• TFIDB EN
  • వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి
    UATelugu
    చంటి గాడు(ప్రవీణ్) పండు గాడు(మధు) ఇద్దరు తోబుట్టువులు. గ్రామంలో చాలా ఇబ్బందులు సృష్టిస్తారు. ఓరోజు గౌరి (లక్ష్మీరాయ్) రూపంలో ఒక టీచర్ వారి గ్రామానికి వస్తుంది. ఆమె పట్ల ఆకర్షితులై, సోదరులిద్దరూ ఆమెను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. కానీ గౌరి గురించి ఓ విషయం తెలిసి షాక్‌ అవుతారు. ఎంతకు వారు తెలుసుకున్న నిజం ఏమిటి?
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    రాయ్ లక్ష్మి
    వెంకటలక్ష్మి
    మధునందన్
    పండుగాడు
    ప్రవీణ్
    చంటిగాడు
    పూజిత పొన్నాడ
    గౌరి
    పంకజ్ కేసరి
    ఒక రౌడీ
    రామ్ కార్తీక్శేఖర్
    బ్రహ్మాజీ
    సూర్యం
    జబర్దస్త్ మహేష్
    జెమినీ సురేష్
    రమణా రెడ్డి
    సిబ్బంది
    కిషోర్ (లడ్డా)దర్శకుడు
    ఎం.శ్రీధర్ రెడ్డినిర్మాత
    హెచ్ ఆనంద్ రెడ్డినిర్మాత
    ఆర్కే రెడ్డినిర్మాత
    హరి గౌరాసంగీతకారుడు
    కథనాలు
    <strong>Lakshmi Roy Hot: కసి అందాలతో సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్న లక్ష్మీ రాయ్‌..!&nbsp;</strong>
    Lakshmi Roy Hot: కసి అందాలతో సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్న లక్ష్మీ రాయ్‌..!&nbsp;
    కన్నడ బ్యూటీ లక్ష్మీ రాయ్‌ (Laxmi Roy).. తన సొగసుల సంపదతో సోషల్‌ మీడియాను హోరెత్తిస్తోంది. ఎద అందాలను ఏకరవు పెడుతూ కవ్విస్తోంది.&nbsp; తాజాగా చిట్టి పొట్టి గౌనులో ఫొటో షూట్‌ నిర్వహించిన ఈ అమ్మడు.. తెల్లటి అందాలను ఆరబోసింది. మత్తెక్కించే కళ్లతో కొంటెగా చూస్తూ నెటిజన్లకు గిలిగింతలు పెట్టింది.&nbsp; రెండ్రోజుల క్రితం బికినిలో ఉన్న ఫొటోను షేర్‌ చేసిన లక్ష్మీ రాయ్‌.. నెట్టింట రచ్చ రచ్చ చేసింది. కూల్‌గా కోక్‌ తాగుతూనే హాట్‌ మీటర్లను బద్దలు కొట్టింది.&nbsp; లక్ష్మీ రాయ్‌ లేటెస్ట్‌ ఫొటోలను చూసిన నెటిజన్లు ఆమె అందాలకు మైమరిచిపోతున్నారు. స్టార్‌ హీరోయిన్‌ కటౌట్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; కర్ణాటకలోని బెంగళూరు జన్మించిన లక్ష్మీ రాయ్‌.. 2005లో వచ్చిన 'కర్క కసధార' అనే తమిళ చిత్రం ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.&nbsp; అదే ఏడాది శ్రీకాంత్‌ పక్కన 'కాంచనమాల కేబుల్‌ టీవీ'లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో శిరీష / కాంచనమాల పాత్రల్లో ఈ అమ్మడు అదరగొట్టింది.&nbsp; ఆ తర్వాత 'నీకు నాకు' (2006) సినిమాతో మరోమారు టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించింది. ఆ మూవీ కూడా సక్సెస్‌ కాకపోవడంతో ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో తమిళం, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలతో ఫోకస్‌ పెట్టిన లక్ష్మీ రాయ్‌.. అక్కడ వరుసగా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.&nbsp; 2011లో లారెన్స్‌ సరసన కాంచన సినిమాలో నటించిన ఈ బ్యూటీ.. తన గ్లామర్‌షోతో మంచి మార్కులే కొట్టేసింది.&nbsp; ఆ తర్వాత తెలుగులో అధినాయకుడు (2012), బలుపు (2013) చిత్రాల్లో కనిపించి ఆకట్టుకుంది. అధినాయుకుడు ఆమె పోషించిన దీప్తి పాత్ర నటిగా లక్ష్మీ రాయ్‌కు గుర్తింపు తీసుకొచ్చింది.&nbsp; మెగాస్టార్‌ రీఎంట్రీ చిత్రం ‘ఖైదీ 150’లో ‘రత్తాలు రత్తాలు’ అనే స్పెషల్‌ సాంగ్‌లో కనిపించి లక్ష్మీ రాయ్‌ ఆకట్టుకుంది. చిరంజీవితో పోటీపడి మరి స్టెప్పులేసి ప్రశంసలు అందుకుంది.&nbsp; తెలుగులో చివరిగా 2019లో వచ్చిన 'వేర్‌ ఇజ్‌ ద వెంకటలక్ష్మీ' చిత్రంలో లక్ష్మీ రాయ్‌ చేసింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు దక్కలేదు. ఇటీవల ‘డీఎన్‌ఏ’ అనే మలయాళ చిత్రంలో లక్ష్మీ రాయ్‌ నటించింది. ఇందులో ఐపీఎస్‌ అధికారిణి పాత్రలో ఆకట్టుకుంది. ప్రస్తుతం అవకాశాలు సన్నగిల్లడంతో ఈ అమ్మడు సోషల్‌ మీడియాపై ఫోకస్‌ పెట్టింది. ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ దర్శక నిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.&nbsp; క్రమం తప్పకుండా హాట్‌ ట్రీట్‌ ఇస్తుండటంతో లక్ష్మీ రాయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ఎక్కువ మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఆమె ఖాతాను 7.1 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
    జూన్ 21 , 2024
    HBD Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌ జీవితంలో జరిగిన ఈ ముఖ్యమైన విషయాల గురించి తెలుసా?
    HBD Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌ జీవితంలో జరిగిన ఈ ముఖ్యమైన విషయాల గురించి తెలుసా?
    నందమూరి నట వారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన తారక్‌ (Jr NTR).. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్‌ బేస్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు. ఎంతటి కఠినమైన డైలాగ్స్‌ను అయినా అలవోకగా చెప్పగల నైపుణ్యం.. కళ్లు చెదిరే డ్యాన్స్‌ చేయగల సామర్థ్యం తారక్‌ సొంతం. అందుకే తారక్‌ లాంటి హీరోకు అభిమానులుగా ఉన్నందుకు ఫ్యాన్స్ కూడా గర్వపడుతుంటారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) ముందు వరకూ టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో ఒకరిగా ఉన్న అతడు.. ఆ సినిమా ప్రభంజనంతో ఒక్కసారిగా పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. టాలీవుడ్‌ గర్వించతగ్గ నటుల్లో ఒకరిగా ఎదిగాడు. ఇవాళ (మే 20) జూ.ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా అతడి సినీ, వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. (Jr NTR Birthday Special Story) అసలు పేరు&nbsp; జూనియర్ ఎన్టీఆర్‌ అసలు పేరు 'తారక్‌ రామ్‌' (Jr NTR Life Memorable Moments) . ఓ రోజు తారక్‌ను తీసుకొని తండ్రి హరికృష్ణ.. నందమూరి తారకరామారావు వద్దకు వెళ్లారు. అప్పుడు తారక్‌ను చూసిన ఎన్టీఆర్ ఎంతో మురిసిపోయారట. తన మనవడికి తనే పేరే పెట్టాలని సూచించారట. అంతేకాదు స్వయంగా ఆయనే నందమూరి తారక రామారావుగా తారక్‌ పేరు మార్చారు.&nbsp; ఎనిమిదేళ్ల వయసులోనే.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన నట ప్రస్థానాన్ని బాల్యం నుంచి మెుదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ‘బాల రామయాణం’ కంటే ముందే తారక్‌ ఓ సినిమాలో నటించాడు. తారక్‌ తన ఎనిమిదేళ్ల వయసులో ముఖానికి మేకప్ వేసుకున్నాడు. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో భరతుడి పాత్రతో నటనలో ఓనమాలు నేర్చుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ‘బాల రామాయణం’లో నటించాడు. (Jr NTR Birthday Special Story) 100కి పైగా ప్రదర్శనలు తారక్‌కు కూచిపూడి నృత్యంలో గొప్ప ప్రావీణ్యం ఉంది. 12 ఏళ్ల పాటు కూచిపూడి సాధన చేశాడు. దేశవ్యాప్తంగా 100పైగా ప్రదర్శనలు ఇచ్చాడు. ప్రస్తుతం తారక్ ఈ స్థాయిలో డ్యాన్స్‌ ఇరగదీస్తున్నాడంటే అందుకు కారణం.. కూచిపూడిలో నేర్చుకున్న మెళుకువలేనని ఇండస్ట్రీలో టాక్ ఉంది.&nbsp; ఆ విషయంలో ఎప్పటికీ లోటే! కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే నటుల్లో తారక్‌ ముందు వరుసలో ఉంటాడు. షూటింగ్‌ నుంచి ఏ మాత్రం విరామం దొరికిన వెంటనే ఫ్యామిలీ ఎదుట వాలిపోతుంటాడు. అయితే తారక్‌కు తొలి నుంచి ఓ కుమార్తె కావాలన్న కోరిక ఉండేదట. అయితే భార్య ప్రణతీకి ఇద్దరూ అబ్బాయిలే పుట్టడంతో కూతురు లేదన్న లోటు తనకెప్పుడూ ఉంటుందని ఓ ఇంటర్యూలో తారక్‌ తెలిపాడు.&nbsp; ఫోర్బ్స్‌ జాబితా జాతీయ స్థాయిలో తారక్‌ (Jr NTR Life Memorable Moments) తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దేశంలో మంచి క్రేజ్‌ ఉన్న హీరోల్లో ఒకరిగా నిలిచాడు. ఈ క్రమంలోనే తారక్‌.. ‘ఫోర్బ్స్‌ ఇండియా’ సెలబ్రిటీ లిస్ట్‌లో రెండు సార్లు చోటు సంపాదించుకున్నాడు. ఆ దేశంలో యమా క్రేజ్‌! టాలీవుడ్‌ హీరోల క్రేజ్‌ గ్లోబల్‌ స్థాయికి చేరింది. ఆయా దేశాల్లోని తెలుగు వారంతా తమకు ఇష్టమైన హీరోలను అభిమానిస్తూ వారి సినిమాలకు ఓవర్సీస్‌లో సక్సెస్ చేస్తుంటారు. అయితే జపాన్‌లో ఏ హీరోకు లేనంత క్రేజ్‌ తారక్‌కు ఉంది. అక్కడ జూ.ఎన్టీఆర్‌ను అభిమానించే వారి సంఖ్య గణనీయసంఖ్యలో ఉంటుంది.&nbsp; ఎన్టీఆర్‌ మంచి గాయకుడు ఎన్టీఆర్‌ అద్భుతంగా నటించడమే కాదు.. మంచిగా పాటలు కూడా పాడగలడు.&nbsp; ‘ఓలమ్మీ తిక్కరేగిందా’, ‘వన్‌ టూ త్రీ నేనో కంత్రి’, ‘వేర్‌ ఈజ్‌ ది పంచకట్టు చారి’ తదితర పాటలతో అతడు ఫ్యాన్స్‌ను అలరించాడు.&nbsp; హోస్ట్‌గానూ సూపర్‌ సక్సెస్‌ ప్రముఖ టెలివిజన్‌ షోలకు తారక్‌ గతంలో హోస్ట్‌గానూ (Jr NTR Life Memorable Moments) వ్యవహిరించాడు. గొప్ప వ్యాఖ్యాతగా గుర్తింపు పొందాడు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’, ‘బిగ్‌బాస్‌ తెలుగు’ షోలకు హోస్ట్‌గా పని చేసి బుల్లితెర ప్రేక్షకుల్లో మరింత క్రేజ్‌ను సంపాదించాడు.&nbsp; తారక్ ఫేవరేట్‌ నెంబర్‌ యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌కు అందరిలాగే కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. తారక్‌కి ‘9’ సంఖ్య అంటే మహా ఇష్టం. దానిని తన లక్కీ నెంబర్‌గా ఫీలవుతుంటాడు తారక్‌. తన కారు నెంబర్‌ ప్లేట్‌ కూడా 9999 వచ్చేలా తీసుకున్నాడు. ట్విటర్‌&nbsp; ఫేవరేట్‌ సాంగ్‌ &amp; సినిమా తారక్‌కు మ్యూజిక్‌ అంటే చాలా ఇష్టం. ఖాళీ సమయాల్లో సంగీతాన్ని ఆస్వాదిస్తుంటాడు. తారక్‌ ఆల్‌టైమ్ ఫేవరేట్‌ సాంగ్‌.. ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ (మాతృదేవోభవ). ఇష్టమైన సినిమా ‘దాన వీర శూర కర్ణ’.&nbsp; రికార్డు స్థాయిలో ఆడియో ఫంక్షన్‌ ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌ కాంబోలో వచ్చిన మెుట్ట మెుదటి చిత్రం ‘ఆంధ్రావాలా’. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఏపీలోని నిమ్మకూరులో జరిగిన ఈ ఈవెంట్‌ కోసం రైల్వే శాఖ స్పెషల్‌ ట్రైన్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఆడియో ఫంక్షన్‌లో సుమారు 10 లక్షల మంది తారక్‌ అభిమానులు పాల్గొన్నారు.&nbsp; రీరిలీజ్‌ రికార్డు గతేడాది ఇదే రోజున (మే 20) తారక్ బర్త్‌డేను పురస్కరించుకొని ‘సింహాద్రి’ సినిమాను రీరిలీజ్‌ చేశారు. 1000 స్క్రీన్లలో ఈ సినిమాను ప్రసారం చేసి రికార్డు సృష్టించారు. ఒక రీరిలీజ్‌ చిత్రాన్ని ఈ స్థాయిలో ప్రదర్శించడం అదే తొలిసారి.&nbsp;
    మే 20 , 2024
    <strong>Pushpa 2 Dialogues: ‘పుష్ప 2’లో గూస్‌బంప్స్‌ తెప్పించిన డైలాగ్స్‌.. ఓ లుక్కేయండి!&nbsp;</strong>
    Pushpa 2 Dialogues: ‘పుష్ప 2’లో గూస్‌బంప్స్‌ తెప్పించిన డైలాగ్స్‌.. ఓ లుక్కేయండి!&nbsp;
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా విడుదలైంది. ఈ సినిమాకు సర్వత్రా పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. అల్లు అర్జున్ నటన, యాస, బాడీ లాంగ్జేవ్‌ నెక్స్ట్‌ లెవల్లో ఉన్నాయంటూ ఆడియన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న జీవించేసిందంటూ ప్రశంసిస్తున్నారు. బన్నీకి సుకుమార్ ఇచ్చిన మాస్ ఎలివేషన్స్ పూనకాలు తెప్పించిందని చెబుతున్నారు. డైలాగ్స్ (Pushpa 2 Dialogues) కూడా సినిమాలో బాగా పేలాయని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ ప్రారంభ సీన్‌ నుంచి క్లైమాక్స్‌ వరకూ ఉన్న హైలెట్‌ డైలాగ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; అల్లు అర్జున్‌ ఎంట్రీ డైలాగ్‌ జపాన్‌ పుష్ప రాజ్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ను చూపించారు దర్శకుడు సుకుమార్‌. పుష్ప నుంచి ఎర్ర చందనం తీసుకున్న జపాన్ డీలర్లు డబ్బు ఇవ్వకుండా మోసం చేస్తారు. ఈ క్రమంలో కంటైనర్‌లో దుడ్డుతో పాటు వెళ్లిన పుష్ప వారికి చిక్కుతాడు. ఈ క్రమంలో వచ్చే ఎంట్రీ డైలాగ్ హైలేట్‌గా నిలుస్తుంది. జపాన్‌ భాషలో బన్నీ మాట్లాడటం విశేషం.&nbsp; పుష్ప రాజ్‌: హలో! బాగుండారా? నా జపాన్‌ బ్రదర్స్‌. (జపాన్‌ భాషలో) ఎప్పటి నుండో నా సరుకు యాడికెళ్తుందో సూడాలని అనుకునే వాడిని. ఇన్నాళ్లకు కుదిరుండాది. అంటూ బన్నీ తనను బంధించిన వారిపై విరుచుకుపడతాడు.&nbsp; కమెడియన్‌ సత్య : యో.. ఏందప్ప నీకు జపాన్‌ భాష వచ్చా? పుష్ప రాజ్‌ : నలభై దినాలు కంటైనర్‌లో ప్రయాణిస్తూనే 30 దినాల్లో జపాన్‌ భాష (30 రోజుల్లో జపాన్‌ నేర్చుకోవడం ఎలా అనే బుక్‌ను చూపిస్తూ) నేర్చుకున్నాలే అప్ప. ఎట్టా ఉండాది నా జపనీస్‌ భాష. సత్య: అదిరి పోయింది.. అదిరిపోయింది. ఇంతకీ జపాన్‌ ఎందుకు వచ్చినావ్‌ అప్ప? పుష్పరాజ్‌ : జపాన్‌కు దుడ్డు (ఎర్ర చందనం) వచ్చింది గానీ, డబ్బు రాలేదప్ప. ఇండియా వాడ్ని మోసం చేస్తే ఎట్టా ఉంటదో సూపించడానికి వచ్చినా.. సత్య: పైసలు కోసం ఇంత దూరం వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటావా? పుష్పరాజ్‌: నాకు రావాల్సింది అణా అయినా, అర్ధ అణా అయినా.. అది ఏడు కొండలు పైన ఉన్నా అయినా, ఏడు సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్పగాడి అలవాటు.&nbsp; పుష్పరాజ్‌: ఐయామ్‌ యూనివర్స్ బాస్‌.. పుష్ప ఈజ్‌ ద బాస్‌ (జపాన్‌ భాషలో)&nbsp; పోలీసు స్టేషన్‌ డైలాగ్స్‌ ఎర్ర చందనం తరలిస్తున్న పుష్ప రాజ్‌ మనుషులను ఎస్పీ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ పట్టుకొని జైల్లో వేస్తాడు. తన వారికోసం స్టేషన్‌కు వచ్చిన పుష్ప చెప్పే డైలాగ్స్ మెప్పిస్తాయి.&nbsp; పుష్ప: పుష్ప: నా పిల్లకాయలను లోపల ఏశావా ఏంది? ఒక గంటలో మా శీను గాడి (జైల్లో ఉన్న వ్యక్తి) పెళ్లి ఉండాది. వాళ్లని తోలుకపోవడానికి వచ్చిన. సీఐ: శీనుగాడి పేరున ఎఫ్‌ఐఆర్‌ రాశారు. మెుత్తం 230 మంది. ఒక్కరు తక్కువైనా లెక్క తేడా వస్తాది.&nbsp; పుష్ప: అట్నా.. రేయ్‌ (తన పక్కన ఉన్న వారితో) మన వాళ్లలో శ్రీనివాస్‌ ఎవరు ఉన్నార్రా. (ఒక వ్యక్తి నేనున్నా అంటూ ముందుకు వస్తాడు) సీఐ: అదెట్లా కుదిరిద్ది పుష్ప. ముందు మాదిరి లేదు పుష్ప. రూల్స్‌ అన్నీ మారిపోయాయ్‌. పుష్ప : సీఐ గారికి రూల్స్ మారి పోయాయంట్రా. నేను చెప్పేదా రూల్‌ ఏంటో. చెవులు పెద్దవి చేసుకొని వినండి. ఈడ జరిగేదంతా ఒకటే రూలు. అది పుష్పగాడి రూలు. సీఎంతో మీటింగ్‌ అప్పుడు.. ఎంపీ సిద్దప్ప (రావు రమేష్‌)తో కలిసి సీఎంను కలవడానికి పుష్ప బయలుదేరతాడు. ఈ క్రమంలో సీఎంతో ఫొటో దిగమని శ్రీవల్లి సూచిస్తుంది. దీంతో సీఎంతో ఫొటో దిగేందుకు శాలువ కప్పుతుండగా సీఎం హేళన చేస్తూ చెప్పే డైలాగ్‌ కథను మలుపు తిప్పుతాయి.&nbsp; ఎంపీ సిద్ధప్ప: పుష్ఫ భార్య మంచి ఫొటో అడిగుండాది. ఫొటో బాగా తీయ్‌ (కెమెరామెన్‌తో) సీఎం: ఏంటీ సిద్దప్పు నువ్వు.. ఎంపీ సిద్దప్ప: ఏ అన్నా.. సీఎం: ఈ స్మగ్లర్లు.. పార్టీకి ఫండ్‌ ఇచ్చినంత ఈజీగా మనం ఫొటోలు ఇవ్వలేం. చెప్పులు కాళ్లను మోస్తున్నాయని చేతులకు తొడుక్కుంటామా ఏందీ. సీఎం: సిద్దప్ప.. పిల్లోడు కదా. పెళ్లాం మాట విని ఫొటోల కోసం వచ్చుంటాడు. పుష్ప.. పెళ్లాం మాట విని బాగుపడినోడు ఎవ్వడు లేడు. మదిలో పెట్టుకో. సీఎంతో మీటింగ్‌ తర్వాత.. సీఎం చెప్పిన మాటలకు బాగా హార్ట్‌ అయిన పుష్ప బయటకు వచ్చి సోఫాలో కూర్చొని ఉంటాడు. సీఎంతో మాట్లాడిన కొద్దిసేపటికి ఎంపీ సిద్దప్ప (రావు రమేష్‌) బయటకు వస్తాడు. ఈ క్రమంలో పుష్ప - సిద్ధప్ప మధ్య వచ్చే సంభాషణ సినిమాకు కీలక మలుపు తిప్పుతుంది.&nbsp; పుష్ప: ఏం.. సార్‌. పని అయ్యుండాదే? ఎంపీ సిద్దప్ప: శాఖ ఏంటో తెలీదు గానీ.. మినిస్ట్రీ అయితే ఇస్తా అన్నాడు. మనమే కొంచెం దుడ్డు (లంచం) ఎక్కువ తడపాలా! పుష్ప : అది కాదు.. షెకావత్‌ (ఫహాద్‌ ఫాజిల్‌) ట్రాన్స్‌ఫర్ అయ్యుండాదా అని అడుగుతున్నా? ఎంపీ సిద్దప్ప: కుదరదు అన్నాడప్ప. పోలీసు వాళ్లతో సర్దుకుపోవాలి గానీ వచ్చిన ప్రతీ వాడితో కలియపెట్టుకొని ట్రాన్సఫర్‌ కోరితే కుదరదన్నాడప్పా.&nbsp; నువ్వు కూడా వద్దన్నావని విడిచేసినా. పుష్ప: వాడు వద్దనడం వేరు.. నేను వద్దనడం వేరు. చాలా తేడా ఉండాది.&nbsp; ఎంపీ సిద్దప్ప: ఏందప్ప మాట మారుతుండాది? సీఎం గారిని ఆడు ఈడు అంటున్నావ్‌. ఫొటో ఇవ్వలేదని మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావ్‌ కదా. పుష్ప : అదేం లేదప్ప. సీఎం అన్నాక సవాలక్ష సమస్యలు ఉంటాయి. రేపు ఏ సీఎం అయినా అలాగే అంటాడు.&nbsp; ఎంపీ సిద్దప్ప: నేను అయితే అలా ఎందుకు అంటా? శుభ్రంగా ఇస్తా పుష్ప : ఏందీ.. ఫొటో ఇస్తావా? ఎంపీ సిద్దప్ప: ఇస్తానప్పా.. ఎందుకు ఇవ్వను.. పుష్ప : అయితే మీరే సీఎం (సిద్దప్ప వెంటనే షాకవుతాడు) ఎంపీ సిద్దప్ప: ఏందీ (షాక్‌లో) పుష్ప : మీరే సీఎం అప్పా..&nbsp; ఎంపీ సిద్దప్ప: నేను సీఎం ఆ.. (నవ్వుతూ) మతి ఉండే మాట్లాడుతున్నావా? పుష్ప: ఏమప్పా.. పుష్ప లాంటోడ్ని పక్కన పెట్టుకొని పిల్లి పిత్రి పదవులు (మంత్రి) ఏంటి సామి. పెద్దగా ఆలోచించండి సారు. నా పక్కన పుష్ప లాంటోడు ఉంటే నేను అట్లనే ఆలోచిస్తా.&nbsp; ఎంపీ సిద్దప్ప: ఆలోచించొచ్చు గానీ.. సీఎం అంటే చాలా అవుద్దీ అప్పా. పుష్ప : ఎంత అవుతది? ఎంపీ సిద్దప్ప: తక్కువలో తక్కువ రూ.100 కోట్లు. పుష్ప : రూ.500 కోట్లు ఇస్తా.. సరిపోద్దా (థియేటర్లలో ఒకటే విజిల్స్‌) ఎంపీ సిద్దప్ప: అంత డబ్బు ఎట్టా తెస్తావప్పా? పుష్ప: దుడ్డు (డబ్బు) గురించి పుష్పకు వదిలేసి.. ఢిల్లీ వెళ్లి ప్రతాప్‌సింగ్‌ (జగపతిబాబు)ను కలవండి. జగపతి బాబుతో ఫస్ట్ ఫోన్‌కాల్‌.. కేంద్ర మంత్రి ప్రతాప్‌సింగ్‌ (జగపతిబాబు) సింగ్‌తో పుష్ప ఫోన్‌లో మాట్లాడే సంభాషణ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. సీఎం సీటు గురించి ఎంపీ సిద్దప్ప అతడితో మాట్లాడుతున్న క్రమంలోనే ప్రతాప్‌ సింగ్ సోదరుడ్ని పుష్ప కలిసి రూ.5 కోట్లు ఇస్తాడు. దీంతో తన అన్నకు ఫోన్‌ చేసి ఆ డబ్బు గురించి చెప్తాడు. అప్పుడు పుష్ప-ప్రతాప్‌ సింగ్‌ సంభాషణ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది.&nbsp;&nbsp; పుష్ప: హలో.. నమస్తే! నా పేరు పుష్ప. మార్కెట్‌లో అందరూ ఎర్ర చందనం పుష్ప అంటుంటార్లే. ప్రతాప్‌సింగ్‌: తెలుసప్పా.. కొండారెడ్డి పావలా వాటానే కదా నువ్వు. వింటూనే ఉన్నా.&nbsp; పుష్ప: నువ్వు పావల వాటా గాడితో మాట్లాడుతున్నావ్‌ అనుకుంటే.. నేను క్వారీలో లారీ ఆపే గుమస్తా గాడితో మాట్లాడుతున్నాని ఫీలవ్వాల్సి వస్తది. చరిత్రలు ఎందుకులే అన్నా తవ్వుకోవడం. ప్రతాప్‌సింగ్‌: ఏందీ ఆ రూ.5 కోట్ల కథ. పుష్ప: అది నీకు కాదులే అన్న. నీతోడ బుట్టినోడికి. ఫోన్‌ కలిపిచ్చినందుకు. ఎన్ని దినాలు పాత సోఫాలో కూర్చొని ఉంటావ్‌. నీకో కొత్త కూర్చి పంపిస్తాలే. దాంట్లో కూర్చో.&nbsp; పుష్ప: సోఫా అంటే మామూలు సోఫా కాదన్న అది. చానా కాస్ట్లీ సోఫా. రూ.25 కోట్ల రూపాయల సోఫా అది.&nbsp; ప్రతాప్‌ సింగ్: ఏ టెండర్‌ కోసమో చెప్పు. క్వారీనా? మైనింగా?. స్టేట్‌లో ఏ పక్క కావాలో చెప్పు. పుష్ప: హా హా హా..&nbsp; మెుత్తం స్టేటే కావాలా. సిద్దప్ప స్టేట్‌కి సీఎం కావాలా. ప్రతాప్‌ సింగ్‌: నువ్వు నిర్ణయం తీసుకుంటే సరిపోద్దా? పుష్ప: సరిపోద్ది అన్నా. పుష్పగాడి నిర్ణయం తిరుపతి లడ్డు మాదిరి. ఒకసారి ఇచ్చినాక కాదనడానికి లే. కళ్లకద్దుకొని తీసుకోవాల్సిందే. సిద్దప్ప సీఎం అయ్యేది ఖాయం. కాదంటే నాకాడా చాలా సోఫాలు ఉన్నాయిలే. ప్రతాప్‌ సింగ్‌తో మీటింగ్ తర్వాత ఎంపీ సిద్దప్ప: ఏందప్ప ఇది ఫోన్ కనిపినోడికి రూ.5 కోట్లు, మాట్లాడినోడికి రూ.25 కోట్లా. ఇట్టా సింటికేట్‌ డబ్బంతా పొప్పులు, బెల్లాల మాదిరి పంచుకుంటూ పోతే ఎవరు సమాధానం చెప్పేది.&nbsp; పుష్ప: నీకు ఇచ్చే లెక్క మారదు సారు.. సిండికేట్‌కు వచ్చే లెక్క మారుద్ది. ఎంపీ సిద్దప్ప: టన్నుకు అదే రూ.కోటిన్నర లెక్క.. ఎట్లా మారుద్ది. పుష్ప: మంగళం శ్రీనుకి అమ్మితే టన్నుకు రూ.50 లక్షలు.. మురుగన్‌కు అమ్మితే టన్ను రూ.కోటిన్నర. అదే మురుగన్‌ అమ్మేటోడికి మనం పోగలిగితే.. ఎంపీ సిద్దప్ప: ఆశ్చర్యం, ఆనందం కలసిన ముఖంతో&nbsp; పుష్ప: పుష్పగాడి చూపు దేశం దాటేసుండాది. ఏందీ.. పుష్ప అంటే నేషనల్‌ అనుకుంటివా? ఇంటర్‌నేషనల్‌.. ఇంటర్నేషనల్‌ స్మగ్లర్‌తో డీల్‌.. స్మగ్లర్‌: పుష్ప రెండక్షరాలు.. నామ్ ఛోటా హై లేకిన్‌ సౌండ్‌ బడా.. బూమ్‌ పుష్ప: సౌండ్‌ నచ్చుండాదా నీకు.. ఇప్పుడు దందా మాట్లాడదాం చెప్పబ్బా. స్మగ్లర్‌: మాల్‌ ఎంత (హిందీలో) పుష్ప: 2000 టన్నులు (ఎర్ర చందనం) స్మగ్లర్‌: హా హా హా.. టన్నుకు ఎంత? పుష్ప : రూ. రెండున్నర కోట్లు స్మగ్లర్: జోక్‌ చేస్తున్నావా? పుష్ప పుష్ప: దందా విషయంలో పుష్ప జోకులెయ్యడు. పుష్పతో దందా అంటే చాలా మజా వస్తుంది.&nbsp; స్మగ్లర్‌: సరే 2000 టన్నుల మాల్‌ రూ.5000 కోట్లు పుష్ప: కాదు.. రూ.4,900 కోట్లు స్మగ్లర్‌: రూ.100 కోట్లు ఎందుకు తగ్గించావ్‌ పుష్ప? మాల్‌ సరిపడ లేదా? పుష్ప: మిగతా రూ.100 కోట్లకి నవ్వుతూ.. (హెలికాఫ్టర్‌ తీసుకొని వెళ్లిపోతాడు) సిండికేట్ మీటింగ్‌ సమయంలో.. సిండికేట్‌ సభ్యులు: షెకావత్‌ మన కోసం కాచుకొని ఉన్నాడు. ఈ సమయంలో అంత సరుకు పంపించడం కరెక్టెనా? పుష్ప: కరెక్టో కాదో పుష్ప ఆలోచించడప్ప.. ఒరు నిర్ణయం తీసుకుంటాడు. అది కరెక్ట్ అవుతుంది అంతే.&nbsp; పుష్ప - రష్మిక సంభాషణ ఓ సీన్‌లో శ్రీవల్లి (రష్మిక) కాలుకి దెబ్బ తగలుతుంది. పుష్ప స్వయంగా ఆమె కాలు పట్టుకొని మందు రాస్తుంటాడు. అప్పుడు వారి మధ్య వచ్చే డైలాగ్స్‌ క్యూట్‌గా అనిపిస్తాయి. శ్రీవల్లి: కాలు వదిలేయ్‌ సామి.. పుష్ప: ఏమి.. శ్రీవల్లి: అసలే మీరు పుష్పరాజ్‌. పెళ్లా కాలు పట్టుకుంటాడని నాకు మాట రానీకు. పుష్ప: ఏయ్‌.. పౌరుషంలోనే కాదు.. ప్రేమ విషయంలోనూ పుష్పరాజ్‌ తగ్గేదేలే (అంటు శ్రీవల్లి కాలితో తన గడ్డని నిమురుతాడు) పుష్ప - షెకావత్‌&nbsp; ఫస్ట్‌ పార్ట్‌ క్లైమాక్స్‌లో జరిగిన దానికి పుష్ప సారీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ మీటింగ్‌ ఏర్పాటు చేస్తాడు. అప్పుడు పుష్ప- షెకవాత్‌ మధ్య వచ్చే సంభాషణ వారి మధ్య మరింత శత్రుత్వాన్ని పెంచుతుంది. ఎంపీ సిద్దప్ప: పుష్ప చెప్పేయప్పా పుష్ప: సారీ చెప్పే ముందు పుష్ప చేసే ఎటకారపు చర్యలు భలే నవ్వు తెప్పిస్తాయి. పుష్ప: సరే.. సారీ షెకావత్‌ : బ్రహ్మాజీతో పుష్ప సారీ చెప్పింది విన్నావా? బ్రహ్మాజీ: సారీ చెప్పింది కాదు సార్‌.. చెప్పాడు అనాలి. షెకావత్‌: పుష్ప ఫైర్‌ అయ్యుంటే చెప్పాడు అనేవాడ్ని.. సారి చెప్పి ఫ్లవర్‌ అయ్యాడుగా అందుకే చెప్పింది.&nbsp; ‘పుష్ప అంటే ఫైర్‌ అనుకుంటివా.. వైల్డ్‌ ఫైర్‌’ జాతర సందర్భంలో వచ్చే డైలాగ్స్‌ అజయ్‌: వీరందర్నీ కొట్టినావని చెప్పి నిన్ను మాలో కలుపుకోవాలా? నువ్వు ఎప్పటికీ ఉత్త పుష్పరాజే. శ్రీవల్లి: యో పెద్ద మనిషి నీ కూతుర్ని కాపాడితే అంతా డ్రామా లాగా అనిపిస్తుందా? నీ బిడ్డకే కాదు ఏ ఆడబిడ్డైనా ఇట్లానే కాపాడతాడు. ఓ జన్మయ్య నీది. పుష్ప అమ్మ: శ్రీవల్లి.. పెద్ద చిన్న చూసి మాట్లాడు. శ్రీవల్లి: నీ కొడుకును అంటే నువ్వు ఊరుకుంటావేమోగానీ, ఎవడైనా నా మెుగుడ్ని అంటే నేను ఊరుకుండేదే లేదు.&nbsp; కిడ్నాపర్లకు పుష్పరాజ్‌ మాస్‌ వార్నింగ్‌ సినిమా చివర దశకు చేరుకునే క్రమంలో అజయ్‌ కూతుర్ని కొందరు కిడ్నాప్‌ చేస్తారు. ఓ న్యూస్‌ ఛానెల్‌ వేదికగా కిడ్నాపర్లకు పుష్పరాజ్‌ ఇచ్చే వార్నింగ్‌ హైలెట్ అనిపిస్తుంది.&nbsp; పుష్పరాజ్‌: నా పేరు పుష్ప.. పుష్ప రాజ్‌. మీరు నాకు పరిచయం అక్కర్లేదు పాయింట్‌కు వస్తున్నా. పుష్పరాజ్‌: బిడ్డను ఎత్తుకు పోతార్రా మీరు.. అంత దమ్ముండాదా? కొడ**రా. ఇప్పుడు చెబుతున్నా చెవులు పెద్దవి చేసుకొని వినండి.&nbsp; పుష్పరాజ్‌: మీకు ఈ క్షణం నుంచి గంట టైమ్ ఇస్తాండా. ఆ బిడ్డను యాడ నుంచి ఎత్తుకెళ్లారో ఆడనే దింపాలా. అట్ట పోయి ఇట్ట వచ్చినట్లుండాలా. పుష్పరాజ్‌: అట్ట కాదని ఆ బిడ్డమీద ఒక్క చిన్న గీత పడాలా.. గంగమ్మ తల్లి జాతరలో యాటను నరికినట్లు రప్పా రప్పా నరుకుతా.. ఒక్కొక్కడిని రప్పా రప్పా రప్పా..&nbsp; మెగా ఫ్యామిలీకి కౌంటర్లుగా అనిపించే డైలాగ్స్‌ అల్లు అర్జున్‌ వర్సెస్‌ మెగా ఫ్యామిలీ మధ్య వివాదం రాజుకున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేథ్యంలో పుష్ప 2 లోని కొన్ని డైలాగ్స్&nbsp; చర్చనీయాంశమవుతున్నాయి. చిరు ఫ్యామిలీకి కౌంటర్‌గా వాటిని మూవీలో పెట్టారన్ని మెగా ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. ఆ డైలాగ్స్‌పై లుక్కేద్దాం.&nbsp; ‘మీ బాస్‌కే నేను బాస్‌’ 'ఒక‌డు ఎదుగుతుంటే చూడ‌లేక వాడు డౌన్ కావాల‌ని కోరుకునేవాళ్లు చాలా మందే ఉంటారు'&nbsp; ‘నేను తగ్గాలని చాలా మంది చూస్తున్నారు’ 'ఎత్తులో ఉన్న‌ప్పుడు ఈగోలు ఉండ‌కూడ‌దు'&nbsp; 'పెళ్లాం మాట వింటే ఎట్టుంటాదో ప్రపంచానికి చూపిస్తా'&nbsp; ‘పావలా పర్సంటేజ్ వాటా గాడివి ఏంటిరా?&nbsp; 'ఎవడ్రా నువ్వు ఇలాగే వాగితే అనంతపురం తీసుకెళ్లి గుండు కొట్టిస్తా..’
