• TFIDB EN
  • జాతి రత్నాలు
    UTelugu2h 28m
    మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    నవీన్ పొలిశెట్టి
    చిట్టి ప్రేమ భర్త
    ప్రియదర్శి పులికొండ
    జోగిపేట్ శేఖర్
    రాహుల్ రామకృష్ణ
    జోగిపేట రవి
    ఫారియా అబ్దుల్లా
    షామిలి లేదా చిట్టి
    మురళీ శర్మ
    క్రీడా మంత్రి చాణక్య
    బ్రహ్మానందం
    జస్టిస్ బల్వంత్ చౌదరి; చాణక్య హత్యాయత్నం కేసుకు న్యాయమూర్తి
    వెన్నెల కిషోర్
    శేఖర్ మరియు రవి సెల్ మేట్
    నరేష్
    సతీష్ జనార్ధన్; చిట్టి తండ్రి
    తనికెళ్ల భరణి
    గోవిందు; తండ్రి శ్రీకాంత్
    బ్రహ్మాజీ
    ఎమ్మెల్యే రామచంద్రయ్య
    గిరి బాబు
    ముఖ్యమంత్రి మరియు పార్టీ నాయకుడు
    శుభలేఖ సుధాకర్
    సుబాష్ కె. చంద్ర; స్వతంత్ర ఎలక్ట్రానిక్స్ యజమాని
    మిర్చి కిరణ్చాణక్య బావమరిది
    మహేష్ ఆచంటచాణక్య అభిమానుల సంఘం అధ్యక్షుడు
    సివిఎల్ నరసింహారావు
    లాయర్ సుబ్రహ్మణ్యం; చాణక్య న్యాయవాది
    జయ నాయుడుశ్రీకాంత్ తల్లి
    హరిణి రావుచిట్టి తల్లి
    కేశవ్ దీపక్ డాక్టర్
    మస్త్ అలీ
    బావర్చి
    శోభన్ చిట్టుప్రోలుటీ దుకాణం యజమాని
    విజయ్ దేవరకొండ
    నీలిరంగు చొక్కాతో కోర్టులో ఉన్న వ్యక్తి
    సిబ్బంది
    అనుదీప్ కెవి
    దర్శకుడు
    నాగ్ అశ్విన్
    నిర్మాత
    రాధన్
    సంగీతకారుడు
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    <strong>Vishwak Sen: పవన్‌ కల్యాణ్‌ హీరోయిన్‌తో విష్వక్‌ సేన్‌ రొమాన్స్‌.. క్రేజీ కాంబో లోడింగ్‌!</strong>
    Vishwak Sen: పవన్‌ కల్యాణ్‌ హీరోయిన్‌తో విష్వక్‌ సేన్‌ రొమాన్స్‌.. క్రేజీ కాంబో లోడింగ్‌!
    ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న యంగ్‌ హీరోల్లో విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) ఒకరు. వరుసగా చిత్రాలను రిలీజ్‌ చేస్తూ అతడు దూసుకుపోతున్నాడు. ఇప్పటికే హాట్రిక్‌ హిట్స్‌తో ఫుల్‌ ఫామ్‌లో ఉన్న ఈ మాస్‌ కా దాస్‌ వరుసగా కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. వైవిధ్యమైన కథలతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే జాతి రత్నాలు డైరెక్టర్‌ అనుదీప్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ కూడా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోయిన్‌తో విష్వక్‌ రొమాన్స్‌ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; ‘VS14’లో హీరోయిన్‌ ఫిక్స్‌! విష్వక్‌ సేన్‌ హీరోగా జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘VS14’ వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించి ఆగస్టులో అధికారిక ప్రకటన వచ్చింది. అయితే లేటేస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ సినిమాలో విష్వక్‌కు జోడీగా తమిళ నటి  ప్రియాంక అరుళ్‌ మోహనన్‌ చేయనుంది. ఇటీవల ‘సరిపోదా శనివారం’ చిత్రంలో నాని సరసన నటించిన ప్రియాంక మంచి మార్కులు కొట్టేసింది. మరోవైపు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో 'ఓజీ' సినిమాలోనూ ఈ అమ్మడు నటిస్తోంది. ఇక విష్వక్‌ సినిమాలోనూ ఈ అమ్మడు నటిస్తే ‘VS14’పై అంచనాలు భారీగా పెరగనున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టి.జి. విశ్వ ప్రసాద్‌ నిర్మించనున్నారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం సమకూర్చనున్నారు. యాక్షన్‌ డ్రామా.. యంగ్‌ హీరో విష్వక్‌ సేన్‌ ఇటీవల మరో ప్రాజెక్టును ప్రకటించాడు. 'VS13' వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. శ్రీధర్‌ గంట (Sridhar Ganta) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. 'కాంతార' (Kantara) మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజనీష్‌ ఈ మూవీలు స్వరాలు సమకూర్చనున్నారు. తాజా పోస్టర్‌ను గమనిస్తే ఇందులో విష్వక్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్‌ డ్రామాగా ‘VS13’ రాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.&nbsp; రెండోసారి ఖాకీ పాత్రలో.. విష్వక్‌ సేన్‌ పోలీసు పాత్రను పోషించడం ఇదే తొలిసారి కాదు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన 'హిట్‌ : ది ఫస్ట్‌ కేసు' (HIT: The First Case) చిత్రంలోనూ విష్వక్‌ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించాడు. ఈ సినిమా సక్సెస్‌తో విష్వక్‌ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ‘VS13’ ప్రాజెక్ట్‌లోనూ విష్వక్‌ మరోమారు పోలీసు పాత్ర పోషిస్తుండటంతో ఆడియన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. తనకు బాగా కలిసొచ్చిన కాప్‌ రోల్‌లో విష్వక్‌ మరోమారు సక్సెస్ అవుతాడని ఫ్యాన్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.&nbsp; విష్వక్‌ బిజీ బిజీ.. ప్రస్తుతం విష్వక్‌ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ‘మెకానిక్‌ రాకీ’ (Mechanic Rocky)లో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా చేస్తోంది. కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇటీవలే సెకండ్‌ సాంగ్‌ కూడా రిలీజై ఆకట్టుకుంది. దీంతో పాటు ఇటీవల ‘లైలా’ (Laila) అనే కొత్త సినిమాను సైతం విష్వక్‌ ఇటీవల ప్రకటించారు. ఇందులో విష్వక్‌ అమ్మాయిగా కనిపించనున్నారు. రామ్‌నారాయణ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ‘లైలా’ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. హ్యాట్రిక్‌ హిట్స్‌ ప్రస్తుతం విష్వక్‌ హ్యాట్రిక్‌ విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఆయన రీసెంట్‌ చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి' (Gangs Of Godavari) థియేటర్లలో పాజిటిక్‌ టాక్‌ తెచ్చుకుంది. మంచి వసూళ్లను సైతం సాధించింది. లంకల రత్నాకర్‌ పాత్రలో విష్వక్‌ మాస్‌ జాతర చేశాడు. అలాగే విద్యాధర్‌ కాగిత డైరెక్షన్‌లో వచ్చిన 'గామి' (Gaami) కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో అఘోరా శంకర్‌ పాత్రలో విష్వక్‌ నటన మెప్పించింది. హీరోయిన్‌ చాందిని చౌదరి (Chandini Chowdary) మరో ముఖ్య పాత్రలో కనిపించింది. అంతకుముందు వచ్చిన ‘దాస్‌ కా ధమ్కీ’ (Das Ka Dhamki) మూవీ కూడా విష్వక్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రానికి విష్వక్‌ దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో విష్వక్‌ ద్విపాత్రాభినయంతో అలరించాడు. నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌గా చేసింది.&nbsp;
    సెప్టెంబర్ 24 , 2024
    దివ్య శ్రీపాద గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    దివ్య శ్రీపాద గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    టాలీవుడ్‌లో తమ క్రేజ్‌ను క్రమంగా పెంచుకుంటున్న తెలుగు అమ్మాయిల్లో 'దివ్య శ్రీపాద' ఒకరు. రీసెంట్‌గా 'సుందరం మాస్టర్‌' (Sundaram Master) సినిమా ద్వారా ఈ భామ హీరోయిన్‌గా మారిపోయింది. అంతకుముందు 'డియర్‌ కామ్రేడ్‌', 'కలర్ ఫొటో', 'మిస్ ఇండియా', 'జాతి రత్నాలు' వంటి హిట్&nbsp; చిత్రాల్లో సైడ్‌ పాత్రలకే పరిమితమైంది. 'సుందరం మాస్టర్‌'లో చక్కటి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించింది. మరి దివ్య శ్రీపాద వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం దివ్య శ్రీపాద అసలు పేరు? దివ్య దృష్టి దివ్య శ్రీపాద ఎప్పుడు పుట్టింది? 1996, సెప్టెంబర్ 5న జన్మించింది దివ్య శ్రీపాద ఎక్కడ పుట్టింది? దివ్య శ్రీపాద హైదరాబాద్‌లో జన్మించింది. దివ్య శ్రీపాద నటించిన తొలి సినిమా? డియర్ కామ్రెడ్ (2019)&nbsp; దివ్య శ్రీపాద నటించిన తొలి వెబ్‌సిరీస్ హెడ్స్ అండ్ టేల్స్(2021) దివ్య శ్రీపాద ఎత్తు ఎంత? 5 అడుగుల 6గుళాలు&nbsp; దివ్య శ్రీపాద అభిరుచులు? కూకింగ్ దివ్య శ్రీపాద&nbsp; ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ దివ్య శ్రీపాదకు ఇష్టమైన కలర్?&nbsp; వైట్ దివ్య శ్రీపాదకు ఇష్టమైన హీరో? పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ దివ్య శ్రీపాద ఏం చదివింది? MBA దివ్య శ్రీపాద పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ. 30లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. దివ్య శ్రీపాద సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? దివ్య శ్రీపాద సినిమాల్లోకి రాకముందు IBM కంపెనీలో పనిచేసింది. దివ్య శ్రీపాద ఎన్ని భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అరబిక్, ఫ్రెంచ్, తెలుగు భాషాల్లో అనర్గళంగా మాట్లాడుతుంది. https://www.youtube.com/watch?v=P1fCyBtJyC0 దివ్య శ్రీపాద ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/divyasripada/
    ఏప్రిల్ 29 , 2024
    నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    స్వయంకృషితో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ పొలిశెట్టి. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ అంచెలంచెలుగా హీరో స్థాయికి ఎదిగాడు. హీరోగా తొలి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో విమర్శకుల ప్రశంసలు పొందాడు. జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విజయాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టాలీవుడ్‌లో కామెడీ స్టార్‌గా ఎదిగిన నవీన్ పొలిశెట్టి గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. నవీన్ పొలిశెట్టి హీరోగా తొలి సినిమా? ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ నవీన్ పొలిశెట్టి ఎత్తు ఎంత? 5 అడుగుల 10 అంగుళాలు నవీన్ పొలిశెట్టి&nbsp; ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్ నవీన్ పొలిశెట్టి పుట్టిన తేదీ ఎప్పుడు? 1990, డిసెంబర్ 26 నవీన్ పొలిశెట్టికి వివాహం అయిందా? ఇంకా జరగలేదు. నవీన్ పొలిశెట్టి&nbsp; ఫెవరెట్ హీరో? మహేష్ బాబు, అనిల్ కపూర్ నవీన్ పొలిశెట్టి&nbsp; తొలి హిట్ సినిమా? ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ నవీన్ పొలిశెట్టి గుర్తింపునిచ్చిన చిత్రం? జాతి రత్నాలు నవీన్ పొలిశెట్టి ఇష్టమైన కలర్? &nbsp;బ్లాక్ నవీన్ పొలిశెట్టి&nbsp; తల్లిదండ్రుల పేరు? మంజుల(బ్యాంక్ ఉద్యోగి), రాజ్‌కుమార్( ఫార్మస్యూటిక్ బిజినెస్) నవీన్ పొలిశెట్టి ఇష్టమైన ప్రదేశం? అమెరికా నవీన్ పొలిశెట్టికి ఇష్టమైన సినిమాలు? షోలే నవీన్ పొలిశెట్టి ఏం చదివాడు? సివిల్ ఇంజనీరింగ్(NIT భోపాల్) నవీన్ పొలిశెట్టి అభిరుచులు? &nbsp;ట్రావలింగ్, డ్యాన్స్ చేయడం, రీడింగ్ బుక్స్ నవీన్ పొలిశెట్టి ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 7 సినిమాల్లో నటించాడు.&nbsp; నవీన్ పొలిశెట్టి సినిమాకి ఎంత తీసుకుంటాడు? ఒక్కో సినిమాకు రూ.2కోట్లు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=6SPYe3HkBVo
    మార్చి 21 , 2024
    Om Bheem Bush: రిలీజ్‌కు ముందే నాలుగు రెట్లు లాభాలు.. ‘ఓం భీమ్‌ బుష్‌’ మూవీనా మజాకా!
    Om Bheem Bush: రిలీజ్‌కు ముందే నాలుగు రెట్లు లాభాలు.. ‘ఓం భీమ్‌ బుష్‌’ మూవీనా మజాకా!
    ఈ వారం రిలీజ్‌ కాబోతున్న టాలీవుడ్‌ మోస్ట్‌ అవైటెడ్‌ చిత్రం 'ఓం భీమ్‌ బుష్‌' (Om Bheem Bush). శ్రీ విష్ణు (Sree Vishnu), ప్రియదర్శి (Priyadarsi), రాహుల్ రామకృష్ణ (Rahul RamaKrishna) హీరోలుగా.. హుషారు (Hushaaru) మూవీ ఫేమ్‌ శ్రీ హర్ష కనుగొంటి (Sri Harsha Kanugonti) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యువీ క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ బ్యానర్లపై ఈ సినిమా వస్తుండటంతో అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఇటీవల రిలీజైన టీజర్‌, ట్రైలర్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో సినిమాపై మంచి బజ్‌ ఏర్పడింది. ప్రమోషన్స్‌ కూడా భిన్నంగా చేస్తుండటంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తిని పెంచింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి హీరో శ్రీ విష్ణు ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్ ఇచ్చాడు.&nbsp; ‘ఆ దెబ్బతో ప్రాఫిట్స్‌ వచ్చేశాయ్‌’ ‘ఓం భీమ్ బుష్‌’ ట్రైలర్‌ చూసినవారంతా ఈ సినిమా మరో ‘జాతి రత్నాలు’గా ఉందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తికనబరుస్తున్నాయి. ఇదిలా ఉంటే హీరో శ్రీవిష్ణు.. ఈ సినిమా విడుదలకు ముందే నాలుగు రెట్లు ప్రాఫిట్స్‌ యూవీ క్రియేషన్స్‌ వారికి వచ్చాయని వ్యాఖ్యానించారు. తన గత హిట్‌ చిత్రం ‘సామజవరగమన’ తాలూకా పాజిటివ్ ఫ్యాక్టర్.. అలాగే ఇప్పుడు ‘ఓం భీం బుష్’ తాలూకా క్రియేటివ్ టీజర్, ట్రైలర్ కంటెంట్‌ల దెబ్బతో నిర్మాతలకి ఆల్రెడీ ప్రాఫిట్స్ వచ్చేశాయని లేటెస్ట్ ఇంటర్వ్యూ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. విడుదలకు ముందే ఈ స్థాయిలో ప్రాఫిట్స్ తీసుకొస్తే రిలీజయ్యాక ఎన్ని రికార్డ్స్‌ బద్దలు అవుతాయో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; సెన్సార్‌ పూర్తి 'ఓం భీమ్ బుష్‌' చిత్రం.. తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్టు ఈ చిత్రానికి యూ/ఏ (U/A) సర్టిఫికేట్ జారీ చేసింది. 2 గం.ల 15 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమాను అన్ని వయస్సుల వారు నిరభ్యంతరంగా చూడవచ్చని పేర్కొంది. అయితే మూవీ చూస్తున్నంత సేపు సెన్సార్ సభ్యులు కూడా నవ్వుతూనే ఉన్నారని టాక్‌. కామెడీతో పాటు మంచి ఎమోషన్స్‌ కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్‌ శ్రీ హర్ష ఈ కథకి కామెడీ, హారర్‌ టచ్ ఇవ్వడంతో పాటు కొన్ని సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్‌ జత చేసినట్లు సమాచారం. ఇది ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ అంటోంది. కాగా, ఈ చిత్రం మార్చి 22న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.&nbsp; శ్రీవిష్ణు ఖాతా మరో హిట్‌? ‘సామజవరగమన’ తర్వాత శ్రీవిష్ణు నటించిన ఫుల్‌ లెన్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓమ్‌ బీమ్‌ బుష్‌'. సెన్సార్‌ సభ్యుల మాదిరే థియేటర్స్‌లో సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు నవ్వుతూ బయటకు వెళ్లిపోతాడని మేకర్స్‌ నమ్మకంగా చెబుతున్నారు. సెన్సార్‌ సభ్యుల ప్రశంసలు.. ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్‌ చుస్తుంటే శ్రీవిష్ణు ఖాతాలో కచ్చితంగా మరో హిట్‌ పడేలా కనిపిస్తోంది. మరి జాతిరత్నాలు మాదిరే ‘ఓం భీమ్‌ బుష్‌’ కూడా భారీ బ్లాక్‌ బస్టర్‌ అవుతుందా? లేదా? అనేది మరో రెండ్రోజుల్లో తేలిపోనుంది.&nbsp; https://twitter.com/i/status/1770390528661839896
    మార్చి 20 , 2024
    Pareshan Review: కామెడీ ఓకే.. ‘పరేషాన్‌’తో మసూద హీరో హిట్‌ కొట్టినట్లేనా!
