• TFIDB EN
  • అల్లరి నరేష్
    ప్రదేశం: మద్రాసు, తమిళనాడు, భారతదేశం (ప్రస్తుత చెన్నై)
    అల్లరి నరేష్ ప్రముఖ డైరెక్టర్ దివంగత ఇ వి వి సత్యనారాయణ రెండవ కుమారుడు. రవి బాబు డైరెక్షన్‌లో వచ్చిన 'అల్లరి' సినిమాతో సినీరంగప్రవేశం చేశాడు. ఈ సినిమా హిట్ కావడంతో "అల్లరి" పేరునే తన ఇంటిపేరుగా స్థిరపడిపోయింది. అల్లరి నరేష్ కెరీర్‌లో ఎక్కువగా కామెడీ చిత్రాల్లోనే నటించాడు. ఈతరం రాజేంద్ర ప్రసాద్‌గా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం యాక్షన్ సినిమాలకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. తెలుగులో 50కి పైగా చిత్రాల్లో నటించాడు. గమ్యం చిత్రంలో గాలి శీను, శంభో శివ శంభో సినిమాలో మల్లి పాత్ర నరేష్ నటనా ప్రతిభకు మచ్చుతునకలు. జూనియర్స్, నేను, డేంజర్, కితకితలు, సీమశాస్త్రి, బెండు అప్పారావు R.M.P., బ్లేడ్ బాబ్జీ, మహర్షి, లడ్డుబాబు, నాంది, ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం, నా సామి రంగ వంటి చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. తన విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు.

    అల్లరి నరేష్ వయసు ఎంత?

    అల్లరి నరేష్‌ వయసు 42 సంవత్సరాలు

    అల్లరి నరేష్ ముద్దు పేరు ఏంటి?

    సెడన్‌ స్టార్‌, కామెడీ కింగ్‌

    అల్లరి నరేష్ ఎత్తు ఎంత?

    6' 2'' (188cm)

    అల్లరి నరేష్ అభిరుచులు ఏంటి?

    క్రికెట్ ఆడటం, మ్యూజిక్ వినడం

    అల్లరి నరేష్ ఏం చదువుకున్నారు?

    బీకాం

    అల్లరి నరేష్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    చెట్టినాడ్‌ విద్యాశ్రమం, చెన్నై

    అల్లరి నరేష్ రిలేషన్‌లో ఉంది ఎవరు?

    దీక్షా పంత్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో డేటింగ్ చేసినట్లు రూమర్స్ ఉన్నాయి. వీరిద్దరు కలిసి కొన్ని వీడియో అల్బమ్స్ చేశారు.

    అల్లరి నరేష్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    2024 వరకు 54 సినిమాల్లో నటించాడు.

    అల్లరి నరేష్ Childhood Images

    అల్లరి నరేష్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Description of the image
    Editorial List
    క్రిష్ జాగర్లమూడి హిట్ సినిమాల జాబితా
    క్రిష్ జాగర్లమూడి సినిమాల జాబితాEditorial List
    క్రిష్ జాగర్లమూడి సినిమాల జాబితా
    తెలుగులో ‘మిక్స్‌ అప్‌’ మాదిరి బోల్డ్ కంటెంట్ చిత్రాలుEditorial List
    తెలుగులో ‘మిక్స్‌ అప్‌’ మాదిరి బోల్డ్ కంటెంట్ చిత్రాలు
    అల్లరి నరేష్ కెరీర్‌లో టాప్ 10 హిట్ చిత్రాలుEditorial List
    అల్లరి నరేష్ కెరీర్‌లో టాప్ 10 హిట్ చిత్రాలు

    అల్లరి నరేష్ తల్లిదండ్రులు ఎవరు?

    టాలీవుడ్‌ దిగ్గజ డైరెక్టర్‌ దివంగత ఈవీవీ సత్యనారాయణ, సరస్వతి కుమారి దంపతులకు అల్లరి నరేష్‌ జన్మించాడు. తండ్రి ఈవీవీ.. 51 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అందులో చాలావరకూ హాస్య కథా చిత్రాలే. హాస్య నటులు రాజేంద్ర ప్రసాద్‌తో.. 'ఆ ఒక్కటి అడక్కు', 'అప్పుల అప్పారావు', 'ఆలీబాబా అరడజను దొంగలు', నరేష్‌తో.. 'జంబలకిడి పంబ' వంటి బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలను ఈవీవీ తీశారు. అగ్రనటులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతోనూ చిత్రాలు చేశారు.

