రివ్యూస్
How was the movie?
తారాగణం
ధనుష్
రష్మిక మందన్న
నాగార్జున
జిమ్ సర్భ్
దలీప్ తాహిల్
సౌరవ్ ఖురానా
సిబ్బంది
శేఖర్ కమ్ముల
దర్శకుడుసునీల్ నారంగ్నిర్మాత
పుస్కూర్ రామ్ మోహన్ రావునిర్మాత
కథనాలు
Kalki 2898 AD: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు ట్వీట్ వెనక నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్..!
ప్రభాస్ హీరోగా చేస్తోన్న సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్ సినిమా 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD)పై వరల్డ్ వైడ్‌గా బజ్ ఏర్పడింది. ఈ సినిమాను మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రంగా కల్కి రికార్డు సృష్టించింది. జూన్ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండటంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమా ప్రమోషన్స్‌ను షురూ చేశారు. సినిమాలో రోబిటిక్ వెహికల్‌గా కీలక పాత్ర పోషించిన బుజ్జి అనే వాహనాన్ని ఇటీవల అందరీ పరిచయం చేసి ఆశ్చర్యపరిచాడు. సినిమా కోసం స్పెషల్‌గా తయారు చేయించిన వెహికల్ కావడంతో బుజ్జిపై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం బుజ్జిని ఉపయోగించుకొని డైరెక్టర్ నాగ్ అశ్విన్ సరికొత్త ప్రమోషన్స్‌కు తెరలేపారు.
అపర కుబేరుడికి రిక్వెస్ట్
ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడైన టెస్లా అధినేత ఎలా మస్క్ (Elon Musk)కు.. 'కల్కి 2898 ఏడీ' డైరెక్టర్ నాగ్ అశ్విన్ తాజాగా ఓ రిక్వెస్ట్ పెట్టారు. బుజ్జి వెహికల్‌ను నడపడానికి ఆహ్వానిస్తున్నట్లు ఓ ట్వీట్‌ను ఎలాన్ మస్క్‌కు ట్యాగ్ చేశాడు. ‘ప్రియమైన ఎలాన్ మస్క్ సర్.. మా బుజ్జిని చూడటానికి, డ్రైవ్ చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇది 6 టన్నుల బరువుతో సరికొత్తగా డిజైన్ చేశాం. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం, అద్భుతమైన ఇంజినీరింగ్ వర్క్‌తో నిర్మించబడింది. మీకు బుజ్జి తప్పకుండా మంచి అనుభూతిని ఇస్తుంది' అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.
https://twitter.com/nagashwin7/status/1795534761072693594
ట్వీట్ వెనక మాస్టర్ ప్లాన్
అపర కుభేరుడు ఎలాన్ మస్క్‌కు నాగ్ అశ్విన్ ట్వీట్ పెట్టడం వెనక ఓ మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు కనిపిస్తోంది. కల్కి సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్ ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఎలాన్ మస్క్ దృష్టిని కల్కి మీదకు మళ్లిస్తే అది గ్లోబల్ స్థాయిలో మూవీకి ప్లస్ అవుతుందని నాగ్ అశ్విన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే అసాధ్యమని తెలిసినా బుజ్జిని నడపాలని, ఇండియాకు రావాలని ఆయన మస్క్‌ను కోరినట్లు సమాచారం. ఇప్పటికే నాగ్ అశ్విన్ ట్వీట్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. చాలా మంది భారతీయులు ట్వీట్‌పై స్పందిస్తున్నారు. ఈ అడ్వాన్స్‌డ్ వెహికల్‌ను నడపాలని మస్క్‌కు సైతం సూచిస్తున్నారు. అటు మస్క్ కూడా అశ్విన్ ట్వీట్‌కు సమాధానం ఇస్తే అది ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అవుతుంది. 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి రావాల్సినంత ప్రమోషన్ వరల్డ్ వైడ్‌గా వచ్చేస్తుంది.
బుజ్జిని నడిపిన చైతూ
బుజ్జి వెహికల్‌పై మనసు పారేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya).. ఇప్పటికే దానిపై ఓ రైడ్ కూడా వేశాడు. రేసింగ్ కోర్స్‌లా ఉన్న చోట రయ్‍రయ్ అంటూ ఇటీవల ఈ కారును డ్రైవ్ చేసాడు. అందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఎక్స్‌లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. అనంతరం బుజ్జి వెహికల్‌కు హాట్యాఫ్ చెప్పిన చైతూ.. అదొక ఇంజనీరింగ్ అద్భుతమని కొనియాడాడు. బుజ్జితో తాను సరదాగా గడిపినట్లు చెప్పుకొచ్చారు.
https://twitter.com/chay_akkineni/status/1794262966986215753
బుజ్జి ఎందుకు స్పెషలో తెలుసా?
బుజ్జి అనే ఫ్యూచరస్టిక్ కారును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వెహికల్ తయారీ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో శ్రమించారు. మహీంద్రా సంస్థ, జయం ఆటోమోటివ్ భాగస్వామ్యంతో పాటు చాలా మంది ఇంజినీర్లతో బుజ్జి కారును తయారు చేయించారు. ఇది తయారు చేసేందుకు సుమారు రెండేళ్ల కాలం పట్టిందట. బుజ్జి వాహనానికి ముందు రెండు, వెనుక ఒకటే భారీ టైర్లు ఉన్నాయి. ఈ టైర్లు తయారు చేసేందుకే చాలా కసరత్తులు చేశారు. సియట్ కంపెనీతో ఈ టైర్లను తయారు చేయించారు. సుమారు 6 టన్నుల బరువు ఉన్న బుజ్జీని తయారు చేసేందుకు సుమారు రూ.7 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం.
కల్కి బడ్జెట్ తెలిస్తే షాకే!
‘కల్కి 2898 ఏడీ’ చిత్రం జూన్ 27వ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీలో ప్రభాస్‍తో పాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, తమిళ లెజెండ్ కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె, దిశా పటానీ కీలకపాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా వస్తోంది. సుమారు రూ.600 కోట్ల వరకు ఈ చిత్రానికి బడ్జెట్ వెచ్చించినట్టు అంచనాలు ఉన్నాయి. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
మే 29 , 2024
Keerthy Suresh: దసరా నుంచి కీర్తిని హీరోయిన్‌గా తీసేద్దామనుకున్న డైరెక్టర్.. కానీ!
అందం కంటే నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్లలో కీర్తి సురేష్ (Keerthy Suresh) ఒకరు. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఈ అమ్మడు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్ర అద్భుతంగా పోషించి ఏకంగా జాతీయ అవార్డు అందుకుంది. అయితే ఆమె ఫిల్మ్ కెరీర్‌లో ఎన్నో ఆసక్తికర సంఘనటలు చోటుచేసుకున్నాయి. నేడు (అక్టోబర్ 17) కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
చైల్డ్ ఆర్టిస్టుగా
నటీనటులు సురేష్‌కుమార్, మేనకల కుమార్తె అయిన కీర్తి సురేష్ పెలట్స్ అనే మలయాళ చిత్రంతో బాలనటిగా మెరిసింది. మరో అచనేయనేనికిష్టం, కుబేరన్ అనే చిత్రాల్లోనూ ఆమె చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది.
చిరుకి జోడీగా తల్లి.. చెల్లిగా కూతురు
చిరంజీవి (Chiranjeevi) ‘పున్నమినాగు’ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ తల్లి మేనక నటించారు. రీసెంట్‌గా వచ్చిన 'భోళా శంకర్' మూవీలో మెగాస్టార్ సోదరిగా కీర్తి సురేష్ నటించడం గమనార్హం. సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అన్నా చెల్లెళ్లుగా వీరి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. హైదరాబాద్‌లో షూటింగ్ జరిగిన అన్ని రోజులు తన ఇంటి నుంచే కీర్తికి భోజనం పంపినట్లు చిరు మూవీ ప్రమోషన్స్ సందర్భంగా తెలిపారు.
ప్రారంభంలోనే అటకెక్కిన చిత్రాలు
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన గీతాంజలి సినిమాతో కీర్తి సురేష్ హీరోయిన్‌గా మారింది. అయితే అంతకుముందే హీరోయిన్‌గా మూడు ప్రాజెక్ట్స్‌ను కీర్తి ఓకే చేసింది. షూటింగ్ కూడా సగానికి పైనే జరిగింది. అయితే అనూహ్యంగా ఆ మూడు ప్రాజెక్ట్స్ మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో తీవ్ర నిరాశకు గురైనట్లు ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది.
ఐరెన్ లెగ్‌గా ముద్ర
కెరీర్ ప్రారంభంలోనే మూడు ప్రాజెక్ట్స్ ఆగిపోవడం.. మలయాళంలో చేసిన ‘గీతాంజలి’, రింగ్ మాస్టర్ చిత్రాలు ఫ్లాప్ కావడం, తమిళంలో ఆమె ఫస్ట్ ఫిల్మ్ ‘ఇదు ఎన్న యామమ్’ కూడా డిజాస్టర్‌గా నిలవడంతో కీర్తికి ఐరెన్ లెగ్ అన్న ముద్ర వచ్చింది. విపరీతంగా ట్రోల్స్‌కు సైతం గురైంది. వాటిని పట్టించుకోకుండా విజయవంతమైన చిత్రాల్లో నటించి కీర్తి సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా మారింది.
మహానటితో కెరీర్ టర్నింగ్
తెలుగులో చేసిన ఫస్ట్ ఫిల్మ్ ‘నేను శైలజా’ మంచి విజయం సాధించడంతో టాలీవుడ్, కోలీవుడ్‌లో కీర్తి సురేష్‌కు అవకాశాలు పెరిగాయి. వరుసగా కమర్షియల్ చిత్రాలు చేస్తున్నప్పటికీ నటిగా ఏమీ సాధించలేదన్న అసంతృప్తి కీర్తిలో ఉండిపోయింది. ఆ సమయంలోనే ‘మహానటి’ ప్రాజెక్ట్ ఆమె చెంతకు వచ్చింది. ఇందులో సావిత్రిగా పరకాయ ప్రవేశం చేసి మరి నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకొని తోటి హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలిచింది. మహానటి తర్వాత కీర్తి సురేష్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.
వరుస ఫెయిల్యూర్స్
‘మహానటి’ తర్వాత కెరీర్ పరంగా కీర్తి సురేష్‌కు తిరుగుండదని అంతా భావించారు. అందుకు తగ్గట్లే వరుసగా ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ ఆ సినిమాలన్నీ ఫ్లాప్ టాక్స్ తెచ్చుకోవడంతో కీర్తి సురేష్ ఇబ్బందుల్లో పడింది. మహానటి తర్వాత ఆమె చేసిన ‘సామి స్క్వేర్’, ‘పందెం కోడి 2’, రంగ్ దే, ‘అన్నాతే’ వంటి సినిమాలు ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయాయి. లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’, ‘గుడ్‌లక్ సఖి’ చిత్రాలూ సందడి చేయలేకపోయాయి.
కీర్తిని తీసేద్దామన్న డైరెక్టర్
గతేడాది విడుదలైన ‘దసరా’ సినిమాతో కీర్తి భారీ విజయం సాధించి తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి అడుగుపెట్టింది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సత్తా చాటింది. ముఖ్యంగా కీర్తి సురేష్ నటనపై సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. వెన్నెల అనే గ్రామీణ యువతిగా ఆమె అదరగొట్టింది. ఉత్తమనటిగా సైమా, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సైతం అందుకుంది. అయితే వాస్తవానికి ఈ పాత్ర అయితే దసరా హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను తీసేద్దామని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల భావించినట్లు ఆ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా నాని చెప్పారు. మూవీ కథను కీర్తికి చెప్పిన డైరెక్టర్ ఆమెను 10-12 కిలోలు బరువు పెరగాలని సూచించారట. కానీ అందుకు తగ్గట్లు పెరగలేదట. దీంతో తన వద్దకు వచ్చి కీర్తి సురేష్‌ను తీసేద్దామని శ్రీకాంత్ ఓదెల అన్నట్లు నాని చెప్పారు. నువ్వు డెబ్యూ డైరెక్టర్‌వి, ఆమె నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి. ఇది జరగదని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ విధంగా సినిమా సెట్స్‌పైకి వెళ్లడం వారిద్దరు మంచి ఫ్రెండ్స్ కావడం చకాచకా జరిగిపోయినట్లు నాని వివరించారు.
https://www.youtube.com/watch?v=J-PhzFEt9Wk
కీర్తి స్పెషల్ టాలెంట్
కీర్తి సురేష్ ముఖమే కాదు, గొంతు కూడా చాలా అందంగా ఉంటుంది. దీనిని గుర్తించిన దర్శకులు ఆమె వాయిస్‌తో మ్యాజిక్ చేయించారు. ‘సామి స్క్వేర్’ సినిమాలో కీర్తి 'పుదు మెట్రో రైల్' అనే పాటను చాలా అందంగా పాడింది. అంతేకాకుండా ఇటీవల వచ్చి కల్కి 2898 ఏడీ చిత్రంలో బుజ్జి వాహనానికి వాయిస్ అందించి ఆకట్టుకుంది. ‘గాంధారి’ ఆల్బమ్‌తో తనలో మంచి డ్యాన్సర్ ఉందని కూడా చాటి చెప్పింది.
ఈ ఏడాది బాలీవుడ్‌లోకి..
ఈ ఏడాది ఇప్పటికే ‘సైరన్’, ‘రఘుతాత’తో అలరించిన కీర్తి ‘రివాల్వర్ రీటా’, ‘కన్నివేడి’, ‘ఉప్పు కప్పురంబు’తో బిజీగా ఉన్నారు. ‘బేబీ జాన్’ (Baby John)తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తన కెరీర్‌లో సావిత్రి (మహానటి), వెన్నెల (దసరా), కళావతి (సర్కారువారి పాట) పాత్రలు సవాలు విసిరాయని ఓ సందర్భంలో అన్నారు.
అక్టోబర్ 17 , 2024
Kalki 2898 AD: రామ్‌చరణ్ కూతురికి కల్కి టీమ్ స్పెషల్ గిఫ్ట్.. డైరెక్టర్ ప్లాన్ అదేనా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ (Nag Ashwin) డైరెక్షన్‌లో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రంపై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. ఈ చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు ఒక్కసారిగా పెంచింది. ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన AI వెహికల్.. బుజ్జిని ప్రముఖ నగరాల్లో తిప్పుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ను బుజ్జి వెహికల్‌ను నడపాలని కోరి వరల్డ్ వైడ్‌గా సినిమాపై అటెన్షన్ తీసుకొచ్చింది. ఇక తాాజాగా మరో కాన్సెప్ట్‌తో సరికొత్త ప్రమోషన్స్‌ను మేకర్స్ షురూ చేశారు.
క్లింకారకు స్పెషల్ గిఫ్ట్
సరికొత్త ప్రమోషన్స్‌కు కల్కి టీమ్ నాంది పలికింది. ఇందులో భాగంగా సినీ సెలబ్రిటీల పిల్లలకు గిఫ్ట్‌లు పంపుతోంది. తాజాగా రామ్ చరణ్ కుమార్తె క్లీంకారకు (Klinkaara) మూవీ యూనిట్ ఓ బహుమతి అందించింది. అందులో బుజ్జి - భైరవ స్టికర్స్, బుజ్జి బొమ్మ, టీషర్ట్స్ ఉన్నాయి. క్లీంకార వాటితో ఆడుకుంటున్న ఫొటోలను ఉపాసన ఇన్‌స్టాలో షేర్ చేశారు. కల్కి టీమ్‌కు థ్యాంక్స్, ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు. అలాగే మరికొంతమంది సెలబ్రిటీల పిల్లలకు కూడా వీటిని పంపనున్నట్లు తెలుస్తోంది.
చిన్నారులపై ఫోకస్
సాధారణంగా ఏ సినిమా మేకర్స్ అయినా రిలీజ్ సందర్భంగా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తుంటారు. అయితే కల్కి టీమ్ ఇందుకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తోంది. ఓ వైపు పెద్దలను ఆకర్షిస్తూనే చిన్నారులపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం చిన్నారులపైనే ఫుల్‌గా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఇటీవల కిడ్స్‌ను టార్గెట్ చేస్తూ 'బుజ్జి అండ్ భైరవ' (Bujji And Bhairava) పేరుతో సరికొత్త యానిమేషన్ సిరీస్‌ను తీసుకొచ్చారు. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వేదికగా ఈ సిరీస్ రెండు ఎపిసోడ్స్‌తో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది చిన్నారులను ఎంటగానో ఆకర్షిస్తోంది. అటు పెద్దల నుంచి సైతం సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా స్పెషల్ గిఫ్ట్స్ ప్రోగ్రామ్‌ను కూడా పిల్లల కోసమే లాంచ్ చేశారు.
కారణం ఇదేనా!
‘కల్కి 2898 ఏడీ’ సైంటిఫిక్ అండ్ ఫ్యూచరిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఇటీవల విడుదల చేసిన బుజ్జి, భైరవ సిరీస్, గ్లింప్స్‌ను పరిశీలిస్తే కల్కి చిత్రం సూపర్ హీరోల కాన్సెప్ట్‌ను తలపిస్తోంది. సాధారణంగా ఈ తరహా చిత్రాలు.. పెద్దల కంటే పిల్లలనే ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంటాయి. ఇప్పటికే హాలీవుడ్‌లో వచ్చిన అవెంజర్స్, మార్వెల్ సిరీస్ చిత్రాలు ఈ విషయాన్నే రుజువు చేశాయి. కాబట్టి కల్కి టీమ్ కూడా ఆ పాయింట్‌నే పట్టుకున్నట్లు కనిపిస్తోంది. ముందుగా పిల్లల్లో కల్కి సినిమాపై ఆసక్తి రగిలిస్తే ఆటోమేటిక్‌గా తల్లిదండ్రులను కూడా థియేటర్లకు రప్పించవచ్చని మూవీ టీమ్ భావిస్తున్నట్లు సమాచారం. అటు యూత్, టీనేజర్స్‌ను ఆకర్షించడానికి ప్రభాస్ ఉండనే ఉన్నాడు. ఇవన్నీ చూస్తే అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ వ్యూహాత్మంగా ముందుకు సాగుతున్నట్లు అర్థమవుతోంది.
కల్కి రన్‌టైమ్ లాక్?
'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) రన్ టైమ్ ఫిక్స్ అయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. రీసెంట్ సోషల్ మీడియా బజ్ ప్రకారం.. ఈ సినిమా నిడివిని 3.10 గం.లుగా మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు దగ్గరకు వెళ్లి ఏమైన కత్తెరలు పడినా కూడా నిడివి 3 గం.లకు తగ్గే పరిస్థితి ఉండదని ప్రచారం జరుగుతోంది. అయితే రన్‌టైమ్‌పై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ హీరోయిన్లుగా చేశారు. దిగ్గజ నటులు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలు పోషించారు.
జూన్ 03 , 2024
Rashmika Mandanna: బాగానే మెనేజ్ చేశారు.. కానీ ఇలా దొరికిపోయారు!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు డేటింగ్, డిన్నర్లు అంటూ తెగ తిరిగేస్తున్నారని పెద్ద ఎత్తువ కథనాలు సైతం వచ్చాయి. తాము కేవలం స్నేహితులమని ఇద్దరూ చెప్పినా తరచూ టూర్లు, రెస్టారెంట్స్‌లో దర్శనమివ్వడంతో ఎవరూ నమ్మడం లేదు. ఈ క్రమంలో తాజాగా మారుమారు ఈ జంట కెమెరాలకు చిక్కింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
విడివిడిగా వచ్చినా.. దొరికేశారు!
స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న జంటగా ఎక్కడ కనిపించినా వెంటనే కెమెరాలు వారి మీదకి వెళ్లిపోతాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ స్టార్స్ ఇద్దరూ హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. సోమవారం రాత్రి విమానశ్రయంలో విజయ్ కనిపించగా.. కొద్దిసేపటి తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా రష్మిక కూడా వచ్చింది. రష్మిక ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టిన సమయంలో ఆమె చేతిలో ఎల్లో కలర్ క్యాప్ ఉంది. అంతకుముందు విజయ్ తలకు బ్లాక్ కలర్ క్యాప్ పెట్టుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరి దగ్గర ఉన్న క్యాప్స్ చేతులు మారడం గమనించవచ్చు. విజయ్ తలపైకి ఎల్లో క్యాప్ రాగా, రష్మిక హెడ్ పైకి బ్లాక్ క్యాప్ వచ్చింది. దీంతో ఇద్దరూ విడివిడిగానే కనిపించినా క్యాప్ మాత్రం వారు జంటగా వచ్చారని ఇరికించేసింది. కాగా, క్రిస్మస్, న్యూయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా వారు విదేశాలకు వెళ్లబోతున్నట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
https://twitter.com/pakkatelugunewz/status/1871451463966404651
అనుమానాలు మరింత బలోపేతం
గత కొద్దిరోజులుగా విజయ్- రష్మిక ప్రేమ గాసిప్ తెగ చర్చకు వస్తోంది. వీరిద్దరు ఏ ఈవెంట్‌లో పాల్గొన్నా ప్రేమ, డేటింగ్‌కు సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. అయితే వీరిద్దరు ఇప్పటివరకూ తమ లవ్‌ను ధ్రువీకరించలేదు. తాజాగా ఎయిర్‌పోర్టు వీడియోలు బయటకు రావడంతో వారి రిలేషన్‌పై అనుమానాలు మరింత బలపడ్డాయని చెప్పవచ్చు. వారిద్దరు కచ్చితంగా రిలేషన్‌లో ఉన్నారని ఫ్యాన్స్ కూడా చర్చించుకుంటున్నారు. ఎన్నాళ్లు ఈ దాపరికమని, మీ ప్రేమ గురించి అనౌన్స్ చేయమని సూచిస్తున్నారు.
ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె ఫుల్ స్వింగ్‌లో ఉంది. చేతిలో ఏకంగా ఐదు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇటీవల 'పుష్ప 2' సాలిడ్ హిట్ అందుకున్న రష్మిక.. ప్రస్తుతం తెలుగులో ‘కుబేర’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ వంటి ప్రాజెక్ట్స్ చేస్తోంది. హిందీలో ‘చావా’, ‘సికిందర్’, ‘తమ’ వంటి సినిమాల్లో నటిస్తోంది. అటు విజయ్ దేవరకొండ సైతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో 'VD12' మూవీ చేస్తున్నాడు. రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్‌లో మరో మూవీకి అంగీకరించాడు. అలాగే దిల్‌రాజు నిర్మాణంలో ఓ మూవీ కూడా విజయ్ ఓకే చేశాడు.
వచ్చే ఏడాదే పెళ్లి!
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వచ్చే ఏడాది ఆరంభంలోనే పెళ్లి (Vijay Devarakonda - Rashmika Mandanna Wedding) చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. దీనిపై త్వరలోనే రష్మిక - విజయ్ దేవరకొండ జాయింట్‌గా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసే ఛాన్స్ ఉందంటూ నెట్టింట పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. తాజా ఇంటర్వ్యూలో విజయ్ చెప్పిన సమయం అదే కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
డిసెంబర్ 24 , 2024
Mahesh Babu Trolls: మీమర్స్ స్టఫ్‌గా మారిపోయిన మహేష్ బాబు.. ఒక్క వీడియోపై ఇన్ని ట్రోల్సా!
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఇటీవల ఓ బిజినెస్ మ్యాన్ పుట్టినరోజు వేడుకకు హాజరైన సంగతి తెలిసిందే. మాల్దీవుల్లో జరిగిన ఈ సెలబ్రేషన్స్‌కు మహేష్‌తో పాటు టాలీవుడ్ నుంచి చిరంజీవి, నాగార్జున, అఖిల్, వెంకటేష్ హాజరయ్యారు. సెలబ్రిటీలంతా కలిసిన దిగిన ఓ ఫొటో ఇటీవల బయటకు రాగా అది క్షణాల్లో నెట్టింట వైరల్ అయ్యింది. తాజాగా మరికొన్నిఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇందులో మహేష్‌కు సంబంధించిన ఓ వీడియో తెగ ట్రోలింగ్ (Mahesh Babu Trolls)కు గురవుతోంది. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మహేష్ మరీ ఇంత ఇంట్రోవర్టా?
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్రోవర్ట్ (Mahesh Babu Trolls) అన్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా ఫంక్షన్స్‌లో చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. తన మూవీ ఈవెంట్ అయినా కూడా కొద్ది మాటలతోనే ముగిస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో మహేష్ ఎంత ఇంట్రోవర్టో మరోమారు బయటపడింది. ఈ వీడియోలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అందరూ బర్త్‌డే బాయ్‌తో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంటే మహేష్ మాత్రం పక్కనే కొంచెం గ్యాప్‌తో సైలెంట్‌గా నిల్చున్నాడు. అందరూ ఎంజాయ్ చేస్తుంటే మహేష్ మాత్రం పక్కన ఫొటోకి ఫోజు ఇచ్చినట్లు నిలబడిపోయాడు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మహేష్‌ను చూసి నవ్వుకుంటున్నారు. మహేష్ మరీ ఇంత ఇంట్రోవర్టా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1856609040123441371
మీమర్స్ స్టఫ్‌గా మహేష్..!
అయితే మహేష్ బాబు తాజా వీడియోను ఇంట్రోవర్ట్స్ అంతా ఓన్ చేసుకుంటున్నారు. ఇంట్రోవర్ట్స్ కమ్యూనిటీలోకి స్వాగతం అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఆ వీడియోను పలు రకాలుగా ఎడిటింగ్ చేసి మీమ్స్ స్టఫ్ (Mahesh Babu Trolls)గా వాడుకుంటున్నారు. ‘మహేష్ బాబు.. సేమ్ టూ సేమ్ నాలాగే’ అంటూ ఇంట్రోవర్ట్స్ పోస్టులు పెడుతున్నారు. తాము కూడా ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండ్ అయినప్పుడు ఇలాగే ప్రవర్తిస్తుంటామని తెలియజేస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్‌పై మహేష్ అభిమానులు మాత్రం తమదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. 'నిండు చంద్రుడు ఒకవైపు.. చుక్కలు ఒకవైపు' అంటూ సమర్థించుకుంటున్నారు. నలుగురిలో ప్రత్యేకంగా ఉండటం తమ హీరోకు అలవాటని వెనకేసుకొస్తున్నారు.
https://twitter.com/Sampath01266745/status/1856890678778773683
https://twitter.com/ursbhargav_1/status/1856738857888473213
https://twitter.com/Memuchalabusy_2/status/1856590047505723771
ధనుష్ కోసం మహేష్..
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న లేటెస్ట్ చిత్రం 'కుబేర'. తమిళ స్టార్ హీరో ధనుష్ ఇందులో హీరోగా చేస్తున్నాడు. టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నారు. రేపు (నవంబర్ 15) కార్తీక పౌర్ణమి సందర్భంగా ‘కుబేర’ గ్లింప్స్‌ను రిలీజ్ చేయబోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ గ్లింప్ల్ విడుదల కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. కాగా ఈ మూవీలో ధనుష్, నాగార్జున మధ్య వచ్చే సీన్స్ చాలా వైవిధ్యభరితంగా ఉంటాయని అంటున్నారు. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ మూవీ రిలీజ్ కానుంది.
https://twitter.com/SVCLLP/status/1856645705110298753
మహేష్ లేటెస్ట్ లుక్ అదుర్స్!
బిజినెస్ మ్యాన్ బర్త్‌డే ఫంక్షన్‌లో మహేష్‌కు సంబంధించి మరిన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. పార్టీ ఇచ్చిన బిజినెస్ మ్యాన్ కపుల్స్‌తో మహేష్ దంపతులు ఫొటోలు దిగారు. ఈ ఫొటోల్లో మహేష్ లుక్ అదిరిపోయింది. గతంలో వచ్చిన పిక్స్‌లో మహేష్ గుబురు గడ్డం, లాంగ్ హెయిర్‌తో కనిపించాడు. లేటెస్ట్ పిక్స్‌లో మాత్రం అతడి హెయిర్ కాస్త షార్ట్ అయ్యింది. అలాగే గడ్డాన్ని కూడా ట్రిమ్ చేశాడు. పూర్తిగా ఉంగరాల జుట్టుతో కనిపించాడు. ఇది చూసిన ఫ్యాన్స్ రాజమౌళి సినిమాలో మహేష్ ఇలాగే కనిపిస్తారేమోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
https://twitter.com/Nikhil_Prince01/status/1856562711074636174
హైదరాబాద్‌లో వారణాసి సెట్!
రాజమౌళి - మహేష్ బాబు (SSMB29) చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కథ వారణాసి నేపథ్యంలో మెుదలవుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత సౌతాఫ్రికాకు షిఫ్ట్ అవుతుందని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వారణాసి షెడ్యూల్ మెుత్తాన్ని ఓ సెట్‌లో పూర్తి చేయాలని జక్కన్న భావిస్తున్నారట. దాని కోసం హైదరాబాద్ శివార్లలో భారీ కాశీ సెట్‌ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. కథ మెుత్తం అటవీ నేపథ్యంలో సాగనుండటంతో అందుకు అనువైన ప్రదేశాన్ని జక్కన్న టీమ్ రెక్కీ చేస్తున్నట్లు సమాచారం. లోకేషన్ ఫైనల్ కాగానే సెట్ నిర్మాణ పనులను మెుదలుపెడతారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
నవంబర్ 14 , 2024
Nani - Sekhar Kammula: నాని- శేఖర్ కమ్ముల కాంబోలో కొత్త సినిమా.. హీరోయిన్ ఎవరంటే?
టాలీవుడ్‌లో క్లాసిక్ సినిమాలు నిర్మిస్తూ దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్లకు ఆయన కేరాఫ్‌గా మారారు. మరోవైపు నేచురల్ స్టార్ నానికి సైతం లవర్ బాయ్‌గా మంచి ఇమేజ్ ఉంది. ఇటీవల ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) సినిమాతో సాలిడ్ విజయాన్ని సైతం అందుకొని మంచి ఊపులో ఉన్నాడు. ఈ నేపథ్యంలో హీరో నాని, డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ఓ చిత్రం రాబోతున్నట్లు నెట్టింట విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవి కూడా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
సూపర్ కాంబో లోడింగ్
టాలీవుడ్‌లో మరో ఇంట్రస్టింగ్ కాంబినేషన్‌కి రంగం సిద్ధం అవుతోంది. నాని-శేఖర్ కమ్ముల కాంబోలో ఓ సినిమా రానున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అటు టాలీవుడ్ వర్గాలు సైతం నాని, శేఖర్ కమ్ముల కలిసి ఓ సినిమా చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నాయి. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యిందని త్వరలోనే నానికి కథ వినిపించే అవకాశముందని తెలుస్తోంది. ఈ చిత్రం సరికొత్త లవ్ ఎంటర్‌టైనర్‌గా రానున్నట్లు సమాచారం. కాబట్టి సాయిపల్లవిని హీరోయిన్‌గా తీసుకుంటే బాగుటుందని శేఖర్ కమ్ముల భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన ఉంటుందని అంటున్నారు.