    డిసెంబర్ 05 , 2024
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    ప్రస్తుతం భారతీయ సినిమా మరింత సరళంగా మారింది. ఒక భాషలో రిలీజైన సినిమాలను మరో భాషలోని ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి గత రెండేళ్లలో తెలుగులోకి చాలా చిత్రాలు వివిభ భాషల నుంచి డబ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్‌ అయిన మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలతో పాటు అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం. [toc] Best malayalam movies in telugu ప్రేమలు రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. యూనిక్ కథాంశంతో యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం కథంతా హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సినిమా కథలోకి వెళ్తే..స‌చిన్.. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌టికే ల‌వ్‌లో ఫెయిలైన స‌చిన్‌.. రీనూకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవ‌రు? స‌చిన్‌ - రీనూ చివ‌ర‌కు కలిశారా? లేదా? అన్న‌ది క‌థ‌. మంజుమ్మెల్‌ బాయ్స్‌&nbsp; ఈ చిత్రం మంచి ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కేర‌ళ‌ కొచ్చికి చెందిన కుట్ట‌న్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్క‌డ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ. ఆవేశం ఇటీవల మలయాళంలో బ్లాక్ బాస్టర్ అయిన ఆవేశం చిత్రం అన్ని భాషల్లోనూ అదే హవా కొనసాగించింది. ఈ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కామెడీ యాక్షన్ జొనర్‌లో వచ్చి మంచి ఎంటర్‌టైనింగ్ అందించింది. ఈ సినిమా కథలోకి వెళ్తే..కేరళకు చెందిన బీబీ (మిథున్ జై శంకర్), అజు (హిప్‌స్టర్), మరియు శాంతన్ (రోషన్ షానవాజ్) ముగ్గురు స్నేహితులు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంటారు. కాలేజీలో సీనియర్లు కారణం లేకుండా కొడుతుంటారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో గ్యాంగ్‌స్టర్ అయిన రంగాతో(ఫాహద్ ఫాసిల్) ఫ్రెండ్‌షిప్ చేస్తారు. రంగా స్నేహం వారి జీవితాలను ఏవిధంగా మార్చిందనేది కథ. ది గోట్ లైఫ్ ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ RDX మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది.&nbsp; 2018 కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఆంథోని జోసెఫ్‌ డైరెక్ట్ చేశాడు. కింగ్ అఫ్ కొత్త ఖన్నా భాయ్ (డ్యాన్స్ రోజ్ షబీర్) కోతా పట్టణంలో డ్రగ్స్ వ్యాపారి. సిఐ షాహుల్ హాసన్ (ప్రసన్న) పట్టణంలో డ్రగ్స్ మాఫియాను నిర్మూలించాలని కంకణం కట్టుకుంటాడు. కొన్నేళ్ల క్రితం కోతా... రాజు (దుల్కర్ సల్మాన్) నియంత్రణలో ఉందని, ఒకప్పుడు ఖన్నా భాయ్ రాజుకి ప్రియమైన స్నేహితుడని షాహుల్ తెలుసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల రాజు మరియు ఖన్నా భాయ్ ఇద్దరూ విడిపోయారు. వారిని వేరు చేసింది ఏమిటి? అప్పుడు సీఐ షాహుల్ హాసన్ ఏం చేశాడు? అనేది కథ రోమాంచం రోమాంచం చిత్రం మలయాళంలో వచ్చిన కామెడీ హర్రర్ చిత్రం. ఈ చిత్రాన్ని జితు మాధావన్ తెరకెక్కించారు. ఈ సినిమా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కథలోకి వెళ్తే…. బెంగుళూరులోని ఓ ఇంట్లో ఉండే ఏడుగురు బ్యాచిలర్ స్నేహితుల కథే ఈ చిత్రం. అందులో ఒకరు ఉద్యోగం చేస్తుంటారు, మరొకరు వ్యాపారాలు చేస్తూ విఫలమవుతుంటాడు. ఇద్దరు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు కానీ ఇంకా ఆఫర్ లెటర్ అందదు. ఒకరు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరూ ఏమీ చేయకుండా తమ జీవితాలను సాగిస్తుంటారు. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లోకి ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఇంతకీ ఎంటా పరిణామం? దాని వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి అనేది కథ. భ్రమయుగం తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ. అన్వేషిప్పిన్ కండెతుమ్ ఈ సినిమా మంచి సస్పెన్స్‌ను క్యారీ చేస్తూ.. ఆసక్తికరంగా కథనం సాగుతుంది.&nbsp;ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్‌ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్‌ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ. మలైకోట్టై వాలిబన్ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయ‌కుడి క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ పోరాటంలో వాలిబాన్‌ (మోహ‌న్‌లాల్)కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ ప్రాంత ప్రజలకు అతడు హీరోగా ఎలా నిలిచాడు? అన్నది కథ. నెరు కళ్లు కనిపించని సారా మహ్మద్‌ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్‌ విజయ్‌ మోహన్‌ (మోహన్‌లాల్‌)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు? అన్నది కథ. మాలికాపురం ఎనిమిదేళ్ల చిన్నారి షన్ను అయ్యప్ప స్వామి భక్తురాలు. షన్ను కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో సోదరుడు బుజ్జితో కలిసి షన్ను శబరిమలై బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లలు కిడ్నాప్‌ చేసే గ్యాంగ్‌ షన్నును ఎలా ఇబ్బంది పెట్టింది? కథలో ఉన్ని ముకుందన్ పాత్ర ఏంటి? అన్నది కథ. Best&nbsp; Tamil movies in telugu డియర్ అర్జున్‌ (జీవి ప్రకాష్‌) న్యూస్‌ రీడర్‌గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్‌ లైఫ్‌లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సైరన్ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా కథలోకి వెళ్తే..భార్యను (అనుప‌మ)ను చంపిన కేసులో తిల‌గ‌న్‌ (జ‌యం ర‌వి) జైలుకు వెళ్తాడు. పెరోల్‌పై బయటకొచ్చిన తిలగన్‌.. వరుసగా పొలిటిషియన్స్‌ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీస‌ర్‌ నందిని (కీర్తిసురేష్‌) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ. ఓటీటీ: హాట్‌ స్టార్ లియో హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలతో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. ఇదే సమయంలో ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) &amp; గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్‌ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? అనేది మిగిలిన కథ. ఓటీటీ:&nbsp; నెట్‌ఫ్లిక్స్ జైలర్ ఈ చిత్రం సరైన హిట్‌లేక సతమతమవుతున్న రజినీకాంత్‌కు సాలిడ్ విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్‌ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్‌ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ; హాట్ స్టార్ విక్రమ్ ఈ సినిమా మరోసారి వింటేజ్ కమల్ హాసన్‌ను గుర్తు తెచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ కమల్ హాసన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక కథలోకి వెల్తే.. డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్‌ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్‌ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్‌ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ. ఓటీటీ; హాట్ స్టార్, జీ5 కాల్వన్ ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్‌ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్‌ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్‌ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ. ఓటీటీ: హాట్‌స్టార్ అయాలన్ భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్‌ (శరద్‌ ఖేల్కర్‌) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్‌ భారత్‌లో ల్యాండ్‌ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ మెర్రీ క్రిస్మస్ ఆల్బర్ట్‌ (విజయ్‌ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్‌)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్‌ గతం ఏంటి? అన్నది స్టోరీ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్ ఈ చిత్రం కాస్త వివాదాస్పదం అయింది. తమిళంలో హిట్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి తండ్రిని చూసి చెఫ్ కావాలని అనుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె నాన్ వెజ్ ముట్టుకోవడం పాపం అని తండ్రి అంటాడు. మరి కలలు కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? లేదా? అన్నది కథ. జపాన్ ఈ చిత్రం కార్తీ&nbsp; నటించిన 25వ చిత్రం. ఈ సినిమాలో పేరుమోసిన దొంగ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. అతని పాత్ర హెలెరియస్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అంతా అనుమానిస్తారు. జపాన్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్‌ కోసం గాలిస్తుంటారు. తన ప్రేయసిని కలిసే ప్రయత్నంలో జపాన్ దొరికిపోతాడు. అయితే ఆ సొత్తు జపాన్ దొంగలించలేదని విచారణలో తేలుతుంది. మరి ఆ నగల దొంగతనం చేసింది ఎవరు? ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ కెప్టెన్ మిల్లర్ కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధ‌నుష్‌) నిమ్న‌ కులానికి చెందిన యువ‌కుడు. ఊరిలోని కుల‌ వివ‌క్ష‌ను భ‌రించ‌లేక గౌర‌వ మ‌ర్యాద‌ల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్ల‌ర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్‌ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్‌ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్‌ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ పాత్రలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో చిన్నా మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో... అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ 800 ఈ చిత్రంలో తొలుత విజయ్ సేతుపతి నటించినప్పటికీ.. తమిళనాడు నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక కథలోకి వెళ్తే.. తేయాకు తోట‌ల్లో ప‌నిచేస్తున్న త‌మిళ కుటుంబంలో ముత్తయ్య ముర‌ళీధ‌ర‌న్‌ జన్మిస్తారు. శ్రీలంక‌లోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే సింహ‌ళులు, త‌మిళుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగుతాయి. దాంతో ముత్తయ్య కుటుంబం ప్రాణ భయంతో దూరంగా వెళ్లి త‌ల‌దాచుకుంటుంది. 70వ దశకంలో చెలరేగిన ఘ‌ర్ష‌ణ‌ల ప్రభావం త‌న బిడ్డపై ప‌డ‌కూడ‌ద‌ని ముత్తయ్య త‌ల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆస‌క్తి ఎలా ఏర్పడింది? శ్రీలంక జ‌ట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవ‌మానాల్ని, స‌వాళ్లని ఎదుర్కొని ఆట‌గాడిగా నిలబడ్డాడు? అనేది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మార్క్ ఆంటోనీ మార్క్ (విశాల్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్‌ మిషన్‌ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ నాయకుడు అణగారిన వర్గానికి చెందిన మహారాజు రామాపురం ఎమ్మెల్యే. అయితే, అతడు, అతని కుమారుడు రఘు వీరకు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేశారు. మహారాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన తండ్రి కోసం పోరాడేందుకు రఘుని ప్రేరేపిస్తుంది. ఇంతకు ఆ సమస్య ఏమిటి? వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎందుకు మానేశారు?చివరికి ఏమి జరిగింది అనేది మిగిలిన కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సార్ బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Best Kannada movies in telugu కబ్జ ఆర్కేశ్వర (ఉపేంద్ర), భారత వైమానిక దళ అధికారి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. అతను సంపన్నమైన అమ్మాయి అయిన మధుమతి (శ్రియా శరణ్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇదేక్రమంలో అమరాపురను తమ&nbsp; అధికారం కోసం భయంకరమైన గూండాలు మరియు రాజకీయ నాయకులు ఓ క్రైమ్ వరల్డ్‌గా&nbsp; మార్చేస్తారు. అయితే అర్కేశ్వర క్రైమ్ ప్రపంచంలోకి ప్రవేశించి ఆ ప్రాంతానికి నాయకుడు ఎలా అవుతాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది మిగతా కథ. సప్తసాగరాలు దాటి సైడ్ బి మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ. ఓటీటీ; ప్రైమ్ వీడియో ఘోస్ట్ బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ తన గ్యాంగ్‌తో కలిగి ఓ జైలును ఆక్రమిస్తాడు. మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్‌ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ? అతని గతం ఏమిటి ? అసలు అతను ఘోస్ట్‌గా ఎందుకు మారాడు ? అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5 బాయ్స్ హాస్టల్ ఓ బాయ్స్ హాస్టల్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండే అజిత్ (ప్రజ్వల్) ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. తమని టార్చర్ చేసే హాస్టల్ వార్డెన్‌ను తన ఫ్రెండ్స్‌తో కలిసి చంపేసినట్లుగా స్క్రిప్ట్‌లో రాసుకుంటాడు. అయితే నిజంగానే వార్డెన్‌ చనిపోతాడు. సుసైడ్‌ నోట్‌లో అజిత్‌, ‌అతడి ఫ్రెండ్స్ పేరు రాయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: ఈటీవీ విన్ కాటేరా ఈ సినిమా కన్నడ నాట బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కథలోకి వెళ్తే.. భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష‌ అనుభ‌విస్తున్న‌ కాటేరా (ద‌ర్శ‌న్‌) పెరోల్ మీద బ‌య‌ట‌కు వ‌స్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తుంటారు. వారంద‌రూ ఎవ‌రు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ. ఓటీటీ: జీ5 టోబి టోబి చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులకు గురవుతాడు. కోపం వస్తే అందరితో దారుణంగా ప్రవరిస్తుంటాడు. నిజానికి అమాయకుడైన టోనీని ఊరిపెద్ద ఆనంద హత్యలు చేసేందుకు ఉపయోగించుకుంటాడు. తనను వాడుకుంటున్నారని తెలుసుకున్న టోబి ఏం చేశాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సోనీ లీవ్ Best Hindi movies in telugu అమర్ సింగ్ చమ్కిలా జానపద గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పేద కుటుంబంలో జన్మించిన ఆయన&nbsp; సింగర్‌ కావడాని కసితో ఎలా ఎదిగాడు? 27 ఎళ్లతో ఎంతో ఫేమస్ అయిన అతన్ని ఎవరు చంపారు అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ యానిమల్‌ ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమాలో సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో రణ్‌బీర్ కపూర్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది. దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్‌ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మైదాన్ 1952లో జరిగిన ఒలింపిక్స్‌ పోటీల్లో భారత ఫుట్‌బాల్‌ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్‌ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్‌ సయ్యద్ అబ్దుల్‌ రహీమ్‌ (అజయ్‌ దేవగన్‌) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్‌గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ 2 లస్ట్ స్టోరీస్ 2లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథలో మృణాల్, అంగన్ బేడీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడా ఒప్పుకుంటారు. అయితే మృణాల్ నానమ్మ.. పెళ్లికి ప్రేమ కంటే బలమైన శారీరక సంబంధం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత మృణాల్- బేడీ ఎం చేశారన్నది ఫస్ట్ కథ. రెండో కథలో ఓనర్ లేనప్పుడు పనిమనిషి తన భర్తను తెచ్చుకుని లైంగికానందం పొందుతుంది. అయితే వీరిద్దరిని చూసిన ఓనర్ ఏం చేసింది అనేది రెండో కథ. ఇక మూడో కథలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ కొన్నేళ్ల తర్వాత తమన్నను కలుస్తాడు. వీరిద్దరు శారీరకంగా దగ్గరైన తర్వాత ఏం జరిగింది అనేది కథ. నాల్గొ కథలో కామంతో రగిలిపోతున్న తన భర్త విషయంలో కాజల్ ఏమి చేసింది అనేది కథ.. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మర్డర్ ముబారక్ రాయల్‌ ఢిల్లీ క్లబ్‌లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్‌ రంగంలోకి దిగుతాడు. క్లబ్‌లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్‌), నటి షెహనాజ్‌ నూరాని (కరిష్మా కపూర్‌), రాయల్‌ రన్‌విజయ్‌ (సంజయ్‌ కపూర్‌), లాయర్‌ ఆకాష్‌ (విజయ్‌ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్‌ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ భక్షక్ జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గంగూభాయి కతియావాడి ఈ చిత్రం అలియా భట్‌ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. గంగూబాయి హర్జీవందాస్‌ (అలియా భట్‌) గుజరాత్‌లోని&nbsp; ఓ పెద్ద కుటుంబంలో పుడుతుంది.&nbsp; ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆసరా చేసుకున్న గంగుభాయ్ లవర్ ఆమెను ముంబై తీసుకొచ్చి అక్కడ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. తప్పని పరిస్థితుల్లో ఆమె వేశ్యగా కొనసాగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత.. గంగూబాయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి? వేశ్యల అభ్యున్నతి ఆమె ఏం చేసింది అనేది మిగతా కథ. ఓటీటీ; నెట్‌ఫ్లిక్స్ 83 1983 నాటి క్రికెట్ ప్రపంచకప్‌ను ఇండియా గెలుచుకున్న నేపథ్యాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆ క్రమంలో ఆటగాళ్లు ఎదురుకున్న సమస్యలు, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? ఎలా కప్ గెలిచారు ? అనేది మిగతా కథ ఓటీటీ; డిస్నీ హాట్ స్టార్ జవాన్ సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గదర్ 2 బాలీవుడ్‌లో చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవుతున్న క్రమంలో వచ్చిన ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. తారా సింగ్ (సన్నీ డియోల్) భారత సరిహద్దుల్లో కనిపించకుండా పోతాడు. పాక్‌ అతడ్ని బంధించిందని భావించిన అతడి కొడుకు.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్తాడు. అనూహ్యాంగా ఇంటికి తిరిగొచ్చిన తారా సింగ్‌.. కొడుకు పాక్‌లో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. బిడ్డను కాపాడేందుకు పాక్‌ వెళ్తాడు. అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ. ఓటీటీ: ప్రైమ్ వీడియో
    మే 20 , 2024
    <strong>Telugu hot movies : గత 25 ఏళ్లలో తెలుగులో వచ్చిన అడల్ట్ సినిమాలు, అవి స్ట్రీమింగ్ అవుతున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లిస్ట్ ఇదే!</strong>
    Telugu hot movies : గత 25 ఏళ్లలో తెలుగులో వచ్చిన అడల్ట్ సినిమాలు, అవి స్ట్రీమింగ్ అవుతున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లిస్ట్ ఇదే!
