రివ్యూస్
How was the movie?
తారాగణం
శర్వానంద్
రాజా హరిశ్చంద్ర ప్రసాద్సీరత్ కపూర్
ప్రియఅడివి శేష్
నయీం బాషాసంపత్ రాజ్
పోలీస్ కమీషనర్ దిలీప్ కుమార్జయప్రకాష్
ప్రకాష్ (మాజీ పోలీస్ కమిషనర్)కోట శ్రీనివాసరావు
మంత్రి గోవిందరాజువెన్నెల కిషోర్
ముకుందం (రాజు కొడుకు)అలీ
డాక్టర్విద్యుల్లేఖ రామన్
బుజ్జిమఅజయ్ ఘోష్
రాజు అసిస్టెంట్చత్రపతి శేఖర్
ఎండీ. ఖలీద్ బాషాసుజీత్
స్వయంగాసిబ్బంది
సుజీత్
దర్శకుడుV. వంశీ కృష్ణా రెడ్డినిర్మాత
ప్రమోద్ ఉప్పలపాటినిర్మాత
సుజీత్
రచయితజిబ్రాన్
సంగీతకారుడుR. మధి
సినిమాటోగ్రాఫర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Tatva Review in Telugu: 58 నిమిషాల నిడివితో అర్ధరాత్రి జరిగే క్రైమ్ థ్రిల్లర్.. ‘తత్వ’ మెప్పించిందా?
నటీనటులు : హిమ దాసరి, పూజా రెడ్డి బోరా, ఒస్మాన్ ఘని తదితరులు
దర్శకత్వం : రుత్విక్ యాలగిరి
సంగీతం : సాయి తేజ
సినిమాటోగ్రాఫర్ : సి. హెచ్. సాయి
ఎడిటింగ్: జై సి. శ్రీకర్
ఆర్ట్ డైరెక్టర్ : అరవింద్ ములే
నిర్మాత : మానస దాసరి
ఓటీటీ వేదిక : ఈటీవీ విన్
ఈ మధ్యకాలంలో ఓటీటీలో ఎన్నో విభిన్నమైన కథలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈటీవీ విన్ వారానికి ఒక వైవిధ్యమైన సినిమాను తీసుకొస్తూ ప్రేక్షలను అలరిస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారం 'తత్వ' (Tatva Review In Telugu) అనే సస్పెన్స్ థ్రిల్లర్‌ను నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది. ఇందులో హిమ దాసరి, పూజా రెడ్డి బోరా జంటగా నటించారు. రుత్విక్ యాలగిరి దర్శకత్వం వహించారు. కేవలం గంట నిడివితో వచ్చిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
ఆరిఫ్ (హిమ దాసరి) ఒక సాధారణ ట్యాక్సీ డ్రైవర్. అనుకోకుండా అతడికి డబ్బు అవసరం పడుతుంది. ఈ క్రమంలో బిజినెస్ మ్యాన్ థామస్ (ఒస్మాని ఘని) ఆరిఫ్ ట్యాక్సీ ఎక్కుతాడు. తనకు కావాల్సిన డబ్బు థామస్ దగ్గర ఉందని గ్రహించిన ఆరిఫ్ అతడి నుంచి ఎలాగైన డబ్బు తీసుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలోనే అనుకోని విధంగా థామస్ హత్య జరుగుతుంది. ఇందులో ఆరిఫ్ ఇరుక్కుంటాడు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు పోలీసు ఆఫీసర్ జ్యోత్స్న (పూజా రెడ్డి బోరా) రంగంలోకి దిగుతుంది. అసలు థామస్‌ను హత్య చేసింది ఎవరు? ఆరిఫ్ ఈ కేసులో ఎలా ఇరుక్కున్నాడు? థామస్ - ఆరీఫ్ మధ్య రిలేషన్ ఏంటి? ఆరీఫ్ నిర్దోషిగా బయటపడ్డాడా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
సినిమాకి మెయిన్ హీరో హిమ దాసరి అయినప్పటికీ నటుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్న వ్యక్తి మాత్రం ఒస్మాన్ ఘని. థామస్ పాత్రకు అతడు ప్రాణం పోశాడు. ఓ వైపు నవ్విస్తూనే తన నటనతో ఆలోచింపజేశారు. ఇక ఆరీఫ్ పాత్రలో హిమ దాసరి కూడా అలరించాడు. కష్టాల్లో ఉన్న యువకుడిగా అతడి నటన సహజంగా అనిపిస్తుంది. నటి పూజా రెడ్డికి ఇందులో మంచి పాత్రే దక్కింది. ప్రారంభంలో ఆమె రోల్ సాదా సీదాగా అనిపించిన క్లైమాక్స్ వచ్చే సరికి ఆశ్చర్యపరుస్తుంది. కథను మలుపు తిప్పడంలో ఆమె పాత్రనే కీలకం. కథ మెుత్తం ప్రధానంగా ఈ మూడు పాత్రల చుట్టే తిరిగింది. ఇతర నటీనటులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
‘రన్ రాజా రన్’, ‘సాహో’ చిత్రాలకు సుజీత్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన రుత్విక్ తనదైన శైలిలో థ్రిల్లింగ్‌గా ఈ సినిమాను రూపొందించారు. మనిషిలో మానవత్వం అంతరిచిపోతున్నదనే విషయాన్ని వివరించిన విధానం బాగుంది. ముఖ్యంగా మెుదటి 20 నిమిషాలు చాలా ఆసక్తికరంగా చూపించారు. తన చెప్పాలనుకున్న పాయింట్స్‌ను ఎలాంటి తికమక లేకుండా నేరుగా చెప్పే ప్రయత్నం చేశారు. సినిమాను అనవసరంగా సాగదీయకుండా 58 నిమిషాల్లోనే ముగించడం బాగా ప్లస్ అయ్యింది. అయితే కొన్ని సీన్స్ లాజిక్‌కు దూరంగా, అసంపూర్ణంగా ఉండటం మైనస్‌గా మారింది. ఈ విషయంలో దర్శకుడు జాగ్రత్త పడి ఉండే రిజల్ట్ ఇంకా బెటర్‌గా ఉండేది. సాంగ్స్, ఫైట్స్, రొమాన్స్, లవ్‌ట్రాక్ వంటి కమర్షియల్ హంగులు కోరుకునేవారికి మాత్రం ఈ సినిమా అంతగా ఎక్కకపోవచ్చు. ఓవరాల్‌గా దర్శకుడు రుత్విక్ పనితనం మెప్పిస్తుంది.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ మంచి పనితీరు కనబరిచారు. సినిమా మెుత్తం అర్ధరాత్రి సాగడంతో లో-లైట్‌లోనూ మంచి విజువల్స్ అందించారు. నేపథ్య సంగీతం కూడా సినిమాకు అదనపు బలంగా మారింది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. టెక్నికల్‌గా చూసుకుంటే 'తత్వ'కి మంచి మార్కులే పడ్డాయి.
ప్లస్ పాయింట్స్
ఆరిఫ్, థామస్ పాత్రలుకెమెరా వర్క్‌నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
కమర్షియల్ హంగులు లేకపోవడంఅసంపూర్ణమైన క్లైమాక్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
అక్టోబర్ 11 , 2024
Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
టాలీవుడ్ హీరోల స్థాయి సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోలు కూడా మన హీరోల క్రేజ్‌ను అందుకోలేకపోతున్నారు. హీరోల పారితోషికంతో పాటు అనభవించే సౌకర్యాలు ఘనంగా ఉంటున్నాయి. ఒక్కో హీరో రూ.10 కోట్ల నుంచి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మరి ఈ రేంజ్‌లో వసూలు చేస్తున్న తెలుగు హీరోల లైఫ్‌స్టైల్ ఇలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వారు వాడే ప్రతి వస్తువు చాలా లగ్జరీగా, లావీష్‌గా ఉంటుంది. ఇక మన హీరోలు ఎలాంటి కార్లు వాడుతున్నారు. ఏ కారు ఎంత ధర ఉంది.టాలీవుడ్ హీరోల్లో ఎవరి దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయి. అత్యధిక ధర కలిగిన కారు ఎవరి దగ్గర ఉంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
[toc]
సూపర్ స్టార్ మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్‌బాబు దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తం ఆయన దగ్గర రూ.14 కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి. రీసెంట్‌గా ఆయన గోల్డ్ కలర్ రెంజ్ రోవర్ కొనుగోలు చేశాడు. దీని ధర రూ.5కోట్లు. మహేష్ బాబుకు మెర్సిడెస్ కార్లంటే తెగ ఇష్టం. ఈ బ్రాండ్‌కు సంబంధించిన అనేక కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ E క్లాస్‌తో పాటు.. మెర్సిడెస్ GL క్లాస్ కార్లు లగ్జరీ కార్ల జాబితాలో ఉన్నాయి.
వీటితో పాటు రూ.1.90కోట్లు విలువ చేసే Audi E-Tron, రూ.2.80 కోట్ల విలువ చేసే లంబోర్గిని గాలర్డో వంటి విలాసవంతమైన కార్లు ఆయన సేకరించారు.
జూనియర్ ఎన్టీఆర్ కార్ కలెక్షన్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర కూడా అదిరిపోయే లగ్జరీ కార్ల లైనప్ ఉంది. ఇటీవల ఆయన రెండు కార్లు కొన్నారు. మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ ఎస్- క్లాస్(Mercedes-Benz Maybach S - Class) దీనిని తనకు ఇష్టమైన బ్లాక్ కలర్ వేరియంట్‌లో తీసుకున్నాడు. దీని ధర రూ.4.23 కోట్లు. మరో లగ్జరీ కారు హ్యూందాయ్ ఎలక్ట్రిక్ కార్ ఐయానిక్ 5 (hyundai electric car ioniq 5 black) తీసుకున్నారు. దీని ధర రూ.55.2 లక్షలు. ఈ రెండు కార్ల ధరే దాదాపు రూ.5 కోట్లు దాటింది.
https://twitter.com/sarathtarak9/status/1775161795440971956
వీటితో పాటు భారత దేశంలోని మొట్టమొదటి లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్‌ను ఆయన రూ. 3.16 కోట్ల ధరతో ఇంటికి తీసుకొచ్చాడు. ఈ కారును 2021లో కొన్న ఎన్టీఆర్.. అప్పట్లో వార్తల్లో నిలిచాడు. మరో విషయం ఏమిటంటే ఈ కారుకు తన లక్కీ నంబర్.. 9999 రిజిస్ట్రేషన్ కోసం ఏకంగా ఆయన రూ.17 లక్షలు చెల్లించాడు.
జూనియర్ ఎన్టీఆర్ దగ్గర రేంజ్ రోవర్ వోగే (Range Rover Vogue) కూడా ఉంది. దీని ధర అక్షరాల రూ.2 కోట్లు. దీనితో పాటు BMW 7 సిరీస్( రూ.1.799 కోట్లు), పోర్సే 718(Porsche 718 Cayman) దీని ధర రూ. 2.54 కోట్లు. ఇది కేవలం 3.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది.
విషేషమేటిటంటే ఈ లగ్జరీ కార్లన్నింటి నెంబర్లు 9999 కావడం గమనార్హం.
ప్రభాస్ కార్ కలెక్షన్లు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల్లోనే కాదు.. లగ్జరీ కార్ల విషయంలోనూ బాహుబలే. ఏ హీరో దగ్గరలేనన్ని కార్లు ప్రభాస్ దగ్గర ఉన్నాయి. వాటిలో అత్యంత ఖరీదైన కార్లను ఇప్పుడు చూద్దాం.
ప్రభాస్ గ్యారేజ్‌లో ఇప్పటికే BMW X3 (రూ.56 లక్షలు), జాగ్వర్ XJL 3.0 (రూ.1.97 కోట్లు), రేంజ్ రోవర్ SV ఆటోబయోగ్రఫీ (రూ.1.84 కోట్లు), లంబోర్గిని అవెంటడార్ రోడ్‌స్టర్ (రూ.6 కోట్లు) లాంటి ఖరీదైన, ఫారెన్ బ్రాండెడ్ కార్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రభాస్ కలెక్షన్‌లో ఉన్న చిన్నచిన్న కార్లు మాత్రమే. వీటిని తలదన్నే అత్యంత ఖరీదైన కారు కూడా ఉంది. అది ఏంటంటే?
ప్రభాస్ కలెక్షన్లలో అత్యంత ఖరీదైన కారు రూ.8 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉంది. దీని కోసం ప్రభాస్ ఏకంగా రూ.2.5 కోట్లు అదనంగా ఖర్చు చేసి, కస్టమైజేషన్ కూడా చేశారు. అంటే ప్రభాస్ సినిమాల్లోనే కాదు, కార్ల కలెక్షన్ల్లోనూ బాహుబలే అని స్పష్టమవుతోంది. ప్రభాస్ గ్యారేజీలోని ఈ ఫ్యాన్సీ కార్లు గురించి మరింత వివరంగా ఇప్పుడు చూద్దాం.
Rolls Royce Phantom : ప్రభాస్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత విలువైనది. రోల్స్ రాయిస్ ఫాంటమ్. ఇది ప్రప్రంచంలోని ఖరీదైన కార్లలో ఒకటి. దీని ధర రూ. 8-10 కోట్ల మధ్యలో ఉంటుంది. ఇలాంటి కారు మనదేశంలో కొద్ది మంది సెలబ్రెటీల దగ్గర మాత్రమే ఉంది. అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్ల దగ్గర ఈ కారు ఉంది.
Rolls Royce Ghost
ప్రభాస్ గ్యారేజ్‌లో ఉన్న మరో లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్. దీని ధర ఏకంగా రూ.7.95కోట్లు
Jaguar XJL
ప్రభాస్ ఇష్టమైన లగ్జరీ కార్లలో సిల్వర్ జాగ్వర్ XJLకు ప్రత్యేక స్ధానం ఉంది. ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగిన తర్వాత కొనుగోలు చేసిన తొలి విలాసవంతమైన కారు ఇదే. దీని ధర రూ.2 కోట్లు.
Audi R8: ప్రభాస్ లగ్జరీ కార్ల జాబితాలో చేరిన మరో విలాసవంతమైన కారు ఆడి R8. దీని ధర అక్షరాల రూ.2.30 కోట్లు
BMW X5
ప్రభాస్ గ్యారేజ్‌లో బ్లాక్ బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 కారు ఉంది. దీని ధర రూ.1.2కోట్లకు పైగా ఉంటుంది. 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. ఇది 255 PS పవర్, 560 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
Lamborghini Aventador Roadster
లంబోర్గినీ వెంచర్‌లో ఇది ప్రత్యేకమైనది. ఇది లీటర్‌కు 5.0 kmpl మైలేజ్ మాత్రమే ఇస్తుంది. దీనిలో ఇంధనం నిలిపేందుకు ఇచ్చిన ట్యాంక్ సామర్థ్యం 90లీటర్లు. అతి తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు ద్వారా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. దీని ధర అక్షరాల 6.5 కోట్లు ఉంటుంది.
Range Rover SV Autobiography
ప్రభాస్ లగ్జరీ లైనప్‌లో ఇది మరో సూపర్బ్ కారు. ఇది కేవలం 3 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. దీని ధర రూ.6కోట్లకు పైనే ఉంటుంది.
అల్లు అర్జున్ లగ్జరీ కార్ కలెక్షన్స్
పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్యారెజీలో సూపర్బ్ లగ్జరీ కార్ల లైనప్ అయితే ఉంది వాటిపై ఓ లుక్ వేద్దాం.
జాగ్వార్ XJL
దీని ధర రూ.2 కోట్లు. ఇది బన్నీ కొన్న మొదటి లగ్జరీ కార్. ఇదే కారు ప్రభాస్ దగ్గర కూడా ఉంది. ఇది వైట్ కలర్‌లో ఉంటుంది.
హమ్మర్ H2
అల్లు అర్జున్ లగ్జరీ లైనప్‌లో ఉన్న మరో కారు... హమ్మర్ H2. దీని ధర రూ.75 లక్షలు. దీనిని ముద్దుగా బన్నీ 'బ్యాడ్ బాయ్'గా పిలుచుకుంటారు.
వోల్వో XC90 T8
ఇది వోల్వో ఫ్లాగ్‌షిప్ SUV దీని ధర ఏకంగా రూ.1.5 కోట్లు
ఇటీవల ఆయన గ్యారేజ్‌లోకి రేంజ్ రోవర్ చేరింది. అల్లు అర్జున్ దీనిని 'ది బీస్ట్‌గా' పిలుస్తారు. దీని ధర రూ.2.3కోట్లు.
ఇక అల్లు అర్జున్ వెహికల్ కలెక్షన్‌లో స్టార్ హీరో వ్యానిటీ వ్యాన్. దీనిని బన్నీ ప్రత్యేకంగా కస్టమైజ్ చేయించుకున్నారు. దీని ధర రూ.7కోట్లకు పైమాటే.
రామ్‌చరణ్ లగ్జరీ కార్ కలెక్షన్లు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లోనే కాదు.. కార్ల కలెక్షన్లలోనూ సూపర్ స్టారే. విలాసవంతమైన కార్లకు చెర్రీ పెద్ద అభిమాని. మరి రామ్ చరణ్ గ్యారేజీలో ఉన్న లగ్జరీ కార్లపై ఓలుక్కేద్దాం.
Ferrari Portofino
రామ్‌చరణ్ కలెక్షన్స్‌లో అత్యంత వార్తల్లో నిలిచింది ఫెరారీ పోర్టోఫినో. దీని ధర దాదాపు రూ. 3.50 కోట్లపైనే ఉంటుంది. ఇది రెడ్ కలర్‌లో ఉంటుంది. ఈకారును అప్పుడప్పుడు హైదరాబాద్ వీధుల్లో చరణ్ తిప్పుతుంటాడు.
View this post on Instagram A post shared by abhi's photography📸 (@abhi__photographyy)
ఈ కార్ మాత్రమే కాకుండా రామ్ చరణ్ దగ్గర అతి పెద్ద లగ్జరీ కార్ల వాహన శ్రేణి ఉంది.