సహజ శైలికి భిన్నంగా..
శేఖర్ కమ్ముల ఒక సినిమాకు పనిచేస్తున్నప్పుడు మరో సినిమా గురించి అస్సలు ఆలోచించరు. ఆయన పూర్తి ఫోకస్ మెుత్తం ప్రస్తుత మూవీ పైనే ఉంటుంది. అయితే ఈ పంథాకు ఆయన స్వస్థి పలికినట్లు కనిపిస్తోంది. ఒక సినిమా చేస్తున్నప్పుడే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన కథలు సైతం ఆయన సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తద్వారా సినిమా పూర్తయిన వెంటనే ప్రీ ప్రొడక్షన్ పనులు మెుదలుపెట్టవచ్చని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. దాని వల్ల సినిమాకు సినిమాకు మధ్య గ్యాప్ తగ్గుతుందని ఈ క్లాసిక్ డైరెక్టర్ అంచనావేస్తున్నారట. ఈ క్రమంలోనే నాని చిత్రానికి సంబంధించిన స్టోరీని ఆయన సిద్ధం చేశారని అంటున్నారు. ప్రస్తుతం ఆయన తమిళ హీరో ధనుష్, తెలుగు దిగ్గజ నటుడు నాగార్జున కాంబోలో కలిసి 'కుబేర' (Kubera) అనే పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఇదే తొలిసారి
నాని - శేఖర్ కమ్ముల కాంబోలో ఇప్పటివరకూ ఒక్క సినిమా తెరకెక్కలేదు. నానితో వర్క్ చేయాలని ఉందని పలు సందర్భాల్లో శేఖర్ కమ్ముల వ్యాఖ్యానించడం విశేషం. అయితే సాయిపల్లవితో మాత్రం రెండు చిత్రాలకు శేఖర్ కమ్ముల పనిచేశారు. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన ఫిదా సినిమాతోనే సాయిపల్లవి హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత నాగచైతన్యతో తెరకెక్కించిన ‘లవ్ స్టోరీ’ చిత్రంలోనూ ఆమెనే కథానాయికగా ఎంచుకున్నారు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు నటిగా సాయిపల్లవికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. మరోవైపు సాయి పల్లవి, నాని కూడా ఇప్పటికే రెండు చిత్రాలకు వర్క్ చేశారు. ‘MCA’ (మిడిల్ క్లాస్ అబ్బాయి), ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాల్లో వారిద్దరు జంటగా నటించారు. ఆ రెండు చిత్రాలు కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. దీంతో వీరి కాంబోలో హ్యాట్రిక్ విజయం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఇప్పట్లో కష్టమేనా!
‘సరిపోదా శనివారం’ చిత్రం తర్వాత ప్రస్తుతం నాని 'హిట్ 3' (Hit 3)కోసం రెడీ అవుతున్నాడు. శైలేష్ కొలను డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందనుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రిలీజై ఆకట్టుకుంది. అలాగే సుజిత్ డైరెక్షన్‌లో ఒక సినిమా, దసరా డైరెక్టర్‌తో మరో మూవీని నాని ప్లాన్ చేస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే ఈ అరుదైన కాంబో సెట్ కావాడానికి మరో రెండేళ్ల సమయం పట్టొచ్చని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల కూడా ‘కుబేర’ చిత్రం షూటింగ్‌తో బిజీ బిజీగా ఉండటం గమనార్హం.
సెప్టెంబర్ 13 , 2024
Prabhas Future Projects: 2025లోనూ ప్రభాస్ జోరు.. మూడు సినిమాలు పక్కా!
గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కెరీర్ ప్రస్తుతం పీక్స్‌లో ఉంది. ఆయన గత చిత్రాలైన ‘సలార్’ (Salaar: Part 1 - Ceasefire), ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ప్రభాస్ సత్తా ఏంటో మరోమారు నిరూపించాయి. అయితే ‘బాహుబలి 2’ తర్వాతి నుంచి ప్రభాస్ చిత్రాల జోరు ఒక్కసారిగా పెరిగింది. ఒకటికి తగ్గకుండా ప్రతీ ఏడాది తన సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే గతేడాది రెండు చిత్రాలతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఏడాది ఇప్పటికే ‘కల్కి’ రూపంలో పలకరించాడు. ఇక వచ్చే ఏడాది ఏకంగా మూడు చిత్రాలతో ప్రభాస్ ఆడియన్స్‌కు ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఆ మూడు చిత్రాలు లోడింగ్..!
‘బాహుబలి’ (Baahubali), ‘బాహుబలి 2’ (Baahubali 2) చిత్రాల తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి వరకూ టాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ ఆ రెండు చిత్రాలతో గ్లోబల్ స్థాయికి చేరింది. ఆ క్రేజ్‌ను కాపాడుకోవడమే కాకుండా తన ప్రతీ సినిమాకు మరింత పెంచుకుంటూ రెబల్ స్టార్ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ లైనప్‌లో ఐదు బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. డైరెక్టర్ మారుతీతో ‘రాజా సాబ్’ (Raja Saab), సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ (Spirit), నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘కల్కి 2’ (Kalki 2), ప్రశాంత్ నీల్‌తో ‘సలార్ 2’ (Salaar 2)తో పాటు హను రాఘవపూడితో ఓ చిత్రం చేయనున్నాడు. పైన చెప్పుకున్న వాటిలో తొలి మూడు చిత్రాలు 2025లో రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘రాజా సాబ్’ను 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అటు ‘కల్కి 2‘ షూటింగ్ కూడా కొంతమేర పూర్తైనట్లు నిర్మాత అశ్వనీ దత్ ఇటీవల ఓ ఇంటర్యూలో చెప్పారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి (జూన్ నెలలో) రిలీజ్ చేయవచ్చని హింట్ ఇచ్చారు. అటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రానున్న ‘స్పిరిట్’ కూడా మరో రెండు నెలల్లో పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. వచ్చే ఏడాది చివరి కల్లా ఈ మూవీని రిలీజ్ చేయాలని సందీప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ నుంచి 2025లో మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా అని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
వరుస సినిమాలతో ప్రభాస్ జోరు!
‘దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి’ అన్న సామెతను ప్రభాస్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం అతడి కెరీర్ పీక్స్‌లో ఉన్న నేపథ్యంలో వరుసగా సినిమాలు చేస్తూ తన క్రేజ్‌ను, ఫాలోయింగ్‌ను మరింత పెంచుకునేందుకు డార్లింగ్ ప్రయత్నిస్తున్నాడు. శరవేగంగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌కు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారు. 2023లో ప్రభాస్ నుంచి ‘ఆదిపురుష్’, సలార్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ ఏడాది కల్కితో ఇప్పటికే ఆడియన్స్‌ను పలకరించిన ప్రభాస్ డిసెంబర్‌లో రానున్న ‘కన్నప్ప’లో ఓ క్యామియోతో అలరించనున్నాడు. ఆపై 2025లో మూడు చిత్రాలు, 2026 కోసం ‘సలార్ 2’, హను రాఘవపూడి దర్శకత్వంలోని చిత్రాన్ని రెడీ చేసుకున్నాడు. ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడానికి తారక్, అల్లుఅర్జున్, రామ్‌చరణ్ వంటి స్టార్ హీరోలు తడబడుతుంటే ప్రభాస్ మాత్రం అలవోకగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. అది కూడా పాన్ ఇండియా స్థాయి చిత్రాలను చక చక పూర్తి చేస్తుండటం ఇండస్ట్రీలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
రేసుకు తెరలేపిన ప్రభాస్!
ప్రభాస్ అప్‌కమింగ్ చిత్రం 'రాజా సాబ్'ను 2025 సమ్మర్ కానుకగా తీసుకురాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్‌గా ఐదు (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ) భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే 2025 సమ్మర్ రేసులో పలు భారీ చిత్రాలు నిలిచాయి. నాగ చైతన్య 'తండేల్' (Thandel), నాగార్జున - ధనుష్ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం 'కుబేర' (Kubera)ను వచ్చే ఏడాది వేసవిలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అటు ‘కేజీఎఫ్’ ఫేమ్ యష్ నటిస్తున్న 'టాక్సిక్' (Toxic) కూడా సమ్మర్ -2025 టార్గెట్‌గా రూపొందుతోంది. అటు హిందీలో సల్మాన్ నటిస్తున్న 'సికిందర్' కూడా ఈ రేసులో ఉన్నాయి. ప్రభాస్ సినిమా డేట్‌ను లాక్ చేసుకున్న నేపథ్యంలో ఆయా చిత్రాలు సమ్మర్‌లోనే రిలీజ్ అవుతాయా? లేక ప్రీపోన్ లేదా పోస్ట్ పోన్ చేసుకుంటాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.
జూలై 30 , 2024
RamCharan Global Craze: రామ్ చరణ్ లాంటి నటుడు మాకు కావాలి: హాలీవుడ్
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ‘రామ్‌చరణ్’ (Ramcharan).. టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో ఒకరిగా మారారు. ‘చిరుత’తో ఎంట్రీ ఇచ్చిన అతడు.. ‘మగధీర’తో స్టార్ హీరోగా మారిపోయాడు. ‘రంగస్థలం’ ద్వారా తనలో దాగున్న అద్భుతమైన నటుడ్ని ఆడియన్స్‌కు పరిచయం చేశాడు. రీసెంట్‌గా వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’తో రామ్‌చరణ్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించాడు. ఈ చిత్రం ఆస్కార్ స్థాయికి ఎదగడంతో ఇందులో నటించిన తారక్ (Jr NTR), రామ్‌చరణ్ గురించి గ్లోబల్ స్థాయిలో చర్చ జరిగింది. ప్రస్తుతం హాలీవుడ్‌లో రామ్‌చరణ్‌కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో చెప్పే పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసిన మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
‘చరణ్ లాంటి నటుడు కావాలి’
హాలీవుడ్‌లో ఓ నటీనటుల ఎంపిక సంస్థ తమకి ఈ లక్షణాలు ఉన్న నటుడు కావాలని కొన్ని పాయింట్స్ పెట్టి అందులో పలువురు హాలీవుడ్ స్టార్స్ ఫొటోలను చేర్చింది. ఆస్కార్ ఇసాక్ (Oscar Isaac), టెనెట్ (Tenet) నటుడు జాన్ డేవిడ్ వాషింగ్టన్ (John David Washington), టాప్ గన్ (Top Gun) ఫేమ్ మైల్స్ టెల్లర్ (Miles Teller) లాంటి నటులతో సహా ఆర్‌ఆర్‌ఆర్ (RRR)లో రామ్‌చరణ్ పోలీసు గెటప్‌ను చేర్చింది. తమకు వీరి రేంజ్ ఫిజిక్, లుక్స్ ఉన్న నటులు కావాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రామ్‌చరణ్ (RamCharan) లాంటి నటుడ్ని హాలీవుడ్ కోరుకుంటోందని మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తమ హీరో పక్కా హాలీవుడ్ మెటిరియల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు లేటెస్ట్ పోస్టరే ఉదాహరణ అంటూ పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/TweetRamCharan/status/1763423843023196469?s=20
‘గేమ్ ఛేంజర్’లో ఎన్ని కోణాలో!
ప్రస్తుతం రామ్ చరణ్.. 'గేమ్ ఛేంజర్' (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడు ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెండూ పొంతనలేని పాత్రలని టాక్. అందులో ఒక పాత్ర నేటి యువతరానికి ప్రతీకగా నిలిచేదైతే.. మరో పాత్ర 1970-80 కాలానికి చెందిందని అంటున్నారు. రెండు పాత్రల ఆహార్యాలు కూడా పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇందులో రామ్‌చరణ్ పోషిస్తున్న ఒక పాత్ర పేరు ‘రామ్ నందన్’ అని తెలుస్తోంది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ మూవీలో పీరియాడికల్ నేపథ్యంతో పాటు, ప్రేమ, స్నేహం, నమ్మకద్రోహం, ప్రతీకారం, సామాజిక సమస్యలు.. అన్నీ మిళితమై ఉంటాయని వినికిడి. కైరా అద్వాణీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, శ్రీకాంత్, ఎస్.ఎ.సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అంబానీ కొడుకు వెడ్డింగ్‌కు రామ్‌చరణ్!
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్‌తో ఏడడుగులు వేయబోతున్నాడు. అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫిబ్రవరి 28 నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మొదలయ్యాయి. ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు రామ్‌చరణ్ అటెండ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. తన సతీమణి ఉపాసనతో కలిసి ఈ పెళ్లి వేడుకల్లో చెర్రీ పాల్గొంటారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ మాత్రమే అనంత్ పెళ్లి వేడుకలకు హాజరుకాబోతున్నట్లు సమాచారం. రామ్‌చరణ్‌తో పాటు షారుఖ్ ఖాన్ తన భార్య పిల్లలతో అనంత్ అంబానీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొననున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బుచ్చిబాబుతో స్పోర్ట్స్ డ్రామా చిత్రం!
గేమ్ ఛేంజర్ తర్వాత రామ్‌చరణ్.. ఉప్పెన (Uppena) ఫేమ్ బుచ్చిబాబు (Buchi Babu)తో ఓ స్పోర్ట్స్ డ్రామా మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ సైతం రెడీ అయిపోయింది. ఈ మూవీ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ‘RC16’ మూవీలో కన్నడ అగ్ర హీరో శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ ఏడాదే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో రామ్‌చరణ్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించనుంది.
ప్రొడ్యూసర్‌గానూ బిజీ బిజీ!
హీరోగా బిజీగా ఉంటూనే చిత్ర నిర్మాణంపై రామ్‌చరణ్ ఫోకస్ పెట్టాడు. తండ్రి చిరంజీవితో ఆచార్య, ఖైదీ నంబర్ 150 వంటి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించిన చరణ్.. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశంతో కూడిన చిన్న సినిమాలను నిర్మిచండానికి ‘వీ మెగా పిక్చర్స్’ పేరుతో మరో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఈ బ్యానర్ ద్వారా ‘ది ఇండియా హౌజ్’ పేరుతో ఓ దేశభక్తి మూవీని చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు.
మార్చి 01 , 2024
AI Gender Swapped: జంబలకిడి పంబ అంటే ఇదే.. మన సెలబ్రిటీలను ఇలా చూసి ఉండరు..!
జంబలకిడి పంబ సినిమా గుర్తుందా. ఇందులోని మగవారు, ఆడవారిగాను, ఆడవారు మగవారిగానూ మారుతుంటారు. కట్టుబొట్టుతో అచ్చం తమ అపొజిట్ జెండర్‌గా కనిపిస్తారు. అయితే కృత్రిమ మేధ(AI) కూడా సరిగ్గా ఇదే చేసింది. టాప్ సెలబ్రిటీల చిత్రాలను తీసుకొని వారి జెండర్‌ను మార్చేసింది. మరి మన సెలబ్రిటీలు తమ ఆపోజిట్ జెండర్‌లో ఎలా ఉంటారు?. మగవారు ఆడవారిలాగా, ఆడవారు మగవారిగా మారితే వారి లుక్ ఎలా ఉంటుంది?. తెలియాలంటే ఈ కథనం చూసేయండి.