    రొమాంటిక్, అడల్ట్, బొల్డ్ కంటెంట్‌ సినిమాలకు సపరేట్‌ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలు యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తాయి. కథలో పెద్దగా లాజిక్‌లు ఏమి లేకుండా కేవలం.. హీరోయిన్ల అందాల ఆరబోతకే ప్రాధాన్యత ఇస్తుంటాయి. పాత్ర డిమాండ్ చేసినా చేయకపోయినా.. కుదిరితే ముద్దు సీన్లు.. ఇంకాస్తా ముందుకెళ్తే బెడ్‌ రూం సీన్లు కూడా ప్రస్తుతం సినిమాల్లో సాధారణమై పోయాయి. మరి అలాంటి చిత్రాలు గడిచిన 25 ఏళ్లలో తెలుగులో ఎన్ని వచ్చాయో ఓసారి చూద్దాం. [toc] Arthaminda Arunkumar Season 2 ఈ చిత్రం మంచి అడల్ట్‌ స్టఫ్‌తో వచ్చింది. చాలా సన్నివేశాల్లో రొమాంటిక్ సీన్లు మిమ్మల్ని అలరిస్తాయి. ఇక కథ విషయానికొస్తే.. హైదరాబాద్‌లో కొత్త ఉద్యోగంతో మొదలుపెట్టిన అరుణ్‌ కుమార్ తన లేడీ బాస్‌తో సవాళ్లను ఎదుర్కొంటూనే అసిస్టెంట్ మేనేజర్‌గా పదోన్నతి పొందుతాడు. అటువంటి సమయంలో అతనికి ఓ ముఖ్యమైన ప్రాజెక్ట్ అప్పగించబడుతుంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కాకుండా చూసేందుకు తేజస్వి పాత్ర కుతంత్రాలు పన్నుతుంది. ఈ పరిస్థితుల్లో అరు౦ తన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు, ఆ అడ్డంకులను అధిగమించాడా అనేదే కథ. Citadel Honey Bunny ఈ సినిమాలోని బెడ్రూమ్‌ సీన్లలో సమంత రెచ్చిపోయి నటించింది. వరుణ్‌ ధావన్‌తో లిప్‌లాక్‌ సీన్స్‌ మరి ఘాటుగా ఉంటాయి. ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌ తరహాలో ఇందులో కూడా హాట్‌ సీన్స్‌లో సామ్ నటించింది.&nbsp; ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే..బన్నీ (వరుణ్ ధావన్) ఓ స్టంట్ మ్యాన్. సీక్రెట్‌ ఏజెంట్‌గాను పనిచేస్తుంటాడు. షూటింగ్‌లో పరిచయమైన హనీ (సమంత)ను ఓ మిషన్‌లో భాగం చేస్తాడు. ఈ క్రమంలో ఇద్దరూ దగ్గరవుతారు. అయితే ఈ మిషన్‌లో హనీ చనిపోయిందని బన్నీ భావిస్తాడు. కానీ, 8 ఏళ్ల తర్వాత హనీ బతికున్న విషయం తెలుస్తుంది. వారిద్దరికి పుట్టిన కూతురు కూడా ఉందని తెలుస్తుంది. మరోవైపు హనీ, ఆమె కూతుర్ని చంపేందుకు కొందరు యత్నిస్తుంటారు. అప్పుడు బన్నీ ఏం చేశారు? విలన్‌ గ్యాంగ్‌ను హనీ-బన్నీ ఎలా ఎదుర్కొన్నారు? విలన్‌ గ్యాంగ్‌ హనీ వెంట ఎందుకు పడుతోంది? అన్నది స్టోరీ.&nbsp; Honeymoon Express&nbsp; చైతన్యరావు , హెబ్బా పటేల్‌&nbsp; జంటగా నటించిన చిత్రం ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’. హీరోయిన్‌ హెబ్బా పటేల్‌ తన అందాల ఆరబోతతో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచింది. బెడ్రూమ్ సీన్లలో చైతన్యరావు, హెబ్బా పటెల్ రెచ్చిపోయి నటించారు. బొల్డ్ కంటెంట్ ఇష్టపడేవారికి మంచి మాజాను ఇస్తుంది. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే..ఇషాన్‌, సోనాలి పెళ్లైన కొత్త జంట. భిన్నమైన మనస్తత్వాలు ఉండటంతో తరచూ వీరి కాపురంలో గొడవలు వస్తుంటాయి. ఈ క్రమంలో ఓ సీనియర్‌ కపుల్స్‌.. వీరికి హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌ అనే గేమ్‌ గురించి చెప్తారు. ఏంటా గేమ్‌? దాని వల్ల ఇషాన్‌, సోనాలి ఎలా దగ్గరయ్యారు? ఇంతకీ గేమ్‌ను సూచించిన సీనియర్‌ జంట ఎవరు? అన్నది కథ.&nbsp; స్త్రీ 2 స్త్రీ 2 చిత్రంలో టైమ్ లెస్ హాట్ బ్యూటీ శ్రద్ధా కపూర్ అందాలను అప్పనంగా ఆస్వాదించవచ్చు. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ బొల్డ్ సీన్లలో రెచ్చిపోయి నటించింది. యూత్‌కు మంచి మజాను అందిస్తుంది ఈ చిత్రం. &nbsp;ఇక సినిమా స్టోరీ విషయానికొస్తే.. చందేరీ గ్రామంలో స్త్రీ సమస్య తొలిగింది అనే అంతా భావించే లోపు సర్కటతో కొత్త సమస్య మొదలువుతుంది. ఈ సమస్యను విక్కీ(రాజ్ కుమార్), రుద్ర (పంకజ్ త్రిపాఠి), జన(అభిషేక్ బెనర్జీ)తో కలిసి దెయ్యం(శ్రద్ధా కపూర్) ఎలా ఎదుర్కొంది అన్నది కథ. Nakide First Time రాంరెడ్డి మస్కీ దర్శకత్వంలో వచ్చిన 'నాకిదే ఫస్ట్ టైమ్'&nbsp; చిత్రంలో ధనుష్ బాబు, సిందూర రౌత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో టీనేజీలో యువతీ యువకుల మధ్య ఉండే ఆకర్షణలను ప్రధానంగా చూపించారు. Silk Saree&nbsp; అడల్ట్‌ కంటెంట్‌ ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి టైం పాస్ ఇస్తుంది. ఈ సినిమాలో వాసుదేవ్‌రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి, ప్రధాన పాత్రల్లో నటించారు.&nbsp; Naughty Girl&nbsp; ఈ చిత్రంలో శ్రీకాంత్, తాప్సి పన్ను ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో కావాల్సినన్ని మసాల సీన్లు అందుబాటులో ఉన్నాయి.&nbsp; Hi Five ఈ చిత్రాన్ని రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా అమ్మ రాజశేఖర్ తెరకెక్కించారు.ఈ సినిమాలోనూ అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎవోల్ రీసెంట్‌గా ఓటీటీలో రిలీజైన ఎవోల్ చిత్రం ట్రెండింగ్‌లో ఉంది. తొలుత ఈ సినిమాను థియేటర్‌లో రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ.. ఈ చిత్రంలోని బొల్డ్ సీన్లకు సెన్సార్ బోర్డు అడ్డు చెప్పడంతో నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే. నిధి అనే యువతి ప్రభుని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అయితే ప్రభు బిజినెస్ పార్ట్నర్ అయిన రిషితో నిధి అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. ఇదే క్రమంలో ప్రభు తన అసిస్టెంట్ దివ్యతో ఎఫైర్ పెట్టుకుంటాడు. ఓ రోజు దివ్య గురించి చెప్పి విడాకులు అడుగుతాడు. ఇదే సమయంలో నిధి కూడా తనకున్న అఫైర్‌ను బయటపెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? మరి వీరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అన్నది మిగతా కథ. యావరేజ్ స్టూడెంట్ నాని ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ సినిమా హీరో, డైరెక్టర్ పవన్ కొత్తూరి ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఈ చిత్రంలో బొల్డ్ సీన్లు శృతి మించాయని ట్రోల్ చేశారు. సరే, ఇక కథలోకి వెళ్తే.. చదువులో యావరేజ్ స్టూడెంట్ అయిన నాని తన కాలేజ్ సీనియర్ సారాతో ప్రేమలో పడుతాడు. ఆమెతో ఎఫైర్ పెట్టుకుంటాడు. బ్రేకప్ అయిన తర్వాత అనుతో ప్రేమలో పడుతాడు. సారాతో ఎఫైర్ ఉన్నట్లు తెలిసిన అను అతన్ని ఎందుకు ప్రేమించింది? బ్రేకప్ అయిన తర్వాత కూడా నానితో సారా ఎందుకు రిలేషన్ షిప్ కొనసాగించాలనుకున్నది అనేది మిగతా కథ. https://www.youtube.com/watch?v=xQxqX7fO4Ps హాట్ స్పాట్ నాలుగు కథల సమాహారంగా హాట్‌స్పాట్‌ చిత్రం రూపొందింది. నలుగురు యువతులు వారి భాగస్వాముల చుట్టూ కథ నడుస్తుంది. వారి రిలేషన్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? వాటి నుంచి ఆ జంట ఎలా బయటపడింది? అన్నది స్టోరీ. లవ్ మౌళి 2024లో వచ్చిన బొల్డ్ కంటెంట్ సినిమాల్లో లవ్ మౌళి చిత్రం ముందు వరుసలో నిలుస్తుంది. ఈ చిత్రం మూడేళ్ల నుంచి ఊరిస్తూ ఊరిస్తూ ఇప్పటికీ విడుదలైది. ఈ సినిమాలోనూ బొల్డ్ సీన్లు పుష్కలంగా ఉన్నాయి. కథ పక్కకు పెడితే అడల్ట్ కంటెంట్ ఇష్టపడేవారిని ఈ చిత్రం ఏమాత్రం డిస్సాపాయింట్ చేయదని చెప్పాలి. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.."తల్లిదండ్రులు విడిపోవడంతో మౌళి (నవదీప్‌) చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరుగుతాడు. కొన్ని అనుభవాల వల్ల అతడికి ప్రేమ‌పై కూడా న‌మ్మ‌కం పోతుంది. పెయిటింగ్ వేస్తూ వాటి ద్వారా వ‌చ్చిన డ‌బ్బుల‌తో జీవిస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల ఓ అఘోరా (రానా ద‌గ్గుబాటి) అతడికి మహిమ గల బ్రష్‌ ఇస్తాడు. ఆ పెయింటింగ్ బ్ర‌ష్‌తో తను కోరుకునే లక్షణాలున్న అమ్మాయిని సృష్టించే శక్తి మౌళికి వస్తుంది. ఈ క్రమంలో అతడు వేసిన పెయింటింగ్ ద్వారా చిత్ర (ఫంఖూరీ గిద్వానీ) అత‌డి ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. కొన్నాళ్లు సాఫీగా సాగిన వారి ప్రేమ బంధం.. గొడవలు రావడంతో బ్రేకప్‌ అవుతుంది. మౌళి.. మళ్లీ బ్రష్‌ పట్టి అమ్మాయి పెయింటింగ్‌ గీయగా తిరిగి చిత్రనే ముందుకు వస్తుంది. అలా ఎందుకు జరిగింది? మౌళి.. లవ్‌ బ్రేకప్‌కు కారణమేంటి? ప్రేమకు నిజమైన అర్థాన్ని హీరో ఎలా తెలుకున్నాడు? మౌళి, చిత్ర ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. Mr &amp; Miss ఈ చిత్రం కూడా బొల్డ్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఏ మాత్రం డిస్సాపాయింట్ చేయదు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. "తన బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ కావడంతో శశి(జ్ఞ్యానేశ్వరి) ఓ పబ్‌లో అనుకోకుండా శివ(సన్నీ)ని కిస్ చేస్తుంది. అక్కడ మొదలైన వారి బంధం ముందుకు సాగుతుంది. ఇద్దరు ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకుని శారీరకంగా దగ్గరవుతారు. అయితే కొన్ని కారణాల వల్ల విడిపోయే పరిస్థితి వస్తుంది. సరిగ్గా బ్రేకప్ చెప్పే సమయంలో శివ ఫొన్ మిస్‌ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వీరి రిలేషన్ ఏమైంది అనేది మిగతా కథ. ఏడు చేపలా కదా ఈ సినిమా తెలుగులో పెద్ద ఎత్తున బజ్ సంపాదించింది. అడల్ట్ మూవీల్లో ఓ రకమైన ట్రెండ్ సెట్ చేసింది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. రవి(అభిషేక్ పచ్చిపాల) పగలు ఏ అమ్మాయిని చూసి టెంప్ట్‌ అవుతాడో.. అదే అమ్మాయి రాత్రి అతనితో శారీరకంగా కలుస్తుంటుంది. ఈక్రమంలో అతను ప్రేమించిన (ఆయేషా సింగ్) కూడా రవికి దగ్గరవుతుంది. దీని వల్ల రవి ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు రవిని చూసి వాళ్లెందుకు టెంప్ట్‌ అవుతున్నారన్నది మిగతా కథ. RGV’s Climax తెలుగులో వచ్చిన బొల్డ్ కంటెంట్‌ సినిమాల్లో ఇదొకటి. మియా మాల్కోవా మరియు ఆమె ప్రియుడు ఎడారి పర్యటనను అనుసరిస్తూ, వారు వేరే ఏదైనా కొత్తగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో వారి పయనం ఎడారిలో ఎటు వైపు సాగిందనేది కథ. రాజ్ ఈ చిత్రం కూడా అడల్ట్ కంటెంట్ ఉన్న మూవీ. ఇక ఈ సినిమాలో కూడా రొమాంటిక్ సీన్లు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇక కథలోకి వెళ్తే.. ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అయిన రాజ్ (సుమంత్) తన తండ్రి సన్నిహితుడి కూతురు మైథిలి (ప్రియమణి)తో నిశ్చితార్థం చేసుకున్నాడు. పెళ్లి తేదీ దగ్గర పడుతున్న సమయంలో, అతను మరో అమ్మాయి ప్రియ (విమలా రామన్)తో ప్రేమలో పడుతాడు.పెళ్లిని రద్దు చేయాలని తండ్రిని కోరుతాడు. అయితే ఇంతలో ప్రియ కనిపించకుండా వెళ్లిపోతుంది. దీంతో ప్రియను రాజ్ పెళ్లి చేసుకుంటాడు? ఇంతకు ప్రియ ఎటు వెళ్లింది? మైథిలి, రాజ్ మధ్య కాపురం సజావుగా సాగిందా లేదా అనేది మిగతా కథ. నేను మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది. BA పాస్ బాలీవుడ్‌లో వచ్చిన అత్యంత బోల్డ్ సినిమాల్లో ఒకటిగా BA PAss గుర్తింపు పొందింది. ఈ చిత్రం తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే… ముఖేష్ (షాదబ్ కమల్) అనే ఓ యువకుడి చూట్టూ తిరుగుతుంది. బీఏ డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ముఖేష్ తల్లిదండ్రులు చనిపోతారు. దీంతో అతను ఢిల్లీలో ఉన్న తన మేనత్త ఇంట్లో ఉంటూ చదువుకుంటూ ఉంటాడు. అక్కడ అవమానాలను ఎదుర్కొంటూ చాలీ చాలని డబ్బుతో కాలం నెట్టుకొస్తుంటాడు. ఈ క్రమంలో అతనికి సారికా(శిల్పా శుక్లా) అనే ఓ పెళ్ళైన మహిళ పరిచయమవుతుంది.ఇద్దరూ శారీరకంగా ఒక్కటవుతారు. ముఖేష్ పరిస్థితి అర్థం చేసుకున్న సారికా అతనికి తనలాగా శారీరక సుఖం కోసం పరితపిస్తున్న పెళ్లైన మహిళలను పరిచయం చేస్తుంది. డబ్బు బాగా చేతికందుతున్న క్రమంలో అతని జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ముఖేష్ జీవితంలో జరిగిన ఆ సంఘటన ఏమిటి? ఈ వృత్తిని ముఖేష్ కొనసాగించాడా? మానేశాడా? అనేది మిగతా కథ. కుమారి 21F తెలుగులో వచ్చిన బోల్డ్ కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రాల్లో కుమారి 21F ఒకటి. యూత్‌ను తెగ ఆకర్షించింది ఈ సినిమా. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. సిద్దు(రాజ్ తరుణ్) హోటల్‌ మెనేజ్‌మెంట్‌లో డిగ్రీ కంప్లీట్ చేసి చెఫ్‌గా వెళ్ళాలని తెగ ట్రై చేస్తుంటాడు. ఈక్రమంలో ముంబై నుంచి వచ్చిన మోడల్ కుమారి(హేభ పటేల్) సిద్ధు ప్రేమలో పడుతుంది. ఆమె బోల్డ్ యాటిట్యూడ్ వల్ల సిద్ధు తొలుత ఇబ్బంది పడ్డా తర్వాత ఆమెను ప్రేమిస్తాడు. ఈక్రమంలో కుమారి క్యారెక్టర్ మంచిదికాదని సిద్ధు ఫ్రెండ్స్ అతనికి చెబుతారు. దీంతో ఆమెను అనుమానించిన సిద్ధు… కుమారి ఓ రోజు వేరే ఎవరి బైక్ మీదో వెళ్తుంటే నిలదీస్తాడు. దాంతో కుమారి తనని అర్థం చేసుకునే మెచ్యూరిటీ తనకు లేదని తన ప్రేమకి నో చెప్పి వెళ్లిపోతుంది. అసలు కుమారి ఎందుకు అంతలా బోల్డ్ గా ఉండటానికి కారణం ఏమిటి? అసలు ముంబై నుంచి కుమారి హైదరాబాద్ ఎందుకు వచ్చింది? అన్నది మిగతా కథ. మిక్స్ అప్ రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బొల్డ్ కంటెంట్‌కు కెరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా విజయం సాధించనప్పటికీ.. ఓటీటీలో మాత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమా(Telugu hot movies) ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది. రెండు జంటలకు సెక్స్, లవ్‌ పరంగా సమస్యలు తలెత్తుతాయి. సైకాలజిస్ట్‌ సూచన మేరకు వారు గోవా టూర్‌ ప్లాన్‌ చేస్తారు. ఈ క్రమంలో ఒకరి భార్యను మరొకరు మార్చుకుంటారు. చివరికి ఆ రెండు జంటల పరిస్థితి ఏమైంది? అన్నది స్టోరీ. ఈ సినిమాలో స్టార్టింగ్ సీన్‌ నుంచే బొల్డ్ కంటెంట్‌తో ప్రేక్షకులకు కావాల్సి మసాల అందుతుంది. ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి చూడలేమని గుర్తించుకోవాలి. సిద్ధార్థ్ రాయ్ రీసెంట్‌గా వచ్చిన మంచి హాట్ సీన్లతో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు తెగ వెతకసాగారు. ఎట్టకేలకు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. 12 ఏళ్లకే ప్రపంచంలోని ఫిలాసఫీ పుస్తకాలన్నీ చదివిన సిద్ధార్థ్‌.. ఏ ఏమోషన్స్‌ లేకుండా జీవిస్తుంటాడు. లాజిక్స్‌ను మాత్రమే ఫాలో అయ్యే సిద్ధార్థ్‌ అనుకోకుండా ఇందుతో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమలో హీరో ఏం తెలుసుకున్నాడు? ఇందు ఎందుకు బ్రేకప్ చెప్పింది? సిద్ధార్థ్‌ ప్రేమకథ చివరికీ ఏమైంది? అన్నది కథ. ఆట మొదలైంది ఈ చిత్రంలో బొల్డ్ కంటెంట్ అవసరానికి మించి ఉంటుంది. కథ ఎలా ఉన్నా.. బోల్డ్ కంటెంట్ ప్రేమికులను ఈ సినిమా నిరాశపర్చదు. కథ విషాయానికొస్తే.. శ్రీను మేనకోడలికి గుండె జబ్బు వచ్చినప్పుడు, మంచి మనసున్న వ్యక్తిగా వారికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతని దయకు ప్రతిఫలంగా మరియు అతని కలలను నెరవేర్చుకునే ప్రయత్నంలో, శ్రీను తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. భక్షక్ సామాజిక రుగ్మతలపై మంచి సందేశం ఇచ్చినప్పటికీ.. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు బొల్డ్‌గా తీశారు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ. బబుల్గమ్ ఇటీవల వచ్చిన బబుల్గమ్ చిత్రంలో ఉన్న బోల్డ్ కంటెంట్ యూత్‌ను బాగా టెంప్ట్ చేస్తుంది. చాలా వరకు లిప్ లాక్ సీన్లు అలరిస్తాయి. ఈ సినిమా కథలోకి వెళ్తే.. హైదరాబాదీ కుర్రాడు ఆది (రోషన్ కనకాల) డీజే కావాలని కలలు కంటాడు. ఓరోజు పబ్‌లో జాన్వీ(మానస చౌదరి)ని చూసి ప్రేమిస్తాడు.(Telugu hot movies) &nbsp;ఆమెని ఫాలో అవుతుంటాడు. అయితే జాన్వీ పెద్దింటి అమ్మాయి. లవ్, రిలేషన్స్ పెద్దగా నచ్చవు. అబ్బాయిల్ని ఆటబొమ్మల్లా చూస్తుంటుంది. ఇలాంటి అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఆదితో లవ్‌లో పడుతుంది. భిన్న మనస్తత్వాలు కలిగిన ఆది, జాన్వీ ఎలాంటి సమస్యలు ఫేస్‌ చేశారు? చివరకు ఒక్కటయ్యారా? లేదా? అనేదే కథ. ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. యానిమల్‌ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా యానిమల్. ఈ చిత్రంలోని హింసాత్మక సంఘటనలు ఏ స్థాయిలో ఉన్నాయో.. శృంగార సన్నివేశాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. రష్మిక మంధాన, తృప్తి దిమ్రితో ఉండే లిప్ లాక్ సీన్లు ప్రేక్షకులను రంజింప జేస్తాయి.ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే..దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు&nbsp; మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్‌ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఈ సినిమా ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. పర్‌ఫ్యూమ్‌ అమ్మాయిల వాసనపై వ్యామోహం పెంచుకున్న ఒక వ్య‌క్తి.. వారిని కిడ్నాప్ చేస్తూ రాక్షసానందం పోందుతుంటాడు. అతడ్ని ప‌ట్టుకోవ‌డానికి పోలీసులు ఏం చేశారు? అత‌డు ఇలా ఎందుకు మారాడు? అనేది కథ. మంగళవారం ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ చాలా హాట్‌గా కనిపిస్తుంది. మునుపెన్నడు లేని విధంగా బోల్డ్ సీన్లలో పాయల్ నటించింది. శృంగార సన్నివేశాలు కావాలనుకునేవారిని ఈ చిత్రం నిరాశపరుచదు. ఇక ఈ చిత్రం కథ విషయానికొస్తే.. మ‌హాల‌క్ష్మీపురంలోని ఓ జంట మ‌ధ్య అక్రమ సంబంధం ఉంద‌ని ఊరి గోడ‌ల‌పై రాత‌లు క‌నిపిస్తాయి. ఆ జంట అనూహ్య ప‌రిస్థితుల్లో చ‌నిపోతుంది. మ‌రో జంటకి కూడా అదే పరిస్థితి ఎదురై చ‌నిపోవ‌డంతో ఊరి ప్రజ‌ల్లో భ‌యం మొద‌ల‌వుతుంది. ఆ హత్యలన్ని మంగళవారం రోజునే జరుగుతుంటాయి. ఈ కేసును ఛేదించేందుకు ఎస్‌ఐ నందితా శ్వేత ప్రయత్నిస్తుంది. ఇంతకు ఆ హత్యల వెనుక ఉన్నది ఎవరు? అనేది మిగతా కథ. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ది కేరళ స్టోరీ ఈ చిత్రంలో కాస్త సందేశం ఉన్నప్పటికీ.. బొల్డ్ కంటెంట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. సినిమా స్టోరీ విషయానికొస్తే..కేరళలోని ఓ నర్సింగ్ కాలేజీలో హిందువైన షాలిని ఉన్నికృష్ణన్‌ (అదాశర్మ) చేరుతుంది. అక్కడ గీతాంజలి (సిద్ధి ఇద్నానీ), నిమా (యోగితా భిహాని), ఆసిఫా (సోనియా బలానీ)లతో కలిసి హాస్టల్‌లో రూమ్ షేర్ చేసుకుంటుంది. అయితే అసీఫా ఐసీస్ (ISIS)లో (Telugu Bold movies) అండర్ కవర్‌గా పనిచేస్తుంటుంది. అమ్మాయిలను బ్రెయిన్‌ వాష్‌ చేసి ఇస్లాం మతంలోకి మారుస్తుంటుంది. ఆమె పన్నిన ఉచ్చులో షాలిని చిక్కుకొని ఎలాంటి కష్టాలు అనుభవించింది అన్నది కథ. ఈ చిత్రం జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. థియేటర్లలో మిస్‌ అయిన వారు ఓటీటీలో వీక్షించవచ్చు. ఒదెల రైల్వే స్టేషన్ ఈ చిత్రంలో బొల్డ్ కంటెంట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. హెబ్బా పటేల్, పూజిత పొన్నాడ అందాలు మిమ్మల్ని దాసోహం చేస్తాయి. ఇక స్టోరీ విషయానికొస్తే...అనుదీప్ (సాయి రోనక్) ఐపీఎస్‌ అధికారి. ట్రైనింగ్ కోసం ఓదెల వెళతాడు. ఈ క్రమంలో ఆ ఊరిలో వరుస హత్యాచారాలు తీవ్ర కలకలం రేపుతాయి. మరి అనుదీప్‌ హంతకుడ్ని పట్టుకున్నాడా? కేసు విచారణలో రాధ (హెబ్బా పటేల్‌) అతడికి ఎలా సాయపడింది? అనేది కథ. ఈ సినిమాను ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వీక్షించవచ్చు. హెడ్స్ అండ్ టేల్స్ హాట్ సీన్లు దండిగా కావాలనుకునేవారికి ఈ సినిమా ఒక మంచి ఛాయిస్‌గా చెప్పవచ్చు. ఈ సినిమా స్టోరీ ఏమిటంటే?..