    అల్లరి నరేష్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    అల్లరి నరేష్‌కు ఒక సోదరుడు ఉన్నాడు. అతడి పేరు ఆర్యన్‌ రాజేష్‌. అతడు కూడా పలు తెలుగు చిత్రాల్లో హీరోగా చేశాడు. 'ఎవడిగోల వాడిది' ఆర్యన్‌ చేసిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం. ఆర్యన్‌ రాజేష్‌.. ప్రస్తుతం సినిమాల్లో నటించడం లేదు.

    అల్లరి నరేష్ పెళ్లి ఎప్పుడు అయింది?

    ఆర్కిటెక్ట్‌ విరూపాను 29 మే, 2015లో అల్లరి నరేష్‌ వివాహం చేసుకున్నాడు.

    అల్లరి నరేష్ కు పిల్లలు ఎంత మంది?

    అల్లరి నరేేష్‌కు ఓ పాప ఉంది. పేరు అయానా ఇవిక.

    అల్లరి నరేష్ Family Pictures

    అల్లరి నరేష్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    తొలి చిత్రం 'అల్లరి'లో తన కామెడీ టైమింగ్‌తో నరేష్‌ అదరగొట్టాడు. ఆ తర్వాత నుంచి వరుసగా హాస్య చిత్రాలు చేసి కామెడీ స్టార్‌గా మారిపోయాడు.

    అల్లరి నరేష్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో అల్లరి నరేష్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన అల్లరి నరేష్ తొలి చిత్రం ఏది?

    మహేష్‌ హీరోగా చేసిన మహర్షిచిత్రంలో అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ రూ.175 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

    అల్లరి నరేష్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    గమ్యంసినిమాలోని గాలి శీను పాత్ర ఇప్పటివరకూ అల్లరి నరేష్‌ చేసిన రోల్స్‌లో అత్యుత్తమమైనది.

    అల్లరి నరేష్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Allari Naresh best stage performance

    అల్లరి నరేష్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Allari Naresh best dialogues

    అల్లరి నరేష్ రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకి దాదాపు రూ.5-8 కోట్లు తీసుకుంటున్నాడు.

    అల్లరి నరేష్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    చేపల పులుసు

    అల్లరి నరేష్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    అల్లరి నరేష్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు

    అల్లరి నరేష్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    అల్లరి నరేష్ ఫెవరెట్ సినిమా ఏది?

    అల్లరి నరేష్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    తెలుపు, నలుపు

    అల్లరి నరేష్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    అల్లరి నరేష్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    అమెరికా

    అల్లరి నరేష్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    KIA’s EV6 GT

    అల్లరి నరేష్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    రూ. 21 కోట్లు

    అల్లరి నరేష్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    3 లక్షల మంది ఫాలోవర్లు

    అల్లరి నరేష్ సోషల్‌ మీడియా లింక్స్‌

    అల్లరి నరేష్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • నంది, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు - 2008

      'గమ్యం' చిత్రానికి గాను బెస్ట్‌ సపోర్టింగ్‌ రోల్‌ కేటగిరిలో నంది, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు గెలుచుకున్నాడు.

    • ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు - 2010

      'శంభో శివ శంభో' మూవీకి గాను ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు పొందాడు

    • జీ సినీ అవార్డ్, సైమా అవార్డ్, సంతోషం అవార్డ్‌ - 2019

      'మహర్షి' మూవీకి గాను బెస్ట్‌ సపోర్టింగ్‌ రోల్‌ కేటగిరిలో జీ సినీ అవార్డ్, సైమా అవార్డ్, సంతోషం అవార్డ్‌ అందుకున్నాడు.

    • సైమా అవార్డు - 2021

      'నాంది' చిత్రానికి ఉత్తమ నటుడు కేటగిరిలో సైమా అవార్డుకు నామినేట్ అయ్యాడు.

    అల్లరి నరేష్ కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?

    అల్లరి నరేష్‌కు ఎలాంటి వ్యాపారాలు లేవు. ఆయన ఫోకస్‌ మెుత్తం సినిమాలపైనే ఉంది.
    అల్లరి నరేష్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే అల్లరి నరేష్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree