UATelugu
శృతి (హన్సిక) ఓ యాడ్ ఏజెన్సీలో పని చేస్తుంటుంది. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తాత, అమ్మ పెంపకంలో పెరుగుతుంది. చరణ్ (సాయి తేజ)తో శృతి ప్రేమాయణం సవ్యంగా సాగిపోతున్న దశలో అనుకోకుండా ఆమె ఎమ్మెల్యే గురుమూర్తి (నరేన్) ముఠా వలలో చిక్కుకుంటుంది. స్కిన్ మాఫియా ముఠాలో గురుమూర్తి చేస్తున్న దారుణాలన్నీ శృతికి తెలుస్తాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలేంటి? ఈ స్కిన్ మాఫియా ముఠా వెనక ఎవరున్నారు? ఈ ముఠా ఆగడాలకు శృతి ఎలా చెక్ పెట్టింది? అనేది సినిమా
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
Watch
రివ్యూస్
YouSay Review
My Name Is Shruthi Movie Review: హన్సిక నటన అదుర్స్.. సినిమా హిట్ కొట్టినట్లేనా?
టాలీవుడ్‌లో అగ్రకథానాయిక స్థాయికి ఎదిగిన నటీమణుల్లో హన్సిక (Hansika) ఒకరు. బన్నీ, రామ్, నితీన్ వంటి స్టార్ హీరోల సరసన నటించి ఆమె గుర్తింపు సంపాదించ...read more
How was the movie?
తారాగణం
హన్సిక మోత్వాని
శృతిసాయి తేజ్చరణ్
ప్రేమ
డాక్టర్ కిరణ్మయిమురళీ శర్మ
ఏసీపీ రంజిత్పూజా రామచంద్రన్
అనురాజా రవీందర్
హోంమంత్రి వి.ప్రతాప్ రెడ్డిప్రవీణ్
భాభిఆడుకలం నరేన్
ఎమ్మెల్యే గురుమూర్తిజయప్రకాష్
సివిఎల్ నరసింహారావు
దయానంద్ రెడ్డియాది
అప్పాజీ అంబరీష దర్భవ్యాపారవేత్త
సిబ్బంది
శ్రీనివాస్ ఓంకార్దర్శకుడు
బూరుగు రమ్య ప్రభాకర్నిర్మాత
మార్క్ కె రాబిన్సంగీతకారుడు
కిషోర్ బోయిడపుసినిమాటోగ్రాఫర్
ఛోటా కె. ప్రసాద్ఎడిటర్ర్
కథనాలు
This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
గత వారంలాగే ఈ వారం కూడా పెద్ద సినిమాలు లేకపోవడంతో థియేటర్లను ఆక్రమించేందుకు చిన్న సినిమాలు సిద్ధమవుతున్నాయి. నవంబర్ మూడో వారంలో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఆసక్తికర సినిమాలు రాబోతున్నాయి. నవంబర్ 13 నుంచి 19 తేదీల మధ్య ఆ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.
థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు
మంగళవారం
‘RX 100’ డైరెక్టర్ అజయ్ భూపతి రూపొందించిన మరో ఆసక్తికర చిత్రం ‘మంగళవారం’ (Mangalavaaram). ఇందులో పాయల్ రాజ్‌పూత్ (Payal Rajput), అజ్మల్ అమిర్ ప్రధాన పాత్రలు పోషించారు. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ ఈ మూవీని నిర్మించారు. నవంబరు 17న (శుక్రవారం) తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.
మై నేమ్ ఈజ్ శృతి
ప్రముఖ హీరోయిన్ హన్సిక నటించిన లేటేస్ట్ మూవీ ‘మై నేమ్ ఈజ్ శృతి’ (My Name Is Shruthi) సినీ ప్రియులను థ్రిల్ చేసేందుకు ఈ వారమే వస్తోంది. ఆమె లీడ్ రోల్‌లో చేసిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీనివాస్ ఓంకార్ తెరకెక్కిస్తున్నారు. బురుగు రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ఊహకందని మలుపులతో సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. తన మనోభావాలను ధైర్యంగా వెల్లడించే యువతిగా ఇందులో హన్సిక కనిపిస్తుందని పేర్కొన్నాయి. నవంబరు 17న (శుక్రవారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
స్పార్క్ లైఫ్
విక్రాంత్ హీరోగా నటించి.. స్వయంగా తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘స్పార్క్ లైఫ్’ (Spark The Life). డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ మూవీని నిర్మించింది. మెహరీన్, రుక్సర్ థిల్లాన్ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 17న థియేటర్‌లలో విడుదల కానుంది.
సప్త సాగరాలు దాటి సైడ్-B
కన్నడ నటుడు రక్షిత్ శెట్టి (Rakshit Shetty) కీలక పాత్రలో నటించిన ప్రేమకథా చిత్రం ‘సప్త సాగరాలు దాటి సైడ్-B’ (Sapta Sagaralu Dhaati Side B). రుక్మిణీ వసంత్ కథానాయిక. హేమంత్ ఎం. రావు దర్శకత్వం వహించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన (Sapta Sagaralu Dhaati Side A) సినిమాకు కొనసాగింపుగా కొత్త చిత్రాన్ని తీసుకొస్తున్నారు. నవంబర్ 17న కన్నడతోపాటు తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.
అన్వేషి
విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అన్వేషి’ (Anvesh). వి.జె.ఖన్నా దర్శకత్వం వహించారు. టి.గణపతిరెడ్డి నిర్మాత. అడవి నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కిందని చిత్ర యూనిట్ తెలిపింది. కథానాయిక అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషించిందని చెప్పింది. ఆమె చుట్టూ సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయని, చైతన్ భరద్వాజ్ మరోసారి తన సంగీతంతో ఆకట్టుకుంటాడని చెబుతోంది. నవంబరు 17న ఈ సినిమా విడుదల కానుంది.
ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
TitleCategoryLanguagePlatformRelease DateTwin LoveWeb SeriesEnglishAmazon PrimeNov 17ApurvaMovieHindiDisney + HotstarNov 15Chinna MovieTamil/TeluguDisney + HotstarNov 17Kannur SquadMovieMalayalamDisney + HotstarNov 17How to Become a Mob BossWeb SeriesEnglishNetflixNov 14Best. Christmas. Ever!MovieEnglishNetflixNov 16The crownWeb SeriesEnglishNetflixNov 16Believer 2MovieEnglishNetflixNov 17The DadsDocumentaryEnglishNetflixNov 17SukheeMovieHindiNetflixNov 18The RailwaymenMovieHindiNetflixNov 18
APP: సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 5 తేదీల మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు ఏంటో తెలుసుకోవాలంటే YouSay Web లింక్‌పై క్లిక్ చేయండి.
నవంబర్ 13 , 2023
My Name Is Shruthi Movie Review: హన్సిక నటన అదుర్స్.. సినిమా హిట్ కొట్టినట్లేనా?
నటీనటులు: హన్సిక, మురళీశర్మ, నరేన్, జయప్రకాష్, వినోదిని, సాయితేజ, పూజా రామచంద్రన్, ప్రేమ, ప్రవీణ్, రాజీవ్ కనకాల తదితరులు
దర్శకత్వం: శ్రీనివాస్ ఓంకార్,
సినిమాటోగ్రఫీ: కిశోర్ బోయిడపు
సంగీతం: మార్క్ కె రాబిన్
నిర్మాత: బురుగు రమ్య ప్రభాకర్,
సంస్థ: వైష్ణవి ఆర్ట్స్
విడుదల: 17 నవంబర్ 2023
టాలీవుడ్‌లో అగ్రకథానాయిక స్థాయికి ఎదిగిన నటీమణుల్లో హన్సిక (Hansika) ఒకరు. బన్నీ, రామ్, నితీన్ వంటి స్టార్ హీరోల సరసన నటించి ఆమె గుర్తింపు సంపాదించింది. అయితే గత కొంత కాలంగా ఆమెకు టాలీవుడ్ నుంచి పెద్దగా అవకాశాలు లేవు. ఈ క్రమంలోనే ఆమె నటించిన లేటెస్ట్ మూవీ `మై నేమ్ ఈజ్ శృతి`. హన్సిక చాలా రోజుల తర్వాత చేసిన తెలుగు చిత్రం ఇది. ఈ సినిమా విజయంపై ఈ భామ ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? హన్సికకు విజయాన్ని తెచ్చిపెట్టిందా? ఈ కథనంలో తెలుసుకుందాం.
కథ
శృతి (హన్సిక) ఓ యాడ్ ఏజెన్సీలో పని చేస్తుంటుంది. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తాత, అమ్మ పెంపకంలో పెరుగుతుంది. చరణ్ (సాయి తేజ)తో శృతి ప్రేమాయణం సవ్యంగా సాగిపోతున్న దశలో అనుకోకుండా ఆమె ఎమ్మెల్యే గురుమూర్తి (నరేన్) ముఠా వలలో చిక్కుకుంటుంది. స్కిన్ మాఫియా ముఠాలో గురుమూర్తి చేస్తున్న దారుణాలన్నీ శృతికి తెలుస్తాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలేంటి? ఈ స్కిన్ మాఫియా ముఠా వెనక ఎవరున్నారు? ఈ ముఠా ఆగడాలకు శృతి ఎలా చెక్ పెట్టింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
శృతిగా హన్సిక మోత్వాని మంచి నటన కనబరిచింది. ప్రథమార్ధంలో కుటుంబం, ప్రేమ నేపథ్యంలో సాగే సన్నివేశాల్లోనూ, ద్వితీయార్ధంలో మలుపులతో కూడిన సీన్లలో మంచి అభినయం ప్రదర్శించిది. పూజా రామచంద్రన్ నటన ఆకట్టుకుంటుంది. ఒకప్పుడు హీరోయిన్‌గా చేసిన ప్రేమ ఇందులో వ్యతిరేక ఛాయలున్న పాత్రలో కనిపించి మెప్పించింది. ప్రతి నాయకుడి పాత్రలో నరేన్ పర్వాలేదనిపించాడు. మురళీశర్మ, జయప్రకాశ్, ప్రవీణ్ అలవాటైన పాత్రల్లో తమదైన నటన కనబరిచారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
చర్మంతో కూడా వ్యాపారం చేస్తారనే కొత్త అంశాన్ని డైరెక్టర్ శ్రీనివాస్ ఓం కార్ ఈ సినిమాలో చూపించారు. మంచి కథనే ఎంచుకున్నప్పటికీ దానిని ఆసక్తికరంగా ఆవిష్కరించలేకపోయారు. స్కిన్ గ్రాఫ్టింగ్ ప్రస్తావనతో సినిమా మొదలుపెట్టినా పాత్రల పరిచయానికి, కథా నేపథ్యాన్ని ఆవిష్కరించడానికే ఎక్కువ సమయం తీసుకున్నారు. ఏడాది తర్వాత, ఆరు నెలల ముందు అంటూ ముక్కలు ముక్కలుగా కథని చెప్పడం ప్రేక్షకులను గందరగోళానికి గురిచేస్తుంది. కీలక సన్నివేశాల్లో భావోద్వేగాల్ని పండించడంలో దర్శకుడు విఫలయ్యాడు. అయితే ద్వితియార్థంలో వచ్చే మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
సాంకేతికంగా
సాంకేతిక విభాగాలు మంచి పనితీరునే కనబరిచాయి. మార్క్ కె.రాబిన్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. కిశోర్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
హన్సిక నటనట్విస్ట్‌లుసంగీతం
మైనస్ పాయింట్స్
ప్రథమార్థంపండని భావోద్వేగాలు
రేటింగ్ : 2.5/5
నవంబర్ 17 , 2023
Jai Hanuman: హనుమాన్‌గా కాంతారా హీరో రిషబ్ శెట్టి?
యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో వచ్చిన 'హనుమాన్' యావత్ దేశాన్ని షేక్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం పెద్ద పెద్ద హీరోల సినిమాలను సైతం మట్టి కరిపించి సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా రానున్న ‘జై హనుమాన్’పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఇందులో హనుమంతుడి పాత్ర కోసం పాన్ ఇండియా స్టార్ ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
‘హనుమాన్’గా కాంతార నటుడు!
‘హనుమాన్’ సినిమా ఎండింగ్‌లోనే 'జై హనుమాన్' ఎలా ఉండనుందో హింట్ ఇచ్చి దర్శకుడు ప్రశాంత్ వర్మ అమాంతం అంచనాలు పెంచేశాడు. ఈ క్రమంలోనే హనుమాన్ సీక్వెల్‌లో అగ్రనటులు నటిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. చిరంజీవి, రామ్‌చరణ్‌లలో ఎవరో ఒకరు హనుమంతుడి పాత్ర పోషించే ఛాన్స్ ఉందంటూ రూమర్లు వినిపించాయి. ఇటీవల కేజీఎఫ్ ఫేమ్ యష్‌తోనూ ప్రశాంత్ వర్మ సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లే అని చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. కానీ, లేటెస్ట్ బజ్ ప్రకారం కాంతారా ఫేమ్ రిషబ్‌శెట్టితో ప్రశాంత్ వర్మ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. హనుమంతుడి పాత్ర కోసం ఆయన్ను సంప్రదించినట్లు సమాచారం. రిషబ్ శెట్టి సైతం ఈ ప్రాజెక్ట్ ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. దీంతో ఈ క్రేజీ కాంబోపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది కేవలం ఇండస్ట్రీ లీక్.. అఫిషియల్‌గా ఇంకా అనౌన్స్ మెంట్ చేయాల్సిన అవసరం ఉంది.
స్టార్ల పేర్ల వెనక స్ట్రాటజీ ఉందా?
‘జై హనుమాన్’ను ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి ఏదోక వార్త నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంది. ఇందులోని హనుమాన్ పాత్రకు పలానా స్టార్ హీరోను ఫైనల్ చేసినట్లు కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి రామ్‌చరణ్, రానా దగ్గుబాటి, కేజీఎఫ్ ఫేమ్ యష్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా రిషబ్ శెట్టి ఫైనల్ అయ్యాడంటూ కథనాలు మెుదలయ్యాయి. మరి అతడైనా ఖరారు అవుతాడో లేదో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే దీనివెనక పెద్ద ప్రమోషన్ స్టంట్ ఉన్నట్లు సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘జై హనుమాన్’పై ప్రేక్షకుల్లో హైప్ తగ్గిపోకుండా చిత్ర బృందంమే ఇలా లీక్స్ ఇస్తున్నట్లు అభిప్రాయపడుతున్నాయి. అప్పుడు ‘జై హనుమాన్’ అంశం ట్రెండింగ్‌లోకి వచ్చి ప్రజల్లో హైప్ తగ్గకుండా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.
‘కాంతార’తో పాన్ ఇండియా క్రేజ్
రిషబ్ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం 'కాంతారా' జాతీయ స్థాయిలో సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. కాంతారా ముందు వరకు కన్నడ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన రిషబ్‌శెట్టి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యింది. ఆ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా కేంద్రం నుంచి అవార్డు సైతం అందుకున్నాడు. ప్రస్తుతం 'కాంతారా చాప్తర్ 1' (Kantara chapter 1) పేరుతో ప్రీక్వెల్‌ను కూడా రిషబ్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ ప్రముఖ హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్ కంపెనీతో చిత్ర బృందం చేతులు కలిపిందని సమాచారం. ‘ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా’, ‘ది లయన్ కింగ్’, ‘బాట్‌మ్యాన్’ లాంటి విజయవంతమైన హాలీవుడ్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ఆ సంస్థ ఇప్పుడు ఈ ప్రీక్వెల్ కోసం పని చేస్తున్నట్లు తెలిసింది.
‘మహా కాళీ’ ప్రాజెక్ట్
‘హనుమాన్’ డైరెక్టర్ క్రియేట్ చేసిన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి మూడో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ఇటీవలే వచ్చింది. ఈ మూవీకి 'మహా కాళీ' (MAHAKALI) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. భారతీయ సినీ ప్రపంచంలో మొదటి మహిళా సూపర్ హీరో సినిమాగా ఈ చిత్రం ఉండనున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. దాంతో పాటు ఈ మూవీకి మహిళా దర్శకురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తోండటం ఆసక్తి కలిగిస్తోంది. RKD స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అంటూ ప్రశాంత్ వర్మ పోస్టు పెట్టారు.
https://twitter.com/PrasanthVarma/status/1844236760215392423
‘జై హనుమాన్’ కంటే ముందే..
తన సినిమాటిక్ యూనివర్స్‌కు సంబంధించి 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని ప్రశాంత్ వర్మ గతంలోనే ప్రకటించారు. తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్ హీరోల సినిమాలు తీస్తామని స్పష్టం చేశారు. ‘జై హనుమాన్’ కంటే ముందు ‘అధీర’, ‘మహాకాళీ’ సిద్ధంగా ఉన్నాయని ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వీటితో పాటు నందమూరి వారసుడు మోక్షజ్ఞను పరిచయం చేస్తున్నట్లు కూడా ఇటీవలే తెలిపారు. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రెండో ప్రాజెక్ట్‌గా మోక్షజ్ఞ సినిమా రానున్నట్లు చెప్పారు. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించనున్నట్లు వెల్లడించారు. ప్రశాంత్ వర్మ దూకుడు చూస్తుంటే ఏడాది ఒక సినిమాతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది.
అక్టోబర్ 18 , 2024
3rd Day BOX OFFICE: స్టార్ హీరో లేకున్నా కలెక్షన్లు కుమ్మేసిన టాప్-10 మీడియం రేంజ్ సినిమాలు ఇవే!
కొన్ని సినిమాలకు ఓపెనింగ్స్ ఊహించనంతగా వస్తాయి. కానీ, సినిమా బాలేకపోతే తర్వాత రోజు నుంచి తగ్గిపోతాయి. చిత్రం బాగున్నప్పటికీ అసలు వసూళ్లు రాని సినిమాలు కూడా ఉన్నాయి. ఇక పెద్ద సినిమాలకు వరుసగా మూడ్రోజులు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. హీరో స్టార్ ఇమేజ్ ప్రేక్షకులను థియేటర్‌కు లాగుతుంది. కానీ మీడియం రేంజ్ చిత్రాలకు ఆ పరిస్థితి ఉండదు. సినిమా బాగుందని టాక్ వస్తే తప్ప థియేటర్‌కు ఎవరూ వెళ్లరు. అలా తొలి రోజు కలెక్షన్లు తక్కువగా ఉన్నా…. ప్రేక్షకుల టాక్‌తో మూడో రోజు కల్లా దూసుకు పోయిన సినిమాలేంటో ఓ సారి చూద్దాం.
ఉప్పెన
మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో వైష్ణవ్ తేజ్ మెుదటి సినిమా అయినప్పటికీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఓపెనింగ్స్ ఫర్వాలేదనిపించినా.. హిట్ టాక్ రావటంతో మూడో రోజు ఏకంగా రూ. 8.26 కోట్లు కొళ్లగొట్టింది. చిత్రాన్ని రూ.15 కోట్లు పెట్టి తీస్తే రూ.83 కోట్లు వచ్చాయి. ఇందులో హీరోయిన్ తండ్రి పాత్రను విజయ్ సేతుపతి మెుదట ఒప్పుకోలేదు. దర్శకుడు పట్టుబట్టడంతో సైన్ చేశారు. చిత్రం కోసం ఇద్దరు హీరోయిన్లను మార్చి కృతి శెట్టిని తీసుకున్నారు. ఆమె కారణంగా మరింత బజ్ వచ్చింది.
దసరా
నేచురల్ స్టార్ నాని నటించిన పవర్ ప్యాక్డ్ మాస్ చిత్రం దసరా. లుక్, యాసతో నటీనటులందరూ అదరగొట్టారు. దీంతో కలెక్షన్ల వర్షం కురిసింది. సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. రూ. 65 కోట్లతో తెరకెక్కిస్తే రూ. 110 కోట్లు రాబట్టింది. ఇక మూడోరోజు రూ. 6.73 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. శ్రీకాంత్ ఓదెల మెుదటి సినిమా అయినప్పటికీ ఎక్కడా అలా కనిపించదు. మరో డెబ్యూ డైరెక్టర్‌కి ఛాన్స్ ఇచ్చి హిట్ కొట్టాడు నాని.
విరూపాక్ష
సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన విరూపాక్ష హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మూడోరోజు రూ. 5.77 కోట్లు రాబట్టింది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఈ దర్శకుడు టాక్ తెలుసుకుందామని సినిమాకు వెళితే అతడి ఫోన్ కొట్టేశారు. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది.
https://telugu.yousay.tv/virupaksha-full-review-virupaksha-with-horror-suspense-plot-sai-dharam-tej-super-come-back.html
లవ్ స్టోరీ
శేఖర్ కమ్ముల మరో మ్యాజికల్ చిత్రం లవ్ స్టోరీ. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. మూడో రోజు రూ. 5.19 కోట్లు వసూలు చేసింది. కులం అనే సున్నితమైన అంశాన్ని ప్రేమకథకు జోడించి అద్భుతంగా తెరకెక్కించాడు శేఖర్. ఇందులో చైతూ తెలంగాణ యాసలో మాట్లాడి మెప్పించాడు.
బింబిసార
కల్యాణ్‌రామ్‌కు మంచి హిట్ ఇచ్చిన సినిమా బింబిసార. చరిత్రలోని ఓ కథను తీసుకొని టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కించారు. ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఫుల్ కలెక్షన్లు వచ్చాయి. మూడో రోజు రూ. 5.02 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. రూ. 40 కోట్లు పెట్టి తీస్తే రూ. 65 కోట్లు సాధించింది. బింబిసార ఫ్రాంఛైజీలో భాగంగా మరో పార్ట్ కూడా వస్తుంది. చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై కల్యాణ్‌రామ్ స్వయంగా నిర్మించాడు.
ఇస్మార్ట్ శంకర్
హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్, పూరి జగన్నాథ్‌లకు మంచి కిక్ ఇచ్చింది ఇస్మార్ట్ శంకర్. మెుదట్నుంచే కలెక్షన్లలో దూసుకెళ్లిన ఈ చిత్రం మూడో రోజు రూ. 4.32 కోట్లు రాబట్టింది. సినిమాకు రూ. 15 కోట్లు ఖర్చు పెట్టగా ఏకంగా రూ. 75 కోట్లు వచ్చాయి. సినిమాలో నటించిన నభా నటేశ్, నిధి అగర్వాల్‌కు ఆఫర్లు వరుస కట్టాయి. మణిశర్మ బాణీలు ఇప్పటికీ మార్మోగుతున్నాయి.
భీష్మ
వెంకీ కుడుముల, నితిన్, రష్మిక కాంబోలో వచ్చిన కామెడీ లవ్ ఎంటర్‌టైనర్ భీష్మ. బాక్సీఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన చిత్రం మూడో రోజు వసూళ్లు రూ. 4.31 కోట్లు. ఈ సినిమాను తక్కువ బడ్జెట్‌లో తీసినప్పటికీ రూ. 40 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కబోతుంది. భీష్మ, ఛలోని మించి ఉంటుందని దర్శకుడు చెప్పాడు.
జాతి రత్నాలు
కరోనా తర్వాత థియేటర్లలో జనం బాగా ఎంజాయ్ చేసిన సినిమా జాతి రత్నాలు. అనుదీప్ కేవీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మస్త్ వసూళ్లు వచ్చాయి. బ్లాక్‌బస్టర్ టాక్ రావటంతో మూడో రోజు రూ. 4.28 కోట్లు రాబట్టింది. కేవలం రూ. 4 కోట్లు ఖర్చు చేయగా.. రూ. 65 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.
కార్తీకేయ 2
ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాలీవుడ్‌ను షేక్ చేసింది కార్తీకేయ 2. నిఖిల్, అనుపమ జంటగా నటించిన ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లోకి వెళ్లింది. బాలీవుడ్‌లోనూ కోట్లు రాబట్టిన కార్తీకేయ 2 మూడో రోజు కలెక్షన్లు రూ. 4.23 కోట్లు. సినిమాకు అయ్యింది రూ. 15 కోట్లు.. కానీ రూ. 117 కోట్లు కొళ్లగొట్టింది. సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటున్నారని నిఖిల్ చెప్పడంతో ఓ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
అఖిల్, పూజా హెగ్డే కాంబోలో లవ్ స్టోరీ స్పెషలిస్ట్ బొమ్మరిల్లు భాస్కర్ తీశాడు. యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లలో దూసుకెళ్లింది. ఈ సినిమాకు మూడో రోజు రూ. 4.03 కోట్లు సాధించింది. గోపి సుందర్ అందించిన మ్యూజిక్ సినిమాకు హైలెట్. కలెక్షన్ల పరంగా రూ. 51 కోట్లు రాబట్టింది అఖిల్ సినిమా.
ఏప్రిల్ 24 , 2023
This Week OTT Movies: ఈ వారం మిమ్మల్ని అలరించే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
గత కొన్ని వారాలుగా స్టార్ హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఈ వేసవిలో అహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు
టెనెంట్
హాస్య నటుడు సత్యం రాజేష్ (Satyam Rajesh) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'టెనెంట్' (Tenant). ఏప్రిల్ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. వై. యుగంధర్ దర్శకత్వం వహించారు. ప్రేమ పెళ్లి తర్వాత సంతోషంగా సాగాల్సిన హీరో జీవితం ఎలాంటి అనూహ్య మలుపులు తిరిగింది? అన్నది కథ.
శశివదనే
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన ప్రేమకథ చిత్రం 'శశివదనే' (Sasivadane). సాయి మోహన్ ఉబ్బర దర్శకుడు. ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదల కానుంది. గోదావరి నేపథ్యంలో ఈ ప్రేమ కథ సాగనుంది.
పారిజాత పర్వం
సునీల్, శ్రద్ధాదాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijathaparvam). సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్' అని ఉపశీర్షిక పెట్టారు. ఈ మూవీ ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌లోని ప్రతీ సన్నివేశం నవ్వులు పూయిస్తోంది.
లవ్ మౌళి
అవనీంద్ర దర్శకత్వంలో నవ్‌దీప్ హీరోగా చేసిన సినిమా 'లవ్ మౌళి' (Love Mouli). ఇందులు పంకురి గిద్వానీ హీరోయిన్‌గా చేసింది. ఏప్రిల్ 19న ఈ సినిమా విడుదల కానుంది. ప్రేమ అనేది లేకుండా మనుషులకు దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తికి.. లవ్ దొరికితే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఈ చిత్రాన్ని తెరక్కించారు.
మార్కెట్ మహాలక్ష్మీ
కేరింత ఫేమ్ పార్వతీశం ఈ సినిమా (Market Mahalakshmi)లో హీరోగా చేశాడు. వీఎస్ దర్శకత్వం వహించిన ఈ మూవీతో ప్రణీకాన్వికా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. అఖిలేష్ కలారు నిర్మాత. ఈ చిత్రంలో హర్షవర్ధన్, మహబూబ్ భాషా, ముక్కు అవినాష్ ముఖ్యపాత్రలు పోషించారు. ఏప్రిల్ 19న ఈ మూవీ రిలీజ్ కానుంది.
శరపంజరం
నవీన్‌కుమార్ గట్టు హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘శరపంజరం’ (Sarapanjaram). లయ కథానాయిక. ఈ మూవీ ఏప్రిల్ 19న థియేటర్‌లలో విడుదల కానుంది. ‘జోగిని వ్యవస్థ, గంగిరెద్దుల్ని ఆడించే సంచార జాతుల కష్టాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.
మారణాయుధం
సీనియర్ నటి మాలాశ్రీ.. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మారణాయుధం’ (Maaranaayudham). గురుమూర్తి సునామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. గతేడాది కన్నడలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులనూ అలరించడానికి సిద్ధమైంది. ఏప్రిల్ 19న ‘మారణాయుధం’ థియేటర్‌లలో విడుదల కానుంది.
