• TFIDB EN
  • Editorial List
    ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన మెగాస్టార్ చిరంజీవి టాప్ 15 సినిమాలు
    Dislike
    30+ views
    2 months ago

    మెగాస్టార్ చిరంజీవి తన అద్భుతమైన నటన, డ్యాన్స్‌తో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు. ఇటీవల ఆయన గిన్నిస్ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కి చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ఓటీటీలో తప్పక చూడాల్సిన చిరంజీవి సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . చూడాలని వుంది(ఆగస్టు 27 , 1998)
    U|148 minutes|థ్రిల్లర్
    తన తండ్రి పంపిన గూండాల బారి నుంచి భర్త రామకృష్ణను కాపాడే క్రమంలో ప్రియా చనిపోతుంది. అక్రమ కేసులో ఇరుక్కొని రామకృష్ణ జైలుకు వెళ్లగా అతడి కొడుకును ప్రియా నాన్న తీసుకెళ్తాడు. బయటకొచ్చిన రామకృష్ణ ఓ మహిళ సాయంతో తన బిడ్డను ఎలా దక్కించుకున్నాడు అన్నది కథ.

    ఓటీటీ- జియో సినిమా, యూట్యూబ్

    2 . కొండవీటి దొంగ(మార్చి 09 , 1990)
    U|151 minutes|యాక్షన్,థ్రిల్లర్
    రాజా అనే గిరిజన యువకుడు తన విద్యను పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తమ గూడెం వారిని స్థానిక గూండాలు హింసించడాన్ని గమనిస్తాడు. వారి అన్యాయాలను ఎదుర్కొనేందుకు కొండవీటి దొంగగా మారతాడు.

    ఓటీటీ- ఆహా

    3 . శ్రీ మంజునాథ(జూన్ 22 , 2001)
    U|157 minutes|డ్రామా,హిస్టరీ
    మంజునాథ (అర్జున్‌) అనే నాస్తికుడు. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతుంటాడు. అతడు శివుని భక్తురాలైన కాత్యాయిని (సౌందర్య)ని వివాహం చేసుకుంటాడు. కొద్ది రోజుల తర్వాత మంజునాథ జీవితంలో పెను మార్పులు చోటుచేసుకుంటాయి. దీంతో అతడు శివుడికి పరమభక్తుడిగా మారిపోతాడు. మరి మంజునాథ ఎందుకు మారాడు? మారిన తర్వాత ఏం చేశాడు? అనేది మిగతా కథ.

    ఓటీటీ- యూట్యూబ్

    4 . గ్యాంగ్ లీడర్(మే 09 , 1991)
    A|యాక్షన్,డ్రామా
    ముగ్గురు సోదరులలో చిన్నవాడైన రాజారామ్ తన రెండో అన్న చదువుకు డబ్బులు కట్టేందుకు చేయని నేరాన్ని తనపై వేసుకుంటాడు. అయితే తన పెద్దన్నయ్యను హత్య చేసిన నిందితుల గురించి తెలిసి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.

    ఓటీటీ- అమెజాన్ ప్రైమ్, ఆహా

    5 . ముఠా మేస్త్రి(జనవరి 17 , 1993)
    U|యాక్షన్,డ్రామా
    బోసు (చిరంజీవి) ఒక దేశభక్తి గలవాడు. కూరగాయల మార్కెట్‌లో కూలివారికి అన్యాయం జరగకుండా కాపాడుతుంటాడు. ఆత్మా (శరత్ సక్సేనా) ఆ ప్రాంతంలో ఒక ముఠా నాయకుడు. బోసు అతనికి వ్యతిరేకంగా పోరాడుతుంటాడు. బోసు దేశభక్తిని మెచ్చిన సీఎం (గుమ్మడి వెంకటేశ్వర రావు) అతడ్ని మంత్రిగా చేస్తారు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నది అసలు కథ.

    ఓటీటీ- అమెజాన్ ప్రైమ్

    6 . ఖైదీ(అక్టోబర్ 28 , 1983)
    A|157 minutes|యాక్షన్
    ఒక పేద రైతు కొడుకు సూర్యం, ఓ క్రూరమైన భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. దీంతో ఆ భూస్వామి, సూర్యం కుటుంబాన్ని, అతని జీవితాన్ని చిద్రం చేస్తాడు.

    ఓటీటీ- జియో సినిమా, యూట్యూబ్

    7 . హిట్లర్(జనవరి 04 , 1997)
    U|153 minutes|డ్రామా
    మాధవరావుకి తన ఐదుగురు చెల్లెళ్లంటే ప్రాణం. క్రూరమైన సమాజం నుండి చెల్లెళ్లను రక్షించే క్రమంలో వారి పట్ల కాస్త కఠినంగా ఉంటాడు. సిస్టర్స్ తన అన్నకు ఎదురు తిరిగినప్పుడు కథ మలుపు తిరుగుతుంది.

