• TFIDB EN
  • జగదేక వీరుడు అతిలోక సుందరి
    UTelugu
    నలుగురు అనాథలకు ఆశ్రయిమిచ్చిన రాజు.. గైడ్‌గా పనిచేస్తుంటాడు. రాజుకు అనుకోకుండా ఓ రోజు ఇంద్రుడి కుమార్తె ఇంద్రజకు చెందిన ఉంగరం దొరుకుతుంది. ఆ ఉంగరం కోసం ఇంద్రజ తిరిగి భూమి మీదకు వస్తుంది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌SunNextఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    చిరంజీవి
    ఒక హిల్ స్టేషన్ టూర్ గైడ్
    శ్రీదేవి
    ఇంద్రలోకం యొక్క ఖగోళ రాజ్యం నుండి వచ్చిన ఇంద్రుని కుమార్తె
    అమ్రిష్ పూరి
    చేతబడి చేసే మంత్రగాడు
    ప్రభాకర్
    కె.పి
    గంగా జలం
    రామి రెడ్డి
    అబ్బులు
    తనికెళ్ల భరణి
    దాసు
    బ్రహ్మానందం
    విచిత్ర కుమార్
    ప్రసాద్ బాబు
    నారద
    జనగరాజు
    పోలీస్ ఇన్‌స్పెక్టర్
    సంగీత
    టీచర్
    రిచర్డ్ రిషి
    అనాథ
    శాలిని అజిత్
    అనాథ
    షామ్లీ
    అనాథ
    PJ శర్మ
    ఋషి
    ఆర్ఎస్ శివాజీ
    మాలోకం
    క్రేజీ మోహన్
    సిబ్బంది
    కె. రాఘవేంద్రరావు
    దర్శకుడు
    సి. అశ్వని దత్
    నిర్మాత
    ఇళయరాజా
    సంగీతకారుడు
    యండమూరి వీరేంద్రనాథ్
    కథ
    కోటగిరి వెంకటేశ్వరరావు
    ఎడిటర్ర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    RC16: జూ.ఎన్టీఆర్ హీరోయిన్‌తో రొమాన్స్ చేయనున్న రామ్‌ చరణ్?
    RC16: జూ.ఎన్టీఆర్ హీరోయిన్‌తో రొమాన్స్ చేయనున్న రామ్‌ చరణ్?
    తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ జోడీ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే జంట చిరంజీవి-శ్రీదేవి. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) చిత్రంలో వీరి కెమెస్ట్రీకి సినీ అభిమానులు దాసోహం అయ్యారు. ‘అబ్బనీ తియ్యని దెబ్బ’ పాటలో చిరు-శ్రీదేవి వేసిన స్టెప్పులను ఇప్పటికీ టీవీల్లో చూస్తూ ఫిదా అవుతుంటారు. అయితే మూడు దశాబ్దాల తర్వాత వారి వారసులు జత కట్టబోతున్నారు. చిరు తనయుడు రామ్‌చరణ్‌ (Ram Charan) సరసన హీరోయిన్‌గా శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌ నటించబోతోంది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ జోడీ ఒకప్పటి చిరు - శ్రీదేవి జంటను గుర్తు చేస్తుందని ఇప్పటినుంచే అంచనాలు పెరిగిపోయాయి. జత కట్టే సినిమా అదే! రామ్‌చరణ్‌ (Ram Charan) కథానాయకుడిగా బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్‌ డ్రామాగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ క్రమంలో హీరోయిన్‌ను తాజాగా చిత్ర బృందం ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. శ్రీదేవి, బోనీకపూర్‌ల తనయ జాన్వీకపూర్‌ (Janhvi Kapoor)ను చరణ్‌కు జోడీగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీకపూర్‌ (Boney Kapoor) స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.  https://twitter.com/i/status/1759275401048649821 ‘దేవర’ను ఆస్వాదిస్తోంది’ తారక్‌ (Jr NTR) హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ చిత్రంలోనూ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ నటిస్తోంది. ఈ సినిమాపై కూడా జాన్వీ తండ్రి బోనీకపూర్‌ తాజా ఇంటర్యూలో స్పందించారు. ‘దేవర సెట్‌లో ప్రతి క్షణాన్ని మా అమ్మాయి ఆస్వాదిస్తోంది. తన నటన, భాషను పెంచుకునేందుకు వీలు కుదిరినప్పుడల్లా జాన్వీ తెలుగు సినిమాలు చూస్తోంది. ఎన్టీఆర్‌, చరణ్‌ ఇద్దరూ ఇద్దరే. వారి పక్కన నటించడం జాన్వీకి లభించిన మంచి అవకాశం. ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద అదరగొట్టాలని ఆకాంక్షిస్తున్నా. మరిన్ని చిత్రాల్లో నటించే అవకాశం జాన్వీకి రావాలి. నా భార్య శ్రీదేవి పలు భాషల్లో నటించారు. అలాగే నా కుమార్తె కూడా నటించాలి’ అని అన్నారు.  https://twitter.com/i/status/1759489211156341061 సౌత్‌ ఇండస్ట్రీపై జాన్వీ కన్ను! బాలీవుడ్‌లో తొమ్మిదికి పైగా చిత్రాల్లో నటించిన జాన్వీ కపూర్‌కు ఇప్పటివరకూ చెప్పుకోతగ్గ విజయం దక్కలేదు. దీనికి తోడు దీపికా పదుకొనే, అలియా భట్‌, కత్రినా కైఫ్‌, ప్రియాంక చోప్రా వంటి స్టార్‌ హీరోయిన్ల నుంచి జాన్వీ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. దీంతో ఈ భామ దృష్టి దక్షిణాది చిత్ర పరిశ్రమపై పడింది. టాలీవుడ్‌ సహా పలు దక్షిణాది చిత్రాలు పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతుండటంతో వాటిలో నటించడం ద్వారా తన క్రేజ్ పెంచుకోవాలని జాన్వీ భావిస్తోంది. ఈ క్రమంలోనే తారక్‌ సరసన ‘దేవర’, రామ్‌చరణ్‌ చిత్రాలతో పాటు తమిళ స్టార్‌ సూర్యతో కూడా మరో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాలు విజయం సాధిస్తే ఇక తన కెరీర్‌కు ఢోకా ఉండదని ఈ అమ్మడి ప్లాన్‌. జాన్వీ.. మరో శ్రీలీల కానుందా! టాలీవుడ్‌లోని స్టార్‌ హీరోలు అంతా ఇండస్ట్రీలోని టాప్‌ హీరోయిన్లతో దాదాపుగా నటించారు. దీంతో వారితో సినిమాలు రూపొందిస్తున్న డైరెక్టర్లు కొత్త హీరోయిన్‌ను జోడీగా ఎంపిక చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీలీల (Sreeleela)కు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. అంతకు ముందు ఉప్పెన (Uppena Movie) ఫేమ్‌ కృతి శెట్టి (Krithi Shetty)కి సైతం ఈ కోవలోనే అవకాశాలు దక్కాయి. ప్రస్తుతం కృతి శెట్టికి ఛాన్సెస్‌ లేకపోవడం.. శ్రీలీల నటించిన చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ఆడకపోవడంతో దర్శక నిర్మాతల దృష్టి ప్రస్తుతం జాన్వీ కపూర్‌పై పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కుతున్నట్లు సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జాన్వీ కపూర్‌ మరో శ్రీలీలగా మారవచ్చని అంటున్నారు. 
