• TFIDB EN
  • యానిమల్‌
    ATelugu3h 21m
    దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్‌ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Netflixఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    YouSay Review

    Animal Movie Review: యాక్షన్ సీన్లలో రణబీర్‌ ఉగ్రరూపం.. ‘యానిమల్‌’ ఎలా ఉందంటే?

    రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్‌ వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యానిమల్‌’ (Animal). రష్మిక హీరోయిన్‌గా చేసింది. బ...read more

    How was the movie?

    తారాగణం
    రణబీర్ కపూర్
    అర్జన్ వైలీ సింగ్
    అనిల్ కపూర్
    బల్బీర్ సింగ్
    బాబీ డియోల్
    అబ్రార్ హక్
    రష్మిక మందన్న
    గీతాంజలి సింగ్
    త్రిప్తి డిమ్రి
    జోయా
    పృథివీరాజ్
    అస్రార్ హక్
    శక్తి కపూర్
    మిశ్రా
    సురేష్ ఒబెరాయ్
    దాదాజీ
    ప్రేమ్ చోప్రా
    బడే దార్జీ
    సిబ్బంది
    సందీప్ రెడ్డి వంగ
    దర్శకుడు
    భూషణ్ కుమార్
    నిర్మాత
    క్రిషన్ కుమార్
    నిర్మాత
    మురాద్ ఖేతానినిర్మాత
    ప్రణయ్ రెడ్డి వంగనిర్మాత
    ప్రీతమ్ చక్రబర్తి
    సంగీతకారుడు
    విశాల్ మిశ్రా
    సంగీతకారుడు
    జాని
    సంగీతకారుడు
    సందీప్ రెడ్డి వంగ
    కథ
    అమిత్ రాయ్సినిమాటోగ్రాఫర్
    సందీప్ రెడ్డి వంగ
    ఎడిటర్ర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Animal Park Villain: ‘యానిమల్‌ పార్క్‌’లో విలన్‌గా స్టార్‌ హీరో.. సందీప్‌ రెడ్డి వంగా లక్ష్యమదే!
    Animal Park Villain: ‘యానిమల్‌ పార్క్‌’లో విలన్‌గా స్టార్‌ హీరో.. సందీప్‌ రెడ్డి వంగా లక్ష్యమదే!
    యానిమల్‌’ (Animal) చిత్రంతో యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలకు మించి విజయాన్ని అందుకుంది. యాక్షన్‌ ప్రియులకు కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చిన ఈ సినిమాకు ‘యానిమల్‌ పార్క్‌’(Animal Park) అనే టైటిల్‌తో ఈ సీక్వెల్‌ రానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. అయితే తాజాగా ఈ సీక్వెల్‌కు సంబంధించి క్రేజీ బజ్‌ బయటకొచ్చింది. ప్రస్తుతం ఆ వార్త సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది.  విలన్‌గా స్టార్‌ హీరో! ‘యానిమల్‌ పార్క్‌’లో విలన్‌గా రణ్‌బీర్‌ను పోలిన వ్యక్తినే ఉంటాడని తొలి పార్ట్‌ క్లైమాక్స్‌లో డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా చూపించారు. అయితే తాజా బజ్‌ ప్రకారం బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ హీరో.. అందులో ప్రతినాయకుడిగా కనిపిస్తాడని టాక్‌ వినిపిస్తోంది. షారుక్‌ ఖాన్‌ 'డంకీ' చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచిన 'విక్కీ కౌశల్‌' (Vicky Kaushal).. యానిమల్‌ పార్క్‌లో మెయిన్‌ విలన్‌గా చేయనున్నట్లు రూమర్స్‌ మెుదలయ్యాయి. ఇదే నిజమైతే రణ్‌బీర్‌ వర్సెస్‌ విక్కీ కౌశల్‌ పోరు ఆసక్తికరంగా మారనుంది. వీరిద్దరు ప్రత్యర్థులు అయితే తెరపై విధ్వంసమేనని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.  ‘యానిమల్‌ పార్క్‌’ ఇప్పట్లో లేనట్లే! 'యానిమల్‌' సినిమా దెబ్బకు దేశంలోని టాప్‌ డైరెక్టర్ల జాబితాలోకి సందీప్‌ రెడ్డి వంగా చేరిపోయాడు. ప్రస్తుతం అతడు యానిమల్‌ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. అయితే సందీప్‌ తర్వాతి ప్రాజెక్ట్ ఏంటన్న దానిపై చాలా రోజుల నుంచి స్పష్టత లేదు. ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ చిత్రాన్ని ఇప్పటికే సందీప్ ఇప్పటికే ప్రకటించగా.. మరోవైపు యానిమల్‌ పార్క్‌కు సంబంధించిన కథను కూడా అతడి టీమ్‌ సిద్ధం చేస్తోంది. దీంతో ఈ రెండు చిత్రాల్లో తొలుత ఏది పట్టాలెక్కుతుందోనన్న సందేహం సినీ వర్గాల్లో ఏర్పడింది. అయితే దీనిపై తాజాాగా సందీప్‌ క్లారిటీ ఇచ్చాడు. ఓ వేడుకలో పాల్గొన్న సందీప్‌.. యానిమల్‌ పార్క్‌ ఇప్పట్లో రాదని క్లారిటీ ఇచ్చేశాడు. ముందు ప్రభాస్‌ స్పిరిట్ చేయాలని దాని తర్వాతే ఇతర సినిమాల గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశాడు.  యానిమల్‌ సీక్వెల్ లక్ష్యమదే! గతంలో ‘యానిమల్‌’ సీక్వెల్‌ గురించి మాట్లాడుతూ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో మరిన్ని బలమైన పాత్రలు ఉంటాయని పేర్కొన్నాడు. అలాగే గతంలో వచ్చిన సినిమాల కంటే ఎక్కువ థ్రిల్‌ను పంచడమే ‘యానిమల్‌ పార్క్‌’ లక్ష్యంగా చెప్పుకొచ్చాడు. ‘యానిమల్‌ పార్క్‌లో ఊహించనన్ని యాక్షన్‌ సన్నివేశాలుంటాయి. రణ్‌బీర్‌ కపూర్ పాత్ర మరింత క్రూరంగా ఉంటుంది. ‘యానిమల్‌’ చిత్రం ప్రేక్షకుల్లో శాశ్వత స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల వచ్చిన అత్యంత సాహసోపేతమైన.. అసాధారణమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది’’ అన్నారు.  ‘విక్కీ కౌశల్‌’ ఎవరో తెలుసా? యానిమల్‌ పార్క్‌లో విక్కీ కౌశల్‌ విలన్‌గా చేస్తారన్న వార్తలతో సోషల్‌ మీడియాలో అతడి పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. విక్కీ గురించి తెలుగు ఆడియన్స్‌కు పెద్దగా తెలియకపోవచ్చు గానీ, బాలీవుడ్‌లో అతడు స్టార్‌ హీరో. ప్రముఖ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ (Katrina Kaif)కు స్వయాన భర్త. 2019లో వచ్చిన ‘ఉరి’ (Uri: The Surgical Strike) సినిమా ముందు వరకూ చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చిన విక్కీ ఆ సినిమాతో స్టార్‌ హీరోగా మారిపోయాడు. రీసెంట్‌గా షారుక్‌ ఖాన్‌ ‘డంకీ’ చిత్రంలో సుఖి పాత్రలో అదరగొట్టాడు.
    ఫిబ్రవరి 29 , 2024
    Animal New Record: ‘యానిమల్‌’ మరో సంచలనం.. తొలి భారత చిత్రంగా రికార్డు!
    Animal New Record: ‘యానిమల్‌’ మరో సంచలనం.. తొలి భారత చిత్రంగా రికార్డు!
    బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా అర్జున్‌ రెడ్డి (Arjun Reddy) ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించగా అనిల్ కపూర్, తృప్తి దిమ్రి, బాబీ డియోల్, శక్తి కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇప్పటికే ఓటీటీలో (Netflix) విడుదలైన యానిమల్‌ అక్కడ కూడా టాప్ ట్రెండింగ్‌ మూవీగా కొనసాగుతోంది. తాజాగా ఈ చిత్రం మరో సరికొత్త రికార్డు సృష్టించింది.  మ్యూజిక్‌ రికార్డు ప్రముఖ మ్యూజిక్ ప్లాట్ ఫామ్ స్పాటిఫై (Spotify)లో యానిమల్‌ ఈ అరుదైన ఘనత సాధించింది. 500 మిలియన్లకుపైగా స్ట్రీమింగ్ అయిన మ్యూజిక్ ఆల్బమ్‌గా నిలిచింది. ఇండియాలో వేగంగా ఈ మార్క్‌ను చేరుకున్న తొలి చిత్రంగా 'యానిమల్' (Animal Music Record) సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని సదరు సంస్థ (Spotify) సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో ‘యానిమల్‌’ పేరు నెట్టింట మరోమారు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన సమాచారం #Animal హ్యాష్‌ట్యాగ్‌తో ఎక్స్‌ (ట్విటర్‌)లో వైరల్ అవుతోంది.  హైలేట్‌ సంగీతం యానిమల్‌ విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలోని అన్ని పాటలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా తృప్తి దిమ్రితో రణ్‌బీర్‌ రొమాన్స్ చేస్తుండగా వచ్చే 'ఎవరెవరో' సాంగ్‌ యూత్‌ను విపరీతంగా ఆకర్షించింది. అలాగే తండ్రిపై ప్రేమను చాటే 'నాన్న నువ్వు నా ప్రాణం'.. క్లైమాక్స్‌తో వచ్చే 'యాలో యాలో' పాట కూడా మనసులను హత్తుకుంటాయి. ఇక ‘జమాలో జమాలో’ పాట ఏ స్థాయిలో ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సాంగ్‌ను మ్యూజిక్ ప్రియులు రిపీటెడ్‌ మోడ్‌లో విన్నారు. మిగిలిన పాటలను సైతం తమ ఫేవరెట్‌ సాంగ్స్‌ లిస్టులో చేర్చేశారు. బీజీఎంతో గూస్‌బంప్స్‌ అటు నేపథ్య సంగీతం కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. రణ్‌బీర్‌ కపూర్‌ను ఎలివేట్‌ చేసే క్రమంలో వచ్చే BGM గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. థియేటర్‌లో చూసిన వారు యానిమల్‌ నేపథ్య సంగీతాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా మ్యూజిక్‌ లవర్స్‌ యానిమల్‌ BGMను తమ కాలర్‌ ట్యూన్‌గా, రింగ్‌టోన్‌గా పెట్టుకొని అస్వాదిస్తున్నారు. యానిమల్‌ బీజీఎం విన్నప్పుడల్లా తాము ఎంతో ఉత్తేజానికి గురవుతున్నట్లు పలువురు సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయ పడ్డారు. లాభాలే లాభాలు.! డిసెంబర్ 1న రిలీజైన యానిమల్‌ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ.900 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. అటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లాభాల పంట పండించింది. ‘యానిమల్’ (Animal) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.10.85 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11.2 కోట్ల షేర్‌ను రాబట్టాలి. రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ ఫుల్ రన్ ముగిసేసరికి రూ.25.55 కోట్ల షేర్‌ని కలెక్ట్ చేసింది. బయ్యర్స్‌కి ఈ మూవీ రూ.14.35 కోట్ల లాభాలను అందించిందని సమాచారం.    
    ఫిబ్రవరి 12 , 2024
    Animal OTT: యానిమల్‌ ఓటీటీ వెర్షన్‌లో ఆ సీన్లు లేకపోవడమే రచ్చకు కారణమైందా?
    Animal OTT: యానిమల్‌ ఓటీటీ వెర్షన్‌లో ఆ సీన్లు లేకపోవడమే రచ్చకు కారణమైందా?
