రివ్యూస్
How was the movie?
తారాగణం
రానా దగ్గుబాటి
చనిపోయిన తన తండ్రి తర్వాత ముఖ్యమంత్రి అయిన వ్యక్తిరిచా గంగోపాధ్యాయ
ఒక టీవీ ఛానల్ రిపోర్టర్ప్రియా ఆనంద్
ఒక వార్తా విలేఖరిని అర్జున్ తన పార్టీ ఎమ్మెల్యేల మద్దతును గెలుచుకోవడంలో సహాయం చేస్తాడుసుహాసిని మణిరత్నం
అర్జున్ తల్లిసుమన్
హత్యకు గురైన అర్జున్ తండ్రిసుబ్బరాజు
అతడిని హత్య చేసేందుకు ప్రయత్నించిన అర్జున్ కజిన్కోట శ్రీనివాసరావు
అర్జున్ మామయ్య మరియు సంజీవయ్య అన్నయ్యతనికెళ్ల భరణి
ప్రధాన కార్యదర్శి శర్మహర్ష వర్ధన్
అర్జున్ వ్యక్తిగత కార్యదర్శిరావు రమేష్
అర్జున్ మామయ్యఆహుతి ప్రసాద్
అర్చన తండ్రి మరియు అలయన్స్ పార్టీ నాయకుడునర్సింగ్ యాదవ్
రాణి రుద్రమ
శత్రు
అతిధి పాత్రలో వాయ్ సిస్టా
ఉదయ భాను
ఐటమ్ నంబర్ రాజశేఖరసిబ్బంది
శేఖర్ కమ్ముల
దర్శకుడుఎం. శరవణన్ (చిత్ర నిర్మాత)
నిర్మాతకృతికనిర్మాత
హర్షితనిర్మాత
మిక్కీ J. మేయర్
సంగీతకారుడువిజయ్ సి. కుమార్
సినిమాటోగ్రాఫర్మార్తాండ్ కె. వెంకటేష్
ఎడిటర్ర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
EXCLUSIVE: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
'డైరెక్టర్' ని సినిమాకు టీమ్ లీడర్ లాంటి వాడు. హీరో నుంచి ఇతర నటీనటుల వరకు అతన్ని ఫాలో అవ్వాల్సిందే. అందుకే సినిమా ఫలితం ఎలా ఉన్నా అతకే ఆపాదిస్తారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది కుర్ర హీరోలు దర్శకుడు, రచయితలుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు. టాలీవుడ్‌లో ఈ కోవలో హీరో నుంచి దర్శకులుగా మారిన వారి గురించి ఓసారి చూద్దాం.
అడవి శేషు(Adivi Sesh)
ఈ కేటగిరిలో మనకు ముందు గుర్తొచ్చే పేరు.. విలక్షణ నటుడు యంగ్ హీరో అడివి శేషు. 'కర్మ' అనే సినిమాతో డెరెక్టర్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షించాడు.శేష్ ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించడమే కాకుండా అందులో ప్రధాన పాత్ర కూడా పోషించాడు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత 'కిస్' సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా విజయవంతం కాలేదు. అయితే ప్రస్తుతం అడవి శేష్ రచయితగా, హీరోగా సత్తా చాటుతున్నాడు.
విశ్వక్ సేన్(Vishwak Sen)
ఈ నగరానికి ఏమైంది చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్‌లో మంచి టాలెంట్ దాగుంది. ఓ స్క్రీన్‌ప్లే రైటర్‌గా, రచయితగా, హీరోగా, డైరెక్టర్‌గా బహుముఖ ప్రజ్ఞను చాటుతున్నాడు. ఫలక్‌నామా దాస్(2019) చిత్రాన్ని డైరెక్ట్ చేసి ప్రశంసలు పొందాడు. ఈ చిత్రంలో నటించడంతో పాటు ప్రొడ్యూస్ చేశాడు. మరో నాలుగేళ్ల తర్వాత దాస్ కా ధమ్కీ(2023) చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇటీవల విడుదలైన గామి చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. విశ్వక్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల కావాల్సి ఉంది.
సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda)
ప్రస్తుతం టాలీవుడ్‌లో డైరెక్టర్లకు మోస్ట్ వాంటెడ్ హీరోగా సిద్ధు జొన్నలగడ్డ మారిపోయాడు. స్టార్ బాయ్ సిద్ధూ కూడా స్టోరీ రైటర్‌గా, స్క్రీన్‌ప్లే రచయితగా, ఎడిటర్‌గా సత్తా చాటుతున్నాడు. బ్లాక్ బాస్టర్ చిత్రం DJ టిల్లుకు స్టోరీ రాసిన సిద్ధు జొన్నలగడ్డ.. దాని సీక్వేల్ టిల్లు స్కేర్‌కు కూడా కథ అందించాడు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో సిద్ధు టాలెంట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఈ చిత్రాల కంటే ముందు గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాధ వినుమా చిత్రాలకు స్టోరీతో పాటు సంభాషణలు అందించాడు. టిల్లు స్కేర్ చిత్రం తర్వాత దీనికి సీక్వెల్‌గా టిల్లు క్యూబ్ ఉంటుందని ఇటీవల ప్రకటించారు.
రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran)
'అందాల రాక్షసి', 'టైగర్', 'అలా ఎలా' వంటి సినిమాలలో హీరోగా నటించిన రాహుల్ రవీంద్రన్.. 'చి..ల..సౌ' సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. ఆ తర్వాత 'మన్మధుడు 2' సినిమాతో కింగ్ అక్కినేని నాగార్జున ను డైరెక్ట్ చేశాడు. 'స్నేహగీతం' 'ఇట్స్ మై లవ్ స్టోరీ' వంటి చిత్రాల్లో హీరోగా నటించిన వెంకీ అట్లూరి.. 'తొలిప్రేమ' సినిమాతో డైరెక్టర్ అవతరమెత్తాడు. ఈ క్రమంలో నటనను పక్కనపెట్టి 'మిస్టర్ మజ్ను' 'రంగ్ దే' వంటి సినిమాలను తెరకెక్కించాడు. అయితే టాలీవుడ్‌లో హీరోలు మెగా ఫోన్ పట్టుకోవడం ఇదే కొత్తకాదు. గతంలో దిగ్గజ నటులు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, పవన్ కళ్యాణ్ డైరెక్టర్లుగా మారి తమ అభిరుచికి తగ్గ సినిమాలను తెరకెక్కించారు.
పవన్ కళ్యాణ్(Pawan Kalyan)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మెగాఫోన్‌ను చేత పట్టుకుని కట్, యాక్షన్ చెప్పారు. తన సొంత బ్యానర్‌లో తెరకెక్కిన 'జానీ' చిత్రానికి పవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్లాఫ్ అవడంతో పవన్ మళ్ళీ డైరెక్షన్ వైపు చూడలేదు. 'గుడుంబా శంకర్', 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాలకు స్టోరీ-స్క్రీన్ ప్లే అందించారు. టాలీవుడ్‌లో ఈ జనరేషన్‌లో హీరో నుంచి డైరెక్టర్‌గా మారిన నటుడు పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు.
ఆర్ నారాయణ మూర్తి(R. Narayana Murthy)
విప్లవ సినిమాల హీరో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సైతం ఓ వైపు నటుడిగా రాణిస్తూనే నిర్మాతగా, డైరెక్టర్‌గా మారి... పలు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం సినిమా దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం. దండోరా, ఎర్రసైన్యం వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
ఎన్టీఆర్ &సూపర్ స్టార్ కృష్ణ
లెజెండరీ యాక్టర్ ఎన్టీర్ స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే అనేక పౌరాణిక, జానపద చిత్రాలకు దర్శకత్వం వహించారు.'సీతారామ కళ్యాణం' అనే మూవీతో డైరెక్టర్‌గా ఆయనకు తొలి సినిమా. ఆ తర్వాత 'గులేభకావళి కథ' 'దాన వీర శూర కర్ణ' 'చాణక్య చంద్రగుప్తా' 'తల్లాపెళ్లామా' వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఓ వైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే డైరెక్టర్‌గాను సక్సెస్ అయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా హీరోగా నటిస్తూనే డైరెక్టర్‌గా మారి పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. . 'సింహాసనం' అనే భారీ బడ్జెట్ సినిమాతో డైరెక్టర్‌గా మారిన కృష్ణ.. ఆ తర్వాత ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను డైరెక్ట్ చేశారు. 'శంఖారావం', 'కలియుగ కర్ణుడు', 'ముగ్గురు కొడుకులు' 'కొడుకు దిద్దిన కాపురం' 'రిక్షావాలా' 'అన్నా తమ్ముడు' 'ఇంద్ర భవనం' 'అల్లుడు దిద్దిన కాపురం' 'రక్త తర్పణం' 'మానవుడు దానవుడు'వంటి హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.
ఏప్రిల్ 01 , 2024
Yellamma: యంగ్ హీరోతో బలగం వేణు ప్రాజెక్ట్ లాక్.. నాని, తేజ సజ్జా స్థానంలో రీప్లేస్!
కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన వేణు యెల్దండి (Venu Yeldandi) కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న రోల్స్ చేస్తూ కెరీర్‌ని నెట్టుకొచ్చాడు. ఆ తర్వాత బజర్దస్త్ కామెడీ షాలో టీమ్ లీడర్‌గా మారి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే డైరెక్టర్‌గా మారిన వేణు గతేడాది ‘బలగం’ అనే సినిమాను తెరకెక్కించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. తెలంగాణ గ్రామీణం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. దీంతో వేణు తర్వాతి ప్రాజెక్ట్‌పై సహజంగానే అందరి దృష్టి ఏర్పడింది. అయితే బలగం వచ్చి ఏడాది దాటిన ఒక్క ప్రాజెక్ట్ వేణు అనౌన్స్ చేయకపోవడంపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే ఓ యంగ్ హీరోతో వేణు సినిమా ఓకే అయినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
వేణు డైరెక్షన్‌లో నితిన్!
బలగం చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు బ్యానర్‌లోనే తన రెండో చిత్రం ఉంటుందని గతంలోనే కమెడియన్, దర్శకుడు వేణు యెల్దండి ప్రకటించారు. రెండో చిత్రానికి సంబంధించిన కథను ఎప్పుడో సిద్దం చేసిన వేణు త్వరలోనే పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. యంగ్ హీరో నితీన్‌తో తన తర్వాతి చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్టోరీ గురించి నితీన్‌కు చెప్పగా కొన్ని మార్పులతో ప్రాజెక్ట్‌కు ఓకె చెప్పాడని సమాచారం. అన్ని కుదిరితే త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి 'యల్లమ్మ' (Yellamma Movie) అనే టైటిల్‌ను కూడా రిజిస్టర్ చేసినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
నాని, తేజ సజ్జా రిజెక్ట్!
వాస్తవానికి నేచురల్ స్టార్ నానితో వేణు యెల్డండి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇందుకు అనుగుణంగానే 'యల్లమ్మ' స్టోరీని నానికి వేణు వినిపించారు. కానీ సెకండ్ హాఫ్ పట్ల నాని సంతృప్తి చెందలేదని తెలిసింది. వేణు కూడా కథ పరంగా వెనక్కి తగ్గకపోవడంతో నాని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత తేజ సజ్జకు స్టోరీ వినిపించగా ఈ యంగ్ హీరో ఓకే కూడా చెప్పారని తెలిసింది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ కాంబో కూడా సెట్ కాలేదు. ఫైనల్‌గా నితీన్ వద్దకు కథను తీసుకెళ్లిన వేణు ఫైనల్‌గా అతడ్ని ఒప్పించినట్లు తెలుస్తోంది.
షూటింగ్ ఎప్పుడంటే?
ఇక వేణు యెల్దండి డైరెక్ట్ చేయనున్న ‘ఎల్లమ్మ’ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఇటీవల జరిగిన ‘జనక అయితే గనక’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్మాత దిల్ రాజు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఈవెంట్‌కు దర్శకుడు వేణు కూడా హాజరయ్యారు. అతడు స్టేజ్ పైకి వెళ్లగానే కింద కూర్చున్న దిల్ రాజు ‘ఎల్లమ్మ’ ఎప్పుడు అని అడిగాడు. దీనికి వేణు స్పందిస్తూ ‘అదేదో సామెత చెప్పినట్లు ఉంది. కర్త, కర్మ, క్రియ అన్నీ మీరే.. మీరే చెప్పాలి. నేను రేపు మొదలు పెట్టమన్నా రెడీ. చెప్పండి.. నవంబర్‌లో చేద్దామా అని అన్నాడు. దీనికి దిల్ రాజు బదులిస్తూ ‘వద్దులే ఫిబ్రవరిలో మొదలుపెడదాం’ అని స్పష్టం చేశారు.
https://twitter.com/i/status/1844354638587498984
‘బలగం’కు అవార్డుల పంట
హాస్య నటుడు ప్రియదర్శి (Priyadarsi), కావ్యా కళ్యాణ్‌రామ్ (Kavya Kalyanram) జంటగా వేణు యెల్దండి తెరకెక్కించిన ‘బలగం’ (Balagam) చిత్రం గతేడాది మార్చి 3న విడుదలైంది. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళిధర్ గౌడ్, కోటా జయరామ్, మైమ్ మధు ముఖ్యపాత్రలు పోషించారు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. పల్లెల్లో స్పెషల్ షోలను సైతం వేశారు. ఈ ఏడాది ఆగస్టులో ప్రకటించిన ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ‘బలగం’ చిత్రం ఏకంగా మూడు అవార్డులు కొల్లగొట్టింది. అలాగే ఒక సైమా అవార్డు, సంతోషం అవార్డ్‌ను సొంతం చేసుకుంది.
అక్టోబర్ 15 , 2024
Anirudh Ravichander: టాలీవుడ్‌లో నెంబర్ వన్‌గా అనిరుధ్.. తగ్గిన దేవి శ్రీ, థమన్ హవా!
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) పేరు మార్మోమోగుతోంది. కోలీవుడ్‌కు చెందిన ఈ మ్యూజిక్ సెన్సేషన్ ‘రఘువరన్ బీటెక్’, ‘విక్రమ్’, ‘జైలర్’, ‘బీస్ట్’ వంటి చిత్రాలతో యమా క్రేజ్ సంపాదించాడు. అనిరుధ్ మ్యూజిక్ ఉందంటే ఆ మూవీకి ఎనలేని క్రేజ్ వస్తోంది. ముఖ్యంగా యూత్ అనిరుధ్ ఇచ్చే పాటలు, నేపథ్య సంగీతానికి బాగా కనెక్ట్ అవుతున్నారు. రీసెంట్‌గా తారక్ నటించిన ‘దేవర’ చిత్రానికి సైతం అనిరుధ్ అదిరిపోయే సంగీతం ఇచ్చి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే ఇప్పటివరకూ కోలీవుడ్‌పైనే ఫోకస్ ఉంచిన అనిరుధ్ ప్రస్తుతం దానిని టాలీవుడ్‌పైకి మరల్చినట్లు కనిపిస్తోంది. దీంతో ఇక్కడి మ్యూజిక్ డైరెక్టర్లకు కష్టాలు తప్పవన్న చర్చ మెుదలైంది.
ఆ చిత్రాలతో తెలుగులో క్రేజ్!
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో నేరుగా ‘అజ్ఞాతవాసి’, ‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’, ‘యూటర్న్’ వంటి చిత్రాలు చేశాడు. ఆయా సినిమాల్లో మ్యూజిక్ పెద్ద హిట్ అయినప్పటికీ అనిరుధ్ గురించి టాలీవుడ్‌లో పెద్దగా చర్చ జరగలేదు. అయితే రీసెంట్‌గా ‘విక్రమ్’, ‘జైలర్’, ‘జవాన్’ చిత్రాలతో అతడి పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోయింది. ముఖ్యంగా అతడిచ్చిన నేపథ్య సంగీతానికి యూత్ ఫిదా అయ్యారు. ఆయా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడంతో అనిరుధ్ మ్యూజిక్‌ను తెలుగు ఆడియన్స్ సైతం బాగా ఎంజాయ్ చేశారు. రిపీట్ మోడ్‌లో అతడి పాటలు వింటూ సంగీతాన్ని అస్వాదించారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ వల్లే అనిరుధ్ ‘దేవర’ ప్రాజెక్ట్‌లో భాగమైనట్లు కూడా మేకర్స్ ఇటీవల తెలియజేశారు.
టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు!
‘దేవర’ సక్సెస్ తర్వాత టాలీవుడ్‌లో అనిరుధ్ పేరు బాగా వినిపిస్తోంది. మరోమారు థియేటర్లలో అతడి మ్యూజిక్ ఎంజాయ్ చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇది గమనించిన తెలుగు దర్శక నిర్మాతలు అనిరుధ్‌తో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అటు తెలుగులో వస్తోన్న ఆదరణ చూసి టాలీవుడ్‌లోనూ తన దూకుడు పెంచాలని అనిరుధ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా, ఇప్పటికే విజయ్ దేవరకొండ, గౌతం తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న ‘VD12’ ప్రాజెక్ట్‌కు అనిరుధ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే నాని - శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న సినిమాకు సైతం అనిరుధ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరికొందరు డైరెక్టర్లు కూడా తమ మూవీ కోసం అనిరుధ్‌ను సంప్రదిస్తున్నట్లు టాక్. రానున్న రోజుల్లో అరడజను ప్రాజెక్ట్స్ వరకూ తెలుగులో అనిరుధ్ చేయవచ్చని అంటున్నారు.
థమన్, దేవిశ్రీకి కష్టమేనా!
సంగీత దర్శకులు థమన్, దేవిశ్రీ ప్రసాద్ గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లుగా కొనసాగుతూ వస్తున్నారు. ఇండస్ట్రీలో రిలీజయ్యే 10 చిత్రాల్లో కనీసం 5-8 చిత్రాలకు వీరిద్దరే మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగు డైరెక్టర్ల తొలి రెండు ప్రాధాన్యాలుగా వీరిద్దరే ఉంటూ వచ్చారు. అటువంటి థమన్, దేవిశ్రీకి అనిరుధ్ రాకతో గట్టి పోటీ తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిన్న, మెున్నటి వరకూ టాలీవుడ్‌ను అంతగా ప్రాధాన్యత ఇవ్వని అనిరుధ్ ప్రస్తుతం తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టడం వారికి గట్టి ఎదురుదెబ్బేనని అభిప్రాయపడుతున్నారు. మరి అనిరుధ్ మ్యానియాను తట్టుకొని థమన్, దేవిశ్రీ ఏవిధంగా రాణిస్తారో చూడాలని పేర్కొంటున్నారు.
అవి క్లిక్ అయితే ఆపడం కష్టం!
రామ్‌చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఆ మూవీ నుంచి జరగండి జరగండి, రా మచ్చా మచ్చా పాటలు రిలీజ్ కాగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే పవన్ కల్యాణ్ ‘ఓజీ’ చిత్రానికి సైతం థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ‘హంగ్రీ చీతా’ రిలీజ్ చేసిన సాంగ్ పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. తాజాగా బాలయ్య-బోయపాటి నాలుగో చిత్రం ‘అఖండ 2’కి థమన్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. మరోవైపు దేవిశ్రీ చేతిలో ‘పుష్ప 2’ ప్రాజెక్ట్ ఉంది. ఇప్పటికే రిలీజైన పుష్ప టైటిల్ సాంగ్‌తోపాటు 'సూసేకి అగ్గిరవ్వ మాదిరి' పాటకు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. ఆయా ప్రాజెక్ట్స్ సక్సెస్ అయితే థమన్, దేవిశ్రీకి తిరుగుండదని చెప్పవచ్చు.
అక్టోబర్ 22 , 2024
రానా దగ్గుబాటి (Rana Daggubati) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
తెలుగు ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా.. తన నటనతో విలక్షణ నటుడిగా ఎదిగాడు రానా దగ్గుబాటి. కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళ్ భాషల్లో నటిస్తూ గుర్తింపు దక్కించుకున్నాడు. బాహుబలి1, బాహుబలి2, నేనేరాజు నేనే మంత్రి, లీడర్ చిత్రాల సక్సెస్ స్టార్ డం అందించాయి. తనదైన స్లాంగ్, మెనరిజంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు రానా దగ్గరయ్యాడు. తన నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రానా గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.
రానా అసలు పేరు?
రామానాయుడు
రానా ఎవరు?
తెలుగులో దిగ్గజ నిర్మాత అయిన డి.రామానాయుడు మనవడు, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కుమారుడు
రానా ఎత్తు ఎంత?
6 అడుగుల 2 అంగుళాలు
రానా ఎక్కడ పుట్టారు?
నిజామాబాద్
రానా వివాహం అయిందా?
మిహికా బజాజ్‌తో 2020లో పెళ్లి జరిగింది.
రానాకి ఇష్టమైన రంగు?
బ్లాక్
రానా తల్లిదండ్రుల పేరు
డి.సురేష్ బాబు, లక్ష్మి దగ్గుబాటి
రానా అభిరుచులు?
చెత్తను రీ సైక్లింగ్ చేయడం, బాక్సింగ్, ఫొటోగ్రఫి, వంటచేయడం వంటివి అతని అభిరుచులు
రానాకి ఇష్టమైన ఆహారం?
నాటు కోడి పులుసు
రానా అభిమాన నటుడు?
కమల్ హాసన్, అక్షయ్ కుమార్
రానాకు స్టార్ డం అందించిన సినిమాలు?
లీడర్, బాహుబలి సిరీస్, నేనేరాజు నేనే మంత్ర
రానా ఏం చదివాడు?
ఇండస్ట్రియల్ ఫొటోగ్రఫీలో డిగ్రీ చదివాడు
రానా ఎన్ని సినిమాల్లో నటించాడు?
2024 వరకు 22 సినిమాల్లో నటించాడు
రానా సినిమాకు ఎంత తీసుకుంటారు?
ఒక్కో సినిమాకి దాదాపు రూ.8కోట్ల వరకు తీసుకుంటున్నాడు.
https://www.youtube.com/watch?v=WHGxx6ganOY
రానా ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడు?
బాహుబలి2 చిత్రానికి గాను ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటుడి అవార్డును అందుకున్నాడు. అలాగే సైమా అవార్డుల్లో ఉత్తమ ప్రతినాయకుడు అవార్డులను బాహుబలి1,2 చిత్రాలు, భీమ్లానాయక్ సినిమాలకు గాను గెలుచుకున్నాడు.
మే 29 , 2024
Chiranjeevi Vijayashanthi: చిరంజీవి- విజయశాంతి జంటగా నటించిన చిత్రాలు ఎన్నో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి మరే హీరోయిన్‌తో తీయనన్ని సినిమాలు లెడీబాస్ విజయశాంతితో తీశాడు. వీరిద్దరి కాంబోలో మొత్తం 19 చిత్రాలు వచ్చాయి. 90వ దశకంలో వీరికి హిట్ పెయిర్ అనే పేరు ఉండేది. వీరి కాంబోలో చిత్రం విడుదలైందంటే థియేటర్లకు అభిమానులు పరుగులు తీసేవారు. చిరంజీవి- విజయశాంతి జంటగా నటించిన చిత్రాల్లో గ్యాంగ్ లీడర్, పసివాడి ప్రాణం, స్వయంకృషి, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి.
1. సంఘర్షణ
మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి తొలిసారి సంఘర్షణ చిత్రంలో నటించారు. మురళి మోహన్ రావు తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేసింది.
2. స్వయం కృషి
చిరంజీవి- విజయశాంతి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం స్వయంకృషి. ఈ సినిమాలో విజయశాంతి- చిరంజీవి పోటీపడి మరి నటించారు. భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. ఈ సినిమాను కళాతపస్వి కే.విశ్వనాథ్ డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
3. దేవాంతకుడు
వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఎస్ ఏ చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను జీవీ నారాయణరావు నిర్మించారు. కే చక్రవర్తి మ్యూజిక్ అందించారు.
4. మహానగరంలో మాయగాడు
చిరంజీవి- విజయశాంతి(Chiranjeevi and Vijayashanthi) కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఆశించినంతగా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. ఈ సినిమాను విజయ బాపినేడు డైరెక్ట్ చేశారు. మాగంటి రవింద్రనాథ్ చౌదరి నిర్మించారు.
5. ఛాలెంజ్
చిరంజీవి, విజయశాంతి జంటగా కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రంలో విజయశాంతితో పాటు సుహాసిని కూడా నటించింది.
6. చిరంజీవి
చిరంజీవి తన సొంత పేరుతో తెరకెక్కిన చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఈ చిత్రాన్ని సీవీ రాజేంద్రన్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో విజయశాంతితో పాటు భానుప్రియ కూడా నటించింది.
7. కొండవీటి రాజా
చిరు, విజయశాంతి, రాధ జంటగా నటించిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. 'కొండవీటి రాజా' సినిమాను దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు.
8. ధైర్యవంతుడు
చిరు, విజయశాంతి(Chiranjeevi and Vijayashanthi) కాంబోలో వచ్చిన 'ధైర్యవంతుడు' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఈ చిత్రాన్ని లక్ష్మీ దీపక్ డైరెక్ట్ చేశాడు.
9. చాణక్య శపథం
కే రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. చిరంజీవి, విజయశాంతి జంటకు పీడ కలను మిగిల్చింది.
10. పసివాడి ప్రాణం
చిరంజీవిని టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా చేసిన చిత్రం ఇది. తన తరం ఉన్న హీరోలతో ఉన్న పోటీని తట్టుకుని చిరంజీవి నంబర్ 1 గా నిలిచాడు. విజయశాంతితో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.
11. మంచి దొంగ
రాఘవేంద్ర రావు డైరెక్షన్ వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో విజయశాంతితో పాటు సుహాసిని నటించింది.
12. యముడికి మొగుడు
చిరంజీవి, విజయశాంతి (Chiranjeevi and Vijayashanthi) జోడిగా రవిరాజ పినిశెట్టి డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం 'యముడికి మొగుడు'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టైయింది.
13. యుద్ధ భూమి
మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి కాంబోలో వచ్చిన 'యుద్ధభూమి' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమాను కే రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేశారు.
14. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
చిరంజీవి, విజయశాంతి జంటగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రాన్ని ఏ కొదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు.
15. కొండవీటి దొంగ
చిరు, విజయశాంతి, రాధ కాంబోలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఏ కొదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు.
16. స్టువర్టుపురం పోలీస్ స్టేషన్
బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. యండమూరి వీరేంద్రనాథ్ డైరెక్షన్‌లో సినిమా రూపొందింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన విజయశాంతితో పాటు నిరోషా నటించింది.
17. గ్యాంగ్ లీడర్
చిరంజీవికి మెగాస్టార్ క్రేజ్‌ను సుస్థిరం చేసిన సినిమా గ్యాంగ్ లీడర్. ఈ చిత్రాన్ని విజయ బాపినీడు తెరకెక్కించారు. చిరు సరసన విజయశాంతి((Chiranjeevi and Vijayashanthi) హీరోయిన్‌గా నటించింది.
18. మెకానిక్ అల్లుడు
చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన చివరి చిత్రం ఇది. ఈ సినిమాలో నాగేశ్వరరావు చిరంజీవికి మామగా నటించారు. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను బి. గోపాల్ తెరకెక్కించారు.
19. రుద్ర నేత్ర
కే రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయింది. ఈ సినిమాలో చిరుకు జోడీగా విజయశాాంతి, రాధ నటించారు.
నవంబర్ 07 , 2023
Dev Mohan: సమంతను ఇంప్రెస్ చేసిన శాకుంతలం హీరో దేవ్ మోహన్‌కు ఇంత టాలెంటా?
శాకుంతలం చిత్రంలో సమంత సరసన నటించిన దేవ్ మోహన్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్‌లో చురుగ్గా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. దీంతో అసలు ఈ నటుడు ఎవరు? మన తెలుగు వ్యక్తియేనా? ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించాడు? అన్న ప్రశ్నలు సగటు సినీ ప్రేక్షకుడిలో నెలకొంది. ఈ నేపథ్యంలో దేవ్ మోహన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
కేరళలోని త్రిస్సూరు చెందిన దేవ్ మోహన్ 18 సెప్టెంబర్ 1992లో జన్మించాడు. విద్యాభ్యాసమంతా త్రిస్సూర్‌లోనే చేసిన దేవ్.. ఆ తర్వాత బెంగళూరుకు చెందిన ఓ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేశాడు. ఉద్యోగం చేస్తూనే దేవ్ మోడల్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈ క్రమంలోనే 2016లో మిస్టర్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్టుగా నిలిచాడు. 2020లో రజీనా అనే అమ్మాయిని దేవ్ పెళ్లి చేసుకున్నాడు.
2020 లో మళయాళం మూవీ 'సూఫీయుం సుజాతయుమ్' చిత్రం ద్వారా తొలిసారి దేవ్ మోహన్ సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇందులో ‘సూఫీ రోల్‌లో కనిపించి దేవ్ మెప్పించాడు. ఆ తర్వాత 2021లో పులి, పంత్రండు చిత్రాల్లో నటించి అందరిని ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో డైరెక్టర్ గుణశేఖర్ కంట్లో పడ్డ దేవ్ మోహన్ శాకుంతలం చిత్రంలో కీలక పాత్రను దక్కించుకున్నాడు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్యూ ఇచ్చిన దేవ్ పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ప్రశ్న: శాకుంతలం ఆఫర్ ఎలా వచ్చింది?
దేవ్: నిర్మాత నీలిమ నా ఫస్ట్ ఫిల్మ్ 'సూఫీయుం సుజాతయుమ్' చూశారు. నా నటను ఆమెకు నచ్చింది. శాకుంతలంలో దుశ్యాంత పాత్రకు నేను సరిపోతానని ఆమె ఫీలయ్యారు. దీంతో ఆమె నన్ను సంప్రదించారు. మెుదట ఏదో ప్రాంక్ చేస్తున్నారని భావించా. నీలిమ, డైరెక్టర్ గుణశేఖర్‌తో మాట్లాడిన తర్వాత నిజమని నిర్ధారించుకున్నా. ఇందులో చేయడం ద్వారా నా కల నేరవేరినట్లు భావిస్తున్నా.
ప్రశ్న: తెలుగు ఇండస్ట్రీ, గుణశేఖర్ గురించి మీకు అవగాహన ఉందా?
దేవ్: తెలుగు సినీ పరిశ్రమపై నాకు అవగాహన ఉంది. అల్లు అర్జున్ సినిమాలు మా దగ్గర (కేరళ) చాలా ఫేమస్. ఆర్య, హ్యాపీ సినిమాలు చూశాను. రీసెంట్‌గా వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి చూశాను. గుణశేఖర్ గారి ఒక్కడు, రుద్రమదేవి చిత్రాలు చూశాను. ఆయనో చాలా గొప్ప దర్శకులు.
ప్రశ్న. శాకుంతలం కోసం మీరు తీసుకున్న ట్రైనింగ్ ?
దేవ్: ఈ మూవీ కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్నా. రోజుకు రెండు గంటలు గుర్రపు స్వారీ చేసే వాడ్ని. తొలి రోజుల్లో చాలా కష్టంగా అనిపించింది. భుజం, వెన్ను నొప్పి వచ్చేది. క్రమంగా ఎంజాయ్ చేయడం ప్రారంభించా. గుర్రానికి బాగా కనెక్ట్ అయ్యి ట్రైనింగ్‌ను ఆస్వాదించాను.
ప్రశ్న. తెలుగులో డైలాగ్స్ చెప్పడానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు?
దేవ్: డైలాగ్స్‌ను డైరెక్టర్ నాకు వాయిస్ నోట్ పంపేవారు. నేను దాన్ని విని మలయాళంలో రాసుకునే వాడ్ని. షూటింగ్‌కు ముందు రోజు డైరెక్టర్‌ను కలిసి డైలాగ్ చెప్పేవాడ్ని. ఏమైనా తప్పు ఉంటే సరిచేసుకొని షూటింగ్‌లో డైలాగ్స్ చెప్పాను.
పూర్తి ఇంటర్యూ కోసం ఇక్కడ చూడండి..
https://youtu.be/TrcHf9vOscM
అవార్డులు దాసోహం...