    Pareshan Review: కామెడీ ఓకే.. ‘పరేషాన్‌’తో మసూద హీరో హిట్‌ కొట్టినట్లేనా!
    నటీనటులు : తిరువీర్‌, పావని, సాయి ప్రసన్న, అర్జున్‌ కృష్ణ, మురళీధర్ గౌడ్, శ్రుతి రయాన్ దర్శకత్వం: రోనాల్డ్ రూపక్‌ సన్‌ సంగీతం: యశ్వంత్ నాగ్ సినిమాటోగ్రఫీ: వాసు నిర్మాత : సిద్ధార్థ్‌ రాళ్లపల్లి సమర్పణ: రానా దగ్గుబాటి టాలీవుడ్‌లో తెలంగాణ నేపథ్యమున్న సినిమాలు తెగ సందడి చేస్తున్నాయి. తెలంగాణ యాస, భాషతో పాటు సంస్కృతి సంప్రదాయల మేళవింపుతో వచ్చి ఘన విజయాలు సాధిస్తున్నాయి. ఫిదా, బలగం, జాతి రత్నాలు, దసరా వంటి చిత్రాలు అలా వచ్చి భారీ హిట్ అందుకున్నవే. తాజాగా రూపొందిన ‘పరేషాన్‌’ మూవీ సైతం తెలంగాణ నేపథ్యంలోనే తెరకెక్కింది. రోనాల్డ్ రూపక్‌ సన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘మసూద’ ఫేమ్‌ తిరువీర్‌ హీరోగా నటించాడు. ఈ సినిమాని సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మించగా, హీరో దగ్గుబాటి రానా సమర్పిస్తుండటంతో మూవీపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (జూన్‌ 2) పరేషాన్ చిత్రం విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? అందరినీ ఆకట్టుకుందా? లేదా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ: ఐజాక్‌(తిరువీర్‌) ITI చదివి పనిపాట లేకుండా స్నేహితులతో ఖాళీగా తిరుగుతుంటాడు.&nbsp;ఫ్రెండ్స్‌తో కలిసి విపరీతంగా తాగుతూ గొడవలు పడుతుంటాడు. ఐజాక్‌ను చూసి విసిగిపోయిన తండ్రి సమర్పణం (మురళీధర్‌ గౌడ్‌) తన సింగరేణి ఉద్యోగం కుమారుడికి ఇప్పించాలని భావిస్తాడు. అందుకోసం భార్య నగలు అమ్మి లంచం డబ్బు సిద్ధం చేస్తాడు. అయితే ఆ డబ్బును ఆపదలో ఉన్న ఫ్రెండ్స్‌కు ఐజాక్ ఇస్తాడు. డబ్బు కనిపించకపోవడంతో తండ్రి కొడుకుల మధ్య గొడవ జరుగుతుంది. మరోవైపు తాను ప్రేమించిన అమ్మాయి శిరీష (పావని కరణం) గర్భవతి కావడం ఐజాక్‌ చిక్కులు తెచ్చిపెడుతుంది. అబార్షన్‌ కోసం సిద్దం చేసిన డబ్బును ఎవరో కాజేయడంతో ఐజాక్‌ కొత్త సమస్యల్లో చిక్కుకుంటాడు. దీంతో డబ్బు కోసం ఐజాక్ తెగ పరేషాన్ అవుతుంటాడు. డబ్బు కోసం ఐజాక్‌ ఏం చేశాడు? ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? అనేది మిగిలిన కథ. ఎవరెలా చేశారంటే ఐజాక్‌ పాత్రలో తిరువీర్‌ అద్భుత నటన కనబరిచాడు. సహజత్వానికి దగ్గరగా ఉన్న పాత్రలో జీవించేశాడు. మసూద తర్వాత నటనలో మరింత మెరుగైనట్లు కనిపించాడు. అటు ఫ్రెండ్స్‌ పాత్రలైన ఆర్జీవీ, మైదాక్‌, సత్తి(అర్జున్ కృష్ణ) ప్రేక్షకులను చాలా బాగా కనెక్ట్‌ అవుతాయి. డబ్బు కోసం వారు పడే బాధలు థియేటర్‌లో నవ్వులు పూయించాయి. ముఖ్యంగా సత్తి పాత్ర సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. ఆ పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇక తండ్రి పాాత్రలో మురళీధర్‌ గౌడ్‌ ఎప్పటిలాగే తన మార్క్‌ చూపించాడు. కొడుకు ఫ్యూచర్‌ కోసం తాపత్రయపడే తండ్రిగా ‌అలరించాడు. హీరోయిన్‌ శిరీష పాత్రలో పావని తన పరిధిమేరకు నటించిం మెప్పించింది. సినిమాలో చాలావరకు కొత్తవారే ఉన్నప్పటికీ ఆ నటనలో మాత్రం చాలా అనుభవం ఉన్నట్లు చేశారు. అయితే కొన్ని సీన్లలో మాత్రం అనుభవలేమి కనిపిస్తుంది.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే డైరెక్టర్‌ రోనాల్డ్ రూపక్‌ సన్‌ మంచి కథనే ఎంచుకున్నప్పటికీ దానిని తెరకెక్కించడంలో తడబడ్డాడు. స్క్రీన్‌ప్లే చాలా పేలవంగా ఉంది. నవ్వుల కోసమే సీన్లు చేసుకుంటూ పోయినట్లు అనిపిస్తుంది.&nbsp; ఒకదానికొకటి కనెక్షన్ ఉండదు. సినిమాలో ఎక్కువ భాగం తాగుడే ఉండటం వల్ల ప్రేక్షకుడికి కాస్త విసుగ్గా అనిపిస్తుంది. అయితే ప్రధాన పాత్రల మధ్య వచ్చే కామెడీ సీన్స్‌ను మాత్రం డైరెక్టర్‌ చాలా చక్కగా తెరకెక్కించాడు. ఆ కామెడీ చాలా ఫ్రెష్‌ ఫీలింగ్‌ను తీసుకొస్తుంది. అయితే సీన్లను మరింత క్వాలిటీగా రాసుకుని మేకింగ్‌ పరంగా జాగ్రత్తలు తీసుకుంటే సినిమాకు తిరుగుండేది కాదు.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సినిమాటోగ్రఫీ పరేషాన్‌ చిత్రానికి ప్లస్‌ అని చెప్పొచ్చు. వాసు కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది.&nbsp;పల్లెటూరు వాతావరణాన్ని ఆయన చక్కగా తన కెమెరాతో చూపించారు. ఎడిటింగ్‌ పరంగా ఇంకా కేర్‌ తీసుకుంటే బాగుండేది. యశ్వంత్‌ నాగ్‌ సంగీతం పర్వాలేదు. అయితే BGM సో సోగా అనిపిస్తుంది. కొన్ని సీన్లకు నేపథ్య సంగీతం మరీ ఓవర్‌గా అనిపిస్తుంది. అసలు సింక్‌ అయినట్లు అనిపించదు. నిర్మాణ పరంగా మేకర్స్‌ రాజీ పడినట్లు కనిపిస్తుంది. ఆచి తూచి ఖర్చు పెట్టినట్లు కనిపిస్తోంది.&nbsp; ప్లస్‌ పాయింట్స్ హీరో నటనకామెడీసినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్‌ స్క్రీన్‌ప్లేఎడిటింగ్నేపథ్య సంగీతం రేటింగ్‌ : 2.5/5
    జూన్ 02 , 2023
    EXCLUSIVE: ఫ్యూచర్‌లో టాలీవుడ్‌ను రూల్‌ చేసే యంగ్‌ హీరోలు వీరే!
    EXCLUSIVE: ఫ్యూచర్‌లో టాలీవుడ్‌ను రూల్‌ చేసే యంగ్‌ హీరోలు వీరే!
    సినీ పరిశ్రమలో వారసత్వం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. స్టార్ హీరోల కుమారులు తమ టాలెంట్‌ను నిరూపించుకొని కథానాయకులుగా ఎదుగుతున్నారు. టాలీవుడ్‌లోనూ ఈ తరహా పరిస్థితులే ఉన్నాయి. వారసులుగా వచ్చిన ఈతరం యువ నటులు.. ఇక్కడ స్టార్లుగా గుర్తింపు సంపాదించారు. అయితే కొందరు మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా వచ్చి టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన యాక్టింగ్‌ స్కిల్స్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. తద్వారా రానున్న ఐదేళ్లలో తెలుగు చిత్ర పరిశ్రమను రూల్‌ చేయగలమన్న నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ఇంతకీ ఆ కథానాయకులు ఎవరు? వారి ప్రస్థానం ఇకపై ఎలా సాగనుంది? టాలీవుడ్‌ను శాసించేందుకు వారికి కలిసి రానున్న అంశాలేంటి? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.&nbsp; సుహాస్‌ యువ నటుడు సుహాస్‌ (Suhas).. వరుస హిట్స్‌తో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. కమెడియన్‌గా తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైన సుహాస్‌.. తానొక హీరో మెటీరియల్ ‌అని నిరూపించుకున్నాడు. ‘కలర్‌ ఫొటో’, ‘రైటర్‌’, ‘అంజాబీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’ వంటి హిట్‌ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. సుహాస్‌తో సినిమా అంటే హిట్‌ పక్కా అని దర్శక నిర్మాతలు భావించే స్థాయికి ఈ యువ హీరో ఎదిగాడు. కథల ఎంపికలో సుహాస్‌ అనుసరిస్తున్న వైఖరి చాలా బాగుందని సినీ విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. సుహాస్‌ ఇదే తరహాలో భవిష్యత్‌లో సినిమాలు చేస్తే హీరో నానిలా మరో నేచురల్‌ స్టార్‌ అవుతాడని అంటున్నారు.&nbsp; విజయ్‌ దేవరకొండ యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. ఫ్యూచర్‌ స్టార్‌గా ఎదుగుతున్నాడు. ‘అర్జున్‌ రెడ్డి’తో స్టార్‌ హీరోగా మారిన విజయ్‌.. మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. హిట్‌, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా అభిమానించే ఫ్యాన్స్.. విజయ్‌ సొంతం. ప్రస్తుతం సరైన హిట్‌ లేక విజయ్‌ ఇబ్బంది పడుతున్నాడు. అంతమాత్రన అతడి పని అయిపోయినట్లేనని భావిస్తే పొరపాటే. విజయ్‌ మార్కెట్‌ ఏంటో 2018లో వచ్చిన ‘గీతా గోవిందం’ కళ్లకు కట్టింది. ఆ సినిమా ద్వారా అప్పట్లోనే విజయ్‌ రూ.100 కోట్ల కలెక్షన్లను రాబట్టాడు. ఇక సాలిడ్‌ హిట్‌ లభిస్తే విజయ్‌ను ఆపడం కష్టమేనని చెప్పవచ్చు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ టాలీవుడ్‌ను రూల్‌ చేయగల సామర్థ్యమున్న మరో హీరో ‘సిద్ధు జొన్నలగడ్డ’. ‘డీజే టిల్లు’కి ముందు వరకు సాధారణ హీరోగా ఉన్న సిద్ధూ.. ఆ సినిమాతో తన టాలెంట్‌ ఏంటో చూపించాడు. రీసెంట్‌గా ‘టిల్లు స్క్వేర్‌’తో రూ.100 కోట్ల క్లబ్‌లో వచ్చి చేరాడు. సిద్ధూ మ్యానరిజం, బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ డెలివరీ, రైటింగ్‌ స్కిల్స్‌ యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యాయి. ఎప్పుడైన ఒక సినిమాను సక్సెస్‌ చేయడంలో యూత్‌ కీలకంగా ఉంటారు. అటువంటి యూత్‌పై ఈ యంగ్‌ హీరో చెరగని ముద్ర వేయడం.. అతడి ఫ్యూచర్‌కు కలిసిరానుంది. త్వరలో ‘టిల్లు క్యూబ్‌’ను పట్టాలెక్కించేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో స్టార్‌ హీరోయిన్లు సమంత, తమన్నాలు నటిస్తారని టాక్‌ వినిపిస్తోంది. ఆ మూవీ కూడా సక్సెస్‌ అయితే ఇక ఇండస్ట్రీలో సిద్ధూకు తిరుగుండదని చెప్పవచ్చు.&nbsp; నవీన్ పొలిశెట్టి ఒకప్పుడు కామెడీ హీరో అనగానే ముందుగా రాజేంద్ర ప్రసాద్‌ గుర్తుకు వచ్చేవారు. ఈ జనరేషన్‌లో కామెడీ స్టార్‌ అనగానే అందరికీ నవీన్‌ పొలిశెట్టి గుర్తుకు వస్తున్నాడు. ఈ యంగ్‌ హీరో కామెడీ టైమింగ్‌కు చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. 2019లో వచ్చిన ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో నవీన్‌ తన టాలెంట్‌ ఏంటో చూపించాడు. ‘జాతి రత్నాలు’ సినిమాతో తన క్రేజ్‌ ఒక సినిమాతో పోయేది కాదని నిరూపించాడు. ఫన్‌ అండ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన నవీన్‌ పొలిశెట్టితో సినిమా అంటే మినిమమ్‌ గ్యారంటీ అని నిర్మాతలు భావిస్తున్నారు. బాక్సాఫీస్‌ వద్ద ఒక సాలిడ్‌ హిట్‌ లభిస్తే నవీన్‌ పొలిశెట్టిని ఇక ఎవరూ ఆపలేరని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తేజ సజ్జ యంగ్‌ హీరో ‘తేజ సజ్జ’ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ‘హను మాన్‌’తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సంపాందించిన ఈ యంగ్‌ హీరో.. టాలీవుడ్‌ ఫ్యూచర్‌పై గట్టి భరోసా కల్పిస్తున్నాడు. తేజ ఇప్పటివరకూ చేసిన ‘జాంబిరెడ్డి’, ‘ఇష్క్‌’, ‘అద్భుతం’ చిత్రాలను గమనిస్తే అవన్నీ యూనిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కినవే. ప్రస్తుతం అతడు చేస్తున్న ‘సూపర్‌ యోధ’ చిత్రం కూడా&nbsp; సాహసోపేతమైన కథతో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఈ మూవీ కూడా హనుమాన్‌ స్థాయిలో సక్సెస్ అయితే తేజ ఇక తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరముండదని సినీ నిపుణుల అభిప్రాయం.&nbsp; అడవి శేషు యువ హీరో అడవి శేషు.. యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయాడు. ‘గూఢచారి’ వంటి స్ఫై థ్రిల్లర్‌ తర్వాత ఈ హీరో కథల ఎంపిక పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు లవర్‌ బాయ్‌, విలన్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించిన ఈ యంగ్‌ హీరో.. ప్రస్తుతం ప్రేక్షకులు ఏం&nbsp; కోరుకుంటున్నారో అలాంటి చిత్రాలనే చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘హిట్‌: సెకండ్‌ కేసు’, ‘మేజర్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్స్ వచ్చాయి. ప్రస్తుతం గూఢచారికి సీక్వెల్‌లో నటిస్తూ అడవి శేషు.. బిజీగా ఉన్నాడు. ఈ వ్యూహాన్నే ఫ్యూచర్‌లోనూ అనుసరిస్తే.. ఈ కుర్ర హీరో టాలీవుడ్‌ జేమ్స్‌ బాండ్‌గా మారే అవకాశముంది. ప్రియదర్శి కమెడియన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా మారిన నటుడు ప్రియదర్శి. 2016లో వచ్చిన&nbsp; 'టెర్రర్‌' చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చిన అతడు.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు. గ్రామీణ నేపథ్యమున్న చిత్రాల్లో హీరోగా నటిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకర్షిస్తున్నాడు. గతేడాది వచ్చిన ‘బలగం’ చిత్రం ప్రియదర్శి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇటీవల వచ్చిన ‘మంగళవారం’ సినిమాలో ఓ డిఫరెంట్‌లో రోల్‌లో కనిపించి తనలోని కొత్త నటుడ్ని పరిచయం చేశాడు. ప్రియదర్శి.. ఇలాగే తన ఫ్యూచర్‌ ప్రాజెక్టులను ప్లాన్‌ చేసుకుంటే భవిష్యత్‌లో స్టార్‌ హీరోగా మారడం ఖాయమని ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.&nbsp;
    ఏప్రిల్ 18 , 2024
    EXCLUSIVE: ఈ జనరేషన్‌ మెగాస్టార్లు.. స్వయంకృషితో స్టార్లుగా ఎదిగిన టాలీవుడ్‌ కుర్ర హీరోలు వీరే!
