UATelugu2h 36m
ధరణి తన స్నేహితులతో కలిసి బొగ్గుని దొంగతనం చేస్తూ.. మద్యం సేవిస్తూ అందరితో గొడవలు పడుతూ ఉంటాడు. కానీ మరుసటి రోజు అవన్నీ మర్చిపోతాడు. ఈ క్రమంలో ఓ రోజు చిన్న నంబి ( షైన్ టామ్ చాకో) సిల్క్ బార్‌లో కూడా గొడవపడి మర్చిపోతాడు. దానిని చిన్న తంబి చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ఈక్రమంలో ఓ రాత్రి ముసుగు దుండగులు ధరణి ప్రాణ స్నేహితుడిని చంపుతారు. ఇంతకు ధరణి స్నేహితుడిని చంపిందెవరు? వారిపై ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు అన్నది మిగతా కథ
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Netflixఫ్రమ్
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
నాని
ధరణికీర్తి సురేష్
వెన్నెలధీక్షిత్ శెట్టి
సిద్ధం సూరి సూర్యంషైన్ టామ్ చాకో
తూర్పుగుట్ట చిన్న నంబిసముద్రకని
చిన్న నంబి తండ్రిపి. సాయి కుమార్
శివన్న సవతి తమ్ముడుఝాన్సీ లక్ష్మి
వెన్నెల తల్లిషమ్నా కాసిం
చిన్న నంబి భార్యసురభి ప్రభావతిసూరి తల్లి
సిబ్బంది
శ్రీకాంత్ ఓదెలదర్శకుడు
సుధాకర్ చెరుకూరినిర్మాత
సంతోష్ నారాయణన్
సంగీతకారుడుసత్యన్ సూర్యన్ ISC
సినిమాటోగ్రాఫర్నవీన్ నూలి
ఎడిటర్ర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Dussehra Movies Weekend Collections: దసరా చిత్రాల వీకెండ్ కలెక్షన్స్.. విజేత ఎవరంటే?
దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని గతవారం బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున చిత్రాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రాలు నాలుగు ఉన్నాయి. ‘వేట్టయన్’, ‘విశ్వం’, ‘మా నాన్న సూపర్ హీరో’, ‘జిగ్రా’ మూవీస్ దసరా కానుకగా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. మరి వీకెండ్ పూర్తయ్యే సరికి ఏ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఏ చిత్రం వసూళ్ల పరంగా టాప్‌లో నిలిచింది? ఇప్పుడు పరిశీలిద్దాం.
వేట్టయన్ (Vettaiyan)
రజనీకాంత్ హీరోగా టి. జే. జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ‘వేట్టయన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంపర కొనసాగిస్తోంది. గురువారం (అక్టోబర్ 10)న విడుదలైన ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 201.21 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఒక్క తమిళనాడులోనే రూ.81 కోట్లను తన ఖాతాలో వేసుకున్నట్లు తెలిపాయి. తెలుగుల రాష్ట్రాల్లో రూ.15.50 కోట్లు, కేరళలో రూ.13.20 కోట్లు, కర్ణాటకలో రూ. 19.25 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.5 కోట్లు రాబట్టినట్లు చెప్పాయి. అటు ఓవర్సీస్‌లో ఏకంగా రూ. 67.26 కోట్లు వసూలు చేసినట్లు వివరించాయి. కలెక్షన్ల పరంగా చూస్తే వేట్టయన్ రూ.200 కోట్ల క్లబ్‌లో చేరి దసరా విజేతగా నిలిచిందని చెప్పవచ్చు.
https://twitter.com/Filmy_Track/status/1845727131768082555
విశ్వం (Viswam)
మాస్ సినిమాల స్పెషలిస్ట్ గోపీచంద్, కామెడీ కింగ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన విశ్వం చిత్రం దసరా సందర్భంగా రిలీజై పర్వాలేదనిపించింది. అక్టోబర్ 11 (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దారుణంగా ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం రూ. 7 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఏపీలో రూ.3.60 కోట్లు, నైజాంలో రూ. 2.20 కోట్లు, కర్ణాటకలో రూ.30 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.20 లక్షలు మాత్రమే రాబట్టినట్లు అభిప్రాయపడ్డాయి. అటు ఓవర్సీస్‌లో కేవలం రూ.20 లక్షలు మాత్రమే వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. అయితే రెండో రోజు నాటికే డిస్టిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి 100 శాతం రికవరీ అయినట్లు నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధికారిక పోస్టు పెట్టడం గమనార్హం.
https://twitter.com/AndhraBoxOffice/status/1845695019199463627
https://twitter.com/Colliderreview/status/1845720361499083121
మా నాన్న సూపర్ హీరో (Maa Nanna Super Hero)
సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా తెరకెక్కిన మరో వైవిధ్యమైన సినిమా ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Superhero). అక్టోబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి ఫీల్‌గుడ్ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తోంది. ఈ చిత్రం వీకెండ్ పూర్తయ్యేసరికి రూ. 75 లక్షలు (GROSS) మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో రూ.68 కోట్లు నెట్ వసూళ్లుగా ఉన్నట్లు తెలిపాయి. తొలి రోజు రూ.19 లక్షలు, రెండో రోజు రూ.26 లక్షలు, మూడో రోజు రూ.23 లక్షలు మాత్రమే రాబట్టినట్లు వివరించాయి. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.5.2 కోట్లు రాబట్టాల్సి ఉంది. ప్రస్తుత వసూళ్లను బట్టి చూస్తే ఈ సినిమా లాభాల్లోకి రావడం కష్టంగానే కనిపిస్తోంది.
జిగ్రా (Jigra)
బాలీవుడ్ బ్యూటీ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ చిత్రం 'జిగ్రా'. వాసన్ బాలా దర్శకత్వం వహించారు. తెలుగు నటుడు రాహుర్ రవీంద్రన్ ముఖ్య పాత్ర పోషించాడు. అక్టోబర్ 11న తెలుగు, హిందీతో పాటు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రూ.26 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఒక్క హిందీ బెల్ట్‌లోనే రూ.16.47 కోట్లు వసూలు చేసినట్లు వివరించాయి. హిందీలో రాజ్‌కుమార్ రావు, త్రిప్తి దిమ్రీ కాంబోలో రిలీజైన 'విక్కీ ఔర్ విద్యా కా వోహ్ వాలా' మూవీ నుంచి జిగ్రాకు గట్టి పోటీ ఎదురైనట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. దీంతో జిగ్రా కలెక్షన్స్‌లో కొంతమేర కోత పడినట్లు అభిప్రాయపడుతున్నారు.
అక్టోబర్ 14 , 2024
#AskNani: ఫ్యాన్‌కు నాని స్ట్రాంగ్ కౌంటర్… మళ్లీ చెబుతున్నా KGF, దసరా ఒకటి కాదు.. ఒరిజినల్ పీస్
దసరా చిత్రంతో అభిమానులకు మాస్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు నాని. మార్చి 30న మెుదలవుతున్న మాస్ జాతర కోసం సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ రావటంతో సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ అయ్యింది. ప్రచారంలో బిజీగా ఉన్న నేచురల్ స్టార్… ట్విటర్‌లో అభిమానుల ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఓసారి వాటిపై లుక్కేయండి.
దసరా రన్‌టైమ్
#Asknaniలో భాగంగా దసరా చిత్రం రన్ టైమ్ రివీల్ చేశాడు నాని. ఈ చిత్రంలో బాగా హై ఇచ్చే సీన్ ఏదంటూ అభిమాని అడిగిన ప్రశ్నకు 2 గంటల 36 నిమిషాలు అలానే ఉంటుందనే సమాధానం ఇచ్చాడు.
https://twitter.com/NameisNani/status/1636016970473828353
ఫుల్ బిందాస్
సినిమా ఔట్‌పుట్‌పై మీరు సంతోషంగా ఉన్నారా ? అడిగిన ప్రశ్నకు నాని పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. ట్రైలర్‌లోని ఓ చిన్న వీడియోను జోడిస్తూ సమాధానం చెప్పాడు యంగ్ హీరో. దీంతో చిత్రం అదిరిపోతుందని చెప్పకనే చెప్పాడు.
https://twitter.com/NameisNani/status/1636015575284748288
స్ట్రాంగ్ రిప్లై
రంగస్థలం, పుష్ప చిత్రాలతో పోలీస్తే దసరా సినిమాలో తేడా ఏంటీ ? నార్త్ ఇండియాలో కొంతమంది చిత్రాన్ని కేజీఎఫ్‌తో పోల్చి పట్టించుకోవడం లేదని తెలిపాడు ఓ అభిమాని. దీనికి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. షారుఖ్ ఖాన్, ఆర్నాల్డ్ ఒకే రకం జాకెట్ వేసుకున్నంత మాత్రాన హాలీవుడ్ టర్మినేటర్, బాలీవుడ్ దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే సినిమాలు ఒక్కటి కావంటూ రిప్లే ఇచ్చాడు.
https://twitter.com/NameisNani/status/1636005865101877255
ఫన్నీ సమాధానం
నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చిన నాని. భలే భలే మెుగాడివోయ్ చిత్రం ఎప్పుడనే క్వశ్చన్‌కు నాని ఎపిక్ రిప్లై ఇచ్చాడు. సినిమా కథను గుర్తు చేస్తూ “ వాడికి గుర్తొచ్చినప్పుడు” అన్నాడు.
https://twitter.com/NameisNani/status/1636006778805837824
ఎవరైనా ఒక్కటే
నేచురల్ స్టార్ కొత్త దర్శకులకు అవకాశాలు ఎక్కువగా ఇస్తుంటాడు. అలా కాకుండా టాప్ డైరెక్టర్లతో పనిచేయాలని ఓ వ్యక్తి చెప్పగా… “ టాలెంట్ కొత్తది అయితే ఏంటి? పాతది అయితే ఏంటి? తేడా తెలియట్లేదు నాకు” అంటూ చెప్పిన సమాధానాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.
https://twitter.com/NameisNani/status/1636004611210502150
ఒరిజినల్ పీస్
సినిమా ట్రైలర్ చూస్తే నిజంగానే కొత్త దర్శకుడు తీసినట్లుగా అనిపించదు. చాలా అనుభవం ఉన్న వ్యక్తి చిత్రాన్ని తెరకెక్కించిన ఫీలింగ్ వస్తుంది. దీనిపై నానికి ప్రశ్నలు ఎదురయ్యాయి. “ఊహల్లో ఇప్పటికే చాలా తీసేశాడు. దొరికాడు మనకు ఒకడు, ఒరిజినల్ పీస్” అంటూ శ్రీకాంత్ ఓదెలను కొనియాడాడు.
మార్చి 16 , 2023
Review: దసరా మూవీ రివ్యూ.. ఊరమాస్ నటనతో విశ్వరూపం చూపించిన నాని..!
నటీనటులు : నాని, కీర్తి సురేష్, సాయికుమార్, షైన్ టౌన్ చాకో, పూర్ణ, దీక్షిత్, సముద్ర కని
డైరెక్టర్: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: చెరుకూరి సుధాకర్
సంగీతం: సంతోష్ నారాయణ
సినిమాటోగ్రఫీ: సత్యం సూర్యన్
భాషలు: తెలుగు, తమిళం, కన్నడ, హిందీ
కథ:
వీర్నపల్లి అనే చిన్న పల్లెటూరు నేపథ్యంలో సాగే కథ ఇది. చిన్నప్పటి స్నేహితులైన ధరణి (నాని), వెన్నెల (కీర్తి సురేష్,) సూరి (దీక్షిత్ శెట్టి) పై ఆధార పడి కథ తిరుగుతుంది. ధరణి తన స్నేహితులతో కలిసి బొగ్గుని దొంగతనం చేస్తూ.. మద్యం సేవిస్తూ అందరితో గొడవలు పడుతూ ఉంటాడు. కానీ మరుసటి రోజు అవన్నీ మర్చిపోతాడు. ఈ క్రమంలో ఓ రోజు చిన్న నంబి ( షైన్ టామ్ చాకో) సిల్క్ బార్‌లో కూడా గొడవపడి మర్చిపోతాడు. దానిని చిన్న తంబి చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ధరణి చేసిన పొరపాటు వల్ల ఆయన ప్రియురాలు వెన్నెల (కీర్తి సురేష్), అతని స్నేహితులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి?. వారిని కాపాడటం కోసం ధరణి ఏం చేశాడు? వంటివి తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే:
శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రంలో నాని తన నటనతో అదరగొట్టాడనే చెప్పాలి. సినిమా మొదటి నుంచి చివరి వరకు మెుత్తం నానినే కనిపిస్తాడు.
ఇప్పటివరకు చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా నాని నటన ఉంటుంది. ముఖ్యంగా నాని భాష, యాస, తన రూపురేఖలతో ఊరమాస్‌గా కనిపించారు. ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీక్వెల్స్‌లో తన మార్క్ చూపించాడు. సినిమా చూస్తున్నంత సేపు నాని పాత్రకు బాగా కనెక్ట్ అవుతారు. ఈ మూవీ నాని కెరీర్‌లో ఉత్తమ చిత్రంగా నిలిచే ఛాన్స్ ఉంది. ఇక నానితో పాటుగా కీర్తి సురేష్ పోటీపడి నటించారు. ఆమె నటన సినిమాకు బాగా ప్లస్ అయిందనే చెప్పాలి. అటు దీక్షిత్ శెట్టి సైతం నానితో సమానంగా ఎక్కడ తగ్గకుండా నటించారు. ఈ ముగ్గురి నటన సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. మలయాళ నటుడు ‘షైన్ టామ్ చాకో’ కూడా విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. సముద్రఖని, సాయికుమార్ వారి పరిధిమేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక విభాగం:
టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పనితీరు చాలా బాగుంది. నానిలోని నటుడ్ని ఆయన పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నారు. ఎమోషనల్, యాక్షన్ సీన్స్‌లో ఎలివేషన్లు బాగా చూపించాడు. కొన్ని సీన్స్‌లో డైరెక్టర్ గూస్ బంప్స్ తెప్పించారు. సత్యం సూర్యన్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. సంతోష్ నారాయణన్ అందించిన పాటలు కూడా ప్రేక్షకులను ఫిదా చేశాయి. ‘చంకీలా అంగీలు వేసి’ పాట చిత్రానికే వన్నెతెచ్చింది. మొదటి భాగం కాస్త సాగదీసినట్టు నాని నటనతో అదంతా కవర్ అయిపోతుంది. మిగిలిన నిర్మాణ విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.
ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన కథఎమోషనల్ సన్నివేశాలుసంగీతంసినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
సూటిగా సాగే కథకథలో వేగం లోపించడం
రేటింగ్: 4/5
మార్చి 30 , 2023
DASARA: దసరా ప్రమోషన్ల జోరు.. నాని బ్లాక్ డ్రెస్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదా?
నేచురల్ స్టార్ నాని దసరా ప్రమోషన్లతో చాలా బిజీగా గడుపుతున్నాడు. మార్చి 30న సినిమా విడుదలవుతుండటం.. కొద్దిరోజుల సమయమే ఉండటంతో చిత్రబృందం వేగం పెంచింది. పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేస్తున్నందునా.. వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సినిమాపైన కూడా భారీ అంచనాలే ఉన్నాయి.
https://twitter.com/NameisNani/status/1638035548236566528
రంగులతో షురూ
దసరా సినిమాను ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు యూనిట్. హోలీ సందర్భంగా ముంబయిలో ప్రచారం షురూ చేశాడు నాని. అక్కడ యూత్ నుంచి నానికి గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. ఫుల్ హుషారుగా ప్రమోట్ చేశాడు నేచురల్ స్టార్.
https://twitter.com/NameisNani/status/1633324647830650880
కొచ్చిలో విషెస్
కొచ్చిలో ప్రమోషన్ చేస్తుండగా ఆర్‌ఆర్‌ఆర్‌కి అవార్డు వచ్చింది. ఆ కార్యక్రమంలోనే అందరి సమక్షంలో ప్రత్యేకమైన వీడియోతో నాని విషెస్ చెప్పాడు. ట్విటర్ వేదికగా ఆ వీడియోను షేర్ చేశాడు నాని.
https://twitter.com/NameisNani/status/1635265590066827264
VD గురించి
తమిళ్ ఇంటర్వ్యూలో భాగంగా విజయ్ దేవరకొండతో ఉన్న స్నేహం గురించి చెప్పాడు ఈ యంగ్ హీరో. “ అతడిని చూస్తే గర్వంగా ఉంది. మేము తరచూ మాట్లాడుకుంటాం. సినిమాల గురించి చర్చిస్తాం. తన సినిమా ఫెయిల్ అయినా నేను మెసేజ్ పెడతాను. అంతా మన మంచికే జరిగిందని చెబుతుంటాను. విజయ్ ఇంకా చాలా సాధిస్తాడు” అన్నాడు నాని.
https://twitter.com/i/status/1634446694854311936
జెర్సీతో దసరా ప్రమోషన్
విశాఖపట్టణం వేదికగా జరిగిన ఆస్ట్రేలియా, భారత్ మధ్య రెండో వన్డేలోనూ ప్రమోషన్ చేశాడు నాని. తన క్యారెక్టర్‌ను సూచించేలా ధరణి అనే జెర్సీ వేసుకొని వెళ్లాడు. అంతేకాదు, తనకు ఇష్టమైన క్రికెటర్ ఎవరో చెప్పడంతో పాటు తన సినిమాల్లో ఏ క్యారెక్టర్ ఎవరికి సూట్ అవుతుందని కూడా వెల్లడించాడు.
https://twitter.com/i/status/1637709729240875014
ఆటో ధరణి
రగడ్ లుక్‌తో మాస్ రోల్‌లో నటించిన స్టార్ హీరో ప్రమోషన్లను కూడా తనదైన స్టైల్‌లో చేస్తున్నాడు. ముంబయిలో ఆటోలో ఇంటర్వ్యూకి వెళ్లాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ హీరో తన సహజత్వాన్ని ఎక్కడా విడిచిపెట్టట్లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
https://twitter.com/i/status/1637808713955196929
https://twitter.com/apekshasandesh_/status/1638040424815247360?s=20
సీక్రెట్ సాంగ్
దసరా సినిమాలోని ఓ పాటను విడుదల చేయట్లేదని నాని చెప్పాడు. ఆ పాట చిత్రానికి ప్రాణం పోస్తుందని.. తనకు చాలా ఇష్టమని వెల్లడించాడు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి.
https://twitter.com/i/status/1635985478070464515
నలుపు రంగులో
ఇప్పటి వరకు జరిగిన చాలా దసరా ప్రమోషన్లలో ఎక్కువగా నలుపు రంగు దుస్తులు ధరించి నాని ప్రమోట్ చేస్తున్నాడు. సినిమా కథను సింగరేణిలో జరుగుతుంది. అది ప్రతిబింబించేందుకు ఇలా చేస్తున్నాడని టాక్.
https://twitter.com/shreyasgroup/status/1638022757215789056?s=20
https://twitter.com/i/status/1638033798905602049
హీరోయిన్ కీర్తి సురేశ్ కూడా ఇదే విషయాన్ని ఫాలో అవుతుంది. బ్లాక్ డ్రెస్‌లో రీల్స్ చేయటంతో పాటు ప్రచార కార్యక్రమాలకు హాజరవుతుంది.
Keerthy Suresh (@keerthysureshofficial) • Instagram photos and videos
మార్చి 21 , 2023
New Ott Releases This Week: దసరా స్పెషల్.. ఈ వారం రాబోతున్న కొత్త చిత్రాలు ఇవే!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి నెలకొంది. ఈ పండగను పురస్కరించుకొని తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఈ వారం బాక్సాఫీస్ వద్ద అలరించనున్నాయి. అటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు
వేట్టయాన్ (Vettaiyan)
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన లేటెస్ట్ చిత్రం ‘వేట్టయాన్’. ‘జై భీమ్’ వంటి సోషల్ మెసేజ్ మూవీతో ప్రేక్షకులను అలరించిన టి.జె.జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించారు. దసరా కానుకగా అక్టోబరు 10న ఈ చిత్రం విడుదల (Vettaiyan Release Date) కానుంది. జైలర్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రజనీ నటించిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో వేట్టయాన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
విశ్వం (Viswam)
ప్రముఖ నటుడు గోపిచంద్ (Gopichand) హీరోగా శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ’విశ్వం’ (Viswam). ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి సంయుక్తంగా నిర్మించారు. కావ్య థాపర్ హీరోయిన్‌గా చేసింది. అక్టోబరు 11న (Viswam Movie Release Date) విడుదలవుతోంది. కామెడీ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన శ్రీను వైట్లతో నటుడు గోపిచంద్ గతకొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాలని ధీమాతో ఉన్నారు. ఇప్పటికే విడుదలైన విశ్వం ట్రైలర్, టీజర్ ఆకట్టుకున్నాయి.
మా నాన్న సూపర్ హీరో (Maa Nanna Super Hero)
సుధీర్ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Super Hero). ఆర్ణ కథానాయికగా చేసింది. షాయాజీ షిండే కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడంతో అంచనాలను రేకెత్తించాయి.
జనక అయితే గనక (Janaka Ithe Ganaka)
యంగ్ హీరో సుహాస్ వరుసగా చిత్రాలు రిలీజ్ చేస్తూ దూసుకుపోతున్నాడు. వైవిధ్యమైన కథలతో మంచి విజయాలను సాధిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు నటించిన లేటెస్ట్ చిత్రం ‘జనక అయితే గనక’ ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. సంకీర్తన కథానాయక. ఈ చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. సందీప్ బండ్ల దర్శకత్వం వహించారు. అక్టోబరు 12న ఈ మూవీ విడుదల కానుంది.
జిగ్రా (Jigra)
అలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో వాసన్ బాలా రూపొందించిన బాలీవుడ్ చిత్రం ‘జిగ్రా’. అక్టోబరు 11న (Jigra Release Date) థియేటర్లలోకి రానుంది. తెలుగులో ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రానా దగ్గుబాటి విడుదల చేస్తున్నారు. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలయికతో వచ్చిన ఈ చిత్రం అన్నివర్గాలు ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటికే విడుదలై ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది.
మార్టిన్ (Martin)
కన్నడ నటుడు ధ్రువ సర్జా ఈ వారం మార్టిన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎ.పి. అర్జున్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వైభవి శాండిల్య కథానాయిక.ఈ పాన్ ఇండియా చిత్రాన్ని అక్టోబరు 11న (Martin Movie Release Date) విడుదల చేస్తున్నారు. యాక్షన్ చిత్రాల ప్రేమికులను ఈ మూవీ తప్పక మెప్పిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
లెవెల్ క్రాస్
అమలాపాల్ హీరోయిన్‌గా నటించిన మలయాళం మూవీ ‘లెవెల్ క్రాస్’ థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి అర్ఫాజ్ అయూబ్ దర్శకత్వం వహించాడు. ఆసిఫ్ అలీ హీరోగా నటించాడు. అక్టోబర్ 11 నుంచి ఆహాలో ఈ చిత్రం ప్రసారం కానుంది. ప్లాట్ ఏంటంటే చైతాలి (అమలాపాల్) ట్రైన్ ప్రమాదంలో గాయపడుతుంది. ఆమెను రైల్వే గేట్‌మెన్ రఘు (ఆసిఫ్ అలీ) కాపాడుతాడు. రఘుని కలిసిన తర్వాత నుంచి చైతాలి జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. చైతాలి తనకు పెళ్లి అయినట్లుగా ఎందుకు భ్రమపడుతుంది? వారిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.
TitleCategoryLanguagePlatformRelease DateYoung SheldonMovieEnglishNetflixOct 08Monster High 2MovieEnglishNetflixOct 10Khel Khel MeinMovieHindiNetflixOct 09Starting 5SeriesEnglishNetflixOct 10Tomb Raider: Lara CroftAnimationEnglishNetflixOct 10Lonely PlanetMovieEnglishNetflixOct 10Outer Banks 4SeriesEnglishNetflixOct 10Up RisingSeriesEnglish/KoreanNetflixOct 11ChuckyMovieEnglishNetflixOct 15SurfiraMovieHindiHotstarOct 11WarieMovieTamilHotstarOct 11Pailan PillagaMovieTeluguETV WinOct 10Thatva MovieTeluguETV WinOct 10Guter GuMovieHindiJio CinemaOct 11Tea cupMovieEnglishJio CinemaOct 11Jai MahendranMovieMalayalamSonyLIVOct 11Raat Jawan HieMovieHindiSonyLIVOct 11
అక్టోబర్ 07 , 2024
Dasara Movie Story: నాని మాస్ అవతారం… దసరా అసలు కథ ఇదేనా..!
]విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న దసరా చిత్రంపై నాని చాలా ఆశలు పెట్టుకున్నాడు. నాని కెరీర్ గ్రాఫ్‌తో పాటు కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కేరీర్‌ను కూడా ఈ చిత్రం ఫలితం శాసించనుంది.
ఫిబ్రవరి 24 , 2023
Keerthy Suresh: దసరా నుంచి కీర్తిని హీరోయిన్‌గా తీసేద్దామనుకున్న డైరెక్టర్.. కానీ!
అందం కంటే నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్లలో కీర్తి సురేష్ (Keerthy Suresh) ఒకరు. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఈ అమ్మడు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్ర అద్భుతంగా పోషించి ఏకంగా జాతీయ అవార్డు అందుకుంది. అయితే ఆమె ఫిల్మ్ కెరీర్‌లో ఎన్నో ఆసక్తికర సంఘనటలు చోటుచేసుకున్నాయి. నేడు (అక్టోబర్ 17) కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
చైల్డ్ ఆర్టిస్టుగా
నటీనటులు సురేష్‌కుమార్, మేనకల కుమార్తె అయిన కీర్తి సురేష్ పెలట్స్ అనే మలయాళ చిత్రంతో బాలనటిగా మెరిసింది. మరో అచనేయనేనికిష్టం, కుబేరన్ అనే చిత్రాల్లోనూ ఆమె చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది.
చిరుకి జోడీగా తల్లి.. చెల్లిగా కూతురు
చిరంజీవి (Chiranjeevi) ‘పున్నమినాగు’ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ తల్లి మేనక నటించారు. రీసెంట్‌గా వచ్చిన 'భోళా శంకర్' మూవీలో మెగాస్టార్ సోదరిగా కీర్తి సురేష్ నటించడం గమనార్హం. సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అన్నా చెల్లెళ్లుగా వీరి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. హైదరాబాద్‌లో షూటింగ్ జరిగిన అన్ని రోజులు తన ఇంటి నుంచే కీర్తికి భోజనం పంపినట్లు చిరు మూవీ ప్రమోషన్స్ సందర్భంగా తెలిపారు.
ప్రారంభంలోనే అటకెక్కిన చిత్రాలు
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన గీతాంజలి సినిమాతో కీర్తి సురేష్ హీరోయిన్‌గా మారింది. అయితే అంతకుముందే హీరోయిన్‌గా మూడు ప్రాజెక్ట్స్‌ను కీర్తి ఓకే చేసింది. షూటింగ్ కూడా సగానికి పైనే జరిగింది. అయితే అనూహ్యంగా ఆ మూడు ప్రాజెక్ట్స్ మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో తీవ్ర నిరాశకు గురైనట్లు ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది.