    ఓటీటీ- యూట్యూబ్

    8 . శంకర్ దాదా MBBS(అక్టోబర్ 15 , 2004)
    U|172 minutes|హాస్యం
    శంకర్ దాదా.. స్థానికంగా సెటిల్‌మెంట్లు చేసే రౌడీ. చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయిన శంకర్ దాదా... తన తల్లిదండ్రులకు తానొక డాక్టర్‌ అని అబద్దం చెబుతాడు. అయితే శంకర్ డాక్టర్ కాదన్న విషయాన్ని రామలింగేశ్వరరావు అతని తల్లిదండ్రులకు చెబుతాడు.
    9 . ఠాగూర్(సెప్టెంబర్ 24 , 2003)
    U|176 minutes|యాక్షన్,డ్రామా
    ప్రభుత్వ వ్యవస్థల్లో లంచగొండి అధికారులను నిర్మూలించడానికి ఠాగూర్ అనే ప్రొఫెసర్ తన స్టూడెంట్స్‌తో ఒక నిఘా సంస్థను రూపొందిస్తాడు. ఆ సంస్థ ద్వారా అవినీతి పరులను ఏరిపారేస్తాడు.

    ఓటీటీ- ఆహా

    10 . స్వయంకృషి(సెప్టెంబర్ 03 , 1987)
    U|డ్రామా,మ్యూజికల్
    సాంబయ్య (చిరంజీవి) చెప్పులు కుట్టుకుంటూ స్వయం కృషితో వ్యాపారవేత్తగా ఎదుగుతాడు. గంగ (విజయశాంతి)ను పెళ్లి చేసుకొని చెల్లెలు కొడుకు చిన్నాను సొంత బిడ్డలా పెంచుతాడు. అయితే ధనిక జీవితానికి ఇష్టపడ్డ చిన్నా కాయ కష్టం పనులను అసహ్యించుకుంటాడు. చిన్నా అసలు తండ్రి గోవింద్‌ (చరణ్‌రాజ్‌) రాకతో సాంబయ్య ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? అనేది కథ.

    ఓటీటీ- సోనీ లీవ్

    11 . ఆపద్బాంధవుడు(అక్టోబర్ 09 , 1992)
    U|డ్రామా,మ్యూజికల్
    మాధవ తన యాజమాని కూతురు హేమతో ప్రేమలో పడుతాడు. అయితే సామాజిక కట్టుబాట్ల కారణంగా తన ప్రేమను బయటపెట్టడు. కానీ హేమ అకస్మాత్తుగా మెంటల్ ఆస్పత్రిలో చేరినప్పుడు.. ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు.

    ఓటీటీ- జియో సినిమా, యూట్యూబ్

    12 . రుద్రవీణ(మార్చి 04 , 1988)
    U|170 minutes|డ్రామా,మ్యూజికల్
    సంగీత విద్వాంసుని కొడుకు తన సంగీతంతో సమాజాన్ని మార్చాలని కోరుకుంటాడు కానీ అతని తండ్రి అతని ప్రవర్తనను ఒప్పుకోడు. అతని ప్రయత్నాలకు ప్రభుత్వం నుండి ప్రశంసలు అందడంతో ఆ తండ్రి మారుతాడు.

    ఓటీటీ- యూట్యూబ్

    13 . ఇంద్ర(జూలై 24 , 2002)
    U|173 minutes|యాక్షన్
    రాయలసీమలో రెండు కుటుంబాల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతుంటుంది. ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యర్థుల చెల్లెలితో ఇంద్ర పెళ్లికి అంగీకరిస్తాడు. కట్‌ చేస్తే సాధారణ జీవితం కోసం ఇంద్ర మారుపేరుతో కాశీకి వెళ్లిపోతాడు. ఇంద్ర కాశీకి ఎందుకు వెళ్లాడు? తిరిగి ప్రత్యర్థులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.

    ఓటీటీ- యూట్యూబ్

    14 . జగదేక వీరుడు అతిలోక సుందరి(మే 09 , 1990)
    U|యాక్షన్,ఫ్యామిలీ
    నలుగురు అనాథలకు ఆశ్రయిమిచ్చిన రాజు.. గైడ్‌గా పనిచేస్తుంటాడు. రాజుకు అనుకోకుండా ఓ రోజు ఇంద్రుడి కుమార్తె ఇంద్రజకు చెందిన ఉంగరం దొరుకుతుంది. ఆ ఉంగరం కోసం ఇంద్రజ తిరిగి భూమి మీదకు వస్తుంది.

    ఓటీటీ- సన్ నెక్ట్స్

    15 . సైరా నరసింహా రెడ్డి(అక్టోబర్ 02 , 2019)
    UA|170 minutes|యాక్షన్,డ్రామా,హిస్టరీ
    భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదురించలేక పాలెగాళ్లు అందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటిష్ సైనికులకు ఎదురుతిరిగి వారు దోచుకున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. తోటి పాలెగాళ్ళలో మార్పు తెచ్చి వారితో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని నిర్మిస్తాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు యుద్దానికి దారి తీసిన అంశాలు ఏమిటి? అన్నది మిగతా కథ

    ఓటీటీ- అమెజాన్ ప్రైమ్


    @2021 KTree