UATelugu2h 18m
తన బిడ్డ లైగర్(విజయ్ దేవరకొండ)ను ఛాంపియన్‌గా చూడాలని బాలామణి (రమ్యకృష్ణ) కోరిక. ఇందుకోసం కరీంనగర్ నుంచి ముంబయికి వస్తుంది. ప్రేమ జోలికి వద్దని తల్లి చెబుతున్నప్పటికీ లైగర్ తానియా (అనన్య పాండే) ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వారి ప్రేమ ఎందుకు విఫలమైంది? లైగర్ ఛాంపియన్‌గా అయ్యాడా? అనేది కథ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Hotstarఫ్రమ్
Watch
Free
రివ్యూస్
YouSay Review
Liger Movie Review
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'లైగర్' మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. పూరీ జగన్నాథ్...read more
How was the movie?
తారాగణం
విజయ్ దేవరకొండ
తాన్య ప్రేమ ఆసక్తి మరియు బాలమణి కొడుకుఅనన్య పాండే
లిగర్ ప్రేమ ఆసక్తి మరియు సంజు చెల్లెలురమ్య కృష్ణన్
లిగర్ తల్లిరోనిత్ రాయ్
లిగర్ MMA కోచ్అలీ
మకరంద్ దేశ్‌పాండే
చంకీ పాండే
తాన్య మరియు సంజు తండ్రిమైక్ టైసన్
మార్క్ ఆండర్సన్ (పొడిగించిన అతిధి పాత్ర)గెటప్ శ్రీనుగణపత్
సిబ్బంది
పూరి జగన్నాధ్
దర్శకుడుకరణ్ జోహార్
నిర్మాతపూరి జగన్నాధ్
నిర్మాతఛార్మీ కౌర్
నిర్మాతఅపూర్వ మెహతానిర్మాత
హీరో యష్ జోహార్నిర్మాత
పూరి జగన్నాధ్
రచయితవిక్రమ్ మాంట్రోస్
సంగీతకారుడుతనిష్క్ బాగ్చి
సంగీతకారుడుజాని
సంగీతకారుడుసునీల్ కశ్యప్
సంగీతకారుడులిజో జార్జ్-DJ చేతస్సంగీతకారుడు
ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Puri Jagannadh: ‘లైగర్’ ఫ్లాప్ తర్వాత విజయేంద్ర ప్రసాద్ క్లాస్ పీకారు.. పూరి జగన్నాథ్ క్రేజీ కామెంట్స్!
టాలీవుడ్‌కు చెందిన స్టార్ దర్శకుల్లో పూరి జగన్నాథ్ (Puri Jagannadh) ఒకరు. ఒకప్పుడు పూరి నుంచి సినిమా వచ్చిందంటే మాస్ ఆడియన్స్‌తో థియేటర్లు దద్దరిల్లేవి. పూరి మార్క్ డైలాగ్స్ కుర్రకారును ఉర్రూతలూగించేవి. అయితే గత కొలంగా పూరి మేనియా కనిపిచడం లేదు. ‘పోకిరి’, బిజినెస్ మ్యాన్’ ‘టెంపర్’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలు రావడం లేదు. పూరి జగన్నాథ్ గత చిత్రం ‘లైగర్’ (Liger) దారుణంగా ఫెయిల్ అవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒకప్పటి పూరి తమకు మళ్లీ కావాలంటూ పెద్ద ఎత్తున అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) పూరికి క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ పూరి ఈ విషయాన్ని స్వయంగా పంచుకున్నారు.
‘సినిమా తీసే ముందు నాకు చెప్పండి’
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం 'డబుల్ ఇస్మార్ట్' (Double Ismart). ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఆదివారం (ఆగస్టు 11) హనుమకొండలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు పూరి మాట్లాడుతూ ఆసక్తిక విషయాన్ని పంచుకున్నారు. ‘హిట్ సినిమా తీస్తే చాలామంది ఫోన్ చేసి ప్రశంసిస్తారు. ఫ్లాప్ సినిమా విషయంలోనూ నాకు ఓ కాల్ వచ్చింది. చేసిందెవరో కాదు విజయేంద్ర ప్రసాద్. నాకో సాయం చేస్తారా? అని అడిగారు. ఆయన కుమారుడు రాజమౌళే పెద్ద డైరెక్టర్. నేనేం హెల్ప్ చేయాలి? అని మనసులో అనుకున్నా. తదుపరి చిత్రం ఎప్పుడు చేస్తున్నారు? మీరెప్పుడు చేసినా ఆ సినిమా కథ నాకు చెబుతారా? అని అడిగారు. ఆయనెందుకు అలా అంటున్నారో కొంచెం అర్థమైంది. మీలాంటి డైరెక్టర్లు ఫెయిల్ అవ్వడం నేను చూడలేను. చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. అందుకే తీసే ముందు నాకు ఒక్కసారి చెప్పండి’ అని అన్నారు. ఆయన మాటలతో భావోద్వేగానికి గురయ్యా. నాపై అభిమానంతో చేసిన ఆ కాల్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. అయితే, ఈ స్టోరీ గురించి ఆయనకు చెప్పలేదు. జాగ్రత్తగా తెరకెక్కించి, సినిమానే చూపించాలనుకున్నా’ అని పూరి చెప్పారు.
https://twitter.com/i/status/1822878179679203353
కథ చెప్పాల్సింది కదా!
డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే విపరీతమైన అభిమానం. డైరెక్టర్లలో తనకు పూరి జగన్నాథ్ ఇష్టమని గతంలో ఓ ఇంటర్యూలో ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన మొబైల్ వాల్‌పేపర్‌గా పూరి జగన్నాథ్ ఫొటో పెట్టుకోవడం కూడా చూపించారు. అలాంటి విజయేంద్ర ప్రసాద్ తనను కథ చెప్పమని అడిగితే తాను చెప్పలేదని పూరి జగన్నాథ్ షాకింగ్ విషయాన్ని తాజాగా బయటపెట్టారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపతున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ బ్లాక్ బాస్టర్ చిత్రాలకు కథ అందించిన విజయేంద్ర వర్మ స్వయంగా కథ చెప్పాలని సూచిస్తే పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ‘డబుల్ ఇస్మార్ట్’ స్టోరీ చెప్పి ఉంటే అందులోని తప్పొప్పులను ఆయన సూచించేవారు కదా అని పోస్టులు పెడుతున్నారు. రిస్క్ తీసుకోకుండా ఆయనకు స్టోరీ చెప్పుంటే బాగుండేదని అంటున్నారు.
మనకంటూ ఓ క్లారిటీ ఉండాలి!
‘డబుల్ ఇస్మార్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో రామ్ పోతినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెగిటివ్ రివ్యూలు చూసి థియేటర్లకు రావడం మానివేసే వారికి పరోక్షంగా కీలక సూచనలు చేశాడు. 'మనలో చాలా మంది తమ అభిప్రాయానికి గౌరవం ఇవ్వడం లేదు. మనం ఓ రెస్టారెంట్‌లో తిన్న బిర్యానీ బాగుంటే మిగిలిన వారు బాగోలేదంటే మనపై మనకు డౌట్ ఉండకూడదు. నేను తిన్నాను బాగుందనుకోవాలి. సినిమాల విషయంలోనూ మీ కెరీర్ విషయంలోనూ అంతే. పక్కవారి ఒపీనియన్ వల్ల నీ ఒపీనియన్ మార్చుకోవద్దు. ఎందుకంటే ఇతరుల అభిప్రాయాలతో పోల్చుకుంటే మనం ఏ పనీ చేయలేం. మీరంతా నా వాళ్లు అనుకుని ఇదంతా చెబుతున్నా’ అని రామ్ అన్నారు. ఈ ఎనర్జిటిక్ స్టార్ వ్యాఖ్యలను మెజారిటీ నెటిజన్లు సమర్థిస్తూ పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/i/status/1822887370594877712
ఆగస్టు 12 , 2024
Double Ismart: చిక్కుల్లో ‘డబుల్ ఇస్మార్ట్’.. పూరి, రామ్‌ను వెంటాడుతున్న ‘లైగర్’ నష్టాలు!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni), డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కాంబోలో రూపొందిన సెకండ్ ఫిల్మ్ 'డబుల్ ఇస్మార్ట్' (Double Ismart). గతంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం 'ఇస్మార్ట్ శంకర్' (Ismart Shankar)కు సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందింది. ఆగస్టు 15న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇటీవల సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న డైరెక్టర్ పూరికి, రామ్‌లకు ఈ మూవీ సక్సెస్ ఎంతో కీలకంగా మారింది. ఇటీవల రిలీజైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను సైతం పెంచేసింది. దీంతో అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో ఈ ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీకి ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. పూరి డైరెక్షన్‌లో వచ్చిన ‘లైగర్’ (Liger) సినిమా ఆర్థిక కష్టాలు రామ్ చిత్రాన్ని చుట్టుముడుతున్నాయి.
అసలేం జరిగిందంటే?
‘డబుల్ ఇస్మార్ట్’ మూవీకి లైగర్ నష్టాలు పెద్ద తలనొప్పిగా మారాయి. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కాంబోలో భారీ బడ్జెట్‌తో రూపొందిన 'లైగర్' (Liger) ఊహించని స్థాయిలో డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతలతో పాటు ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లకు పెద్ద ఎత్తున నష్టాలను మిగిల్చింది. అయితే లైగర్ నష్టాలను సెటిల్ చేయకుండా పూరి మరో సినిమాను రిలీజ్‌కు సిద్ధం చేయడంపై డిస్టిబ్యూటర్లు కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. లైగర్ నష్టాలను సెటిల్‌మెంట్ చేసేవరకూ ఈ చిత్రాన్ని ప్రదర్శించకూడదని వారు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఓ పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్‌లో మీటింగ్ కూడా జరిగినట్లు సమాచారం. ఈ భేటీలో లైగర్ నష్టాల భర్తీ గురించి కూలంకుషంగా చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్‌కు ఏమైనా ఆటంకం కలుగుతుందా అన్న ఆందోళన మూవీ టీమ్‌లో నెలకొంది.
సాంగ్ పైనా వివాదం!
ఇటీవల డబుల్ ఇస్మార్ట్ సినిమా నుంచి రెండో లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 'మార్ ముంత చోడ్ చింత' పేరుతో సెకండ్ సింగిల్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. అయితే ఈ పాట మధ్యలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాయిస్ ఉపయోగించారు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన 'ఏం జేద్దామంటవ్ మరీ' పదాన్ని వాడారు. అది కూడా డైరెక్ట్‌గా కేసీఆర్ వాయిస్‌తోనే ఉపయోగించారు. దీంతో కేసీఆర్ అభిమానులు, తెలంగాణ వాదులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ కల్చర్‌ను తాగుడు సంస్కృతిగా చూపించేలా ఈ పాట ఉందంటూ విమర్శలు చేశారు. కేసీఆర్ డైలాగ్‌ను తొలగించకపోతే సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే దీనిపై మూవీ టీమ్ స్పందించాల్సి ఉంది.
https://www.youtube.com/watch?v=-Kba0qmTtZE
పోటీగా మూడు చిత్రాలు
డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి 'పుష్ప 2' ఆ రోజున రిలీజ్ కావాల్సి ఉంది. షూటింగ్‌లో జాప్యం వల్ల ఆ సినిమాను డిసెంబర్ 6కు పోస్టు పోన్ చేశారు. దీంతో ఆ డేట్‌ను పూరి జగన్నాథ్ తన సినిమా కోసం లాక్ చేశారు. అయితే ఆ సంతోషం ఎక్కువ కాలం నిలువ లేదు. రవితేజ నటించిన 'మిస్టర్ బచ్చన్' (Mr Bachchan), కోలీవుడ్ స్టార్ విక్రమ్ లీడ్ రోల్‌లో చేసిన 'తంగలాన్' (Thangalaan) చిత్రాలు ఆగస్టు 15న రిలీజ్ కాబోతున్నాయి. వీటితో పాటు 'ఆయ్' అనే మరో మూవీ కూడా డబుల్ ఇస్మార్ట్‌కు పోటీగా బరిలోకి దిగుతోంది. దీంతో ఆ మూడు చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తలపడాల్సిన పరిస్థితి ‘డబుల్ ఇస్మార్ట్’కు ఏర్పడింది.
జూలై 31 , 2024
Double iSmart Review: మాస్ ఎనర్జీతో ఇరగదీసిన రామ్ పొత్తినేని.. సినిమా ఎలా ఉందంటే?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని కావ్యాథాపర్ జంటగా నటించిన 'డబుల్ ఇస్మార్ట్' భారీ అంచనాల నడుమ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'లైగర్' ఫ్లాప్ తర్వాత పూరి జగన్నాథ్ (Puri Jagannadh), 'స్కంద' పరాజయం తర్వాత రామ్ పోతినేని (Ram Pothineni) కలిసి చేసిన సినిమా కావడంతో ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలోనూ ఈ చిత్రంపై పెద్ద ఎత్తున బజ్ ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? రామ్- పూరి కాంబో మరోసారి హిట్ అయిందా? లేదా? ఈ సమీక్షలో చూద్దాం.
