• TFIDB EN
 • సౌండ్ పార్టీ (2023)
  U/ATelugu

  తండ్రి కొడుకులు (అప్పాజీ శివన్నారాయణ, వీజే సన్నీ) సులభంగా కోటీశ్వరులు కావాలని కలలు కంటుంటారు. ఈ క్రమంలోనే దొంగతనం కేసు మీద వేసుకుని 2 నెలలు జైళ్లో ఉంటే రూ. 2 కోట్లు ఇస్తానని తండ్రీకొడుకులకు ఎమ్మెల్యే వర ప్రసాద్ (పృథ్వీ) ఆఫర్ ఇస్తాడు. డబ్బుకు ఆశపడి వారు జైలుకు వెళ్తారు. అయితే అది దొంగతనం కాదని, రేప్‌ కేసు అని తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ కేసు నుంచి వారిద్దరు ఎలా బయటపడ్డారు? అన్నది కథ.

  ఇంగ్లీష్‌లో చదవండి
  మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
  స్ట్రీమింగ్‌ ఆన్‌Ahaఫ్రమ్‌
  Watch
  రివ్యూస్
  How was the movie?

  సిబ్బంది
  సంజయ్ షెరీదర్శకుడు
  రవి పోలిశెట్టినిర్మాత
  మహేంద్ర గజేంద్రనిర్మాత
  సంజయ్ షెరీరచయిత
  మోహిత్ రహ్మానియాక్సంగీతకారుడు
  శ్రీనివాస్ రెడ్డి జూలకంటిసినిమాటోగ్రాఫర్
  అవినాష్ గుల్లింకాఎడిటర్ర్
  కథనాలు
  Pushpa 2 The Rule: పుష్ప2 నుంచి బిగ్ అప్‌డేట్.. ఆ బాలీవుడ్ బ్యూటీతో ఐటెం సాంగ్!
  Pushpa 2 The Rule: పుష్ప2 నుంచి బిగ్ అప్‌డేట్.. ఆ బాలీవుడ్ బ్యూటీతో ఐటెం సాంగ్!
  ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘పుష్ప’ (Pushpa). పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అంతేకాకుండా బన్నీని జాతీయ స్థాయి నటుడుగా నిలబెట్టింది. ఈ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అల్లు అర్జున్‌ అందుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్‌ రూపొందుతోంది. ‘పుష్ప 2’ పేరుతో ఇది రాబోతోంది. టైటిల్‌ కింద ‘ది రూల్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. అయితే ఈ సీక్వెల్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ బయటకొచ్చింది. ప్రస్తుతం ఆ వార్త సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది.  బాలీవుడ్‌ బ్యూటీతో ఐటెం సాంగ్‌ ‘పుష్ప’ మూవీ పాటలు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా మావా.. ఉ.. ఉ.. అంటావా’ అనే ఐటెం సాంగ్‌ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్‌ చేసింది. బన్నీ-సామ్‌ కలిసి వేసిన స్టెప్స్‌ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్‌ సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ పాట కోసం ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్‌ల పేర్లు బయటకు వచ్చినప్పటికి చివరకు ఈ అవకాశం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశ పటానీ (Disha Patani)కి దక్కింది. అంతేకాదు ఈ వారంలోనే దిశాతో ఐటమ్‌సాంగ్‌ చిత్రీకరించనున్నట్లు సమాచారం.  శరవేగంగా షూటింగ్‌ ఆగస్టు 15న 'పుష్ప 2'ను రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అందుకు అనుగుణంగా శరవేగంగా షూటింగ్‌ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ 'రామోజీ ఫిల్మ్‌ సిటీ'లో చురుగ్గా సాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే నిన్న (ఫిబ్రవరి 12) ‘పుష్ప2’ హీరోయిన్‌ రష్మిక మందన్న సెట్‌లో డైరెక్టర్‌ సుకుమార్‌ను క్యాప్చర్‌ చేసింది. ఓ సింహం బొమ్మపై సుకుమార్ నవ్వుతూ కనిపించారు. ఈ ఫొటోను షేర్‌ చేసిన చిత్ర యూనిట్‌.. శ్రీవల్లి (రష్మిక) ఈ ఫోటో తీసినట్లు స్పష్టం చేశారు. చకా చకా షూటింగ్ పనులు జరుగుతున్నట్లు చెప్పారు.  https://twitter.com/PushpaMovie/status/1756931867146907757? ఒకే ఒక్క మార్పు పుష్ప చిత్రం సౌత్‌లో కంటే.. నార్త్‌లోనే ఎక్కువ అభిమానుల్ని సంపాదించుకుంది. దాంతో ‘పుష్ప 2’ పై విప‌రీత‌మైన అంచ‌నాలు పెరిగాయి. పెరిగిన అంచ‌నాల్ని దృష్టిలో ఉంచుకొని, స్క్రిప్టు ప‌రంగా సుకుమార్ అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లూ తీసుకున్నారు. ఈ క్రమంలోనే ‘పుష్ప 2’లో కొత్త స్టార్లు ద‌ర్శ‌న‌మిస్తార‌ని గత కొంత కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని సమాచారం. ‘పుష్ప 1’లో ఉన్న‌వారే.. పార్ట్ 2లోనూ క‌నిపిస్తారట. ఒక్క జ‌గ‌ప‌తిబాబు పాత్ర మాత్రమే కొత్తగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది. కాగా, ఈ చిత్రంలో బన్నీతో పాటు సునీల్‌, అనసూయ, ఫహద్‌ ఫాసిల్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  పుష్ప2 డైలాగ్ లీక్‌..! ఇక పుష్ప2 నుంచి రిలీజైన ఓ పోస్టర్‌లో బన్నీ.. గంగమ్మ జాతర గెటప్‌లో కనిపిస్తాడు. ఈ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ నుంచి ఓ డైలాగ్ లీకైదంటూ నెట్టింట వార్తలు వచ్చాయి. మంగళం శీను (సునీల్‌)కు పుష్ప(బన్నీ) వార్నింగ్ ఇచ్చే క్రమంలో ఈ డైలాగ్‌ ఉంటుందని అంటున్నారు. అదేంటంటే.. ‘చూడు శీనప్ప పుష్ప గుండెల్లో గుండు దింపాలంటే గన్ను ఒకటే పట్టుకుంటే సరిపోదప్ప దాన్ని పట్టుకున్నోడి గుండె కూడా గన్నులా ఉండాలి’ అని సునీల్‌తో బన్నీ అంటాడట. అయితే ఈ ప్రచారంపై చిత్ర యూనిట్‌ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.  లీకుల బెడద..! 'పుష్ప 2' చిత్రాన్ని లీకుల బెడద వెంటాడుతోంది. ఇటీవల షూటింగ్ స్పాట్‌ నుంచి అల్లు అర్జున్‌ చీరలో ఉన్న ఫొటో లీక్‌ అయ్యింది. దీంతో సుకుమార్‌ యూనిట్‌పై సీరియస్ అయ్యాడట. తాజాగా షూటింగ్‌ స్పాట్‌ నుంచి రావు రమేష్‌ ‘ప్రజా చైతన్య పార్టీ’ అనే ఫ్లెక్సీలు కూడా బయటకు వచ్చాయి. ఈ లీకులను ఆపేందుకు సుకుమార్‌ స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మున్ముందు మూవీకి సంబంధించిన మరిన్ని ముఖ్యమైన విషయాలు లీక్‌ కాకుండా అడ్డుకోవాలని యూనిట్‌ను హెచ్చరించినట్లు సమాచారం.  https://twitter.com/SrikanthAnu2/status/1751986145318314415
  ఫిబ్రవరి 13 , 2024
  <strong>Ustaad Bhagat Singh: ‘గ్లాస్‌ అంటే సైజ్‌ కాదు సైన్యం’.. ఏపీ ప్రభుత్వానికి పవన్‌ గట్టి కౌంటర్‌?</strong>
  Ustaad Bhagat Singh: ‘గ్లాస్‌ అంటే సైజ్‌ కాదు సైన్యం’.. ఏపీ ప్రభుత్వానికి పవన్‌ గట్టి కౌంటర్‌?
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ఈ చిత్రంపై పవన్‌ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘గబ్బర్‌ సింగ్‌’ లాంటి బ్లాక్‌బాస్టర్‌ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఎక్స్‌పెక్టెషన్స్‌ తారా స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం పవన్‌ ఏపీ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు. జనసేన పార్టీ తరపున చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ అభిమానులతో పాటు జనసైనికులకు మంచి బూస్టప్‌ ఇచ్చేలా ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ నుంచి మరో గ్లింప్స్‌ రిలీజైంది. ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.&nbsp; 'గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది’ భగత్‌ బ్లేజ్‌(Bhagath Blaze) పేరుతో రిలీజైన ఈ గ్లింప్స్‌ వీడియో ఆద్యాంతం అలరించింది. 1:02 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియోల పవన్ ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ లుక్‌లో కనిపించాడు. గ్లింప్స్‌లోకి వెళ్తే.. మెుదట విలన్‌ గ్యాంగ్‌లోని మనిషి పవన్‌ను ఉద్దేశించి నీ రేంజ్ ఇది అంటూ టీ గ్లాస్‌ను చూపించి కింద పడేస్తాడు. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌.. 'గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది’, 'గ్లాస్ అంటే సైజ్‌ కాదు సైన్యం.. కనిపించని సైన్యం' అంటూ పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ చెప్పడం వీక్షకులకు గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన బీజీఎం కూడా సూపర్‌గా అనిపించింది. ఈ గ్లింప్స్‌పై మీరూ ఓ లుక్కేయండి. https://www.youtube.com/watch?v=oZYqzxtg4f8 అధికార వైసీపీకి గట్టి కౌంటర్! ఏపీలోని అధికార వైసీపీకి గట్టి కౌంటర్‌ ఇచ్చేలా ఈ గ్లింప్స్‌ను రూపొందినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా పవన్‌ ఓడిపోయాడని.. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేకపోయారని తరచూ అధికార పార్టీకి చెందిన నేతలు విమర్శిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ను, జనసేన పార్టీని తక్కువగా చూస్తున్న వారికి గట్టి కౌంటర్‌ ఇచ్చేలా ఈ డైలాగ్స్ ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్లింప్స్‌లోని ‘గాజు గ్లాస్‌’ డైలాగ్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1770055005283688593 పొలిటికల్‌ హీట్‌ పెంచిన డైలాగ్స్‌! మరి కొన్నిరోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ.. టీడీపీ - భాజాపాతో పెట్టుకొని ఎన్నికల బరిలో దిగుతుంది. ఈ నేపథ్యంలో కావాలనే పొలిటికల్ హీట్ పెంచేలా ఈ గ్లింప్స్‌ను విడుదల చేశారని అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ మెుదలైంది. ఎన్నికల వేళ జనసైనికుల్లో ఫుల్‌జోష్‌ నింపేందుకు ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారని అంటున్నారు. ఏదీ ఏమైనా పవన్ ఫ్యాన్స్ మాత్రం మాస్ ఈ గ్లింప్స్‌తో జాతర చేసుకుంటున్నారు. చాల రోజుల తర్వాత పవన్ కల్యాణ్‌ను ఇలా యాక్షన్ మోడ్‌లో చూడటం సంతోషంగా ఉందంటూ సంబురాలు చేసుకుంటున్నారు.
  మార్చి 19 , 2024
  Memes on Mega Princess: మెగా లిటిల్ ప్రిన్సెస్‌పై మీమ్స్.. ఇంత టాలెంట్‌గా ఉన్నారెంట్రా బాబు!
  Memes on Mega Princess: మెగా లిటిల్ ప్రిన్సెస్‌పై మీమ్స్.. ఇంత టాలెంట్‌గా ఉన్నారెంట్రా బాబు!
  మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసన దంపతులు ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా ఇంట సంబరాలు నెలకొన్నాయి. జూన్ 20న జన్మించిన మెగా లిటిల్ ప్రిన్సెస్‌కి సినీ, రాజకీయ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అగ్ర హీరోలు, డైరెక్టర్లు, హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్లు.. ఇలా ప్రతి ఒక్కరూ రామ్‌చరణ్ దంపతులను విష్ చేశారు. దీంతో సోషల్ మీడియాల్లో ఫ్యాన్స్ హడావుడి చేసేస్తున్నారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి ట్విటర్‌లో మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.&nbsp; మెగా లిటిల్ ప్రిన్సెస్ ఆగమనాన్ని తెలియజేస్తూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. దీనికి రిప్లై ఇస్తూ ఓ నెటిజన్ వినూత్నంగా పార్టీ అడిగారు. వాల్తేరు వీరయ్య సినిమాలోని ‘బాస్ పార్టీ’ సాంగ్‌ని ట్యాగ్ చేసి ‘బాసూ పార్టీ ఎక్కడా’ అంటూ అడుగుతున్నారు.&nbsp; https://twitter.com/Nithish13771106/status/1671007811839623170 దాదాపు 11 ఏళ్ల నిరీక్షణ ఫలించిందంటూ మెగాస్టార్ ఎమోషనలయ్యారు. మెగా ఇంట అన్నీ శుభకార్యాలే జరుగుతున్నాయని, చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు. https://twitter.com/Hemanth_RcCult/status/1671006003612225536 లిటిల్ ప్రిన్సెస్ పుట్టిందని తెలియగానే చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎలా ఆనందపడ్డారో తెలుపుతూ మరో మీమ్ చేశారు.&nbsp; https://twitter.com/WeLoveMegastar/status/1671021787042447365 లయన్ కింగ్ సినిమాలో కూన సింహాన్ని రాజుగా ప్రకటించే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అలా రామ్‌చరణ్, ఉపాసన తమ కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేశారంటూ ఓ మీమ్ చేశారు. https://twitter.com/s_siechojithu/status/1670955824305569795 రామ్‌చరణ్, ఉపాసనల గారాల పట్టికి తన బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలిస్తే ఎలా ఆశ్చర్యపోతుందోనని చెబుతూ ఓ మీమ్ చేశారు. https://twitter.com/HereFoRamCharan/status/1671203912190406656 తన నాన్న అల్లూరి సీతారామరాజు, తాతా ఇంద్రసేనరెడ్డి, చిన్నతాత గబ్బర్ సింగ్, మామయ్య పుష్పరాజ్ అని తెలుసుకుని మురిసిపోతుంది. https://twitter.com/sunny5boy/status/1671039650897510400 మెగా ప్రిన్సెస్‌ని అరుంధతితో పోలుస్తూ చేసిన మీమ్ తెగ వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/always_dasari9/status/1670959463367598082 మనవరాలి రాకతో తాతయ్య చిరంజీవి ఎంతో సంబరపడుతున్నారు. ఇక చిట్టితల్లి పెంపకాన్ని దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత చిరుపై ఉంటుందని వివిధ మీమ్స్ షేర్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/BharathRCKajal/status/1671029533041111040 డ్యాన్స్ నేర్పించడం, ఫొటోలు, వీడియోలు క్యాప్చర్ చేస్తుండటం, ఉదయాన్నే నిద్ర లేపి వ్యాయామం చేపిస్తుండటం వంటి పనులు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. https://twitter.com/Hemanth_RcCult/status/1670954488969187328 ఇక లిటిల్ ప్రిన్సెస్‌ని స్కూళ్లో చేర్పించే సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించి ఓ మీమ్ చేశారు. జై చిరంజీవ సినిమాలో సీన్‌ని స్పూఫ్ చేశారు. ఇది వైరల్ అవుతోంది. https://twitter.com/PriyaRC_4/status/1671024958275997705 ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులు ఎంతో ఫేమస్. కానీ, ఇందులో ఓ విలన్ ‘జయ ఆంటీ తెలుసా నీకు, లల్లూ అంకుల్ తెలుసా నీకు.. వారంతా నా వెనకే ఉన్నారు’ అని అర్థం వచ్చేలా హిందీలో చెబుతాడు. దీనిని మెగా లిటిల్ ప్రిన్సెస్‌కి అన్వయించారు. మెగాస్టార్, పవర్ స్టార్, స్టైలిష్ స్టార్, మెగా పవర్ స్టార్.. ఇలా వీళ్లంతా నా వెనక ఉన్నారంటూ చెబుతున్న మీమ్ ఇది.&nbsp;&nbsp; https://twitter.com/vj_vijayawada/status/1671070004484386818 అల్లు అర్జున్ కుమారుడు అయాన్. ఇప్పుడు పుట్టిన లిటిల్ ప్రిన్సెస్‌కు వరుసకు బావ అవుతాడు. రామ్‌చరణ్, ఉపాసనకు కుమార్తె పుట్టడంతో అత్యంత ఆనందం పొందిన వ్యక్తి అయానే అంటూ మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.&nbsp; https://twitter.com/gnani0414/status/1670985319297212416 పుష్ప సినిమాలో ‘భలే య్యాపీగా ఉండాది కదరా నీకు’ అంటూ చెప్పే డైలాగ్ వైరల్ అవుతోంది. https://twitter.com/gnani0414/status/1671012059625168897 రామ్‌చరణ్‌కి ప్రత్యేక అభిమాని అయాన్. రంగస్థలం చిట్టిబాబు గెటప్ వేసి మామ మీద అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా మరదలు పుట్టాక మామయ్యతో అయాన్ చిట్ చాట్ ఇలా ఉంటుందని మీమ్ చేశారు. https://twitter.com/lokeshBangaram/status/1671441932294422529 మెగా ఫ్యామిలీ చిన్నదేం కాదు. ఎంతో మంది ఉంటారు. వారి మధ్యలో లిటిల్ ప్రిన్సెస్ చేరింది. దీంతో తనపై ప్రేమను ఎలా కురిపిస్తారో ఈ మీమ్ చూస్తే తెలిసిపోతుంది. https://twitter.com/s_siechojithu/status/1671026894760992770 నాయక్ సినిమాలో పోసాని కృష్ణమురళి కామెడీ హైలైట్. అందులో అధికారులు ఓ ల్యాప్‌టాప్‌లో ప్రాపర్టీస్ చూపించి మీవేనా? అని అడిగితే అన్నీ నావేనని ఒప్పుకుంటాడు. ఈ వీడియోను స్పూఫ్ చేశారు. https://twitter.com/KingLeo_007/status/1671348946755805191 చెర్రీకి పిల్లలంటే ఎంతో ఇష్టం. చిన్నపిల్లలు కనిపిస్తే చాలు చరణ్ పిల్లాడిలా మారిపోతాడు. వారితో ఎంతో ముచ్చటగా ఆడుకుంటాడు. ఇప్పుడు తనకే బిడ్డ పుట్టింది. మరి, ఏ రేంజ్‌లో ఫన్ ఉంటుందో ఊహించుకుంటేనే తెలిసిపోతుంది. https://twitter.com/Noori_NN/status/1671045618079506433
  జూన్ 21 , 2023
  బాలివుడ్‌ డైరెక్టర్‌పై రేప్‌ ఆరోపణలు..సౌత్‌ దర్శకులు,యాక్టర్లపై ప్రశంసలు కురిపించిన హీరోయిన్
  బాలివుడ్‌ డైరెక్టర్‌పై రేప్‌ ఆరోపణలు..సౌత్‌ దర్శకులు,యాక్టర్లపై ప్రశంసలు కురిపించిన హీరోయిన్
  బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ తనను రేప్ చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్‌ పాయల్ ఘోష్. ఈ క్రమంలో దక్షిణాది చిత్ర పరిశ్రమపై ప్రేమను కురిపించింది.&nbsp;సౌత్‌లో అవార్డులు గెలుచుకున్న ఇద్దరు దర్శకులతో పనిచేసినప్పటకీ కనీసం వాళ్లు టచ్‌ కూడా చేయలేదంటూ వెల్లడించింది. జూనియర్ ఎన్టీఆర్‌తో నటించానని… ఒక్కరోజు కూడా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని.. అందుకే సౌత్ ఇండస్ట్రీ అంటే తనకిష్టమంటూ పేర్కొంది ఈ సుందరి. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.&nbsp; మూడో మీటింగ్‌లోనే అనురాగ్ కశ్యప్‌ను టార్గెట్‌ చేసుకొని మీటూ వేదికగా విమర్శలు గుప్పించింది ఈ బెంగాల్ భామ. “ అసలు అతడితో కలిసి పనిచేయలేదు. కానీ, అతడు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మూడో మీటింగ్‌లోనే ఇలా జరిగింది. ఇలాంటి వాళ్లకు ఇంకా బాలీవుడ్‌లో పని దొరుకుతుండటం బాధాకరం” అన్నారు. ఒక్కసారిగా సంచలన వ్యాఖ్యలతో ట్రెండింగ్‌లోకి వచ్చిన పాయల్ ఘోష్ ఎవరనే విషయాన్ని వెతుకుతున్నారు చాలామంది. తారక్‌తో ఏ సినిమాలో నటించిందని ఆలోచిస్తున్నారు.&nbsp;&nbsp; ఎవరీ పాయల్‌ 17 సంవత్సరాల వయసులోనే&nbsp; నటనలోకి అడుగుపెట్టింది పాయలో ఘోష్. షార్ప్స్‌ పెరిల్‌ అనే బీబీసీ టెలిఫిల్మ్‌లో నటించి మెప్పించింది. తర్వాత కెనడియన్ చిత్రంలోనూ చేసింది. సినిమాల్లోకి వెళ్లడం ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకపోవటంతో కళాశాలలో చదువుతున్నప్పుడే పారిపోయి ముంబయి వచ్చింది పాయల్. నమిత్ కిషోర్ అకాడమీలో నటనపై మెళుకువలు నేర్చుకుంది. కశ్యపై కేసు గతంలోనే అనురాగ్‌ కశ్యప్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టింది ఈ హీరోయిన్. 2013లో ముంబయిలోని యారీ రోడ్‌లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని 2022 సెప్టెంబర్ 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటిి కశ్యప్ కొట్టి పారేశారు. పోలీసుల విచారణకు హాజరైన అతడు… ఆ సమయంలో శ్రీలంకలో షూటింగ్ చేస్తున్నట్లు ఆధారాలు కూడా సమర్పించాడు. కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నట్లు స్పష్టం చేశాడు.&nbsp; తెలుగులోకి ఎంట్రీ అకాడమీలో దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి పరిచయం కావటంతో ఆయన తెరకెక్కించిన ప్రయాణం చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. మంచు మనోజ్‌ ఇందులో హీరోగా నటించాడు. తర్వాత Mr. రాస్కెల్‌ సినిమాలో చేసింది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించిన ఊసరవెళ్లి సినిమాలో తమన్నా స్నేహితురాలిగా మెరిసింది ముద్దుగుమ్మ.&nbsp; రాజకీయ నాయకురాలు ప్రస్తుత కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలో 2020లో జాయిన్ అయ్యింది పాయల్‌. అదే రోజున మహిళల విభాగానికి ఉపాధ్యక్షురాలుగా నియమించారు.&nbsp; ‌అప్పట్నుంచి రాజకీయాల్లో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది ఈ అమ్మడు. ఇటీవల కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ ఇచ్చిన స్పీచ్‌పైన విమర్శలు చేసింది. విదేశాల్లో మన దేశం పరువు తీశాడని ఆరోపించింది. సినిమాలు ప్రస్తుతం రెండు సినిమాల్లో పాయల్ ఘోష్ నటిస్తుంది. పటేల్‌కి పంజాబ్‌ షాదీ, కోయి జానే నా అనే చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.&nbsp;
  మార్చి 19 , 2023
  PawanKalyan On Instagram: ఏ హీరోకి సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. అంతా ఫ్యాన్స్ వల్లే!
  PawanKalyan On Instagram: ఏ హీరోకి సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. అంతా ఫ్యాన్స్ వల్లే!
  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టారు. సింగిల్ పోస్ట్ లేకుండా కేవలం 20 నిమిషాల్లోనే 140K ఫాలోవర్లను పవన్ చేరుకోగా.. గంటలో 250K ఫాలోవర్లను క్రాస్ చేశారు. మరో 5 నిమిషాల్లోనే 300K మార్క్‌ను దాటారు. పవన్ కళ్యాణ్ ఫాలోవర్ల సంఖ్యలో పెరుగుదల జెట్ వేగంతో దూసుకెళ్తోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో నానా రచ్చచేస్తున్నారు. #PawanKalyanOnInstagram హ్యాష్ ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు. &nbsp;దేశంలో ఏ హీరోకు సాధ్యం కాని రికార్డును క్రియేట్ చేయాలని ట్వీట్ల జడివాన కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ షేర్ చేయాలని ఇతర అభిమానులకు ట్యాగ్ చేస్తున్నారు.&nbsp; ఈరోజు&nbsp; #PawanKalyanOnInstagram ట్యాగ్‌ను సోషల్ మీడియాలో నంబర్ 1 గా నిలపాలని పవన్ డైహర్టెడ్ ఫ్యాన్స్.. అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు. https://twitter.com/_jspnaveen/status/1676106458516127747?s=20 ప్రజలకు మరింత అందుబాటులోకి ఉండేందుకు పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెడుతున్నట్లు ఇటీవల నాగబాబు తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రొఫైల్ నోట్ చాలా సింపుల్‌గా ఎఫెక్టివ్‌గా ఉంది. ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో, జైహింద్ అనే ట్యాగ్ లైన్‌ను పవన్‌ తన అకౌంట్‌కు జత చేశారు.&nbsp; ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవర్ స్టార్ అభిమానులకు, యువతకు నిత్యం అందుబాటులో ఉండేందుకు ఈ మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ట్విట్టర్, తన అధికారిక వెబ్‌సైట్ (https://janasenaparty.org/) ద్వారా తన పార్టీ అభిప్రాయాలను పవర్ స్టార్ పంచుకుంటున్నారు. https://twitter.com/_jspnaveen/status/1676108997869588480?s=20 అందుకేనా ఇన్‌స్టా? ఏపీలో మరో 8 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో జనసేనాని సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సోషల్ మీడియా ప్రచారంలో వెనకపడొద్దని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్, ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు. సనిశితమైన సమస్యలపై ప్రశ్నిస్తూ యువత ద్వారా సమాధానాలు రప్పిస్తూ విలైనంత ఎక్కువ మందికి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని పవన్ ఆలోచిస్తున్నారు. వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వం తనదైన శైలీలో వాగ్బాణాలతో విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. గతానికంటే భిన్నంగా తన ప్రచార పర్వాన్ని మార్చివేశారు. తన అభిమానులతో పాటు టాలీవుడ్‌లో ఇతర అగ్ర హీరోలైన ప్రభాస్, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు దగ్గరయ్యేందుకు వ్యూహాత్మంగా వ్యవహరిస్తున్నారు. కులాల ప్రస్తావనకు తావులేకుండా తాను అందరివాడినంటూ యువతకు దగ్గరయ్యేందుకు తన టెంపోను మార్చుకున్నారు.&nbsp; జులై&nbsp; 'బ్రో' నెల మరోవైపు పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించిన 'బ్రో' మూవీ ఈనెల 28న విడుదల కానుంది.&nbsp; చిత్ర యూనిట్ బ్రో ప్రమోషన్లలో బిజీగా ఉంది. అభిమానులు జులై నెలను 'బ్రో' నెలగా ప్రకటించి ఉత్సాహంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విలక్షణ నటుడు సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నారు. 'బ్రో' సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా, సాయిధరమ్ కామన్ మ్యాన్‌గా నటిస్తున్నారు. ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించాడు.&nbsp; పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను నిర్మించింది. అటు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్‌ షూటింగ్‌ను ప్రారంభించింది.&nbsp; పవన్-హరీష్ కాంబోలో గబ్బర్ సింగ్ హిట్‌ కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.&nbsp; క్రిష్ డెరెక్షన్‌లో వస్తున్న హరిహరవీరమల్లు చిత్రం నుంచి మాత్రం ఎలాంటి అప్‌డేట్ లేదు. ఏఎం రత్నం నిర్మిస్తున్న సినిమా షూటింగ్ కొద్దిరోజులుగా ఆగిపోయింది. అలాగే యంగ్ డైరెక్టర్ సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న OG సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.&nbsp; నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసింది. బ్రో సినిమా తర్వాత OG మూవీనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.&nbsp;
  జూలై 04 , 2023
  Tollywood Cult&nbsp; Movies: శివ To దసరా.. తెలుగు ప్రేక్షకుడ్ని మీసం మెలేసేలా చేసిన సినిమాలు ఇవే!&nbsp;