    ఓటీటీ ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'యానిమల్' (Animal) చిత్రం ఎట్టకేలకు స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. రిపబ్లిక్ డే నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (#AnimalOnNetflix)లో ప్రసారం అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, దక్షిణాది భాషల్లో శుక్రవారం (జనవరి 26న) అందుబాటులోకి వచ్చింది. సినిమా బాగుందా? బాగాలేదా? అన్న విషయాన్ని పక్కన పెడితే ఓ విషయంలో మాత్రం ఓటీటీ ప్రేక్షకులు ‘యానిమల్‌’పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా చెప్పుకుంటూ వచ్చిన విషయాన్ని చిత్ర యూనిట్‌ పక్కన పెట్టేయడంపై డిసప్పాయింట్ అవుతున్నారు. ఆ మేటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం.  అసంతృప్తికి కారణమదే! యానిమల్‌ ప్రమోషన్స్ సందర్భంగా సినిమా గురించి ఎన్నో విషయాలు చెప్పిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. థియేటర్లలో 3 గంటల 21 నిమిషాల మూవీ కాకుండా మరిన్ని సీన్లు ఉన్నాయని చెప్పాడు. ఈ క్రమంలోనే ఓటీటీలోకి ఎడిట్ చేసిన సన్నివేశాలు కూడా జోడిస్తామని తెగ ఊరించారు. దీంతో యానిమల్ ఓటీటీ వెర్షన్‌పై అందర్లో చెప్పలేనంత క్యూరియాసిటీ పెరిగింది. థియేటర్‌లో సినిమా చూసిన వారు సైతం అదనపు సీన్లు జోడిస్తుండంతో ఓటీటీ వెర్షన్‌పై ఆసక్తి పెంచుకున్నారు. తీరా చూస్తే థియేటర్లలో చూసిన సినిమా కట్‌నే ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. దీంతో అదనపు సన్నివేశాలు ఉంటాయని భావించిన వారంతా చాలా డిసప్పాయింట్ అవుతున్నారు.  నెటిజన్ల మండిపాటు డైరెక్టర్‌ సందీప్‌ చెప్పినట్లు 8 నిమిషాల సీన్లను కాకుండా కేవలం 3 నిమిషాల అదనపు సీన్లను మాత్రమే ఓటీటీ వెర్షన్‌లో యాడ్‌ చేసినట్లు తెలుస్తోంది. యానిమల్‌ థియేటర్‌ వెర్షన్‌ నిడివి 3 గంటల 21 నిమిషాలు. అదే ఓటీటీ వెర్షన్‌ తీసుకుంటే 3 గంటల 24 నిమిషాలుగా ఉంది. దీని ప్రకారం కేవలం మూడు సీన్లను మాత్రమే ఓటీటీలో వెర్షన్‌లో యాడ్‌ చేశారని వీక్షకులు అంటున్నారు. ట్విటర్‌ (ఎక్స్‌)లో #Animal హ్యాష్‌ట్యాగ్‌ పేరుతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అదనపు సీన్లు కూడా పట్టి పట్టి చూస్తే కానీ గుర్తించలేమని అంటున్నారు. కొత్త సీన్లను ఎక్స్‌పెక్ట్‌ చేసిన తమకు తీవ్ర నిరాశే ఎదురైందని పేర్కొంటున్నారు. మెుత్తంగా యానిమల్‌ వ్యవహారంపై కొందరు క్రేజీగా కామెంట్స్‌ చేస్తుంటే మరికొందరు మూవీ యూనిట్‌ తమను మోసం చేసిందని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కోరుకున్న సీన్లు అవేనా! యానిమల్‌ ఓటీటీ వెర్షన్‌లో తాము ఏ సీన్లను కోరుకున్నామో కొందరు నెటిజన్లు ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా స్పష్టం చేశారు. ఫ్లైట్‌లో హీరో, హీరోయిన్ల మధ్య జరిగే రొమాన్స్‌, రణ్‌బీర్‌ - త్రిప్తి దిమ్రితో శారీరకంగా కలిసే సన్నివేశాలకు అదనపు సీన్లను జత చేసి మరింత బోల్డ్‌గా చూపిస్తారని ఆశించినట్లు పోస్టులు పెట్టారు. మరికొందరు ఆ పోస్టులను లైక్‌ చేయడం ద్వారా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంకొందరు నెటిజన్లు యాక్షన్‌ సీన్స్‌లో మరింత వైలెంట్‌ ఎక్స్‌పెక్ట్‌ చేసినట్లు చెప్పారు. సెన్సార్‌ బోర్డు ప్రేక్షకులకు చూపించకుండా కట్‌ చేసిన రొమాన్స్‌, వైలెన్స్‌ సీన్లు అన్ని ఓటీటీలో ఉంటాయని భావించి భంగపడినట్లు కామెంట్స్‌ చేశారు. https://twitter.com/MaayonTweetz_/status/1750863511738265790 మరోవైపు ప్రశంసలు కూడా! ఇదిలా ఉంటే మెుదటిసారి యానిమల్‌ చిత్రాన్ని చూసినవారు మాత్రం సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రన్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) నటన అద్భుతమంటూ కొనియాడుతున్నారు. డైరెక్టర్‌ సందీప్‌ వంగా టేకింగ్‌, స్క్రీన్‌ప్లే చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. యాక్షన్‌ సన్నివేశాలను, హీరోయిజాన్ని ఆయన చక్కగా ఎలివేట్‌ చేశారని కొనియాడుతున్నారు. అంతేకాకుండా యానిమల్‌ చిత్రంలోని హైలెట్‌ సీన్లను తమ ఎక్స్‌ ఖాతాల ద్వారా షేర్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పోస్టులు కూడా #Animal హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నాయి.  https://twitter.com/i/status/1751101072092127579 బాక్సాఫీసుపై కాసుల వర్షం! డిసెంబర్‌ 1న విడుదలైన యానిమల్‌ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాకు బాలీవుడ్‌లో రెండోది. ఆయన మెుదటి చిత్రం కబీర్‌ సింగ్‌ (Kabir Singh). యానిమల్‌ వరల్డ్‌వైడ్‌గా రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌కు జోడీగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించింది. తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అటు తండ్రి పాత్రలో అనిల్‌ కపూర్‌ జీవించారు. చిత్ర విజయంలో తన వంతు పాత్ర పోషించారు.  https://twitter.com/i/status/1751124216349638941
    జనవరి 27 , 2024
    Animal Movie Review: యాక్షన్ సీన్లలో రణబీర్‌ ఉగ్రరూపం.. ‘యానిమల్‌’ ఎలా ఉందంటే?
    Animal Movie Review: యాక్షన్ సీన్లలో రణబీర్‌ ఉగ్రరూపం.. ‘యానిమల్‌’ ఎలా ఉందంటే?
    నటీనటులు: రణబీర్ కపూర్, రష్మికా మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్, తృప్తి దిమ్రి, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ తదితరులు దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ సినిమాటోగ్రఫీ: అమిత్ రాయ్ నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతని, ప్రణయ్ రెడ్డి వంగా  విడుదల తేదీ: డిసెంబర్ 1, 2023   రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్‌ వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యానిమల్‌’ (Animal). రష్మిక హీరోయిన్‌గా చేసింది. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటించారు. ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) తీసిన సందీప్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం, అంచనాలు పెంచేలా ట్రైలర్‌ ఉండటంతో ‘యానిమల్‌’పై అటు బాలీవుడ్‌తో పాటు, తెలుగులోనూ భారీగా హైప్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథ దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీ యజమాని అయిన ఆయనకు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్) కుమారుడు. విజయ్ దూకుడు మనస్తత్వం కలవాడు. అయితే తండ్రి అంటే ప్రాణం. కుమారుడి ప్రవర్తన నచ్చక బల్బీర్‌ అతడ్ని బోర్డింగ్ స్కూల్‌కు పంపిస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత ఓ గొడవ వల్ల తండ్రి కొడుకుల మధ్య మరింత దూరం పెరుగుంది. ఈ క్రమంలోనే విజయ్ అమెరికా వెళ్లిపోతాడు. తండ్రి మీద హత్యాయత్నం జరిగిందని తెలిసి 8 ఏళ్ళ తర్వాత భారత్‌కు వస్తాడు. తండ్రిపై అటాక్ చేసిన వాళ్ళ అంతు చూస్తానని శపథం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? గీతాంజలి (రష్మిక), రణ్ విజయ్ సింగ్ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? అబ్రార్ (బాబీ డియోల్) ఎవరు? వాళ్ళకు, రణ్ విజయ్ సింగ్ కుటుంబం మధ్య సంబంధం లేదా శత్రుత్వం ఏమిటి? అనేది కథ. ఎవరెలా చేశారంటే తెరపై పాత్ర మాత్రమే కనిపించేలా నటించే అతి కొద్ది మంది హీరోలలో రణబీర్ కపూర్‌ ఒకరు. రణ్ విజయ్ సింగ్ పాత్రకు అతడు ప్రాణం పోశాడు. టీనేజ్, యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్ ఇలా వివిధ దశల్లో జీవించారు. ప్రేక్షకులను ఆ పాత్రతో పాటు ప్రయాణం చేసేలా అందులో ఒదిగిపోయాడు. అటు గీతాంజలి పాత్రకు రష్మికా మందన్నా న్యాయం చేసింది. రణబీర్, రష్మిక మధ్య వైఫ్ అండ్ హజ్బెండ్ బాండింగ్, పెళ్లి గురించి చెప్పే కొన్ని డైలాగులు అదరహో అనిపిస్తాయి. జోయా పాత్రలో తృప్తి దిమ్రి గ్లామర్‌తో ఆకట్టుకుంది. అటు రణబీర్ తండ్రిగా అనిల్ కపూర్ అదరగొట్టాడు. ఇక రణ్‌బీర్ తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన నటుడు బాబీ డియోల్. ఆయన విలన్‌గా కళ్లతోనే భయపెట్టేశారు. రణబీర్ - బాబీ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి.  డైరెక్షన్ ఎలా ఉందంటే? డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ఈ సినిమాతో మరోమారు తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్నాడు. సోదరిని ర్యాగింగ్‌ చేశారన్న కోపంతో  హీరో గన్‌ పట్టుకొని ఆమె కాలేజీకి వెళ్లే సీన్‌ ఆయన మార్క్‌ యాక్షన్‌కు ఉదాహరణ. ఇలాంటి కొత్త తరహా వైలెన్స్‌ యాక్షన్ సీన్స్‌ సినిమాలో చాలానే ఉన్నాయి. కథలో కొత్త దనం లేకపోయినప్పటికీ తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పడంలో డైరెక్టర్‌ ఎటువంటి మెుహమాటాలకు పోలేదు. ముఖ్యంగా రణబీర్‌ - బాబీ డియోల్‌ మధ్య ఫైట్‌ సీన్స్‌ సందీప్‌ వంగా దర్శకత్వం ప్రతిభకు అద్దం పడతాయి. అయితే నిడివి కాస్త ఎక్కువగా ఉండటంతో పాటు కొన్ని సీన్లు మరి సాగదీసినట్లు అనిపిస్తుంది. దీని వల్ల ప్రేక్షకులు అక్కడక్కడ బోర్‌ ఫీలవుతారు. టెక్నికల్‌గా  సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. నేపథ్య సంగీతం సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది.  హర్షవర్ధన్ రామేశ్వర్ తన BGMతో సినిమాకు ప్రాణం పోశారు. హీరోయిజాన్ని తన BGMతో చాలా బాగా ఎలివేట్ చేశారు. కెమెరా వర్క్ టాప్ క్లాస్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.  డైలాగ్స్‌లో సందీప్ రెడ్డి వంగా మార్క్ కనిపించింది.  ప్లస్‌ పాయింట్‌ రణ్‌బీర్ నటనయాక్షన్‌ సీన్లునేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్ నిడివిసాగదీత సీన్లు రేటింగ్‌ : 4/5
    డిసెంబర్ 01 , 2023
    Pushpa 2 Latest Song: ‘పుష్ప 2’ ఐటెం సాంగ్‌పై ఊహించని ట్విస్ట్‌.. తెరపైకి ‘యానిమల్‌’ బ్యూటీ!
    Pushpa 2 Latest Song: ‘పుష్ప 2’ ఐటెం సాంగ్‌పై ఊహించని ట్విస్ట్‌.. తెరపైకి ‘యానిమల్‌’ బ్యూటీ!
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2 : ది రూల్‌’ (Pushpa 2: The Rule). గతంలో వచ్చిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం 'పుష్ప: ది రైజ్‌' కి సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ సినిమాపై భారీగా అంచనాలు పెంచగా.. ఇటీవల వచ్చిన ఫస్ట్‌ సింగిల్‌ వాటిని రెట్టింపు చేసింది. తాజాగా రెండో సాంగ్ ప్రోమోను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. మరోవైపు ‘పుష్ప 2’కి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇది విన్న ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.  తృప్తి దిమ్రితో ఐటెం సాంగ్‌! బాలీవుడ్‌ స్టార్ రణ్‌బీర్‌ కపూర్‌, సందీప్‌ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన ‘యానిమల్‌’.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద ఎంత సెన్సేషన్‌ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇందులో నటించిన బాలీవుడ్‌ నటి తృప్తి దిమ్రీ.. తన గ్లామర్‌తో యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. ‘పుష్ప 2’లో ఈ భామ ఐటెం సాంగ్‌ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాంగ్‌ కోసం చిత్ర యూనిట్‌ ఆమెను సంప్రదించగా తృప్తి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్‌ త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేస్తుందని అంటున్నారు. పుష్పలో ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ అంటూ సమంత చేసిన మ్యాజిక్‌ను తృప్తి రిపీట్‌ చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. బన్నీ, తృప్తి కలిసి స్టెప్పులేస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయని కామెంట్స్ చేస్తున్నారు.  ప్రోమోలో ఏముందంటే? సెకండ్‌ సాంగ్‌ ప్రోమోలో పూర్తిగా హీరోయిన్‌ రష్మిక మందన్ననే కనిపించింది. సాంగ్‌ సెట్‌లో రష్మిక మేకప్‌ వేసుకుంటూ కనిపించింది. ఈ క్రమంలో కేశవ వచ్చి.. శ్రీవల్లి వదిన పుష్ప 2 నుంచి రెండో సాంగ్‌ రిలీజ్‌ చేస్తున్నారంటగా కదా ఆ పాటేందో చెప్తావా అని అడుగుతాడు. అప్పుడు రష్మిక ‘సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అంటూ పాట పాడుతుంది. మీరు కూడా ఈ ప్రోమోను ఓసారి చూసేయండి.  https://www.youtube.com/watch?v=sbp9M95-2rQ&t=19sv పూర్తి సాంగ్‌ ఎప్పుడంటే? పుష్ప 2లోని రెండో పాటను మే 29న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తాజా ప్రోమోలో స్పష్టం చేశారు. ఆ రోజు ఉ.11.07 గం.లకు పూర్తి లిరికల్‌ వీడియోను విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇది బన్నీ, రష్మిక మధ్య సాగే మెలోడీ సాంగ్ అంటూ వివరించారు. గతంలో పుష్ప సినిమాలో వచ్చిన ‘సామి.. సామి’ సాంగ్‌ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. దీంతో ‘సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ పాట కూడా ఆ స్థాయిలోనే అలరిస్తుందని ఫ్యాన్స్‌ నమ్ముతున్నారు. ఆ పాట కోసం బన్నీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.  ఆ రోజున ఫ్యాన్స్‌కు పండగే భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు ప్రత్యర్థిగా మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ (Fahad Faasil) నటిస్తున్నారు. అనసూయ, ధనుంజయ్, సునీల్, రావు రమేశ్‌, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ రూపొందిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌ రిలీజ్‌ కానుంది. ఇప్పటికే వదిలిన అప్ డేట్స్ అన్నీ కూడా సినిమాపై ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేశాయి. ఈ మూవీ రిలీజ్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 15 ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు. 
    మే 23 , 2024
    Animal Movie OTT: ఓటీటీ ప్రియులకు గ్రాండ్‌ ట్రీట్.. మరికొద్ది గంటల్లో ‘యానిమల్‌’ స్ట్రీమింగ్‌!
    Animal Movie OTT: ఓటీటీ ప్రియులకు గ్రాండ్‌ ట్రీట్.. మరికొద్ది గంటల్లో ‘యానిమల్‌’ స్ట్రీమింగ్‌!
    రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ వంగా (Sandeep Reddy) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ డ్రామా చిత్రం ‘యానిమల్‌’ (Animal movie). ఈ చిత్రం రేపటి నుంచి (జనవరి 26) ఓటీటీలో ప్రసారం కానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ‘యానిమల్‌’ స్ట్రీమింగ్‌లోకి రానుంది.  ‘యానిమల్’ స్ట్రీమింగ్‌ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ స్వయంగా ప్రకటిస్తూ ఎక్స్‌ (ట్విటర్‌)లో ఓ ఆసక్తికర వీడియోను సైతం పోస్టు చేసింది. ప్రస్తుతం ఆ వీడియో #AnimalOnNetflix హ్యాష్‌ట్యాగ్‌ పేరుతో నెట్టింట వైరల్‌ అవుతోంది.  https://twitter.com/i/status/1750390548165472508 ‘గాలి దట్టంగా ఉంది.. ఉష్ణోగ్రత పెరుగుతోంది’ అంటూ నెట్‌ఫ్లిక్స్‌ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. జనవరి 26 నుంచి తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ‘యానిమల్‌’ (Animal Movie OTT Release) చిత్రాన్ని వీక్షించవచ్చని స్పష్టం చేసింది.  డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమల్‌ చిత్రం #AnimalOnNetflix  బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. యువ ప్రేక్షకులను (Animal movie ott release date telugu) అమితంగా ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. యానిమల్‌ చిత్రాన్ని ఇప్పటికే థియేటర్లలో వీక్షించిన వారికి కూడా ఓటీటీ వెర్షన్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వనుంది. దాదాపు 8 నిమిషాల అదనపు నిడివితో దీన్ని తీసుకొస్తున్నారు. థియేటర్‌లో చూడలేకపోయిన సన్నివేశాలను ఇందులో చూసే అవకాశం కల్పించారు.  యానిమల్‌ మూవీ రన్‌ టైమ్‌ 3 గం.ల 21 నిమిషాలు కాగా.. ఓటీటీ కోసం అదనపు సన్నివేశాలు జోడించి దాదాపు మూడున్నర గంటలతో 'యానిమల్‌' (Animal movie ott release date telugu)ను స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. దీంతో ఆ సన్నివేశాలు ఏంటా అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది. యాక్షన్ ప్రియులకు (#AnimalOnNetflix) పసందైన విందు భోజనాన్ని అందించిన యానిమల్‌కు కొనసాగింపుగా మరో చిత్రం సైతం రానుంది. యానిమల్‌ పార్క్‌ (Animal Park) టైటిల్‌తో ఆ చిత్రాన్ని రూపొందించనున్నట్లు డైరెక్టర్‌ సందీప్‌ వంగా ఇప్పటికే ప్రకటించారు.  ఇక యానిమల్‌ చిత్రాన్ని హిందీ అగ్ర నిర్మాణ సంస్థ T సిరీస్ ప్రొడ్యూస్ చేసింది.  హిందీతో పాటు ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేసింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది.  డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాకు బాలీవుడ్‌లో ఇది రెండో చిత్రం. అంతకుముందు ఆయన అర్జున్‌ రెడ్డి చిత్రాన్ని 'కబీర్‌ సింగ్‌' (Kabir singh)పేరుతో హిందీలో తెరకెక్కించారు. ఇక యానిమల్ చిత్రంలో రణ్‌బీర్‌కు జోడీగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించింది. అనిల్‌ కపూర్‌ బాబీ డియోల్‌, శక్తికపూర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.  ‘యానిమల్‌’ కథ విషయానికి వస్తే..  రణ్ విజయ్ సింగ్ బల్బీర్ (రణబీర్ కపూర్)‌కు తండ్రి మీద విపరీతమైన ప్రేమ. తండ్రి బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) కోసం ఎంత దూరమైన వెళ్తాడు. తండ్రి బల్బీర్ సింగ్ ఓ బిజీగా ఉండే వ్యాపార వేత్త. ఇండియాలోనే అతిపెద్ద స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీని నడుపుతుంటాడు. బిజీ లైఫ్‌ వల్ల తన కొడుకుతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతుంటాడు. పూర్తి రివ్యూ కోసం కింద ఉన్న లింక్‌పై క్లిక్‌ చేయండి.  https://telugu.yousay.tv/animal-movie-review-ranbir-looks-fierce-in-action-scenes-how-is-animal.html
    జనవరి 25 , 2024
    <strong>Spirit Movie: ‘స్పిరిట్‌’ కోసం గట్టిగానే ప్లాన్‌ చేసిన సందీప్‌ రెడ్డి వంగా.. ప్రభాస్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌!&nbsp;</strong>
    Spirit Movie: ‘స్పిరిట్‌’ కోసం గట్టిగానే ప్లాన్‌ చేసిన సందీప్‌ రెడ్డి వంగా.. ప్రభాస్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌!&nbsp;
    ‘యానిమల్‌’ (Animal) చిత్రంతో డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అతడి విభిన్నమైన డైరెక్షన్‌ స్కిల్స్‌ అందర్నీ మెస్మరైజ్‌ చేశాయి. ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy)తో సందీప్‌ రెడ్డి పనితనం తెలుగు ఆడియన్స్‌కు ముందే తెలిసినప్పటికీ ‘యానిమల్‌’తో అది దేశం మెుత్తానికి అర్థమైంది. ఇదిలా ఉంటే అతడి నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ ప్రభాస్‌తో ఉండనున్న సంగతి తెలిసిందే. ‘స్పిరిట్‌’ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో సందీప్‌ చాలా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ మూవీగా స్పిరిట్‌ నిలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; భారీ బడ్జెట్‌తో.. ప్రభాస్‌ (Prabhas) హీరోగా సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో రాబోతున్న ‘స్పిరిట్‌’ (Spirit)పై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించి నెట్టింట ఓ వార్త హల్‌ చల్‌ చేస్తోంది.&nbsp; ఈ సినిమాకు ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు టాక్ వినిపిస్తోంది. తొలుత ఈ మూవీ బడ్జెట్ రూ.500 కోట్లు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత రూ. 750 కోట్లకు పెరిగిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రూ.1000 కోట్లతో ఈ సినిమా రూపొందనున్నట్లు బజ్‌ వినిపిస్తోంది. అదే నిజమైతే బడ్జెట్‌ పరంగా ప్రభాస్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ మూవీగా 'స్పిరిట్‌' నిలవనుంది.&nbsp; రెమ్యూనరేషన్లకే రూ.600 కోట్లు! ‘స్పిరిట్‌’కు కేటాయించనున్న బడ్జెట్‌లో రూ.600 కోట్లు నటీనటుల పారితోషానికే వెళ్లనున్నట్లు సమాచారం. ఒక్క ప్రభాస్‌కే రూ.300 కోట్లు చెల్లించనున్నట్లు ఫిల్మ్‌ వర్గాల టాక్‌. ఎందుకంటే ప్రభాస్‌ ఇందులో డ్యూయల్‌ రోల్‌ పోషించనున్నాడు. కాబట్టి ఆ మాత్రం రెమ్యూనరేషన్‌ తీసుకోవడం సమంజసమే అంటున్నారు. అదే విధంగా బాలీవుడ్‌ స్టార్స్‌ అనిల్‌ కపూర్‌ (Anil Kapoor), సైఫ్‌ అలీ ఖాన్‌ (Saif Ali Khan), కరీనా కపుర్‌ (Kareena Kapoor) ఇందులో స్పెషల్‌ రోల్స్ చేస్తారని టాక్ ఉంది. ఈ నేపథ్యంలో పారితోషికానికి ఆ మాత్రం బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక మూవీ మేకింగ్‌ కోసం రూ.300 కోట్లు, గ్రాఫిక్స్‌ కోసం రూ.120-150 కోట్లు, ప్రమోషన్స్‌కు మరో రూ.50-80 కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం. మమ్ముట్టీ స్పెషల్‌ రోల్‌! ‘స్పిరిట్‌’ సినిమాలో ఓ స్టార్‌ హీరో నటించబోతున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. మలయాళ సూపర్ స్టార్‌ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కథకు ఆ పాత్ర ఎంతో కీలకం కానుందని అంటున్నారు. దీనిపై చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ మూవీలో బాలీవుడ్‌ కపుల్‌ సైఫ్‌ అలీఖాన్‌, కరీనా కపూర్‌ నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. అలాగే కొరియన్‌, చైనీస్‌ స్టార్స్‌ కూడా ఇందులో నటిస్తారని రూమర్లు వినిపిస్తున్నాయి.&nbsp;&nbsp; పోలీసు vs మాఫియా డాన్‌! ‘స్పిరిట్‌’ సినిమాలో ప్రభాస్‌ ద్విపాతాభినయం చేయనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఒక పాత్రలో పోలీసుగా మరో పాత్రలో మాఫియా డాన్‌గా ప్రభాస్‌ కనిపిస్తారని సమాచారం. డాన్‌ పాత్ర నెగిటివ్‌ షేడ్స్‌ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే బాక్సాఫీస్‌ వద్ద ఊచకోత ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ‘స్పిరిట్‌’ సెట్స్‌పైకి వెళ్తుందని టాక్‌. మరోవైపు ప్రభాస్‌ ఇప్పటివరకూ మూడు సినిమాల్లో ద్విపాత్రిభినయం చేశారు. తొలి చిత్రం ‘బిల్లా’ కాగా ఆపై ‘బాహుబలి’ సిరీస్‌లోనూ డ్యూయల్‌ రోల్స్‌లో కనిపించారు. రీసెంట్‌గా తెరకెక్కుతున్న ‘రాజాసాబ్‌’లోనూ ప్రభాస్‌ రెండు పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం ఉంది.
    అక్టోబర్ 08 , 2024
    <strong>Spirit Movie: ప్రభాస్‌కు విలన్‌గా జూ.ఎన్టీఆర్‌? సందీప్‌ రెడ్డి వంగా మాస్టర్‌ ప్లాన్‌!</strong>
    Spirit Movie: ప్రభాస్‌కు విలన్‌గా జూ.ఎన్టీఆర్‌? సందీప్‌ రెడ్డి వంగా మాస్టర్‌ ప్లాన్‌!
    ‘యానిమల్‌’ చిత్రంతో డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అతడి విభిన్నమైన డైరెక్షన్‌ స్కిల్స్‌ అందర్నీ మెస్మరైజ్‌ చేశాయి. అర్జున్‌ రెడ్డితో సందీప్‌ రెడ్డి పనితనం తెలుగు ఆడియన్స్‌కు ముందే తెలిసినప్పటికీ యానిమల్‌ మూవీతో అది దేశం మెుత్తానికి అర్థమైంది. ఇదిలా ఉంటే అతడి నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ ప్రభాస్‌తో ఉండనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో సందీప్‌ చాలా బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో తారక్‌ను సందీప్‌ కలవడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ‘స్పిరిట్‌’ సినిమాకు సంబంధించే తారక్‌ను కలిసినట్లు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వచ్చిన ఓ క్రేజీ బజ్‌ టాలీవుడ్‌ను షేక్‌ చేస్తోంది.&nbsp; ‘స్పిరిట్‌’లో విలన్‌గా తారక్‌? ప్రభాస్‌ హీరోగా సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో రూపొందనున్న ‘స్పిరిట్‌’ (Spirit)కు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ మూవీలో తారక్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తాడని నెట్టింట ప్రచారం జరుగుతోంది. తాజాగా తారక్‌ను సందీప్‌ రెడ్డి వంగా కలిసిన నేపథ్యంలో ఈ రూమర్‌ బయటకొచ్చింది. స్పిరిట్‌లో విలన్‌గా నటించాలని తారక్‌ను సందీప్‌ కోరినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ నటిస్తున్న ‘వార్‌ 2’ చిత్రంలో తారక్‌ నెగిటివ్ షేడ్స్‌ ఉన్న రోల్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాను విలన్‌గా ఎంత ప్రభావం చూపగలడో ‘జై లవకుశ’ చిత్రం ద్వారా తారక్‌ ఇప్పటికే నిరూపించాడు. ఇందులో ఎన్టీఆర్‌ త్రిపాత్రిభినయం చేయగా అందులో ఓ పాత్ర పూర్తిగా నెగిటివ్‌ షేడ్స్‌లో ఉంటుంది. దీంతో గ్లోబల్‌ స్థాయిలో తెరకెక్కనున్న ‘స్పిరిట్‌’ మూవీలో తారక్‌ విలన్‌గా చేస్తే బాగుటుందని సందీప్‌ రెడ్డి వంగా భావించినట్లు నెట్టింట టాక్‌ వినిపిస్తోంది. ఇందుకు తారక్ అంగీకరిస్తే ‘స్పిరిట్‌’పై అంచనాలు అమాంతం పెరగటం ఖాయమని అంటున్నారు.&nbsp; ఎక్కడ కలిశారంటే? సందీప్‌ రెడ్డి వంగా, జూనియర్‌ ఎన్టీఆర్‌ కలవడంపై రక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్పిరిట్‌లో తారక్‌ నటిస్తాడా? లేదా? అన్న విషయాన్ని కాస్త పక్కన పెడితే ప్రస్తుతం వీరిద్దరు కలవడానికి ఓ రీజన్ ఉన్నట్లు తెలుస్తోంది. దేవర ప్రమోషన్స్‌లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్‌ 9) వీరు కలిసినట్లు సమాచారం. ప్రస్తుతం తారక్‌ ‘దేవర’ ప్రమోషన్స్‌లో కోసం ముంబయికి వెళ్లారు. రేపు (సెప్టెంబర్ 10) అక్కడే దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో ఫుల్‌ క్రేజ్ ఉన్న సందీప్‌ రెడ్డి వంగాను తారక్‌ కలిసినట్లు తెలుస్తోంది. వీరు నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫొటో ఆ విధంగా బయటకు వచ్చిందేనని సమాచారం.&nbsp; తారక్‌తో స్పెషల్‌ ఇంటర్యూ! దేవర ప్రమోషన్స్‌లో భాగంగా సందీప్‌ రెడ్డి వంగా, జూనియర్‌ ఎన్టీఆర్‌ల మధ్య క్రేజీ ఇంటర్యూ కూడా జరిగినట్లు బాలీవుడ్‌లో మీడియా కోడై కూస్తోంది. ‘దేవర’ సినిమాకు సంబంధించి తారక్‌ను సందీప్‌ రెడ్డి వంగా పలు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. దీనిపై తారక్‌ అదిరిపోయే సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. మాస్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఈ ఇద్దరి మధ్య ఇంటర్యూ ఎలా ఉంటుందోనని తారక్‌, సందీప్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఈ ఇంటర్యూ టెలికాస్ట్ అవుతుందని సమాచారం.&nbsp; ట్రైలర్‌ రన్‌టైమ్‌ ఫిక్స్‌! రేపు విడుదల కాబోయే దేవర ట్రైలర్ రన్‌టైమ్‌ ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్‌&nbsp; 2 నిమిషాల 50 సెకన్ల పాటు ఉంటుందని సమాచారం. ట్రైలర్‌ను చాలా వరకూ యాక్షన్‌ సీక్వెన్స్‌తో దర్శకుడు కొరటాల శివ నింపేసినట్లు తెలుస్తోంది. అటు మూవీ టీమ్‌ కూడా యాక్షన్‌ ఫీస్ట్‌కు సిద్ధంగా ఉండండంటూ ట్రైలర్‌పై భారీ ఎత్తున హైప్‌ పెంచేసింది. కాగా ఇందులో తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ నటించింది. బాలీవుడ్‌ నటులు సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్‌ విలన్‌ పాత్రల్లో కనిపించనున్నారు. యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 10 , 2024
    Rashmika Mandanna: ఛీ.. సిగ్గులేకుండా ఇదేం పని! రణబీర్‌కు లిప్ లాక్‌తో రెచ్చిపోయిన రష్మిక.. ఆగ్రహంతో విజయ్ ఫ్యాన్స్
    Rashmika Mandanna: ఛీ.. సిగ్గులేకుండా ఇదేం పని! రణబీర్‌కు లిప్ లాక్‌తో రెచ్చిపోయిన రష్మిక.. ఆగ్రహంతో విజయ్ ఫ్యాన్స్
    బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌తో అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్ వంగా తెరకెక్కిస్తున్న చిత్రం యానిమల్‌ (Animal). బుధవారం ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ రిలీజవ్వగా ఇందులో ర‌ణ్‌బీర్‌ క‌పూర్‌ (Ranbir Kapoor), ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) లిప్‌లాక్‌ల‌తో అద‌ర‌గొట్టారు. ‘అమ్మాయి’ అంటూ సాగే ఈ పాట‌లో ఘాటైన ముద్దులతో రెచ్చిపోయారు. https://twitter.com/ilysmnojk/status/1712018933333778570?s=20 డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఈ సాంగ్‌ను ముద్దుతో ప్రారంభించడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ‘ఈ అబ్బాయిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం.. చూడండి ఏం చేశాడో’ అని రణ్‌బీర్‌పై రష్మిక ఫ్యామిలీ ఫైర్‌ అవుతుంటారు. ఆ మాటలను ఏమాత్రం పట్టించుకోని రణ్‌బీర్‌, రష్మిక.. కుటుంబ సభ్యుల ముందే లిప్‌లాక్‌ చేసుకోవడం షాక్‌కి గురిచేస్తుంది.&nbsp; ఆ త‌ర్వాత ఫ్లైట్ జ‌ర్నీలో ర‌ష్మిక, ర‌ణ్‌బీర్ ముద్దుల్లో మునిగిపోయిన‌ట్లుగా చూపించారు. ఇద్ద‌రు పెళ్లి చేసుకున్న‌ట్లుగా చూపించి పాట‌ను ఎండ్ చేశారు. ఈ ఫ‌స్ట్ సింగిల్‌లో ర‌ణ్‌భీర్‌, ర‌ష్మిక కెమిస్ట్రీ హైలైట్‌గా నిలుస్తోంది. రష్మికకు ఇది హిందీలో మూడో చిత్రం. అంతకుముందు అమితాబ్‌ బచ్చన్‌తో గుడ్ బై (Good Bye), సిద్దార్థ్‌ మల్హోత్రాతో ‘మిషన్‌ మజ్నూ’ (Mission Majnu) చిత్రాలు చేసినప్పటికీ గ్లామర్‌ షో చేసే అవకాశం ఆమెకు దక్కలేదు. తాజాగా రణ్‌బీర్‌ సినిమాలో మాత్రం ఈ భామ రెచ్చిపోయినట్లే కనిపిస్తోంది. రష్మికకు లిప్‌లాక్‌ సీన్‌ కొత్తేమి కాదు. గతంలో విజయ్‌ దేవరకొండతో చేసిన ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలోనూ ఈ భామ ముద్దు సీన్‌లో నటించింది. తాజాగా యానిమల్‌ చిత్రంలో ఇలా లిప్‌లాక్‌ సీన్‌ చేయడం ద్వారా బాలీవుడ్‌కు గట్టి సందేశాన్ని రష్మిక ఇచ్చినట్లు కనిపిస్తోంది. పాత్ర డిమాండ్‌ చేస్తే ఎటువంటి సాహసాలకైనా రెడీ అనే మెసేజ్‌ను ఈ భామ పంపింది. &nbsp; అటు డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా తన మార్క్‌ను ఈ సినిమాలోనూ కొనసాగించాడు. గతంలో అర్జున్‌ రెడ్డి మూవీ పోస్టర్‌ను సందీప్‌ లిప్‌లాక్‌తోనే రిలీజ్‌ చేశాడు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున వివాదమే చెలరేగింది. తాజాగా యానిమల్‌ ఫస్ట్‌ సింగిల్‌ పోస్టర్‌ను సైతం ఘాటైన ముద్దుతో చూపించడం సందీప్‌ వంగాకే చెల్లింది.  &nbsp; ఇదిలా ఉంటే రణ్‌బీర్‌, రష్మిక లిప్‌లాక్‌ సీన్లను విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే రష్మిక, అర్జున్‌ రిలేషన్‌లో ఉన్నారని వారు నమ్ముతున్నారు. డియర్‌ కామ్రేడ్‌ సినిమా నుంచే వీరి ప్రేమాయణం ప్రారంభమైందని సోషల్‌ మీడియాలో ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే విజయ్‌ ఫ్యాన్స్‌ రష్మికపై మండిపడుతున్నారు. మరికొందరు నెటిజన్లు యానిమల్‌ ఫస్ట్‌ సింగిల్‌పై ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు. లిరిక్స్‌, మ్యూజిక్ కంటే లిప్‌లాక్‌లే హైలైట్ అయ్యాయని పేర్కొంటున్నారు. పాట చూస్తుంటే యానిమ‌ల్ మూవీ అర్జున్‌రెడ్డికి మ‌రో వెర్ష‌న్‌లా ఉంద‌ని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. ఇన్ని లాప్‌లాక్‌లు అవ‌స‌ర‌మా అంటూ మ‌రో నెటిజ‌న్ ప్రశ్నించాడు.&nbsp; యానిమ‌ల్ మూవీ డిసెంబ‌ర్ 1న రిలీజ్ కానుంది. దాదాపు వంద కోట్ల వ్య‌యంతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో అనిల్ క‌పూర్‌, బాబీ డియోల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ు పోషించారు.&nbsp;
    అక్టోబర్ 11 , 2023
    <strong>Ranbir Kapoor: ‘యానిమల్‌పై వచ్చిన విమర్శలతో ఏకీభవిస్తా’.. రణ్‌బీర్‌ కపూర్‌ ప్లేట్‌ ఫిరాయించాడా!</strong>
    Ranbir Kapoor: ‘యానిమల్‌పై వచ్చిన విమర్శలతో ఏకీభవిస్తా’.. రణ్‌బీర్‌ కపూర్‌ ప్లేట్‌ ఫిరాయించాడా!
    బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా అర్జున్‌ రెడ్డి (Arjun Reddy) ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించగా అనిల్ కపూర్, తృప్తి దిమ్రి, బాబీ డియోల్, శక్తి కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబర్ 1న విడుదలైన ‘యానిమల్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అదే సమయంలో అనేక విమర్శలను సైతం మూటగట్టుకుంది. తీవ్ర హింసతోపాటు పలు సీన్స్‌లో మహిళను తక్కువ చేసి చూపారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే తొలిసారి ఈ విమర్శలపై రణ్‌బీర్‌ కపూర్‌ స్పందించాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. ‘అది నా బాధ్యత’ గోవా వేదికగా జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియా (IFFI)లో రణ్‌బీర్‌ కపూర్‌ మాట్లాడారు. ‘యానిమల్‌ (Animal) విషయంలో అందరి అభిప్రాయాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీసుకురావడం తమ బాధ్యతని రణ్‌బీర్ అన్నారు. అలాగే కొత్తదనాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పారు. నటీ నటులకు ఇది చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. నటులందరూ విభిన్నమైన పాత్రలు పోషించినప్పుడే కెరీర్‌ బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఈ వ్యాఖ్యలను యానిమల్ సినిమా అభిమానులు స్వాగతిస్తున్నారు. ఈ మూవీ గురించి విమర్శించిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చారని కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/IFFIGoa/status/1860953456476835977 అలా చెప్పకుండా తప్పుచేశారా? ‘యానిమల్‌’ గురించి రణ్‌బీర్‌ చేసిన వ్యాఖ్యలను కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు పెదవి విరుస్తున్నారు. విమర్శకుల అభిప్రాయాలతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పడం తమకు నచ్చలేదని కామెంట్స్ చేస్తున్నారు. అది ఓ రకంగా వారికి మద్దతు తెలియజేయడమేనని అభిప్రాయపడుతున్నారు. సినిమాను సినిమాలాగా చూడాలని రణ్‌బీర్‌ నేరుగా చెప్పి ఉంటే ఇంకా బాగుండేదని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అలా కాకుండా ‘కర్ర ఇరగొద్దు.. పాము చావొద్దు’ అన్న విధంగా రణ్‌బీర్‌ వ్యాఖ్యలు ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్ద విజయాన్ని అందించిన డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా గురించి కూడా కొన్ని పాజిటివ్‌ కామెంట్స్ చేసి ఉంటే బాగుండేదని అంటున్నారు. ఎనిమిది రోజులపాటు.. గోవాలోని పనాజీలో భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ (ఇఫ్ఫీ) (IFFI) వేడుకగా జరుగుతోంది. నవంబర్‌ 20న ప్రారంభమైన ఈ వేడుక నవంబర్‌ 28 వరకు జరగనుంది. ఇందులో పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు. అయితే బాలీవుడ్‌ దిగ్గజాలను నేటి తరానికి తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు రణ్‌బీర్‌ తన ప్రసంగంలో చెప్పారు. ఇందుకోసం డిసెంబర్‌ 13 నుంచి 15 వరకు ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. దేశమంతా రాజ్‌కపూర్‌ సినిమాలను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. గొప్ప వాళ్లను నేటితరం మర్చిపోకుండా ఉండాలంటే వారి సినిమాల గురించి ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వహించాలన్నారు.&nbsp; ఇద్దరూ బిజీ బిజీ ‘యానిమల్‌’తో సాలిడ్‌ విజయాన్ని అందుకున్న సెన్సేషన్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ప్రస్తుతం ప్రభాస్‌ (Prabhas)తో ‘స్పిరిట్‌’ (Spirit)ను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో సందీప్‌ చాలా బిజీగా ఉన్నాడు. వచ్చే నెల డిసెంబర్‌లో ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరగనున్నాయి. జనవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మెుదలవుతుంది. మరోవైపు ‘యానిమల్‌’ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ ప్రస్తుతం ‘రామయణ’ (Ramayana) అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నటిస్తున్నాడు. ఇందులో రాముడిగా ఆయన చేస్తున్నారు. సీతగా సాయిపల్లవి (Sai Pallavi) నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్‌ తివారి (Nitesh Tiwari) దర్శకత్వం వహిస్తున్నారు. మెుత్తం రెండు పార్ట్స్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగాన్ని 2025 దీపావళికి విడుదల చేయనున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు.&nbsp;
    నవంబర్ 25 , 2024
    Spirit Heroine: ‘స్పిరిట్‌’లో ప్రభాస్‌కు జోడీగా ఆ స్టార్‌ హీరోయిన్‌.. 16 ఏళ్ల ఎదురుచూపులకు తెర!
    Spirit Heroine: ‘స్పిరిట్‌’లో ప్రభాస్‌కు జోడీగా ఆ స్టార్‌ హీరోయిన్‌.. 16 ఏళ్ల ఎదురుచూపులకు తెర!
    ‘అర్జున్‌రెడ్డి’తో తొలి ప్రయత్నంలోనే సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘యానిమల్‌’ (Animal) కూడా జాతీయ స్థాయిలో ప్రభంజనం సృష్టించింది. రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), రష్మిక (Rashmika Mandanna) హీరో, హీరోయిన్లుగా చేసిన ఈ చిత్రం.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. దీంతో ఆయన తర్వాతి సినిమాపై అందరి దృష్టి పడింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ సినిమా తీయబోతున్నట్లు గతంలోనే సందీప్‌ రెడ్డి ప్రకటించారు. దీంతో షూట్‌ ప్రారంభానికి ముందే వీరి కాంబినేషన్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌కు సంబంధించి క్రేజీ న్యూస్ బయటకొచ్చింది.&nbsp; ప్రభాస్‌ సరసన స్టార్ హీరోయిన్‌! ప్రభాస్‌ - సందీప్‌ రెడ్డి కాంబోలో రానున్న స్పిరిట్‌ చిత్రంలో హీరోయిన్‌ ఎవరన్న ప్రశ్న.. గత కొన్ని రోజులుగా ఫ్యాన్స్‌ను వెంటాడుతోంది. ఇటీవల నేషనల్‌ క్రష్‌ రష్మిక (Rashmika Mandanna) ప్రభాస్ పక్కన చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ‘స్పిరిట్‌’లో హీరోయిన్‌ ఎవరన్న విషయం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన స్టార్‌ హీరోయిన్‌ త్రిష (Trisha) చేయబోతున్నట్లు సమాచారం. ప్రముఖ ఫిల్మ్‌ సైట్‌ IMDB.. ‘స్పిరిట్‌’ మూవీ క్యాస్ట్ విభాగంలో త్రిషను హీరోయిన్‌గా చేర్చింది. స్పిరిట్‌లో ఆమె పాత్ర పేరును ‘గీత’ పేర్కొంది. అలాగే సీనియర్‌ నటుడు అనంత నాగ్‌ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు IMDB తన సైట్‌లో పేర్కొంది. దీంతో త్రిష ఎంపిక కన్ఫార్మ్‌ అయి ఉండవచ్చని సోషల్‌ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.&nbsp; గతంలోనే స్టార్‌ జోడీగా గుర్తింపు! ప్రభాస్‌ - త్రిష జంటగా నటించడం ‘స్పిరిట్‌’తోనే తొలిసారి కాదు. వారి కాంబినేషన్‌లో గతంలో మూడు చిత్రాలు విడుదలయ్యాయి. 2004లో వచ్చిన ‘వర్షం’ చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్రభాస్‌ - త్రిష మధ్య కెమెస్ట్రీ అద్భుతంగా కుదరడంతో మెస్మరైజింగ్‌ జోడీగా వారు గుర్తింపు పొందారు. ఆ తర్వాత పౌర్ణమి (2006), బుజ్జిగాడు (2008) సినిమాలోనూ ఈ జంట కలిసి నటించింది. బుజ్జిగాడు యావరేజ్‌ టాక్‌ తెచ్చుకోగా.. పౌర్ణమి మాత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ హ్యాట్రిక్‌ సినిమాల జోడి తిరిగి తెరపై కనిపించనుందని వార్తలు వస్తుండటం ఆసక్తికరంగా మారింది.&nbsp; అర్జున్‌ రెడ్డి, యానిమల్‌కు భిన్నంగా..! దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ను విభిన్నంగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అర్జున్‌ రెడ్డి (Arjun Reddy), యానిమల్‌ (Animal) సినిమాల తరహాలో పెద్దింటి కుటుంబాల మధ్య కథను అల్లకుండా మధ్యతరగతి బ్యాక్‌డ్రాప్‌లో దీన్ని తీయనున్నట్లు ‘స్పిరిట్‌’ (Spirit) సినిమాకు సంబంధించిన ప్లాట్‌లో IMDB పేర్కొంది. అయితే దీన్ని చిత్ర యూనిట్‌ ధ్రువీకరించాల్సి ఉంది. మరోవైపు స్పిరిట్‌లో ప్రభాస్‌ పాత్రకు సంబంధించి గతంలోనే సందీప్‌ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని పేర్కొన్నాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని.. గతంలో ఎప్పుడూ చూడని ప్రభాస్‌ను ఈ మూవీలో చూడబోతున్నట్లు సందీప్‌ చెప్పడం విశేషం.&nbsp; ‘స్పిరిట్‌’ నిర్మాత ఏమన్నారంటే? స్పిరిట్‌ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత భూషణ్‌కుమార్‌ నిర్మించనున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించి ఆయన కీలక అప్‌డేట్స్‌ ఇచ్చారు. స్పిరిట్‌ చాలా ప్రత్యేకమైన సినిమా అని ఆయన అన్నారు. ఇందులో ప్రభాస్‌ తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి లాఠీ ఝుళిపిస్తారని పేర్కొన్నారు. ‘అలాగే ఈ సినిమాకు సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చిత్రం గురించి ఒక విషయం కచ్చితంగా చెప్పగలను. ఇందులో మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ని చూస్తారు’ అని భూషణ్‌ కుమార్‌ చెప్పారు. ఈ వార్త విన్నప్పటి నుంచి ప్రభాస్‌ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.&nbsp; భారీ ఆఫర్లతో దూసుకెళ్తున్న త్రిష! గత కొంతకాలంగా సరైన సినిమాలు లేక టాలీవుడ్‌కు దూరమైన నటి త్రిష.. తిరిగి గట్టి కమ్‌బ్యాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ భామ ముగ్గురు స్టార్‌ హీరోల సరసన నటించబోతోంది! ఇప్పటికే చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రంలో త్రిషను హీరోయిన్‌గా ఫిక్స్‌ చేశారు. అటు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రానున్న ‘ఎఫ్‌ 4’ మూవీలో వెంకటేష్‌ సరసన త్రిష పేరును పరిశీలిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. తాజాగా ప్రభాస్‌ సరసన ‘స్పిరిట్‌’లో త్రిష ఛాన్స్‌ కొట్టేసినట్లు వార్తలు వస్తుండటం ఆమె ఫ్యాన్స్‌ను సంతోషంలో ముంచెత్తుతోంది.&nbsp;
    ఫిబ్రవరి 27 , 2024
    Tamannaah Bhatia: ఎద పొంగుల అందంతో రచ్చ రేపుతున్న మిల్కీ బ్యూటీ!