కథేంటి?
మాఫియా డింపుల్ బిగ్ బుల్(సంజయ్ దత్) మరణం లేకుండా ఉండాలని అనుకుంటాడు. (Double iSmart Review)ఈ క్రమంలో వైద్యులు అతనికి ఓ సలహా ఇస్తారు. మెమోరీ ట్రాన్సఫర్ గురించి వివరిస్తారు. మెమోరీ ట్రాన్సఫర్ చేస్తే అలాంటి అవకాశం ఉందని చెబుతారు. బిగ్ బుల్ మెమోరిని రకరకాల వ్యక్తులకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. కానీ విఫలమవుతుంది. ఈక్రమంలో ఇస్మార్ట్ శంకర్ గురించి బిగ్ బుల్‌కు తెలుస్తుంది. తన మెమోరీని ట్రాన్స్‌ఫర్ చేసేందుకు శంకర్‌ను ఎంచుకుంటారు. మరీ శంకర్ బ్రేయిన్‌లోకి బిగ్ బుల్ మెమోరీని ట్రాన్స్‌ఫర్ చేశారా? ఇస్మార్ట్ శంకర్ ఏం చేశాడు? మళ్లీ బిగ్ బుల్, ఇస్టార్ట్ శంకర్ ఎందుకు తలపడుతారు? కావ్యా థాపర్‌కు శంకర్‌కు మధ్య సంబంధం ఏమిటి? బోకా(అలీ) క్యారెక్టర్‌కు ఈ చిత్రంలో ఉన్న ప్రాధాన్యత ఏమిటి అన్నది మిగతా సినిమా.
సినిమా ఎలా ఉందంటే?
ఫస్టాఫ్ లవ్, కామెడీ ట్రాక్‌తో ఉంటుంది. తెలంగాణ స్లాంగ్ డైలగ్‌లతో మాస్ జాతర ఉంటుంది. పూరీ జగన్నాథ్ మార్క్ పంచ్ డైలాగ్‌లు తన స్టైల్ కామెడీ సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ నుంచి ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు రివీల్ అవుతుంటాయి. ముఖ్యంగా రామ్- సంజయ్ దత్‌ల మధ్య వచ్చే సీన్లు అదిరిపోతాయి. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. అలాగే డైలాగ్స్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. తెలంగాణ స్లాంగ్‌లో రామ్ చెప్పే సామెతలు సూపర్బ్‌గా పేలాయి. రామ్- కావ్యాథాపర్ మధ్య రొమాంటిక్ సీన్స్, అలాగే రామ్- సంజయ్ దత్‌ల మధ్య మైండ్ గేమ్, మదర్ సెంటిమెంట్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో అలరించాడు.అలీ కామెడీ సన్నివేశాలు బాగున్నాయి.
ఎవరెలా చేశారంటే?
ఇస్మార్ట్ శంకర్‌గా రామ్ పొత్తినేని యాక్టింగ్ ఇరగదీశాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా కంటే ఈ చిత్రంలో రామ్ యాక్టింగ్ ట్రిపుల్ టైమ్ మాస్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. తన ఎనర్జీకి మించి కష్టపడ్జాడని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇక విలన్ బిగ్ బుల్‌గా సంజయ్ బాబా యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. (Double iSmart Review) తన పాత్రకు 100శాతం న్యాయం చేశాడు. హీరోయిన్ జన్నత్‌గా కావ్యాథాపర్ తన పాత్రలో ఒదిగిపోయింది. ఇక సీబీఐ అధికారిగా షియాజీ షిండే, బన్నీ జయశంకర్, రామ్ తల్లిగా ఝాన్సీ, బొకాగా అలీ, రామ్ స్నేహితుడిగా గెటప్ శ్రీను తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
లైగర్ ప్లాఫ్ తర్వాత పూరి జగన్నాథ్ చాలా శ్రద్ధగా కథను రాసుకున్నట్లు ఈ సినిమాను చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాతో పూరి తిరిగి కమ్‌బ్యాక్ అయ్యారని చెప్పవచ్చు. తాను అనుకున్న స్టోరీని బాగా తీశాడు. స్క్రీన్‌ప్లే కూడా బాగుంది. యూత్‌ను అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్‌తో పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే సన్నివేశాలు చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి. తనదైన మార్క్ సింగిల్ లైన్ పంచ్ డైలాగ్‌లతో మరోసారి పాత తరం పూరిని పరిచయం చేశాడు. మదర్ సెంటిమెంట్ బాగున్నా(Double iSmart Review) ఇంకాస్తా ఎలివేట్ చేస్తే బాగుండేది అనిపించింది. ఓవరాల్‌గా యూత్‌ను అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్‌తో సినిమా తీయడంలో పూరి సక్సెస్ అయ్యాడు అని చెప్పవచ్చు.
సాంకేతికంగా
టెక్నికల్ పరంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా కనిపిస్తుంది. మణిశర్మ అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తుంది. జియాన్ కే గియాన్ హెల్లి, శ్యామ్ కే నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. మొత్తంగా ఈ సినిమా మాస్ పీస్ట్ అని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్
రామ్ పొత్తినేని నటన
పూరి డైరెక్షన్
సంజయ్ దత్- రామ్ మధ్య సీన్లు
మైనస్ పాయింట్స్
లెంగ్తీగా ఉన్న అలీ కామెడీ ట్రాక్
కొన్ని పాటలు
తీర్పు: ఓవరాల్‌గా డబుల్ ఇస్మార్ట్ శంకర్ మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్
రేటింగ్: 3/5
ఆగస్టు 16 , 2024
VD 12: శ్రీలంకలో చిల్ అవుతున్న విజయ్ దేవరకొండ.. బోట్ నడుపుతున్న వీడియో వైరల్!
టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒకరు. ఎలాంటి ఫిల్మ్ నేపథ్యం లేకుండా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్ ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు. ‘పెళ్లిచూపులు’, ‘టాక్సీవాలా’, ‘గీత గోవిందం’ సక్సెస్‌తో తెలుగు ఇండస్ట్రీలో సుస్థిర స్థానం సంపాదించాడు. అటువంటి విజయ్‌కు గత కొంతకాలంగా ఇండస్ట్రీలో కలిసిరావడం లేదు. అతడు చేసిన గత మూడు చిత్రాలు ‘లైగర్’, ‘ఖుషీ’, ‘ఫ్యామిలీ స్టార్’ బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. దీంతో ప్రస్తుతం అతడు చేస్తున్న ‘VD12’ చిత్రంపై విజయ్‌తో పాటు అతడి ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూట్ శ్రీలంకలో జరుగుతుండగా అక్కడ విజయ్ చిల్ అవుతున్నాడు.
బోట్ నడుపుతూ విజయ్ చిల్!
విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కాంబోలో 'VD 12' తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శ్రీలంకలో శరవేగంగా సాగుతోంది. విజయ్ సరికొత్త లుక్‌లో ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. అదే సమయంలో షూటింగ్ గ్యాప్‌లో తెగ చిల్ అవుతున్నాడు. నీటిలో బోట్ రైడ్ చేస్తూ విజయ్ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. సూర్యస్తమయ సమయంలో బోట్ రైడ్ చేస్తున్న వీడియోను విజయ్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. విజయ్ ఫ్యాన్స్ ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. బోట్ డ్రైవింగ్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda)
రెండు భాగాలుగా..
'VD 12' చిత్రానికి సంబంధించి ఇటీవల నిర్మాత నాగవంశీ మాట్లాడారు. దీన్ని రెండు పార్టులుగా అందించనున్నట్లు తెలిపారు. ‘విజయ్ దేవరకొండ సినిమా విషయంలో నేను రిస్క్ తీసుకోవడం లేదు. రెండు పార్టులకు సరిపోయే కంటెంట్ సిద్ధంగా ఉంది. మొదటి భాగం ఫలితం ఆధారంగా రెండో పార్ట్ తెరకెక్కిస్తాం. గౌతమ్ తిన్ననూరి కథను అద్భుతంగా తీర్చిదిద్దారు. సూపర్ హిట్ అవుతుందని మాకు పూర్తి నమ్మకం ఉంది’ అని తెలిపారు. అయితే విజయ్ కెరీర్‌లో ఇప్పటివరకూ ఏ సినిమా రెండు భాగాలుగా రాలేదు. విజయ్ చేసిన చిత్రాలన్నీ సింగిల్ పార్ట్‌గా వచ్చినవే. నాగవంశీ చెప్పినట్లు అన్ని అనుకున్నట్లు జరిగితే విజయ్ కెరీర్‌లోనూ సీక్వెల్స్ చూసే అవకాశం లభించనుంది.
పవన్‌తో పోటీ!
సోమవారం (సెప్టెంబర్ 23) హరి హర వీర మల్లు రిలీజ్ తేదీని ప్రకటించడంతో బాక్సాఫీస్ వద్ద పవన్, విజయ్ దేవరకొండ తలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజయ్ నటిస్తున్న 'VD 12' చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. తాజాగా అదే రోజున హరిహర వీరమల్లు వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పదని అంటున్నారు. పవన్ లాంటి బిగ్‌స్టార్‌ను ఢీకొట్టేందుకు తమ హీరో సిద్ధమంటూ విజయ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే పవన్‌కు అత్యంత సన్నిహితులైన సితారా నిర్మాతలు 'VD 12'ను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు పోటీగా వారు తమ చిత్రాన్ని బరిలోకి దింపే అవకాశం లేకపోవచ్చని సమాచారం. మరో కొత్త డేట్‌ను చూసుకొని VD12ను రిలీజ్ చేసే అవకాశం లేకపోదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
విజయ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్!
ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో ‘VD12’తో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘ఫ్యామిలీ స్టార్’ తర్వాత విజయ్‌తో దిల్‌రాజు మరో చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నారు. అలాగే డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ మరో ప్రాజెక్ట్ చేయనున్నాడు. పీరియాడికల్ జానర్‌లో రాయల సీమ బ్రాక్ డ్రాప్‌లో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న నటించే అవకాశముంది.
సెప్టెంబర్ 24 , 2024
Tollywood Directors: హీరోయిన్‌ను ఎలా చూపించాలో వీళ్లకి మాత్రమే తెలుసా?
సినిమాకు హీరో, హీరోయిన్ రెండు కళ్లు లాంటి వారు. గతంతో పోలిస్తే ఇప్పుడు హీరోయిన్లకు నటన పరంగా పెద్ద స్కోప్ దొరకడం లేదు. సినిమా మెుత్తం హీరో చుట్టూనే సాగేలా కొందరు దర్శకులు సినిమాలు తీస్తున్నారు. పాటల కోసం, అందచందాలను ఆరబోయటం కోసం మాత్రమే హీరోయిన్లు అన్నట్లు చూపిస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘లైగర్’, ‘మిస్టర్ బచ్చన్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలను గమనిస్తే హీరోయిన్ నటన కంటే వారి ఎక్స్‌పోజింగ్‌పైనే దర్శకులు ఎక్కువగా దృష్టిపెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే టాలీవుడ్‌లోని కొందరు యువ డైరెక్టర్లు మాత్రం హీరోయిన్లను ఒకప్పటిలా డిగ్నిటీగా చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ విషయంలో శేఖర్ కమ్ములాను ఫాలో అవుతూ సినీ లవర్స్ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారు చేసిన చిత్రాలేంటి? అందులో హీరోయిన్స్‌ను ఎలా చూపించారు? వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శేఖర్ కమ్ముల (Sekhar Kammula)
టాలీవుడ్‌లో సెన్సిబుల్ దర్శకుడు అనగానే ముందుగా శేఖర్ కమ్ముల గుర్తుకు వస్తారు. అందమైన ప్రేమ కథలను, ఆకట్టుకునే కుటుంబ కథలను తెరకెక్కించడంలో ఆయన దిట్ట. ఆయా సినిమాల కోసం ఎంచుకునే హీరోయిన్స్, వారిని ఆయన చూపించే విధానం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆనంద్, గోదావరి చిత్రాల్లో నటి కమలిని ముఖర్జీని ఎంత బాగా చూపించారో అందరికీ తెలిసిందే. పక్కింటి అమ్మాయి అనిపించేతలా ఆ పాత్రను తీర్చిదిద్దారు. అలాగే ‘లీడర్’లో రీచా గంగోపాధ్యాయ, ‘లైఫ్ ఈజ్‌బ్యూటీఫుల్’లో షగున్ కౌర్ పాత్రలు ఇప్పటికీ గుర్తుంటాయి. ఇక ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ చిత్రాల్లో సాయి పల్లవి పాత్రను మనసుకు హత్తుకునేలా ఎలా తీర్చిదిద్దారో అందరికీ తెలిసిందే. పెద్దగా ఎక్స్‌పోజింగ్ చేయనప్పటికీ ప్రస్తుతం ఆమె స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుందంటే అందులో శేఖర్ కమ్ములకు ఎంతో కొంత క్రెడిట్ ఇవ్వాల్సిందే. హీరోయిన్లను డిగ్నిటీగా ఎలా చూపించాలో, వారి నుంచి నటన ఏవిధంగా రాబట్టాలో తెలిసిన దర్శకుడు కావడంతో శేఖర్ కమ్ములతో కనీసం ఒక సినిమా అయిన చేయాలని కథానాయికలు ఆశ పడుతుంటారు.
