• TFIDB EN
 • హాయ్‌ నాన్న (2023)
  UTelugu2h 35m

  విరాజ్ (నాని) ఓ ఫ్యాష‌న్ ఫొటోగ్రాఫ‌ర్‌. తన కూతురు మహి(కియారా) అంటే అతడికి ప్రాణం. కూతురికి సరదాగా కథలు చెప్తుంటాడు విరాజ్‌. ఓ రోజు అమ్మ కథ చెప్పమంటే విరాజ్‌ చెప్పడు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది మహి. ఆ తర్వాత ఏం జరిగింది. మహి, యష్న (మృణాల్‌ ఠాకూర్‌) ఎలా ఫ్రెండ్స్‌ అయ్యారు. విరాజ్‌చెప్పిన అమ్మ కథలో వర్ష పాత్ర ఎవరిది? అన్నది కథ.

  ఇంగ్లీష్‌లో చదవండి
  మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
  స్ట్రీమింగ్‌ ఆన్‌Netflixఫ్రమ్‌
  Watch
  రివ్యూస్
  How was the movie?

  @prudhvi

  nice movie

  2 months ago

  తారాగణం
  నానివిరాజ్
  మృణాల్ ఠాకూర్యష్ణ/వర్ష
  బేబీ కియారా ఖన్నామహి, విరాజ్ కూతురు
  నాసర్మహి డాక్టర్
  జయరామ్యష్నా తండ్రి
  అంగద్ బేడీడాక్టర్ అరవింద్, యష్నాకు కాబోయే భార్య
  విరాజ్ అశ్విన్అరవింద్ సోదరుడు
  శృతి హాసన్ఒక మోడల్, "ఒడియమ్మ" పాటలో కూడా కనిపిస్తుంది (అతి అతిథి పాత్ర)
  సిబ్బంది
  శౌర్యువ్దర్శకుడు
  మోహన్ చెరుకూరినిర్మాత
  శౌర్యువ్రచయిత
  సాను జాన్ వర్గీస్సినిమాటోగ్రాఫర్
  ప్రవీణ్ ఆంటోనీఎడిటర్ర్
  కథనాలు
  Hi Nanna Review: తండ్రిగా గుండెల్ని పిండేసిన నాని.. ‘హాయ్‌ నాన్న’ సినిమా ఎలా ఉందంటే?
  Hi Nanna Review: తండ్రిగా గుండెల్ని పిండేసిన నాని.. ‘హాయ్‌ నాన్న’ సినిమా ఎలా ఉందంటే?
  నటీనటులు: నాని, మృణాల్‌ ఠాకూర్‌, బేబీ కియారా, జయరాం, ప్రియదర్శి పులికొండ, అగంద్‌ బేబీ, విరాజ్‌ అశ్విన్‌, శ్రుతిహాసన్‌ తదితరులు రచన, దర్శకత్వం: శౌర్యువ్ సంగీతం: హషీమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ సినిమాటోగ్రఫీ: సాను వర్గీస్‌ నిర్మాత: మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజేందర్‌రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్‌. నిర్మాణ సంస్థ: వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ విడుదల: 07-12-2023 ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్‌ లేకుండా స్వయం కృషితో పైకొచ్చిన ఈ జనరేషన్‌ హీరోల్లో నాని ముందు వరుసలో ఉంటారు. ఇమేజ్‌, ట్రెండ్ అంటూ లెక్క‌లేసుకోకుండా సినిమాలు చేస్తుండటం నాని ప్రత్యేకతగా చెప్పవచ్చు. దసరా సినిమాతో తొలిసారి 100 కోట్ల క్లబ్‌లో చేరిన నాని.. ప్రస్తుతం ‘హాయ్‌ నాన్న’ చిత్రంతో మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శౌర్యువ్ అనే ద‌ర్శ‌కుడిని ఈ సినిమాతో  ప‌రిచ‌యం చేశారు. విడుద‌ల‌కి ముందే  నాని - మృణాల్ జోడీ, ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకున్నాయి. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? తండ్రీ-కూతుళ్ల పాత్రలు భావోద్వేగాలను పంచాయా? లేదా? ఇప్పుడు చూద్దాం.  కథ విరాజ్ (నాని) ముంబైలో ఓ ఫ్యాష‌న్ ఫొటోగ్రాఫ‌ర్‌. తన కూతురు మహి(కియారా) అంటే అతడికి ప్రాణం. కూతురికి సరదాగా కథలు చెప్తుంటాడు విరాజ్‌. ఆ కథల్లో హీరోగా నాన్ననే ఊహించుకుంటూ ఉంటుంది మహి. ఓ రోజు అమ్మ కథ చెప్పమంటే విరాజ్‌ చెప్పడు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో జరిగిన ఓ ప్రమాదం నుంచి మహిని యష్న (మృణాల్‌ ఠాకూర్‌) కాపాడుతుంది. వారిద్దరు కాఫీ షాపులో ఉండగా పాపను వెత్తుకుంటూ విరాజ్‌ ‌అక్కడకు వస్తాడు. అక్కడే మహికి అమ్మ కథ చెప్తాడు విరాజ్‌. ఇంతకి ఆ కథలో ఏముంది? వర్ష పాత్ర ఎవరిది? యష్నకీ, మ‌హి త‌ల్లికీ సంబంధం ఏమిటి? యష్న.. విరాజ్‌ని ఎలా ప్రేమించింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే నాని (Hero Nani) మ‌రోసారి త‌న న‌ట‌న‌తో ప్రేక్షకుల హృద‌యాల్ని బ‌రువెక్కించాడు. చిన్నారితో క‌లిసి ఆయ‌న పండించిన భావోద్వేగాలు సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. ముఖ్యంగా కూతుర్ని ఎలాగైనా బతికించుకోవాలనే తపన, బాధ, దు:ఖాన్ని నాని కళ్లలోనే చూపించాడు. నాని, మృణాల్ ఠాకూర్ జోడీ బాగుంది. ఇద్ద‌రూ చాలా బాగా న‌టించి పాత్రలకు ప్రాణం పోశారు. ప్రేమ స‌న్నివేశాలు, ప్రీ క్లైమాక్స్‌లోనూ మృణాల్ నానితో పోటీపడి మరి నటించింది. త‌న అభిన‌యంతో క‌ట్టిప‌డేసింది. బేబి కియారా ముద్దు ముద్దుగా క‌నిపిస్తూ కంటత‌డి పెట్టించింది. ప్రియ‌ద‌ర్శి, అంగ‌ద్ బేది, జ‌య‌రామ్, విరాజ్ అశ్విన్ త‌దిత‌రులు కీల‌క‌మైన పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే? దర్శకుడిగా శౌర్యువ్‌కి ఇది తొలి చిత్రమే అయిన ఎంతో అనుభవం ఉన్నట్లు సినిమాను తెరకెక్కించారు. కథ చెప్పడంలో ఎక్కడా కన్ఫ్యూజ్ కాలేదు. అసభ్యతకి తావు ఇవ్వకుండా అక్కర్లేని రొమాన్స్, హింసల్ని జనానికి ఎక్కించకుండా కథని నీట్‌గా ప్రజెంట్ చేశారు. అయితే కొన్ని స్పూన్ ఫీడింగ్ సీన్ల వల్ల కథ సాగిదీస్తున్నట్టుగా అనిపిస్తుంది. స్లో నెరేషన్‌ కూడా కాస్త మైనస్‌ అని చెప్పవచ్చు. అయితే సినిమాకు అవసరమైన భావోద్వేగాలను పండించడంలో ఆయన సక్సెస్‌ అయ్యారు. అనూహ్య మలుపులతో ప్రేక్షకులను సినిమాలో లీనం చేయడంలో విజయం సాధించారు. కుటుంబ ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే ఎన్నో భావోద్వేగ సన్నివేశాలు ‘హాయ్‌ నాన్న’లో పుష్కలంగా ఉన్నాయి. సాంకేతికంగా.. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. క‌థ‌కి త‌గ్గ స‌న్నివేశాలు, సంగీతంతో సినిమా సాగుతుంది.  సాను జాన్ వర్గీస్ కెమెరా వర్క్ మూవీకి ప్లస్ అయ్యింది. నానిని కొత్తగా చూపించారు. హీరోయిన్‌ని రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో డిఫరెంట్‌గా చూపించారు. ముంబై, గోవా లొకేషన్స్‌ని అందంగా మలిచారు. అటు హేష‌మ్ ఇచ్చిన సంగీతం ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకుంటుంది. సమయమా సాంగ్‌ సినిమా మొత్తం ఏదో సందర్భంలో వినిపిస్తూనే ఉంటుంది. ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌, కూర్పు సరిగ్గా కుదిరాయి.  ప్లస్‌ పాయింట్స్‌ నాని, మృణాల్‌, కియారా నటనభావోద్వేగాలు, మలుపులుసంగీతం  మైనస్‌ పాయింట్స్‌ ఊహకు అందే కథసాగదీత సీన్లు రేటింగ్‌: 3/5
  డిసెంబర్ 07 , 2023
  <strong>Summer Heroines 2024: వేసవి హీట్‌ మరింత పెంచేందుకు సిద్ధమవుతున్న అందాలు భామలు వీరే!&nbsp;</strong>
  Summer Heroines 2024: వేసవి హీట్‌ మరింత పెంచేందుకు సిద్ధమవుతున్న అందాలు భామలు వీరే!&nbsp;
  సమ్మర్‌ అంటే తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద పండగ లాంటిది. స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవుల నేపథ్యంలో చిన్న, పెద్ద సినిమాలు సమ్మర్‌లో విడుదలయ్యేందుకు ఆసక్తి కనబరుస్తాయి. ఈ క్రమంలోనే ఏప్రిల్‌లో వినోదాలు పంచడానికి పలు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా అందులోని కథానాయకులు వేసవి హీట్‌ను తమ అందచందాలతో మరింత పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఆ భామలు ఎవరు? వారు నటించిన చిత్రాలు ఏంటి? అవి ఎప్పుడు విడుదలవుతాయి? వంటి అంశాలు ఈ కథనంలో చూద్దాం.&nbsp; మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) ‘సీతా రామం’, ‘హాయ్‌ నాన్న’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మృణాల్‌ ఠాకూర్‌.. ఈ సమ్మర్‌లో సరికొత్త మూవీతో వస్తోంది. యంగ్‌ హీరో విజయ్‌ నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) చిత్రంతో ఈ భామ టాలీవుడ్‌లో మరోమారు సందడి చేయబోతోంది. ఈ మూవీ ఏప్రిల్‌ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది.&nbsp; దివ్యాంశ కౌషిక్‌ (Divyansha Kaushik) ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా ద్వారా అలరించనున్న మరో నటి దివ్యాంశ కౌషిక్‌. ఇందులో ఈ భామ సెకండ్‌ హీరోయిన్‌గా చేస్తోంది. 