ముగ్గురు యువతులు తమ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వాటి నుండి ఎలా బయటపడ్డారు? ఆ ముగ్గురి కథ ఏంటి? అన్నది కథ. ఈ సినిమా జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది. క్రష్ ముగ్గురు యువకులు పై చదువుల కోసం అమెరికా వెళ్లాలని ప్రయత్నిస్తుంటారు. అమెరికా నుంచి వచ్చిన తమ సీనియర్‌ ఇచ్చిన సలహాతో వారి జీవితాలు అనూహ్య మలుపు తిరుగుతాయి. ఏక్ మినీ కథ ఈ చిత్రం కూడా బొల్డ్ కంటెంట్ ప్రేమికులను ఎక్కడా నిరుత్సాహ పరుచదు. ఇక సినిమా విషయానికొస్తే, సంతోష్‌ శోభన్‌ (సంతోష్‌) తన జననాంగం చిన్నదని భావిస్తూ నిత్యం సతమతమవుతుంటాడు. ప్రాణహాని ఉందని తెలిసినా సర్జరీ చేయించుకునేందుకు సిద్ధమవుతాడు. ఈ క్రమంలోనే అమృత (కావ్య)తో అతడికి పెళ్లి జరుగుతుంది. తన సమస్య బయటపడకుండా సంతోష్ ఏం చేశాడు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరకు ఏమైంది? అన్నది కథ. ఈ సినిమా ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. డర్టీ హరి హరికి హైదరాబాద్‌లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్‌ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ. ఈ సినిమా ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. చూసి ఎంజాయ్ చేయండి. RDX లవ్ అందాల తార పాయల్ రాజ్‌పుత్ పరువాల ప్రదర్శనను పీక్ లెవల్ తీసుకెళ్లిన చిత్రమిది. అలివేలు (పాయల్ రాజ్‌పుత్) రాష్ట్ర ముఖ్యమంత్రితో అపాయింట్‌మెంట్ పొందడం కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తుంటుంది. దీని కోసం, ఆమె హీరో(తేజస్)ని ఉపయోగించుకుంటుంది. ఇంతకు అలివేలు ఎవరు? సీఎంను ఎందుకు కలవాలనుకుంటుంది అనేది అసలు కథ. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో చూడవచ్చు. చీకటి గదిలో చితక్కొట్టుడు ఈ చిత్రంలో కావాల్సినంత బోల్ట్ కంటెంట్ ఉంటుంది.&nbsp; ఈ సినిమాలో స్టోరీ విషయానికొస్తే.. ఓ స్నేహితుల బృందం బ్యాచిలర్ పార్టీ కోసం నగరానికి దూరంగా (Telugu hot movies) &nbsp;ఉన్న విల్లాకు వెళ్తారు. ఆ విల్లాలో వారికి వింత పరిస్థితి ఎదురవుతుంది. ఓ అదృశ్య శక్తి వారిని వెంబడిస్తుంటుంది.&nbsp; నాతిచరామి ఈ చిత్రంలో పూనమ్ కౌర్ హాట్ ఎక్స్‌ప్రెషన్స్ మిమ్మల్ని థ్రిల్ చేస్తాయి. ఒంటరి మహిళలకు ఏం కావాలి అనే ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందింది. వారి శారీర కోరికలు, వారి భావోద్వేగాలు వంటి అంశాల ప్రాతిపాదికగా నడిచే బోల్డ్ చిత్రం ఇది. ఈ సినిమా MX&nbsp; ప్లేయర్‌లో అందుబాటులో ఉంది. 24 కిసెస్ ఆనంద్ (అదిత్ అరుణ్) సామాజిక స్పృహ ఉన్న సినీ దర్శకుడు. శ్రీలక్ష్మీ (హెబ్బా పటేల్‌)తో ప్రేమలో పడి డేటింగ్‌తోనే జీవితాన్ని గడపాలని అనుకుంటాడు. దీంతో వారి లవ్ బ్రేకప్‌ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వారు మళ్లీ కలిశారా? 24 ముద్దుల వెనక రహస్యం ఏంటి? అన్నది కథ. ఈ సినిమా ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. RX 100 ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ అందాల ఆరబోత మాములుగా ఉండదు. సెలవులకు ఇంటికి వచ్చిన ఇందు (పాయల్‌) ఊర్లోని శివ (కార్తికేయ)ను ప్రేమిస్తుంది. పెళ్లికి ముందే అతనితో శారీరకంగా దగ్గరవుతుంది. అయితే ఓ రోజు ఇందు అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది. మరి శివ ఏమయ్యాడు? ఇందు వేరే పెళ్లి ఎందుకు చేసుకుంది? అన్నది మిగతా కథ. దండుపాళ్యం 3 దండుపాళ్యంగా పేరొందిన సైకో కిల్లర్స్ ముఠా తమ సరదాల కోసం ఎంతకైనా తెగించి నగరంలో బీభత్సం సృష్టిస్తుంటుంది. వారి కామం, డబ్బు కోసం క్రూరంగా చంపుతుంటారు. వారిని పట్టుకునేందుకు పోలీసు అధికారి (రవి శంకర్) గాలిస్తుంటాడు. చట్టం వద్ద దోషులుగా నిరూపించడానికి అతను ఏం చేశాడు? మరి వారికి శిక్ష పడిందా? లేదా? అన్నది మిగతా కథ. జూలీ 2 నటి కావాలనుకునే సాదాసీదా అమ్మాయి జూలీ. ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించి స్టార్‌గా ఎదుగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాలు జూలీని చీకటి మార్గంలో పయనించేలా చేస్తాయి. అసలు జూలీ స్టార్‌గా ఎదిగిన తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. అర్జున్ రెడ్డి ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, శాలిని పాండే మధ్య వచ్చే కిస్ సీన్లు రంజింపజేస్తాయి. అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు.(Telugu Bold movies) &nbsp;ఇంతకు తన( ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ.ఈ చిత్రం ప్రైమ్‌లో వీక్షించవచ్చు. బాబు బాగా బిజీ తెలుగులో వచ్చిన బోల్డ్ కంటెంట్ సినిమాల్లో ఇది టాప్ లెవల్లో ఉంటుంది. మాధవ్ అనేక మంది స్త్రీలతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటాడు. అయితే, మాధవ్ తన డ్రీమ్ గర్ల్ రాధను కలిసినప్పుడు అతను తన మార్గాన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. గుంటూరు టాకీస్ గిరి (నరేష్), హరి (సిద్ధు) ఓ మెడికల్‌ షాపులో పనిచేస్తూనే అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తుంటారు. ఓ దశలో పెద్ద దొంగతనమే చేయాలని నిర్ణయించుకొని ఓ ఇంట్లో 5 లక్షల రూపాయలను దోచేస్తారు. ఆ తర్వాత వారి జీవితాలు అనుకోని మలుపు తిరిగాయి. చివరికీ వీరి కథ ఎటు పోయింది? అన్నది కథ. అవును2 ఇది "అవును" సినిమాకి సీక్వెల్. మోహిని మరియు హర్ష కొత్త ఇంటికి మారుతారు. ఆ ఇంటిలో మళ్లీ వింత ఘటనలు జరుగుతాయి. పగపట్టిన ఆత్మ వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఐస్ క్రీమ్ 2 ఐదుగురు ఫ్రెండ్స్‌ షార్ట్‌ఫిల్మ్‌ తీసేందుకు అడవిలోని గెస్ట్‌ హౌస్‌కు వెళ్తారు. అక్కడ వారికి వింత అనుభూతులు ఎదురవుతాయి. ఈ క్రమంలో వారిని కొందరు కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఫ్రెండ్స్‌ ఒక్కొక్కరిగా చనిపోవడానికి కారణం ఏంటి? అన్నది కథ. ఈ చిత్రాన్ని నేరుగా యూట్యూబ్‌లో వీక్షించవచ్చు. నా బంగారు తల్లి దుర్గ (అంజలి పాటిల్) అమలాపురంలో చాలా తెలివైన విద్యార్థి. ఉన్నత చదువులను హైదరాబాద్‌లో పూర్తి చేయాలనుకుంటుంది. కానీ ఆమె తండ్రి ఒప్పుకోడు. రహస్యంగా హైదరాబాద్‌కు వెళ్లిన ఆమెను దుండగులు కిడ్నాప్ చేసి వ్యభిచారంలోకి దింపుతారు. ఈ క్రమంలో తన తండ్రి గురించి ఒక షాకింగ్ నిజం తెలుసుకుంటుంది. ఆమె తెలుసుకున్న నిజం ఏమిటి? వ్యభిచార గృహం నుంచి ఎలా తప్పించుకున్నది అన్నది మిగతా కథ. ఈ సినిమా హాట్‌స్టార్‌ ఓటీటీలో అందుబాటులో ఉంది. గ్రీన్ సిగ్నల్ ఈ సినిమాలోనూ కావాల్సినంత హాట్ మసాల సీన్లు మిమ్మల్ని అలరిస్తాయి. సినిమా కథ విషయానికొస్తే..నాలుగు జంటల జీవితాల్లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అపర్థాల వలన వారి ప్రయాణంలో చోటుచేసుకున్న సంక్లిష్టతలు ఏంటి? వాటి నుంచి ఎలా బయటపడ్డారు? అన్నది కథ. ప్రేమ ఒక మైకం మల్లిక (ఛార్మీ కౌర్) ఓ అందమైన వేశ్య. మద్యం మత్తులో లైఫ్ లీడ్ చేస్తూ.. నచ్చిన విటులతోనే వ్యాపారం చేస్తుంటుంది. ఓరోజు అనుకోకుండా యాక్సిడెంట్ చేస్తుంది. యాక్సిడెంట్ గురైన లలిత్‌ను హస్పిటల్‌కు చేర్చి.. బ్రతికించి చేరదీసి తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తుంది. అయితే యాక్సిడెంట్‌లో లలిత్ చూపు కోల్పోతాడు. ఒకానొక సందర్భంలో యాక్సిడెంట్‌కు గురైన లలిత్ డైరీని చదువుతుంది. దాంతో డైరీ తర్వాత ఆతని జీవితం గురించి తెలుసుకున్న మల్లిక ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఏం చేసింది అన్నది మిగతా కథ. ఈ సినిమాను నేరుగా యూట్యూబ్‌లో వీక్షించవచ్చు. పవిత్ర శ్రియ అందాలను ఆరాధించాలంటే ఈ బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమా చూడాల్సిందే..వ్యభిచారం చేసే ఒక మహిళ తన జీవితం మార్చుకోవడానికి ఉన్న అన్నీ అడ్డంకులు దాటుకొని, పట్టుదలగా ఎలా ప్రయాణించింది అనేది సినిమా కథ. ఈ చిత్రాన్ని నేరుగా MX ప్లేయర్ ఓటీటీల్లో వీక్షించవచ్చు. దండుపాళ్యం క్రూరమైన ఓ గ్యాంగ్‌ నగరంలో దొంగతనాలు హత్యలు చేస్తుంచారు. మహిళలను దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తుంటారు. పోలీసు అధికారి చలపాతి ఆ గ్యాంగ్‌ను ఎలా కనిపెట్టాడు? చట్టం ముందు వారిని ఏవిధంగా నిలబెట్టాడు? అన్నది కథ. ఈ సినిమాను యూట్యూబ్‌ ద్వారా నేరుగా చూడవచ్చు. ది డర్టీ పిక్చర్ ఈ చిత్రంలో సిల్క్‌స్మిత పాత్రలో నటించిన విద్యాబాలను తన అందాలను కొంచెం కూడా దాచుకోకుండా బోల్డ్ షో చేసింది. శృంగార సన్నివేశాలు ఈ చిత్రంలో కొకొల్లలు. కథ విషయానికొస్తే.. రేష్మ పెద్ద హీరోయిన్ కావాలని చెన్నైకి వస్తుంది. కొద్ది రోజుల్లోనే నటిగా అవకాశం వస్తుంది. ఎక్కువగా ఐటెం గర్ల్ పాత్రలు వస్తుంటాయి. తరువాత ఆమె సిల్క్ స్మితగా మారుతుంది. తన గ్లామర్‌తో మొత్తం ఇండస్ట్రీని శాసించే స్థాయికి చేరుకుంటుంది. సౌత్ సూపర్ స్టార్ సూర్య కాంత్, రమా కాంత్‌తో(Telugu hot movies) &nbsp;ఆమె వివాహేతర సంబంధ కొనసాగిస్తుంది. మద్యానికి బానిసై.. కొద్దిరోజుల్లోనే అన్నీ కోల్పోతుంది. చివరికి ఆమె జీవితం ఎలా ముగిసిందన్నది అసలు కథ. శ్వేత 5/10 వెల్లింగ్టన్ రోడ్ కాలేజీ స్టూడెంట్ అయిన శ్వేత ఓ బంగ్లాలో తన కుటుంబంతో నివసిస్తుంటుంది. ఆమె తల్లి దండ్రులు ఊరు వెళ్తారు. ఈక్రమంలో ఆమె తన బాయ్‌ ఫ్రెండ్‌ క్రిష్ ఇంటికి రావాలని కాల్ చేస్తుంది. అయితే ఒక అపరిచితుడు ఆమె ఇంటికి వస్తాడు. తనతో సెక్స్ చేయాలని లేకపోతే ఆమె బాయ్ ఫ్రెండ్‌తో ఉన్న ప్రైవేట్ వీడియోలను నెట్‌లో పెడుతానని బెదిరిస్తాడు. తర్వాత ఏం జరిగింది? శ్వేత అతనికి లొంగుతుందా? చివరకు ఏం జరిగింది అనేది మిగతా కథ. అరుంధతి ఈ సినిమాలోనూ కొన్ని సీన్లలో అనుష్క హాట్‌గా కనిపిస్తుంది.చాలా ఎళ్ల తర్వాత తన సొంత ఊరికి వెళ్లిన సమయంలో అరుందతి... తాను తన తాతమ్మ జేజమ్మలాగా ఉన్నానని తెలుసుకుంటుంది. ఈక్రమంలో తనను తన కుటుంబాన్ని నాశనం చేయాలనుకునే ఓ ప్రేతాత్మతో పోరాడుతుంది. ఈ సినిమా యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. ఆపరేషన్ దుర్యోధన ఈ చిత్రంలో ముమైత్ ఖాన్ రెచ్చిపోయి మరి అందాల విందు చేసింది. బొల్డ్ అందాలను వీక్షించాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్. ఇక కథ విషయానికొస్తే..మహేష్ (శ్రీకాంత్) నిజాయితీగల పోలీసు అధికారి. అతని నిజాయితీ వల్ల నష్టపోతున్న కొద్దిమంది రాజకీయ నాయకుల వల్ల అతని భార్యను, పిల్లలను కోల్పోతాడు. దాంతో మహేష్ రాజకీయాల్లో చేరడానికి తన వేషాన్ని, పేరును మార్చుకుంటాడు. వ్యవస్థలో ఉన్న లోపాల్ని ప్రజలను ఎలా తెలియజేశాడన్నది మిగతా కథ. రా శ్రీధర్ ఒక ప్లేబాయ్. అమ్మాయిలను ఆకర్షిస్తూ వారిని నిరాశకు గురిచేస్తుంటాడు. శ్రీధర్ స్త్రీ ద్వేషిగా మారడానికి ఒక బలమైన గతం ఉంది. అయితే శాంతి అనే అమ్మాయి కలవడంతో అతని జీవితం మారుతుంది. ఈ చిత్రం యూట్యూబ్‌లో చూడొచ్చు. సముద్రం సాక్షి శివానంద్ ఈ సినిమాలో అవసారనికి మించి అందాల ప్రదర్శన చేసింది. ఈ సినిమా బొల్డ్ కంటెంట్ ప్రేమికులకు మంచి మత్తు అందిస్తుంది. ఈ చిత్రం సన్‌నెక్స్ట్‌ ఓటీటీ ప్లాట్‌పామ్‌లో అందుబాటులో ఉంది. 10th Class టినేజ్‌లో ఉండే ఆకర్షణలను ఈ చిత్రం ద్వారా చూపించారు. ఈ సినిమాలోనూ కొన్ని శృంగార సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. కథ విషయానికొస్తే.. శీను, అంజలి పదోతరగతిలో ప్రేమించుకుంటారు. పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకుని వారికి దూరంగా జీవిస్తుంటారు. ఈక్రమంలో శీను జీవితంలో ఓ విషాదం జరుగుతుంది. ఆరుగురు పతివ్రతలు ఈ చిత్రం కూడా బొల్డ్ కంటెంట్ ప్రేమికులకు మంచి మజా అందిస్తుంది. ఈ సినిమాలోని కొన్ని సీన్లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమా కథ ఏంటంటే.. ఆరుగురు చిన్ననాటి స్నేహితులు ఆరేళ్ల తర్వాత తిరిగి కలుస్తారు. అందరు ఒక దగ్గర చేరి వారి వైవాహిక జీవితంలో జరిగిన సాధక బాధకాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని నేరుగా యూట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు. 4 లెటర్స్ ఈ సినిమా కథ ఎలా ఉన్నా.. బొల్డ్ కంటెంట్ మాత్రం దండిగా ఉంటుంది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే.. విజ్జు టాప్ బిజినెస్ మెన్ కొడుకు. కాలేజీలో అంజలిని ఇష్టపడతాడు. అయితే (Telugu Bold Movies) ఆమె బ్రేకప్‌ చెప్పి వెళ్లిపోవడంతో విజ్జు మరో అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే అంజలి మళ్లీ విజ్జు లైఫ్‌లోకి వస్తుంది. చివరికి అతడు ఏ అమ్మాయిని ప్రేమించాడు? అన్నది కథ. రొమాంటిక్ క్రిమినల్స్ ఇందులో కూడా మోతాదుకు మించి అడల్ట్ కంటెంట్ ఉంటుంది. కథ విషయానికొస్తే... కార్తీక్ మరియు ఏంజెల్ అనే యువ జంట డ్రగ్స్ పెడ్లర్ సహాయంతో అనేక నేరాలకు పాల్పడుతారు. తీరా వారు మారాలని నిర్ణయించుకున్నప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌లో వీక్షించవచ్చు. ఈరోజుల్లో ఇందులో కూడా మంచి రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. కథ విషయానికొస్తే..హీరో (శ్రీ) ఓ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించి మోసపోతాడు. అప్పటి నుంచి శ్రీ అమ్మాయిలపై ద్వేషం పెంచుకుంటాడు. శ్రేయాకి కూడా అబ్బాయిలంటే అసలు నచ్చదు. అటువంటి వ్యక్తులు ఎలా ప్రేమలో పడ్డారు? చివరికి ఎలా ఒక్కటయ్యారు? అన్నది కథ. ఈ సినిమా డిస్నీ హాట్‌ స్టార్‌లో చూడవచ్చు. అల్లరి అల్లరి నరేష్ హీరోగా నటించిన తొలి చిత్రమిది. ఈ చిత్రంలో కొన్ని హాట్ సీన్లు ప్రేక్షకులను రంజింపజేస్తాయి. ఇందులో పెద్దగా కథేమి లాజిక్‌గా ఉండదు. రవి, అపర్ణ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్‌. పక్క ఫ్లాట్‌లోకి వచ్చిన రుచిని రవి ప్రేమిస్తాడు. ఆమెను ముగ్గులో దింపేందుకు రవికి అపర్ణ సాయం చేస్తుంది. ఈ క్రమంలో రవితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఈ సినిమాను నేరుగా యూట్యూబ్‌ ద్వారా వీక్షించవచ్చు.
    నవంబర్ 14 , 2024
    <strong>The Goat Director: తెలుగు ఆడియన్స్‌పై ‘ది గోట్‌’ డైరెక్టర్‌ అక్కసు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!</strong>
    The Goat Director: తెలుగు ఆడియన్స్‌పై ‘ది గోట్‌’ డైరెక్టర్‌ అక్కసు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!
    కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay) నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్‌). సెప్టెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళనాడులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అటు ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లను సాధిస్తూ రూ.300 కోట్ల మార్క్‌ను సైతం అందుకుంది. అయితే తెలుగు, హిందీ భాషల్లో మాత్రం 'ది గోట్‌'కు గట్టి ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర డైరెక్టర్‌ వెంకట్ ప్రభు స్పందించారు. తెలుగు, హిందీ ప్రేక్షకులపై అతడు చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.&nbsp; ‘అందుకే నచ్చలేదు’ తెలుగు, హిందీ భాషల్లో ‘ది గోట్‌’ (The Greatest Of All Time) సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో రూ.22 కోట్లకు ఈ మూవీని కొనుగోలు చేయగా ఇప్పటివరకు రూ.10 కోట్ల గ్రాస్‌ మాత్రమే వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే బ్రేక్‌ ఈవెన్‌ కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ వెంకట్‌ ప్రభు సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. చెన్నై సూపర్ కింగ్స్, ఎంఎస్ ధోనీకి సంబంధించిన సీన్స్ హైలైట్‌ చేయడం వల్ల తెలుగు, హిందీ ప్రేక్షకులకు ఇది నచ్చలేదని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాలు, హిందీ బెల్ట్‌లో ది గోట్‌ పనితీరు తక్కువగా ఉండడానికి ఇదే కారణమన్నారు. అంతేకాదు ఐపీఎల్‌లోని ముంబయి, బెంగళూరు జట్టు అభిమానులు తమ చిత్రాన్ని ఎక్కువగా ట్రోల్‌ చేస్తున్నారని ఆరోపించారు. తాను చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు అభిమానిని కావడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. వెంకట్‌ ప్రభు కామెంట్స్‌ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.&nbsp; https://twitter.com/TheAakashavaani/status/1833133203697131918 తెలుగు ఆడియన్స్ ఫైర్‌..! డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు తాజా కామెంట్స్‌ను తెలుగు ఆడియన్స్‌ తీవ్రంగా తప్పుబడుతున్నారు. తెలుగులో 'ది గోట్‌' డిజాస్టర్‌ దిశగా వెళ్లడానికి కారణాలు వేరే ఉన్నాయని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. కంటెంట్‌ బాగుంటే ఇండస్ట్రీతో సంబంధం లేకుండా అన్ని భాషల చిత్రాలను తాము ఆదరిస్తామని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ‘మానాడు’ చిత్రం తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో ఒకసారి గుర్తుచేసుకోవాలని డైరెక్టర్‌కు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ధోనికి విపరీతంగా అభిమానులు ఉన్నారని, హైదరాబాద్‌లో సీఎస్కే మ్యాచ్‌ జరిగితే ఎల్లో జెర్సీలతో స్టేడియం నిండిపోతుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా ‘ది గోట్‌’ ఫెయిల్యూర్‌కు గల కారణాలేంటో అన్వేషించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.&nbsp; తెలుగులో ఫ్లాప్‌కు కారణాలు ఇవే! దర్శకుడు వెంకట్‌ ప్రభు రొటిన్‌ స్టోరీతో ది గోట్‌ను తెరకెక్కించారు. ఇందులో విజయ్‌ ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రి కొడుకుల పాత్రల్లో కనిపించాడు. అయితే టెర్రరిజం మూలాలతో తెరకెక్కినప్పటికీ ఏజెంట్‌ సినిమాల్లో కనిపించే ట్విస్టులు ఇందులో ఉండవు. మలుపులు, మెరుపులు ఏ ఒక్కటీ కథనంలో కనిపంచలేదు. కనీసం హీరో చేసే ఆపరేషన్స్‌లోనూ థ్రిల్‌ లేదు. పైగా విరామం వరకూ కథంతా సాగతీత వ్యవహారమే. అనవసరంగా వచ్చి పడిపోయే పాటలు, యోగిబాబు కామెడీ ట్రాక్‌ తెలుగు ఆడియన్స్‌ సహనానికి పరీక్ష పెట్టాయి. అయితే సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌, క్లైమాక్స్‌లో వచ్చే ఐపీఎల్‌ ట్రాక్‌ ప్రేక్షకుల్లో కాస్త ఉత్సాహాన్ని నింపాయి.&nbsp; నో చెప్పిన ధోని! ‘ది గోట్‌’లో చాలా అతిథి పాత్రలు ఉన్నాయి. హీరో శివ కార్తికేయ (Sivakarthikeyan), హీరోయిన్ త్రిష (Trisha) అతిథులుగా అలరించారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీని కూడా క్లైమాక్స్‌లో చూపించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) విజువల్స్‌ ద్వారా మహీని వెండితెరపై చూపారు. నిజానికి ధోనీతో ఒక్క సన్నివేశమైనా సినిమాలో చేయించాలని దర్శకుడు వెంకట్‌ ప్రభు అనుకున్నారట. అందుకు మహీ ఒప్పుకోకపోవడంతో ఐపీఎల్‌ విజువల్స్‌ ద్వారా స్క్రీన్‌పై చూపించారు. 20 నిమిషాల పాటు ఉండే ఈ క్లైమాక్స్ ఎపిసోడ్‌ క్రికెట్‌ లవర్స్‌ను ఎంతగానో ఆకర్షించింది.&nbsp; నెగిటివ్‌ రివ్యూలపైనా మండిపాటు ‘ది గోట్‌’ సినిమాపై వచ్చిన నెగిటివ్‌ రివ్యూలపై దర్శకుడు వెంకట్‌ ప్రభు స్పందించారు. ‘సినిమాని రూపొందించేందుకు మేం పడిన కష్టం గురించి మాట్లాడరు. కానీ, కొందరు సినిమాపై కావాలనే నెగెటివ్‌ కామెంట్స్‌ చేస్తుంటారు. ఈ సినిమాలో ఉన్నన్ని రిఫరెన్స్‌లు ఏ చిత్రంలోనూ లేవు. ఏ హీరో అభిమాని అయినా ఈ సినిమాని సెలబ్రేట్‌ చేసుకోవాలనే ఉద్దేశంతోనే రిఫరెన్స్‌లు తీసుకున్నాం. అతిథి పాత్రల కోసమే చిత్రాన్ని రూపొందించలేదు. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉండేలా కథను తీర్చిదిద్దా. సినిమా ఆడియన్స్‌ కోసమేగానీ రివ్యూవర్స్‌కు కాదు’ అని అన్నారు.