హను రాఘవపూడి (Hanu Raghavapudi)
శేఖర్ కమ్ముల తరహాలోనే దర్శకుడు హను రాఘవపూడి కథానాయికల విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తారు. ఆయన దర్శత్వంలో వచ్చిన ‘అందాల రాక్షసి’, ‘క్రిష్ణ గాడి వీర ప్రేమ గాధ’, ‘పడి పడి లేచె మనసు’, ‘సీతారామం చిత్రాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన దర్శకత్వంలో పని చేసిన లావణ్య త్రిపాఠి, మెహరిన్, సాయిపల్లవి, మృణాల్ ఠాకూర్ ఎంత మంచి పేరు సంపాదించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ‘సీతారామం’ వంటి అద్భుతమైన ప్రేమ కావ్యంలో మృణాల్‌ను చాలా బాగా చూపించారు. ఆ సినిమాతో ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది. ఆ సినిమాలోని సీత పాత్ర తనకు ఎప్పటికీ ప్రత్యేకమేనని మృణాల్ పలు సందర్భాల్లో చెప్పడం విశేషం. హను రాఘవపడి ప్రభాస్‌తో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఈ చిత్రం ద్వారా కొత్త అమ్మాయి ఇమాన్ ఇస్మాయిల్ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇప్పటికే ఆమె లుక్స్ విపరీతంగా ఆకర్షించగా డైరెక్టర్ హను ఇంకెంత బాగా చూపిస్తారోనని సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.
వివేక్ ఆత్రేయ (Vivek Athreya)
యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సైతం హీరోయిన్ల విషయంలో శేఖర్ కమ్ములానే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. రీసెంట్‌గా నానితో చేసిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) చిత్రంలో తమిళ నటి ప్రియాంక అరుళ్ మోహన్‌ను ఎంత బాగా చూపించారో అందరికీ తెలిసిందే. ఎక్కడా గ్లామర్‌షోకు చోటు ఇవ్వకుండా ఆమె ద్వారా అద్భుత నటనను రాబట్టి ప్రశంసలు అందుకున్నారు. అందుకు ముందు డైరెక్ట్ చేసిన ‘మెంటల్ మదిలో’ (Mental Madhilo), ‘బ్రోచెవారెవరురా’ (Brochevarevarura), ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki) చిత్రాల్లోనూ హీరోయిన్ల స్కిన్ షో కంటే డిగ్నిటీ లుక్‌కే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. ఆయా చిత్రాల్లో నటించిన నివేదా పేతురాజ్, నివేదా థామస్, నజ్రియా నజిమ్‌కు మంచి గుర్తింపు వచ్చింది.
శౌర్యువ్ (Shouryuv)
దర్శకుడు శౌర్యువ్ ‘హాయ్ నాన్న’ (Hi Nanna) చిత్రం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. మనసుకు హత్తుకునేలా ఈ చిత్రాన్ని మలిచి ప్రశంసలు అందుకున్నారు. ఇందులో నాని హీరోగా నటించగా మృణాల్ ఠాకూర్ అతడికి జోడీగా చేసింది. బాలీవుడ్‌లో అప్పటికే హాట్ బాంబ్‌గా గుర్తింపు తెచ్చుకున్న మృణాల్‌ను ఇందులో మళ్లీ అచ్చ తెలుగు అమ్మాయిగా చూపించారు. సాంగ్స్‌లో స్కిన్ షోకు అవకాశం ఉన్నప్పటికీ శౌర్యువ్ ఆ పని చేయలేదు. ఆమె పోషిస్తున్న డిగ్నిటీ పాత్రపై ప్రభావం చూపకుండా ఆద్యంతం మృణాల్‌ను అందంగా చూపించారు. హీరోయిన్ పాత్ర ఎలా ఉండాలి? ఎలా చూపించాలి? అని శౌర్యువ్‌కు ఉన్న స్పష్టతను చూసి సినీ విమర్శకులు సైతం ఆశ్చర్యపోయారు. తన తర్వాతి సినిమాల్లోనూ ఇదే రీతిన కొనసాగాలని ఆశిస్తున్నారు.
తరుణ్ భాస్కర్ (Tharun Bhascker)
యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ యూత్‌ఫుల్ చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయారు. యువత మెచ్చే కంటెంట్‌తో వరుసగా సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే కుర్రకారును ఆకట్టుకువాలన్న తాపత్రయంలో అతడు ఎక్కడా గ్లామర్ షోకు ఆస్కారం ఇవ్వడం లేదు. తొలి చిత్రం ‘పెళ్లి చూపులు’ నుంచి గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో విజయ్ దేవరకొండకు జోడీగా రీతు వర్మ నటించింది. అసభ్యతకు, అనవసర స్కిన్‌షోకు చోటు లేకుండా ఆమెతో మంచి నటన రాబట్టాడు తరుణ్ భాస్కర్. ఈ సినిమాతో రీతు వర్మ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత నటుడిగా మారి పలు సినిమాల్లో నటించిన తరుణ్ బాస్కర్ ‘కీడా కోలా’తో మళ్లీ డైరెక్టర్‌గా మారారు.
సెప్టెంబర్ 14 , 2024
Double Ismart: రామ్‌తో కోల్డ్ వార్? అందుకే ట్రైలర్ లాంచ్‌కు పూరీ రాలేదా!
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా, పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart). ఆగస్టు 15న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటికీ నుంచి మూవీ టీమ్‌కు ఏదోక సమస్య వస్తూనే ఉంది. రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ పంద్రాగస్టు బరిలో నిలవడం, ‘లైగర్’ డిస్ట్రిబ్యూటర్లు తమ నష్టాలను సెటిల్ చేయాలని డిమాండ్ చేయడం చిత్ర బృందానికి తలనొప్పిగా మారింది.ఈ క్రమంలోనే తాజాగా హీరో రామ్, డైరెక్టర్ పూరికి మధ్య మనస్పర్థలు (Ram Pothineni vs Puri Jagannadh) తలెత్తినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ కోల్డ్ వార్‌కు కారణమేంటో ఇప్పుడు చూద్దాం.
రామ్ అసంతృప్తి!
హీరో రామ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ (Ismart Shankar) బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart)ను రూపొందించారు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ రెడీ కాగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై హీరో రామ్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 'లైగర్' వివాదం కారణంగా తన చిత్రానికి చిక్కులు రావడంపై రామ్ గుర్రుగా ఉన్నారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పటికీ నైజాం పంపిణీ వ్యవహారం కొలిక్కిరాకపోవడం, నిర్మాత ఛార్మీ ప్రమోషన్స్ షురూ చేయకపోవడంపై రామ్ ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడిపోతున్నారట. ఆదివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా డైరెక్టర్ పూరి రాకపోవడం వెనుక రామ్‌తో తలెత్తిన వివాదాలే కారణమని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రైలర్ ఈవెంట్‌లో ఏకాకిగా రామ్ తన సినిమాను ప్రమోట్ చేసుకోవడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
పూరి వివరణ!
'డబుల్ ఇస్మార్ట్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు రాకపోవడంపై డైరెక్టర్ పూరి ఓ వీడియో బైట్‌ను రిలీజ్ చేశారు. సెన్సార్ కోసం ముంబయిలో ఫైనల్ మిక్సింగ్ ఉండి ఈవెంట్‌కి రాలేకపోయినట్లు తెలిపారు. ఈవెంట్‌కు రాలేకపోయినందుకు చాలా బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇవేమి నమ్మశక్యంగా లేవని పేర్కొంటున్నారు. ఒక దర్శకుడు లేకుండా ట్రైలర్ లాంచ్ జరగడమేంటని ప్రశ్నిస్తున్నారు. రామ్‌తో గ్యాప్ వల్లే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు పూరి రాలేదని ఆరోపిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ సూపర్ హిట్ సాధిస్తే ఆటోమేటిక్‌గా వీరి మధ్య గ్యాప్ తొలగిపోతుందని కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రామ్, పూరి మధ్య విభేదాలకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ చిత్ర యూనిట్ దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
https://twitter.com/i/status/1820365775439552575
ట్రైలర్ ఎలా ఉందంటే?
ఆదివారం రిలీజైన 'డబుల్ ఇస్మార్ట్' ట్రైలర్ ఊహించిన విధంగానే మాస్ యాక్షన్‍తో, నాటు డైలాగ్‍లతో నిండిపోయింది. అటు తన మార్క్ ఎనర్జిటిక్ యాక్షన్, మాస్ డైలాగ్‍లు, డ్యాన్స్‌తో రామ్ ట్రైలర్‌లో దుమ్మురేపారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ (Sanjay Dutt) ఇందులో విలన్‍గా బిగ్‍బుల్ పాత్రను చేశారు. బిగ్‍బుల్ బ్రెయిన్‍లోని మెమొరీని శంకర్ (రామ్ పోతినేని) మెదడులో పంపించడం ఈ ట్రైలర్‌లో ముఖ్యమైన అంశంగా కనిపిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చిప్‍ను తలలో పెడితే ఈ డబుల్ ఇస్మార్ట్ మూవీలో ఏకంగా బ్రెయిన్ మెమొరీ ట్రాన్స్‌ఫర్ కాన్సెప్ట్ తీసుకున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
https://www.youtube.com/watch?v=ym0upoayqJg
మిస్టర్ బచ్చన్ దూకుడు!
డబుల్ ఇస్మార్ట్ టీమ్‌తో పోలిస్తే ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) టీమ్ ప్రమోషన్స్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. వరుసగా ప్రెస్ మీట్‌లు నిర్వహిస్తూ తమ సినిమాను ఆడియన్స్‌లోకి తీసుకెళ్తోంది. సాధారణంగా ప్రమోషన్స్ అనేవి సినిమా ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపుతాయి. అటువంటి కీలకమైన ప్రమోషన్స్‌ను ‘డబుల్ ఇస్మార్ట్’ సరిగా మెుదలు పెట్టకపోవడంపై సినీ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15 రేసులోకి రావడంతో పూరి ఢీలా పడిపోయారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ సక్సెస్ ఏంతో కీలకమైన నేపథ్యంలో రిజల్ట్‌పై పూరి ఆందోళనతో ఉన్నారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కోరినా.. వెనక్కి తగ్గలేదా?
పంద్రాగస్టు రోజున ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ కాకుండా ఉండేందుకు ‘డబుల్ ఇస్మార్ట్’ టీమ్ అన్ని ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. సినిమాను వాయిదా వేసుకోవాలని బచ్చన్ టీమ్‌ను వారు అడిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనికి బచ్చన్ టీమ్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే డబుల్ ఇస్మార్ట్ నిర్మాత ఛార్మీ ఇటీవల రవితేజతో పాటు దర్శకుడు హరీశ్ శంకర్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసినట్లు కథనాలు వచ్చాయి.
ఆగస్టు 05 , 2024
VD12: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎగిరిగంతేసే న్యూస్.. కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్!
టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒకరు. ఎలాంటి ఫిల్మ్ నేపథ్యం లేకుండా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్ ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు. ‘పెళ్లిచూపులు’, ‘టాక్సీవాలా’, ‘గీత గోవిందం’ సక్సెస్‌తో తెలుగు ఇండస్ట్రీలో సుస్థిర స్థానం సంపాదించాడు. అటువంటి విజయ్‌కు గత కొంతకాలంగా ఇండస్ట్రీలో కలిసిరావడం లేదు. అతడు చేసిన గత మూడు చిత్రాలు ‘లైగర్’, ‘ఖుషీ’, ‘ఫ్యామిలీ స్టార్’ బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. దీంతో ప్రస్తుతం అతడు చేస్తున్న ‘VD12’ చిత్రంపై విజయ్‌తో పాటు అతడి ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం గురించి నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
రెండు భాగాలుగా..
