Editorial List
పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన సినిమాల జాబితా
40+ views22 days ago
ఫలితంతో సంబంధం లేకుండా తనకు నచ్చిన కథను సినిమాగా తీసే డైరెక్టర్లో పూరి జగన్ ముందు వరుసలో ఉంటారు.మరి ఆయన ఇప్పటి వరకు డైరెక్ట్ చేసిన సినిమాలేవో ఇక్కడ అందించిన లిస్ట్‌లో చూడండి.
1 . డబల్ ఇస్మార్ట్(ఆగస్టు 15 , 2024)
UA|యాక్షన్,థ్రిల్లర్,సైన్స్ ఫిక్షన్
మాఫియా డింపుల్ బిగ్ బుల్(సంజయ్ దత్) మరణం లేకుండా ఉండాలని అనుకుంటాడు. ఈ క్రమంలో వైద్యులు అతనికి ఓ సలహా ఇస్తారు. మెమోరీ ట్రాన్సఫర్ గురించి వివరిస్తారు. మెమోరీ ట్రాన్సఫర్ చేస్తే అలాంటి అవకాశం ఉందని చెబుతారు. బిగ్ బుల్ మెమోరిని రకరకాల వ్యక్తులకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. కానీ విఫలమవుతుంది. ఈక్రమంలో ఇస్మార్ట్ శంకర్ గురించి బిగ్ బుల్‌కు తెలుస్తుంది. తన మెమోరీని ట్రాన్స్‌ఫర్ చేసేందుకు శంకర్‌ను ఎంచుకుంటారు. మరీ శంకర్ బ్రేయిన్‌లోకి బిగ్ బుల్ మెమోరీని ట్రాన్స్‌ఫర్ చేశారా? ఇస్మార్ట్ శంకర్ ఏం చేశాడు? అనేది కథ
2 . లైగర్(ఆగస్టు 25 , 2022)
UA|138 minutes|యాక్షన్,డ్రామా
తన బిడ్డ లైగర్(విజయ్ దేవరకొండ)ను ఛాంపియన్‌గా చూడాలని బాలామణి (రమ్యకృష్ణ) కోరిక. ఇందుకోసం కరీంనగర్ నుంచి ముంబయికి వస్తుంది. ప్రేమ జోలికి వద్దని తల్లి చెబుతున్నప్పటికీ లైగర్ తానియా (అనన్య పాండే) ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వారి ప్రేమ ఎందుకు విఫలమైంది? లైగర్ ఛాంపియన్‌గా అయ్యాడా? అనేది కథ.
3 . ఇస్మార్ట్ శంకర్(జూలై 18 , 2019)
A|141 minutes|యాక్షన్,సైన్స్ ఫిక్షన్,థ్రిల్లర్
ఇస్మార్ట్ శంకర్ ఒక కాంట్రాక్ట్ కిల్లర్. ఓ రాజకీయ నాయకున్ని హత్య చేసి తన లవర్‌తో పారిపోతాడు. ఈ హత్య కేసును విచారిస్తున్న క్రమంలో పోలీస్ అధికారి అరుణ్ చనిపోతాడు. దీంతో పోలీసులు అరుణ్ మెమోరీని శంకర్‌కు అతనికి తెలియకుండా బదిలీ చేస్తారు. దీంతో కథ కీలక మలుపు తిరుగుతుంది.
4 . మెహబూబా(మే 11 , 2018)
UA|డ్రామా,రొమాన్స్,యుద్ధం
ఇండియాలో ఉన్న హీరో, పాక్‌లో ఉన్న హీరోయిన్‌ను ఒకటే కల వెంటాడుతుంటుంది. దీనికి కారణం ఏంటి? వారికి గత జన్మలో ఉన్న సంబంధం ఏంటి? చివరికీ వారు ఎలా కలిశారు? అన్నది కథ.
5 . పైసా వసూల్(సెప్టెంబర్ 01 , 2017)
UA|142 minutes|యాక్షన్,డ్రామా
గూఢచార సంస్థలో పనిచేస్తున్న ఒక అధికారి ఒక మాఫియా నాయకుడిని పట్టుకోవడానికి ఒక పెద్ద మిషన్ కోసం స్థానిక గ్యాంగ్‌స్టర్‌ని నియమిస్తాడు. మరి ఆ గ్యాంగ్ స్టార్ మాఫియా డాన్‌ను పట్టుకున్నాడా? లేదా అనేది కథ.