    సెప్టెంబర్ 10 , 2024
    This WeeK OTT Movies (Sept 25- Oct 01) : ఈ వారం ఓటీటీల్లో 30కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్.. లిస్ట్ ఇదే!
    This WeeK OTT Movies (Sept 25- Oct 01) : ఈ వారం ఓటీటీల్లో 30కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్.. లిస్ట్ ఇదే!
    గత వారం వినాయక చవితి నవరాత్రులను దృష్టిలో ఉంచుకుని పెద్దగా సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాలేదు. అయితే ఈవారం మాత్రం ప్రేక్షకులను అలరించేందుకు పెద్ద సినిమాలు సిద్దమయ్యాయి. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫాంలోను దాదాపు 30కి పైగా సినిమాలు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. మరి ఆ చిత్రాలు ఏమిటో ఓసారి చూద్దాం స్కంద (Skanda movie) ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పొత్తినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం స్కంద. ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. రామ్ రెండు విభిన్న గెటప్‌లలో కనిపించనున్నాడు. రామ్ సరసన శ్రీలీల, సయిూ మంజ్రేకర్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లిరికల్ వీడియో సాంగ్స్ ప్రేక్షకుల నుంచి మంచి టాక్‌ తెచ్చుకున్నాయి. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న రామ్‌కు ఈ సినిమా విజయం ఎంతో కీలకంగా మారింది. అటు వరుస బ్లాక్ బాస్టర్ హిట్‌లతో మంచి ఫామ్‌లో ఉన్న బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీనివాస చిట్టూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. స్కంద చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. చంద్రముఖి 2 (chandramukhi 2) రాఘవ లారెన్స్‌, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌ కాంబోలో వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ చిత్రం చంద్రముఖి2.&nbsp; ఈ చిత్రాన్ని పి.వాసు తెరకెక్కిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖికి ఇది సిక్వేల్‌గా రాబోతుంది. 17 ఏళ్ల తర్వాత రాజ్‌ మహల్‌ను వీడిన చంద్రముఖి మళ్లి కోటలోకి ఎందుకు ప్రవేశించింది అనే కథాంశంతో సినిమాను తెరకెక్కించారు.&nbsp; ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. చంద్రముఖిలో జ్యోతికను చంద్రముఖి ఆవహించగా, ఇందులో నిజమైన చంద్రముఖిగా కంగనా రనౌత్‌ నటిస్తోంది. లైకా ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ది వ్యాక్సిన్ వార్ (The Vaccine War) కశ్మీర్ ఫైల్స్ సినిమా డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వస్తున్న మరో చిత్రం ది వ్యాక్సిన్ వార్. ఈ సినిమాను కరోనా నాటి పరిస్థితుల సమయంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతోంది. ఈనెల 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదొక సైన్స్‌ ఫిక్షన్‌తో కూడిన సినిమాగా పేర్కొంటున్నారు. ముఖ్యంగా వైద్యులు, పరిశోధకులు చేసిన గొప్ప సేవలకు ఈ సినిమా నివాళులర్పించనున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. పెదకాపు-1 (Peddha Kapu 1) ఫ్యామిలీ చిత్రాలకు పెట్టింది పేరైన శ్రీకాంత్ అడ్డాల నారప్ప సినిమాతో తన దారిని యాక్షన్ చిత్రాల వైపు మరల్చుకున్నాడు. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఆయన దగ్గరయ్యాడు. తాజాగా పెదకాపు-1 యాక్షన్ చిత్రంతో సెప్టెంబర్ 29న ప్రేక్షకులను పలకరించబోతున్నాడు . ఈ సినిమాలో విరాట్ కర్ణ హీరోగా, ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు ( సెప్టెంబర్ 25- October 1) TitleCategoryLanguagePlatformRelease DateLittle Baby Bum: Music Time&nbsp;SeriesEnglishNetflixSept 25The Devil's Plan&nbsp;SeriesKoreanNetflixSept 26Forgotten LoveMoviePolishNetflixSept 27OverhaulMoviePortugueseNetflixSept 27Sweet Flow 2&nbsp;MovieFrenchNetflixSept 27The Wonderful Story of Henry SugarMovieEnglishNetflixSept 27Castlevania: NocturneSeriesEnglishNetflixSept 27Ice Cold: Murder, Coffee and Jessica Wangso&nbsp;MovieEnglishNetflixSept 28Love is in the AirMovieEnglishNetflixSept 28Fair Play&nbsp;MovieEnglishNetflixSept 29Choona&nbsp;SeriesHindiNetflixSept 29Nowhere&nbsp;MovieSpanishNetflixSept 29Reptile&nbsp;MovieEnglishNetflixSept 29Khushi&nbsp;MovieTeluguNetflixOct 01Spider-Man: Across the Spider-VerseMovieEnglishNetflixOct 01The Fake ShakeSeriesEnglishAmazon PrimeSept 26Hostel Days Season 4SeriesHindiAmazon PrimeSept 27Doble DiscourseMovieSpanishAmazon PrimeSept 28Kumari SrimatiSeriesTelugu&nbsp;Amazon PrimeSept 28Jen WeiSeriesEnglishAmazon PrimeSept 29El-PopSeriesSpanishHotstarSept 27The Worst of EvilSeriesEnglishHotstarSept 27King of KotaMovieTelugu Dubbed&nbsp;HotstarSept 28Launchpad Season 2SeriesEnglishHotstarSept 29Tum Se Na Ho Payega&nbsp;MovieHindiHotstarSept 29Papam Pasivadu&nbsp;SeriesTeluguAhaSept 29Dirty HariMovieTamilAhaSept 29Charlie ChopraSeriesHindiSony LivSept 27Bye!&nbsp;MovieTamilSony LivSept 29Agent&nbsp;MovieTeluguSony LivSept 29Angshuman MBA&nbsp;MovieBengaliZee5Sept 29Blue BeetleMovieEnglishBook My ShowSept 29
    సెప్టెంబర్ 25 , 2023
    Best Transformation Heroes in Tollywood: సినిమా కోసం బాడీని ఉక్కులా మార్చుకున్న హీరోలు వీరే!
    Best Transformation Heroes in Tollywood: సినిమా కోసం బాడీని ఉక్కులా మార్చుకున్న హీరోలు వీరే!
    ఈ రోజుల్లో హీరో కావాలంటే డాన్సులు, నటన రావడమే కాదు ఫిజిక్ కూడా అద్భుతంగా ఉండాలి. కండలు తిరిగిన దేహంతో హీరో తెరపై కనిపిస్తే ఫ్యాన్స్‌కు వచ్చే మజానే వేరు. అందుకే ఎంత కష్టమైన భరించి కథానాయకులు సిక్స్ ప్యాక్‌లు చేస్తుంటారు. పాత్రలకు అనుగుణంగా తమను తాము రూపాంతరం చేసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పాత్రలను బట్టి బరువు కూడా పెరగాల్సి ఉంటుంది. ఆ వెంటనే తదుపరి చిత్రం కోసం తమను ఫిట్‌గా మార్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దీన్ని బట్టి మన స్టార్‌ హీరోలు సినిమా పట్ల ఎంత కమిట్‌మెంట్‌తో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో అద్భుతమైన ఫిజిక్‌ కలిగిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; చిరంజీవి (Chiranjeevi) ఇంద్ర సినిమా ముందు వరకూ టాలీవుడ్‌లో మంచి ఫిట్‌నెస్‌ కలిగిన హీరో అంటే ముందుగా మెగాస్టార్‌ చిరంజీవినే గుర్తుకు వచ్చాయి. శంకర్‌దాదా జిందాబాద్‌ తర్వాత రాజకీయాల వైపు వెళ్లిన చిరు బాడీని కాస్త అశ్రద్ధ చేశారు. తిరిగి సినిమాల్లోకి కమ్‌బ్యాక్‌ ఇచ్చిన చిరు.. ఆరు పదుల వయసులోనూ ఫిట్‌నెస్‌ కోసం శ్రమిస్తున్నారు. ఇటీవల ‘విశ్వంభర’ సినిమా కోసం కఠిన వ్యాయామాలు చేస్తూ ఔరా అనిపించారు. https://twitter.com/i/status/1752914245170364419 ప్రభాస్‌ (Prabhas) టాలీవుడ్‌లో మెస్మరైజింగ్‌ బాడీ అనగానే ముందుగా పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ గుర్తుకు వస్తారు. తొలి చిత్రం ఈశ్వర్‌ నుంచి ఫిట్‌గానే ఉన్న ప్రభాస్‌.. బుజ్జిగాడు సినిమా కోసం తొలిసారి సిక్స్‌ప్యాక్‌ చేశాడు. ఆ తర్వాత బాహుబలి కోసం మరింత బరువు పెరిగి కండలు తిరిగిన యోధుడిలా ప్రభాస్‌ మారాడు. రీసెంట్‌గా ‘సలార్‌’లోనూ ప్రభాస్‌ పలకలు తిరిగిన బాడీతో కనిపించాడు.&nbsp; రానా (Rana) ప్రభాస్‌ తర్వాత ఆ స్థాయిలో గంభీరమైన దేహాన్ని కలిగిన హీరో రానా. తొలి సినిమా ‘లీడర్‌’లో బక్కపలచని బాడీతో కనిపించిన రానా.. ఆ తర్వాత పూర్తిగా రూపాంతరం చెందాడు. ‘కృష్ణం వందే జగద్గురం’లో కడలు తిరిగిన బాడీతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. బాహుబలి చిత్రం కోసం మరింత బరువు పెరిగి.. ప్రభాస్‌ను ఢీకొట్ట సమవుజ్జీలా మారాడు.&nbsp; సుధీర్‌ బాబు (Sudheer Babu) శివ మనసు శృతి (SMS) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన సుధీర్‌ బాబు.. తన బాడీతో ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తుంటాడు. బేసిక్‌గా జిమ్మాస్టర్‌ అయిన ఈ హీరో.. ప్రతీ సినిమాలో సిక్స్‌ ప్యాక్‌ బాడీని మెయిన్‌టైన్‌ చేస్తూ మెప్పిస్తున్నాడు.&nbsp; రామ్‌ చరణ్‌ (Ram Charan) మెగాస్టార్‌ వారసుడిగా ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్‌చరణ్‌. తొలి సినిమాలో ఫిట్‌గా కనిపించిన చరణ్‌.. ‘మగధీర’కు వచ్చేసరికి ఎవరూ ఊహించని విధంగా కండలతో మెరిశాడు. ఇక ధ్రువ సినిమాలో ఏకంగా సిక్స్‌ ప్యాక్‌తో కనిపించి శభాష్ అనిపించుకున్నాడు. రీసెంట్‌గా ‘ఆర్‌ఆర్ఆర్‌’లోనూ దృఢమైన బ్రిటిష్ పోలీసు అధికారిగా కనిపించి మెప్పించాడు.&nbsp; అల్లు అర్జున్‌ (Allu Arjun) గంగోత్రి సినిమాతో లేలేత వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లుఅర్జున్‌.. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. దేశముదురు చిత్రంతో తొలిసారి సిక్స్‌ ప్యాక్‌లో కనిపించిన బన్నీ.. తన ఫిట్‌నెస్‌ను ప్రతీ సినిమాలోనూ కొనసాగిస్తూ వచ్చాడు. రీసెంట్‌ పుష్పలో తన పాత్ర కోసం బరువు పెరిగి కనిపించాడు.&nbsp; జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR) టాలీవుడ్‌లో ఫిట్‌నెస్‌ బాడీని కలిగి ఉన్న స్టార్‌ హీరోల్లో తారక్‌ ఒకరు. కెరీర్‌ తొలినాళ్లలో చాలా బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్‌.. ‘యమదొంగ’ సినిమాతో సన్నగా మారిపోయాడు. ఆ తర్వాత మళ్లీ లావైన తారక్.. ‘టెంపర్‌’లో సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. రీసెంట్‌గా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోనూ దృఢమైన బాడీతో మెప్పించాడు.&nbsp; రామ్ పోతినేని (Ram Pothineni) లవర్ బాయ్‌లాగా క్యూట్‌గా కనిపించే రామ్‌.. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాలో సిక్స్ ప్యాక్‌తో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇటీవల ‘స్కంద’ చిత్రం కోసం బరువు పెరిగిన రామ్‌.. డబుల్‌ ఇస్మార్ట్‌ కోసం మళ్లీ సిక్స్‌ ప్యాక్‌ చేసినట్లు తెలుస్తోంది.&nbsp; నాగ శౌర్య (Naga Shourya) యంగ్‌ హీరో నాగ శౌర్య.. కెరీర్‌ ప్రారంభంలో డెసెంట్‌ సినిమాలు చేస్తూ సాఫ్ట్‌గా కనిపించాడు. ఇటీవల ‘లక్ష్య’ సినిమా కోసం సిక్స్‌ ప్యాక్‌ చేసి మాస్‌ హీరోగా రూపాంతరం చెందాడు.&nbsp; విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) మంచి హైట్‌, ఫిజిక్‌ కలిగిన విజయ్‌ దేవరకొండ.. ఇటీవల వచ్చిన ‘లైగర్‌’ సినిమాలో మెస్మరైజింగ్‌ బాడీతో అదరగొట్టాడు. బాక్సింగ్‌ నేపథ్యం ఉన్న కథ కావడంతో పాత్రకు తగ్గట్టు విజయ్‌ తనను తాను మార్చుకున్నాడు.&nbsp; అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే సీనియర్‌ నటుల్లో అక్కినేని నాగార్జున ముందు వరుసలో ఉంటారు. కెరీర్‌ ప్రారంభం నుంచి ఒకటే బాడీని మెయిన్‌టెన్‌ చేస్తున్న నాగార్జున.. ‘ఢమరుకం’ సినిమాలో సిక్స్‌ప్యాక్‌తో కనిపించారు.&nbsp; సునీల్‌ (Sunil) టాలీవుడ్‌లో ఎవరూ ఊహించని బాడీ ట్రాన్సఫర్‌మేషన్ ఏదైనా ఉందంటే అది కమెడియన్ సునీల్‌ (Sunil)ది మాత్రమే. హాస్య పాత్రలు పోషించి రోజుల్లో చాలా లావుగా కనిపించిన సునీల్‌.. హీరోగా మారాక సిక్స్‌ ప్యాక్‌ చేశాడు. పూలరంగడు సినిమాలో ఆరు పలకల బాడీతో కనిపించి ఆడియన్స్‌ను షాక్‌కి గురి చేశాడు.&nbsp;
    ఫిబ్రవరి 23 , 2024
    <strong>Allu Arjun vs Sukumar: సుకుమార్‌తో విభేదాలు.. చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిన బన్నీ?</strong>
    Allu Arjun vs Sukumar: సుకుమార్‌తో విభేదాలు.. చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిన బన్నీ?
    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun), డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar)కు ఇండస్ట్రీలో మంచి బాండింగ్‌ ఉంది. అది పలు సందర్భాల్లో నిరూపితమైంది కూడా. బన్నీ-సుకుమార్‌ కాంబోలో ఇప్పటికే మూడు చిత్రాలు (ఆర్య, ఆర్య 2, పుష్ప) రాగా అందులో రెండు బ్లాక్‌ బాస్టర్‌ విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం వీరిద్దరు కాంబోలో 'పుష్ప 2' తెరకెక్కుతోంది. కొన్ని రోజుల క్రితం వరకూ ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా సాగింది. అయితే అనూహ్యంగా ఈ మూవీ షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. దీనికి కారణం సుకుమార్‌, అల్లు అర్జున్‌ మధ్య తలెత్తిన వివాదాలేనని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. దీనికి తోడు బన్నీ షూటింగ్‌ను పక్కకు పెట్టి విహారయాత్రకు వెళ్లడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది.&nbsp; సుకుమార్‌ - బన్నీ మధ్య కోల్డ్‌వార్‌? 'పుష్ప: ది రూల్' షూటింగ్ విషయంలో అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావించారు. తీరా షూటింగ్‌కు మరింత సమయం పట్టే అవకాశముందని తెలిసి వాయిదా వేశారు. అయితే సినిమా వాయిదా వేసినప్పటికీ షూటింగ్‌ సక్రమంగా జరగడం లేదని బన్నీ గుర్రుగా ఉన్నారట. తను పూర్తిగా సహకరిస్తున్నా సుకుమార్‌ సరిగ్గా వినియోగించుకోవడం లేదని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే షూటింగ్‌ను నిలిపేసి సుకుమార్‌ అమెరికాకు వెళ్లడంపై బన్నీలో మరింత అసంతృప్తి కారణమైందని ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గడ్డం తీసేసిన బన్నీ సుకుమార్ శైలి నచ్చని అల్లు అర్జున్ ఫ్యామిలీతో హాలిడేకి వెళ్లారని తెలుస్తోంది. అతడు యూరప్ వెళ్లారని టాక్ వినిపిస్తోంది. ఫ్లైట్ జర్నీ సమయంలో ఆయన్ను కొందరు వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బన్నీ గడ్డం ట్రిమ్‌ చేసి కనిపించారు. వాస్తవానికి పుష్ప గాడు అంటే ఆ గడ్డం లుక్కే మెయిన్‌. గడ్డం మీద చేయి వేసి తగ్గేదేలే అని బన్నీ చెప్పిన డైలాగ్‌ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దీనిపై భారీ ఎత్తున రీల్స్‌ సైతం అప్పట్లో వచ్చాయి. అటువంటిది గడ్డాన్ని బన్నీ ట్రిమ్‌ చేసి పర్యటనకు వెళ్లడం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. సుకుమార్‌తో ఉన్న విభేదాల వల్లే బన్నీ షూటింగ్‌కు దూరం అయ్యారా? అన్న ప్రశ్న నెట్టింట వినిపిస్తోంది.&nbsp; https://twitter.com/i/status/1813405877908726058 'పుష్ప 2' మళ్లీ వాయిదా? డైరెక్టర్‌ సుకుమార్‌, అల్లు అర్జున్‌ ఇద్దరు విదేశీ పర్యటనకు వెళ్లడంతో ప్రస్తుతం 'పుష్ప 2' అటకెక్కింది. ఇంకా చాలా సన్నివేశాలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరువురు లేకపోవడం 'పుష్ప 2' రిలీజ్‌పై ప్రభావం చూపుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్‌ను ఆగస్టు 15 నుంచి డిసెంబర్‌ 6కు మార్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో డిసెంబర్‌లోనైనా పుష్ప గాడిని చూస్తామా? అన్న ప్రశ్న ఆడియన్స్‌లో తలెత్తుతోంది. ప్రస్తుతం బన్నీ గడ్డాన్ని ట్రిమ్ చేసి యూరప్‌ వెళ్లారు. పుష్ప పాత్రకు తగ్గట్లు గడ్డం పెంచాలంటే కనీసం నెల రోజుల సమయం పడుతుంది. అంటే ఒక నెల రోజుల సమయం వృథా అయినట్లేనని ఫిల్మ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp; ‘పుష్ప 2’కి విలన్ కష్టాలు! మలయాళ స్టార్‌ ఫహాద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) 'పుష్ప 2'లో విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ ఆలస్యం కారణంగా ఫహద్ కూడా కొంత నిరాశలో ఉన్నట్లు పరిశ్రమ వర్గాల టాక్. పైగా ఫహద్ చేతిలో 6,7 పెద్ద సినిమాలే ఉన్నాయి. దాంతో అతడు అడిగినన్ని కాల్ షీట్లు ఇచ్చేలా కనిపించడం లేదు. దాంతో అతడు ఇచ్చిన డేట్స్‌లోనే షూట్ ఫినిష్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అదీకాక కాంబోలో ఉన్న ఆర్టిస్టులు అందరూ పెద్దవారే కావడం డైరెక్టర్‌ సుకుమార్‌కు పెద్ద సమస్యగా మారింది. ఇన్ని సమస్యలను సుకుమార్ ఎలా హ్యాండిల్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.&nbsp; నో చెప్పిన జాన్వీ కపూర్‌ పుష్ప 2లో ఐటెం సాంగ్ ఏ నటి చేస్తారన్న ప్రశ్న ఇప్పటికీ వెంటాడుతోంది. కొన్ని రోజుల క్రితం యానిమల్‌ బ్యూటీ తిప్తి దిమ్రీ పేరు వినిపించింది. ఆమెను చిత్ర యూనిట్‌ సంప్రదించగా ఐటెం సాంగ్ చేసేందుకు ఓకే చెప్పినట్లు రూమర్లు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఆమెను కాకుండా జాన్వీ కపూర్‌ను ఐటెం సాంగ్‌ కోసం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఆమెను సంప్రదించినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ వంటి స్టార్‌ హీరోలతో నటిస్తుండటంతో ఐటెం సాంగ్‌ చేసేందుకు జాన్వీ నో చెప్పినట్లు సమాచారం. ఇలాంటి సాంగ్స్‌ చేస్తే తన ఇమేజ్‌కు డ్యామేజ్‌ కలుగుతుందని ఆమె భావిస్తున్నట్లు తెలిసింది.&nbsp;
    జూలై 17 , 2024
    Controversial Movies: విడుదలకు ముందే విమర్శలు.. సినిమాలు మాత్రం సూపర్ హిట్లు..!&nbsp;
    Controversial Movies: విడుదలకు ముందే విమర్శలు.. సినిమాలు మాత్రం సూపర్ హిట్లు..!&nbsp;
    సినిమాలను అమితంగా ఇష్టపడే దేశంలో భారత్‌ ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ ఏటా వందల చిత్రాలు రిలీజవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతాయి. ప్రతీ మనిషి జీవితంలో సినిమాలు ఓ భాగం కావడంతో అవి సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు విడుదలకు ముందే వివాదస్పదంగా మారుతున్నాయి. ఆ చిత్రాలను బ్యాన్‌ చేయాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలే పుట్టుకొచ్చాయి. భారత్‌లో తీవ్ర వివాదానికి కారణమైన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp;&nbsp; ది కేరళ స్టోరీ భారత్‌లో విడుదలకు ముందే తీవ్ర విమర్శలను మూటగట్టుకున్న సినిమా ‘కేరళ స్టోరీ’. కేరళలో గత కొన్నేళ్లలో అదృశ్యమైన 32 వేల మంది మహిళలు ఎక్కడనే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. నలుగురు యువతులు మతం మారి, అనంతరం ఐసిస్‌లో చేరిన నేపథ్యంతో కథ నడుస్తుంది. తప్పిపోయిన అమ్మాయిలు ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో చూపించడం వివాదానికి దారితీసింది. దీనిపై కేరళ సీఎం సహా, ప్రతిపక్ష కాంగ్రెస్‌, ముస్లిం సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. సమాజంలో అల్లర్లు సృష్టించేలా ఈ సినిమా ఉందంటూ ఆరోపించాయి. వీటన్నింటిని దాటుకొని రిలీజైన ‘ది కేరళ స్టోరీ’ పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. ఇందులో ఆదా శర్మ నటనకు మంచి మార్కులే పడ్డాయి. Image Credit: wikipedia/commons ఫర్హానా నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వంలో హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ నటించిన 'ఫర్హానా' సినిమాపై కూడా వివాదం చెలరేగింది. ముస్లింల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై కొన్ని ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సినిమాలో ముస్లిం మహిళలను, హిజాబ్‌ను అవమానించేలా డైలాగ్‌లు ఉన్నాయని కొన్ని ఇస్లామిక్ సంస్థలు ఆరోపించాయి. వివాదం మరింత ముదురుతుండటంతో మేకర్స్‌ స్పందించారు. ఈ సినిమా ఏ మతం సెంటిమెంట్‌లకు వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగింది. మే 12న రిలీజైన ఫర్హానా చిత్రం హిట్‌ టాక్ తెచ్చుకుంది.&nbsp; Image Credit: wikipedia/commons ది కాశ్మీర్‌ ఫైల్స్‌ 2022లో వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది కాశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రం అప్పట్లో తీవ్ర దుమారానికి కారణమైంది. కశ్మీరీ పండిట్లను మిలిటెంట్లు ఏ విధంగా హింసించి చంపారో అన్న అంశాన్ని ఇతివృత్తంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా రాజకీయరంగు పులుముకోవడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భాజపా పాలిత రాష్ట్రాలు ఈ ప్రదర్శనలకు పన్ను రాయితీలు సైతం ఇచ్చాయి. అయితే, ది కాశ్మీర్‌ ఫైల్స్‌లో వాస్తవాలను వక్రీకరించి చూపించారంటూ కాంగ్రెస్‌ మండిపడింది.&nbsp; Image Credit: wikipedia/commons పఠాన్‌ బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ రీసెంట్‌ మూవీ ‘పఠాన్‌’ పైనా విడుదలకు ముందు వివాదం చెలరేగింది. చిత్రంలోని ‘బేషరమ్‌ రంగ్‌’ పాటలో దీపికా ధరించిన కాషాయ రంగు బికినీ వివాదానికి కారణమైంది. కాషాయ రంగు బికినిపై హిందూ - ముస్లిం సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా సైతం దీపిక వస్త్రధారణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వహిందూ పరిషత్‌, వీర్ శివాజీ గ్రూప్‌లు సైతం అసంతృప్తి వ్యక్తం చేశాయి.&nbsp; Image Credit: wikipedia/commons అర్జున్‌ రెడ్డి విజయ్‌ దేవరకొండ హీరోగా సందీప్‌ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్‌ రెడ్డి సినిమాపై కూడా అప్పట్లో చాలా విమర్శలే వచ్చాయి. ఈ మూవీలో అభ్యంతరకర సీన్లు ఎక్కువగా ఉన్నాయంటూ పలువురు ప్రజా సంఘ నేతలు సినిమా పోస్టర్లను చించేశారు. ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. యాంకర్‌ అనసూయ సైతం సినిమాలోని అభ్యంతరకర డైలాగ్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అయితే ఈ వివాదాలను దాటుకొని అర్జున్‌ రెడ్డి సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. విజయ్‌ దేవరకొండను స్టార్‌ హీరోగా నిలబెట్టింది.&nbsp; Image Credit: wikipedia/commons పీకే బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ నటించిన 'పీకే' సినిమాపై కూడా 2014లో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. హిందూ దేవతలను, స్వామీజీలను ఎగతాళి చేసేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని పలు హిందూ సంస్థలు ధ్వజమెత్తాయి. సినిమాపై నిషేధం విధించడంతోపాటు చిత్రంతో సంబంధం ఉన్న వారందరినీ సమాజం నుంచి వెలివేయాలని యోగా గురు బాబా రాందేవ్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ముస్లిం సంఘాలు సైతం పీకే సినిమాను తప్పుబట్టాయి. అప్పట్లో ఈ వివాదంపై స్పందించిన అమీర్‌ఖాన్‌ అన్ని మతాలను తాము గౌరవిస్తామన్నారు. అయితే రిలీజ్‌ అనంతరం పీకే సూపర్‌ హిట్‌గా నిలిచింది.&nbsp; Image Credit: wikipedia/commons ద ఢిల్లీ ఫైల్స్ కశ్మీర్ ఫైల్స్ చిత్రం తెరకెక్కించిన వివేక్ అగ్నిహోత్రి ప్రస్తుతం ‘ద ఢిల్లీ ఫైల్స్’ సినిమాపై వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాపై కూడా చర్చ జరుగుతోంది. పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ ఈ డైరెక్టర్‌పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన నోటీసులు పంపించారు. ఈ విధంగా ‘ద ఢిల్లీ ఫైల్స్’ చిత్రీకరణకు ముందే హాట్ టాపిక్‌గా మారింది.