    ఫిబ్రవరి 19 , 2024
    Vyjayanthi Movies Hits : ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ సంస్థ  వైజయంతీ బ్యానర్‌లో ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయా?
    Vyjayanthi Movies Hits : ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ సంస్థ  వైజయంతీ బ్యానర్‌లో ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయా?
    ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం.. థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కల్కి ఈ స్థాయి సక్సెస్‌ సాధించడం వెనక దర్శకుడు నాగ్‌ అశ్విన్‌తో పాటు నిర్మాణ సంస్థ ‘వైజయంతీ మూవీస్‌’ (Vyjayanthi Movies) బ్యానర్‌ పాత్ర కూడా ఎంతో ఉంది. నిర్మాత అశ్వనీ దత్‌ (Aswani Dutt) ఎంతో సాహాసోపేతంగా కల్కి చిత్రాన్ని నిర్మించారు. బడ్జెట్‌ అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. క్వాలిటీ ఔట్‌పుట్‌ ఇవ్వాలన్న లక్ష్యంతో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు బడ్జెట్‌ పరంగా పూర్తి స్వేచ్ఛను కల్పించారు. రూ.600 కోట్లకు పైగా వ్యయంతో ఇండియాలోనే అతి భారీ బడ్జెట్‌ ఫిల్మ్‌గా కల్కిని తీర్చిదిద్దారు. కల్కి లాంటి విజువల్‌ వండర్‌ను అందించిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ పేరు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.  వైజయంతీ మూవీస్‌ ప్రస్థానం అశ్వనీ దత్‌.. నిర్మాతగా తన ప్రస్థానాన్ని అభిమాన హీరో నందమూరి తారక రామారావు ఫిల్మ్‌తోనే ప్రారంభించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ను నిర్మించి దాని లోగోగా కృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీఆర్‌ను పెట్టారు. 1975లో వచ్చిన 'ఎదురులేని మనిషి' చిత్రంతో వైజయంతీ మూవీస్‌ సంస్థ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలినాళ్లలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలను అందించడంలో మాత్రం వెనకడుగు వేయలేదు. ఈ బ్యానర్‌లో వచ్చిన పలు చిత్రాలు టాలీవుడ్‌లో ఎంతో ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేశాయి. ఇంతకీ ఆ బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు ఏంటి? తెలుగు చిత్ర పరిశ్రమలో అవి ఎలాంటి మార్క్‌ను క్రియేట్‌ చేశాయి? ఇప్పుడు చూద్దాం.  అగ్నిపర్వతం వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ‘అగ్నిపర్వతం’ (Agni Parvatam) ఒకటి. ఇందులో సూపర్‌ స్టార్‌ కృష్ణ డబుల్‌ రోల్స్‌ చేయగా.. రాధ, విజయశాంతి హీరోయిన్లుగా కనిపించారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ ఫిల్మ్‌ అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇందులో సూపర్‌ స్టార్‌ కృష్ణ నట విశ్వరూపం చూపించారు. ఈ చిత్రం కృష్ణ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో కృష్ణ దూకుడుగా చెప్పిన ‘అగ్గి పెట్టుందా?’ డైలాగ్‌ అప్పట్లో మారుమోగింది. అలాగే ‘కదులుతున్న అగ్నిపర్వతం’ సాంగ్‌ కూడా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. నటుడిగా సరికొత్త కృష్ణను పరిచయం చేసింది. మూవీ కథ ఏంటంటే.. ‘జమదగ్ని తన తల్లిని విడిచిపెట్టినందుకు అతని తండ్రిని ద్వేషిస్తాడు. అయితే అతని శత్రువులు సమస్య సృష్టించేందుకు జమదగ్ని సవతి సోదరుడిని తెరపైకి తెస్తారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.  https://www.youtube.com/watch?v=FaJqLrjanQM జగదేక వీరుడు అతిలోక సుందరి వైజయంతీ మూవీస్‌ రొటిన్‌ చిత్రాలనే కాకుండా ప్రయోగాత్మక ఫిల్మ్స్‌ కూడా తీయగలదని ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం నిరూపించింది. మెగాస్టార్ కెరీర్‌లో మరుపురాని చిత్రంగా నిలిచిపోయింది. సోషియో ఫాంటసీ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం.. అప్పట్లో కలెక్షన్ల మోత మోగించింది. ఈ చిత్రం విడుదలకు ముందు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను వరదలు అతలాకుతలం చేశాయి. అయినా ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకోవడం విశేషం.  రూ. 2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ ఫిల్మ్‌.. ఆ రోజుల్లో రూ.15 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాకు ఇళయరాజా అందించిన మధురమైన పాటలు ఇప్పటికీ ఎక్కడోచోట మారుమోగుతూనే ఉన్నాయి. కథ ఏంటంటే ‘నలుగురు అనాథలకు ఆశ్రయిమిచ్చిన రాజు.. గైడ్‌గా పనిచేస్తుంటాడు. రాజుకు అనుకోకుండా ఓ రోజు ఇంద్రుడి కుమార్తె ఇంద్రజకు చెందిన ఉంగరం దొరుకుతుంది. ఆ ఉంగరం కోసం ఇంద్రజ తిరిగి భూమి మీదకు వస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.  శుభలగ్నం జగపతిబాబు హీరోగా, ఆమని, రోజా హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం యూనిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. భార్య భర్తలు సంతోషంగా జీవించడానికి డబ్బుతో సంబంధం లేదని నిరూపించింది. డబ్బు కోసం భర్తనే అమ్మేసిన భార్య.. చివరికి మారి భర్తను ఎలా దక్కించుకుంది? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీలోని ‘చిలకా ఏ తోడు లేక’ అనే పాటకు ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెలకు నంది పురస్కారం రావడం విశేషం. కథ ఏంటంటే.. ‘డబ్బుపై ఆశతో రాధ తన భర్తను ధనవంతురాలైన లతకు ఇచ్చి పెళ్లి చేస్తుంది. ఫలితంగా ఆమెకు కోటి రూపాయలు లభిస్తాయి. అయితే కాలక్రమంలో భర్త తోడు లేని జీవితం వృథా అని భావిస్తుంది’. గోవిందా గోవిందా నాగార్జున - రామ్‌ గోపాల్‌ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన 'గోవిందా గోవిందా'.. అప్పట్లో బ్లాక్‌ బాస్టర్ సక్సెస్‌ అందుకుంది. వెంకటేశ్వర స్వామి కిరీటం చుట్టూ తిరిగే ఈ సినిమా కథ తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. ఇందులో శ్రీదేవి తెలుగు ఆడియన్స్‌ ఎంతగానో మిస్మరైజ్‌ చేశారు. కథ ఏంటంటే.. ‘భగవంతుడైన వేంకటేశ్వరుడు.. దైవిక ఆయుధాన్ని ఉపయోగించి భూమిపై గందరగోళ పరిస్థితిని పరిష్కరించాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఈ ఆయుధంపై ఉన్న ఆభరణాలను కొంతమంది దుండగులు దొంగిలించినప్పుడు పరిస్థితి దిగజారుతుంది’. ఓటీటీ వేదిక : సన్‌ నెక్స్ట్‌ రాజకుమారుడు వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ ద్వారానే సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా పరిచయం చేశారు. కథానాయకుడిగా అతడి ఫస్ట్‌ ఫిల్మ్‌ 'రాజకుమారుడు'ను కల్కి నిర్మాత అశ్వనీదత్‌ నిర్మించారు. ఈ సినిమాకు ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు సైతం వచ్చింది. చాలా సెంటర్లలో ఈ సినిమా 100 రోజులకు పైగా ఆడింది. ప్లాట్ ఏంటంటే.. 'సెలవులను ఎంజాయ్‌ చేయడానికి వచ్చిన రాజ్‌.. రాణిని చూసి ప్రేమలో పడతాడు. అయితే కుటుంబం ఒత్తిడితో ఆమె ప్రేమను వదులుకుంటాడు. ఇంతకి రాణి ఎవరు? ఆమె ఫ్యామిలీతో రాజ్‌ కుటుంబానికి ఉన్న వైరం ఏంటి? చివరికి వారు ఎలా ఒక్కటయ్యారు?' అన్నది కథ.  ఇంద్ర మెగాస్టార్‌ చిరంజీవి క్రేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిన చిత్రంగా 'ఇంద్ర'కు పేరుంది. ఈ సినిమాలో చిరు.. తొలిసారి ఫ్యాక్షనిస్టు పాత్ర పోషించారు. నిర్మాత అశ్వనీదత్‌కు ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. 2002లో ఉత్తమ నటుడిగా చిరంజీవికి నంది పురస్కారం వచ్చేలా చేసింది. 'రాయలసీమలో రెండు కుటుంబాల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతుంటుంది. ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యర్థుల చెల్లెలితో ఇంద్ర పెళ్లికి అంగీకరిస్తాడు. కట్‌ చేస్తే సాధారణ జీవితం కోసం ఇంద్ర మారుపేరుతో కాశీకి వెళ్లిపోతాడు. ఇంద్ర కాశీకి ఎందుకు వెళ్లాడు? తిరిగి ప్రత్యర్థులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు?' అన్నది కథ. స్టూడెంట్‌ నెంబర్‌ 1 దర్శకధీరుడు రాజమౌళిని నిర్మాత అశ్వని దత్‌ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తారక్‌ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన మెుట్ట మెుదటి చిత్రం 'స్టూడెంట్‌ నెం.1' అశ్వనీదత్‌ నిర్మాత. వైజయంతీ మూవీస్‌ సబ్‌ బ్యానర్‌ అయి స్వప్న సినిమాస్‌ ఈ మూవీని తెరకెక్కించింది. ఈ సినిమా 73 కేంద్రాల్లో 50 రోజులు, 42 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ప్రదర్శించబడింది. ఈ సినిమాని రూ.1.85 కోట్లతో నిర్మించగా రూ.12 కోట్లు వసూలు చేసింది. కథ ఏంటంటే.. ‘ఆదిత్యకు ఇంజినీర్ కావాలని కోరిక. కానీ అతని తండ్రి లాయర్ కావాలని ఆదేశిస్తాడు. అయితే లా చదవడం ఇష్టం లేని ఆదిత్య పరీక్ష రాసేందుకు వెళ్లే క్రమంలో ఓ అమ్మాయిని రక్షించబోయి సమస్యల్లో పడతాడు. ఆదిత్య తండ్రి అతన్ని ఇంటి నుంచి గెంటేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.  మహర్షి మహేష్‌ బాబు హీరోగా పూజా హెగ్డే, అల్లరి నరేష్‌ ప్రధాన పాత్రల్లో చేసిన మహార్షి చిత్రానికి.. అశ్వనీ దత్‌ సహా నిర్మాతగా వ్యవహరించారు. 2019 సంవత్సరానికి గాను 10 విభాగాల్లో విభాగాల్లో సైమా అవార్డ్స్‌ నామినేట్‌ కాగా.. అందులో 5 పురస్కారాలను మహర్షి కైవసం చేసుకోవడం విశేషం. ‘రిషి (మహేష్‌) ఓ మల్టీ నేషనల్‌ కంపెనీకి సీఈవోగా ఉంటాడు. కాలేజీ రోజుల్లో తన కోసం ఫ్రెండ్‌ రవి  చేసిన త్యాగం గురించి తెలుసుకుంటాడు. అతడ్ని వెతుక్కుంటూ ఊరికి వెళ్లిన రిషికి అతడు సమస్యల్లో ఉన్నట్లు తెలుస్తుంది. అప్పుడు రిషి తన ఫ్రెండ్‌ కోసం ఏం చేశాడు? ఎలా అండగా నిలబడ్డాడు?’ అన్నది కథ. ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ సీతారామం 2022లో తెరకెక్కిన సీతారామం చిత్రం.. ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నిర్మాతగా అశ్వని దత్‌ వ్యవహరించారు. ఈ సినిమాతో మృణాల్‌ ఠాకూర్‌ రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. రూ.30 కోట్లతో తెరకెక్కిన సీతారామం చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ.91-98 కోట్లు కొల్లగొట్టింది. ప్లాట్‌ ఏంటంటే.. ‘ఆర్మీ అధికారి రామ్ (దుల్కర్‌ స‌ల్మాన్‌) ఓ అనాథ. ఆ విషయాన్ని రేడియోలో చెప్పినప్పటి నుంచి అతడికి ఉత్తరాలు వెల్లువెత్తుతాయి. పెద్ద కుటుంబం ఏర్పడుతుంది. ఓ అమ్మాయి మాత్రం నీ భార్య సీతామ‌హాల‌క్ష్మి (మృణాల్ ఠాకూర్‌) అని సంబోధిస్తూ ఉత్తరాలు రాస్తుంటుంది. ఇంత‌కీ ఈ ఆమె ఎవ‌రు? అనాథ అయిన రామ్‌కు భార్య ఎక్కడి నుంచి వ‌చ్చింది? ఆమెని క‌లుసుకునేందుక‌ని వ‌చ్చిన రామ్‌కు ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి?’ అనేది కథ. ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ & హాట్‌స్టార్‌ కల్కి 2898 ఏడీ నిర్మాత అశ్వని దత్‌.. ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని నిర్మించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై వచ్చిన అతి భారీ బడ్జెట్‌ చిత్రం ‘కల్కి’ కావడం విశేషం. ఈ సినిమాను మైథాలిజీ & ఫ్యూచరిక్‌ జానర్లలో నిర్మించారు. ఇందులో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామ పాత్ర పోషించిగా.. విలన్‌గా కమల్‌ హాసన్‌ చేశారు. దిశాపటానీ, దీపిక పదుకొణె ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.  వైజయంతీ మూవీస్‌ సబ్‌ బ్యానర్స్‌లో వచ్చిన హిట్‌ చిత్రాలు బాణం అశ్వని దత్‌ కుమార్తె ప్రియాంక దత్‌.. త్రీ ఎంజెల్స్ బ్యానర్‌పై తొలిసారి బాణం చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ ద్వారా నారా రోహిత్‌ హీరోగా పరిచయం అయ్యారు. ప్లాట్‌ ఏంటంటే.. ‘మాజీ నక్సలైట్ కొడుకు అయిన భగత్ ఒక చిన్న పట్టణంలో నివసిస్తుంటాడు. స్థానిక గ్యాంగ్‌స్టర్ దౌర్జన్యాల నుంచి ప్రజలను కాపాడేందకు IPS అధికారి కావాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా? లేదా?’ అన్నది కథ. సారొచ్చారు ప్రియాంక దత్‌ నిర్మించిన ఈ సినిమా.. ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంది. ఇందులో రవితేజ, కాజల్‌  రిచా గంగోపాథ్యాయ ప్రధాన పాత్రలు పోషించారు. ప్లాట్‌ ఏంటంటే.. 'సంధ్య కార్తిక్‌ను ప్రేమిస్తుంది. అయితే అతడికి ఇదివరకే పెళ్లైన విషయాన్ని తెలుసుకుంటుంది. ఇంతకీ కార్తిక్‌ గతం ఏంటి? కార్తిక్, సంధ్య కలిశారా? లేదా?’ అన్నది స్టోరీ. ఓటీటీ వేదిక : హాట్‌స్టార్‌ & ఆహా Sir Ocharu Movie Posters TollywoodAndhra.in ఎవడే సుబ్రహ్మణ్యం కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన మెుట్టమెుదటి ఫిల్మ్‌ 'ఎవడే సుబ్రహ్మణ్యం'. ఇందులో నాని, విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ టాలెంటెడ్‌ డైరెక్టర్‌గా నాగ్ అశ్విన్‌కు గుర్తింపు తీసుకొచ్చింది. ప్లాట్ ఏంటంటే.. ‘మెటీరియలిస్టిక్ స్వభావం కలిగిన సుబ్రమణ్యం జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు హిమాలయాలకు వెళ్తాడు. ఈ క్రమంలో అనుబంధాల పట్ల తన వైఖరిని మార్చుకుంటాడు’. ఓటీటీ వేదిక : సన్‌ నెక్స్ట్‌ మహానటి అశ్వని దత్‌ రెండో కుమార్తె స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి కూడా కల్కి ఫేమ్‌ నాగ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. స్వప్న సినిమా బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం.. మహానటి సావిత్రి జీవత కథ ఆధారంగా తెరకెక్కింది. ‘సావిత్రి ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టారు? నటుడు జెమినీ గణేషన్‌ ఆమె జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించారు? జీవత చరమాంకంలో ఆమె ఎలాంటి కష్టాలు అనుభవించారు?’ అన్నది స్టోరీ.  ఓటీటీ వేదిక :  అమెజాన్‌ ప్రైమ్‌ జాతి రత్నాలు వైజయంతి మూవీస్‌ సబ్‌ బ్యానర్‌ అయిన 'స్వప్న సినిమా'.. జాతిరత్నాలు మూవీని నిర్మించింది. ప్లాట్‌ ఏంటంటే.. ‘మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారు’ అనేది కథ. ఓటీటీ వేదిక :  అమెజాన్‌ ప్రైమ్‌
    జూన్ 29 , 2024
    Project K Glimpse: నిమిషం వీడియోతో సినిమా మెుత్తం చెప్పేశారు భయ్యా..! ‘కల్కి 2898 AD’లో జరగబోయేది ఇదే?
    Project K Glimpse: నిమిషం వీడియోతో సినిమా మెుత్తం చెప్పేశారు భయ్యా..! ‘కల్కి 2898 AD’లో జరగబోయేది ఇదే?
    నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పఠాని, కమల్ హాసన్.. ఇలా స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ కాలిఫోర్నియాలోని శాన్‌ డియాగాలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ ‘కామిక్ కాన్’లో రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న మొదటి ఇండియన్ సినిమాగా ‘ప్రాజెక్ట్ K’ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్, కమల్ హాసన్ పాల్గొన్నారు. గ్లింప్స్‌ చెప్పే సీక్రెట్స్ ఇవే! కాగా, ప్రాజెక్ట్‌ K సినిమాకు టైటిల్ చాలా మంది ఊహించినట్టే కల్కి అని పెట్టారు. ఇక సినిమా టైటిల్ కింద ‘2898 AD’ అని పెట్టారు. అంటే కలియుగాంతం చివర్లో జరిగే కథ అని డైరెక్టర్‌ చెప్పకనే చెప్పాడు. గ్లింప్స్ చూస్తే సాధారణంగా ప్రపంచాన్ని చీకటి కమ్ముకున్నప్పుడు ఒక వెలుగు వస్తుంది