    EXCLUSIVE: ఈ జనరేషన్‌ మెగాస్టార్లు.. స్వయంకృషితో స్టార్లుగా ఎదిగిన టాలీవుడ్‌ కుర్ర హీరోలు వీరే!
    తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది కథానాయకులు ఉన్నారు. స్టార్‌ హీరోల కుటుంబాల నుంచి వచ్చిన వారసులు, దర్శక నిర్మాతల తనయులు.. హీరోలుగా మారి తామేంటో నిరూపించుకున్నారు. అయితే కొందరు మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా వచ్చి టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన యాక్టింగ్‌ స్కిల్స్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. కసి, పట్టుదల ఉంటే ఇండస్ట్రీలో ఎవరైనా పైకి రావొచ్చని ఆ కుర్ర హీరోలు నిరూపించారు. ఇంతకీ ఆ కథానాయకులు ఎవరు? ఇండస్ట్రీలో తమ ప్రస్థానాన్ని ఎలా మెుదలు పెట్టారు? వారిని స్టార్లుగా మార్చిన చిత్రాలు ఏవి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; నాని స్వయం కృషితో పైకొచ్చిన ఈ తరం హీరో అనగానే అందరికీ ముందుగా నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన నాని.. ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా మారాడు. ‘భీమిలి కబడ్డి జట్టు’, ‘అలా మెుదలైంది’, ‘పిల్ల జమిందార్‌’, ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘నేను లోకల్‌’, ‘జెర్సీ’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘దసరా’, ‘హాయ్‌ నాన్న’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోగా మారిపోయాడు. నాని నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న విడుదల కానుంది.&nbsp; విజయ్‌ దేవరకొండ యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. హీరో ఫ్రెండ్‌, ప్రాధాన్యం లేని పాత్రల్లో నటిస్తూ సరైన అవకాశాల కోసం ఎదురుచూశాడు. ‘నువ్విలా’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్‌.. ‘లైఫ్‌ ఇజ్‌ బ్యూటిఫుల్‌’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాల్లో సైడ్‌ రోల్స్‌లో చేశాడు. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి చూపులు' చిత్రంతో తొలిసారి ఫుల్‌ లెన్త్‌ హీరోగా మారాడు. ఆ తర్వాత సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన 'అర్జున్‌ రెడ్డి'తో విజయ్‌ రాత్రికి రాత్రే స్టార్‌గా ఎదిగాడు. యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించాడు. 'గీతా గోవిందం' ఫిల్మ్‌ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కూ విజయ్‌ దగ్గరయ్యాడు. రీసెంట్‌గా ‘ఫ్యామిలీ స్టార్‌’తో విజయ్‌ తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda).. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిత్ర పరిశ్రమలో తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో చిన్న పాత్రలతో కొద్ది రోజులు నెట్టుకొంచాడు. ‘జోష్‌’, ‘ఆరెంజ్‌’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘డాన్‌ శీను’ చిత్రాల్లో పెద్దగా గుర్తింపు లేని పాత్రల్లో నటించాడు. ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్‌లో వచ్చిన 'LBW' (లైఫ్‌ బిఫోర్‌ వెడ్డింగ్‌) మూవీతో సిద్ధూ హీరోగా మారాడు. 'గుంటూరు టాకీస్‌' చిత్రం హీరోగా అతడికి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత అడపాదడపా చిత్రాలు చేసినప్పటికీ సిద్ధుకు చెప్పుకోతగ్గ హిట్‌ రాలేదు. 2022లో వచ్చిన 'డీజే టిల్లు' ఈ యంగ్‌ హీరో కెరీర్‌ను మలుపు తిప్పింది. ప్రేమ పేరుతో మోసపోయిన టిల్లు పాత్రలో సిద్ధు జీవించేశాడు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్‌ కూడా బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. అంతేకాదు రూ.100 కోట్లకు పైగా గ్రాస్‌ రాబట్టి సిద్ధూను స్టార్‌ హీరోల సరసన నిలబెట్టింది. దీంతో 'టిల్లు క్యూబ్‌' తీసేందుకు మేకర్స్ సన్నాహాలు మెుదలు పెట్టారు.&nbsp; నవీన్ పొలిశెట్టి యువ కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) సైతం.. ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. కెరీర్‌ తొలినాళ్లల్లో ప్రాధాన్యం లేని పాత్రల్లో నవీన్‌ నటించాడు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్‌ ఇజ్‌ బ్యూటిఫుల్‌' చిత్రంతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయయ్యాడు. ఆ తర్వాత 'డీ ఫర్‌ దోపిడి', ‘1 నేనొక్కడినే’ చిత్రాల్లో చేసినప్పటికీ పెద్దగా ఫేమ్‌ రాలేదు. అయితే 2019లో వచ్చిన ఏజెంట్‌ 'సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రం.. నవీన్‌ పోటిశెట్టి పేరు మార్మోగేలా చేసింది. ఇందులో నవీన్‌ చెప్పే ఫన్నీ డైలాగ్‌ డెలివరీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక 'జాతి రత్నాలు' ఫిల్మ్‌తో నవీన్‌ పొలిశెట్టి క్రేజ్‌ మరో స్థాయికి చేరింది. ఇటీవల స్టార్‌ నటి అనుష్కతో మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి చిత్రంలో ఈ యంగ్‌ హీరో నటించగా ఆ ఫిల్మ్‌ కూడా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో టాలీవుడ్‌లో నవీన్‌ మినిమమ్‌ గ్యారంటీ హీరోగా మారిపోయాడు.&nbsp; తేజ సజ్జ యువ హీరో తేజ సజ్జ (Teja Sajja).. ఒకప్పుడు బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. చిరంజీవి, మహేష్‌బాబు, వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌, శ్రీకాంత్, జూ.ఎన్టీఆర్‌ చిత్రాల్లో నటించాడు. కాగా, 2019లో వచ్చిన 'జాంబిరెడ్డి' సినిమాతో తేజ సజ్జా హీరోగా మారాడు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ సాధించింది. ఆ తర్వాత చేసిన ఇష్క్‌, అద్భుతం సినిమాలు కూడా హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. రీసెంట్‌గా అతడు నటించిన ‘హనుమాన్‌’ (Hanu Man) సినిమా ప్యాన్‌ ఇండియా స్థాయిలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్రశాంత్‌ వర్మ (Prashanth Varma) దర్శకత్వం వహించిన ఈ సినిమా.. నార్త్‌లో విశేష ఆదరణ సంపాందించింది. దీంతో తేజ సజ్జా క్రేజ్‌ అమాంతం పెరిగింది. ప్రస్తుతం అతడు సూపర్ యోధ అనే ఫిల్మ్‌లో నటిస్తున్నాడు.&nbsp; అడవి శేషు స్టార్‌ హీరో అడవి శేషు (Adivi Sesh)కు కూడా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేదు. తొలి చిత్రం 'కర్మ'తో హీరోగా మారిన అతడు.. అరంగేట్రంతోనే మంచి గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత ‘పంజా’, ‘బలుపు’, ‘రన్‌ రాజా రన్‌’, ‘బాహుబలి’, ‘అమీ తుమీ’ వంటి చిత్రాల్లో సపోర్టింగ్‌ రోల్స్‌లో కనిపించాడు. ఆ తర్వాత వచ్చిన 'గూడఛారి' చిత్రం అడివి శేషు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ స్పై థ్రిల్లర్‌ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఆ తర్వాత చేసిన ‘ఎవరు’, ‘మేజర్‌’, ‘హిట్‌: సెకండ్‌ కేసు’ కూడా సూపర్‌ హిట్స్‌గా నిలవడంతో ఈ యువ నటుడు స్టార్‌ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం అడివి శేషు.. గూడఛారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు.&nbsp; ప్రియదర్శి యువనటుడు ప్రియదర్శి (Priyadarshi Pulikonda)కి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. ఇండస్ట్రీలో తనకంటూ ఎవరు లేనప్పటికీ అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగాడు. చివరికీ 2016లో శ్రీకాంత్‌ హీరోగా వచ్చిన&nbsp; 'టెర్రర్‌' చిత్రంలో ఉగ్రవాది పాత్రతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అదే ఏడాది వచ్చిన ‘పెళ్లి చూపులు’ అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో 'నావు చావు నేను చస్తా.. నీకెందుకు' డైలాగ్‌తో అతడు బాగా ఫేమస్‌ అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హాస్య పాత్రల్లో కనిపించిన ప్రియదర్శి.. 'జాతి రత్నాలు' మూవీతో మరింత పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే గతేడాది వచ్చిన 'బలగం' సినిమా ప్రియదర్శిని స్టార్‌ నటుడిగా నిలబెట్టింది. ఇటీవల వచ్చిన ‘మంగళవారం’, ‘ఓం భీమ్ బుష్‌’ చిత్రాల్లో లీడ్‌ రోల్స్‌లో నటించి ప్రియదర్శి అలరించాడు.&nbsp;
    ఏప్రిల్ 17 , 2024
    Telugu Heroines: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్‌ డేస్‌ తిరిగి వచ్చినట్లేనా?&nbsp;
    Telugu Heroines: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్‌ డేస్‌ తిరిగి వచ్చినట్లేనా?&nbsp;
    ఒకప్పుడు టాలీవుడ్‌ హీరోయిన్స్‌ అనగానే.. తెలుగు భాష, సంప్రదాయం ఉట్టిపడే సావిత్రి, జమున, శారద, జయసుధ లాంటి వారు గుర్తుకు వచ్చేవారు. రాను రాను టాలీవుడ్‌లో పరిస్థితులు మారిపోయాయి. పర భాష ముద్దు గుమ్మలే ప్రేక్షకులను ఆకర్షిస్తారనే నమ్మకం మన టాలీవుడ్ డైరెక్టర్లలో పడిపోయింది. దీంతో నిన్నటి దాకా కాజల్‌, త్రిష, సమంత.. ప్రస్తుతం రష్మిక, పూజా హెగ్డే, మృణాల్‌ ఠాకూర్‌ వంటి ఇతర భాషల నాయికలు ఇక్కడ స్టార్‌ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. అయితే&nbsp; గత కొద్ది కాలంగా&nbsp; ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నట్లు కనిపిస్తోంది. తెలుగు అమ్మాయిల హవా ఇండస్ట్రీలో క్రమంగా పెరుగుతోంది. బడా హీరోలవి మినాహా.. రీసెంట్‌గా వస్తున్న చిన్న సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది. స్టార్‌ హీరోయిన్ల రేసులోకి దూసుకొస్తున్న తెలుగు భామలు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; గౌరి ప్రియ (Gouri Priya) టాలీవుడ్‌లో ఇటీవల వచ్చి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌లో ‘మ్యాడ్‌’ (MAD) చిత్రంలో హీరోయిన్‌గా చేసి గౌరి ప్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. మంచి నటన, అభినయంతో యూత్‌ను కట్టిపడేసింది. రీసెంట్‌గా తమిళ హీరో మణికందన్‌ పక్కన ‘లవర్‌’ సినిమాలో నటించి కోలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.&nbsp; https://www.youtube.com/watch?v=8dwrE0OCq40 ఆనందిని (Anandhi) వరంగల్‌కు చెందిన ఆనంది.. 2012లో వచ్చిన 'ఈ రోజుల్లో' (Ee Rojullo) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చిన్న పాత్రలు చేసుకుంటూ వెళ్లిన ఈ భామ.. తన ఫోకస్‌ను తమిళ మూవీస్‌పై వైపు మళ్లించింది. అక్కడ యంగ్‌ హీరోల సరసన హీరోయిన్‌గా చేసి అందరి ప్రశంసలు అందుకుంది. తెలుగులో జాంబి రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్‌, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం చిత్రాల్లో ఈ భామ మెయిన్‌ హీరోగా చేసింది.&nbsp; చాందిని చౌదరి (Chandini Chowdary) ఏపీలోని విశాఖపట్నానికి చెందిన చాందిని చౌదరి.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' (Life Is Beautiful) మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ‘కుందనపు బొమ్మ’, ‘హౌరా బ్రిడ్జ్‌’, ‘మను’ వంటి చిన్న చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. 'కలర్‌ ఫొటో' (Colour Photo) మూవీతో ఈ అమ్మడి క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. రీసెంట్‌గా 'గామి' (Gaami)లో విష్వక్‌ సేన్‌ సరసన నటించే స్థాయికి చాందిని ఎదిగింది. ఈ భామ సినిమాలతో పాటు 'మస్తీస్‌', 'గాలివాన', 'ఝాన్సీ' వంటి వెబ్‌సిరీస్‌లు సైతం చేసింది.&nbsp; వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ‘బేబీ’ (Baby) సినిమాతో ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చిన తెలుగు నటి ‘వైష్ణవి చైతన్య’. అంతకుముందు వరకూ యూట్యూబ్ సిరీస్‌లకు మాత్రమే పరిమితమైన ఈ సుందరి.. ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ (Software Developer) సిరీస్‌తో ఒక్కసారిగా యూత్‌లో క్రేజీ సంపాదించుకుంది. తద్వారా ‘బేబీ’ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో మెస్మరైజింగ్‌ నటనతో కుర్రకారు హృదయాలను దోచేసింది. ప్రస్తుతం వైష్ణవి.. బేబీ ఫేమ్‌ ఆనంద్‌ దేవరకొండతోనే మరో చిత్రంలో నటిస్తోంది. అలాగే దిల్‌ రాజు ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు అంగీకరించింది.