లవ్ యూ శంకర్
దర్శకుడు రాజీవ్ ఎస్.రియా.. ‘మై ఫ్రెండ్ గణేశా’ యానిమేషన్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ‘లవ్ యూ శంకర్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్ 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో శ్రేయాస్ తల్పాడే, తనీషా జంటగా నటించారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు
సైరెన్
జయం రవి (Jayam Ravi) కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సైరెన్’ (Siren). ఫిబ్రవరి 16న కోలీవుడ్‌లో విడుదలైన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఏప్రిల్ 19 నుంచి ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతోపాటు తెలుగులో కూడా సైరన్ డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఇందులో జయం రవితో పాటు కీర్తి సురేష్, అనుపమా పరమేశ్వరన్ ముఖ్యపాత్రలు పోషించారు.
మై డియర్ దొంగ
ఓటీటీలోకి నేరుగా మరో కామెడీ మూవీ వస్తోంది. అభినవ్ గోమటం, షాలిని, దివ్య శ్రీపాద నటించిన ‘మై డియర్ దొంగ’ (My Dear Donga) మూవీ.. ఏప్రిల్ 19 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఓ అమ్మాయి ఇంట్లోకి దొంగతనం చేయడానికి వచ్చిన యువకుడు.. అనుకోని పరిస్థితుల్లో అక్కడే బందీగా చిక్కుకుపోతే ఏం జరిగింది? దొంగకు, యువతికి మధ్య ఏర్పడిన స్నేహం ఎలాంటి మలుపులకు కారణమైంది? అన్న కథతో ఈ మూవీ రూపొందింది.
కాటేరా
కన్నడ స్టార్ హీరో దర్శన్ నటించిన చిత్రం కాటేరా (Kaatera). తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది విడుదలై రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా కన్నడ వెర్షన్ ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ5’ (Zee 5)లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా తెలుగు, తమిళ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ‘జీ 5’ వర్గాలు ప్రకటించాయి.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateAnyone but YouMovieEnglishNetflixApril 15Rebel MoonMovieEnglishNetflixApril 19Chief Detective 1958SeriesKoreanDisney + HotstarApril 19SirenMovieTeluguDisney + HotstarApril 19My Dear DongaMovieTeluguAhaApril 19Dream ScenarioMovieEnglishLions Gate PlayApril 19The Tourist S2SeriesEnglishLions Gate PlayApril 19Pon Ondru KandenMovieTamilJio CinemaApril 14The SympathizerSeriesEnglishJio CinemaApril 14Article 370MovieHindiJio CinemaApril 19Quizzer Of The YearSeriesEnglishSonyLIVApril 15Dune: Part TwoMovieEnglishBook My ShowApril 16
ఏప్రిల్ 15 , 2024
Telugu Heroines: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్ డేస్ తిరిగి వచ్చినట్లేనా?
ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్స్ అనగానే.. తెలుగు భాష, సంప్రదాయం ఉట్టిపడే సావిత్రి, జమున, శారద, జయసుధ లాంటి వారు గుర్తుకు వచ్చేవారు. రాను రాను టాలీవుడ్‌లో పరిస్థితులు మారిపోయాయి. పర భాష ముద్దు గుమ్మలే ప్రేక్షకులను ఆకర్షిస్తారనే నమ్మకం మన టాలీవుడ్ డైరెక్టర్లలో పడిపోయింది. దీంతో నిన్నటి దాకా కాజల్, త్రిష, సమంత.. ప్రస్తుతం రష్మిక, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ వంటి ఇతర భాషల నాయికలు ఇక్కడ స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. అయితే గత కొద్ది కాలంగా ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నట్లు కనిపిస్తోంది. తెలుగు అమ్మాయిల హవా ఇండస్ట్రీలో క్రమంగా పెరుగుతోంది. బడా హీరోలవి మినాహా.. రీసెంట్‌గా వస్తున్న చిన్న సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది. స్టార్ హీరోయిన్ల రేసులోకి దూసుకొస్తున్న తెలుగు భామలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
గౌరి ప్రియ (Gouri Priya)
టాలీవుడ్‌లో ఇటీవల వచ్చి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో ‘మ్యాడ్’ (MAD) చిత్రంలో హీరోయిన్‌గా చేసి గౌరి ప్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. మంచి నటన, అభినయంతో యూత్‌ను కట్టిపడేసింది. రీసెంట్‌గా తమిళ హీరో మణికందన్ పక్కన ‘లవర్’ సినిమాలో నటించి కోలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
https://www.youtube.com/watch?v=8dwrE0OCq40
ఆనందిని (Anandhi)
వరంగల్‌కు చెందిన ఆనంది.. 2012లో వచ్చిన 'ఈ రోజుల్లో' (Ee Rojullo) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చిన్న పాత్రలు చేసుకుంటూ వెళ్లిన ఈ భామ.. తన ఫోకస్‌ను తమిళ మూవీస్‌పై వైపు మళ్లించింది. అక్కడ యంగ్ హీరోల సరసన హీరోయిన్‌గా చేసి అందరి ప్రశంసలు అందుకుంది. తెలుగులో జాంబి రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం చిత్రాల్లో ఈ భామ మెయిన్ హీరోగా చేసింది.
చాందిని చౌదరి (Chandini Chowdary)
ఏపీలోని విశాఖపట్నానికి చెందిన చాందిని చౌదరి.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' (Life Is Beautiful) మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ‘కుందనపు బొమ్మ’, ‘హౌరా బ్రిడ్జ్’, ‘మను’ వంటి చిన్న చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. 'కలర్ ఫొటో' (Colour Photo) మూవీతో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. రీసెంట్‌గా 'గామి' (Gaami)లో విష్వక్ సేన్ సరసన నటించే స్థాయికి చాందిని ఎదిగింది. ఈ భామ సినిమాలతో పాటు 'మస్తీస్', 'గాలివాన', 'ఝాన్సీ' వంటి వెబ్‌సిరీస్‌లు సైతం చేసింది.
వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)
‘బేబీ’ (Baby) సినిమాతో ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చిన తెలుగు నటి ‘వైష్ణవి చైతన్య’. అంతకుముందు వరకూ యూట్యూబ్ సిరీస్‌లకు మాత్రమే పరిమితమైన ఈ సుందరి.. ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ (Software Developer) సిరీస్‌తో ఒక్కసారిగా యూత్‌లో క్రేజీ సంపాదించుకుంది. తద్వారా ‘బేబీ’ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో మెస్మరైజింగ్ నటనతో కుర్రకారు హృదయాలను దోచేసింది. ప్రస్తుతం వైష్ణవి.. బేబీ ఫేమ్ ఆనంద్ దేవరకొండతోనే మరో చిత్రంలో నటిస్తోంది. అలాగే దిల్ రాజు ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు అంగీకరించింది.
https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI
దివ్య శ్రీపాద (Divya Sripada)
టాలీవుడ్‌లో తమ క్రేజ్‌ను క్రమంగా పెంచుకుంటున్న తెలుగు అమ్మాయిల్లో ‘దివ్య శ్రీపాద’ ఒకరు. రీసెంట్‌గా ‘సుందరం మాస్టర్’ (Sundaram Master) సినిమా ద్వారా ఈ భామ హీరోయిన్‌గా మారిపోయింది. అంతకుముందు ‘డియర్ కామ్రేడ్’, ‘కలర్ ఫొటో’, ‘మిస్ ఇండియా’, ‘జాతి రత్నాలు’, ‘ఎఫ్ 3’, ‘యశోద’, ‘పంచతంత్రం’ వంటి ప్రముఖ చిత్రాల్లో సైడ్ పాత్రలకే పరిమితమైంది. 'సుందరం మాస్టర్'లో చక్కటి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈ భామకు హీరోయిన్‌గా మరిన్ని అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
శోభిత ధూలిపాళ్ల (Sobhita Dhulipala)
ఏపీలోని తెనాలిలో జన్మించిన శోభిత దూళిపాళ్ల.. ‘రామన్ రాఘవ్ 2.0’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. 2018లో వచ్చిన 'గూఢచారి'తో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత కురుప్, మేజర్, పొన్నిసెల్వన్ వంటి హిట్ చిత్రాల్లో మెరిసింది. హాలీవుడ్ చిత్రం 'మంకీ మ్యాన్'లోనూ శోభిత నటించడం విశేషం. ప్రస్తుతం హిందీలో 'సితార' మూవీలో ఈ భామ చేస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన హాలీవుడ్, బాలీవుడ్ స్థాయిలో చిత్రాలు చేస్తూ స్థానిక నటీమణులకు ఆదర్శంగా నిలుస్తోంది.
రితు వర్మ (Ritu Varma)
హైదరాబాద్‌కు చెందిన ఈ సుందరి.. 'బాద్ షా' (Badshah) సినిమాలో కాజల్ ఫ్రెండ్ పాత్రలో తెరంగేట్రం చేసింది. 2015లో వచ్చిన 'పెళ్లి చూపులు' (Pelli Choopulu) హీరోయిన్‌గా మారిన రీతు వర్మ.. తొలి సినిమాతోనే సాలిడ్ హిట్ అందుకుంది. ‘కేశవ’, ‘నిన్నిలా నిన్నిలా’, ‘టక్ జగదీష్’, ‘వరుడు కావలెను’, ‘ఒకే ఒక జీవితం’.. రీసెంట్‌గా ‘మార్క్ ఆంటోనీ’ సినిమాల్లో హీరోయిన్‌గా చేసి స్టార్ నటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ భామ.. విక్రమ్ సరనస 'ధ్రువ నక్షత్రం'లోనూ నటిస్తుండటం విశేషం.
https://www.youtube.com/watch?v=4hNEsshEeN8
స్వాతి రెడ్డి (Swathi Reddy)
వైజాగ్‌కు చెందిన స్వాతి.. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'డేంజర్' (2005) తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో 'సుబ్రహ్మణ్యపురం' చిత్రంలో హీరోయిన్‌గా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 'అనంతపురం' పేరుతో తెలుగులో రిలీజ్ కావడం గమనార్హం. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుసగా అష్టాచమ్మా, గోల్కొండ స్కూల్, స్వామి రారా, కార్తికేయ, త్రిపుర, పంచతంత్రం చిత్రాల్లో స్వాతి నటించింది. రీసెంట్‌గా 'మంత్ ఆఫ్ మధు'తో ప్రేక్షకులను పలకరించింది.
https://www.youtube.com/watch?v=BCwsSk_KKrE
డింపుల్ హయాతి (Dimple Hayathi)
ఏపీలోని విజయవాడలో జన్మించిన నటి డింపుల్ హయాతి.. హైదరాబాద్‌లో పెరిగింది. 2017లో వచ్చిన 'గల్ఫ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా పెద్దగా విజయం సాధించనప్పటికీ నటన పరంగా డింపుల్‌కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు దక్కాయి. ‘అభినేత్రి 2’, ‘యురేఖ’, హిందీలో ‘అత్రంగి రే’, విశాల్‌తో ‘సామాన్యుడు’, రవితేజతో ‘ఖిలాడీ’, గోపిచంద్‌తో ‘రామబాణం’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో సినిమాలు లేనప్పటికీ సరైన హిట్ తగిలితే డింపుల్ ఎవరూ ఆపలేరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
https://twitter.com/CallBoyforwomen/status/1693578673595793606
శివాని నగరం (Shivani Nagaram)
ఇటీవల టాలీవుడ్‌లో తళుక్కుమన్న కొత్త హీరోయిన్లలో శివాని నగరం ఒకరు. యంగ్ హీరో సుహాస్ ప్రధాన పాత్ర పోషించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాలో శివాని హీరోయిన్‌గా చేసింది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో శివానికి తెలుగులో మంచి అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తాయి.
మానస చౌదరి (Maanasa Choudhary)
ఏపీలోని చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన మానన చౌదరి.. రీసెంట్‌గా ‘బబుల్‌గమ్’ సినిమాతో టాలీవుడ్‌లో తళుక్కుమంది. రాజీవ్ - సుమ తనయుడు రోషన్.. హీరోగా నటించిన ఈ మూవీలో తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ తనలో మంచి స్కిల్స్ ఉన్నాయన్న సందేశాన్ని మానస టాలీవుడ్ దర్శక నిర్మాతలకు పంపింది. ఒక హిట్ పడితే తెలుగులో ఈ భామకు తిరుగుండదని చెప్పవచ్చు.
https://twitter.com/i/status/1762802318934950146
అంజలి (Anjali)
తూర్పు గోదావరి జిల్లా రాజోల్‌లో జన్మించిన నటి అంజలి.. ఓ దశలో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అందుకుంది. 2006లో 'ఫొటో' అనే తెలుగు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అంజలి.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాల్లో నటించి కోలివుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు' సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ.. బలుపు, మసాలా, గీతాంజలి, డిక్టేటర్, సరైనోడు, వకీల్‌సాబ్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం తెలుగులో గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గేమ్ ఛేంజర్‌లోనూ నటిస్తోంది.
https://www.youtube.com/watch?v=3lowhNvIWK0
మార్చి 06 , 2024
HBD Mokshagna Teja: ‘జై హనుమాన్’తో మోకజ్ఞ సినిమా లింకప్.. ఏం ప్లాన్ చేశావ్ ప్రశాంత్ మామా!
నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) అధికారికంగా సినీ రంగ ప్రవేశం చేశాడు. టాలెంటెడ్ డైరెక్టర్ ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ అరంగేట్ర చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇవాళ (సెప్టెంబర్ 6) మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇదే సమయంలో మోక్షజ్ఞ సినిమాకు సంబంధించి ఎగిరిగంతేసే న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
మోక్షజ్ఞ పోస్టర్ ఎలా ఉందంటే
నందమూరి మోక్షజ్ఞ తేజ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో రానున్న చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది. ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు గొప్ప సంతోషంగా ఉందంటూ మూవీలోని ఆయన లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో మోక్షజ్ఞ హ్యాండ్స్‌మ్ లుక్‌లో స్మైలింగ్ ఫేస్‌తో కనిపించారు. అంతేకాదు పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించి పక్కా హీరో మెటీరియల్‌గా అనిపిస్తున్నారు. మోక్షజ్ఞ లుక్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ మోక్షజ్ఞకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
https://twitter.com/PrasanthVarma/status/1831921862609154407
తారక్ స్పెషల్ విషెస్
నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ బర్త్‌డేతో పాటు ఆయన డెబ్యూ ఫిల్మ్ పోస్టర్‌పై జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) స్పందించారు. మోక్షజ్ఞను విష్ చేస్తూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు! నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాతగారితో పాటు అన్ని దైవ శక్తులు నీపై ఆశీస్సులు కురిపించాలని కోరుకుటుంన్నాను! హ్యాపీ బర్త్‌డే మోక్షూ’ అంటూ జూనియర్ ఎన్‌టీఆర్ ట్వీట్ చేశారు. మరోవైపు నందమూరి హీరో కల్యాణ్ రామ్ కూడా తన తమ్ముడు మోక్షజ్ఞకు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు. ‘టిన్సెల్ టౌన్‌కు నీకు స్వాగతం మోక్షూ. తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్‌డే’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ చూసి నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అన్నతమ్ముల అనుబంధం అంటే ఇలానే ఉండాలని అంటున్నారు.