    మే 19 , 2023
    Pushpa 2 songs lyrics Telugu: ఒక్క క్లిక్‌తో  పుష్ప2లోని అన్ని సాంగ్స్ లిరిక్స్
    Pushpa 2 songs lyrics Telugu: ఒక్క క్లిక్‌తో  పుష్ప2లోని అన్ని సాంగ్స్ లిరిక్స్
    "పుష్ప 2" క్రేజీ బజ్‌తో సినీప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది.&nbsp; ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పవర్‌ఫుల్‌ పాత్రతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హీరోయిన్ రష్మిక మందన్నా స్ఫూర్తిదాయకమైన నటనతో మరోసారి అందరినీ ఆకట్టుకోనుంది. ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్&nbsp; అందించిన సంగీతం అభిమానులను అలరిస్తోంది. ఈ చిత్రంలోని పాటలు ప్రతీ సీన్‌లోని భావోద్వేగాలను, కథలోని ప్రధాన అంశాలను దృశ్యమాలికగా మన కళ్ల ముందు కదిలేలా చేస్తున్నాయి. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అయిన "పుష్ప: ది రైజ్" చిత్రానికి కొనసాగింపుగా, "పుష్ప 2: ది రూల్"లో పాటలు కథనానికి మరింత జీవం పోసేలా ఉంటాయని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పుష్ప: ది రూల్ చిత్రంలోని పాటల లిరిక్స్‌ను ఇక్కడ అందిస్తున్నాం. మీరు ఓ లుక్ వేయండి. Peelings Song Lyrics in Telugu మల్లిక బన్నంటే అంబుకలా కన్మున తుముకలో అంబిలి పూనిలా నముకలో పుంచిరి తుంబికలో ముళ్ల మలార్ మని చుండుకలో నిన్ మని చుండుకలో తేన్ తెరేంజెతున్న వండుకలో పూన్కినా తుండుకలో ఆరుంటికోసారి యేడింటికోసారి పావు తక్కువ పదింటికోసారి పడుకుంటే ఓసారి మేల్కుంటే ఓసారి యేమి తోసక కూసుంటే ఓసారి యేలు నొక్కుతుంటే ఓసారి ఓసారి కాలు తొక్కుతుంటే ఓసారి ఓసారి నువ్వు పక్కనుంటే ప్రతొక్కసారి వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ ఛీ అంటే ఓసారి పో అంటే ఓసారి చాటు మాటుగా సై అంటే ఓసారి పూలెడ్తే ఓసారి నాగలెడ్తే ఓసారి సాదా సీదా చీర కట్టెత్తే ఓసారి ఒళ్ళు ఇర్సుకుంటే ఓసారి ఓసారి యిల్లు చిమ్ముతుంటే ఓసారి ఓసారి నీళ్లు తోడుతుంటే నిజంగ ఓసారి వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ మల్లిక బన్నంటే అంబుకలా కన్మున తుముకలో అంబిలి పూనిలా నముకలో పుంచిరి తుంబికలో ముళ్ల మలార్ మని చుండుకలో నిన్ మని చుండుకలో తేన్ తెరేంజెతున్న వండుకలో పూన్కినా తుండుకలో రోటి పచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు ఆఁ పైటతోటి సెమట నువ్వు తుడుసుకున్నప్పుడు దండాన నీ సొక్క ఆరేస్తున్నప్పుడు నీ వొంటి వాసన తెగ గుర్తొచ్చినప్పుడు రెండు సేతుల నీ జుట్టు ముడిసినప్పుడు దిండు కత్తుకొని పడుకున్నప్పుడు అలసిపోయి నువ్వు ఆవలించినప్పుడు వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ మల్లిక బన్నంటే అంబుకలా అంబిలి పూనిలా నముకలో ముళ్ల మలార్ మని చుండుకలో తేన్ తెరేంజెతున్న వండుకలో తువ్వాలు తో నా తలను తుడిసినప్పుడు నడుమ నడుమ నువ్వు నా నడుము తురిమినప్పుడు అన్నం కలిపి నోట్లో ముద్ద పెట్టినప్పుడు యెంగిలి మూఁతితో నువ్వు ముద్దు పెట్టినప్పుడు సీర సెంగుని నువ్వు సవరించినప్పుడు సాయం సేత్తో సెయ్యేసినప్పుడు సొంత మొగుడు సెంత సిగ్గు పడినప్పుడు వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ మల్లిక బన్నంటే అంబుకలా కన్మున తుముకలో అంబిలి పూనిలా నముకలో పుంచిరి తుంబికలో ముళ్ల మలార్ మని చుండుకలో నిన్ మని చుండుకలో తేన్ తెరేంజెతున్న వండుకలో పూన్కినా తుండుకలో https://www.youtube.com/watch?v=8RAd-_Qj_ac&amp;ab_channel=T-SeriesTelugu Kissik Song Lyrics in Telugu కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ దించర దించర దించు మావయ్యోచ్చాడు దించు కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ దించర దించర దించు బావయ్యోచాడు దించు కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ చిచ్చా వచ్చాడు దించు కిస్సిక్ మచ్చా వచ్చాడు దించు కిస్సిక్ పిలిసినోడొచ్చాడు దించు కిస్సిక్ పిలవనోడొచ్చాడు దించు కిస్సిక్ మావోడొచ్చాడు మీవోడొచ్చాడు మనోడొచ్చాడు దించు ఆళ్లతో ఫోటో ఈళ్లతో ఫోటో ఆల్బం లో అంటించు మరి నాతో దిగిన బొమ్మను లోకర్లో దాచుంచు హే పుసుక్కున ఈ కిస్సిక్కులు బైటికి వచ్చాయో దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో దెబ దెబ దెబ్బలు పడతయి రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో దెబ దెబ దెబ్బలు పడతయి రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలు గాని రాసుకుంటే దెబ్బలు పడతయి రో కిస్సిక్ దెబ్బలు పడతయి రో కిస్సిక్ సర్లే భుజం పైన సెయ్యేసి తీసుకో సేతులు తిన్నగా వుండకపోతే దెబ్బలు పడతయి రో కిస్సిక్ దెబ్బలు పడతయి రో కిస్సిక్ సింగల్ ఫోటో పర్లేదు రంగుల ఫోటో పర్లేదు గ్రూప్ ఫోటో తీసుకుందాం తప్పేమి లేదు కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కామెంట్స్ సేసారో దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో దెబ దెబ దెబ్బలు పడతయి రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో దెబ దెబ దెబ్బలు పడతయి రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ ఏ పోసైన ఫోటో తీస్కో ఎక్సపోసింగ్ ల ఉన్నాదంటే దెబ్బలు పడతయి రో కిస్సిక్ దెబ్బలు పడతయి రో కిస్సిక్ అంగెల్ ఏదైనా ఫోటో తీస్కో బాడ్ అంగెల్లో చూసావంటే దెబ్బలు పడతయి రో కిస్సిక్ దెబ్బలు పడతయి రో కిస్సిక్ తీసిన ఫోటో దాసుకో తీరుబడిగా సూసుకో కళ్ళకు పండగ సేసుకో కాదనేది లేదు కానీ ఫేసులు గీసులు మార్ఫింగ్ సేసి పిచ్చి పిచ్చి వేషాలు ఏసారొ దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో దెబ దెబ దెబ్బలు పడతయి రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో దెబ దెబ దెబ్బలు పడతయి రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ కిస్ కిస్ కిస్ కిస్సిక్ Pushpa Title Song Lyrics In Telugu పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప నువ్వు భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమే బద్దలయ్యే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప నిన్ను కొలవాలంటే సంద్రం ఇంకా లోతే తవ్వాలే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప హే గువ్వపిట్ట లాగ వానకు తడిసి బిక్కుమంటు రెక్కలు ముడిసి వణుకుతు వుంటే నీదే తప్పవదా పెద్ద గద్దలాగమబ్బులపైన హద్దు దాటి ఎగిరావంటే వర్షమైనా తలనే వంచి కాళ్ళ కింద కురిసెయ్‍దా పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ ఎన్నో వచ్చిన పుష్పాకి పాపం కొన్ని రావంటా వణుకే రాదు ఓటమి రాదు వెనకడుగు ఆగడము అస్సలు రానే రాదు అన్నీ ఉన్న పుష్పాకి పాపం కొన్ని లేవంటా భయమే లేదు బెంగే లేదు బెదురు ఎదురు తిరిగే లేదు తగ్గేదే లేదు ఎయ్ దండమెడితే దేవుడికే సలాము కొడితే గురువులకే కాళ్ళు మొక్కితే అమ్మకే రా తల దించినావా బానిసవి ఎత్తినావా బాద్‍షావి తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ ఆడు కాలుమీద కాలేసి కూసున్నాడంటే బండరాయి కూడా బంగారు సింహాసనమంటా వేరే సింహాసనమేదైనా వట్టి బండరాయంటా ఆడు సేతిలోన సెయ్యేసి మాటిచ్చాడంటే తుఫాకిలోంచి తూటా దూసుకెళ్ళినట్టే ఆ తూటాలాగే మాట కూడా ఎనక్కి రానట్టే హే వాడు నీకు గొప్పే కాదు వీడు నీకు ఎక్కువ కాదు నీకు నువ్వే బాసులా ఉండు హే ఎవడో విలువ ఇచ్చేదేంది ఎవడో నిను గుర్తించేదేంది ఒంటి నిండా తిమ్మిరి ఉంటె నీ పేరే నీ బ్రాండు పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ అస్సలు తగ్గేదెలే Suseki Song lyrics In Telugu వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్నా పసిపిల్లవాడు నా వాడు వీడు మొండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నా వాడు ఓ ఓ మాట పెళుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్న వాడిలోన దేవుడెవరికి తెలుసును నా కన్నా సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా సామి హో ఎర్రబడ్డ కళ్ళలోన కోపమే మీకు తెలుసు కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు కోరమీసం రువ్వుతున్న రోషమే మీకు తెలుసు మీసమెనక ముసురుకున్న ముసినవ్వు నాకు తెలుసు అడవిలో పులిలా సరసర సరసర చెలరేగడమే నీకు తెలుసు అలసిన రాతిరి ఒడిలో చేరి తల వాల్చడమే శ్రీవల్లికి తెలుసు సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా సామి హో ఓ ఓ గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చివేసే నవాబు నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గరీబు పెద్ద పెద్ద పనులు ఇట్టే చక్కబెట్టే మగాడు వాడి చొక్కా ఎక్కడుందో వెతకమంటాడు సూడు బయటికి వెళ్లి ఎందరెందరినో ఎదిరించేటి దొరగారు నేనే తనకి ఎదురెళ్ళకుండా బయటికి వెళ్ళరు శ్రీవారు సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామే ఇట్టాంటి మంచి మొగుడుంటే ఏ పిళ్ళైనా మహారాణీ
    డిసెంబర్ 03 , 2024
    <strong>Venom 3 Review In Telugu: యాక్షన్ సీక్వెన్స్‌లో టాప్‌ నాచ్‌.. ‘వెనమ్‌ 3’ ఎలా ఉందంటే?&nbsp;</strong>
    Venom 3 Review In Telugu: యాక్షన్ సీక్వెన్స్‌లో టాప్‌ నాచ్‌.. ‘వెనమ్‌ 3’ ఎలా ఉందంటే?&nbsp;
    నటీనటులు : టామ్‌ హార్డీ, ఆండీ సెర్కిస్, చివెటెల్ ఎజియోఫోర్, జునో టెంపుల్, పెగ్గీ, రీస్‌ ఇఫాన్స్‌, క్రిస్టో ఫెర్నాండెజ్, స్టీఫెన్ గ్రాహమ్ తదితరులు&nbsp; దర్శకత్వం : కెల్లి మార్సెల్‌ సినిమాటోగ్రఫీ : ఫబియన్ వాగ్నర్‌ ఎడిటింగ్‌ : మార్క్‌ సంగర్‌ సంగీతం : డ్యాన్‌ డీకాన్‌ నిర్మాతలు : అవి అరద్‌, మ్యాట్‌ టాల్‌మచ్‌, కెల్లీ మార్సెల్‌, టాప్‌ హార్డీ విడుదల తేదీ : అక్టోబర్ 25, 2024 హాలీవుడ్‌ చిత్రాల్లో 'వెనమ్‌' సిరీస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. సూపర్‌ హీరో చిత్రాలను బాగా ఇష్టపడే వారిని 'వెనమ్‌' సిరీస్‌ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు సినిమాలు రాగా బ్లాక్‌ బాస్టర్‌ విజయాలను అందుకున్నాయి. తాజాగా వాటికి కొనసాగింపుగా 'వెనమ్‌ 3' థియేటర్లలోకి వచ్చింది. ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’ (Venom: The Last Dance) పేరుతో అక్టోబర్‌ 25న వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. ఎప్పటిలాగే ఈ చిత్రంలోనూ టామ్ హార్డీ కథానాయకుడిగా చేశాడు. కెల్లీ మార్సెల్ దర్శకుడు. మరి పార్ట్‌ 3 కూడా ప్రేక్షకులను మెప్పించిందా? అదిరిపోయే యాక్షన్‌ సీక్వెన్స్‌తో విజువల్‌ వండర్‌గా నిలిచిందా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథేంటి ‘వెనమ్: లెట్ దేర్ బి కార్నేజ్’ ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచే మూడో పార్ట్‌ మెుదలవుతుంది. వెనమ్‌తో విడిపోయిన తర్వాత ఎడ్డీ బ్రాక్ (టామ్ హార్డీ) మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అవుతాడు. మరోవైపు వెనమ్‌ని కూడా తన గ్రహానికి చెందిన వాసులు వెంటాడుతూ ఉంటాయి. ఇంతలో వీరిద్దరికీ ఒక కొత్త ప్రమాదం ఎదురవుతుంది. వేరే లోకంలో బంధించి ఉన్న నల్ (ఆండీ సెర్కిస్) అనే సూపర్ విలన్ విడుదలకు అవసరమైన ఒక ఎలిమెంట్ వీరి దగ్గర మాత్రమే ఉంటుంది. దీంతో నల్ సైన్యం కూడా వీరి వెంట పడుతుంది. నల్ సైన్యం నుంచి తప్పించుకోవాలంటే ఎడ్డీ, వెనమ్‌ల్లో ఒకరు మరణించాలి. లేదంటే జీవితాంతం పరిగెడుతూనే ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఎడ్డీ, వెనమ్ ఏం చేశారు? నల్‌ను వారు ఎలా ఎదుర్కొన్నారు? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే వెనమ్‌ 3 మూవీలో టామ్ హార్డీ వన్ మ్యాన్ షో చేశాడు. ఎడ్డీ బ్రాక్ పాత్రలో మరోమారు చక్కగా ఒదిగిపోయాడు. లేని వెనమ్‌ని ఊహించుకుని దాంతో కెమిస్ట్రీని పండించడం మామూలు విషయం కాదు. గత చిత్రాలలో లాగానే ఇందులోనూ తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌లోనూ దుమ్మురేపాడు. ఎంతో సాహసోపేతంగా ఫైట్స్‌ చేసి ఆడియన్స్‌ను ఫిదా చేశాడు. నల్‌ పాత్రలో ఆండీ సెర్కిస్ కూడా ఆకట్టుకున్నాడు. చివెటెల్ ఎజియోఫోర్, జునో టెంపుల్, పెగ్గీ, రీస్‌ ఇఫాన్స్‌, క్రిస్టో ఫెర్నాండెజ్, స్టీఫెన్ గ్రాహమ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించారు.&nbsp; https://twitter.com/VenomMovie/status/1834215396595101934 డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు కెల్లి మార్సెల్‌ తొలి రెండు భాగాలు తరహాలోనే ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’ చిత్రాన్ని కూడా అదిరిపోయే యాక్షన్‌ సీక్వెన్స్‌తో రూపొందించారు. ప్రారంభంలో ఫ్లైట్ యాక్షన్ సీన్‌తో సినిమాను మెుదలపెట్టిన దర్శకుడు ఆ జోరు చివరకూ కొనసాగించాడు. మూడు సాలిడ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేశారు. 20 నిమిషాల పాటు సాగే ఈ సీక్వెన్స్‌ను ప్రేక్షకులు కళ్లార్పకుండా చూస్తారు. ఒక పెద్ద శత్రువు కోసం వెనమ్, ఇతర సింబియోట్లు, మిలటరీ అందరూ కలిసి చేసే పోరాటం అలరిస్తుంది. అయితే వెనమ్‌ సిరీస్‌లో ఈ మూవీనే లాస్ట్‌ అని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఎడ్డీ, వెనమ్‌ బాండింగ్‌ను హైలెట్‌ చేస్తూ ఎమోషనల్‌ ఫినిషింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది. ప్రీ క్లైమ్యాక్స్‌కు ముందు వచ్చే ఒక్క సీన్ మాత్రం ఎమోషనల్‌గా ఆకట్టుకుంది. ఓవరాల్‌గా యాక్షన్‌ ప్రియులను ఈ సినిమా తప్పక అలరిస్తుంది. https://twitter.com/VenomMovie/status/1846663977784562073 టెక్నికల్‌గా సాంకేతిక విషయాలకు వస్తే వీఎఫ్‌ఎక్స్‌ టీమ్ అద్భుత పనితీరు కనబరిచిది. విజువల్‌ వండర్‌లా సినిమాను తీర్చిదిద్దింది. నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్ టామ్ హార్డీ నటనయాక్షన్‌ సీక్వెన్స్‌వీఎఫ్‌ఎక్స్‌ వర్క్ మైనస్ పాయింట్స్ కొరవడిన ఎడ్డీ, వెనమ్‌ బాండింగ్‌కథలో డ్రామా లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    అక్టోబర్ 25 , 2024
    <strong>HBD Mokshagna Teja: ‘జై హనుమాన్‌’తో మోకజ్ఞ సినిమా లింకప్‌.. ఏం ప్లాన్‌ చేశావ్‌ ప్రశాంత్ మామా!&nbsp;</strong>
    HBD Mokshagna Teja: ‘జై హనుమాన్‌’తో మోకజ్ఞ సినిమా లింకప్‌.. ఏం ప్లాన్‌ చేశావ్‌ ప్రశాంత్ మామా!&nbsp;
    నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) అధికారికంగా సినీ రంగ ప్రవేశం చేశాడు. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ ‘హనుమాన్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) ఈ అరంగేట్ర చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇవాళ (సెప్టెంబర్‌ 6) మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇదే సమయంలో మోక్షజ్ఞ సినిమాకు సంబంధించి ఎగిరిగంతేసే న్యూస్‌ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; మోక్షజ్ఞ పోస్టర్ ఎలా ఉందంటే నందమూరి మోక్షజ్ఞ తేజ, డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ కాంబోలో రానున్న చిత్రానికి సంబంధించి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ తాజాగా విడుదలైంది. ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు గొప్ప సంతోషంగా ఉందంటూ మూవీలోని ఆయన లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో మోక్షజ్ఞ హ్యాండ్స్‌మ్‌ లుక్‌లో స్మైలింగ్‌ ఫేస్‌తో కనిపించారు. అంతేకాదు పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించి పక్కా హీరో మెటీరియల్‌గా అనిపిస్తున్నారు. మోక్షజ్ఞ లుక్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్‌ మోక్షజ్ఞకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1831921862609154407 తారక్‌ స్పెషల్‌ విషెస్‌ నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ బర్త్‌డేతో పాటు ఆయన డెబ్యూ ఫిల్మ్‌ పోస్టర్‌పై జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) స్పందించారు. మోక్షజ్ఞను విష్‌ చేస్తూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు! నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాతగారితో పాటు అన్ని దైవ శక్తులు నీపై ఆశీస్సులు కురిపించాలని కోరుకుటుంన్నాను! హ్యాపీ బర్త్‌డే మోక్షూ’ అంటూ జూనియర్ ఎన్‌టీఆర్ ట్వీట్‌ చేశారు. మరోవైపు నందమూరి హీరో కల్యాణ్‌ రామ్ కూడా తన తమ్ముడు మోక్షజ్ఞకు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు. ‘టిన్సెల్ టౌన్‌కు నీకు స్వాగతం మోక్షూ. తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్‌డే’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్స్‌ చూసి నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అన్నతమ్ముల అనుబంధం అంటే ఇలానే ఉండాలని అంటున్నారు. రెండ్రోజులుగా వరుస హింట్స్‌ రెండు రోజులుగా డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ వరుస పోస్ట్‌లతో మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ఎంట్రీ గురించి హింట్స్‌ ఇస్తూనే వచ్చారు. ‘నా యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’ అని తొలుత అతడు పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ తర్వాత ‘వారసత్వాన్ని ముందుకుతీసుకెళ్లే అద్భుత క్షణం’ అంటూ పెట్టిన మరో పోస్టు కూడా నందమూరి అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా మోక్షజ్ఞ లుక్‌ను పంచుకొని తన తర్వాత సినిమా హీరో అంటూ బాలయ్య వారసుడిని పరిచయం చేశారు ప్రశాంత్ వర్మ. https://twitter.com/PrasanthVarma/status/1830839179716239368 https://twitter.com/PrasanthVarma/status/1831604468355391886 ‘జై హనుమాన్‌’తో లింకప్‌! ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా మోక్షజ్ఞ ఫస్ట్‌ ఫిల్మ్‌ రూపొందనుంది. ప్రస్తుతం 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్‌ హీరోల సినిమాలు తీస్తామని గతంలో ప్రశాంత్‌ వర్మ వివరించారు. ఏడాదికి ఒక సినిమా కచ్చితంగా విడుదల చేస్తానని ఆయన (Prasanth Varma) స్పష్టం చేశారు. ఈ క్రమంలో తన సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి&nbsp; తొలుత హనుమాన్‌ను ప్రశాంత్ వర్మ రిలీజ్‌ చేశారు. సెకండ్‌ ఫిల్మ్‌గా మోక్షజ్ఞ ఫిల్మ్‌ రాబోతోంది. ఈ విషయాన్ని ‘సింబా ఈజ్‌ బ్యాక్‌’ అనే పోస్టర్‌లో 'PVCU 2' ప్రాజెక్ట్‌ అంటూ ప్రశాంత్‌ వర్మనే స్పష్టం చేశారు. తన సినిమాటిక్‌ యూనివర్స్‌లో రానున్న ప్రతీ చిత్రానికి తన తర్వాతి ఫిల్మ్‌తో లింకప్‌ ఉంటుందని గతంలో ప్రశాంత్‌ వర్మనే తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే 'PVCU 2' ప్రాజెక్ట్‌ తర్వాత ‘జై హనుమాన్‌’ చిత్రాన్ని ప్రశాంత్‌ వర్మ పట్టాలెక్కిించనున్నారు. దీంతో మోక్షజ్ఞ చిత్రానికి కచ్చితంగా 'జై హనుమాన్‌'తో కనెక్షన్‌ ఉంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ లింకప్‌ ఎలా ఉంటుందోనని ఇప్పటి నుంచే నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్‌ మామా ఏం ప్లాన్‌ చేశాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/theBuzZBasket/status/1831944240831852919 శ్రీకృష్ణుడిగా బాలయ్య! మోక్షజ్ఞ సినిమాను మైథలాజికల్‌, సోషియో ఫాంటసీ చిత్రంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా ఫైనల్‌ అయినట్లు సమాచారం. మహాభారతం స్ఫూర్తితో ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. అయితే మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఇందులో శ్రీకృష్ణుడి పాత్రలో బాలయ్య కనిపిస్తారని సమాచారం. హనుమాన్‌ తరహాలోనే ఈ సినిమాలో సూప‌ర్ హీరో, మైథ‌లాజిక‌ల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయ‌ని, చివ‌ర్లో బాల‌య్య శ్రీ‌కృష్ణుడిగా ఎంట్రీ ఇవ్వ‌డంతో క‌థ మ‌రో మలుపు తిరుగుతుంద‌ని సమాచారం. మరోవైపు అర్జునుడి పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రశాంత్‌ వర్మ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.&nbsp; హీరోయిన్‌ ఫిక్స్ అయ్యిందా? మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్‌ వర్మ కాంబోలో రానున్న చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్వినీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్‌. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం బాలయ్య స్వయంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్‌ (Khushi Kapoor) హీరోయిన్‌గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే మోక్షజ్ఞ-ఖుషీ కపూర్‌ జోడీ మరో ట్రెండ్‌ సెట్టర్‌గా మారుతుందని నందమూరి ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.
    సెప్టెంబర్ 06 , 2024
    <strong>Kalki 2898 AD Top Dialogues: ‘కల్కి’ని సూపర్‌ సక్సెస్‌ చేసిన డైలాగ్స్‌ ఇవే..!</strong>
    Kalki 2898 AD Top Dialogues: ‘కల్కి’ని సూపర్‌ సక్సెస్‌ చేసిన డైలాగ్స్‌ ఇవే..!