&nbsp; https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI దివ్య శ్రీపాద (Divya Sripada) టాలీవుడ్‌లో తమ క్రేజ్‌ను క్రమంగా పెంచుకుంటున్న తెలుగు అమ్మాయిల్లో ‘దివ్య శ్రీపాద’ ఒకరు. రీసెంట్‌గా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master) సినిమా ద్వారా ఈ భామ హీరోయిన్‌గా మారిపోయింది. అంతకుముందు ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘కలర్ ఫొటో’, ‘మిస్ ఇండియా’, ‘జాతి రత్నాలు’, ‘ఎఫ్‌ 3’, ‘యశోద’, ‘పంచతంత్రం’ వంటి ప్రముఖ చిత్రాల్లో సైడ్‌ పాత్రలకే పరిమితమైంది. 'సుందరం మాస్టర్‌'లో చక్కటి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈ భామకు హీరోయిన్‌గా మరిన్ని అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శోభిత ధూలిపాళ్ల (Sobhita Dhulipala) ఏపీలోని తెనాలిలో జన్మించిన శోభిత దూళిపాళ్ల.. ‘రామన్‌ రాఘవ్‌ 2.0’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. 2018లో వచ్చిన 'గూఢచారి'తో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత కురుప్‌, మేజర్‌, పొన్నిసెల్వన్‌ వంటి హిట్‌ చిత్రాల్లో మెరిసింది. హాలీవుడ్‌ చిత్రం 'మంకీ మ్యాన్‌'లోనూ శోభిత నటించడం విశేషం. ప్రస్తుతం హిందీలో 'సితార' మూవీలో ఈ భామ చేస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన హాలీవుడ్‌, బాలీవుడ్‌ స్థాయిలో చిత్రాలు చేస్తూ స్థానిక నటీమణులకు ఆదర్శంగా నిలుస్తోంది.&nbsp; రితు వర్మ (Ritu Varma) హైదరాబాద్‌కు చెందిన ఈ సుందరి.. 'బాద్‌ షా' (Badshah) సినిమాలో కాజల్‌ ఫ్రెండ్‌ పాత్రలో తెరంగేట్రం చేసింది. 2015లో వచ్చిన 'పెళ్లి చూపులు' (Pelli Choopulu) హీరోయిన్‌గా మారిన రీతు వర్మ.. తొలి సినిమాతోనే సాలిడ్ హిట్‌ అందుకుంది. ‘కేశవ’, ‘నిన్నిలా నిన్నిలా’, ‘టక్ జగదీష్‌’, ‘వరుడు కావలెను’, ‘ఒకే ఒక జీవితం’.. రీసెంట్‌గా ‘మార్క్‌ ఆంటోనీ’ సినిమాల్లో హీరోయిన్‌గా చేసి స్టార్‌ నటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ భామ.. విక్రమ్‌ సరనస 'ధ్రువ నక్షత్రం'లోనూ నటిస్తుండటం విశేషం.&nbsp; https://www.youtube.com/watch?v=4hNEsshEeN8 స్వాతి రెడ్డి (Swathi Reddy) వైజాగ్‌కు చెందిన స్వాతి.. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'డేంజర్‌' (2005) తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో 'సుబ్రహ్మణ్యపురం' చిత్రంలో హీరోయిన్‌గా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 'అనంతపురం' పేరుతో తెలుగులో రిలీజ్ కావడం గమనార్హం. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుసగా అష్టాచమ్మా,&nbsp; గోల్కొండ స్కూల్‌, స్వామి రారా, కార్తికేయ, త్రిపుర, పంచతంత్రం చిత్రాల్లో స్వాతి నటించింది. రీసెంట్‌గా 'మంత్‌ ఆఫ్‌ మధు'తో ప్రేక్షకులను పలకరించింది.&nbsp; https://www.youtube.com/watch?v=BCwsSk_KKrE డింపుల్‌ హయాతి (Dimple Hayathi) ఏపీలోని విజయవాడలో జన్మించిన నటి డింపుల్‌ హయాతి.. హైదరాబాద్‌లో పెరిగింది. 2017లో వచ్చిన 'గల్ఫ్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా పెద్దగా విజయం సాధించనప్పటికీ నటన పరంగా డింపుల్‌కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు దక్కాయి. ‘అభినేత్రి 2’, ‘యురేఖ’, హిందీలో ‘అత్రంగి రే’, విశాల్‌తో ‘సామాన్యుడు’, రవితేజతో ‘ఖిలాడీ’, గోపిచంద్‌తో ‘రామబాణం’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో సినిమాలు లేనప్పటికీ సరైన హిట్‌ తగిలితే డింపుల్ ఎవరూ ఆపలేరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.&nbsp; https://twitter.com/CallBoyforwomen/status/1693578673595793606 శివాని నగరం (Shivani Nagaram) ఇటీవల టాలీవుడ్‌లో తళుక్కుమన్న కొత్త హీరోయిన్లలో శివాని నగరం ఒకరు. యంగ్‌ హీరో సుహాస్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాలో శివాని హీరోయిన్‌గా చేసింది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో శివానికి తెలుగులో మంచి అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తాయి. మానస చౌదరి (Maanasa Choudhary) ఏపీలోని చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన మానన చౌదరి.. రీసెంట్‌గా ‘బబుల్‌గమ్‌’ సినిమాతో టాలీవుడ్‌లో తళుక్కుమంది. రాజీవ్ - సుమ తనయుడు రోషన్‌.. హీరోగా నటించిన ఈ మూవీలో తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనప్పటికీ తనలో మంచి స్కిల్స్‌ ఉన్నాయన్న సందేశాన్ని మానస టాలీవుడ్‌ దర్శక నిర్మాతలకు పంపింది. ఒక హిట్‌ పడితే తెలుగులో ఈ భామకు తిరుగుండదని చెప్పవచ్చు.&nbsp; https://twitter.com/i/status/1762802318934950146 అంజలి (Anjali) తూర్పు గోదావరి జిల్లా రాజోల్‌లో జన్మించిన నటి అంజలి.. ఓ దశలో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ను అందుకుంది. 2006లో 'ఫొటో' అనే తెలుగు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అంజలి.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాల్లో నటించి కోలివుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు' సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ.. బలుపు, మసాలా, గీతాంజలి, డిక్టేటర్‌, సరైనోడు, వకీల్‌సాబ్‌, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం తెలుగులో గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి, గేమ్‌ ఛేంజర్‌లోనూ నటిస్తోంది.&nbsp; https://www.youtube.com/watch?v=3lowhNvIWK0
    మార్చి 06 , 2024
    Telugu Youthful Songs: తెలుగులో యూత్‌ను అమితంగా ఆకట్టుకున్న టాప్‌-10 సాంగ్స్‌ ఇవే!
    Telugu Youthful Songs: తెలుగులో యూత్‌ను అమితంగా ఆకట్టుకున్న టాప్‌-10 సాంగ్స్‌ ఇవే!
    ప్రేమ కథా చిత్రాలకు టాలీవుడ్ పెట్టింది పేరు. దశాబ్దాల కాలం నుంచి ఎన్నో కల్ట్‌ లవ్‌ స్టోరీలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. ఆయా సినిమాలతో పాటు అందులోని పాటలూ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ప్రత్యేకించి కొన్ని మెలోడి సాంగ్స్‌ ప్రేక్షకుల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించాయి. ఆ పాటలు వచ్చి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్‌ ఆల్బమ్స్‌లో అవి తప్పక ఉంటాయి. అటు యూట్యాబ్‌లోనూ అత్యధిక వ్యూస్‌తో ఆ సాంగ్స్‌ దూసుకెళ్తున్నాయి. ఇంతకీ ఆ యూత్‌ఫుల్‌ సాంగ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; 1. మాష్టారు మాష్టారు ధనుష్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సార్‌ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులోని ‘మాష్టారు మాష్టారు’ పాట విశేష ఆదరణ పొందింది. ఈ తరం యువత ఫేవరేట్‌ సాంగ్‌గా మారిపోయింది. అటు యూట్యూబ్‌లోనూ ఈ సాంగ్ ‌అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ 70 మిలియన్ల మంది ఈ సాంగ్‌ను వీక్షించారు.&nbsp; https://www.youtube.com/watch?v=AXSm49NGkg8 2. నీ కన్ను నీలి సముద్రం ఉప్పెన సినిమాలోని ‘నీ కన్ను నీలి సముద్రం’ సాంగ్‌ అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఇప్పటికీ ఈ పాట చాలమందికి ఫేవరేట్. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించగా జావేద్ అలీ ఆ సాంగ్‌ పాడారు. యూట్యూబ్‌లో 39 మిలియన్ల మంది ఈ పాటను చూశారు.&nbsp; https://www.youtube.com/watch?v=zZl7vDDN8Ek 3. చిట్టి నీ నవ్వంటే&nbsp; జాతి రత్నాలు సినిమాలోని ‘చిట్టి నీ నవ్వంటే’ పాట యూత్‌ను ఎంతగానో ఆకర్షించింది.&nbsp;రాధన్ సంగీతం అందించిన ఈ పాటను రామ్ మిరియాల పాడారు. ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ పాటను యూత్‌కు కనెక్ట్‌ అయ్యేలా రాశారు. కాగా, యూట్యూబ్‌లో ఈ పాటను ఏకంగా 145 మిలియన్ల మంది వీక్షించారు.&nbsp; https://www.youtube.com/watch?v=uvCbZxYdLuU 4. ఇంకేం ఇంకేం కావాలి విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘గీతా గోవిందం’ చిత్రం ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఇందులోని ‘ఇంకేం ఇంకేం కావాలి’ సాంగ్‌ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. అటు యూట్యూబ్‌లో ఈ పాటకు 155 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. https://www.youtube.com/watch?v=cC8AmhPUJPA 5. అడిగా అడిగా నాని, నివేదా థామస్‌ జంటగా చేసిన సినిమా ‘నిన్నుకోరి’. ఇందులోని ‘అడిగా అడిగా’ పాట హృదయాలను హత్తుకుంటుంది. గోపి సుందర్‌ సంగీతం అందించిన ఈ సినిమాలోని అన్ని పాటలు మ్యూజిక్‌ లవర్స్‌ను మెప్పించాయి.&nbsp; https://www.youtube.com/watch?v=evbYFsSJ4pU 6. చూసి చూడంగానే 2018లో రిలీజైన ‘ఛలో’ సినిమా నాగశౌర్య కెరీర్‌లోని బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘చూసి చూడంగానే’ పాట అప్పట్లో యమా క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆటోల్లోనూ, బస్‌స్టాండ్లలోనూ ఎక్కడ చూసిన ఈ సాంగ్‌ మారుమోగేది. అనురాగ్‌ కులకర్ణి, స్వరసాగర్‌ మహతి ఈ పాటను పాడారు. కాగా, యూట్యూబ్‌లో ఈ పాటను 205 మిలియన్ల మంది వీక్షించారు. https://www.youtube.com/watch?v=_JVghQCWnRI 7. పూలనే కునుకేయమంటా శంకర్‌ డైరెక్షన్‌లో విక్రమ్‌, అమీ జాక్సన్‌ జంటగా నటించిన చిత్రం ‘ఐ’. ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలో ‘పూలనే కునుకేయమంటా’ అనే పాట కోట్లాది మంది హృదయాలను దోచుకుంది. హరిచరణ్, శ్రేయా ఘోషల్‌ ఎంతో అద్భుతంగా ఈ పాటను పాడారు. అంతేగాక ఈ సాంగ్‌ను చిత్రీకరించిన లోకేషన్స్‌ కూడా ఆకట్టుకుంటాయి.&nbsp; https://www.youtube.com/watch?v=cjoz0FZ-wWs 8. మాటే వినదుగా విజయ్‌ దేవరకొండ హీరోగా చేసిన ‘టాక్సీవాలా’ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చి హిట్‌ అందుకుంది. ఈ సినిమాలోని ‘మాటే వినదుగా’ పాట కూడా మ్యూజిక్ లవర్స్‌ను&nbsp; ఉర్రూతలూగించింది. ఇప్పటికీ ఈ సాంగ్‌ను రిపీట్‌ మోడ్‌లో పెట్టుకొని వింటుంటారు.&nbsp; https://www.youtube.com/watch?v=HMh6W8oxmyc 9. మధురమే విజయ్‌ దేవరకొండ కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమా ‘అర్జున్‌ రెడ్డి’. ఇందులో ‘మధురమే’ పాట మోస్ట్‌ రొమాంటిక్‌ సాంగ్‌గా గుర్తింపు పొందింది. యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటలో విజయ్‌, హీరోయిన్‌ షాలిని పాండే రొమాన్స్‌ను తారా స్థాయిలో చూపించారు. రాధన్ సంగీతం అందించిన ఈ పాటకు సమీరా భరద్వాజ్ స్వరాన్ని అందించింది. https://www.youtube.com/watch?v=YaZuEkCgctA&amp;feature=youtu.be 10. ఎంత సక్కగున్నావే రంగస్థలం సినిమాలోని ‘ఎంత సక్కగున్నావే’ పాట అందరినీ కట్టిపడేసింది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ పాటకు సంగీతంతో పాటు స్వరాన్ని కూడా అందించారు. సమంత అందాన్ని పొగిడే క్రమంలో రామ్‌చరణ్‌ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ హైలెట్‌గా నిలుస్తాయి. యూట్యూబ్‌లో 61 మిలియన్ల మంది ఈ పాటను వీక్షించారు.&nbsp; https://www.youtube.com/watch?v=eABViudPBFE
    మే 31 , 2023
    Vyjayanthi Movies Hits : ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ సంస్థ  వైజయంతీ బ్యానర్‌లో ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయా?
    Vyjayanthi Movies Hits : ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ సంస్థ  వైజయంతీ బ్యానర్‌లో ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయా?
    ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం.. థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కల్కి ఈ స్థాయి సక్సెస్‌ సాధించడం వెనక దర్శకుడు నాగ్‌ అశ్విన్‌తో పాటు నిర్మాణ సంస్థ ‘వైజయంతీ మూవీస్‌’ (Vyjayanthi Movies) బ్యానర్‌ పాత్ర కూడా ఎంతో ఉంది. నిర్మాత అశ్వనీ దత్‌ (Aswani Dutt) ఎంతో సాహాసోపేతంగా కల్కి చిత్రాన్ని నిర్మించారు. బడ్జెట్‌ అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. క్వాలిటీ ఔట్‌పుట్‌ ఇవ్వాలన్న లక్ష్యంతో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు బడ్జెట్‌ పరంగా పూర్తి స్వేచ్ఛను కల్పించారు. రూ.600 కోట్లకు పైగా వ్యయంతో ఇండియాలోనే అతి భారీ బడ్జెట్‌ ఫిల్మ్‌గా కల్కిని తీర్చిదిద్దారు. కల్కి లాంటి విజువల్‌ వండర్‌ను అందించిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ పేరు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.&nbsp; [toc] వైజయంతీ మూవీస్‌ ప్రస్థానం అశ్వనీ దత్‌.. నిర్మాతగా తన ప్రస్థానాన్ని అభిమాన హీరో నందమూరి తారక రామారావు ఫిల్మ్‌తోనే ప్రారంభించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ను నిర్మించి దాని లోగోగా కృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీఆర్‌ను పెట్టారు. 1975లో వచ్చిన 'ఎదురులేని మనిషి' చిత్రంతో వైజయంతీ మూవీస్‌ సంస్థ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలినాళ్లలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలను అందించడంలో మాత్రం వెనకడుగు వేయలేదు. ఈ బ్యానర్‌లో వచ్చిన పలు చిత్రాలు టాలీవుడ్‌లో ఎంతో ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేశాయి. ఇంతకీ ఆ బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు ఏంటి? తెలుగు చిత్ర పరిశ్రమలో అవి ఎలాంటి మార్క్‌ను క్రియేట్‌ చేశాయి? ఇప్పుడు చూద్దాం.&nbsp; అగ్నిపర్వతం వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ‘అగ్నిపర్వతం’ (Agni Parvatam) ఒకటి. ఇందులో సూపర్‌ స్టార్‌ కృష్ణ డబుల్‌ రోల్స్‌ చేయగా.. రాధ, విజయశాంతి హీరోయిన్లుగా కనిపించారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ ఫిల్మ్‌ అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇందులో సూపర్‌ స్టార్‌ కృష్ణ నట విశ్వరూపం చూపించారు. ఈ చిత్రం కృష్ణ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో కృష్ణ దూకుడుగా చెప్పిన ‘అగ్గి పెట్టుందా?’ డైలాగ్‌ అప్పట్లో మారుమోగింది. అలాగే ‘కదులుతున్న అగ్నిపర్వతం’ సాంగ్‌ కూడా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. నటుడిగా సరికొత్త కృష్ణను పరిచయం చేసింది. మూవీ కథ ఏంటంటే.. ‘జమదగ్ని తన తల్లిని విడిచిపెట్టినందుకు అతని తండ్రిని ద్వేషిస్తాడు. అయితే అతని శత్రువులు సమస్య సృష్టించేందుకు జమదగ్ని సవతి సోదరుడిని తెరపైకి తెస్తారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.&nbsp; https://www.youtube.com/watch?v=FaJqLrjanQM జగదేక వీరుడు అతిలోక సుందరి వైజయంతీ మూవీస్‌ రొటిన్‌ చిత్రాలనే కాకుండా ప్రయోగాత్మక ఫిల్మ్స్‌ కూడా తీయగలదని ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం నిరూపించింది. మెగాస్టార్ కెరీర్‌లో మరుపురాని చిత్రంగా నిలిచిపోయింది. సోషియో ఫాంటసీ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం.. అప్పట్లో కలెక్షన్ల మోత మోగించింది. ఈ చిత్రం విడుదలకు ముందు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను వరదలు అతలాకుతలం చేశాయి. అయినా ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకోవడం విశేషం.&nbsp; రూ. 2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ ఫిల్మ్‌.. ఆ రోజుల్లో రూ.15 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాకు ఇళయరాజా అందించిన మధురమైన పాటలు ఇప్పటికీ ఎక్కడోచోట మారుమోగుతూనే ఉన్నాయి. కథ ఏంటంటే ‘నలుగురు అనాథలకు ఆశ్రయిమిచ్చిన రాజు.. గైడ్‌గా పనిచేస్తుంటాడు. రాజుకు అనుకోకుండా ఓ రోజు ఇంద్రుడి కుమార్తె ఇంద్రజకు చెందిన ఉంగరం దొరుకుతుంది. ఆ ఉంగరం కోసం ఇంద్రజ తిరిగి భూమి మీదకు వస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.&nbsp; శుభలగ్నం జగపతిబాబు హీరోగా, ఆమని, రోజా హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం యూనిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. భార్య భర్తలు సంతోషంగా జీవించడానికి డబ్బుతో సంబంధం లేదని నిరూపించింది. డబ్బు కోసం భర్తనే అమ్మేసిన భార్య.. చివరికి మారి భర్తను ఎలా దక్కించుకుంది? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీలోని ‘చిలకా ఏ తోడు లేక’ అనే పాటకు ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెలకు నంది పురస్కారం రావడం విశేషం. కథ ఏంటంటే.. ‘డబ్బుపై ఆశతో రాధ తన భర్తను ధనవంతురాలైన లతకు ఇచ్చి పెళ్లి చేస్తుంది. ఫలితంగా ఆమెకు కోటి రూపాయలు లభిస్తాయి. అయితే కాలక్రమంలో భర్త తోడు లేని జీవితం వృథా అని భావిస్తుంది’. గోవిందా గోవిందా నాగార్జున - రామ్‌ గోపాల్‌ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన 'గోవిందా గోవిందా'.. అప్పట్లో బ్లాక్‌ బాస్టర్ సక్సెస్‌ అందుకుంది. వెంకటేశ్వర స్వామి కిరీటం చుట్టూ తిరిగే ఈ సినిమా కథ తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. ఇందులో శ్రీదేవి తెలుగు ఆడియన్స్‌ ఎంతగానో మిస్మరైజ్‌ చేశారు. కథ ఏంటంటే.. ‘భగవంతుడైన వేంకటేశ్వరుడు.. దైవిక ఆయుధాన్ని ఉపయోగించి భూమిపై గందరగోళ పరిస్థితిని పరిష్కరించాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఈ ఆయుధంపై ఉన్న ఆభరణాలను కొంతమంది దుండగులు దొంగిలించినప్పుడు పరిస్థితి దిగజారుతుంది’. ఓటీటీ వేదిక : సన్‌ నెక్స్ట్‌ రాజకుమారుడు వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ ద్వారానే సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా పరిచయం చేశారు. కథానాయకుడిగా అతడి ఫస్ట్‌ ఫిల్మ్‌ 'రాజకుమారుడు'ను కల్కి నిర్మాత అశ్వనీదత్‌ నిర్మించారు. ఈ సినిమాకు ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు సైతం వచ్చింది. చాలా సెంటర్లలో ఈ సినిమా 100 రోజులకు పైగా ఆడింది. ప్లాట్ ఏంటంటే.. 'సెలవులను ఎంజాయ్‌ చేయడానికి వచ్చిన రాజ్‌.. రాణిని చూసి ప్రేమలో పడతాడు. అయితే కుటుంబం ఒత్తిడితో ఆమె ప్రేమను వదులుకుంటాడు. ఇంతకి రాణి ఎవరు? ఆమె ఫ్యామిలీతో రాజ్‌ కుటుంబానికి ఉన్న వైరం ఏంటి? చివరికి వారు ఎలా ఒక్కటయ్యారు?' అన్నది కథ.&nbsp; ఇంద్ర మెగాస్టార్‌ చిరంజీవి క్రేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిన చిత్రంగా 'ఇంద్ర'కు పేరుంది. ఈ సినిమాలో చిరు.. తొలిసారి ఫ్యాక్షనిస్టు పాత్ర పోషించారు. నిర్మాత అశ్వనీదత్‌కు ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. 2002లో ఉత్తమ నటుడిగా చిరంజీవికి నంది పురస్కారం వచ్చేలా చేసింది. 'రాయలసీమలో రెండు కుటుంబాల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతుంటుంది. ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యర్థుల చెల్లెలితో ఇంద్ర పెళ్లికి అంగీకరిస్తాడు. కట్‌ చేస్తే సాధారణ జీవితం కోసం ఇంద్ర మారుపేరుతో కాశీకి వెళ్లిపోతాడు. ఇంద్ర కాశీకి ఎందుకు వెళ్లాడు? తిరిగి ప్రత్యర్థులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు?' అన్నది కథ. స్టూడెంట్‌ నెంబర్‌ 1 దర్శకధీరుడు రాజమౌళిని నిర్మాత అశ్వని దత్‌ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తారక్‌ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన మెుట్ట మెుదటి చిత్రం 'స్టూడెంట్‌ నెం.1' అశ్వనీదత్‌ నిర్మాత. వైజయంతీ మూవీస్‌ సబ్‌ బ్యానర్‌ అయి స్వప్న సినిమాస్‌ ఈ మూవీని తెరకెక్కించింది. ఈ సినిమా 73 కేంద్రాల్లో 50 రోజులు, 42 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ప్రదర్శించబడింది. ఈ సినిమాని రూ.1.85 కోట్లతో నిర్మించగా రూ.12 కోట్లు వసూలు చేసింది. కథ ఏంటంటే.. ‘ఆదిత్యకు ఇంజినీర్ కావాలని కోరిక. కానీ అతని తండ్రి లాయర్ కావాలని ఆదేశిస్తాడు. అయితే లా చదవడం ఇష్టం లేని ఆదిత్య పరీక్ష రాసేందుకు వెళ్లే క్రమంలో ఓ అమ్మాయిని రక్షించబోయి సమస్యల్లో పడతాడు. ఆదిత్య తండ్రి అతన్ని ఇంటి నుంచి గెంటేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.&nbsp; మహర్షి మహేష్‌ బాబు హీరోగా పూజా హెగ్డే, అల్లరి నరేష్‌ ప్రధాన పాత్రల్లో చేసిన మహార్షి చిత్రానికి.. అశ్వనీ దత్‌ సహా నిర్మాతగా వ్యవహరించారు. 2019 సంవత్సరానికి గాను 10 విభాగాల్లో విభాగాల్లో సైమా అవార్డ్స్‌ నామినేట్‌ కాగా.. అందులో 5 పురస్కారాలను మహర్షి కైవసం చేసుకోవడం విశేషం. ‘రిషి (మహేష్‌) ఓ మల్టీ నేషనల్‌ కంపెనీకి సీఈవోగా ఉంటాడు. కాలేజీ రోజుల్లో తన కోసం ఫ్రెండ్‌ రవి&nbsp; చేసిన త్యాగం గురించి తెలుసుకుంటాడు. అతడ్ని వెతుక్కుంటూ ఊరికి వెళ్లిన రిషికి అతడు సమస్యల్లో ఉన్నట్లు తెలుస్తుంది. అప్పుడు రిషి తన ఫ్రెండ్‌ కోసం ఏం చేశాడు? ఎలా అండగా నిలబడ్డాడు?’ అన్నది కథ. ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ సీతారామం 2022లో తెరకెక్కిన సీతారామం చిత్రం.. ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నిర్మాతగా అశ్వని దత్‌ వ్యవహరించారు. ఈ సినిమాతో మృణాల్‌ ఠాకూర్‌ రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. రూ.30 కోట్లతో తెరకెక్కిన సీతారామం చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ.91-98 కోట్లు కొల్లగొట్టింది. ప్లాట్‌ ఏంటంటే.. ‘ఆర్మీ అధికారి రామ్ (దుల్కర్‌ స‌ల్మాన్‌) ఓ అనాథ. ఆ విషయాన్ని రేడియోలో చెప్పినప్పటి నుంచి అతడికి ఉత్తరాలు వెల్లువెత్తుతాయి. పెద్ద కుటుంబం ఏర్పడుతుంది. ఓ అమ్మాయి మాత్రం నీ భార్య సీతామ‌హాల‌క్ష్మి (మృణాల్ ఠాకూర్‌) అని సంబోధిస్తూ ఉత్తరాలు రాస్తుంటుంది. ఇంత‌కీ ఈ ఆమె ఎవ‌రు? అనాథ అయిన రామ్‌కు భార్య ఎక్కడి నుంచి వ‌చ్చింది? ఆమెని క‌లుసుకునేందుక‌ని వ‌చ్చిన రామ్‌కు ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి?’ అనేది కథ. ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ &amp; హాట్‌స్టార్‌ కల్కి 2898 ఏడీ నిర్మాత అశ్వని దత్‌.. ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని నిర్మించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై వచ్చిన అతి భారీ బడ్జెట్‌ చిత్రం ‘కల్కి’ కావడం విశేషం. ఈ సినిమాను మైథాలిజీ &amp; ఫ్యూచరిక్‌ జానర్లలో నిర్మించారు. ఇందులో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామ పాత్ర పోషించిగా.. విలన్‌గా కమల్‌ హాసన్‌ చేశారు. దిశాపటానీ, దీపిక పదుకొణె ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.&nbsp; వైజయంతీ మూవీస్‌ సబ్‌ బ్యానర్స్‌లో వచ్చిన హిట్‌ చిత్రాలు బాణం అశ్వని దత్‌ కుమార్తె ప్రియాంక దత్‌.. త్రీ ఎంజెల్స్ బ్యానర్‌పై తొలిసారి బాణం చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ ద్వారా నారా రోహిత్‌ హీరోగా పరిచయం అయ్యారు. ప్లాట్‌ ఏంటంటే.. ‘మాజీ నక్సలైట్ కొడుకు అయిన భగత్ ఒక చిన్న పట్టణంలో నివసిస్తుంటాడు. స్థానిక గ్యాంగ్‌స్టర్ దౌర్జన్యాల నుంచి ప్రజలను కాపాడేందకు IPS అధికారి కావాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా? లేదా?’ అన్నది కథ. సారొచ్చారు ప్రియాంక దత్‌ నిర్మించిన ఈ సినిమా.. ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంది. ఇందులో రవితేజ, కాజల్‌&nbsp; రిచా గంగోపాథ్యాయ ప్రధాన పాత్రలు పోషించారు. ప్లాట్‌ ఏంటంటే.. 'సంధ్య కార్తిక్‌ను ప్రేమిస్తుంది. అయితే అతడికి ఇదివరకే పెళ్లైన విషయాన్ని తెలుసుకుంటుంది. ఇంతకీ కార్తిక్‌ గతం ఏంటి? కార్తిక్, సంధ్య కలిశారా? లేదా?’ అన్నది స్టోరీ. ఓటీటీ వేదిక : హాట్‌స్టార్‌ &amp; ఆహా Sir Ocharu Movie Posters TollywoodAndhra.in ఎవడే సుబ్రహ్మణ్యం కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన మెుట్టమెుదటి ఫిల్మ్‌ 'ఎవడే సుబ్రహ్మణ్యం'. ఇందులో నాని, విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ టాలెంటెడ్‌ డైరెక్టర్‌గా నాగ్ అశ్విన్‌కు గుర్తింపు తీసుకొచ్చింది. ప్లాట్ ఏంటంటే.. ‘మెటీరియలిస్టిక్ స్వభావం కలిగిన సుబ్రమణ్యం జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు హిమాలయాలకు వెళ్తాడు. ఈ క్రమంలో అనుబంధాల పట్ల తన వైఖరిని మార్చుకుంటాడు’. ఓటీటీ వేదిక : సన్‌ నెక్స్ట్‌ మహానటి అశ్వని దత్‌ రెండో కుమార్తె స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి కూడా కల్కి ఫేమ్‌ నాగ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. స్వప్న సినిమా బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం.. మహానటి సావిత్రి జీవత కథ ఆధారంగా తెరకెక్కింది. ‘సావిత్రి ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టారు? నటుడు జెమినీ గణేషన్‌ ఆమె జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించారు? జీవత చరమాంకంలో ఆమె ఎలాంటి కష్టాలు అనుభవించారు?’ అన్నది స్టోరీ.&nbsp; ఓటీటీ వేదిక :&nbsp; అమెజాన్‌ ప్రైమ్‌ జాతి రత్నాలు వైజయంతి మూవీస్‌ సబ్‌ బ్యానర్‌ అయిన 'స్వప్న సినిమా'.. జాతిరత్నాలు మూవీని నిర్మించింది. ప్లాట్‌ ఏంటంటే.. ‘మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారు’ అనేది కథ. ఓటీటీ వేదిక :&nbsp; అమెజాన్‌ ప్రైమ్‌
    అక్టోబర్ 25 , 2024
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి.&nbsp; ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.. [toc] Allari Naresh comedy movies సుడిగాడు అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 అల్లరి టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో&nbsp; ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ ఆ ఒక్కటీ అడక్కు ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో లడ్డూ బాబు&nbsp; ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ సిల్లీ ఫెలోస్&nbsp; ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్‌) సూరిబాబు (సునీల్‌)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్‌)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మేడ మీద అబ్బాయి&nbsp; శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ జేమ్స్ బాండ్&nbsp; నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ. ఓటీటీ: జీ5 యముడికి మొగుడు యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది. OTT: అమెజాన్ ప్రైమ్ సీమ టపాకాయ్ శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్ కత్తి కాంతారావు ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ బెండు అప్పారావు R.M.P. ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక&nbsp; కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు. ఓటీటీ: జీ5 బ్లేడ్ బాబ్జీ ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్‌ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్‌నెక్స్ట్ సీమా శాస్త్రి ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు. ఓటీటీ: ప్రైమ్ వీడియో నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్‌ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి&nbsp; మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ప్లిక్స్ జాతి రత్నాలు ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ; అమెజాన్ ప్రైమ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ&nbsp; ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్‌ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది. ఓటీటీ: ఆహా సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్‌ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్‌ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. టిల్లు స్క్వేర్ రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లిల్లీ జోసెఫ్‌ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ డీజే టిల్లు డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాల‌నేది అత‌డి క‌ల‌. సింగ‌ర్ రాధిక (నేహాశెట్టి)ని చూడ‌గానే ప్రేమలో పడుతాడు. ఇంత‌లో రాధిక ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ. ఓటీటీ: ఆహా రాజ్‌ తరుణ్&nbsp; పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్‌ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం. ఉయ్యాల జంపాలా బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. సినిమా చూపిస్త మావ&nbsp; సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు ఓటీటీ:&nbsp; హాట్ స్టార్ విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈనగరానికి ఏమైంది? నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ అశోకవనంలో అర్జున కళ్యాణం మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్‌ డౌన్‌ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా సునీల్ కామెడీ సినిమాలు సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు.&nbsp; సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్‌ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మర్యాద రామన్న ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్ పూలరంగడు ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ వీడియో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అప్పల్రాజు (సునిల్) స్టార్‌ డైరెక్టర్‌ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో అందాల రాముడు ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ జై చిరంజీవ! ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్‌ డీలర్‌ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు. ఓటీటీ: యూట్యూబ్ సొంతం ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ చిరునవ్వుతో ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది. ఓటీటీ: ఆహా నువ్వే కావాలి ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది. ఓటీటీ: ఈటీవీ విన్ తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు లేడీస్ టైలర్ సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ: యూట్యూబ్ చంటబ్బాయి&nbsp; జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ అహ! నా పెళ్లంట తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా&nbsp; బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం&nbsp; దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు. ఓటీటీ-&nbsp; యూట్యూబ్ జంబలకిడి పంబ తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది. ఓటీటీ- యూట్యూబ్ అప్పుల అప్పారావు తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది.&nbsp; ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ-&nbsp; జియో సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు&nbsp; రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.&nbsp; ఓటీటీ: ఆహా మాయలోడు పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.&nbsp; మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో&nbsp; ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది. ఓటీటీ: ఈటీవీ విన్ యమలీల S. V. కృష్ణా రెడ్డి&nbsp; దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా,&nbsp; కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి&nbsp; రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.&nbsp; ఓటీటీ: ప్రైమ్ హనుమాన్ జంక్షన్ &nbsp;ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ఓటీటీ: ప్రైమ్ నువ్వు నాకు నచ్చావ్ కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని&nbsp; ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్&nbsp; ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది. ఓటీటీ: హాట్ స్టార్ వెంకీ తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది. ఓటీటీ: యూట్యూబ్ దూకుడు పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా&nbsp; దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.&nbsp; మత్తు వదలరా తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ‌ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి. అదుర్స్‌ అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఓటీటీ: ప్రైమ్, ఆహా మన్మధుడు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు. ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్ ఢీ మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి. ఓటీటీ: యూట్యూబ్ రెడీ శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్‌ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. రేసు గుర్రం ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్‌ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు. ఓటీటీ: యూట్యూబ్ మనీ మనీ "వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి. ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్ అనగనగా ఒకరోజు ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే. ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా కింగ్ ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు. ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు వెన్నెల ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.&nbsp; ఓటీటీ: యూట్యూబ్ భలే భలే మగాడివోయ్ ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు. ఓటీటీ: హాట్ స్టార్ అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్‌ కావొద్దు. దేశముదురు ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది ఓటీటీ: యూట్యూబ్ చిరుత ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది ఓటీటీ: యూట్యూబ్ పోకిరి ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది ఓటీటీ: యూట్యూబ్/ హాట్‌ స్టార్ సూపర్ ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
    మే 23 , 2024
    3rd Day BOX OFFICE: స్టార్‌ హీరో లేకున్నా కలెక్షన్లు&nbsp; కుమ్మేసిన టాప్‌-10 మీడియం రేంజ్ సినిమాలు ఇవే!