1. నరేంద్ర మోదీ
ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ కలిగిన నేతల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకరు. ప్రధాని మోదీ తనదైన వేషధారణతో ఎంతో హుందాగా కనిపిస్తారు. అటువంటి మోదీ ఒక మహిళ అయితే ఎలా ఉంటాడో AI చూపించింది.
2. విరాట్ కోహ్లీ
అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. మైదానంలో ఎంతో చురుగ్గా ఉండే కోహ్లీ బయట చాలా స్టైలిష్‌గా కనిపిస్తాడు. అటువంటి విరాట్ కోహ్లీ.. యువతిగా మారితే ఎలా ఉంటాడో ఒక లుక్ వేయండి.
https://twitter.com/mvdhav/status/1612298825368240128?s=20
3. ఎలాన్ మస్క్
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఉన్నారు. ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. మస్క్ అమ్మాయి అయితే ఎలా ఉంటారో AI చేసి చూపించింది.
4. అజయ్ దేవ్‌గన్
బాలీవుడ్ సినిమాల్లో పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా నటుడు అజయ్ దేవ్‌గన్ అలరించాడు. యాక్షన్, ఫైట్ సీన్లలో తనదైన నటనతో ఆకట్టున్నాడు. అలాంటి దేవ్‌గన్ మహిళ అయితే ఎలా ఉంటాడో AI మీ ముందు ఉంచింది.
https://twitter.com/mvdhav/status/1612299501737496576?s=20
5. అలియాభట్
బాలీవుడ్ నటి అలియా భట్ పలు సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తన అందం, అభినయం, నటనతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అటువంటి అలియా మగాడిగా మారితే ఇంకెంత హ్యాండ్సమ్‌గా ఉంటాడో కదా.
6. మార్క్ జూకర్‌బర్గ్
ఫేస్‌బుక్ సృష్టికర్త మార్క్ జూకర్‌బర్గ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన కూడా తన ఆపోజిట్ జెండర్‌లో ఎలా ఉంటారో AI చూపించింది.
https://twitter.com/mvdhav/status/1612300171655917568?s=20
7. దీపికా పదుకొనే
బాలీవుడ్ అగ్ర కథానాయికల్లో దీపికా పదుకొనే ఒకరు. గ్లామర్ క్వీన్‌గా గుర్తింపు పొందిన ఈ భామ ఒక పురుషుడైతే ఎలా ఉంటాడో మీరే చూడండి.
8. అక్షయ్ కుమార్
బాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ హీరోగా అక్షయ్ కుమార్ గుర్తింపు పొందారు. మహిళల్లోనూ ఆయనకు మంచి క్రేజ్ ఉంది. అటువంటి అక్షయ్‌ను AI వద్దల్లేదు. ఈ హీరో అమ్మాయిగా పుడితే ఎలా ఉంటాడో కళ్లకు కట్టింది.
https://twitter.com/mvdhav/status/1612300512698986498?s=20
9. ప్రభాస్
బాహుబలి సినిమాతో ప్రభాస్ కెరీర్ మారిపోయింది. ఆ సినిమా ప్రభాస్‌కు పాన్ ఇండియా క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. మరి ప్రభాస్ అమ్మాయిగా మారితే ఎలా ఉంటాడో ఒక లుక్కేయండి.
10. లియోనార్డో డికాప్రియో
టైటానిక్ సినిమా ద్వారా లియోనార్డో డికాప్రియా పేరు మారుమోగింది. ఆ తర్వాత కూడా పలు హిట్ చిత్రాలతో లియోనార్డో మంచి గుర్తింపు సంపాదించాడు. హాలీవుడ్ హీరోయిన్ల అందానికి ఏమాత్రం తీసిపోని విధంగా అమ్మాయి లుక్‌లో లియోనార్డో ఉన్నాడు.
https://twitter.com/mvdhav/status/1612301198668992513?s=20
11. లియోనెల్ మెస్సీ
అర్జెంటినా ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనాల్ మెస్సీ.. తనదైన ఆటతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. అతడు కూడా అమ్మాయి లుక్‌లో ఎలా ఉంటాడో AI మార్ఫింగ్ చేసి చూపించింది.
12. క్రిస్టియానో రొనాల్డో
పోర్చుగల్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో కూడా తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. మహిళగా రొనాల్డో లుక్ ఎలా ఉందో చూసేయండి.
https://twitter.com/mvdhav/status/1612301499228655616?s=20
13. రాక్
హాలీవుడ్ సినిమాలను విపరీతంగా ఇష్టపడేవాళ్లలో రాక్ తెలియని వారు ఉండరు. కండలు తిరిగిన దేహంతో ఎన్నో సూపర్ హిట్ యాక్షన్ సినిమాల్లో ఆయన నటించాడు. అటువంటి రాక్ మహిళగా మారితే ఎలా ఉంటాడు? ఊహించడానికే కష్టంగా ఉంది కదా.
14. నోరా ఫతేహి
బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి కూడా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకుంది. తన గ్లామర్ స్టెప్పులతో కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. మరి నోరా అబ్బాయిగా మారితే ఎలా ఉంటుందో చూడండి.
https://twitter.com/mvdhav/status/1612301736508784641?s=20
15. షారుక్ ఖాన్
బాలీవుడ్ బాద్‌షాగా పేరు సంపాదించిన షారుక్ ఖాన్.. అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అటువంటి షారుక్ మహిళగా మారితే ఎలా ఉంటాడో చూడాలని ఉందా. అయితే చూసేయండి.
16. బాబా రాందేవ్
యోగా గురు బాబా రాందేవ్ అంటే దేశంలో తెలియని వారు ఉండరు. ఎంతో కఠినమైన ఆసనాలను సైతం చాలా తేలికగా ఆయన వేస్తుంటారు. అయితే బాబా రాందేవ్ ఫొటోను మహిళ చిత్రంగా మార్చడంలో AI విఫలమైంది. కేవలం ఆయన్ను యంగ్‌గా మాత్రమే మన ముందు ఉంచింది.
https://twitter.com/mvdhav/status/1612302529223880705?s=20
17. ముకేష్ అంబానీ
దేశంలోని అపర కుభేరుల్లో ముకేష్ అంబానీ ఒకరు. రిలయన్స్ ఇండస్ట్రీ కింద అనేక వ్యాపార సామ్రాజ్యాలు స్థాపించి ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగారు. అటువంటి అంబానీ మహిళగా మారితే ఎలా ఉంటారో చూడండి.
18. మోనాలిసా
ప్రపంచంలోని అత్యంత అందమైన చిత్ర పటాల్లో మోనాలిసాది తొలి స్థానంలో ఉంటుంది. అలాంటి మోనాలిసా అబ్బాయిగా మారితే ఎలా ఉంటుందో AI చేసి చూపించింది.
https://twitter.com/mvdhav/status/1612302687500120064?s=20
మే 05 , 2023
Telugu Movies 2025: వచ్చే ఏడాది రాబోతున్న మోస్ట్ వాంటెడ్ టాప్-10 చిత్రాలు!
సాధారణంగా ప్రతీ సంవత్సరం కొత్త సినిమాలు రిలీజవుతూనే ఉంటాయి. అయితే 2025 సంవత్సరం మాత్రం తెలుగు ప్రేక్షకులకు ఎంతో ముఖ్యమైనది. వారు ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రాలు 2025లోనే గ్రాండ్‌గా విడుదల కాబోతున్నాయి. ముఖ్యంగా పది చిత్రాల కోసం సినీ లవర్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ సినిమాలకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చిన ట్రెండింగ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? అందులో చేస్తోన్న స్టార్ హీరోలు ఎవరు? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
[toc]
రాజాసాబ్ (The Raja Saab)
ప్రభాస్ (Prabhas) సినిమా వస్తుందంటే ఇండియన్ బాక్సాఫీస్ కళకళలాడిపోతుంది. ఈ ఏడాది ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ వచ్చే ఏడాది ‘రాజాసాబ్’ మరోమారు బాక్సాఫీస్‌పై దండ యాత్ర చేయబోతున్నాడు. మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. లవర్ బాయ్ మేకోవర్‌తో అదరగొడుతున్నాడు. దీంతో రాజా సాబ్ కోసం ప్రభాస్ ఫ్యాన్ తెగ ఎదురుచూస్తున్నాడు.
ఓజీ (OG)
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘ఓజీ’ చిత్రంపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. సుజీత్ (Director Sujeeth) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ తొలిసారి గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో పవన్ ఊచకూత చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దీంతో పవన్ చేతిలో ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్’ వంటి ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ ‘ఓజీ’ పైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. 2025 సమ్మర్‌లో ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. లేదంటే సెప్టెంబర్‌లోనైనా కచ్చితంగా విడుదల చేసే ఛాన్స్ ఉంది.
గేమ్ ఛేంజర్ (Game changer)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది. జనవరి 10న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నారు. ‘RRR’ వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత చరణ్ చేసిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇందులో రామ్‌చరణ్ తొలిసారి కలెక్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అతడి లుక్స్‌కు సంబంధించిన ఫొటోలు సైతం ఇటీవల పెద్ద ఎత్తున లీకయ్యాయి. అవినీతిపరులైన రాజకీయ నాయకులపై పోరాటం చేసే ఐఏఎస్ అధికారి పాత్రలో చరణ్ ఎలా నటించాడోనని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
వార్ 2 (War 2)
టాలీవుడ్ అగ్ర కథనాయకుల్లో ఒకరైన జూ.ఎన్టీఆర్ (Jr NTR) ‘వార్ 2’ (War 2) చిత్రంతో హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నాడు. ఇందులో హృతిక్ రోషన్ (Hrithik Roshan)కు ప్రత్యర్థిగా తారక్ నటిస్తున్నారన్న టాక్ బలంగా ఉంది. దేవర వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత తారక్ స్క్రీన్‌పై కనిపించనున్న చిత్రం కూడా ఇదే కావడంతో ‘వార్ 2’ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల లాగానే హిందీ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకోవాలని కోరుకుంటున్నారు. 2025 ఆగస్టు 15న వార్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.
VD 12
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘VD 12’ తెరకెక్కుతోంది. వరుసగా నాలుగు ఫ్లాప్స్ తర్వాత చేస్తోన్న చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ప్రాణం పెట్టి చేస్తున్నాడు. ఇందులో రగ్‌డ్ లుక్‌లో కనిపించి మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం విజయ్‌కు కేజీఎఫ్ లాంటి మూవీ అవుతుందని ప్రముఖ నిర్మాత నాగవంశీ వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా హైప్ పెరిగింది. దీంతో ఈ మూవీ కోసం తెలుగు ఆడియన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. 2025 మార్చి 28న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
తండేల్ (Thandel)
నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటిస్తున్న ‘తండేల్’ మూవీపై టాలీవుడ్‌లో మంచి హైప్ ఉంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ (Love story) మంచి హిట్ కావడంతో పాటు చైతూ మత్సకారుడిగా ఇందులో నటిస్తుండంతో తండేల్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఎంతో ప్రతీష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం.
మిరాయ్ (Mirai)
‘హనుమాన్’ (Hanuman) వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) ‘మిరాయ్’ అనే మరో పాన్‌ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ (Manchu Manoj) విలన్‌గా నటిస్తున్నాడు. కెరీర్‌లో తొలిసారి నెగిటివ్ పాత్ర పోషిస్తున్నాడు. దీంతో తేజ సజ్జా - మంచు మనోజ్ మధ్య ఫైట్ ఏ విధంగా ఉంటుందోనని తెలుగు ఆడియన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం 2024 ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కుబేరా (Kubera)
క్లాసిక్ సినిమాలకు పెట్టింది పేరైనా దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) 'కుబేర' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో తమిళ నటుడు ధనుష్ (Dhanush)తో పాటు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున (Akkineni Nagarjuna) లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. ఇందులో బిచ్చగాడి పాత్రలో ధనుష్ చేస్తున్నట్లు టాక్. మరోవైపు నాగార్జున పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి స్టార్ హీరోలను శేఖర్ కమ్ముల ఏ విధంగా చూపిస్తారోనన్న అంచనాలు అందరిలో ఉన్నాయి. ఈ మూవీని వచ్చే ఏడాది పక్కాగా రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు.
జీ 2 (G2)
అడివి శేష్ (Adivi Sesh) హీరోగా వినయ్ కుమార్ సిరిగినీడి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'జీ 2'. గతంలో విడుదలై బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన 'గూడాఛారి' (Goodachari) చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. పైగా ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్‌గా నటిస్తుండటంతో అందరిలోనూ భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. స్పైగా అడివి శేష్ ఈసారి ఎలాంటి సాహసాలు చేస్తాడోనని సినీ లవర్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా 2025లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
NANI 33
‘దసరా’ (Dasara) తో గతేడాది ఘన విజయాన్ని అందుకున్నారు నాని (Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela). వీరిద్దరి కాంబోలో ఇటీవల కొత్త ప్రాజెక్ట్ ఓకే అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆఖరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించే ఛాన్స్ ఉంది. దీంతో ‘NANI 33’ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దసరా లాంటి బ్లాక్ బాస్టర్ మరోమారు రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు.
అక్టోబర్ 23 , 2024
HBD Nagarjuna: నాగార్జున బర్త్‌డే స్పెషల్.. ఆయన వేసిన ఈ డేరింగ్ స్టెప్స్ ఏ హీరో వేయలేదు భయ్యా!
అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున (Akkineni Nagarjuna) ఏ హీరో చేయనన్నీ ప్రయోగాలు తనపై తాను చేసుకున్నారు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా వైవిధ్యమైన చిత్రాలతో కెరీర్‌లో ముందుకు సాగారు. మాస్, క్లాస్, ఆధ్యాత్మికం, లవ్ ఇలా అన్ని జానర్స్‌లో చిత్రాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అక్కినేని కుటుంబం నుంచి మూడో తరం వారసులుగా తన ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్‌ను సైతం ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి తండ్రిగానూ సక్సెస్ అయ్యారు. ఇండస్ట్రీలో నాగార్జున సక్సెస్ వెనుక కొన్ని డేరింగ్ స్టెప్స్ ఉన్నాయి. ఇవాళ (ఆగస్టు 29) నాగార్జున బర్త్‌డే సందర్భంగా వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
'శివ'తో సెన్సేషన్
సాధారణంగా కెరీర్ తొలినాళ్లలో ఏ హీరో అయినా సేఫ్ స్టోరీలను ఎంచుకొని సినిమాలు చేస్తుంటారు. అయితే నాగార్జున ‘శివ’ అనే ప్రయోగాత్మక చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. కనీసం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయని రామ్‌గోపాల్ వర్మకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి గొప్ప సాహసమే చేశారు. నాగార్జున వేసిన ఆ డేరింగ్ స్టెప్ అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఎవరూ ఊహించిన విధంగా ‘శివ’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. నాగ్ కెరీర్‌తో పాటు టాలీవుడ్ దిశను కూడా శివ పూర్తిగా మార్చేసింది. హీరో అంటే ఇలాగే ఉండాలన్న మూసధోరణికి ‘శివ’తో నాగ్ - రామ్‌గోపాల్ వర్మ చెక్ పెట్టారు.