రోల్స్ రాయిస్ ఫాంటమ్ - రూ 9.57 కోట్లు
మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 — రూ. 4 కోట్లు
https://twitter.com/ManobalaV/status/1437059410321309702
ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ V8 — రూ. 3.2 కోట్లు
ఫెరారీ పోర్టోఫినో - రూ 3.50 కోట్లు
రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ 2.75 కోట్లు
BMW 7 సిరీస్ - రూ. 1.75 కోట్లు
Mercedes Benz GLE 450 AMG కూపే — రూ. 1 కోటి
ఈ లగ్జరీ కార్ల లైనప్‌తో పాటు రామ్ చరణ్ వద్ద ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉంది. తరచుగా ఆ జెట్‌లో దూర ప్రాంతాలకు విదేశాలకు వెళ్లి వస్తుంటాడు.
https://twitter.com/HelloMawa123/status/1502241248836349956
విజయ్ దేవరకొండ లగ్జరీ కార్ కలెక్షన్లు
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు లగ్జరీ కార్లంటే అందరి హీరోల్లాగే మక్కువ. విజయ్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత ఖరీదైనది బెంట్లీ కాంటినెంటల్ జీటీ. దీని ధర సుమారు రూ.4కోట్లు. ఇదే కారు విరాట్ కోహ్లీ దగ్గర కూడా ఉంది. అతని దగ్గర ఆకట్టుకునే కలెక్షన్ ఉంది.BMW 5 సిరీస్ 520d దీని ధర సుమారు రూ.75 లక్షలు, అలాగే రూ.62 లక్షల విలువైన ఫోర్డ్ ముస్టాంగ్‌ను కలిగి ఉన్నాడు. దీనితో పాటు Benz GLS 350 వంటి హైఎండ్ కారు అతని గ్యారేజ్‌లో పార్క్ అయి ఉంది. దీని దాదాపు కోటి రూపాయలు. Volvo XC90 (సుమారు INR 1.31 కోట్లు), Audi Q7 దీని ధర రూ.74 లక్షలుగా ఉంది. దీంతో పాటు విజయ్ దేవరకొండకు ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. తరచుగా తన కుటుంబంతో చార్టర్డ్ విమానాలలో ప్రయాణిస్తుంటాడు.
https://www.youtube.com/watch?v=vkS_uio8ix8
నాగచైతన్య లగ్జరీ కార్ కలెక్షన్లు
అక్కినేని నాగ చైతన్య గ్యారేజ్‌లో పార్క్ చేసిన విలాసవంతమైన కార్లు ఓసారి చూద్దాం. ఈ కార్ల వెరియంట్ల లిస్ట్ చూస్తే అతనికి లగ్జరీ కార్లంటే ఎంత ఇష్టమో అర్ధమవుతుంది.
ఫెరారీ 488GTB — (రూ. 3.88cr)
నిస్సాన్ GT-R — (రూ. 2.12cr)
Mercedes –Benz G-Class G 63 AMG — (రూ. 2.28cr)
BMW 740 Li — (రూ. 1.30cr)
నిస్సాన్ GT-R — (రూ. 2.12cr)
2X ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ — (రూ. 1.18cr)
MV అగస్టా F4 — (రూ. 35L)
BMW 9RT — (రూ. 18.50L)
View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni)
https://twitter.com/baraju_SuperHit/status/859824197706465280
View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth)
నాని లగ్జరీ కారు కలెక్షన్
నాని దగ్గర లగ్జరీ కార్ కలెక్షన్ ఉంది. రేంజ్ రోవర్ వోగ్(range rover vogue) ఉంది. దీని ధర రూ.2కోట్ల 75 లక్షలు, BMW 5 సిరీస్- దీని ధర రూ.60లక్షలు, టయోట ఫార్చునర్(రూ.42లక్షలు), టయోటా ఇన్నోవా క్రిస్టా(రూ.25లక్షలు) ఉన్నాయి. ఫోర్డ్ ఫియాస్టా కారు కూడా నాని గ్యారేజీలో ఉంది. ఈ కారంటే నానికి చాలా ఇష్టమని చాలా సందర్బాల్లో చెప్పాడు.
https://www.youtube.com/watch?v=KuOxAHUisOg
రామ్‌పొత్తినేని లగ్జరీ కారు కలెక్షన్
రామ్ పోతినేని దేవదాసుతో అరంగేట్రం చేసి మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రెడీ, కందిరీగ, పండగ చేస్కో, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. సినిమాల్లో ఏ రేంజ్‌లో ఉన్నాడో విలాసవంతమైన కార్లున్న హీరోల్లోనూ రామ్ అదే స్థాయిలో ఉన్నాడు.
అతని కార్ కలెక్షన్లలో ప్రముఖంగా
రూ. 2.30 కోట్ల విలువైన రేంజ్ రోవర్,
రూ. 2.10 కోట్ల విలువైన నిస్సాన్ GTR,
రూ.2.50 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ .
రూ. 1.20 కోట్ల విలువైన పోర్సే సియానీ(porsche cayenne)-
రూ. కోటి విలువైన BMW X3.
https://www.youtube.com/watch?v=hnhUYoAy0PE
విష్వక్ సేన్ లగ్జరీ కారు కలెక్షన్
విశ్వక్ సేన్ నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగాను ఆయనకు గుర్తింపు ఉంది. 'వెళ్లిపోమాకే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ద్వారా ఆయనకు గుర్తింపు లభించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. ఇక తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ఫలక్‌నామాదాస్' చిత్రం సైతం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'హిట్', 'అశోకవనంలో అర్జున కళ్యాణం', 'దాస్‌కా ధమ్కీ', 'ఓరిదేవుడా' వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇతను జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు.
విశ్వక్‌కు సినిమాలంటే ఎంత ఇంట్రెస్టో లగ్జరీ కార్లంటే అంత ఇష్టం. విశ్వక్ దగ్గర రూ.90 లక్షల విలువైన రేంజ్ రోవర్ కారుతో పాటు ఇటీవల ఓ కొత్త కారును తన లగ్జరీ కార్ల లిస్ట్‌లోకి చేర్చాడు. బెంజ్ జీ క్లాస్ బ్లాక్ కలర్ వేరియంట్‌ను రూ.1.50 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇది తన డ్రీమ్ కారు అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు
శర్వానంద్ లగ్జరీ కార్ కలెక్షన్
శర్వానంద్ తెలుగులో స్టార్ హీరో. విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. కెరీర్ ఆరంభంలో పెద్ద హీరోల సరసన చిన్న చిన్న పాత్రల్లో నటించడం వల్ల ఇతనికి గుర్తింపు లభించింది. క్రమంగా అవకాశాలు పెరిగాయి. క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన 'గమ్యం' సినిమా ఇతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత సుజీత్ డెరెక్షన్‌లో వచ్చిన రన్ రాజా రన్ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', ఎక్స్‌ప్రెస్ రాజా, క్లాస్‌మేట్స్, శతమానంభవతి, రాధ, 'పడి పడి లేచె మనసు', జర్నీ 'శ్రీకారం' వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరో స్థాయి ఎదిగాడు. ఈక్రమంలో శర్వానంద్ సెకరించిన లగ్జరీ వాహన శ్రేణిని ఓసారి చూద్దాం.
రెంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ ప్రిమీయం వెర్షన్- రూ.3.34కోట్లు
ఆడి Q7- రూ. 90 లక్షలు
BMW 530D- రూ. 75 లక్షలు
ఫోర్డ్ ఎండేవర్- రూ.36 లక్షలు
నిఖిల్ సిద్ధార్థ్ లగ్జరీ కారు కలెక్షన్
హ్యాపీ డేస్ చిత్రంతో తెరంగేట్రం చేసిన నిఖిల్ సిద్ధార్థ.. అంచెలంచేలుగా ఎదిగాడు. ‘యువత’, ‘వీడు తేడా’ వంటి చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ కమర్షియల్ బ్రేక్ రాలేదు. కార్తికేయ(2014) చిత్రంతో కమర్షియల్‌గా సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, కిరాక్ పార్టీ, కార్తికేయ 2, 18 పేజెస్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. కార్తికేయ 2 చిత్రం నిఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా నిఖిల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నిఖిల్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర విలువైన వాహన శ్రేణి ఉంది. ఓసారి దానిపై లుక్కేద్దాం.
రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ.3.43కోట్లు
Fiery Red Mercedes Sports Coupe- దీని ధర రూ.3.33కోట్లు
https://twitter.com/actor_Nikhil/status/1353350557109424128
https://twitter.com/actor_Nikhil/status/612984749645148160
రోల్స్ రాయిస్ గోస్ట్ - రూ.7.50 కోట్లు
https://www.youtube.com/watch?v=HAp_5y1FSSI
సిద్ధు జొన్నలగడ్డ లగ్జరీ కార్ కలెక్షన్
సిద్ధు జొన్నలగడ్డ నటుడిగానే కాకుండా రచయితగాను మంచి పేరు సంపాదించాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి ముందు జోష్, ఆరంజ్, భీమిలి సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించాడు. గుంటూరు టాకీస్ చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. ఈ చిత్రానికి రచయితగా వ్యవహరించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ కమర్షియల్‌గా బ్రేక్ రాలేదు. అయితే 2022లో విడుదలైన డిజె టిల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంతో సిద్ధు స్టార్ డం సంపాదించాడు. సిద్దు జొన్నల గడ్డ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాడు.
సిద్ధు జొన్నలగడ్డ దగ్గర.. రూ.3.43 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఉంది. ఈ కారును సిద్ధు.. డీజే టిల్లు సినిమా హిట్ తర్వాత కొనుగోలు చేశాడు.
https://www.youtube.com/watch?v=8CM-HSifLsY
అక్టోబర్ 22 , 2024
HBD Sujeeth: ‘ఓజీ’ డైరెక్టర్ సుజీత్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ తెలుసా?
యంగ్ డైరెక్టర్ సుజీత్ (HBD Sujeeth) టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఇప్పటివరకూ చేసింది రెండే చిత్రాలే అయినప్పటికీ పది చిత్రాలు చేసినా రానీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ‘రన్ రజా రన్’తో డైరెక్టర్‌గా మారిన సుజీత్ ‘సాహో’ (Saaho)తో పాన్ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తో ‘ఓజీ’ చిత్రాన్ని తెరకెకిస్తూ మెగా ఫ్యాన్స్ దృష్టంతా తన వైపునకు తిప్పుకున్నాడు. ఇవాళ ఈ టాలెంటెడ్ డైరెక్టర్ పుట్టిన రోజు. 34వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఆయన కెరీర్‌లోని సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
17 ఏళ్లకే షార్ట్ ఫిల్మ్స్
సుజీత్ రెడ్డి ఏపీలోని అనంతపురంలో 1990 అక్టోబర్ 26న జన్మించాడు. తొలుత చార్టెట్ అకౌంటెండ్ (CA) కావాలని కలలు కన్నాడు. సినిమాలపై ఆసక్తి పెరగడంతో L.V. ప్రసాద్ ఫిల్మ్ & టీవీ అకాడమీలో ఫిల్మ్ కోర్సు చేశాడు. 17 ఏళ్లకే యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేయడం మెుదలు పెట్టాడు. ఇప్పటివరకూ 30కి పైగా షార్ట్‌ఫిల్మ్‌ను సుజీత్ తెరకెక్కించాడు.
షార్ట్ ఫిల్మ్స్‌లో క్రియేటివిటీ
సాధారణంగా యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ అంటే తక్కువ బడ్జెట్‌తో రూపొందుతుంటాయి. వాటి నుంటి హై స్టాండర్డ్స్‌ను ఎవరు పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయరు. కానీ సుజీత్ తెరకెక్కించిన ‘రన్ రాజా రన్’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘తొక్కలో లవ్ స్టోరీ’, ‘వేషం’, ‘యుద్ధం’, ‘ప్రేమ కేరాఫ్ డ్రామా’, ‘ఇండియన్ ఐడల్’ వంటి షార్ట్‌ఫిల్మ్‌ను చాలా రిచ్‌గా తెరకెక్కించి సినీ ఇండస్ట్రీ వాళ్లను ఆశ్చర్యపరిచాడు. తన క్రియేటివిటీ మెస్మరైజ్ చేశాడు.
View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign)
తొలుత ఫ్యామిలీ ఒప్పుకోలేదట
తను డైరెక్టర్ అవుతానని సుజీత్ చెప్పినప్పుడు కుటుంబ సభ్యులు విముఖత వ్యక్తం చేశారట. అయితే సినిమాపై అతడికి ఉన్న శ్రద్ధ చూసి ఫైనల్‌గా ఓకే చెప్పారట. అంతే కాదు సుజీత్ ఫస్ట్ కెమెరాను అతని తల్లి స్వయంగా తన డబ్బులతో కొనుగోలు చేసి గిఫ్ట్‌గా ఇచ్చిందట. అలా తల్లి, కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో సుజీత్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు.
పూరి జగన్నాథ్ సూచనతో
డైరెక్టర్ కావాలన్న లక్ష్యంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుజీత్ తొలుత అసిస్టెంట్ డైరెక్టర్‌గా పూరి జగన్నాథ్ దగ్గర పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆయన్ను కలవగా అప్పటికే డైరెక్టర్ స్కిల్స్ పుష్కలంగా ఉన్నాయని పూరి చెప్పారు. దీంతో డైరెక్టర్‌గా సుజీత్ ప్రయత్నాలు మెుదలుపెట్టాడు.
23 ఏళ్లకే డైరెక్టర్‌గా..
డైరెక్టర్ ఛాన్స్ కోసం సుజీత్ ప్రయత్నిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అతడి టాలెంట్‌ను గుర్తించి అవకాశమిచ్చింది. 'రన్ రాజా రన్' చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చింది. అలా 23 ఏళ్లకే సుజీత్ డైరెక్టర్‌గా మారాడు. తొలి చిత్రంతోనే సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు.
షార్ట్ ఫిల్మ్‌నే సినిమా తీసి..
తనకు ఎంతగానో గుర్తింపు తీసుకొచ్చిన ‘రన్ రాజా రన్’ షార్ట్ ఫిల్మ్‌నే తన ఫస్ట్ ఫిల్మ్‌గా సుజీత్ తెరకెక్కించడం విశేషం. షార్ట్ ఫిల్మ్‌లోని స్టోరీ కొద్దిగా మార్పులు చేసిన సినిమాను తెరకెక్కించడం గమనార్హం.
బాహుబలి కంటే ముందే
తొలి చిత్రాన్ని నిర్మించిన యువీ క్రియేషన్స్ వాళ్లే ప్రభాస్‌తో ‘మిర్చి’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ క్రమంలో ప్రభాస్‌తో రెండో ఫిల్మ్ ప్లాన్ చేయాలని యువీ క్రియేషన్స్ భావించగా తన వద్ద కథ ఉందంటూ సుజీత్ తెలియజేశాడు. ఆ స్టోరీని ప్రభాస్‌కు చెప్పగా బాగా నచ్చిందట. అయితే అప్పటికీ బాహుబలి రిలీజ్ కాలేదు. బాహుబలి రిలీజ్ తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరగడంతో కథలో సుజీత్ మార్పులు చేశాడు. అలా ‘సాహో’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయిన అంత చిన్న వయసులో సుజీత్ పనితనం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign)
ఫ్యాన్ నుంచి పవన్‌ను డైరెక్ట్ చేసే స్థాయికి..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు సుజీత్ వీరాభిమాని. జానీ సినిమాకు తలకు బ్యాండ్ కట్టుకొని మరి థియేటర్‌కు వెళ్లినట్లు ఓ ఇంటర్వ్యూలో సుజీత్ చెప్పారు. ఏడు రోజుల పాటు బ్యాండ్‌ను అలాగే ఉంచుకున్నట్లు స్పష్టం చేశారు. అటు గబ్బర్ సింగ్ రిలీజ్ సమయంలోనూ ర్యాలీగా థియేటర్‌కు వెళ్లినట్లు సుజీత్ అన్నారు. అటువంటి స్టేజ్ నుంచి ‘ఓజీ’తో పవన్‌ను డైరెక్ట్ చేసే స్థాయికి సుజీత్ ఎదగడం సాధారణ విషయం కాదు.
జపనీస్ సినిమాలంటే చాల ఇష్టం
డైరెక్టర్ సుజీత్‌కు జపనీస్ సినిమాలంటే చాలా ఇష్టమట. ఓ ఇంటర్వూలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. పవన్ ‘ఓజీ’ సినిమాపైనా జపనీస్ సినిమాల ప్రభావం ఉంటుందని అంటున్నారు.
View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign)
ఫ్రెండ్స్‌తో ట్రావెలింగ్
సుజీత్ తీరిక దొరికినప్పుడుల్లా స్నేహితులతో గడిపేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. వారితో కలిసి వరల్డ్ టూర్‌కు వెళ్తుంటారు. అక్కడ దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఉంటారు.
View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign)
క్రికెట్ అంటే పిచ్చి
సుజీత్‌కు క్రికెట్ అంటే మహా ఇష్టం. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid), సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) అతడి తన ఫేవరేట్ ప్లేయర్స్ అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.
భక్తి ఎక్కువే
సుజీత్‌కు భక్తి కాస్త ఎక్కువనే చెప్పాలి. సమయం దొరికినప్పుడూ దేవాలయాలను సందర్శిస్తుంటాడు.
View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign)
ప్రేయసితో వివాహం
దర్శకుడు సుజీత్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 2020లో కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రవల్లికను వివాహం చేసుకున్నారు.
https://twitter.com/Filmiparadise/status/1271319435127603205
ఉత్తమ డైరెక్టర్‌గా
తాను డైరెక్ట్ చేసిన తొలి సినిమా రన్ రాజా రన్ చిత్రానికి ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌గా నంది అవార్డ్స్‌లో సుజీత్ నామినేట్ అయ్యాడు. ఆ తర్వాత అతని రెండో చిత్రం సాహోకు గాను ఉత్తమ డైరెక్టర్‌గా సైమా అవార్డు పొందాడు.
బర్త్‌డే స్పెషల్ వీడియో
నేడు దర్శకుడు సుజీత్ పుట్టినరోజు సందర్భంగా అతనికి బర్త్‌డే విషెస్ తెలుపుతూ ‘ఓజీ’ టీమ్ స్పెషల్ వీడియోను పంచుకుంది. షూటింగ్ స్పాట్‌లో సుజీత్‌కి సంబంధించిన వీడియో క్లిప్స్‌ను ఒక దగ్గర చేర్చి నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
https://twitter.com/i/status/1850075370994925843
అక్టోబర్ 26 , 2024
Dacoit: మోసం చేశావ్ మృణాల్.. అడవి శేష్ కామెంట్స్ వైరల్
టాలీవుడ్ నటుడు అడివి శేష్ (Adivi Sesh) వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ‘ఎవడు’, ‘మేజర్’, ‘హిట్ 2’ వంటి హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే ‘డెకాయిట్: ఏ లవ్ స్టోరీ’ (Dacoit: A Love Story) అనే ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను అడివి శేష్ పట్టాలెక్కించారు. ఈ చిత్రానికి షానీల్ డియో డైరెక్షన్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా 'డెకాయిట్' హీరోయిన్‌ను అనౌన్స్ చేశారు. ఇందులో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటిస్తున్న ప్రకటించారు. దీంతో హీరో అడివి శేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్టు పెట్టాడు. మోసం చేశావంటూ రాసుకొచ్చాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
‘ప్రేమించి మోసం చేశావ్’
యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) ప్రస్తుతం ‘డెకాయిట్’ (Dacoit: A Love Story) అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో కొత్త పోస్టర్‌ను షేర్ చేసిన అడివి శేష్ 'ప్రేమంచావు.. కానీ మోసం చేశావు.. విడిచిపెట్టను.. తేలాల్సిందే' అని క్యాప్షన్ పెట్టారు. దీనికి మృణాల్ ఠాకూర్ స్పందిస్తూ 'వదిలేశాను.. కానీ మనస్ఫూర్తిగా ప్రేమించాను' అంటూ సమాధానం చెప్పింది. అయితే ఈ వ్యాఖ్యలు సినిమాలో తమ పాత్రలకు సంబంధించి ఒకరికొకరు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో మృణాల్ - అడివి శేష్ ప్రేమించుకొని, ఓ బలమైన కారణం వల్ల విడిపోతారని అర్థమవుతోంది.
https://twitter.com/AdiviSesh/status/1868899040303431969
హ్యాండ్ ఇచ్చిన శ్రుతి హాసన్!