రెండ్రోజులుగా వరుస హింట్స్
రెండు రోజులుగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వరుస పోస్ట్‌లతో మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ఎంట్రీ గురించి హింట్స్ ఇస్తూనే వచ్చారు. ‘నా యూనివర్స్ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’ అని తొలుత అతడు పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ తర్వాత ‘వారసత్వాన్ని ముందుకుతీసుకెళ్లే అద్భుత క్షణం’ అంటూ పెట్టిన మరో పోస్టు కూడా నందమూరి అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా మోక్షజ్ఞ లుక్‌ను పంచుకొని తన తర్వాత సినిమా హీరో అంటూ బాలయ్య వారసుడిని పరిచయం చేశారు ప్రశాంత్ వర్మ.
https://twitter.com/PrasanthVarma/status/1830839179716239368
https://twitter.com/PrasanthVarma/status/1831604468355391886
‘జై హనుమాన్’తో లింకప్!
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా మోక్షజ్ఞ ఫస్ట్ ఫిల్మ్ రూపొందనుంది. ప్రస్తుతం 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్ హీరోల సినిమాలు తీస్తామని గతంలో ప్రశాంత్ వర్మ వివరించారు. ఏడాదికి ఒక సినిమా కచ్చితంగా విడుదల చేస్తానని ఆయన (Prasanth Varma) స్పష్టం చేశారు. ఈ క్రమంలో తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి తొలుత హనుమాన్‌ను ప్రశాంత్ వర్మ రిలీజ్ చేశారు. సెకండ్ ఫిల్మ్‌గా మోక్షజ్ఞ ఫిల్మ్ రాబోతోంది. ఈ విషయాన్ని ‘సింబా ఈజ్ బ్యాక్’ అనే పోస్టర్‌లో 'PVCU 2' ప్రాజెక్ట్ అంటూ ప్రశాంత్ వర్మనే స్పష్టం చేశారు. తన సినిమాటిక్ యూనివర్స్‌లో రానున్న ప్రతీ చిత్రానికి తన తర్వాతి ఫిల్మ్‌తో లింకప్ ఉంటుందని గతంలో ప్రశాంత్ వర్మనే తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే 'PVCU 2' ప్రాజెక్ట్ తర్వాత ‘జై హనుమాన్’ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ పట్టాలెక్కిించనున్నారు. దీంతో మోక్షజ్ఞ చిత్రానికి కచ్చితంగా 'జై హనుమాన్'తో కనెక్షన్ ఉంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ లింకప్ ఎలా ఉంటుందోనని ఇప్పటి నుంచే నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ మామా ఏం ప్లాన్ చేశాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/theBuzZBasket/status/1831944240831852919
శ్రీకృష్ణుడిగా బాలయ్య!
మోక్షజ్ఞ సినిమాను మైథలాజికల్, సోషియో ఫాంటసీ చిత్రంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయినట్లు సమాచారం. మహాభారతం స్ఫూర్తితో ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఇందులో శ్రీకృష్ణుడి పాత్రలో బాలయ్య కనిపిస్తారని సమాచారం. హనుమాన్ తరహాలోనే ఈ సినిమాలో సూపర్ హీరో, మైథలాజికల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయని, చివర్లో బాలయ్య శ్రీకృష్ణుడిగా ఎంట్రీ ఇవ్వడంతో కథ మరో మలుపు తిరుగుతుందని సమాచారం. మరోవైపు అర్జునుడి పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రశాంత్ వర్మ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా?
మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్ వర్మ కాంబోలో రానున్న చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్వినీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం బాలయ్య స్వయంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ (Khushi Kapoor) హీరోయిన్‌గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే మోక్షజ్ఞ-ఖుషీ కపూర్ జోడీ మరో ట్రెండ్ సెట్టర్‌గా మారుతుందని నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సెప్టెంబర్ 06 , 2024
Mokshagna Teja: మోక్షజ్ఞ తేజ సినిమాకు ముహోర్తం ఫిక్స్! శ్రీకృష్ణుడి గెటప్‌లో బాలయ్య గెస్ట్ రోల్?
నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. నందమూరి మూడో తరం వారసుడ్ని వెండితెరపై చూసుకునేందుకు కళ్లు కాయలు కాచేలా నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ తేజ తెరంగేట్రానికి సంబంధించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు అప్‌డేట్స్ బయటకొచ్చాయి. ఇది చూసిన నందమూరి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. ఇన్నాళ్ల తమ ఎదురుచూపులకు సరైన ఫలితం దక్కబోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ అప్‌డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
మోక్షజ్ఞ కోసం స్పెషల్ పోస్ట్!
‘హనుమాన్’తో టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఆకర్షించారు. మోక్షజ్ఞ తెరంగేట్రం చిత్రాన్ని అతడే డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రశాంత్ నీల్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఓ సింహం తన పిల్లను ఎత్తుకొని చూపుతోన్న పోస్ట్ పెట్టిన ప్రశాంత్ వర్మ ‘నా యూనివర్స్ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’ అని రాశారు. దీనికి ‘సింబా ఈజ్ కమింగ్’ అనే హ్యాష్‌ట్యాగ్ పెట్టారు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీని ఉద్దేశించే ప్రశాంత్ ఈ పోస్ట్ పెట్టారని అందరూ అనుకుంటున్నారు. ఇటీవల ప్రశాంత్ వర్మ పెట్టిన మరో పోస్ట్ కూడా నెట్టింట వైరల్‌గా మారింది. ఒక ఫొటో షేర్ చేస్తూ ‘ఛాలెంజ్‌ని స్వీకరిస్తున్నా’ అని రాశారు. ఇది కూడా మోక్షజ్ఞ సినిమా కోసం పెట్టిన పోస్టు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
https://twitter.com/PrasanthVarma/status/1830839179716239368
https://twitter.com/PrasanthVarma/status/1830473835046461471
ముహోర్తం ఫిక్స్..!
మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్ వర్మ సినిమాకు సంబంధించి పూజా వేడుక డేట్ ఖరారైనట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. మోక్షజ్ఞ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్ 6న ఈ సినిమాను అధికారికంగా లాంచ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఆ రోజున పూజా కార్యక్రమాలు నిర్వహించాలని డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో పాటు నందమూరి బాలకృష్ణ నిర్ణయించినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా మెుదలైనట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యే అవకాశమున్నట్లు సమాచారం. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమయం మరో మూడు రోజుల్లో వస్తుండటంతో నందమూరి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.
శ్రీకృష్ణుడిగా బాలయ్య!
మోక్షజ్ఞ సినిమాను మైథలాజికల్, సోషియో ఫాంటసీ చిత్రంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయినట్లు సమాచారం. మహాభారతం స్ఫూర్తితో ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఇందులో శ్రీకృష్ణుడి పాత్రలో బాలయ్య కనిపిస్తారని సమాచారం. హనుమాన్ తరహాలోనే ఈ సినిమాలో సూపర్ హీరో, మైథలాజికల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయని, చివర్లో బాలయ్య శ్రీకృష్ణుడిగా ఎంట్రీ ఇవ్వడంతో కథ మరో మలుపు తిరుగుతుందని సమాచారం. మరోవైపు అర్జునుడి పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రశాంత్ వర్మ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా?
మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్ వర్మ కాంబోలో రానున్న చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్వినీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం బాలయ్య స్వయంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ (Khushi Kapoor) హీరోయిన్‌గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే మోక్షజ్ఞ-ఖుషీ కపూర్ జోడీ మరో ట్రెండ్ సెట్టర్‌గా మారుతుందని నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మోక్షజ్ఞ లుక్స్ వైరల్..
నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం ఖాయమైన వేళ ఇటీవల ఆయన ఫొటోలు కూడా వైరలయ్యాయి. ఓ సినిమా వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ మోక్షజ్ఞ ఈ ఏడాదే కెమెరా ముందుకొస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం మోక్షజ్ఞ అందుకు సంబంధించిన సన్నాహాల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన ఓ ఫొటోషూట్‌లో పాల్గొనగా, అందులోని కొన్ని లుక్స్ బయటికొచ్చాయి. అప్పటినుంచి సామాజిక మాధ్యమాల్లో అవి తెగ వైరల్ అవుతోన్నాయి. దీంతో త్వరలోనే ఈ నందమూరి వారసుడు తెరపై సందడి చేయడం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు.
సెప్టెంబర్ 03 , 2024
Latest OTT telugu Movies: ఈ వీకెండ్‌లో ఈ చిత్రాలను అస్సలు మిస్ కాకండి.. సూపర్బ్ థ్రిల్లింగ్ సినిమాలు
రీసెంట్‌గా చాలా సినిమాలు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో థియేటర్లలో విడుదలై రెండు వారాలు గడవకముందే ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఉన్నాయి. మరికొన్ని నేరుగా ఓటీటీల్లోకి విడుదలైన వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. ఇక్కడ అందిస్తున్న లిస్ట్‌లో దాదాపు అన్నింటికీ ప్రేక్షకుల నుంచి మంచి రివ్యూలు అందుకున్నవే ఉన్నాయి. మరి వీటిలో మీకు నచ్చిన జనర్‌ను ఎంచుకుని వీకెండ్‌ను ఎంజాయ్ చేయండి
లవ్ మీ ఇఫ్ యు డేర్ మీ
రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్, బేబీ మూవీ వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లవ్ మీ’ (Love Me). ఇఫ్ యూ డేర్ (If You Dare) అనేది ఉప శీర్షిక. ఈ చిత్రాని అరుణ్ తెరకెక్కించారు. దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించారు. దెయ్యంతో హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. మే 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్(జూన్ 15) వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్‌లో కాస్త రొమాంటిక్ డోస్ కావాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే... అర్జున్ (ఆశిష్), ప్రతాప్(రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలు, స్మశానాలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్ లవర్ ప్రియా (వైష్ణవి చైతన్య).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. మరి ఆ దెయ్యం కూడా అర్జున్ ప్రేమలో పడుతుందా? అసలు ఈ దివ్యవతి ఎవరు? సినిమా ప్రారంభంలో నిప్పంటించుకొని చనిపోయిన కపుల్‌తో ఆమెకున్న సంబంధం ఏంటి? చివరికీ ఏమైంది? అన్నది కథ.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
విష్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari). నేహాశెట్టి హీరోయిన్. అంజలి కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.మే 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా బ్రేక్ ఈవెన్ సాధించి విజయం అందుకుంది. ముఖ్యంగా విష్వక్ సేన్ మాస్ నటన ప్రేక్షకులను అలరించింది. నెహ శెట్టి, అంజలి గ్లామర్ తోడవడంతో (Gangs of Godavari Ott) ఆశించిన ఫలితం సాధించింది. అయితే థియేటర్లలో ఈ సినిమా మిస్ అయినవారు ఓటీటీలో వీక్షించే అవకాశం తాజాగా లభించింది. ప్రస్తుతం ఈ చిత్రం(జూన్ 14నుంచి) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌పామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అప్పుడు మిస్ అయిన వారు ఈ వీకెండ్‌లో చూసి ఎంజాయ్ చేయండి.
ఇక ఈ సినిమా కథ విషాయానికొస్తే.. పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం(విష్వక్ సేన్).. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. మంచి ఉద్దేశ్యంతో పాలిటిక్స్‌లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు? పాలిటిక్స్‌లో తన లక్ష్యాన్ని హీరో చేరుకున్నాడా? లేదా? అన్నది కథ.
పారిజాత పర్వం
సునీల్, శ్రద్ధాదాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijatha Parvam). సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్' అని ఉపశీర్షిక పెట్టారు. (ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం(జూన్ 12 నుంచి) ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కామెడీ జనర్‌లో వచ్చిన ఈ సినిమా వీకెండ్‌లో చూసేందుకు మంచి ఛాయిస్‌గా చెప్పవచ్చు.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. చైతన్య (చైతన్యరావు) డైరెక్టర్ కావాలని కలలు కంటుంటాడు. స్నేహితుడ్ని (హర్ష) హీరోగా పెట్టి ఓ కథతో నిర్మాతల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతాడు. ఆ ప్రయత్నాలు సక్సెస్ కాకపోవడంతో చివరికి తానే నిర్మాతగా మారి సినిమా తీయాలని ఫిక్సవుతాడు. డబ్బు కోసం శెట్టి (శ్రీకాంత్ అయ్యంగార్) సెకండ్ సెటప్‌ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేస్తాడు. మరోవైపు బారు శ్రీను (సునీల్), పారు (శ్రద్దా దాస్) కూడా ఆమెను కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మరి ఈ ఇద్దరిలో శెట్టి భార్యని ఎవరు కిడ్నాప్ చేశారు? అసలు బారు శ్రీను ఎవరు? అతడి కథేంటి? చైతన్య డైరెక్టర్ అయ్యాడా? లేదా? అన్నది కథ.
యక్షిణి
మంచు లక్షి, వేదిక ప్రధాన పాత్రల్లో నటించిన సోషియో ఫాంటసి & హారర్ సిరీస్ 'యక్షిణి'. కోటా బొమ్మాళి ఫేమ్ రాహుల్ విజయ్ హీరోగా చేశాడు. డైరెక్టర్ తేజ (Yakshini Ott) మార్ని రూపొందించిన ఈ సిరీస్.. నేరుగా డిస్నీ హాట్‌స్టార్‌లో జూన్ 14 విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌పై పాజిటివ్ సమీక్షలు అయితే వస్తున్నాయి. వీకెండ్‌లో మంచి హరర్ థ్రిల్లర్ సినిమా కావాలనుకునే వారు ఈ సిరీస్‌ను చూడవచ్చు.