  Tollywood Cult&nbsp; Movies: శివ To దసరా.. తెలుగు ప్రేక్షకుడ్ని మీసం మెలేసేలా చేసిన సినిమాలు ఇవే!&nbsp;
  ఒకప్పుడు టాలీవుడ్‌ అంటే దేశంలోని సినీ ఇండస్ట్రీలలో ఒకటిగా ఉండేది. తెలుగు సినిమాలంటే&nbsp;నార్త్‌ ఇండియన్స్‌ పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. మన డైరెక్టర్లు కూడా కేవలం సరిహద్దులు గీసుకొని కేవలం తెలుగు ఆడియన్స్‌ కోసమే సినిమా రిలీజ్‌ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జాతీయ అవార్డు ఫంక్షన్లకు ఆహ్వానం లభించని స్టేజీ నుంచి ఆస్కార్‌ వేడుకల్లో పాల్గొనే స్థాయికి మన డైరెక్టర్లు ఎదిగారు. అంతర్జాతీయ బహుమతులను దేశానికి అందిస్తూ ప్రతీ ఒక్కరినీ గర్వపడేలా చేస్తున్నారు. ఇదిలా ఉంటే 1990 నుంచి ఇవాళ్టి దసరా వరకూ ఎన్నో కల్ట్‌ సినిమాలు టాలీవుడ్‌ గతిని మార్చాయి. తెలుగు ఇండస్ట్రీని రేంజ్‌ను ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉన్నాయి. కల్ట్ మూవీ అంటే? కల్ట్ మూవీకి పర్యాయ పదంగా ట్రెండ్ సెట్టర్ సినిమా అని కూడా సినీ విశ్లేషకులు పిలుస్తారు. విభిన్న కథాంశం. విడుదలయ్యాక ఆ మూవీ పెద్దఎత్తున ఫ్యాన్ బేస్ సంపాదించడం, ఆ చిత్రం పంథాను కొన్నేళ్లపాటు మరికొన్ని సినిమాలు అనుసరించి రావడం, ఆ సినిమా డైలాగ్స్.. ఇప్పటికీ జనాల నాలుకలపై నానడం వంటి లక్షణాలు కలిగి ఉండాలి. అలాగే బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున కలెక్షన్ల వర్షం కురిపించే సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. 90వ దశకం నుంచి యాక్షన్ కల్ట్ మూవీలు శివ(1989) ఎలాంటి అంచనాలు లేకుండా 1989లో రిలీజైన 'శివ' మూవీ ఇండస్ట్రీ కల్ట్ గా నిలిచింది. అప్పటి వరకు సామాజిక ఆర్థిక అంశాలే ప్రధానం రూపొందిన చిత్రాల పంథాను ఒక్కసారిగా మార్చింది. పక్క యాక్షన్ మూవీగా తెరకెక్కిన శివ నాగార్జునకు స్టార్ డామ్ తెచ్చిపెట్టింది. ఆయన కెరీర్ గ్రాఫ్‌ను అమాంతం పెంచేసింది. నాగార్జున పట్ల యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సైకిల్ చైన్ లాగే మెనరిజాన్ని అప్పట్లో యూత్ పిచ్చిగా ఫాలో అయ్యేవారు. ఈ సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మతో మూవీలు చేసేందుకు స్టార్ హీరోలు క్యూ కట్టారు. అంతే కాదు శివ యాక్షన్ సిక్వెన్స్‌ను అనుసరిస్తూ చాలా చిత్రాలు వచ్చాయి. గాయం(1993) 1993లో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లోనే&nbsp; వచ్చిన 'గాయం' సైతం మంచి యాక్షన్ కల్ట్‌ గా నిలిచింది. ఈ మూవీని యార్లగడ్డ సురేంద్ర నిర్మించారు. అప్పటి వరకు ఫ్యామిలీ హీరోగా పెరొందిన జగపతి బాబు ఈ సినిమాతో ఒక్కసారిగా మాస్ లుక్ లోకి మారిపోయారు. దుర్గ క్యారెక్టర్ లో ఒదిగిపోయారు. జగపతి బాబు సరసన రేవతి, కోటా శ్రీనివాస్ రావు, సిరివెన్నెల సితారామశాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీలోని 'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని' అనే పాట ఎంత ప్రజాదరణ పొందిందో అందరికి తెలిసిందే. భారతీయుడు(1996) శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన భారతీయుడు ఆల్ టైమ్ యాక్షన్ కల్ట్ చిత్రంగా పేరొందింది. రొటీన్ మూవీలకు భిన్నంగా అవినీతికి వ్యతిరేకంగా సరికొత్త కథాంశంతో శంకర్ తెరకెక్కించాడు. సేనాపతి పాత్రలో కమల్ హాసన్ అద్భుతంగా నటించాడు. ఈ మూవీ తర్వాత ఇదే తరహా కథాంశాలతో వచ్చిన రమణ, ఠాగూర్, మల్లన్న చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ఈ చిత్రంలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్‌లో మెప్పించాడు. మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందించాడు. సమరసింహా రెడ్డి(1999) నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 'సమరసింహా రెడ్డి(1999), నరసింహా నాయుడు(2001) యాక్షన్ ఎంటర్ టైన్మెంట్‌కు కొత్త నిర్వచనం అందించాయి. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ చిత్రాల్ని డెరెక్టర్ బీ గోపాల్ అద్భుతంగా తెరకెక్కించాడు. పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగ్స్&nbsp; బాగా పేలాయి. ఈ చిత్రాల్లో బాలయ్య డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పించేలా చేసింది. ఈ రెండు సినిమాలను అనుకరిస్తూ వచ్చిన చాలా చిత్రాలు వచ్చాయి. ఫాక్షనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన ఇంద్ర, ఆది, యజ్ఞం మూవీలు హిట్ కొట్టాయి. పోకిరి(2006) తెలుగులో వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ కల్ట్ మూవీ పోకిరి(2006). అప్పటివరకు తెలుగు తెరకు పరిచయం లేని గ్యాంగ్ స్టర్ స్టోరీ లైన్ తో పూరి ముందుకొచ్చాడు. పోకిరి దెబ్బకు అన్ని రికార్డులు దాసోహం అయ్యాయి. హీరో మేనరిజం, డెలాగ్స్, చిత్రీకరణ విలువలు, మణిశర్మ మ్యూజిక్&nbsp; ప్రతి ఒక్కటీ వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుకు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. టాలీవుడ్ లో వచ్చిన చాలా సినిమాలు పోకిరి యాక్షన్ సిక్వెన్స్ ను ఫాలో అయ్యాయి.&nbsp;&nbsp;&nbsp; మగధీర(2009) రాజమౌళి డైరెక్ట్ చేసిన మగధీర క్లాసిక్ కల్ట్ గా చరిత్ర సృష్టించింది. అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను మగధీర బ్రేక్ చేసింది. పూర్వ జన్మ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ చాల ఏళ్ల తర్వాత మళ్లీ పౌరాణిక వాసనను తెలుగు తెరకు గుర్తు చేసింది. కత్తులు, యుద్ధం వంటి యాక్షన్ డ్రామాతో ఆకట్టుకుంది. ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు మంచి బ్రెక్ ఇచ్చింది. నటించిన రెండో సినిమాతోనే చరణ్ కు స్టార్ హోదా దక్కింది. ఈ చిత్రం పోలికలతో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఆశించినంత విజయం సాధించలేదు.&nbsp;&nbsp; అర్జున్ రెడ్డి(2017) కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి డెరెక్ట్ చేసిన 'అర్జున్ రెడ్డి(2017)' టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. వివాదాల మధ్య విడుదలైన ఈ చిత్రం పెద్దఎ త్తున ఫ్యాన్ బేస్ సంపాదించింది.&nbsp; విజయ్ దేవరకొండ కేరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఊహించని సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాను హిందీ, తమిళ్ ఇండస్ట్రీల్లో రీమేక్ చేశారు. యూత్ లో ఫుల్ జోష్ ను నింపింది. అర్జున్ రెడ్డిగా నటించిన విజయ్ ని రౌడీ బాయ్ అంటూ అభిమానులు పిలవడం మొదలు పెట్టారు. బాహుబలి-2(2017) రాజమౌళి తెరకెక్కించిన అద్భుత కావ్యం 'బాహుబలి-2(2017)' భారత చలనచిత్ర గతినే మార్చింది. అన్ని భాషలను ఏకం చేసి పాన్ ఇండియా ఇమేజ్ ను క్రియేట్ చేసింది. ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది. అప్పటి వరకు హాలీవుడ్ చిత్రాల్లోనే సాధ్యమనుకునే&nbsp; భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసింది. భారత చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన దంగల్ రికార్డును బ్రేక్ చేసింది. బాక్సాఫీస్ రికార్డులే కాదు సౌత్ సినిమాలను పెద్దగా ఆదరించని నార్త్ ఆడియన్స్ మనసులను సైతం కొల్లగొట్టింది. సౌత్, నార్త్ కాదు మన సినిమా ఇండియన్ సినిమా అనే స్థాయికి ఇండస్ట్రీ వర్గాలను తీసుకొచ్చింది. ఈ మూవీ తర్వాత పలువురు బాలీవుడ్ డైరెక్టర్లు పాన్ ఇండియా మూవీలు తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రంగస్థలం (2018) ఒకేరకమైన కథలతో వెళ్తున్న టాలీవుడ్‌కు రంగస్థలం సినిమా కొత్త మార్గాన్ని చూపించింది. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా పక్కా పల్లెటూరు కథతోనూ హిట్‌ కొట్టొచ్చని డైరెక్టర్ సుకుమార్‌ ఈ తరం దర్శకులకు చూపించారు. ఇందులో రామ్‌ చరణ్, సమంత నటన మూవీకే హైలెట్‌ అని చెప్పాలి. రామ్‌చరణ్‌లోని కొత్త నటుడ్ని ఈ సినిమా ఆవిష్కరించింది. ఈ సినిమా స్ఫూర్తితో ప్రస్తుతం చాలా మంది దర్శకులు పల్లెటూరి కథలో దృష్టిసారిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో షేక్‌ చేస్తున్న దసరా, బలగం సినిమాలకు ఈ సినిమానే స్ఫూర్తి అని చెప్పొచ్చు.&nbsp; పుష్ప(2022) పాన్ ఇండియా మూవీగా వచ్చిన 'పుష్ప' భారీ విజయాన్ని సాధించింది. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ&nbsp; అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గేస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా డైలాగులను రాజకీయ నాయకులు మొదలు క్రికెటర్లు, WWE స్టార్ల వరకు వల్లవేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అయితే.. రాజకీయ నాయకులు 'తగ్గేదేలే'.. 'ఏ బిడ్డా ఇది నా అడ్డా' అంటూ ప్రత్యర్థి పార్టీ నేతలకు కౌంటర్ ఇచ్చే వరకు వెళ్లింది. ఆర్‌ఆర్‌ఆర్‌ (2022) దర్శకధీరుడు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ద్వారా తెలుగు సినిమా ఖ్యాతిని అమాంతం పెంచేశాడు. టాలీవుడ్‌ శక్తి సామర్థ్యాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. ఈ సినిమాలో నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్‌ అవార్డును సాధించింది. తద్వారా భారతీయుల హృదయాలను ఉప్పొంగేలా చేసింది. ఒకప్పుడు జాతీయ అవార్డులు రావడమే గగనంగా ఉన్న పరిస్థితి నుంచి తెలుగు సినిమా ఆస్కార్‌ స్థాయికి ఎదిగింది. కథానాయకులు రామ్‌చరణ్‌, ఎన్‌టీఆర్‌లు కూడా RRRలో ఎంతో అద్భుతంగా నటించారు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు.&nbsp; బలగం (2023) సరైన కంటెంట్‌తో వస్తే చిన్న సినిమా అయిన ఘనవిజయం సాధిస్తుందని బలగం సినిమా నిరూపించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రిలీజ్‌ తర్వాత ప్రభంజనే సృష్టించింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రేమానురాగాలను డైరెక్టర్‌ వేణు చక్కగా చూపించాడు. పక్కా పల్లెటూరు నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.&nbsp; దసరా (2023) టాలీవుడ్‌ రేంజ్‌ను దసరా చిత్రం మరింత పెంచింది. దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తన తొలి సినిమాతోనే రూ.100 కోట్ల మార్క్‌ అందుకున్నాడు. ఈ సినిమా కూడా పల్లెటూరు కథాంశంతో తెరకెక్కి పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందింది. ముఖ్యంగా హీరో నాని ఈ సినిమా తన నటా విశ్వరూపమే చూపించాడు. ఇప్పటివరకూ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఊరమాస్‌గా ఇరగదీశాడు. హీరోయిన్‌ కీర్తి సురేష్‌ కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. మహానటి తర్వాత కీర్తి అత్యుత్తమ నటనను ఈ సినిమాలో చూడొచ్చు.
  ఏప్రిల్ 12 , 2023
  Adipurush: ఆదిపురుష్‌కు అదిరిపోయే ఓపెనింగ్స్‌… ప్రమాదంలో బాహుబలి-2, RRR రికార్డ్స్‌?
  Adipurush: ఆదిపురుష్‌కు అదిరిపోయే ఓపెనింగ్స్‌… ప్రమాదంలో బాహుబలి-2, RRR రికార్డ్స్‌?
  ఆదిపురుష్ మూవీ గ్రాండ్‌గా విడుదలైంది. వరల్డ్‌వైడ్‌గా ఐదు భాషల్లో రిలీజైంది. ఈ నేపథ్యంలో ట్రేడ్ పండితుల దృష్టి ఈ సినిమా కలెక్షన్లపై పడింది. తొలి రోజు ఆదిపురుష్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందా? అన్న ఆసక్తి మొదలైంది. మునపటి సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ట్రేడ్ పండితుల అంచనాల ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు భారీగా వసూళ్లు సాధించనున్నట్లు తెలుస్తోంది. మరి, ఇండస్ట్రీలో ఇది వరకు భారీ ఓపెనింగ్స్‌ని రాబట్టిన సినిమాలేంటి? ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు ఎన్ని కోట్ల వసూళ్లను సాధించాయి? అనే అంశాలను తెలుసుకుందాం.&nbsp; బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రంగా ‘బాహుబలి2’ అగ్రస్థానంలో ఉంది. ఈ సినిమా ఏకంగా రూ.217 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఓవరాల్‌గా బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్ల వసూళ్లను సాధించింది. ఎస్.ఎస్. రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌ నిర్మించింది.&nbsp; కేజీఎఫ్ 2 కన్నడ నాట పెను సంచలనం రేపిన సినిమా కేజీఎఫ్. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో సెకండ్ పార్ట్‌పై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే కేజీఎఫ్2 సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు ఈ సినిమా రూ.164 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ పండితుల అంచనా. సంజయ్ దత్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓవరాల్‌గా రూ.1300 కోట్లు రాబట్టినట్లు సమాచారం.&nbsp; ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డును గెలుచుకున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్లలోనూ దూసుకెళ్లింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించడం, బాహుబలి తర్వాత జక్కన్న చేసిన సినిమా కావడంతో బీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.158 కోట్లను కలెక్ట్ చేసింది. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా ఓవరాల్‌గా రూ.1200 కోట్ల వసూళ్లను సాధించింది.&nbsp; సాహో బాహుబలి-2 సినిమాతో హీరో ప్రభాస్ మార్కెట్ విశ్వవ్యాప్తమైంది. దీంతో బాహుబలి తర్వాత వచ్చిన సాహో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇందుకు అనుగుణంగానే తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.130 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు మందగించాయి. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.190 కోట్లు కలెక్ట్ చేసింది.&nbsp; పఠాన్ బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రం బిగ్ హిట్ అయింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు రూ.106 కోట్లను రాబట్టింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో వసూళ్లలో దూసుకెళ్లింది. ఓవరాల్‌గా పఠాన్ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 2023లో బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.&nbsp; రోబో 2.0 రజినీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ కాంబోలో వచ్చిన చిత్రం రోబో 2.0. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు రూ.106 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను సాధించింది. కానీ, అన్ని రకాల ప్రేక్షకులను మెప్పించడంలో సినిమా విఫలమైంది. దీంతో ఓవరాల్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది.&nbsp;
  జూన్ 16 , 2023
  Pushpa 3: నో డౌట్‌.. ‘పుష్ప 3’ సినిమా పక్కా.. మైండ్‌ బ్లోయింగ్ అప్‌డేట్స్‌ మీకోసం!
  Pushpa 3: నో డౌట్‌.. ‘పుష్ప 3’ సినిమా పక్కా.. మైండ్‌ బ్లోయింగ్ అప్‌డేట్స్‌ మీకోసం!
  సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2). భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా వచ్చిన ‘పుష్ప’ (Pushpa) ఏ స్థాయి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. దీంతో దీనికి సీక్వెల్‌గా వస్తోన్న ‘పుష్ప 2’ అందరి దృష్టి పడింది. అయితే సినిమాకు కొనసాగింపుగా ‘పార్ట్‌ 3’ (Pushpa 3) కూడా ఉండొచ్చని ఇటీవలే బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాటిని నిజం చేస్తూ తాజాగా ‘పుష్ప 3’పై సాలిడ్‌ అప్‌డేట్‌ బయటకొచ్చింది.&nbsp; వచ్చే ఏడాది సమ్మర్‌లో.. ఈ ఏడాది ఆగస్టు 15న 'పుష్ప 2' విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో డే అండ్‌ నైట్‌ షూటింగ్‌ చేస్తూ పుష్ప టీమ్‌ బిజీ బిజీగా గడుపుతోంది. అయితే తాజా బజ్‌ ప్రకారం.. 'పుష్ప 3'కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా డైరెక్టర్‌ సుకుమార్‌ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. 'పుష్ప 3' లో వచ్చే సీన్లకు ప్రస్తుత షూటింగ్‌ లోకేషన్స్‌ సరిగ్గా సరిపోతాయని భావించి ఈ షూట్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇక ‘పుష్ప 3’ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ చేసే యోచనలో సుకుమార్‌ టీమ్ ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.&nbsp; జాన్వీ కపూర్‌తో ఐటెం సాంగ్‌! ‘పుష్ప’ సినిమాలో సమంత చేసిన ‘ఊ అంటావా.. ఉ ఊ అంటావా’ ఐటెం సాంగ్‌ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే ‘పుష్ప 2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ పెట్టాలని డైరెక్టర్‌ సుకుమార్‌ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం బాలీవుడ్ హీరోయిన్‌ దిశా పటాని (Disha Patani) ఎంపికచేసినట్లు మెున్నటి వరకూ వార్తలు వచ్చాయి. అయితే తాజా బజ్‌ ప్రకారం.. జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) పేరును ఐటెం సాంగ్‌ కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి పార్టులో కన్నాపెద్దగా ఈ రెండో పార్టులో ఈ ఐటెం సొంగ్ ఉండాలని చిత్ర నిర్వాహకులు, దర్శకుడు భావిస్తున్నారట. కాబట్టి జాన్వీ కపూర్‌కు ఉన్న ఫేమ్‌ దృష్ట్యా ఆమె అయితేనే సరిగ్గా ఉంటుందని పుష్ప టీమ్ అభిప్రాయపడుతోందట. మరి జాన్వీ కపూర్ ఈ ఐటెం సాంగ్ చెయ్యడానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.&nbsp; ‘పుష్ప 3’పై బన్నీ ఏమన్నాడంటే! ఇటీవల జర్మనీలో జరిగిన ప్రతిష్టాత్మక ‘బెర్లిన్‌ యూరోపియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో అల్లు అర్జున్ పాల్గొన్న సంగతి తెలిసిందే. అక్కడ ‘పుష్ప 3’ సినిమా గురించి తొలిసారి బన్నీ మాట్లాడాడు. పార్ట్‌-3కి అన్నీ అనుకూలంగా ఉంటే తీసే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు. కథను కొనసాగించాలని అనుకుంటున్నామని, తెరకెక్కించేందుకు అద్భుతమైన ఆలోచనలు కూడా ఉన్నాయని చెప్పాడు. మరోవైపు మొదటి భాగంతో పోలిస్తే ‘పుష్ప 2’లో పాత్రలు, వాటి మధ్య సంఘర్షణ మరింత బలంగా ఉంటాయని బన్నీ తెలిపాడు. ముఖ్యంగా పుష్పరాజ్‌, భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ల క్యారెక్టరైజేషన్‌, తెరపై వాటి ఎగ్జిక్యూషన్‌, వారికి ఎదురయ్యే పరిస్థితులు థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయని వివరించాడు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో వైరల్‌గా మారాయి.&nbsp; బన్నీ నా రోల్‌ మోడల్‌: సమంత ఇదిలాఉంటే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌పై స్టార్‌ హీరోయిన్‌ సమంత తాజాగా ప్రశంసల వర్షం కురిపించింది. తమిళనాడులోని వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన కల్చరల్ కార్నివాల్‌లో పాల్గొన్న సమంత అక్కడ బన్నీ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించింది. అల్లు అర్జున్ తన యాక్టింగ్ రోల్ మోడల్ అంటూ ఆకాశానికెత్తింది. ‘బన్నీ ఓ పవర్ హౌజ్ పర్ఫార్మర్‌గా మారాడు. అతని నుంచి నేర్చుకోవడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తాను’ అని సమంత చెప్పింది. కాగా గతంలో వీరిద్దరూ సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో నటించిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఈ సినిమా వచ్చింది.&nbsp;
  మార్చి 07 , 2024
  Tollywood Disaster Sequels: భారీ అంచనాలతో వచ్చి చతికలపడ్డ టాప్ 13 సీక్వెల్‌ చిత్రాలు ఇవే!
  Tollywood Disaster Sequels: భారీ అంచనాలతో వచ్చి చతికలపడ్డ టాప్ 13 సీక్వెల్‌ చిత్రాలు ఇవే!
  గత దశాబ్దాల కాలంలో తెలుగులో ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు వచ్చాయి. వీటిలో కొన్నింటికి సీక్వెల్స్‌ సైతం ప్రేక్షకులను పలకరించాయి. అయితే తొలి భాగంతో పోలిస్తే (Tollywood Disaster Sequels) సెకండ్‌ పార్ట్‌ ఆడియన్స్‌ పెద్దగా ఆకట్టుకులేకపోయాయి. తొలి సినిమా మానియాను కొనసాగించడంలో విఫలమయ్యాయి. ఎన్నో అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? అందులో నటించిన స్టార్‌ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; మనీ మనీ మోర్‌ మనీ&nbsp; జేడీ చక్రవర్తి హీరోగా చేసిన మనీ మూవీ సిరీస్‌లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. మనీ (1993), మనీ మనీ (1994) పేరుతో వచ్చిన ఆ చిత్రాలు మంచి హిట్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే ఆ చిత్రాలకు కొనసాగింపుగా 2011లో వచ్చిన ‘మనీ మనీ మోర్‌ మనీ’ (Money Money More Money) మాత్రం ఆడియన్స్‌ను తీవ్రంగా నిరాశ పరిచింది. బాక్సాఫీస్‌ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసింది.&nbsp; Money Money More Money Wallpapers శంకర్‌దాదా జిందాబాద్‌ మెగాస్టార్‌ చిరంజీవి నటించిన సూపర్‌ హిట్‌ సినిమాల్లో శంకర్‌దాదా M.B.B.S ఒకటి. 2004లో విడుదలైన ఆ&nbsp; చిత్రం చిరుకి మంచి పేరు తీసుకొచ్చింది. అంతేగాక కాసుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో దీనికి కొనసాగింపుగా ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ (Shankar Dada Zindabad) తెరకెక్కించారు. డిఫరెంట్‌ స్టోరీతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. కిక్‌&nbsp; 2 రవితేజ కెరీర్‌లోని టాప్‌-5 హిట్‌ చిత్రాల్లో ‘కిక్‌’ (Kick Movie) సినిమా కచ్చితంగా ఉంటుంది. 2009లో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ అందుకుంది. ఈ నేపథ్యంలో దీనికి సీక్వెల్‌గా 2015లో ’కిక్‌-2’ (Kick 2)వచ్చింది. అయితే సినిమా ఆశించిన మేర విజయాన్ని అందుకోలేకపోయింది. రవితేజ ఫ్లాపు చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది.&nbsp; సర్దార్ గబ్బర్ సింగ్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కిన ‘గబ్బర్‌ సింగ్‌’ (Gabbar Singh) చిత్రం ఎంత పెద్ద బ్లాక్‌ బాస్టర్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ఎన్నో అంచనాలతో వచ్చిన ‘సర్ధార్‌ గబ్బర్‌ సింగ్‌’ (Sardaar Gabbar Singh) మాత్రం ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. 2016లో వచ్చిన ఈ చిత్రం.. పవన్‌ డిజాస్టర్‌ చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది. మన్మథుడు 2 అక్కినేని నాగార్జున హీరోగా చేసిన ఎవర్‌గ్రీన్ చిత్రాల్లో ‘మన్మథుడు’ (Manmadhudu) ఒకటి. ఈ సినిమాను ఇప్పటికీ చాలామంది చూస్తుంటారు. ఇందులో నాగార్జున కామెడీ టైమింగ్‌ను, బ్రహ్మీ కాంబినేషన్‌లో వచ్చే సీన్లను ఎంజాయ్‌ చేస్తుంటారు. అయితే ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ‘మన్మథుడు 2’ (Manmadhudu 2) మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దారుణంగా విఫలైంది.&nbsp; గాయం 2 1993లో జగపతి బాబు హీరోగా రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం (Gayam) చిత్రం బ్లాక్‌ బాస్టర్‌గా నిలిచింది. ఆరు నంది అవార్డులను సైతం కొల్లగొట్టింది. అటువంటి ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన గాయం-2 (Gayam 2) మాత్రం బాక్సాఫీస్‌ వద్ద చతికలపడింది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. 2010లో వచ్చిన ఈ సీక్వెల్‌ చిత్రానికి ప్రవీణ్‌ శ్రీ దర్శకత్వం వహించారు.&nbsp; ఆర్య-2&nbsp; అల్లు అర్జున్‌ (Allu Arjun), సుకుమార్‌ (Sukumar) కాంబోలో వచ్చిన మెుట్టమెుదటి చిత్రం ‘ఆర్య’ (Arya Movie). ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. బన్నీతో పాటు సుకుమార్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘ఆర్య 2’ (Arya 2) అదే స్థాయిలో మెప్పించలేకపోయింది. మోస్టరు టాక్‌ మాత్రమే తెచ్చుకుంది.&nbsp; చంద్రముఖి 2 &amp; నాగవల్లి తెలుగులో వచ్చిన టాప్‌-5 హారర్‌ చిత్రాల్లో రజనీకాంత్‌ హీరోగా ‘చంద్రముఖి’ కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమా అప్పట్లో విపరీతంగా భయపెట్టింది. చంద్రముఖి (Chandramukhi) పాత్రలో జ్యోతిక అదరగొట్టింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన చంద్రముఖి 2 (Chandramukhi 2), నాగవల్లి (Nagavalli) చిత్రాలు మాత్రం తీవ్రంగా నిరాశపరిచాయి. నాగవల్లిలో వెంకటేష్‌ లీడ్‌ రోల్‌లో నటించగా.. చంద్రముఖి 2లో రాఘవ లారెన్స్‌ చేశాడు.&nbsp; రోబో 2 రజనీకాంత్‌ హీరోగా డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కించిన ‘రోబో’ (Robo) చిత్రం.. 2010లో ఏ స్థాయి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన గ్రాఫిక్స్‌ మాయజాలంతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కనక వర్షాన్ని కురిపించింది. దీనికి అనుసంధానంగా 2018లో రిలీజైన ‘రోబో 2’ (Robo 2) అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ విలన్‌ పాత్రలో కనిపించాడు.&nbsp; సత్య 2 రామ్‌గోపాల్‌ వర్మను బాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌గా చేసిన చిత్రం ‘సత్య’ (Sathya). ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన సత్య-2 (Sathya 2)మాత్రం ఆ స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇందులో శర్వానంద్‌ హీరోగా నటించాడు. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించాడు.&nbsp; వెన్నెల 1/2&nbsp; రాజా హీరోగా దేవకట్టా దర్శకత్వంలో వచ్చిన 'వెన్నెల' (Vennela) చిత్రం.. 2005లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారానే వెన్నెల కిషోర్‌ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అయితే ఏడేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన 'వెన్నెల 1/2' (Vennela 1/2) దారుణంగా పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఈ సినిమాకు వెన్నెల కిషోర్‌ దర్శకత్వం వహించడం విశేషం. అవును 2 విభిన్నమైన హారర్‌ కథాంశంతో వచ్చిన ‘అవును’ (Avunu).. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. డైరెక్టర్‌గా రవిబాబుకు మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘అవును 2’ (Avunu 2)&nbsp; మాత్రం బాక్సాఫీస్‌ వద్ద చతికిల పడింది.&nbsp; మంత్ర 2 కథానాయిక చార్మి చేసిన మరుపురాని చిత్రాల్లో ‘మంత్ర’ (Mantra). హారర్‌ &amp; సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం మ్యాసివ్ విజయాన్ని అందుకుంది. 2007లో వచ్చిన ఈ చిత్రానికి ఓషో తులసి రామ్‌ దర్శకత్వం వహించాడు. అయితే దీనికి అనుసంధానంగా వచ్చిన ‘మంత్ర 2’ (Mantra 2) మాత్రం చార్మి ఆశలను అడియాశలు చేసింది.&nbsp;
  ఫిబ్రవరి 22 , 2024
  Pushpa The Rule : 20 సెకన్లలో పుష్ప 2 కథ ఏంటో చెప్పేసిన సుకుమార్‌..!
  Pushpa The Rule : 20 సెకన్లలో పుష్ప 2 కథ ఏంటో చెప్పేసిన సుకుమార్‌..!