వైవిధ్యతకు ప్రాధాన్యం
శివ సినిమాతో నాగార్జున ఇండస్ట్రీలో టాప్ హీరోగా మారిపోయాడు. అప్పట్లో ఒక సినిమా హిట్ అయ్యిందంటే అదే ప్యాట్రన్‌లో చాలా కథలు వచ్చి పడేవి. అయితే నాగార్జున వాటికి తలొగ్గకుండా సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ‘గోవిందా గోవిందా’లాంటి సూపర్ నేచురల్ హెయిస్ట్ ఫిల్మ్, ‘నిన్నే పెళ్లాడతా’ వంటి ఫ్యామిలీ డ్రామా, ‘హలో బ్రదర్’లాంటి యాక్షన్ ఎంటర్‌టైనర్‌లతో ఫ్యాన్స్‌ను అలరించారు. తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయాడు.
‘అన్నమయ్య’
చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి హీరోలు కమర్షియల్ చిత్రాలతో దూసుకుపోతున్న తరుణంలో నాగార్జున ‘అన్నమయ్య’ ప్రాజెక్ట్‌ను ఓకే చేసి అప్పట్లో అందరికీ షాక్ ఇచ్చారు. అప్పటికే మాస్ ఇమేజ్ తెచ్చుకున్న నాగార్జున డివోషనల్ చిత్రం చేయడమేంటని ఇండస్ట్రీలో విమర్శలు వచ్చాయి. నటుడు అంటే అన్ని రకాల పాత్రలు వేయాలన్న సిద్ధాంతాన్ని నమ్మిన నాగార్జున ఏమాత్రం సంకోచించకుండా అన్నమయ్య సినిమాలో నటించారు. రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. నాగార్జున తన నటనతో నిజమైన అన్నమయ్యను గుర్తుచేశారు. ఈ చిత్రానికి ఏకంగా రెండు జాతీయ పురస్కారాలు, తొమ్మిది నంది అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ రావడం విశేషం.
మరిన్ని ఆధ్యాత్మిక చిత్రాలు..
‘అన్నమయ్య’ సక్సెస్‌తో నాగార్జున సరిపెట్టుకోలేదు. ఓవైపు కమర్షియల్ చిత్రాలు చేస్తూనే మరిన్ని భక్తిరస సినిమాల్లో ఆయన నటించారు. రాఘవేంద్రరావు-నాగార్జున కాంబోలో వచ్చిన ‘రామదాసు’ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అలాగే ‘శిరిడి సాయి’, ‘ఓం నమో వేంకటేశాయ’, ‘జగద్గురు ఆది శంకర’ వంటి ఆధ్యాత్మిక చిత్రాల్లో నాగార్జున మెరిశారు.
కొత్తవారికి ఛాన్స్..
కొత్త వారికి అవకాశం ఇవ్వడంలో రిస్కే కాదు, విజయమూ ఉందని ఎన్నోసార్లు నిరూపించారు నాగార్జున. సుదీర్ఘ నట ప్రస్థానంలో సుమారు 40 మంది దర్శకులను ఆయన టాలీవుడ్‌కి పరిచయం చేశారు. రామ్‌గోపాల్ వర్మ (శివ), వైవీఎస్ చౌదరి (శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి), లారెన్స్ (మాస్), విజయ్ బిన్నీ (నా సామిరంగ) తదితరులు ఆ జాబితాలోకే వస్తారు. తాను స్టార్ కావడానికి కారణం ఓ రకంగా నూతన దర్శకులే అంటుంటారు నాగ్.
తెలుగులో ఫస్ట్ పాన్ ఇండియా స్టార్
తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలను మార్చిన హీరోగా నాగార్జునను చెబుతుంటారు. ఈ విషయంపై డైరెక్టర్ కృష్ణవంశీ ఓ ఇంటర్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాను గ్లోబల్ చేసిన హీరో నాగార్జున అని కొనియాడారు. ఇతర ఇండస్ట్రీలకు చెందిన డైరెక్టర్లను తీసుకొచ్చి తన సొంత డబ్బుతో వైవిధ్యమైన చిత్రాలు నిర్మించారని గుర్తుచేశారు. తద్వారా ఆడియన్స్ విజన్‌ను నాగార్జున మార్చేశారని పేర్కొన్నారు. మణిరత్నం, ప్రియదర్శన్, ఫాజిల్, రవిచందర్, మహేష్ భట్ ఇలా మలయాళం, కన్నడ, హిందీ, తమిళ ఇండస్ట్రీలకు చెందిన డైరెక్టర్లతో నాగార్జున వర్క్ చేశారని గుర్తుచేశారు. చిన్న క్యారెక్టర్ అయినా బాంబే వెళ్లి వచ్చేవారని పేర్కొన్నారు. పాన్ ఇండియా అనే మాటకు మెుదట ఫౌండేషన్ వేసిందే నాగార్జున అని ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
https://twitter.com/thokkaloteja/status/1828863171152757038
బిగ్ బాస్ హోస్ట్‌గా..
సాధారణంగా స్టార్‌డమ్ వచ్చిన హీరోలు బుల్లితెర షోలలో కనిపించేందుకు పెద్దగా ఆసక్తి కనిపించరు. వారి దృష్టంతా సినిమాలపైనే ఉంటుంది. అయితే నాగార్జున అలా కాదు. బిగ్‌బాస్ తెలుగు షోకు గత కొన్నేళ్లుగా హోస్ట్‌గా వ్యవహరిస్తూ బుల్లితెర ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఎన్టీఆర్, తారక్ వంటి కుర్ర హీరోలు ఒక సీజన్‌కు మాత్రమే పరిమితం కాగా నాగ్ మాత్రం అలవోకగా సీజన్‌లపైన సీజన్‌లు చేసుకుంటూ వెళ్తున్నారు. వరుసగా ఐదు సీజన్ల (Bigg Boss 3,4,5,6,7)కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సెప్టెంబరు 1న ప్రారంభం కానున్న 8వ సీజన్‌కూ ఆయనే వ్యాఖ్యాత. అంతేకాదు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి కూడా నాగ్ హోస్ట్‌గా వ్యవహించడం గమనార్హం.
https://twitter.com/i/status/1829013612117230039
ఫిట్‌నెస్ మంత్ర
నాగార్జున ఫిట్‌నెస్‌ను చూసి కుర్ర హీరోలు సైతం షాకవుతుంటారు. శివ సమయంలో నాగ్ ఫిజిక్ ఎలా ఉందో ఇప్పటికే అదే బాడీని మెయిన్‌టెన్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆరు పదుల వయసులోనూ ఎంతో గ్లామర్‌గా కనిపిస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండటం, వర్కౌట్ చేయడమే తన అందం సీక్రెట్ అంటూ పలు వేదికల్లో నాగార్జున చెప్పుకుంటా వచ్చారు. 1986లో ‘విక్రమ్’(Vikram)తో హీరోగా పరిచయమైన నాగ్ వంద చిత్రాలకు చేరుకున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ (Kubera)లో నటిస్తున్నారు.
ఆగస్టు 29 , 2024
Hit 3 Movie: సైకో కిల్లర్‌గా రానా దగ్గుబాటి.. నానితో బిగ్ ఫైట్‌కి రెడీ!
టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో నాని (Nani), దగ్గుబాటి రానా (Daggubati Rana) ముందు వరుసలో ఉంటారు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ వీరిద్దరికీ మంచి ఫాలోయింగ్ ఉంది. జానర్‌తో సంబంధం లేకుండా వీరు తమ మార్క్ నటనతో మెప్పిస్తుంటారు. అటు బయట కూడా నాని-రానా మంచి ఫ్రెండ్స్‌గా గుర్తింపు పొందారు. ఇటువంటి కథానాయకులు ప్రత్యర్థులుగా మారితే? సినిమాలో ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటే? ఊహిస్తేనే ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది కదా. అయితే ఇది ఊహా మాత్రమే కాదు.. త్వరలోనే నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో వీరిద్దరు హీరో విలన్లుగా కనిపించబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
‘హిట్ 3’ మూవీలో..
టాలీవుడ్‌లో 'హిట్' (Hit) సినిమా సిరీస్‌లకు మంచి క్రేజ్ ఉంది. శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో వచ్చిన 'హిట్' (Hit: The First Case), ‘హిట్ 2’ (Hit 2 : The Second Case) సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇందులో హీరోలుగా చేసిన విశ్వక్ సేన్, అడవి శేష్‌లకు కెరీర్ పరంగా మంచి మైలేజ్‌ను తీసుకొచ్చాయి. ఇక హిట్ సిరీస్‌కు కొనసాగింపుగా రానున్న పార్ట్ 3 చిత్రంలో నాని హీరోగా చేయనున్నట్లు సెకండ్ పార్ట్ ఎండింగ్‌లోనే డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ‘హిట్ 3’ (Hit 3: Third Case) ఎప్పుడు మెుదలవుతుందా అని మూవీ లవర్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే చాలాకాలం తర్వాత ‘హిట్ 3’ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. ఇందులో నానికి ప్రత్యర్థిగా దగ్గుబాటి రానా కనిపించబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఈ వార్త టాక్ ఆఫ్ టాలీవుడ్‌గా మారిపోయింది.
సైకో కిల్లర్‌గా రానా?
‘హిట్’, ‘హిట్ 2’ చిత్రాలను పరిశీలిస్తే ఈ రెండు సినిమాలు.. వరుస హత్యలు, సైకో కిల్లర్, పోలీసు ఇన్‌వెస్టిగేషన్ నేపథ్యంలోనే వచ్చాయి. కాబట్టి ‘హిట్ 3’ కూడా ఆ తరహా కథాంశంతోనే రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో నాని.. పవర్‌ఫుల్ పోలీసు అధికారిగా కనిపించనున్నాడు. ఇక నానిని ఢీకొట్టే స్థాయిలోనే రానా పాత్ర ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రానాకు తన పాత్రను వివరించగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ‘హిట్ 3’లో రానా క్రూరమైన సైకో కిల్లర్‌గా కనిపించనున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. అతడి పాత్ర ఎంతగానో భయపెడుతుందని అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఉండనున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
టైటిల్ ఛేంజ్..!
నేచురల్ స్టార్ నాని నటించిన గత రెండు చిత్రాలు 'దసరా' (Dasara), 'హాయ్ నాన్న' (Hi Nanna) మంచి విజయాన్ని సాధించాయి. దీంతో ప్రస్తుతం నాని హ్యాట్రిక్ హిట్స్‌పై ఫోకస్ పెట్టాడు. ఆయన నటించిన 'సరిపోదా శనివారం' త్వరలోనే విడుదల కానుంది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహనన్ హీరోయిన్‌గా చేస్తోంది. గతంలో ఈ హీరో - హీరోయిన్ - డైరెక్టర్ కాంబోలోనే 'గ్యాంగ్ లీడర్' (Gang Leader) అనే సినిమా రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో నాని, ప్రియాంక జంటకు మంచి మార్కులు పడ్డాయి. కాగా, ‘సరిపోదా శనివారం’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రాబోతోంది. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళం, కన్నడ వెర్షన్స్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. తెలుగు మినహా మిగతా భాషల్లో ఈ మూవీని 'సాటర్ డే' (Saturday) టైటిల్‌తో రిలీజ్ చేయబోతున్నారు. ఆగస్టు 29న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.
క్రేజీ కాంబో లాక్..!
టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో లాకైనట్లు తెలుస్తోంది. నేచరల్ స్టార్ నాని, స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు సమాచారం. ఇటీవలే నానిని కలిసిన శేఖర్ కమ్ముల.. మూవీకి సంబంధించిన లైన్‌ను చెప్పారట. అది నానికి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఏషియన్ సునీల్ నిర్మించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నాని, శేఖర్ కమ్ముల కాంబోలో గతంలో సినిమా రాలేదు.. ఇదే ఫస్ట్ టైమ్. ప్రస్తుతం శేఖర్ కమ్ముల.. 'కుబేర' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ధనుష్, నాగార్జున హీరోలుగా చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత నాని ప్రాజెక్ట్‌పై శేఖర్ కమ్ముల ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం.
జూలై 03 , 2024
Latest OTT telugu Movies: ఈ వీకెండ్‌లో ఈ చిత్రాలను అస్సలు మిస్ కాకండి.. సూపర్బ్ థ్రిల్లింగ్ సినిమాలు
రీసెంట్‌గా చాలా సినిమాలు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో థియేటర్లలో విడుదలై రెండు వారాలు గడవకముందే ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఉన్నాయి. మరికొన్ని నేరుగా ఓటీటీల్లోకి విడుదలైన వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. ఇక్కడ అందిస్తున్న లిస్ట్‌లో దాదాపు అన్నింటికీ ప్రేక్షకుల నుంచి మంచి రివ్యూలు అందుకున్నవే ఉన్నాయి. మరి వీటిలో మీకు నచ్చిన జనర్‌ను ఎంచుకుని వీకెండ్‌ను ఎంజాయ్ చేయండి
లవ్ మీ ఇఫ్ యు డేర్ మీ
రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్, బేబీ మూవీ వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లవ్ మీ’ (Love Me). ఇఫ్ యూ డేర్ (If You Dare) అనేది ఉప శీర్షిక. ఈ చిత్రాని అరుణ్ తెరకెక్కించారు. దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించారు. దెయ్యంతో హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. మే 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్(జూన్ 15) వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్‌లో కాస్త రొమాంటిక్ డోస్ కావాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే... అర్జున్ (ఆశిష్), ప్రతాప్(రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలు, స్మశానాలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్ లవర్ ప్రియా (వైష్ణవి చైతన్య).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. మరి ఆ దెయ్యం కూడా అర్జున్ ప్రేమలో పడుతుందా? అసలు ఈ దివ్యవతి ఎవరు? సినిమా ప్రారంభంలో నిప్పంటించుకొని చనిపోయిన కపుల్‌తో ఆమెకున్న సంబంధం ఏంటి? చివరికీ ఏమైంది? అన్నది కథ.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
విష్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari). నేహాశెట్టి హీరోయిన్. అంజలి కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.మే 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా బ్రేక్ ఈవెన్ సాధించి విజయం అందుకుంది. ముఖ్యంగా విష్వక్ సేన్ మాస్ నటన ప్రేక్షకులను అలరించింది. నెహ శెట్టి, అంజలి గ్లామర్ తోడవడంతో (Gangs of Godavari Ott) ఆశించిన ఫలితం సాధించింది. అయితే థియేటర్లలో ఈ సినిమా మిస్ అయినవారు ఓటీటీలో వీక్షించే అవకాశం తాజాగా లభించింది. ప్రస్తుతం ఈ చిత్రం(జూన్ 14నుంచి) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌పామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అప్పుడు మిస్ అయిన వారు ఈ వీకెండ్‌లో చూసి ఎంజాయ్ చేయండి.
ఇక ఈ సినిమా కథ విషాయానికొస్తే.. పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం(విష్వక్ సేన్).. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. మంచి ఉద్దేశ్యంతో పాలిటిక్స్‌లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు? పాలిటిక్స్‌లో తన లక్ష్యాన్ని హీరో చేరుకున్నాడా? లేదా? అన్నది కథ.