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతోంది. 'VD 12' అనే వర్కింగ్ టైటిల్‌తో మూవీని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి నిర్మాత నాగవంశీ మాట్లాడారు. దీన్ని రెండు పార్టులుగా అందించనున్నట్లు తెలిపారు. ‘విజయ్ దేవరకొండ సినిమా విషయంలో నేను రిస్క్ తీసుకోవడం లేదు. రెండు పార్టులకు సరిపోయే కంటెంట్ సిద్ధంగా ఉంది. మొదటి భాగం ఫలితం ఆధారంగా రెండో పార్ట్ తెరకెక్కిస్తాం. గౌతమ్ తిన్ననూరి కథను అద్భుతంగా తీర్చిదిద్దారు. సూపర్ హిట్ అవుతుందని మాకు పూర్తి నమ్మకం ఉంది’ అని తెలిపారు. అయితే విజయ్ కెరీర్‌లో ఇప్పటివరకూ ఏ సినిమా రెండు భాగాలుగా రాలేదు. విజయ్ చేసిన చిత్రాలన్నీ సింగిల్ పార్ట్‌గా వచ్చినవే. నాగవంశీ చెప్పినట్లు అన్ని అనుకున్నట్లు జరిగితే విజయ్ కెరీర్‌లోనూ సీక్వెల్స్ చూసే అవకాశం లభించనుంది. ఇప్పటికే ‘VD 12’పై భారీ అంచనాలు ఉండగా నాగ వంశీ కామెంట్స్‌తో ఫ్యాన్స్ ఎగిరిగంతేస్తున్నారు.
ఆకట్టుకున్న ఫస్ట్ లుక్!
'VD12' చిత్రానికి సంబంధించి ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ మాస్ లుక్‌లో కనిపించాడు. 'విధి పిలిచింది.. రక్తపాతం ఎదురుచూస్తోంది.. కొత్త రాజు ఉద్భవిస్తాడు' అని ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ఆసక్తికరమై క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాదు వచ్చే ఏడాది మార్చి 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు తమ టీమ్ ఎంతో కష్టపడుతోందని లీకైన కంటెంట్‌ను ఎవరూ షేర్ చేయవద్దని ఈ సందర్భంగా చిత్ర బృందం విజ్ఞప్తి చేసింది.
డ్యుయల్ రోల్‌లో..!
‘VD 12’ చిత్రంలో విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి అస్పష్టంగా ఉన్న ఖాకీ డ్రెస్ పోస్టర్‌ను సైతం గతంలో అధికారికంగా రిలీజ్ చేసింది. అయితే తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే విజయ్ దేవరకొండ ఊర మాస్ లుక్‌లో కనిపించాడు. ఒక లోకల్ గ్యాంగ్‌స్టర్‌ను తలపించాడు. దీన్ని బట్టి చూస్తే విజయ్ ఈ చిత్రంలో ద్విపాత్రిభినయం చేస్తున్నాడా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. లేదా ఒకే పాత్రను రెండు డైమన్షన్స్‌లో దర్శకుడు చూపించబోతున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. ఏది ఏమైనా విజయ్ లుక్ చూస్తే థియేటర్‌లో మాస్ జాతర కన్ఫార్మ్ అని స్పష్టమవుతోంది.
విజయ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్!
ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో ‘VD12’ కాకుండా మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘ఫ్యామిలీ స్టార్’ తర్వాత విజయ్‌తో దిల్‌రాజు మరో చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నారు. అలాగే డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ మరో ప్రాజెక్ట్ చేయనున్నాడు. పీరియాడికల్ జానర్‌లో రాయల సీమ బ్రాక్ డ్రాప్‌లో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న నటించే అవకాశముంది.
ఆగస్టు 05 , 2024
VD12 Leaked Pic: ‘VD12’ సెట్ నుంచి విజయ్ దేవరకొండ ఫొటో లీక్.. నెట్టింట రచ్చ రచ్చ!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు యూత్‌లో ఏ స్థాయి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్ ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘పెళ్లిచూపులు’, ‘టాక్సీవాలా’, ‘గీత గోవిందం’ సక్సెస్‌తో స్టార్ హీరోల స్థాయికి ఎదిగాడు. అయితే గత కాలంగా ఇండస్ట్రీలో విజయ్‌కు కలిసిరావడం లేదు. అతడు చేసిన గత మూడు చిత్రాలు ‘లైగర్’, ‘ఖుషీ’, ‘ఫ్యామిలీ స్టార్’ బాక్సాఫీస్ వద్దగా దారుణంగా విఫలమయ్యాయి. దీంతో ప్రస్తుతం అతడు చేస్తున్న ‘VD12’ చిత్రంపై విజయ్‌తో పాటు అతడి ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ సెట్ నుంచి ఓ ఫొటో లీకైంది. ఇందులో విజయ్ దేవరకొండ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
విజయ్ పిక్ వైరల్!
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'VD12' చిత్రం రూపొందుతోంది. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో షూటింగ్ సెట్ నుంచి విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇందులో బైక్‌పై వెనక కూర్చుని మాస్ లుక్‌లో కనిపించాడు. తలపై లైట్ హెయిర్, ముఖాన గడ్డంతో మెస్మరైజ్ చేసేలా అతడి లుక్ ఉంది. ఇది చూసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌తో సంతోషంతో ఊగిపోతున్నారు. మరో బ్లాక్‌బాస్టర్ లోడింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోను విపరీతంగా షేర్ చేస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు.
https://twitter.com/king_ntr9999/status/1815611065381896259
థియేటర్లు బద్దలే!
‘VD 12’ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ మాస్‌లుక్‌కు అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు తోడైతే ధియేటర్లు బద్దలు కావాల్సిందేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ‘VD 12’లో విజయ్ లుక్ చూస్తుంటే ‘యువ’ సినిమాలో మాధవన్ గుర్తుకు వస్తున్నాడంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో విజయ్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నట్లు సమాచారం. తొలుత ఈ చిత్రానికి శ్రీలీలను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అనివార్య కారణాలతో ఆమె ప్లేస్‌లో భాగ్యశ్రీని తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె షూటింగ్‌లోనూ పాల్గొంటున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
https://twitter.com/Rebelstarpr/status/1815667163178656207
డ్యుయల్ రోల్‌లో రౌడీ బాయ్!
‘VD 12’ చిత్రంలో విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి అస్పష్టంగా ఉన్న ఖాకీ డ్రెస్ పోస్టర్‌ను సైతం అధికారికంగా రిలీజ్ చేసింది. అయితే తాజాగా లీకైన ఫొటోను చూస్తే విజయ్ దేవరకొండ ఊర మాస్ లుక్‌లో కనిపించాడు. ఒక లోకల్ గ్యాంగ్‌స్టర్‌ను తలపించాడు. దీన్ని బట్టి చూస్తే విజయ్ ఈ చిత్రంలో ద్విపాత్రిభినయం చేస్తున్నాడా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. లేదా ఒకే పాత్రను రెండు డైమన్షన్స్‌లో దర్శకుడు చూపించబోతున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. ఏది ఏమైనా లీకైనా విజయ్ లుక్ చూస్తే థియేటర్‌లో మాస్ జాతర కన్ఫార్మ్ అని స్పష్టమవుతోంది.
క్యూట్ లవ్‌స్టోరీ!
విజయ్ దేవరకొండ ‘VD 12’తో పాటు మరో ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దర్శకుడు రవికిరణ్ కోలా దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ మూవీకి దిల్‌రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించనున్నారు. అందమైన ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇందులో హీరోయిన్‌గా సాయిపల్లవి (Sai Pallavi) తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాయిపల్లవిని సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇటీవల టాలీవుడ్‌లో ప్రచారం జరిగింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.
జూలై 23 , 2024
Double iSmart: డబుల్ ఇస్మార్ట్ రూ.100 కోట్లు కొల్లగొడుతాడా? గతం ఏం చెబుతుంది?
ఎనర్జిటిక్ హీరో రామ్ పొత్తినేని, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్(Double iSmart). ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతోంది. ఈ చిత్రం పూరి జగన్నాథ్, రామ్ కెరీర్‌కు కీలకం కానుంది. ఎందుకంటే పూరి తీసిన ‘లైగర్’(Liger) ఘోర పరాజయం చవిచూడటం.. రామ్ నటించి రెడ్, స్కంద చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోవడంతో..వీరి కలయిక మళ్లీ అనివార్యమైంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. మనిషి మెడదులో వేరే వ్యక్తి ఆలోచనలకు సంబంధించిన చిప్ పెడితే ఎలా ప్రవర్తిస్తాడు అనే వినూత్న కాన్సెప్ట్‌తో వచ్చి మంచి విజయం సాధించింది. రీసెంట్‌గా ఈ చిత్రానికి సంబంధించి సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. మే 15న డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కానుంది. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఒక రకమైన బజ్ ఏర్పడింది.
రూ.100 కోట్లు కొల్లగొట్టే ఛాన్స్
అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఇస్మార్ట్ శంకర్.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇండియాలో రూ.66 కోట్లు కొల్లగొట్టింది. దీంతో ఈ సినిమాకు వస్తున్న సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంపై సహజంగానే అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుతుందా? కనీసం దరిదాపుల్లోకైనా వస్తుందా అనే అంశాలపై చర్చ జరుగుతుంది.
టాలీవుడ్‌లో టైర్ 2 హీరోగా రామ్ పొత్తినేని ఉన్నప్పటికీ టైర్ 1 హీరో స్థాయిలో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన మాస్ యాక్టింగ్, డాన్సింగ్‌తో ప్రేక్షకులను అలరించడంలో ఏమాత్రం తగ్గడు. ఇప్పటికే ఈ విషయం అతని సినిమాల ద్వారా నిరూపితమైంది. రామ్ పొత్తినేని- పూరి జగన్నాథ్ కాంబోలో సినిమా వస్తుండటం, ఇస్మార్ట్ శంకర్ చిత్రం హిట్ అవడం వంటి అంశాలు సానుకూలంగా ఉన్నాయి. ఇది డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి అనుకూలంశాలు. ఇవన్నీ ప్రేక్షకులను మొదటి రెండు రోజులు సినిమా థియేటర్లకు రప్పించేలా చేశాయి.
ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో బరిలో దిగిన ఇస్మార్ట్ శంకర్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఓవరాల్‌గా రూ.80 కోట్లు కలెక్ట్ చేసి రామ్ పొత్తినేని సత్తా చాటాడు. దీంతో ఈ సినిమాకు కొనసాగింపుగా పూరి.. డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక రోల్‌లో నటిస్తున్నారు. తాజాగా విడుదలే చేసిన టీజర్ ప్రోమో ఆకట్టుకుంది. రామ్ గెటప్, స్వాగ్ కూడా చాలా బాగున్నాయి. ప్రోమోపై ప్రేక్షకులు పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. మే 15న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. మరి ఈ టిజర్ టాక్ ప్రి రిలీజ్ బిజినెస్‌పై ప్రభావం చూపనుంది. డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి రూ.100కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. పూరి- రామ్ హిటో కాంబో కావడంతో.. ఈ చిత్రం ఓటీటీ రైట్స్ భారీ ధరకు చేజిక్కించుకునేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పోటీపడుతున్నాయి. ఇప్పటికే చిత్రబృందానికి మంచి నంబర్ ఆఫర్ చేసినట్లు తెలిసింది.
కథ ఇదేనా?
ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ (Double iSmart Movie) సినిమా కథకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఈ సినిమాలో పవర్‌ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో రామ్ పూర్తిగా కొత్త గెటప్‌లో కనిపిస్తాడని సమాచారం. యాక్షన్ - థ్రిల్లర్ నేపథ్యంలో ఇది సాగుతుందని అంటున్నారు. పైగా తొలి భాగంతో పోలిస్తే సెకండ్ పార్ట్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కువగానే ఉండనుందట. ఇది సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
పట్టుదలతో పూరి
డబుల్ ఇస్మార్ట్ మూవీని డైరెక్టర్ పూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఆయన గత మూవీ ‘లైగర్’ (Liger Movie) బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలం కావడంతో పూరీపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. సినిమాకు ముందు ఆయన చేసిన కామెంట్స్ కూడా ఇందుకు కారణమయ్యాయి దీనిని అద్భుతంగా తెరకెక్కించి తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టాలన్న కసిలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా రేంజ్‌లో..
ఆ కారణంగానే ‘డబుల్ ఇస్మార్ట్’ను పాన్ ఇండియా స్థాయిలో పూరి జగన్నాథ్ రూపొందిస్తున్నారు. తొలి భాగాన్ని కేవలం సింగిల్ లాంగ్వేజ్ (తెలుగు)లో రిలీజ్ చేసిన పూరి.. సెకండ్ పార్ట్‌ను మాత్రం దేశంలోని పలు భాషల్లో విడుదల చేయబోతున్నారు. తద్వారా తన క్రేజ్‌ను జాతీయ స్థాయికి చేర్చాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు టాక్. ఇందులో భాగంగానే ‘డబుల్ ఇస్మార్ట్’ను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
హీరో రామ్‌కూ కీలకం!
