• TFIDB EN
  • Editorial List
    ఈ సినిమాలను కుటుంబంతో కలిసి చూడలేరు... ఛాలెంజ్..!
    Dislike
    500+ views
    1 year ago

    ఆరుగురు పతివ్రతలు, 7G బృందవన కాలని వంటి సినిమాలకు చాలా మంది ఫ్యాన్స్ ఉండి ఉంటారు. అయితే ఈ సినిమాలను మీరు కుటుంబంతో కలిసి చూసేటప్పుడు.. కొన్ని సీన్లను రిమోట్‌తో ఫార్వడ్ చేయకుండా ఉండలేరు. ఈ సినిమాలే కాదు, తెలుగులో ఇలాంటి అడల్ట్ కేటగిరీ సినిమాలు చాలానే ఉన్నాయి. మరి ఆ చిత్రాలపై ఓ లుక్‌ వేయండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . 7G బృందావన కాలనీ(నవంబర్ 06 , 2004)
    U|185 minutes (Tamil) 174 minutes (Telugu)|డ్రామా,రొమాన్స్
    పనిపాటలేని రవి అనే వ్యక్తి పక్కింట్లోకి అనిత అనే అమ్మాయి తన కుటుంబంతో మారుతుంది. ఆమెతో రవి ప్రేమలో పడుతాడు. అనిత ఇంప్రెస్ చేసేందుకు రవి తన శక్తిమేర ప్రయత్నించినప్పటకీ విఫలమతుంటాడు. చివరకు రవి తనపై చూపుతున్న ప్రేమకు చలించిన అనిత తాను కూడా అతన్ని ప్రేమిస్తుంది. ఓ అనుకోని సంఘటన పెద్ద విషాదానికి దారితీస్తుంది.
    2 . అర్జున్ రెడ్డి(ఆగస్టు 25 , 2017)
    A|182 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
    అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు. ఇంతకు తన ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ.
    3 . RX 100(జూలై 12 , 2018)
    A|153 minutes|యాక్షన్,రొమాన్స్
    సెలవులకు ఇంటికి వచ్చిన ఇందు (పాయల్‌) ఊర్లోని శివ (కార్తికేయ)ను ప్రేమిస్తుంది. పెళ్లికి ముందే అతనితో శారీరకంగా దగ్గరవుతుంది. అయితే ఓ రోజు ఇందు అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది. మరి శివ ఏమయ్యాడు? ఇందు వేరే పెళ్లి ఎందుకు చేసుకుంది? అన్నది మిగతా కథ.
    4 . కుమారి 21F(నవంబర్ 20 , 2015)
    A|135 minutes|రొమాన్స్
    సిద్ధూ, కుమారి అనే అందమైన అమ్మాయిని ప్రేమిస్తాడు. బోల్డ్ యాటిట్యూడ్ వల్ల ఆమె ప్రేమను అనుమానిస్తాడు. ఓ రోజు ఓ సంఘటన ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది.
    5 . అల్లరి(మే 10 , 2002)
    UA|డ్రామా,రొమాన్స్
    రవి, అపర్ణ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్‌. పక్క ఫ్లాట్‌లోకి వచ్చిన రుచిని రవి ప్రేమిస్తాడు. ఆమెను ముగ్గులో దింపేందుకు రవికి అపర్ణ సాయం చేస్తుంది. ఈ క్రమంలో రవితో ప్రేమలో పడుతుంది.
    6 . గుంటూరు టాకీస్(మార్చి 04 , 2016)
    A|158 min|హాస్యం,రొమాన్స్
    గిరి (నరేష్), హరి (సిద్ధు) ఓ మెడికల్‌ షాపులో పనిచేస్తూనే అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తుంటారు. ఓ దశలో పెద్ద దొంగతనమే చేయాలని నిర్ణయించుకొని ఓ ఇంట్లో 5 లక్షల రూపాయలను దోచేస్తారు. ఆ తర్వాత వారి జీవితాలు అనుకోని మలుపు తిరిగాయి. చివరికీ వీరి కథ ఎటు పోయింది? అన్నది కథ.
    7 . ఈరోజుల్లో(మార్చి 23 , 2012)
    U|126 min|రొమాన్స్
    హీరో (శ్రీ) ఓ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించి మోసపోతాడు. అప్పటి నుంచి శ్రీ అమ్మాయిలపై ద్వేషం పెంచుకుంటాడు. శ్రేయాకి కూడా అబ్బాయిలంటే అసలు నచ్చదు. అటువంటి వ్యక్తులు ఎలా ప్రేమలో పడ్డారు? చివరికి ఎలా ఒక్కటయ్యారు? అన్నది కథ.
    8 . చీకటి గదిలో చితక్కొట్టుడు(మార్చి 21 , 2019)
    A|హాస్యం,హారర్
    ఓ స్నేహితుల బృందం బ్యాచిలర్ పార్టీ కోసం నగరానికి దూరంగా ఉన్న విల్లాకు వెళ్తారు. ఆ విల్లాలో వారికి వింత పరిస్థితి ఎదురవుతుంది. ఓ అదృశ్య శక్తి వారిని వెంబడిస్తుంటుంది.
    9 . బాబు బాగా బిజీ(మే 05 , 2017)
    A|హాస్యం
    మాధవ్ అనేక మంది స్త్రీలతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటాడు. అయితే, మాధవ్ తన డ్రీమ్ గర్ల్ రాధను కలిసినప్పుడు అతను తన మార్గాన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తాడు.
    10 . యానిమల్‌ (డిసెంబర్ 01 , 2023)
    A|201 minutes|యాక్షన్,క్రైమ్,డ్రామా
    దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్‌ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ.

    @2021 KTree