ఐరెన్ లెగ్‌గా ముద్ర
కెరీర్ ప్రారంభంలోనే మూడు ప్రాజెక్ట్స్ ఆగిపోవడం.. మలయాళంలో చేసిన ‘గీతాంజలి’, రింగ్ మాస్టర్ చిత్రాలు ఫ్లాప్ కావడం, తమిళంలో ఆమె ఫస్ట్ ఫిల్మ్ ‘ఇదు ఎన్న యామమ్’ కూడా డిజాస్టర్‌గా నిలవడంతో కీర్తికి ఐరెన్ లెగ్ అన్న ముద్ర వచ్చింది. విపరీతంగా ట్రోల్స్‌కు సైతం గురైంది. వాటిని పట్టించుకోకుండా విజయవంతమైన చిత్రాల్లో నటించి కీర్తి సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా మారింది.
మహానటితో కెరీర్ టర్నింగ్
తెలుగులో చేసిన ఫస్ట్ ఫిల్మ్ ‘నేను శైలజా’ మంచి విజయం సాధించడంతో టాలీవుడ్, కోలీవుడ్‌లో కీర్తి సురేష్‌కు అవకాశాలు పెరిగాయి. వరుసగా కమర్షియల్ చిత్రాలు చేస్తున్నప్పటికీ నటిగా ఏమీ సాధించలేదన్న అసంతృప్తి కీర్తిలో ఉండిపోయింది. ఆ సమయంలోనే ‘మహానటి’ ప్రాజెక్ట్ ఆమె చెంతకు వచ్చింది. ఇందులో సావిత్రిగా పరకాయ ప్రవేశం చేసి మరి నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకొని తోటి హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలిచింది. మహానటి తర్వాత కీర్తి సురేష్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.
వరుస ఫెయిల్యూర్స్
‘మహానటి’ తర్వాత కెరీర్ పరంగా కీర్తి సురేష్‌కు తిరుగుండదని అంతా భావించారు. అందుకు తగ్గట్లే వరుసగా ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ ఆ సినిమాలన్నీ ఫ్లాప్ టాక్స్ తెచ్చుకోవడంతో కీర్తి సురేష్ ఇబ్బందుల్లో పడింది. మహానటి తర్వాత ఆమె చేసిన ‘సామి స్క్వేర్’, ‘పందెం కోడి 2’, రంగ్ దే, ‘అన్నాతే’ వంటి సినిమాలు ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయాయి. లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’, ‘గుడ్‌లక్ సఖి’ చిత్రాలూ సందడి చేయలేకపోయాయి.
కీర్తిని తీసేద్దామన్న డైరెక్టర్
గతేడాది విడుదలైన ‘దసరా’ సినిమాతో కీర్తి భారీ విజయం సాధించి తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి అడుగుపెట్టింది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సత్తా చాటింది. ముఖ్యంగా కీర్తి సురేష్ నటనపై సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. వెన్నెల అనే గ్రామీణ యువతిగా ఆమె అదరగొట్టింది. ఉత్తమనటిగా సైమా, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సైతం అందుకుంది. అయితే వాస్తవానికి ఈ పాత్ర అయితే దసరా హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను తీసేద్దామని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల భావించినట్లు ఆ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా నాని చెప్పారు. మూవీ కథను కీర్తికి చెప్పిన డైరెక్టర్ ఆమెను 10-12 కిలోలు బరువు పెరగాలని సూచించారట. కానీ అందుకు తగ్గట్లు పెరగలేదట. దీంతో తన వద్దకు వచ్చి కీర్తి సురేష్‌ను తీసేద్దామని శ్రీకాంత్ ఓదెల అన్నట్లు నాని చెప్పారు. నువ్వు డెబ్యూ డైరెక్టర్‌వి, ఆమె నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి. ఇది జరగదని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ విధంగా సినిమా సెట్స్‌పైకి వెళ్లడం వారిద్దరు మంచి ఫ్రెండ్స్ కావడం చకాచకా జరిగిపోయినట్లు నాని వివరించారు.
https://www.youtube.com/watch?v=J-PhzFEt9Wk
కీర్తి స్పెషల్ టాలెంట్
కీర్తి సురేష్ ముఖమే కాదు, గొంతు కూడా చాలా అందంగా ఉంటుంది. దీనిని గుర్తించిన దర్శకులు ఆమె వాయిస్‌తో మ్యాజిక్ చేయించారు. ‘సామి స్క్వేర్’ సినిమాలో కీర్తి 'పుదు మెట్రో రైల్' అనే పాటను చాలా అందంగా పాడింది. అంతేకాకుండా ఇటీవల వచ్చి కల్కి 2898 ఏడీ చిత్రంలో బుజ్జి వాహనానికి వాయిస్ అందించి ఆకట్టుకుంది. ‘గాంధారి’ ఆల్బమ్‌తో తనలో మంచి డ్యాన్సర్ ఉందని కూడా చాటి చెప్పింది.
ఈ ఏడాది బాలీవుడ్‌లోకి..
ఈ ఏడాది ఇప్పటికే ‘సైరన్’, ‘రఘుతాత’తో అలరించిన కీర్తి ‘రివాల్వర్ రీటా’, ‘కన్నివేడి’, ‘ఉప్పు కప్పురంబు’తో బిజీగా ఉన్నారు. ‘బేబీ జాన్’ (Baby John)తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తన కెరీర్‌లో సావిత్రి (మహానటి), వెన్నెల (దసరా), కళావతి (సర్కారువారి పాట) పాత్రలు సవాలు విసిరాయని ఓ సందర్భంలో అన్నారు.
అక్టోబర్ 17 , 2024
Weekend OTT Suggestions: దసరా వీకెండ్‌ను మరింత వినోదాత్మకంగా మార్చే చిత్రాలు ఇవే!
ప్రస్తుత ఓటీటీ యుగంలో ప్రతీ వారం కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వీకెండ్ కూడా పెద్ద ఎత్తున తెలుగు చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి కూడా. ఇంతకీ ఈ వారం ఓటీటీలోకి వచ్చిన చిత్రాలు ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి ప్లాట్స్ ఎలా ఉన్నాయి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
మత్తు వదలరా 2 (Mathu vadalara 2)
బ్లాక్ బస్టర్ కామెడీ మూవీ ‘మత్తు వదలరా 2’ ఈ వీకెండ్ ఓటీటీలోకి వస్తోంది. అక్టోబర్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ గానుంది. సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో శ్రీసింహా, సత్య ప్రధాన పాత్రలు పోషించారు. ప్లాట్ ఏంటంటే 'డెలీవరీ బాయ్ ఏజెంట్స్ బాబు (శ్రీ సింహా), యేసుబాబు (సత్య) డబ్బులు సరిపోకా స్పెషల్ ఏజెంట్స్‌గా మారతారు. ఓ కేసు విషయంలో చేసిన చిన్న పొరపాటు కారణంగా చిక్కుల్లో పడతారు. ఇంతకీ ఏంటా కేసు? వారు చేసిన పొరపాటు ఏంటి? దాని నుంచి ఎలా బయటపడ్డారు? అండర్ కవర్ ఏజెంట్ నిధి (ఫరియా అబ్దుల్లా) వారికి ఎలా సాయపడింది?' అన్నది స్టోరీ.
గొర్రె పురాణం (Gorre Puranam)
సుహాస్ నటించిన రీసెంట్ చిత్రం ‘గొర్రె పురాణం’ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. సెప్టెంబర్ 20న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆకట్టుకుంది. కాగా, ఆక్టోబర్ 10 (గురువారం) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. థియేటర్లలో మిస్సయిన వారు ఇప్పుడు ఇంట్లోనే ఈ సినిమాను కుంటుంబంతో కలిసి చూసేయచ్చు. ప్లాట్ ఏంటంటే ‘బిర్యానీ చేసుకుందామని ఒక ముస్లిం వ్యక్తి కొనుగోలు చేసిన గొర్రె తప్పించుకొని గ్రామ దేవత గుడిలో దూరుతుంది. అక్కడ కల్లు తాగి జట్కా ఇవ్వడంతో దాన్ని తామే బలిస్తామని హిందువులు పట్టుబడతారు. ఈ వ్యవహారం రెండు మతాల మధ్య చిచ్చుపెట్టడంతో పోలీసులు గొర్రెను అరెస్టు చేస్తారు. రవి (సుహాస్) ఉన్న సెల్‌లో బంధిస్తారు. ఇంతకీ రవి ఎవరు? అతడు చేసిన హత్యకు గొర్రెకు సంబంధం ఏంటి?’ అన్నది స్టోరీ.
పైలం పిలగా (Pailam Pilaga)
సాయితేజ, పావని కరణం జంటగా నటించిన చిత్రం 'పైలం పిలగా'. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈటీవీ విన్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే 'శివ దుబాయ్ వెళ్లి బాగా సెటిల్ కావాలని నిర్ణయించుకుంటాడు. పాస్‌పోర్టు, ఉద్యోగం కోసం అతడికి రూ.2 లక్షలు అవసరం అవుతాయి. దీంతో గుట్టపై ఉన్న స్థలాన్ని అమ్మేందుకు యత్నించగా ఎవరు ముందుకు రారు. కానీ మరుసటి రోజు పోటీపడి మరి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. పనికిరాని గుట్టను కొనేందుకు వారు ఎందుకు పోటీ పడ్డారు? శివ కోరిక నెరవేరిందా? లేదా?’ అన్నది స్టోరీ.
శబరి (Sabari)
విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా ‘శబరి’. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ఈ సినిమాతో అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. థియేటర్లలో యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం వీకెండ్‌లో ఓటీటీలోకి రాబోతోంది. అక్టోబర్ 11 నుంచి సన్‌నెక్ట్స్ ఓటీటీలో ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. ప్లాట్ ఏంటంటే 'సంజనా (వరలక్ష్మీ) భర్తను వదిలేసి కూతురితో ముంబయి నుంచి వైజాగ్ వస్తుంది. అక్కడ ఓ కార్పొరేట్ కంపెనీ జుంబా డ్యాన్సర్‌గా చేరుతుంది. అయితే సంజనాను చంపేందుకు సూర్య (మైమ్ గోపి) ప్రయత్నిస్తాడు. ఇంతకీ సూర్య ఎవరు? భర్త అరవింద్‌తో సంజనా ఎందుకు విడిపోయింది? కిడ్నాపైన కూతుర్ని సంజనా ఎలా కాపాడుకుంది?’ అన్నది కథ.
లెవల్ క్రాస్ (Level Cross)
అమలాపాల్ హీరోయిన్‌గా నటించిన మలయాళం మూవీ ‘లెవెల్ క్రాస్’ థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి అర్ఫాజ్ అయూబ్ దర్శకత్వం వహించాడు. ఆసిఫ్ అలీ హీరోగా నటించాడు. అక్టోబర్ 11 నుంచి ఆహాలో ఈ చిత్రం ప్రసారం కానుంది. ప్లాట్ ఏంటంటే చైతాలి (అమలాపాల్) ట్రైన్ ప్రమాదంలో గాయపడుతుంది. ఆమెను రైల్వే గేట్‌మెన్ రఘు (ఆసిఫ్ అలీ) కాపాడుతాడు. రఘుని కలిసిన తర్వాత నుంచి చైతాలి జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. చైతాలి తనకు పెళ్లి అయినట్లుగా ఎందుకు భ్రమపడుతుంది? వారిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.
వెయ్ దరువేయ్ (Vey Dharuvey)
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ నటించిన రీసెంట్ చిత్రం ‘వెయ్ దరువెయ్’. ఈ యాక్షన్ మూవీ మార్చి 15న థియేటర్లలో రిలీజై ఆకట్టుకోలేకపోయింది. నవీన్ రెడ్డి డైరెక్ట్ వచ్చిన ఈ చిత్రం ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగు పెడుతోంది. అక్టోబర్ 11 నుంచి ఆహాలో ఈ సినిమాను వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘శంకర్.. ఫేక్ సర్టిఫికేట్స్‌తో ఉద్యోగం పొందేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇందుకోసం ఫ్లై కన్సల్టెన్సీని సంప్రదిస్తాడు. అందులో పనిచేస్తున్న శ్రుతిని చూసి ఇష్టపడతాడు. అయితే ఈ ఫేక్ సర్టిఫికేట్స్ మాఫియాకు శంకర్‌కు సంబంధం ఏంటి? కేవలం ఉద్యోగం కోసమే హీరో నగరానికి వచ్చాడా? ఏదైనా ప్లాన్ ఉందా?’ అన్నది కథ.
కృష్ణం ప్రణయ సఖీ (Krishnam Pranaya Sakhi)
కృష్ణమ్ ప్రణయ సఖి మూవీలో కన్నడ గోల్డెన్ స్టార్ గణేష్ హీరోగా నటించాడు. ఈ రొమాంటిక్ మూవీకి దండుపాళ్యం ఫేమ్ శ్రీనివాసరాజు దర్శకత్వం వహించాడు. ఇందులో మాళవికానాయర్‌తో పాటు శరణ్య శెట్టి హీరోయిన్లుగా చేశారు. కన్నడలో సూపర్ సక్సెస్ అయిన ఈ చిత్రం అక్టోబర్ 11 నుంచి తెలుగులో స్ట్రీమింగ్ వస్తోంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా సినిమాను వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘కృష్ణ (గణేష్) ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. ఉమ్మడి కుటుంబం కావడంతో ఫ్యామిలీలో అడ్జస్ట్ అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడతాడు. ఈ క్రమంలోనే అనాథ అయిన ప్రణయ అతడికి పరిచయమవుతుంది. తాను కోటీశ్వరుడన్న నిజం దాచి ప్రణయకు కృష్ణ దగ్గరవుతాడు. మరోవైపు కృష్ణను దక్కించుకునేందుకు జాహ్నవి ప్రయత్నిస్తుంటుంది. ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరి చివరికి ఏలాంటి పరిస్థితులకు దారి తీసింది?’ అన్నది స్టోరీ.