    Tamannaah Bhatia: ఎద పొంగుల అందంతో రచ్చ రేపుతున్న మిల్కీ బ్యూటీ!
    మిల్కీ బ్యూటీ తమన్నా మరోమారు తన అందచందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. బిగుతైన అవుట్‌ఫిట్‌లో యద అందాలను ఆరబోసింది. ముంబయిలో జరిగిన యానిమల్‌ సక్సెస్‌ పార్టీలో పాల్గొన్న తమన్నా.. తాజా లుక్‌తో అక్కడి వారిని కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తమన్నా ఇండస్ట్రీకి పరిచయమై 18 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తూ కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెడుతోంది.&nbsp; View this post on Instagram A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus) మెుదట బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తమన్నా.. ఆ తర్వాత దక్షిణాదిలో వరుస సినిమాలు చేసి స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది.&nbsp; https://twitter.com/Zoom_News_India/status/1743860862207803778?s=20 గతేడాది చిరంజీవితో చేసిన ‘భోళాశంకర్‌’ చిత్రం నిరాశ పరిచినా.. రజనీకాంత్‌ ‘జైలర్‌’తో ఈ భామ ఘన విజయాన్ని అందుకుంది.&nbsp; అయితే జైలర్‌ విజయం తర్వాత తమన్నాకు ఆ స్థాయిలో సినిమా ఆఫర్లు రాకపోవడంతో ఫ్యాన్స్‌ నిరాశకు గురవుతున్నారు.&nbsp; View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) ప్రస్తుతం తమిళంలో ‘అరణ్మణై-4’ చిత్రంతో పాటు ‘హిందీ’లో వేద సినిమాలో తమన్నా నటిస్తోంది. అలాగే మలయాళంలోనూ మరో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లపైనా ఈ భామ ఫోకస్‌ పెట్టింది. ఇటీవల ‘లస్ట్‌ స్టోరీస్‌-2’ వెబ్‌సిరీస్‌లో తమన్నా బోల్డ్‌గా కనిపించింది. తన ప్రియుడు విజయ్‌ వర్మతో ముద్దు సీన్లలో రెచ్చిపోయింది.&nbsp; ఇప్పటికే 11th అవర్,&nbsp; నవంబర్ స్టోరీ వంటి రెండు వెబ్ సిరీస్‌లతో తమన్నా ఓటీటీ ప్రేక్షకులను అలరించింది. ఇటీవలలో ‘జీ కర్డా’, ‘ఆఖ్రీ సచ్‌’ వంటి సిరీస్‌లలో కనిపించి మెప్పించింది. ఓ వైపు సినిమాలు, సిరీస్‌లు చేస్తూనే వ్యాపార రంగంపైనా ఈ భామ దృష్టి సారిస్తోంది. వాణిజ్య ప్రకటనల్లో నటించడంతో పాటు పెళ్లిళ్లు, ఇతరత్రా వేడుకల్లో డ్యాన్స్‌ చేస్తూ భారీ మెుత్తంలో అర్జిస్తోంది. మరోవైపు భాయ్‌ ఫ్రెండ్‌ విజయ్‌ వర్మతో షికార్లు చేస్తూ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. సోషల్‌ మీడియాలో తన గ్రామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ ఎప్పటికప్పుడు హాట్‌ ట్రీట్‌ ఇస్తోంది.&nbsp;
    జనవరి 08 , 2024
    <strong>Spirit: ప్రభాస్‌ సరసన మృణాల్‌ ఠాకూర్.. పిక్స్ వైరల్</strong>
    Spirit: ప్రభాస్‌ సరసన మృణాల్‌ ఠాకూర్.. పిక్స్ వైరల్
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas), డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబోలో ‘స్పిరిట్‌’ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరూ కెరీర్‌ పరంగా ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. ప్రభాస్‌ రీసెంట్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) సూపర్‌ హిట్‌ కాగా, సందీప్‌ రెడ్డి తెరకెక్కించిన 'యానిమల్‌' చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. దీంతో వీరి కాంబోలో రానున్న 'స్పిరిట్‌' (Spirit) ఇక ఏ స్థాయిలో ఉంటుందోనని ఆడియన్స్‌లో ఇప్పటి నుంచే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పటివరకూ స్పిరిట్‌కు సంబంధించి ఎన్నో గాసిప్స్‌ బయటకు వచ్చాయి. తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రభాస్‌ జోడీగా స్టార్‌ హీరోయిన్‌ లాక్ అయినట్లు తెలుస్తోంది.  మృణాల్‌తో ప్రభాస్‌ రొమాన్స్‌! ప్రభాస్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో రానున్న ‘స్పిరిట్‌’ (Spirit) చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్‌ థాకూర్‌ (Mrunal Thakur) ఫిక్స్ అయినట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సందీప్‌ రెడ్డి వంగాతో ఆమెకు అగ్రిమెంట్‌ కూడా కుదిరిందని బజ్‌ వినిపిస్తోంది. తొలుత ఇద్దరు, ముగ్గురు పేర్లు పరిశీలించిన సందీప్‌.. ఫైనల్‌గా సీతారామం బ్యూటీకే ఓటు వేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్‌కు పెయిర్‌గా ఆమె అయితేనే చక్కగా బాగుటుందని మూవీ టీమ్‌ భావించినట్లు సమాచారం. పైగా ఈ జోడీ ఇప్పటివరకూ కలిసి నటించకపోవడంతో తెరపై చూసిన వారికి ఫ్రెష్‌గా అపిస్తుందని మేకర్స్ అనుకున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు తెలుస్తోంది.  ఫుల్‌ స్వింగ్‌లో స్క్రిప్ట్‌ వర్క్‌.. ప్రస్తుతం సందీప్‌ రెడ్డి వంగా ఫోకస్‌ మెుత్తం ‘స్పిరిట్‌’ (Spirit) పైనే ఉంది. ఈ మూవీ ప్రీ - ప్రొడక్షన్‌, స్క్రిప్ట్‌ వర్క్‌ ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో బజ్‌ వినిపిస్తోంది. ఇప్పటివరకూ ఏ డైరెక్టర్‌ చూపిన విధంగా ప్రభాస్‌ను ఆయన ప్రభాస్‌ను రీ ఇంట్రడ్యూస్‌ చేస్తారని లేటెస్ట్‌ సమాచారం అందుతోంది. ఇక స్పిరిట్‌కు సంబంధించి మరో పోస్టర్‌ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ‘పోలీసులలో మంచి వారుంటారు.. చెడ్డవారుంటారు.. అలాగే అతడూ ఉన్నాడు’ అంటూ రక్తంతో తడిసిన పోలీసు మెడల్‌ పోస్టర్‌ సైతం నెట్టింట విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ రెండు అప్‌డేట్స్‌తో స్పిరిట్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయని చెప్పవచ్చు.&nbsp; https://twitter.com/thetalkenti/status/1867877611852226619 https://twitter.com/BFilmyOfficial_/status/1867880194939277662 ప్రభాస్‌ - మృణాల్ ఏఐ పిక్స్‌ వైరల్‌ ప్రభాస్‌తో మృణాల్‌ జతకట్టడం ఖాయమంటూ నెట్టింట ప్రచారం మెుదలు కావడంతో డార్లింగ్‌ ఫ్యాన్స్ అలెర్ట్‌ అయ్యారు. ‘స్పిరిట్‌’లో వారి జోడీ ఏ విధంగా ఉంటుందో ముందుగానే ఊహించి ఏఐ జనరేటేడ్‌ పిక్స్‌ను నెట్టింట అప్‌లోడ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఖాకీ డ్రెస్‌లో ప్రభాస్‌, బ్లాక్‌ శారీలో మృణాల్ ఉన్న ఏఐ పిక్‌ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అలాగే ఎదురెదురుగా ప్రభాస్, మృణాల్‌ నిలబడి ఒకరి కళ్లల్లో మరొకరు చూసుకుంటున్న ఫిక్‌ కూడా మెప్పిస్తోంది. ఆ ఫొటోలను మీరూ చూసేయండి. https://twitter.com/ursnaveenOO7/status/1867872170392822045 https://twitter.com/MalayalamReview/status/1867901481430741203 https://twitter.com/Box_Office_BO/status/1867870995748622686 https://twitter.com/Akashsinghakki4/status/1867919899416477813 విలన్స్‌గా బాలీవుడ్‌ జంట బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) ఇటీవల కాలంలో విలన్ రోల్స్‌ కేరాఫ్‌గా మారాడు. ‘ఆదిపురుష్‌’ చిత్రంలో రావణాసురుడిగా నటించినా సైఫ్‌ అలీఖాన్‌ ‘దేవర’లో తారక్‌కు ప్రత్యర్థిగా నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు స్పిరిట్‌లోనూ విలన్‌గా అతడే నటించబోతున్నట్లు సమాచారం.  ప్రభాస్‌ను ఢీకొట్టే పవర్‌ఫుల్‌ పాత్రలో సైఫ్‌ కనిపించనున్నట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. సైఫ్‌ అలీఖాన్‌ భార్య కరీనా కపూర్‌ (Kareena Kapoor) కూాడా నెగిటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు రూమర్లు ఉన్నాయి. అదే నిజమైతే ‘స్పిరిట్‌’పై అంచనాలు మరో లెవల్‌కు వెళ్లడం ఖాయమని అంటున్నారు.  https://twitter.com/dreamworlddigi/status/1867924942609666122
    డిసెంబర్ 14 , 2024
    <strong>Sandeep Reddy Vanga: తల్లి సెంటిమెంట్‌పై సందీప్‌ రెడ్డి వంగా కొత్త సినిమా?</strong>
    Sandeep Reddy Vanga: తల్లి సెంటిమెంట్‌పై సందీప్‌ రెడ్డి వంగా కొత్త సినిమా?