డెకాయిట్ చిత్రాన్ని అనౌన్స్ చేసినప్పుడే హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్స్, టీజర్‌ను సైతం గతంలో రిలీజ్ చేశారు. ఇక సినిమాను పట్టాలెక్కించడమే తరువాయి అనుకున్న క్రమంలో ఈ ప్రాజెక్ట్ నుంచి అనూహ్యంగా శ్రుతి హాసన్ తప్పుకుంది. అయితే దీనికి గల స్పష్టమైన కారణాలు ఏంటో బయటకు రాలేదు. మూవీ టీమ్ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన సైతం చేయలేదు. మూవీ టీమ్‌తో విభేదాల వల్లే ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు నెట్టింట ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆమె స్థానంలోకి మృణాల్‌ను మేకర్స్ తీసుకున్నారు. అడివి శేష్, మృణాల్ పెయిర్ బాగుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/AnnapurnaStdios/status/1751466771436208424
డెకాయిట్ స్టోరీ ఇదే!
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో ‘డెకాయిట్’ చిత్రం ద్వారానే దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఇందులో హీరో, హీరోయిన్లు వరుస దోపిడీలకు పాల్పడతారు. అలా దొంగతనానికి పాల్పడుతున్న సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడతారు. ఓ విషయమై వారి ప్రేమలో విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. ఇక ‘డెకాయిట్’కు సంబంధించిన టీజర్‌ను గతేడాది డిసెంబర్‌లోనే రిలీజ్ చేయగా ఇందులో అడివి శేష్, శ్రుతి హాసన్ కనిపించి సర్‌ప్రైజ్ చేశారు. కాగా, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.
https://twitter.com/TrackTwood/status/1737423086188925221
అడివి శేష్ ఫిల్మ్ జర్నీ ఇదే..
ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన ‘సొంతం’ (Sontham) సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిన అడివి శేష్ ‘కర్మ’ (Karma) సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘పంజా’ (Panja) సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’ (Kshanam), ‘గూఢచారి’ (Guachari), ‘ఎవరు’ (Yevaru), ‘మేజర్’ (Mejor), ‘హిట్ 2’ (Hit 2) వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్’ సినిమాతో అడివి శేష్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడి చేతిలో గూఢచారి సీక్వెల్ (G2)తో పాటు, ‘డెకాయిట్’ వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్న సంగతి తెలిసిందే.
డిసెంబర్ 17 , 2024
Adivi Sesh - Shruti Haasan: అడవి శేష్‌కు షాకిచ్చిన స్టార్ హీరోయిన్.. అర్థాంతరంగా ప్రాజెక్ట్ నుంచి క్విట్!
టాలీవుడ్ నటుడు అడివి శేష్ వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ‘ఎవడు’, ‘మేజర్’, ‘హిట్ 2’ వంటి హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు అడివి శేష్ ఓకే చెప్పాడు. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు అనౌన్స్‌మెంట్ రావడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆ ప్రాజెక్ట్‌పై పడింది. Sesh Ex Shruti పేరుతో స్పెషల్ పోస్టర్ సైతం రిలీజ్ అయ్యింది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు కూడా మెుదలుపెట్టారు. క్రమంలోనే హీరోయిన్ శ్రుతి హాసన్ చిత్ర యూనిట్‌కు ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
హ్యాండ్ ఇచ్చిన శ్రుతి హాసన్!
యంగ్ హీరో అడివి శేష్, స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కాంబోలో చిత్రం అనగానే ఒక్కసారిగా ఈ ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి పడింది. షానియెల్ దేవ్ దర్శకత్వంలో లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రానికి 'డెకాయిట్: ఏ లవ్ స్టోరీ' అనే టైటిల్‌ను సైతం ఖరారు చేశారు. ఇక సినిమాను పట్టాలెక్కించడమే తరువాయి అనుకున్న క్రమంలో ఈ ప్రాజెక్ట్ నుంచి అనూహ్యంగా శ్రుతి హాసన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి గల స్పష్టమైన కారణాలు ఏంటో బయటకు రాలేదు. మూవీ టీమ్ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన సైతం చేయలేదు. మరి శ్రుతి హాసన్‌ను కన్విన్స్ చేసి మళ్లీ తీసుకుంటారా? లేదా కొత్త హీరోయిన్‌ను ఎంపిక చేసుకుంటారా? అన్న దానిపై ప్రస్తుతం సందిగ్దం నెలకొంది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.
డెకాయిట్ స్టోరీ ఇదే!
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో డెకాయిట్ చిత్రం ద్వారానే దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఇందులో హీరో, హీరోయిన్లు వరుస దోపిడీలకు పాల్పడుతూ ఉంటారని, అలా దొంగతనానికి పాల్పడుతున్న సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడతారని మూవీ టీమ్ తెలిపింది. డెకాయిట్‌కు సంబంధించిన టీజర్‌ను కూడా గతేడాది డిసెంబర్‌లోనే రిలీజ్ చేశారు. ఇందులో అడివి శేష్, శ్రుతి హాసన్ కనిపించి సర్‌ప్రైజ్ చేశారు. కాగా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది.
https://twitter.com/TrackTwood/status/1737423086188925221
బాలీవుడ్ స్టార్‌కు గాయం
అడివి శేష్ (Adivi Sesh) నటించిన 'గూఢచారి' ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'జీ 2'లో అడివి శేష్ నటిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో నటుడు ఇమ్రాన్ హష్మీ గొంతు వద్ద గాయమైంది. జంపింగ్ సీన్స్ తీస్తున్న సమయంలో మెడ స్వల్పంగా కట్ అయి రక్తం కారింది. దీంతో షూటింగ్ కాస్త బ్రేక్ ఇచ్చి నట్టు సమాచారం. వెంటనే వైద్యులు ఇమ్రాన్‌కు చికిత్స అందించారు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బనితా సంధు (Banita Sandhu) హీరోయిన్‌గా మధుశాలిని, సుప్రియ యార్లగడ్డ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల (Sricharan Pakala) సంగీతం అందిస్తున్నాడు.
https://twitter.com/Movies4u_Officl/status/1843311804039967199
అడివి శేష్ సినీ ప్రస్థానం
ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన ‘సొంతం’ (Sontham) సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిన అడివి శేష్ ‘కర్మ’ (Karma) సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘పంజా’ (Panja) సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’ (Kshanam), ‘గూఢచారి’ (Goodachari), ‘ఎవరు’ (Yevaru), ‘మేజర్’ (Major), ‘హిట్ 2’ (Hit 2) వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్’ సినిమాతో అడివి శేష్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడి చేతిలో గూఢచారి సీక్వెల్ (G2)తో పాటు, ‘డెకాయిట్’ వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్న సంగతి తెలిసిందే.
అక్టోబర్ 08 , 2024
Young Telugu Heroes: వైవిధ్యతకు ప్రాధాన్యమిస్తున్న కుర్ర హీరోలు.. సీనియర్లు చూసి నేర్చుకోవాల్సిందే!
టాలీవుడ్ యంగ్ హీరోలు కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కథలో కొత్త దనం ఉంటేనే సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. లేకుంటే నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. తద్వారా రొటిన్ స్టోరీలతో వస్తోన్న నాగార్జున, వెంకటేష్, రవితేజ, రామ్ పోతినేని, నితిన్, గోపిచంద్ వంటి సీనియర్ హీరోలకు పాఠాలు నేర్పుతున్నారు. యువ హీరో సుహాస్ రీసెంట్‌గా 'గొర్రెపురాణం' అనే మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుర్ర హీరోలు ఎంచుకుంటున్న కొత్త తరహా సబ్జెక్ట్స్‌పై మరోమారు చర్చ మెుదలైంది. ఇంతకీ కొత్త కథలతో వస్తోన్న యంగ్ హీరోలు ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
సుహాస్ (Suhas)
ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ నటుడిగా కొనసాగుతూ వచ్చిన సుహాస్ ‘కలర్ ఫోటో’ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చిన క్రేజ్‌తో సినిమా అవకాశాలను పట్టేశాడు. ‘రైటర్ పద్మభూషణ్’, ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’, ‘శ్రీరంగనీతులు’, ‘ప్రసన్నవదనం’ వంటి వైవిధ్యవంతమైన చిత్రాల్లో నటించి ఆడియన్స్‌లో మంచి మార్కులు కొట్టేశాడు. అంతేకాదు ‘హిట్ 2’ మూవీలో విలన్‌గానూ నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా ‘గొర్రెపురాణం’ అనే సరికొత్త సబ్జెక్ట్‌తో శుక్రవారం (సెప్టెంబర్ 20) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
తేజ సజ్జ (Teja Sajja)
బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తేజ సజ్జ ‘జాంబి రెడ్డి’ సినిమాతో హీరోగా మారాడు. తొలి చిత్రంతోనే హీరో మెటీరియల్‌గా అనిపించాడు. ఆ తర్వాత ‘ఇష్క్’, ‘అద్భుతం’ వంటి వైవిధ్యమైన చిత్రాలు చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. తిరిగి ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లోనే 'హనుమాన్' చిత్రం చేసి జాతీయ స్థాయిలో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ సక్సెస్‌తో తేజ సజ్జ పేరు మార్మోగింది. ప్రస్తుతం 'మిరాయ్' అనే మరో పాన్ ఇండియా చిత్రంలో తేజ నటిస్తున్నాడు. ఇందులో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘మిరాయ్’ టీజర్ గూస్‌బంప్స్ తెప్పించింది.
నిఖిల్ సిద్దార్ధ్ (Nikhil Siddhartha)
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హ్యాపీ డేస్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సినిమాలో వరుణ్ సందేశ్ పక్కన ఫ్రెండ్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత సోలో హీరోగా పలు సినిమాలు చేసి యూత్‌కు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే స్వామి రారా, కార్తికేయా, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ, కార్తికేయ 2, స్పై వంటి డిఫరెంట్ జానర్ ఫిల్మ్స్ చేసి మినమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రామ్‌చరణ్ నిర్మాణంలో స్వయంభు అనే హిస్టారికల్ చిత్రంలో నిఖిల్ నటిస్తున్నాడు. అలాగే ‘కార్తికేయ 3’ చిత్రం కూడా అతడి లైనప్‌లో ఉంది.
విశ్వక్ సేన్ (Visvak Sen)
యువ నటుడు విశ్వక్ సేన్ యూత్‌లో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా విశ్వక్ జాగ్రత్త పడుతున్నాడు. తొలి చిత్రం ‘వెళ్లిపోమాకే’ పెద్దగా సక్సెస్ కాకపోయిన ‘ఈ నగరానికి ఏమైంది’ ఫిల్మ్‌తో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘ఫలక్‌నామా దాస్’ పేరుతో మాస్ యాక్షన్ డ్రామా తీసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ‘హిట్’, ‘పాగల్’, ‘అశోక వనంలో అర్జున కల్యాణం’, ‘ఓరి దేవుడా’, ‘దాస్ కా ధమ్కీ’, ‘గామి’, ‘గ్యాంగ్స్ గోదావరి’ సక్సెస్‌లతో తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’, ‘లైలా’ అనే డిఫరెంట్ జానర్ ఫిల్మ్‌లో విశ్వక్ నటిస్తున్నాడు. ‘లైలా’లో లేడీ గెటప్‌లో అతడు కనిపించనుండటం గమనార్హం.
అడివి శేష్ (Adivi Sesh)
ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన సొంతం సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిన అడివి శేష్ ‘కర్మ’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్ కల్యాణ్ నటించిన ‘పంజా’ సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్ 2’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్’ సినిమాతో అడివి శేష్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడు గూఢచారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఈ మూవీ కూడా సక్సెస్ అయితే అడివి శేష్‌కు తిరుగుండదని చెప్పవచ్చు.
సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda)
నాగచైతన్య హీరోగా నటించిన మొదటి సినిమా జోష్‌తోనే సిద్దు జొన్నలగడ్డ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘ఆరెంజ్’, ‘గుంటూర్ టాకీస్’ వంటి సినిమాలలో నటించినప్పటికీ సిద్ధు కెరీర్ గ్రోత్ అంతగా లేదనే చెప్పాలి. అయితే ఆయా చిత్రాల్లో సిద్ధు రోల్స్ మాత్రం చాలా వైవిధ్యంగా ఉంటాయి. నటనతోపాటు రైటర్‌గా, ఎడిటర్‌గా కూడా వర్క్ చేస్తూ వచ్చిన సిద్ధు ‘డిజే టిల్లు’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో సీక్వెల్ కూడా తెరకెక్కించి మరో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ‘టిల్లు స్క్వేర్’ చిత్రం ఏకంగా రూ.135 కోట్లు వసూలు చేయడం విశేషం. ప్రస్తుతం ‘జాక్’, ‘తెలుసు కదా’ వంటి చిత్రాల్లో అతడు నటిస్తున్నాడు. వాటి తర్వాత ‘టిల్లు క్యూబ్’ కూడా పట్టాలెక్కనుంది.
నార్నే నితిన్ (Narne Nithin)
జూనియర్ ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’తో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రావడంతో యూత్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఇక నితిన్ తన తర్వాతి చిత్రం ‘ఆయ్’ను పక్కా విలేజ్ నేపథ్యంలో తీసుకొచ్చి వైవిధ్యం చూపించాడు. అంతేకాదు మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు. మ్యాడ్‌లో కాస్త సెటిల్‌గా కనిపించిన నితీన్ ‘ఆయ్’ సినిమాలో మంచి ప్రదర్శన చేశాడు. నటన, డ్యాన్స్, కామెడీ ఇలా అన్ని రంగాల్లో మ్యాడ్‌తో పోలిస్తే బెటర్ పర్‌ఫార్మెన్స్ చేశాడు. భావోద్వేగాలను కూడా చక్కగా పండించి ఆకట్టుకున్నాడు.
సెప్టెంబర్ 17 , 2024
One Hero Two Heroines: ఒక హీరో ఇద్దరు భామలు.. టాలీవుడ్‌లో మరో కొత్త ట్రెండ్!
కొత్త ట్రెండ్‌లను సృష్టించడంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందు ఉంటుంది. ఈ క్రమంలో టాలీవుడ్‌లో మరో కొత్త ట్రెండ్ మెుదలైనట్లు తెలుస్తోంది. ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు కాన్సెప్ట్‌ను దర్శక నిర్మాతలు అనుసరిస్తున్నారు. వాస్తవానికి ఈ ట్రెండ్ పాతదే. గతంలో ఈ తరహా చిత్రాలు తెలుగులో బోలెడు వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో ఈ తరహా చిత్రాలు తగ్గిపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు టాలీవుడ్‌లో ఈ ట్రెండ్ మళ్లీ మెుదలైంది. కొత్తగా రూపొందుతున్న చాలా వరకూ చిత్రాలు ఇద్దరు భామలు కాన్సెప్ట్‌తో రూపొందుతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? అందులో నటించిన హీరోయిన్లు ఎవరు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
గాయత్రి భరద్వాజ్ - ప్రిషా రాజేశ్ సింగ్
అల్లు శిరీష్ హీరోగా నటించిన సరికొత్త చిత్రం 'బడ్డీ' (Buddy). శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే సినిమాలో ఇద్దరు హీరోయిన్లుగా నటించారు. అందులో ఒకరు గాయత్రి భరద్వాజ్ (Gayathri Bharadwaj) కాగా, మరొకరు ప్రిషా రాజేశ్ సింగ్ (Prisha Rajesh Singh). ఇప్పటికే విడుదలైన బడ్డీ ప్రచార చిత్రాల్లో ఈ ఇద్దరు భామలు ఆకట్టుకున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు.
మాల్వీ మల్హోత్ర - మన్నారా చోప్రా
రాజ్‌తరుణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'తిరగబడరా సామి' (Thiragabadara saami). ఏ.ఎస్. రవి కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. మెయిన్ హీరోయిన్ మాల్వీ మల్హోత్ర (Malvi Malhotra) కాగా, మరో నటి మన్నారా చోప్రా (Mannara Chopra) ప్రత్యేక గీతంలో చేసింది. ఇదిలా ఉంటే రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్ర గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. హీరో రాజ్ తరణ్ తనను మోసం చేసి మాల్వీ మల్హోత్రతో ప్రేమాయణం సాగించినట్లు అతడి ప్రేయసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదాల మధ్య వస్తోన్న ‘తిరగబడరా సామి’ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది.
తన్వీ ఆకాంక్ష - సీరత్ కపూర్
ఒకప్పటి స్టార్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం 'ఉషా పరిణయం'. విజయ్ భాస్కర్ కుమారుడు శ్రీకమల్ ఇందులో హీరోగా నటించాడు. ఆగస్టు 2న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. అయితే ఇందులో ఇద్దరు భామలు మెరవనున్నారు. శ్రీకమల్‌కు జోడీగా తాన్వి ఆకాంక్ష (Thanvi Akansha) నటించగా ప్రముఖ నటి సీరత్ కపూర్ (Seerat Kapoor) ఇందులో ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. తాన్వి ఆకాంక్షకు ఇదే తొలి చిత్రం. సీరత్ కపూర్ గతంలో రన్ రాజా రన్, టైగర్, కొలంబస్, ఒక్క క్షణం, టచ్ చేసి చూడు తదితర చిత్రాల్లో నటించింది.
మీనాక్షి చౌదరి - శ్రద్ధా శ్రీనాథ్
విశ్వక్ సేన్ హీరోగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మెకానిక్ రాకీ' (Mechanic Rocky). రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విశ్వక్‌కు జోడీగా ఇద్దరు హీరోయిన్లు చేస్తున్నారు. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary), శ్రద్దా శ్రీనాథ్ (Shraddha Srinath) విశ్వక్‌కు జంటగా నటించనున్నారు. ట్రయాంగిల్ లవ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మీనాక్షి చౌదరి ఇప్పటికే ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’, ‘కిలాడీ’, ‘హిట్ 2: సెకండ్ కేస్’, ‘గుంటూరు కారం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అటు శ్రద్ధా శ్రీనాథ్ సైతం జెర్సీ, సైంధవ్ చిత్రాలకు తెలుగు ఆడియన్స్‌ను అలరించింది.
తమన్నా - రాశి ఖన్నా
అరణ్మణై సిరీస్‌లో నాలుగో చిత్రంగా రూపొందిన 'బాక్' (Baak) ఇటీవల తెలుగులో విడుదలైంది. సుందర్. సి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా (Tamannaah Bhatia), రాశి ఖన్నా (Raashii Khanna) ముఖ్య పాత్రలు పోషించారు. వీరిద్దరు కలిసి చేసిన ఓ సాంగ్ పెద్ద ఎత్తున ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. హార్రర్ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
తమన్నా - కీర్తి సురేష్
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గత చిత్రం ‘భోళా శంకర్’లోనూ ఇద్దరు హీరోయిన్లు నటించారు. మేహర్ రమేష్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా (Tamannaah Bhatia), కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో చిరుకి జోడీగా తమన్నా, సోదరిగా కీర్తి సురేష్ నటించారు. గతేడాది ఆగస్టు 11న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షుకలను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది.