అరంగేట్రం సినిమాలతోనే దేవ్ మోహన్ తన సత్తా ఎంటో నిరూపించుకున్నాడు. 'సూఫీయుం సుజాతయుమ్’ మూవీకి ‘ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్’లో ఉత్తమ నూతన నటుడు అవార్డు దక్కించుకున్నాడు. సమయం మూవీ అవార్డులోనూ ఉత్తమ అరంగేట్ర యాక్టర్‌గా దేవ్ మోహన్ ఎంపికయ్యాడు. అటు 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో బెస్ట్ డెబ్యూట్ మేల్ పురస్కారాన్ని దేవ్ అందుకున్నాడు.
దేవ్ మోహన్, రష్మిక మందన్నా జంటగా కొత్తగా రెయిన్‌బో చిత్రం తెరకెక్కబోతోంది. అక్కినేని అమల ఈ చిత్రం షూటింగ్‌ను క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఏప్రిల్ 7 నుంచి రెయిన్‌బో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. రొమాంటిక్ ఫాంటసీగా రూపొందనున్న ఈ సినిమాకు శాంతరూబన్ నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఏప్రిల్ 03 , 2023
Chiru Odela: చిరు - ఓదెల మూవీ స్టోరీ ఇదేనా .. డైరెక్టర్‌కు ఫ్యాన్స్ కండీషన్స్
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కొత్త ప్రాజెక్ట్ ఖరారైంది. తొలి చిత్రం 'దసరా'తో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఈ సినిమా (Chiru Odela) ను డైరెక్ట్ చేయనున్నారు. యంగ్ హీరో నాని ఈ చిత్రాన్ని సమర్పించనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్‌లో నెత్తురోడుతున్న చిరు చేతిని చూపించారు. దీంతో ఈ సినిమా చాలా వైలెంట్‌గా ఉండబోతుందని మేకర్స్ చెప్పకనే చెప్పారు. కమ్ బ్యాక్ తర్వాత చిరంజీవి నటించనున్న మోస్ట్ వైలెంట్ చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు మెుదలయ్యాయి. స్టోరీని కూడా ముందే ప్రిడిక్ట్ చేసేస్తున్నారు. ఈ మూవీ ఏ స్థాయిలో ఉండాలో ముందుగానే ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారు.
చిరు - ఓదెల స్టోరీ ఇదే!
మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల చిత్రాని (Chiru Odela)కి సంబంధించిన ప్రీలుక్ పోస్టులో ఆసక్తికర లైన్‌ను చిత్ర బృందం రాసుకొచ్చింది. 'అతడు హింసలో తన శాంతిని వెతుక్కుంటున్నాడు' అని ఆసక్తికర క్యాప్షన్ పెట్టింది. దీన్ని బట్టి చూస్తే ఇదో బిగ్ రివేంజ్ స్టోరీగా కనిపిస్తోంది. తనకు అన్యాయం చేసిన వారిపై మెగాస్టార్ చిరు కొదమసింహంలాగా ఈ సినిమాలో విరుచుకుపడతాడని దర్శకుడు చెప్పకనే చెప్పాడు. తన ఫ్యామిలీ లేదా సమూహం లేదా ప్రజలకు జరిగిన దారుణాలను చూసి కన్నెర్ర చేసిన ఓ సామాన్యుడు ఎలాంటి హింసాత్మక దారిని ఎంచుకున్నాడు? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రావొచ్చని నెటిజన్లతో పాటు ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
https://twitter.com/odela_srikanth/status/1864157520920817831
https://twitter.com/AlwaysRamCharan/status/1864173106480202135
ఫ్యాన్స్ ఏమంటున్నారంటే
మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ తర్వాత అతడి స్థాయికి తగ్గ సక్సెస్ రాలేదు. ‘ఖైదీ నంబర్ 150’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకున్న ఇండస్ట్రీ హిట్‌గా నిలవలేదు. ఈ నేపథ్యంలో చిరు-ఓదెల ప్రాజెక్ట్ ఊరమాస్ వైలెన్స్‌తో రానుండటంతో ఒక్కసారిగా మెగా ఆడియన్స్ దృష్టి దీనిపై పడింది. చిరు కెరీర్‌లో బిగ్గెస్ట్ మాస్ చిత్రాలుగా నిలిచిన ‘గ్యాంగ్ లీడర్’, ‘ముఠామేస్త్రీ’, ‘ఇంద్ర’ సరసన ఈ ప్రాజెక్ట్ నిలబడాలని కోరుకుంటున్నారు. చిరు బిగ్‌బాస్ చిత్రంలోని రగ్‌డ్ లుక్ షేర్ చేస్తూ ఆ విధంగా మెగాస్టార్‌ను మేకోవర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో వింటేజ్ చిరును మళ్లీ తీసుకురావాలని ఓదెలాకు విజ్ఞప్తి చేస్తున్నారు. 'దుమ్ము లేచిపోవాలి అన్న' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సాంగ్స్, డ్యాన్స్, కామెడీ పక్కన పెట్టి కంటెంట్‌పై దృష్టి సారించాలని కోరుతున్నారు. తమ నమ్మకాన్ని నిలబెట్టి బెస్ట్ మూవీ ఇవ్వాలని సూచిస్తున్నారు.
https://twitter.com/JohnWick_fb/status/1864188176165654619
చిరంజీవి స్ఫూర్తితో..
మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ బిగ్ ఫ్లాట్‌ఫామ్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఈ జనరేషన్ హీరోలు, డైరెక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఆయనే స్ఫూర్తి. ఈ విషయం పలు సందర్భాల్లో వ్యక్తమైంది కూడా. చిరు తాజా ప్రాజెక్ట్‌ను నిర్మించనున్న యంగ్ హీరో నాని కూడా చిరుకి బిగ్ ఫ్యాన్. చిరు స్ఫూర్తితోనే తాను పెరిగానని, ఆయన సినిమా టికెట్ల కోసం గంటల తరబడి లైన్లలో నిల్చున్నానని ప్రీ లుక్ పోస్టర్‌ను షేర్ చేస్తూ నాని పేర్కొన్నాడు. అటువంటి చిరంజీవి చిత్రాన్ని సమర్పిస్తున్నందుకు తన జీవితం పరిపూర్ణమైందని చెప్పారు. కాగా ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. ఇది వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలోనే 'ది ప్యారడైజ్' అనే సినిమాలో నటిస్తున్నాడు.
https://twitter.com/NameisNani/status/1863954922926137824
2025 సమ్మర్ బరిలో..
ప్రస్తుతం చిరంజీవి - వశిష్ట కాంబోలో ‘విశ్వంభర’ (Viswambhara) రూపొందుతోంది. ఈ చిత్రం 2025 సమ్మర్‌లో రానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాలి. జనవరి 10న రాబోతున్నట్లు గతంలోనే విశ్వంభర టీమ్ అనౌన్స్ చేసింది. అయితే తనయుడు రామ్ చరణ్ (Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కోసం చిరు వెనక్కి తగ్గారు. దీంతో గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలో నిలవగా ‘విశ్వంభర’ సమ్మర్‌కు పోస్టుపోన్ అయింది. 2025 మే (Viswambhara Release Date)లో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, గతంలో చిరు నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ సినిమాల తరహాలో సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్‌గా ‘విశ్వంభర’ రూపొందుతోంది.
డిసెంబర్ 04 , 2024
HBD Priyanka Mohan: ‘నన్ను తీసుకొని తొందరపడ్డారేమో’.. నేరుగా డైరెక్టర్‌నే అడిగేసిన ప్రియాంక మోహన్!
దక్షిణాదికి చెందిన ప్రముఖ హీరోయిన్లలో ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఒకరు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడిన ఆమె ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. సూర్య, ధనుష్, నాని, శివ కార్తికేయన్, జయం రవి వంటి స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం పవన్ పక్కన 'ఓజీ' సినిమాలో నటిస్తూ అందరి కళ్లు తనవైపు తిప్పుకుంది. కాగా, ఇవాళ ప్రియాంక మోహన్ పుట్టిన రోజు (HBD Priyanka Mohan). 29వ సంవత్సరంలోకి ఈ అమ్మడు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె కెరీర్‌లోని ఆసక్తికర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1995 నవంబర్ 20న కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రియాంక మోహన్ (HBD Priyanka Mohan) జన్మించింది. ఆమె అక్కడే విధ్యాబ్యాసం చేసింది. బయలాజికల్ ఇంజనీర్‌గా పట్టా అందుకుంది.
ప్రియాంక అమ్మ కన్నడిగ కాగా ఆమె తండ్రిది తమిళ నేపథ్యం. దీంతో కన్నడతో పాటు తమిళ భాషపైనా ప్రియాంకకు పట్టు వచ్చింది.
ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే ప్రియాంక పలు నాటకాలు వేసింది. ఆ సమయంలోనే రెండు, మూడు ప్రకటనల్లోనూ నటించింది.
ఆ సమయంలోనే ఫ్రెండ్స్ అంతా కలిసి డబ్బులు వేసుకొని మరి తనతో సినిమా తీసేందుకు సిద్ధమయ్యారని ప్రియాంక ఓ ఇంటర్వూలో రివీల్ చేసింది.
అలా చేసిన తన ఫస్ట్ కన్నడ సినిమా 'ఒందు కథే హెళ్లా' అని ప్రియాంక (HBD Priyanka Mohan) స్పష్టం చేసింది. అయితే ఈ సినిమా చేస్తున్న సంగతి ఇంట్లో అస్సలు చెప్పలేదట.
రిలీజయ్యాక అందులో ప్రియాంకను చూసి కుటుంబ సభ్యులు చాలా షాకయ్యారట. కానీ ఒక్క మాట కూడా అనలేదని, పైగా ప్రోత్సహించారని ప్రియాంక చెప్పింది.
నటనపై ఆసక్తి ఉనప్పటికీ సినిమాల్లోకి రావాలని ప్రియాంక ఎప్పుడు అనుకోలేదట. మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కలలు కన్నదట.
ఇండస్ట్రీలోకి రాకపోయుంటే ఈపాటికి మంచి కార్పోరేట్ సంస్థలో పని చేస్తూ ఉండేదానిని ప్రియాంక (HBD Priyanka Mohan) చెప్పింది.
నాని 'గ్యాంగ్ లీడర్స్' సినిమాతోనే ప్రియాంక తెలుగు తెరపై అడుగుపెట్టింది. తొలి రోజు షూటింగ్‌లో లక్ష్మీ, శరణ్య వంటి దిగ్గజ నటులను చూసి ప్రియాంక చాలా టెన్షన్‌కు గురైందట.
పెద్ద నటులతో చేసేంత అర్హత తనకు ఉందా అని ఆలోచించిందట. వెంటనే దర్శకుడు విక్రమ్ వద్దకు వెళ్లి 'బాగా ఆలోచించే నన్ను తీసుకున్నారా.. తొందరపడ్డారేమో' అని అనేసినట్లు ప్రియాంక తెలిపింది.
చిన్నప్పటి నుంచి ప్రియాంకకు సూర్య అంటే చాలా ఇష్టం. హీరో సూర్యతో కలిసి 'ఈటీ'లో నటించే ఛాన్స్ రావడంతో ఎంతో సంతోషించినట్లు ఈ అమ్మడు తెలిపింది. షూటింగ్ పూర్తయ్యాక సూర్య గిఫ్ట్ పంపిస్తే దానిని ఇన్‌స్టాలో పోస్టు చేసి మరి ఈ భామ మురిసిపోయింది.
ప్రియాంక చాలా మృధుస్వభావి. ఎక్కడకు వెళ్లినా చాలా తక్కువగా మాట్లాడతారు. దీని వల్ల ఆమెకు స్నేహితులు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు.
హీరోయిన్లు నిత్యా మీనన్, అనుష్క, నజ్రియా అంటే ప్రియాంకకు ఎంతో అభిమానం. వారి నటన తనకు ఎంతో ఇష్టమని పలు సందర్భాల్లో ప్రియాంక చెప్పింది.
సాధారణంగా షూటింగ్ గ్యాప్ దొరికితే ఏ హీరోయిన్ అయినా వెంటనే విహారానికి వెళ్లిపోతారు. కానీ ప్రియాంక (HBD Priyanka Mohan) అలా కాదు.
తీరిక సమయాల్లో ఇంట్లోనే హాయిగా విశ్రాంతి తీసుకుంటుందట. లేదంటే నచ్చిన పనులు చేస్తూ ఫ్రీ టైమ్‌ను పూర్తిగా ఆస్వాదిస్తుందంట. అప్పుడప్పుడు విహారయాత్రకు వెళ్తుంది.
పొద్దున్నే లేవాలంటే ప్రియాంకకు చాలా కష్టంగా ఉంటుందట. కెరీర్ తొలినాళ్లలో వ్యాయమం చేయడానికి కూడా చాలా బద్దకించేదానినని ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చెప్పింది.
View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial)
చికెన్ వంటకాలను ప్రియాంక (HBD Priyanka Mohan) బాగా చేస్తుందట. ఏ టైప్ చికెన్ డిష్ కావాలన్న చాలా రుచికరంగా చేసేస్తానని ఓ సందర్భంలో ఈ అమ్మడు తెలిపింది.
ఇక పొద్దున్నే కప్పు కాఫీ పడాల్సిందేనని ఈ అమ్మడు (HBD Priyanka Mohan) చెప్పింది. కాఫీ లేకుండా తన డే అస్సలు స్టార్ట్ కాదని చెపుకొచ్చింది.
తెర వెనుక తాను ఎలా ఉంటుందో సినిమాల్లోనూ అలాగే ఉండేందుకు ఈ అమ్మడు ప్రయత్నిస్తోంది. స్కిన్‌షోలకు దూరంగా సంప్రదాయ పాత్రలకే ప్రాధాన్యం ఇస్తోంది.
తెలుగులో ఇప్పటివరకూ ‘గ్యాంగ్ లీడర్’తో పాటు ‘శ్రీకరం’, రీసెంట్‌గా ‘సరిపోదా శనివారం’ చిత్రాలు చేసింది. ప్రస్తుతం పవన్‌తో 'ఓజీ'లో నటిస్తోంది.
అటు తమిళంలో శివకార్తికేయన్‌తో చేసిన 'డాక్టర్', 'డాన్'.. ధనుష్‌తో చేసిన ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి.
నవంబర్ 20 , 2024
Unstoppable 4: బాలయ్యతో తన వీక్‌నెస్ చెప్పిన బన్నీ.. పెద్ద సమస్యే ఇది!
అల్లు అర్జున్ (Allu Arjun) ఇటీవల బాలకృష్ణ (Balakrishna) అన్‌స్టాపబుల్ (Unstoppable 4) షోకి వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. అందులో పలు ఆసక్తికర విషయాలను బన్నీ పంచుకోగా అవి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఈ ఎపిసోడ్‌కు పార్ట్ 2 కూడా ఉంటుందని అహా వర్గాలు ప్రకటించాయి. తాజాగా పార్ట్ 2కి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో బన్నీ తన పిల్లలు అల్లు అర్హా, అల్లు అయాన్‌తో పాల్గొనడం విశేషం. అయితే తొలి ఎపిసోడ్‌లో లాగానే ఇందులోనూ పలు ప్రశ్నలకు బన్నీ సమాధానం ఇచ్చారు. అటు బన్నీ పిల్లలకు సైతం బాలయ్య క్యూట్ ప్రశ్నలు వేశారు. ఈ క్రమంలో తనకు సంబంధించిన వీక్‌నెస్‌ను బాలయ్య ఎదుట అల్లు అర్జున్ రివీల్ చేశాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం.
బన్నీ సమస్య ఏంటంటే?
బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable Season 4). ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో నాలుగో సీజన్ కూడా ఫుల్ జోష్‌తో అలరిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్‌తో బాలయ్య చేసిన ఇంటర్వ్యూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో సెకండ్ పార్ట్‌ను నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు ఆహా వర్గాలు ప్రకటించాయి. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో బన్నీ తనను ఎంతోకాలంగా వెంటాడుతున్న ఓ సమస్య గురించి ప్రస్తావించారు. 'నీలో నువ్వు మార్చుకుందాం అనుకుంటుంది ఏంటి?' అన్న బాలయ్య ప్రశ్నకు బన్నీ సమాధానం ఇస్తూ 'ఇకపై తొందరగా పడుకొని నాలుగున్నర, ఐదు గంటల కల్లా లేవాలి' అని చెప్తాడు. దీన్ని బట్టి లేటుగా పడుకోని పొద్దెక్కే వరకూ లేగకపోవడం బన్నీకి అలవాటని తెలుస్తోంది. దీనిని వీలైనంత త్వరగా మార్చుకోవాలని బన్నీ ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ ప్రయత్నంలో బన్నీ సక్సెస్ కావాలని మనమూ కోరుకుందాం.
https://twitter.com/i/status/1858729413354897916
బాలయ్యను ఫిదా చేసిన అర్హా!