    ప్రభాస్‌ (Prabhas).. ప్రస్తుతం ఈ పేరు యావత్‌ సినీ లోకాన్ని ఊర్రూతలూగిస్తోంది. థియేటర్లలో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రభజనం కొనసాగుతున్న వేళ.. అందరూ ప్రభాస్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో అతడి నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హాలీవుడ్‌ స్థాయి యాక్షన్‌ సీక్వెన్స్‌లో ప్రభాస్‌ అదరగొట్టాడని, ఇండియన్‌ సినిమా స్టాండర్డ్స్‌ను కల్కి టీమ్‌ గ్లోబల్‌ స్థాయికి తీసుకెళ్లిందని అంటున్నారు. మరి ముఖ్యంగా కల్కిలో ప్రభాస్‌ డైలాగ్స్‌పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభాస్‌ కటౌట్‌కు తగ్గ డైలాగ్స్‌ కల్కిలో పడ్డాయని ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ సహా కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె ఇతర ప్రధాన తారాగణం చెప్పిన డైలాగ్స్‌ను కూడా ఫ్యాన్స్‌ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ప్రేక్షకులను మిస్మరైజ్‌ చేసిన కల్కి డైలాగ్స్ ఏవి? అవి ఏ సందర్భంలో వచ్చాయి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; కల్కి మూవీ డైలాగ్స్‌ కల్కి సినిమా ప్రారంభంలో కురుక్షేత్రం ఎపిసోడ్‌ చూపిస్తారు. గర్భస్త శిశువుపై అస్త్రాన్ని వదిలి.. అశ్వత్థామ పెద్ద తప్పు చేస్తాడు. దీంతో శ్రీకృష్ణుడు అతడ్ని శపించే క్రమంలో వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.&nbsp; అశ్వత్థామ : చంపడానికి వస్తే నన్ను చంపు కృష్ణ. నీ ఉపదేశాలు వినడానికి నేను అర్జునుడ్ని కాదు.&nbsp; కృష్ణుడు : ఈ 18 రోజులు కురు క్షేత్రంలో జరిగిన పాపాల కన్నా.. నీ అధర్మం నిష్కృతమైనది. ధ్రోణాచార్యుడి పుత్రుడివి అయ్యుండి ఇంతకు దిగజారావా? అశ్వత్థామ : నా తండ్రి పేరు పలికే అర్హత నీకు లేదు. నువ్వు అనుకుంటే అతడి మరణాన్ని ఆపగలిగేవాడివి. కృష్ణుడు : అశ్వత్థామ.. దేవుడైనా క్రురుడైనా కర్మను తప్పించుకోలేరు. గర్భస్త శిశువుపై అస్త్రం వదిలావు. నీ ఖర్మ నువ్వు అనుభవించక తప్పదు.&nbsp; అశ్వత్థామ : అయితే సంధించు చక్రం.. విధించు నీ శిక్షని. కృష్ణుడు : చావు నీ శిక్ష కాదు అశ్వత్థామ.. అది విముక్తి. కాలాంతరం పాండవులు అందరూ చనిపోతారు. నా శరీరమూ మరణిస్తుంది. ఈ యుగం అంతరిస్తుంది. కానీ, నీకు మరణం రాదు. వేలాది సంవత్సరాలు నీ గాయాలు మానక.. చావు రాక.. బ్రతకలేక.. ఎన్నో పాపాలు చూస్తూ జీవిస్తావు. ఇదే నా శాపం. అశ్వత్థామ : మరి నా శాపానికి ప్రాయిశ్చిత్తం లేదా? కృష్ణుడు : నువ్వు నన్ను చంపాలనుకున్నావ్‌.. కానీ ఒక రోజు నువ్వే నన్ను కాపాడాలి.&nbsp; అశ్వత్థామ : నేనా? కృష్ణుడు : కలియుగం వస్తుంది. కలి వస్తున్నాడు. అధర్మం పెరిగిపోయి ప్రపంచమంతా చీకటి అయినప్పుడు నేను మళ్లీ ఒక అవతారం ఎత్తాలి. ఆ యుగంలో కలి మహా శక్తిశాలి. ఎంత శక్తివంతుడు అంటే నా పుట్టుకనే ఆపగలడు. అప్పుడు నువ్వే నా గర్భ గుడికి కాపలా కాయాలి. డైలాగ్‌ కాంప్లెక్స్‌ ఒక యువకుడిపై 5000 యూనిట్స్‌ నజరానా ప్రకటిస్తుంది. అతడ్ని పట్టుకునేందుకు ఓ గ్యాంగ్ వెళ్తుంది. ఈ సందర్భంలో పారిపోతున్న ఆ వ్యక్తికి బుజ్జి (AI వెహికల్‌).. సంకెళ్లు వేస్తుంది. అప్పుడు బుజ్జిపై విలన్‌ గ్యాంగ్‌ కాల్పులు జరుపుతారు. దీంతో బుజ్జి తన బాస్‌ భైరవ (ప్రభాస్‌)ను పరిచయం చేస్తూ బైరవకు ఎలివేషన్స్ ఇస్తుంది. బుజ్జి : హేయ్‌.. స్టాప్‌. నన్ను షూట్‌ చేస్తావా. ఇప్పుడు చూడు నా బాస్‌ వచ్చి మీ అందరిని స్మాష్‌ చేస్తాడు. విలన్‌ గ్యాంగ్‌: ఎవరు మీ బాస్‌? బుజ్జి : పాత యుద్ధాల్లో సోల్జర్‌. ఇంత వరకూ&nbsp; ఒక్క యుద్ధంలో ఓడిపోలేదు. ది వన్‌ అండ్‌ ఓన్లీ భైరవ (ఈ డైలాగ్‌ తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు) భైరవ: ఎంట్రీ అనంతరం భైరవ నేలపై గురక పెట్టి నిద్ర పోతాడు.. బుజ్జి : భైరవ గెటప్‌.. చాలా బిల్డప్‌ ఇచ్చాను లే. భైరవ: బుజ్జి.. బుజ్జి.. ప్లీజ్‌ 5 మినిట్స్‌ పడుకుంటాను. (దీని తర్వాత ప్రభాస్‌ ఎంట్రీ ఫైట్‌ ఉంటుంది) డైలాగ్‌ సుప్రీమ్‌ యాస్కిన్‌ (కమల్‌ హాసన్‌).. కాంప్లెక్స్‌లో తన మనుషుల చేత గర్భిణి స్త్రీలపై ప్రయోగాలు చేయిస్తుంటాడు. దీంతో యాస్కిన్‌ బృందంలోని ఒక సైంటిస్టు అతడ్ని చంపడానికి యత్నిస్తాడు. యస్కిన్‌.. ఆ సెంటిస్టును చంపుతూ చెప్పే డైలాగ్స్‌ మెప్పిస్తాయి.&nbsp; సుప్రీమ్‌ యాస్కిన్‌: చావుకు నేను చాలా ప్రాణాలు ఇచ్చాను. అది నన్నేం చేయదు. నిన్ను చూస్తే జాలేస్తుంది. ఎందుకు నన్ను చంపాలనుకున్నావ్‌? సైంటిస్టు : మంచి కోసం..&nbsp; సుప్రీమ్‌ యాస్కిన్‌ : మంచి.. చరిత్రలో ఎన్ని ప్రాణాలు తీసిందో తెలుసా ఈ మంచి. రాజులు రాజ్యాలు మారుతున్న ప్రతీసారి మారుతుందీ మంచి. దాన్ని నమ్మోద్దు. ఇంతకీ నీకేం కావాలి? సైంటిస్టు : ఈ లోకాన్ని కాపాడాలి సుప్రీమ్ యాస్కిన్‌ : అదే కదా.. నేనూ చేసింది. దేవుడిని, డబ్బులని, వందల యుద్ధాలు చేసే అందరినీ ఒక్క యుద్ధంతో గెలిచాను తప్పా?. మీరు బూడిద చేస్తున్న ప్రకృతిని అందనంత దూరంలో పెట్టాను.. తప్పా? సైంటిస్టు : నీకు ఇష్టం వచ్చినట్లు చేయడానికి నువ్వు ఎవరు? సుప్రీమ్‌ యాస్కిన్‌ : మరి నాశనం చేయడానికి మీరు ఎవరు? ఎన్ని యుగాలు అయినా.. ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు.. మారలేడు. ఇది నీ తప్పు కాదులే. హ్యూమన్‌ బీయింగ్స్‌కు ఉన్న డిఫెక్టే అది.&nbsp; డైలాగ్‌ కల్కిని గర్భంలో మోస్తున్న సుమతి (దీపిక పదుకొణె)ని.. సుప్రీమ్‌ యస్కిన్‌ మనుషుల నుంచి కాపాడి అశ్వత్థామ శంబాలకు తీసుకు వస్తాడు. అప్పుడు శంబాలకు రక్షణాధికారిగా ఉన్న వ్యక్తి సుమతి ఎవరో తెలియక అడ్డుకుంటాడు. సందర్భంలో వచ్చే సీన్‌, డైలాగ్స్‌ హైలెట్‌గా నిలుస్తాయి. రక్షణాధికారి : ఆమెను ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చావు. 5 మిలియన్ పౌండ్లు పెట్టారు ఈమె మీద. కాంప్లెక్స్‌ మాత్రమే కాదు వరల్డ్‌లో ప్రతీ ఒక్కరు ఆమె కోసం వెతుకున్నారు. ఎలా కాపాడతావు? అశ్వత్థామ : నేను కాపాడతాను రక్షణాధికారి : అసలు నువ్వు ఎవరు? పొడుగ్గా ఉంటే సరిపోదు. ఎప్పుడైనా యుద్ధం చేశావా? అశ్వత్థామ గురించి తెలిసిన బాలుడు: ఎక్స్‌క్యూజ్‌మీ.. మహాభారతంలో శ్రీకృష్ణుడితోనే యుద్ధం చేశాడు.. ఓకే. (ఇక్కడ హైలెట్‌ బీజీఎం వస్తుంది) రక్షణాధికారి : అందరికీ పిచ్చి ఎక్కిందా? ఈమె (సుమతి) ఇక్కడి రావడం వల్ల అందరికీ ఎంతో డేంజరో అర్థమవుతుందా? తను జస్ట్‌.. ల్యాబ్‌ నుంచి ఎస్కేప్‌ అయిన మామూలు ప్రెగ్నెంట్‌ ఉమెన్‌. ఏమీ స్పెషల్‌ ఉమెన్‌ కాదు. అయినా పుట్టేది దేవుడు అనడానికి ఏంటీ సాక్ష్యం. *ఆ డైలాగ్‌ అనగానే వెంటనే వర్షం మెుదలవుతుంది. అక్కడ వాన పడి చాలా కాలమే అయి ఉంటుంది. ఆమె రాకతో వర్షం పడటంతో కల్కి జన్మించేది ఆమె కడుపునే అని శంబాలా ప్రజలు నమ్ముతారు. ఈ సీన్‌ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. డైలాగ్‌ మహావిష్ణువు.. కల్కిగా పుట్టేందుకు తననే ఎందుకు ఎంచుకున్నాడని సుమతి (దీపిక).. అశ్వత్థామను ప్రశ్నిస్తుంది. ఆ సందర్భంలో వచ్చే డైలాగ్స్‌ మిస్మరైజింగ్‌ చేస్తాయి.&nbsp; అశ్వత్థామ : నువ్వు ప్రాణం ఇవ్వడానికే పుట్టావ్‌ అమ్మా? సుమతి : అసలు ఏం మాట్లాడుతున్నారు. ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకా ఎంత మంది చనిపోవాలి? అశ్వత్థామ : ప్రతీ చావుకి ఒక పరమార్థం ఉంటుంది. ప్రతీ చావు లోకానికి కొత్త ఊపిరి పోస్తుందమ్మా. సుమతి : కానీ, నేనే ఎందుకు? అశ్వత్థామ : మోయగలిగిన శక్తి ఉన్నవారికే బాధ్యతను ఇస్తాడు ఆ దేవుడు. భగవంతుడ్ని కడుపులో మోయాలంటే భూదేవి అంత ఓర్పు ఉండాలి. మీలో ఆ ఓర్పు ఉందనే మిమ్మల్ని తల్లిగా ఎంచుకున్నారు.&nbsp; అశ్వత్థామ: నువ్వు ఇప్పుడు కనబోయేది మాములు ప్రాణం కాదమ్మ.. సృష్టిని. జన్మనివ్వడం నీ ధర్మం కాపాడటం నా బాధ్యత. డైలాగ్‌ శంబలకు తీసుకెళ్లిన సుమతి తనకు కావాలని కాంప్లెక్స్‌ ప్రతినిధి చటర్జీ తన మనుషులతో అంటాడు. అన్ని డైరెక్షన్స్‌లో రైడర్స్‌ పంపాం.. త్వరలోనే పట్టుకుంటామని అతని కమాండర్ చెబుతాడు. అప్పటికే అశ్వత్థామతో యుద్ధం చేసిన ప్రభాస్‌.. ఏమి చేయలేరని అంటాడు. ఈ సందర్బంలో ఛటర్జీతో అతడి సంభాషణ ఆకట్టుకుంటుంది. భైరవ : ఆ ముసలోడు ఉన్నంతవరకూ ఏం చేయలేరు. ఛటర్జీ : ముసలోడా? భైరవ : మీ వాళ్లందరినీ కొట్టింది అతడే? ఒక్కడు కూడా వాడ్ని టచ్‌ చేయలేదు. నేను తప్పా. ఛటర్జీ : వీడెవడు అసలు? కమాండర్‌: భైరవ అని బౌంటీ ఎంటర్‌ సర్‌. మన వాళ్లని కొడితే బ్లాక్‌ లిస్ట్‌ చేశాను.&nbsp; భైరవ: ఎలాగైనా బ్లాక్‌ లిస్ట్‌ చేశావు కదా. మళ్లీ కొడతా. పాయింట్‌ ఏంటి అంటే నేను ఒక్కడినే ఆ అమ్మాయిని తీసుకురాగలను. మీకు వేరే ఆప్షన్‌ లేదు.&nbsp; ఛటర్జీ : అంత ష్యూర్‌ ఆ..&nbsp; భైరవ : రికార్డ్స్‌ చూసుకో.. ఇంతవరకూ ఒక్క ఫైట్‌ కూడా ఓడిపోలేదు. ఇది కూడా ఓడిపోను.&nbsp; డైలాగ్‌ కల్కి క్లైమాక్స్‌లో.. కమల్‌ హాసన్‌ మీద వచ్చే సీన్‌ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. శక్తిని పుంజుకున్న తర్వాత ఆయన చెప్పే 'జగన్నాథ రథచక్రాల్‌ వస్తున్నాయ్‌ వస్తున్నాయ్‌.. రథచక్ర ప్రళయఘోళ భూమార్గం పట్టిస్తాను.. భూకంపం పుట్టిస్తాను'.. అనే డైలాగ్‌ సెకండ్‌ పార్ట్‌లో తాను ఎంత విధ్వంసం సృష్టిస్తానో తెలియజేస్తుంది. అయితే ఈ డైలాగ్‌ శ్రీశ్రీ మహా ప్రస్థానం లోనిది. 44 ఏళ్ల క్రితం ఆకలి రాజ్యం సినిమాలో ఇదే డైలాగ్‌ను కమల్‌ హాసన్ చెప్తారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత అతడి నోట శ్రీశ్రీ కవిత వినిపించడం ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసింది.&nbsp; View this post on Instagram A post shared by TELUGU SONGS OLD (@telugu_songs_old) డైలాగ్‌ కల్కిలో అప్పటివరకూ భైరవగా ఉన్న ప్రభాస్‌.. చివరి భాగంలో కర్ణుడిగా కనిపించి అందరికీ షాకిస్తాడు. చివరి పది నిమిషాల మహాభారతం ఎపిసోడ్‌లో కర్ణుడిగా కనిపించి స్క్రీన‌ను షేక్‌ చేస్తాడు.&nbsp; ‘ఆలస్యమైందా ఆచార్య పుత్ర’ అంటూ ప్రభాస్‌ విల్లు పట్టుకుని రథంపై నిలబడగా.. థియేటర్‌ మొత్తం దద్దరిల్లిపోయింది. భైరవను కర్ణుడిగా పరిచయం చేసే సందర్భంలో వచ్చే కురుక్షేత్రంలోని డైలాగ్స్‌ విజిల్స్‌ వేయిస్తాయి.&nbsp; అర్జునుడు : అశ్వత్థామ.. తలరాతను రాసే బ్రహ్మ చేసిన గాంఢీవం ఇది. దీనిని ఎవరు అడ్డుకోలేరు. కర్ణుడు: ప్రభాస్‌ ఎంట్రీ ఇచ్చి అర్జునుడు వేసిన బాణాన్ని నిలువరిస్తాడు. ఆ సందర్భంలో ఆలస్యమైందా ఆచార్య దేవా? అని అశ్వత్థామతో అంటాడు. అశ్వత్థామ: లేదు.. సరైన సమయంలోనే వచ్చావు.&nbsp; అర్జునుడు: చూశావా.. కేశవ (కృష్ణుడు). తను నాకు సమానుడా? వాడ్ని (కర్ణుడు) అడ్డుకొని మన రథం కేవలం రెండు అడుగులు వెనక్కి వెళ్లింది. నా అస్త్రానికి అతడి రథం 10 అడుగులు వెనక్కి వెళ్లింది.&nbsp; కృష్ణుడు : ఓ ధనుంజయ.. నీ రథం అగ్నిదేవుడి వరం. కాపాడుతున్నదని జెండాపై కపిరాజు (హనుమంతుడు).&nbsp; నడుపుతున్నది ముల్లోకాలు నడిపించే నేను. అయినా రెండడుగులు వెనక్కి తోశాడంటే ఆలోచించు అర్జునా.&nbsp; కృష్ణుడు: తను (కర్ణుడు) సామాన్య యోధుడు కాదు. తన కళ్లల్లోని తేజస్సు.. తన చేతిలోని ధనస్సు.. తన పేరు.. చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. సూర్య పుత్ర వైకర్ణ.. కర్ణ. (ఈ డైలాగ్‌తో కల్కి తొలిపార్ట్‌ ముగుస్తుంది).
    జూలై 02 , 2024
    <strong>Allu vs Mega Family: అల్లు - మెగా ఫ్యామిలీకి అస్సలు పడట్లేదా? నిర్మాత క్రేజీ కామెంట్స్‌!</strong>
    Allu vs Mega Family: అల్లు - మెగా ఫ్యామిలీకి అస్సలు పడట్లేదా? నిర్మాత క్రేజీ కామెంట్స్‌!
    మెగా (Mega Family), అల్లు ఫ్యామిలీల మధ్య వివాదాలు తలెత్తినట్లు గత కొంతకాలంగా సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్‌ను మెగా ఫ్యామిలీ దూరం పెట్టిదంటూ పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ఏపీ మంత్రిగా పవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారానికి కూాడా అల్లు ఫ్యామిలీ నుంచి కనీసం ఒక్కరు కూడా హాజరు కాకపోవడం ఈ వివాదానికి అప్పట్లో మరింత బలాన్నీ చేకూర్చింది. అయితే తాజాగా ఈ అంశంపై అల్లు, మెగా ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు స్పందించారు. ఈ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇవి టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి.&nbsp; నిర్మాత ఏమన్నారంటే! జూ.ఎన్టీఆర్‌ (Jr NTR) బావమరిది నార్నే నితిన్‌ హీరోగా తెరకెక్కుతున్న 'ఆయ్‌' (AAY) చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించారు. తాజాగా ఈ మూవీలోని థీమ్‌ సాంగ్‌ రిలీజ్‌ ఈవెంట్‌ జరగ్గా అందులో బన్నీ వాసు పాల్గొన్నారు. ఈ క్రమంలో అల్లు - మెగా ఫ్యామిలీ మధ్య రాజుకున్న విభేదాలపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనిపై బన్నీ వాసు స్పందిస్తూ ‘మెగా, అల్లు ఫ్యామిలీలను 20 ఏళ్లుగా చూస్తున్నా. కుటుంబ సభ్యులంతా కలిసి ఉండాలని చిరంజీవి కోరుకుంటారు. అందుకే ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీని తీసుకొని బెంగళూరు వెళ్తుంటారాయన. ఏ కుటుంబంలోనైనా ఒకరు తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని సందర్భాల్లో ఇష్యూస్‌ వస్తాయి. అంతమాత్రాన బంధం దెబ్బతిన్నట్లు కాదు. ఇలా తాత్కాలికమైన వాటిని హైలైట్‌ చేయడం మంచి పద్ధతి కాదు. వారి బంధం గురించి తెలుసు కాబట్టే నమ్మకంగా చెబుతున్నా. మేమంతా ఒక్కటే అని చెప్పేందుకు వారికి ఒక్క సందర్భం చాలు. సమయం రావాలంతే. ఇప్పుడొస్తున్నవన్నీ పాసింగ్‌ క్లౌడ్స్‌’ అని సమాధానం ఇచ్చారు.&nbsp; వివాదానికి కేంద్ర బిందువు ఇదే! ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైకాపా నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌కు మద్దతుగా అల్లు అర్జున్‌ ప్రచారం చేయడంతో వివాదం మెుదలైంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలోని అభ్యర్థికి బన్నీ మద్దతు ఇవ్వడాన్ని మెగా ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోయారు. దీనికి తోడు మంత్రిగా పవన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సైతం అల్లు అర్జున్ గానీ, అల్లు ఫ్యామిలీ సభ్యులు గానీ ఎవరూ హాజరు కాలేదు. దీంతో మెగా - అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగినట్లు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇటీవల పవన్‌ కల్యాణ్‌ను కలిసిన నిర్మాతల బృందంలో అల్లు అరవింద్‌ ఉండటం, ఇద్దరూ ఎంతో అప్యాయంగా పలకరించకోవడంతో ఈ వివాదానికి కాస్త బ్రేకులు పడ్డాయి. అయితే బన్నీపై మాత్రం ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ కోపంగానే ఉన్నట్లు సోషల్‌ మీడియాలో వస్తోన్న కామెంట్స్‌ను బట్టి తెలుస్తోంది.&nbsp; అల్లు అర్జున్‌ vs రామ్‌చరణ్‌ అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో ‘పుష్ప 2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 15న ఈ చిత్రం రిలీజ్‌ కావాల్సి ఉండగా షూటింగ్‌లో జాప్యం వల్ల డిసెంబర్‌ 6కు విడుదల తేదీని మార్చారు. అయితే డిసెంబర్‌లో వచ్చే చిత్రాల రేసులో రామ్‌చరణ్‌ నటిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ కూడా ఉంది. శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో రిలీజ్‌ చేయాలని నిర్మాత దిల్‌రాజు భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ డిసెంబర్‌ ఫస్ట్‌వీక్‌లోనే గేమ్‌ ఛేంజర్‌ను రిలీజ్‌ చేయాలని భావిస్తే బాక్సాఫీస్‌ వద్ద ‘బన్నీ vs చరణ్‌’ పోరు తప్పదు. అదే జరిగితే మరోమారు మెగా ఫ్యాన్స్‌ రెండుగా చీలిపోయే తమ అభిమాన హీరో చిత్రాన్ని ప్రమోట్‌ చేయడం ఖాయమని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp; సుకుమార్‌తో కోల్డ్‌వార్‌? 'పుష్ప: ది రూల్' షూటింగ్ విషయంలో అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో ఇటీవల వార్తలు వచ్చాయి. షూటింగ్‌ సక్రమంగా జరగడం లేదని బన్నీ గుర్రుగా ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరిగింది. తను పూర్తిగా సహకరిస్తున్నా సుకుమార్‌ సరిగ్గా వినియోగించుకోవడం లేదని ఆయన అసంతృప్తితో ఉన్నారట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఫ్యామిలీతో హాలిడేకి వెళ్లారని తెలుస్తోంది. ఫ్లైట్ జర్నీ సమయంలో ఆయన్ను కొందరు వీడియో తీశారు. ఈ వీడియోలో బన్నీ గడ్డం ట్రిమ్‌ చేసి కనిపించారు. వాస్తవానికి పుష్ప గాడు అంటే ఆ గడ్డం లుక్కే మెయిన్‌. టువంటిది గడ్డాన్ని బన్నీ ట్రిమ్‌ చేసి పర్యటనకు వెళ్లడం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. https://twitter.com/i/status/1813405877908726058
    జూలై 20 , 2024
    ఈ వారం (April 03) థియేటర్లు, OTTలో సందడి చేసే సినిమాలు ఇవే..!
    ఈ వారం (April 03) థియేటర్లు, OTTలో సందడి చేసే సినిమాలు ఇవే..!
    సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఏప్రిల్‌ 3 నుంచి ఏప్రిల్‌ 9 మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్‌ అయ్యే చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు: రావణాసుర: మాస్‌ మహారాజా రవితేజ నటించిన రావణాసుర చిత్రం ఈ వారంలోనే థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఈ శుక్రవారం (ఏప్రిల్‌ 7) థియేటర్లలో రచ్చ రచ్చ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ట్రైలర్, టీజర్‌, సినిమా పోస్టర్లు ఈ చిత్రంపై భారీగా అంచనాలను పెంచేశాయి. రవితేజ సైతం ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఎంతో ధీమాగా ఉన్నారు. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమస్ సిసిరోలియో సంగీతం ఇచ్చారు.&nbsp; మీటర్‌: యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ‘మీటర్‌’ చిత్రం కూడా ఈ శుక్రవారమే (ఏప్రిల్‌ 7) థియేటర్లలోకి ఎంట్రీ ఇవ్వనుంది.&nbsp; కామెడీ, యాక్షన్‌తో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా మీటర్‌ అలరించనుంది. రమేష్‌ కడూరి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో అతూల్య రవి హీరోయిన్‌గా చేసింది. పోసాని కృష్ణ మురళి, సప్తగిరి ప్రధాన పాత్రలు పోషించారు. సాయికార్తిక్‌ ఈ సినిమాకు సంగీతం అందించారు.&nbsp; గుమ్రా: ఆదిత్య ఠాకూర్‌, సీతారామం ఫేమ్‌ మృణాల్‌ జంటగా నటించిన బాలీవుడ్‌ మూవీ గుమ్రా శుక్రవారం రిలీజ్ అవుతోంది. వర్ధన్‌ కేట్కర్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్‌గా అలరించనుంది. తమిళ హిట్‌ చిత్రం తడంకు రీమేక్‌గా ఈ చిత్రం తెరక్కెక్కింది. ఇందులో మృణాల్‌ పోలీసు ఆఫీసర్‌గా నటించింది. కాగా ఈ సినిమా రామ్‌ హీరోగా రెడ్‌ పేరుతో తెలుగు రిలీజ్‌అయింది.&nbsp; ఛిప్‌కలి: ఈ వారం మరో బాలీవుడ్‌ ఛిప్‌కలి కూడా థియేటర్లలో రిలీజ్ కానుంది. కౌషిక్‌ కర్‌ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమా కూడా శుక్రవారం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్దమైంది. నటులు యాష్‌పాల్‌ శర్మ, యోగేష్‌ భరద్వాజ్‌, తనిస్తా బిస్వాస్‌ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మర్డర్‌ చుట్టూ సినిమా కథ తిరుగుతుందని చిత్ర యూనిట్‌ తెలిపింది.&nbsp; వీరం: కన్నడ మూవీ వీరం సైతం ఈ శుక్రవారమే థియేటర్లలో సందడి చేయనుంది. కుమార్‌ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రంలో ప్రజ్వాల్‌ దేవరాజ్‌, శ్రీనగర కిట్టీ, రిచిత రామ్‌, దీపక్‌, అచ్యుత్‌ కుమార్‌ ముఖ్య పాత్రలు పోషించారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వీరం రాబోతోంది. ఓటీటీలో సందడి చేయనున్న మూవీస్ అసలు: నటి పూర్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన అసలు చిత్రం ఏప్రిల్‌ 5 బుధవారం రోజున ఓటీటీలోకి రాబోతోంది. రవిబాబు డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా ఈటీవీ విన్‌లో ప్రసారం కానుంది.&nbsp;అసలు కథేంటి? అసలు సినిమా దేని గురించి? అసలు ఎక్కడ చూడాలి? అని ఈటీవీ విన్‌ తన ట్విటర్ ఖాతాలో హైప్‌ క్రియేట్ చేసింది.&nbsp; యాంట్‌ మాన్‌ అండ్‌ ది వాస్ప్‌ క్వాంటుమేనియా: ఈ మూవీ హాట్‌స్టార్‌లో ఏప్రిల్‌ 5న రిలీజ్‌ కానుంది. యానిమేటెడ్‌ సైంటిఫిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఈ మూవీని నిర్మించారు. ఇందులో పాల్‌ పాల్ రూడ్, ఎవాంజెలిన్ లిల్లీ, జోనాథన్ మేజర్స్ వంటి స్టార్‌ క్యాస్ట్ నటించింది.&nbsp; ఫ్లాట్‌ఫామ్‌ వారీగా ఓటీటీ విడుదలలు…&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateThe Crossoverseries&nbsp;EnglishDisney+ HotstarApril 5Tiny Beautiful Thingsseries&nbsp;EnglishDisney+ HotstarApril 07Redefined: J.R. Smith&nbsp;TV seriesenglishAmazon PrimeApril 4Bros (2022)movieenglishAmazon PrimeApril 4Lizzy Hoo: Hoo Cares!? (2023)movieenglishAmazon PrimeApril 4On a Wing and a Prayer (2023)MovieHindiAmazon PrimeApril 7Gangs of Lagos (2023)MovieEnglishAmazon PrimeApril 7Magic MixiesSeriesEnglishNetflixApril 03“Surviving R. Kelly: Part III: The Final ChapterSeriesEnglishNetflixApril 03Mo’Nique: My Name Is Mo’NiqueSeriesEnglishNetflixApril 04BeefSeriesEnglishNetflixApril 06The Last StandMovieEnglishNetflixApril 06On a Wing and a Prayer (2023)MovieEnglishNetflixApril 06Thicker Than WaterSeriesEnglishNetflixApril 07TransatlanticSeriesEnglishNetflixApril 07ChupaMovieEnglishNetflixApril 07Oh BelindaMovieEnglishNetflixApril 07Holy SpiderMovieEnglishNetflixApril 07HungerMovieEnglishNetflixApril 08The Lady in DignityMovieMovieMX PlayerApril 05My Debate Opponent Season 2&nbsp;SeriesEnglishMX PlayerApril 08The Song of GloryMovieMovieMX PlayerApril 12
    ఏప్రిల్ 03 , 2023
    RGV: షేపులు ఎలా మెయిన్‌టైన్ చేస్తున్నావ్..? కొంటెగా ఆన్సర్ ఇచ్చిన RGV చీర భామ!
    RGV: షేపులు ఎలా మెయిన్‌టైన్ చేస్తున్నావ్..? కొంటెగా ఆన్సర్ ఇచ్చిన RGV చీర భామ!
    Sreelakshmi Satheesh: సంచలనాలు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఈ మధ్య ఓ యువతిపై మనసు పారేసుకున్నారు. ఆమెనే శ్రీ లక్ష్మీ సతీష్. రామ్‌గోపాల్ వర్మ శ్రీలక్ష్మీ సతీష్ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన తర్వాత ఒక్కసారిగా సెలబ్రెటీగా మారిపోయింది. శ్రీలక్ష్మీ అందానికి దాసోహం అయ్యానని RGV చెప్పడంతో తెలుగు రాష్ట్రాలో ఈ కేరళ అందం హాట్‌ ఆఫ్ ది టాక్‌గా మారింది. రామ్‌గోపాల్ వర్మ ఆమెను గుర్తించక ముందు జస్ట్ ఆమె ఇన్‌స్టా ఫాలోవర్లు 30 వేలు మించలేదు. ఎప్పుడైతే శ్రీలక్ష్మీ అందాన్ని ఆర్జీవీ గుర్తించాడే ఆమె ఫాలోవర్ల సంఖ్య జెట్ వేగంతో దూసుకెళ్లింది. తాజాగా రామ్‌గోపాల్ వర్మ శ్రీలక్ష్మి సతీష్‌తో 'చీర' అనే సినిమాను తీస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమె కూడా ఈసినిమా చేసేందుకు ఒప్పుకుంది. శ్రీలక్ష్మీతో ఆర్జీవీ ఫోన్‌లో మాట్లాడటం.. ఆమె గురించి వరుస ఫోస్ట్‌లు పెట్టడంతో నెటిజన్లను పెద్ద పని కలిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తీరికలేకుండా తనకు నోటిఫికేషన్లు వస్తున్నట్లు శ్రీలక్ష్మీ సతీష్ తెలిపింది. అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఎలాగు క్రేజ్ వస్తోంది కదా అని … ఈ అందాల తెగింపు వరుస హాట్ ఫొటో షూట్‌లతో కుర్రకారుకు గిలిగింతలు పెడుతోంది. నేరుగా నెటిజన్లతో ఇంటరాక్ట్ అవుతూ తన అభిప్రాయాలను పంచుకుంటోంది. చాలా మంది ఆమె అందాల షేపులు, సౌందర్యం, ఒంపుసొంపుల గురించి ప్రశ్నలు సంధించారు. వాటి రహస్యం ఏమిటని బహిరంగంగానే అడిగారు. మీ కళ్లు సూదుల్లా మా గుండెల్ని గుచ్చుతున్నాయి అని ఓ నెటిజన్ అనగా… నీవు మానవ కన్యవు కావు, పైనుంచి దిగివచ్చిన దేవకన్యవు అంటూ తెగ పొగిడేశారు. నీ ఎద షేపులు, నడుమందాలు బాగున్నాయి.. ఎలా మెయిన్‌టైన్ చేస్తున్నావ్ అని అడిగితే… శ్రీలక్ష్మీ సతీష్ తెగ సిగ్గుపడుతూ జవాబు చెప్పింది. అందరిలాగే నార్మల్ వాకింగ్, టైమ్‌ టూ టైమ్ డైట్‌ తీసుకుంటాను. అదే నా సౌందర్య రహస్యం అని చెప్పుకొచ్చింది. RGVపై ఒక్కమాటలో చెప్పండి అంటే… ఆయనపై కొండంత ప్రేమ దాగుందని ఆన్సర్ ఇచ్చింది… ఈ కొంటె కోనంగి.
    అక్టోబర్ 31 , 2023
    <strong>Trisha: డేటింగ్‌లో విజయ్‌ - త్రిష? కీర్తి సురేష్‌ పెళ్లిలో రివీలైన బంధం!</strong>
    Trisha: డేటింగ్‌లో విజయ్‌ - త్రిష? కీర్తి సురేష్‌ పెళ్లిలో రివీలైన బంధం!
    తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్ (Vijay), హీరోయిన్‌ త్రిష (Trisha) ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వీరు డేటింగ్‌ (Trisha Vijay Dating)లో ఉన్నట్లు కూడా నెట్టింట రూమర్లు వచ్చాయి. ఈ క్రమంలో వీరు గోవాలో జరిగిన కీర్తి సురేష్ - ఆంటోనీ తట్టిల్ వివాహ వేడుకకు కలిసి ప్రయాణించినట్లు ఫొటోలు, వీడియోలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. ఈ ఫొటోలతో వీరి సంబంధం గురించి సోషల్ మీడియాలో మరోమారు చర్చ మొదలైంది. వీరు నిజంగానే డేటింగ్‌లో ఉన్నారనేందుకు ఈ ఫొటోలు, వీడియోలే నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  చెకింగ్‌ దగ్గర దొరికేసిన జంట..&nbsp; స్టార్‌ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ (Keerthi Suresh) తన చిరకాల మిత్రుడు ఆంటోని తట్టిల్‌ (Antony Thattil)ను గురువారం (డిసెంబర్‌ 12) గోవాలో పెళ్లి చేసుకుంది. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లికి అతి ముఖ్యులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. తమిళ ఇండస్ట్రీ నుంచి విజయ్‌, త్రిష జంటగా ఈ పెళ్లికి హాజరయ్యారంటూ గురువారమే వార్తలు వచ్చాయి. అయితే ఇవాళ వీడియోలు బయటకు రావడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. విజయ్‌, త్రిష స్పెషల్‌ ఫ్లైట్‌లో గోవాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు చెకింగ్‌ సందర్భంగా విజయ్‌, త్రిష జంటగా కెమెరాలకు చిక్కారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. https://twitter.com/TrollywoodX/status/1867249542149926983 త్రిష-విజయ్‌ లుక్స్‌ అదరహో..&nbsp; ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో త్రిష సాధారణ వైట్ టీ-షర్ట్ ధరించగా, విజయ్ బ్లూ స్ట్రైప్ షర్ట్‌తో చక్కగా కనిపించాడు. సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది వారిద్దరిని చెక్‌ చేస్తుండగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌ కెమెరాలో వారిని బంధించారు. చెకింగ్ అనంతరం త్రిష, విజయ్‌ తమ కారుల్లో ఎక్కి హడావిడీగా వెళ్లిపోయారు. కాగా, స్పెషల్‌ ఫ్లైట్‌లో ప్రయాణం చేసిన వారి లిస్ట్‌ కూడా సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. అందులో త్రిష, విజయ్‌ పేర్లతో పాటు మరో నలుగురు వ్యక్తులు ప్రయాణించినట్లు వివరాలు ఉన్నాయి.&nbsp; https://twitter.com/rajubhai_DMK/status/1867463962440478816 నెటిజన్ల రియాక్షన్‌ ఇదే విజయ్, త్రిష (Trisha Vijay Dating)కి సంబంధించిన వీడియో బయటకు వచ్చిన వెంటనే నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ‘వెడ్డింగ్‌లో పాల్గొంటే తప్పేముంది?’ అని కొందరు విజయ్ జంటను సమర్థిస్తున్నారు. పెళ్లై పిల్లలను పెట్టుకొని విజయ్‌ ఇలా చెట్టాపట్టాలు వేసుకొని తిరగడం ఏమాత్రం అమోదయోగ్యం కాదని మరికొందరు విమర్శిస్తున్నారు. పైగా రాజకీయాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో వ్యక్తిగత జీవితంలోనూ విజయ్‌ హుందాగా ఉండాల్సిన అవసరముందని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం త్రిష, విజయ్‌ వ్యవహారం కీర్తి సురేష్‌ పెళ్లి కంటే ఎక్కువగా చర్చ జరుగుతోంది.&nbsp; విజయ్‌ జంటకు మంచి క్రేజ్‌ విజయ్‌ - త్రిష (Trisha Vijay Dating) జంటకు తమిళంలో మంచి క్రేజ్ ఉంది. వారు ఇప్పటివరకూ 8 చిత్రాల్లో కలిసి నటించారు. గతేడాది వచ్చిన లియో సినిమాలో విజయ్‌కి జోడీగా త్రిష నటించింది. ఈ ఏడాది వచ్చిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’ సినిమాలోనూ త్రిష ఓ స్పెషల్‌ సాంగ్‌లో తళుక్కుముంది. అయితే ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కాలం నుంచే వీరు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు మెుదలయ్యాయి. అయితే విజయ్‌ రాజకీయాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో అతడి పొలిటికల్‌ ప్రత్యర్థులు ఇలా దుష్ప్రచారం చేయిస్తున్నారన్న ప్రచారం కూడా తమిళనాడులో ఉంది. ఏది ఏమైనా తన రిలేషన్‌ గురించి విజయ్‌ - త్రిష క్లారిటీ ఇచ్చే వరకూ ఈ చర్చ ఇలాగే కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 
    డిసెంబర్ 13 , 2024
    Vijay Deverakonda: ఆ రోజు చాలా బాధపడ్డా… కానీ ఇప్పుడు 400 మిలియన్ల లవ్ సాధించా
    Vijay Deverakonda: ఆ రోజు చాలా బాధపడ్డా… కానీ ఇప్పుడు 400 మిలియన్ల లవ్ సాధించా
    నేషనల్ క్రష్ రష్మిక మంధాన(Rashmika Mandanna), రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫేయిర్‌ అంటే తెలుగులో ఓ ట్రెండ్ సెట్ చేసింది. వీరు చేసింది రెండు సినిమాలే అయినా సిల్వర్ స్క్రీన్‌ పేయిర్‌గా గుర్తింపు పొందారు. అంతలా వీరి మధ్య కెమిస్ట్రీ కుదురిందని చెప్పవచ్చు. వీరిద్దరు కలిసి నటించినా తొలి చిత్రం 'గీతా గోవిందం'బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. ఏకంగా ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను పరుశురామ్ తెరకెక్కించగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాణం అయింది. ఈ చిత్రంలో విజయ్- రష్మిక జోడికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.&nbsp; మరో సినిమా వీరి కాంబినేషన్‌లో రావాలని ఆశపడ్డారు.దీంతో ఈ జోడి మళ్లి కలిసి పనిచేసింది. యంగ్ డైరెక్టర్ భరత్ కమ్మ డియర్ కామ్రెడ్(Dear Comrade) చిత్రాన్ని రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని&nbsp; మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై&nbsp; నిర్మించారు.మించారు.ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా అన్ని పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. యూత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించాయి. ముఖ్యంగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ యూనియన్ లీడర్ పాత్రలో సూపర్బ్‌గా నటించాడు. అవుట్‌ అండ్ అవుట్ యాక్షన్‌ సీక్వెన్స్‌తో అలరించాడు. ఈ చిత్రంలో లిల్లి క్యారెక్టర్‌లో రష్మిక మంధాన క్రికెటర్‌గా అద్భుతంగా నటించింది. వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లకు ప్రేక్షకులు విజిల్స్ వేశారు. ఇద్దరి మధ్య ఎమోషనల్ సీన్లు ప్రేక్షకులను కదిలించాయి. ఈ సినిమా తెలుగులో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. సోషల్ మీడియాలో విజయ్ యాంటి ఫ్యాన్స్ ఈ సినిమాపైన కూడా ట్రోల్స్ మొదలు పెట్టారు. అయితే అవేమీ విజయ్ సక్సెస్‌ను ఆపలేకపోయాయి. ఈ థియేటర్లలో రాణించకపోయినప్పటికీ.. ఓటీటీలో దుమ్ము రేపింది. డబ్ అయిన అన్ని భాషల్లో మంచి టాక్ సంపాదించి విజయం సాధించింది. డియర్ కామ్రెడ్ రికార్డు.. తాజాగా.. డియర్ కామ్రెడ్ హిందీ డబ్‌డ్‌ వెర్షన్ రికార్డు క్రియేట్ చేసింది.&nbsp; హిందీలో డబ్ అయిన ఈ చిత్రం యూట్యూబ్‌లో ఏకంగా&nbsp; 40 కోట్ల ప్లస్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇదే విషయాన్ని డియర్ కామ్రెడ్ చిత్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్‌ ద్వారా తన సంతోషాన్ని ట్వీట్ చేసింది. తెలుగులో ఈ సినిమా కథాంశం ప్రేక్షకులకు ఎక్కకున్నా హిందీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా బాగా నచ్చింది. విజయ్- రష్మిక బాండింగ్ సూపర్బ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి కంటెంట్ ఉన్న చిత్రాలు విజయ్ నుంచి రావాలని మెసెజేస్ పెడుతున్నారు. &nbsp; ఈ విషయాన్నీ మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్ ద్వారా తెలియజేసింది. ఆ రోజు బాధపడ్డాం.. మరోవైపు విజయ్ దేవరకొండ తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపాడు. 400 మిలియన్ లవ్&nbsp; సాధించాము. 2019లో డియర్ కామ్రెడ్ విడుదలైన రోజున కొంత బాధపడ్డాం. కానీ ఇప్పుడు 400 మిలియన్‌ లవ్ మమ్మల్ని తడిసి ముద్ధచేసింది.&nbsp; ఎన్ని సినిమాలు వచ్చినా తన లైఫ్‌లో డియర్ కామ్రెడ్ చిత్రం ప్రత్యేకమంటూ రాసుకొచ్చాడు. ఇదే పోస్ట్‌ను రష్మిక మంధానకు సైతం ట్యాగ్ చేశాడు. రష్మిక మంధాన సైతం దీనిపై స్పందించింది. విజయ్ దేవరకొండ పోస్ట్ స్క్రీన్ షాట్‌ను తన ఇన్‌స్టా రీల్‌లో పోస్ట్ చేసింది. విజయ్ బిజీ బిజీ ఇక ఇదిలా ఉంటే విజయ దేవరకొండ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. జెర్సీ ఫెమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో వస్తున్న VD12 చిత్రాన్ని విజయ్ చేస్తున్నాడు. ఈ సినిమా పిరియాడిక్ డ్రామా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంకీర్తయన్ డెరెక్షన్‌లో VD14 చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా ది లెజెండ్ ఆఫ్ కర్స్‌డ్ ల్యాండ్ అంటూ ఈ సినిమా ట్యాగ్ లైన్‌ ఉంది. ఈ రెండు సినిమాలు విజయ్ కెరీర్‌కు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు ఆశించినంత ఫలితాన్ని రాబట్టలేకపోవడంతో ఈ సినిమాలను చాలా జాగ్రత్తగా విజయ్ టెకప్ చేస్తున్నాడని తెలుస్తోంది. మరోవైపు రష్మిక మంధాన పుష్ప2 ప్రమోషన్‌లో బిజీగా ఉంది. యానిమల్ సినిమా సక్సెస్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్‌లో అవకాశాలు తలుపుతడుతున్నాయి. ప్రస్తుతం తన ఫ్యూచర్ ప్రాజెక్ట్‌లైన చావా(హిందీ), కుబెరా(తమిళ్) సినిమాల్లో నటిస్తోంది.
    జూన్ 15 , 2024
    <strong>Pushpa 2 Trailer: బిహార్‌లోనే పుష్ప ట్రైలర్ రిలీజ్ ఎందుకంటే?</strong>
    Pushpa 2 Trailer: బిహార్‌లోనే పుష్ప ట్రైలర్ రిలీజ్ ఎందుకంటే?
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2)పై దేశవ్యాప్తంగా బజ్‌ ఉంది. డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ‘పుష్ప 2’ సంబంధించి రోజుకో అప్‌డేట్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. దీంతో ట్రైలర్‌ (Pushpa 2 Trailer) రిలీజ్‌ అప్‌డేట్‌ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వారి నిరీక్షణనను పటాపంచలు చేస్తూ మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్‌ తీసుకొచ్చారు. పుష్ప 2 ట్రైలర్ రిలీజ్‌పై ఓ స్పెషల్‌ పోస్టర్‌ ద్వారా స్పష్టత ఇచ్చారు.&nbsp; పాట్నాలో గ్రాండ్ రిలీజ్ దేశ విదేశాల్లో ఉన్న సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘పుష్ప ది రూల్‌’ (Pushpa The Rule). మూవీ రిలీజ్‌కు నెల రోజులు కూడా లేకపోవడంతో ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ట్రైలర్ రిలీజ్‌పై మూవీ టీమ్‌ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. నవంబర్‌ 17న సాయంత్రం 6.03 గంటలకు పాట్నాలో ట్రైలర్‌ (Pushpa 2 Trailer)ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బన్నీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేసింది. ఇందులో గన్‌ భుజాన పెట్టుకొని పుష్పగాడు ఎంతో అగ్రెసివ్‌గా కనిపించాడు. ఇది చూసిన సినీ లవర్స్ తెగ ఖుషీ అవుతున్నారు. పుష్ప 2 ట్రైలర్ దెబ్బకు సోషల్ మీడియా మోతమోగడం ఖాయమని అంటున్నారు.&nbsp; https://twitter.com/PushpaMovie/status/1855922382181134676 బిహార్‌లోనే ఎందుకంటే? తెలుగు స్టేట్స్‌తో పాటు నార్త్‌లో ఇన్ని రాష్టాలు ఉండాలుగా ‘పుష్ప 2’ టీమ్‌ ట్రైలర్‌ రిలీజ్‌కు బిహార్‌నే ఎంచుకోవడం వెనక ఓ బలమైన కారణమే ఉంది. 2021లో విడుదలైన ‘పుష్ప’ చిత్రం ఎవరూ ఊహించని విధంగా నార్త్‌లో ఘన విజయం సాధించింది. ముఖ్యంగా బిహార్‌ స్టేట్‌లో ‘పుష్ప’ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. పుష్పగాడి మాస్ క్యారెక్టర్‌ను బిహార్ ఆడియన్స్ బాగా ఓన్‌ చేసుకున్నారు. అప్పట్లో బన్నీని ఇమిటేట్‌ చేస్తూ పెద్ద ఎత్తున రీల్స్ సైతం చేశారు. ఇటీవల ‘పుష్ప 2’ టైటిల్‌ సాంగ్‌ రిలీజవ్వగా దానిపైనా బిహారి యూత్‌ రీల్స్‌ చేసింది. బిహార్‌ సరిహద్దు రాష్ట్రం యూపీలోనూ ‘పుష్ప’కు మంచి ఆదరణ ఉంది. 2022 యూపీ ఎలక్షన్స్‌ సందర్భంగా 'పుష్ప'లోని శ్రీవల్లి సాంగ్‌ ప్రముఖంగా వినిపించింది. విపక్ష కాంగ్రెస్‌ పార్టీ శ్రీవల్లి ట్యూన్‌ను కాపీ చేసి 'తూ హై గజాబ్‌ యూపీ.. తేరి కసం యూపీ' అంటూ లిరిక్స్‌ మార్చి పాటను ప్రచారానికి వాడుకుంది. ఇలా చెప్పుకుంటే బిహార్‌, యూపీలో పుష్పగాడి క్రేజ్‌కు నిదర్శనమైన ఎన్నో ఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం పాన్‌ ఇండియా మార్కెట్‌ను టార్గెట్‌ చేసిన ‘పుష్ప 2’ టీమ్ బిహార్‌ రాజధాని పాట్నాలో ట్రైలర్ రిలీజ్‌ చేయడం ద్వారా మంచి మైలేజ్‌ సాధించవచ్చని అంచనా వేస్తోంది. ‘కిస్సిక్‌’ శ్రీలీల అదుర్స్‌ స్టార్ హీరోయిన్ శ్రీలీల 'పుష్ప 2'లో ఐటెం సాంగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సెట్‌లో బన్నీతో ఆమె ఉన్న పిక్‌ నెట్టింట వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే శ్రీలీల తమ ప్రాజెక్టులో భాగమైనట్లు 'పుష్ప 2' టీమ్ ఆదివారం (నవంబర్‌ 11) అధికారికంగా ప్రకటించింది. ఇందులో ఆమె స్పెషల్‌ సాంగ్‌ చేయనున్నట్లు తెలిపింది. ‘కిస్సిక్‌’ అంటూ సాగే ఈ పాట సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ కానుందని పేర్కొంది. సినీ ప్రియులను ఇది తప్పక అలరిస్తుందని తెలిపింది. ‘ది డ్యాన్సింగ్‌ క్వీన్ శ్రీలీల’అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్‌ సైతం ఇచ్చింది. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది.&nbsp; https://twitter.com/PushpaMovie/status/1855559794985426988 డ్యాన్స్‌ అదిరిపోవాల్సిందే! ‘పుష్ప 2’ ఐటెం సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్ (Pushpa 2 Trailer) అదిరిపోతుందని చెప్పవచ్చు. ప్రస్తుత తరం కథానాయికల్లో డ్యాన్స్‌లో శ్రీలీలను కొట్టేవారే లేరనడంతో అతిశయోక్తి లేదు. ఈ భామ తన నటన కంటే డ్యాన్స్ పరంగానే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. రవితేజ 'ధమాకా' చిత్రంలో పల్సర్ బైక్‌ సాంగ్‌లో ఈ అమ్మడు ఏవిధంగా అదరగొట్టిందో అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా మహేష్‌ బాబుతో 'కుర్చీని మడతపెట్టి' సాంగ్‌లో ఏకంగా తన స్టెప్పులతో విధ్వంసం సృష్టించింది. శ్రీలీలతో డ్యాన్స్ అంటే హేమా హేమీ డ్యాన్సర్లు సైతం కాస్త వెనక్కి తగ్గుతుంటారు. అటువంటి శ్రీలీలతో డ్యాన్స్‌కు కేరాఫ్‌గా నిలిచే బన్నీ జతకలిస్తే ఇక ఐటెం సాంగ్ ఏ స్థాయిలో ఉంటుందో అభిమానుల ఊహకే వదిలేయవచ్చు.&nbsp; ప్రమోషన్స్‌కు టీమిండియా! ‘పుష్ప 2’ (Pushpa 2) రిలీజ్‌కు నెల రోజులు కూడా లేకపోవడంతో ప్రమోషన్స్‌పై చిత్ర బృందం ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. నార్త్‌ ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈవెంట్స్‌ (Pushpa 2 Trailer)ను ప్లాన్‌ చేస్తున్నారట. అక్కడ జరిగే ఈవెంట్స్‌కు టీమిండియా స్టార్‌ క్రికెటర్స్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, రింకు సింగ్‌, అర్షదీప్‌ సింగ్‌ సహా పలువురు క్రికెటర్స్‌ను ఆహ్వానించనున్నట్లు సమాచారం. దీనిపై నెక్స్ట్‌వీక్‌లో అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు చెబుతున్నారు. ఇదే నిజమైతే ‘పుష్ప 2’ కొత్త ట్రెండ్‌ను సృష్టించనున్నాయి. ఇప్పటివరకూ మూవీ ప్రమోషన్స్‌లో క్రికెటర్లు పాల్గొన్న సందర్భాలు లేవు. ‘పుష్ప 2’ ప్రమోషన్స్‌లో వారు గనుక భాగం అయితే ఇండియన్‌ మూవీ హిస్టరీలో ఇదొక కొత్త అధ్యాయం కానుంది.&nbsp;
    నవంబర్ 11 , 2024

    @2021 KTree