జూలై 31 , 2024
Seerat Kapoor: ‘భామకలాపం-2’తో గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చిన సీరత్.. ఆమె గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
యంగ్ బ్యూటీ సీరత్ కపూర్ (Seerat Kapoor).. ఇటీవల వచ్చిన ‘భామకలాపం 2’ (Bhamakalapam 2) వెబ్‌సిరీస్‌తో మరోమారు తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తన అందం, నటనతో ఓటీటీ ఆడియన్స్‌ను అలరించింది. టాలీవుడ్‌లో తన అరంగేట్ర చిత్రంతోనే బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందుకున్న సీరత్ కపూర్.. రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయింది. ఆ తర్వాత చిత్రాలు చెప్పుకోతగ్గ విజయాలు సాధించకపోవడంతో ఈ భామకు అవకశాలు తగ్గాయి. ఇప్పుడు మళ్లీ ‘భామకలాపం 2’ మళ్లీ మెరవడంతో అందరి దృష్టి ఈ బ్యూటీపై పడింది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం.
సీరత్ కపూర్ ఎవరు?
సీరత్ కపూర్.. ప్రముఖ హీరోయిన్. తెలుగు, హిందీ చిత్రాల్లో నటించింది.
సీరత్ కపూర్ ఎక్కడ పుట్టింది?
మహారాష్ట్ర ముంబైలో ఈ భామ జన్మించింది.
సీరత్ కపూర్ ఎప్పుడు జన్మించింది?
ఏప్రిల్ 3, 1993
సీరత్ కపూర్ వయసు ఎంత?
31 సంవత్సరాలు (2024)
సీరత్ కపూర్ ఎత్తు ఎంత?
5 అడుగుల 5 అంగుళాలు (165 సెం.మీ)
సీరత్ కపూర్ తల్లిదండ్రులు ఎవరు?
వినీత్ కపూర్, నీనా సిహోత కపూర్ దంపతులకు సీరత్ జన్మించింది. ఆమె తండ్రి ముంబయిలోని ప్రముఖ హోటల్‌కు యజమాని. తల్లి ఎయిర్ హోస్టేస్‌గా పనిచేసింది.
సీరత్ కపూర్‌కు తోబుట్టువులు ఉన్నారా?
ఈ భామకు ఒక సోదరుడు ఉన్నాడు. అతడి పేరు వరుణ్ కపూర్ (గ్రాఫిక్ డిజైనర్)
సీరత్ కపూర్ ఎక్కడ చదువుకుంది?
ముంబయిలోని పోదర్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో సీరత్ ప్రాథమిక విద్యను అభ్యసించింది. ఆర్.డి నేషనల్ కాలేజీలో బిఏ మాస్ కమ్యూనికేషన్‌లో చేరిన సీరత్..చదువు మధ్యలోనే ఆపేసింది.
సీరత్ కపూర్‌కు పెళ్లి అయ్యిందా?
ఆమెకు ఇంకా మ్యారేజ్ కాలేదు
సీరత్ కపూర్ తన కెరీర్‌ను ఎలా మెుదలుపెట్టింది?
సీరత్‌కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. 16 ఏళ్లకే బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ యాష్లే లోబో వద్ద అసిస్టెంట్‌గా తన కెరీర్ ప్రారంభించింది.
సీరత్ కపూర్ కొరియోగ్రాఫ్ చేసిన చిత్రం?
బాలీవుడ్ చిత్రం రాక్‌స్టార్‌కు సీరత్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసింది.
సీరత్ కపూర్ మోడల్‌గా చేసిందా?
సినిమాల్లోకి రాకముందు మోడల్‌గానూ ఈ బ్యూటీ పనిచేసింది. రోషన్ తనేజా స్కూల్ ఆఫ్ యాక్టింగ్‌లో నటనకు శిక్షణ కూడా తీసుకుంది.
సీరత్ కపూర్ తెరంగేట్ర చిత్రం?
2014లో బాలీవుడ్‌లో వచ్చిన 'జిద్' ఆమెకు మెుట్ట మెుదటి సినిమా. నాన్సీ పాత్రతో ఆమె హిందీ ఆడియన్స్‌ను పలకరించింది.
సీరత్ కపూర్ చేసిన తొలి తెలుగు చిత్రం?
శర్వానంద్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వచ్చిన 'రన్ రాజా రన్'.. సీరత్‌కు తొలి తెలుగు చిత్రం. ప్రియా పాత్రలో గ్లామర్‌గా కనిపించి టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
సీరత్ కపూర్ నటించిన తెలుగు చిత్రాలు?
‘రన్ రాజా రన్’తో పాటు ‘టైగర్’, ‘కొలంబస్’, ‘రాజు గారి గది - 2’, ‘ఒక్క క్షణం’, ‘టచ్ చేసి చూడు’, ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’, ‘మా వింత గాధ వినుమా’ చిత్రాల్లో సీరత్ నటించింది.
సీరత్ కపూర్ చేసిన బాలీవుడ్ చిత్రాలు?
తొలి చిత్రం జిద్‌తో పాటు మార్రిచ్ (Maarrich) సినిమాలో ఆమె నటించింది.
సీరత్ కపూర్ హాబీస్?
ట్రావెలింగ్ & డ్రాయింగ్
సీరత్ కపూర్‌కు ఇష్టమైన హీరో?
హిందీలో రణ్‌బీర్ కపూర్.. తెలుగులో మహేష్ బాబు అంటే తనకూ ఎంతో ఇష్టమని సీరత్ ఓ ఇంటర్యూలో తెలిపింది.
సీరత్ కపూర్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా?
https://www.instagram.com/iamseeratkapoor/?hl=en
https://www.youtube.com/watch?v=Hv1HLoWBEMU
ఏప్రిల్ 05 , 2024
Telugu Debut Directors: ఎన్ని సినిమాలు తీశాం అన్నది కాదన్నయ్యా...స్టార్ డైరెక్టర్ అయ్యామా లేదా?
తెలుగు ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్‌గా స్థిరపడటమంటే మామూలు విషయం కాదు. దానికి ఎన్నో సంవత్సరాల కృషి అవసరం. కొందరికి నాలుగైదు సినిమాలకు డైరెక్టర్‌గా గుర్తింపు వస్తే ఇంకొందరికి 10 సినిమాల వరకు పట్టొచ్చు. కానీ, ఇందుకు భిన్నంగా అరంగేట్ర సినిమాతోనే కొందరు డైరెక్టర్లు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. దశాబ్ద కాలానికి వచ్చే పేరును మెుదటి సినిమాతోనే సొంతం చేసుకున్నారు. తద్వారా టాలీవుడ్‌లో అగ్రడైరెక్టర్ల సరసన చేరిపోయారు. టాలీవుడ్‌లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఆ దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1. శ్రీకాంత్ ఓదెల (srikanth odela)
ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల పేరు టాలీవుడ్‌లో మార్మోగుతోంది. తొలి సినిమా ‘దసరా’ తోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయిన శ్రీకాంత్.. డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. దసరా సినిమా చూసిన వారంతా శ్రీకాంత్ డైరెక్షన్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌ను తెరపై చాలా బాగా చూపించాడని ప్రశంసిస్తున్నారు. కాగా, సుకుమార్ దగ్గర శ్రీకాంత్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
2. వేణు ఎల్దండి(Venu Yeldandi)
బలగం సినిమాతో వేణు ఎల్దండి గొప్ప డైరెక్టర్‌గా గుర్తింపు పొందాడు. చిన్న సినిమాగా వచ్చిన బలగం అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కొల్లగొట్టింది. వేణు డైరెక్షన్ స్కిల్స్‌ను ఎంత మెచ్చుకున్నా తక్కువే. తెలంగాణ సంస్కృతి, పల్లెటూరి కట్టుబాట్లు, ప్రేమానురాగాలను వేణు చాలా చక్కగా చూపించాడు. తెలంగాణలోని ప్రతీ పల్లెలోను తెరలు కట్టుకొని మరీ సినిమాను చూస్తున్నారంటే బలగం ఏ రేంజ్‌లో ఆదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు.
3. బుచ్చిబాబు సాన(buchi babu sana)
డైరెక్టర్ బుచ్చిబాబు కూడా తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. ఉప్పెన సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. హీరో పంజా వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి ఇద్దరు కొత్త వారే అయినప్పటికీ బుచ్చిబాబు తన డైరక్షన్ స్కిల్స్‌తో సినిమాను నిలబెట్టాడు. స్వచ్చమైన ప్రేమ కావ్యాన్ని తెలుగు ఆడియన్స్‌కు అందించాడు. ఈ సూపర్ హిట్ సాధించడంతో బుచ్చిబాబు టాలెంట్ ఇండస్ట్రీ అంతా తెలిసింది. దీంతో తన రెండో సినిమానే రామ్‌చరణ్‌తో చేసే అవకాశం లభించింది. బుచ్చిబాబు కూడా సుకుమార్ దగ్గరే దర్శకత్వ పాఠాలు నేర్చుకోవడం విశేషం.
4. సందీప్ వంగా(sandeep reddy vanga)
అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ రాత్రికి రాత్రే స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ సినిమా డైరెక్ట్ చేసిన సందీప్ వంగా కూడా అంతే స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు. మెుదట అర్జున్ రెడ్డి ప్రచార చిత్రాలు, ట్రైలర్ చూసి పెద్ద దుమారమే రేగింది. కానీ, సినిమా రిలీజ్ తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోయాయి. పెద్ద ఎత్తున యువత సినిమాకు కనెక్ట్ అయ్యారు. అప్పట్లో ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కలిసి సందీప్ ఓ సినిమా చేయబోతున్నాడు. పుష్ప2 షూటింగ్ పూర్తైన వెంటనే బన్నీ ఈ సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడు.
5. అనిల్ రావిపూడి(anil ravipudi)
డైరెక్టర్ అనిల్ రావిపూడి తీసిన తొలి చిత్రం ‘పటాస్’ ఘన విజయం సాధించింది. హీరో కళ్యాణ్‌రామ్ కెరీర్‌లో గొప్ప హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో హాస్య దర్శకుడిగా అనిల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన సుప్రీమ్, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవ్వరు, F3 చిత్రాలు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ల సరసన అనిల్‌ను నిలబెట్టాయి. ప్రస్తుతం అనిల్ బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నాడు.
6. సుజీత్ (sujeeth)
డైరెక్టర్ సుజీత్ కూడా రన్ రాజా రన్ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాకు గాను సుజీత్ ఉత్తమ అరంగేట్ర డైరెక్టర్‌గా అవార్డు అందుకున్నాడు. అయితే ప్రభాస్ హీరోగా సుజీత్ డైరెక్షన్‌లో వచ్చిన రీసెంట్ మూవీ సాహో బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో సుజీత్ ఓ సినిమా చేస్తున్నాడు.
7. తరుణ్ భాస్కర్(Tharun Bhascker)
పెళ్లి చూపులు చిత్రం ద్వారా టాలెంటెడ్ డైరెక్టర్‌గా తరుణ్ భాస్కర్ గుర్తింపు తెచ్చుకున్నారు. లవ్ అండ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. ఈ సినిమాకు గాను తరణ్ భాస్కర్ సైమా అవార్డ్స్-2016 సైమా అవార్డ్స్ అందుకున్నారు. ఉత్తమ అరంగేట్ర డైెరెక్టర్‌గా పురస్కారాన్ని పొందారు. పెళ్లి చూపులు తర్వాత చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా కూడా తరుణ్‌కు మంచి హిట్ ఇచ్చింది. ఈ సినిమా ద్వారానే విశ్వక్ సేన్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.
8. స్వరూప్ RSJ
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో డైరెక్టర్‌గా స్వరూప్ RSJ టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో పాటు స్వరూప్ డైరెక్షన్‌కు మంచి మార్కులే పడ్డాయి. రొటిన్ కామెడీతో వస్తున్న సినిమాలకు ఈ చిత్రం ట్రెండ్ సెటర్‌గా నిలిచింది. మిషన్ ఇంపాజిబుల్ (2022) చిత్రం ద్వారా మరోమారు స్వరూప్ తెలుగు ప్రేక్షకులను పలకరించాడు.
9. అజయ్ భూపతి(Ajay Bhupathi)
అజయ్ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన RX100 చిత్రం పెద్ద సంచలనమే అని చెప్పాలి. 'యాన్ ఇన్‌క్రెడిబుల్ లవ్ స్టోరీ' అనే ట్యాగ్‌లైన్‌కి తగ్గట్టే సినిమాను చాలా డిఫరేంట్‌గా తెరపైకి ఎక్కించాడు. ఈ సినిమా యూత్‌కు తెగ కనెక్ట్ అయింది. దీంతో అజయ్ భూపతి పేరు అప్పట్లో మార్మోగింది. ఆ తర్వాత అజయ్ తీసిని మహాసముద్రం (2021) బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.
10. కరుణ కుమార్(karuna kumar)
డైరెక్టర్ కరుణ కుమార్ కూడా తన తొలి సినిమా పలాసతో మంచి డైరెక్టర్‌గా గుర్తింపు పొందాడు. తన సొంత ఊరులో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీసినట్లు అప్పట్లో కరుణ కుమార్ తెలిపారు. కుల వివక్ష, అంటరానితనం, దళితుల శ్రమ దోపిడి వంటి అంశాలను పలాసలో చక్కగా చూపించాడు. ఈ సినిమాకు గాను కరుణ కుమార్‌ను సైమా అవార్డ్ వరించింది. ఉత్తమ అరంగేట్ర డైరెక్టర్-2020 పురస్కారాన్ని అందించింది. అయితే ఆ తర్వాత కరుణ కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన మెట్రో కథలు, శ్రీదేవి సోడా సెంటర్, కళాపురం చిత్రాలు ఆకట్టుకోలేదు.
ఏప్రిల్ 12 , 2023
EXCLUSIVE: ఈ జనరేషన్ మెగాస్టార్లు.. స్వయంకృషితో స్టార్లుగా ఎదిగిన టాలీవుడ్ కుర్ర హీరోలు వీరే!
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది కథానాయకులు ఉన్నారు. స్టార్ హీరోల కుటుంబాల నుంచి వచ్చిన వారసులు, దర్శక నిర్మాతల తనయులు.. హీరోలుగా మారి తామేంటో నిరూపించుకున్నారు. అయితే కొందరు మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. కసి, పట్టుదల ఉంటే ఇండస్ట్రీలో ఎవరైనా పైకి రావొచ్చని ఆ కుర్ర హీరోలు నిరూపించారు. ఇంతకీ ఆ కథానాయకులు ఎవరు? ఇండస్ట్రీలో తమ ప్రస్థానాన్ని ఎలా మెుదలు పెట్టారు? వారిని స్టార్లుగా మార్చిన చిత్రాలు ఏవి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
నాని
స్వయం కృషితో పైకొచ్చిన ఈ తరం హీరో అనగానే అందరికీ ముందుగా నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన నాని.. ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా మారాడు. ‘భీమిలి కబడ్డి జట్టు’, ‘అలా మెుదలైంది’, ‘పిల్ల జమిందార్’, ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘భలే భలే మగాడివోయ్’, ‘నేను లోకల్’, ‘జెర్సీ’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘దసరా’, ‘హాయ్ నాన్న’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా మారిపోయాడు. నాని నటించిన లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న విడుదల కానుంది.
విజయ్ దేవరకొండ
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. హీరో ఫ్రెండ్, ప్రాధాన్యం లేని పాత్రల్లో నటిస్తూ సరైన అవకాశాల కోసం ఎదురుచూశాడు. ‘నువ్విలా’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్.. ‘లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాల్లో సైడ్ రోల్స్‌లో చేశాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి చూపులు' చిత్రంతో తొలిసారి ఫుల్ లెన్త్ హీరోగా మారాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన 'అర్జున్ రెడ్డి'తో విజయ్ రాత్రికి రాత్రే స్టార్‌గా ఎదిగాడు. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాడు. 'గీతా గోవిందం' ఫిల్మ్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కూ విజయ్ దగ్గరయ్యాడు. రీసెంట్‌గా ‘ఫ్యామిలీ స్టార్’తో విజయ్ తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు.
సిద్ధు జొన్నలగడ్డ
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda).. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిత్ర పరిశ్రమలో తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో చిన్న పాత్రలతో కొద్ది రోజులు నెట్టుకొంచాడు. ‘జోష్’, ‘ఆరెంజ్’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘డాన్ శీను’ చిత్రాల్లో పెద్దగా గుర్తింపు లేని పాత్రల్లో నటించాడు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో వచ్చిన 'LBW' (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) మూవీతో సిద్ధూ హీరోగా మారాడు. 'గుంటూరు టాకీస్' చిత్రం హీరోగా అతడికి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత అడపాదడపా చిత్రాలు చేసినప్పటికీ సిద్ధుకు చెప్పుకోతగ్గ హిట్ రాలేదు. 2022లో వచ్చిన 'డీజే టిల్లు' ఈ యంగ్ హీరో కెరీర్‌ను మలుపు తిప్పింది. ప్రేమ పేరుతో మోసపోయిన టిల్లు పాత్రలో సిద్ధు జీవించేశాడు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. అంతేకాదు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సిద్ధూను స్టార్ హీరోల సరసన నిలబెట్టింది. దీంతో 'టిల్లు క్యూబ్' తీసేందుకు మేకర్స్ సన్నాహాలు మెుదలు పెట్టారు.
నవీన్ పొలిశెట్టి
యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) సైతం.. ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. కెరీర్ తొలినాళ్లల్లో ప్రాధాన్యం లేని పాత్రల్లో నవీన్ నటించాడు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్' చిత్రంతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయయ్యాడు. ఆ తర్వాత 'డీ ఫర్ దోపిడి', ‘1 నేనొక్కడినే’ చిత్రాల్లో చేసినప్పటికీ పెద్దగా ఫేమ్ రాలేదు. అయితే 2019లో వచ్చిన ఏజెంట్ 'సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రం.. నవీన్ పోటిశెట్టి పేరు మార్మోగేలా చేసింది. ఇందులో నవీన్ చెప్పే ఫన్నీ డైలాగ్ డెలివరీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక 'జాతి రత్నాలు' ఫిల్మ్‌తో నవీన్ పొలిశెట్టి క్రేజ్ మరో స్థాయికి చేరింది. ఇటీవల స్టార్ నటి అనుష్కతో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రంలో ఈ యంగ్ హీరో నటించగా ఆ ఫిల్మ్ కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో టాలీవుడ్‌లో నవీన్ మినిమమ్ గ్యారంటీ హీరోగా మారిపోయాడు.
తేజ సజ్జ
యువ హీరో తేజ సజ్జ (Teja Sajja).. ఒకప్పుడు బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. చిరంజీవి, మహేష్‌బాబు, వెంకటేష్, పవన్ కల్యాణ్, శ్రీకాంత్, జూ.ఎన్టీఆర్ చిత్రాల్లో నటించాడు. కాగా, 2019లో వచ్చిన 'జాంబిరెడ్డి' సినిమాతో తేజ సజ్జా హీరోగా మారాడు. ఆ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత చేసిన ఇష్క్, అద్భుతం సినిమాలు కూడా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. రీసెంట్‌గా అతడు నటించిన ‘హనుమాన్’ (Hanu Man) సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వం వహించిన ఈ సినిమా.. నార్త్‌లో విశేష ఆదరణ సంపాందించింది. దీంతో తేజ సజ్జా క్రేజ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం అతడు సూపర్ యోధ అనే ఫిల్మ్‌లో నటిస్తున్నాడు.