అల్లు అర్జున్ (Allu Arjun) పార్ట్ 2 ఎపిసోడ్ (Unstoppable 4)లో అల్లు అర్హ (Allu Arha), అల్లు అయాన్ (Allu Ayaan) పాల్గొని సందడి చేశారు. ఇద్దరూ షోలో అడుగుపెడుతూనే బాలయ్య పాదాలకు నమస్కరించడం ప్రోమాలో చూడవచ్చు. ఈ క్రమంలో బాలయ్య వీళ్లకు తెలుగు వచ్చా? అని బన్నీని ప్రశ్నిస్తారు. వెంటనే అల్లు అర్హ 'అటజని కాంచె పద్యం' చెప్పి బాలయ్య సహా షోలో ఉన్న వారందరినీ ఆశ్చర్య పరిచింది. పదో తరగతి తెలుగు సిలబస్‌లో ఉన్న ఈ పద్యాన్ని గుక్క తిప్పుకోకుండా అర్హ చెప్పడంతో అందరూ మెచ్చుకుంటున్నారు. బాలయ్య సైతం అర్హను దగ్గరకు తీసుకొని అభినందించారు. బన్నీ తన వారసురాలికి తెలుగుపై పట్టు ఉండేలా ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1858769410934403111
అయాన్.. యానిమల్ హీరో టైపు!
ప్రోమోలో అల్లు అయాన్ (Allu Ayaan)ను బాలయ్య (Unstoppable 4) ఆసక్తికర ప్రశ్న అడుగుతారు. ‘నాన్నకు నీకంటే చెల్లి మీదే ప్రేమ ఎక్కువ కదా?’ అని అయాన్‌ను ప్రశ్నిస్తారు. అప్పుడు అయాన్ 'ఏం కాదు' అని జవాబిస్తాడు. దీంతో బన్నీ కలుగుజేసుకొని 'యానిమల్ సినిమాలో రణ్‌బీర్ టైపు తను' అని అయాన్ గురించి చెప్తాడు. నాన్నకు ఇబ్బంది కలుగుతుంటే అస్సలు తగ్గడని వ్యాఖ్యానిస్తాడు. ఈ మాట బాలయ్య విని “ఐకాన్ స్టార్ కు అమ్మ మొగుడు అయ్యేలా ఉన్నాడు” అంటాడు. అప్పుడు వెంటనే అయాన్ 'తగ్గేదే లే' అన్న పుష్ప మ్యానరిజాన్ని చూపించి అందరినీ నవ్వించాడు. మెుత్తం బన్నీ, అతని పిల్లలతో సెకండ్ ఎపిసోడ్ సరదా సరదాగా సాగిపోతుందని ప్రోమోను బట్టి తెలిసిపోతోంది.
స్టార్స్ గురించి ఏమన్నారంటే?
ఫస్ట్ ఎపిసోడ్ (Unstoppable 4)లో పలు హీరోలను స్క్రీన్‌పై చూపిస్తూ వారికి గురించి అభిప్రాయం ఏంటో చెప్పాలని బన్నీని బాలయ్య అడిగారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఫొటోను ప్రదర్శించగా బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ధైర్యం అంటే తనకు చాలా ఇష్టమని బన్నీ చెప్పారు. సొసైటీలో చాలా మంది లీడర్స్, బిజినెస్ మెన్స్‌ను దగ్గర నుంచి చూస్తుంటానని తెలిపారు. కానీ తాను లైవ్‌లో మాత్రం పవన్ కల్యాణ్ ధైర్యాన్ని చూస్తుంటానని ప్రశంసించారు. చాలా డేరింగ్ పర్సన్ అంటూ పవన్‌ను ఆకాశానికెత్తారు. మహేష్ బాబు (Mahesh Babu) గురించి మాట్లాడుతూ అందరూ అతడి అందం గురించే మాట్లాడతారని, కానీ అయన కమ్‌బ్యాక్స్ చాలా బాగుంటాయని పేర్కొన్నారు. ఇక ప్రభాస్ (Prabhas) గురించి ప్రస్తావిస్తూ అతడు ఆరడుగుల బంగారమని కొనియాడాడు. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) గురించి మాట్లాడుతూ ఈ జనరేషన్ హీరోల్లో వావ్ అనిపించే యాక్టర్ అంటూ వ్యాఖ్యానించాడు. ఈ జనరేషన్ హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ అంటే చాలా ఇష్టమని స్పష్టం చేశాడు.
https://twitter.com/pakkafilmy007/status/1857292801391628444
నవంబర్ 19 , 2024
Unstoppable 4: పవన్‌పై ప్రశ్న.. ఆ విషయంలో నేనే నెం.1: బన్నీ
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పాపులర్ టాక్ షో 'అన్‌స్టాపబుల్' సీజన్ 4 (Unstoppable Season 4) విజయవంతంగా కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ (Aha)లో ఏపీ సీఎం చంద్రబాబు, దుల్కర్ సల్మాన్, సూర్య ఎపిసోడ్లు రిలీజై ట్రెండింగ్‌లో దూసుకెళ్లాయి. తాజాగా మరో స్టార్ హీరోకు సంబంధించిన ఎపిసోడ్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఆయనెవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). ఇందులో సినీ హీరోల గురించి బాలయ్య కొన్ని ప్రశ్నలు వేయగా బన్నీ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్ జరుగుతున్న వేళ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
పవన్‌పై ఏమన్నారంటే?
బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable Season 4). ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో నాలుగో సీజన్ కూడా ఫుల్ జోష్‌తో అలరిస్తోంది. తాజాగా 4వ ఎపిసోడ్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇందులో పలు హీరోలను స్క్రీన్‌పై చూపిస్తూ వారికి గురించి అభిప్రాయం ఏంటో చెప్పాలని బాలయ్య అడిగారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఫొటోను ప్రదర్శించగా బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ధైర్యం అంటే తనకు చాలా ఇష్టమని బన్నీ చెప్పారు. సొసైటీలో చాలా మంది లీడర్స్, బిజినెస్ మెన్స్‌ను దగ్గర నుంచి చూస్తుంటానని తెలిపారు. కానీ తాను లైవ్‌లో మాత్రం పవన్ కల్యాణ్ ధైర్యాన్ని చూస్తుంటానని ప్రశంసించారు. చాలా డేరింగ్ పర్సన్ అంటూ పవన్‌ను ఆకాశానికెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బన్నీ వ్యాఖ్యలను పవన్ అభిమానులు స్వాగతిస్తున్నారు.
https://twitter.com/pakkafilmy007/status/1857292801391628444
‘ఆ స్టార్‌తో మల్టీస్టారర్ చేయాలి’
పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు స్టార్ హీరోల ఫొటోలు స్క్రీన్‌పై రాగా వారిపైనా అల్లు అర్జున్ (Allu Arjun) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ముందుగా మహేష్ బాబు (Mahesh Babu) గురించి మాట్లాడుతూ అందరూ అతడి అందం గురించే మాట్లాడతారని, కానీ అయన కమ్‌బ్యాక్స్ చాలా బాగుంటాయని పేర్కొన్నారు. ఫెయిల్యూర్స్ తర్వాత వచ్చే ఆయన కమ్‌బ్యాక్స్ చాలా బాగుంటాయన్నారు. ఇక ప్రభాస్ (Prabhas) గురించి ప్రస్తావిస్తూ అతడు ఆరడుగుల బంగారమని కొనియాడాడు. తాము మంచి స్నేహితులమని చెప్పుకొచ్చాడు. తాను ప్రతీ ఏటా క్రిస్మస్ ట్రీ పెడతానని తెలిసి తనకోసం యూరప్ నుంచి డెకరేషన్ ఐటెమ్స్ తీసుకొచ్చారని తెలిపాడు. అటు బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) గురించి మాట్లాడుతూ ఈ జనరేషన్ హీరోల్లో వావ్ అనిపించే యాక్టర్ అంటూ వ్యాఖ్యానించాడు. తాను రణ్‌బీర్‌తో మల్టీస్టారర్ చేస్తే అద్భుతంగా ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు.
ఈ తరం ఫేవరేట్ హీరో
ఈ జనరేషన్ హీరోల్లో నీకు ఇష్టమైన హీరో ఎవరని బాలయ్య ప్రశ్నించగా బన్నీ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ తరం వాళ్లందరూ బాగా నటిస్తున్నారని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) యాక్టింగ్ తనకు బాగా నచ్చిందని అన్నాడు. తర్వాత నవీన్ పొలిశెట్టి చేసిన జాతిరత్నాలు మూవీ చూసి పడి పడి నవ్వుకున్నట్లు తెలిపాడు. సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), విష్వక్ సేన్ (Vishwak Sen), అడివిశేష్ (Adivi Sesh)లు బాగా నటిస్తున్నట్లు ప్రశంసించాడు. ఒకరి పేరు చెప్పమంటే మాత్రం సిద్ధూ (Siddhu Jonnalagadda) అని స్పష్టం చేశాడు. మరోవైపు ఇండస్ట్రీలో టాప్ డ్యాన్సర్ నువ్వే అనుకుంటున్నావా? అని బాలయ్య ప్రశ్నించగా ‘నిజమే సర్’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. బాలకృష్ణ గారు చెప్పారు కాబట్టి నేనే నవంబర్ వన్ డ్యాన్సర్ అంటూ చెప్పుకొచ్చాడు.
'ఇండస్ట్రీలో నాకు నేనే పోటీ'
ప్రస్తుతం ఇండస్ట్రీలో నీకు ఎవరు పోటీ అని అల్లు అర్జున్‌ను బాలయ్య ప్రశ్నించారు. దీనికి బన్నీ సమాధానం ఇస్తూ పుష్పా 2 టైటిల్ సాంగ్‌లోనూ లిరిక్‌ను చదివాడు. 'నన్ను మించి ఎదిగినవాడు ఇంకోడు ఉన్నాడు చూడు.. ఎవరంటే అది రేపటి నేనే. నాను నేనే పోటీ. అలాగే నేను అందరినీ గౌరవిస్తాను' అంటు బన్నీ సమాధానం ఇచ్చారు. ఇక త్రివిక్రమ్, సుకుమార్‌లో ఎవరు ఎక్కువ ఇష్టం అంటూ బాలయ్య ప్రశ్నించారు. దానిపై బన్నీ మాట్లాడుతూ 'చేస్తున్న దర్శకుడు ఒకరు.. చేయనున్న దర్శకుడు ఒకరు. నేను ఇప్పుడే చెప్పాను కదా.. ఏ సినిమా చేస్తే. ఆ చిత్ర బృందం నా ఫేవరేట్ అని. అందుకే సుకుమార్ అంటే ఇష్టం' అని ఆన్సర్ ఇచ్చాడు.
https://twitter.com/i/status/1857314917340397862
నవంబర్ 16 , 2024
Bandla Ganesh: ‘టికెట్ల రేటు పెంపునకే సీఎం కావాలి’.. ప్రభాస్, తారక్‌కు బండ్ల గణేష్ చురకలు!
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) ఏదోక కామెంట్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. న్యూస్ చానళ్లు, సోషల్ మీడియా వేదికగా పలు రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు బాహాటంగా మద్దతు తెలుపుతూ హాట్ టాపిక్‌గా మారుతుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో బండ్ల గణేష్ సంచలన పోస్టు పెట్టారు. శుక్రవారం (నవంబర్ 9) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలను టార్గెట్ చేశారు. సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి మాత్రమే సీఎం కావాలని సినీ ప్రముఖులపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
టాలీవుడ్‌పై బండ్ల గణేష్ ఫైర్!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నవంబర్ 8న ఘనంగా పుట్టిన రోజు జరుపుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రమంత్రులు, కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఒకరిద్దరు మినహా తెలుగు ఇండస్ట్రీ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ రేవంత్ రెడ్డికి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన బండ్ల గణేష్ సినీ పరిశ్రమపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్టు క్షణాల్లో వైరల్‌గా మారింది.
https://twitter.com/ganeshbandla/status/1855087509103165519
తారక్, ప్రభాస్‌కు చురకలు?
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలుగు చిత్ర పరిశ్రమకు మధ్య గ్యాప్ వచ్చినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే మెయిన్‌గా టికెట్ల రేటు పెంపు విషయాన్ని బండ్ల గణేష్ ప్రస్తావించడం చర్చకు తావిస్తోంది. స్టార్ హీరోలు ప్రభాస్, జూ.ఎన్టీఆర్‌లను టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’, తారక్ చేసిన ‘దేవర’ చిత్రాలు టికెట్ పెంపునకు తెలంగాణ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకున్నాయి. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం సానుకూలంగా స్పందించింది. అయితే శుక్రవారం రేవంత్ రెడ్డి బర్త్‌డే సందర్బంగా తారక్, ప్రభాస్ నుంచి ఎలాంటి విషింగ్ పోస్టు రాలేదు. దీంతో బండ్ల గణేష్ వారిద్దరిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
విష్ చేసిన స్టార్స్ వీరే!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) శుభాకాంక్షలు తెలిపారు. 'రానున్న సంవత్సరం మీకు అద్భుతంగా ఉండాలి. ప్రజాసేవలో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా' అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అటు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సైతం రేవంత్ రెడ్డిని విష్ చేశారు. దేవుడు మీకు ఆరోగ్యాన్నివ్వాలని, రాష్ట్రాన్ని మరింత సుభిక్షం వైపు నడిపించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ramcharan) సైతం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కూడా రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. రేవంత్ రెడ్డి లీడర్‌షిప్‌ను ప్రశంసించాడు.
https://twitter.com/KChiruTweets/status/1854736624749625361
https://twitter.com/PawanKalyan/status/1854776671339262428
https://twitter.com/AlwaysRamCharan/status/1854859851509141522
https://twitter.com/urstrulyMahesh/status/1854818024030929039
నంది అవార్డుల విషయంలో రగడ!
ఈ ఏడాది జనవరిలో గద్దర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించారు. రేవంత్ ఈ ప్రకటన చేసి ఆరేడు నెలలు గడిచినా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ముందడుగు పడలేదు. ఈ క్రమంలో ఓ వేదికపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, సినీ పెద్దల మౌనంపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, అతడి ఫ్యామిలీపై కాంగ్రెస్ మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలు టాలీవుడ్‌ను కుదిపేశాయి. ఈ వరుస ఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో సినీ పెద్దలు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
https://twitter.com/RamMohanINC/status/1752717581834916020
నవంబర్ 09 , 2024
Jithender Reddy Review: నక్సలిజంలోని చీకటి కోణాన్ని బయటపెట్టిన ‘జితేందర్ రెడ్డి’.. హిట్టా? ఫట్టా?
నటీనటులు: రాకేష్ వర్రే, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్, ఛత్రపతి శేఖర్ తదితరులు..
దర్శకత్వం: విరించి వర్మ
సంగీతం: గోపి సుందర్
సినిమాటోగ్రఫీ: వి.ఎస్. జ్ఞాన శేఖర్
ఎడిటర్: రామకృష్ణ అర్రం
నిర్మాత: ముదుగంటి రవీందర్ రెడ్డి
విడుదల తేదీ: నవంబర్ 7, 2024
రాకేశ్ వర్రే కథానాయకుడిగా చేసిన లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ చిత్రం ‘జితేందర్‌రెడ్డి’ (Jithender Reddy). ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ దర్శకుడు విరించి వర్మ ఈ సినిమాను రూపొందించారు. 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తీర్చిదిద్దారు. ఆర్‌ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవకుడిగా పనిచేసిన వ్యక్తుల జీవిత కథను బేస్ చేసుకొని రూపొందించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? ఇప్పుడు తెలుసుకుందాం.