    భారతీయ చిత్ర పరిశ్రమలో దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కొత్త ఒరవడిని సృష్టించాడు. మూస ధోరణి సీన్లు, రెగ్యులర్‌ స్క్రీన్‌ప్లేకు స్వస్థి చెప్పి తనదైన కొత్త తరహా మేకింగ్‌ స్టైల్‌ను అందరికీ పరిచయం చేశాడు. తన సినిమాల్లో ఎక్కువగా వైలెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే సందీప్‌ రెడ్డి ‘యానిమల్‌’ (Animal)లో వైలెన్స్‌తో పాటు తండ్రి సెంటిమెంట్‌ను సైతం బాగా చూపించాడు. తన చిత్రాల్లో తండ్రి పాత్రలను ప్రాధాన్యత ఇచ్చే సందీప్‌ తల్లి రోల్స్‌ను అంతగా పట్టించుకోడన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్‌ రెడ్డి తన సినిమాల్లో తల్లి పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వడానికి గల కారణాన్ని వివరించారు. ప్రస్తుతం ఆ కామెంట్స్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ‘అమ్మను ఎదిరించాను’ సెన్సేషన్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి&nbsp; (Sandeep Reddy Vanga) రంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన సినిమాల్లో తల్లి రోల్స్‌కు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడో వివరించాడు. తన అమ్మతో తాను చాలా చనువుగా ఉంటానని సందీప్‌ తెలిపారు. ఆమె తనను బాగా&nbsp; సపోర్ట్ చేస్తుందని చెప్పారు. కెరీర్‌లో ముందుకెళ్లడానికి తన మదర్‌ చాలా సహకరించిందని, యాక్టింగ్‌ స్కూల్‌ ఫీజుల దగ్గర నుంచి అర్జున్‌ రెడ్డి ప్రొడక్షన్‌ వరకు ఎన్నో విషయాల్లో ఆమె సపోర్ట్ ఉందని చెప్పారు. అమ్మతో ఎక్కువ ఎటాచ్‌మెంట్ ఉండడం వల్ల ఒక్కోసారి ఆమెను ఎదిరించిన సందర్భాలు సైతం ఉన్నాయని చెప్పించారు. తమ బంధంలో ఎలాంటి సమస్యలు లేకపోవడం వల్లే సినిమాల్లో ఆ డ్రామాను తీసుకురాలేకపోతున్నట్లు స్పష్టం చేశారు. ఒకవేళ తల్లి- కుమారుడు సెంటిమెంట్‌తో సినిమా తీస్తే అది పాజిటివ్‌గా ఉంటుందని, అందులో హింసకు చోటుండదని చెప్పుకొచ్చాడు.&nbsp; తండ్రి-కొడుకుల బాండింగ్‌ సూపర్బ్‌ సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించిన ‘యానిమల్‌’(Animal) చిత్రం గతేడాది డిసెంబర్‌లో విడుదలై బ్లాక్‌బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఇందులో వైలెన్స్‌తో పాటు తండ్రీ, తనయుల మధ్య అనుబంధాన్ని సందీప్‌ చక్కగా చూపించాడు. యాక్షన్‌ &amp; ఎమోషన్‌ డ్రామా ఫిల్మ్‌గా కళ్లకు కట్టాడు. ఇందులో బాలీవుడ్ దిగ్గజ నటుడు అనిల్‌కపూర్‌ తండ్రి పాత్రలో యాక్ట్‌ చేయగా రణ్‌బీర్‌ కపూర్‌ తనయుడిగా చేశాడు. బాబీదేవోల్‌ ప్రతి నాయకుడిగా కనిపించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీనికి కొనసాగింపుగా ‘యానిమల్‌ పార్క్‌’ రానున్న విషయం తెలిసిందే.&nbsp; మూడు విభిన్న లుక్స్‌తో.. యానిమల్‌ తర్వాత రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో సందీప్‌ (Sandeep Reddy Vanga) ‘స్పిరిట్‌’ అనే ప్రాజెక్ట్‌ రూపొందించనున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్‌ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. పోలీసు లుక్‌తో పాటు మరో రెండు లుక్స్‌లో ప్రభాస్ కనిపించే ఛాన్స్ ఉందని చర్చ జరుగుతోంది. ‘యానిమల్‌’లో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కనిపించిన తరహాలోనే మరో రెండు కొత్త లుక్స్‌లో ప్రభాస్‌ అలరించే అవకాశముందని స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. డిసెంబర్‌ ఎండింగ్‌లోపు సినిమాను లాంఛనంగా ప్రారంభించి 2025 జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్‌ మెుదలు పెట్టాలని సందీప్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. అక్కడి నుంచి 6 నెలల్లోనే సినిమాను కంప్లీట్‌ చేయాలని భావిస్తున్నట్లు ఇటీవల చిత్ర నిర్మాత ప్రకటించారు. దీంతో మూవీ లాంచింగ్‌ కార్యక్రమం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.&nbsp; భారీ బడ్జెట్‌తో.. ప్రభాస్‌ (Prabhas) హీరోగా సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో రాబోతున్న ‘స్పిరిట్‌’ (Spirit)పై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించి నెట్టింట ఓ వార్త హల్‌ చల్‌ చేస్తోంది.&nbsp; ఈ సినిమాకు ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు టాక్ వినిపిస్తోంది. తొలుత ఈ మూవీ బడ్జెట్ రూ.500 కోట్లు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత రూ. 750 కోట్లకు పెరిగిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రూ.1000 కోట్లతో ఈ సినిమా రూపొందనున్నట్లు బజ్‌ వినిపిస్తోంది. అదే నిజమైతే బడ్జెట్‌ పరంగా ప్రభాస్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ మూవీగా 'స్పిరిట్‌' నిలవనుంది.
    డిసెంబర్ 07 , 2024
    <strong>Spirit Updates: ‘స్పిరిట్‌’పై అధికారిక అప్‌డేట్స్‌.. రెండు సాంగ్స్‌ రెడీ.. రిలీజ్‌ డేట్ కూడా ఫిక్స్‌!</strong>
    Spirit Updates: ‘స్పిరిట్‌’పై అధికారిక అప్‌డేట్స్‌.. రెండు సాంగ్స్‌ రెడీ.. రిలీజ్‌ డేట్ కూడా ఫిక్స్‌!
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas), డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కెరీర్‌ పరంగా ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. ప్రభాస్‌ రీసెంట్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) సూపర్‌ హిట్‌ కాగా, సందీప్‌ రెడ్డి తెరకెక్కించిన 'యానిమల్‌' చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ఇక వీరిద్దరి కాంబోలో రాబోతున్న 'స్పిరిట్‌' (Spirit) చిత్రం ఇక ఏ స్థాయిలో ఉంటుందోనని ఆడియన్స్‌లో ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాపై చాలా గాసిప్స్‌ ఉన్నప్పటికీ అఫిషియల్‌గా ఏ ప్రకటన రాలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన స్పిరిట్‌ నిర్మాత.. మూవీకి సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు.&nbsp; ‘2026 మిడిల్‌లో రిలీజ్‌’ సందీప్ రెడ్డి గత చిత్రం 'యానిమల్‌'ను నిర్మించిన బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్‌ ‘స్పిరిట్‌’ను సైతం ప్రొడ్యూస్‌ చేయనున్నారు. తాజాగా బాలీవుడ్‌ మీడియాతో మాట్లాడిన టీ సిరీస్‌ నిర్మాత భూషణ్‌ కుమార్‌ తన అప్‌కమింగ్‌ ప్రాజెక్ట్‌ 'స్పిరిట్‌' గురించి తొలిసారి స్పందించారు. ప్రభాస్‌ 'స్పిరిట్‌' చిత్రాన్ని డిసెంబర్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లేలా ప్లాన్‌ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే నెలలోనే ముహోర్తం షాట్ ఉంటుందని చెప్పారు. 2026 మిడిల్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ప్రస్తుతం స్టోరీ వర్క్‌లో బిజీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే స్పిరిట్‌ సాంగ్స్‌ గురించి కూడా ఆయన వర్క్‌ చేస్తున్నట్లు చెప్పారు. తాను రెండు సాంగ్స్‌ విన్నానని, అవి బాగున్నాయని వివరించారు. కాగా, యానిమల్‌కు సంగీతం అందించిన హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ స్పిరిట్‌కు సైతం మ్యూజిక్ ఇవ్వనున్నారు. ఇటీవల హర్షవర్దన్‌ కంపోజ్‌ చేసిన సాంగ్‌ను సందీప్‌ రెడ్డి వింటున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.&nbsp; https://twitter.com/Fukkard/status/1856301078016303591 View this post on Instagram A post shared by Harshavardhan Rameshwar (@harshavardhan_rameshwar) రాజా సాబ్‌పై ప్రశంసలు.. ప్రభాస్‌ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న 'ది రాజాసాబ్‌' (The Raja Saab) సినిమాపై కూడా నిర్మాత భూషణ్‌ కుమార్‌ మాట్లాడారు. తాను రాజా సాబ్‌ మూవీకి సంబంధించి కొన్ని సీన్స్‌ చూశానని, విజువల్స్‌ అద్భుతంగా వచ్చాయని ప్రశంసించారు. హాలీవుడ్‌ సినిమా 'హ్యారీ పోటర్‌'ను తలపించేలా ఆ సన్నివేశాలు ఉన్నాయని ఆకాశానికెత్తారు. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ది రాజా సాబ్‌ చిత్రంలో ప్రభాస్‌ డ్యూయల్‌ రోల్స్‌ చేస్తున్నాడు. ప్రభాస్‌ ఓల్డ్‌ లుక్‌కు సంబంధించి ఇటీవల ఓ పోస్టర్‌ సైతం రిలీజైంది. ఇందులో ప్రభాస్‌ డెవిల్‌ అట్మాస్పియర్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2025 ఏప్రిల్‌ 10న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.&nbsp; తొలుత పోలీసు.. తర్వాత! సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) రూపొందించనున్న ‘స్పిరిట్‌’ (Spirit) చిత్రంలో ప్రభాస్‌ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపిస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పాత్రతో పాటు మరో కీ రోల్‌లో ప్రభాస్ కనిపిస్తారని ఓ వార్త ఇటీవల చక్కర్లు కొట్టింది. దాని ప్రకారం కథలో తొలుత పోలీసుగా కనిపించిన ప్రభాస్‌ అనేక నాటకీయ పరిణామాల తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా మారతారని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో భారీ వైల్డ్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉంటాయని చెబుతున్నారు. ‘యానిమల్‌’కు మించిన వైలెన్స్‌, ఫైట్‌ సీక్వెన్స్‌ను ‘స్పిరిట్‌’లో చూస్తారని అంటున్నారు. దీంతో స్పిరిట్‌పై అంచనాలు మరింత పెరిగాయని చెప్పవచ్చు.&nbsp; భారీ బడ్జెట్‌తో.. స్పిరిట్‌ చిత్రాన్ని టీ-సిరీస్‌ భూషణ్‌ కుమార్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్లు సమాచారం. ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్‌ను ఈ మూవీకి కేటాయించినట్లు టాక్ వినిపిస్తోంది. తొలుత ఈ మూవీ బడ్జెట్ రూ.500 కోట్లు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత రూ. 750 కోట్లకు పెరిగిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రూ.1000 కోట్లతో ఈ సినిమా రూపొందనున్నట్లు బజ్‌ వినిపిస్తోంది. అదే నిజమైతే బడ్జెట్‌ పరంగా ప్రభాస్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ మూవీగా 'స్పిరిట్‌' నిలవనుంది. బడ్జెట్‌లో రూ.600 కోట్లు నటీనటుల పారితోషానికే వెళ్లనున్నట్లు సమాచారం. ఒక్క ప్రభాస్‌కే రూ.300 కోట్లు చెల్లించనున్నట్లు ఫిల్మ్‌ వర్గాల టాక్‌.
    నవంబర్ 13 , 2024
    <strong>Pushpa 2 Item Song:&nbsp; పుష్ప 2 ఐటెం సాంగ్‌లో శ్రీలీల, శ్రద్ధా కపూర్?.. రొమాన్స్‌తో రెచ్చిపోనున్న బన్నీ!</strong>
    Pushpa 2 Item Song:&nbsp; పుష్ప 2 ఐటెం సాంగ్‌లో శ్రీలీల, శ్రద్ధా కపూర్?.. రొమాన్స్‌తో రెచ్చిపోనున్న బన్నీ!