  సుకుమార్‌ డైరెక్షన్‌లో అల్లుఅర్జున్‌ హీరోగా తెరకెక్కిన పుష్ప చిత్రం పాన్‌ ఇండియా రేంజ్‌లో ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో బన్నీ చేసిన అద్భుత నటనకు బాలీవుడ్‌ ఆడియన్స్‌ సైతం ఫ్యాన్స్‌గా మారిపోయారు. ఎర్ర చందనం చుట్టూ తిరిగే ఈ సినిమాను సుకుమార్ అద్భుతంగా తెరకెక్కించాడు. కూలి స్థాయి నుంచి ఎర్రచందనం సిండికేట్‌ నాయకుడిగా బన్నీ ఎదిగిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. క్లైమాక్స్‌లో పోలీసు ఆఫీసర్‌ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌కు అదిరిపోయే రేంజ్‌లో బన్నీ వార్నింగ్‌ ఇవ్వడంతో తొలి పార్ట్‌ ముగుస్తుంది.&nbsp; పుష్ప తొలి పార్ట్‌ను చాలా ప్రశ్నలతోనే సుకుమార్‌ ముగించాడు. ఆ ప్రశ్నలకు సమాధానం కావాలంటే రెండో పార్ట్‌ చూడాల్సిందే అన్న ఆసక్తిని సగటు ప్రేక్షకుడి కలిగించాడు. దీంతో పుష్ప 2 కథను ఎవరికి నచ్చినట్లు వారు ఊహించేసుకున్నారు. కేజీఎఫ్‌-2 లాగా పుష్ప సెకండ్‌ పార్ట్‌ ఉంటుందని జోస్యం చెప్పడం ప్రారంభించారు. వీటన్నింటికిి సుకుమార్‌ చెక్‌ పెట్టే ప్రయత్నం చేశాడు. పుష్ప 2కు సంబంధించిన 20 సెకన్ల వీడియోను విడుదల చేసి సినిమా కథను చెప్పకనే చెప్పేశాడు.&nbsp; https://youtu.be/JG-u9rNLq50 ఆసక్తికరంగా గ్లింప్స్ చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసిన టీజర్‌ను బట్టి… హీరో పుష్ప(అల్లుఅర్జున్‌) పై పోలీసు ఆఫీసర్‌ భన్వర్‌ సింగ్ షెకావత్‌ రివేంజ్‌ తీర్చుకున్నట్లు తెలుస్తోంది. పుష్పను అరెస్టు చేసి తిరుపతి జైలులో బంధించినట్లు కనిపిస్తోంది. పుష్ప జైలు నుంచి తప్పుకోవడం ఆసక్తిరేపుతోంది. దీంతో పుష్ప మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతారు. పోలీసులు డౌన్‌ డౌన్ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తారు. అసలు పుష్ప ఎక్కడ?. అంటూ 20 సెకన్లలో ముగుస్తుంది. దీనికి కొనసాగింపుగా మరింత సమాచారం కావాలంటే ఏప్రిల్‌ 7th&nbsp; సా. 4.05 ఆగాల్సిందేనని వీడియోలో కనిపిస్తోంది.&nbsp;అయితే తాజాగా రిలీజైన వీడియో పుష్ప 2పై పలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది.&nbsp; పుష్పకు ప్రజాదరణ తొలిపార్ట్‌లో పుష్ప ఎర్ర చందనం స్మగ్లర్‌గా కనిపిస్తాడు. పోలీసులకు చిక్కకుండా ఎర్ర చందనం దుంగలను తరలించి సిండికేట్‌ సభ్యులను ఆకర్షిస్తాడు. మెుదటి పార్ట్‌లో హీరోకు ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ ఉండదు. అయితే సెకండ్‌ పార్ట్‌లో పుష్పకు ఫాలోయింగ్‌ ఉన్నట్లు తాజాగా రిలీజైన వీడియోలో చూపించారు. మరి ఒక్కసారిగా పుష్పకు ప్రజల మద్దతు ఎలా పెరిగిందన్న అంశం ఆసక్తిరేపుతోంది. ఎర్రచందనం ద్వారా సంపాదించిన డబ్బును పుష్ప ఏమైనా ప్రజా శ్రేయస్సుకు ఖర్చు చేసి ఉంటాడా? అన్న అనుమానం కూడా కలుగుతోంది. ప్రజలకు మేలు కలిగించే పనులు చేసి వారి మద్దతు చొరగొన్నాడా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కేశవ నమ్మక ద్రోహం? &nbsp; పోలీసుల కళ్లుగప్పి తిరిగే పుష్ప ఎలా అరెస్టయ్యాడనేది ఆసక్తికరం. పుష్పను పోలీసులకు తన ప్రాణ స్నేహితుడు కేశవే పట్టించాడని సోషల్ మీడియాలో నెటిజన్లు ఊహిస్తున్నారు. ఇదే సినిమాలో ట్విస్ట్ అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు.&nbsp; శ్రీవల్లి క్యారెక్టర్‌ కూడా పుష్పకు దూరమయ్యే అవకాశం ఉందని చర్చిస్తున్నారు.&nbsp; పుష్ప 2లో ప్రతికారం.. మెుదటి పార్ట్‌లో మంగళం శీను (సునీల్‌), దాక్షాయణి (అనసూయ), జాలిరెడ్డి (ధనుంజయ్‌) డీఎస్పీ గోవిందప్పను పుష్ప చాలా ఇబ్బందులకు గురిచేస్తాడు. పుష్ప కారణంగా జాలిరెడ్డి మంచానికి పరిమితం కాగా, మంగళం శీను తన బామ్మర్దిని కోల్పోతాడు. మరి సెకండ్‌ పార్ట్‌లో వారు కూడా షెకవాత్‌తో చేయి కలిపి పుష్పపై పగ తీర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ప్రజాదరణ పొందిన పుష్పను షెకావత్‌ ఏ కేసులో అరెస్టు చేశాడో తెలియాల్సి ఉంది. మరి జైలు నుంచి తప్పించుకున్న పుష్ప షెకావత్‌పై ఎలా రివేంజ్‌ తీర్చుకుంటాడు? శ్రీవల్లి కడవరకు ఉంటుందా?&nbsp; పుష్ప స్నేహితుడు కేశవ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నమ్మకద్రోహం చే &nbsp; తెలియాలంటే పుష్ప-2 చూడాల్సిందే.&nbsp;
  ఏప్రిల్ 05 , 2023
  <strong>సందీప్ కిషన్ (Sundeep Kishan) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్</strong>
  సందీప్ కిషన్ (Sundeep Kishan) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
   తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న నటుల్లో సందీప్ కిషన్ ఒకరు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, బిరువా వంటి సినిమాల సక్సెస్‌తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాడు. తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తమిళ్, హిందీ చిత్రాల్లోనూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా కొనసాగుతున్న సందీప్ కిషన్ గురించి చాలా మందికి తెలియని విషయాలు ఇప్పుడు చూద్దాం. సందీప్ కిషన్ మద్దు పేరు? సండీ సందీప్ కిషన్ ఎత్తు ఎంత? 5 అడుగుల 9 అంగుళాలు సందీప్ కిషన్ తొలి సినిమా? ప్రస్థానం సినిమాలో నెగిటివ్‌ రోల్‌తో పరిచయం అయ్యాడు. హీరోగా చేసిన తొలి చిత్రం స్నేహ గీతం సందీప్ కిషన్ ఎక్కడ పుట్టాడు? చెన్నై సందీప్ కిషన్ పుట్టిన తేదీ ఎప్పుడు? 1987, మే 7 సందీప్ కిషన్‌కు వివాహం అయిందా? ఇంకా జరగలేదు. సందీప్ కిషన్‌కు లవర్ ఉందా? సొనియా అనే ఇండో-అమెరికన్ నటితో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. సందీప్ కిషన్ ఫెవరెట్ హీరో? పవన్ కళ్యాణ్, విజయ్ సందీప్ కిషన్ తొలి హిట్ సినిమా? వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సందీప్ కిషన్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. బిరువా, వివాహ భోజనంబు వంటి చిత్రాలు హిట్‌గా నిలిచాయి. సందీప్ కిషన్‌కు ఇష్టమైన కలర్? బ్లూ, వైట్ సందీప్ కిషన్ తల్లిదండ్రుల పేర్లు? RK దుర్గా, P.R.P నాయుడు సందీప్‌ కిషన్‌కు ఇష్టమైన ప్రదేశం? అమెరికా సందీప్ కిషన్ ఏం చదివాడు? డిగ్రీ సందీప్ కిషన్ అభిరుచులు? ట్రావలింగ్, పార్టింగ్ సందీప్ కిషన్ ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 31 సినిమాల్లో నటించాడు.&nbsp; సందీప్‌ కిషన్‌కు ఇష్టమైన ఆహారం? బిర్యాని సందీప్ కిషన్ వ్యాపారాలు? సందీప్‌ కిషన్‌కు హైదరాబాద్‌లో వివాహ భోజనంబు అనే రెస్టారెంట్ ఉంది. అలాగే వైజాగ్‌లో యూనిసెక్స్ అనే సెలూన్ వ్యాపారం కూడా ఉంది. సందీప్ కిషన్‌ సినిమాకి ఎంత తీసుకుంటాడు? ఒక్కో సినిమాకి దాదాపు రూ. 3 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=jtpwRcyTwlI
  మార్చి 21 , 2024
  Allu Arjun: ‘పుష్ప 3’పై బన్నీ సెన్సేషనల్‌ కామెంట్స్‌.. ఫుల్‌ జోష్‌లో ఫ్యాన్స్‌!
  Allu Arjun: ‘పుష్ప 3’పై బన్నీ సెన్సేషనల్‌ కామెంట్స్‌.. ఫుల్‌ జోష్‌లో ఫ్యాన్స్‌!
  తెలుగు చిత్ర పరిశ్రమలో పుష్ప (Pushpa) సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్‌ (Allu Arjun) ప్యాన్‌ ఇండియా స్థాయికి ఎదిగాడు. జాతీయ ఉత్తమ నటుడు పురస్కారంతో పాటు గ్లోబల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. అటు హీరోయిన్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna)కు కూడా ‘పుష్ప’ మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్‌ కూడా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఫ్యాన్స్‌ను ఫుల్‌ జోష్‌లో నింపాయి.&nbsp; ‘పుష్ప 3’ కూడా ఉంటుందట! జర్మనీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘బెర్లిన్‌ యూరోపియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో అల్లు అర్జున్ పాల్గొన్నాడు. అక్కడ పుష్ప సినిమా గురించి కొత్త అప్‌డేట్‌ను అందించారు. పార్ట్‌-3కి అన్నీ అనుకూలంగా ఉంటే తీసే అవకాశాలున్నాయని బన్నీ తెలిపారు. కథను కొనసాగించాలని అనుకుంటున్నామని, తెరకెక్కించేందుకు అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయని చెప్పారు. మొదటి భాగంతో పోలిస్తే ఈ ‘పుష్ప 2’లో పాత్రలు వాటి మధ్య సంఘర్షణ మరింత బలంగా ఉంటాయని అన్నారు. ముఖ్యంగా పుష్పరాజ్‌, భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ల క్యారెక్టరైజేషన్‌, తెరపై వాటి ఎగ్జిక్యూషన్‌, వారికి ఎదురయ్యే పరిస్థితులు థ్రిల్లింగ్‌అనిపిస్తాయని చెప్పారు. ఈ సినిమా తర్వాత చాలా ఆసక్తికర ప్రాజెక్ట్‌లు వరుసలో ఉన్నాయని బన్నీ తన ప్రసంగాన్ని ముగించారు.&nbsp; ‘పుష్ప ముగింపు లేని కథ’ నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న పుష్ప చిత్రంలో హీరోయిన్‌గా నటించి అద్భుత నటన కనబరిచింది. తనదైన యాస, భాషతో శ్రీవల్లి పాత్రలో జీవించింది. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఈ అమ్మడు ‘పుష్ప 2’ చిత్రంపై స్పందించింది. పుష్ప 2 అందరినీ అలరిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. ‘ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయని తెలుసు. మీ ఆలోచనలకు తగ్గట్టుగా చేయాలనే తపన మాలో ఉంది. పుష్ప ముగింపు లేని కథ, ఎలా అయినా దీనిని రూపొందించవచ్చు’ అని అన్నారు. రష్మిక వ్యాఖ్యలను బట్టి చూసిన కూడా పార్ట్‌ 3పై సానుకూల సంకేతాలే వచ్చాయి. బన్నీ ప్లాన్స్‌ తలకిందులు! నిజానికి పుష్ప సినిమాను ఒక్క పార్ట్‌లోనే తీయాలని డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) భావించారు. కానీ చిత్రీకరణ మొదలైన తర్వాత రెండు భాగాలుగా తీయాలనే ఆలోచన వచ్చింది. దీనికి బన్నీ కూడా ఓకే చెప్పడంతో పుష్ప 2 సీక్వెల్ సిద్ధమైంది. అయితే పుష్ప దెబ్బకి బన్నీ ప్లానింగ్స్ అన్ని తలకిందులు అయ్యాయి. పుష్ప ముగిసిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తానని అల్లు అర్జున్ అనౌన్స్ చేశాడు. కానీ పుష్ప 2 సడెన్‌గా రావడంతో త్రివిక్రమ్ సినిమా పక్కకి వెళ్లిపోయింది. మళ్లీ ఇప్పుడు పుష్ప 3 సెట్స్‌పైకి వెళ్తే బన్నీ మరో ఏడాది కూడా సుకుమార్‌కే అంకితం కావాల్సి ఉంటుంది.&nbsp; బాలీవుడ్‌ బ్యూటీతో ఐటెం సాంగ్‌ ‘పుష్ప’ మూవీ పాటలు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా మావా.. ఉ.. ఉ.. అంటావా’ అనే ఐటెం సాంగ్‌ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్‌ చేసింది. బన్నీ-సామ్‌ కలిసి వేసిన స్టెప్స్‌ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్‌ సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ పాట కోసం ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్‌ల పేర్లు బయటకు వచ్చినప్పటికి చివరకు ఈ అవకాశం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశ పటానీ (Disha Patani)కి దక్కింది.&nbsp;
  ఫిబ్రవరి 17 , 2024
  Pindam Movie Review: హారర్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో భయపెట్టిన ‘పిండం’.. సినిమా ఎలా ఉందంటే?
  Pindam Movie Review: హారర్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో భయపెట్టిన ‘పిండం’.. సినిమా ఎలా ఉందంటే?
  నటీనటులు : శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీ రావు, శ్రీనివాస్ అవసరాల, బేబీ చైత్ర, బేబీ లీషా, విజయలక్ష్మి, శ్రీలత, రవివర్మ, తదితరులు దర్శకుడు : సాయికిరణ్ దైదా సంగీతం : కృష్ణ సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ: సతీష్ మనోహరన్ ఎడిటర్: శిరీష్ ప్రసాద్ నిర్మాత : యశ్వంత్ దగ్గుమాటి విడుదల తేదీ : డిసెంబర్ 15, 2023 ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో హార‌ర్ జానర్‌ చిత్రాలు ఎక్కువగా కనిపించేవి. ఇటీవల కాలంలో వాటి తాకిడి కాస్త తగ్గింది. అయితే ఆడపాదడపా ఈ జాన‌ర్‌ని స్పృశిస్తూ ద‌ర్శ‌కనిర్మాత‌లు సినిమాలు తీస్తున్నారు. తాజాగా ఈ కోవలో రూపొందిన చిత్రం ‘పిండం’ (Pindam). ‘ది స్కేరియ‌స్ట్ ఫిలిం ఎవ‌ర్’ అనే ఉప‌శీర్షిక‌తో సినిమా రూపుదిద్దుకుంది. ప్ర‌చార చిత్రాలు సైతం ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? అందరి అంచనాలను అందుకుందా? లేదా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ తాంత్రిక విద్యలో ఆరితేరిన అన్నమ్మ(ఈశ్వరి రావు)ను తన రీసెర్చ్ కోసం లోక్ నాథ్ (శ్రీనివాస్ అవసరాల) ఇంటర్వ్యూ చేస్తాడు. ఆమె కెరీర్ లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉందా అని ప్రశ్నిస్తాడు. అందుకు బదులిస్తూ 1990 దశకంలో సుక్లాపేట్‌లోని ఓ కుటుంబానికి జరిగిన ఘటనను ఆమె చెప్పుకొస్తుంది. ఆంటోనీ (శ్రీరామ్).. గర్భవతి భార్య మేరీ(ఖుషి రవి), తల్లి, తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతాడు. ఆ తర్వాత నుంచి ఇంట్లో అంతా అనుమానాస్పద ఘటనలు జరుగుతుంటాయి. వాళ్ళని పీడిస్తుంది ఏంటి? అంతకు ముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా? దుష్టశక్తి నుంచి ఆ కుటుంబం ఎలా బయట పడింది? అన్నది మిగిలిన కథ. ఎవరెలా చేశారంటే శ్రీరామ్‌, ఖుషి ర‌వి మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన జంట‌గా ఇమిడిపోయారు. హార‌ర్ సీన్లలో శ్రీరామ్ న‌ట‌న ఆకట్టుకుంటుంది. ఖుషి ర‌వి గ‌ర్భ‌వ‌తిగా, ఇద్ద‌రు బిడ్డల త‌ల్లిగా పాత్ర‌కి త‌గ్గ‌ట్టుగా న‌టించింది. తాంత్రిక శ‌క్తులున్న మ‌హిళ‌గా ఈశ్వ‌రీరావు న‌ట‌న మెప్పిస్తుంది. ఇద్ద‌రు చిన్నారుల్లో తారగా న‌టించిన అమ్మాయి సైగల‌తో మాట్లాడుతూ ప్రేక్షకులను క‌ట్టిప‌డేస్తుంది. అవ‌స‌రాల శ్రీనివాస్ పాత్ర‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. ర‌వివ‌ర్మ త‌దిత‌రులు పాత్రల ప్రాధాన్యం మేర‌కు న‌టించారు&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే? దర్శకుడు సాయికిరణ్ దైదా క‌థ‌నంపైన‌, క‌థ‌లోని భావోద్వేగాల‌పైన ఇంకొంచెం దృష్టిపెట్టాల్సింది. అయితే ఆంథోనీ కుటుంబం ఇంట్లోకి వ‌చ్చాక ఆత్మ‌లు క‌నిపించ‌డం, అంద‌రూ విచిత్రంగా ప్ర‌వ‌ర్తించే స‌న్నివేశాల్ని భ‌యం క‌లిగించేలా తీయ‌డంలో ఆయన స‌ఫ‌ల‌మ‌య్యాడు. కానీ, అవే సీన్లు పదే పదే పునరావృతం కావడంతో ఆరంభ స‌న్నివేశాల్లో క‌లిగినంత భ‌యం ఆ త‌ర్వాత ఉండదు. విరామంలో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్‌ సెకండ్‌ పార్ట్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో వచ్చే కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. క‌డుపులో పిండానికీ, బ‌య‌టి ఆత్మ‌కీ ముడిపెట్ట‌డంలో పెద్దగా లాజిక్ క‌నిపించ‌దు. ఓవరాల్‌గా సినిమాలోని థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తాయి. సాంకేతికంగా సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. కెమెరా, సంగీతం విభాగాలు మంచి ప‌నితీరుని కనబరిచాయి. శబ్దాల‌తోనే భ‌య‌పెట్టడంలో సంగీత ద‌ర్శ‌కుడు కృష్ణ సౌరభ్ సక్సెస్‌ అయ్యాడు. విష్ణు నాయ‌ర్ క‌ళా ప్ర‌తిభ తెర‌పై క‌నిపిస్తుంది. ద‌ర్శ‌కుడు భ‌య‌పెట్టే స‌న్నివేశాల్ని ఆయన బాగా డిజైన్ చేసుకున్నారు. నిర్మాణంప‌రంగా లోపాలేమీ లేవు. ప్లస్ పాయింట్స్‌ హారర్‌ సన్నివేశాలునటీనటులుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ రొటిన్ కథ, కథనంకొరవడిన భావోద్వేగాలు రేటింగ్‌: 2.5/5
  డిసెంబర్ 15 , 2023
  VD13: వరుసగా సమంత, శ్రీలీల, మృణాల్‌తో విజయ్ దేవరకొండ రొమాన్స్.. పెట్టి పుట్టాడు పో!