ఇక కథ విషయానికొస్తే.. యక్షిణిల రాజైన అయిన కుబేరుడు, మాయ అనే దేవకన్యను (వేదిక)ను శపిస్తాడు. ఆమె తిరిగి అల్కపురికి వచ్చేందుకు 100 మందిని చంపాలని షరతు పెడుతాడు. దీంతో ఆమె అమాయకుడైన కృష్ణ (రాహుల్ విజయ్)ని ప్రేమిస్తున్నట్లు నాటకమాడి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అతన్ని చంపే క్రమంలో మహాకల్ (అజయ్) మహాకల్ అడ్డుపడుతాడు. ఇంతకు ఈ మహాకల్ ఎవరు? మాయకు ఎందుకు అడ్డుపడుతాడు? జ్వాలముఖి(మంచు లక్ష్మి) ఎలా ప్రవేశిస్తుంది? చివరకు మాయ తన స్వస్థలం అల్కాపురికి చేరుకుందా? లేదా? అనేది మిగతా కథ.
పరువు
నివేదా పేతురాజ్, నరేష్ అగస్య ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్ ‘పరువు’. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో నాగబాబు, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి ప్రముఖ పాత్రలు పోషించారు. జూన్ 14న ఈ వెబ్ సిరీస్ నేరుగా జీ5లో(Paruvu ott) విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌పైన మిక్స్‌డ్ రివ్యూస్ వస్తున్నాయి. పబ్లిక్ మాత్రం ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను చూడొచ్చు అని అడ్వైజ్ చేస్తున్నారు.
ఇక ఈ వెబ్ సిరీస్ కథ విషయానికొస్తే... పల్లవి(నివేదా పేతురాజ్), సుధీర్(నరేష్ అగస్త్య) ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కులాలు వేరు కావడంతో పెద్దలు ఓప్పుకోరు. దీంతో ప్రేమ వివాహం చేసుకుంటారు. ఈక్రమంలో పల్లవి పెద్దనాన్న చనిపోవడంతో అతన్ని చూసేందుకు పల్లవి, సుధీర్ బయల్దేరుతారు. మార్గమాధ్యలో ఇద్దరు కలిసి పల్లవి బావ చందును చంపుతారు. ఇంతకు చందును వీరిద్దరు ఎందుకు చంపాల్సి వచ్చింది. ఆ తర్వాత వారికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది మిగతా కథ.
జూన్ 15 , 2024
Tejaswi Madivada: బికినిపై తేజస్వి హాట్ కామెంట్స్ వైరల్
తెలుగమ్మాయి తేజస్వి మడివాడ హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస చిత్రాలు, సిరీస్‌లు చేస్తోంది. తాజాగా బికినీపై ఆమె చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
రీసెంట్‌గా ఆమె చేసిన 'అర్థమయ్యిందా అరుణ్ కుమార్' సీజన్ 2 ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఓ సీన్‌లో బికినీలో కనిపించి ఆమె అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఆ బికినీకి సంబంధించిన ఫొటోలను సైతం తేజస్వి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. దీంతో అవి ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.
బికినీలో ఆమె లుక్ పర్పెక్ట్‌గా ఉందంటూ నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. దీనిపై తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తేజస్వి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ప్రతీ యాక్టర్‌కు అందంగా, ఫిట్‌గా ఉండటం అవసరమని తేజస్వి స్పష్టం చేసింది. ఈ సిరీస్‌లోనే తాను తొలిసారి బికినీ వేశానని గుర్తుచేసింది. దీనిని గొప్ప అవకాశంలా భావించాని చెప్పింది.
ఓటీటీ సిరీస్‌కు బికిని అవసరమా? అన్న ప్రశ్నకు ఆమె అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. తానేమి ఊరికే బికినీ వేసుకొని రోడ్లమీద తిరగట్లేదని, సన్నివేశం కోసం మాత్రమే అలా చేశానని చెప్పింది.
https://www.youtube.com/watch?v=tZHrZBu_TAY&t=82s
ఇక తేజస్వి వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె హైదరాబాద్‌లో జర్నలిజం చదివింది. షార్ట్‌ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభించింది. 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' చిత్రంలో ఓ చిన్న క్యామియో చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో సమంతకు చెల్లిగా చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ‘మనం’, ‘హార్ట్ అటాక్’ వంటి చిత్రాల్లో తేజస్వి నటించింది.
2014లో వచ్చిన ‘ఐస్‌క్రీమ్’ సినిమాలో కథానాయికగా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ‘అనుక్షణం’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రాల్లో కీ రోల్స్ చేసి నటిగా గుర్తింపు సంపాదించింది.
'కేరింత' చిత్రంలో ప్రియా పాత్రతో మెప్పించి యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడికి సరైన బ్రేక్ లభించలేదు.
దీంతో బుల్లితెరపై ఫోకస్ పెట్టిన తేజస్వి మదివాడ అక్కడ పలు షోలలో హల్‌చల్ చేసింది. 2018లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో పాల్గొన్న ఈ చిన్నది తన అల్లరితనంతో ఆకట్టుకుంది.
తర్వాత స్టార్‌మాలో 'ది గ్రేటర్ తెలుగు లాఫర్ ఛాలెంజ్' సీజన్ 1లో కనిపించి సందడి చేసింది. 2022లో 'బిగ్‌బాస్ నాన్ స్టాప్ 1'లోనూ పాల్గొని మరోమారు టీవీ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసింది.
ఇటీవల 'హైడ్ ఎన్ సీక్' (Hide N Seek) మూవీలో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం చేతిలో ఏ సినిమా లేకపోవడంతో ‘అర్థమయ్యిందా అరుణ్ కుమార్ 2’ సిరీస్‌లో చాలా ఆశలు పెట్టుకుంది.
మరోవైపు సోషల్‌మీడియాలోనూ చురుగ్గా వ్యవహరిస్తూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే పనిలో తేజస్వి ఉంది. ఇందుకోసం తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం ఈ భామ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 1.1 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. తేజస్వి ఏ ఫొటో షేర్ చేసినా దానిని వెంటనే షేర్ చేస్తున్నారు.
అక్టోబర్ 23 , 2024
Aa Okkati Adakku Review: వింటేజ్ అల్లరి నరేష్ ఈజ్ బ్యాక్.. ‘ఆ ఒక్కటి అడక్కు’ హిట్ కొట్టినట్లేనా?
నటీ నటులు : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జామీ లివర్, హర్ష చెముడు, అరియానా గ్లోరి తదితరులు..
డైరెక్టర్ : మల్లీ అంకం
సినిమాటోగ్రాఫర్ : సూర్య
సంగీతం : గోపి సుందర్
నిర్మాత : రాజీవ్ చిలక
నిర్మాణ సంస్థ : చిలక ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 3 మే, 2024
అల్లరి నరేష్ (Allari Naresh), ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). మల్లి అంకం దర్శకత్వం వహించాడు. కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ మళ్లీ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందు వస్తుండటంపై సినిమాపై అంచనాలు పెరిగాయి. మే 3న విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? అల్లరి నరేష్ ఖాతాలో మరో విజయం చేరినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
గణపతి (అల్లరి నరేష్) సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేస్తుంటాడు. పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో పాటు పెళ్లైన సోదరుడు ఉండటంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె తిరస్కరించడంతో ఇద్దరూ ఫ్రెండ్స్‌గా మారతారు. అయితే మ్యాట్రిమోనీ ద్వారా సిద్ధి అబ్బాయిలను మోసం చేస్తోందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తాయి. ఇందులో నిజమెంత? సిద్ధి ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? ఓ మ్యాట్రిమోనీ సంస్థ పెళ్లికానీ అబ్బాయిలను ఎలా మోసం చేసింది? చివరికీ సిద్ధి - గణపతి ఒకట్టయ్యారా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
గణపతి పాత్రలో అల్లరి నరేష్ చక్కగా ఒదిగిపోయాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. తన కామెడీ టైమింగ్‌తో వింటేజ్ నరేష్‌ను గుర్తు చేశాడు. ఇక సిద్ధి పాత్రలో ఫరియా అబ్దుల్లా పర్వాలేదనిపించింది. నటన పరంగా ఆమెకు పెద్దగా స్కోప్ రాలేదు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సరదా సంభాషణలు, వారి పెయిర్ ఆకట్టుకుంటాయి. ఇక జెమీ లివర్ ఎక్స్‌ప్రెషన్స్, ఆమె హుషారైన నటన మెప్పిస్తుంది. వెన్నెల కిషోర్, హర్ష చెముడు స్క్రీన్‌పైన కనిపిస్తున్నంత సేపు నవ్వించారు. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
ప్రస్తుతం చాలా మంది యువత ఎదుర్కొంటున్న సమస్యను కథాంశంగా చేసుకొని దర్శకుడు మల్లి అంకం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మ్యాట్రిమోనీ సైట్లలో యువతీ యువకులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో కళ్లకు కట్టే ప్రయత్నం చేశాడు. అయితే ప్రచార చిత్రాల్లో చూపించినట్లు ఇది ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రం కాదు. ఎన్నారై పెళ్లి కొడుకుల మోసాలు, మనం తరచూ వార్తల్లో చూసే విషయాలు తప్ప కొత్తగా ఇందులో ఏమీ లేదు. ఫేక్ పెళ్లి కూతురు కాన్సెప్ట్ కాస్త కొత్తగా అనిపించినా దాని చుట్టూ అల్లుకున్న కామెడీ మాత్రం వర్కౌట్ కాలేదు. ఫస్టాఫ్ వరకూ కామెడీ పర్వాలేదనిపించినా సెకండాఫ్‌లో మాత్రం అది ఎక్కడ కానరాదు. పెళ్లి అనే కాన్సెప్ట్ తీసుకొని డైరెక్టర్ కథను మరీ సాగదీసినట్లు అనిపించింది.
టెక్నికల్‌గా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే రాజ్ సుందర్ అందించిన సంగీతం పర్వాలేదు. 'రాజాది రాజా..' సాంగ్ మళ్లీ మళ్లీ వినేలా ఉంది. నేపథ్య సంగీతం సోసోగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు కాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
అల్లరి నరేష్ నటనకామెడీ
మైనస్ పాయింట్స్
కథలో మెరుపులు లేకపోవడంసాగదీత సీన్లు
Telugu.yousay.tv Rating : 2.5/5
మే 03 , 2024
Miss Perfect Web Series Review: ఓసీడీతో లావణ్యకి ఎన్ని సమస్యలో.. సిరీస్ ఎలా ఉందంటే?
నటీనటులు: లావణ్య త్రిపాఠి, అభిజిత్, కేశవ్ దీపక్, ఝాన్సీ, హర్షవర్ధన్, అభిజ్ఞ, రోషన్, సతీష్ సరిపల్లి, మహేష్ విట్టా తదితరులు
డైరెక్టర్: విశ్వక్ ఖండేరా
సినిమాటోగ్రాఫర్ : అదిత్య జవ్వాది
సంగీతం : ప్రశాంత్ ఆర్. విహారి
స్ట్రీమింగ్ భాషలు : తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, బెంగాలి, కన్నడ, మరాఠీ
ఓటీటీ వేదిక: డిస్నీ + హాట్‌స్టార్
విడుదల తేదీ: 02 ఫిబ్రవరి, 2024
లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'మిస్ పర్ఫెక్ట్' (Miss Perfect Web Series Review in Telugu). 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేమ్, 'బిగ్ బాస్ 4' విన్నర్ అభిజీత్ (Abhijith) ఆమెకు జంటగా నటించాడు. అభిజ్ఞ, హర్షవర్ధన్, ఝాన్సీ, మహేష్ విట్టా, సునైనా ఇతర ప్రధాన తారాగణంగా ఉన్నారు. 'స్కై ల్యాబ్' (Sky Lab) ఫేమ్ విశ్వక్ ఖండేరావు ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించగా నేటి నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney + Hotstar) వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? ఇప్పుడు చూద్దాం.
కథ
లావణ్య రావు (లావణ్య త్రిపాఠి) శుచి - శుభ్రతలకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి అమ్మాయి. ఓసీడీ ఉండటం వల్ల పరిసరాలు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలని భావిస్తుంటుంది. ప్రమోషన్‌లో భాగంగా లావణ్య హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతుంది. రోహిత్ (అభిజీత్) ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌లో అద్దెకు దిగుతుంది. వీరిద్దరి ఫ్లాట్‌లో జ్యోతి (అభిజ్ఞ) వంట చేస్తుంటుంది. ఓ కారణం చేత లావణ్య.. రోహిత్ ఫ్లాట్‌కు వెళ్తుంది. ఆమెను జ్యోతి పంపిన పనిమనిషి అని రోహిత్ భ్రమపడటంతో కథ మలుపు తిరుగుతుంది. మరి లావణ్య రోజూ రోహిత్ ఫ్లాటుకు ఎందుకు వెళ్లింది? రోహిత్ ఆమెను ఎందుకు ఇష్టపడ్డాడు? ఆ విషయాన్ని ఆమెకు చెప్పాడా లేదా? చివరికి ఏమైంది? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
మిస్ పర్ఫెక్ట్‌గా (Miss Perfect) లావణ్య త్రిపాఠి అద్భుతంగా నటించింది. అపరిశుభ్రతను భరించలేని పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయింది. బిగ్‌బాస్ ఫేమ్ అభిజీత్ కూడా చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకులకు కనిపించాడు. ఫ్రెష్ లుక్‌లో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అభిజిత్ - లావణ్య జోడీ చూడటానికి చాలా బాగుంది. ఇద్దరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక హర్షవర్ధన్, ఝూన్సీ క్యారెక్టర్లు పరిమితంగా ఉన్నాయి. మహేష్ విట్టాతో పాటు మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
తెలుగు ప్రేక్షకులకు ఓసీడీ కథ కొత్త కాదు. 'మహానుభావుడు' చిత్రం ఇదే కాన్సెప్ట్‌తో వచ్చిందే. అయితే మహిళకు ఓసీడీ ఉంటే ఎలా ఉంటుందన్న లైన్‌ను దర్శకుడు విశ్వక్ ఖండేరావు తీసుకోవడం ఆసక్తికరం. అందుకు అనుగుణంగానే లావణ్య క్యారెక్టర్‌ను బాగా డిజైన్ చేశారు. అయితే ఆ పాత్రకు తగ్గ సన్నివేశాలను రాసుకోవడంలో ఆయన విఫలమయ్యారు. ఆమెకున్న ఓసీడీని క్యాష్ చేసుకొని కామెడీని పండించడంలో ఆయన విఫలమయ్యారు. కథ - కథనాల్లో, కామెడీలో, నెక్స్ట్ ఏంటి అన్న క్యూరియాసిటీని క్రియేట్ చేయడంలోనూ డైరెక్టర్ తడబడ్డారు. రైటింగ్ ఫెయిల్యూర్ వల్ల భావోద్వేగాలు కూడా పెద్దగా పండలేదు.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. క్రెడిట్ అంతా మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్. విహారికే దక్కుతుంది. సిరీస్ అని లైట్ తీసుకోకుండా మంచి మెలోడీ పాటలు కంపోజ్ చేశారు. నేపథ్య సంగీతం కూడా బావుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ ఓకే. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
లావణ్య, అభిజిత్ నటనసంగీతంసినిమాటోగ్రఫి
మైనస్ పాయింట్స్
కథ, కథనంసాగదీత సీన్లుపండని భావోద్వేగాలు
రేటింగ్: 2.5/5
ఫిబ్రవరి 02 , 2024
Prabhas New Movie: ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ మరో కొత్త సినిమా.. టైటిల్ కూడా ఫిక్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా కేజీఎఫ్ (KGF) ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘సలార్’ (Salaar). గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ.600 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానుంది. సలార్ పార్ట్ 2; శౌర్యంగ పర్వం (Salaar Part 2 ; Shouryaanga Parvam) పేరుతో ఇది రూపొందనుంది. అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో మరో చిత్రం ఉండనున్నట్లు క్రేజీ బజ్ బయటకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
సినిమా టైటిల్ అదే!