6 . రోగ్(మార్చి 31 , 2017)
UA|134 minutes|యాక్షన్,రొమాన్స్
ఒక యువకుడి ప్రేమ విఫలం కావడంతో అతని జీవితం తీవ్రమైన మలుపు తీసుకుంటుంది. అతన్ని హింస సంఘర్షణల ప్రపంచంలోకి నెట్టివేస్తుంది.
7 . ఇజం(అక్టోబర్ 21 , 2016)
UA|130 mins|యాక్షన్,డ్రామా
జర్నలిస్టు అయిన హీరో (కళ్యాణ్‌రామ్) అవినీతి, మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతుంటాడు. ఈ క్రమంలో అతడు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? సమాజంలో మార్పు కోసం అతడు ఏం చేశాడు? అన్నది కథ.
8 . లోఫర్(డిసెంబర్ 17 , 2015)
UA|134 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
తల్లి చనిపోయిందని భావించిన రాజా దొంగగా మారతాడు. అయితే, బలవంతపు పెళ్లి నుంచి తప్పించుకున్న మౌనిక అనే యువతితో ప్రేమలో పడుతాడు. చివరికి ఆమె అత్తను కలుసుకోవడంతో అతని జీవితం మలుపు తిరుగుతుంది. రాజాకు హీరోయిన్ అత్తకు ఏంటి సంబంధం అనేది మిగతా కథ.
9 . జ్యోతి లక్ష్మి(జూన్ 12 , 2015)
UA|డ్రామా
ఇది జ్యోతి లక్ష్మి అనే వేశ్య జీవితం మీద ఆధారపడింది, ఆమె తన వృత్తిని వదిలి మంచి జీవితాన్ని కోరుకుంటుంది. ఈ చిత్రం ఆమె సమాజంలో ఎదుర్కొనే సమస్యలు మరియు ఆమె గౌరవప్రయాణంను చూపిస్తుంది.
10 . టెంపర్(ఫిబ్రవరి 13 , 2015)
UA|141 minutes|యాక్షన్,డ్రామా,థ్రిల్లర్
దయా ఒక అవినీతి పోలీసు అధికారి. వైజాగ్‌కు బదిలీ అయిన తర్వాత అక్కడ వాల్టర్ వాసు అనే గూండాతో చేతులు కలుపుతాడు. అవినీతి మార్గంలో ప్రయాణిస్తాడు. అతని ప్రేయసి కాజల్ అగర్వాల్‌ను అనుకోకుండా వాల్టర్ వాసు కిడ్నాప్ చేయడంతో కథలో ట్విస్ట్ పుడుతుంది
11 . హార్ట్ ఎటాక్(జనవరి 31 , 2014)
A|140 min|యాక్షన్,రొమాన్స్
స్పెయిన్‌లో హీరో, హీరోయిన్లు ప్రేమలో పడతారు. కానీ హీరోకి పెళ్లి అంటే ఇష్టం ఉండదు. దీంతో హీరోయిన్ గోవా వెళ్లిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ప్రేమను రియలైజ్ అయిన హీరో ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
12 . ఇద్దరమ్మాయిలతో(మే 31 , 2013)
UA|143 minutes|రొమాన్స్,థ్రిల్లర్
సంజు రెడ్డి స్పెయిన్‌లో లీడ్ గిటారిస్ట్. కొంతమందితో కలిసి బ్యాండ్ నడుపుతుంటాడు. ఈక్రమంలో ఇండియాలో బాగా ధనవంతురాలైన, యూనియన్ మినిస్టర్ కూతురైన ఆకాంక్ష సైకాలజీలో పిజి చేయడానికి స్పెయిన్ వస్తుంది. తను దిగిన ఇంట్లో, ఇదివరకూ అదే ఇంట్లో ఉన్న వారికి సంబందించిన డైరీ ఒకటి దొరుకుతుంది. ఆ డైరీకి సంజూ రెడ్డికి మధ్య సంబంధమే సినిమా కథ.
13 . కెమెరామెన్ గంగతో రాంబాబు(అక్టోబర్ 18 , 2012)
UA|154 minutes|డ్రామా
అన్యాయం చేస్తున్న వారిని కొట్టిమరి రాంబాబు న్యాయం చేస్తుంటాడు. అతడి క్యారెక్టర్ నచ్చి కెమెరామెన్ గంగా తమ న్యూస్ ఛానెల్‌లో జర్నలిస్టుగా జాయిన్ చేయిస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో అతడు ఎలాంటి మార్పును తీసుకొచ్చాడు? అన్నది కథ.
