• TFIDB EN
 • Editorial List
  2023లో బెస్ట్ తెలుగు సినిమాలు.. వీటిని మాత్రం ఓటీటీల్లో మిస్ కావొద్దు!
  Dislike
  400+ views
  6 months ago

  2023 ఏడాదిలో ది బెస్ట్ అండ్ సూపర్ హిట్ చిత్రాల కోసం వెతుకుతున్నారా? అయితే ఈ లిస్ట్ మీకోసమే..! అయితే ప్రస్తుతం ఆ చిత్రాలను థియేటర్లలో చూడలేకపోయినప్పటికీ... అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, ZEE5, హాట్‌స్టార్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో చూడవచ్చు. ఇంకెందుకు ఆలస్యం కూల్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేయండి.. చేతిలోకి పాప్‌కార్న్, స్నాక్ బాక్స్ తీసుకోండి... ఎంటర్‌టైన్‌మెంట్ మత్తును ఎంజాయ్ చేయండి.

  ఇంగ్లీష్‌లో చదవండి

  1 . భగవంత్ కేసరి(అక్టోబర్ 19 , 2023)
  U/A|యాక్షన్,డ్రామా
  కొన్ని తప్పని పరిస్థితుల్లో జైలుకు వెళ్లిన భగవంత్ కేసరికి ఆ జైలు.. జైలర్ ఓ పని అప్పగిస్తాడు. తన కూతుర్ని కొంత మంది దుర్మార్గుల నుంచి రక్షించమని మాట తీసుకుంటాడు. అందుకోసం భగవంత్ కేసరి.. ఏం చేశాడు? ఆమెను స్ట్రాంగ్‌ చేసేందుకు ఏలాంటి పనులు చేశాడన్నది మిగతా కథ

  బాలకృష్ణ నటించిన టాప్ యాక్షన్ చిత్రం.. అమెజాన్‌ ప్రైమ్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ సినిమాను థియేటర్లలో చూడని వారు ఓటీటీల్లో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

  2 . టైగర్ నాగేశ్వరరావు(అక్టోబర్ 20 , 2023)
  U/A|యాక్షన్,క్రైమ్,థ్రిల్లర్
  టైగర్ నాగేశ్వరరావు(రవితేజ) అనే గజదొంగ ధనికుల దగ్గర అందినంత బంగారం, డబ్బు దోచుకుంటూ పేదలకు పంచుతుంటాడు. అతనికి పోలీసులు సైతం భయపడుతుంటారు. అయితే స్టువర్టుపురంలో మాములు వ్యక్తిగా ఉన్న నాగేశ్వరరావు గజదొంగగా ఎలా మారాడు అనేది కథ.

  ఈ చిత్రం సైతం రీసెంట్‌గా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. థియేటర్లలో మిస్‌ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

  3 . మ్యాడ్(అక్టోబర్ 06 , 2023)
  U/A|హాస్యం,డ్రామా
  మనోజ్(రామ్ నితిన్), అశోక్ (నార్నె నితిన్), దామోదర్(సంగీత్ శోభన్) మంచి స్నేహితులు. రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల(RIE)లలో చదువుతుంటారు. ఇక మనోజ్.. శృతి(గౌరి)ని ప్రేమిస్తుంటాడు. జెన్నీ(అనంతిక) అశోక్‌ను ఇష్టపడుతుంటుంది. దామోదర్ (డీడీ)కు గుర్తుతెలియని అమ్మాయి ప్రేమ లేఖలు రాయడంతో అతడు ఆమె ప్రేమలో పడతాడు. ఇలా వెన్నెల అనే అమ్మాయిని చూడకుండానే నాలుగేళ్లు గడిపేస్తాడు డీడీ. ఇంతకీ వెన్నెల ఎవరు?. ఆమెను వెతికే క్రమంలో డీడీకి తెలిసిన నిజం ఏంటీ? మనోజ్‌, అశోక్‌, దామోదర్‌ తమ ప్రేమను గెలిపించుకున్నారా? అనేది మిగతా కథ.

  యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కాలేజీ లైఫ్‌లో ఉన్నవారు తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇది. రీసెంట్‌గా ఈ సినిమా నెట్‌ఫిక్స్‌లోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

  4 . రైటర్ పద్మభూషణ్(ఫిబ్రవరి 03 , 2023)
  U|123 minutes|డ్రామా,ఫ్యామిలీ
  పెద్ద రచయిత కావాలనేది భూషణ్(సుహాస్) కల. అసిస్టెంట్ లైబ్రేరియన్‌గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ పుసక్తం రాసి.. దానిని ప్రింట్ చేయించడానికి రూ.4లక్షల అప్పు చేస్తాడు. ఈ పుస్తకానికి సరైన ఆదరణ రాదు. దీంతో అందరితో చదివించడానికి భూషణ్ చాలా కష్టపడుతుంటాడు. ఈ క్రమంలో పద్మభూషణ్ పేరుతో మరో పుసక్తం విడుదలై మంచి ఆదరణను పొందుతుంది. కానీ, ఆ పుస్తకాన్ని తనే రాశానంటూ భూషణ్ చెబుతూ తిరుగుతుంటాడు. ఈ క్రమంలో ఆ పుస్తకం నచ్చి తన కూతురు సారిక(టీనా శిల్పరాజ్)ను ఇచ్చి పెళ్లి చేస్తానంటూ మేనమామ ముందుకొస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ

  ఈ చిత్రం ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో టాప్‌ రేటింగ్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.