2019లో వచ్చిన మజిలీ సినిమా ద్వారా దివ్యాంశ తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత రామారావు ఆన్‌ డ్యూటీ, పోలీసు వారి హెచ్చరిక, మైఖేల్‌ తదితర చిత్రాల్లో నటించింది.&nbsp; అంజలి (Anjali) ప్రముఖ హీరోయిన్‌ అంజలి కూడా ఈ వేసవిని మరింత హీటెక్కించేందుకు రెడీ అవుతోంది. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాతో ఆమె తెలుగు ఆడియన్స్‌ను మరోమారు పలకరించనుంది. ఈ చిత్రం ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేష్‌, షకలక శంకర్ ముఖ్యపాత్రలు పోషించారు.&nbsp; స్వర్ణిమా సింగ్‌ (Swarnima Singh) హర్షివ్‌ కార్తీక్‌ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బహుముఖం' (Bahumukham). 'గుడ్‌, బ్యాడ్ యాక్టర్‌' అనేది ట్యాగ్‌లైన్‌. ఈ సినిమాలో స్వర్ణిమా సింగ్‌ కథానాయికగా చేసింది. తన అందం, అభినయంతో ఆకట్టుకునేందుకు ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.&nbsp; మీనాక్షి గోస్వామి (Meenakshi Goswami) మీనాక్షి గోస్వామి కథానాయికగా చేసిన లేటెస్ట్‌ చిత్రం 'భరతనాట్యం'. ఈ మూవీ ద్వారానే మీనాక్షి తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఏప్రిల్‌ 5న విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారా సూర్యతేజ ఏలే హీరోగా పరిచయం అవుతున్నాడు. సినిమా ఓ యువకుడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందన్న కాన్సెప్ట్‌తో రూపొందింది. ప్రనీకాన్వికా (Praneekaanvikaa) ఏప్రిల్‌లో విడుదల కాబోతున్న మరో చిన్న చిత్రం 'మార్కెట్‌ మహాలక్ష్మీ'. కేరింత ఫేమ్‌ పార్వతీశం హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రణీకాన్వికా నటించింది. ఇదే ఆమెకు మెుదటి సినిమా. ఈ మూవీ విజయం ద్వారా తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకోవాలని ఈ బ్యూటీ భావిస్తోంది. ఏప్రిల్‌ 19న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.&nbsp; కోమలి ప్రసాద్‌ (Komali Prasad)&nbsp; యంగ్‌ హీరోయిన్‌ కోమలి ప్రసాద్‌ కూడా.. ఈ వేసవిలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ‘శశివదనే’ సినిమాతో ఆమె తెలుగు ఆడియన్స్‌ను పలకరించనుంది. ఏప్రిల్‌ 19న ఈ సినిమా విడుదల కానుంది. ‘నేను సీతాదేవి’ (2016) చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన కోమలి.. ‘హిట్‌ 2’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. శశివదనే సినిమా విజయంపై ఈ బ్యూటీ ఎన్నో ఆశలు పెట్టుకుంది.&nbsp; వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ‘బేబీ’ సినిమా సెక్సెస్‌తో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయిన హీరోయిన్‌ వైష్ణవి చైతన్య. ఈ భామ నటించిన రెండో చిత్రం 'లవ్‌ మి ఇఫ్‌ యు డేర్‌' కూడా ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఈ నెల 25 నుంచి తెలుగు ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయనుంది.&nbsp;
  ఏప్రిల్ 03 , 2024
  Nani HBD: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి నేచురల్‌ స్టార్‌ వరకూ.. నాని ఇన్‌స్పిరేషనల్‌ జర్నీ!
  Nani HBD: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి నేచురల్‌ స్టార్‌ వరకూ.. నాని ఇన్‌స్పిరేషనల్‌ జర్నీ!
  టాలీవుడ్‌లో ఎలాంటి ఫిల్మ్‌&nbsp; బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా (Happy Birthday Nani) వచ్చిన యంగ్‌ హీరో అంటే ముందుగా నేచురల్ స్టార్ నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఇండస్ట్రీలో తెలిసిన వారు లేకపోయిన తన యాక్టింగ్‌ టాలెంట్‌తో అవకాశాలను సంపాదించుకున్నాడు నాని. తన అద్భుతమైన నటనతో ఎన్నో సూపర్‌ హిట్‌ అందుకున్న నాని.. ప్రతీ సినిమాకు యాక్టర్‌గా ఓ మెట్టు ఎక్కుతూనే వచ్చాడు. ఎన్నో మరపురాని పాత్రలు చేసి తన టాలెంట్‌ ఏంటో నిరూపించుకున్నాడు. ‘అష్టా చమ్మా’ చిత్రం ద్వారా తొలిసారి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాని.. ‘దసరా’ విజయంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. రీసెంట్‌గా ‘హాయ్‌ నాన్న’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ రెండు సినిమాలతో ఇక ఎంతమాత్రం తాను టైర్ 2 హీరో కానని నానీ నిరూపించుకున్నాడు. లేటెస్ట్‌గా ‘సరిపోదా శనివారం’ అనే సినిమాతో థియేటర్లలో రచ్చ చేసేందుకు ఈ నేచురల్‌ స్టార్ సిద్ధమవుతున్నాడు.&nbsp; ఈ తరం యంగ్‌ హీరోలకు స్ఫూర్తిగా నిలిచిన నానికి (Happy Birthday Nani) ఈ సక్సెస్ ఒక్కరోజులో వచ్చింది కాదు. కథల ఎంపిక, సినీరంగంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు ఆయన్ను ఈ స్థాయిలో నిలిపింది. ఇవాళ నాని పుట్టిన రోజు&nbsp; సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం? నాని తీసిన సూపర్‌ హిట్‌ సినిమాలు? ఇండస్ట్రీలో స్థిరపడేందుకు దోహదం చేసిన పాత్రలు? ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.&nbsp; అష్టా చమ్మా (2008) అష్టా చమ్మా (Ashta chamma) సినిమా ద్వారానే నానిడ సహజ సిద్దమైన నటన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా ద్వారానే నాని నటనా సామర్థ్యం ఇండస్ట్రీకి తెలిసింది. మహేష్‌ పాత్రలో నాని నటన ఎంతో నేచురల్‌గా అనిపించింది. పక్కింటి కుర్రాడిలా ఉన్నాడనే ట్యాగ్‌ను తెచ్చి పెట్టింది. మెుదటి సినిమాతోనే నాని ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేశాడనే చెప్పాలి. పరిశ్రమకు కూడా నాని ఆశాజనకంగా కనిపించడంతో వరుస అవకాశాలు లభించాయి.&nbsp; రైడ్‌ (2009) రైడ్ (Ride) సినిమాలో నానిలోని నటుడు మరింత పరిణితి చెందాడు. నటనకు ఆస్కారమున్న అర్జున్‌ పాత్రలో నాని మెప్పించాడు. జీవితంలోని సవాళ్లతో పోరాడుతున్న యువకుడిగా చక్కగా తన హావభావాలను పలికించాడు. క్లిష్టమైన భావోద్వేగాలను కూడా చక్కగా ప్రదర్శించిన నాని వర్ధమాన నటుడిగా ఇండస్ట్రీలో తన ఖ్యాతిని సుస్థిరం చేసుకున్నాడు. అలా మెుదలైంది (2011) అలా మెుదలైంది (Ala Modalaindi) సినిమాతో నాని తొలిసారి సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గౌతం పాత్రలో నాని చేసిన కామెడి నానిలోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది. నాని తన ఎక్స్‌లెంట్‌ కామెడి టైమింగ్‌తో అదరగొట్టాడు. హీరోయిన్‌ నిత్యాతో నాని కెమిస్ట్రీ బాగా కుదురడంతో ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలించింది. ఈ విజయంతో నాని కెరీర్‌కు తిరుగు లేకుండా పోయింది.&nbsp;&nbsp; పిల్ల జమీందార్‌ (2011) పిల్ల జమీందార్‌(Pilla Zamindar) సినిమా నానిని కామెడి స్టార్‌గానూ నిలబెట్టింది. సినిమాలోని ప్రతిసీన్‌లో నాని మార్క్‌ కనిపిస్తుంది. హాస్య సన్నివేశాలు, భావోద్వేగ సీన్లలో నాని ఎంతో మెచ్యూర్‌గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి కలెక్షన్లనే రాబట్టింది.&nbsp; ఈగ (2012) దర్శకధీరుడు రాజమౌళితో చేసిన ఈగ (Eega) సినిమా నాని కెరీర్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. ఇందులో నాని యూనిక్‌ రోల్‌లో కనిపించారు. పునర్జన్మ పొందిన ఈగగా కనిపించి అలరించాడు. సినిమాలో నాని నేరుగా కనిపిచేంది కొద్దిసేపే అయినప్పటికీ చిత్ర విజయానికి అతడి యాక్టింగ్‌ ఎంతో దోహదం చేసింది. భలే భలే మగాడివోయ్ (2015) భలే భలే మగాడివోయ్‌ (Bhale Bhale Magadivoy) సినిమాలో నాని మతిమరుపు ఉన్న పాత్రలో నటించాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ హావభావాలను చక్కగా పండించాడు. లక్కీ పాత్రలో నాని నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాతో నాని ఫ్యాన్‌ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.