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న ఈ హ్యాట్రిక్ మూవీకి టైటిల్ ఇదే అంటూ ఓ పేరు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు ‘రావణం’ (Ravanam) అనే పేరును ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ కెరీర్‌లోనే అతిపెద్ద చిత్రంగా ఇది రూపొందనున్నట్లు సమాచారం. భారత సినిమా చరిత్రలో ఇంతవరకూ రాని కథతో ఈ చిత్రం తెరకెక్కుతుందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
బాహుబలి తరహాలోనే..!
బాహుబలి తరహాలోనే ఈ సినిమాకు కూడా మైథలాజికల్ డ్రామా (Mythological Drama)గా రానుందని అంటున్నారు. ప్రభాస్ బాహుబలి తర్వాత ఆ జోనర్ సినిమాను ఇప్పటి వరకూ చేయలేదు. ‘ఆదిపురుష్’లో ప్రభాస్ నటించినప్పటికీ అది రామాయణం ఆధారంగా తెరకెక్కింది. దీంతో కమర్షియల్‌గా రానున్న ‘రావణం’ ప్రభాస్ ఫేమ్, కెరీర్‌ను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కథకు సంబంధించి ఎలాంటి స్పష్టత లేకపోయినప్పటికీ మైథలాజికల్‌గా వస్తుందన్న ఊహాగానాలతో ‘రావణం’ ఆసక్తిరేపుతోంది.
నిర్మాత అతడే!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఈ సినిమాను రూపొందిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తారని అంటున్నారు. ప్రస్తుతం దిల్ రాజు.. రామ్‌చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. దిల్‌రాజు ఫోకస్ మెుత్తం ప్రస్తుతం ఆ సినిమా పైనే ఉంది. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత ఆయన ‘రావణం’ మేకింగ్ వర్క్స్‌పై దృష్టి సారిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
షూటింగ్ ఎప్పుడు?
‘రావణం’ సినిమా షూటింగ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ‘సలార్ 2’ తర్వాత వెంటనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని కొందరు అంటున్నారు. గతంలో తారక్ (Jr NTR)తో ప్రశాంత్ నీల్ ఓ సినిమాను ప్రకటించారు. ‘NTR 31’గా అది రావాల్సి ఉంది. అయితే తాజా బజ్ ప్రకారం ఆ మూవీ కంటే ముందే ‘రావణం’ తెరకెక్కుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే మరికొందరి విశ్లేషణ మరోలా ఉంది. 2026 తర్వాత ప్రశాంత్ నీల్ ‘రావణం’ ప్రాజెక్ట్‌ను టేకప్ చేయవచ్చని అంటున్నారు. అప్పటి వరకూ దీనిపై అధికారిక ప్రకటన కూడా ఉండకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా రానున్న రోజుల్లోనే ‘రావణం’పై క్లారిటీ రానుంది.
ఫిబ్రవరి 12 , 2024
Game Changer: ‘గేమ్ ఛేంజర్’తో చిరంజీవికి ఊహించని తలనొప్పి.. మెగా ఫ్యాన్స్ మధ్య చీలికలు తప్పదా?
రామ్‌చరణ్ - డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game changer). 'ఆర్ఆర్‌ఆర్' (RRR) తర్వాత రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాసేలా మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ ఖాయమంటూ పలు వేదికలపై దిల్‌రాజు స్పష్టం చేశారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా సంక్రాంతి రేసులో నిలవనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే పొంగల్ బరిలో నిలిచిన చిరుకు చరణ్ నుంచి గట్టి పోటీ తప్పదా అన్న ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది.
క్రిస్మస్ నుంచి సంక్రాంతికి లాక్!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి చాలా పెద్ద ఫెస్టివల్. బడా బడా హీరోలందరూ తమ చిత్రాలను సంక్రాంతికి లాక్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం తన అప్‌కమింగ్ చిత్రం 'విశ్వంభర'ను పొంగల్ రేసులో నిలిపారు. ఈ క్రమంలోనే రామ్‌చరణ్ లేటెస్ట్ చిత్రం 'గేమ్ ఛేంజర్'ను సైతం సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ వినిపిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కావడానికి ఇంకాస్త సమయం పట్టే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో క్రిస్మస్ నాటికి రిలీజ్ సాధ్యం కాకపోవచ్చని సమాచారం. దీంతో సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. అదే జరిగితే బాక్సాఫీస్ వద్ద చిరు-రామ్‌చరణ్ మధ్య బిగ్ ఫైట్ తప్పదని అంటున్నారు.
డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడే కారణమా?
గేమ్ ఛేంజర్ చిత్రం డిసెంబర్ నుంచి సంక్రాంతికి మారడం వెనక డిస్ట్రిబ్యూటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని క్రిస్మస్ కంటే సంక్రాంతికి తీసుకువస్తేనే తమకు లాభదాయకంగా ఉంటుందని డిస్ట్రిబ్యూటర్ల అంటున్నారట. అలా కాదని క్రిస్మస్‌కు తీసుకొస్తే తమకు గిట్టుబాటు కాకపోవచ్చని తేల్చి చెబుతున్నారట. పైగా జనవరి 10 నుంచి సంక్రాంతి చిత్రాలు వస్తుండటంతో లాంగ్ పీరియడ్ కలెక్షన్స్ పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారట. 20 రోజుల కలెక్షన్స్‌తోనే 'గేమ్ ఛేంజర్' సరిపెట్టుకోవాల్సి వస్తుందని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారట. దీంతో ‘గేమ్ ఛేంజర్’ టీమ్ పూర్తిగా ఇరాకటంలో పడిపోయినట్లు తెలుస్తోంది.
చిరు వెనక్కి తగ్గేనా!
తండ్రి కొడుకులైనా చిరంజీవి, రామ్‌చరణ్ ఇప్పటివరకూ బాక్సాఫీస్ వద్ద తలపడలేదు. ‘విశ్వంభర’ వర్సెస్ ‘గేమ్ ఛేంజర్’గా పోటీ మారితే ఫ్యాన్స్‌కు తప్పుడు సంకేతం ఇచ్చినవారవుతారు. రిలీజ్ సందర్భంగా ఏ సినిమా చూడాలన్న విషయంలో మెగా ఫ్యాన్స్ తర్జనభర్జన అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కొడుకు కోసం ‘విశ్వంభర’ను పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం లేకపోలేదని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే ‘గేమ్ ఛేంజర్’ సినిమా రిలీజ్‌పై ఎప్పటినుంచో సందిగ్దం నెలకొంది. నిర్మాత దిల్‌రాజు, సంగీత దర్శకుడు థమన్ క్రిస్మస్ కానుకగా సినిమా వస్తుందని చెప్పినా మెగా ఫ్యాన్స్ పూర్తిగా విశ్వసించలేదు. ఇప్పుడేమో సంక్రాంతికి సినిమా వస్తుందంటూ మరో ప్రచారం జోరందుకుంది. సంక్రాంతి కూడా మిస్ అయితే ‘గేమ్ ఛేంజర్’పై మెగా ఫ్యాన్స్ అసంతృప్తి తారాస్థాయికి చేరే ప్రమాదం ఉంది. కాబట్టి సంక్రాంతికే ‘గేమ్ ఛేంజర్’ను రిలీజ్ చేయాలని మేకర్స్ పట్టుబడితే మెగాస్టార్ వెనక్కి తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రీషూట్‌కు నో చెప్పిన చరణ్!
‘గేమ్ ఛేంజర్’ మూవీ షూటింగ్ ఇటీవలే కంప్లీట్ చేసుకున్న రామ్‌చరణ్ తన ఫోకస్‌ను తర్వాతి చిత్రంపైకి మళ్లించారు. బుచ్చిబాబు డైరెక్షన్‌లో రానున్న ‘RC16’ కోసం లాంగ్ హెయిర్‌తో పాటు బాడీని సైతం పెంచాడు. అయితే దర్శకుడు శంకర్ ‘గేమ్ ఛేంజర్’కి సంబంధించిన కొన్ని సీన్లపై అసంతృప్తిగా ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. చరణ్‌తో వాటిని రీషూట్ చేాయాలని భావించినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని నిర్మాత దిల్‌రాజు ద్వారా చరణ్ దృష్టికి తీసుకెళ్లగా ఇందుకు అతడు నో చెప్పినట్లు తెలిసింది. తిరిగి ‘గేమ్ ఛేంజర్’ లుక్‌లోకి మారితే ‘RC16’ షూటింగ్‌లో జాప్యం జరుగుతుందని ఆయన భావించారట. ఇప్పటికే ‘RC16’ కోసం డేట్స్ కూడా ఇవ్వడంతో వాటిని అడ్జస్ట్ చేసుకునేందుకు చరణ్ సంసిద్ధంగా లేరని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపించింది.
చరణ్- నీల్ కాంబో లోడింగ్!
రామ్ చరణ్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్‌బాస్టర్స్ అందించిన ప్రశాంత్ నీల్‌తో చరణ్ ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై చర్చలు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను డీవీవీ దానయ్య నిర్మించనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు చాలా సమయం పట్టే అవకాశముంది. ప్రస్తుతం ప్రశాంత్ చేతిలో 'NTR 31'తో పాటు సలార్ 2, కేజీఎఫ్ 3 ప్రాజెక్టులు ఉన్నాయి. అటు చరణ్ సైతం బుచ్చిబాబుతో పాటు సుకుమార్‌తో ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. అవన్నీ పూర్తయిన తర్వాత చరణ్-నీల్ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
అక్టోబర్ 09 , 2024
Ram Charan: రూట్‌మార్చిన రామ్‌చరణ్.. ఫుల్ జోష్‌లో మెగా ఫ్యాన్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) సక్సెస్‌తో గ్లోబల్ స్థార్‌గా ఎదిగారు. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్‌ను కెరీర్ ప్రారంభం నుంచి ఓ సమస్య వెంటాడుతోంది. ఈ సమస్య నుంచి చరణ్ ఎన్నిసార్లు బయటపడాలని చూసిన కుదరడం లేదు. దీనిపై మెగా ఫ్యాన్స్ సైతం అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆ ప్రాబ్లమ్‌కు చెక్ పెట్టే దిశగా రామ్‌చరణ్ సరికొత్త ప్లాన్స్‌ను రచిస్తున్నాడు. ఆ దిశగా ఓ కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలిసి మెగా ఫ్యాన్స్ సైతం తెగ ఖుషీ అవుతున్నారట. ఇంతకీ ఆ సమస్య ఏంటి? దానిపై చెర్రీ తీసుకున్న నిర్ణయం ఏంటి? అన్నది ఈ కథనంలో తెలుసుకుందాం.
సెట్స్‌పైకి రెండు చిత్రాలు!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ చిరు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 17 ఏళ్లు అవుతోంది. ఇప్పటివరకూ ఆయన నుంచి వచ్చింది 13 చిత్రాలు మాత్రమే. మిగతా స్టార్స్‌తో పోలిస్తే సినిమా సినిమాకు చరణ్ ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారన్న విమర్శ ఉంది. దీని నుంచి ఎన్నిసార్లు బయటపడాలని చూసిన అది వర్కౌట్ కాలేదు. దీంతో ఈ సమస్యకు కచ్చితంగా చెక్ పెట్టాలని చరణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై సంవత్సరానికి రెండు చొప్పున చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఇందులో భాగంగానే ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కాకముందే డైరెక్టర్ బుచ్చిబాబుతో RC16 ప్రాజెక్ట్‌ను చరణ్ అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈ చిత్రంతో పాటుగానే సుకుమార్ దర్శకత్వంలో మరో మూవీ చేయబోతున్నాడు. ఒకేసారి ఆ రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని రామ్‌చరణ్ భావిస్తున్నారట. ఈ రెండు సినిమాలను 2026 లోపే రిలీజ్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.
ప్రభాస్‌ను అనుసరిస్తున్నాడా?