ఇక హీరో రామ్ కూడా ‘డబుల్ ఇస్మార్ట్’ (Double iSmart Movie) చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘స్కంద’ (Skanda) చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా రాణించలేదు. పైగా ఈ సినిమాపై పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వచ్చాయి. బోయపాటి శ్రీను (Boyapati Srinu) డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలో యాక్షన్ మరి ఓవర్‌గా ఉందంటూ విమర్శలు వచ్చాయి. అటు ఈ చిత్రానికి ముందు రామ్ చేసిన ‘వారియర్’ (Warrior Movie In Telugu)) కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేక పోయింది. దీంతో ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రామ్‌కు ఎంతో కీలకంగా మారింది.
మే 14 , 2024
VD12 : హ్యాట్రిక్ ఫ్లాప్స్ నేపథ్యంలో విజయ్ దేవరకొండ డేరింగ్ డెసీషన్..? కెరీర్‌లోనే తొలిసారి!
టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో ‘విజయ్ దేవరకొండ’ (Vijay Devarakonda) ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా అతడ్ని ఫ్యాన్స్ అభిమానిస్తుంటారు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్ లేక విజయ్ ఇబ్బంది పడుతున్నాడు. విజయ్ గత మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. దీంతో రాబోయే చిత్రం విజయ్‌కు చాలా కీలకంగా మారింది. విజయ్ తన తర్వాతి చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి సెన్సేషనల్ అప్‌డేట్ బయటకొచ్చింది. అది విన్న విజయ్ ఫ్యాన్స్ తమ హీరో డేరింగ్ డెసిషన్‌కు ఆశ్చర్యపోతున్నారు.
డేరింగ్ డేసిషన్ ఏంటంటే?
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) కాంబోలో రానున్న 'VD12' చిత్రం.. యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. విజయ్ రీసెంట్ చిత్రాలు ‘లైగర్’, ‘ఖుషీ’, ‘ఫ్యామిలీ స్టార్’ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటంతో.. ప్రస్తుతం అతడి ఫోకస్ మెుత్తం ఈ సినిమా పైనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవాలని విజయ్ దృఢసంకల్పంతో ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘VD12’ సక్సెస్ కోసం ఎంతైన కష్టపడాలని అతడు నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం విజయ్.. ఈ సినిమా కోసం ఓ డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఈ సినిమాలో ఒక్క పాట లేకుండా నటించేందుకు అతడు సిద్ధపడ్డాడట.
సాంగ్స్ ఎందుకు వద్దంటే?
విజయ్ దేవరకొండ సినిమాలకు హిట్ ఆల్బమ్స్‌గా పేరుంది. అతడి ప్రతీ సినిమాలో కనీసం రెండు, మూడు సాంగ్స్ అయినా సూపర్ హిట్‌గా నిలుస్తుంటాయి. అటువంటిది ‘VD12’లో సాంగ్స్ వద్దని చిత్ర యూనిట్ భావిస్తుండటం అందరికీ షాకింగ్‌గా అనిపిస్తోంది. అయితే ఇందుకు ఓ బలమైన కారణం ఉన్నట్లు టాలీవుడ్‌లో వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో విజయ్ తొలిసారి పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ ప్రాజెక్టులో పాటలు పెడితే కథనం, మూవీ ఫ్లేవర్ దెబ్బతింటాయని డైరెక్టర్ గౌతమ్ భావిస్తున్నారట. దీంతో పాటలు లేకుండానే ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దామని విజయ్‌తో ఆయన అన్నాడట. ఇందుకు విజయ్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. కార్తీ నటించిన 'ఖైదీ' చిత్రం కూడా గతంలో ఒక్క పాట లేకుండానే వచ్చి.. సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ చిత్రాన్నే 'VD12' అనుసరించనుండటం గమనార్హం.
అనిరుధ్ పైనే భారం!
‘VD12’ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. అనిరుధ్ పాటలు, నేపథ్య సంగీతానికి ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. ‘VD12’ను చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడానికి అనిరుధ్ మ్యూజిక్ ఒక్కటి చాలని డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి భావిస్తున్నారట. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకే హైలైట్ అవుతుందని మూవీ టీమ్ నమ్ముతోంది. మరి ఈ ప్రయోగం విజయ్‌కి కలిసొస్తుందో లేదో చూడాలి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది.
హీరోయిన్‌గా కేరళ బ్యూటీ!
ప్రేమలు చిత్రంతో యువతరం హృదయాలను దోచుకున్న మలయాళీ బ్యూటీ 'మమితా బైజు' (Mamita Baiju).. 'VD12'లో హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ పాత్రకు శ్రీలీల (Sreeleela)ను ఎంపిక చేశారు. కొన్ని కారణాల రిత్యా ఆమె స్థానంలో మమితాను తీసుకోవాలని మేకర్స్ నిర్ణయించారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది. కాగా, ‘VD12’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుంది. విజయ్‌కు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళ్, కన్నడ భాషల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే మలయాళం సహా నార్త్ ప్రేక్షకులకు 'VD12' చిత్రాన్ని చేరువ చేసేందుకు మమితా బైజు క్రేజ్ ఉపయోగపడుతుందని మేకర్స్ భావిస్తున్నారు. అటు ఓవర్సీస్‌లోనూ ఈ అమ్మడికి ఫాలోయింగ్ ఉండటంతో సినిమాకు అదనపు ప్రయోజనం చేకూరనుంది.
ఏప్రిల్ 26 , 2024
Kushi Movie Review: విజయ్ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ సూపర్బ్.. మరి ‘ఖుషి’ హిట్ అయినట్లేనా?
నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, లక్ష్మీ, మురళీ శర్మ, జయరామ్, రోహిణి, సచిన్ ఖేడేకర్, శరణ్య, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు
దర్శకత్వం: శివ నిర్వాణ
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
సినిమాటోగ్రఫీ: మురళి. G
నిర్మాత : చిరంజీవి పెదమల్లు, Y. రవిశంకర్, నవీన్ యెర్నేని
సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న చిత్రమిది. విజయ్‌కి జోడిగా సమంత అని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ సూపర్ హిట్ సాధించడంతో ‘ఖుషి’పై హైప్ మరింత పెరిగింది. భారీ అంచనాల మధ్య ఇవాళ (సెప్టెంబర్ 1) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? విజయ్, సమంత జోడీకి ఎన్ని మార్కులు పడ్డాయి? ఈ పూర్తి రివ్యూలో చూద్దాం.
కథ:
ఈ సినిమా కథ కశ్మీర్‌లో ప్రారంభమవుతుంది. బుర్ఖాలో ఉన్న బేగం (సమంత)ను చూసి విప్లవ్ (విజయ్ దేవరకొండ) తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆ పిల్ల తనదని ఫిక్స్ అవుతాడు. అయితే అనూహ్య పరిస్థితుల్లో బేగం బ్రాహ్మిణ్ అని విప్లవ్‌కు తెలుస్తుంది. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆరాధ్య (సమంత)ను క్రిస్టియన్ అబ్బాయి విప్లవ్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు ఆమె తండ్రి చంద్రరంగం (మురళీశర్మ) ఒప్పుకోడు. ఈ పెళ్లికి విప్లవ్ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించరు. దీంతో పెద్దలను ఎదిరించి మరీ విప్లవ్, ఆరాధ్య ఒక్కటవుతారు. అంతా ‘ఖుషి’గా సాగిపోతుందని అనుకున్న సమయంలో విప్లవ్, ఆరాధ్యల కాపురం కొత్త మలుపు తిరుగుతుంది. అసలు విప్లవ్, ఆరాధ్యలకు వచ్చిన సమస్యేంటి? దాని నుంచి వారు ఎలా బయటపడ్డారు? అన్నది మిగిలిన కథ. ఇది తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే?
విజయ్ దేవరకొండ ఎప్పటిలాగే తన అద్భుతమైన నటనతో మెప్పించాడు. విప్లవ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి అలరించాడు. అటు సమంత కూడా ఆరాధ్య పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఎంతగానో ఆకట్టుకుంది. తెరపై విప్లవ్, ఆరాధ్య పాత్రలు మాత్రమే కనిపించేంతలా విజయ్, సామ్ పోటీపడి నటించారు. వీరి మధ్య కెమెస్ట్రీ సైతం అద్భుతంగా కుదిరింది. అటు మురళీశర్మ, సచిన్ ఖేడేకర్, రోహిణి, లక్ష్మీ నటన సినిమాకు ప్లస్ అయ్యింది. వెన్నెల కిషోర్, అలీ, రాహుల్ రామకృష్ణ కామెడీ నవ్వులు పూయించింది.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీసే దర్శకుడు శివ నిర్వాణ. తన గత చిత్రాలైన ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఖుషి కోసం రొటిన్ కథనే ఆయన ఎంచుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దాన్ని తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. పెళ్లి తర్వాత ఇది చేద్దాం.. అది చేద్దాం అని ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న జంటలకు ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అయితే సినిమాలో అక్కడక్కడ కొన్ని సీన్లు బోరింగ్ అనిపిస్తాయి. మరికొన్ని సీన్లు ఎక్కడో చూసిన భావన కలిగిస్తాయి. ఎడిటర్ తన కత్తెరకు మరింత పని చెప్పి ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా శివ నిర్వాణ డైరెక్షన్ బాగుంది.
టెక్నికల్‌గా
ఖుషి సినిమాకు టెక్నికల్ అంశాలు చాలా బాగా ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా పాటలు ఈ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. సందర్భానుసారంగా వచ్చే సాంగ్స్ ఎంతో వినసొంపుగా అనిపిస్తాయి. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. అటు G. మురళి అందించిన సినిమాటోగ్రఫీ కూడా ఈ చిత్రానికి మంచి ఎసెట్ అయ్యింది. ముఖ్యంగా కశ్మీర్ అందాలను ఆయన తన కెమెరా పనితనంతో ఎంతో అద్భుతంగా చూపించాడు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. నాణ్యత విషయంలో ప్రొడ్యుసర్లు ఎక్కడా రాజీపడినట్లు అనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
విజయ్, సమంత నటనసంగీతంసినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
కథనంబోరింగ్ సీన్స్
రేటింగ్: 3/5
సెప్టెంబర్ 01 , 2023
VD13: వరుసగా సమంత, శ్రీలీల, మృణాల్‌తో విజయ్ దేవరకొండ రొమాన్స్.. పెట్టి పుట్టాడు పో!
‘పెళ్లిచూపులు’ అంటూ పక్కింటి అబ్బాయిలా ప్రేక్షకులను పలకరించాడు విజయ్ దేవరకొండ. వెంటనే అర్జున్ రెడ్డితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాడు. రౌడీబాయ్ యాటిట్యూడ్‌కి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడిందంటేనే విజయ్ స్టార్‌డమ్ ఏ రేంజ్‌లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ అభిమాన గణాన్ని కాపాడుకుంటేనే పక్కాగా సినిమాలు చేస్తున్నాడు దేవరకొండ. లైగర్ బెడిసి కొట్టినా వరుస సినిమాలకు సైన్ చేసి కెరీర్‌ని పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు.
సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయంలో డైరెక్టర్, ప్రొడ్యూసర్లతో పాటు హీరోది కీలక పాత్ర. ఫలానా వారినే పెట్టుకుందామని హీరోలు సిఫార్సు చేస్తే డైరెక్టర్, ప్రొడ్యూసర్లు ఒకే చెప్పేస్తారు. అయితే, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మాత్రం ప్రత్యేక రూటు ఫాలో అవుతున్నాడు. తెలుగులో టాప్ హీరోయిన్లతోనే రొమాన్స్ చేస్తానని అంటున్నాడు. అందుకు తగ్గట్టుగానే అప్ కమింగ్ సినిమాల్లో హీరోయిన్లను ఎంపిక చేసుకుంటున్నాడీ హ్యాండ్‌సమ్ హీరో.
సమంత
మహానటి సినిమాలో పార్ట్ టైం హీరోగా నటించాడు విజయ్ దేవరకొండ. ఇందులో విజయ్‌కి తోడుగా సమంత నటించింది. కానీ, ఈ సినిమాలో వీరిద్దరి మధ్య రోమాన్స్‌కు స్కోప్ లేకుండా పోయింది.
ఖుషీ సినిమాతో మరోసారి సామ్, విజయ్ ఒక్కటయ్యారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. కశ్మీర్ నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీగా డైరెక్టర్ శివ నిర్వాణ దీన్ని తీర్చిదిద్దాడు.
సినిమాలో నుంచి ‘నా రోజా నువ్వే’ సాంగ్ విడుదలై మంచి రెస్పాన్స్‌ని రాబడుతోంది. మరి, ఇందులో సమంతతో విజయ్ ఏ మేరకు రొమాన్స్ చేశాడో వేచి చూడాలి.
శ్రీలీల
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా శ్రీలీల బిజీబిజీగా ఉంది. జెర్సీ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సినిమాలో శ్రీలీలనే హీరోయిన్. ఈ ప్రాజెక్టు చిత్రీకరణ దశలో ఉంది.