&nbsp; నేను లోకల్‌ (2017) నేను లోకల్‌ చిత్రం(Nenu Local)తో నాని అగ్రహీరోల సరసన చేరిపోయాడు. ఇందులో నాని నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్‌తో నాని నిర్మాతల హీరోగా మారిపోయాడు. నానితో సినిమా అంటే వసూళ్లకు ఎలాంటి లోటు ఉండదని ఇండస్ట్రీ అంతా భావించింది.&nbsp; MCA (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి) (2017) MCA చిత్రంలో నాని (HBD Nani) మధ్య తరగతికి చెందిన అబ్బాయిగా కనిపించి మెప్పించాడు. నాని నటనకు మంచి మార్కులే పడ్డాయి. నాని క్రేజ్‌ కారణంగా రూ. 25 కోట్ల బడ్జెట్ తీసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.70 కోట్లను వసూలు చేసింది.&nbsp; నిన్ను కోరి (2017) నిన్నుకోరి చిత్రంలో నాని నటన మరో స్థాయికి వెళ్లింది. ప్రేమికుడిగా, భగ్న ప్రేమికుడిగా, తన ప్రేమను పొందాలని తాపత్రయ పడే యువకుడిగా నాని మెప్పించాడు. క్లైమాక్స్‌లో నాని నటన కంటతడి తెప్పిస్తుంది.&nbsp; జెర్సీ (2019) జెర్సీ(Jersey) సినిమా నానిలోని పరిపూర్ణ నటుడ్ని (HBD Nani) పరిచయం చేసింది. ఫెయిల్యూర్‌ క్రికెటర్‌గా నాని ఎంతో బాగా నటించాడు. ఈ పాత్రను తనను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా నటించి మెప్పించాడు. ఉద్వేగభరితమైన సన్నివేశాల్లో నాని నటన అమోఘమనే చెప్పాలి.&nbsp; గ్యాంగ్ లీడర్‌ (2019) గ్యాంగ్‌ లీడర్‌లో ఐదుగురు ఆడవాళ్లకు సాయపడే వ్యక్తిగా నాని కనిపిస్తాడు. అదే ఏడాది విడుదలైన జెర్సీలో పాత్రకు ఈ క్యారెక్టర్‌ పూర్తి భిన్నం.పెన్సిల్‌ పార్థసారథి పాత్రలో నాని నవ్వులు పూయిస్తాడు. సెకండాఫ్‌లో విలన్‌ ఎత్తులకు పైఎత్తులు వేసే యువకుడిగా అలరిస్తాడు.&nbsp; వి (2020) వి(V) సినిమాలో నాని&nbsp; నెగెటివ్‌ రోల్‌ కనిపించాడు. ఎన్నో సవాళ్లు ఉన్న ఈ పాత్రకు నాని వంద శాతం న్యాయం చేశాడు. తనకు ఎలాంటి వైవిధ్యమైన పాత్ర ఇచ్చిన అలవోకగా చేయగలనని నాని ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు.&nbsp; టక్‌ జగదీష్‌ (2021) టక్‌ జగదీష్‌ పాత్రకు నాని 100 శాతం న్యాయం చేశాడు. ఎమోషనల్‌ సన్నివేశాల్లో తనకు తిరుగులేదని మరోసారి నాని నిరూపించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాను నాని తన భుజాలపై మోసాడు.&nbsp; శ్యామ్‌ సింగరాయ్‌ (2021)&nbsp; పునర్జన్మ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేశారు. వాసు, శ్యామ్‌ సింగరాయ్ పాత్రలో రాణి అద్భుతంగా నటించాడు. ఇందులో నాని ఆహార్యం, మాట తీరు అన్ని కొత్తగా అనిపిస్తాయి.&nbsp; అంటే.. సుందరానికీ (2022) గతేడాది విడుదలైన అంటే సుందరానికీ చిత్రంలో నాని బ్రహ్మణ కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపిస్తాడు. సుందర్ ప్రసాద్ పాత్రలో నాని పూర్తిగా ఒదికిపోయాడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన నాని కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాలను మరోమారు గెలుచుకున్నారు. దసరా (2023) దసరా మూవీలో నాని ఊరమాస్‌గా కనిపించారు. ధరణి పాత్రలో తనదైన ముద్ర వేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంతో నాని బాలీవుడ్‌ ప్రేక్షకుల మనసులను సైతం గెలుచుకున్నారు. నాని కెరీర్‌లోనేే వసూళ్లు, నటన పరంగా ఈ సినిమా ది బెస్ట్‌గా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.&nbsp; హాయ్‌ నాన్న (2023) నాని-మృణాల్ ఠాకూర్‌ కాంబినేషన్‌లో యువ డైరెక్టర్‌ శౌర్యువ్‌ రూపొందించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. గుండెలకు హత్తుకునే భావోద్వేగాలతో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. మరోమారు నానీ తన అద్భుతమైన నటనతో ఇందులో ఆకట్టుకున్నాడు.&nbsp; &nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;మెుత్తంగా అష్టా చమ్మా నుంచి ‘హాయ్‌ నాన్న’ వరకూ నాని సినీ ప్రస్థానం అద్భుతమనే చెప్పాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నాని ఎదిగిన తీరు ప్రస్తుత, భవిష్యత్‌ తరాల హీరోలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇండస్ట్రీలో అతని వరుస విజయాలు… నాని అంకిత భావానికి, కృషి, ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. నేచురల్ స్టార్ నాని తన కేరీర్‌లో మరిన్ని అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని YOUSAY మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
  ఫిబ్రవరి 24 , 2024
  True Love Movies: ఈ చిత్రాలు ఎప్పటికీ మిమ్మల్ని వెంటాడుతునే ఉంటాయి!
  True Love Movies: ఈ చిత్రాలు ఎప్పటికీ మిమ్మల్ని వెంటాడుతునే ఉంటాయి!
  టాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎన్నో ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. అయితే వాటిలో అతి కొద్ది చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించాయి. యాక్షన్‌, శృంగార సన్నివేశాలు, ఐటెం సాంగ్స్‌ ఇలాంటివి లేకపోయినా.. స్వచ్చమైన ప్రేమ, ఆకట్టుకునే కథ-కథనం, చక్కటి ప్రజెంటేషన్‌ ఉంటే చాలని అవి నిరూపించాయి. ప్రేక్షకుల్లో భావోద్వేగాలను రగిలించి కొత్త రకం ప్రేమ కథలను ఇండస్ట్రీకి పరిచయం చేశాయి. తెలుగులో వచ్చిన ‘సీతారామం’ (Sitaramam), ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna) చిత్రాలు ఇందుకు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. బాలీవుడ్‌ ఇండస్ట్రీని సైతం ఈ చిత్రాలు కదిలించాయి. నార్త్‌ అభిమానుల ఫేవరేట్‌ చిత్రంగా మారిపోయాయి. మరి టాలీవుడ్‌లో ఇప్పటివరకూ వచ్చి కల్ట్‌ క్లాసిక్‌ మూవీలు ఏవి? అవి ప్రేక్షకులకు ఇచ్చిన సందేశం ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.&nbsp; సీతారామం 2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్‌ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్‌ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది.&nbsp; హాయ్‌ నాన్న ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది.&nbsp; సూర్య S/O కృష్ణన్ హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.&nbsp; మజిలి తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.&nbsp; నిన్ను కోరి హీరో ఒక యువతిని ఎంతగానో ఇష్టపడతాడు. అనూహ్యంగా ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. తొలత ఆమెను దక్కించుకోవాలని భావించినప్పటికీ చివరికీ ఆమె సంతోషం కోసం తన ప్రేమను త్యాగం చేస్తాడు.&nbsp; మళ్లీ మళ్లీ ఇది రాని రోజు రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్‌. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.&nbsp; ఓయ్‌ బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు. తొలి ప్రేమ&nbsp; టాలీవుడ్‌లో వచ్చి కల్ట్‌ క్లాసిక్‌ ప్రేమ కథా చిత్రాల్లో తొలి ప్రేమ ఒకటి. విదేశాల నుంచి వచ్చిన యువతిని హీరో ప్రేమిస్తాడు. ఆమెకు తన భావాలను చెప్పుకోలేక ఇబ్బంది పడుతుంటాడు. తిరిగి వెళ్లేపోతున్న క్రమంలో తానూ హీరోను లవ్‌ చేస్తున్నట్లు యువతికి అర్థమవుతుంది.&nbsp; నిన్నే పెళ్లాడతా కృష్ణ వంశీ డైరెక్షన్‌లో వచ్చిన నిన్నే పెళ్లడతా చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు. రాజా రాణి ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు.&nbsp; జాను శర్వానంద్‌, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్‌ లవ్‌ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్‌ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్‌ టూ గెదర్‌ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు.&nbsp;
  ఫిబ్రవరి 13 , 2024
  This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు ఇవే!