ప్రభాస్ కూడా తన ప్రాజెక్టుల విషయంలో గతంలో కంటే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పటిలాగా ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్ట్ అనే విధానానికి స్వస్థి పలికి ఒకేసారి మూడు ప్రాజెక్ట్స్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ మారుతీతో 'రాజాసాబ్' అనే చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల హను రాఘవపూడితో కొత్త ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించాడు. నవంబర్ కల్లా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లోని 'స్పిరిట్'ను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్లాన్‌లో డార్లింగ్ ఉన్నాడు. తద్వారా ఏక కాలంలో ఈ మూడు చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొని ఒక్కో సినిమాను ఏడాది కంటే తక్కువ వ్యవధిలోనే రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు. మరోవైపు ‘సలార్ 2’, ‘కల్కి 2’ చిత్రాలను కూడా వచ్చే ఏడాది పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది.
ముఖ్య అతిథిగా రామ్‌చరణ్
దక్షిణాది సినీ అవార్డుల పండుగ ‘ఐఐఎఫ్ఏ ఉత్సవం’ (IIFA Utsavam 2024) కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరుకానున్నారు. అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో సెప్టెంబరు 27న ఐఐఎఫ్ఏ (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) వేడుక జరగనుంది. ఇక్కడి ఎతిహాద్ ఎరీనా వేదికగా జరిగే ఈ అవార్డుల ఉత్సవంలో రామ్ చరణ్ సందడి చేయనున్నారు. ఈ మేరకు ఐఐఎఫ్ఏ నిర్వాహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ఈవెంట్‌కు చరణ్‌తో పాటు పలువురు దక్షిణాది ప్రముఖులు హాజరుకానున్నారు.
ఈ ఏడాది లేనట్లే!
ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' చిత్రంలో రామ్‌చరణ్ నటిస్తున్నాడు. డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ఈ చిత్రం రిలీజ్ కానున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నిర్మాత దిల్ రాజు కూడా డిసెంబర్‌లోనే రిలీజ్ చేయనున్నట్లు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం గేమ్ ఛేంజర్ డిసెంబర్‌లో రావడం కష్టమేనని అంటున్నారు. డిసెంబర్ 20కి ఇప్పటికే తండేల్, రాబిన్ హుడ్ షెడ్యూల్ అయి ఉన్నాయి. ఆ టైమ్ లో గేమ్ ఛేంజర్ ను రిలీజ్ చేస్తే కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉందని మేకర్స్ భావిస్తున్నారట. వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ చేయవచ్చని అంటున్నారు. దీనిపై మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
సెప్టెంబర్ 14 , 2024
Pushpa 3: కష్టకాలంలో బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. ‘పుష్ప 3’పై స్టన్నింగ్ అప్‌డేట్!
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప' (Pushpa: The Rise) చిత్రం 2021లో విడుదలై పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత బన్నీ 'పుష్ప 2' (Pushpa 2: The Rule)తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిసెంబర్ 6న ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే ఇటీవల ఓ సినిమా ఫంక్షన్‌లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. మెగా ఫ్యామిలీ లక్ష్యంగా బన్నీ ఈ కామెంట్స్ చేశారంటూ మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అటు అల్లు అర్మీ సైతం వారికి దీటుగా సమాధానం ఇస్తూ కష్టపడుతోంది. ఈ క్రమంలో బన్నీ ఫ్యాన్స్‌కు హై ఓల్టేజ్ పవర్ ఇచ్చే అప్‌డేట్ బయటకొచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
పుష్ప 3పై క్రేజీ అప్‌డేట్
'పుష్ప' చిత్రంలో నటుడు రావు రమేష్ (Rao Ramesh) ఓ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఎంపీ భూమిరెడ్డి పాత్రలో అయన కనిపించింది కొద్దిసేపే అయిన కథపై ఎంతో ఇంపాక్ట్ చూపించారు. తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన రావు రమేష్ 'పుష్ప 2'లో తన పాత్ర గురించి చెబుతూనే 'పుష్ప 3' క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. 'పుష్ప కథ అంతా చెప్పి ఒక్క సీన్ మాత్రమే షూట్ చేశారు. మిగిలిన డేట్స్ పుష్ప 2కి వాడుకుంటాం సర్ అన్నారు. నేనూ ఓకే అన్నాను. పార్ట్ 2లో మంచి పాత్రే పడింది. ఇప్పుడు పార్ట్ 3 కూడా అంటున్నారు. అందులోనూ నా పాత్ర ఉండొచ్చేమో' అంటూ రావు రమేష్ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. 'పుష్ప 3' పక్కాగా ఉంటుందని రావు రమేష్ చెప్పకనే చెప్పారని నెటిజన్లు అంటున్నారు. ఈ వీడియో చూసిన బన్నీ ఫ్యాన్స్ కూడా తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/Nasavnensasthaa/status/1828421405731697031?
క్లైమాక్స్‌లో హింట్!
‘పుష్ప 3’ సంబంధించి ప్రస్తుతం మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘పుష్ప 2’ క్లైమాక్స్‌లోనే మూడో పార్ట్‌కు సంబంధించిన అప్‌డేట్ ఉంటుందని సినీ వర్గాల్లో స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. అంతేకాదు పార్ట్ 3కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను సైతం చూపిస్తారని సమాచారం. అయితే పుష్ప 3 వెంటనే పట్టాలెక్కకపోవచ్చని సమాచారం. బన్నీ-సుకుమార్ రెండు మూడేళ్ల గ్యాప్ తీసుకునే అవకాశముందని అంటున్నారు. అటు బన్నీ, సుకుమార్‌లకు వేరే కమిట్‌మెంట్స్ ఉన్నాయి. సుకుమార్ ఇప్పటికే రామ్‌చరణ్‌తో ఓ సినిమాను అనౌన్స్ చేయగా, బన్నీ చేతిలో త్రివిక్రమ్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'పుష్ప 3' ఇప్పట్లో రాకపోవచ్చని సమాచారం.
తొలి పార్ట్‌కి మించి..
ఇక పుష్ప 2 చిత్రం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్, ఫస్ట్, సెకండ్ సింగిల్ లిరికల్ సాంగ్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా పుష్ప 2 గురించి మాట్లాడిన దర్శకుడు సుకుమార్ సినిమాపై హైప్‌ను పెంచే కామెంట్స్ చేశారు. మెుదటి భాగాన్ని మించి సెకండ్ పార్ట్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తొలి భాగంలో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలకు పుష్ప 2లో సమాధానం దొరుకుతుందని సుకుమార్ తెలిపారు. మరీ ముఖ్యంగా సిండికేట్‌తో పుష్పరాజ్ ఆడే గేమ్, ఎమోషనల్ సీన్స్, పుష్ప రాజ్ vs భన్వర్‌సింగ్ షెకావత్ మధ్య నడిచే డ్రామా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పుకొచ్చారు.
‘కేజీఎఫ్’ ఫార్మూలా!
డైరెక్టర్ సుకుమార్ (Sukumar), హీరో అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప 3’ విషయంలో ‘కేజీఎఫ్’ (KGF Movie) ఫార్మూలాను అనుసరించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా రూపొందిన ‘కేజీఎఫ్’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అయ్యింది. ఆపై వెంటనే సెకండ్ పార్ట్‌ను పట్టాలెక్కించి ‘కేజీఎఫ్ 2’ను కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత ‘కేజీఎఫ్ 3’ గ్యాప్ ఇచ్చి ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో ‘సలార్’ అనే చిత్రాన్ని కూడా రూపొందించారు. అటు యష్ సైతం ‘టాక్సిక్’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ‘పుష్ప 3’పై వస్తోన్న లేటెస్ట్ అప్‌డేట్స్‌ను పరిశీలిస్తే సుకుమార్ - బన్నీ కూడా ప్రశాంత్ నీల్- యష్‌లను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసి ఆ తర్వాత ‘పుష్ప 3’ని పట్టాలెక్కించాలని వారు భావిస్తున్నట్లు సమాచారం.
ఆగస్టు 28 , 2024
KGF 3: ‘కేజీఎఫ్ 3’లో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్రేజీ డీల్!
కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన ‘కేజీఎఫ్’ (KGF), ‘కేజీఎఫ్ 2’ (KGF 2) దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. కేజీఎఫ్ ముందు వరకూ పెద్దగా ఎవరికి తెలియని కన్నడ నటుడు యష్ (Yash), డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఆ రెండు చిత్రాలతో స్టార్ సెలబ్రిటీలుగా మారిపోయారు. యష్ నటన, ప్రశాంత్ నీల్ పనితనంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది. అయితే వీరి కాంబోలో ‘కేజీఎఫ్ 3’ ఉంటుందని గతంలోనే మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. ‘కేజీఎఫ్ 3’లో కోలివుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ నటించబోతున్నట్లు ఒక్కసారిగా ఊహాగానాలు మెుదలయ్యాయి.
‘కేజీఎఫ్ 3’లో అజిత్!
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు. ఇటీవలే 'విదా ముయార్చి' (Vidaamuyarchi) మూవీ షూట్‌ను పూర్తి చేసుకున్న అజిత్ మరో స్టార్ డైరెక్టర్‌తో వర్క్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ డైరెక్టర్ ఎవరో కాదు ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్. లేటెస్ట్ బజ్ ప్రకారం అజిత్‌తో కలిసి ప్రశాంత్ నీల్ రెండు చిత్రాలు తెరకెక్కించనున్నారు. అందులో ఒకటి విభిన్నమైన కథాంశం కలిగిన స్టాండలోన్ మూవీ కాగా, మరొకటి కేజీఎఫ్ యూనివర్స్‌కు లింకప్ చేసే కథ అని ప్రచారం జరుగుతోంది. దీంతో 'కేజీఎఫ్ 3' చిత్రంలో యష్‌తో పాటు అజిత్ కూడా కనిపించబోతున్నట్లు టాక్ మెుదలైంది. దీంతో కేజీఎఫ్ సిరీస్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. 'కేజీఎఫ్ 3' అన్ని రికార్డ్స్‌ను బ్రేక్ చేయడం ఖాయమని ఇప్పటినుంచే పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/nitishyadav1801/status/1816002560731287619
టైమ్ పట్టనుందా?
అజిత్, ప్రశాంత్ నీల్ చేతిలో ఇప్పటికే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘విదా ముయార్చి’ తర్వాత అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) అనే ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మంచనుండటం విశేషం. మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. అతడి చేతిలో ఇప్పటికే 'సలార్ 2' ప్రాజెక్ట్ ఉంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌తో 'NTR 31' అనే సినిమాను సైతం అనౌన్స్ చేశారు. ఆ రెండు చిత్రాల తర్వాత అజిత్‌తో సినిమా పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది. అటు కేజీఎఫ్ హీరో యష్ సైతం ‘టాక్సిక్’ (Toxic) అనే సినిమాలో నటిస్తున్నట్లు ఇటీవలే ఈ మూవీ షూటింగ్ మెుదలైంది. ‘కేజీఎఫ్ 3’కి కీలకమైన ఈ ముగ్గురు బిజీ బిజీగా ఉండటంతో ఇప్పట్లో ఈ మూవీ పట్టాలెక్కే అవకాశం లేదు.
కలెక్షన్ల సునామీ
యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రం 2018 డిసెంబర్ 21 విడుదలై సంచలనం సృష్టించింది. ట్రైలర్ నుంచి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం విడుదల అనంతరం వాటిని అందుకుంటూ వసూళ్లు సునామీ సృష్టించింది. ఏకంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కన్నడ ఇండస్ట్రీలో చరిత్రలోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. ఆపై దీనికి కొనసాగింపుగా వచ్చిన 'కేజీఎఫ్ 2' అంతకుమించి రికార్డ్స్ క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ.1,225–1,250 కోట్లు కొల్లగొట్టింది. తద్వారా దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాల్గో స్థానంలో నిలిచింది. దీంతో 'కేజీఎఫ్ 3'పై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.
జూలై 24 , 2024
Bagheera Trailer Review: ప్రశాంత్ నీల్ ‘భగీరా’ట్రైలర్‌లో ఇవి గమనించారా.. మరో కేజీఎఫ్ కానుందా?
ప్రశాంత్ నీల్ ‘భగీరా’ట్రైలర్‌లో ఇవి గమనించారా.. మరో కేజీఎఫ్ కానుందా?కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన ‘కేజీఎఫ్’ (KGF), ‘కేజీఎఫ్ 2’ (KGF 2) దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. కేజీఎఫ్ ముందు వరకూ పెద్దగా ఎవరికి తెలియని కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఆ రెండు చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ఇటీవల ప్రభాస్‌తో ‘సలార్’ తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద మరోమారు వసూళ్ల సునామి సృష్టించాడు. ముఖ్యంగా కథల విషయంలో ప్రశాంత్ నీల్ ఎంతో శ్రద్ధ వహిస్తారని పేరుంది. ఈ క్రమంలోనే ఆయన ఓ పాన్ ఇండియా చిత్రానికి స్టోరీ అందించారు. ‘బఘీర’ పేరుతో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ ఇవాళ విడుదలై ఆకట్టుకుంటోంది. అయితే ట్రైలర్‌లో ‘కేజీఎఫ్’ మార్క్ కనిపించేలా చాలా అంశాలే ఉన్నాయి.
బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్‌లో..
‘కేజీఎఫ్’ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌కు పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు వచ్చింది. వీళ్ల కాంబినేషన్‌లో ఏ ప్రాజెక్ట్ రూపొందిన దానిపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ కథతో హోంబలే ఫిల్మ్స్ ‘బగీరా’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందించింది. ప్రశాంత్ నీల్ ఫస్ట్ ఫిల్మ్ 'ఉగ్రమ్' హీరో శ్రీ మురళి ఇందులో లీడ్ రోల్ చేశాడు. సూరి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా అది విపరీతంగా ఆకట్టుకుంటోంది. భగీర ట్రైలర్ చూస్తే రెండు డిఫరెంట్ గెటప్స్‌లో శ్రీమురళి కనిపించి ఆకట్టుకున్నాడు. ప్రశాంత్ నీల్ స్టైల్‌లోనే యాక్షన్‌తో పాటు బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్‌లోనే ట్రైలర్ విజువల్స్ ఉన్నాయి.
https://www.youtube.com/watch?v=O38mUkgL-w8
కేజీఎఫ్ తరహా డైలాగ్స్!