కథేంటి
1980లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. జితేందర్ రెడ్డి (రాకేష్ వర్రే) ఫ్యామిలీ మెుదటి నుంచి RSS స్వయంసేవకులు. అలాంటి ఫ్యామిలీలో పుట్టిన జితేందర్ రెడ్డి చిన్నపుడే RSS సిద్దాంతాలకు ఆకర్షితుడు అవుతాడు. దేశం, ధర్మం, ప్రజలు కోసం ఏదైనా చేయాలని తపన పడుతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు 18 ఏళ్లు కూడా నిండని ఓ కుర్రాడిని నక్సలైట్లు అన్యాయంగా చంపేస్తారు. ఈ ఘటనతో కాలేజ్ స్టూడెంట్ అయిన జితేందర్ రెడ్డి కామ్రేడ్స్‌పై రగిలిపోతాడు. ప్రజల శ్రేయస్సు కోసం గన్ను పట్టుకున్నామని చెప్పుకునే నక్సలైట్స్ దారి తప్పారని గ్రహిస్తాడు. ఆ తర్వాత నక్సలైట్స్‌పై జితేందర్ రెడ్డి ఎలాంటి పోరాటం చేశాడు? విద్యా వ్యవస్థల్లో బలంగా నాటుకుపోయిన PDSUకి ధీటుగా ABVB ఎలా ఎదురొడ్డి నిలిచింది? కాలేజ్ స్టూడెంట్ లీడర్‌గా, ఆ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనే నాయకుడిగా జితేందర్ రెడ్డి చేసిన సేవలు ఏంటి? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
జితేందర్ రెడ్డి పాత్రలో రాకేష్ వర్రే చక్కగా ఒదిగిపోయాడు. RSS భావజాలం కలిగిన వ్యక్తిగా ఆకట్టుకున్నాడు. ప్రజల్లో చైతన్యం కల్పించే సీన్స్‌లో మంచి నటన కనబరిచాడు. ఇప్పటివరకూ చేసిన చిత్రాలతో పోలిస్తే నటన పరంగా ఎంతో మెచ్యూరిటీ ప్రదర్శించాడు. మొత్తంగా రాకేష్ వర్రే ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడని చెప్పవచ్చు. రాకేష్ తర్వాత PDSU నేతగా చేసిన నటుడి యాక్టింగ్ బాగుంది. స్వయం సేవకుడిగా సుబ్బరాజు నటన, నక్సలైట్ లీడర్‌గా ఛత్రపతి శేఖర్ యాక్టింగ్ మెప్పిస్తుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
తెలుగు తెరపై ఇప్పటి వరకు నక్సలైట్స్‌పై పాజిటివ్ యాంగిల్‌లోనే సినిమాలు తెరకెక్కాయి. కానీ తొలిసారి నక్సలిజం వెనకున్న చీకటి కోణాన్ని దర్శకుడు విరించి వర్మ ధైర్యంగా చూపించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం చేపట్టే ప్రగతికారక పనులకు వారు ఏ విధంగా అడ్డుగా నిలుస్తున్నారో కళ్లకు కట్టారు. అప్పట్లో అట్టడగు వర్గాల కోసం పాటుపడిన స్వయంసేవకులను నక్సలైట్స్ ఏ విధంగా కాల్చి చంపారో చూపించారు. కామ్రేడ్స్ ఆగడాలను చూసి చలించిపోయిన హీరో వారిపై చేసే పోరాటాన్ని ఎంతో ఇంట్రస్టింగ్‌గా తెరకెక్కించారు. ఇంటర్వెల్ వరకూ కాలేజీ రాజకీయాలు చూపించిన దర్శకుడు ఆ తర్వాత మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ యాంగిల్‌ను టచ్ చేశాడు. నిజమైన రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో కూడా జితేందర్ రెడ్డి పాత్ర ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఓవరాల్‌గా తను చెప్పాలనుకున్న పాయింట్‌ను సూటిగా, స్పష్టంగా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే ఫస్ట్ హాఫ్ స్లోగా సాగడం, కమర్షియల్ హంగులు లేకపోవడం, ప్రిడిక్టబుల్‌గా స్టోరీ ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు.
సాంకేతికంగా..
టెక్నికల్ విషయాలకు వస్తే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు కాస్త ఇబ్బంది పెట్టినా క్లైమాక్స్‌లో వచ్చే ఓ సాంగ్ గుండెలను హత్తుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కథ, కథనంరాకేష్ వర్రే నటనసంగీతం
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్ స్లోగా ఉండటంకమర్షియల్ హంగులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 3/5
నవంబర్ 07 , 2024
Bhagyashri Borse: పీకల్లోతు ప్రేమలో భాగ్యశ్రీ బోర్సే? ప్రియుడితో డేటింగ్ చేస్తున్నట్లు హింట్స్!
యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) పేరు ఇటీవల పెద్ద ఎత్తున టాలీవుడ్‌లో మార్మోగింది. తెలుగులో ఆమె ఫస్ట్ ఫిల్మ్ ‘మిస్టర్ బచ్చన్’ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైనప్పటికీ బాగ్యశ్రీ ప్రదర్శన మాత్రం మెప్పించింది. ఇటీవల దుల్కర్ సల్మాన్‌తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించి తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. ఇదిలా ఉంటే భాగ్యశ్రీ ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రియుడితో కలిసి డేటింగ్ కూడా చేస్తున్నట్లు సమాచారం. ఈ అమ్మడు లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టును పరిశీలిస్తే ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
భాగ్యశ్రీ ప్రేమలో పడిందా?
ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే తన ప్రియుడితో కలిసి విహార యాత్రలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే 'ప్రేమ.. ఎలాంటి హెచ్చరిక లేకుండా పుడుతుంది' అంటూ ఆమె పెట్టిన ఇన్‌స్టా పోస్టు ఒక్కసారిగా వైరల్‌గా మారింది. తనకు బాగా దగ్గరైన వ్యక్తి ఇచ్చిన పూల బొకేను షేర్ చేస్తూ దానికి లవ్ సింబల్‌ను కూాడా ఈ అమ్మడు జత చేసింది. మంచుతో నిండిన కొండలోయలను ఇష్టమైన వాడితో వీక్షిస్తూ ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. తాము ప్రేమ పక్షులం అని అర్థం వచ్చేలా రెండు బర్డ్స్ ఉన్న ఫొటోను షేర్ చేసి ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చింది. ఓ వ్యక్తితో కలిసి సూర్యస్తమయాన్ని వీక్షిస్తూ అతడి ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. చివరిగా ‘ఈ వీక్‌లో కొంత భాగం’ అంటూ లవ్ ఎమోజీ, ఓ పక్షి ఫొటోను పెట్టింది. దీంతో భాగ్యశ్రీ ప్రేమలో పడిపోయిందంటూ నెటిజన్లు జోరుగా పోస్టులు పెడుతున్నారు.
View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse)
ఫ్లాప్ వచ్చినా తగ్గని క్రేజ్!
‘మిస్టర్ బచ్చన్’ సినిమా టైంలో భాగ్యశ్రీ బోర్సే పేరు ఎంతగా ట్రెండ్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైన దగ్గర్నుంచి ఆమె సోషల్ మీడియా దృష్టినీ ఆకర్షిస్తూనే వచ్చింది. సినిమా నుంచి తొలి పాటను అనౌన్స్ చేసినపుడు కొన్ని విజువల్స్ చూసి కుర్రాళ్లకు మతిపోయింది. అయితే ఊహించని విధంగా ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్ కావడంతో భాగ్యశ్రీ అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. తొలి చిత్రమే దారుణ పరాజయాన్ని మిగిల్చడంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన దూకుడు కాస్త తగ్గించింది. తాజాగా 'కాంత' సినిమాలో హీరోయిన్‌గా ఎంపికై తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. సరైన హిట్ లభిస్తే ఈ అమ్మడు స్టార్ హీరోయిన్‌గా మారిపోవడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
దుల్కర్‌కి జోడీగా భాగ్యశ్రీ
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరో, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కాంత’ (Kaantha). ‘నీలా’ ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ (Selvamani Selvaraj) దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగా ఇటీవల పూజా కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి అందంగా చీరకట్టుకొని మరి భాగ్యశ్రీ హాజరయ్యింది. ఆమె లుక్స్‌కు మరోమారు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆమె మంచి ఛాన్స్ కొట్టేశారంటూ పోస్టులు పెట్టారు. వేఫరెర్ ఫిలిమ్స్, స్పిరిట్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో రానా దగ్గుబాటి ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.
https://twitter.com/DQsWayfarerFilm/status/1833013939837276196
రౌడీ బాయ్‌తోనూ..
విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న 'VD12' చిత్రంలోనూ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ అమ్మడు షూటింగ్‌లోనూ చురుగ్గా పాల్గొంటోంది. ఈ సినిమాలో విజయ్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఓ సాధారణ పోలీసు కానిస్టేబుల్ అయిన హీరో, మాఫియా లీడర్‌గా ఎలా ఎదిగాడన్న కాన్సెప్ట్‌తో 'VD12' రాబోతున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. ఇక నేచురల్ స్టార్ నాని (Hero Nani) హీరోగా సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో రానున్న మూవీలోనూ హీరోయిన్‌గా భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు టాక్ ఉంది.
భాగ్యశ్రీ నేపథ్యం ఇదే..
భాగ్యశ్రీ బోర్సేది మహారాష్ట్రలోని పుణే. హిందీ చిత్రం 'యారియాన్ 2'తో ఆమె వెండితెరకి పరిచయమైంది. అంతకుముందు చాలా యాడ్స్‌లో మోడల్‌గా పని చేసింది. ఈమె చేసిన యాడ్స్‌లో క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ బాగా ఫేమ్ తెచ్చి పెట్టింది. ఇక ‘యారియాన్ 2’లో ఈ బ్యూటీ యాక్టింగ్‌కి ఫిదా అయిన డైరెక్టర్ హరీశ్ శంకర్ ‘మిస్టర్ బచ్చన్’లో ఛాన్స్ ఇచ్చారు. అలా టాలీవుడ్‌లో బజ్ క్రియేట్ చేసిన ఈ అమ్మడు మరిన్ని ఆఫర్లను దక్కించుకుంది. చూడటానికి చాలా క్యూట్‌గా ఉండే భాగ్యశ్రీ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటుంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇస్తూ సినిమాలకు అతీతంగా తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.
అక్టోబర్ 23 , 2024
EXCLUSIVE: టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సైడ్ రోల్స్.. ఓ లుక్కేయండి!
సాధారణంగా సినిమాలో హీరో, హీరోయిన్ పాత్రలే ప్రేక్షకులకు ఎక్కువగా గుర్తుంటాయి. విలన్ నటన బట్టి ఆ పాత్రనూ ఆదరించేవారు ఉంటారు. అయితే కొన్నిసార్లు క్రేజ్‌తో సంబంధం లేకుండా సైడ్ పాత్రలు కూడా ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తుంటాయి. తెరపై ఆ పాత్ర సాగుతున్నంతసేపు తమ వెంటే ప్రేక్షకుల అటెన్షన్‌ను తీసుకువెళ్తుంటాయి. టాలీవుడ్‌లో మరో పదేళ్లు గడిచినా ఆ పాత్రలకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గదని చెప్పవచ్చు. ఇంతకీ ఆ పాత్రలు ఏవి? వాటి ప్రత్యేకతలు ఏంటి?
[toc]
సత్యరాజ్ (బాహుబలి)
బాహుబలిలో ప్రభాస్, రాణా పాత్రల తర్వాత అందరికీ గుర్తుండిపోయే రోల్ కట్టప్ప. దర్శకుడు రాజమౌళి ఈ పాత్రను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాడు. కట్టప్ప పాత్ర లేకుండా బాహుబలి చిత్రాన్ని అసలు ఊహించలేము. సీనియర్ నటుడు సత్యరాజ్ (Sathyaraj) ఆ పాత్రలో పరాకయప్రవేశం చేసి మరి నటించాడు.
ప్రకాష్ రాజ్ (అతడు)
మహేష్ కెరీర్‌లో వచ్చిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘అతడు’ ఒకటి. ఇందులో మహేష్ బాబు (Mahesh Babu) తర్వాత ఆ స్థాయిలో ఆకట్టుకునే పాత్ర ప్రకాష్ రాజ్‌ది. సీబీఐ ఆఫీసర్‌గా అతడి అందరినీ అలరించాడు. కేసు దర్యాప్తు సందర్భంగా ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్స్, ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
https://youtu.be/Kk93JgAM7wA?si=5saRnFWzIEeDf3fR
సుకుమారి (మురారి)
మహేష్ బాబు హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘మురారి’ (Murari) చిత్రం అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులోని శబరి పాత్రలో సీనియర్ నటి మెప్పించింది. మహేష్ జాతకంలో ఉన్న గండం వల్ల అతడికి ఏం జరుగుతుందో అని భయపడుతూ సినిమాలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. హీరో కోసం చివర్లో ప్రాణ త్యాగం చేసి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది.
https://youtu.be/3GrsswRGUaA?si=TgwJ6hZRa0rtRu18
శ్రీకాంత్ (శంకర్‌దాదా MBBS)
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా చేసిన ‘శంకర్ దాదా MBBS’ చిత్రం అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసింది. ఇందులో ‘ఏటీఎం’ అనే పాత్ర ఎంతో కీలకమైనది. సీనియర్ నటుడు శ్రీకాంత్ (Srikanth) ఈ పాత్రలో కనువిందు చేశాడు. చిరుకి రైట్‌గా ఉంటూ సందర్భానుసరంగా వచ్చే సీన్లలో నవ్వులు పూయించాడు. ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ‘శంకర్ దాదా జిందాబాద్’లోనూ శ్రీకాంత్ ఈ తరహా పాత్రనే చేసి అదరగొట్టాడు.
https://youtu.be/QHdvEYMIOao?si=K5wkBfT-Y1gUFlZ3
రాజేంద్ర ప్రసాద్ (ఆ నలుగురు)
డబ్బు మాత్రమే సంతోషాన్ని ఇవ్వదని నిరూపించిన చిత్రం ‘ఆ నలుగురు’ (Aa Naluguru). ఇందులో రఘు రామయ్య పాత్రలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) నటించాడు. నైతిక విలువలు కలిగిన ఓ పత్రికా ఎడిటర్‌గా, ఎంత కష్టం వచ్చినా న్యాయంగా వ్యవహరించే ఆ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసి మరి నటించారు.
https://youtu.be/AYZjTMg2EbM?si=iOSHIruH84KVRJ-0
శ్రీహరి (నువ్వొస్తానంటే నేనొద్దంటానా)
సిద్ధార్థ్ - త్రిష జంటగా డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో నటుడు శ్రీహరి (Srihari)కి మంచి పాత్ర దక్కింది. హీరోయిన్‌కు అన్నగా ఆయన ఎంతో అద్భుతంగా నటించాడు. అన్న అంటే ఎలా ఉండాలో ఈ పాత్ర ద్వారా తెలియజేశారు. క్లైమాక్స్‌లో హీరో చేసిన హత్యను తనపైన వేసుకొని జైలుకు వెళ్లే దృశ్యాలు ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి.
https://youtu.be/WNCwQvHa1w4?si=f2K-X2pSMJSzfQtd
గొల్లపూడి మారుతిరావు (లీడర్)
దిగ్గజ నటుడు గొల్లపూడి మారుతిరావు (Gollapudi Maruti Rao).. ‘లీడర్’ సినిమాలో ఓ అద్భుతమైన క్యామియో చేశారు. సీనియర్ పొలిటిషన్‌గా హీరో రాణాతో ఆయన చెప్పే డైలాగ్స్ ప్రస్తుత రాజకీయాలకు అద్దం పడతాయి. ఆ సీన్‌పై మీరు ఓ లుక్కేయండి.
https://youtu.be/AjLNxJCU1Cs?si=nNVLqa_4N5Md1O8y
అభినవ్ గోమఠం (ఈ నగరానికి ఏమైంది)
తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న హాస్య నటుల్లో అభినవ్ గోమఠం ఒకరు. ఈ నగారానికి ఏమైంది చిత్రం ద్వారా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. కౌషిక్ పాత్రలో తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు.
https://youtu.be/qAluEZGqhh8?si=xRLufanS8xSuqf9h
సుహాసిని (నువ్వు నాకు నచ్చావ్)
వెంకటేష్ - ఆర్తి అగర్వాల్ జంటగా చేసిన ఈ చిత్రంలో సీనియర్ నటి సుహాసిని (Suhasini) హీరోయిన్‌కు అత్తగా మెప్పించింది. అత్తింటిలో కొందరి ఆడవారి కష్టాలు ఎలా ఉంటాయో తన డైలాగ్స్ ద్వారా కళ్లకు కట్టింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో హీరోయిన్ తండ్రిని పెళ్లికి ఒప్పించే సీన్ అదరహో అనిపిస్తుంది.
https://youtu.be/XlXM5l95rEg?si=pepiyzzgooAEmbwe
అక్టోబర్ 22 , 2024
Chiranjeevi: చిరు, బాలయ్య మల్టీస్టారర్.. స్టోరీ ఏంటో తేల్చేసిన బోయపాటి శ్రీను!