  This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు ఇవే!
  కొత్త సంవత్సరం మెుదలైంది. సంక్రాంతి కానుకగా పెద్ద సినిమాలన్నీ రాబోతున్నాయి. దీంతో ఈ వారం థియేటర్లలో చెప్పుకోతగ్గ చిత్రాలు రావడం లేదు. దీంతో అందరి దృష్టి ఓటీటీపైన పడింది. ఇందుకు తగ్గట్లే ఈ వారం బోలెడన్ని కొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు కాలింగ్ సహస్ర సుడిగాలి సుధీర్ న‌టించిన కాలింగ్ స‌హ‌స్ర మూవీ ఇప్పటికే ఓటీటీలోకి వ‌చ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా (జనవరి 1 నుంచి) స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని అరుణ్ విక్కిరాల డైరెక్ట్ చేశాడు. డిసెంబ‌ర్ 1న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సినిమాకు పెద్ద‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. సుడిగాలి సుధీర్‌ టీవీ ప్రేక్షకులకు సుపరిచితం కావడంతో త్వరగా ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఈ మూవీలో డాలీషా ఫిమేల్ లీడ్‌గా న‌టించింది.&nbsp; హాయ్‌ నాన్న నానీ లేటెస్ట్‌ మూవీ 'హాయ్‌ నాన్న' ఈ వారమే ఓటీటీలోకి రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా జనవరి 4నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తొలుత ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయాలని భావించారు. కానీ మరీ ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో ముందే స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తున్నారు. ఇందులో నానికి జోడీగా మృణాల్‌ థాకూర్‌ నటించింది.&nbsp; కంజూరింగ్‌ కన్నప్పన్ గతేడాది కోలీవుడ్‌లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన 'కంజూరింగ్‌ కన్నప్పన్‌' ఈ వారమే ఓటీటీలోకి విడుదల రాబోతోంది. హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 5న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కాబోతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీని వీక్షించవచ్చు. ఈ చిత్రంలో రెజీనా, నాసర్‌, శరణ్య ముఖ్య పాత్రల్లో నటించారు. #90s హీరో శివాజీ, వాసుకి ప్రధాన పాత్రల్లో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరిస్ '#90’s'. ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనేది ట్యాగ్ లైన్. ఈటీవీ విన్‌ వేదికగా జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మధ్యతరగతి కుటుంబం చుట్టు అల్లుకున్న సన్నివేశాలు, భావోద్వేగాలు వీక్షకులను ఆకట్టుకుంటాయని మేకర్స్‌ తెలిపారు. ఈ సిరీస్‌లోని సరదాలు, ఆనందాలు, సంఘర్షణలు మనసుకు హత్తుకునేలా ఉంటాయని పేర్కొన్నారు. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateBitconMovieEnglishNetflixJan 01Fool me onceSeriesEnglishNetflixJan 01You Are What You Eat: A Twin ExperimentSeriesEnglishNetflixJan 01Delicious in DungeonSeriesEnglish/JapaneseNetflixJan 04The brothers son&nbsp;SeriesEnglishNetflixJan 04Good griefMovieEnglishNetflixJan 05IshuraSeriesEnglish/JapaneseDisney HotStarJan 03Perilloor Premier LeagueSeriesMalayalamDisney HotStarJan 05Marry my husbandSeriesEnglish/KoreanAmazon PrimeJan 01LOL: Last One Laughing Quebec 2SeriesEnglishAmazon PrimeJan 05TejasMovieHindiZee5Jan 05Meg 2: The trenchMovieTelugu/EnglishJio CinemaJan 03Cubicles Season 3MovieHindiSonyLIVJan 05
  జనవరి 05 , 2024
  Tollywood Debut Directors in 2023: తొలి చిత్రంతోనే సంచనాలు సృష్టించిన కొత్త దర్శకులు వీరే!
  Tollywood Debut Directors in 2023: తొలి చిత్రంతోనే సంచనాలు సృష్టించిన కొత్త దర్శకులు వీరే!
  ప్రతీ సంవత్సరం స్టార్‌ డైరెక్టర్ల చిత్రాలు టాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తుంటాయి. కనీసం రెండు లేదా మూడు చిత్రాలు జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అయితే ఈ ఏడాది స్టార్‌ డైరెక్టర్ల హవా టాలీవుడ్‌లో పెద్దగా కనిపించలేదు. అయితే కొత్త దర్శకులు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి సినిమాతోనే సంచలనాలు సృష్టించారు. మరి ఆ దర్శకులు ఎవరు? వాళ్ళు తెరకెక్కించిన సినిమాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం.&nbsp; శౌర్యువ్‌ నాని హీరోగా తెరక్కిన హాయ్‌ నాన్న చిత్రం రీసెంట్‌గా విడుదలై బ్లాక్‌బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా శౌర్యువ్‌ దర్శకుడిగా పరిచయం అయ్యారు. సినిమాలో భావోద్వేగాలను చక్కగా పలికించి తొలి సినిమాతోనే అందరి మన్ననలు పొందాడు.&nbsp; కళ్యాణ్‌ శంకర్‌ కొత్త నటీనటులను, కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్ ని పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తెరకెక్కించిన సినిమా ‘మ్యాడ్’. కాలేజీ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సుమంత్ ప్రభాస్ షార్ట్ ఫిలిమ్స్‌తో ఫేమ్‌ని సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్.. హీరోగా, దర్శకుడిగా చేస్తూ వెండితెరపై అరంగేట్రం చేసిన సినిమా ‘మేమ్ ఫేమస్’. ఈ సినిమా యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాకు ముందు చిత్ర యూనిట్‌ చేసిన ప్రమోషన్స్‌ కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి.&nbsp; క్లాక్స్‌ చిన్న సినిమాగా విడుదలైన ‘బెదురులంక 2012’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా డైరెక్టర్‌ క్లాక్స్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఒక యునిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది.&nbsp; వేణు యెల్దండి ఈ ఏడాది సంచలనం సృష్టించిన కొత్త దర్శకుల్లో వేణు యెల్దండి ముందు వరుసలో ఉంటారు. ఆయన తెరకెక్కించిన 'బలగం' అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కొల్లగొట్టింది. అంతేగాక విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. గ్రామాల్లో తెరలు పెట్టి మరి సినిమాను ప్రదర్శించారంటే ఈ చిత్రం ఏ స్థాయిలో ఆదరణ సంపాదించిందో అర్థమవుతుంది. శ్రీకాంత్ ఓదెల నాని ‘దసరా’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ప్రొడ్యూసర్ల దృష్టిని ఆకర్షించాడు ఓదెల. గొప్ప సినిమాలు చేయగల సత్తా తనలో ఉందని నిరూపించుకున్నాడు.&nbsp; షణ్ముఖ ప్రశాంత్ ఈ ఏడాది విడుదలైన ‘రైటర్‌ పద్మభూషణ్‌’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా షణ్ముఖ ప్రశాంత్ డైరెక్టర్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద రూ.12 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.&nbsp; మురళి కిషోర్ కిరణ్ అబ్బవరం హీరోగా నూతన దర్శకుడు మురళి కిషోర్ అబ్బుర డైరెక్ట్ చేసిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. ఈ సినిమా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. తొలి చిత్రంతోనే డైరెక్టర్‌గా తనకు మంచి భవిష్యత్ ఉందని నిరూపించుకున్నారు మురళి కిషోర్‌.
  డిసెంబర్ 16 , 2023
  This Week OTT Movies : ఈ వారం థియేటర్లు / ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఇదే!
  This Week OTT Movies : ఈ వారం థియేటర్లు / ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఇదే!
  గత వారం లాగే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. డిసెంబర్‌ 4 నుంచి 10వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు హాయ్‌ నాన్న నేచురల్‌ స్టార్‌ నాని (Nani) నటించిన లేటెస్ట్‌ మూవీ ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna). ఈ సినిమా తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందింది. ఇందులో హీరోయిన్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) చేసింది. శ్రుతిహాసన్‌ (Shruti Haasan), బేబీ కియారా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాతో శౌర్యువ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 2 గంటల 5 నిమిషాల నిడివితో రూపొందిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో డిసెంబరు 7న విడుదల కానుంది. ఎక్స్‌ట్రా: ఆర్డినరీమ్యాన్‌ హీరో నితిన్‌ (Nithiin) కొత్త మూవీ ‘ఎక్స్‌ట్రా: ఆర్డినరీమ్యాన్‌’ (Extra: OrdinaryMan) ఈ వారమే రిలీజ్‌ కాబోతోంది. ఇందులో వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రీలీల నటించింది. ప్రముఖ హీరో రాజశేఖర్‌ (Rajasekhar) కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో నితిన్‌ జూనియర్‌ ఆర్టిస్ట్‌గా కనిపించనున్నారు. సినిమాను చూస్తున్నంత సేపు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతారని చిత్ర యూనిట్‌ ధీమా వ్యక్తం చేసింది. ఈ చిత్రం డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. చండిక వీరు, శ్రీహర్ష, కుషి చౌహన్‌, నిషా సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘చండిక’ (Chandika). హారర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. తోట కృష్ణ దర్శకత్వం వహించారు. కె.వి.పాపారావు నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 8న విడుదల కానుంది.&nbsp; ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు ఇక ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే అని చెప్పవచ్చు. ఎందుకంటే 32కు పైగా చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు ఈ వారం ఓటీటీలోకి రాబోతున్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఇప్పుడు చూద్దాం.&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateJigarthanda DoubleXMovieTelugu/TamilNetflixDec 8Japan&nbsp;MovieTelugu/TamilNetflixDec 11The archies&nbsp;MovieHindiNetflixDec 7Leave the World BehindMovieEnglishNetflixDec 8Dhak DhakMovieHindiNetflixDec 8VadhuvuWeb SeriesTeluguDisney+HotstarDec 8Mast Mein Rehne KaMovieHindiAmazon PrimeDec 8Kadak SinghMovieHindiZee 5Dec 8Koose Muniswamy VeerappanDocumentaryTeluguZee 5Dec 8ChamakWeb SeriesHindiSonyLIVDec 7Maa oori polimera 2MovieTeluguAhaDec 8 మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott
  డిసెంబర్ 04 , 2023
  <strong>మృణాల్ ఠాకూర్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్</strong>
  మృణాల్ ఠాకూర్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
  మృణాల్ ఠాకూర్ ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సీతారామం(2022) చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా అన్ని భాషల్లో బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఆమె నటనకు గాను రెండు సైమా అవార్డలు వరించాయి. ఈ చిత్రం తర్వాత మృణాల్ నాని సరసన 'హాయ్ నాన్న'(2023) సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తోంది. ఈక్రమంలో మృణాల్ ఠాకూర్ గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Mrunal Thakur) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మృణాల్ ఠాకూర్ దేనికి ఫేమస్? మృణాల్ ఠాకూర్ సీతారామం చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.&nbsp; మృణాల్ ఠాకూర్ వయస్సు ఎంత? 1992, ఆగస్టు 1న జన్మించింది. ఆమె వయస్సు&nbsp; 31 సంవత్సరాలు&nbsp; మృణాల్ ఠాకూర్&nbsp; ముద్దు పేరు? గోళి మృణాల్ ఠాకూర్&nbsp; ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు&nbsp; మృణాల్ ఠాకూర్ ఎక్కడ పుట్టింది? ధూలే, మహారాష్ట్ర మృణాల్ ఠాకూర్‌కు వివాహం అయిందా? ఇంకా కాలేదు మృణాల్ ఠాకూర్ అభిరుచులు? క్రికెట్ చూడటం, ఫొటోగ్రఫీ మృణాల్ ఠాకూర్‌కు ఇష్టమైన ఆహారం? ప్రాన్స్, చేపలు, జిలేబీ మృణాల్ ఠాకూర్‌కు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మృణాల్, శరత్ చంద్ర అనే రచయితతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మృణాల్ ఠాకూర్‌ తల్లిదండ్రుల పేర్లు? ఉదయ్ సింగ్ ఠాకూర్(యూనియన్ బ్యాంక్‌లు అసిస్టెంట్ జనరల్ మెనేజర్‌గా పనిచేస్తున్నారు) మృణాల్ ఠాకూర్‌ ఫెవరెట్ హీరో? అమితాబ్ బచ్చన్ మృణాల్ ఠాకూర్‌కు ఇష్టమైన హీరోయిన్? కరీనా కపూర్ మృణాల్ ఠాకూర్‌కు ఇష్టమైన కలర్ ? యెల్లో, వైట్, పింక్ మృణాల్ ఠాకూర్ తెలుగులో హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ సినిమా? సీతారామం(2023) మృణాల్ ఠాకూర్ ఏం చదివింది? జర్నలిజంలో డిగ్రీ చేసిందిత మృణాల్ ఠాకూర్ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.కోటి- రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. మృణాల్ ఠాకూర్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మృణాల్ సినిమాల్లోకి రాకముందు అనేక టీవీ షోల్లో నటించింది. మోడల్‌గా కొన్ని యాడ్స్ చేసింది. మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/mrunalthakur/?hl=en మృణాల్ ఠాకూర్ ఎన్ని లిప్ లాక్ సీన్లలో నటించింది? హాయ్‌ నాన్న చిత్రంలో నానితో కలిసి లిప్‌ లాక్ సీన్‌లో నటించింది. అలాగే జెర్సీ చిత్రంలో షాహిద్ కపూర్‌తో లిప్ లాక్ సీన్‌లో యాక్ట్ చేసింది. https://www.youtube.com/watch?v=36fZHQwlDCo
  ఏప్రిల్ 08 , 2024
  <strong>EXCLUSIVE: ఈ జనరేషన్‌ మెగాస్టార్లు.. స్వయంకృషితో స్టార్లుగా ఎదిగిన టాలీవుడ్‌ కుర్ర హీరోలు వీరే!</strong>
  EXCLUSIVE: ఈ జనరేషన్‌ మెగాస్టార్లు.. స్వయంకృషితో స్టార్లుగా ఎదిగిన టాలీవుడ్‌ కుర్ర హీరోలు వీరే!
  తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది కథానాయకులు ఉన్నారు. స్టార్‌ హీరోల కుటుంబాల నుంచి వచ్చిన వారసులు, దర్శక నిర్మాతల తనయులు.. హీరోలుగా మారి తామేంటో నిరూపించుకున్నారు. అయితే కొందరు మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా వచ్చి టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన యాక్టింగ్‌ స్కిల్స్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. కసి, పట్టుదల ఉంటే ఇండస్ట్రీలో ఎవరైనా పైకి రావొచ్చని ఆ కుర్ర హీరోలు నిరూపించారు. ఇంతకీ ఆ కథానాయకులు ఎవరు? ఇండస్ట్రీలో తమ ప్రస్థానాన్ని ఎలా మెుదలు పెట్టారు? వారిని స్టార్లుగా మార్చిన చిత్రాలు ఏవి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; నాని స్వయం కృషితో పైకొచ్చిన ఈ తరం హీరో అనగానే అందరికీ ముందుగా నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన నాని.. ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా మారాడు. ‘భీమిలి కబడ్డి జట్టు’, ‘అలా మెుదలైంది’, ‘పిల్ల జమిందార్‌’, ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘నేను లోకల్‌’, ‘జెర్సీ’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘దసరా’, ‘హాయ్‌ నాన్న’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోగా మారిపోయాడు. నాని నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న విడుదల కానుంది.&nbsp; విజయ్‌ దేవరకొండ యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. హీరో ఫ్రెండ్‌, ప్రాధాన్యం లేని పాత్రల్లో నటిస్తూ సరైన అవకాశాల కోసం ఎదురుచూశాడు. ‘నువ్విలా’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్‌.. ‘లైఫ్‌ ఇజ్‌ బ్యూటిఫుల్‌’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాల్లో సైడ్‌ రోల్స్‌లో చేశాడు. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి చూపులు' చిత్రంతో తొలిసారి ఫుల్‌ లెన్త్‌ హీరోగా మారాడు. ఆ తర్వాత సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన 'అర్జున్‌ రెడ్డి'తో విజయ్‌ రాత్రికి రాత్రే స్టార్‌గా ఎదిగాడు. యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించాడు. 'గీతా గోవిందం' ఫిల్మ్‌ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కూ విజయ్‌ దగ్గరయ్యాడు. రీసెంట్‌గా ‘ఫ్యామిలీ స్టార్‌’తో విజయ్‌ తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda).. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిత్ర పరిశ్రమలో తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో చిన్న పాత్రలతో కొద్ది రోజులు నెట్టుకొంచాడు. ‘జోష్‌’, ‘ఆరెంజ్‌’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘డాన్‌ శీను’ చిత్రాల్లో పెద్దగా గుర్తింపు లేని పాత్రల్లో నటించాడు. ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్‌లో వచ్చిన 'LBW' (లైఫ్‌ బిఫోర్‌ వెడ్డింగ్‌) మూవీతో సిద్ధూ హీరోగా మారాడు. 'గుంటూరు టాకీస్‌' చిత్రం హీరోగా అతడికి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత అడపాదడపా చిత్రాలు చేసినప్పటికీ సిద్ధుకు చెప్పుకోతగ్గ హిట్‌ రాలేదు. 2022లో వచ్చిన 'డీజే టిల్లు' ఈ యంగ్‌ హీరో కెరీర్‌ను మలుపు తిప్పింది. ప్రేమ పేరుతో మోసపోయిన టిల్లు పాత్రలో సిద్ధు జీవించేశాడు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్‌ కూడా బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. అంతేకాదు రూ.100 కోట్లకు పైగా గ్రాస్‌ రాబట్టి సిద్ధూను స్టార్‌ హీరోల సరసన నిలబెట్టింది. దీంతో 'టిల్లు క్యూబ్‌' తీసేందుకు మేకర్స్ సన్నాహాలు మెుదలు పెట్టారు.&nbsp; నవీన్ పొలిశెట్టి యువ కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) సైతం.. ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. కెరీర్‌ తొలినాళ్లల్లో ప్రాధాన్యం లేని పాత్రల్లో నవీన్‌ నటించాడు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్‌ ఇజ్‌ బ్యూటిఫుల్‌' చిత్రంతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయయ్యాడు. ఆ తర్వాత 'డీ ఫర్‌ దోపిడి', ‘1 నేనొక్కడినే’ చిత్రాల్లో చేసినప్పటికీ పెద్దగా ఫేమ్‌ రాలేదు. అయితే 2019లో వచ్చిన ఏజెంట్‌ 'సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రం.. నవీన్‌ పోటిశెట్టి పేరు మార్మోగేలా చేసింది. ఇందులో నవీన్‌ చెప్పే ఫన్నీ డైలాగ్‌ డెలివరీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక 'జాతి రత్నాలు' ఫిల్మ్‌తో నవీన్‌ పొలిశెట్టి క్రేజ్‌ మరో స్థాయికి చేరింది. ఇటీవల స్టార్‌ నటి అనుష్కతో మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి చిత్రంలో ఈ యంగ్‌ హీరో నటించగా ఆ ఫిల్మ్‌ కూడా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో టాలీవుడ్‌లో నవీన్‌ మినిమమ్‌ గ్యారంటీ హీరోగా మారిపోయాడు.&nbsp; తేజ సజ్జ యువ హీరో తేజ సజ్జ (Teja Sajja).. ఒకప్పుడు బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. చిరంజీవి, మహేష్‌బాబు, వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌, శ్రీకాంత్, జూ.ఎన్టీఆర్‌ చిత్రాల్లో నటించాడు. కాగా, 2019లో వచ్చిన 'జాంబిరెడ్డి' సినిమాతో తేజ సజ్జా హీరోగా మారాడు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ సాధించింది. ఆ తర్వాత చేసిన ఇష్క్‌, అద్భుతం సినిమాలు కూడా హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. రీసెంట్‌గా అతడు నటించిన ‘హనుమాన్‌’ (Hanu Man) సినిమా ప్యాన్‌ ఇండియా స్థాయిలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్రశాంత్‌ వర్మ (Prashanth Varma) దర్శకత్వం వహించిన ఈ సినిమా.. నార్త్‌లో విశేష ఆదరణ సంపాందించింది. దీంతో తేజ సజ్జా క్రేజ్‌ అమాంతం పెరిగింది. ప్రస్తుతం అతడు సూపర్ యోధ అనే ఫిల్మ్‌లో నటిస్తున్నాడు.&nbsp; అడవి శేషు స్టార్‌ హీరో అడవి శేషు (Adivi Sesh)కు కూడా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేదు. తొలి చిత్రం 'కర్మ'తో హీరోగా మారిన అతడు.. అరంగేట్రంతోనే మంచి గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత ‘పంజా’, ‘బలుపు’, ‘రన్‌ రాజా రన్‌’, ‘బాహుబలి’, ‘అమీ తుమీ’ వంటి చిత్రాల్లో సపోర్టింగ్‌ రోల్స్‌లో కనిపించాడు. ఆ తర్వాత వచ్చిన 'గూడఛారి' చిత్రం అడివి శేషు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ స్పై థ్రిల్లర్‌ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఆ తర్వాత చేసిన ‘ఎవరు’, ‘మేజర్‌’, ‘హిట్‌: సెకండ్‌ కేసు’ కూడా సూపర్‌ హిట్స్‌గా నిలవడంతో ఈ యువ నటుడు స్టార్‌ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం అడివి శేషు.. గూడఛారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు.&nbsp; ప్రియదర్శి యువనటుడు ప్రియదర్శి (Priyadarshi Pulikonda)కి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. ఇండస్ట్రీలో తనకంటూ ఎవరు లేనప్పటికీ అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగాడు. చివరికీ 2016లో శ్రీకాంత్‌ హీరోగా వచ్చిన&nbsp; 'టెర్రర్‌' చిత్రంలో ఉగ్రవాది పాత్రతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అదే ఏడాది వచ్చిన ‘పెళ్లి చూపులు’ అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో 'నావు చావు నేను చస్తా.. నీకెందుకు' డైలాగ్‌తో అతడు బాగా ఫేమస్‌ అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హాస్య పాత్రల్లో కనిపించిన ప్రియదర్శి.. 'జాతి రత్నాలు' మూవీతో మరింత పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే గతేడాది వచ్చిన 'బలగం' సినిమా ప్రియదర్శిని స్టార్‌ నటుడిగా నిలబెట్టింది. ఇటీవల వచ్చిన ‘మంగళవారం’, ‘ఓం భీమ్ బుష్‌’ చిత్రాల్లో లీడ్‌ రోల్స్‌లో నటించి ప్రియదర్శి అలరించాడు.&nbsp;
  ఏప్రిల్ 17 , 2024
  Mrunal Thakur: మృణాల్ లేత అందాలు.. టైట్ డ్రెస్‌లో హాట్ బంప్స్
  Mrunal Thakur: మృణాల్ లేత అందాలు.. టైట్ డ్రెస్‌లో హాట్ బంప్స్
  యంగ్‌ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌.. మరోమారు మత్తెక్కించే అందాలతో సోషల్‌ మీడియాను హీటెక్కించింది. కళ్లు చెదిరే స్కిన్‌ షోతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.&nbsp; తాజాగా ‘69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు’ (69th Filmfare Awards)వేడుకల్లో పాల్గొన్న మృణాల్‌.. అక్కడ తన గ్లామర్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టైట్‌ఫిట్‌ డ్రెస్‌లో ఎద అందాలను చూపిస్తూ వీక్షకులను ఫిదా చేసింది. ప్రస్తుతం మృణాల్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. #MrunalThakur హ్యాష్‌టాగ్‌తో అవి వైరల్‌ అవుతున్నాయి. https://twitter.com/i/status/1751880621524484350 ‘సీతారామం’ (Sitaramam) సినిమాతో సూపర్‌ క్రేజ్‌ తెచ్చుకున్న మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur).. ప్రస్తుతం వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ బిజీ బిజీగా ఉంటోంది. ఇటీవల బాలీవుడ్‌ మీడియాతో మాట్లాడిన మృణాల్‌ (69th Filmfare Awards) ఆసక్తికర కామెంట్స్‌ చేసింది. కెరీర్ పరంగా ఎదుగుతున్నా హిందీలో మాత్రం పెద్ద సినిమాలలో అవకాశాలు రావడం లేదని వాపోయింది. ముఖ్యంగా రొమాంటిక్‌ సినిమాల్లో ఆఫర్లు రావట్లేదని మృణాల్‌ స్పష్టం చేసింది. కొందరు రొమాంటిక్‌ సినిమాలంటే ఇష్టం లేదని అంటారని.. కానీ అవే చూస్తారని పేర్కొంది.&nbsp; ఇక ఈ భామ తెలుగు లేటెస్ట్‌ మూవీ 'హాయ్‌ నాన్న' మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కోసం ఆమె దాదాపు రూ.3 కోట్ల రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్‌.&nbsp; ప్రస్తుతం తెలుగులో విజయ్‌ దేవరకొండ సరసన మృణాల్‌ నటిస్తోంది. పరుశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి విజయ్‌నే మృణాల్‌ను రిఫర్ చేశాడని సమాచారం.&nbsp; ఇక తమిళ్‌ స్టార్‌ శివ కార్తికేయన్‌ మూవీలోనూ ఈ బ్యూటీకి అవకాశం దక్కిందట. దర్శకుడు మురగదాస్‌ ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తారని టాక్. ఇక మృణాల్ వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమె 1 ఆగస్టు 1992న మహారాష్ట్రలోని ధూలేలో జన్మించింది.&nbsp; మృణాల్.. ముంబైలోని KC కాలేజీ డిగ్రీ చేస్తుండగానే టెలివిజన్‌ రంగం వైపు అడుగులు వేశారు. ఈ క్రమంలో ‘కుంకుమ్ భాగ్య’ సీరియల్‌లో నటించి మృణాల్‌ పాపులర్ అయ్యింది. 2014లో విడుదలైన మరాఠీ చిత్రం ‘విట్టి దండు’తో సినీ రంగ ప్రవేశం చేసింది. 2019లో వికాస్ బహ్ల్ బయోపిక్ ‘సూపర్ 30’ నటించి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ‘ఆంథాలజీ ఘోస్ట్ స్టోరీస్‌’లోనూ మృణాలు మెరిసింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అదే సంవత్సరం జాన్ అబ్రహంతో కలిసి 'గల్లన్ గోరియా' అనే మ్యూజిక్ వీడియోలోనూ ఈ బ్యూటీ తళుక్కుమంది. 2021లో రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ‘తూఫాన్’ అనే స్పోర్ట్స్ డ్రామాలో మృణాల్‌ నటించింది.&nbsp; ఆ తర్వాత షాహిద్‌ కపూర్‌తో కలిసి ‘జెర్సీ’ సినిమా రీమేక్‌లో ఆమె కనిపించింది. అయితే ఈ చిత్రం ఫ్లాప్‌ టాక్ తెచ్చుకుంది.&nbsp;
  జనవరి 29 , 2024
  Successful Actress 2023: ఈ ఏడాది తమ స్టార్‌డమ్‌ను అమాంతం పెంచుకున్న హీరోయిన్లు వీరే!
  Successful Actress 2023: ఈ ఏడాది తమ స్టార్‌డమ్‌ను అమాంతం పెంచుకున్న హీరోయిన్లు వీరే!