ది గోట్ (The Greatest Of All Time)
గతవారం పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిని ఇంకా చూడకపోతే ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోండి. విజయ్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం ‘ది గోట్’ (The Greatest Of All Time). వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ మూవీ అక్టోబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ప్రసారం అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాను వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే 'గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. ఓ మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లి కొడుకును పొగొట్టుకుంటాడు. దీంతో భార్య అను (స్నేహా) అతడ్ని దూరం పెడుతుంది. కొన్నేళ్ల తర్వాత మాస్కోకు వెళ్లిన గాంధీకి చనిపోయాడనుకుంటున్న కొడుకు జీవన్ (విజయ్) కనిపిస్తాడు. సంతోషంగా ఇంటికి తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీకి సంబంధించిన వారు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. ఈ హత్యలకు కారణం ఎవరు? చనిపోయిన జీవన్ ఎలా తిరిగొచ్చాడు?’ అన్నది స్టోరీ.
35 చిన్న కథ కాదు (35 Chinna katha kadu)
ప్రముఖ నటి నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం ’35 చిన్న కథ కాదు’. ఎమోషనల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రానికి నందకిషోర్ ఇమాని దర్శకత్వం వహించాడు. ఇందులో ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ, గౌతమి కీలకపాత్రలు పోషించారు. సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదలైన మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అక్టోబర్ 2 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘ప్రసాద్ (విశ్వదేవ్), సరస్వతి (నివేదా థామస్) మధ్యతరగతి కుటుంబానికి చెందిన భార్య భర్తలు. పెద్ద కుమారుడు అరుణ్ స్కూల్లో ఆరో తరగతి చదువుతుంటాడు. మ్యాథ్స్‌లో చాలా వీక్. దాంతో లెక్కల మాస్టారు చాణక్య (ప్రియదర్శి) అరుణ్‌కి జీరో అని పేరు పెడతాడు. పరీక్షల్లో ఫెయిల్ కూడా చేస్తాడు. అరుణ్ స్కూల్‌లో ఉండాలంటే లెక్కల్లో కనీసం 35 మార్కులు సాధించాల్సిందేనని షరతు విధిస్తాడు. ఆ పరిస్థితుల్లో అరుణ్ ఏం చేశాడు? అతడికి తల్లి సరస్వతి ఎలా సాయం చేసింది?’ అన్నది స్టోరీ.
భలే ఉన్నాడే (Bhale Unnade)
రాజ్‌తరుణ్ (Raj tarun) కథానాయకుడిగా జె.శివసాయివర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భలే ఉన్నాడే’ (Bhale Unnade). మనీషా కంద్కూర్ కథానాయిక. సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈటీవీ విన్‌లో (ETV Win) అక్టోబరు 3వ తేదీ నుంచి ప్రసారం అవుతోంది. ప్లాట్ ఏంటంటే ‘రాధ (రాజ్‌తరుణ్) చాలా సౌమ్యుడు. వైజాగ్‌లో శారీ డ్రాపర్‌గా పనిచేస్తూ తల్లికి హెల్ప్ చేస్తుంటాడు. తన తల్లితో పాటు బ్యాంక్‌లో పనిచేసే మనీషాకు లంచ్ బాక్స్ ద్వారా దగ్గరవుతాడు. ఈ క్రమంలో వారిద్దరు ఒకరినొకరు ఇష్టబడి నిశ్చితార్థం వరకూ వెళ్తారు. అయితే రాధ పెళ్లికి పనికొస్తాడా? లేదా? అన్న సందేహాం కృష్ణకు కలుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? రాధకు కృష్ణ పెట్టిన పరీక్ష ఏంటి?’ అన్నది స్టోరీ.
అక్టోబర్ 10 , 2024
Tiger Nageswara Rao Movie Review: రవితేజ యాక్షన్ ఫీస్ట్.. దసరా బరిలో విజేతగా నిలిచిన టైగర్ నాగేశ్వరరావు
మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టైగర్ నాగేశ్వరరావు’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. విక్రమార్కుడు, రావణాసుర, శంభో శివ శంభో వంటి సీరియస్ క్యారెక్టర్ల తర్వాత మరోసారి సీరియస్ యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న చిత్రంలో రవితేజ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్‌లో కూడా రవితేజ లుక్స్, యాక్షన్ సీన్లు అంచనాలను మరింత పెంచాయి. మరోవైపు ఇంతవరకు ఎవరు టచ్ చేయని స్టువర్ట్‌పురం సబ్జెక్ట్ కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో సినిమాపై హైప్ నెలకొంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో నిర్మించారు. మరి ఇంత హైప్ సృష్టించిన టైగర్ నాగేశ్వరరావు ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? దసరా బరిలో నిలిచిన ఈ సినిమా విజయం సాధించిందా? అనే విషయాలను YouSay రివ్యూలో చూద్దాం.
తారాగణం: రవితేజ, గాయత్రీ భరద్వాజ్, నుపూర్ సనన్, రేణూ దేశాయ్, నాజర్, అనుపమ్ ఖేర్, జిషు సేన్ గుప్తా
డైరెక్టర్: వంశీ కృష్ణా
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
సినిమాటోగ్రఫీ: మది ఐ.ఎస్.సి
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
సంగీతం: జీవీ ప్రకాశ్
విడుదల తేదీ: అక్టోబర్ 20, 2023
కథ:
టైగర్ నాగేశ్వరరావు అనే గజదొంగ ధనికుల దగ్గర అందినంత బంగారం, డబ్బు దోచుకుంటూ పేదలకు పంచుతుంటాడు. అతనికి పోలీసులు సైతం భయపడుతుంటారు. అయితే స్టువర్టుపురంలో మాములు వ్యక్తిగా ఉన్న నాగేశ్వరరావు గజదొంగగా ఎలా మారాడు. అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? తాను దోచుకున్న డబ్బు ఏంచేశాడు? స్టువర్టుపురంలో ఎలాంటి మార్పుని అతను తీసుకు వస్తాడు..? టైగర్ నాగేశ్వరరావును పట్టుకోవాలని ప్రధానమంత్రి ఎందుకు ఆర్డర్ వేశారు? చివరకు టైగర్ నాగేశ్వరరావును పోలీసులు పట్టుకున్నారా? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ఇక సినిమా విషయానికి వస్తే... 1970లో స్టువర్టుపురంలో పేరు మోసిన గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు. ఆయన జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కానీ కథలో భారీగానే మార్పులు చేశారు వంశీ. సినిమా స్టార్టింగ్ నుంచే ఆసక్తికరంగా ఉంటుంది. ఫస్టాప్‌లో కొన్ని కామెడీ సీన్లు, యాక్షన్ సీన్లు పర్వాలేదనిపిస్తాయి. ఊరిలో జరిగే సంఘటనలను చక్కగా చూపించారు. సారా(నుపురు సనన్) టైగర్ నాగేశ్వరరావు మధ్య జరిగే లవ్ ట్రాక్.. ఇడియట్ సినిమా సీన్లను గుర్తు చేస్తుంది. అయితే మాములు జీవితం సాగిస్తున్న నాగేశ్వరరావు దొంగగా ఎలా మారాడు అనే సంఘటనలను డైరెక్టర్ వంశీ బాగా డీల్ చేశాడు అని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో రాబిన్ హుడ్ స్టైల్‌కి మూవీ ట్రాక్ వెళ్తుంది. ధనికుల నుంచి టైగర్ నాగేశ్వరరావు అందినంత దోచేస్తుంటాడు. అలా దోచుకున్న సొమ్మును టైగర్ నాగేశ్వరరావు ఏం చేస్తాడు అనేది కూడా బాగా చూపించారు. సినిమా చూస్తున్నంత సేపూ 1970 దశకంలోని వాతావరణానికి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. అయితే టైగర్ నాగేశ్వరరావు అంటే కేవలం దొంగనే కాదు.. ఆయనలోని పాజిటివ్ కోణాన్ని చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
ఎవరెలా చేశారంటే
రవితేజ మరోసారి తన యాక్షన్ పవర్‌ను బయట పెట్టాడు. లుక్స్, స్క్రీన్ ప్రజెన్స్‌తో అదరగొట్టాడు. రవితేజ చెప్పిన డైలాగ్స్ థియేటర్స్‌లో ప్రేక్షకులను అలరిస్తాయి. ఎమోషనల్ సన్నివేశాల్లో రవితేజ జీవించేశాడు. యాక్షన్ సిక్వెన్స్ అదిరిపోయాయి. ఇక హీరోయిన్ నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు తమకు ఇచ్చిన రోల్స్‌లో మెప్పించారు. టైగర్ నాగేశ్వరరావు గజ దొంగ గ్యాంగ్‌లో యాక్ట్ చేసినవారు కూడా ఇంప్రెస్ చేస్తారు. ఈ సినిమాలో స్పేషల్ రోల్ చేసిన రేణు దేశాయ్ సామాజిక కార్యకర్తగా ఆకట్టుకుంది. ఆమె పాత్ర సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. నాజర్, జిషు సేన్ గుప్తా తమ పాత్రల్లో రాణించారు. అనుపమ్ ఖేర్ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' అనే చిన్న సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన వంశీకృష్ణ .. కెరీర్ ఆరంభంలోనే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తీయడంలో దాదాపుగా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ప్రతి సీన్‌ను జాగ్రత్తగా రాసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఫ్రేమ్ ఫ్రేష్‌గా తీశాడు. రవితేజను టైగర్ నాగేశ్వరరావుగా చూపించడంలో విజయం సాధించాడు. ఫస్టాఫ్‌ను సెకండాఫ్‌తో కనెక్ట్ చేసిన విధానం బాగుంది. అయితే సెకండాఫ్‌లో లాగ్ అనిపిస్తుంది. కొన్ని సీన్లు తీసివేస్తే బాగుండు అనిపిస్తుంది. అలాగే నుపుర్- రవితేజ మధ్య వచ్చే లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోదు. సింక్ లేకుండా వచ్చే పాటలు కూడా చికాకు తెప్పిస్తాయి. సెకండాఫ్‌పై ఇంకొంచెం శ్రద్ద పెడితే బాగుండు అనిపిస్తుంది. మొత్తానికి తాను అనుకున్న కథను ప్రేక్షకులకు చెప్పడంలో మాత్రం డైరెక్టర్ వంశీ సక్రెస్ అయ్యాడు.
టెక్నికల్ పరంగా..
నిర్మాణ విలువల పరంగా టైగర్ నాగేశ్వరరావు సినిమా చాలా రిచ్‌గా కనిపిస్తుంది. సినిమా కోసం పెట్టిన భారీ ఖర్చు సీన్లలో ప్రతిబింబిస్తుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలకు గూస్ బంప్స్ వస్తాయి. ఇక టాలెంటెడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాశ్ అందించిన సంగీతం పర్వాలేదు. పాటలు అంత ఆకట్టుకోకపోయినా… బీజీఎం మెప్పిస్తుంది. యాక్షన్ సిక్వెన్స్, రవితేజ డైలాగ్స్‌కు కొట్టిన BGM బాగుంది. మది ఐ.ఎస్.సి అందించిన సినిమాటోగ్రఫి, రామ్-లక్ష్మణ్ ఫైట్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
బలాలు
రవితేజ యాక్టింగ్
యాక్షన్ సిక్వెన్స్
డైరెక్షన్
బలహీనతలు
సింక్ లేకుండా మధ్య మధ్యలో వచ్చే పాటలు
సెకండాఫ్‌లో కొన్ని లాగ్ సీన్లు
చివరగా:
టైగర్ నాగేశ్వరరావు అంటే కేవలం గజ దొంగ కథ మాత్రమే కాదు... ఓ పాజిటివ్ వైబ్రెషన్. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే సినిమా మంచి వినోదాన్ని పంచుతుంది.
రేటింగ్: 3/5
అక్టోబర్ 20 , 2023
Tollywood Cult Movies: శివ To దసరా.. తెలుగు ప్రేక్షకుడ్ని మీసం మెలేసేలా చేసిన సినిమాలు ఇవే!
ఒకప్పుడు టాలీవుడ్ అంటే దేశంలోని సినీ ఇండస్ట్రీలలో ఒకటిగా ఉండేది. తెలుగు సినిమాలంటే నార్త్ ఇండియన్స్ పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. మన డైరెక్టర్లు కూడా కేవలం సరిహద్దులు గీసుకొని కేవలం తెలుగు ఆడియన్స్ కోసమే సినిమా రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జాతీయ అవార్డు ఫంక్షన్లకు ఆహ్వానం లభించని స్టేజీ నుంచి ఆస్కార్ వేడుకల్లో పాల్గొనే స్థాయికి మన డైరెక్టర్లు ఎదిగారు. అంతర్జాతీయ బహుమతులను దేశానికి అందిస్తూ ప్రతీ ఒక్కరినీ గర్వపడేలా చేస్తున్నారు. ఇదిలా ఉంటే 1990 నుంచి ఇవాళ్టి దసరా వరకూ ఎన్నో కల్ట్ సినిమాలు టాలీవుడ్ గతిని మార్చాయి. తెలుగు ఇండస్ట్రీని రేంజ్‌ను ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉన్నాయి.
కల్ట్ మూవీ అంటే?
కల్ట్ మూవీకి పర్యాయ పదంగా ట్రెండ్ సెట్టర్ సినిమా అని కూడా సినీ విశ్లేషకులు పిలుస్తారు. విభిన్న కథాంశం. విడుదలయ్యాక ఆ మూవీ పెద్దఎత్తున ఫ్యాన్ బేస్ సంపాదించడం, ఆ చిత్రం పంథాను కొన్నేళ్లపాటు మరికొన్ని సినిమాలు అనుసరించి రావడం, ఆ సినిమా డైలాగ్స్.. ఇప్పటికీ జనాల నాలుకలపై నానడం వంటి లక్షణాలు కలిగి ఉండాలి. అలాగే బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున కలెక్షన్ల వర్షం కురిపించే సినిమాలు ఈ కోవలోకే వస్తాయి.