ఇప్పటివరకు శ్రీలీల లిప్‌లాక్ సీన్లలో నటించలేదు. గౌతమ్ తిన్ననూరి తొలి సినిమాలో రొమాన్స్‌ని బాగా చూపించాడు. కథ వేరే అయినప్పటికీ ఈ సీన్స్ పెట్టి ఆడియెన్స్‌ని సాటిస్‌ఫై చేశాడు.
ముఖ్యంగా, విజయ్‌లోని రొమాంటిక్ యాంగిల్‌ని చాలా మంది ఇష్టపడతారు. దీంతో ఈ సినిమాలోనూ శ్రీలీల, విజయ్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.
మృణాల్ ఠాకూర్
సీతారామం సినిమాలో అందాల భామ మృణాల్ ఠాకూర్‌ని డైరెక్టర్ హను చాలా పద్ధతిగా చూపించాడు. కానీ, మృణాల్ ఠాకూర్ తరచూ హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంటుంది.
బికినీలు ధరించి సోషల్ మీడియాను హీటెక్కిస్తుంది. ఏ మాత్రం సంకోచించకుండా అందాల నిధిని బయటకు తెరుస్తుంది. ఇప్పుడు ఈ బ్యూటీ విజయ్ దేవరకొండతో జతకట్టింది.
గీతగోవిందం సినిమా ఫేమ్ డైరెక్టర్ పరషురామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గీతగోవిందం సినిమాకు సీక్వెల్‌గా ఇది రానుంది. మరి, అటు రౌడీబాయ్, ఇటు గ్లామర్ బ్యూటీ ఏ మేరకు రెచ్చిపోతారో? అని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు.
వీరిద్దరి మధ్య రోమాన్స్ పండితే ఇక సినిమా బ్లాక్ బాస్టర్ అని కామెంట్ చేస్తున్నారు.
లవ్ స్టోరీగానే ఈ సీక్వెల్‌ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రొమాంటిక్ సన్నివేశాలకు కొదవ ఉండకపోవచ్చని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అలనాటి అర్జున్ రెడ్డి సినిమాను గుర్తు తెచ్చుకుంటున్నారు.
జూన్ 14 , 2023
Ananya Pandey : అనన్య సోకుల వలలో విలవిల్లాడుతున్న నెటిజన్లు..!
బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ అనన్య పాండే.. తన ఒంపు సొంపుల ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎద అందాలను ప్రదర్శిస్తూ ఈ భామ పెట్టిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
చీకట్లో దగ దగా మెరుస్తున్న అనన్య అందాలను చూసి నెటిజన్లు మైమరిచిపోతున్నారు. అందంలో నీకు సాటి ఎవరూ రారంటూ కామెంట్లు పెడుతున్నారు.
లైగర్ సినిమాతో అనన్య టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తన ఒంపుసొంపులతో తెలుగు ఆడియన్స్ ఉర్రూతలూగించింది.
లైగర్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అనన్య అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆమె పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోయింది.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2 చిత్రం ద్వారా అనన్య తొలిసారి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తన తొలి సినిమాకే ఉత్తమ ఆరంగేట్ర నటిగా అవార్డు అందుకుంది.
‘పతి పత్నీ ఔర్ వో’ చిత్రంలో అనన్య చేసిన గ్లామర్ ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది.
సినిమా అవకాశాలు పెద్దగా రాకపోవడంతో సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు తన బోల్డ్ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
అనన్య నుంచి ఏ చిన్న ఫొటో వచ్చిన అది సోషల్ మీడియాలో సెన్సేషననే చెప్పాలి. ఈ భామ పెట్టే హాట్ ఫొటోలను చూసిన నెటిజన్లు కవ్వించే కామెంట్లతో చెలరేగుతుంటారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన చుంకీ పాండే కూతురే అనన్య. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తన టాలెంట్‌ను నమ్ముకొని అనన్య ఎదుగుతోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికమంది ఫాలోవర్లు ఉన్న బాలీవుడ్ నటిగా అనన్య పాండే ఉంది. ప్రస్తుతం ఆమె ఖాతాను 2.44 కోట్ల మంది ఫాలో అవుతున్నారు.
ఏప్రిల్ 10 , 2023
2022లో మార్మోగిన పాటలు
]రామ్ పోతినేని నటించిన చిత్రంలో ఈ ఎనర్జిటిక్ పాటను తమిళ్ సూపర్ స్టార్ శింబు పాడాడు. శింబు వాయిస్‌తో పాటు రామ్ డాన్స్‌తో చాలా పాపులర్ అయ్యింది.12. బుల్లెట్ ( ది వారియర్ )Listen nowమరికొన్ని హిట్స్కల్యాణం ( సీతారామం )నీతో ఉంటే చాలు ( బింబిసార )మరికొన్ని హిట్స్నామది ( తిరు )మేఘం కరిగేనా ( తిరు )మరికొన్ని హిట్స్కోకా ( లైగర్ )విజిల్( ది వారియర్)మరికొన్ని హిట్స్రా రా రక్కమ్మ ( విక్రాంత్ రోణ )నాకోసం మారావా నువ్వు ( బంగార్రాజు )
ఫిబ్రవరి 13 , 2023
Ananya Pandey HBD : గూగుల్‌లో తన గురించి ఎక్కువగా వెతుకుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పిన అనన్య పాండే
బాలీవుడ్ అందాల తారా అనన్య పాండే నేడు 27 వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. గూగుల్‌లో నెటిజన్లు ఎక్కువగా తనగురించి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలను చాలా ఫన్నీగా చెప్పింది. అవేంటో మీరు ఓసారి చూసేయండి.
View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday)
గూగుల్: అనన్య పాండేకు టాటూ ఉందా?
అనన్య పాండే: నాకు ఎలాంటి టాటూ లేదు. కానీ ఒక టాటూ అయితే వేయించుకోవాలని ఉంది. ఓసారి టాటూ కోసం డబ్బులు కూడా చెల్లించాను. కానీ అక్కడి వెళ్లి టాటూ వేయించుకోవాలంటే భయమేసింది. నాకు ఎలాంటి టాటూ బాగుంటుందో ఐడియాస్ ఇవ్వండి.
గూగుల్: అనన్య పాండే దగ్గర డాగ్స్ ఉన్నాయా?
అనన్య పాండే: అవును, నా దగ్గర రెండు శునకాలు ఉన్నాయి. ఒకటి గొల్డెన్ రిట్రివర్ జాతికి చెందినది, మరొకటి మల్టిపుల్ కాల్ రైట్
గూగుల్: అనన్య పాండే ఫెవరెట్ లిప్స్‌టిక్ ఏది?
అనన్య పాండే: నాకు లాక్మీకి చెందిన Blushing Bae లిప్స్‌టిక్ అంటే చాలా ఇష్టం. ఇందులోని ప్రెటి కలర్స్ నాకు బాగా నచ్చుతాయి.
గూగుల్: అనన్య పాండే ఫెవరెట్ సాంగ్ ఏది?
అనన్య పాండే: నాకు మిల్లి సైరస్( Miley Cyrus) పాడిన ఫ్లవర్స్ సాంగ్ అంటే చాలా ఇష్టం. అది వింటున్నప్పుడు నాకు చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది.
వీటితో పాటు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం.
ఇక అనన్య పాండే విద్యభ్యాసమంతా ముంబైలో జరిగింది. ఆమె ధీరుబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేయగా.. యూనివర్సిటీ ఆఫ్ సథరన్ కాలిఫోర్నియాలో ఉన్నత విద్యను అభ్యసించింది.
అనన్యకు ట్రావెలింగ్, డ్యాన్సింగ్, పార్టీయింగ్, రీడింగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కువగా స్నేహితులతో గడిపేందుకు ఇష్టపడుతుంది.
బాలీవుడ్‌లో ఆమె బెస్ట్ ఫ్రెండ్స్ సారా అలీ ఖాన్, సుహానా ఖాన్
అనన్య తండ్రి చుంకీ పాండే బాలీవుడ్‌లో ప్రముఖ నటుడు. 30 ఏళ్ల సినీ జీవితంలో 100కి పైగా చిత్రాల్లో నటించారు. తల్లి భావన పాండే.. ఫేమస్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా గుర్తింపు పొందారు. అనన్య తాత శరద్ పాండేకు దేశంలోనే ప్రముఖ హార్ట్ సర్జన్‌గా పేరుంది.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2 చిత్రం ద్వారా అనన్య పాండే బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. తన తొలి సినిమాకే ఉత్తమ ఆరంగేట్ర నటిగా అవార్డు అందుకుంది.
సినిమాల్లోకి రాకముందు అనన్య పాండే మోడలింగ్ చేసింది. లాక్మీతో పాటు మరికోన్ని వాణిజ్య ప్రకటనల్లో ఆమె నటించింది.
ఇక తెలుగులో లైగర్ సినిమాతో అనన్య టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తన ఒంపుసొంపులతో తెలుగు ఆడియన్స్ ఆకట్టుకుంది.
లైగర్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అనన్య అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆమె పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోయింది.
‘పతి పత్నీ ఔర్ వో’ చిత్రంలో అనన్య చేసిన గ్లామర్ ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది.
సినిమా అవకాశాలు పెద్దగా రాకపోవడంతో సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు తన బోల్డ్ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
అనన్య నుంచి ఏ చిన్న ఫొటో వచ్చిన అది సోషల్ మీడియాలో సెన్సేషననే చెప్పాలి. ఈ భామ పెట్టే హాట్ ఫొటోలను చూసిన నెటిజన్లు కవ్వించే కామెంట్లతో చెలరేగుతుంటారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన చుంకీ పాండే కూతురే అనన్య. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తన టాలెంట్‌ను నమ్ముకొని అనన్య ఎదుగుతోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికమంది ఫాలోవర్లు ఉన్న బాలీవుడ్ నటిగా అనన్య పాండే ఉంది. ప్రస్తుతం ఆమె ఖాతాను 25 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
అక్టోబర్ 30 , 2024
Navratri Dresses: ఈ నవరాత్రుల్లో మరింత అందంగా కనిపించండి
దేశమంతటా నవరాత్రుల శోభ సంతరించుకుంది. నవరాత్రి అనగా "తొమ్మిది రాత్రులు" అని అర్థం. ఈ తొమ్మిది రోజుల్లో దుర్గాదేవి వివిధ రూపాలను ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలు పూజిస్తారు. ఏడాదికి నాలుగు సార్లు నవరాత్రి జరుగుతుంది, ఇందులో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునేది శార్దీయ నవరాత్రి. ఇది హిందూ చంద్ర కాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలో (సెప్టెంబర్-అక్టోబర్) వస్తుంది. ఈ సంవత్సరం, శార్దీయ నవరాత్రి అక్టోబర్ 3న ప్రారంభమవుతూ, అక్టోబర్ 12న దసరాతో ఈ ఉత్సవం ముగుస్తుంది.
శార్దీయ నవరాత్రి అనేది ఆధ్యాత్మిక దార్శనికత, ఉపవాసం మరియు ప్రార్థన కాలం. ఈ తొమ్మిది రాత్రుల సమయంలో, దుర్గాదేవి దైవ శక్తి పరాకాష్టకు చేరుకుంటుందని హిందువులు నమ్ముతారు. భక్తులు ఆమె ఆశీర్వాదాలను పొందెందుకు పూజిస్తారు. ఈ క్రమంలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను ఆరాధిస్తారు, అవి ఆమె శక్తి, దయ రూపాలను ప్రతిబింబిస్తాయి.
శార్దీయ నవరాత్రి ఉత్సవాల ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి రోజుకు ఒక నిర్దిష్ట రంగు చీరతో అమ్మవారిని అలంకరించి భక్తులు పూజిస్తారు. ఈ రంగులు దేవి గుణాలు, లక్షణాలను ప్రతిబింబిస్తుంటాయి. నవరాత్రి రోజుల్లో భక్తులు ఈ రంగుల్లో దుస్తులు లేదా ఆభరణాలు ధరించి దేవిని స్మరించి, ఆమె ఆశీర్వాదాలను కోరుకుంటారు.
మొదటిరోజు- పసుపు
నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రి దేవిని పూజించే రోజు. ఈ రోజు పసువు దుస్తులు ధరించడం ఆనవాయితీగా ఉంటుంది.
మరి ఈరోజున భక్తి శ్రద్దలతో అమ్మవారిని పూజించడంతో పాటు .. కాస్త ట్రెండీగా కనిపించేందుకు ఇక్కడ మన టాలీవుడ్ హీరోయిన్లు ధరించిన పసుపు రంగు డ్రెస్సింగ్ స్టైల్స్‌ను మీకోసం అందిస్తున్నాం. ఓ లుక్ వేయండి.
దేవర హీరోయిన్ జాన్వీ కపూర్ .. ఈ ట్రెడిషనల్ పసుపు రంగు చీరలో ఎంత అందంగా ఉందో చూడండి. సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్‌తో ఎంబ్రాయిడరీ లేస్‌తో ప్రీమియం మాస్ షిఫాన్ ఫ్యాబ్రిక్‌పై వచ్చిన అందమైన డిజైనర్ చీర ఇది. ఈ చీర మీకు మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.