అని, ప్రపంచాన్ని విలన్ తన గుప్పిట్లోకి తీసుకున్నప్పుడు కల్కి ఉద్భవిస్తాడని, ప్రజల్ని కాపాడతాడని తెలుస్తుంది. అయితే గ్లింప్స్‌ను మరింత పరిశీలనగా చూస్తే చాలా విషయాలు మనకు అర్థమౌతాయి. కలియుగాంతం సమయంలో ఈ ప్రపంచం పూర్తిగా రోబోల మయంగా, ఆధునిక ఆయుధాలతో యుద్ధం జరిగే స్థాయికి వెళ్తుందని గ్లింప్స్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పైగా 2898 ADలో ప్రస్తుత స్థాయిలో జనాభా కాకుండా చాలా కొద్దిమంది ప్రజలే ఉండొచ్చని భావించవచ్చు. వారంతా ఓ వ్యక్తి (రాజు) పాలనలో జీవిస్తుండవచ్చు. https://twitter.com/DEADLINE/status/1682221771154677760?s=20 అమితాబ్‌ పాత్ర నిడివి తక్కువేనా? ప్రాజెక్ట్‌లో Kలో రాజు (అమితాబ్‌ బచ్చన్‌) తన ప్రజలని పాలిస్తుంటే ఒక విలన్ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. ఆ రాజుని బంధించి అతని ప్రజలని విలన్ తనకు బానిసలుగా చేసుకున్నట్లు గ్లింప్స్‌లో కనిపిస్తోంది. అలాంటప్పుడు రాజు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతాడు. ఆ సమయంలో వారిని ఆదుకునేందుకు కల్కి అవతారంలో హీరో (ప్రభాస్‌) ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. మూవీలో అయితే మొదట అమితాబ్ వచ్చి ఆ తర్వాత ప్రభాస్ వస్తాడని అర్థం చేసుకోవచ్చు. శివాలయంలోకి ఓ రోబో రావడం గ్లింప్స్‌లో చూశాం. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడి క్యారెక్టర్‌లో అమితాబ్ నటిస్తున్నట్లు టాక్.  https://twitter.com/DEADLINE/status/1682129398600966146?s=20 ప్రభాస్ అందుకే కల్కి అవుతాడా? ఇక ప్రాజెక్ట్ K అంటే ‘ప్రాజెక్ట్ కల్కి’ అని, ప్రభాస్‌తో లోకాన్ని కాపాడించడానికి కొంతమంది చేసే యుద్ధమని గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. నిమిషం వీడియోతో డైరెక్టర్‌ నాగ్ అశ్విన్ ఇండైరెక్ట్‌గా కథ మెుత్తం రివీల్ చేసినట్లు అర్థమవుతోంది. ఇక కొంచెం డీటేలింగ్‌లోకి వెళ్తే అమితాబ్‌ బచ్చన్‌తో పాటు హీరోయిన్‌ దీపికా పదుకొణేను కూడా విలన్లు బంధించినట్లు గ్లింప్స్‌లో చూపించారు. దీన్ని బట్టి ప్రభాస్‌ ఆమె కోసం వచ్చి కల్కి లాగా మారతాడా? అన్న సందేహం కూడా ఉత్పన్నమవుతుంది. లేదా హీరోయిన్‌ను కాపాడే క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా దీపికా, ప్రభాస్‌ మధ్య ప్రేమ సన్నివేశాలను కూడా బాగా ఎలివేట్‌ చేయాలని డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ భావిస్తున్నారు.  చీకటికి రారాజు అతడే? ఇకపోతే ఈ సినిమాలో లోక నాయకుడు కమల్‌ హాసన్‌ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రతినాయకుడిగా కనిపిస్తాడని మెున్నటి వరకూ ఊహాగానాలు వినిపించినా తాజాగా విడుదలైన గ్లింప్స్‌ వీడియోతో ‌అది కన్‌ఫార్మ్‌ అయింది. ఎందుకంటే ప్రాజెక్ట్‌Kలో కమల్‌ హాసన్‌ నటించనున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించిన సమయంలో ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు. 'భూమి మెుత్తాన్ని కమ్మేసే షాడో (చీకటి) కోసం వెతికామని.. ఆ పాత్ర చేయగల ఒకే ఒక్కడు దొరికేశాడు' అని కమల్‌ గురించి ప్రకటించారు. తాజా గ్లింప్స్‌ కూడా భూమిని చీకటి కమ్మేయడం గమనించవచ్చు. ఈ రెండు కలిపి చూస్తే ఇందులో విలన్లకు రారాజుగా కమల్‌ హాసన్‌ కనిపిస్తాడని అర్థం చేసుకోవచ్చు.  https://twitter.com/i/status/1672854637014138880 సూపర్ రెస్పాన్స్ గ్లింప్స్‌ని చూస్తుంటే గూస్‌బమ్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ వెల్లడిస్తున్నారు. విజువల్ వండర్‌గా, హాలీవుడ్ రేంజ్ సినిమాని తలపిస్తోందని చెబుతున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ విజనరీకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇక, సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. మళ్లీ మళ్లీ వినాలనిపించే ట్రాక్‌ని అందించాడు. గ్లింప్స్ చూశాక మ్యూజిక్ హాంట్ చేస్తూనే ఉంటుందంటే అతిశయోక్తి కాదు.  https://twitter.com/THR/status/1682126315229683715?s=20 విడుదల తేదీ? ముందుగా అనౌన్స్ చేసిన ప్రకారం ఈ మూవీ 2024 సంక్రాంతికి రిలీజ్ కావాలి. అయితే, గ్లింప్స్‌లో కేవలం 2024లో వస్తుందనే ఇచ్చారు. అంటే, మూవీ డేట్ మారుతుందనే సంకేతాలు ఇచ్చారు. మరి, జనవరి 12న కాకుండా సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే టాక్ నడుస్తోంది. నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మూవీస్‌కి అచ్చొచ్చిన ‘మే9’న కల్కిని కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ రోజున జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి సినిమాలు ఇదే రోజున రిలీజ్ అయ్యాయి. https://www.youtube.com/watch?v=bC36d8e3bb0
    జూలై 21 , 2023
    Raghavendra Rao: దర్శకేంద్రుడు సినిమాల్లోని టాప్‌-10 రొమాంటిక్‌ పాటలు.. బాబోయ్‌ మరీ ఇంత హాాటా!
    Raghavendra Rao: దర్శకేంద్రుడు సినిమాల్లోని టాప్‌-10 రొమాంటిక్‌ పాటలు.. బాబోయ్‌ మరీ ఇంత హాాటా!