90వ దశకం నుంచి యాక్షన్ కల్ట్ మూవీలు
శివ(1989)
ఎలాంటి అంచనాలు లేకుండా 1989లో రిలీజైన 'శివ' మూవీ ఇండస్ట్రీ కల్ట్ గా నిలిచింది. అప్పటి వరకు సామాజిక ఆర్థిక అంశాలే ప్రధానం రూపొందిన చిత్రాల పంథాను ఒక్కసారిగా మార్చింది. పక్క యాక్షన్ మూవీగా తెరకెక్కిన శివ నాగార్జునకు స్టార్ డామ్ తెచ్చిపెట్టింది. ఆయన కెరీర్ గ్రాఫ్‌ను అమాంతం పెంచేసింది. నాగార్జున పట్ల యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సైకిల్ చైన్ లాగే మెనరిజాన్ని అప్పట్లో యూత్ పిచ్చిగా ఫాలో అయ్యేవారు. ఈ సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మతో మూవీలు చేసేందుకు స్టార్ హీరోలు క్యూ కట్టారు. అంతే కాదు శివ యాక్షన్ సిక్వెన్స్‌ను అనుసరిస్తూ చాలా చిత్రాలు వచ్చాయి.
గాయం(1993)
1993లో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లోనే వచ్చిన 'గాయం' సైతం మంచి యాక్షన్ కల్ట్ గా నిలిచింది. ఈ మూవీని యార్లగడ్డ సురేంద్ర నిర్మించారు. అప్పటి వరకు ఫ్యామిలీ హీరోగా పెరొందిన జగపతి బాబు ఈ సినిమాతో ఒక్కసారిగా మాస్ లుక్ లోకి మారిపోయారు. దుర్గ క్యారెక్టర్ లో ఒదిగిపోయారు. జగపతి బాబు సరసన రేవతి, కోటా శ్రీనివాస్ రావు, సిరివెన్నెల సితారామశాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీలోని 'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని' అనే పాట ఎంత ప్రజాదరణ పొందిందో అందరికి తెలిసిందే.
భారతీయుడు(1996)
శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన భారతీయుడు ఆల్ టైమ్ యాక్షన్ కల్ట్ చిత్రంగా పేరొందింది. రొటీన్ మూవీలకు భిన్నంగా అవినీతికి వ్యతిరేకంగా సరికొత్త కథాంశంతో శంకర్ తెరకెక్కించాడు. సేనాపతి పాత్రలో కమల్ హాసన్ అద్భుతంగా నటించాడు. ఈ మూవీ తర్వాత ఇదే తరహా కథాంశాలతో వచ్చిన రమణ, ఠాగూర్, మల్లన్న చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ఈ చిత్రంలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్‌లో మెప్పించాడు. మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందించాడు.
సమరసింహా రెడ్డి(1999)
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 'సమరసింహా రెడ్డి(1999), నరసింహా నాయుడు(2001) యాక్షన్ ఎంటర్ టైన్మెంట్‌కు కొత్త నిర్వచనం అందించాయి. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ చిత్రాల్ని డెరెక్టర్ బీ గోపాల్ అద్భుతంగా తెరకెక్కించాడు. పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగ్స్ బాగా పేలాయి. ఈ చిత్రాల్లో బాలయ్య డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పించేలా చేసింది. ఈ రెండు సినిమాలను అనుకరిస్తూ వచ్చిన చాలా చిత్రాలు వచ్చాయి. ఫాక్షనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన ఇంద్ర, ఆది, యజ్ఞం మూవీలు హిట్ కొట్టాయి.
పోకిరి(2006)
తెలుగులో వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ కల్ట్ మూవీ పోకిరి(2006). అప్పటివరకు తెలుగు తెరకు పరిచయం లేని గ్యాంగ్ స్టర్ స్టోరీ లైన్ తో పూరి ముందుకొచ్చాడు. పోకిరి దెబ్బకు అన్ని రికార్డులు దాసోహం అయ్యాయి. హీరో మేనరిజం, డెలాగ్స్, చిత్రీకరణ విలువలు, మణిశర్మ మ్యూజిక్ ప్రతి ఒక్కటీ వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుకు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. టాలీవుడ్ లో వచ్చిన చాలా సినిమాలు పోకిరి యాక్షన్ సిక్వెన్స్ ను ఫాలో అయ్యాయి.
మగధీర(2009)
రాజమౌళి డైరెక్ట్ చేసిన మగధీర క్లాసిక్ కల్ట్ గా చరిత్ర సృష్టించింది. అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను మగధీర బ్రేక్ చేసింది. పూర్వ జన్మ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ చాల ఏళ్ల తర్వాత మళ్లీ పౌరాణిక వాసనను తెలుగు తెరకు గుర్తు చేసింది. కత్తులు, యుద్ధం వంటి యాక్షన్ డ్రామాతో ఆకట్టుకుంది. ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు మంచి బ్రెక్ ఇచ్చింది. నటించిన రెండో సినిమాతోనే చరణ్ కు స్టార్ హోదా దక్కింది. ఈ చిత్రం పోలికలతో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఆశించినంత విజయం సాధించలేదు.
అర్జున్ రెడ్డి(2017)
కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి డెరెక్ట్ చేసిన 'అర్జున్ రెడ్డి(2017)' టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. వివాదాల మధ్య విడుదలైన ఈ చిత్రం పెద్దఎ త్తున ఫ్యాన్ బేస్ సంపాదించింది. విజయ్ దేవరకొండ కేరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఊహించని సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాను హిందీ, తమిళ్ ఇండస్ట్రీల్లో రీమేక్ చేశారు. యూత్ లో ఫుల్ జోష్ ను నింపింది. అర్జున్ రెడ్డిగా నటించిన విజయ్ ని రౌడీ బాయ్ అంటూ అభిమానులు పిలవడం మొదలు పెట్టారు.
బాహుబలి-2(2017)
రాజమౌళి తెరకెక్కించిన అద్భుత కావ్యం 'బాహుబలి-2(2017)' భారత చలనచిత్ర గతినే మార్చింది. అన్ని భాషలను ఏకం చేసి పాన్ ఇండియా ఇమేజ్ ను క్రియేట్ చేసింది. ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది. అప్పటి వరకు హాలీవుడ్ చిత్రాల్లోనే సాధ్యమనుకునే భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసింది. భారత చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన దంగల్ రికార్డును బ్రేక్ చేసింది. బాక్సాఫీస్ రికార్డులే కాదు సౌత్ సినిమాలను పెద్దగా ఆదరించని నార్త్ ఆడియన్స్ మనసులను సైతం కొల్లగొట్టింది.
సౌత్, నార్త్ కాదు మన సినిమా ఇండియన్ సినిమా అనే స్థాయికి ఇండస్ట్రీ వర్గాలను తీసుకొచ్చింది. ఈ మూవీ తర్వాత పలువురు బాలీవుడ్ డైరెక్టర్లు పాన్ ఇండియా మూవీలు తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
రంగస్థలం (2018)
ఒకేరకమైన కథలతో వెళ్తున్న టాలీవుడ్‌కు రంగస్థలం సినిమా కొత్త మార్గాన్ని చూపించింది. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా పక్కా పల్లెటూరు కథతోనూ హిట్ కొట్టొచ్చని డైరెక్టర్ సుకుమార్ ఈ తరం దర్శకులకు చూపించారు. ఇందులో రామ్ చరణ్, సమంత నటన మూవీకే హైలెట్ అని చెప్పాలి. రామ్‌చరణ్‌లోని కొత్త నటుడ్ని ఈ సినిమా ఆవిష్కరించింది. ఈ సినిమా స్ఫూర్తితో ప్రస్తుతం చాలా మంది దర్శకులు పల్లెటూరి కథలో దృష్టిసారిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో షేక్ చేస్తున్న దసరా, బలగం సినిమాలకు ఈ సినిమానే స్ఫూర్తి అని చెప్పొచ్చు.
పుష్ప(2022)
పాన్ ఇండియా మూవీగా వచ్చిన 'పుష్ప' భారీ విజయాన్ని సాధించింది. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గేస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా డైలాగులను రాజకీయ నాయకులు మొదలు క్రికెటర్లు, WWE స్టార్ల వరకు వల్లవేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అయితే.. రాజకీయ నాయకులు 'తగ్గేదేలే'.. 'ఏ బిడ్డా ఇది నా అడ్డా' అంటూ ప్రత్యర్థి పార్టీ నేతలకు కౌంటర్ ఇచ్చే వరకు వెళ్లింది.
ఆర్‌ఆర్‌ఆర్ (2022)
దర్శకధీరుడు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ద్వారా తెలుగు సినిమా ఖ్యాతిని అమాంతం పెంచేశాడు. టాలీవుడ్ శక్తి సామర్థ్యాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. ఈ సినిమాలో నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ అవార్డును సాధించింది. తద్వారా భారతీయుల హృదయాలను ఉప్పొంగేలా చేసింది. ఒకప్పుడు జాతీయ అవార్డులు రావడమే గగనంగా ఉన్న పరిస్థితి నుంచి తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి ఎదిగింది. కథానాయకులు రామ్‌చరణ్, ఎన్‌టీఆర్‌లు కూడా RRRలో ఎంతో అద్భుతంగా నటించారు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు.
బలగం (2023)
సరైన కంటెంట్‌తో వస్తే చిన్న సినిమా అయిన ఘనవిజయం సాధిస్తుందని బలగం సినిమా నిరూపించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రభంజనే సృష్టించింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రేమానురాగాలను డైరెక్టర్ వేణు చక్కగా చూపించాడు. పక్కా పల్లెటూరు నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.
దసరా (2023)
టాలీవుడ్ రేంజ్‌ను దసరా చిత్రం మరింత పెంచింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన తొలి సినిమాతోనే రూ.100 కోట్ల మార్క్ అందుకున్నాడు. ఈ సినిమా కూడా పల్లెటూరు కథాంశంతో తెరకెక్కి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందింది. ముఖ్యంగా హీరో నాని ఈ సినిమా తన నటా విశ్వరూపమే చూపించాడు. ఇప్పటివరకూ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఊరమాస్‌గా ఇరగదీశాడు. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. మహానటి తర్వాత కీర్తి అత్యుత్తమ నటనను ఈ సినిమాలో చూడొచ్చు.
ఏప్రిల్ 12 , 2023
Dasara: రూ.100 కోట్ల క్లబ్‌లో దసరా..! నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సూపర్ హిట్
Updated On 6-4-2023
రూ.100 కోట్ల క్లబ్‌లో..
నాని కెరీర్లో ఇప్పటివరకు చాలా సినిమాలు బంపర్ హిట్ సాధించాయి. కానీ, అధికారిక గణాంకాల ప్రకారం ఏ సినిమా కూడా రూ.100 కోట్లు వసూలు చేయలేదు. అయితే 'దసరా’తో నాని రూ.100 కోట్ల క్లబ్‌లో చేరతాడని YouSay ముందే అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగానే కేవలం 6 రోజుల్లోనే ‘దసరా’ సినిమా రూ. 100 కోట్ల గ్రాస్‌ను సాధించింది. దీంతో నాని రూ. 100 కోట్లు సాధించిన టాలీవుడ్ హీరోల జాబితాలో చేరిపోయాడు.
https://twitter.com/NameisNani/status/1643656266248777728
ఈ సారి శ్రీరామ నవమికే ‘దసరా’ పండుగ వచ్చేసింది. సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ ‘దసరా’ మూవీ థియేటర్లలో జోరు చూపించింది. నాని మార్క్ యాక్టింగ్, మాస్ యాటిట్యూడ్, బలమైన ఎమోషన్స్, టేకింగ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కలిసి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో మార్చి 30న విడుదలైన ఈ చిత్రం అంతటా హిట్ టాక్‌ని తెచ్చుకోవడం విశేషం. ఈ క్రమంలో ఆడియెన్స్ దృష్టి సినిమా కలెక్షన్లపై పడింది. కచ్చితంగా భారీ వసూళ్లను రాబడుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. పండితుల అంచనాలను కూడా అందుకుంటూ దసరా మూవీ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది.
ఓవర్‌సీస్‌లో ‘దసరా’ జోరు..
ఓవర్‌సీస్‌లోనూ ‘దసరా’ మూవీ అదరగొడుతోంది. యుఎస్‌లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓవర్‌సీస్‌లో దసరా కలెక్షన్స్ రూ.20 కోట్లు దాటినట్లు మేకర్స్ తెలిపారు. ఆస్ట్రేలియాలో దసరా కలెక్షన్స్ 2.47 లక్షల డాలర్లు దాటాయి. ఓవర్‌సీస్‌లో ఈ వికెండ్ కూడా వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
అంతటా హౌస్ ఫుల్..
నాని కెరీర్‌లోనే అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ తీసుకొచ్చిన సినిమా దసరా. పైగా, దేశవ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా థియేటర్లలో సినిమాను రిలీజ్ చేశారు. సినిమాపై అంచనాలు పెరిగిపోవడం, ప్రమోషన్లు కూడా కలిసి రావడంతో ప్రేక్షకుల దృష్టి ‘దసరా’ వైపు మళ్లింది. దీంతో థియేటర్లలో సీట్లను ఆడియన్స్ ముందుగానే బుక్ చేసుకున్నారు. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, చెన్నై, కొచ్చి, బెంగుళూరులలో సినిమా చూడటానికి జనం ఆసక్తి చూపించారు. దసరా హిట్ టాక్ తెచ్చుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో సీటు దొరకని పరిస్థితి ఏర్పడింది. బుక్ మై షో వంటి టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫాంలలో ట్రాఫిక్ పెరిగిపోయింది. ఈ హవా చూస్తుంటే వీకెండ్‌లో ‘దసరా’ వసూళ్ల మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
https://telugu.yousay.tv/review-dussehra-movie-review-nani-showed-universal-form-with-ooramas-performance.html
ఏప్రిల్ 7 వరకు పోటీలేదు..