అడవి శేషు
స్టార్ హీరో అడవి శేషు (Adivi Sesh)కు కూడా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. తొలి చిత్రం 'కర్మ'తో హీరోగా మారిన అతడు.. అరంగేట్రంతోనే మంచి గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత ‘పంజా’, ‘బలుపు’, ‘రన్ రాజా రన్’, ‘బాహుబలి’, ‘అమీ తుమీ’ వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించాడు. ఆ తర్వాత వచ్చిన 'గూడఛారి' చిత్రం అడివి శేషు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ స్పై థ్రిల్లర్ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఆ తర్వాత చేసిన ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్: సెకండ్ కేసు’ కూడా సూపర్ హిట్స్‌గా నిలవడంతో ఈ యువ నటుడు స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం అడివి శేషు.. గూడఛారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు.
ప్రియదర్శి
యువనటుడు ప్రియదర్శి (Priyadarshi Pulikonda)కి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. ఇండస్ట్రీలో తనకంటూ ఎవరు లేనప్పటికీ అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగాడు. చివరికీ 2016లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన 'టెర్రర్' చిత్రంలో ఉగ్రవాది పాత్రతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అదే ఏడాది వచ్చిన ‘పెళ్లి చూపులు’ అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో 'నావు చావు నేను చస్తా.. నీకెందుకు' డైలాగ్‌తో అతడు బాగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హాస్య పాత్రల్లో కనిపించిన ప్రియదర్శి.. 'జాతి రత్నాలు' మూవీతో మరింత పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే గతేడాది వచ్చిన 'బలగం' సినిమా ప్రియదర్శిని స్టార్ నటుడిగా నిలబెట్టింది. ఇటీవల వచ్చిన ‘మంగళవారం’, ‘ఓం భీమ్ బుష్’ చిత్రాల్లో లీడ్ రోల్స్‌లో నటించి ప్రియదర్శి అలరించాడు.
ఏప్రిల్ 17 , 2024
Top Searched Telugu Heroines in 2024: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాలీవుడ్ అందాల భామలు వీళ్లే
టాలీవుడ్ అంటేనే ప్రపంచ సినీ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ప్రత్యేకించి, ఈ పరిశ్రమను ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దడంలో హీరోయిన్‌ల పాత్ర అమోఘం. అద్భుతమైన అభినయంతో పాటు, అందంతో కట్టిపడేసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. కను సైగలతోనే మాట్లాడగల నేర్పుతో అలరిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తమ ప్రతిభతోనే కష్టపడి ఎదిగిన ఈ కథానాయికల అందం, నటన మనం మరిచిపోలేము. ఈ క్రమంలో 2024 సంవత్సరంలో ఇంటర్నెట్‌లో నెటిజన్లు ఎక్కువగా వెతికిన టాప్ తెలుగు హీరోయిన్ల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. మీరు ఓ లుక్ వేయండి
Sobhita Dhulipala
శోభితా ధూళిపాళ టాలీవుడ్ హీరోయిన్ . ఆమె ప్రధానంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళ చిత్రాలలో నటిస్తోంది. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. మిస్ ఎర్త్ 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం రామన్ రాఘవ్ 2.0 (2016) ద్వారా నటిగా పరిచయమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో డ్రామా సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (2019)లో ప్రధాన పాత్ర పోషించింది. తెలుగులో గూఢచారి చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. రీసెంట్‌గా ఆమె హీరో నాగచైతన్యను వివాహం చేసుకుంది.
Meenakshi Chaudhary
మీనాక్షి చౌదరి.. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోయిన్. హరియాణాలో పుట్టి పెరిగిన మీనాక్షి.. కెరీర్ ప్రారంభంలో మోడల్‌గా చేసింది. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' (2021) ఫిల్మ్‌తో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. హిట్ 2, గుంటూరు కారం, లక్కీ బాస్కర్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలతో క్రేజ్ సంపాదించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 9 సినిమాలు చేసింది.
Sreeleela
శ్రీలీల తెలుగులో స్టార్ హీరోయిన్. శ్రీలీల చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు ఇచ్చింది. MBBS చదివిన శ్రీలీల నటనపై మక్కువతో సినిమాల్లోకి రంగ ప్రవేశం చేసింది. పెళ్లి సందD చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ధమాకా, గుంటూరుకారం వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది
Samantha
సమంత భారతీయ నటి. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ప్రధానంగా నటిస్తోంది. కెరీర్ ఆరంభంలో మోడలింగ్ చేసిన సమంత... గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఏ మాయ చేశావే'(2010) చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను విమర్శల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013), మనం(2014), మజిలి(2019), ఖుషి(2023) వంటి సూపర్ హిట్ చిత్రాలతో అతితక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అటు సమంత హిందీ వెబ్-సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్లో రాజీ పాత్రను పోషించింది. ఈ సిరీస్‌లో ఆమె నటనకు ఎంతో గుర్తింపు లభించింది.
Courtesy Instagram: samantha
Rashmika Mandanna
నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రధానంగా నటిస్తోంది. 2016లో వచ్చిన కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీ ద్వారా నటిగా పరిచయమైంది. తెలుగులో ఛలో(2018) చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ సరసన గీతా గోవిందం చిత్రంలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో రష్మికకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, సీతారామం, వారసుడు, యానిమల్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. యానిమల్, పుష్ప ఆమె కెరీర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. కిరాక్ పార్టీ, గీతాగోవిందం చిత్రాలకు గాను ఉత్తమ నటిగా ఆమె సైమా పురస్కారం అందుకుంది .
Sai Pallavi
సాయిపల్లవి భారతీయ సినీ నటి. మలయాళం చిత్రం ప్రేమమ్ సినిమాతో పరిచయమైంది. ఈ సినిమాలోని మలర్ క్యారెక్టర్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమాలో భానుమతి క్యారెక్టర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఎంసీఎ, పడి పడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్, విరాట పర్వం, గార్గి వంటి చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.
Kiara Advani
కియారా అద్వానీ అసలు పేరు ఆలియా అద్వానీ . ఆమె హిందీ మరియు తెలుగు భాషా చిత్రాలలో పని చేస్తుంది. ఆమె హాస్య చిత్రం ఫగ్లీ (2014)లో తొలిసారిగా నటించింది. స్పోర్ట్స్ బయోపిక్ MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ (2016)లో MS ధోని భార్యగా నటించింది. నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ ఫిల్మ్ లస్ట్ స్టోరీస్ (2018)లో లైంగికంగా సంతృప్తి చెందని భార్యగా నటించి ప్రశంసలు అందుకుంది మరియు పొలిటికల్ థ్రిల్లర్ భరత్ అనే నేను మేయిన్ హీరోయిన్‌గా నటించి మెప్పించింది.
Rukshar Dhillon
రుక్సర్ థిల్లాన్ టాలీవుడ్‌కు చెందిన నటి. 2016లో కన్నడ సినిమా 'రన్ ఆంటోని'తో సినీ రంగ ప్రవేశం చేసింది. ‘ఆకతాయి’ (2017) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 'కృష్ణార్జున యుద్ధం' (2018), ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ (2022), ‘నా సామిరంగా’ (2024) చిత్రాలతో తెలుగులో పాపులర్ అయ్యింది.
Samyuktha Menon
సంయుక్త మీనన్ తెలుగులో భీమ్లా నాయక్ చిత్రం(2022) ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఈ చిత్రంలో రాణా భార్యగా నటించింది. అయితే ధనుష్‌తో నటించిన సార్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు సాధించింది. ఆ తర్వాత విరూపక్ష, బింబిసారా వంటి బ్లాక్ బాస్టర్ హిట్‌తో తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరింది. సంయుక్త మీనన్ తెలుగు కంటే ముందు మలయాళం చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. పాప్‌కార్న్, థివాండి వంటి చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది.
Keerthy Suresh
కీర్తి సురేష్ తెలుగులో 'నేను శైలజ'(2016) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. నేను లోకల్(2017), మహానటి(2017) వంటి సూపర్ హిట్లతో స్టార్ హిరోయిన్ స్థాయికి ఎదిగింది. మిస్ ఇండియా(2020), రంగ్ దే(2021), సర్కారు వారి పాట(2022)వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్‌లోను చాలా చిత్రాల్లో కీర్తి నటించింది. రెమో, బైరవా, సర్కార్, తొడరి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహానటిలో ఆమె నటనకు గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది.
Divyansha Kaushik
దివ్యాంశ కౌశిక్ తెలుగు చిత్రం మజిలీ (2019)తో తొలిసారిగా నటించింది, దీని కోసం ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రం కోసం SIIMA అవార్డును అందుకుంది.
Pooja Hegde
పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధే శ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహర్షి చిత్రానికి గాను జీసినీ అవార్డ్స్ ఉత్తమ నటి అవార్డు, అల వైకుంఠపురములో చిత్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారాలు అందుకుంది.
Mirnalini Ravi
మృణాళిని రవి 'గద్దలకొండ గణేష్' ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. తర్వాత ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’, ‘మామా మశ్చింద్రా’ చిత్రాల్లో నటించింది. మృణాళిని నటించిన లేటెస్ట్ చిత్రం 'లవ్ గురు'లోనూ మంచి నటన కనబరిచి అభిమానులను అలరించింది.
Kethika Sharma
కేతిక శర్మ తెలుగు సినిమా నటి. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్(2021) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ చిత్రం పరాజయం పొందినప్పటికీ.. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. లక్ష్య, రంగ రంగా వైభవంగా, బ్రో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ డాల్‌గా గుర్తింపు పొందింది. కేతిక సినిమాల్లోకి రాకముందే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆమె 2016లో నటించిన 'థగ్ లైఫ్ (2016)' వీడియోతో పాపులర్ అయ్యింది. దబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో యూత్‌లో సూపర్ క్రేజ్ పొందింది.
Chandini Chowdary
చాందిని చౌదరి తెలుగులో మధురం సినిమాతో ఆరంగేట్రం చేసింది. 'కలర్ ఫొటో' సినిమాతో గుర్తింపు పొందింది. తన సహజమైన నటన, అందంతో అవకాశాలను అందిపుచ్చుకుంది. గ్లామర్ పరంగా మెప్పిస్తూనే.. ట్రెడిషనల్ లుక్‌లో అదరగొడుతోంది. ముంబై బామలకు తీసిపోకుండా దూసుకెళ్తోంది. సమ్మతమే, హౌరా బ్రిడ్జ్, గామి చిత్రాల్లో లీడ్ రోల్‌లో నటించి సత్తా చాటింది. ఈ ముద్దుగుమ్మకు తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Eesha Rebba
ఈష రెబ్బ తెలుగు సినీ నటి. 'అంతకు ముందు... ఆ తరువాత'(2013) చిత్రం ద్వరా హీరోయిన్‌గా పరిచయమైనది. బందిపోటు, బ్రాండ్ బాబు సినిమాల్లో హిరోయిన్‌గా గుర్తింపు పొందింది. అయితే ఆ తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు పెద్దగా రాలేదు. కానీ సహాయ నటి పాత్రలు చేస్తూ మెప్పిస్తోంది. అరవింద సమేత వీర రాఘవ, సుబ్రహ్మణ్యపురం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఈష రెబ్బ సినిమాలతో పాటు పలు వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించింది. 3 రోజస్, పిట్టకథలు, మాయాబజార్ ఫర్ సేల్ వెబ్ సిరీస్‌ల్లో నటించి ప్రేక్షకులకు చేరువైంది.
Priyanka Jawalkar
"ప్రియాంక జవాల్కర్ తెలుగు సినిమా నటి. కలవరం ఆయే సినిమా(2017) సినిమా ద్వారా ఆమె సినిమారంగ ప్రవేశం చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా 2018లో వచ్చిన టాక్సీవాలా చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. మరాఠి కుటుంబానికి చెందిన ప్రియాంక విద్యాభ్యాసం అంతా ఏపీలోనే జరిగింది. ఆమె హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్ ఉన్న ప్రియాంక ఎన్.జె.బిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకుంది. టాలీవుడ్‌లో నటనతో పాటు గ్లామర్‌కు అవకాశం ఉన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Dimple Hayathi
డింపుల్ హయాతి తెలుగు సినిమా నటి. గల్ఫ్(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే ఆమెకు గద్దలకొండ గణేష్ చిత్రంలోని 'సూపర్ హిట్టు.. బొమ్మ హిట్టు ఐటెం' సాంగ్ ద్వారా గుర్తింపు లభించింది. ఆ తర్వాత రవి తేజ సరసన ఖిలాడి చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. గోపిచంద్‌తో రామబాణం సినిమాలోనూ కథానాయికగా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. డింపుల్ డ్యాన్స్‌కు పేరుగాంచింది. ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం.
Courtesy Instagram: Dimple Hayathi
Pujita Ponnada
పూజిత పొన్నాడ టాలీవుడ్‌కు చెందిన నటి. విశాఖపట్నంలో జన్మించింది. తండ్రి ఉద్యోగరిత్యా చెన్నై, ఢిల్లీ నగరాల్లో పెరిగింది. ఊపిరి (2016) సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. 'రన్' (2020) సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఇప్పటివరకూ తెలుగులో 18 చిత్రాల్లో నటించింది.
Ananya Nagalla
అనన్య నాగళ్ల తెలుగు సినీ నటి. మల్లేశం(2019) సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'ప్లే బ్యాక్', వకీల్ సాబ్, మాస్ట్రో, ఊర్వశివో రాక్షశివో, శాకుంతలం, మళ్లీ పెళ్లి సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లోకి రాకముందు హైదరాబాద్‌లోని రాజా మహేంద్ర ఇంజినీరింగ్ కాలేజ్‌లో బీటెక్ పూర్తి చేసింది. కొన్నిరోజులు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది.
Courtesy Instagram:Ananya Nagalla
డిసెంబర్ 04 , 2024
Family Star: ‘ఫ్యామిలీ స్టార్’ ప్రమోషన్‌లో దిల్ రాజు సాహసం.. మొత్తానికి చేసేశాడు! 😊😊
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ హవానే కనిపిస్తోంది. శుక్రవారం (ఏప్రిల్ 5) ఈ మూవీ రిలీజ్ కానుండటంతో హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) మూవీ ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటూ సందడి చేస్తున్నారు. అటు నిర్మాత దిల్‌రాజు సైతం వారితో పాటు చురుగ్గా ప్రమోషన్స్ చేస్తూ మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా తాజాగా నిర్వహించిన ఓ ఈవెంట్‌లో నిర్మాత దిల్‌రాజు చెలరేగిపోయారు. మూవీలోని పాటలకు స్టెప్పులేసి అదరగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
దిల్‌రాజు.. స్టెప్పులకే రారాజు!
ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత దిల్‌రాజు.. తాజాగా మీమర్స్, డిజిటల్ పేజ్ అడ్మిన్స్‌తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాలోని ‘నంద నందన సాంగ్, కళ్యాణి వచ్చా వచ్చా’ పాటలకి అందరితో కలిసి స్టెప్పులు వేశారు. ఎలాంటి తడబాటు లేకుండా హుక్ స్టెప్పులు వేసి అదరగొట్టారు. ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నాయి. ఇవి చూసి నెటిజన్లు ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్‌లో దిల్ మామే హైలెట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇతర నిర్మాతలతో పోలిస్తే దిల్‌రాజు చాలా స్పోర్టివ్‌గా ఉంటారని ప్రశంసిస్తున్నారు.
https://twitter.com/mr_rowdi/status/1775554308127551770?s=20
https://twitter.com/mr_rowdi/status/1775581652800131408
విజయ్, మృణాల్ కూడా ఇంతే!
ఫ్యామిలీ స్టార్ సినిమాలోని 'కళ్యాణి వచ్చా వచ్చా' సాంగ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బాగా ట్రెండ్ అవుతోంది. దీంతో ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయ్ దేవరకొండ - మృణాల్ ఠాకూర్ కూడా ఈ పాటకు డ్యాన్స్ చేశారు. హుక్ స్టెప్పులతో ఆడియన్స్ అలరించారు. ఈ క్రమంలో నిర్మాత దిల్‌రాజు కూడా వారితో కలిసి డ్యాన్స్ చేయడం విశేషం. ఈ వీడియో కూడా రెండ్రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. మీరూ ఓ లుక్కేయండి.
https://twitter.com/i/status/1775183286417125744
సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఇదే
ఫ్యామిలీ స్టార్ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బృందం.. యూ/ ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. రన్ టైమ్‌ను 2 గం.ల 30 నిమిషాలకు ఫిక్స్ చేసింది. 150 నిమిషాల పాటు ఫ్యామిలీ స్టార్‌ను ఎంజాయ్ చేసేందుకు సిద్ధంగా ఉండండంటూ మేకర్స్ ఓ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. అయితే సినిమాలో మొత్తం నాలుగు డైలాగ్స్‌ను మ్యూట్ చేయాలని సెన్సార్ సూచించినట్లు వార్తలు వచ్చాయి. ఇక సినిమాలో డిలీటెడ్ సీన్లు ఏమీ లేవని తెలుస్తోంది. అయితే ఓ పాటలో లిక్కర్ బాటిల్స్ వచ్చినప్పుడు ఆయా లోగోలు కనిపించకుండా చూడాలని సెన్సార్ బోర్డు చెప్పినట్లు సమాచారం. ఇవి తప్ప సినిమాలో పెద్దగా అభ్యంతరక సన్నివేశాలు ఏమీ లేవని తెలుస్తోంది.
'హిట్ కొట్టేసారండీ'
ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని దిల్‌రాజు, విజయ్ దేవరకొండ ఫ్యామిలీలు.. తాజాగా స్పెషల్ షో వేసుకొని చూశాయి. ఈ సినిమా చూసిన తర్వాత తన భార్య తేజస్విని 'హిట్ కొట్టేసారండీ' అని కంప్లీమెంట్ ఇచ్చినట్లు నిర్మాత దిల్‌రాజు తెలిపారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె జడ్జిమెంట్ పర్ఫెక్ట్‌గా, క్రెడిబుల్‌గా ఉంటుందని పేర్కొన్నారు. అటు దిల్‌రాజు కూతురు హన్షిత రెడ్డి కూడా సినిమా చూసి.. కిల్డ్ ఇట్ అంటూ దేవరకొండను హగ్ చేసుకుందట. మరోవైపు విజయ్ దేవరకొండ తండ్రి కూడా ఈ సినిమా చూసి దిల్‌రాజు బయోపిక్‌లా ఉందని ప్రశంసించారు.
ఏప్రిల్ 04 , 2024
Family Star: ‘ఫ్యామిలీ స్టార్‌కు’సెన్సార్ బోర్డు ఝలక్..!
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటించిన చిత్రం 'ఫ్యామిలీ స్టార్' (Family Star). దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ పేట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో (ఏప్రిల్ 5) విడుదల కానుంది. గీతాగోవిందం లాంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత విజయ్-పరుశురామ్ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అటు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గట్టిగానే జరిగింది. ఆ విశేషాలేంటో చూద్దాం.
ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎంతంటే?
భారీ అంచనాలతో వస్తోన్న ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం.. గణనీయ సంఖ్యలో ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 34.50 కోట్లు నమోదు చేసింది. తెలంగాణ (నైజాం)లో రూ. 13 కోట్లు, రాయలసీమ (సీడెడ్) రూ. 4.5 కోట్లు, ఏపీలో రూ.17 కోట్లకు థియేట్రికల్ రైట్స్‌ను మేకర్స్ విక్రయించారు. అటు కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ రూ. 3 కోట్లు, ఓవర్సీస్ రూ. 5.5 కోట్లతో కలిపి మెుత్తంగా ఈ సినిమా రూ.43 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఫలితంగా ఫ్యామిలీ స్టార్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.44 కోట్లకు చేరింది.
సెన్సార్ ఝలక్!
ఫ్యామిలీ స్టార్ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బృందం.. యూ/ ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. రన్ టైమ్‌ను 2గం.ల 43 నిమిషాలకు ఫిక్స్ చేసింది. అయితే సినిమాలో మొత్తం నాలుగు డైలాగ్స్‌ను మ్యూట్ చేయాలని సెన్సార్ సూచించినట్లు సమాచారం. ఇక సినిమాలో డిలీటెడ్ సీన్లు ఏమీ లేవని తెలుస్తోంది. అయితే ఓ పాటలో లిక్కర్ బాటిల్స్ వచ్చినప్పుడు ఆయా లోగోలు కనిపించకుండా చూడాలని సెన్సార్ బోర్డు చెప్పినట్లు సమాచారం. ఇవి తప్ప సినిమాలో పెద్దగా అభ్యంతరక సన్నివేశాలు ఏమీ లేవని సమాచారం.
ఆ చిత్రాలతో గట్టి పోటీ!
విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరో నటించినప్పటికీ ఫ్యామిలీ స్టార్‌కు రెండు సినిమాల నుంచి గట్టిపోటీ తప్పదనిపిస్తోంది. ఒకటి ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) కాగా, రెండోది మలయాళం బ్లాక్ బాస్టర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummel Boys). గత శుక్రవారం రిలీజైన టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ వారం కూడా మంచి వసూళ్లు సాధిస్తూ వీకెండ్ వైపు పరుగులు పెడుతోంది. రెండో వారంతం కూడా టిల్లు స్క్వేర్‌కు మంచి ఆదరణ లభించే అవకాశముంది. మరోవైపు మలయాళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన మంజుమ్మెల్ బాయ్స్.. ఏప్రిల్ 6న విడుదలవుతోంది. కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ మూవీని చూసేందుకు తెలుగు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. దీంతో ఈ రెండు చిత్రాలను తట్టుకొని ‘ఫ్యామిలీ స్టార్’ ఏమేర రాణిస్తుందో చూడాలి.
ఏప్రిల్ 03 , 2024
True Love Movies: ఈ చిత్రాలు ఎప్పటికీ మిమ్మల్ని వెంటాడుతునే ఉంటాయి!
టాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎన్నో ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. అయితే వాటిలో అతి కొద్ది చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించాయి. యాక్షన్, శృంగార సన్నివేశాలు, ఐటెం సాంగ్స్ ఇలాంటివి లేకపోయినా.. స్వచ్చమైన ప్రేమ, ఆకట్టుకునే కథ-కథనం, చక్కటి ప్రజెంటేషన్ ఉంటే చాలని అవి నిరూపించాయి. ప్రేక్షకుల్లో భావోద్వేగాలను రగిలించి కొత్త రకం ప్రేమ కథలను ఇండస్ట్రీకి పరిచయం చేశాయి. తెలుగులో వచ్చిన ‘సీతారామం’ (Sitaramam), ‘హాయ్ నాన్న’ (Hi Nanna) చిత్రాలు ఇందుకు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం ఈ చిత్రాలు కదిలించాయి. నార్త్ అభిమానుల ఫేవరేట్ చిత్రంగా మారిపోయాయి. మరి టాలీవుడ్‌లో ఇప్పటివరకూ వచ్చి కల్ట్ క్లాసిక్ మూవీలు ఏవి? అవి ప్రేక్షకులకు ఇచ్చిన సందేశం ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
సీతారామం
2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్‌ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది.
హాయ్ నాన్న
ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది.
సూర్య S/O కృష్ణన్
హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.
మజిలి
తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.
నిన్ను కోరి
హీరో ఒక యువతిని ఎంతగానో ఇష్టపడతాడు. అనూహ్యంగా ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. తొలత ఆమెను దక్కించుకోవాలని భావించినప్పటికీ చివరికీ ఆమె సంతోషం కోసం తన ప్రేమను త్యాగం చేస్తాడు.
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.
ఓయ్
బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు.
తొలి ప్రేమ
టాలీవుడ్‌లో వచ్చి కల్ట్ క్లాసిక్ ప్రేమ కథా చిత్రాల్లో తొలి ప్రేమ ఒకటి. విదేశాల నుంచి వచ్చిన యువతిని హీరో ప్రేమిస్తాడు. ఆమెకు తన భావాలను చెప్పుకోలేక ఇబ్బంది పడుతుంటాడు. తిరిగి వెళ్లేపోతున్న క్రమంలో తానూ హీరోను లవ్ చేస్తున్నట్లు యువతికి అర్థమవుతుంది.
నిన్నే పెళ్లాడతా
కృష్ణ వంశీ డైరెక్షన్‌లో వచ్చిన నిన్నే పెళ్లడతా చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు.
రాజా రాణి
ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు.
జాను
శర్వానంద్, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్ లవ్ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్ టూ గెదర్ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు.
ఫిబ్రవరి 13 , 2024
Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్ నామినేషన్స్‌లో ప్రభాస్, రష్మికకు అన్యాయం.! ఎందుకీ చిన్నచూపు?
ప్రేక్షకులతో పాటు, సినీ తారలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే అవార్డుల వేడుక 'ఫిల్మ్‌ఫేర్' (Filmfare Awards 2024). 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుకలకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. జనవరి 27, 28 తేదీల్లో గుజరాత్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది అవార్డుల కోసం పోటీపడుతున్న చిత్రాల జాబితాను తాజాగా విడుదల చేశారు. అయితే ఇది కొత్త వివాదానికి దారి తీసింది. రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’ (Rocky Aur Rani Ki Prem Kahani), యానిమల్ (Animal) చిత్రాలతో పాటు 12th ఫెయిల్, డంకీ, జవాన్, శ్యామ్ బహదూర్ చిత్రాలు అవార్డు రేసులో నిలిచాయి. కానీ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'ఆదిపురుష్', 'సలార్' వంటి చిత్రాలకు ఏ ఒక్క విభాగంలోనూ చోటు దక్కకపోవడం చర్చలకు తావిస్తోంది.
ప్రభాస్‌కు అన్యాయం!
బాహుబలి తర్వాత ప్రభాస్ (Prabhas) క్రేజ్ ప్రపంచస్థాయికి చేరింది. ఆయనతో చిత్రాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే గతేడాది ప్రభాస్ చేసిన ఆదిపురుష్ (Aadipurush), సలార్ (Saalar) చిత్రాలు ప్రేక్షకులను పలకరించాయి. ‘ఆదిపురుష్’ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ప్రభాస్ మానియాతో రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అందులో డార్లింగ్ నటనకు సైతం మంచి మార్కులే పడ్డాయి. ఇక రీసెంట్ మూవీ ‘సలార్’ బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపింది. ఇప్పటివరకూ ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.611.8 కోట్లు రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతూ తన కలెక్షన్స్‌ను పెంచుకుంటుంది. పైగా ఇందులో ప్రభాస్ తన యాక్షన్‌తో గూస్‌బంప్స్ తెప్పించాడు. అటువంటి ప్రభాస్‌కు ఉత్తమ నటుడు కేటగిరి నామినేషన్స్‌లో కనీసం చోటు దక్కకపోవడం ఫ్యాన్స్‌లో అసంతృప్తికి కారణమవుతోంది.
సలార్ వద్దు.. డంకీ ముద్దు!(Saalar Vs Dunki)
షారుక్ ఖాన్ రీసెంట్ చిత్రం డంకీ (Dunki), ప్రభాస్ ‘సలార్’ చిత్రాలు రెండూ ఒకే రోజూ రిలీజయ్యాయి. డంకీ ఇప్పటివరకూ రూ.460.70 కోట్లు వసూలు చేయగా సలార్ అంతకంటే ఎక్కువే కలెక్షన్స్ సాధించింది. అయినప్పటికీ సలార్‌ను కాదని, డంకీ ఉత్తమ చిత్రం కేటగిరిలో చోటు కల్పించడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది చిత్రాలు ప్రపంచ స్థాయిలో రాణిస్తున్న ఈ రోజుల్లోనూ మన హీరోలపై ఎందుకీ వివక్ష అని ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా ఘటనలు భారతీయ చిత్ర పరిశ్రమకు మంచిది కాదని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డులు పూర్తిగా హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించినవని తెలుసు.. సలార్, ఆదిపురుష్ వంటి చిత్రాలు పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన విషయం గుర్తించుకోవాలి. ప్రభాస్ బాహుబలి తర్వాత తీసిన సినిమాలు హిందీ డైరెక్టర్లతోనే తీశాడు. విచిత్రమేమిటంటే.. జవాన్ సినిమా డైరెక్టర్ అట్లీ సౌత్ నుంచి వచ్చాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై హిట్ అయింది. ఈ సినిమాకు అవార్డుల్లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ కేటగిరీల్లో స్థానం దక్కింది. అలాగే సలార్ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది.. ప్రశాంత్ నీల్. అతను సౌత్‌కు చెందినవాడే కావచ్చు. కానీ సలార్ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో ఎలాంటి హిట్ సాధించిందో… హిందీలోనూ అలాంటి హిట్‌నే సాధించింది. కావాలనే ప్రభాస్‌ను అవార్డుల రేసు నుంచి పక్కకు పెట్టారని నెటిజన్లతో పాటు ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. దీనికి బాలీవుడ్‌లో కొంతమంది అగ్ర హీరోలు ఉన్నారని చర్చించుకుంటున్నారు.
సలార్ విడుదల సమయంలో థియేటర్లు కెటాయించకుండా… డంకీ చిత్రానికి థియేటర్లు కేటాయించడంపై అప్పట్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్(Prabhas fans) నిరసన వ్యక్తం చేశారు. దానికి ప్రతీకారంగానే ప్రభాస్‌ను, ఆయన సినిమాలను బాలీవుడ్‌లో ఓ వర్గం పక్కకు పెట్టారని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు.
పాపం రష్మిక..!
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన చిత్రం ‘యానిమల్’ (Animal). ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇందులో రష్మిక మంచి నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయినప్పటికీ ఉత్తమ నటి కేటగిరి నామినేషన్స్‌లో రష్మిక( Rashmika Mandanna) పేరు లేకపోవడం ఆశ్చర్య పరుస్తోంది. అదే సినిమాలో కొద్దిసేపు కనిపించి అలరించిన నటి త్రిప్తి దిమ్రి (Tripti Dimri) ఉత్తమ సహాయ నటి కేటగిరీలో ఫిల్మ్ ఫేర్ అవార్డ్ నామినేషన్స్‌లో నిలవడం చర్చకు తావిస్తోంది. దీనిని రష్మిక ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. రష్మిక దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన నటి కావడం వల్లే ఆమె ఏ విభాగంలోనూ నామినేట్ కాలేదని చెబుతున్నారు.
అప్పట్లోనే అవమానం
అంబాని గణపతి పూజ సమయంలోనూ… బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ కావాలనే రష్మికను పట్టించుకోని వీడియో అప్పట్లో సోషల్ మీడియోలో వైరల్ అయింది. సౌత్ నటి అయినందు వల్లే రష్మికను అవైడ్ చేశారని పెద్ద చర్చ సాగింది.
https://twitter.com/leena_gaut57982/status/1704495711058812951?s=20
‘యానిమల్’ సత్తా చాటేనా!
తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ (Animal) చిత్రం ఏకంగా 19 విభాగాల్లో చోటు దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడి కేటగిరిలో సందీప్ రెడ్డి వంగా, ఉత్తమ నటుడు విభాగంలో రణ్‌బీర్ కపూర్, ఉత్తమ సహాయ నటులుగా అనిల్ కపూర్, బాబీ దేబోల్, సహాయ నటిగా త్రిప్తి దిమ్రి యానిమల్ మూవీ నుంచి రేసులో నిలిచారు. దీన్ని బట్టి చూస్తే 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుకల్లో (Filmfare Awards 2024) యానిమల్ సత్తా చాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోమారు జాతీయ స్థాయిలో టాలీవుడ్ సత్తా ఏంటో తెలియనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
విభాగాల వారిగా నామినేషన్స్ జాబితా
ఉత్తమ చిత్రం (పాపులర్)
12th ఫెయిల్‌జవాన్‌ఓఎంజీ2పఠాన్‌రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్)
12th ఫెయిల్‌బీడ్‌ఫరాజ్‌జొరామ్‌శ్యామ్ బహదూర్‌త్రీ ఆఫ్ అజ్‌జ్విగాటో
ఉత్తమ దర్శకుడు
అమిత్ రాయ్ (ఓఎంజీ2)అట్లీ (జవాన్)కరణ్ జోహార్ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ)సందీప్ వంగా (యానిమల్)సిద్ధార్థ్ ఆనంద్ (పఠాన్)విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
ఉత్తమ నటుడు
రణ్‌బీర్ కపూర్ (యానిమల్)రణ్‌వీర్ సింగ్ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ)షారుక్‌ఖాన్ (డంకీ)షారుక్ ఖాన్(జవాన్)సన్నీ దేఓల్ (గదర్2)విక్కీ కౌశల్ (శ్యామ్ బహదూర్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్)
అభిషేక్ బచ్చన్ (ఘూమర్)జయ్‌దీప్ అహల్వత్ (త్రీ ఆఫ్ అజ్)మనోజ్ బాజ్‌పాయ్ (జొరామ్)పంకజ్ త్రిపాఠి (ఓఎంజీ2)రాజ్‌కుమార్ రావ్ (బీడ్)విక్కీ కౌశల్ (శ్యామ్ బహదూర్)విక్రాంత్ మెస్సే (12th ఫెయిల్)
ఉత్తమ నటి
అలియా భట్ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ)భూమి పెడ్నేకర్ (థ్యాంక్యూ ఫర్ కమింగ్)దీపిక పదుకొణె (పఠాన్)కియారా అడ్వాణీ (సత్య ప్రేమ్‌కి కథ)రాణీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ Vs నార్వే)తాప్సీ (డంకీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్)
దీప్తి నవల్ (గోల్డ్ ఫిష్)ఫాతిమా సనా షేక్ (ధక్ ధక్)రాణీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ Vs నార్వే)సయామీఖేర్ (ఘూమర్)షహానా గోస్వామి (జ్విగాటో)షఫిల్ షా (త్రీ ఆఫ్ అజ్)
ఉత్తమ సహాయ నటుడు
ఆదిత్య రావల్ (ఫరాజ్)అనిల్ కపూర్ (యానిమల్)బాబీ దేఓల్ (యానిమల్)ఇమ్రాన్ హష్మి (టైగర్3)టోటా రాయ్ చౌదరి (రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ)విక్కీ కౌశల్ (డంకీ)
ఉత్తమ సహాయ నటి
జయా బచ్చన్ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ)రత్న పాఠక్ షా (ధక్ ధక్)షబానా అజ్మీ (ఘూమర్)షబానా అజ్మీ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ)త్రిప్తి దిమ్రి (యానిమల్)యామి గౌతమ్ (ఓఎంజీ2)
జనవరి 17 , 2024
Pushpa 2: దద్దరిల్లిన కొచ్చి ఎయిర్‌పోర్ట్.. బన్నీకి ఫ్యాన్స్ గ్రాండ్ వెల్‌కమ్!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Director Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా మరో వారం రోజుల్లోనే రిలీజ్ కానుంది. దీంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌ను భారీగా చేస్తోంది. ఇప్పటికే పాట్నా, చెన్నైలో భారీ ఈవెంట్స్ నిర్వహించగా నేడు (నవంబర్ 27) కేరళలో మరో ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఇందులో పాల్గొనేందుకు చిత్రం బృందం హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో కొచ్చి వెళ్లింది. అక్కడ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన బన్నీకి ఊహించని స్థాయిలో ఫ్యాన్స్ సాగర స్వాగతం పలికారు.
దద్దరిల్లిన విమానశ్రయం..
కొచ్చి ఎయిర్‌పోర్టులో దిగిన బన్నీకి కేరళ అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. అల్లు అర్జున్ రాక గురించి ముందే తెలుసుకొని వారంతా పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు తరలి వచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న బన్నీకి సుస్వాగతం పలికారు. తమ అభిమాన హీరోను తమ ఫోన్ కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించారు. అంతేకాదు బన్నీతో ఫొటోలు దిగేందుకు కూడా ఎగబడ్డారు. అంచనాలకు మించి వచ్చిన ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేయడానికి ఎయిర్‌పోర్టు సిబ్బంది, పోలీసులు బాగా కష్టపడాల్సి వచ్చింది. అభిమానుల కేరింతలకు దెబ్బకు ఓ దశలో బన్నీ తన రెండు చెవులు మూసుకోవడం గమనార్హం. రాష్ట్రం కాని రాష్ట్రంలో బన్నీ వస్తోన్న ఈస్థాయి ఆదరణ చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 'రాజు ఎక్కడ ఉన్న రాజే' అని కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/GulteOfficial/status/1861740756030886182
https://twitter.com/IamEluruSreenu/status/1861718081313107982
కేరళలో ఎందుకంత క్రేజ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఏపీ, తెలంగాణ తర్వాత ఆ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రాష్ట్రం కేరళ. అక్కడి ప్రజలు బన్నీని ముద్దుగా మల్లు అర్జున్ (Mallu Arjun) అని పిలుచుకుంటారు. కెరీర్ తొలినాళ్లలో చేసిన ‘ఆర్య’ కేరళలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. 100 రోజులకు పైగా ఆడింది. ‘ఆర్య’ నుంచి అల్లు అర్జున్‌ను కేరళ ప్రజలు ఓన్ చేసుకోవడం మెుదలపెట్టారు. అల్లు అర్జున్ హీరోగా చేసిన ప్రతీ సినిమా కేరళలో కచ్చితంగా రిలీజ్ అవుతూ వచ్చింది. తెలుగులో ఏ విధమైన రెస్పాన్స్ వచ్చేదో కేరళలోనూ అంతే స్థాయిలో ప్రేక్షకులు బన్నీ చిత్రాన్ని ఆదరించారు. బన్నీ గత చిత్రం ‘పుష్ప’ సైతం కేరళలో బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ (Pushpa 2) కేరళ ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కొచ్చిలో ప్రమోషన్ ఈవెంట్‌ను మేకర్స్ ప్లాన్ చేశారు.
https://twitter.com/baraju_SuperHit/status/1861742091337953731
https://twitter.com/alluarjun/status/1861737357105672266
రన్ టైమ్ లాక్
'పుష్ప 2' చిత్రానికి సంబంధించి రన్‌టైన్ లాక్ అయినట్లు తెలుస్తోంది. సాధారణంగా సుకుమార్ సినిమా అంటే మూడు గంటలు కచ్చితంగా ఉంటుందని అభిమానులు ఓ అంచనాకు వచ్చేస్తుంటారు. ఆయన గత చిత్రాలు ‘రంగస్థలం’, ‘పుష్ప’ దాదాపు మూడు గంటల నిడివితో వచ్చి బ్లాక్ బాస్టర్లుగా నిలిచాయి. అయితే ఇప్పుడు 'పుష్ప 2' మూడు గంటలకు పైగా నిడివితో రాబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఈ సినిమాకు 3 గంటల 22 నిమిషాల నిడివిని డైరెక్టర్ సుకుమార్ ఫిక్స్ చేశారట. యూఎస్‌లో 3 గంటల 15 నిమిషాల నిడివితో ‘పుష్ప 2’ రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు పర్యవేక్షణ అనంతరం అఫిషియల్‌గా నిడివిని అనౌన్స్ చేయనున్నారు.