    తెలుగులోని దిగ్గజ దర్శకుల్లో దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు ఒకరు. రొమాంటిక్ సాంగ్స్‌ను తెరకెక్కించడంలో ఆయనకు సాటి ఎవరూ లేరు. హీరోయిన్స్ బొడ్డు, నడుముపై పళ్ళు, పూలు విసిరితే ఎంత రొమాంటిక్‌గా ఉంటుందో రాఘవేంద్ర రావు తన పాటల్లో చూపించారు. అలనాటి నటి శ్రీదేవి నుంచి ఇప్పటి శ్రీలీల వరకూ ఎంతో మంది హీరోయిన్లతో ఆయన సూపర్ హిట్‌ రొమాంటిక్ పాటలు తీశారు. ఇవాళ దర్శకేంద్రుడి పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమాల్లోని టాప్‌-10 రొమాంటిక్ సాంగ్స్‌ మీకోసం.. 1. ఈ గాలిలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘అగ్ని పర్వతం’ చిత్రం సూపర్‌ స్టార్‌ కృష్ణ కెరీర్‌లోనే ఒక చిరస్మరణీయ విజయంగా మిగిలిపోయింది. ఈ సినిమాలోని ‘ఈ గాలిలో’ పాట అప్పట్లో ఒక ట్రెండ్‌ సెట్టర్‌ అని చెప్పొచ్చు. కృష్ణ ఫొటోలతో ఈ పాట సాగుతుంది. ఓ సీన్‌లో హీరోయిన్‌ విజయశాంతి కృష్ణ ఫొటోపై పడుకొని అతని కోసం కళ్లతో వెతుకుతూ పాడుతుంటుంది. ఆమె తన తలను పైకి ఎత్తి కిందకి చూసే సరికి ఫొటో ప్లేస్‌లో కృష్ణ కనిపిస్తారు. రాఘవేంద్రరావు సృజనాత్మకత ఏ పాటిదో ఈ ఒక్క సీన్‌ తెలియజేస్తుంది.  https://www.youtube.com/watch?v=MceWRlMzHYo 2. అబ్బని తియ్యని దెబ్బ చిరంజీవి - శ్రీదేవి జంటగా చేసిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా అప్పట్లో బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది. డైరెక్టర్‌ రాఘవేంద్రరావుతో పాటు చిరంజీవికి మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులోని ‘అబ్బని తియ్యని దెబ్బ’ పాట ఇప్పటికీ ఎంతో పాపులర్‌. చిరంజీవి, శ్రీదేవి వేసే రొమాంటిక్ స్టెప్పులను చూసి ఈ జనరేషన్‌ వారు కూడా ఎంతగానో ఎంజాయ్‌ చేస్తుంటారు. ఈ పాటలో శ్రీదేవి ఎంతో అందంగా కనిపిస్తుంది.  https://www.youtube.com/watch?v=zloL0fdu5aM 3. మా పెరటి జామ చెట్టు పెళ్లిసందడి సినిమాలోని ‘మా పెరటి జామ చెట్టు’ పాట అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ పాటలో హీరోయిన్‌ రవళిని దర్శకేంద్రుడు ఎంతో అందంగా చూపించారు. రవళి బొడ్డుపై జామ పండు పడినప్పుడు ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఆడియన్స్‌ ఫ్లాట్ కావాల్సిందే.  https://www.youtube.com/watch?v=e92ff-s1yRk 4. రోజ్‌ రోజ్‌ రోజా పువ్వా అల్లరి ప్రియుడు సినిమాలోని ‘రోజ్‌ రోజ్‌ రోజా పువ్వా’ సాంగ్‌ రాఘువేంద్రరావు సినిమాల్లోని టాప్‌-5 సూపర్‌ హిట్ సాంగ్స్‌లో ఒకటిగా కచ్చితంగా ఉంటుంది. ఈ పాటలో రమ్యకృష్ణ అందాన్ని ఎంత పొగిడినా తక్కువే. దర్శకేంద్రుడు ఆమెను పాలరాతి శిల్పంలా చూపించారు. పాట మెుత్తాన్ని పూలతో నింపేశారు.  https://www.youtube.com/watch?v=S1X_-z7JTcE 5. సై సై సయ్యారే ‘ఘరానా బుల్లోడు’ సినిమాలోని ‘సై సై సయ్యారే’ పాటను కూడా రాఘవేంద్రరావు చాలా రొమాంటిక్‌గా తీశారు. కుండలు, గొడుగులను సెట్‌ ప్రొపార్టీలుగా ఉపయోగించుకొని పాటను తెరకెక్కించారు.  ఈ పాటలో నాగార్జున, రమ్యకృష్ణ కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.  https://www.youtube.com/watch?v=lRc1LOiYthY 6.  భీమవరం బుల్లోడా ‘ఘరానా బుల్లోడు’ సినిమాలోని ‘భీమవరం బుల్లోడా’ పాట కూడా చాలా పాపులర్ అయ్యింది. ఈ పాట మెుత్తం స్టీల్‌ బిందెలే కనిపిస్తాయి. నాగార్జున, ఆమని డ్యాన్స్ అలరిస్తుంది.  https://www.youtube.com/watch?v=kQD5NHAxtXk 7. మీనా మీనా ‘సాహసవీరుడు సాగర కన్య’ సినిమాలోని ‘మీనా మీనా’ పాట రాఘవేంద్రరావు సృజనాత్మకతకు అద్దం పడుతుంది. శిల్పా శెట్టి నడుముపై వెంకటేష్‌ ముత్యాలు వేసే సీన్‌ దర్శకేంద్రుడి మార్క్‌ను చూపిస్తుంది.  https://www.youtube.com/watch?v=X-37Hz673RE 8. అస్మదీయ  అన్నమయ్య లాంటి భక్తిరస చిత్రంలోనూ దర్శకేంద్రుడు తన మార్క్‌ను విడిచిపెట్టలేదు. మోహన్‌ బాబు, రోజాల మధ్య వచ్చే ‘అస్మదీయ’ పాటలో మళ్లీ పండ్లకు పని చెప్పారు. ద్రాక్ష పండ్ల నడుమ రోజా నడుమును చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.  https://www.youtube.com/watch?v=4YRwSezPqmE 9. చాలు చాలు శ్రీరామదాసు సినిమాలోని ‘చాలు చాలు’ పాట కూడా రాఘవేంద్రరావు రొమాంటిక్ పాటలలో ముందు వరుసలో ఉంటుంది. ఈ పాటలో నాగార్జున, స్నేహా మధ్య కెమెస్ట్రీ అద్భుతంగా పండింది.  https://www.youtube.com/watch?v=xj5yoitVQTQ 10. గందర్వ లోకాల రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ‘పెళ్లి సందD’ సినిమాలోనూ ఆయన మార్క్‌ కనిపించింది. హీరోయిన్‌ శ్రీలీలను గందర్వ లోకాల పాటలో ఎంతో ‌అద్భుతంగా చూపించారు. పైనుంచి దిగొచ్చిన దేవకన్యలా శ్రీలీల కనిపిస్తుంది.  https://www.youtube.com/watch?v=0d3ktyClW8Q
    మే 23 , 2023
    Hanuman Roles: హునుమంతుడి పాత్రలో మెప్పించిన తెలుగు హీరోలు తెలుసా? 
    Hanuman Roles: హునుమంతుడి పాత్రలో మెప్పించిన తెలుగు హీరోలు తెలుసా? 