  VD13: వరుసగా సమంత, శ్రీలీల, మృణాల్‌తో విజయ్ దేవరకొండ రొమాన్స్.. పెట్టి పుట్టాడు పో!
  ‘పెళ్లిచూపులు’ అంటూ పక్కింటి అబ్బాయిలా ప్రేక్షకులను పలకరించాడు విజయ్ దేవరకొండ. వెంటనే అర్జున్ రెడ్డితో బ్లాక్ బస్టర్ హిట్‌ అందుకుని.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాడు. రౌడీబాయ్ యాటిట్యూడ్‌కి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడిందంటేనే విజయ్ స్టార్‌డమ్‌ ఏ రేంజ్‌లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ అభిమాన గణాన్ని కాపాడుకుంటేనే పక్కాగా సినిమాలు చేస్తున్నాడు దేవరకొండ. లైగర్ బెడిసి కొట్టినా వరుస సినిమాలకు సైన్ చేసి కెరీర్‌ని పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు.&nbsp; సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయంలో డైరెక్టర్, ప్రొడ్యూసర్లతో పాటు హీరోది కీలక పాత్ర. ఫలానా వారినే పెట్టుకుందామని హీరోలు సిఫార్సు చేస్తే డైరెక్టర్, ప్రొడ్యూసర్లు ఒకే చెప్పేస్తారు. అయితే, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మాత్రం ప్రత్యేక రూటు ఫాలో అవుతున్నాడు. తెలుగులో టాప్ హీరోయిన్లతోనే రొమాన్స్ చేస్తానని అంటున్నాడు. అందుకు తగ్గట్టుగానే అప్ కమింగ్ సినిమాల్లో హీరోయిన్లను ఎంపిక చేసుకుంటున్నాడీ హ్యాండ్‌సమ్ హీరో.&nbsp; సమంత మహానటి సినిమాలో పార్ట్ టైం హీరోగా నటించాడు విజయ్ దేవరకొండ. ఇందులో విజయ్‌కి తోడుగా సమంత నటించింది. కానీ, ఈ సినిమాలో వీరిద్దరి మధ్య రోమాన్స్‌కు స్కోప్ లేకుండా పోయింది.&nbsp; ఖుషీ సినిమాతో మరోసారి సామ్, విజయ్ ఒక్కటయ్యారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. కశ్మీర్ నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీగా డైరెక్టర్ శివ నిర్వాణ దీన్ని తీర్చిదిద్దాడు.&nbsp; సినిమాలో నుంచి ‘నా రోజా నువ్వే’ సాంగ్ విడుదలై మంచి రెస్పాన్స్‌ని రాబడుతోంది. మరి, ఇందులో సమంతతో విజయ్ ఏ మేరకు రొమాన్స్ చేశాడో వేచి చూడాలి.&nbsp; శ్రీలీల తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా శ్రీలీల బిజీబిజీగా ఉంది. జెర్సీ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సినిమాలో శ్రీలీలనే హీరోయిన్. ఈ ప్రాజెక్టు చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటివరకు శ్రీలీల లిప్‌లాక్ సీన్లలో నటించలేదు. గౌతమ్ తిన్ననూరి తొలి సినిమాలో రొమాన్స్‌ని బాగా చూపించాడు. కథ వేరే అయినప్పటికీ ఈ సీన్స్ పెట్టి ఆడియెన్స్‌ని సాటిస్‌ఫై చేశాడు.&nbsp; ముఖ్యంగా, విజయ్‌లోని రొమాంటిక్ యాంగిల్‌ని చాలా మంది ఇష్టపడతారు. దీంతో ఈ సినిమాలోనూ శ్రీలీల, విజయ్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.&nbsp; మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాలో అందాల భామ మృణాల్ ఠాకూర్‌ని డైరెక్టర్ హను చాలా పద్ధతిగా చూపించాడు. కానీ, మృణాల్ ఠాకూర్ తరచూ హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంటుంది.&nbsp; బికినీలు ధరించి సోషల్ మీడియాను హీటెక్కిస్తుంది. ఏ మాత్రం సంకోచించకుండా అందాల నిధిని బయటకు తెరుస్తుంది. ఇప్పుడు ఈ బ్యూటీ విజయ్ దేవరకొండతో జతకట్టింది.&nbsp; గీతగోవిందం సినిమా ఫేమ్ డైరెక్టర్ పరషురామ్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గీతగోవిందం సినిమాకు సీక్వెల్‌గా ఇది రానుంది. మరి, అటు రౌడీబాయ్, ఇటు గ్లామర్ బ్యూటీ ఏ మేరకు రెచ్చిపోతారో? అని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు. వీరిద్దరి మధ్య రోమాన్స్ పండితే ఇక సినిమా బ్లాక్ బాస్టర్‌ అని కామెంట్ చేస్తున్నారు.&nbsp; లవ్ స్టోరీగానే ఈ సీక్వెల్‌ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రొమాంటిక్ సన్నివేశాలకు కొదవ ఉండకపోవచ్చని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అలనాటి అర్జున్ రెడ్డి సినిమాను గుర్తు తెచ్చుకుంటున్నారు.&nbsp;
  జూన్ 14 , 2023
  HBD SAMANTHA: ఆ ఒక్కటి&nbsp; సమంతకే చెల్లింది..&nbsp; బోల్డ్ అయినా, ఎమోషనల్ అయినా సామ్ దిగనంత వరకే!
  HBD SAMANTHA: ఆ ఒక్కటి&nbsp; సమంతకే చెల్లింది..&nbsp; బోల్డ్ అయినా, ఎమోషనల్ అయినా సామ్ దిగనంత వరకే!
  చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌ సమంతది ప్రత్యేకమైన ప్రయాణం. ఏమాయ చేశావే చిత్రంతో జెస్సీగా పరిచయమై అందరి మనసుల్ని కొళ్లగొట్టింది సామ్. 2010లో కెరీర్ ప్రారంభించి దాదాపు 13 సంవత్సరాలుగా టాప్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. సమంత ఇప్పటివరకు చేసిన సినిమాల్లో డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ వర్తమాన హీరోయిన్స్‌ చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఆమెకున్నంత డైహార్ట్ ఫ్యాన్స్‌ హీరోయిన్స్‌లో మరెవరికి లేరని చెప్పవచ్చు. ఏప్రిల్ 28న ఆమె పుట్టిన రోజు సందర్భంగా&nbsp; ఇప్పటి వరకు సమంత చేసిన విభిన్న పాత్రలు ఓసారి గుర్తు చేసుకుందాం… రంగస్థలం రామ లక్ష్మి రామ్‌చరణ్‌, సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలంలో అచ్చమైన పల్లెటూరు అమ్మాయి పాత్రలో జీవించేసింది సమంత. ఆంధ్రా స్లాంగ్‌ను అచ్చుగుద్దినట్లు దింపేసింది. ఇందులో సామ్‌ చేసిన నటనకు మంచి మార్కులు పడ్డాయి.&nbsp; మజిలీ శ్రావణి నాగచైతన్య, సమంత నటించిన చిత్రం మజిలీ. ఇందులో భర్త ఏం చేసినా భార్య వెనకేసుకు వస్తూ ప్రేమించే పాత్రలో సామ్‌ నటన నెక్స్ట్‌ లెవల్‌. క్లైమాక్స్‌లో సమంత పర్‌ఫార్మెన్స్‌ కన్నీళ్లు పెట్టిస్తుంది. అంతలా క్యారెక్టర్‌ను ముందుకు తీసుకెళ్లింది.  ఓ బేబీ సమంత హీరోయిన్‌గా వచ్చిన లేడి ఓరియెంటెడ్‌ ఇది. ఓ ముసలి వ్యక్తి కొన్ని కారణాల వల్ల యవ్వనంలోకి వెళ్తుంది. కానీ, ఆ పాత్రను చేసిన వ్యక్తిలానే నటించడం చాలా కష్టమైన పని. సీనియర్ యాక్టర్‌లా హావాభావాలు పండిస్తూ… చూడటానికి 25 ఏళ్లున్నా వయసు మాత్రం 60 ఏళ్లు అన్నట్లుగా కనిపించే పాత్రలో చించేసింది ఈ బ్యూటీ. యశోద అద్దె గర్భం కాన్సెప్ట్‌లో వచ్చిన యాక్షన్ సినిమా. ఇందులో సమంత పోరాట సన్నివేశాల్లో అదరగొట్టింది. తన కోసం చిక్కుల్లో పడిన చెల్లెల్ని కాపాడేందుకు ఆమె వేసే ఎత్తుగడలు, విలన్లతో పోరాటం వంటివి ఆకట్టుకున్నాయంటే ఆమెనే కారణం. బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలే వచ్చాయి. శకుంతల కాళిదాసు రచించి అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. మయోసైటిస్‌తో బాధపడుతున్నప్పటికీ సినిమాను పూర్తి చేసింది. ఇందులో తన పాత్ర కోసం చాలానే కష్టపడింది. శకుంతల పాత్రలో జీవించింది. గ్లామర్‌ పరంగా ఏమాత్రం తగ్గకుండా నటించింది. బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చినప్పటికీ సామ్ చేసిన డిఫరెంట్ రోల్స్‌లో ఇదొకటని చెప్పవచ్చు.&nbsp; పుష్ప ది రైజ్‌ పుష్ప చిత్రంలో ఐటెమ్‌ సాంగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావ అంటూ ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఫ్యామిలీ మెన్ రాజీ మనోజ్ బాజ్‌పేయ్‌ లీడ్‌ రోల్‌లో వచ్చిన ఫ్యామిలీ మెన్ సిరీస్‌ పార్ట్‌ 2లో సమంత విభిన్నమైన క్యారెక్టర్‌లో కనిపించింది. శ్రీలంక రెబల్ గ్రూప్‌ అంటే నక్సలైట్‌ పాత్రలో మెరిసింది సుందరి. డీ గ్లామరస్‌ రోల్‌లో కనిపించడమే కాకుండా బోల్డ్‌ సీన్‌లో నటించి షాకిచ్చింది. సిటాడెల్ హాలీవుడ్‌ యాక్షన్ థ్రిల్లర్‌ సిటాడెల్‌ సిరీస్‌ను బాలీవుడ్‌లో వరుణ్ ధావన్‌, సమంత లీడ్‌ రోల్స్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా పోషించిన యాక్షన్‌ రోల్‌ను సామ్ చేయనుంది. ఇప్పటికే షూటింగ్‌ కోసం చిత్రబృందంతో జత కట్టింది చెన్నై సుందరి.&nbsp;
  ఏప్రిల్ 27 , 2023
  డీగ్లామర్‌ రోల్స్‌లోనూ నటనతో అదరగొట్టిన అందాల భామలు
  డీగ్లామర్‌ రోల్స్‌లోనూ నటనతో అదరగొట్టిన అందాల భామలు
  ఒక సినిమా విజయానికి హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్‌ అంతే కీలకం. కథానాయిక నటన, గ్లామర్‌, డ్యాన్స్‌ కోసమే సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు ఇప్పటికీ ఉన్నారు. వెండి తెరపై తమ అందాల తార అందాలను చూసుకొని వారు మురిసిపోతుంటారు. హీరోయిన్లు కూడా గ్లామర్‌ ప్రదర్శనకు ఏమాత్రం వెనకాడకుండా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించేవారు.&nbsp; అయితే ఇదంతా గతం. ఇప్పుడు డీ గ్లామరస్ రోల్‌లోనూ హీరోయిన్లు అదరగొడుతున్నారు. తెరపై గ్లామర్‌కు చోటు ఇవ్వకుండా కేవలం తమ నటనతోనే ఆడియన్స్‌ను మెప్పిస్తున్నారు. ఓ వైపు గ్లామరస్‌ రోల్స్‌ చేస్తూనే అవకాశం వచ్చినప్పుడు పల్లెటూరి పాత్రల్లో తళ్లుక్కుముంటున్నారు. మట్టివాసన వెదజల్లే క్యారెక్టర్‌లో తమదైన ముద్ర వేస్తున్నారు. డీగ్లామర్‌ రోల్‌లో కనిపించి మెప్పించిన హీరోయిన్లను ఇప్పుడు చూద్దాం. కీర్తి సురేష్‌ దసరా(Dasara) మూవీలో పల్లెటూరి అమ్మాయిగా కీర్తి సురేష్‌ (keerthi suresh) అదరగొట్టింది. వెన్నెల పాత్రలో నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇందులో కీర్తి నటన సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. హీరో నానితో పోటీపడి మరీ నటించింది. దీంతో నానితో సమానంగా కీర్తి సురేష్‌ ప్రశంసలు అందుకుంటోంది.&nbsp; సమంత టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్స్‌లో ఒకరైన సమంత(Samantha) ‘రంగస్థలం (Rangasthalam)’ చిత్రంలో డీగ్లామరస్‌గా కనిపించింది. అచ్చం పల్లెటూరి అమ్మాయిగా మెప్పించింది. రామలక్ష్మీ పాత్రలో సమంతను తప్ప మరొకరిని ఊపించుకోలేము. ఫ్యామిలీ మ్యాన్‌-2 వెబ్‌సిరీస్‌లోనూ సమంత గ్లామర్‌కు దూరంగా ఉన్న పాత్రనే చేసింది.&nbsp; అనుష్క బాహుబలి(Bahubali) మెుదటి పార్ట్‌లో వృద్దురాలైన దేవసేనగా అనుష్క(Anushka Shetty) కనిపించింది. ఈ పాత్రలో ఆమె నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భల్లాల దేవుడిపై పగ తీర్చుకునేందుకు ఎదురు చూస్తున్న మహిళగా అనుష్క చాాాలా బాగా నటించింది.&nbsp; తమన్నా బాహుబలి పార్ట్‌-1 లోనే తమన్నా(Thamanna)&nbsp; కూడా అవంతిక పాత్రలో మెరిసింది. ఎలాంటి మేకప్‌ లేకుండా పోరాట సన్నివేశాల్లో అదరగొట్టింది. గ్లామర్‌ పాత్రలే కాదు అందానికి ప్రాధాన్యం లేని క్యారెక్టర్లు కూడా చేయగలనని తమన్నా నిరూపించుకుంది.&nbsp; ఐశ్వర్య రాజేష్‌ ‘కౌసల్య కృష్ణమూర్తి’ (Kousalya krishnamurthy), ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ (world famous lover) లాంటి చిత్రాల్లో ఐశ్వర్య రాజేష్‌ డీ గ్లామరస్‌ రోల్స్‌లో నటించారు. ఈ రెండు సినిమాల్లో పల్లెటూరి యువతిగా ఐశ్వర్య అద్భుతంగా నటించింది. అయితే కౌసల్య కృష్ణమూర్తి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోగా.. వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌లో ఐశ్వర్య పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. రితికా సింగ్ వెంకటేష్‌ ప్రధాన పాత్రలో చేసిన గురు(Guru) సినిమా ద్వారా రితికా సింగ్‌ (Ritika Singh) తొలిసారి టాలీవుడ్‌కు పరిచయమైంది. తొలుత కూరగాయాలు అమ్ముకునే రాముడు పాత్రలో రితికా డీగ్లామరెస్‌గా కనిపించింది. ఆ తర్వాత బాక్సర్‌గా మారి సినిమా విజయంలో ముఖ్య భూమిక పోషించింది.&nbsp; అమ్రితా అయ్యర్‌ బుల్లితెర యాంకర్ ప్రదీప్‌ హీరోగా వచ్చి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రంలో అమ్రితా అయ్యర్‌ పల్లెటూరి అమ్మాయిగా కనిపించి మెప్పించింది. ఈ సినిమాలో ‘నీలి నీలి ఆకాశం పాట’ (Neeli Neeli Aakasam) ఎంత ఫేమస్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. సంజనా బుజ్జిగాడు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సంజనా (Sanjana).. దండుపాళ్యం-2 Dandupalyam-2)లో ఓ విభిన్నమైన పాత్ర పోషించి షాక్‌ ఇచ్చింది. హత్యలు చేసే గ్యాంగ్‌లో నటించి మెప్పించింది. ఇదే సినిమాలో సంజన న్యూడ్‌గా నటించిందన్న వార్తలు అప్పట్లో షికారు చేశాయి.&nbsp;
  ఏప్రిల్ 01 , 2023
  Animal Movie OTT: ఓటీటీ ప్రియులకు గ్రాండ్‌ ట్రీట్.. మరికొద్ది గంటల్లో ‘యానిమల్‌’ స్ట్రీమింగ్‌!