టాలీవుడ్ దిగ్గజ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ముందు వరుసలో ఉంటారు. ఐదు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 60 ఏళ్లు పైబడినా కూడా ఒళ్లు హూనమయ్యేలా కష్టపడుతూ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. అయితే ఇటీవల బాలయ్య 50 సంవత్సరాల సినీ ఇండస్ట్రీ ఫంక్షన్‌లో పాల్గొన‌్న చిరంజీవి తమ మల్టీస్టారర్ గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. కథ సిద్ధం చేయాలంటూ దర్శకుడు బోయపాటి శ్రీనుకు సవాలు సైతం విసిరారు. అయితే తాజాగా చిరు-బాలయ్య మల్టీస్టారర్‌పై బోయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.
‘కథ రాయకపోతే వేస్ట్’
చిరంజీవి - బాలయ్య మల్టీసారర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కథ రెడీ చేస్తే తాము చేయడానికి సిద్ధమంటూ ఇరువురు హీరోలు ఓపెన్ ఛాలెంచ్ చేసిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే డైరెక్టర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి బోయపాటి పేరు ప్రస్తావించడంతో ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ఆయనే చేస్తారన్న అంచనాలు అందరిలోనూ ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే తాజాగా చిరు - బాలయ్య మల్టీస్టారర్‌పై దర్శకుడు బోయపాటి మాడ్లాడారు. ఓ ఛానెల్‌కు సంబంధించిన అవార్డ్ ఫంక్షన్‌లో పాల్గొన్న ఆయనకు ఈ మల్టీస్టారర్‌పై ప్రశ్న ఎదురైంది. దీనికి బోయపాటి బదులిస్తూ 'చిరు, బాలయ్యను పెట్టుకొని వారికి కథ రాయకపోతే వేస్ట్. వారిద్దరే తన సినిమాకి టైటిల్' అంటూ క్రేజీ కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
https://twitter.com/i/status/1847303422111801807
బోయపాటే ఎందుకు?
బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ఇండస్ట్రీ నుంచి చాలామంది డైరెక్టర్లు హాజరయ్యారు. అయితే వారిని కాదని బోయపాటి శ్రీను పేరునే చిరు ప్రస్తావించడానికి ఓ బలమైన కారణమే ఉంది. ప్రస్తుత డైరెక్టర్లలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌గా బోయపాటి ఉన్నారు. పైగా బాలకృష్ణ లాంటి సీనియర్ నటుడితో ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను తీశారు. దీంతో బోయపాటి అయితేనే ఈ భారీ మల్టీస్టారర్‌కు న్యాయం చేయగలరని చిరు భావించి ఉండవచ్చు. అందుకే ‘ఓయ్ బోయపాటి.. ఛాలెంజ్’ అంటూ ముందుగా ఆయన పేరునే ప్రస్తావించినట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో సీనియర్ డైరెక్టర్ వై.వీ.యస్. చౌదరి, ఇతర కథా రచయితలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ పరోక్షంగా చిరు సూచించారు.
https://twitter.com/i/status/1830519890249421017
ఊరమాస్ స్టోరీ పక్కానా?
మాస్ ఆడియన్స్ పల్స్ ఏంటో బోయపాటి శ్రీనుకు బాగా తెలుసు. చిరు, బాలయ్యలకు సైతం మాస్ ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. చిరు హీరోగా చేసిన గ్యాంగ్ లీడర్, ముఠామేస్త్రీ, ఇంద్ర వంటి చిత్రాలు మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించాయి. అటు బాలయ్య చేసిన ఫ్యాక్షనిస్ట్ చిత్రాలు సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, నరసింహనాయుడు కూడా C సెంటర్లలో అద్భుత విజయాన్ని అందుకున్నాయి. అటువంటి హీరోలు ఒకే సినిమాలో నటిస్తే ఇక కథ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో చిరు, బాలయ్య యాక్షన్‌కు సరిపోయే దీటైనా ఊరమాస్ కథను బోయపాటి సిద్ధం చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటివరకూ ఏ డైరెక్టర్ చూపించని విధంగా వీరిద్దరిని బోయపాటి చూపిస్తారని అంటున్నారు.
బోయపాటికి పోటీగా వై.వి.ఎస్ చౌదరి!
‘ఇంద్ర’, ‘సమరసింహారెడ్డి’ సినిమాలను ఆధారంగా చేసుకొని చిరంజీవి, బాలయ్య పాత్రలను రాయడానికి తాను సిద్దమే అంటూ దర్శకుడు వైవీఎస్ చౌదరీ ముందుకు వచ్చినట్టు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ఆయన మెుదలుపెట్టినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. వైవీఎస్ చౌదరీ విషయానికి వస్తే ఆయన నందమూరి కుటుంబానికి వీరాభిమాని. అంతేగాదు ఆ ఫ్యామిలీతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. బాలయ్య, హరికృష్ణతో ఆయన గతంలో సినిమాలు కూడా తీశారు. అయితే కొద్దికాలంగా ఇండస్ట్రీకి దూరమైన ఆయన తాజాగా కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తన కథతో చిరు. బాలయ్యను ఒప్పించి మరోమారు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని వైవీఎస్ చౌదరి భావిస్తున్నారట. మరి వీరిద్దరిలో చిరు-బాలయ్య ఎవరి కథను ఫైనల్ చేస్తారో చూడాలి.
‘అఖండ 2’ తర్వాతే..
టాలీవుడ్‌లో బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. వీరి కాంబోలో వచ్చిన ‘సింహా’ (Simha), ‘లెజెండ్’ (Lezend), ‘అఖండ’ (Akhanda) చిత్రాలు ఏ స్థాయి విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. తాజాగా వీరి కాంబోలో నాలుగో ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్దమైంది. ‘అఖండ 2’ అనే టైటిల్‌తో ఇటీవలై కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ కూడా చేశారు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. చిత్రబృందంతోపాటు బాలకృష్ణ కుమార్తెలు నారా బ్రాహ్మణి (Nara Brahmani), తేజస్విని (Tejaswini), ఇతర కుటుంబసభ్యులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. అయితే చిరు బాలయ్య మల్టీస్టారర్‌కు బోయపాటిని ఫైనల్ చేసినా ‘అఖండ 2’ పూర్తయిన తర్వాతే ఆ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనుంది.
https://twitter.com/TeluguChitraalu/status/1846413204492374156
అక్టోబర్ 19 , 2024
Chiranjeevi Remake Movies: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీమెక్ చిత్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో దాదాపు 50 రీమేక్ చిత్రాల్లో నటించి, తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఈ రీమేక్ చిత్రాలు చిరంజీవి మెగాస్టార్ స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఆయన కెరీర్‌లో రీమేక్ చిత్రాల ప్రాధాన్యతను సుదీర్ఘంగా చూస్తే, అందులో కొన్ని డిజాస్టర్ అయ్యినా, కొన్ని ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి.
[toc]
భోళా శంకర్
ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ చిత్రం వేదాళంకు రీమేక్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భోళా శంకర్ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కించారు.
గాడ్ ఫాదర్
చిరంజీవి మలయాళ సూపర్‌హిట్ "లూసిఫర్" రీమేక్‌లో నటించారు. తెలుగులో "గాడ్ ఫాదర్" టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా 2022లో దసరా కానుకగా విడుదలైంది. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన "లూసిఫర్" సూపర్ హిట్ కాగా, "గాడ్ ఫాదర్" తెలుగులో మోస్తరు విజయాన్ని సాధించింది.
ఖైదీ నంబర్ 150
చిరంజీవి కమ్ బ్యాక్ మూవీగా ఖైదీ నంబర్ 150 వచ్చింది. ఇది తమిళ సూపర్‌హిట్ "కత్తి"కు రీమేక్‌గా రూపొందింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.
అంజి
చిరంజీవి నటించిన "అంజి" సినిమా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. హాలీవుడ్ మూవీ "ఇండియానా జోన్స్" ప్రేరణతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద తక్కువ వసూళ్లు మాత్రమే సాధించింది.
శంకర్ దాదా జిందాబాద్
ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన "శంకర్ దాదా జిందాబాద్" హిందీ సూపర్‌హిట్ "లగే రహో మున్నాభాయ్" రీమేక్‌గా రూపొందింది. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
శంకర్ దాదా M.B.B.S
"మున్నాభాయ్ MBBS" హిందీ చిత్రానికి రీమేక్‌గా "శంకర్ దాదా MBBS" రూపొందింది. చిరంజీవి నటనతో ఈ సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది.
ఠాగూర్
తమిళం "రమణ"కి రీమేక్‌గా వచ్చిన "ఠాగూర్" చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను వి.వి. వినాయక్ దర్శకత్వం వహించారు.
మృగరాజు
హాలీవుడ్ మూవీ "ది హోస్ట్ అండ్ ది డార్క్‌నెస్" ప్రేరణతో రూపొందిన "మృగరాజు" గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
స్నేహం కోసం
కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన "స్నేహం కోసం" తమిళ సినిమా "నట్పుక్కగ" రీమేక్. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా విజయం సాధించలేకపోయింది.
హిట్లర్
మలయాళంలో మమ్ముట్టి నటించిన "హిట్లర్" రీమేక్ గా వచ్చిన ఈ సినిమా చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. చిరంజీవి నటనతో ఈ సినిమా ఆయన అభిమానులను అలరించింది.
ముగ్గురు మొనగాళ్లు
కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన "ముగ్గురు మొనగాళ్లు" హిందీ "యాదోంకి బారాత్" చిత్రానికి రీమేక్. ఈ సినిమా చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం అయినప్పటికీ, కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించలేదు.
మెకానిక్ అల్లుడు
"శ్రీరంగనీతులు" అనే సినిమా ప్రేరణతో రూపొందిన "మెకానిక్ అల్లుడు" సినిమా సరైన విజయాన్ని సాధించలేకపోయింది. చిరంజీవి నటనకు మంచి మార్కులు వచ్చినా, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు.
ఆజ్ కా గూండా రాజ్
"గ్యాంగ్ లీడర్" హిందీ రీమేక్‌గా రూపొందిన "ఆజ్ కా గూండా రాజ్" హిందీలో సూపర్‌హిట్‌గా నిలిచింది.
ఘరానా మొగుడు
"అనురాగ అరాలితు" కన్నడ సినిమాకు రీమేక్‌గా వచ్చిన "ఘరానా మొగుడు" చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది.
పసివాడి ప్రాణం
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘పసివాడి ప్రాణం’ సినిమా.. మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన ‘పూవిన్ను పుతియా పుంతెన్నెల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘పసివాడి ప్రాణం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
చక్రవర్తి
రవిరాజా పినిశెట్టి దర్శకత్వలో తెరకెక్కిన ‘చక్రవర్తి’ సినిమా తమిళంలో శివాజీ గణేషణ్ హీరోగా తెరకెక్కిన ‘జ్ఞాన ఓలి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
ఆరాధన
భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆరాధన’ మూవీ.. తమిళంలో భారతీరాజా డైరెక్షన్‌లో సత్యరాజ్ హీరోగా నటించిన ‘కవితోరా కవితైగల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
దొంగ మొగుడు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘దొంగ మొగుడు’ సినిమా హాలీవుడ్ మూవీ ‘ట్రాడింగ్ ప్లేసెస్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘దొంగ మొగుడు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ తర్వాత కొన్నేళ్లుకు ఇదే కాన్సెప్ట్‌తో ‘రౌడీ అల్లుడు’సినిమాగా కొద్దిగా మార్పులు చేర్పులతో తెరకెక్కింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
వేట
ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేట’ సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ ‘ది కౌంట్ ఆఫ్ మొంటే క్రిష్టో’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్
యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ‘స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్’ సినిమా.. హిందీలో ఓంపురి హీరోగా తెరకెక్కిన ‘అర్ధ్ సత్య’ మూవీని తెలుగు నేటివిటికి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
రాజా విక్రమార్క
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘రాజా విక్రమార్క’ సినిమా తమిళంలో ప్రభు హీరోగా తెరకెక్కిన ‘మై డియర్ మార్తాండన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
ప్రతిబంధ్
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తొలి బాలీవుడ్ మూవీ ‘ప్రతిబంధ్’ . ఈ చిత్రం తెలుగులో కోడిరామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన ‘అంకుశం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం హిందీలో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.
త్రినేత్రుడు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘త్రినేత్రుడు’ సినిమా హిందీలో నసీరుద్దీన్ షా హీరోగా తెరకెక్కిన ‘జల్వా’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఇక చిరు హీరోగా నటించిన ‘త్రినేత్రుడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
ఖైదీ నంబర్ 786
విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ నంబర్ 786’ సినిమా తమిళంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన ‘అమ్మన్ కోవిల్ కిళావలే’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
అడవి దొంగ
చిరంజీవి హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అడవి దొంగ’ సినిమా హాలీవుడ్‌తో పాటు హిందీలో తెరకెక్కిన ‘టార్జాన్’ సినిమాను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తన తెర పేరు ‘చిరంజీవి’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. కన్నడలో రవిచంద్రన్ హీరోగా తెరకెక్కిన ‘నానే రాజ’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
నాగు
తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాగు’ సినిమా.. హిందీలో షమ్మి కపూర్ హీరోగా తెరకెక్కిన ‘తీస్రి మంజిల్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది.
ఇంటిగుట్టు
చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఇంటిగుట్టు’ సినిమా ఎంజీఆర్ హీరోగా నటించిన ‘పనక్కర కుటుంబం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది.
దేవాంతకుడు
దేవాంతకుడు సినిమా కన్నడలో అంబరీష్ హీరోగా తెరకెక్కిన ‘గెలుపు నన్నదే’ పినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం మంచి విజయాన్నే నమోదు చేసింది.
హీరో
విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘హీరో’ సినిమా హాలీవుడ్ సినిమా ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ సినిమా ప్రేరణతో తెరకెక్కించారు.
‘ఖైదీ’
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ’ సినిమా హాలీవుడ్‌లో సిల్వోస్టర్ స్టాలిన్ హీరోగా తెరకెక్కిన ‘ఫస్ట్ బ్లడ్’ సినిమా ప్రేరణ తీసుకొని తెలుగులో కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా చిరంజీవిని స్టార్ హీరోల జాబితాలో చేర్చింది.
అభిలాష
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అభిలాష’ మూవీని హాలీవుడ్ మూవీ ‘ది మ్యాన్ హు డేర్‌డ్’తో పాటు ‘బియైండ్ ఏ రీజనబుల్ డౌట్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ప్రేమ పిచ్చోళ్లు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమ పిచ్చోళ్లు’ సినిమా హిందీలో మిథున్ చక్రబర్తి హీరోగా నటించిన ‘షౌకిన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
బంధాలు అనుబంధాలు
‘బంధాలు అనుబంధాలు’ సినిమా కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా తెరకెక్కిన ‘అవళ హెజ్జే’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది.
మంచు పల్లకీ
వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంచు పల్లకీ’ మూవీ తమిళంలో సుహాసిన ప్రధాన పాత్రలో నటించిన పాలైవోనా సోలై’ సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
యమ కింకరుడు
యమ కింకరుడు ’ సినిమా హాలీవుడ్ మూవీ ‘డర్టీ హ్యారీ’ తో పాటు ‘మ్యాడ్ మాక్స్’ మూవీలను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది.
పట్నం వచ్చిన పతివ్రతలు
పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా కన్నడలో హిట్టైన 'పట్ణణక్కే బంధ పత్‌నియారు' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
చట్టానికి కళ్లులేవు
చిరంజీవి హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'చట్టానికి కళ్లులేవు' సినిమా.. తమిళంలో విజయకాంత్ హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'సట్టమ్ ఓరు ఇరుత్తారాయ్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం తెలుగులో కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది.