పారిజాత పర్వం
సునీల్, శ్రద్ధాదాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijatha Parvam). సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్' అని ఉపశీర్షిక పెట్టారు. (ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం(జూన్ 12 నుంచి) ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కామెడీ జనర్‌లో వచ్చిన ఈ సినిమా వీకెండ్‌లో చూసేందుకు మంచి ఛాయిస్‌గా చెప్పవచ్చు.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. చైతన్య (చైతన్యరావు) డైరెక్టర్ కావాలని కలలు కంటుంటాడు. స్నేహితుడ్ని (హర్ష) హీరోగా పెట్టి ఓ కథతో నిర్మాతల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతాడు. ఆ ప్రయత్నాలు సక్సెస్ కాకపోవడంతో చివరికి తానే నిర్మాతగా మారి సినిమా తీయాలని ఫిక్సవుతాడు. డబ్బు కోసం శెట్టి (శ్రీకాంత్ అయ్యంగార్) సెకండ్ సెటప్‌ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేస్తాడు. మరోవైపు బారు శ్రీను (సునీల్), పారు (శ్రద్దా దాస్) కూడా ఆమెను కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మరి ఈ ఇద్దరిలో శెట్టి భార్యని ఎవరు కిడ్నాప్ చేశారు? అసలు బారు శ్రీను ఎవరు? అతడి కథేంటి? చైతన్య డైరెక్టర్ అయ్యాడా? లేదా? అన్నది కథ.
యక్షిణి
మంచు లక్షి, వేదిక ప్రధాన పాత్రల్లో నటించిన సోషియో ఫాంటసి & హారర్ సిరీస్ 'యక్షిణి'. కోటా బొమ్మాళి ఫేమ్ రాహుల్ విజయ్ హీరోగా చేశాడు. డైరెక్టర్ తేజ (Yakshini Ott) మార్ని రూపొందించిన ఈ సిరీస్.. నేరుగా డిస్నీ హాట్‌స్టార్‌లో జూన్ 14 విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌పై పాజిటివ్ సమీక్షలు అయితే వస్తున్నాయి. వీకెండ్‌లో మంచి హరర్ థ్రిల్లర్ సినిమా కావాలనుకునే వారు ఈ సిరీస్‌ను చూడవచ్చు.
ఇక కథ విషయానికొస్తే.. యక్షిణిల రాజైన అయిన కుబేరుడు, మాయ అనే దేవకన్యను (వేదిక)ను శపిస్తాడు. ఆమె తిరిగి అల్కపురికి వచ్చేందుకు 100 మందిని చంపాలని షరతు పెడుతాడు. దీంతో ఆమె అమాయకుడైన కృష్ణ (రాహుల్ విజయ్)ని ప్రేమిస్తున్నట్లు నాటకమాడి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అతన్ని చంపే క్రమంలో మహాకల్ (అజయ్) మహాకల్ అడ్డుపడుతాడు. ఇంతకు ఈ మహాకల్ ఎవరు? మాయకు ఎందుకు అడ్డుపడుతాడు? జ్వాలముఖి(మంచు లక్ష్మి) ఎలా ప్రవేశిస్తుంది? చివరకు మాయ తన స్వస్థలం అల్కాపురికి చేరుకుందా? లేదా? అనేది మిగతా కథ.
పరువు
నివేదా పేతురాజ్, నరేష్ అగస్య ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్ ‘పరువు’. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో నాగబాబు, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి ప్రముఖ పాత్రలు పోషించారు. జూన్ 14న ఈ వెబ్ సిరీస్ నేరుగా జీ5లో(Paruvu ott) విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌పైన మిక్స్‌డ్ రివ్యూస్ వస్తున్నాయి. పబ్లిక్ మాత్రం ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను చూడొచ్చు అని అడ్వైజ్ చేస్తున్నారు.
ఇక ఈ వెబ్ సిరీస్ కథ విషయానికొస్తే... పల్లవి(నివేదా పేతురాజ్), సుధీర్(నరేష్ అగస్త్య) ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కులాలు వేరు కావడంతో పెద్దలు ఓప్పుకోరు. దీంతో ప్రేమ వివాహం చేసుకుంటారు. ఈక్రమంలో పల్లవి పెద్దనాన్న చనిపోవడంతో అతన్ని చూసేందుకు పల్లవి, సుధీర్ బయల్దేరుతారు. మార్గమాధ్యలో ఇద్దరు కలిసి పల్లవి బావ చందును చంపుతారు. ఇంతకు చందును వీరిద్దరు ఎందుకు చంపాల్సి వచ్చింది. ఆ తర్వాత వారికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది మిగతా కథ.
జూన్ 15 , 2024
Vijay Deverakonda: ఆ రోజు చాలా బాధపడ్డా… కానీ ఇప్పుడు 400 మిలియన్ల లవ్ సాధించా
నేషనల్ క్రష్ రష్మిక మంధాన(Rashmika Mandanna), రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫేయిర్ అంటే తెలుగులో ఓ ట్రెండ్ సెట్ చేసింది. వీరు చేసింది రెండు సినిమాలే అయినా సిల్వర్ స్క్రీన్ పేయిర్‌గా గుర్తింపు పొందారు. అంతలా వీరి మధ్య కెమిస్ట్రీ కుదురిందని చెప్పవచ్చు. వీరిద్దరు కలిసి నటించినా తొలి చిత్రం 'గీతా గోవిందం'బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. ఏకంగా ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను పరుశురామ్ తెరకెక్కించగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాణం అయింది. ఈ చిత్రంలో విజయ్- రష్మిక జోడికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
మరో సినిమా వీరి కాంబినేషన్‌లో రావాలని ఆశపడ్డారు.దీంతో ఈ జోడి మళ్లి కలిసి పనిచేసింది. యంగ్ డైరెక్టర్ భరత్ కమ్మ డియర్ కామ్రెడ్(Dear Comrade) చిత్రాన్ని రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించారు.మించారు.ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా అన్ని పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. యూత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించాయి.
ముఖ్యంగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ యూనియన్ లీడర్ పాత్రలో సూపర్బ్‌గా నటించాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్‌తో అలరించాడు. ఈ చిత్రంలో లిల్లి క్యారెక్టర్‌లో రష్మిక మంధాన క్రికెటర్‌గా అద్భుతంగా నటించింది. వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లకు ప్రేక్షకులు విజిల్స్ వేశారు. ఇద్దరి మధ్య ఎమోషనల్ సీన్లు ప్రేక్షకులను కదిలించాయి. ఈ సినిమా తెలుగులో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. సోషల్ మీడియాలో విజయ్ యాంటి ఫ్యాన్స్ ఈ సినిమాపైన కూడా ట్రోల్స్ మొదలు పెట్టారు. అయితే అవేమీ విజయ్ సక్సెస్‌ను ఆపలేకపోయాయి. ఈ థియేటర్లలో రాణించకపోయినప్పటికీ.. ఓటీటీలో దుమ్ము రేపింది. డబ్ అయిన అన్ని భాషల్లో మంచి టాక్ సంపాదించి విజయం సాధించింది.
డియర్ కామ్రెడ్ రికార్డు..
తాజాగా.. డియర్ కామ్రెడ్ హిందీ డబ్‌డ్ వెర్షన్ రికార్డు క్రియేట్ చేసింది. హిందీలో డబ్ అయిన ఈ చిత్రం యూట్యూబ్‌లో ఏకంగా 40 కోట్ల ప్లస్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇదే విషయాన్ని డియర్ కామ్రెడ్ చిత్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్ ద్వారా తన సంతోషాన్ని ట్వీట్ చేసింది. తెలుగులో ఈ సినిమా కథాంశం ప్రేక్షకులకు ఎక్కకున్నా హిందీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా బాగా నచ్చింది. విజయ్- రష్మిక బాండింగ్ సూపర్బ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి కంటెంట్ ఉన్న చిత్రాలు విజయ్ నుంచి రావాలని మెసెజేస్ పెడుతున్నారు. ఈ విషయాన్నీ మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్ ద్వారా తెలియజేసింది.
ఆ రోజు బాధపడ్డాం..
మరోవైపు విజయ్ దేవరకొండ తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపాడు. 400 మిలియన్ లవ్ సాధించాము. 2019లో డియర్ కామ్రెడ్ విడుదలైన రోజున కొంత బాధపడ్డాం. కానీ ఇప్పుడు 400 మిలియన్ లవ్ మమ్మల్ని తడిసి ముద్ధచేసింది. ఎన్ని సినిమాలు వచ్చినా తన లైఫ్‌లో డియర్ కామ్రెడ్ చిత్రం ప్రత్యేకమంటూ రాసుకొచ్చాడు. ఇదే పోస్ట్‌ను రష్మిక మంధానకు సైతం ట్యాగ్ చేశాడు. రష్మిక మంధాన సైతం దీనిపై స్పందించింది. విజయ్ దేవరకొండ పోస్ట్ స్క్రీన్ షాట్‌ను తన ఇన్‌స్టా రీల్‌లో పోస్ట్ చేసింది.
విజయ్ బిజీ బిజీ
ఇక ఇదిలా ఉంటే విజయ దేవరకొండ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. జెర్సీ ఫెమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో వస్తున్న VD12 చిత్రాన్ని విజయ్ చేస్తున్నాడు. ఈ సినిమా పిరియాడిక్ డ్రామా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంకీర్తయన్ డెరెక్షన్‌లో VD14 చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా ది లెజెండ్ ఆఫ్ కర్స్‌డ్ ల్యాండ్ అంటూ ఈ సినిమా ట్యాగ్ లైన్ ఉంది. ఈ రెండు సినిమాలు విజయ్ కెరీర్‌కు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు ఆశించినంత ఫలితాన్ని రాబట్టలేకపోవడంతో ఈ సినిమాలను చాలా జాగ్రత్తగా విజయ్ టెకప్ చేస్తున్నాడని తెలుస్తోంది.
మరోవైపు రష్మిక మంధాన పుష్ప2 ప్రమోషన్‌లో బిజీగా ఉంది. యానిమల్ సినిమా సక్సెస్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్‌లో అవకాశాలు తలుపుతడుతున్నాయి. ప్రస్తుతం తన ఫ్యూచర్ ప్రాజెక్ట్‌లైన చావా(హిందీ), కుబెరా(తమిళ్) సినిమాల్లో నటిస్తోంది.
జూన్ 15 , 2024
Sai Pallavi: నిత్యామీనన్.. సాయి పల్లవి కంటే గొప్ప నటా? జాతీయ అవార్డ్ రాకపోవడంపై ఫ్యాన్స్ ఫైర్!
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi)కి టాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ భామ సినిమాకు ఓకే చెప్పిందంటే అది కచ్చితంగా కంటెంట్ ఉన్న మూవీనే అయి ఉంటుందని అభిమానులు భావిస్తుంటారు. గ్లామర్ షోకు ఆమడ దూరం ఉండే సాయి పల్లవి తన నటన, మెస్మరైజింగ్ డ్యాన్స్‌తోనే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో ఆమె నటించిన చిత్రాలు తక్కువే అయినా అవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాయి. అటువంటి సాయి పల్లవికి తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డు అన్యాయం జరిగినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ దఫా కచ్చితంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు వస్తుందని భావించిన తమను అవార్డ్స్ కమిటీ నిర్ణయం తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆమె ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
సాయిపల్లవిని కాదని..!
70వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను (70th National Film Awards) కేంద్ర ప్రభుత్వం శుక్రవారం (ఆగస్టు 16) ప్రకటించింది. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకుగానూ ఈ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ నటి నామినేషన్స్‌లో గార్గి చిత్రానికి గాను సాయిపల్లవి అవార్డు రేసులో నిలిచింది. తన తండ్రిని జైలు నుంచి తీసుకురావడానికి పోరాడే ఉపాధ్యాయురాలిగా అందులో సాయి పల్లవి అద్భుత నటన కనబరిచింది. దీంతో కచ్చితంగా ఆమెకు నేషనల్ అవార్డు వస్తుందని సినీ విశ్లేషకులతో పాటు ఆమె అభిమానులు భావిస్తూ వచ్చారు. అయితే అనూహ్యంగా నిత్యా మీనన్‌ను జాతీయ ఉత్తమ నటిగా ఎంపిక చేసి అవార్డుల ఎంపిక కమిటీ షాకిచ్చింది. తిరుచిట్రంబళం (తమిళం) చిత్రానికి గాను నిత్యామీనన్ ఉత్తమ నటిగా ఎంపికైంది. అలాగే 'కచ్ ఎక్స్‌ప్రెస్' అనే గుజరాతీ ఫిల్మ్‌లో నటించిన మానసి పరేఖ్‌కు ఉత్తమ నటి అవార్డ్ సంయుక్తంగా వరించింది.
నిత్యా మీనన్ ఏం గొప్ప..!
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో సాయి పల్లవికి అన్యాయం జరిగిదంటూ సోషల్ మీడియా పెద్ద ఎత్తున పోస్టులు హల్‌చల్ చేస్తున్నాయి. సాయిపల్లవిని కాదని నిత్యమీనన్‌కు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు ఇవ్వడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘గార్గి’ సినిమాలో సాయిపల్లవి నటన కంటే నిత్యా మీనన్ నటన ఏం బాగుందని ప్రశ్నిస్తున్నారు. తిరుచిట్రంబళం చిత్రంలో నిత్య మీనన్ నటన బాగున్నప్పటికీ అది గార్గీలో సాయి పల్లవి యాక్టింగ్‌ను మ్యాచ్ చేయలేకపోయిందని అభిప్రాయపడుతున్నారు. తండ్రి కోసం పోరాడే ఉపాధ్యాయురాలి పాత్రలో సాయిపల్లవి జీవించేసిందని గుర్తు చేస్తున్నారు.
https://twitter.com/david_bro18/status/1824390579129815154
https://twitter.com/jammypants4/status/1824662625713521129
https://twitter.com/tum_saath_ho/status/1824438399735869460
బెస్ట్ యాక్టర్‌గా సౌత్ స్టార్
70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ చిత్రంగా మలయాళ సినిమా 'ఆట్టమ్' (Aattam) నిలిచింది. ప్రాంతీయ చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రంగా 'కార్తికేయ 2' ఎంపికైంది. ఉత్తమ కన్నడ చిత్రంగా 'కేజీఎఫ్ 2', బెస్ట్ హిందీ ఫిల్మ్‌గా గుల్‌మోహర్ నిలిచాయి. ఇక ‘కాంతార’ చిత్రంలో అద్భుత నటనతో ఆకట్టుకున్న రిషబ్ శెట్టి జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచాడు.