  Animal Movie OTT: ఓటీటీ ప్రియులకు గ్రాండ్‌ ట్రీట్.. మరికొద్ది గంటల్లో ‘యానిమల్‌’ స్ట్రీమింగ్‌!
  రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ వంగా (Sandeep Reddy) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ డ్రామా చిత్రం ‘యానిమల్‌’ (Animal movie). ఈ చిత్రం రేపటి నుంచి (జనవరి 26) ఓటీటీలో ప్రసారం కానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ‘యానిమల్‌’ స్ట్రీమింగ్‌లోకి రానుంది.&nbsp; ‘యానిమల్’ స్ట్రీమింగ్‌ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ స్వయంగా ప్రకటిస్తూ ఎక్స్‌ (ట్విటర్‌)లో ఓ ఆసక్తికర వీడియోను సైతం పోస్టు చేసింది. ప్రస్తుతం ఆ వీడియో #AnimalOnNetflix హ్యాష్‌ట్యాగ్‌ పేరుతో&nbsp;నెట్టింట వైరల్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1750390548165472508 ‘గాలి దట్టంగా ఉంది.. ఉష్ణోగ్రత పెరుగుతోంది’ అంటూ నెట్‌ఫ్లిక్స్‌ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. జనవరి 26 నుంచి తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ‘యానిమల్‌’ (Animal Movie OTT Release) చిత్రాన్ని వీక్షించవచ్చని స్పష్టం చేసింది.&nbsp; డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమల్‌ చిత్రం #AnimalOnNetflix&nbsp; బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. యువ ప్రేక్షకులను (Animal movie ott release date telugu) అమితంగా ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. యానిమల్‌ చిత్రాన్ని ఇప్పటికే థియేటర్లలో వీక్షించిన వారికి కూడా ఓటీటీ వెర్షన్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వనుంది. దాదాపు 8 నిమిషాల అదనపు నిడివితో దీన్ని తీసుకొస్తున్నారు. థియేటర్‌లో చూడలేకపోయిన సన్నివేశాలను ఇందులో చూసే అవకాశం కల్పించారు.&nbsp; యానిమల్‌ మూవీ రన్‌ టైమ్‌ 3 గం.ల 21 నిమిషాలు కాగా.. ఓటీటీ కోసం అదనపు సన్నివేశాలు జోడించి దాదాపు మూడున్నర గంటలతో 'యానిమల్‌' (Animal movie ott release date telugu)ను స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. దీంతో ఆ సన్నివేశాలు ఏంటా అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది. యాక్షన్ ప్రియులకు (#AnimalOnNetflix) పసందైన విందు భోజనాన్ని అందించిన యానిమల్‌కు కొనసాగింపుగా మరో చిత్రం సైతం రానుంది. యానిమల్‌ పార్క్‌ (Animal Park) టైటిల్‌తో ఆ చిత్రాన్ని రూపొందించనున్నట్లు డైరెక్టర్‌ సందీప్‌ వంగా ఇప్పటికే ప్రకటించారు.&nbsp; ఇక యానిమల్‌ చిత్రాన్ని హిందీ అగ్ర నిర్మాణ సంస్థ T సిరీస్ ప్రొడ్యూస్ చేసింది.&nbsp; హిందీతో పాటు ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేసింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది.&nbsp; డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాకు బాలీవుడ్‌లో ఇది రెండో చిత్రం. అంతకుముందు ఆయన అర్జున్‌ రెడ్డి చిత్రాన్ని 'కబీర్‌ సింగ్‌' (Kabir singh)పేరుతో హిందీలో తెరకెక్కించారు. ఇక యానిమల్ చిత్రంలో రణ్‌బీర్‌కు జోడీగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించింది. అనిల్‌ కపూర్‌ బాబీ డియోల్‌, శక్తికపూర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.&nbsp; ‘యానిమల్‌’ కథ విషయానికి వస్తే..&nbsp; రణ్ విజయ్ సింగ్ బల్బీర్ (రణబీర్ కపూర్)‌కు తండ్రి మీద విపరీతమైన ప్రేమ. తండ్రి బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) కోసం ఎంత దూరమైన వెళ్తాడు. తండ్రి బల్బీర్ సింగ్ ఓ బిజీగా ఉండే వ్యాపార వేత్త. ఇండియాలోనే అతిపెద్ద స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీని నడుపుతుంటాడు. బిజీ లైఫ్‌ వల్ల తన కొడుకుతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతుంటాడు. పూర్తి రివ్యూ కోసం కింద ఉన్న లింక్‌పై క్లిక్‌ చేయండి.&nbsp; https://telugu.yousay.tv/animal-movie-review-ranbir-looks-fierce-in-action-scenes-how-is-animal.html
  జనవరి 25 , 2024
  Fighter Movie Review: శత్రుదేశానికి చుక్కలు చూపించిన హృతిక్‌.. ‘ఫైటర్‌’ ఎలా ఉందంటే?
  Fighter Movie Review: శత్రుదేశానికి చుక్కలు చూపించిన హృతిక్‌.. ‘ఫైటర్‌’ ఎలా ఉందంటే?
  నటీనటులు: హృతిక్‌ రోషన్‌, దీపికా పదుకొణె, అనిల్‌ కపూర్‌, కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌, అక్షయ్‌ ఒబెరాయ్‌, సంజీవ్‌ జైశ్వాల్‌ తదితరులు రచన, దర్శకత్వం: సిద్ధార్థ్‌ ఆనంద్‌ సంగీతం: విశాల్‌ - శేఖర్‌&nbsp; నేపథ్య సంగీతం: సంచిత్‌ బల్హారా - అంకిత్‌&nbsp; సినిమాటోగ్రఫీ: సచిత్‌ పాలోస్‌ ఎడిటింగ్‌: ఆరిఫ్‌ షేక్‌ విడుదల: &nbsp;25-01-2024 బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) హీరోగా, సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘ఫైటర్‌’ (Fighter). బాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ‘వార్‌’ చిత్రం తర్వాత హృతిక్‌ - ఆనంద్‌ కాంబోలో మరోమారు ఈ చిత్రం వస్తుండటంతో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. పైగా సిద్దార్థ్‌ ఆనంద్‌ రీసెంట్‌ చిత్రం ‘పఠాన్‌’ సూపర్‌ హిట్ కావడంతో (Fighter Movie Review In Telugu) అందరి దృష్టి ఈ చిత్రంపై పడింది. ఇందులో హృతిక్‌కు జోడీగా దీపికా పదుకునే నటించింది. ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? హృతిక్‌ చేసిన యాక్షన్ అడ్వెంచర్స్‌ ఆకట్టుకుందా? సిద్దార్థ్‌ ఆనంద్‌ ఖాతాలో మరో హిట్‌ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం. కథేంటి సంషేర్ ప‌ఠానియా అలియాస్ పాటీ (హృతిక్ రోష‌న్‌) భార‌త వైమానిక ద‌ళంలో స్క్వాడ్ర‌న్ లీడ‌ర్‌. సాహ‌సాల‌కి వెనుకాడ‌ని ఫైట‌ర్ పైల‌ట్‌. ఓ ఆప‌రేష‌న్ కోసం శ్రీన‌గ‌ర్ వ‌స్తాడు. రాకీ (అనిల్ క‌పూర్‌) నేతృత్వంలో మిన్ను (దీపికా ప‌దుకొణె), తాజ్ (క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్‌), బాష్ (అక్ష‌య్ ఒబెరాయ్‌) బృందం కూడా ఆ మిషన్‌ కోసం అతడితో పాటు రంగంలోకి దిగుతుంది. గ‌గ‌న‌త‌లంలో శ‌త్రువుల‌పై వాళ్ల పోరాటం ఎలా సాగింది? (Fighter Movie Review) పాటీని వెంటాడుతున్న గతం ఏమిటి? త‌నకు ఎదురైన స‌వాళ్ల‌ని దాటి పాటీ వీరోచిత ఫైట‌ర్‌గా ఎలా నిలిచాడు? అన్నది కథ.&nbsp; ఎవరెలా చేశారంటే హృతిక్‌రోషన్‌ (Hrithik Roshan) ఎప్పటిలాగే అద్భుతంగా నటించాడు. ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తూనే పోరాట ఘట్టాల్లో తన మార్క్‌ ఏంటో చూపించాడు. కళ్లతో భావాల్ని పలికిస్తూ చాలా సన్నివేశాల్లో భావోద్వేగాలను రగిలించాడు. అటు హృతిక్‌కు జోడీగా దీపికా పదుకునే (Deepika Padukone) చక్కటి నటన కనబరిచింది. ద్వితియార్థంలో తన నటనతో భావోద్వేగాల్ని పండించింది. అనిల్‌ కపూర్‌ (Anil Kapoor) చిత్రంలో కీలకపాత్ర పోషించాడు. రాకీ పాత్రలో ఆయన ఒదిగిపోయారు. క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్‌, అక్ష‌య్ ఒబెరాయ్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే? భారత వాయుసేన చుట్టూ సాగే కథ ఇది. యాక్ష‌న్‌, నేప‌థ్యం, విజువ‌ల్స్ ప‌రంగా ‘ఫైటర్‌’ (Fighter Movie Review In Telugu) ప‌ర్వాలేదు కానీ క‌థ, క‌థ‌నాల ప‌రంగానే నిరుత్సాహ ప‌రుస్తాడు. త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఉత్సుక‌త‌ని ద‌ర్శ‌కుడు సిద్దార్థ్‌ ఆనంద్‌ ప్రేక్షకుల్లో ఏమాత్రం క‌లిగించ‌లేక‌పోయారు. అయితే శ‌త్రుదేశ‌మైన పాక్ ఉగ్రవాదులతో పన్నిన పన్నాగాలను వైమానిక దళం ఎలా ఎదుర్కొందో చూపించిన తీరు బాగుంది. హాలీవుడ్ చిత్రాల్ని త‌ల‌దన్నే రీతిలో స‌న్నివేశాల్ని తీర్చిదిద్దడంలో ద‌ర్శ‌కుడు స‌ఫ‌ల‌మ‌య్యాడు. వాటికి దేశభక్తిని జోడించడం కలిసొచ్చింది.&nbsp; కథ, కథనాన్ని పక్కన పెడితే డైరెక్టర్‌గా సిద్ధార్థ్‌ ఆనంద్‌ మరోమారు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. సాంకేతికంగా సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. స‌చిత్ కెమెరా పనితనం ఆకట్టుకుంది. ముఖ్యంగా గగనతలంలో వచ్చే యాక్షన్‌ సీన్లను ఆయన అద్భుతంగా చూపించారు. ఇక సంచిత్‌-అంకిత్ నేప‌థ్య సంగీతం, విశాల్-శేఖ‌ర్ పాట‌లు చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లంగా నిలిచాయి. నిర్మాణ విలువలు చాలా ఉన్న‌తంగా ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో నిర్మాతలు రాజీపడినట్లు ఎక్కడా కనిపించలేదు. ప్లస్‌ పాయింట్స్‌ హృతిక్‌, దీపిక, అనిల్‌ కపూర్‌ నటనయాక్షన్‌ సన్నివేశాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీఊహకందే సన్నివేశాలు&nbsp; రేటింగ్: 3/5
  జనవరి 25 , 2024
  Saindhav Movie Review: యాక్షన్‌ సీక్వెన్స్‌లో వెంకీ మామ ఉగ్రరూపం.. ‘సైంధవ్‌’ హిట్టా? ఫట్టా?
  Saindhav Movie Review: యాక్షన్‌ సీక్వెన్స్‌లో వెంకీ మామ ఉగ్రరూపం.. ‘సైంధవ్‌’ హిట్టా? ఫట్టా?