ప్రశాంత్ నీల్ సినిమా అంటే యాక్షన్‌తో పాటు డైలాగ్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా కేజీఎఫ్ సినిమాలోని డైలాగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘బగీరా’ ట్రైలర్‌లోనూ ఆ తరహా డైలాగ్స్‌ను మనం చూడవచ్చు. 'దేవుడు ఎందుకమ్మా రామాయణం, భారతం అంటూ ఎప్పుడో వస్తాడు. ఎందుకు ఎప్పుడూ రాడు’ అని ఓ పిల్లాడు తన తల్లిని అడుగుతున్న డైలాగ్‌తో ట్రైలర్ మెుదలవుతుంది. ‘మనిషి మృగంగా మారినప్పుడు వస్తాడు’ అంటూ అందుకు తగ్గ పరిస్థితులను ఆ తల్లి వివరిస్తుంది. ఆ డైలాగ్ చెప్తున్న క్రమంలోనే క్రూరమైన విలన్స్‌తో కూడిన సన్నివేశాలను చూపించారు. పోలీస్ ఆఫీసర్ అయిన హీరో తన యూనిఫామ్‌ను పక్కనపెట్టి ఓ ముసుగు మనిషిలా క్రిమినల్స్‌ను పాశవికంగా చంపడం చూపించారు. ఓ వైపు పోలీస్‌గా మరోవైపు రాక్షసులను చంపే వెపన్ గా మారె శ్రీ మురళి యాక్టింగ్ ట్రైలర్‌లో ఆకట్టుకుంది. పోలీసు ఉన్నతాధికారిగా నటుడు ప్రకాష్ రాజ్ ట్రైలర్‌లో కనిపించాడు.
తల్లి సెంటిమెంట్!
కేజీఎఫ్ సినిమాను గమనిస్తే చిన్నప్పుడే హీరో తల్లి చనిపోతుంది. చివరి క్షణాల్లో తల్లికి ఇచ్చిన మాట కోసం హీరో క్రిమినల్‌గా మారతాడు. బగీరా ట్రైలర్‌ను గమనిస్తే కేజీఎఫ్‌కు సిమిలార్ స్టోరీతో ఇది వస్తున్నట్లు అర్ధమవుతుంది. ఇందులోనూ తల్లి సెంటిమెంట్ ఉండనున్నట్లు ట్రైలర్‌ను బట్టే తెలిసిపోతోంది. చిన్నప్పుడు తల్లి చనిపోయిన ఓ పిల్లాడు అన్యాయాలను ఎదిరించేందుకు పెద్దయ్యాక పోలీసు అవుతాడు. చట్టబద్దంగా న్యాయం జరగట్లేదని భావించి ముసుగు వ్యక్తిలా మారతాడు. అలా బగీరా గెటప్‌లో క్రిమినల్స్‌ను చాలా దారుణంగా చంపుతాడు. అయితే హీరో తల్లికి క్రిమినల్స్ నుంచి ఇబ్బందులు ఎదురై ఉండవచ్చు. దీంతో ఆమెకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదన్న ఉద్దేశ్యంతో హీరో ఖాకీ ధరించి ఉంటాడని నెటిజన్లు భావిస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్, యాక్షన్ సీక్వెన్స్ చూస్తుంటే అచ్చం కేజీఎఫ్‌ను చూసిన ఫీలింగ్ కలుగుతోందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘NTR 31’తో బిజీ బిజీ
సలార్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను జూ.ఎన్టీఆర్ (Jr NTR)తో చేయబోతున్నాడు. ‘NTR 31’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా బంగ్లాదేశ్ నేపథ్యంలో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇందులో తారక్ బంగ్లాదేశ్ రైతుగా కనిపిస్తారని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. అయితే సీక్వెల్‌కు కేరాఫ్‌గా మారిన ప్రశాంత్ వర్మ 'NTR 31' ప్రాజెక్ట్‌ను సింగిల్ పార్ట్‌గా తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ తర్వాత ప్రభాస్‌తో 'సలార్ 2' ప్రశాంత్ నీల్ తెరకెక్కించే అవకాశముంది. అలాగే రామ్ చరణ్‌తోనే ఓ ప్రాజెక్ట్‌ను ఫైనల్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
అక్టోబర్ 21 , 2024
Kamal Hassan: ‘కల్కి’పై కమల్ హాసన్ క్రేజీ కామెంట్స్.. 27 ఏళ్ల తర్వాత స్టార్ హీరోయిన్ రీఎంట్రీ!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ రూపొందిన చిత్రం 'కల్కి 2898 ఏడి' (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ (Nag Ashwin) డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం.. యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. సైంటిఫిక్ అండ్ ఫ్యూచరిక్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా దిగ్గజ నటుడు కమల్ హాసన్ (Kamal Hassan) నటించారు. దీంతో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే కల్కి గురించి ఇప్పటివరకూ పెద్దగా కామెంట్స్ చేయని కమల్.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కల్కిపై అంచనాలను మరింత పెంచుతున్నాయి
కమల్ ఏమన్నారంటే
దేశం గర్వించతగ్గ నటుల్లో కమల్ హాసన్ ఒకరు. ఆయన యూనివర్సల్ స్టార్‌గానూ గుర్తింపు పొందారు. అటువంటి కమల్.. కల్కిలో ఓ ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించనున్నారని తెలియగానే సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే తాజాగా కల్కి సినిమాపై స్పందించిన కమల్.. ఈ చిత్రాన్ని హవర్ గ్లాస్‌తో పోల్చారు. మనం ఎలా టర్న్ చేస్తే అలా సినిమా తిరుగుతుందని వ్యాఖానించారు. ఇలాంటి సినిమాలో నటించడం చాలా ఆసక్తికరమని చెప్పారు. ఇప్పటివరకు చేసిన 230 చిత్రాల్లో ఈ తరహా సినిమాను చేయలేదని చెప్పుకొచ్చారు. కమల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కల్కిలో భారీ కాస్టింగ్
ప్రతిష్టాత్మంగా రూపొందుతున్న కల్కి చిత్రంలో.. హీరో ప్రభాస్, కమల్ హాసన్‌లతో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం మరింత మంది స్టార్ నటులు కల్కిలో కనిపించబోతున్నారు. గతంలో ప్రచారం జరిగిన విధంగా ఎస్.ఎస్ రాజమౌళి (SS Rajamouli), ఆర్జీవీ (RGV), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), హీరో నాని (Nani) ఈ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించనున్నారట. వీరితో పాటు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రానాలు కూడా గెస్ట్ రోల్స్‌లో అలరించబోతున్నట్లు తాజాగా నెట్టింట ప్రచారం జరుగుతోంది. కాగా, ఇప్పటికే సినిమాలోని బుజ్జి అనే రోబొటిక్ వాహనానికి హీరోయిన్ కీర్తి సురేష్ తన వాయిస్ అందించింది. ఇలా ఇంతమంది స్టార్ నటీనటులు కల్కిలో భాగస్వామ్యం కావడంతో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి.
అలనాటి నటి గ్రాండ్ ఎంట్రీ!
కల్కి సినిమాలో కనిపించబోయే స్టార్ క్యాస్టింగ్‌లలో ప్రధానంగా ఓ నటి పేరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన శోభన (Actress Shobana) కూడా కల్కిలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నటి శోభన తెలుగులో సినిమాలు చేసిన రెండు దశాబ్దాలు దాటి పోయింది. 1997 తర్వాత ఆమె తెలుగులో ఏ సినిమా చేయలేదు. ఈ క్రమంలో ఇప్పుడు కల్కిలో ఆమె రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. సుమారు 27 ఏళ్ల తర్వాత ఆమె తెలుగు తెరపై మెరవబోతున్నారు. కాగా, ఈ సినిమాలో హాస్య నటుడు బ్రహ్మానందం కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
జూన్ రెండో వారంలో ట్రైలర్!
విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో కల్కి టీమ్ ప్రమోషన్స్ జోరు పెంచింది. ఇప్పటికే 'బుజ్జి అండ్ భైరవ' అనే యానిమేటెడ్ సిరీస్‌ను ఓటీటీలో లాంచ్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. దీనికి కొనసాగింపుగా త్వరలో ట్రైలర్ కూడా తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వర్స్క్ కూడా మెుదలైనట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. జూన్ రెండో వారంలో ట్రైలర్ లాంచ్ అయ్యే అవకాశమున్నట్లు సమాచారం. విజువల్ వండర్‌లా ట్రైలర్ ఉంటుందని, అసలు కంటెంట్‌ను ఇందులో చూపిస్తారని సమాచారం. మరి ఈ ట్రైలర్ ఏ మేరకు ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తుందో చూడాలి.
జూన్ 04 , 2024
Kalki 2898 AD: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు ట్వీట్ వెనక నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్..!
ప్రభాస్ హీరోగా చేస్తోన్న సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్ సినిమా 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD)పై వరల్డ్ వైడ్‌గా బజ్ ఏర్పడింది. ఈ సినిమాను మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రంగా కల్కి రికార్డు సృష్టించింది. జూన్ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండటంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమా ప్రమోషన్స్‌ను షురూ చేశారు. సినిమాలో రోబిటిక్ వెహికల్‌గా కీలక పాత్ర పోషించిన బుజ్జి అనే వాహనాన్ని ఇటీవల అందరీ పరిచయం చేసి ఆశ్చర్యపరిచాడు. సినిమా కోసం స్పెషల్‌గా తయారు చేయించిన వెహికల్ కావడంతో బుజ్జిపై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం బుజ్జిని ఉపయోగించుకొని డైరెక్టర్ నాగ్ అశ్విన్ సరికొత్త ప్రమోషన్స్‌కు తెరలేపారు.
అపర కుబేరుడికి రిక్వెస్ట్
ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడైన టెస్లా అధినేత ఎలా మస్క్ (Elon Musk)కు.. 'కల్కి 2898 ఏడీ' డైరెక్టర్ నాగ్ అశ్విన్ తాజాగా ఓ రిక్వెస్ట్ పెట్టారు. బుజ్జి వెహికల్‌ను నడపడానికి ఆహ్వానిస్తున్నట్లు ఓ ట్వీట్‌ను ఎలాన్ మస్క్‌కు ట్యాగ్ చేశాడు. ‘ప్రియమైన ఎలాన్ మస్క్ సర్.. మా బుజ్జిని చూడటానికి, డ్రైవ్ చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇది 6 టన్నుల బరువుతో సరికొత్తగా డిజైన్ చేశాం. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం, అద్భుతమైన ఇంజినీరింగ్ వర్క్‌తో నిర్మించబడింది. మీకు బుజ్జి తప్పకుండా మంచి అనుభూతిని ఇస్తుంది' అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.
https://twitter.com/nagashwin7/status/1795534761072693594
ట్వీట్ వెనక మాస్టర్ ప్లాన్
అపర కుభేరుడు ఎలాన్ మస్క్‌కు నాగ్ అశ్విన్ ట్వీట్ పెట్టడం వెనక ఓ మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు కనిపిస్తోంది. కల్కి సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్ ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఎలాన్ మస్క్ దృష్టిని కల్కి మీదకు మళ్లిస్తే అది గ్లోబల్ స్థాయిలో మూవీకి ప్లస్ అవుతుందని నాగ్ అశ్విన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే అసాధ్యమని తెలిసినా బుజ్జిని నడపాలని, ఇండియాకు రావాలని ఆయన మస్క్‌ను కోరినట్లు సమాచారం. ఇప్పటికే నాగ్ అశ్విన్ ట్వీట్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. చాలా మంది భారతీయులు ట్వీట్‌పై స్పందిస్తున్నారు. ఈ అడ్వాన్స్‌డ్ వెహికల్‌ను నడపాలని మస్క్‌కు సైతం సూచిస్తున్నారు. అటు మస్క్ కూడా అశ్విన్ ట్వీట్‌కు సమాధానం ఇస్తే అది ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అవుతుంది. 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి రావాల్సినంత ప్రమోషన్ వరల్డ్ వైడ్‌గా వచ్చేస్తుంది.
బుజ్జిని నడిపిన చైతూ
బుజ్జి వెహికల్‌పై మనసు పారేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya).. ఇప్పటికే దానిపై ఓ రైడ్ కూడా వేశాడు. రేసింగ్ కోర్స్‌లా ఉన్న చోట రయ్‍రయ్ అంటూ ఇటీవల ఈ కారును డ్రైవ్ చేసాడు. అందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఎక్స్‌లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. అనంతరం బుజ్జి వెహికల్‌కు హాట్యాఫ్ చెప్పిన చైతూ.. అదొక ఇంజనీరింగ్ అద్భుతమని కొనియాడాడు. బుజ్జితో తాను సరదాగా గడిపినట్లు చెప్పుకొచ్చారు.
https://twitter.com/chay_akkineni/status/1794262966986215753
బుజ్జి ఎందుకు స్పెషలో తెలుసా?
బుజ్జి అనే ఫ్యూచరస్టిక్ కారును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వెహికల్ తయారీ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో శ్రమించారు. మహీంద్రా సంస్థ, జయం ఆటోమోటివ్ భాగస్వామ్యంతో పాటు చాలా మంది ఇంజినీర్లతో బుజ్జి కారును తయారు చేయించారు. ఇది తయారు చేసేందుకు సుమారు రెండేళ్ల కాలం పట్టిందట. బుజ్జి వాహనానికి ముందు రెండు, వెనుక ఒకటే భారీ టైర్లు ఉన్నాయి. ఈ టైర్లు తయారు చేసేందుకే చాలా కసరత్తులు చేశారు. సియట్ కంపెనీతో ఈ టైర్లను తయారు చేయించారు. సుమారు 6 టన్నుల బరువు ఉన్న బుజ్జీని తయారు చేసేందుకు సుమారు రూ.7 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం.
కల్కి బడ్జెట్ తెలిస్తే షాకే!
‘కల్కి 2898 ఏడీ’ చిత్రం జూన్ 27వ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీలో ప్రభాస్‍తో పాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, తమిళ లెజెండ్ కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె, దిశా పటానీ కీలకపాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా వస్తోంది. సుమారు రూ.600 కోట్ల వరకు ఈ చిత్రానికి బడ్జెట్ వెచ్చించినట్టు అంచనాలు ఉన్నాయి. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
మే 29 , 2024