కృతి శెట్టి లాగా మీరు కూడా ఎల్లో హాఫ్ శారీలో అందరి మనసులు దోచుకోవచ్చు. పసుపు రంగుకు మ్యాచ్ అయ్యేలా గ్రీన్ బ్లౌస్ ధరిస్తే.. మీ అందం రెట్టింపు అవడం ఖాయం.
లైగర్ బ్యూటీ అనన్య పాండే మాదిరి మీరు కూడా లెహెంగాలో అందంగా కనిపించవచ్చు. ఫ్లోరల్ ముకాయిష్ డిజైన్‌లో మీ అందానికి మెరుగులు దిద్దుకోండి.
పూజా హెగ్డే లా, మీరు పసుపు రంగు లెహెంగాలో మెరసిపోవచ్చు. అందంగా సంప్రదాయ కుందన్ ఆభరణాలతో అలంకరించుకోండి. మీ సొగసు మరింత రెట్టింపు అవుతుంది.
View this post on Instagram A post shared by Tree-Shul Media Solutions (@treeshulmediasolutions)
ప్రగ్యా జైస్వాల్ సూర్యకాంతి వెలుగులో రెండు రంగుల ఎంబ్రాయిడరీ క్రాప్ టాప్, ఆకర్షనీయమైన బ్లౌజ్ డిజైన్‌లో మెరిసిపోతుంది. నవరాత్రి వేళ మీరూ ఈవిధంగా కనిపించాలనుకుంటున్నారా. ఇది మంచి ఛాయిస్
రాశీ ఖన్నా లా, మీరు సిల్క్ డ్రెస్‌లో అట్రాక్ట్ లుక్ సొంతం చేసుకోవాలనుకుంటే ఈ డ్రెస్ టైప్ బెస్ట్ ఛాయిస్. దీనికి మ్యాచింగ్‌గా లాంగ్ ఈయరింగ్స్, బంగారు గాజులు, బర్గండి లిప్ స్టిక్‌తో మీ లుక్ ను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు.
రకుల్ సింగ్ మాదిరి మోడ్రన్ స్టైల్‌లో అనార్కలి, స్టేట్‌మెంట్ గోల్డ్ నెక్లెస్‌తో కనిపించాలనుకుంటున్నారా… ఈ పండుగ వేళ ఈ డ్రెస్‌ను కచ్చితంగా దీనిని ట్రై చేయండి.
షెహ్నాజ్ గిల్ పసుపు రంగు డ్రెస్‌లో తన అందాన్ని మరింత వికసింప జేసింది. ఈ డ్రెస్‌తో మీరు కూడా అలా కనిపించవచ్చు.
అక్టోబర్ 04 , 2024
Exclusive: చిరంజీవి, నాగార్జున పని అయిపోయినట్లేనా? ఒత్తిడిలో ఆ స్టార్ డైరెక్టర్లు?
టాలీవుడ్‌లో గత ఐదేళ్ల వ్యవధిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కొందరు హీరోలు విభిన్నమైన కథలను ఎంచుకొని పాన్ ఇండియా స్థాయికి ఎదిగితే మరికొందరు తమ ఫేమ్‌ను తిరోగమనంలోకి తీసుకెళ్లారు. కొందరు హీరోలు చకచకా సినిమాలు చేస్తూ తమ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తే ఇంకొందరు రెండేళ్లకు కూడా ఒక సినిమా రిలీజ్ చేయలేక ఫ్యాన్స్‌లో అసంతృప్తికి కారణమయ్యారు. ముఖ్యంగా కొందరు యంగ్ హీరోలు ఫ్లాప్స్ తియ్యడంలో పోటీ పడుతూ భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు. ఇక సీనియర్ హీరోల పరిస్థితి మరి దారుణంగా ఉంది. గత ఐదేళ్లలో టాలీవుడ్‌లో వచ్చిన గణనీయమైన మార్పులు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
ఒక మూవీకి ఏళ్లకు ఏళ్ల సమయం!
టాలీవుడ్‌లో ఒకప్పుడు ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ వంటి దిగ్గజ నటులు ఏడాదికి రెండు లేదా మూడు చిత్రాలు రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ను అలరించేవారు. వీరి తర్వాత వచ్చిన చిరంజీవి, నాగార్జున, వెంటటేష్, బాలకృష్ణ సైతం ఈ పరంపరను కొనసాగిస్తూ ఏడాదిలో ఒక సినిమాకు తగ్గకుండా రిలీజ్ చేసేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కో సినిమాకు రెండు, మూడేళ్ల సమయం పడుతోంది. రామ్‌చరణ్, అల్లు అర్జున్, తారక్ వంటి స్టార్ హీరోల నుంచి సినిమా వచ్చి దాదాపుగా మూడేళ్లు దాటిపోయింది. ఓ వైపు ప్రభాస్ ఏడాదికి కనీసం ఒకటి లేదా రెండు సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఈ ముగ్గురు స్టార్స్ మాత్రం ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నారు. సైంటిఫిక్, మైథాలజీ, ఫ్యూచరిక్ సినిమాలంటే కొంత ఆలస్యం జరిగిన ఓ అర్థం ఉంది. ప్రస్తుతం తారక్ (దేవర), రామ్‌చరణ్ (గేమ్ ఛేంజర్), అల్లు అర్జున్ (పుష్ప 2) చేస్తున్న కమర్షియల్ చిత్రాలకు కూడా ఇంత ఆలస్యం ఎందుకు అన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఫ్లాప్స్‌తో పోటీపడుతున్న కుర్ర హీరోలు!
యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నాగచైతన్య (Naga Chaitanya), రామ్ పోతినేని (Ram Pothineni)లకు గత ఐదేళ్లుగా టాలీవుడ్‌లో అసలు కలిసి రావడం లేదు. వారి నుంచి సాలిడ్ హిట్ వచ్చి చాలా కాలమే అయ్యింది. ఒకప్పుడు హిట్ సినిమాలతో పోటీ పడిన ఈ ముగ్గురు హీరోలు అనూహ్యంగా గత ఐదేళ్ల నుంచి ఫ్లాప్స్‌తో పోటీ పడుతున్నారు. విజయ్ నటించిన రీసెంట్ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’తో పాటు గతంలో వచ్చిన ‘లైగర్’, ‘ఖుషి’, ‘డియర్ కామ్రేడ్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. అలాగే నాగ చైతన్య నటించిన ‘కస్టడీ’, ‘లాల్ సింగ్ చద్ధా’, ‘థ్యాంక్యూ’, ‘బంగార్రాజు’ చిత్రాలు ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాయి. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చేసిన లేటెస్ట్ చిత్రం 'డబుల్ ఇస్మార్ట్' కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అంతకుముందు వచ్చిన ‘స్కంద’, ‘వారియర్’, ‘రెడ్’ సినిమాలు హిట్స్ అందుకోలేక ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాయి.
మార్కెట్ కోల్పోయే దిశగా సీనియర్లు
ఇక సీనియర్ హీరోల పరిస్థితి గత ఐదేళ్ల వ్యవధిలో దారుణంగా మారిపోయింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి ఇప్పటివరకూ సరైన కమ్‌బ్యాక్ లభించలేదని చెప్పాలి. ఓవైపు రజనీకాంత్, కమల్ హాసన్ తమ వయసుకు తగ్గ స్టోరీలు ఎంచుకొని ‘జైలర్’, ‘విక్రమ్’ సినిమాలతో సాలిడ్ విజయాలను అందుకున్నారు. అయితే చిరు ఇప్పటికే కమర్షియల్ పాత్రలనే ఎంచుకుంటూ పోవడం ఆయనకు మైనస్‌గా మారుతోంది. అటు నాగార్జున, వెంకటేష్ పరిస్థితి కూడా ఇంచు మించు అలాగే ఉంది. నాగార్జున గత చిత్రాలు ‘మన్మథుడు 2’, ‘బంగార్రాజు’, ‘నా సామిరంగ’లోని పాత్రలు ఏమాత్రం నాగార్జునకు సెట్ అయ్యేవిగా కనిపించవు. ఇక వెంటేష్ ‘రానా నాయుడు’ సిరీస్‌తో విపరీతంగా ట్రోల్స్‌కు గురయ్యారు. నందమూరి బాలకృష్ణ మాత్రం ఎప్పటిలాగే మాస్ సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటున్నారు. అయితే కొత్త కథలు ఎంచుకోకపోవడం, వయసు తగ్గ పాత్రలు చేయకపోవడం, సరైన హిట్స్ లేకపోవడంతో ఒకప్పటి స్టార్ హీరోలుగా వెలిగిన ఈ హీరోల కలెక్షన్స్ కుర్రహీరోలతో పోలిస్తే పడిపోతూ వస్తున్నాయి. మార్కెట్‌ను పూర్తిగా కోల్పేయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రభాస్, నాని సూపర్బ్!
గత ఐదేళ్ల కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న హీరోలుగా ప్రభాస్, నానిలను చెప్పవచ్చు. ఓవైపు వేగంగా సినిమాలు చేస్తూనే ప్రతీ మూవీకి కథ, పాత్ర పరంగా వైవిధ్యం చూపిస్తూ ఆకట్టుకున్నారు. క్వాలిటీ పరంగానూ మంచి సినిమాలు తీస్తూ ఎప్పటికప్పుడు తమ క్రేజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నారు. ప్రభాస్ గత చిత్రాలను పరిశీలిస్తే ‘బాహుబలి 1 & 2’, ‘సాహో’, ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు కథ, పాత్ర పరంగా చాలా భిన్నంగా ఉంటాయి. అటు నాని రీసెంట్ చిత్రాలైన ‘గ్యాంగ్ లీడర్’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘అంటే సుందరానికి’, ‘దసరా’, ‘హాయ్ నాన్న’ కూడా విభిన్నమైనవే. నాని నటించిన లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిందే. అటు ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ‘రాజాసాబ్’, సలార్ 2, ‘కల్కి 2’, ‘స్పిరిట్’, ‘ఫౌజీ’ కథ, పాత్ర పరంగా ప్రభాస్‌ను మరో లెవల్‌లో చూపించనున్నాయి.
రీరిలీజ్‌లతో ఫ్యాన్స్ సంతృప్తి!
గతంలో లేని విధంగా ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల హవా ఎక్కువగా కనిపిస్తోంది. స్టార్ హీరోల బర్త్‌డేల సందర్భంగా గతంలో వారు చేసిన బ్లాక్ బాస్టర్ చిత్రాలు విడుదలవుతున్నాయి. మహేష్ బాబు, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోల చిత్రాలకు లాంగ్ గ్యాప్ వస్తుండటంతో రీరిలీజ్ మూవీస్‌లోనే తమ హీరోను చూసుకొని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. గత రోజులను గుర్తుచేసుకుంటూ సంతోష పడుతున్నారు. అయితే రీరిలీజ్ చిత్రాలకు ఆదరణ పెరగడానికి ఓ కారణం కూడా ఉంది. ప్రస్తుతం ఆ తరహా చిత్రాలను హీరోలు చేయకపోవడమే ఇందుకు కారణంగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రీరిలీజ్ రూపంలో తమ ఫేవరేట్ చిత్రాలను మళ్లీ చూసుకొని అభిమానులు సంతోష పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు.
ఆ స్టార్ డైరెక్టర్లకు ఏమైంది?
టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన పూరి జగన్నాథ్‌కు హీరోలతో సమానంగా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో ఆయన నుంచి సినిమా వస్తుందంటే థియేటర్లలో పండగ వాతావరణం నెలకొనేది. ‘ఇడియట్’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘పోకిరి’, ‘బిజినెస్ మ్యాన్’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బాస్టర్స్‌తో ఓ దశలో టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించాడు. అటువంటి పూరి గత కొంత కాలంగా హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఆయన గత చిత్రం ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. తాజాగా వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ సైతం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అటు హరీష్ శంకర్ పరిస్థితి కూడా ఇంచుమించు పూరి లాగానే ఉంది. ‘మిరపకాయ్’, ‘గబ్బర్ సింగ్’ వంటి సూపర్ హిట్స్‌తో మాస్ డైరెక్టర్‌గా హరీష్ శంకర్ ఇటీవల సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ‘దువ్వాడ జగన్నాథం’, ‘గద్దల కొండ గణేష్’ ప్లాప్స్‌తో లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’పై అతడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే మిస్టర్ బచ్చన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. హరీష్ శంకర్ టేకింగ్ సాదా సీదాగా ఉందంటూ విమర్శలు సైతం వచ్చాయి.