    3rd Day BOX OFFICE: స్టార్‌ హీరో లేకున్నా కలెక్షన్లు&nbsp; కుమ్మేసిన టాప్‌-10 మీడియం రేంజ్ సినిమాలు ఇవే!
    కొన్ని సినిమాలకు ఓపెనింగ్స్‌ ఊహించనంతగా వస్తాయి. కానీ, సినిమా బాలేకపోతే తర్వాత రోజు నుంచి తగ్గిపోతాయి. చిత్రం బాగున్నప్పటికీ అసలు వసూళ్లు రాని సినిమాలు కూడా ఉన్నాయి. ఇక పెద్ద సినిమాలకు వరుసగా మూడ్రోజులు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. హీరో స్టార్‌ ఇమేజ్‌ ప్రేక్షకులను థియేటర్‌కు లాగుతుంది. కానీ మీడియం రేంజ్ చిత్రాలకు ఆ పరిస్థితి ఉండదు. సినిమా బాగుందని టాక్‌ వస్తే తప్ప థియేటర్‌కు ఎవరూ వెళ్లరు. అలా&nbsp; తొలి రోజు కలెక్షన్లు తక్కువగా ఉన్నా…. ప్రేక్షకుల టాక్‌తో మూడో రోజు కల్లా దూసుకు పోయిన సినిమాలేంటో ఓ సారి చూద్దాం.&nbsp; ఉప్పెన మెగాస్టార్‌ కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో వైష్ణవ్‌ తేజ్‌ మెుదటి సినిమా అయినప్పటికీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఓపెనింగ్స్‌ ఫర్వాలేదనిపించినా.. హిట్‌ టాక్ రావటంతో మూడో రోజు ఏకంగా రూ. 8.26 కోట్లు కొళ్లగొట్టింది. చిత్రాన్ని రూ.15 కోట్లు పెట్టి తీస్తే రూ.83 కోట్లు వచ్చాయి.&nbsp; ఇందులో హీరోయిన్ తండ్రి పాత్రను విజయ్ సేతుపతి మెుదట ఒప్పుకోలేదు. దర్శకుడు పట్టుబట్టడంతో సైన్ చేశారు. చిత్రం కోసం ఇద్దరు హీరోయిన్లను మార్చి కృతి శెట్టిని తీసుకున్నారు. ఆమె కారణంగా మరింత బజ్‌ వచ్చింది. దసరా&nbsp; నేచురల్‌ స్టార్‌ నాని నటించిన పవర్‌ ప్యాక్డ్‌ మాస్ చిత్రం దసరా. లుక్‌, యాసతో నటీనటులందరూ అదరగొట్టారు. దీంతో కలెక్షన్ల వర్షం కురిసింది. సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. రూ. 65 కోట్లతో తెరకెక్కిస్తే రూ. 110 కోట్లు రాబట్టింది. ఇక మూడోరోజు రూ. 6.73 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. శ్రీకాంత్‌ ఓదెల మెుదటి సినిమా అయినప్పటికీ ఎక్కడా అలా కనిపించదు. మరో డెబ్యూ డైరెక్టర్‌కి ఛాన్స్‌ ఇచ్చి హిట్‌ కొట్టాడు నాని.&nbsp; విరూపాక్ష సాయిధరమ్ తేజ్‌, సంయుక్త మీనన్‌ జంటగా నటించిన విరూపాక్ష హిట్‌ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. మూడోరోజు రూ. 5.77 కోట్లు రాబట్టింది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఈ దర్శకుడు టాక్ తెలుసుకుందామని సినిమాకు వెళితే అతడి ఫోన్ కొట్టేశారు. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది. https://telugu.yousay.tv/virupaksha-full-review-virupaksha-with-horror-suspense-plot-sai-dharam-tej-super-come-back.html లవ్‌ స్టోరీ శేఖర్ కమ్ముల మరో మ్యాజికల్‌ చిత్రం లవ్‌ స్టోరీ. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. మూడో రోజు రూ. 5.19 కోట్లు వసూలు చేసింది. కులం అనే సున్నితమైన అంశాన్ని ప్రేమకథకు జోడించి అద్భుతంగా తెరకెక్కించాడు శేఖర్. ఇందులో చైతూ తెలంగాణ యాసలో మాట్లాడి మెప్పించాడు.&nbsp; బింబిసార కల్యాణ్‌రామ్‌కు మంచి హిట్‌ ఇచ్చిన సినిమా బింబిసార. చరిత్రలోని ఓ కథను తీసుకొని టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కించారు. ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఫుల్ కలెక్షన్లు వచ్చాయి. మూడో రోజు రూ. 5.02 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. రూ. 40 కోట్లు పెట్టి తీస్తే రూ. 65 కోట్లు సాధించింది. బింబిసార ఫ్రాంఛైజీలో భాగంగా మరో పార్ట్‌ కూడా వస్తుంది. చిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌పై కల్యాణ్‌రామ్ స్వయంగా నిర్మించాడు.&nbsp; ఇస్మార్ట్ శంకర్‌ హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్‌, పూరి జగన్నాథ్‌లకు మంచి కిక్ ఇచ్చింది ఇస్మార్ట్ శంకర్‌. మెుదట్నుంచే కలెక్షన్లలో దూసుకెళ్లిన ఈ చిత్రం మూడో రోజు రూ. 4.32 కోట్లు రాబట్టింది. సినిమాకు రూ. 15 కోట్లు ఖర్చు పెట్టగా ఏకంగా రూ. 75 కోట్లు వచ్చాయి. సినిమాలో నటించిన నభా నటేశ్‌, నిధి అగర్వాల్‌కు ఆఫర్లు వరుస కట్టాయి. మణిశర్మ బాణీలు ఇప్పటికీ మార్మోగుతున్నాయి.&nbsp; భీష్మ వెంకీ కుడుముల, నితిన్, రష్మిక కాంబోలో వచ్చిన కామెడీ లవ్ ఎంటర్‌టైనర్‌ భీష్మ. బాక్సీఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టించిన చిత్రం మూడో రోజు వసూళ్లు రూ. 4.31 కోట్లు. ఈ సినిమాను తక్కువ బడ్జెట్‌లో తీసినప్పటికీ రూ. 40 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కబోతుంది. భీష్మ, ఛలోని మించి ఉంటుందని దర్శకుడు చెప్పాడు. జాతి రత్నాలు కరోనా తర్వాత థియేటర్లలో జనం బాగా ఎంజాయ్ చేసిన సినిమా జాతి రత్నాలు. అనుదీప్ కేవీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మస్త్‌ వసూళ్లు వచ్చాయి. బ్లాక్‌బస్టర్ టాక్ రావటంతో మూడో రోజు రూ. 4.28 కోట్లు రాబట్టింది. కేవలం రూ. 4 కోట్లు ఖర్చు చేయగా.. రూ. 65 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. కార్తీకేయ 2 ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాలీవుడ్‌ను షేక్ చేసింది కార్తీకేయ 2. నిఖిల్, అనుపమ జంటగా నటించిన ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లోకి వెళ్లింది. బాలీవుడ్‌లోనూ కోట్లు రాబట్టిన కార్తీకేయ 2 మూడో రోజు కలెక్షన్లు రూ. 4.23 కోట్లు. సినిమాకు అయ్యింది రూ. 15 కోట్లు.. కానీ రూ. 117 కోట్లు కొళ్లగొట్టింది. సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటున్నారని నిఖిల్ చెప్పడంతో ఓ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ అఖిల్, పూజా హెగ్డే కాంబోలో లవ్‌ స్టోరీ స్పెషలిస్ట్ బొమ్మరిల్లు భాస్కర్ తీశాడు. యావరేజ్ టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్లలో దూసుకెళ్లింది. ఈ సినిమాకు మూడో రోజు రూ. 4.03 కోట్లు సాధించింది. గోపి సుందర్ అందించిన మ్యూజిక్‌ సినిమాకు హైలెట్. కలెక్షన్ల పరంగా రూ. 51 కోట్లు రాబట్టింది అఖిల్ సినిమా.
    ఏప్రిల్ 24 , 2023
    ఫరియా అబ్దుల్లా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    ఫరియా అబ్దుల్లా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    ఫరియా అబ్దుల్లా.. జాతిరత్నాలు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె చేసిన 'చిట్టి' పాత్ర యూత్‌లో క్రేజ్ సంపాదించింది. ఫరియా సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది. ప్రస్తుతం తెలుగులో ఆ ఒక్కటి అడక్కు చిత్రంలో అల్లరి నరేష్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ఫరియాకు డ్యాన్స్ అంటే ఇష్టం. మరి ఫరియా గురించి మరిన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About faria abdullah) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫరియా అబ్దుల్లా దేనికి ఫేమస్? ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఆ సినిమాలో ఆమె చేసిన పాత్రకు యూత్‌లో విపరీతమైన క్రేజ్ దక్కింది. ఫరియా అబ్దుల్లా వయస్సు ఎంత? 1998 మే 28న జన్మించింది. ఆమె వయస్సు 26 సంవత్సరాలు&nbsp; ఫరియా అబ్దుల్లా ఎత్తు ఎంత? 5 అడుగుల 10 అంగుళాలు&nbsp; ఫరియా అబ్దుల్లా ఎక్కడ పుట్టింది? కువైట్‌ ఫరియా అబ్దుల్లా ఉండేది ఎక్కడ? హైదరాబాద్ ఫరియా అబ్దుల్లా ఏం చదివింది? మల్టీమీడియా మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేసింది ఫరియా అబ్దుల్లా తల్లిదండ్రుల పేర్లు M.J అబ్దుల్లా(వ్యాపారవేత్త), కౌసర్ సుల్తానా(డాక్టర్) ఫరియా అబ్దుల్లా ఫెవరెట్ హీరో? విజయ్ దేవరకొండ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం? జాతిరత్నాలు, ఈ చిత్రంతో పాటు మసూధ, లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ సినిమాలో నటించింది. ఫరియా అబ్దుల్లా అభిరుచులు? మోడలింగ్, డ్యాన్సింగ్, పేయింటింగ్ ఫరియా అబ్దుల్లా ఇష్టమైన ఆహారం? బిర్యాని ఫరియా అబ్దుల్లాకి&nbsp; ఇష్టమైన కలర్ ? బ్లాక్, రెడ్ ఫరియా అబ్దుల్లా పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.50లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. ఫరియా అబ్దుల్లా సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్, స్టేజీ ఫర్ఫామెన్స్ ఇచ్చేది. ఫరియా అబ్దుల్లా ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/fariaabdullah/?hl=en https://www.youtube.com/watch?v=Xcc_cng9Cl8 ఫరియా అబ్దుల్లా మరికొన్ని విషయాలు ఫరియా అబ్దుల్లా స్కూల్ డేస్‌లో బ్రైట్ స్టూడెంట్‌గా ఉండేది. భారతీయ విద్యా భవన్‌లో హెడ్‌ గర్ల్‌ ఆఫ్ స్కూల్‌గా ఎంపికైంది.ఫరియా కుడి చేతి మీద Veni Vidi Vici అనే పదాలు రాసి ఉంటాయి. వీటి అర్థం "నేను వచ్చాను, చూశాను, జయించాను"ఫరియా అబ్దుల్లాకు ఖాళీ సమయంలో కొత్త ప్రదేశాలను చూసేందుకు ఇష్టపడుతుందిఫరియాకు తన చెల్లెలు ఇనయా అబ్దుల్లా అంటే చాలా ఇష్టం
    ఏప్రిల్ 13 , 2024
    అరుదైన వ్యాధులతో బాధపడుతున‌్న సెలబ్రెటీలు
    అరుదైన వ్యాధులతో బాధపడుతున‌్న సెలబ్రెటీలు
    ]కాఫీ, జ్యూస్ వంటివాటిని తీసుకుంటే తనకు రెండు రోజుల వరకు నిద్ర పట్టదని జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. హైలీ సెన్సిటివ్ డిసార్డర్(HSP) అనే వ్యాధితో బాధపడుతున్నట్లు అనుదీప్ వెల్లడించాడు.అనుదీప్ కేవీ: హైలీ సెన్సిటివ్ డిసార్డర్(HSP)Download Our App
    ఫిబ్రవరి 15 , 2023
    టాప్ 30 గూగుల్‌లో వెతికిన తెలుగు నటీమణులు
    టాప్ 30 గూగుల్‌లో వెతికిన తెలుగు నటీమణులు
    ]50కి పైగా స్టేజి షోలు చేసిన ఫరియా, 2021 బ్లాక్‌బస్టర్‌ ‘జాతిరత్నాలు’లో చిట్టిగా మనసులు దోచింది. 2022లో లైక్‌ షేర్‌ &amp; సబ్‌స్క్రైబ్‌ సినిమా అంతగా ఆడకపోయినా..స్పెషల్‌ సాంగ్స్‌, సోషల్‌ మీడియాలో ఉన్న క్రేజ్‌ ఈమెను రేసులో నిలబెట్టాయి.31.ఫరియా అబ్దుల్లా
    ఫిబ్రవరి 13 , 2023
    అరుదైన వ్యాధులతో బాధపడుతున‌్న సెలబ్రెటీలు
    అరుదైన వ్యాధులతో బాధపడుతున‌్న సెలబ్రెటీలు
    ]కాఫీ, జ్యూస్ వంటివాటిని తీసుకుంటే తనకు రెండు రోజుల వరకు నిద్ర పట్టదని జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. హైలీ సెన్సిటివ్ డిసార్డర్(HSP) అనే వ్యాధితో బాధపడుతున్నట్లు అనుదీప్ వెల్లడించాడు.అనుదీప్ కేవీ: హైలీ సెన్సిటివ్ డిసార్డర్(HSP)Download Our App
    ఫిబ్రవరి 11 , 2023
    Mem Famous Review: ‘జాతిరత్నాలను’ తలపించిన ‘మేమ్‌ ఫేమస్‌’...కానీ ఒక్కటి మిస్ అయ్యింది!