జాతీయ అవార్డు విజేతలు వీరే
ఉత్తమ చిత్రం: ఆట్టమ్ (మలయాళం) ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార) ఉత్తమ నటి: నిత్యా మేనన్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ - గుజరాతి) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సినిమా: బ్రహ్మాస్త్ర - పార్ట్ 1ఉత్తమ దర్శకుడు: సూరజ్ బర్జాత్యా (ఉంచాయి - హిందీ)బెస్ట్ కొరియోగ్రాఫర్: జానీ మాస్టర్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), సతీశ్ కృష్ణన్ ఉత్తమ సహాయ నటుడు: పవర్ రాజ్ మల్హోత్రా (ఫౌజా - హరియాన్వి)ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (ఉంచాయి- హిందీ)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ : అర్జిత్ సింగ్ (కేసరియా) - బ్రహ్మాస్త్ర ఉత్తమ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ : బొంబాయి జయశ్రీ (సౌది వెళ్లక్క సీసీ 225/2009- మలయాళం)ఉత్తమ సంగీతం (పాటలు): ప్రీతమ్ (బ్రహ్మస్త్ర -హిందీ)ఉత్తమ సంగీతం (నేపథ్యం): ఏఆర్ రెహమాన్ (పొన్నియిన్ సెల్వన్ - 1 తమిళం)ఉత్తమసినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్ పార్ట్ - 1 తమిళం) ఉత్తమ సౌండ్ డిజైన్: ఆనంద్ కృష్ణమూర్తి (పొన్నియిన్ సెల్వన్ - 1) ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: శ్రీపాథ్ (మాలికాపురం - మలయాళం)ఉత్తమ స్క్రీన్‌ప్లే: ఆనంద్ ఏకార్షి (ఆట్టం- మలయాళం)ఉత్తమ ఎడిటింగ్: మహేష్ భువనేండ్ (ఆట్టం) ఉత్తమ యాక్షన్ డైరక్షన్: అన్బరివు (కేజీఎఫ్- 2)ఉత్తమ మేకప్: సోమనాథ్ కుందు (అపరాజితో- బెంగాళీ)ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: నిక్కి జోషి (కచ్ ఎక్స్‌ప్రెస్- గుజరాతీ) ఉత్తమ మాటల రచయిత: అర్పితా ముఖర్జీ, రాహుల్ వి చిట్టెల (గుల్‌మోహర్)
ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు
ఉత్తమ ప్రాంతీయ చిత్రం: కార్తికేయ -2 (తెలుగు)ఉత్తమ ప్రాంతీయ చిత్రం: కేజీఎఫ్ 2 (కన్నడ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం: పొన్నియిన్ సెల్వన్ - 1 (తమిళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : గుల్‌మొహర్ (హిందీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : సౌది వెళ్లక్క సీసీ 225/2009 (మలయాళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : కబేరి అంతర్దాన్ (బెంగాళీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : వాల్వీ (మరాఠీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : దమన్ (ఒడియా)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : బాగీ డి దీ (పంజాబీ)
జాతీయ ఉత్తమ నాన్ ఫీచర్ సినిమాలు
ఉత్తమ షార్ట్ ఫిల్మ్: ఉన్యుత (వాయిడ్) - అస్సామీఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్: అయేనా (అద్దం)- హిందీ/ ఉర్దూఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్: మర్మర్స్ ఆఫ్ ది జంగిల్ (మరాఠీ)ఉత్తమ యానిమేషన్ సినిమా: ఏ కోకోనట్ ట్రీ (సైలెంట్)ఉత్తమ దర్శకులు: మిరియం చాండీ మినాచెరీ (ఫ్రమ్ ది షాడో- బెంగాళీ/హిందీ/ ఇంగ్లిష్)ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ : బస్తి దినేశ్ షెనోయ్ (ఇంటర్‌మిషన్ - కన్నడ)ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్: విశాల్ భరద్వాజ్ (ఫుర్సత్ - లీజర్/ హిందీ)ఉత్తమ క్రిటిక్: దీపక్ దుహా (హిందీ) ఉత్తమ బుక్ ఆన్ సినిమా: రచయితలు: అనిరుద్ధ భట్టాచార్జీ, పార్థివ్ ధార్ కిషోర్ కుమార్ (ది అల్టిమేట్ బయోగ్రఫీ - ఇంగ్లిష్)ఉత్తమ సినిమాటోగ్రీఫీ: సిద్ధార్థ్ దివాన్ -మోనో నో అవేర్ (హిందీ - ఇంగ్లీష్)
ఆగస్టు 17 , 2024
Adil Hussain: నా దృష్టిలో RRR గొప్ప సినిమానే కాదు.. మళ్లీ గెలుక్కున్న కబీర్ సింగ్ యాక్టర్
భారతీయ చిత్ర పరిశ్రమ ఖ్యాతిని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR). రామ్‌చరణ్ (Ram Charan), తారక్ (Jr. NTR) హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) రూపొందించిన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. ఆస్కార్ సహా గ్లోబల్ స్థాయిలో పలు అవార్డులను కొల్లగొట్టింది. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ (James Cameron) సైతం రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు ఫిదా అయ్యారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తనకు బాగా నచ్చినట్లు ప్రకటించారు. అటువంటి RRR చిత్రంపై ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆదిల్ హుస్సేన్ (Adil Hussain) నోరు పారేసుకున్నారు. దక్షిణాది చిత్రంపై తన అక్కసు వెళ్లగక్కాడు.
RRR గొప్ప చిత్రం కాదు’
బాలీవుడ్‌కు చెందిన ఆదిల్ హుస్సేన్.. వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ పోడ్‌కాస్ట్ ఇంటర్యూలో పాల్గొన్న ఈ అస్సామీ నటుడికి యాంకర్ ఓ ఆసక్తికర ప్రశ్న వేశారు. ప్రాంతీయ సినిమాలు గ్లోబల్ స్థాయిలో అలరిస్తున్నాయని.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ లాగా త్వరలో అసోం చిత్రాలను కూడా అంతర్జాతీయ వేదికలపై చూడవచ్చా? అని అడిగారు. ఇందుకు ఆదిల్ హుస్సేన్ సమాధానమిస్తూ.. ‘అస్సామి సినిమా ఇప్పటికే ఆ స్థాయికి (గ్లోబల్) చేరుకుంది. నేను RRR గొప్ప చిత్రంగా పరిగణించను. అత్యుత్తమ ప్రమాణాలతో రూపొందిన చిత్రాలు సాధారణంగా మంచి సినిమాలుగా పరిగణింపబడతాయి. అంతమాత్రాన అవి తప్పనిసరిగా గొప్ప చిత్రాలు కావాల్సిన పని లేదు. ఆర్‌ఆర్‌ఆర్ కూడా అంతే. అది వినోదాత్మక చిత్రం మాత్రమే. నా దృష్టిలో అది గొప్ప చిత్రం కాదు. నేను ఆర్‌ఆర్‌ఆర్ కంటే విలేజ్ రాక్‌స్టార్‌ను ఎక్కువగా ఇష్టపడతాను’ అని అన్నారు.
View this post on Instagram A post shared by GPlus (@guwahatiplus)
నెట్టింట తీవ్ర దుమారం
RRRపై ఆదిల్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు రెండుగా విడిపోయి విమర్శలు చేసుకుంటున్నారు. కొందరు ఆదిల్ హుస్సేన్ వ్యాఖ్యలను సమర్థిస్తుంటే మరికొందరు తీవ్రంగా ఖండిస్తున్నారు. అందరి దృష్టిని ఆకర్షించడం కోసమే ఇలాంటి అర్థం లేని వ్యాఖ్యలు ఆదిల్ చేశారంటూ 'ఆర్‌ఆర్‌ఆర్' ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సౌత్ సినిమాలు గ్లోబల్ స్థాయిలో రాణిస్తుండటం చూసి తట్టుకోలేకనే ఇలా మాట్లాడారని మండిపడ్డారు. 'ఆర్‌ఆర్‌ఆర్' భారత చిత్ర పరిశ్రమకు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చిందన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మరోవైపు మరికొందరు నెటిజన్లు ఆదిల్ హుస్సేన్ వ్యాఖ్యలకు మద్దతిస్తున్నారు. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని అంటున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ మంచి ఎంటర్‌టైనింగ్ చిత్రమేనని.. అయితే సమాజంలో మార్పు తీసుకొచ్చిన గొప్ప సినిమా అయితే కాదని పేర్కొంటున్నారు.
సందీప్ రెడ్డి వంగా మూవీపైనా విమర్శలు!
యానిమల్ (Animal) ఫేమ్ అర్జున్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) గత చిత్రం ‘కబీర్ సింగ్’ పైనా ఆదిల్ హుస్సేన్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాపై ఓ ఇంటర్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘ఇప్పటివరకూ నా సినీ కెరీర్‌లో ఎందుకు నటించానా? అని ఫీలైన చిత్రం ఒక్కటే. అదే ‘కబీర్ సింగ్’. అందులో కాలేజీ డీన్‌గా వర్క్ చేశా. ఎన్నిసార్లు నో చెప్పినా.. ఒకే ఒక్క రోజు షూట్‌కు రమ్మని అడిగారు. పెద్ద మొత్తంలో పారితోషికం ఇవ్వడంతో యాక్ట్ చేసి వచ్చేశా. విడుదలయ్యాక ఆ సినిమా చూసి.. ఇలాంటి చిత్రంలో ఎందుకు నటించానా? అని ఇబ్బందికరంగా ఫీలయ్యా. స్నేహితుడితో కలిసి సినిమా చూడ్డానికి వెళ్లి మధ్యలోనే బయటకు వచ్చేశా. ఆ సినిమా చూడమని నా భార్యకు కూడా చెప్పలేదు. ఒకవేళ ఆమె చూసి ఉంటే నన్ను తిట్టేది’ అని అన్నారు.
సందీప్ వంగా స్ట్రాంగ్ కౌంటర్
ఆదిల్ హుస్సేన్ చేసి వ్యాఖ్యలపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘మీరు గొప్పగా భావించి నటించిన 30 చిత్రాలతో రాని గుర్తింపు.. ఎందుకు నటించానా? అని ఫీలవుతున్న ఈ ఒక్క బ్లాక్‌బస్టర్‌తో మీ సొంతమైంది. నటనపై అభిరుచి కంటే దురాశ ఎక్కువగా ఉన్న మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు ఇప్పుడు బాధ పడుతున్నా. ఇకపై మీరంత సిగ్గుపడకుండా ఉండేలా నేను చేస్తా. ఆ సినిమాలో మీ స్థానాన్ని ఏఐ సాయంతో ఫిల్ చేస్తా’ అని ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
ఏప్రిల్ 24 , 2024
Ram Charan - Suriya: రామ్ చరణ్‌కు ప్రత్యర్థిగా సూర్య.. మల్టీ స్టారర్‌కు రంగం సిద్ధమైందా?
టాలీవుడ్‌లో మల్టీ స్టారర్ చిత్రాలకు మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ చిత్రాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ (తారక్ - రామ్‌చరణ్), వాల్తేరు వీరయ్య (చిరు - రవితేజ), ‘సలార్’ (ప్రభాస్ - పృథ్వీరాజ్ సుకుమారన్), కల్కి (ప్రభాస్, అమితాబ్, కమల్) చిత్రాలు ఏ స్థాయి సక్సెస్ సాధించాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మరో మైండ్ బ్లోయింగ్ మల్టీ స్టారర్ తెలుగులో రాబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దక్షిణాది స్టార్ హీరోలు రామ్‌చరణ్, సూర్యలు కలిసి ఓ చిత్రంలో నటించబోతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.
చరణ్‌కు విలన్‌గా సూర్య!
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ (Ram Charan), తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్ రాబోతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. లవ్ స్టోరీస్ తీయడంలో స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ మల్టీ స్టారర్‌ను తెరకెక్కించనున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కథను సూర్యకు వినిపించగా అది అతడికి బాగా నచ్చిందని సమాచారం. అయితే రామ్‌చరణ్‌కు స్టోరీ వినిపించాల్సి ఉందని తెలుస్తోంది. రామ్‌చరణ్ కూడా ఓకే చెప్తే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు. అదే జరిగితే చరణ్ - సూర్య మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ క్రేజీగా ఉంటుందని అంటున్నారు. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయమని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
ప్రభాస్‌తో సినిమా తర్వాతే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో డైరెక్టర్ హను రాఘవపూడి ఓ బిగ్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి కథ చర్చలు కూడా ఇటీవలే ముగిసాయి. స్వాతంత్రానికి ముందు జరిగిన రజాకార్ల ఉద్యమం నేపథ్యంలో ఈ చిత్రం సాగనున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీస్ నిర్మించబోయే ఈ సినిమాకు 'ఫౌజి' అనే టైటిల్‌ను దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. డైరెక్టర్ హను గత చిత్రాలకు భిన్నంగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఇది రూపొందనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌తో సినిమా తర్వాతనే రామ్‌చరణ్-సూర్య కాంబో మూవీపై హను రాఘవపూడి దృష్టి పెడతారని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
చరణ్-సూర్య బిజీ బిజీ
ప్రస్తుతం రామ్ చరణ్, సూర్య ఇద్దరూ తమ చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నారు. రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాలో నటిస్తుండగా సూర్య 'కంగువ' (Kanguva) చేస్తున్నాడు. సూర్య చిత్రం అక్టోబర్ 10న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. అటు రామ్‌చరణ్ డిసెంబర్‌లో అందరినీ ఎంటర్‌టైన్ చేసే ఛాన్స్ ఉంది. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత రామ్‌చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇందులో చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ను లాక్ చేశారు. ఈ సినిమాకు 'పెద్ది' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మెగా మల్టీస్టారర్ లోడింగ్..!
మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరైన దర్శకుల్లో హరీష్ శంకర్ (Harish Shankar) ఒకరు. అటువంటి హరీశ్ శంకర్ తన 'మిస్టర్ బచ్చన్' సినిమా ప్రమోషన్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ పాన్ ఇండియా చిత్రం ఎందుకు తీయలేదు? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పవన్ కల్యాణ్, రామ్ చరణ్, చిరంజీవిల కోసం ఒక స్టోరీని సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అది పట్టాలెక్కితే అన్ని పాన్ ఇండియాల కంటే అదే అతి పెద్ద పాన్ ఇండియా అవుతుందని పేర్కొన్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. అయితే గతంలో చిరు, రామ్‌చరణ్‌లు కలిసి ‘ఆచార్య’ చిత్రంలో నటించారు. ‘బ్రూస్‌లీ’, ‘మగధీర’ చిత్రాల్లో చరణ్ కోసం మెగాస్టార్ ఓ స్పెషల్ క్యామియో కూడా ఇచ్చారు. అటు పవన్ కల్యాణ్ సైతం 'శంకర్ దాదా MBBS', 'శంకర్ దాదా జిందాబాద్' చిత్రాల్లో చిన్న క్యామియో పోషించారు.
జూలై 31 , 2024
OTT Suggestion: ఆహాలో ఈ బోల్డ్ మూవీని చూసేందుకు పోటెత్తుతున్నారు.. బెడ్ రూం సీన్లతో రచ్చ!
సాధారణంగా బోల్డ్ కంటెంట్ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ తరహా చిత్రాలను చూసేందుకు వారు విపరీతమైన ఆసక్తిని కనబరుస్తుంటారు. అయితే ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే ‘A’ సర్టిఫికేట్ చిత్రాలు టాలీవుడ్‌లో రావడం చాలా అరుదు. గతంలో వచ్చిన అరకొర చిత్రాలను కూడా గుట్టుచప్పుడు కాకుండా వెళ్లి థియేటర్లలో చూసి వచ్చేవారు. ప్రస్తుతం ఓటీటీ యుగం నడుస్తుండటంతో ఆ సమస్యకు చెక్ పడింది. ప్రస్తుతం ఎలాంటి కంటెంట్ అయినా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగులో వచ్చిన ఓ బోల్డ్ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో హల్‌చల్ చేస్తోంది. ఆ చిత్రాన్ని వీక్షించేందుకు ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ ఆ చిత్రం ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం.
ఆ సినిమా పేరేంటి?