14 . దేవుడు చేసిన మనుషులు(ఆగస్టు 14 , 2012)
UA|124 minutes|హాస్యం
లక్ష్మీదేవి, విష్ణువుకి మధ్య జరిగిన గొడవల కారణంగా ఇద్దరు అనాథల జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి. వారి జీవితాలను డాన్ ఎలా ప్రభావితం చేశాడు? అన్నది కథ.
15 . బిజినెస్‌మెన్(జనవరి 13 , 2012)
A|131 minutes|యాక్షన్
ముంబయిని ఏలాలన్న లక్ష్యంతో సూర్య నగరానికి వస్తాడు. లోకల్ గ్యాంగ్‌స్టర్లతో కలిసి పవర్‌ఫుల్ బిజినెస్‌మ్యాన్‌గా ఎదుగుతాడు. ఇంతకీ ఆ యువకుడు పెట్టిన బిజినెస్ ఏంటి? చిత్ర-సూర్యల లవ్‌స్టోరీ ఏంటి? అన్నది కథ.
16 . నేను నా రాక్షసి(ఏప్రిల్ 28 , 2011)
UA|క్రైమ్,డ్రామా,రొమాన్స్
షార్ప్ షూటర్ అభి.. ఓ కేఫ్‌లో మీనాక్షిని చూసి ప్రేమిస్తాడు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుంటున్న వారి వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటుంది. మీనాక్షి అలా ఎందుకు చేస్తోంది. వారిద్దరు పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నారు? అన్నది కథ.
17 . గోలీమార్(మే 27 , 2010)
A|145 minutes|యాక్షన్
గంగారాం పోలీస్ ఉద్యోగంలో చేరడానికి చాలా కష్టపడుతాడు. చివరికి జాబ్ సంపాదించి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా ఎదుగుతాడు. అతను పెద్ద పెద్ద గ్యాంగ్‌స్టర్లను చంపుతున్న క్రమంలో ఇద్దరు క్రూరమైన గ్యాంగ్‌స్టర్‌లు అతని ఉద్యోగం పోయేలా చేస్తారు. మరి గంగారాం ఆ గ్యాంగ్‌స్టర్లను ఎలా ఎదుర్కొన్నాడు. తిరిగి తన ఉద్యోగాన్ని ఎలా పొందాడు అన్నది స్టోరీ. గోలీమార్ చిత్రం గోపిచంద్ కెరీర్‌లో సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్ల లాభం సాధించింది.
18 . ఏక్ నిరంజన్(అక్టోబర్ 29 , 2009)
UA|155 minutes|యాక్షన్,డ్రామా
రోడ్లపై పిల్లల్ని అడుక్కునే రాకెట్‌ను నడిపే వ్యక్తి చిన్నతనంలో చోటును కిడ్నాప్ చేస్తాడు. అయితే, అతన్ని అరెస్టు చేయడంలో పోలీసులకు చోటు సహాయం చేస్తాడు. ఆ తర్వాత తన కుటుంబం కోసం వెతుకుతాడు.
19 . నేనింతే(డిసెంబర్ 19 , 2008)
U|యాక్షన్,డ్రామా,రొమాన్స్
డైరెక్టర్ కావాలని కలలు కనే రవి.. అనేక కష్టాలకు ఓడ్చి చివరికి తన తొలి చిత్రాన్ని పట్టాలెక్కిస్తాడు. ప్రేయసిని హీరోయిన్‌గా పెట్టి సినిమా తీస్తున్న క్రమంలో నిర్మాత అయిన గ్యాంగ్‌స్టర్.. రవికి అడ్డంకులు సృష్టిస్తాడు. వాటిని రవి ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.
20 . బుజ్జిగాడు(మే 22 , 2008)
UA|146 minutes|యాక్షన్,డ్రామా
బుజ్జి రజనీకాంత్ ఫ్యాన్. చిన్నప్పుడు ఇంటి పక్కన ఉండే చిట్టితో గొడవపడి ఇల్లు వదిలి వెళ్లిపోతాడు. 12 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చిన బుజ్జి.. చిట్టిని వెత్తుకుంటూ వెళ్తాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి? అన్నది స్టోరీ.