47 రోజులు
కే.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన '47 రోజులు' సినిమాను ఒకేసారి తమిళం, తెలుగు భాషల్లో రూపొందించారు. తమిళంలో '47 నాట్కల్' పేరుతో రూపొందితే, తెలుగులో '47 రోజులు' పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాతో చిరంజీవి తమిళ ఇండస్ట్రీలో తన తొలి అడుగులు వేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
మొగుడు కావాలి
చిరంజీవి హీరోగా కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన 'మొగుడు కావాలి' సినిమా.. హిందీలో సంజీవ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'మంచలి' సినిమాకు రీమేక్. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ కాన్సెప్ట్ ఆధారంగా సాయి ధరమ్ తేజ్ 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' అనే సినిమాను చేశారు.
మోసగాడు
కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్ బాబు, చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించిన 'మోసగాడు' సినిమా.. హిందీలో రాజ్‌కపూర్, శతృఘ్న సిన్హా నటించిన 'ఖాన్ దోస్త్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.
ప్రేమ తరంగాలు
'ప్రేమ తరంగాలు' సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రలలో రూపొందిన 'ముఖద్దర్ కా సికందర్' సినిమాకు రీమేక్. తెలుగులో బిగ్‌బీ పాత్రలో కృష్ణంరాజు, వినోద్ ఖన్నా పాత్రలో చిరంజీవి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
పున్నమి నాగు
'పున్నమి నాగు' సినిమా కన్నడలో హిట్టైన 'హున్నిమేయ రాత్రియల్లి' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది.
ఇది కథ కాదు
కే.బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, చిరంజీవి, శరత్ బాబు, జయసుధ ప్రధాన పాత్రలతో రూపొందిన 'ఇది కథ కాదు' సినిమా.. తమిళంలో కమల్ హాసన్, రజినీకాంత్, రవికుమార్ ప్రధాన పాత్రలతో రూపొందిన 'అవర్‌గళ్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో చిరంజీవి నెగిటివ్ రోల్‌లో మెప్పించారు.
మనవూరి పాండవులు
బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు, మురళీ మోహన్, చిరంజీవి హీరోలుగా రూపొందిన 'మనవూరి పాండవులు' సినిమా.. కన్నడలో 'పాడువారళ్లి పాండవరు' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
సెప్టెంబర్ 25 , 2024
Megastar Chiranjeevi Dancing Hits: చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కల్పించిన టాప్ 15 సాంగ్స్ ఇవే!
టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, బి.గోపాల్, కోదండరామిరెడ్డి, గుణశేఖర్, బాబీతోపాటు నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, సురేశ్ బాబు, జెమిని కిరణ్, మైత్రి రవిశంకర్, తమ్మారెడ్డి భరద్వాజ, కేఎస్ రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవికి అభినందనలు తెలిపారు. చిరుతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
డ్యాన్స్‌కు కేరాఫ్!
‘పునాది రాళ్లు’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మెగాస్టార్, కెరీర్ ప్రారంభంలో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొన్నారు. వాటన్నింటిని తన టాలెంట్‌తో అధిగమించారు. నటనతో పాటు డ్యాన్స్‌లోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. డ్యాన్స్ అంటే చిరు.. చిరు అంటే డ్యాన్స్ అనే స్థాయిలో టాలీవుడ్‌పై బలమైన ముద్ర వేశారు. 1980 నుంచి 2005 మధ్య దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు డ్యాన్స్‌లో రారాజుగా వెలుగొందారు. చిరుతో డ్యాన్స్ అంటే కొరియోగ్రాఫర్లే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. రీఎంట్రీ తర్వాత 60 ప్లస్ వయసులోనూ అదిరిపోయే డ్యాన్స్‌లు చేస్తూ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నారు. డ్యాన్స్‌లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన నేపథ్యంలో చిరంజీవి అద్భుతమైన డ్యాన్స్ చేసిన టాప్-15 సాంగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
రగులుతోంది మొగలిపొద (ఖైదీ)
చిరంజీవిని సుప్రీం హీరోను చేసిన చిత్రం ఖైదీ. ఈ మూవీ సక్సెస్‌తో చిరంజీవి రాత్రికి రాత్రి స్టార్‌గా మారిపోయారు. ముఖ్యంగా ఇందులోని ‘రగులుతుంది మొగలిపొద’ సాంగ్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. చిరులోని గొప్ప డ్యాన్సర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. మాధవితో కలిసి చిరు వేసిన స్టెప్స్ ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. పాములా మెలికలు తిరుగుతూ చిరు వేసిన స్టెప్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ సాంగ్ షూట్ తర్వాత దాదాపు వారం రోజుల పాటు చిరు ఒళ్లు నొప్పులతో బాధపడ్డారట. ఈ సాంగ్ ఓసారి మీరూ చూసేయండి.
https://www.youtube.com/watch?v=nyxj1TAjn8Q
చక్కని చుక్క (పసివాడి ప్రాణం)
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘పసివాడి ప్రాణం’ చిత్రం అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలోని ‘చక్కని చుక్కలా’ సాంగ్ ద్వారా చిరు కొత్త ట్రెండ్‌ను సృష్టించారు. ఈ సాంగ్ ద్వారానే చిరు బ్రేక్ డ్యాన్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ పాటలో హీరోయిన్ విజయశాంతితో చిరు వేసిన స్టెప్స్‌ను నాటి తరం ఎప్పటికీ మరిచిపోలేదు.
https://www.youtube.com/watch?v=q5aetbezCqM
నవ్వింది మల్లె చెండు (అభిలాష)
‘అభిలాష’ చిత్రంలోని ఈ పాటలో చిరు హుషారైన స్టెప్పులతో ఆకట్టుకున్నారు. లవ్‌ను ప్రేయసి ఓకే చేస్తే ఆ ప్రియుడు సంతోషం ఏ స్థాయిలో ఉంటుందో చిరు చూపించారు. ఇళయరాజా సంగీతంలో వచ్చిన ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను కట్టిపడేసింది.
https://www.youtube.com/watch?v=82hUDmPYazk
హే పాప (త్రినేత్రుడు)
‘త్రినేత్రుడు’లోని ‘హే పాప’ అంటూ వచ్చే సాంగ్‌లో చిరంజీవి మరోసారి తన బ్రేక్ డ్యాన్స్ స్కిల్స్‌ను చూపించారు. ఓ క్లబ్‌లోని బ్రేక్ డ్యాన్సర్‌కు సవాలు విసిరిమరి చిరు నృత్యం చేస్తాడు. హీరోయిన్ భానుప్రియ కూడా అదిరిపోయే స్టెప్పులతో చిరుకు సహకారం అందించింది. స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ అయిన ఆమె చిరుకు పోటీగా సాంగ్ చేసింది.
https://www.youtube.com/watch?v=1vOAj1HaG1Y
పదహరేళ్ల వయసు (లంకేశ్వరుడు)
‘లంకేశ్వరుడు’ మూవీలోని ‘పదహరేళ్ల వయసు’ పాటకు అప్పట్లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. క్లాప్ క్లాప్ అంటూ సాంగ్‌ను స్టార్ట్ చేసిన చిరు తన హుషారైన స్టెప్పులతో విజిల్స్ వేయించారు. ఈ సాంగ్‌లోని చిరు గెటప్ చాలా ఏళ్ల పాటు యువతను ఒక ఊపు ఊపింది. ఈ సాంగ్‌లో చిరు వేసిన స్టెప్స్ అభిమానులు ఎప్పుడు గుర్తుంచుకుంటారు. రీసెంట్‌గా ‘మత్తు వదలరా 2’ చిత్రంలో కమెడియన్ సత్య ఈ సాంగ్‌ను రిఫరెన్స్‌గా తీసుకొని స్టెప్పులు వేయడం విశేషం.
https://www.youtube.com/watch?v=fsnOGypjHI0
గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్
చిరంజీవి హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఇందులో గ్యాంగ్ లీడర్ అంటూ సాగే టైటిల్ సాంగ్‌లో చిరంజీవి వేసిన స్టెప్స్ అదిరిపోయాయి. ఇప్పటికీ ఆ పాట చూస్తే మెగా ఫ్యాన్స్ పూనకం వచ్చినట్లు ఊగిపోతారు.
https://www.youtube.com/watch?v=KUZ4e7t4u5k
స్టార్ స్టార్ మెగాస్టార్ (కొదమ సింహం)
కొదమ సింహం సినిమాలోని 'స్టార్ స్టార్ మెగాస్టార్' సాంగ్ చిరంజీవిని డ్యాన్సర్‌గా మరో మెట్టు ఎక్కించింది. సుప్రీం హీరో ట్యాగ్‌ను దాటి మెగా స్టార్ ట్యాగ్‌ను అందించింది. ఇందులో ఆద్యంతం కౌబాయ్ కాస్ట్యూమ్స్‌లో కనిపించిన చిరు తన యునిక్ స్టెప్పులతో అదరగొట్టారు. ముఖ్యంగా తలపై టోపీని ఉపయోగిస్తూ ఆయన చేసిన డ్యాన్స్ తెలుగులో ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. అప్పటివరకూ టోపీని ఉపయోగించి ఏ తెలుగు హీరో స్టెప్స్ వేయలేదు.
https://www.youtube.com/watch?v=cFKyIHvudzI
బంగారు కోడిపెట్ట (ఘరానా మొగుడు)
రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఘరానా మొగుడు’ చిత్రం చిరంజీవి ఇమేజ్‌ని ఆకాశానికి తీసుకెళ్లింది. ఈ సినిమాకు గాను రూ. కోటి రెమ్యునరేషన్ తీసుకుని దేశంలో ఈ ఘనత సాధించిన తొలి నటుడిగా చిరంజీవి చరిత్ర సృష్టించారు. ఇక ఇందులోని 'బంగారు కోడిపిట్ట' సాంగ్ ఏ స్థాయిలో సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుదేవా కంపోజ్ చేసిన ఈ సాంగ్‌లో డిస్కో శాంతిని టీజ్ చేస్తూ చిరు స్టెప్పులు వేశారు. డ్యాన్స్‌తో పాటు తన హావభావాలతో ఆకట్టుకున్నారు. చిరు కుమారుడు రామ్‌చరణ్ మగధీర చిత్రంలో ఈ సాంగ్‌ను రీమేక్ చేయడం విశేషం.
https://www.youtube.com/watch?v=hxvUiz6s4Gk
రూపుతేరా మస్తానా (రిక్షావోడు)
రిక్షావోడు చిత్రంలోని ‘రూపుతేరా మస్తానా’ మ్యూజిక్ ప్రియులకు పూనకాలు తెప్పిస్తుంది. సంగీత దర్శకుడు కోటీ ఇచ్చిన వెస్టర్న్ బీట్‌ను మ్యాచ్ చేస్తూ చిరు ఇరగదీశారు. మెలికలు తిరుగుతూ వెస్టర్న్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. హీరోయిన్ నగ్మాతో కలిసి మెస్మరైజ్ చేశారు.
https://www.youtube.com/watch?v=mugdo_VO9pY
నడక కలిసిన నవరాత్రి (హిట్లర్)
ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ‘హిట్లర్’ మూవీలోని నడక కలిసిన నవరాత్రి సాంగ్ సూపర్‌హిట్‌గా నిలిచింది. దీనికి లారెన్స్ కొరియోగ్రఫి చేశారు. ఈ పాటలో చిరు వేసిన స్టెప్స్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేశాయి. హీరోయిన్ రంభ చిరుతో పోటీపడి మరి డ్యాన్స్ చేయడం గమనార్హం.
https://www.youtube.com/watch?v=j2HY4G63qaE
ఈ పేటకు నేనే మేస్త్రీ (ముఠా మేస్త్రి)
ఈ సాంగ్‌లో చిరు వేసిన హుక్ స్టెప్స్ ఎవర్‌గ్రీన్ అని చెప్పవచ్చు. ఈ పేటకు నేనే మేస్త్రీ అంటూ చేతిలో టవల్‌తో బాడిని బెండ్ చేసి భుజాలు ఎగరేసే స్టెప్ చాలా మందికి పూనకాలు తెప్పించింది. ఈ సాంగ్ మెుత్తం చిరు లుంగీలోనే కనిపిస్తారు. తలకు టవల్ చుట్టుకొని మాస్ స్టెప్పులతో ఆద్యంతం అలరించాడు.
https://www.youtube.com/watch?v=oppz5I9KeQA
దాయి దాయి దామ్మ (ఇంద్ర)
‘ఇంద్ర’ సినిమాలోని దాయి దాయి దామ్మ సాంగ్ చిరంజీవిలోని డ్యాన్సింగ్ స్కిల్స్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది. ఇందులోని వీణ స్టెప్ చిరు కెరీర్‌లోనే ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచింది. లారెన్స్ కంపోజ్ చేసిన ఈ స్టెప్‌ను ఎంతో గ్రేస్‌తో చిరు చేశారు. అతి కష్టమైన ఆ స్టెప్‌ను అలవోకగా వేసి ఆశ్చర్యపరిచారు. ఈ స్టెప్‌ను ఇప్పటికీ చాలా మంది ట్రై చేస్తూ ఆనందిస్తుంటారు.
https://www.youtube.com/watch?v=39W78Hp4E8A
ఆటకావాలా పాటకావాలా (అన్నయ్య)
‘అన్నయ్య’ సినిమాలోని ‘ఆట కావాలా పాట కావాలా’ సాంగ్‌లో చిరు మాస్ స్టెప్పులతో ఉర్రూతలూగించారు. చిరు డ్యూయల్ రోల్‌లో కనిపించిన ఏకైక సాంగ్ ఇదే కావడం విశేషం. ఈ సాంగ్ అప్పట్లో ఎక్కడా చూసిన వినిపించేది.
https://www.youtube.com/watch?v=9NGgI8OHTLY
మన్మథ మన్మథ (ఠాగూర్)
వి.వి. వినాయక్ డైరెక్షన్‌లో చిరు హీరోగా వచ్చిన ‘ఠాగూర్’ చిత్రం తెలుగు రికార్డు విజయాన్ని అందుకుంది. ఇందులోని ‘మన్మథ మన్మథ మామ పుత్రుడా’ పాట అంతే స్థాయిలో ఆదరణ పొందింది. ఇందులో చిరు నిలబడి వేసే వీణ స్టెప్ మెస్మరైజ్ చేస్తుంది.
https://www.youtube.com/watch?v=FUnaQaxJNuQ
అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు (ఖైదీ నెంబర్ 150)
‘ఖైదీ నెంబర్ 150’ చిరంజీవి రీఎంట్రీ చిత్రంగా వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరు తనదైన స్టెప్పులతో ఈ సినిమాలో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ అంటూ చిరు వేసిన హుక్ స్టెప్ ఫ్యాన్స్‌ను మునుపటి రోజులకు తీసుకెళ్లింది. ఆ సాంగ్‌ను మరోమారు చూసి ఎంజాయ్ చేయండి.
https://www.youtube.com/watch?v=7jHMP7J6tRs
సెప్టెంబర్ 23 , 2024
Tollywood Directors: హీరోయిన్‌ను ఎలా చూపించాలో వీళ్లకి మాత్రమే తెలుసా?