ఆదర్శ్ బాలకృష్ణ, అక్షర గౌడ, కమల్ కామరాజు, పూజ జవేరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బోల్డ్ కంటెంట్ మూవీ ‘మిక్సప్’ (Mixup). ఆకాష్ బిక్కి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో.. మార్చి 15న ఈ సినిమా రిలీజైంది. అప్పటి నుంచి ఈ సినిమా నెంబర్ వన్ స్థానంలో దూసుకెళ్తోంది. పేరుకి ‘A’ సర్టిఫికేట్ అయినా.. ఈ మూవీ టేకింగ్, మెసేజ్ నేపథ్యం ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతోంది. అందుకే ఈ సినిమాను చూసేందుకు ఓటీటీ ప్రేక్షకులు విపరీతంగా ఆసక్తి కనబరుస్తున్నారు.
ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటి?
దర్శకుడు ఆకాష్ బిక్కి.. ఈ సినిమా కోసం తీసుకున్న కథ నేటి సమాజాన్ని అద్దం పడుతోంది. ఇందులో హైలెట్ చేసిన శృంగార కాన్సెప్ట్స్ కూడా యదార్థ సంఘటనలకు దగ్గరగా ఉన్నాయి. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే.. విపరీతమైన శృంగార కోరికలు ఉన్న భార్య ఉంటే అవతలి వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది? పెళ్లి అంటే కేవలం పడక సుఖం మాత్రమే అనుకునే భర్త ఉంటే ఆ భార్య పరిస్థితి ఏంటి? కట్టుకున్న వాళ్లు వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ భాగస్వామి మానసిక స్థితి ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించాడు దర్శకుడు అకాశ్ బిక్కి .
మిక్సప్ కథేంటి?
అభయ్ (కమల్ కామరాజు), నిక్కీ (అక్షర గౌడ).. సాహో (ఆదర్శ్ బాలకృష్ణ), మైథిలి (పూజ ఝవేరి) భార్య భర్తలు. ఈ రెండు జంటలు సెక్సువల్ లైఫ్ దగ్గర విబేధాలు వచ్చి విడిపోదాం అనుకుంటారు. మొదటి జంటలో నిక్కీకి, రెండు జంటలో సాహోకి సెక్సువల్ లైఫ్‌పై ఎక్కువ ఇంట్రెస్ట్. అయితే వారి పార్ట్నర్స్ అయిన అభయ్, మైథిలి.. లస్ట్ కంటే ప్రేమ లైఫ్‌ని కోరుకుంటూ ఉంటారు. దీంతో రెండు జంటల్లో విబేధాలు వస్తాయి. విడిపోవాలని నిర్ణయం తీసుకుంటారు. అయితే ఓ డాక్టర్ సూచన మేరకు ఈ రెండు జంటలు కామన్ ఫ్రెండ్ ద్వారా ఒక రిసార్ట్‌కి వెళ్తాయి. అక్కడ ఒకరికి ఒకరు పరిచయాలు కావడం.. సెక్సువల్ లైఫ్‌పై ఎక్కువ ఇంటరెస్ట్ ఉన్న సాహో, నిక్కీ బాగా కనెక్ట్ అవడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ రెండు జంటలు చివరికి కలిసున్నాయా? విడిపోయాయా? అన్నది కథ.
మార్చి 25 , 2024
This Week OTT Movies: ‘దేవర’ ఎఫెక్ట్.. థియేటర్లలో ఒకే ఒక్క తెలుగు చిత్రం.. ఓటీటీలో మాత్రం జాతరే!
సెప్టెంబర్ మూడో వారంలో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు ఒకే ఒక్క తెలుగు చిత్రం సిద్ధమైంది. ఈ వారం సుహాస్ సింగిల్‌గా రాబోతున్నాడు. తర్వాతి వారమే 'దేవర' రిలీజ్ ఉండటంతో తమ చిత్రాలు రిలీజ్ చేసేందుకు తెలుగు దర్శక, నిర్మాతలు ఆసక్తి కనబరచలేదు. మరోవైపు రెండు బ్లాక్‌బాస్టర్ చిత్రాలు రీరిలీజ్ వచ్చేస్తున్నాయి. అటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు/ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
గొర్రె పురాణం
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయాడు. కొత్త తరహా కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలో సుహాస్ (Suhas) నటించిన మరో వినూత్న చిత్రం ‘గొర్రె పురాణం’ (Gorre Puranam). బాబీ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక ఊరిలో రెండు వర్గాల మధ్య ఒక గొర్రె ఎలా చిచ్చు పెట్టింది? ఆ గొడవలోకి సుహాస్ ఎలా వచ్చాడు? అనే ఆసక్తికర కథతో సినిమా రూపొందింది. ఈ సినిమాలో గొర్రెకు దర్శకుడు తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం.
యుద్ర
సిద్ధాంత్ చతుర్వేది, మాళవిక మోహనన్ కీలక పాత్రల్లో రవి ఉద్యావర్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఫిల్మ్ ‘యుద్ర’ (Yudhra Movie). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 20న హిందీలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఈ మూవీతోనే మాళవి బాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేస్తున్నారు. ఇందులో ఆమె పలు ఇంటిమేట్, ముద్దు సన్నివేశాల్లో యాక్ట్ చేశారు.
కహా షురూ.. కహా ఖతం
ధ్వని భానుశాలి, ఆషిమ్ గులాటీ కీలక పాత్రల్లో శౌరబ్ దాస్‌గుప్త దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘కహా షురూ.. కహా ఖతం’ (Kahan Shuru Kahan Khatam). సెప్టెంబరు 20న ఈ మూవీ హిందీలో విడుదలకు సిద్ధమైంది. ‘మిమి’, ‘జర హట్కే జర బచ్కే’ వంటి కథలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ మూవీకి కథను అందించడం విశేషం.
బొమ్మరిల్లు
సిద్ధార్థ్, జెనీలియ జంటగా భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన 'బొమ్మరిల్లు' (Bommarillu) చిత్రం తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిందే. 2006లో విడుదలైన ఈ చిత్రం పలు అవార్డులు సైతం సొంతం చేసుకుంది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలేట్‌గా నిలిచింది. కాగా, ఇప్పుడు ఈ చిత్రం రీరిలీజ్‌కు సిద్ధమవుతోంది. సెప్టెంబరు 21న తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్స్‌లో ‘బొమ్మరిల్లు’ విడుదల కానుంది.
జర్నీ
తమిళ, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘జర్నీ’ (Journey Movie). జై, శర్వానంద్, అంజలి అనన్య కీలక పాత్రల్లో నటించారు. భారీ బస్ యాక్సీడెంట్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. ఇప్పుడు మరోమారు థియేటర్లలో అలరించేందుకు జర్నీ రాబోతోంది. సెప్టెంబరు 21న ‘జర్నీ’ కూడా రీ-రిలీజ్ కానుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు
తంగలాన్
తమిళ స్టార్ హీరో విక్రమ్ లేటెస్ట్ సినిమా 'తంగలాన్' (Thangalaan). ఆగస్టు 15న తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజైంది. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. కాగా నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 20 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తమిళం, తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకే రోజు అందుబాటులోకి రానుంది. అయితే ఓవర్సీస్ ప్రేక్షకుల కోసం మాత్రం ఎంథుసన్ ఓటీటీలో శనివారమే ఈ చిత్రం స్ట్రీమింగ్‌లోకి రావడం గమనార్హం.
తిరగబడరా సామి
రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రా హీరోహీరోయిన్లుగా నటించిన ‘తిరగబడరా సామీ’ (Thiragabadara Saami) మూవీ ఈ వారం ఓటీటీలోకి వచ్చేస్తోంది. సెప్టెంబర్ 20న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సీనియర్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 2న విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. స్టోరీ చాలా ఔట్‌డేటెడ్‌గా ఉందంటూ విమర్శలు వచ్చాయి.
హంట్
మలయాళం హారర్ మూవీ ‘హంట్’ (Hunt) థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. జీ5 వేదికగా సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు మలయాళం సీనియర్ డైరెక్టర్ షాజీ కైలాస్ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 29న థియేటర్లలో రిలీజైన హంట్ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. భావన యాక్టింగ్ బాగున్నా రొటీన్ స్టోరీ కారణంగా హంట్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్
అశుతోష్ రానా, ప్రియా ఆనంద్, నందు, సోనియా అగర్వాల్, తేజస్విని మడివాడ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్’ (The Mystery of Moksha Island). ఈ సిరీస్ ఈ నెల 20వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్‌కు అనిష్ యెహాన్ కురువిల్లా దర్శకత్వం వహించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ ట్రైలర్ ఇటీవల రిలీజై ఆకట్టుకుంటోంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateGrave TortureMovieEnglishNetflixSept 16Culinary Class WarsSeriesEnglish/KoreanNetflixSept 17Fast XMovieEnglishNetflixSept 18Leave from the other sideTalk ShowEnglishNetflixSept 18Twilight of the GodsSeriesEnglishNetflixSept 19He’s Three DaughtersMovieEnglishNetflixSept 20Evil Dead RiseMovieEnglishNetflixSept 21Saripodhaa SanivaaramMovieTeluguNetflixSept 26A very Royal Scandal SeriesEnglishAmazonSept 19Stree 2MovieHindiAmazonSept 27DurgaMovieHindiJio CinemaSept 16Jo Tera Hai Woh Mera HaiMovieHindiJio CinemaSept 20The PenguinSeriesEnglishJio CinemaSept 29UnPrisonedMovieEnglishHotstarSept 16Agatha All AlongMovieEnglishHotstarSept 17The Judge From HellSeriesEnglishHotstarSept 21
సెప్టెంబర్ 16 , 2024
ARM Movie Review: మూడు తరాల కథతో వచ్చిన మలయాళం యాక్షన్ డ్రామా.. ‘ఎ.ఆర్.ఎం’ ఆకట్టుకుందా?
నటీనటులు: టొవినో థామస్, కృతిశెట్టి, ఐశ్వర్య రాజేశ్, సురభి లక్ష్మి, బసిల్ జోసెఫ్, జగదీష్, కబీర్ దుహాన్‌సింగ్ తదితరులు
దర్శకత్వం: జితిన్ లాల్
రచన: సుజిత్ నంబియార్
సంగీతం : థిబు నినన్ థామస్
సినిమాటోగ్రఫీ: జోమోన్‌టి
ఎడిటింగ్: షమీర్ మహ్మద్
మలయాళ నటుడు టొవినో థామస్ (Tovino Thomas) తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు లీడ్ రోల్‌లో నటించిన ‘మిన్నల్ మురళి’, ‘2018’ చిత్రాలు తెలుగులోనూ మంచి విజయాలను సాధించాయి. అతడు హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'ఎ.ఆర్.ఎమ్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో టొవినో థామస్‌కు జోడీగా కృతి శెట్టి నటించింది. మలయాళంలో ‘అజయంతే రండమ్ మోషనమ్’ (ఎ.ఆర్.ఎమ్) పేరుతో ఈ చిత్రం రూపొందింది. తెలుగులో ‘అజయన్ చేసిన రెండో దొంగతనం’ అని అర్థం. కాగా, పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన 'ఏఆర్ఎం' మూవీ ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను అలరించిందా? టొవినో థామస్ ఖాతాలో మరో విజయం నమోదైనట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
అజయ్ (టొవినో థామస్) ఊళ్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ తల్లి (రోహిణి)తో కలిసి జీవిస్తుంటాడు. తాత మణియన్ (టొవినో థామస్) ఒకప్పుడు పేరు మోసిన దొంగ కావడంతో ఊళ్లో ఎక్కడ దొంగతనం జరిగినా అజయ్‌ని అనుమానిస్తుంటారు. మరోవైపు ఆ ఊరి గుడిలో కొలువైన శ్రీభూతి దీపం (విగ్రహం) బంగారం కంటే ఎంతో విలువైంది. దాన్ని కాజేయాలనే లక్ష్యంతో సుదేవ్‌వర్మ (హరీష్ ఉత్తమన్) ఆ ఊళ్లో అడుగుపెడతాడు. దీపాన్ని కొట్టేసి ఆ నింద అజయ్‌పై పడేలా ప్లాన్ చేస్తాడు. అయితే ఎన్నో తరతరాలుగా ఆ దీపాన్ని అజయ్ కుటుంబం రక్షిస్తూ వస్తుంది. మరి ఈసారి అజయ్ దాన్ని ఎలా కాపాడాడు? ఆ విగ్రహం వెనకున్న చరిత్ర ఏంటి? ఆ చరిత్రలో మహావీరుడు కుంజికేలు (టొవినో థామస్) పాత్ర? లక్ష్మి (కృతిశెట్టి)తో అజయ్ లవ్ ట్రాక్? గురించి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
టొవినో థామస్ మూడు పాత్రలపై గట్టి ప్రభావం చూపించారు. వీరుడైన కుంజికేలుగా అతడు ప్రదర్శించిన యుద్ధ విద్యలు, చేసిన పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి. తాత మణియన్ పాత్రలో కూడా అతడి నటన మెప్పిస్తుంది. ఆ రెండు పాత్రల్లో టొవినో ఎంత వీరోచితంగా నటించాడో అజయ్ పాత్రలో అంతే సాత్వికంగా చేసి ఆశ్చర్యపరిచాడు. ప్రతీ పాత్రలో వైవిధ్యం చూపించి నటనలో తనకు తిరుగులేదని చాటి చెప్పాడు. అటు లక్ష్మి పాత్రలో కృతిశెట్టి చక్కటి నటన కనబరించింది. 90ల నాటి అమ్మాయిగా అభినయం ప్రదర్శించింది. సురభి లక్ష్మి పాత్ర ఆకట్టుకుంటుంది. ఆమె రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపిస్తారు. రోహిణి, హరీష్ ఉత్తమన్ పాత్రలూ కథలో కీలకం.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు జితిన్‌లాల్‌కు ఇదే తొలి చిత్రమైనా మూడు తరాలతో ముడిపడిన ఈ కథని స్పష్టంగా తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటుంది. మహావీరుడు కేలు కథలోకి ఎంట్రీ ఇవ్వడం నుంచి ఆయన సినిమాను పరుగులు పెట్టించారు. అతడి పరాక్రమం, రాజ్యాన్ని కాపాడినందుకు మహారాజుని అడిగిన వరం, ఆ తర్వాత అతనికి తెలిసిన నిజం తదితర సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. కేలు పాత్రకు దీటుగా తర్వాత తరానికి చెందిన మణియన్ పాత్రని ఆవిష్కరించారు దర్శకుడు. ఈ సినిమాకి మణియన్ పాత్రే హైలైట్. దీపం ఎక్కడుందో మణియన్ కనుక్కుని, దాన్ని కాజేసే సన్నివేశాలు బాగుంటాయి. మణియన్, అజయన్ పాత్రల్ని ఒకే చోటకి తీసుకొచ్చినప్పుడు రేకెత్తే సంఘర్షణ హృదయాల్ని హత్తుకుంటుంది. అయితే ఇతర పాత్రలు ప్రభావవంతంగా లేకపోవడం, పేలవమైన లవ్‌ట్రాక్, ఊహకందే కథనం, బలహీనమైన క్లైమాక్స్ ఈ చిత్రానికి మైనస్‌లుగా మారాయి.
టెక్నికల్‌గా
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. థిబు నేపథ్య సంగీతం, పాటలు చిత్రానికి కొత్త హంగుని చేకూర్చాయి. జోమోన్ టి.జాన్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
టొవినో థామస్ నటనకథా నేపథ్యంసంగీతం
మైనస్ పాయింట్స్
ఊహకందే కథనంబలహీనమైన క్లైమాక్స్
Telugu.yousay.tv Rating : 3/5
సెప్టెంబర్ 12 , 2024