హిట్ టాక్ పొందడంతో ‘దసరా’ సినిమా కనీసం రెండు, మూడు వారాల పాటు నాన్‌స్టాప్‌గా ఆడే అవకాశం ఉంది. దీంతో పాటు ‘దసరా’కు దరిదాపులో ఏ పెద్ద సినిమా కూడా విడుదల కావట్లేదు. అయితే ఏప్రిల్ 7న రవితేజ ‘రావణాసుర’ మినహాయిస్తే టాలీవుడ్‌లో బడా సినిమాల రిలీజ్‌లు లేవు. ఈ లెక్కన చూసుకుంటే ‘దసరా’కు తిరుగులేదనే చెప్పాలి. రావణాసుర చిత్రం టాక్ దసరా వసూళ్లపై ప్రభావం చూపొచ్చు. రవితేజ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంటే ఈ వికెండ్ కూడా దసరా వైపే ప్రేక్షకులు మెుగ్గు చూపే అవకాశముంది. అదే జరిగితే నాని సినిమా రూ.150 కోట్లు వసూలు చేయడం ఏమంత కష్టం కాదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
నాని కెరీర్‌లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాలేంటో చూద్దాం.
దసరా రూ. 100 కోట్లు
ఎంసీఏ రూ.70 కోట్లు
గ్యాంగ్ లీడర్ రూ.70 కోట్లు
శ్యాంసింగరాయ్ రూ.65 కోట్లు
నేను లోకల్ రూ.60 కోట్లు
మజ్ను రూ.58 కోట్లు
నిన్ను కోరి రూ.55 కోట్లు
భలే భలే మగాడివోయ్ రూ.51 కోట్లు
దేవదాస్ రూ.48 కోట్లు
జెర్సీ రూ.45 కోట్లు
అంటే సుందరానికి రూ.40 కోట్లు
జెంటిల్‌మెన్ రూ.32 కోట్లు
రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమా రూ.130 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కానీ, నాని ఇందులో పూర్తిస్థాయి హీరోగా నటించలేదు.
Please Note... దసరా సినిమా వంద కోట్లు కలెక్ట్ చేస్తుందని తొలిసారిగా అంచనా వేసిన వెబ్‌సైట్ ‘YouSay’నే..!
ఏప్రిల్ 06 , 2023
The Paradise: మెున్న ప్రభాస్.. నేడు నాని.. మోహన్ బాబుని తట్టుకోగలడా?
'దసరా' (Dasara)తో నటుడు నాని తొలిసారి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఆ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తనకుంటూ ప్రత్యేక గురింపు సంపాదించాడు. సుకుమార్ అసిస్టెంట్‌గా 'రంగస్థలం' (Rangasthalam)కు వర్క్ చేసిన శ్రీకాంత్ తొలి చిత్రంతోనే స్టార్ డైరెక్టర్ స్టేటస్ సంపాదించాడు. ఇప్పుడు తన రెండో చిత్రం కూడా నానితోనే చేయబోతున్నాడు. ఈ మూవీకి 'ది ప్యారడైజ్' (The Paradise) అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. ఓ దిగ్గజ నటుడు ఈ మూవీలో భాగం కాబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీంతో నాని ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
విలన్‌గా మోహన్‌బాబు!
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రానున్న 'ది ప్యారడైజ్' (The Paradise) చిత్రం సికింద్రాబాద్ నేపథ్యంలో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడైతే ఆ పాత్రకు బాగా న్యాయం చేస్తాడని దర్శకుడు శ్రీకాంత్ భావించినట్లు సమాచారం. పలు పేర్లను పరిశీలించిన పిదప డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) పేరును ఫైనల్ చేసినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో మోహన్‌బాబును సంప్రదించి విలన్ రోల్ గురించి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వివరించినట్లు కూడా తెలుస్తోంది. ఆ పాత్ర మోహన్ బాబుకు బాగా నచ్చినట్లు సమాచారం. దీంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ సైతం ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీంతో నేచురల్ స్టార్ నాని - డైలాగ్ కింగ్ మోహన్ బాబు వైరం స్క్రీన్‌పై ఏ స్థాయిలో పడుతుందో చూడాలని సినీ లవర్స్ ఇప్పటినుంచే ఎదురుచూస్తున్నారు.
డైలాగ్ కింగ్‌ను ఢీ కొట్టగలడా?
డైలాగ్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu)కి విలక్షణ నటుడిగా పేరుంది. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా టాలీవుడ్‌పై ఆయన చెరగని ముద్ర వేశారు. కెరీర్ తొలినాళ్లలో ఎక్కువ విలన్ పాత్రల్లోనే మోహన్ బాబు కనిపించారు. అత్యంత కఠినమైన డైలాగ్‌ను సైతం గుక్కతిప్పుకోకుండా చెప్పగల సామర్థ్యం మోహన్‌బాబుకు ఉంది. అటువంటి మోహన్ బాబును నేచురల్ స్టార్ నాని ఢీకొట్టడమంటే సాధారణ విషయం కాదు. గతంలో ప్రభాస్ చేసిన 'బుజ్జిగాడు' సినిమాలోనూ మోహన్ బాబు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. మోహన్ బాబు ముందు ప్రభాస్ కొన్ని సీన్స్‌లో తేలిపోయాడన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు నాని-మోహన్ బాబు కాంబో (The Paradise)ను కూడా అదే విధంగా ప్రేక్షకులు చూసే ఛాన్స్ ఉంది. కెరీర్‌లోనే తొలిసారి దిగ్గజ నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోనుండటంతో నానికి ‘ది ప్యారడైజ్’ చిత్రం అగ్నిపరీక్ష కానుందని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నారు.
టైటిల్ లీక్‌పై అసహనం
నటుడు నాని - శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపొందనున్న'ది ప్యారడైజ్' (The Paradise) మూవీ టైటిల్ మేకర్స్ అనౌన్స్ చేయకముందే లీకయ్యింది. దీంతో వర్కింగ్ టైటిల్‌తో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని భావించిన శ్రీకాంత్ ఓదెల చివరికీ టైటిల్‌ను అనౌన్స్ చేయక తప్పలేదు. ఈ లీక్ వ్యవహారంపై కొన్ని రోజుల కింద దర్శకుడు శ్రీకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులకు పాల్పడిన వ్యక్తులు ఎవరో తనకు తెలుసని అన్నారు. శ్రీకాంత్ టీమ్‌లోని వారే లీక్ చేశారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఏ సినిమాకైనా లీకల బెడద ఉంటే వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్స్, రచయితలను తప్పుబట్టడం సరికాదని అన్నారు. కష్టపడి పనిచేసే డిపార్ట్‌మెంట్లపై నిందలు వేసే అలవాటును మార్చుకోవాలని సూచించారు. తన సినిమా టైటిల్‌ను లీక్ చేసిన వారు ఎవరో తెలుసని, తన టీమ్‌లోవారు మాత్రం కాదని స్పష్టం చేశారు.
నవంబర్ 27 , 2024
New Ott Releases This Week: ఈ వారం సందడంతా చిన్న చిత్రాలదే.. ఓ లుక్కేయండి!
దసరా పండగను పురస్కరించుకొని గతవారం పెద్ద హీరోల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించి ఆనందంలో ముంచెత్తాయి. ఇక ఈ వారం బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
లవ్‌రెడ్డి
అంజన్ రామచంద్ర, శ్రావణిరెడ్డి కీలక పాత్రల్లో స్మరన్‌రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్‌రెడ్డి’ (Love Reddy Movie). ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబరు 18న విడుదల కానుంది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఆంధ్రా, కర్ణాటక సరిహద్దులో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా దీనిని తెరకెక్కించినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది.
సముద్రుడు
రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్‌లుగా నగేశ్ నారదాసి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సముద్రుడు’ (Samudrudu). అక్టోబరు 18న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మత్స్యకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం మెప్పిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
వీక్షణం
రామ్ కార్తీక్ (Ram Karthik), కశ్వి (Kashvi) జంటగా చేసిన తాజా చిత్రం ‘వీక్షణం’ (Veekshanam). మనోజ్ పల్లేటి దర్శకుడు. పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీ అక్టోబరు 18న థియేటర్‌లో విడుదల కానుంది. చనిపోయిన అమ్మాయితో హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు.
రివైండ్
సాయి రోనక్ హీరోగా కళ్యాణ్ చక్రవర్తి దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘రివైండ్’ (Rewind Movie). అమృత చౌదరి కథానాయిక. ఈ మూవీ అక్టోబరు 18న విడుదల కానుంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌కు మనసుకు హత్తుకునే లవ్‌స్టోరీని జోడించి ఈ సినిమా తీసినట్లు మేకర్స్ తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పక నచ్చుతుందని అభిప్రాయపడ్డారు.
‘ఖడ్గం’ రీ-రిలీజ్
శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్‌రాజ్ కీలకపాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఖడ్గం’. 2002లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. అక్టోబరు 18న (khadgam re release date) ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు
1000 బేబీస్
ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న ఆసక్తికరమైన వెబ్ సిరీస్ '1000 బేబీస్ (1000 Babies). అక్టోబర్ 18న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ, మలయాళ భాషల్లో వీక్షించవచ్చు. ఇందులో రెహమాన్, నీనా గుప్తా ముఖ్యపాత్రలు పోషించారు. నజీమ్ దర్శకత్వం వహించారు.
కలి
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి 'కలి' (Kali Movie OTT Release) చిత్రం ఈ వారం ఓటీటీలోకి రానుంది. అక్టోబర్ 17నుంచి ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ప్రిన్స్, నరేశ్ అగస్త్య ముఖ్య పాత్రలు పోషించారు. నేహా కృష్ణన్ హీరోయిన్‌గా చేసింది. శివ శేషు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 4న రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
TitleCategoryLanguagePlatformRelease DateThe Linkan LawyerMovieEnglishNetflixOct 17Fabulous Lives vs Bollywood Wives S3SeriesEnglishNetflixOct 19The Pradeeps Of PittsburghSeriesEnglishAmazonOct 17Citadel Honey BunnySeriesTelugu/HindiAmazonNov 7Kali MovieTeluguETV WinOct 17Reeta SanyalMovieHindiHotstarOct 14NemesisMovieEnglish/DutchHotstarOct 161000 BabiesSeriesTelugu/MalayalamHotstarOct 18RivalsMovieEnglishHotstarOct 18Crime Reels MovieTeluguAhaOct 13Janaka Aithe GanakaMovieMovieAhaNov 5Maa Nanna Super HeroMovieMovieZee 5Nov 8
అక్టోబర్ 14 , 2024
This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!
దసరా సందర్భంగా థియేటర్లలో నెలకొన్న చిత్రాల హంగామా దీపావళికి కూడా కొనసాగనుంది. ఈసారి దీపావళి సందర్భంగా పలు డబ్బింగ్ చిత్రాలు సందడి చేయనున్నాయి. తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్‌టైన్ చేసేందుకు రాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాలు ఎలా ఉన్నాయి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
టైగర్ 3
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా మనీష్ శర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘టైగర్3 ’ (Tiger 3) దీపావళి కానుకగా రాబోతోంది. నవంబరు 12న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్ (Katrina Kaif) నటించింది. ‘టైగర్ జిందా హై’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మించారు. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు, సల్మాన్‌పై చిత్రీకరించిన ఫైట్ సీక్వెన్స్‌లు అదరహో అనేలా ఉన్నాయి.
జపాన్
కథనాయకుడు కార్తి (Karthi) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జపాన్’ (Japan). రాజు మరుగున్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా చేసింది. ఇందులో కార్తి ‘జపాన్’ అనే దొంగ పాత్రలో కనిపించనున్నారు. రూ.200 కోట్ల విలువైన ఆభరణాలు జపాన్ ఎలా దొంగిలించాడు? అతడిని పట్టుకునేందుకు పోలీసులు వేసిన ఎత్తుగడలు ఏంటి? వంటి ఆసక్తికర అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది. దీపావళి కానుకగా నవంబరు 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
జిగర్ తండా డబుల్ ఎక్స్
రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య కీలక పాత్రల్లో రూపొందిన సినిమా ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ (Jigarthanda DoubleX). ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో నవంబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్యాంగ్‌స్టర్ ఆధారంగా సినిమా తీయాలనుకున్న ఓ దర్శకుడు ఆ గ్యాంగ్‌స్టర్‌నే హీరోగా పెట్టి సినిమా తీయాల్సివస్తే ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటాడనే నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘జిగర్ తండ’. ఇప్పుడు ఆ కథకే మరింత యాక్షన్‌ను జోడించి తెరపైకి ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ తీసుకొస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
అలా నిన్ను చేరి
దినేశ్ తేజ్ హీరోగా హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ కథానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కొమ్మాలపాటి సాయిసుధాకర్ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ప్రేమ, కుటుంబ వినోదంతో కూడిన ఈ సినిమా ఇంటిల్లిపాదినీ మెప్పించేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇందులోని భావోద్వేగాలు మనసుల్ని హత్తుకుంటాయని పేర్కొంది.