ఆగస్టు 17 , 2024
Double Ismart Vs Mr. Bachchan: పూరి జగన్నాథ్ భయపడ్డారా? అందుకే డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్ చేయడం లేదా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం ఆగస్టు 15 నుంచి తప్పుకోవడంతో ఆ డేట్‌లో మహా యుద్ధమే మెుదలైంది. రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) చిత్రాన్ని ఆ రోజున రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అప్పటికీ ఏ చిత్రం ఆ డేట్‌కు లాక్ కాకపోవడంతో ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ‘డబుల్ ఇస్మార్ట్’ సోలోగా విడుదలవుతుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆగస్టు 15 రేసులోకి రవితేజ - హరీష్ శంకర్ కాంబోలోని ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) వచ్చి చేరింది. దీంతో బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్‌కు తెరలేచింది. అయితే ఈ మధ్య ఇండస్ట్రీలో జరుగుతున్న వరుస పరిణామాలను చూస్తుంటే ఈ పోరులో డైరెక్టర్ పూరి వెనకపడ్డారా? అన్న సందేహం కలుగుతోంది. ఆయన భయపడ్డారన్న వాదనలు సైతం సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కారణాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.
ఓ వైపు ప్రమోషన్స్.. మరోవైపు డిప్రెషన్!
ఆగస్టు 15కు సమయం దగ్గర పడుతుండటంతో ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) టీమ్ ప్రమోషన్స్‌తో దూసుకుపోతోంది. వరుసగా ప్రెస్ మీట్‌లు నిర్వహిస్తూ తమ సినిమాను ఆడియన్స్‌లోకి తీసుకెళ్తోంది. అయితే ‘డబుల్ ఇస్మార్ట్’ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. పూరి జగన్నాథ్ & కో ఇప్పటివరకూ ఒక్క ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదు. తమ సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రమోషన్స్‌ను షురూ చేయలేదు. సాధారణంగా ప్రమోషన్స్ అనేవి సినిమా ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపుతాయి. అటువంటి కీలకమైన ప్రమోషన్స్‌ను ‘డబుల్ ఇస్మార్ట్’ ఇంకా మెుదలే పెట్టకపోవడంపై సినీ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15 రేసులోకి రావడంతో పూరి ఢీలా పడిపోయారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. హీరో రామ్‌తో పాటు తనకూ ఈ మూవీ సక్సెస్ ఏంతో కీలకమైన నేపథ్యంలో రిజల్ట్‌పై పూరి ఆందోళనతో ఉన్నారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వెనక్కి తగ్గని బచ్చన్ టీమ్!
పంద్రాగస్టు రోజున ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ కాకుండా ఉండేందుకు ‘డబుల్ ఇస్మార్ట్’ టీమ్ అన్ని ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. సినిమాను వాయిదా వేసుకోవాలని బచ్చన్ టీమ్‌ను వారు అడిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనికి బచ్చన్ టీమ్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే డబుల్ ఇస్మార్ట్ నిర్మాత ఛార్మీ తాజాగా రవితేజతో పాటు దర్శకుడు హరీశ్ శంకర్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసినట్లు కూడా కథనాలు వచ్చాయి. మరోవైపు ‘లైగర్’ మూవీ డిస్ట్రిబ్యూటర్ల నుంచి సైతం ‘డబుల్ ఇస్మార్ట్’కు సమస్యలు ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. లైగర్ నష్టాలను సెటిల్ చేయకుండా పూరి మరో ఫిల్మ్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధం కావడంపై డిస్ట్రిబ్యూటర్ల కోపం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘డబుల్ ఇస్మార్ట్’ టీమ్ ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలి.
వ్యూహామా లేదా గందరగోళమా?
పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రానికి ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ లేకపోవడం వెనక ఓ వ్యూహాం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ పూరి కూడా ‘కల్కి 2898 ఏడీ’ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ను అనుసరిస్తున్నట్లు చెప్పారు. కేవలం కంటెంట్ (ట్రైలర్, టీజర్, లిరికల్ సాంగ్స్, ప్రమోషన్ పోస్టర్లు) ద్వారానే తమ సినిమాను ప్రమోట్ చేయాలని ఇస్మార్ట్ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘లైగర్’ చిత్రానికి పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ఇచ్చి చేతులు కాల్చుకున్న నేపథ్యంలో మరోమారు ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. అయితే ఇండస్ట్రీలో మరికొందరి వాదన ఇంకోలా ఉంది. డిస్ట్రిబ్యూటర్ల గొడవ, మిస్టర్ బచ్చన్ టీమ్‌తో సంప్రదింపులు నేపథ్యంలో ప్రస్తుతం ఇస్మార్ట్ టీమ్ ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టలేకపోతోందని అంటున్నారు. టీమ్ అంతా గందరగోళంలో ఉన్నందువల్ల ఇంకా ప్రమోషన్స్ షురూ కాలేదని చెబుతున్నారు.
ఆ ఇష్యూ వల్లే రిలీజ్ చేస్తున్నాం: హరీశ్ శంకర్
రీసెంట్‌గా మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న డైరెక్టర్ హరీశ్ శంకర్ ఇస్మార్ట్ టీంతో ఉన్న వివాదంపై స్పందించారు. పూరి జగన్నాథ్ సినిమాతో పాటు మీ సినిమా ఒకేసారి విడుదల కాబోతుంది దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని రిపోర్టర్ అడుగగా హరీశ్ శంకర్ సమాధానం ఇచ్చారు. 'పూరితో నేను పోల్చుకోలేను. ఆయన ఒక దిగ్గజం. ఆయనతో నా సినిమా వస్తుండటం నా అదృష్టం. నిజానికి రెండు సినిమాలు ఒకే డేట్‌కి రావడం వెనుక ముఖ్య కారణం ఓటీటీ ఇష్యూ ఉండడం. అందుకే ముందుగా రిలీజ్ చేస్తున్నా. అంతేకాని నాకు పూరి సర్‌కి ఎలాంటి గొడవలు లేవు’ అంటూ హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు.
ఆగస్టు 01 , 2024
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్టు.. తండ్రిని గట్టిగా హగ్ చేసుకొని..!
టాలీవుడ్‌లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు 'విజయ్ దేవరకొండ' (Vijay Devarakonda). ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్.. తనకంటూ ప్రత్యేకమైన స్టార్‌డమ్‌ను సృష్టించుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’, ‘పెళ్లి చూపులు’, ‘గీతా గోవిందం’, ‘ట్యాక్సీవాలా’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలతో స్టార్ హీరోల సరసన నిలిచాడు. కాగా, ఇటీవల విజయ్.. తన ఫ్యామిలీతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లాడు. అక్కడ కుటుంబ సభ్యులతో దిగిన ఎమోషనల్ ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఎమోషనల్ పోస్టు
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవిలతో పాటు సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లాడు. విజయ్ తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి. గత కొంత కాలంగా వరుస షూటింగ్ షెడ్యూల్స్‌తో బిజీ బిజీగా గడుపుతోన్న విజయ్.. విరామం కోసం అమెరికాకు వెళ్లి కొద్ది రోజులు ఫ్యామిలీతో సరదాగా గడిపారు. తాజాగా ఇండియాకు వచ్చిన విజయ్.. అక్కడ తన ఫ్యామిలీతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన అమ్మనాన్న, సోదరుడితో కలిసి అమెరికా వెకేషన్‌ను.. విజయ్ ఎంత బాగా ఆస్వాదించారో ఈ ఫొటోల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా తండ్రి గోవర్ధన్‌రావును విజయ్ గట్టిగా హగ్ చేసుకున్న ఫొటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది.
https://www.instagram.com/p/C8W7M9Jys78/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
అసిస్టెంట్ డైరెక్టర్‌గా త్రివిక్రమ్ కుమారుడు!
విజయ్ దేవరకొండ తీసిన గత మూడు చిత్రాలు (లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్) బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచాయి. దీంతో విజయ్ తన తర్వాతి చిత్రంపై ఫోకస్ పెట్టాడు. ‘VD12’ ప్రొడక్షన్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పెద్ద కుమారుడు రిషి.. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతనిది హీరో ఫేస్ అని అభిమానులు అంటున్నా.. రిషి మాత్రం కెమెరా వెనుక నుంచి తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారట. ఇందుకు త్రివిక్రమ్ కూడా ఓకే చెప్పడంతో విజయ్ దేవరకొండ సినిమా ద్వారానే రిషి తన సినీ కెరీర్‌ను మెుదలుపెట్టినట్లు సమాచారం.
పోలీసు ఆఫీసర్‌గా విజయ్
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న VD12 చిత్రంలో విజయ్.. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా కనిపిస్తారని సమాచారం. ఇందులో సీరియస్ పోలీసు ఆఫీసర్‌గా విజయ్ కనిపించనున్నాడట. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree)ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ సినిమాలో ప్రముఖ నటుడు సత్యదేవ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాలీవడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇటీవల అతడు నటించిన 'కృష్ణమ్మ' ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో సత్యదేవ్ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారట.
సాయిపల్లవితో రొమాన్స్
రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda).. దర్శకుడు రవికిరణ్ కోలా (Ravi Kiran Kola)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీకి దిల్ రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇది అందమైన, సరికొత్త ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించనున్నట్లు కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. చిత్ర యూనిట్ సాయిపల్లవిని కలిశారని, ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు ఫిల్మ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది నిజమైతే విజయ్ - సాయి పల్లవి జోడీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.
జూన్ 19 , 2024
Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ సినిమా? క్లారిటీ!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' (Family Star) చిత్రం.. కలెక్షన్లు రాబట్టడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో విజయ్ కెరీర్ పరంగా బిగ్గెస్ట్ సక్సెస్ కోసం విజయ్ ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అతడి దృష్టంతా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందనున్న లవ్ ఎంటర్‌టైనర్ మీదనే ఉంది. ఈ క్రమంలోనే ‘సలార్’, ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్ బాస్టర్లు అందించిన ప్రశాంత్ నీల్‌తో విజయ్ భేటి కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వీరి కాంబోలో ఏమైనా సినిమా ఉంటుందా? అన్న ఆసక్తి టాలీవుడ్ వర్గాల్లో మెుదలైంది.
ఎందుకు కలిశారంటే!
హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో ఉన్న విజయ్ దేవరకొండ ఇంటికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వెళ్లి కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతుందన్న పుకార్లు మొదలయ్యాయి. ముఖ్యంగా హ్యాట్రిక్ ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్.. ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్‌తో పని చేయబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ‘సలార్ 2’లో విజయ్ అతిథి పాత్ర పోషించబోతున్నట్లు టాలీవుడ్‌లో స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఈ పాత్ర గురించి చర్చించడానికే ప్రశాంత్ నీల్.. విజయ్ ఇంటికి వెళ్లారని సమాచారం. 'సలార్ 2' క్లైమాక్స్‌లో విజయ్ కనిపిస్తాడని అంటున్నారు. ఆయన రోల్ సినిమాకు చాలా కీలకంగా ఉండనుందని టాక్. అయితే దీనిపై మూవీ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
చిక్కుల్లో విజయ్ కెరీర్!
విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన గత మూడు చిత్రాలు ‘లైగర్’ (Liger), ‘ఖుషి’ (Kushi), ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star).. బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. ముఖ్యంగా రెండేళ్ల కిందట వచ్చిన లైగర్ భారీ నష్టాలను మిగిల్చింది. తాజాగా రిలీజైన ‘ఫ్యామిలీ స్టార్’ కూడా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. దీంతో నిర్మాత దిల్ రాజు కూడా భారీగా నష్టాలు చవిచూసినట్లు ఇండస్ట్రీలో టాక్ ఉంది. మరోవైపు తనకు ‘గీత గోవిందం’ లాంటి హిట్ ఇచ్చిన పరశురాం కూడా విజయ్ లక్కును మార్చలేకపోయాడు. దీంతో విజయ్‌కు బ్లాక్ బాస్టర్ తప్పనిసరిగా మారింది. మరో ప్లాపు విజయ్ ఖాతాలో పడితే అతడి కెరీర్ సమస్యల్లో పడవచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
విజయ్ ఫ్లాప్స్‌కు చెక్ పడేనా?
విజయ్(Vijay Deverakonda) తన తర్వాతి చిత్రం 'VD12'ను గౌతం తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనుంది. ఇందులో విజయ్‌కు జోడీగా 'ప్రేమలు' బ్యూటీ మమితా బైజు (Mamita Baiju)ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన ‘ప్రేమలు’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అయ్యింది. ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లను సాధించడంతో ఈ అమ్మడి మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో మమితా బైజును తీసుకుంటే సినిమాకు బాగా కలిసొస్తుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. పైగా కొత్త తరహా లవ్ స్టోరీ కావడం, విజయ్ మమితా తొలిసారి జోడీ కడుతుండటం సినిమాకు ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ అభిప్రాయపడుతోంది. మరి ఈ కేరళ బ్యూటీ విజయ్ ఫ్లాప్స్‌కు చెక్ పెడుతుందో లేదో చూడాలి.
https://telugu.yousay.tv/exclusive-premalu-heroine-romance-with-vijay-deverakonda.html
ఏప్రిల్ 24 , 2024