నవంబర్ 27 , 2024
NTR 31: ట్రెండ్ బ్రేక్ చేసిన తారక్-ప్రశాంత్ నీల్.. ఎలాగంటే?
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్స్ అంతా తమ చిత్రాన్ని జాతీయ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. తద్వారా తమ మూవీ కలెక్షన్స్‌ను అమాంతం పెంచుకుంటున్నారు. అదే సమయంలో సీక్వెల్స్ మీద సీక్వెల్స్ తీస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ‘బాహుబలి’తో మెుదలైన ఈ పరంపర ప్రస్తుతం పీక్స్‌కు చేరుకుంది. ‘పుష్ప’, ‘సలార్’, హనుమాన్, ‘కల్కి 2898 ఏడీ’, ‘దేవర’ వంటి చిత్రాలు రెండు పార్ట్స్‌గా రాబోతున్నాయి. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సైతం రెండు భాగాలుగా రాబోతోంది. అయితే ఈ సీక్వెల్ ఫార్ములాకు జూ.ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబో చెక్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
సింగిల్ పార్ట్‌గా..
‘దేవర’ (Devara: Part 1) వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత జూ.ఎన్టీఆర్ (Jr NTR), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే సీక్వెల్‌కు కేరాఫ్‌గా మారిన ప్రశాంత్ నీల్ నుంచి సినిమా వస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ కూడా రెండు భాగాలుగా వస్తుందని అంతా భావించారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చిన ‘కేజీఎఫ్’ రెండు భాగాలుగా రాగా, ‘సలార్’కు సీక్వెల్ కూడా ఉండనుండటంతో ఈ అభిప్రాయానికి వచ్చారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ‘NTR 31’ సింగిల్ పార్ట్‌గా తీసుకురావాలని ప్రశాంత్ నీల్ నిర్ణయించారట. సింగిల్ పార్ట్‌లోనే కంప్లీట్ చేయాలని ఆయన భావిస్తున్నారట. అంతేకాదు మరీ లెంగ్తీగా కాకుండా రన్ టైమ్ విషయంలోనూ తారక్-ప్రశాంత్ నీల్ జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
సీక్వెల్స్ అవసరమా!
దర్శకధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ (Baahubali) చిత్రంతో ఈ సీక్వెల్స్‌కు పునాది వేశారు. అప్పటినుంచి తెలుగులో వరుసపెట్టి సీక్వెల్స్ వస్తూనే ఉన్నాయి. ముందుగా చెప్పుకున్నట్లు ‘పుష్ప’, ‘సలార్’, హనుమాన్, ‘కల్కి 2898 ఏడీ’, ‘దేవర’ వంటి చిత్రాలు ఈ కోవకు చెందినవే. అయితే కథ పెద్దగా ఉండి సింగిల్ పార్ట్‌లో చెప్పడానికి వీలుకానప్పుడు సీక్వెల్స్ ప్లాన్ చేయడంలో తప్పు లేదు. ప్రేక్షకులు సైతం దీనిని స్వాగతిస్తారు. కానీ కథలో దమ్ము లేకుండా అధిక కలెక్షన్స్ రాబట్టాలన్న ఉద్దేశ్యంతో సీక్వెల్స్‌కు ప్లాన్ చేస్తే అసలుకే మోసం వస్తుంది. దేవర విషయంలో ఇదే జరిగినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. కథ పరంగా చూస్తే రెండు పార్టులుగా తీసేంత స్టఫ్ అందులో లేదని తొలి రోజు నుంచి నెటిజన్లు చెబుతూ వచ్చారు. తారక్ వన్ మ్యాన్ షో, అనిరుధ్ మ్యూజిక్‌తో సినిమా కలెక్షన్స్ పరంగా బాగా నెట్టుకొచ్చిందని పేర్కొన్నారు. కానీ తమ డబ్బులకు మాత్రం న్యాయం జరగలేదన్న ఫీలింగ్‌లో మెజారిటీ ఆడియన్స్ ఉన్నారు. ఇది గమనించిన ‘NTR 31’ ఆ రిస్క్ తీసుకోవద్దని భావించినట్లు సమాచారం.
ఎదురుచూపులకు చెక్
సాధారణంగా భారీ సక్సెస్ అందుకున్న చిత్రాలకే దర్శకులు సీక్వెల్స్ తీస్తుంటారు. రెండో పార్ట్‌కు సంబంధించిన సర్‌ప్రైజింగ్ లింక్‌ను తొలి భాగం ఎండ్‌లో పెట్టడం ద్వారా సీక్వెల్‌పై భారీగా అంచనాలు పెంచేస్తారు. ‘బాహుబలి’ నుంచి ఇది అందరూ చూస్తూ వచ్చిందే. అయితే కథను పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆడియన్స్‌లో సదరు సినిమాపై పూర్తి సంతృప్తి అనేది వస్తుంది. ప్రస్తుతం సీక్వెల్స్ పరంపర కొనసాగుతుండటంతో రెండో భాగం చూస్తేనే అసలు కథ అంటే ఆడియన్స్‌కు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండో పార్ట్ కోసం వారు నెలలు తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తోంది. ఇలా ఎదురు చూసి చూసి ఓ దశలో ఫ్యాన్స్ తీవ్ర అసహనానికి గురయ్యే ప్రమాదం ఉంది. సెకండ్ పార్ట్స్ చూడాలన్న ఆసక్తి తమలో సన్నగిల్లుతున్నట్లు ఆడియన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘NTR 31’ విషయంలో తారక్- ప్రశాంత్ నీల్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.
నవంబర్‌లో షూటింగ్!
NTR 31కు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కథ కూడా ఆమ్‌మౌస్ట్ పూర్తైనట్లు సమాచారం. ఇందులో తారక్‌కు జోడీగా రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు నవంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని అంటున్నారు. జనవరి లేదా ఫిబ్రవరిలో తారక్ మూవీ షూటింగ్‌లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. 2026 జనవరిలో 9న ఈ మూవీని లాంచ్ చేయాలని ప్రశాంత్ నీల్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు టాక్. అందుకు తగ్గట్లు శరవేగంగా ఈ చిత్రాన్ని ఆయన ఫినిష్ చేస్తారని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
బంగ్లాదేశ్ నేపథ్యంలో..
తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న 'NTR 31' ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ బజ్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్‌తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్. ఇందులో తారక్‌ను రెండు వేరియేషన్స్‌లో ప్రశాంత్ నీల్ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్ క్యారెక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్ లెవల్లో ఉంటాయని ఫిల్మ్ వర్గాల సమాచారం.
ఆ మూవీస్ తర్వాత సెట్స్‌పైకి!
తారక్ బాలీవుడ్‌లో ‘వార్ 2’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌లోనూ తారక్ పాల్గొన్నాడు. ఈ సినిమాలో తన కోటా షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత ‘NTR 31’ను పట్టాలెక్కించాలని తారక్ భావిస్తున్నట్లు సమాచారం. ‘వార్ 2’ పూర్తయితే ఇక పూర్తిస్థాయిలో ప్రశాంత్ నీల్‌కు డేట్స్ అడ్డస్ట్ చేయవచ్చని తారక్ అనుకుంటున్నారట. ఇక ‘వార్ 2’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అక్టోబర్ 09 , 2024
Kalki 2898 AD Story: మూడు ప్రపంచాల సంగ్రామమే ‘కల్కి’.. రిలీజ్‌కు ముందే స్టోరీ రివీల్ చేసిన డైరెక్టర్!
యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్న 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం విడుదలకు ఇంకా ఏడు రోజుల సమయమే మిగిలి ఉంది. ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా రూపొందుతున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహించారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం పార్ట్ - 1 జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ముంబయిలో గ్రాండ్‌గా కల్కి ప్రీరిలీజ్ ఈవెంట్ సైతం నిర్వహించారు. సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా స్టోరీ ఏమై ఉంటుందా? అన్న ప్రశ్న గత కొంతకాలంగా ప్రతీ సినీ అభిమానిలోనూ ఉంది. దీంతో దర్శకుడు నాగ్ అశ్విన్.. 'కల్కి' కథను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మేరకు స్పెషల్ వీడియోను ఎక్స్ వేదికగా రిలీజ్ చేశారు.
త్రీ వరల్డ్స్ స్టోరీ
ప్రభాస్ (Prabhas) హీరోగా రూపొందిన 'కల్కి 2898 ఏడీ' మూవీ కథ.. మూడు ప్రపంచాల మధ్య తిరుగుతుందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ లేటెస్ట్ వీడియోలో స్పష్టం చేశారు. కాశీ, కాంప్లెక్స్ (కాశీ పైన ఉన్న పిరమిడ్ లాంటి సిటీ), శంబాలా నగరాల చుట్టూ ప్రధానంగా కల్కి స్టోరీ తిరగనుందని తెలియజేశారు. ‘పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న కాశీ లేదా వారణాసి ఈ ప్రపంచంలో మొదటి నగరమని అనేక పుస్తకాలు, శాసనాల్లో ఉంది. నాగరికత పుట్టుక కూడా ఇక్కడి నుంచే మొదలైందని చెబుతారు. అలాంటిది ఈ ప్రపంచంలో కాశీనే చివరి నగరమైతే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచే ఈ కథ పుట్టింది’ అని నాగ్ అశ్విన్ తెలిపారు.
https://twitter.com/i/status/1803649632041419033
కాంప్లెక్స్‌కు వెళ్లడమే లక్ష్యం
3000 ఏళ్ల తర్వాత కాశీ నగరం ఎలా ఉంటుంది? గంగ పూర్తిగా ఎండిపోయి ప్రజలు ఎలాంటి దుర్భర పరిస్థితులు అనుభవిస్తారు? అని ఊహించి రీసెర్చ్ చేసి మరి కల్కిలో కాశీ నగరాన్ని సృష్టించినట్లు నాగ్ అశ్విన్ చెప్పారు. అదే సమయంలో తిరగేసిన పిరమిడ్ ఆకారంలో ఉండే 'కాంప్లెక్స్'.. ఆకాశంలో కిలో మీటర్ మేర ఉండి స్వర్గాన్ని తలపిస్తుంటుందని పేర్కొన్నారు. 'కాంప్లెక్స్‌లో లభించని వస్తువు, పదార్థమంటూ ఉండదు. ఒక ముక్కలో చెప్పాలంటే అదొక స్వర్గం. నీరు, ఆహారం, పచ్చదనం ఇలా ప్రతిదీ అక్కడ ఉంటుంది. కాశీ ప్రజలు ఎప్పటికైనా కాంప్లెక్స్‌కు వెళ్లి అన్నింటినీ ఆస్వాదించాలనుకుంటారు. ప్రపంచంలో ఎక్కడా లేని వనరులు కాంప్లెక్స్‌లో ఉండటంతో అవి కాశీ ప్రజలకు అందకుండా కొందరు నియంత్రిస్తుంటారు. కాంప్లెక్స్‌లోకి వెళ్లాలంటే మిలియన్ల కొద్దీ యూనిట్స్ (ధనం) కలిగి ఉండాలి. ఒకరకంగా అక్కడ అడుగు పెట్టడమంటే జీవితాన్ని పణంగా పెట్టడమే' అని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు.
శంబాలా.. ఒక శరణార్థి క్యాంపు
కల్కిలోని మూడో ప్రపంచమైన 'శంబాలా' గురించి కూడా తాజా వీడియోలో నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘వివిధ సంస్కృతుల్లో శంబాలా పేరును వినియోగించారు. టిబెటిన్ కల్చర్‌లో దీన్ని షాంగ్రిలా అని పిలిచారు. శంబాలా నుంచే విష్ణు చివరి అవతారం వస్తుందని పురణాలు చెబుతున్నాయి. కాబట్టి శంబాలా ప్రజలు దేవుడి రాక ఇక్కడి నుండి ఉంటుందన్న నమ్మకంతో జీవిస్తుంటారు. అయితే శంబాలా అనేది అతి పెద్ద శరణార్థి క్యాంపులాంటిది. ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు, సంస్కృతులకు చెందిన వాళ్లు.. కాంప్లెక్స్ సభ్యులు వేటాడి హతమార్చగా మిగిలిన వాళ్లు తలదాచుకునే ప్రదేశం. వీరిలోనే రెబల్స్ కూడా ఉంటారు. కాంప్లెక్స్ సభ్యులతో నిత్యం పోరాటం చేస్తూ ఉంటారు. ఇలా ఈ మూడు ప్రపంచాల మధ్యే నడిచే కథ వాటి మధ్య ఏర్పడే సంఘర్షణలే కల్కి కథ’ అని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు.
‘కల్కి’ రన్‌టైమ్ ఎంతంటే?
గత కొన్ని రోజులు నుంచి ఈ మూవీ రన్ టైమ్ గురించి చర్చ నడుస్తోంది. తాజాగా ఇప్పుడు అధికారికంగా రన్ టైమ్ బయటకి వచ్చింది. ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు.. మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. రన్ టైమ్ 180.55 నిమిషాల నిడివితో రానున్నట్లు పేర్కొన్నారు. అంటే ఈ సినిమాను మేకర్స్ 3 గంటల 55 సెకన్లకు కట్ చేశారు. మరి ఈ భారీ ట్రీట్‌ను థియేటర్స్‌లో ప్రేక్షకుల ఎలా ఆదరిస్తారో చూడాలి. కాగా, సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశాపటానీ, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించారు.
జూన్ 20 , 2024
Indian Richest Actress: దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఎవరంటే? దీపికా, ఐశ్వర్యరాయ్, అలియా మాత్రం కాదు!
దేశంలో అత్యధిక సంపాదకులు అనగానే ప్రతీ ఒక్కరు అంబానీ, ఆదానీ పేర్లు ఠక్కున చెప్పేస్తారు. ధనిక హీరోల గురించి అడిగిన కూడా సినిమా నాలెడ్జ్ ఉన్నవారు ఆలోచించకుండా ఆన్సర్ చెప్పగలుగుతారు. మరి రిచెస్ట్ హీరోయిన్స్ అంటే మాత్రం సినీ లవర్స్‌తో సహా ఎవరి దగ్గర సమాధానం ఉండకపోవచ్చు. హీరోయిన్ల ఆస్తులు, రెమ్యూనరేషన్స్ గురించి ఎక్కువగా చర్చ జరగకపోవడమే ఇందుకు కారణం. ఇది గమనించిన హురున్ రిచ్ లిస్ట్ సర్వే (Hurun India Rich List) సంస్థ దేశంలోనే అత్యంత సంపన్నురాలైన హీరోయిన్ల జాబితాను రిలీజ్ చేసింది. టాప్-5లో ఉన్న నటీమణుల ఆస్తుల విలువను ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
జుహీ చావ్లా (Juhi Chawla)
హురున్ రిచ్ లిస్ట్ సర్వే ప్రకారం దేశంలో అత్యంత ధనవంతురాలైన నటిగా బాలీవుడ్ తార జుహీ చావ్లా (Juhi Chawla) నిలిచింది. ఐశ్వర్యరాయ్, ప్రియాంక చోప్రా, అలియా భట్, దీపికా పదుకొనే వంటి స్టార్ హీరోయన్లను తలదన్ని ఎవరూ ఊహించని విధంగా టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఆమె ఆస్తుల విలువ ఏకంగా రూ.4,600 కోట్ల రూపాయలు ఉన్నట్లు సర్వే సంస్థ ప్రకటించింది. 1990వ దశకంలో జుహీ చావ్లా బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. 1984లో మిస్ ఇండియా కిరిటాన్ని సైతం కైవసం చేసుకుంది. వయసు రిత్యా హీరోయిన్ పాత్రలకు స్వస్థి పలికిన జుహీ గత పదేళ్లుగా అడపాదడపా సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తూ అలరిస్తోంది. ఇదిలా ఉంటే జుహి చావ్లాకు సినిమాలతో పాటు చాలా వ్యాపారాలు ఉన్నాయి. షారుక్ ఖాన్ రెడ్ చిల్లిన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, కోలకత్తా నైట్ రైడర్స్‌లో ఆమెకు భాగస్వామ్యం ఉంది. అలాగే ఆమె భర్త జై మెహతా పెద్ద వ్యాపారవేత్త. కుటుంబ వ్యాపారాల్లోనూ జుహీ చావ్లాకు భాగస్వామ్యం ఉంది.
ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai)
దేశంలోని ధనిక హీరోయిన్ల జాబితాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ రెండో స్థానంలో నిలిచింది. ఆమె ఆస్తుల విలువ రూ.860 కోట్లుగా ఉన్నట్లు సర్వే సంస్థ తేల్చింది. ఈమె సంపద చాలా మంది హీరోల కన్నా ఎక్కువనే చెప్పాలి. ఐశ్వర్య ఇటీవల కాలంలో హీరోయిన్‌గా కాకుండా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తోంది. ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రం కోసం రూ.15 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అంతేకాక ఏదైనా బ్రాండ్‌కు పనిచేస్తే రోజుకు రూ.6-7కోట్లు చార్జ్ చేస్తున్నట్లు టాక్ ఉంది. ప్రస్తుతం పలు అంతర్జాతీయ బ్రాండ్‌లకు ఆమె పనిచేస్తోంది. వీటితో పాటు దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ఇంటికి కోడలిగా వెళ్లి తన గుడ్‌విల్‌ను, మార్కెట్ వాల్యూను మరింత పెంచుకుంది.
ప్రియాంక చోప్రా (Priyanka Chopra)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ జాబితాలో మూడో స్థానం దక్కించుకుంది. ఆమె రూ.650 కోట్ల మేర ఆస్తులను కూడబెట్టినట్లు హురున్ రిచ్ లిస్ట్ సర్వే సంస్థ ప్రకటించింది. ప్రియాంక ప్రస్తుతం హాలీవుడ్‌లో సెటిల్ అయ్యింది. అక్కడ వరుసగా సినిమాలు, ‘సిటాడెల్’ వంటి సిరీస్‌లు చేసి భారీ మెుత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటోంది. అలాగే నిర్మాణ సంస్థ పర్పుల్ పిక్చర్స్ పార్ట్నర్స్ ప్రారంభించి సినిమాలు నిర్మిస్తోంది. ప్రసిద్ధ డేటింగ్ యాప్ ‘బుంబుల్’లో ఆమెకు పెట్టుబడులు ఉన్నాయి. అలాగే హెయిర్ కేర్ కంపెనీ ‘అనామలీ’ని కూడా ఆమె ఇటీవల ప్రారంభించింది. వీటితో పాటు పలు అంతర్జాతీయ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ రెండు చేతులా ప్రియాంక సంపాదిస్తోంది.