    రామాయణం కథాంశంలో ఎన్నో సినిమాలు సినీ ప్రేక్షకులను అలరించాయి. రాముడు, సీతా, లక్ష్మణుల పాత్రలో కనిపించి చాలా మంది నటులు మెప్పించారు. అయితే రామాయణంలో హనుమంతుడి పాత్ర ఏంతో కీలకమైంది. సీతను ఎత్తుకెళ్లిన రావణాసురుడి వద్దకు రామయ్యను తీసుకెళ్లడంలో ఆంజనేయుడు కీలకభూమిక పోషించాడు. అటువంటి ఆంజనేయ పాత్రను సినిమాల్లో అద్భుతంగా పండించిన నటులను ఇప్పుడు చూద్దాం.  తేజ సజ్జ: యంగ్‌ హీరో తేజ సజ్జ నటించిన హనుమాన్‌ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో తేజ ఆంజనేయుడు పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన  టీజర్‌, ప్రచార చిత్రాలు హనుమాన్‌ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశాయి. ప్రశాంత్‌ వర్మ డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది మే 12న విడుదల కానుంది.  https://youtu.be/AvjvZ7q2apE దేవ్‌దత్తా నాగే: అత్యంత భారీబడ్జెట్‌తో రూపొందుతున్న ఆదిపురుష్‌ చిత్రంలో రాముడి పాత్రను ప్రభాస్ పోషిస్తున్నాడు. ఇందులో ఆంజనేయుడి పాత్రలో దేవ్‌దత్తా నాగే నటిస్తున్నాడు. బాలీవుడ్‌లో సంఘర్ష్‌, సత్యమేవ జయతే, తానాజీ సినిమాల్లో దేవ్‌దత్తా నటించాడు. ఆయా సినిమాల్లో అద్బుతంగా చేయడంతో ఆదిపురుష్‌లో అత్యంత కీలకమైన హనుమాన్ పాత్ర దేవ్‌దత్తాకు దక్కింది.  చిరంజీవి: జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఓ సీన్‌లో ఆంజనేయుడిగా కనిపిస్తాడు. చిరు ఆంజనేయుడి వేషంలో కనిపించడం అదే తొలిసారి. హనుమాన్‌గా చిరు సరిగ్గా సరిపోయారని అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. ఓ సందర్భంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయుడికి తనకు మధ్య ఉన్న పోలికలను చూపూతూ ట్వీట్లు కూడా మన మెగాస్టార్ చేశారు. https://twitter.com/KChiruTweets/status/1247698208077172736?s=20 https://twitter.com/KChiruTweets/status/1247705832940175360?s=20 https://twitter.com/KChiruTweets/status/1247713378988154881?s=20 https://twitter.com/KChiruTweets/status/1247713383069159424?s=20 https://youtu.be/BfJRVxeIKD8 అర్జున్‌: నితిన్‌ హీరోగా చేసిన ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో అర్జున్‌ హనుమాన్‌ పాత్రను పోషించాడు. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎంతటి కఠినమైన రోల్‌ అయినా అలవోకగా చేయగలనని అర్జున్‌ ఈ సినిమా ద్వారా నిరూపించారు. రాజేంద్ర ప్రసాద్‌: నటుడు రాజేంద్ర ప్రసాద్‌ కూడా దేవుళ్లు సినిమాలో ఆంజనేయుడిగా కనిపించి ఆశ్చర్యపరిచాడు. అయితే ఆంజనేయుడి మేకప్‌లో కనిపించనప్పటికీ మారువేషంలో ఉన్న హనుమాన్‌గా ఆయన కనిపిస్తారు. రాజేంద్ర ప్రసాద్ చుట్టూ పాడే ‘అందరి బంధువయా’ పాట చాలా ఫేమస్‌ అయ్యింది.  విందు దర సింగ్‌: సినిమాల్లో ఆంజనేయుడు పాత్ర అంటే ముందుగా గుర్తుకువచ్చేది ‘విందు దర సింగ్‌’. రామాయణం కథాంశంతో తెరకెక్కిన చాలా సినిమాల్లో ఆయన హనుమాన్‌గా కనిపించారు. తెలుగు విడుదలైన శ్రీ రామదాసు చిత్రంలో కూడా హనుమంతుడి పాత్రలో కనిపించి విందు దర సింగ్ మెప్పించాడు.
    ఏప్రిల్ 04 , 2023
    Memorable Villains in Telugu Cinema: టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే విలన్‌ పాత్రలు ఇవే!
    Memorable Villains in Telugu Cinema: టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే విలన్‌ పాత్రలు ఇవే!
    సాధారణంగా ప్రతీ సినిమాలో హీరోతో సమానంగా విలన్‌ పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. విలన్‌ రోల్‌ ఎంత బలంగా ఉంటే కథాయనాయకుడి పాత్ర అంత బాగా ఎలివేట్ అవుతుంది. కాబట్టి టాలీవుడ్‌ దర్శకులు హీరోతో పాటు విలన్‌ క్యారెక్టర్‌ డిజైన్‌పైనా ప్రత్యేకంగా శ్రద్ధా వహిస్తుంటారు. విలన్ రోల్ క్లిక్‌ అయ్యిందంటే ఆటోమేటిక్‌గా హీరోకి ఎలివేషన్‌ లభించి సినిమా హిట్‌ అవుతుందని వారి నమ్మకం. అయితే ఇప్పటివరకూ టాలీవుడ్‌లో కొన్ని వందల చిత్రాలు వచ్చినప్పటికీ కొన్ని విలన్ పాత్రలే ప్రేక్షకుల మదిలో బలమైన ముద్ర వేశాయి. అటువంటి పాత్రలను You Say ఈ ప్రత్యేక కథనం ద్వారా మీ ముందుకు తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.  భిక్షు యాదవ్‌ (Sye) రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘సై’ చిత్రంలో హీరో నితిన్‌ పాత్ర కంటే.. విలన్‌ బిక్షు యాదవ్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రతినాయకుడి పాత్రలో ప్రదీప్‌ రావత్‌ (Pradeep Rawat) తన లుక్‌తోనే భయపెట్టేలా ఉంటాడు. ముక్కుకు రింగ్‌ తగిలించుకొని నిజమైన విలన్‌గా కనిపిస్తాడు. ఈ పాత్ర ప్రదీప్‌ రావత్‌ కెరీర్‌ను మలుపుతిప్పింది.  https://youtu.be/2JyoOhxNpGk?si=K9os2WSarS60Wz5b అలీభాయ్‌ (Pokiri) పోకిరిలో మహేష్‌ బాబు (Mahesh Babu) తర్వాత అందరికీ గుర్తుండిపోయే రోల్‌ ప్రకాష్‌ రాజ్‌ (Prakash Raj) చేసిన అలీభాయ్‌ పాత్ర. మాఫియా డాన్‌గా పవర్‌ఫుల్‌గా కనిపిస్తూనే ప్రకాష్‌ రాజ్‌ తనదైన డైలాగ్స్‌తో నవ్వులు పూయించాడు. ఈ పాత్ర తన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రకాష్‌ రాజ్‌ ఓ సందర్భంలో చెప్పడం విశేషం.  