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2: ది రూల్‌’ (Pushpa 2: The Rule). గతంలో వచ్చిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం 'పుష్ప: ది రైజ్‌' కి సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతోంది. పుష్ప ది రైజ్‌లో ఐటెం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో  అందరికి తెలిసిందే. సమంత చేసిన ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ పాటకి థియేటర్లు మార్మోగాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా (Pushpa 2 Item Song)ఈ సాంగ్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో ఇప్పుడు పార్ట్ 2లో ఐటెం సాంగ్ కూడా అంతకంటే ఎక్కువగా ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే పుష్ప 2లో రానున్న ఐటెం సాంగ్‌లో ఎవరు నటిస్తారన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది.  తొలుత యానిమల్‌ బ్యూటీ త్రిప్తి దిమ్రి ‘పుష్ప 2’ ఐటెం సాంగ్‌ చేస్తుందని అంతా భావిస్తుండగా చిత్ర యూనిట్ ఆమెకు షాకిచ్చినట్లు తెలుస్తోంది. తృప్తి దిమ్రి చేత రిహార్సల్స్ చేయించగా వచ్చిన అవుట్‌పుట్ పట్ల మేకర్స్ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. దీంతో ఆమెను పక్కకు పెట్టారని టాక్ నడుస్తోంది. ఆమె స్థానంలో టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన ఇద్దరు యువ హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ‘పుష్ప’ మూవీపై దేశవ్యాప్తంగా విపరీతమైన బజ్ ఏర్పడింది. ప్రీ రిలీజ్ బిజినెస్‌ ఏకంగా రూ.1000 కోట్లు దాటింది. దీంతో మేకర్స్ ప్రతి అంశంపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పార్ట్ 1 కన్న ఘనంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పార్ట్‌ 1 ఫీల్‌ ఏమాత్రం తగ్గినా పుష్ప 2 విజయం సాధించదు అనే భావనలో జాగ్రత్త వహిస్తున్నారు. ముఖ్యంగా పుష్పలో పాటలు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా ఊ ఊ&nbsp; అంటావా’ అనే ఐటెం సాంగ్‌ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్‌ చేసింది. బన్నీ-సామ్‌ కలిసి వేసిన స్టెప్స్‌&nbsp; ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్‌ సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఐటెం సాంగ్‌లో శ్రీలీల పుష్ప 2లో ఐటెం సాంగ్‌లో బన్నీ సరసన నర్తించేందుకు చిత్ర బృందం శ్రీలీలను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ గ్లామర్‌పై యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. గుంటూరుకారం సినిమాలో సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో కలిసి చేసిన ఐటెం సాంగ్ ఎంత ప్రజాదారణ పొందిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో "ఆ కుర్చి మడతపెట్టి" సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్ ఇరగదీసింది. అందాల ప్రదర్శనతో పాటు (Pushpa 2 Item Song)డ్యాన్స్‌తోనూ అదరగొట్టింది. మహేష్‌తో పోటీపడి మరి స్టెప్పులేసింది. లుక్స్, గ్లామర్‌ షో పరంగా ఆకట్టుకుంది. దీంతో శ్రీలీలను ఐటెం సాంగ్‌లో తీసుకోవాలనే ప్రయత్నాలను మూవీ మేకర్స్ ముమ్మరం చేశారు. ఇందుకు సుకుమార్, బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఇక ఈ ఇద్దరి కలయిక ఎలా ఉంటోందో అని ప్రేక్షకులు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన బన్నీ, ఈ కుర్ర హీరోయిన్‌తో స్టెప్పులు ఇరగదీయనున్నాడు. బన్నీతో శ్రద్ధా కపూర్‌ రొమాన్స్ పుష్ప 2 ఐటెం సాంగ్‌ కోసం వినిపిస్తున్న మరో పేరు బాలీవుడ్ అందాల తార శ్రద్దా కపూర్. రీసెంట్‌గా ఆమె నటించిన స్త్రీ-2 ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె గ్లామర్ షోక్ యూత్ ఫిదా అయిపోయింది. దీంతో శ్రద్ధా కపూర్‌ పేరును కూడా (Pushpa 2 Item Song)ఐటెం సాంగ్‌ కోసం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆమెతో మూవీ యూనిట్ మాట్లాడినట్లు సమాచారం. ఒక వేళ శ్రద్ధా కపూర్ ఒకే చెబితే.. పాన్‌ ఇండియా రేంజ్‌లో పుష్ప బజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అయితే పుష్ప2 ఐటెం సాంగ్‌లో ఎవరు నటిస్తారనేదానిపై గత వారం ఆ చిత్ర నిర్మాత ఓ ప్రకటన చేశారు. నవంబర్‌లో ఐటెం సాంగ్ షూట్‌ ఉంటుందని అప్పుడే అల్లు అర్జున్ సరసన నర్తించే హీరోయిన్ పేరు వెల్లడిస్తామని తెలిపారు. సో, త్వరలోనే ఆ వ్యక్తి పేరు అధికారికంగా బయటకు రానుంది. బన్నీ సరసన ఇద్దరు హీరోయిన్లు 'పుష్ప 2'లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులోని ఐటెం సాంగ్‌లో రష్మిక మంధాన కూడా స్టెప్పులు వేయబోతున్నట్లు సమాచారం. ఐటెం గార్ల్‌తో పాటు రష్మిక కూడా ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపనుందని ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్ట్‌ 1లో రష్మిక ఉన్నప్పటికీ ఐటెం సాంగ్‌లో ఆమె కనిపించలేదు. ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ అంటూ బన్నీ- సమంత ఇద్దరే స్టెప్పులు ఇరగదీశారు. ఈసారి రష్మికతో కలిసి ఇద్దరు భామలు ఐటెం సాంగ్‌లో కనిపించనుండటంతో మూవీ లవర్స్‌లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ ఇద్దరి భామాలతో కలిసి బన్నీ ఏ స్థాయిలో అలరిస్తాడో మరి చూడాలి.&nbsp; నవంబర్‌లో పుష్ప మేనియా నవంబర్ నెలను పుష్ప నెల అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రకటించారు. మూవీ విడుదలకు మరో నెల మాత్రమే మిగిలి ఉండటంతో ప్రమోషన్లు షూరు చేస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. నవంబర్‌లో దేశవ్యాప్తంగా పర్యటించనున్నట్లు హింట్ ఇచ్చారు. అన్ని భాషల్లో ప్రచారాన్ని త్వరలో మొదలపెట్టనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 15 నుంచి ఈ ప్రక్రియ మొదలు కానున్నట్లు టాక్. ఈ ప్రమోషన్లలో అల్లు అర్జున్‌తో పాటు మూవీ యూనిట్‌ పాల్గొననుంది. చివరి దశకు 'పుష్ప 2' షూటింగ్ 'పుష్ప 2' చిత్రానికి సంబంధించి షూటింగ్ దాదాపు కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఒక్క ఐటెం సాంగ్ మినహా మొత్తం వర్క్ ఫినిష్ చేశారని సమాచారు. గత నెలలో&nbsp; రామోజీ ఫిల్మ్‌ సిటీలో&nbsp; హీరో అల్లు అర్జున్‌, విలన్‌ ఫహాద్‌ పాజిల్‌పై క్లైమాక్స్&nbsp; సన్నివేశాలను సుకుమార్‌ తెరకెక్కించారు. ఫహాద్‌ ఫాజిల్‌, అల్లు అర్జున్‌ల నటన, సంభాషణలతో పాటు యాక్షన్‌ సన్నివేశాలు ఈ క్లైమాక్స్‌లో కీలకంగా ఉండబోతున్నాయని టాక్. తొలి పార్ట్‌లో తరహాలోనే ‘పుష్ప 2’లోనూ క్లైమాక్స్‌ కీలకంగా మారుతుందని పేర్కొంటున్నారు. పైగా మూడో పార్ట్‌కు సంబంధించిన లింక్‌ను కూడా ఈ క్లైమాక్స్‌లో షూట్‌ చేసారని సమాచారం.&nbsp;
    నవంబర్ 02 , 2024
    <strong>Spirit Movie: స్పిరిట్ కథ లీక్? గోపిచంద్ సినిమా తరహాలో స్టోరీ!</strong>
    Spirit Movie: స్పిరిట్ కథ లీక్? గోపిచంద్ సినిమా తరహాలో స్టోరీ!
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas), డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కెరీర్‌ పరంగా ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. ప్రభాస్‌ రీసెంట్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) సూపర్‌ హిట్‌ కాగా, సందీప్‌ రెడ్డి తెరకెక్కించిన 'యానిమల్‌' చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ఇక వీరిద్దరి కాంబోలో రాబోతున్న 'స్పిరిట్‌' (Spirit) చిత్రం ఇక ఏ స్థాయిలో ఉంటుందోనని ఆడియన్స్‌లో ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. తొలుత పోలీసు.. తర్వాత! సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) రూపొందించనున్న ‘స్పిరిట్‌’ (Spirit) చిత్రంలో ప్రభాస్‌ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపిస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పాత్రతో పాటు మరో కీ రోల్‌లో ప్రభాస్ కనిపిస్తారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం కథలో తొలుత పోలీసుగా కనిపించిన ప్రభాస్‌ అనేక నాటకీయ పరిణామాల తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా మారతారని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో భారీ వైల్డ్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉంటాయని చెబుతున్నారు. ‘యానిమల్‌’కు మించిన వైలెన్స్‌, ఫైట్‌ సీక్వెన్స్‌ను ‘స్పిరిట్‌’లో చూస్తారని అంటున్నారు. తాజా అప్‌డేట్స్‌ నేపథ్యంలో స్పిరిట్‌పై అంచనాలు మరింత పెరిగాయని చెప్పవచ్చు.&nbsp; గోలిమార్‌ తరహాలో.. గోపిచంద్‌, పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘గోలిమార్‌’ (Golimar) చిత్రం 2010లో విడుదలై పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. ఎన్ కౌంటర్ స్పెషలిష్ట్ దయా నాయక్ జీవితము ఆధారముగా ఈ సినిమా రూపొందింది. నటన పరంగా ఈ సినిమా గోపిచంద్‌కు ఎంతగానో పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాలో గోపిచంద్‌ కష్టపడి పోలీసు ఆఫీసర్ అవుతాడు. రౌడీలపై ఉక్కుపాదం మోపి ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకుంటాడు. అనుకోని సంఘటనల కారణంగా అతడు గ్యాంగ్‌స్టర్‌గా మారతాడు. ప్రస్తుతం ‘స్పిరిట్‌’ లేటెస్ట్ బజ్‌ను గమనిస్తే అది కూడా ‘గోలిమార్‌’ను తలపిస్తోంది.&nbsp; అయితే గ్లోబల్‌ స్థాయి స్టాండర్డ్స్‌లో విజువల్స్, యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉంటాయి కాబట్టి గోలిమార్‌తో స్పిరిట్‌ కంపేర్‌ చేయకపోవడం బెటర్‌.&nbsp; ఇద్దరు స్టార్‌ హీరోలు... ‘స్పిరిట్‌’ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటించబోతున్నట్లు తెలుస్తోంది. రౌడీబాయ్‌ విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్‌ కపూర్ (Ranbir Kapoor) ఇందులో స్పెషల్ క్యామియో ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే సందీప్‌ రెడ్డి వంగా ఫస్ట్‌ ఫిల్మ్‌ ‘అర్జున్ రెడ్డి’లో విజయ్‌ దేవరకొండ హీరోగా చేశాడు. అలాగే రీసెంట్‌ చిత్రం ‘యానిమల్‌’లో రణ్‌బీర్‌ కపూర్‌ నటించాడు. దీంతో ఆ ఇద్దరు స్టార్స్‌తో సందీప్‌ రెడ్డికి మంచి క్లోజ్‌నెస్ ఉంది. ప్రభాస్ హీరోగా గ్లోబల్‌స్థాయిలో రూపొందుతున్న ‘స్పిరిట్‌’ నుంచి ఆఫర్‌ వస్తే వారు కాదనకుండా ఉండే ఛాన్సే ఎక్కువ ఉంది. అలానే స్పిరిట్​లో ఓ స్టార్ హీరోను విలన్ పాత్రలో నటింపజేయాలని సందీప్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.&nbsp; ప్రభాస్‌ విలన్‌ మళ్లీ రిపీట్‌! బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) ఇటీవల కాలంలో విలన్ రోల్స్‌ కేరాఫ్‌గా మారుతున్నారు. ‘ఆదిపురుష్‌’ చిత్రంలో రావణాసురుడిగా నటించినా సైఫ్‌ అలీఖాన్‌ ‘దేవర’లో తారక్‌కు ప్రత్యర్థిగా నటించారు. స్పిరిట్‌పై వచ్చిన మరో బజ్‌ ప్రకారం సైఫ్‌ అలీఖాన్‌ ఇందులోనూ నెగిటివ్‌ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ను ఢీకొట్టే పవర్‌ఫుల్‌ పాత్రలో సైఫ్‌ కనిపించనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. సైఫ్‌ అలీఖాన్‌ భార్య కరీనా కపూర్‌ కూాడా నెగిటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు రూమర్లు ఉన్నాయి. అదే నిజమైతే స్పిరిట్‌పై అంచనాలు మరో లెవల్‌కు వెళ్లడం ఖాయమని అంటున్నారు.&nbsp; భారీ బడ్జెట్‌తో.. స్పిరిట్‌ చిత్రాన్ని టీ-సిరీస్‌ భూషణ్‌ కుమార్‌ నిర్మించనున్నారు. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో రాబోతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్‌ను ఈ మూవీకి కేటాయించినట్లు టాక్ వినిపిస్తోంది. తొలుత ఈ మూవీ బడ్జెట్ రూ.500 కోట్లు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత రూ. 750 కోట్లకు పెరిగిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రూ.1000 కోట్లతో ఈ సినిమా రూపొందనున్నట్లు బజ్‌ వినిపిస్తోంది. అదే నిజమైతే బడ్జెట్‌ పరంగా ప్రభాస్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ మూవీగా 'స్పిరిట్‌' నిలవనుంది. బడ్జెట్‌లో రూ.600 కోట్లు నటీనటుల పారితోషానికే వెళ్లనున్నట్లు సమాచారం. ఒక్క ప్రభాస్‌కే రూ.300 కోట్లు చెల్లించనున్నట్లు ఫిల్మ్‌ వర్గాల టాక్‌.
    అక్టోబర్ 29 , 2024
    <strong>Spirit Updates: ‘స్పిరిట్‌’లో మెగాస్టార్ చిరంజీవి? అసలు ఏం ప్లాన్‌ చేశావ్‌ సందీప్‌ మామా!</strong>
    Spirit Updates: ‘స్పిరిట్‌’లో మెగాస్టార్ చిరంజీవి? అసలు ఏం ప్లాన్‌ చేశావ్‌ సందీప్‌ మామా!