అలియా భట్ (Alia Bhatt)
బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్ రూ.550 కోట్ల ఆస్తులతో ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఒక్కో సినిమాకు రూ.20 కోట్లు పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటూ బాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వ్యాపార సామ్రాజ్యంలోనూ ఈ అమ్మడు సత్తా చాటుతోంది. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఎడ్-ఎ-మమ్మా (Ed-a-Mamma) అనే స్టార్టప్ కంపెనీని లాంచ్ చేసింది. ఈ కంపెనీ 2 నుంచి 14 ఏళ్ల వయసు పిల్లలకు అవసరమైన బట్టలను విక్రయిస్తుంటుంది. వెబ్‌సైట్ ద్వారా 800లకుపైగా ప్రొడక్స్ట్ ఈ కంపెనీ విక్రయిస్తోంది. 12 నెలల్లోనే 10 రెట్ల వృద్ధితో రూ.150 కోట్లు విలువైన సంస్థగా అవతరించడం గమనార్హం. ఈ కంపెనీతో పాటు నైకా, ఫూల్.కో, స్టైల్ క్రేకర్‌లో వంటి సంస్థల్లో అలియా భట్ పెట్టుబడిదారిగా ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌ను 2022 ఏప్రిల్ 14న అలియా వివాహం చేసుకుంది. ప్రస్తుతం వారికి రాహా అనే పాప ఉంది.
దీపికా పదుకొనే (Deepika Padukone)
దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్‌గా దీపికా పదుకొనే టాప్-5 నిలిచింది. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ రూ.500 కోట్లుగా ఉన్నట్లు సర్వే సంస్థ ప్రకటించింది. దీపికా ఒక్కో సినిమాకు రూ.15-30 కోట్ల వరకూ డిమాండ్ చేస్తోంది. అంతేకాదు పలు బ్యూటీ ప్రాడెక్ట్స్‌ను ప్రమోట్ చేస్తూ రూ. కోట్లలో సంపాదన అర్జిస్తోంది. ఇటీవల హోమ్ ఫర్నిషింగ్ బిజినెస్‌లోకి దీపికా అడుగుపెట్టింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఫర్నిచర్ సంస్థ 'పొటరీ బార్న్'లో అమె పెట్టుబడలు పెట్టింది. '82 ఈస్ట్' పేరుతో సొంత సెల్ఫ్ కేర్ బ్రాండ్‌ను ఆమె రన్ చేస్తోంది. మరోవైపు నిర్మాతగానూ మారింది. తన సొంత బ్యానర్‌లో ‘చపాక్’ వంటి హిట్ చిత్రాలను నిర్మించింది.
అక్టోబర్ 22 , 2024
Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
ప్రస్తుతం భారతీయ సినిమా మరింత సరళంగా మారింది. ఒక భాషలో రిలీజైన సినిమాలను మరో భాషలోని ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి గత రెండేళ్లలో తెలుగులోకి చాలా చిత్రాలు వివిభ భాషల నుంచి డబ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్ అయిన మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలతో పాటు అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం.
[toc]
Best malayalam movies in telugu
ప్రేమలు
రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. యూనిక్ కథాంశంతో యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం కథంతా హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సినిమా కథలోకి వెళ్తే..సచిన్.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని కలలు కంటాడు. వీసా రిజెక్ట్ కావడంతో గేట్ కోచింగ్ కోసం హైదరాబాద్ వస్తాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అప్పటికే లవ్‌లో ఫెయిలైన సచిన్.. రీనూకు తన ప్రేమను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవరు? సచిన్ - రీనూ చివరకు కలిశారా? లేదా? అన్నది కథ.
మంజుమ్మెల్ బాయ్స్
ఈ చిత్రం మంచి ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కేరళ కొచ్చికి చెందిన కుట్టన్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్కడ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావడానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ.
ఆవేశం
ఇటీవల మలయాళంలో బ్లాక్ బాస్టర్ అయిన ఆవేశం చిత్రం అన్ని భాషల్లోనూ అదే హవా కొనసాగించింది. ఈ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కామెడీ యాక్షన్ జొనర్‌లో వచ్చి మంచి ఎంటర్‌టైనింగ్ అందించింది. ఈ సినిమా కథలోకి వెళ్తే..కేరళకు చెందిన బీబీ (మిథున్ జై శంకర్), అజు (హిప్‌స్టర్), మరియు శాంతన్ (రోషన్ షానవాజ్) ముగ్గురు స్నేహితులు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంటారు. కాలేజీలో సీనియర్లు కారణం లేకుండా కొడుతుంటారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో గ్యాంగ్‌స్టర్ అయిన రంగాతో(ఫాహద్ ఫాసిల్) ఫ్రెండ్‌షిప్ చేస్తారు. రంగా స్నేహం వారి జీవితాలను ఏవిధంగా మార్చిందనేది కథ.
ది గోట్ లైఫ్
ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ
RDX
మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది.
2018
కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఆంథోని జోసెఫ్ డైరెక్ట్ చేశాడు.
కింగ్ అఫ్ కొత్త
ఖన్నా భాయ్ (డ్యాన్స్ రోజ్ షబీర్) కోతా పట్టణంలో డ్రగ్స్ వ్యాపారి. సిఐ షాహుల్ హాసన్ (ప్రసన్న) పట్టణంలో డ్రగ్స్ మాఫియాను నిర్మూలించాలని కంకణం కట్టుకుంటాడు. కొన్నేళ్ల క్రితం కోతా... రాజు (దుల్కర్ సల్మాన్) నియంత్రణలో ఉందని, ఒకప్పుడు ఖన్నా భాయ్ రాజుకి ప్రియమైన స్నేహితుడని షాహుల్ తెలుసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల రాజు మరియు ఖన్నా భాయ్ ఇద్దరూ విడిపోయారు. వారిని వేరు చేసింది ఏమిటి? అప్పుడు సీఐ షాహుల్ హాసన్ ఏం చేశాడు? అనేది కథ
రోమాంచం
రోమాంచం చిత్రం మలయాళంలో వచ్చిన కామెడీ హర్రర్ చిత్రం. ఈ చిత్రాన్ని జితు మాధావన్ తెరకెక్కించారు. ఈ సినిమా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కథలోకి వెళ్తే…. బెంగుళూరులోని ఓ ఇంట్లో ఉండే ఏడుగురు బ్యాచిలర్ స్నేహితుల కథే ఈ చిత్రం. అందులో ఒకరు ఉద్యోగం చేస్తుంటారు, మరొకరు వ్యాపారాలు చేస్తూ విఫలమవుతుంటాడు. ఇద్దరు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు కానీ ఇంకా ఆఫర్ లెటర్ అందదు. ఒకరు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరూ ఏమీ చేయకుండా తమ జీవితాలను సాగిస్తుంటారు. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లోకి ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఇంతకీ ఎంటా పరిణామం? దాని వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి అనేది కథ.
భ్రమయుగం
తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ.
అన్వేషిప్పిన్ కండెతుమ్
ఈ సినిమా మంచి సస్పెన్స్‌ను క్యారీ చేస్తూ.. ఆసక్తికరంగా కథనం సాగుతుంది. ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ.
మలైకోట్టై వాలిబన్
స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయకుడి కథతో ఈ మూవీ తెరకెక్కింది. ఈ పోరాటంలో వాలిబాన్ (మోహన్‌లాల్)కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ ప్రాంత ప్రజలకు అతడు హీరోగా ఎలా నిలిచాడు? అన్నది కథ.
నెరు
కళ్లు కనిపించని సారా మహ్మద్ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్ విజయ్ మోహన్ (మోహన్‌లాల్)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు? అన్నది కథ.
మాలికాపురం
ఎనిమిదేళ్ల చిన్నారి షన్ను అయ్యప్ప స్వామి భక్తురాలు. షన్ను కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో సోదరుడు బుజ్జితో కలిసి షన్ను శబరిమలై బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లలు కిడ్నాప్ చేసే గ్యాంగ్ షన్నును ఎలా ఇబ్బంది పెట్టింది? కథలో ఉన్ని ముకుందన్ పాత్ర ఏంటి? అన్నది కథ.
Best Tamil movies in telugu
డియర్
అర్జున్ (జీవి ప్రకాష్) న్యూస్ రీడర్‌గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్ లైఫ్‌లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
సైరన్
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా కథలోకి వెళ్తే..భార్యను (అనుపమ)ను చంపిన కేసులో తిలగన్ (జయం రవి) జైలుకు వెళ్తాడు. పెరోల్‌పై బయటకొచ్చిన తిలగన్.. వరుసగా పొలిటిషియన్స్‌ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీసర్ నందిని (కీర్తిసురేష్) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: హాట్ స్టార్
లియో
హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలతో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. ఇదే సమయంలో ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) & గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? అనేది మిగిలిన కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
జైలర్
ఈ చిత్రం సరైన హిట్‌లేక సతమతమవుతున్న రజినీకాంత్‌కు సాలిడ్ విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ.
ఓటీటీ; హాట్ స్టార్
విక్రమ్
ఈ సినిమా మరోసారి వింటేజ్ కమల్ హాసన్‌ను గుర్తు తెచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ కమల్ హాసన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక కథలోకి వెల్తే.. డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ.
ఓటీటీ; హాట్ స్టార్, జీ5
కాల్వన్
ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.
ఓటీటీ: హాట్‌స్టార్
అయాలన్
భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్ (శరద్ ఖేల్కర్) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్ భారత్‌లో ల్యాండ్ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: సన్ నెక్ట్స్
మెర్రీ క్రిస్మస్
ఆల్బర్ట్ (విజయ్ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్ గతం ఏంటి? అన్నది స్టోరీ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్
ఈ చిత్రం కాస్త వివాదాస్పదం అయింది. తమిళంలో హిట్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి తండ్రిని చూసి చెఫ్ కావాలని అనుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె నాన్ వెజ్ ముట్టుకోవడం పాపం అని తండ్రి అంటాడు. మరి కలలు కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? లేదా? అన్నది కథ.
జపాన్
ఈ చిత్రం కార్తీ నటించిన 25వ చిత్రం. ఈ సినిమాలో పేరుమోసిన దొంగ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. అతని పాత్ర హెలెరియస్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అంతా అనుమానిస్తారు. జపాన్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్ కోసం గాలిస్తుంటారు. తన ప్రేయసిని కలిసే ప్రయత్నంలో జపాన్ దొరికిపోతాడు. అయితే ఆ సొత్తు జపాన్ దొంగలించలేదని విచారణలో తేలుతుంది. మరి ఆ నగల దొంగతనం చేసింది ఎవరు?
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
కెప్టెన్ మిల్లర్
కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధనుష్) నిమ్న కులానికి చెందిన యువకుడు. ఊరిలోని కుల వివక్షను భరించలేక గౌరవ మర్యాదల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్లర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్, సందీప్ కిషన్ పాత్రలు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
చిన్నా
మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో... అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ
800
ఈ చిత్రంలో తొలుత విజయ్ సేతుపతి నటించినప్పటికీ.. తమిళనాడు నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక కథలోకి వెళ్తే.. తేయాకు తోటల్లో పనిచేస్తున్న తమిళ కుటుంబంలో ముత్తయ్య మురళీధరన్ జన్మిస్తారు. శ్రీలంకలోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే సింహళులు, తమిళుల మధ్య ఘర్షణలు చెలరేగుతాయి. దాంతో ముత్తయ్య కుటుంబం ప్రాణ భయంతో దూరంగా వెళ్లి తలదాచుకుంటుంది. 70వ దశకంలో చెలరేగిన ఘర్షణల ప్రభావం తన బిడ్డపై పడకూడదని ముత్తయ్య తల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆసక్తి ఎలా ఏర్పడింది? శ్రీలంక జట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవమానాల్ని, సవాళ్లని ఎదుర్కొని ఆటగాడిగా నిలబడ్డాడు? అనేది మిగతా కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
మార్క్ ఆంటోనీ
మార్క్ (విశాల్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్ మిషన్‌ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు.
ఓటీటీ: ప్రైమ్
నాయకుడు
అణగారిన వర్గానికి చెందిన మహారాజు రామాపురం ఎమ్మెల్యే. అయితే, అతడు, అతని కుమారుడు రఘు వీరకు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేశారు. మహారాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన తండ్రి కోసం పోరాడేందుకు రఘుని ప్రేరేపిస్తుంది. ఇంతకు ఆ సమస్య ఏమిటి? వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎందుకు మానేశారు?చివరికి ఏమి జరిగింది అనేది మిగిలిన కథ
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
సార్
బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
Best Kannada movies in telugu
కబ్జ
ఆర్కేశ్వర (ఉపేంద్ర), భారత వైమానిక దళ అధికారి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. అతను సంపన్నమైన అమ్మాయి అయిన మధుమతి (శ్రియా శరణ్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇదేక్రమంలో అమరాపురను తమ అధికారం కోసం భయంకరమైన గూండాలు మరియు రాజకీయ నాయకులు ఓ క్రైమ్ వరల్డ్‌గా మార్చేస్తారు. అయితే అర్కేశ్వర క్రైమ్ ప్రపంచంలోకి ప్రవేశించి ఆ ప్రాంతానికి నాయకుడు ఎలా అవుతాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది మిగతా కథ.
సప్తసాగరాలు దాటి సైడ్ బి
మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ.
ఓటీటీ; ప్రైమ్ వీడియో
ఘోస్ట్
బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ తన గ్యాంగ్‌తో కలిగి ఓ జైలును ఆక్రమిస్తాడు. మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్‌ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ? అతని గతం ఏమిటి ? అసలు అతను ఘోస్ట్‌గా ఎందుకు మారాడు ? అన్నది మిగతా కథ.
ఓటీటీ: జీ5
బాయ్స్ హాస్టల్
ఓ బాయ్స్ హాస్టల్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండే అజిత్ (ప్రజ్వల్) ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. తమని టార్చర్ చేసే హాస్టల్ వార్డెన్‌ను తన ఫ్రెండ్స్‌తో కలిసి చంపేసినట్లుగా స్క్రిప్ట్‌లో రాసుకుంటాడు. అయితే నిజంగానే వార్డెన్ చనిపోతాడు. సుసైడ్ నోట్‌లో అజిత్, అతడి ఫ్రెండ్స్ పేరు రాయడంతో కథ మలుపు తిరుగుతుంది.
ఓటీటీ: ఈటీవీ విన్
కాటేరా
ఈ సినిమా కన్నడ నాట బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కథలోకి వెళ్తే.. భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కాటేరా (దర్శన్) పెరోల్ మీద బయటకు వస్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. వారందరూ ఎవరు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ.
ఓటీటీ: జీ5
టోబి
టోబి చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులకు గురవుతాడు. కోపం వస్తే అందరితో దారుణంగా ప్రవరిస్తుంటాడు. నిజానికి అమాయకుడైన టోనీని ఊరిపెద్ద ఆనంద హత్యలు చేసేందుకు ఉపయోగించుకుంటాడు. తనను వాడుకుంటున్నారని తెలుసుకున్న టోబి ఏం చేశాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
ఓటీటీ: సోనీ లీవ్
Best Hindi movies in telugu
అమర్ సింగ్ చమ్కిలా
జానపద గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పేద కుటుంబంలో జన్మించిన ఆయన సింగర్ కావడాని కసితో ఎలా ఎదిగాడు? 27 ఎళ్లతో ఎంతో ఫేమస్ అయిన అతన్ని ఎవరు చంపారు అన్నది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
యానిమల్
ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమాలో సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో రణ్‌బీర్ కపూర్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది. దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
మైదాన్
1952లో జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో భారత ఫుట్‌బాల్ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగన్) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్‌గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
లస్ట్ స్టోరీస్ 2
లస్ట్ స్టోరీస్ 2లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథలో మృణాల్, అంగన్ బేడీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడా ఒప్పుకుంటారు. అయితే మృణాల్ నానమ్మ.. పెళ్లికి ప్రేమ కంటే బలమైన శారీరక సంబంధం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత మృణాల్- బేడీ ఎం చేశారన్నది ఫస్ట్ కథ. రెండో కథలో ఓనర్ లేనప్పుడు పనిమనిషి తన భర్తను తెచ్చుకుని లైంగికానందం పొందుతుంది. అయితే వీరిద్దరిని చూసిన ఓనర్ ఏం చేసింది అనేది రెండో కథ. ఇక మూడో కథలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ కొన్నేళ్ల తర్వాత తమన్నను కలుస్తాడు. వీరిద్దరు శారీరకంగా దగ్గరైన తర్వాత ఏం జరిగింది అనేది కథ. నాల్గొ కథలో కామంతో రగిలిపోతున్న తన భర్త విషయంలో కాజల్ ఏమి చేసింది అనేది కథ.. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
మర్డర్ ముబారక్
రాయల్ ఢిల్లీ క్లబ్‌లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్ రంగంలోకి దిగుతాడు. క్లబ్‌లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్), నటి షెహనాజ్ నూరాని (కరిష్మా కపూర్), రాయల్ రన్‌విజయ్ (సంజయ్ కపూర్), లాయర్ ఆకాష్ (విజయ్ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
భక్షక్
జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
గంగూభాయి కతియావాడి
ఈ చిత్రం అలియా భట్ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. గంగూబాయి హర్జీవందాస్ (అలియా భట్) గుజరాత్‌లోని ఓ పెద్ద కుటుంబంలో పుడుతుంది. ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆసరా చేసుకున్న గంగుభాయ్ లవర్ ఆమెను ముంబై తీసుకొచ్చి అక్కడ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. తప్పని పరిస్థితుల్లో ఆమె వేశ్యగా కొనసాగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత.. గంగూబాయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి? వేశ్యల అభ్యున్నతి ఆమె ఏం చేసింది అనేది మిగతా కథ.
ఓటీటీ; నెట్‌ఫ్లిక్స్
83
1983 నాటి క్రికెట్ ప్రపంచకప్‌ను ఇండియా గెలుచుకున్న నేపథ్యాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆ క్రమంలో ఆటగాళ్లు ఎదురుకున్న సమస్యలు, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? ఎలా కప్ గెలిచారు ? అనేది మిగతా కథ
ఓటీటీ; డిస్నీ హాట్ స్టార్
జవాన్
సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
గదర్ 2
బాలీవుడ్‌లో చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవుతున్న క్రమంలో వచ్చిన ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. తారా సింగ్ (సన్నీ డియోల్) భారత సరిహద్దుల్లో కనిపించకుండా పోతాడు. పాక్ అతడ్ని బంధించిందని భావించిన అతడి కొడుకు.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్తాడు. అనూహ్యాంగా ఇంటికి తిరిగొచ్చిన తారా సింగ్.. కొడుకు పాక్‌లో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. బిడ్డను కాపాడేందుకు పాక్ వెళ్తాడు. అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
మే 20 , 2024