    Mem Famous Review: ‘జాతిరత్నాలను’ తలపించిన ‘మేమ్‌ ఫేమస్‌’...కానీ ఒక్కటి మిస్ అయ్యింది!
    నటీనటులు: సుమంత్‌ ప్రభాస్‌, సిరి రాశి, మురళిధర్‌ గౌడ్‌, అంజి, నరేంద్ర రవి, మౌర్య చౌదరి,&nbsp; డైరెక్టర్‌: సుమంత్‌ ప్రభాస్‌ సంగీతం: కళ్యాణ్‌ నాయక్‌ సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ దూపాటి నిర్మాతలు: చంద్రు మనోహరన్, అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర, సూర్య చౌదరి ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలా వరకూ సినిమాలు తెలంగాణ నేపథ్యంతోనే తెరకెక్కుతున్నాయి. ఇలా వచ్చిన బలగం, జాతిరత్నాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్స్‌ సాధించాయి. తాజాగా ఇదే కోవలో తెరకెక్కిన సినిమా ‘మేమ్‌ ఫేమస్‌’. సుమంత్‌ ప్రభాస్‌ హీరోగా అతడి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. `రైటర్‌ పద్మభూషణ్‌` వంటి సూపర్‌ హిట్‌ సినిమాను నిర్మించిన ఛాయ్‌ బిస్కెట్‌, లహరి ఫిల్మ్స్ వాళ్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా ఇటీవలే విడుదలై ఆకట్టుకుంది. అంతేగాక టాలీవుడ్ స్టార్స్‌తో చేసిన విభిన్న ప్రమోషన్స్‌ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (మే 26) రిలీజ్‌ అయిన ‘మేమ్‌ ఫేమస్‌’ అందరి అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ తెలంగాణలోని ఓ విలేజ్‌కు చెందిన మయి(సుమంత్‌ ప్రభాస్‌), దుర్గ(మణి ఏగుర్ల), బాలి(మౌర్య చౌదరి) మంచి స్నేహితులు. తెల్లారితే గొడవలు, రాత్రి అయితే తాగుడు అన్నట్లు జీవితాన్ని గడుపుతుంటారు. మయి త‌న మ‌ర‌ద‌లు మౌనిక (సార్య ల‌క్ష్మ‌ణ్‌)ని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడ్ని ఇష్టపడుతుంది. మయి ఫ్రెండ్‌ బాలి కూడా ఊరిలోని ఇంకో అమ్మాయిని ఇష్టపడుతుంటాడు.&nbsp; అయితే జులాయిగా తిరిగే స్నేహితులంతా కలిసి ఓ టెంట్‌ హౌజ్ పెడతారు. అది బాగా నడుస్తున్న సమయంలో షాట్‌ సర్య్కూట్‌కి టెంట్‌ హౌజ్‌ మొత్తం కాలిపోతుంది. దీంతో యూట్యూబ్‌ ఛానెల్‌ పెట్టి వీడియోలు చేయడం స్టార్ట్‌ చేస్తారు. ఆ వీడియోల వల్ల గ్రామానికి ఎలాంటి మేలు జరిగింది? మయి, బాలి ప్రేమ కథలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయి? అనేది మిగతా కథ. ఇది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.&nbsp; ఎలా సాగిందంటే.. ముగ్గ‌రు ఫ్రెండ్స్ ఎడాపెడా తప్పులు చేస్తూ పంచాయతీలో నిలబడటం ఫ‌స్టాఫ్ అంతా రిపీట్‌ మోడ్‌లో క‌నిపిస్తుంది. అది చూసేవారికి కాస్త బోరింగ్‌ అనిపిస్తుంది. అసలు సినిమాలో కథ ఉందా అన్న ప్రశ్నను కూడా రేకెత్తిస్తుంది. ఊరి ప్రజల సూటిపోటీ మాటలతో టెంట్‌ హౌజ్‌ పెట్టుకొని స్నేహితులు బాధ్యత తెలుసుకున్నట్లు కనిపిస్తారు. ఈ క్రమంలో వచ్చే లవ్‌ ఇష్యూస్‌, టెంట్‌హౌజ్‌ అగ్నిప్రమాదానికి గురికావడం సెకాండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే సెకాండాఫ్‌ అంతా యూట్యూబ్‌ వీడియోస్‌ చుట్టే తిరుగుతుంది. ఈ క్రమంలో వచ్చే కామెడీ పంచ్‌లు నవ్విస్తాయి.&nbsp; అలాగే సుమంత్ ప్ర‌భాస్‌, సార్య ల‌క్ష్మ‌ణ్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్ యూత్‌కి క‌నెక్ట్ అవుతుంది. సుమంత్ న‌ట‌న కూడా ఆక‌ట్టుకుంటుంది. ఇక మ‌ణి, సార్య ల‌క్ష్మ‌ణ్‌, మ‌ణి ఏగుర్ల, ముర‌ళీధ‌ర్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల మేర‌కు న‌టించారు.&nbsp; ఎవరెలా చేశారంటే? నటన పరంగా సుమంత్ ప్రభాస్ ఫ‌ర్వాలేద‌నిపించాడు.&nbsp; నటనలో ఇంకాస్తా రాటుదేలాల్సి ఉంది. అతని ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన మ‌ణి, మౌర్య పాత్రల పరిధి మేరకు నటించారు. అంజిమామ‌, ముర‌ళీధ‌ర్ గౌడ్, కిర‌ణ్ మ‌చ్చా పాత్రలు గుర్తిండి పోతాయి. లిప్‌స్టిక్ స్పాయిల‌ర్ రోల్‌లో యాక్ట్ చేసిన శివ‌నంద‌న్ కామెడీ బాగుంది.&nbsp; అన‌వ‌స‌ర స‌న్నివేశాలు సినిమాలో ఇబ్బ‌డిముబ్బ‌డిగా క‌నిపిస్తాయి.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే? మేమ్‌ ఫేమస్‌ సినిమా చూస్తున్నంత సేపు ‘పెళ్లిచూపులు’, ‘జాతిరత్నాలు’ చిత్రాలే గుర్తుకువస్తాయి. సుమంత్‌ ప్రభాస్‌ కథను తన స్టైల్‌లో అద్భుతంగా రాసుకున్నప్పటికీ దానిని సమర్థవంతంగా తెరకెక్కించడంలో విఫలమైనట్లు కనిపించింది. &nbsp;సుమంత్ రాసుకున్న స్టోరీలో ఏమాత్రం బ‌లం లేదు. రోటీన్‌గా ఉంది. కామెడీ, భావోద్వేగాల్ని తాను రాసుకున్న విధంగా తెరపై చూపించలేకపోయాడు. షార్ట్‌ఫిల్మ్‌ను తలపిస్తుంది. సినిమాను సరదాగా తీసుకెళ్తూనే మధ్య మధ్యలో ఎమోషనల్‌ సీన్స్‌ను ఇరికించారు. ఇక రైతు పడే కష్టం గురించి చెప్పే సీన్లు సందర్భానుసారంగా అనిపించదు. అయితే కొన్ని సీన్లు చాలా కొత్తగా అన్నిపిస్తాయి. కామెడీ కూడా నచ్చుతుంది. అయితే కొన్ని సీన్లు మినహా సినిమా ఓవరాల్‌గా మెప్పించలేకపోయింది.&nbsp; టెక్నికల్‌గా సాంకేతికంగా చూస్తే శ్యామ్ దూపాటి కెమెరా వ‌ర్క్ బావుంది. క‌ళ్యాణ్ నాయ‌క్ పాట‌ల కంటే నేప‌థ్య సంగీతం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు కూడా సో సో గానే ఉన్నాయి. సినిమాకు ఎక్కువ బడ్జెట్‌ ఎందుకని భావించినట్లు అనిపించింది. ప్లస్‌ పాయింట్స్‌ కామెడీనేపథ్య సంగీతంఇంటర్‌వెల్‌కు ముందు సీన్లు మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీసాగదీతపాటలు రేటింగ్‌: 2.75/5
    మే 26 , 2023
    Miss Shetty Mr Polishetty Review: సూపర్ హిట్.. బొల్డ్ కంటెంట్‌ ఉన్నా.. అనుష్క, నవీన్ పొలిశెట్టి అదరగొట్టారు!
    Miss Shetty Mr Polishetty Review: సూపర్ హిట్.. బొల్డ్ కంటెంట్‌ ఉన్నా.. అనుష్క, నవీన్ పొలిశెట్టి అదరగొట్టారు!
    తారాగణం - అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, మురళీ శర్మ, అభినవ్ గోమతం, సోనియా దీప్తి, తులసి, జయసుధ, నాజర్&nbsp; డైరెక్టర్ - పీ మహేష్ బాబు నిర్మాత -&nbsp; ప్రమోద్ ఉప్పలపాటి, వి.వంశీకృష్ణా రెడ్డి బ్యానర్ - UV క్రియేషన్స్ సంగీతం - రధన్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ క్రేజీ కాంబోను థియేటర్లలో చూడాలని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన ఎదురుచూపులకు నేటితో తెరపడింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత అనుష్క చేస్తున్న సినిమా కావడంతో ఆమె ఫ్యాన్స్‌లో ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. అలాగే&nbsp; జాతిరత్నాలు మూవీ బ్లాక్ బాస్టర్ హిట్‌ తర్వాత నవీన్ 2 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమా ట్రైలర్‌లోనే అనుష్క మెస్మరైజింగ్ లుక్స్, నవీన్ కామెడీ టైమింగ్ సినిమాపై అంచనాలను పెంచాయి. మూవీ యూనిట్ సైతం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసింది. ఈ సినిమాలో నవీన్ స్టాండప్ కమెడియన్‌గా నటించగా, అనుష్క చెఫ్‌గా కనిపించింది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? అనుష్క శెట్టికి మంచి కమ్‌బ్యాక్ ఇచ్చిందా లేదో? ఈ సమీక్షలో చూద్దాం.. కథేంటంటే..? మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి శెట్టి( అనుష్క) తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో లండన్‌ నుంచి ఇండియాకు తిరిగి వస్తుంది. అనారోగ్యంతో తల్లి చనిపోయిన తర్వాత అన్విత ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. తల్లి లేని తనకు మరొకరి తోడు, కుటుంబం అవసరం లేదని భావిస్తుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టి( నవీన్ పొలిశెట్టి) స్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. అసలు అన్విత సిద్దూను ఏమి కోరింది.. సిద్దూ తన ప్రేమ కోసం ఏంచేశాడు? పెళ్లి వద్దనుకున్న అన్విత తన మనసు మార్చుకుందా? అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. స్టాండప్ కామెడియన్ పాత్రలో నవీన్ పొలిశెట్టి ఒదిగిపోయాడు. మరో ఏ హీరో చేసినా తనలాగా సెట్ కాదు అనేలా జీవించాడు. తన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బ నవ్వించాడు. తాను బయట ఎలా ఉంటాడో సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్‌లో బాగా పర్ఫామ్ చేశాడు. నవీన్ పొలిశెట్టి తాను కనిపించే ప్రతి ఫ్రేమ్‌లో ఆకట్టుకున్నాడు.&nbsp; హీరోయిన్ అనుష్క శెట్టి చాలా గ్యాప్‌ తర్వాత ఈ చిత్రం చేసింది. ఆధునిక భావాలున్న యువతి పాత్రలో చక్కగా నటించింది. ఎమోషనల్ సీన్స్‌లో జీవించింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి పాత్రలో అనుష్క నటించిందనే భావన ఆమె ఫ్యాన్స్‌లో తప్పక కలుగుతుంది.&nbsp; క్లైమాక్స్ సన్నివేశాల్లో అనుష్క యాక్టింగ్ గూస్‌బంప్స్. ఎలా ఉందంటే?&nbsp; రోటిన్ లవ్ స్టోరీస్, సెన్స్‌లెస్ యాక్షన్‌లెస్ సినిమాలతో విసుగెత్తిన ప్రేక్షకులకు ఈ సినిమా ఫ్రేష్ ఫీల్‌ను అయితే అందిస్తుంది. పెళ్లి చేసుకోకుండా తల్లికావాలనుకే ఓ యువతికి.. ఆమెతో ప్రేమలో పడే ఓ యువకుడి సంఘర్షణను డైరెక్టర్ పీ మహేష్ బాబు చక్కగా తెరకెక్కించాడు. లవ్ స్టోరీతో ముడిపడి ఉన్న ‘స్పెర్మ్ డోనేషన్’ వంటి సున్నితమైన కథాంశాన్ని ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించాడు.&nbsp; ఇక సినిమా ఫస్టాప్ ఫుల్ హెలారీయస్‌గా నడుస్తుంది. ఈ క్రెడిట్ నవీన్‌ పొలిశెట్టికే దక్కుతుంది. నవీన్ స్టేజ్ పర్ఫామెన్స్ కడుపుబ్బ నవ్విస్తుంది.&nbsp; ఫస్ట్ 30 నిమిషాలు కాస్త స్లో అయినప్పటికీ నవీన్ తన స్క్రీన్ ప్రజెన్స్‌తో సినిమాను ట్రాక్‌లోకి తెచ్చాడు. ఫస్టాఫ్‌లో వన్‌మ్యాన్ షో చేశాడు. నవ్వించే వన్-లైనర్స్‌తో పాటు, సెంటిమెంట్ జోన్‌లోని డైలాగ్‌లు ‘క్రిస్ప్ అండ్ సెన్సిబుల్‌’గా ఉన్నాయి. ఇక సెకండాఫ్‌లో సినిమాకు మంచి ఎలివేషన్ సీన్లు పడ్డాయి. ఎమోషనల్‌గా సాగుతుంది. ఫర్టిలిటీ ఎలిమెంట్ కారణంగా కొన్ని సార్లు కామెడీ శృతిమించినట్లు అనిపిస్తుంది. కానీ దానిని డైరెక్టర్ చాలా క్లీన్‌గా మెనేజ్ చేశాడు. డైరెక్షన్ ఎలా ఉందంటే? మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి కథాంశం ఎంచుకోవడం పట్ల డైరెక్టర్ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఇలాంటి స్టోరీని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాలంటే అంత సులువు కాదు. డైలాగ్స్ రైటింగ్ నుంచి భావోద్వేగాలను పండిచడం వరకు డైరెక్టర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక మిగతా నటీనటుల విషయానికొస్తే.. మురళి శర్మ, అభినవ్ గోమఠం తమ పాత్రల పరిధిమేరకు నటించారు. కీలక సన్నివేశాల్లో భావోద్వేగాన్ని పండించారు. బలాలు నవీన్ పొలిశెట్టి నటనఅనుష్క పర్ఫామెన్స్వన్‌లైన్ కామెడీ పంచ్‌లు బలహీనతలు సెకండాఫ్‌లో నిడివి ఎక్కువ ఉండటంసినిమాలోని పాటలు టెక్నికల్ పరంగా.. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా సినిమా చాలా రిచ్ ఫీలింగ్ ఇస్తుంది. నిర్మాణం పరంగా ప్రొడ్యూసర్స్ ఎక్కడా రాజీపడలేదు. రాధన్ అందించిన BGM బాగుంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. సెకండాఫ్ కాస్త లాగ్‌ అనిపించినప్పటికీ క్లైమాక్స్ సీన్లు దానిని కవర్ చేశాయి. చివరగా.. రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలతో వేగిన ప్రేక్షకులకు.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మంచి వినోదాన్ని పంచుతుంది. రేటింగ్ 4/5