  5 . బెదురులంక 2012(ఆగస్టు 25 , 2023)
  U/A|రొమాన్స్,డ్రామా,యాక్షన్
  శివ శంకర వరప్రసాద్‌ (కార్తికేయ) హైదరాబాద్‌లో గ్రాఫిక్‌ డిజైనర్‌గా పనిచేస్తుంటాడు. తన ముక్కుసూటి తనంతో జాబ్‌ పోగొట్టుకుంటాడు. ప్రేమించిన అమ్మాయి (నేహాశెట్టి)కోసం బెదురులంక గ్రామానికి వస్తాడు. అప్పటికే ఊర్లో యుగాంతానికి సంబంధించి వార్త భయానికి గురి చేస్తుంది. ఈక్రమంలో ఊరి ప్రెసిడెంట్‌(గోపరాజు రమణ)తో కలిసి బ్రహ్మణుడైన బ్రహ్మం(శ్రీకాంత్‌ అయ్యంగార్‌), చర్చి ఫాదర్‌ కొడుకు డేనియల్‌(రాంప్రసాద్‌) పెద్ద ప్లాన్‌ వేస్తారు. గ్రామస్థుల వద్ద ఉన్న బంగారాన్ని కరిగించి శివలింగం, శిలువ చేసి గంగలో వదిలేస్తే యుగాంతం ఆగిపోతుందని నమ్మిస్తారు. దీనిని ఎదురించిన శివ ఊరి పెద్దల ఆటలు ఎలా కట్టించాడు అనేది కథ.

  బెదురులంక సినిమా అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌కు ఉంది.

  6 . దసరా(మార్చి 30 , 2023)
  U/A|156 minutes|యాక్షన్,అడ్వెంచర్,డ్రామా
  ధరణి తన స్నేహితులతో కలిసి బొగ్గుని దొంగతనం చేస్తూ.. మద్యం సేవిస్తూ అందరితో గొడవలు పడుతూ ఉంటాడు. కానీ మరుసటి రోజు అవన్నీ మర్చిపోతాడు. ఈ క్రమంలో ఓ రోజు చిన్న నంబి ( షైన్ టామ్ చాకో) సిల్క్ బార్‌లో కూడా గొడవపడి మర్చిపోతాడు. దానిని చిన్న తంబి చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ఈక్రమంలో ఓ రాత్రి ముసుగు దుండగులు ధరణి ప్రాణ స్నేహితుడిని చంపుతారు. ఇంతకు ధరణి స్నేహితుడిని చంపిందెవరు? వారిపై ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు అన్నది మిగతా కథ

  దసరా.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఉంది

  7 . సామజవరగమన(జూన్ 29 , 2023)
  U|140 minutes|హాస్యం,డ్రామా
  బాలు (శ్రీవిష్ణు) హైదరాబాద్‌లోని ఓ మల్టీప్లెక్స్‌లో టిక్కెట్లు అమ్ముతుంటాడు. కానీ అతని తండ్రి (నరేష్) డిగ్రీ పూర్తి చేయాలని సూచిస్తాడు. ఓ రోజు డిగ్రీ పరీక్ష హాలులో సరయు (రెబా మోనికా జాన్)ని బాలు కలుస్తాడు. ఆ తర్వాత సరయు ఇంటికి పేయింగ్ గెస్ట్‌గా వెళ్లి బాలు ఆమెతో ప్రేమలో పడుతాడు. ఈ క్రమంలో సరయు కుటుంబం గురించి ఒక షాకింగ్ న్యూస్ తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది. ఆ సమస్యను బాలు ఎలా పరిష్కరించాడన్నది మిగతా కథ

  ఈ చిత్రం ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

  8 . బలగం(మార్చి 03 , 2023)
  U|129 minutes|డ్రామా
  ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్‌ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు.

  బలగం చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు ఉంది.

  9 . విరూపాక్ష(ఏప్రిల్ 21 , 2023)
  A|146 minutes|థ్రిల్లర్,హారర్,మిస్టరీ,యాక్షన్
  రుద్రవరం అనే ఊరిలో అనుమానాస్పదంగా చాలామంది దారుణంగా చనిపోతుంటారు. ఈ మరణాల చేతబడి వల్ల జరుగుతున్నయా? లేదా ఎవరైనా హత్య చేస్తున్నారా? అనే విషయాన్ని కనుక్కునేందుకు హీరో సాయిధరమ్ తేజ్‌ ఏం చేశాడు? నందినీ పాత్ర ఏంటీ? ఆ డెత్ మిస్టరీ వెనుక అసలు ఎవరున్నారు? అనేది కథ.

  నెట్‌ఫ్లిక్స్‌లో విరూపాక్ష స్ట్రీమింగ్ అవుతోంది.

  10 . రంగ మార్తాండ(మార్చి 22 , 2023)
  U|150 minutes|డ్రామా,ఫ్యామిలీ
  రంగస్థల నాటకాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రాఘవరావు ( ప్రకాశ్ రాజ్‌). అతడి నటనకు మెచ్చి రంగమార్తాండ అనే బిరుదును ఇస్తారు. ఆ బిరుదుతోనే నాటకరంగం నుంచి తప్పుకొని ఆస్తిని పిల్లలకు పంచుతాడు. వారితో సంతోషమైన జీవితం గడుపుదామని భావించిన అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. రాఘవరావు స్నేహితుడు చక్రవర్తి ( బ్రహ్మానందం ) పాత్ర ఏమిటి? అనేది కథ.

  ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌కు ఉంది.

  11 . మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(సెప్టెంబర్ 07 , 2023)
  U/A|147 minutes|హాస్యం,రొమాన్స్
  మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ.

  ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.


  @2021 KTree