  నటీనటులు: వెంకటేష్‌, శ్రద్ద శ్రీనాథ్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బేబీ సారా తదితరులు దర్శకత్వం: శైలేష్‌ కొలను సంగీతం: సంతోష్‌ నారాయణ్‌ నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ నిర్మాత: వెంకట్‌ బోయినపల్లి శైలేష్‌ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో విక్ట‌రీ వెంకటేశ్(Venkatesh) హీరోగా నటించిన చిత్రం ‘సైంధవ్‌’. వెంకటేష్‌ కెరీర్‌లో ఇది 75వ సినిమా (Saindhav Movie Review). బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, తమిళ్ నటుడు ఆర్య, బేబీ సారా ఇందులో కీలక పాత్రలు పోషించారు. శ్రద్ధ శ్రీనాథ్‌ వెంకటేష్‌కు జోడీగా నటించింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కాగా, ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఇవాళ (జనవరి 13న) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? వెంకటేష్‌ ఖాతాలో మరో హిట్‌ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం. కథ సైంధవ్‌ (Venkatesh) తన పాపతో(బేబీ సారా) కలిసి చంద్రప్రస్థ అనే ఓ ఊరిలో జీవిస్తుంటాడు. ఓ రోజు పాప కళ్లు తిరిగిపడిపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్తారు. పాప ప్రాణాంతక జబ్బుతో బాధపడుతుందని తెలుస్తుంది. అదే సమయంలో చంద్రప్రస్థలో టెర్రరిస్టు క్యాంప్‌ నడుస్తుంటుంది. సైంధవ్‌ ఉగ్రవాద చర్యలకు అడ్డుతగులుతాడు. అసలు ఉగ్రవాదులకు సైంధవ్‌కు ఏంటి సంబంధం? గతంలో ఏం చేశాడు? పాపని ఎలా బతికించుకుంటాడు? వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్దికీ), ఆర్య పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది మిగతా కథ. ఎవరెలా చేశారంటే సైంధవ్‌ పాత్రలో వెంకటేష్ (Saindhav Movie Review) అద్భుత నటన కనబరిచాడు. ఎమోషన్, యాక్షన్‌ సన్నివేశాల్లో తన మార్క్‌ నటన కనబరిచి మెప్పించాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో వెంకీ తన విశ్వరూపం చూపించాడు. సైంధవ్‌, పాపకు దగ్గరయ్యే పాత్రలో శ్రద్ధ శ్రీనాథ్‌ (Shraddha Srinath) ఆకట్టుకుంది. ఇక బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్‌ సిద్ది (Nawazuddin Siddiqui)కి విలన్‌ పాత్రలో అదరగొట్టాడు. అతని అసిస్టెంట్‌గా, లేడీ విలన్‌గా ఆండ్రియా కూడా మెప్పిస్తుంది. తమిళ నటుడు ఆర్య పర్వాలేదనిపిస్తాడు. శ్రద్ద శ్రీనాధ్ మాజీ భర్త పాత్రలో గెటప్ శ్రీను సీరియస్‌గా కనిపించినా కామెడీని పండిస్తాడు. ఎలా సాగిందంటే&nbsp; గతాన్ని వదిలేసి దూరంగా బతుకుతున్న హీరోకి ఓ సమస్య వస్తే మళ్ళీ ఆ గతంలోని మనుషులు రావడం అనేది చాలా సినిమాల్లో చూశాము. సైంధవ్‌ సినిమా కథ (Saindhav Movie Review in Telugu) కూడా ఇంచుమించు ‌అలాంటిదే.&nbsp; ఫస్ట్ హాఫ్ అంతా సైంధవ్‌, తన కూతురు మధ్య ప్రేమ, పాపకు జబ్బు ఉందని తెలియడం, కంటైనర్లు గురించి గొడవ, సైంధవ్‌ మళ్ళీ తిరిగొచ్చాడు అంటూ సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో విలన్ సైంధవ్‌ కి పెట్టే ఇబ్బందులు, వాటిని తట్టుకొని సైంధవ్‌ ఎలా నిలబడ్డాడు అని ఫుల్ యాక్షన్ మోడ్ లో సాగుతుంది. చివరి ఇరవై నిమిషాలు ఓ పక్క పిల్లల ఎమోషన్ చూపిస్తూనే మరో పక్క స్టైలిష్ యాక్షన్ సీన్స్ సాగుతాయి. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు శైలేష్‌ కొలను(Sailesh Kolanu) చాలా రొటిన్‌ కథను తీసుకున్నారు. 'సైంధవ్‌' సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడో&nbsp; చూసిన భావన కలుగుతుంది. కమల్‌హాసన్‌ 'విక్రమ్‌', రజనీకాంత్‌ 'జైలర్‌' సినిమాను మళ్లీ చూస్తున్న ఫీలింగ్‌ వస్తుంది. కథ, కథనం కంటే కూడా వెంకటేష్, నవాజుద్దీన్ క్యారెక్టర్లపైనే డైరెక్టర్‌ ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. ఆర్య, ముఖేష్‌ రుషి, రుహానీ శర్మ వంటి స్టార్‌ నటులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరిదీ రొటిన్‌ పాత్రలాగే తీర్దిదిద్దారు డైరెక్టర్‌. సన్నివేశాల మధ్య కనెక్షన్‌ ఉండదు. దీని వల్ల ప్రేక్షకులు కథతో ప్రయాణం చేయడంలో ఇబ్బంది ఎదురువుతుంది.. అయితే యాక్షన్‌ సన్నివేశాల్లో మాత్రం శైలేష్‌ తన మార్క్‌ను చూపించాడు. వెంకీ మామ చేత విశ్వరూపాన్ని చూపించేశారు. ఓవరాల్‌గా యాక్షన్‌ ప్రియులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. కథ, లాజిక్‌ పక్కన పెడితే సైంధవ్‌ మెప్పిస్తాడు. సాంకేతికంగా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. సంతోష్ నారాయణ్‌ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో, బుజ్జికొండవే సాంగ్‌లో మ్యూజిక్ మనసుకి హత్తుకుంటుంది. మిగిలిన పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. మణికందన్ సినిమాటోగ్రఫీ చాలా స్టైలిష్‌గా అనిపించింది. వెంకీ మామని చాలా స్టైలిష్‌గా చూపించారు. చంద్రప్రస్థ అనే ఊరిని, సముద్రం లొకేషన్స్, పోర్ట్.. అన్నిటిని చాలా చక్కగా చూపించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ వెంకటేష్‌ నటనభావోద్వేగ సన్నివేశాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ కొత్తదనం లేని కథలాజిక్‌కు అందని సీన్స్‌ రేటింగ్‌: 3/5
  జనవరి 13 , 2024
  Oscar Award Winning Movies 2024: ఆస్కార్‌ గెలిచిన ఈ సినిమాలు ఎందుకు చూడాలంటే?
  Oscar Award Winning Movies 2024: ఆస్కార్‌ గెలిచిన ఈ సినిమాలు ఎందుకు చూడాలంటే?
  సాధారణంగా అవార్డ్ విన్నింగ్ సినిమా అంటే సినీ ప్రేమికులు చూసేందుకు ఇష్టపడతారు. ఇక ఆస్కార్ దక్కించుకున్న సినిమా అంటే వారి ఆసక్తి ఇక ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయా చిత్రాలు అవార్డు సాధించేంత స్పెషాలిటీ ఆ సినిమాల్లో ఏముందోనని తెలుసుకునేందుకు వారు తెగ వెతికేస్తుంటారు. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో అంగరంగ వైభవంగా అస్కార్‌ వేడుకలు జరిగాయి. ఇందులో 10 చిత్రాలు వివిధ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఆయా చిత్రాల విశేషాలను YouSay మీ ముందుకు తెచ్చింది. అంతేకాకుండా ఆస్కార్‌కు నామినేట్ అయినా చిత్ర వివరాలను సైతం ఈ కథనంలో పొందుపరిచింది. ఆయా సినిమాల కథ, ఏ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ అవుతోంది అన్న విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; ఆస్కార్‌ గెలిచిన చిత్రాలు ఓపెన్ హైమర్ (Oppenheimer) అందరూ ఊహించనట్లే ఈసారి 'ఓపెన్ హైమర్' చిత్రానికి ఏకంగా ఏడు పురస్కారాలు దక్కాయి. ఈ చిత్రానికి హాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ క్రిస్టోపర్‌ నోలాన్‌ (Christopher Nolan) దర్శకత్వం వహించారు. కథ విషయానికి వస్తే ఈ సినిమా.. ప్రముఖ అమెరికన్‌ సైంటిస్ట్ జె. రాబర్ట్‌ ఓపెన్‌హైమర్‌ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఫాదర్‌ ఆఫ్‌ ఆటమ్‌ బాంబ్‌గా అతడి జర్నీ ఎలా మెుదలైంది? అసలు అణుబాంబును అమెరికా ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? జపాన్‌లోని హీరోషిమా - నాగసాకిపైనే వారు ఎందుకు దాడి చేశారు? ఆ దాడి తర్వాత ఓపెన్‌హైమర్‌ మానసిక పరిస్థితి ఎలా ఉండేది? ఆపే అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? అన్నది స్టోరీ. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ బేసిస్ తో చూడొచ్చు. అయితే మార్చి 21 నుంచి జియో సినిమాలో ఉచితంగా స్ట్రీమింగ్ కానుంది. బార్బీ (Barbie) గ్రెటా గర్‌విగ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఒక&nbsp; ఫాంటసీ కామెడీ ఫిల్మ్. ఒక ట్రాన్స్ జెండర్ ఓ బార్బీ మధ్య జరిగే కథ ఇది. బార్బీ డాల్స్ కోసం నిజంగా ఒక లోకం ఉంటే... తన లోకం వదిలి సదరు బార్బీ డాల్ భూలోకంలో అడుగు పెడితే ఎలా ఉంటుంది. బార్బీ డాల్ పట్ల మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది. అసలు బార్బీ తన ప్రపంచం వదిలి భూలోకంలోకి ఎందుకు వచ్చింది? వంటి విషయాల సమాహారమే ఈ మూవీ. అవుట్ అండ్ అవుట్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ‘బార్బీ’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ‘జియో సినిమా’ ఓటీటీ వేదికలో వీక్షించవచ్చు.&nbsp; పూర్‌ థింగ్స్‌ (Poor Things) ఈ సినిమా కథలోకి వెళ్తే.. అసాధారణ శాస్త్రవేత్త గాడ్విన్‌ బాక్స్‌టర్‌.. చనిపోయిన యువతికి తిరిగి జీవం పోస్తాడు. ఆమె మెదడును కడుపులో ఉన్న బిడ్డతో అనుసంధానం చేస్తాడు. దీంతో శిశువు తెలివితేటలు అసాధారణంగా పెరిగిపోతాయి. బయటి ప్రపంచం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో ప్రయాణం మెుదలు పెడుతుంది. ఈ క్రమంలో ఆమెకు అనూహ్య పరిస్థితులు ఎదురవుతాయి. చివరికీ ఏమైంది? అన్నది స్టోరీ. ఈ చిత్రాన్ని డిస్నీ + హాట్‌స్టార్‌లో చూడవచ్చు.&nbsp; అమెరిన్‌ ఫిక్షన్‌ (American Fiction) అమెరికన్‌ ఫిక్షన్ సినిమా.. ఓ నవలా రచయిత చుట్టూ తిరుగుతుంది. కథలోకి వెళ్తే.. మాంక్‌ ఒక తెలివైన గొప్ప నవలా రచయిత. అతడి నవలలకు అకాడెమిక్‌ ప్రశంసలు లభించినా ప్రచురణకు మాత్రం పెద్దగా నోచుకోవు. నల్లజాతీయుడు కావడం చేత మాంక్‌కు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. దీంతో విసుగు చెందిన మాంక్‌.. మనసు లోతుల్లో ఎప్పటి నుంచో దాగున్నా అభిప్రాయాలను ఓ పుస్తకం ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో మాంక్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నది కథ. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.&nbsp; అనాటమి ఆఫ్‌ ఏ ఫాల్‌ (Anatomy of a Fall) ఈ సినిమా మిస్టరీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందింది. కథలోకి వెళ్తే.. శామ్యుల్‌, శాండ్రా భార్య భర్తలు. వారిద్దరు తమ బిడ్డ డానియేల్‌తో కలిసి సంతోషంగా జీవిస్తుంటారు. ఓ రోజు అనుమానస్పద స్థితిలో శామ్యుల్‌ చనిపోతాడు. పోలీసులు అతడి భార్య శాండ్రాపై అనుమానం వ్యక్తం చేస్తారు. పోలీసుల దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగు చూశాయి? శామ్యుల్‌ను హత్య చేసింది ఎవరు? అన్నది కథ. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌&nbsp; (The Zone of Interest) కమాండెంట్‌ రూడొల్ఫ్‌ హాస్‌ తన భార్య, పిల్లలతో కలిసి చెరువుకు ఆనుకొని ఉన్న ఇంటిలో జీవిస్తుంటాడు. అతడి ఇంటి ఆవరణలో ఉండే గార్డెన్‌లో కొందరు బానిసలు పనిచేస్తుంటారు. ఓ రోజు చెరువులో తన పిల్లల మృతదేహాలు రుడోల్ఫ్‌కు కనిపిస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది.&nbsp; ది హోల్డోవర్స్‌ (The Holdovers) టీచర్‌, స్టూడెంట్‌కు మధ్య ఉండే సంబంధాలను ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. ప్రిపరేషన్‌ స్కూల్‌లో క్రాంకీ హిస్టరీ టీచర్‌గా పనిచేస్తుంటాడు. అతడంటే విద్యార్థులకు చాలా భయం. స్కూల్‌కు క్రిస్మస్‌ సెలవులు రావడంతో కొందరు విద్యార్థులు హాలీడేస్‌కు వెళ్లలేకపోతారు. వారికి గార్డియన్‌గా క్రాంకీ ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో టీచర్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ. ఈ చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌లో రెంటల్ విధానంలో చూడవచ్చు.&nbsp; మ్యాస్ట్రో (Maestro) ఈ చిత్రం అద్భుతమైన ప్రేమ కావ్యంగా రూపొందింది. కండక్టర్‌ - స్వరకర్త లియోనార్డ్ బెర్న్‌ స్టెయిన్‌ ఓ కార్యక్రమంలో నటి ఫెలిసియాను చూసి మనసు పడతాడు. ఆమె కూడా అతడ్ని ఇష్టపడటంతో ఇద్దరూ డేటింగ్‌కు వెళ్తారు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారు. వారి వైవాహిక బంధం ఎంత మధురంగా సాగింది? ఈ ప్రయాణంలో వారికి ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని ఎలా అధిగమించారు? అన్నది కథ. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది.&nbsp; కిల్లర్‌ ఆఫ్‌ ద ఫ్లవర్‌ మూన్‌ (Killers of the Flower Moon) లియోనార్డో డికాప్రియో ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా.. గతేడాది విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 1920లో ఒక్లాహోమాలోని ఓసేజ్‌ నేషన్ ల్యాండ్‌ కింద చమురు బయటపడుతుంది. ఆ తర్వాత నుంచి ఆ ప్రాంత ప్రజలు ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఎఫ్‌బీఐ రంగంలోకి దిగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది?&nbsp;అన్నది ప్లాట్‌. ప్రస్తుతం ఈ సినిమా ఆపిల్‌ టీవీ ప్లస్‌లో అందుబాటులో ఉంది. ఆస్కార్‌ నామినేషన్స్‌లో నిలిచిన చిత్రాలు ఆస్కార్ గెలిచిన చిత్రాలతో పాటు ఈ అవార్డుల రేసులో నిలిచిన మరికొన్ని చిత్రాల విశిష్టతను ఓసారి తెలుసుకుందాం. పాస్ట్ లైవ్స్‌ (Past Lives) నోరా, హే సంగ్ అనే ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. నోరా కుటుంబం దక్షిణ కొరియాకు వెళ్లిపోవడంతో వారు విడిపోతారు. ఇరవై సంవత్సరాల తర్వాత వారు తమ ఒకరికొరు ప్రేమలు ఉన్నట్లు గ్రహిస్తారు. వారు తిరిగి ఎలా ఒక్కటయ్యారు? అన్నది స్టోరీ. ఈ సినిమాను కూడా అమెజాన్‌ ప్రైమ్‌లో రెంటల్‌ విధానంలో చూడవచ్చు. ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. సొసైటీ ఆఫ్‌ ది స్నో (Society of the Snow) రగ్బీ బృందంతో ప్రయాణిస్తున్న విమానం.. ప్రమాదవశాత్తు ఆండీస్‌ మంచు పర్వతాల్లో కుప్పకూలుతుంది. ఈ ప్రమాదం నుండి కొందరు ప్రయాణికులు బయటపడతారు. అత్యంత కష్టతరమైన వాతావరణంలో తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు. బాహ్య ప్రపంచానికి తాను బతికే ఉన్నామని చెప్పేందుకు వివిధ రకాలు అన్వేషిస్తారు. మరి వారు ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? అన్నది కథ. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.&nbsp; లో క్యాపిటనో (Lo Capitano) వలసదారులు పడే కష్టాలకు ఈ చిత్రం అద్దం పడుతుంది. ఇద్దరు నల్లజాతి యువకులు యువకులు చేసే సాహస యాత్రనే ఈ చిత్రం కథ. యూరప్ చేరుకోవడానికి డాకర్ నుండి ఇద్దరు యువకులు సెడౌ, మౌసా బయలుదేరుతారు. గమ్యాన్ని చేరుకునే క్రమంలా వారికి ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురయ్యాయి. వాటిని ఎలా అధిగమించారు? చివరికి వారు యూరప్‌ చేరుకున్నారా? లేదా? అన్నది ప్లాట్‌.&nbsp; పర్‌ఫెక్ట్‌ డేస్‌ (Perfect Days) ఆస్కార్‌ నామినేషన్‌లో నిలిచి ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. హిరాయామా అనే వ్యక్తి టోక్యోలో టాయిలెట్ క్లీనర్‌గా పని చేస్తూ సంతృప్తికరమై జీవితాన్ని అనుభవిస్తుంటాడు. క్యాసెట్ టేపులలో సంగీతాన్ని వింటూ, పుస్తకాలు చదువుతూ హాయిగా రోజులు గడుపుతుంటాడు. కొన్ని ఊహించని ఘటనలు అతడి జీవితంలో ఎనలేని మార్పులను తీసుకొస్తాయి.&nbsp; ది టీచర్స్‌ లాంజ్‌ (The Teachers' Lounge) కర్నా నోవాక్‌ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుంటుంది. ఆమె స్టూడెంట్స్‌లో ఒకరు దొంగతనానికి సంబంధించి అనుమానితుడుగా ఉంటాడు. నిజా నిజాలు తెల్చేందుకు ఆమె రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలో ఆమెకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ప్రస్తుతం ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చు.&nbsp;
  మార్చి 11 , 2024

  @2021 KTree