    సెప్టెంబర్ 07 , 2023
    OTT MOVIES: స్నేహితులతో కలిసి ఓటీటీలో చూడగలిగే 10 సినిమాలు
    OTT MOVIES: స్నేహితులతో కలిసి ఓటీటీలో చూడగలిగే 10 సినిమాలు
    సినిమా చూసేందుకు వెళ్లాలి అనుకున్నప్పుడు&nbsp; అందరికన్నా ముందు గుర్తొచ్చేది స్నేహితులే. వాళ్లతో కలిసి థియేటర్‌కి వెళ్లి ఎంజాయ్‌ చేస్తూ సరదాగా గడిపేస్తాం. ఇక బ్యాచ్‌లర్‌గా ఉంటే వేరే లెవల్. రూమ్‌లో ఉంటూ ఫ్రెండ్స్‌తో కలిసి మజా చేయాలనుకుంటే… ఓటీటీలో చూసేందుకు కొన్ని ఎవర్‌ గ్రీన్ సినిమాలు ఉన్నాయి. అవేంటో చదివి మీ దోస్తులతో చూసి ఎంజాయ్ చేయండి.&nbsp; ఈ నగరానికి ఏమైంది సరాదాగా దోస్తులతో కలిసి మందు కొట్టినప్పుడు “గోవా పోవాలి” అని ఎన్ని బ్యాచ్‌లు అనుకొని ఉంటాయి. ఎంతమంది వెళ్లి ఉంటారు. మన జీవితాల్లోనే జరిగే ఇలాంటి ఎన్నో సరాదా సంఘటనలను గుర్తు చేస్తుంది ఈ సినిమా. విశ్వక్‌సేన్, అభినవ్‌ గోమఠం, వెంకటేశ్‌ కాకుమాను, సాయి సుశాంత్ రెడ్డి లీడ్‌ రోల్స్ చేశారు. రూ. 2కోట్లతో తీస్తే రూ. 12 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.&nbsp; జాతిరత్నాలు ఈ సినిమా గుర్తొస్తే మెుదట తలుచుకునేది క్రేజీ డైరెక్టర్ అనుదీప్ KV. జాతిరత్నాలు చిత్రాన్ని అంతలా ప్రేక్షకుల మదిలో ఉండిపోయేలా తీర్చిదిద్దాడు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వంటి ముగ్గురు స్నేహితులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. సినిమాలోని వన్‌లైన్‌ పంచులు బాగా పేలాయి. ఎండాకాలం ఉక్కపోస్తున్న, వాన కాలం వర్షం పడుతున్నా… అలా రూమ్‌లో కూర్చొని నవ్వుకుంటూ ఎంజాయ్‌ చేయవచ్చు. రూ. 4 కోట్ల బడ్జెట్‌ ఖర్చు పెడితే.. ఏకంగా రూ.75 కోట్లు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్‌లో చిత్రాన్ని చూడవచ్చు. డీజే టిల్లు డీజే టిల్లు సినిమా వచ్చి రెండేళ్లైనా సిద్ధూ జొన్నలగడ్డ స్వాగ్‌ ఇంకా మర్చిపోలేరు. టిల్లుతో రాధిక చేయించే విన్యాసాలు.. తెలంగాణ యాసలో పేలిన పంచులను స్నేహితులతో కలిసి చూస్తే కాలక్షేపమే. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం రూ. 30 కోట్లు వసూలు చేసింది. ఆహా, సోని లివ్‌ వేదికగా సినిమాను వీక్షించవచ్చు.&nbsp; హుషారు మద్యం తాగే మిత్రులు కొనడం ఎందుకు దాన్నే తయారు చేద్దామనే క్రేజీ ఆలోచన వస్తే హుషారు సినిమా. సరదాగా గడిపే నలుగురు వ్యక్తులు, కెరీర్‌ను సెట్‌ చేసుకోవాలని తిప్పలు పడుతుండటంతో పాటు కష్టం వచ్చిన స్నేహితుడికి అండగా నిలిచే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. సరదాగా నవ్వుకోవాలి అనిపించినప్పుడు కబూమ్‌ హుషారు సినిమా చూసేయండి. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్‌లో ఉంది.&nbsp; బ్రోచెవారెవరురా&nbsp; స్నేహితులు ఎంతవరకైనా తోడు ఉంటారనేది చూడాలంటే బ్రోచెవారెవరూ చూడాల్సిందే. ఫీజు కట్టాలని చెప్పి నాన్న దగ్గర డబ్బులు తీసుకోవడం. ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాలు, షికార్లు చుట్టేయడం. ఆఖరికి కిడ్నాప్‌లో కూడా స్నేహితులు తోడు వస్తారనే కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో బ్రోచెవారెవరూ రూపొందింది. శ్రీ విష్ణు, దర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్‌ రోల్స్ చేశారు. అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లో ఈ సినిమా చూడొచ్చు. ఒకే ఒక జీవితం టైమ్ ట్రావెల్‌ కథాంశంతో ముగ్గురు మిత్రులు వాళ్ల చిన్నతనంలోకి వెళితే ఎలా ఉంటుందనే విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో ఒకే ఒక జీవితం తెరకెక్కింది. ఇందులో ప్రియదర్శి, వెన్నెల కిషోర్, శర్వానంద్ చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. సరాదాగా సాగే థ్రిల్లింగ్ సినిమాను దోస్తులతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. సోని లివ్‌లో అందుబాటులో ఉంది. మిషన్ ఇంపాజిబుల్‌ చిన్నప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి మనం ఎలా ఉండేవాళ్లమో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది ఈ సినిమా. రఘుపతి, రాఘవ, రాజారాం అనే ముగ్గురు చిచ్చరపిడుగులు చేసిన విన్యాసాలను ఎంజాయ్ చేయవచ్చు. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.&nbsp; హృదయం కాలేజ్‌ లైఫ్, లవ్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన హృదయం సూపర్ హిట్ అయ్యింది. మోహన్‌ లాల్ కుమారుడు ప్రణవ్, కల్యాణి ప్రియదర్శి లీడ్‌ రోల్స్‌లో వచ్చింది. స్నేహితులతో కలిసి చూస్తూ దర్శనా అంటూ పాటలు పాడుకునేంత బాగుంటుంది. డిస్నీ+హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.&nbsp; చిచ్చోరే ఇంజినీరింగ్ చదివే విద్యార్థులు ఈ సినిమాను ఇష్టపడతారు. కళాశాల జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. సుశాంత్ సింగ్ , శ్రద్ధాకపూర్, నవీన్ పొలిశెట్టి నటించిన ఈ సినిమా కాలేజ్ డేస్‌ను గుర్తు చేస్తాయి. డిస్నీ + హాట్‌స్టార్‌ ఓటీటీలో చిచ్చొరే సినిమా ఉంది. రొమాంచనమ్ హారర్‌ కామెడీ జానర్‌లో ఇదొక డిఫరెంట్‌ మూవీ. ఏడుగురు బ్యాచిలర్స్‌ ఉండే ఓ ఇంట్లో ఆత్మను పిలిచే గేమ్‌ ఆడతారు. ఆత్మ వస్తుందా? వస్తే ఏం చేసింది? ఇది కథ. బ్యాచిలర్‌ రూమ్‌లను కళ్లకు కట్టినట్టు చూపిండటమే గాక అదిరిపోయే కామెడీ ఉంటుంది. స్నేహితులతో కలిసి చూస్తే కడుపుబ్బా నవ్వుతూ చిల్‌ అవ్వొచ్చు. హాట్‌స్టార్‌లో ఈ సినిమా చూడొచ్చు. మీకు ఏవైనా మూవీస్ పక్కాగా చూడాల్సినవి తెలిస్తే కామెంట్‌ చేయండి.
    ఏప్రిల్ 21 , 2023
    <strong>Unstoppable: బాలయ్య షోలో రియల్‌ జాతిరత్నం.. శ్రీలీలకు గిఫ్ట్‌ ఇస్తుంటే ఏం చేశాడో చూడండి!</strong>
    Unstoppable: బాలయ్య షోలో రియల్‌ జాతిరత్నం.. శ్రీలీలకు గిఫ్ట్‌ ఇస్తుంటే ఏం చేశాడో చూడండి!
    నందమూరి బాలకృష్ణ పాపులర్ టాక్ షో అన్‌స్టాపబుల్‌ సీజన్ 4 (Unstoppable Season 4) విజయవంతంగా కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ (Aha)లో రికార్డు వ్యూస్‌తో దూసుకు వెళ్తోంది. సీజన్‌ 4 ఫస్ట్‌ ఎపిసోడ్‌లో ఏపీ సీఎం చంద్రబాబు సందడి చేయగా ఆ తర్వాత నుంచి స్టార్‌ హీరోలు వేదికపై మెరిశారు. ఇప్పటివరకూ దుల్కర్‌ సల్మాన్‌, సూర్య, అల్లు అర్జున్‌ ఈ షోలో పాల్గొని బాలయ్యతో తమ సీక్రెట్స్‌ పంచుకున్నారు. ఇప్పుడు ఈ వేదికపై స్టార్‌ హీరోయిన్‌ శ్రీలీల (Sreeleela)తో పాటు, యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) రాబోతున్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఆహా పంచుకున్న ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; ‘రీల్ అండ్‌ రియల్‌ జాతిరత్నం’ నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ (Unstoppable) సీజన్‌ 4లో స్టార్ హీరోలు సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో ఎపిసోడ్‌ సైతం బాలయ్య సిద్ధం చేశారు. ఈసారి స్టార్‌ హీరోయిన్‌ శ్రీలీలతో పాటు యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టి బాలయ్యతో ముచ్చట్లు చెప్పినట్లు తెలుస్తోంది. వీరిద్దరు షోలో పాల్గొన్న ఫొటోను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ తాజాగా తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ఇందులో జాతిరత్నాలు ఫోజు పెట్టి నవీన్‌ నవ్వులు పూయించాడు. ఇందులో బాలయ్య శ్రీలీలకు గిఫ్ట్‌ ఇస్తుండగా దూరంగా నిలబడి చేత్తో దాన్ని పట్టుకుంటున్నట్లు నవీన్‌ పోలిశెట్టి నిలబడ్డాడు. అచ్చం ఇలాగే జాతిరత్నాలు సినిమాలోనూ నవీన్‌ పోలిశెట్టి చేశాడు. దీంతో ఆ రెండు ఫొటోలను పక్క పక్కన పెట్టి ఆహా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'రీల్‌ అండ్‌ రియల్‌ జాతిరత్నం ఆఫ్ ఇండియా' అంటూ రాసుకొచ్చింది. కారణం ఏమైనా ఉందా? బాలయ్య టాక్ షో (Unstoppable)కు వచ్చిన మెజారిటీ సెలబ్రిటీలు తమ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వచ్చారు. మరికొందరు సింగిల్‌గానే షోలో పాల్గొని బాలయ్యతో సరదాగా గడిపారు. అయితే ఈసారి ఎపిసోడ్‌లో శ్రీలీల - నవీన్‌ పోలిశెట్టి ఇద్దరూ పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం వారిద్దరు కలిసి ఏ సినిమా చేయడం లేదు. గతంలో ఓ సినిమా పట్టాలెక్కుతున్నట్లు వార్తలు వచ్చినా అది వర్కౌట్‌ కాలేదు. ఈ నేపథ్యంలో పర్టిక్యూలర్‌గా ఈ యువ హీరో, హీరోయిన్‌నే బాలయ్య పిలవడానికి కారణం ఏమైనా ఉందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే వారిద్దరిని బాలయ్య అడిగే ప్రశ్నలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని ఓటీటీ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్య కొంటే ప్రశ్నలకు వారు సమాధానం చెప్పలేక అల్లాడిపోయినట్లు కూడా తెలుస్తోంది. ఎపిసోడ్‌ రిలీజయ్యాక ఆ ప్రశ్నలపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.&nbsp; https://twitter.com/i/status/1861348565508862042 https://twitter.com/iam_NBKCult/status/1861306464893026701 100% ఫన్‌ పక్కా నవీన్‌ పోలిశెట్టి సినిమాల్లో ఏ విధంగా నవ్వులు పూయిస్తాడో బయట కూడా అదే విధంగా గిలిగింతలు పెడుతుంటాడు. ఏమాత్రం తడుముకోకుండా జోక్స్‌ వేస్తూ నవ్విస్తుంటాడు. మరోవైపు బాలయ్య అన్‌స్టాబుల్‌ షో ద్వారా తనలోని కామెడీ టైమింగ్‌కు మరింత పదును పెట్టారు. సరదా క్వశ్చన్స్‌ వేస్తూ సెలబ్రిటీలను ఇరాకటంలో పడేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు తొలిసారి ఒకే షోలో ఎదురుపడుతుండటంతో ఆ ఎపిసోడ్ కామెడీకి కేరాఫ్‌గా మారిపోతుందని నెటిజన్లు అంచనావేస్తున్నారు. 100% పక్కా ఎంటర్‌టైనింగ్‌గా ఈ ఎపిసోడ్ ఉండబోతుందని ఇప్పటి నుంచే కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ కుర్ర హీరోను బాలయ్య ఓ ఆట ఆడుకోవడం ఖాయమని కూడా అంటున్నారు. ఈ శుక్రవారం (నవంబర్‌ 29) ఈ ఎపిసోడ్‌ (Unstoppable) స్ట్రీమింగయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.&nbsp; ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌.. గతేడాది నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్క (Anushka Shetty) కాంబోలో వచ్చిన 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి' బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆ సక్సెస్‌ తర్వాత నవీన్‌ ప్రస్తుతం 'అనగనగా ఒక రాజు' అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్‌లో చేతికి ఫ్రాక్చర్‌ కావడంతో గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పుడు నయం కావడంతో తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. మరోవైపు శ్రీలీల విషయానికి వస్తే నితీన్‌తో చేసిన 'రాబిన్‌హుడ్‌' మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే శ్రీలీల స్పెషల్‌ సాంగ్‌లో మెరిసిన ‘పుష్ప 2’&nbsp; చిత్రం డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.&nbsp;
    నవంబర్ 28 , 2024

    @2021 KTree