https://youtu.be/4xhZMkerEtE?si=rz8Z19xEeNxXIefV భల్లాలదేవ (Baahubali) రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ చిత్రంలో రానా (Rana Daggubati) చేసిన ‘భల్లాల దేవ’ పాత్ర ప్రతీ ఒక్కరినీ అలరించింది. కుట్రలు, కుతంత్రాలు పన్నే రాజు పాత్రలో అతడు కనిపించాడు. కండలు తిరిగిన దేహంతో బాహుబలి (ప్రభాస్‌)ని ఎదిరించి నిలుస్తాడు. భల్లాల దేవ తరహా పాత్ర ఇప్పటివరకూ తెలుగులో రాలేదని చెప్పవచ్చు.  https://youtu.be/2dFeczHMf58?si=8UKU0_h7Q0qrIGPv పశుపతి (Arundhati) తెలుగులో అతి భయంకరమైన విలన్‌ పాత్ర ఏది అంటే ముందుగా ‘అరుంధతి’ చిత్రంలోని పశుపతినే గుర్తుకు వస్తాడు. ఈ పాత్రలో సోనుసూద్‌ (Sonu Sood) పగ తీరని పిశాచిలా నటించాడు. అరుంధతి (అనుష్క)ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. పశుపతి పాత్ర చాలా భయంకరంగా ఉంటుంది.  https://youtu.be/aJV6JIswFYw?si=JZdCFz_l2XYuNRj3 కాట్‌రాజ్‌ (Chatrapathi) ఛత్రపతి సినిమాలో కాట్‌రాజ్‌ పాత్ర కూడా చూడటానికి చాలా క్రూయిల్‌గా ఉంటుంది. శ్రీలంక నుంచి వలస వచ్చిన వారిపై జులుం ప్రదర్శించే పాత్రలో సుప్రీత్‌ రెడ్డి (Supreeth Reddy) జీవించేశాడు. ఈ సినిమా తర్వాత అతడికి ఇండస్ట్రీలో వరుస అవకాశాలు చుట్టుముట్టాయి.  https://youtu.be/QLc8I_WIFnE?si=4TYG9WD6BUUG9ZS9 పండా (Gharshana) ఘర్షణ సినిమాలో డీసీపీ రామచంద్ర పాత్రలో హీరో వెంకటేష్‌ (Venkatesh) చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడు. అతడ్ని ఢీకొట్టే ప్రతినాయకుడి రోల్ పండా కూడా అదే విధంగా ఉంటుంది. గ్యాంగ్‌స్టర్‌ అయిన పండా పాత్రలో నటుడు సలీం బైజ్ (Salim Baig) అద్భుతంగా నటించాడు.  https://youtu.be/C15GczxdDWk?si=bCbFuf4jMA-Ku9Ml మద్దాలి శివారెడ్డి (Race Gurram) రేసుగుర్రం చిత్రంలోని మద్దాలి శివారెడ్డి కూడా తెలుగులో ఎప్పటికీ గుర్తుండిపోయే విలన్‌. అల్లు అర్జున్‌ చేతిలో దెబ్బలు తిని.. మంత్రి అయిన తర్వాత హీరోపై రీవేంజ్‌ తీర్చుకునే తీరు బాగుంటుంది. నటుడు రవి కిషన్‌ (Ravi Kishan) ఈ పాత్రలో ఎంతో విలక్షణంగా నటించాడు.  https://youtu.be/1eI5MaEPH24?si=akVQ_0ky0sQvA__H వైరం ధనుష్‌ (Sarrainodu) బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు’ చిత్రంలో హీరో ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) తొలిసారి విలన్‌గా నటించాడు. సీఎం కొడుకు అయిన వైరం ధనుష్‌ పాత్రలో చాలా క్రూయల్‌గా చేశాడు.  https://youtu.be/8-Dv9v3jlO4?si=O7-sqHVCz7MS0Usw భవాని (Siva) శివ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. భవాని అనే విలన్‌ పాత్ర కూడా అప్పటి ప్రతినాయకుడి రోల్స్‌కు చాలా భిన్నంగా ఉంటుంది. విలన్‌ అంటే కోరమీసాలు, గంభీరమైన గొంతు, పెద్ద పెద్ద డైలాగ్స్‌ అవసరం లేదని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) ఈ సినిమాతో నిరూపించాడు. భవాని పాత్రతో నటుడు రఘువరన్‌ (Raghuvaran) స్టార్‌ విలన్‌గా మారిపోయాడు.  https://youtu.be/lOk1YI8xwk0?si=M7pHYNOlym7EGemT బుక్కా రెడ్డి (Rakta Charitra) రక్త చరిత్ర సినిమాలో బుక్కా రెడ్డి పాత్ర అతి భయానకంగా ఉంటుంది. కనిపించిన ఆడవారిపై అత్యాచారం చేస్తూ, అడ్డొచ్చిన వారిని చంపుకుంటూ పోయే ఈ పాత్రలో నటుడు అభిమన్యు సింగ్‌ (Abhimanyu Singh) జీవించేశాడు. సినిమాలో ఆ పాత్ర ఎంట్రీ అప్పుడల్లా ప్రేక్షకులు ఓ విధమైన టెన్షన్‌కు లోనవుతారు.  https://youtu.be/xjVj28sLQGs?si=tFP6zVO5moZcczA0 అమ్రీష్‌ పూరి (Jagadeka Veerudu Athiloka Sundari) చిరంజీవి నటించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ చిత్రంలో నటుడు అమ్రీష్‌ పూరి (Amrish Puri) ప్రతినాయకుడిగా కనిపించారు. మహాద్రాష్ట అనే మాంత్రికుడి రోల్‌లో ఆయన తెలుగు ప్రేక్షకులను అలరించారు. దేవ కన్య అయిన హీరోయిన్‌ను వశం చేసుకునే పాత్రలో అమ్రీష్‌ నటన మెప్పిస్తుంది.  https://youtu.be/l_XA9PuOwh0?si=3IUQQJNW3gFYuytc రణదేవ్ బిల్లా (Magadheera) రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మగధీర’ చిత్రంలో హీరోకు సమానంగా విలన్‌ రణదేవ్‌ బిల్లాకు స్క్రీన్‌ షేరింగ్ ఉంటుంది. దేవ్‌ గిల్ (Dev Gill) ఈ పాత్ర ద్వారా తొలిసారి టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. కండలు తిరిగిన దేహం, నటనతో వీక్షకులను కట్టిపడేశాడు.  https://youtu.be/XoYCASOhKPw?si=F1JUwUIIo4FANYpN మంగళం శ్రీను (Pushpa) అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’ (Pushpa)  చిత్రంలో.. నటుడు సునీల్‌ (Sunil) మంగళం శ్రీను పాత్రలో నటించాడు. హాస్యనటుడిగా, హీరోగా గుర్తింపు పొందిన సునీల్‌ను విలన్‌గా చూసి తెలుగు ఆడియన్స్‌ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా అతడి లుక్‌, నటన ఎంతగానో ఆకట్టుకుంది.  https://youtu.be/qF_aQEXieGo?si=WBlNlBjRszc3KrzH
    మార్చి 20 , 2024

    @2021 KTree