ది మార్వెల్స్
అమెరికన్ సూపర్ హీరో సినిమా ‘ది మార్వెల్స్’ (The Marvels) కూడా ఈ వారమే థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో హాలీవుడ్ నటి బ్రీ లార్సన్ కెప్టెన్ మార్వెల్ పాత్రలో కనిపించనుంది. నియా డకోస్టా దర్శకత్వంలో రానున్న ఈ సినిమా నవంబరు 10న తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇమాన్ వెల్లని, టోయోనా ప్యారిస్, సియో-జున్ పార్క్, శామ్యూల్ ఎల్. జాకన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
దీపావళి
అందమైన పల్లెటూరి కథతో ‘దీపావళి’ సినిమా రూపొందింది. రాము, వెంకట్, దీపన్ ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్ దర్శకత్వం వహిచారు. పండగకు కొత్త డ్రెస్ కావాలని అడిగిన మనవడి కోసం తాత తన మేకను బేరం పెడతాడు. ఆ మేక చుట్టూ అల్లుకున్న ఓ అహ్లాదకరమైన కథే ఈ సినిమా. దీపావళి సందర్భంగా నవంబరు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(telugu.yousay.tv/tfidb/ott)
TitleCategoryLanguagePlatformRelease DateRainbow rishtaSeriesEnglishAmazon PrimeNov 07BTS: Yet To ComeMovieEnglishAmazon PrimeNov 09PippaMovieHindiAmazon PrimeNov 10IrugapatruMovieTamilNetflixNov 06Escaping twin flamesSeriesEnglishNetflixNov 08The killerMovieEnglishNetflixNov 10The RoadMovieTamilAhaNov 10The Santa Clause 2SeriesEnglishDisney+HotstarNov 08LabelSeriesTeluguDisney+HotstarNov 10Ghoomer MovieHindiZee 5Nov 10
……………………………………………………………………………………………………………….
APP: దీపావళి సందర్భంగా సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నవంబర్ 6 నుంచి 12వ తేదీల మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు ఏవో తెలుసుకోవాలంటే YouSay Web లింక్‌పై క్లిక్ చేయండి.
నవంబర్ 06 , 2023
OTT Releases This Week (Oct 24-28): ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న తెలుగు సూపర్ హిట్ చిత్రాలు ఇవే!
దసరా పండుగ వేళ భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో వంటి పెద్ద సినిమాలు విడుదల కావడంతో ఈ వారం థియేటర్లలో రిలీజ్‌కు చెప్పుకోదగ్గ సినిమాలు అయితే ఏమి లేవు. అయితే సంపూర్ణేష్ బాబు నటించిన మార్టిన్ లూథర్ కింగ్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన ఘోస్ట్ చిత్రాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఇక ఓటీటీల్లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. దాదాపు 20కి పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్దమయ్యాయి. ఇటీవల రిలీజైన చంద్రముఖి2, స్కందతో పాటు మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. మరి అవెంటో ఓసారి చూసేద్దాం.
ఈవారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు
మార్టిన్ లూథర్ కింగ్ (Martin luther king telugu movie)
కమెడియన్ సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మార్టిన్ లూథర్ కింగ్. పొలిటికల్ కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని పూజా కొల్లూరు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తమిళ్ చిత్రం 'మండేలా'కీ రీమేక్ వస్తోంది. తమిళంలో కమెడియన్ యోగీ బాబు ఇందులో నటించారు. ఈ సినిమాలో నరేష్, మహా, శరణ్య ప్రదీప్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని YNOT స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోంది. మార్టిన్ లూథర్ కింగ్ ఈ నెల 27న థియేటర్లలో విడుదల కానుంది.
ఘోస్ట్ (GHOST)
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రం ఘోస్ట్. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కింది. ఈ చిత్రం అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఘోస్ట్ సినిమాలో అనుపమ్ ఖేర్, ప్రశాంత్ నారాయణ్, ఎంజీ శ్రీనివాస్, అర్చన్ జాయిస్, సత్యప్రకాశ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అర్జున్ జన్య మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా.. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషాల్లో రిలీజ్ కానుంది.
ఈ వారం (October 24-28) ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న చిత్రాలు
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి (telugu.yousay.tv/tfidb/ott)
TitleCategoryLanguagePlatformRelease DateParamporulMovieTamilAmazon PrimeOctober 24Asprints Season 2WebseriesHindiAmazon PrimeOctober 25Transformers: Rise of the BeastMovieEnglishAmazon PrimeOctober 26ConsecrationMovieEnglishAmazon PrimeOctober 27Burning Betrayal MoviePortuguese NetflixOctober 25Life on Our PlanetSeriesEnglishNetflixOctober 25Chandramukhi 2MovieTelugu DubbedNetflixOctober 26Long Live LoveMovieThaiNetflixOctober 26PlutoWeb SeriesJapaneseNetflixOctober 26Pain HustlersMovieEnglishNetflixOctober 27Sister DeathMovieSpanishNetflixOctober 27TorWeb Series SwedishNetflixOctober 27Yellow Door: 90s Lo-Fi Film ClubMovie KoreanNetflixOctober 27PebblesMovieTamilSony LivOctober 27Paramporul MovieTamilahaOctober 24Changure Bangura RajaMovieTeluguE-WinOctober 27Phone CallMovieHindiJio movieOctober 23Duranga Season 2SeriesHindiZee 5October 24Nikonj - The Search BeginsMovieBengaliZee 5October 27Masterpiece SeriesTelugu Dubbed Disney Plus HotstarOctober 25 Koffee With Karan Season 8Talk ShowHindiDisney Plus HotstarOctober 26SkandaMovieTeluguDisney Plus HotstarOctober 27Nights of ZodiacMovieEnglishBook My showOctober 24CursesSeriesTamilApple Plus TVOctober 27The Enfield Poltergeist SeriesEnglishApple Plus TVOctober 27
అక్టోబర్ 26 , 2023
This WeeK OTT Movies (Oct 02- 7) : ఈ వారం ఓటీటీల్లో 25కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్.. లిస్ట్ ఇదే!
దసరా పండుగ మరో రెండు వారాల టైం ఉన్న నేపథ్యంలో పెద్ద సినిమాలకు పోటీగా దిగకుండా.. ఇప్పుడే థియేటర్లలో విడుదలయ్యేందుకు ఈవారం పలు సినిమాలు సిద్ధమయ్యాయి. ఈవారం ఎక్కువగా చిన్న సినిమాలే ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అలాగే ఈవారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యేందుకు 25కు పైగా చిత్రాలు రెడీ అయ్యాయి. మరి ఆ సినిమాలపై ఓ లుక్ వేద్దాం..
రూల్స్ రంజన్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, టిల్లు పాప నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం రూల్స్ రంజన్. ఈ సినిమా అక్టోబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సమ్మోహనుడా సాంగ్ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందింది. యూత్ ఇన్‌స్టారీల్స్‌లో ఈ సాంగ్‌ను పెద్దఎత్తున అనుసరించారు. కాగా సినిమాను రత్నం కృష్ణ డైరెక్ట్ చేశారు. ఏఎం రత్నం సమర్పణలో మురళీ కృష్ణ వేమూరి నిర్మించారు.
మామ మశ్చీంద్ర
వినూత్నమైన టైటిల్‌తో సుధీర్ బాబు హీరోగా వస్తున్న చిత్రం మామా మశ్చీంద్ర. ఈ సినిమాను హర్షవర్ధన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు, హీందీ భాషల్లో ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రానుంది.
చిన్నా
సిద్ధార్థ్, అంజలీ నాయర్ కీలక పాత్రల్లో.. అరుణ్‌కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న మలయాళ చిత్రం 'చిత్త'. తెలుగులో 'చిన్నా' పేరుతో అక్టోబర్ 6న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే మలయాళంలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న సిద్ధార్థ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
మంత్ ఆఫ్ మధు
క్రేజీయాక్టర్ నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి కాంబోలో వస్తున్న వినూత్న చిత్రం 'మంత్ ఆఫ్ మధు'. భావోద్వేగాల నేపథ్యంగా ఈ చిత్రం రూపొందింది. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను శ్రీకాంత్ నాగోతి తెరకెక్కించారు. యశ్వంత్ ములుకుట్ల నిర్మించారు.
800
శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌గా వస్తున్న చిత్రం '800'. మురళీ పాత్రలో మధుర్ మిట్టల్ నటించాడు. ఆయన భార్య మదిమలర్ క్యారెక్టర్లో మహిమా నంబియార్ నటించారు. అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. తెలుగు, హిందీ, సింహాలి, తమిళ్ భాషల్లో విడుదల కానుంది. ప్రపంచ టెస్ట్ క్రికెట్లో 800 వికెట్లు తీసిన ఆటగాడిగా మురళీధరన్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎంఎస్. శ్రీపతి డైరెక్ట్ చేశాడు.
ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు (October 1- 7)
TitleCategoryLanguagePlatformRelease DateBeckham SeriesEnglishNetflixOct 04Race to the SummitMovieGermanNetflixOctober 04Everything Now SeriesEnglishNetflixOctober 05Sister Death MovieEnglish NetflixOctober 05Miss Shetty Mr. Polishetty MovieTelugu Movie NetflixOctober 05 Fair Play MovieEnglishNetflixOctober 06Insidious: The Red DoormovieEnglishNetflixOctober 06Strong Girl Nam SoonSerieskoreanNetflixOctober 07 Mumbai Diaries Season 2SeriesHindi Amazon PrimeOctober 06 Totally Killer MovieEnglishAmazon PrimeOctober 06Desperately Seeking Soulmate SeriesEnglish Amazon PrimeOctober 06Haunted Mansion Movie English HotstarOctober 04Loki: Season 2SeriesEnglishHotstarOctober 06Mr. Pregnant MovieTeluguAhaOctober 06The Great Indian SuicideMovieTeluguAhaOctober 06Nee Vente NenuMovieTeluguCine BazaarOctober 06Gadar 2MovieHindiZee5October 06The Nun 2 MovieEnglishBook My ShowOctober 03Gran Turismo MovieEnglishBook My ShowOctober 05Asteroid City MovieEnglish Book My ShowOctober 06
అక్టోబర్ 02 , 2023
OTT Release This Week: ఈ వారం ఓటీటీ/ థియేటర్లలో సందడి చేసే సినిమాలు ఇవే!
ఈ దసరా పండగకు థియేటర్లు దద్దరిల్లనున్నాయి. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు మూవీలు సినిమా హాళ్లో మోత మోగించనున్నాయి. బాలయ్య, రవితేజ ఇద్దరు పెద్ద స్టార్లు కావడంతో ఈసారి దసరా.. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచనుంది. ఇప్పటికే ఈ రెండు సినిమాల హీరోలు ప్రమోషన్లలో తెగ బీజీగా ఉన్నారు. రెండు మాస్ యాక్షన్ చిత్రాలు కావడంతో ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ రెండు పెద్ద సినిమాలతో పాటు తమిళ్ డబ్బింగ్ చిత్రం విజయ్ నటించిన లియో కూడా దసరా బరిలో నిలుస్తోంది. మరి ఏ చిత్రం ప్రేక్షకులను రంజింప జేయనుందో తెలియాలంటే.. కొద్దిరోజులు ఆగాల్సిందే. అటు ఓటీటీ ఫ్లాట్ ఫారమ్స్‌లోనూ 20కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. మరి ఆ చిత్రాలేంటో ఓసారి చూద్దామా...
టైగర్ నాగేశ్వర రావు
స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా ట్రైలర్‌ను బట్టి చూస్తుంటే సినిమాలో రవితేజ మాస్ యాక్షన్‌తో ఇరగదీసినట్లు అర్థమవుతోంది. ఇక ఈ చిత్రంలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే దాదాపు 23 ఏళ్ల తర్వాత రేణు దేశాయ్ తిరిగి ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేస్తుండటంతో సినిమాపై మాస్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రమోషన్లలో చిత్ర యూనిట్ బిజీగా గడుపుతోంది. రవితేజ అన్ని తానై మూవీ ప్రమోషన్లలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 20న తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదలవుతోంది.
భగవంత్ కేసరి
బాలకృష్ణ మాస్ డైలాగ్స్‌తో ఈ సినిమాకు భారీ హైప్ వచ్చింది. ఇదివరకు ఎప్పుడూ చూడని పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారని డైరెక్టర్ అనిల్ రావుపూడి చెప్పడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. 'భగవంత్ కేసరి ఈ పేరు సానా ఏళ్లు గుర్తుంటుంది' అని బాలయ్య డైలగ్ ప్రేక్షకుల్లో బాగా నానుతోంది. మహిళా సాధికారత కథాంశంగా ఈ సినిమా తెరకెక్కిందని బాలయ్య ఇప్పటికే తెలిపారు. కాగా ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ హీరోయిన్‌గా నటించింది. థమన్ సంగీతం అందించారు. శ్రీలీల బాలయ్య కూతురుగా నటించింది. ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
లియో
స్టార్ కాస్టింగ్‌తో వస్తున్న చిత్రం లియో. తమిళ్ సూపర్ స్టార్ విజయ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించారు. విజయ్ సరసన త్రిష హీరోయిన్‌గా నటించింది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఖైదీ, విక్రమ్ సినిమాలు భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈవారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు
మ్యాన్షన్ 24
బుల్లితెర యాంకర్, డైరెక్టర్ ఓంకార్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ మ్యాన్షన్ 24. ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్‌లో అక్టోబర్ 17నుంచి స్ట్రీమింగ్ కానుంది. హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్, అవికాగోర్, బిందు మాధవి, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ వెబ్ సిరీస్ రానుంది.
TitleCategoryLanguagePlatformRelease DateRick and Marty: Season 7WebseriesEnglishNetflixOctober 16I Walked Up A VampireWebseriesEnglishNetflixOctober 17The Devil on TrialWebseriesEnglishNetflixOctober 17Kaala PaaniWebseriesEnglishNetflixOctober 18Singapenne MovieTamil NetflixOctober 18Bodies Web SeriesEnglishNetflixOctober 19Captain Lazer Hawk: A Blood Dragon RemixWeb SeriesEnglish NetflixOctober 19Crypto BoyMovieDutch NetflixOctober 19NeonWeb SeriesEnglishNetflixOctober 19CreatureWeb SeriesTurkishNetflixOctober 20DoonaWeb SeriesKorean NetflixOctober 20Elite Season 7Web Series SpanishNetflixOctober 20Kandasams: The BabyMovie EnglishNetflixOctober 20Old DadsMovieEnglishNetflixOctober 20Once Upon A StudioMovieEnglishDisney Plus HotstarOctober 16Mansion 24Web SeriesTeluguDisney Plus HotstarOctober 17The Wandering Earth IIMovieMandarinAmazon PrimeOctober 18Permanent Roommates: Season 3Web SeriesHindiAmazon PrimeOctober 18Mama MashchindraMovieTeluguAmazon PrimeOctober 20Sayen: Desert RoadMovieEnglishAmazon PrimeOctober 20The Other JoyMovieEnglishAmazon PrimeOctober 20Transformers: The Rise of the BeastsMovieEnglishAmazon PrimeOctober 20Upload Season 3Web SeriesEnglishAmazon PrimeOctober 20Unstoppable Limited Edition Talk ShowTeluguahaOctober 17Red SandalwoodMovieTamilahaOctober 20Krishna RamaMovieTeluguE-WinOctober 22
అక్టోబర్ 16 , 2023
This Week Movies: ఈ వారం రిలీజయ్యే చిత్రాలు.. ‘దేవర’కు స్పీడ్ బ్రేకులు వేయగలవా!