  ఈ ఏడాది టాలీవుడ్‌ చాలా మంది హీరోయిన్లకు కలిసొచ్చింది. వారు నటించిన చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అయితే ప్రత్యేకించి కొందరు మాత్రం ఈ ఏడాది తమ తల రాతలను మార్చుకున్నారు. తమకంటూ స్టార్‌ స్టేటస్‌ను సంపాదించుకున్నారు. అంతేగాక 2023 ఏడాదిలో తమకు తిరుగులేదని వారు నిరూపించుకున్నారు. ఇంతకీ ఆ భామలు ఎవరు? వారు సాధించిన ఘనతలు ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.&nbsp; శ్రీలీల ఈ ఏడాది చాలా బాగా పాపులర్ అయిన హీరోయిన్ల జాబితాలో శ్రీలీల (Sreeleela) ప్రథమ స్థానంలో ఉంటుంది. ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. రవితేజ పక్కన ‘ధమాకా’లో చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వరుసగా ఆ తర్వాత వరుసగా రామ్‌తో ‘స్కంద’, బాలయ్య కూతురిగా 'భగవంత్‌ కేసరి', పంజా వైష్ణవ్‌ తేజ్‌తో 'ఆదికేశవ', నితీన్‌తో 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌' వంటి చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం మహేష్‌, విజయ్‌ దేవరకొండ, పవన్‌ కల్యాణ్‌ సరసన శ్రీలీల నటిస్తోంది. కీర్తి సురేష్‌ యంగ్‌ బ్యూటీ కీర్తి సురేష్‌ (Keerthy Suresh)కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. నాని సరసన ఆమె నటించిన 'దసరా' చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విజయవంతమైంది. రూ.100 కోట్లకు పైగా ఇందులో తన నటనకు గానూ కీర్తి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరోవైపు ‘భోళాశంకర్‌’ సినిమాలో చిరంజీవి సోదరిగా నటించి మరోమారు అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌ పక్కన ‘మామన్నన్‌’ సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.&nbsp; రష్మిక మందన్న ఈ ఏడాది రష్మిక మందన్న(Rashmika Mandanna) తన స్టార్‌డమ్‌ను మరింత పెంచుకుంది. విజయ్‌తో ‘వారసుడు’ చిత్రంలో నటించిన ఈ భామ.. బాలీవుడ్‌లో సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన ‘మిస్టర్‌ మజ్నూ’ చేసింది. ఇక రణ్‌బీర్‌ కపూర్‌కు జోడీగా ఆమె నటించిన ‘యానిమల్‌’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇందులో రష్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. సమంత ఈ ఏడాది సమంత (Samantha)కు మిశ్రమ స్పందన ఎదురైంది. ఆమె నటించిన ‘శాకుంతలం’ చిత్రం ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకోగా విజయ్‌ దేవరకొండతో చేసిన ‘ఖుషి’ మూవీ మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. మరోవైపు తమిళం, ఇంగ్లీష్‌లో తెరకెక్కుతున్న బైలింగ్విల్‌ ఫిల్మ్‌ ‘చెన్నై స్టోరీస్‌’లోనూ నటించే అవకాశాన్ని సమంత దక్కించుకుంది.&nbsp; సంయుక్త మీనన్‌ ఈ ఏడాది సంయుక్త మీనన్‌ (Samyuktha menon)కు మంచి విజయాలను అందించింది. ధనుష్‌ సరసన ఆమె నటించిన 'సార్‌' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ సరసన ఆమె చేసిన 'విరూపాక్ష' చిత్రం ఘన విజయం సాధించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో సంయుక్త తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.&nbsp; అనుష్క శెట్టి గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన స్టార్‌ నటి అనుష్క (Anushka Shetty) ఈ ఏడాది మరోమారు తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 'మిస్ శెట్టి మిష్టర్‌ పోలిశెట్టి' చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా అనుష్కకు గట్టి కమ్‌బ్యాక్‌ లభించిందని ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. శ్రుతి హాసన్‌ టాలీవుడ్‌లో సరైన సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న శ్రుతి హాసన్‌ (Shruti Haasan)కు ఈ ఏడాది కలిసొచ్చిందని చెప్పవచ్చు. చిరంజీవి, బాలకృష్ణలతో ఆమె నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు సంక్రాంతికి విడుదలై మంచి హిట్‌ టాక్ తెచ్చుకున్నాయి. తాజాగా నానితో ‘హాయ్‌ నాన్న’ చిత్రంలోనూ ఓ పాటలో స్టెప్పులేసి అదరగొట్టింది. అలాగే ప్రభాస్‌ సరసన 'సలార్‌' సినిమాలోనూ శ్రుతి హాసన్‌ నటించింది.&nbsp;
  డిసెంబర్ 19 , 2023
  2023 Roundup: గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన టాప్‌-10 తెలుగు హీరోలు వీరే!
  2023 Roundup: గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన టాప్‌-10 తెలుగు హీరోలు వీరే!
  భారత్‌లో అతిపెద్ద వినోద రంగంగా సినిమాలను చెప్పుకోవచ్చు. దేశంలో సినీ హీరోలకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. తమ అభిమాన హీరోకు సంబంధించిన ప్రతీ చిన్న అప్‌డేట్‌ కోసం ఫ్యాన్స్‌ తెగ సెర్చ్‌ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో 2023గాను నెటిజన్లు విపరీతంగా శోధించిన పలువురు టాలీవుడ్‌ హీరోల జాబితా బయటకొచ్చింది. వారిలో టాప్‌-10 హీరోలు ఎవరు? వారు ఏ కారణం చేత ఎక్కువగా శోధించబడ్డారు? వంటి విశేషాలను ఈ కథనంలో చూద్దాం.&nbsp; ప్రభాస్‌&nbsp; సినీ ప్రేక్షకులు ఎక్కువగా శోధించిన టాలీవుడ్‌ హీరోలలో ప్రభాస్ అగ్రస్థానంలో ఉన్నాడు. బాహుబలి తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌.. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్‌ కావడం, లేటెస్ట్‌ మూవీ సలార్‌ సైతం డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ప్రభాస్‌ ఆటోమేటిక్‌గా మోస్ట్‌ సెర్చ్‌డ్‌ హీరోగా నిలిచారు.&nbsp; జూ.ఎన్టీఆర్‌ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో జూ.ఎన్టీఆర్‌ క్రేజ్‌ అమాంతం పెరిగింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘దేవర’ సినిమా కూడా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఈ నేపథ్యంలో తారక్, ఆయన నటిస్తున్న సినిమాల గురించి ఫ్యాన్స్‌ విపరీతంగా సెర్చ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఈ జాబితాలో తారక్ రెండో స్థానంలో నిలిచాడు.&nbsp; అల్లు అర్జున్‌ పుష్ప సినిమా ద్వారా దేశంలోని సగటు సినీ ప్రేక్షకుడికి అల్లు అర్జున్‌ దగ్గరయ్యాడు. ఈ చిత్రానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా బన్నీ నిలిచాడు. అటు బన్నీ నటిస్తున్న పుష్ప-2 నుంచి పోస్టర్‌, టీజర్‌ వంటి అప్‌డేట్స్‌ రావడంతో బన్నీ మరింత పాపులర్ అయ్యాడు. అతడి గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరిచినట్లు సమాచారం. మహేష్‌ బాబు నెట్టింట ఎక్కువ మంది సెర్చ్‌ చేసిన టాలీవుడ్‌ హీరోల్లో మహేష్‌ బాబు నాల్గో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘గుంటూరు కారం’ శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పాటలు, పోస్టర్లు రిలీజ్‌ అవుతుండటంతో మహేష్‌ పేరు నెట్టింట ట్రెండింగ్‌లోకి వస్తోంది.&nbsp; రామ్‌ చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో రామ్‌చరణ్‌ యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న ‘గేమ్ ఛేంజర్‌’ సినిమాలో చెర్రీ నటిస్తున్నాడు.&nbsp; పవన్‌ కల్యాణ్‌ టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ హీరోల్లో పవన్ కల్యాణ్ ఒకరు. ఓ వైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోనూ పవన్‌ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దీంతో పవన్‌ సినిమాల గురించే కాకుండా పొలిటికల్‌గానూ ఆయన సమాచారం తెలుసుకునేందుకు ఎక్కువ మంచి సెర్చ్‌ చేస్తున్నారు.&nbsp; విజయ్‌ దేవరకొండ తెలుగులో మోస్ట్‌ పాపులర్‌ యంగ్‌ హీరోల్లో విజయ్‌ దేవరకొండ ముందు వరుసలో ఉంటాడు. అర్జున్‌ రెడ్డితో విజయ్ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇటీవల ఆయన నటించిన ఖుషి చిత్రం పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది.&nbsp; నాని నేచురల్‌ స్టార్‌ నాని గురించి కూడా 2023 ఏడాదిలో చాలా మంది సెర్చ్‌ చేశారు. ఆయన నటించిన దసరా చిత్రం ఈ ఏడాది సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇటీవల ‘హాయ్‌ నాన్న’ సినిమాతోనూ మరో విజయాన్ని నాని తన ఖాతాలో వేసుకున్నాడు.&nbsp; చిరంజీవి జయాపజాయలతో సంబంధం లేని మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న హీరోల్లో మెగాస్టార్‌ చిరంజీవి ఒకరు. ఆయన గురించి కూడా ఈ ఏడాది చాలా మంది నెటిజన్లు సెర్చ్‌ చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా హిట్‌ టాక్ తెచ్చుకుంది. ఇటీవల విడుదలైన ‘భోళా శంకర్‌’ మాత్రం ఫ్యాన్స్‌ను అకట్టుకోవడంలో విఫలమైంది. రవితేజ మాస్‌ మహారాజు రవితేజ తెలుగు స్టార్‌ హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఇటీవల ఆయన నటించిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. రవితేజ గురించి కూడా ఎక్కువ మంది శోధించారు.&nbsp;