సినిమాకు హీరో, హీరోయిన్ రెండు కళ్లు లాంటి వారు. గతంతో పోలిస్తే ఇప్పుడు హీరోయిన్లకు నటన పరంగా పెద్ద స్కోప్ దొరకడం లేదు. సినిమా మెుత్తం హీరో చుట్టూనే సాగేలా కొందరు దర్శకులు సినిమాలు తీస్తున్నారు. పాటల కోసం, అందచందాలను ఆరబోయటం కోసం మాత్రమే హీరోయిన్లు అన్నట్లు చూపిస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘లైగర్’, ‘మిస్టర్ బచ్చన్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలను గమనిస్తే హీరోయిన్ నటన కంటే వారి ఎక్స్‌పోజింగ్‌పైనే దర్శకులు ఎక్కువగా దృష్టిపెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే టాలీవుడ్‌లోని కొందరు యువ డైరెక్టర్లు మాత్రం హీరోయిన్లను ఒకప్పటిలా డిగ్నిటీగా చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ విషయంలో శేఖర్ కమ్ములాను ఫాలో అవుతూ సినీ లవర్స్ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారు చేసిన చిత్రాలేంటి? అందులో హీరోయిన్స్‌ను ఎలా చూపించారు? వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శేఖర్ కమ్ముల (Sekhar Kammula)
టాలీవుడ్‌లో సెన్సిబుల్ దర్శకుడు అనగానే ముందుగా శేఖర్ కమ్ముల గుర్తుకు వస్తారు. అందమైన ప్రేమ కథలను, ఆకట్టుకునే కుటుంబ కథలను తెరకెక్కించడంలో ఆయన దిట్ట. ఆయా సినిమాల కోసం ఎంచుకునే హీరోయిన్స్, వారిని ఆయన చూపించే విధానం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆనంద్, గోదావరి చిత్రాల్లో నటి కమలిని ముఖర్జీని ఎంత బాగా చూపించారో అందరికీ తెలిసిందే. పక్కింటి అమ్మాయి అనిపించేతలా ఆ పాత్రను తీర్చిదిద్దారు. అలాగే ‘లీడర్’లో రీచా గంగోపాధ్యాయ, ‘లైఫ్ ఈజ్‌బ్యూటీఫుల్’లో షగున్ కౌర్ పాత్రలు ఇప్పటికీ గుర్తుంటాయి. ఇక ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ చిత్రాల్లో సాయి పల్లవి పాత్రను మనసుకు హత్తుకునేలా ఎలా తీర్చిదిద్దారో అందరికీ తెలిసిందే. పెద్దగా ఎక్స్‌పోజింగ్ చేయనప్పటికీ ప్రస్తుతం ఆమె స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుందంటే అందులో శేఖర్ కమ్ములకు ఎంతో కొంత క్రెడిట్ ఇవ్వాల్సిందే. హీరోయిన్లను డిగ్నిటీగా ఎలా చూపించాలో, వారి నుంచి నటన ఏవిధంగా రాబట్టాలో తెలిసిన దర్శకుడు కావడంతో శేఖర్ కమ్ములతో కనీసం ఒక సినిమా అయిన చేయాలని కథానాయికలు ఆశ పడుతుంటారు.
హను రాఘవపూడి (Hanu Raghavapudi)
శేఖర్ కమ్ముల తరహాలోనే దర్శకుడు హను రాఘవపూడి కథానాయికల విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తారు. ఆయన దర్శత్వంలో వచ్చిన ‘అందాల రాక్షసి’, ‘క్రిష్ణ గాడి వీర ప్రేమ గాధ’, ‘పడి పడి లేచె మనసు’, ‘సీతారామం చిత్రాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన దర్శకత్వంలో పని చేసిన లావణ్య త్రిపాఠి, మెహరిన్, సాయిపల్లవి, మృణాల్ ఠాకూర్ ఎంత మంచి పేరు సంపాదించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ‘సీతారామం’ వంటి అద్భుతమైన ప్రేమ కావ్యంలో మృణాల్‌ను చాలా బాగా చూపించారు. ఆ సినిమాతో ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది. ఆ సినిమాలోని సీత పాత్ర తనకు ఎప్పటికీ ప్రత్యేకమేనని మృణాల్ పలు సందర్భాల్లో చెప్పడం విశేషం. హను రాఘవపడి ప్రభాస్‌తో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఈ చిత్రం ద్వారా కొత్త అమ్మాయి ఇమాన్ ఇస్మాయిల్ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇప్పటికే ఆమె లుక్స్ విపరీతంగా ఆకర్షించగా డైరెక్టర్ హను ఇంకెంత బాగా చూపిస్తారోనని సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.
వివేక్ ఆత్రేయ (Vivek Athreya)
యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సైతం హీరోయిన్ల విషయంలో శేఖర్ కమ్ములానే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. రీసెంట్‌గా నానితో చేసిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) చిత్రంలో తమిళ నటి ప్రియాంక అరుళ్ మోహన్‌ను ఎంత బాగా చూపించారో అందరికీ తెలిసిందే. ఎక్కడా గ్లామర్‌షోకు చోటు ఇవ్వకుండా ఆమె ద్వారా అద్భుత నటనను రాబట్టి ప్రశంసలు అందుకున్నారు. అందుకు ముందు డైరెక్ట్ చేసిన ‘మెంటల్ మదిలో’ (Mental Madhilo), ‘బ్రోచెవారెవరురా’ (Brochevarevarura), ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki) చిత్రాల్లోనూ హీరోయిన్ల స్కిన్ షో కంటే డిగ్నిటీ లుక్‌కే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. ఆయా చిత్రాల్లో నటించిన నివేదా పేతురాజ్, నివేదా థామస్, నజ్రియా నజిమ్‌కు మంచి గుర్తింపు వచ్చింది.
శౌర్యువ్ (Shouryuv)
దర్శకుడు శౌర్యువ్ ‘హాయ్ నాన్న’ (Hi Nanna) చిత్రం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. మనసుకు హత్తుకునేలా ఈ చిత్రాన్ని మలిచి ప్రశంసలు అందుకున్నారు. ఇందులో నాని హీరోగా నటించగా మృణాల్ ఠాకూర్ అతడికి జోడీగా చేసింది. బాలీవుడ్‌లో అప్పటికే హాట్ బాంబ్‌గా గుర్తింపు తెచ్చుకున్న మృణాల్‌ను ఇందులో మళ్లీ అచ్చ తెలుగు అమ్మాయిగా చూపించారు. సాంగ్స్‌లో స్కిన్ షోకు అవకాశం ఉన్నప్పటికీ శౌర్యువ్ ఆ పని చేయలేదు. ఆమె పోషిస్తున్న డిగ్నిటీ పాత్రపై ప్రభావం చూపకుండా ఆద్యంతం మృణాల్‌ను అందంగా చూపించారు. హీరోయిన్ పాత్ర ఎలా ఉండాలి? ఎలా చూపించాలి? అని శౌర్యువ్‌కు ఉన్న స్పష్టతను చూసి సినీ విమర్శకులు సైతం ఆశ్చర్యపోయారు. తన తర్వాతి సినిమాల్లోనూ ఇదే రీతిన కొనసాగాలని ఆశిస్తున్నారు.
తరుణ్ భాస్కర్ (Tharun Bhascker)
యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ యూత్‌ఫుల్ చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయారు. యువత మెచ్చే కంటెంట్‌తో వరుసగా సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే కుర్రకారును ఆకట్టుకువాలన్న తాపత్రయంలో అతడు ఎక్కడా గ్లామర్ షోకు ఆస్కారం ఇవ్వడం లేదు. తొలి చిత్రం ‘పెళ్లి చూపులు’ నుంచి గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో విజయ్ దేవరకొండకు జోడీగా రీతు వర్మ నటించింది. అసభ్యతకు, అనవసర స్కిన్‌షోకు చోటు లేకుండా ఆమెతో మంచి నటన రాబట్టాడు తరుణ్ భాస్కర్. ఈ సినిమాతో రీతు వర్మ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత నటుడిగా మారి పలు సినిమాల్లో నటించిన తరుణ్ బాస్కర్ ‘కీడా కోలా’తో మళ్లీ డైరెక్టర్‌గా మారారు.
సెప్టెంబర్ 14 , 2024
Bhagyashri Borse: పాన్ ఇండియా ఆఫర్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే.. ఫ్లాప్ వచ్చిన తగ్గని క్రేజ్!
టాలీవుడ్ రైజింగ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న భాగ్యశ్రీ బోర్సేకు తొలి చిత్రంతోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలుగులో ఆమె చేసిన ఫస్ట్ ఫిల్మ్ మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. అయితే ఈ అమ్మడి నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఈ భామకు మంచి ఫ్యూచర్ ఉంటుందంటూ కితాబు ఇచ్చారు. ఈ క్రమంలోనే భాగ్యశ్రీకి మరో బంపరాఫర్ దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించి అందరి దృష్టిని ఆకర్షించింది. భాగ్యశ్రీ అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
దుల్కర్‌కి జోడీగా భాగ్యశ్రీ
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా తెరకెక్కుతోన్న చిత్రాల్లో ‘కాంత’ (Kaantha) ఒకటి. ‘నీలా’ ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ (Selvamani Selvaraj) దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్ పుట్టినరోజు పురస్కరించుకుని ఇటీవల ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగా సినీ లవర్స్ నుంచి విశేష ఆదరణ లభించింది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేశారు. అంతేకాదు పూజా కార్యక్రమాలను సైతం నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె మంచి ఛాన్స్ కొట్టేశారంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. వేఫరెర్ ఫిలిమ్స్, స్పిరిట్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వరలోనే దీని రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది. ఇందులో రానా దగ్గుబాటి ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.
https://twitter.com/DQsWayfarerFilm/status/1833013939837276196
1950 నేపథ్యంలో..
కాంత మూవీ పూజా కార్యక్రమాలను హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ మూవీకి టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ ఫస్ట్ క్లాప్ కొట్టారు. కాగా, ఈ చిత్రాన్ని 1950 మద్రాసు నేపథ్యంలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో దుల్కర్ పాత్ర ఇప్పటివరకూ చేసిన చిత్రాల కంటే పూర్తి భిన్నంగా ఉంటుందని సమాచారం. భాగ్యశ్రీకి కూడా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రనే దక్కిందని అంటున్నారు. వీరి మధ్య కెమెస్ట్రీ అదిరిపోతుందని అంటున్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే మెుదలవుతుందని ఫిల్మ్ వర్గాలు తెలియజేశాయి.
ఏమాత్రం తగ్గని క్రేజ్!
‘మిస్టర్ బచ్చన్’ సినిమా టైంలో భాగ్యశ్రీ బోర్సే పేరు ఎంతగా ట్రెండ్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైన దగ్గర్నుంచి ఆమె సోషల్ మీడియా దృష్టినీ ఆకర్షిస్తూనే వచ్చింది. సినిమా నుంచి తొలి పాటను అనౌన్స్ చేసినపుడు కొన్ని విజువల్స్ చూసి కుర్రాళ్లకు మతిపోయింది. అయితే ఊహించని విధంగా ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్ కావడంతో భాగ్యశ్రీ అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. తొలి చిత్రమే దారుణ పరాజయాన్ని మిగిల్చడంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన దూకుడు కాస్త తగ్గించింది. తాజాగా 'కాంత' సినిమాలో హీరోయిన్‌గా ఎంపికై తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. సరైన హిట్ లభిస్తే ఈ అమ్మడు స్టార్ హీరోయిన్‌గా మారిపోవడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ మూవీలోనూ..
విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న 'VD12' చిత్రంలోనూ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ అమ్మడు షూటింగ్‌లోనూ పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ సినిమాలో విజయ్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఓ సాధారణ పోలీసు కానిస్టేబుల్ అయిన హీరో, మాఫియా లీడర్‌గా ఎలా ఎదిగాడన్న కాన్సెప్ట్‌తో 'VD12' రాబోతున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు.
సెప్టెంబర్ 09 , 2024
Committee Kurrollu Review: మెగా డాటర్ నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ ఎలా ఉందంటే?
నటీనటులు: సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, టీనా శ్రావ్య, రాద్యా సురేశ్, తేజశ్వీరావు, సాయికుమార్
దర్శకత్వం: యదు వంశీ
సంగీతం : అనుదీప్ దేవ్
సినిమాటోగ్రాఫర్ : రాజు ఎడురోలు
ఎడిటర్ : అన్వర్ అలీ
నిర్మాత : నిహారిక కొణిదెల
విడుదల: 09-08-2024
మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) నిర్మించిన తాజా చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu Review). సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషించారు. సాయికుమార్, గోపరాజు రమణ ఇతర ముఖ్య రోల్స్‌లో కనిపించారు. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? నిర్మాతగా నిహారికకు మంచి సక్సెస్ అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
గోదావరి జిల్లాలోని పురుషోత్తంపల్లి గ్రామంలో 12 ఏళ్లకు ఒకసారి భరింకాళమ్మతల్లి జాతర నిర్వహిస్తారు. ‘బలి చేట’ పేరుతో జరిగే ఈ ఉత్సవానికి ఎంతో ప్రాశస్త్యం ఉంటుంది. ఈసారి జాతర జరిగిన 10 రోజులకు పంచాయతీ ఎన్నికలు కూడా ఉండటంతో సర్చంచ్ పోలిశెట్టి బుజ్జి (సాయి కుమార్)కి పోటీగా శివ (సందీప్ సరోజ్) బరిలోకి దిగేందుకు రెడీ అవుతాడు. అయితే 12 ఏళ్ల క్రితం జరిగిన జాతర గొడవలో శివ స్నేహితులైన 10 మందిలో ఒకడు ప్రాణాలు కోల్పోతాడు. స్నేహితుల మధ్య జరిగిన కులాల కొట్లాట ఇందుకు కారణం కావడంతో ఈసారి జాతర పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని పంచాయతీలో తీర్మానం చేస్తారు. మరి ఆ తర్వాత ఏమైంది? రిజర్వేషన్ల అంశం శివ గ్యాంగ్‌ను ఎలా విచ్ఛిన్నం చేసింది? 12 ఏళ్ల క్రితం విడిపోయిన స్నేహితులు తిరిగి కలిశారా? అసలు ఈ గొడవలో సర్పంచ్ పోలిశెట్టి బుజ్జి పాత్ర ఏంటి? శివ సర్పంచ్‌గా గెలిచాడా? లేదా? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
ఈ చిత్రంలో 11మంది కుర్రాళ్లు ప్రధాన పాత్రలు పోషించారు. శివగా సందీప్ సరోజ్, సుబ్బుగా త్రినాథ్ వర్మ, విలియంగా ఈశ్వర్ రచిరాజు, సూర్యగా యశ్వంత్ పెండ్యాల ఇలా ఎవరికి వారే తమదైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేశారు. సాయికుమార్, గోపరాజు రమణ, కంచరపాలెం కిషోర్ వంటి వారి నటనానుభవం ఈ కథకు అదనపు బలాన్ని అందించింది. పెద్దోడుగా ప్రసాద్ బెహరా నటన అందర్నీ అలరిస్తుంది. వినోదభరిత సన్నివేశాల్లో ఎంతగా నవ్వించాడో భావోద్వేగభరిత సన్నివేశాల్లో అంతగా ఎమోషన్‌ను పండించాడు. ఇతర పాత్రదారులు కూడా తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు యదు వంశీ 90'sలో కథను నడిపించారు. సమాజంలో అంతర్భాగమైన రిజర్వేషన్ల అంశాన్ని సున్నితంగా టచ్ చేశారు. ఒకే కథలో స్నేహం, ప్రేమ, కులాల సమస్య, రాజకీయం చూపించే ప్రయత్నం చేశారు. గోదావరి యాసలో రాసుకున్న సంభాషణలు, జాతర సన్నివేశాల్ని తీర్చిదిద్దుకున్న తీరు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్ అయితే చాలా వేగంగా గోదావరి స్టైల్ కామెడీతో కథను నడిపించారు. ఆయా సన్నివేశాలకు 90స్ కిడ్స్ సూపర్‌గా కనెక్ట్ అవుతారు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇక సెకండాఫ్‌లో చాలా వరకు ఎమోషనల్ సీన్స్‌పై దర్శకుడు ఫోకస్ పెట్టారు. అయితే ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ స్లో అయినట్లు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు నేటి పొలిటికల్ లీడర్స్‌కు సెటైరికల్‌గా అనిపిస్తాయి. సినిమాలోని ప్రేమ కథనలు అసంపూర్తిగా వదిలేయడం, రిజర్వేషన్ల అంశాన్ని కథలో అర్థంతరంగా ముగించడం, అనవసరంగా కొన్ని సన్నివేశాలను ఇరికించడం మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే అనుదీప్ సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా జాతర నేపథ్యంలో వచ్చే నేపథ్య సంగీతం కట్టిపడేస్తుంది. సినిమాటోగ్రాఫర్ రాజు కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్ విషయంలో నిహారిక కొణిదెల ఎక్కడా రాజీ పడినట్లు కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
కథా నేపథ్యంగోదావరి స్టైల్ కామెడీజాతర సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనంద్వితియార్థం
Telugu.yousay.tv Rating : 3/5
ఆగస్టు 09 , 2024