థియేటర్లలో దేవర ప్రభజనం కొనసాగుతున్న వేళ తమ సత్తా ఏంటో చూపించేందుకు పలు చిన్న చిత్రాలు ఈ వారం థియేటర్లలోకి రాబోతున్నాయి. దసరా సెలవుల నేపథ్యంలో మిమల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు మీకోసం స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటి? ఏ రోజున రిలీజ్ కాబోతున్నాయి? వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు
స్వాగ్ (Swag)
వివైధ్య కథలకు కేరాఫ్‌గా మారిన శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన లేటెస్ట్ చిత్రం ‘స్వాగ్’ (Swag Movie) ‘రాజ రాజ చోర’ వంటి సూపర్ హిట్ తర్వాత హసిత్ గోలి దర్శకత్వంలో వస్తోన్న రెండో చిత్రం ఇది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక వంశ వృక్షంలోని పలు భిన్న తరాల కథల్ని ఇందులో చెప్పనున్నట్లు చిత్రం తెలిపింది. ఇందులో రీతూవర్మ, మీరా జాస్మిన్, దక్ష నగర్కర్ కీలక పాత్రలు పోషించారు.
చిట్టి పొట్టి (Chitti Potti)
రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చిట్టి పొట్టి’ (Chitti Potti). భాస్కర్ యాదవ్ దాసరి నిర్మించడంతో పాటు దర్శకత్వం వహించారు. సిస్టర్ సెంటిమెంట్‌తో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా దీన్ని తీర్చిదిద్దారు. అక్టోబర్ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
దక్షిణ (Dakshina)
తమిళ నటి సాయి ధన్సిక నటించిన తాజా చిత్రం ‘దక్షిణ’ (Dakshina Movie). అక్టోబరు 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మంత్ర’, ‘మంగళ’ సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఓషో తులసిరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కావడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. సీరియల్ కిల్లర్‌ను పట్టుకునే పోలీస్ ఆఫీసర్‌గా సాయిధన్సిక ఇందులో కనిపించనున్నారు.
కలి (Kali)
ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న మరో సైకలాజికల్ థ్రిల్లర్ ‘కలి’ (Kali). ప్రిన్స్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించారు. శివ సాషు దర్శకత్వం వహించారు. ఈ మూవీ కూడా అక్టోబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అతి మంచితనం వల్ల ఇబ్బందులు పడే ఓ వ్యక్తిలైఫ్‌లోకి ఒక అపరిచితుడు రావడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది.
బహిర్భూమి (Bahirbhoomi)
నోయల్, రిషిత నెల్లూరు కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘బహిర్భూమి’ (Bahirbhoomi). ఈ చిత్రాన్ని మహకాళి ప్రొడక్షన్ బ్యానర్ పై మచ్చ వేణుమాధవ్ నిర్మించారు. రాంప్రసాద్ కొండూరు దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 4న విడుదలకు సిద్ధమైంది. రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ చేయగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
35 చిన్న కథ కాదు (35 Chinna Katha Kaadu)
ప్రముఖ నటి నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం ’35 చిన్న కథ కాదు’. ఎమోషనల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రానికి నందకిషోర్ ఇమాని దర్శకత్వం వహించాడు.ఇందులో ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ, గౌతమి కీలకపాత్రలు పోషించారు. సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదలైన మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ వీకెండ్‌లో మిమల్ని అలరించేందుకు ఓటీటీలోకి రాబోతోంది. అక్టోబర్ 2 నుంచి ఆహా వేదికగా ఈ సినిమాను వీక్షించవచ్చు.
బ్లింక్ (Blink)
‘దసర’ ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా చేసిన కన్నడ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'బ్లింక్'. మేలో అమెజాన్ ప్రైమ్ వేదికగా కన్నడలో ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. తాజాగా తెలుగు వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఆహా వేదికగా సెప్టెంబర్ 30 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో డిఫరెంట్ నరేషన్‍తో వచ్చిన ఈ మూవీ బాగా పాపులర్ అయ్యింది.
కళింగ (Kalinga)
ధృువ వాయు హీరోగా నటించిన రీసెంట్ చిత్రం 'కళింగ'. అతడి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రగ్యా నయన్ హీరోయిన్‌గా చేసింది. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హారర్ ఎలిమెంట్స్‌కు ఫాంటసీ అంశాలను జోడించి దర్శకుడు ఈ మూవీని రూపొందించారు. సెప్టెంబర్ 13న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఈ వారం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆహా వేదికగా సెప్టెంబర్ 2 నుంచి ఈ సినిమాను వీక్షించవచ్చు.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateTim Dillan MovieEnglishNetflixOct 01Sheffs TableSeriesEnglishNetflixOct 02Love Is BlindSeriesEnglishNetflixOct 02Unsolved Mysteries 5SeriesEnglishNetflixOct 02Hearts Topper 3SeriesEnglishNetflixOct 03CTRLSeriesHindiNetflixOct 04House Of Spoilers SeriesEnglishAmazonOct 03The TribeSeriesEnglishAmazonOct 04The SignatureMovieHindiZee 5Oct 23Amar Prem Ki Prem KahaniMovieHindiJio CinemaOct 04Furiosa: A Mad Max SagaMovieEnglishJio CinemaOct 2335 Chinna Katha KaduMovieTeluguAhaOct 02Balu Gani TalkiesMovieTeluguAhaOct 04
సెప్టెంబర్ 30 , 2024
This Week Movies: ‘దేవర’ వచ్చేస్తున్నాడు.. ఓటీటీలోనూ బ్లాక్‌బాస్టర్ చిత్రాలు లోడింగ్!
గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలు సందడి చేస్తున్నాయి. దసరా పండగకు ముందు క్రేజీ చిత్రాలు, అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలోనూ అలరించడానికి సిద్ధమయ్యాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు
దేవర (Devara)
ఎన్టీఆర్ (NTR) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా ‘దేవర’. జాన్వీకపూర్ (Janhvi Kapoor) కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 27న (devara release date) పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఎన్టీఆర్ చాలా సంవత్సరాల తర్వాత ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఆయన దేవర, వర పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సత్యం సుందరం (Sathyam Sundaram)
తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా ‘96’ వంటి ఫీల్ గుడ్‌మూవీని తెరకెక్కించిన సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెయ్యజగన్’. తెలుగులో ఈ మూవీని ‘సత్యం సుందరం’ పేరుతో సెప్టెంబరు 28న (meiyazhagan release date) విడుదల చేస్తున్నారు. ఇందులో ప్రముఖ నటుడు అరవింద స్వామి కీలక పాత్ర పోషించారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య, జోతికలు ఈ సినిమాను నిర్మించడం విశేషం. పెళ్లి మండపంలో కలుసుకున్న సత్యం, సుందరం అనే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే కథను వినోదాత్మకంగా సి.ప్రేమ్ కుమార్ ఆవిష్కరించారు.
హిట్లర్ (Hitler)
తమిళ హీరో విజయ్ ఆంటోని నటించిన లేటెస్ట్ చిత్రం 'హిట్లర్'. దర్శకుడు ధన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారు. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలు. ఈ సినిమా ఈ నెల 27న ‘దేవర’ మాదిరిగానే హిందీతో పాటు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు, సిరీస్‌లు..
సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram)
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకుంది.ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా సెప్టెంబర్ 26 నుంచి ప్రసారం కానుంది. ఎస్.జె.సూర్య విలన్‌గా ఆకట్టుకున్న ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ నటించారు. సాయికుమార్ అభిరామి, అదితి బాలన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
డిమోంటి కాలనీ 2 (Demonte Colony 2)
‘డిమోంటి కాలనీ 2’ (Demonte Colony 2) చిత్రం ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అరుళ్ నిధి (Arulnithi), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తు ఈ సినిమాను తెరకెక్కించారు. ఆగస్టులో ప్రేక్షకులను థ్రిల్ చేసిన ఈ హారర్ థ్రిల్లర్ ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 27 నుంచి ‘జీ 5’లో తెలుగు, తమిళ్‌లో స్ట్రీమింగ్ కానుంది. 2015లో వచ్చిన ‘డిమోంటి కాలనీ’కి సీక్వెల్‌గా ఇది రూపొందింది.
ముంజ్యా (Munjya)
బాలీవుడ్ నటి శార్వారీ వాఘ్, అజయ్ వర్మ ప్రధాన పాత్రలలో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘ముంజ్యా’. ఆదిత్య చోప్రా యష్ రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్ రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించాడు. ఇటీవల హిందీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ చిత్రం తాజాగా తెలుగు, తమిళ వెర్షన్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DatePenelopeSeriesEnglishNetflixSept 24Heaven And HellMovieEnglishNetflixSept 26The True GentlemanMovieEnglishNetflixSept 26RezballMovieEnglishNetflixSept 27Will And HarperSeriesEnglishNetflixSept 27School FriendsSeriesHindiAmazonSept 25Nobody Wants ThisSeriesEnglishAmazonSept 26Stree 2MovieHindiAmazonSept 27VazhaMovieMalayalamHotstarSept 239-1-1SeriesHindiHotstarSept 24GrotesqueMovieEnglishHotstarSept 16Taja Khabar 2SeriesHindiHotstarSept 27RTIMovieTeluguETV WinSept 26
సెప్టెంబర్ 23 , 2024
Saripodhaa Sanivaaram First Single: నాని ఊరమాస్ ఊచకోత… ఎవ్వరూ ఊహించని విధంగా ఫస్ట్ సింగిల్
నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సరిపోదా శనివారం సినిమా రోజు రోజుకు బజ్ పెరిగిపోతోంది. దసరా, హాయ్ నాన్న చిత్రాలు హిట్ కావడంతో నాని హ్యాట్రిక్ విజయంపై కన్నేశాడు. ఈసారి పక్క మాస్ ఎంటర్‌టైనర్‌గా రానున్నట్లు మూవీ పోస్టర్స్, గ్లింప్స్‌ను బట్టి అర్ధమవుతోంది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో వస్తున్న సరిపోదా శనివారంలో నాని మాస్ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని DVV ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. నానికి వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో ఇది రెండో సినిమా. గతంలో అంటే సుందరానికీ అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించి విజయం సాధించారు. మళ్లీ ఈ హిట్ కాంబో సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సరిపోదా శనివారం ఫస్ట్ సింగిల్
సరిపోదా శనివారం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 'గరం గరం' పేరుతో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎవరూ ఊహించని విధంగా సాంగ్ ఉంది. ఆకట్టుకునే మాస్ లిరిక్స్‌ను సాహపాఠి భరద్వాజ్ పుత్రుడు అందించాడు. ఈ లిరిక్స్ సినిమాలో హీరో క్యారెక్టర్‌ను రివీల్ చేసే విధంగా ఉంది. జేక్స్ బిజోయ్ మాస్ ట్యూనింగ్‌లో విశాల్ దద్వాని వాయిస్ సాంగ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. ఊర మాస్ బీట్‌తో ప్రేక్షకులను అయితే అలరిస్తోందని చెప్పాలి. మొత్తానికి ఈ సాంగ్‌ను నాని అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. మరో సాలిడ్ హిట్ పక్కా అంటూ కామెంట్ చేస్తున్నారు.
https://www.youtube.com/watch?v=qlbnA4pWwsQ&feature=youtu.be
రూ. 100 కోట్లు పక్కా?
నాని నటించిన దసరా చిత్రం రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ .. కలెక్షన్ల పరంగా నిరాశ పరిచిందని చెప్పవచ్చు. దీంతో పక్కా మాస్ ఎలిమెంట్స్ ఉన్న కథాంశాన్ని నాని ఎంచుకున్నాడు. ఈ సినిమాపై ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమా కూడా దసరా చిత్రం మాదిరి రూ.100కోట్లకు పైగా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని అభిమానులతో పాటు ఇండస్ట్రీ చర్చించుకుంటోంది.
నటీనటలు వీళ్లే!
ఇక నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. గంతలో వీరి కాంబోలో గ్యాంగ్ లీడర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరు కలిసి ఫుల్ టైం మాస్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. అటు నానికి అపోజిట్ క్యారెక్టర్‌లో తమిళ్ స్టార్ డైరెక్టర్, నటుడు ఎస్ జే సూర్య నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందనే బజ్ ప్రేక్షకులతో పాటు అభిమానుల్లో పెరిగిపోయింది. ప్రియాంక మోహన్‌తో పాటు అదితి బాలన్ , సాయికుమార్, శుభలేక సుధాకర్ వంటి స్టార్ నటులు ఈ సినిమాలో భాగమయ్యారు.
షూటింగ్ ఫినిష్
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది. ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే పూర్తి చేశారు. సినిమా నుంచి విడుదలవుతున్న పోస్టర్లో నాని మాస్ లుక్ విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ చిత్రానికి మురళి జీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎడిటర్‌గా కార్తిక శ్రీనివాస్ పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు పాన్ ఇండియా భాషల్లో ఈ ఆగస్ట్ 29న విడుదల చేయనున్నారు
జూన్ 15 , 2024