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas), డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కెరీర్‌ పరంగా ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. ప్రభాస్‌ గత చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపింది. అటు డైరెక్టర్ సందీప్‌ రెడ్డి తెరకెక్కించిన 'యానిమల్‌' (Animal) భారతీయ చిత్ర పరిశ్రమను ఎంతగా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో రాబోతున్న 'స్పిరిట్‌' (Spirit) చిత్రం ఇక ఏ స్థాయిలో ఉంటుందోనని ఆడియన్స్‌లో ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే తాజాగా స్పిరిట్‌ నుంచి అదిరిపోయే అప్‌డేట్స్ బయటకొచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి స్పెషల్‌! ‘స్పిరిట్‌’ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి ఓ స్పెషల్‌ రోల్‌లో కనిపించే ఛాన్స్‌ ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా మెగాస్టార్‌తో సంప్రదింపులు సైతం జరిపినట్లు తెలుస్తోంది. ఇందుకు చిరు సానుకూలంగా స్పందిస్తే స్పిరిట్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోవడం ఖాయమని చెప్పవచ్చు. మరోవైపు మలయాళ సూపర్ స్టార్‌ మమ్ముట్టి సైతం స్పిరిట్‌లో మరో కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కథకు ఆ పాత్ర కూడా ఎంతో కీలకం కానుందని అంటున్నారు. వీటిపై చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ మూవీలో బాలీవుడ్‌ కపుల్‌ సైఫ్‌ అలీఖాన్‌, కరీనా కపూర్‌ నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. అలాగే కొరియన్‌, చైనీస్‌ స్టార్స్‌ కూడా ఇందులో నటిస్తారని రూమర్లు వినిపిస్తున్నాయి.&nbsp;&nbsp; షూటింగ్‌ స్టార్ట్‌ ఎప్పుడంటే? ప్రస్తుతం ‘స్పిరిట్‌’ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. అవి తుది దశకు చేరుకోవడంతో నవంబర్‌ నుంచి షూటింగ్‌ మెుదలు పెట్టాలని సందీప్‌ రెడ్డి వంగా తొలుత భావించారు. అయితే ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో ‘రాజా సాబ్‌’, ‘ఫౌజీ’ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం అవి షూటింగ్‌ కూడా జరుపుకుంటున్నాయి. ప్రభాస్ ఆయా చిత్రాలకు డేట్స్‌ కూడా కేటాయించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి ఫస్ట్‌ వీక్‌లో స్పిరిట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని సందీప్‌ రెడ్డి వంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అప్పటికీ రాజా సాబ్‌ షూటింగ్‌ కంప్లీట్‌ అవ్వడంతో పాటు ఫౌజీ 50% పైగా షూటింగ్‌ ఫినిష్‌ చేసుకుంటుంది. దీంతో ప్రభాస్‌ షూటింగ్స్‌ పరంగా కాస్త ఫ్రీ అవుతాడని సందీప్‌ భావిస్తున్నారట. అంతేకాదు ప్రభాస్‌ ఫోకస్‌ మెుత్తం స్పిరిట్‌ పైనే ఉండేలా సందీప్‌ వంగా చూసుకుంటున్నట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగా జనవరి ఫస్ట్‌ వీక్‌లో స్పిరిట్‌ పూజ కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారట. సంక్రాంతి తర్వాత నుంచి ప్రభాస్‌ రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొంటారని లేటెస్ట్‌గా అప్‌డేట్‌ అందుతోంది.&nbsp; బడ్టెట్‌ తెలిస్తే షాకే! ప్రభాస్‌ (Prabhas) హీరోగా సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో రాబోతున్న ‘స్పిరిట్‌’ (Spirit)పై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించి నెట్టింట ఓ వార్త హల్‌ చల్‌ చేస్తోంది.&nbsp; ఈ సినిమాకు ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు టాక్ వినిపిస్తోంది. తొలుత ఈ మూవీ బడ్జెట్ రూ.500 కోట్లు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత రూ. 750 కోట్లకు పెరిగిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రూ.1000 కోట్లతో ఈ సినిమా రూపొందనున్నట్లు బజ్‌ వినిపిస్తోంది. అదే నిజమైతే బడ్జెట్‌ పరంగా ప్రభాస్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ మూవీగా 'స్పిరిట్‌' నిలవనుంది.&nbsp; ప్రభాస్‌కు రికార్డు రెమ్యూనరేషన్‌! ‘స్పిరిట్‌’కు కేటాయించనున్న బడ్జెట్‌లో రూ.600 కోట్లు నటీనటుల పారితోషానికే వెళ్లనున్నట్లు సమాచారం. ఒక్క ప్రభాస్‌కే రూ.300 కోట్లు చెల్లించనున్నట్లు ఫిల్మ్‌ వర్గాల టాక్‌. ఎందుకంటే ప్రభాస్‌ ఇందులో డ్యూయల్‌ రోల్‌ పోషించనున్నాడు. కాబట్టి ఆ మాత్రం రెమ్యూనరేషన్‌ తీసుకోవడం సమంజసమే అంటున్నారు. ఇదే నిజమైతే రూ.300 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్న ఏకైక భారతీయ నటుడిగా ప్రభాస్‌ నిలవనున్నాడు. మరోవైపు బాలీవుడ్‌ స్టార్స్‌ అనిల్‌ కపూర్‌ (Anil Kapoor), సైఫ్‌ అలీ ఖాన్‌ (Saif Ali Khan), కరీనా కపుర్‌ (Kareena Kapoor) ఇందులో స్పెషల్‌ రోల్స్ చేస్తారని టాక్ ఉంది. ఈ నేపథ్యంలో పారితోషికానికి ఆ మాత్రం బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. &nbsp;
    అక్టోబర్ 09 , 2024
    <strong>Pushpa 2 Item Song: త్రిప్తి దిమ్రికి షాకిచ్చిన ‘పుష్ప 2’ టీమ్‌.. రంగంలోకి మరో బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ!&nbsp;</strong>
    Pushpa 2 Item Song: త్రిప్తి దిమ్రికి షాకిచ్చిన ‘పుష్ప 2’ టీమ్‌.. రంగంలోకి మరో బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ!&nbsp;
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2: ది రూల్‌’ (Pushpa 2: The Rule). గతంలో వచ్చిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం 'పుష్ప: ది రైజ్‌' కి సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతోంది. అయితే పుష్పలో ఐటెం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. సమంత చేసిన ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ పాటకి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. దీంతో ఇప్పుడు పార్ట్ 2లో ఐటెం సాంగ్ కూడా అంతకంటే ఎక్కువగా ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే యానిమల్‌ బ్యూటీ త్రిప్తి దిమ్రి ‘పుష్ప 2’ ఐటెం సాంగ్‌ చేస్తుందని అంతా భావిస్తుండగా చిత్ర యూనిట్ ఆమెకు షాకిచ్చినట్లు తెలుస్తోంది. మరో బాలీవుడ్‌ బ్యూటీని తెరపైకి తీసుకొచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; త్రిప్తి దిమ్రిపై అసంతృప్తి! ‘పుష్ప’ మూవీ పాటలు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా ఊ ఊ&nbsp; అంటావా’ అనే ఐటెం సాంగ్‌ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్‌ చేసింది. బన్నీ-సామ్‌ కలిసి వేసిన స్టెప్స్‌ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్‌ సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ పాట కోసం ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్‌ల పేర్లు బయటకు వచ్చినప్పటికి చివరకు యానిమల్‌ బ్యూటీ త్రిప్తి దిమ్రిని ఫైనల్‌ చేశారని వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం త్రిప్తి దిమ్రిని ఈ సాంగ్‌ నుంచి రిజెక్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల త్రిప్తి దిమ్రితో ఆడిషన్‌ నిర్వహించిన పుష్ప టీమ్‌ దానిపై సంతృప్తి చెందలేదని సమాచారం. దీంతో ఆమె ప్లేసులో మరో బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీని ఎంపిక చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.&nbsp; ఇద్దరు హీరోయిన్స్‌తో బన్నీ స్టెప్పులు! 'పుష్ప 2'లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులోని ఐటెం సాంగ్‌లో బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీతో పాటు రష్మిక కూడా స్టెప్పులు వేయబోతున్నట్లు సమాచారం. ఐటెం గార్ల్‌తో పాటు రష్మిక కూడా ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపనుందని ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్ట్‌ 1లో రష్మిక ఉన్నప్పటికీ ఐటెం సాంగ్‌లో ఆమె కనిపించలేదు. ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ అంటూ బన్నీ- సమంత ఇద్దరే స్టెప్పులు ఇరగదీశారు. ఈసారి రష్మికతో కలిసి ఇద్దరు భామలు ఐటెం సాంగ్‌లో కనిపించనుండటంతో మూవీ లవర్స్‌లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ ఇద్దరి భామాలతో కలిసి బన్నీ ఏ స్థాయిలో అలరిస్తాడో మరి చూడాలి.&nbsp; కీలకంగా 'పుష్ప 2' క్లైమాక్స్‌! 'పుష్ప 2' చిత్రానికి సంబంధించి ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో షూటింగ్‌ జరుగుతోంది. హీరో అల్లు అర్జున్‌, విలన్‌ ఫహాద్‌ పాజిల్‌పై పతాక సన్నివేశాలను సుకుమార్‌ తెరకెక్కిస్తున్నారు. ఫహాద్‌ ఫాజిల్‌, అల్లు అర్జున్‌ల నటన, సంభాషణలతో పాటు యాక్షన్‌ సన్నివేశాలు ఈ క్లైమాక్స్‌లో కీలకంగా ఉండబోతున్నాయని అంటున్నారు. తొలి పార్ట్‌లో తరహాలోనే ‘పుష్ప 2’లోనూ క్లైమాక్స్‌ కీలకంగా మారుతుందని పేర్కొంటున్నారు. పైగా మూడో పార్ట్‌కు సంబంధించిన లింక్‌ను కూడా ఈ క్లైమాక్స్‌లో షూట్‌ చేస్తారని సమాచారం. వచ్చే నెలాఖరు వరకు ఈ చిత్రీకరణ సుదీర్ఘంగా కొనసాగుతుందని టాక్‌ వినిపిస్తోంది.&nbsp; సర్‌ప్రైజ్‌ చేసిన రాజమౌళి ‘పుష్ప 2’ టీమ్‌ను దర్శకధీరుడు రాజమౌళి సర్‌ప్రైజ్‌ చేసినట్లు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో సినిమా చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిన రాజమౌళి అక్కడకు వెళ్లినట్లు సమాచారం. సుకుమార్‌ను కలిసి కొద్దిసేపు ముచ్చటించారట. ఈ క్రమంలో సుకుమార్‌ ఒక సన్నివేశాన్ని చిత్రీకరిస్తూ ఉంటే జక్కన్న అంతే చూస్తూ ఉండిపోయారట. అదిరిపోయిందని మెచ్చుకున్నారట. దాదాపు 30 నిమిషాల పాటు రాజమౌళి అక్కడే ఉన్నారని సమాచారం. చిత్ర యూనిట్‌ సభ్యుల్లో కీలక వ్యక్తులను రాజమౌళికి సుకుమార్‌ పరిచయం చేశారని తెలుస్తోంది. ‘పుష్ప 2’ కి సంబంధించిన పలు విషయాలను దర్శకుడు సుకుమార్‌తో రాజమౌళి చర్చించారట. పుష్ప 2 సెట్‌ కి రాజమౌళి వచ్చిన సందర్భంగా తీసిన వీడియోను త్వరలోనే ఫ్యాన్స్ కోసం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.&nbsp;
    సెప్టెంబర్ 26 , 2024
    <strong>Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగా మరో రాజమౌళి కానున్నారా? ఇది చూస్తే నిజమే అంటారు!</strong>
    Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగా మరో రాజమౌళి కానున్నారా? ఇది చూస్తే నిజమే అంటారు!
    దేశం గర్వించతగ్గ దర్శకుడిగా దర్శకధీరుడు రాజమౌళి గుర్తింపు సంపాదించారు. పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాలు తీస్తు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. సినిమా అంటే ఇలా ఉండాలి అనే స్థాయిలో ఇతర దర్శకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘ఆర్ఆర్‌ఆర్‌’ చిత్రం ద్వారా ఆస్కార్‌ వంటి ప్రతిష్టాత్మక అవార్డును దేశానికి అందించి సత్తా చాటారు. అయితే రాజమౌళి తర్వాత ప్రస్తుతం ఆ స్థాయిలో వినిపిస్తున్న పేరు సందీప్‌ రెడ్డి వంగాదే. తీసింది మూడే సినిమాలు అయినప్పటికీ ఏ డైరెక్టర్‌కు రానీ అటెన్షన్‌ సందీప్‌కు వస్తోంది. రాజమౌళి తరహాలోనే సందీప్‌ సినిమాలో నటించేందుకు స్టార్‌ హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారు. సందీప్‌ స్టోరీ చెబితే గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; యునిక్‌ డైరెక్షన్‌ ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో సందీప్‌ రెడ్డి వంగా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమాలో హీరో క్యారెక్టర్‌ను చూపించిన విధానం యూత్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఆ తర్వాత అదే సినిమాను హిందీలో ‘కబీర్‌ సింగ్‌’ పేరుతో తీసి మరోమారు హిట్‌ కొట్టాడు. రీసెంట్‌గా రణ్‌బీర్‌ సింగ్‌తో 'యానిమల్‌' (Animal) చిత్రాన్ని తెరకెక్కించి బాక్సాఫీస్‌ వద్ద ప్రకంపనలు సృష్టించాడు. అయితే సందీప్‌ కథ చెప్పే విధానం ఇతర డైరెక్టర్లతో పోలిస్తే భిన్నంగా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. హీరో క్యారెక్టర్‌ను చాలా బాగా ఎస్టాబ్లిష్‌ చేస్తాడని చెబుతుంటారు. అతడు డిజైన్‌ చేసే హీరో రోల్స్‌ అభిమానులకు మంచి కిక్‌ ఇస్తాయి. హీరో క్యారెక్టర్‌ను చాలా పవర్‌ఫుల్‌గా యునిక్‌ డైరెక్షన్‌లో చూపిస్తుండటంతో సందీప్‌తో వర్క్‌ చేసేందుకు స్టార్‌ హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారు.&nbsp; క్యూ కడుతున్న స్టార్స్‌! ‘యానిమల్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత సందీప్ - ప్రభాస్ కాంబోలో ‘స్పిరిట్’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అల్లు అర్జున్‌ హీరోగా మరో ప్రాజెక్ట్‌ కన్ఫార్మ్‌ అయినట్లు తెలుస్తోంది. ఇక మహేష్ కూడా రాజమౌళితో సినిమా కంప్లీట్ అయ్యాక సందీప్‌తో మూవీకి ఓకే చెప్పనున్నట్లు సమాచారం. ఇప్పటికే కథను మహేష్‌కు వివరించినట్లు పలు ఇంటర్యూలలో సందీప్‌ తెలిపాడు. అలానే రీసెంట్‌గా తారక్ కూడా సందీప్ రెడ్డితో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇక చరణ్ కూడా త్వరలోనే సందీప్‌తో మాట్లాడనున్నట్లు మెగా కాంపౌండ్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఈ స్టార్స్ కాకుండా అటు బాలీవుడ్‌లో ‘యానిమల్-2’ ఎలానూ ఉంది. దీనిని బట్టి సందీప్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సందీప్‌తో సినిమా అంటే ఎంత బిజీ షెడ్యూల్‌లో అయినా డేట్స్‌ ఇచ్చేందుకు స్టార్ హీరోలు సిద్ధంగా ఉంటున్నారు. రాజమౌళి తరహాలోనే సందీప్‌ కూడా పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్ సినీ లవర్స్ కోరుకుంటున్నారు.&nbsp; స్పిరిట్‌ హీరోయిన్‌ ఫిక్స్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో రాబోతున్న ‘స్పిరిట్‌’ (Spirit)పై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించి నెట్టింట ఓ వార్త హల్‌ చల్‌ చేస్తోంది. బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ (Kareena Kapoor) ఇందులో ప్రభాస్‌కు జోడీగా నటించబోతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. పదేళ్ల క్రితం బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌ అయినా కరీనా కపూర్‌ ప్రస్తుతం అడపా దడపా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తోంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె ఓ స్టార్‌ హీరో పక్కన హీరోయిన్‌గా చేయనున్నట్లు వార్తలు రావడం ఆసక్తి రేపుతోంది. ప్రభాస్‌, కరీనా జోడీ ఎలా ఉంటుందోనని ఇప్పటినుంచే ఫ్యాన్స్‌ ఊహించుకుంటున్నారు. దీనిపై స్పిరిట్‌ యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; ప్రభాస్‌ విలన్‌ మళ్లీ రిపీట్‌! బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) ఇటీవల కాలంలో విలన్ రోల్స్‌ కేరాఫ్‌గా మారుతున్నారు. ‘ఆదిపురుష్‌’ చిత్రంలో రావణాసురుడిగా నటించినా సైఫ్‌ అలీఖాన్‌ ‘దేవర’లో తారక్‌కు ప్రత్యర్థిగా నటించారు. ఇటీవల రిలీజైన ‘దేవర’ ట్రైలర్‌లో క్రూరంగా కనిపించి ఆకట్టుకున్నారు. స్పిరిట్‌పై వచ్చిన మరో బజ్‌ ప్రకారం సైఫ్‌ అలీఖాన్‌ ఇందులోనూ నెగిటివ్‌ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ను ఢీకొట్టే పవర్‌ఫుల్‌ పాత్రలో సైఫ్‌ కనిపించనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఆసక్తికర విషయం ఏంటంటే స్పిరిట్‌లో హీరోయిన్‌ అంటూ రూమర్లు ఎదుర్కొంటున్న కరీనా కపూర్‌.. సైఫ్‌ అలీఖాన్‌కు భార్య. దీంతో భార్య హీరోయిన్‌గా, భర్త విలన్‌గా కనిపిస్తారన్న టాక్‌ ఆసక్తి రేపుతోంది. ఇదే నిజమైతే స్పిరిట్‌పై అంచనాలు మరో లెవల్‌కు వెళ్లడం ఖాయమని అంటున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 24 , 2024

    @2021 KTree