  డిసెంబర్ 14 , 2023
  <strong>Tollywood : మీ ప్రేయసితో తప్పక చూడాల్సిన ఫీల్‌ గుడ్‌ చిత్రాలు</strong>
  Tollywood : మీ ప్రేయసితో తప్పక చూడాల్సిన ఫీల్‌ గుడ్‌ చిత్రాలు
  'ప్రేమ' అనే రెండక్షరాల పదం అప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అందుకే లవ్‌ను ఆధారంగా చేసుకొని టాలీవుడ్‌లో ఇప్పటికే వందలాది చిత్రాలు వచ్చాయి. ఇకపైనా వస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే&nbsp; చాలమంది అబ్బాయిలు తమ ప్రేయసికి ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలను చూపించేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఆ సినిమా చూస్తున్నంత సేపు హీరో, హీరోయిన్ల పాత్రల్లో తమని తాము ఊహించుకుంటారు. అటువంటి వారి కోసం You Say ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. ఫ్రెష్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రాలు యూత్‌కు చాలా బాగా నచ్చుతాయి. ముఖ్యంగా తమ గార్ల్‌ఫ్రెండ్‌తో ఈ సినిమాలు చూస్తే వారి బంధం మరింత బలపడే అవకాశముంది.&nbsp; భలే భలే మగాడివోయ్ (Bhale Bhale Magadivoy) మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేమికులకు కచ్చితంగా నచ్చుతుంది. నిజమైన ప్రేమకు ఎలాంటి అనారోగ్య సమస్యలు అడ్డురావని నిరూపించింది. ఈ సినిమాలో హీరో నాని మతిమరుపు సమస్యతో బాధపడుతుంటాడు. హీరోయిన్‌ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. చివరికీ హీరోయిన్‌ తండ్రి అతడి ప్రేమను గుర్తించి వారికి పెళ్లికి అంగీకరిస్తాడు.&nbsp; తొలి ప్రేమ (Tholi Prema) వరుణ్‌ తేజ్‌, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్.. ప్రేమికులను మెప్పిస్తుంది. లవర్స్ మధ్య ఎన్ని గొడవలు వచ్చిన అది వారి ప్రేమపై ప్రభావం చూపదని ఈ సినిమా నిరూపిస్తుంది. కొన్ని సంవత్సరాల ఎడబాటు వచ్చినప్పటికీ హీరో హీరోయిన్లు ఇద్దరూ ఒకరిపై మరొకరు ప్రేమను కోల్పోరు. ఈ సినిమా మీ ప్రేయసికి కచ్చితంగా నచ్చుతుంది.&nbsp; ఊహలు గుసగులాడే (Oohalu Gusagusalade) నాగశౌర్య, రాశి ఖన్నా జంటగా చేసిన ఈ చిత్రం.. ఒక డిఫరెంట్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో రూపొందింది. ప్రేమకు ముఖ పరిచయంతో సంబంధం లేదని మనకు సరిగ్గా మ్యాచ్‌ అయ్యే భావాలు ఎదుటి మనిషి కలిగి ఉంటే చాలని తెలియజేస్తుంది. ఇందులో హీరోయిన్‌కు ఓ వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది. హీరోయిన్‌ను ఇంప్రెస్‌ చేసేందుకు ఆ వ్యక్తికి హీరో సాయం చేస్తాడు. హీరో చెప్పించే మాటలు, రాసిన లేఖలకు హీరోయిన్‌ ఫిదా అవుతుంది. చివరికీ హీరోను పెళ్లి చేసుకుంటుంది.&nbsp; అష్టా చమ్మా (Ashta Chamma) నాని, అవసరాల శ్రీనివాస్‌, స్వాతి ప్రధాన పాత్రల్లో చేసిన ఈ చిత్రం లవర్స్‌కు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇందులో హీరోయిన్‌కు మహేష్‌ అనే పేరంటే పిచ్చి. దీంతో హీరో తన పేరు మహేష్‌ అని అబద్దం చెప్పి దగ్గరవుతాడు. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. చివరికీ వారు ఎలా ఒక్కటయ్యారు అన్నది స్టోరీ.&nbsp; అలా మెుదలైంది (Ala Modalaindi) డైరెక్టర్‌ నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మెుట్ట మెుదటి సినిమా ‘అలా మెుదలైంది’. నిత్యా మీనన్‌ ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. లవ్‌ ఫెయిల్‌ అయిన హీరో (నాని) జీవితంలోకి ఓ రోజు నిత్యా వస్తుంది. అయితే అప్పటికే ఆమెకు నిశ్చితార్థం జరుగుతుంది. నిత్యాతో పరిచయంతో నాని మళ్లీ ఆమెతో ప్రేమలో పడతాడు. మరి వీరు చివరికీ ఎలా ఒక్కటయ్యారు? అన్నది స్టోరీ. అయితే ఈ సినిమా ఆధ్యాంతం ఎంతో సరదాగా సాగిపోతుంది. క్లైమాక్స్‌లో మాత్రం కాస్త కంటతడి పెట్టిస్తుంది.&nbsp; సూర్య S/O కృష్ణన్ (Surya S/o Krishnan) హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.&nbsp; మజిలి (Majili) తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.&nbsp; ఓకే బంగారం (Ok Bangaram) ప్రస్తుత కాలంలో డేటింగ్‌ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. దీనిని కథాంశంగా చేసుకొని దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. పెళ్లిలో కలుసుకున్న ఓ జంట ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. కొద్దికాలం పాటు సహజీవనం చేస్తారు. ఈ ప్రయాణంలో వారు ఏం గ్రహించారు. చివరికి పెళ్లి చేసుకున్నారా? లేదా? స్టోరీ. ఈ సినిమాను యూత్‌ఫుల్‌గా చాలా బాగుంటుంది.&nbsp; ఏ మాయ చేశావే (Ye Maya Chesave) తెలుగులో వచ్చిన ఎవర్‌గ్రీన్‌ ప్రేమ కథా చిత్రాల్లో ‘ఏ మాయ చేశావే’ ఒకటి. ప్రేమకు వయసుతో సంబంధం లేదని, ప్రేమికుల మధ్య ఎంత దూరం పెరిగినా లవ్‌ మాత్రం అలాగే ఉంటుందని దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ చూపించాడు. ఇందులో నాగచైతన్య, సమంత కెమెస్ట్రీ అద్భుతంగా అనిపిస్తుంది. ఈ సినిమా ద్వారానే వీరికి పరిచయమై చివరికీ పెళ్లి కూడా చేసుకున్నారు.&nbsp;&nbsp; పెళ్లి చూపులు (Pelli Chupulu) తరుణ్‌ భాస్కర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతు వర్మ జంటగా చేశారు. పెళ్లిచూపులకు వెళ్లిన విజయ్‌ను రీతు రిజెక్ట్ చేస్తుంది. అయినప్పటికీ హీరో ఆమె ఫుడ్‌ బిజినెస్‌లో భాగమై సక్సెస్‌ చేస్తాడు. ఈ ప్రయాణంలో వారు ప్రేమలో పడి ఒక్కటవుతారు. ఈ సినిమా మీ ప్రేయసితో గనక చూస్తే ఆమె కచ్చితంగా థ్రిల్ అవుతుంది.&nbsp; సీతారామం (Sita ramam) 2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్‌ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్‌ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది. రీసెంట్‌గా వచ్చిన చిత్రాల్లో సూపర్‌ క్లాసిక్‌ మూవీగా దీన్ని చెప్పవచ్చు.&nbsp; హాయ్‌ నాన్న (Hi nanna) ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది. తెలుగులో కచ్చితంగా చూాడాల్సిన చిత్రాల్లో హాయ్‌ నాన్న తప్పకుండా ఉంటుంది.&nbsp; మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (Malli Malli Idi Rani Roju) రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్‌. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.&nbsp; ఓయ్‌ (Oye) బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు. నిన్నే పెళ్లాడతా (Ninne Pelladatha) కృష్ణ వంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘నిన్నే పెళ్లడతా’ చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సినిమాను యూట్యూబ్‌లో చూసేవారు చాలా మందే ఉన్నారు. కథలోకి వెళ్తే.. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు. రాజా రాణి (Raja Rani) ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు. జాను (Jaanu) శర్వానంద్‌, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్‌ లవ్‌ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్‌ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్‌ టూ గెదర్‌ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు.&nbsp; గోదావరి (Godavari) శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో 2006లో వచ్చిన ఈ చిత్రం.. ఎన్నిసార్లు చూసిన అసలు బోర్‌ కొట్టదు. హీరో సుమంత్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా గోదావరి నిలిచింది. ఇందులో పాటలు, కమలని ముఖర్జీ నటన మెప్పిస్తుంది. మీ ప్రేయసిలో మీరు కోరుకునే లక్షణాలన్ని కమలిని ముఖర్జీలో ఉంటాయి. కథ ఏంటంటే.. ఉన్నత ఆదర్శాలు ఉన్న శ్రీరామ్ తన మరదలు రాజీని ప్రేమిస్తాడు. కానీ రాజీ తండ్రి ఆమె పెళ్లిని ఒక IPS అధికారితో నిశ్చయిస్తాడు. దీంతో ఆ బాధను మరిచిపోయేందుకు శ్రీరామ్ గోదావరి నదిపై విహారయాత్రకు వెళ్తాడు. ఈ ప్రయాణంలో సీత అనే యువతితో స్నేహం అతని జీవితాన్ని మార్చేస్తుంది. ఆనంద్‌ (Anand) ఈ ఫీల్‌గుడ్‌ మూవీ కూడా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిందే. ఈ సినిమా చాలా మందికి ఫేవరేట్‌గా ఉంది. ఈ మూవీ ప్లాట్‌ ఏంటంటే.. రూప కుటుంబం కారు ప్రమాదంలో మరణించిన తర్వాత, ఆమె ఆత్మగౌరవంతో స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తుంది. ఆనంద్ అనే ధనవంతుడు ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు.
  మార్చి 22 , 2024
  Mrunal Thakur: సీతారామం బ్యూటీకి తెలుగు కష్టాలు.. భాషపై పట్టుకోసం శ్రమిస్తున్న మృణాల్‌ ఠాకూర్‌..!
  Mrunal Thakur: సీతారామం బ్యూటీకి తెలుగు కష్టాలు.. భాషపై పట్టుకోసం శ్రమిస్తున్న మృణాల్‌ ఠాకూర్‌..!
  సీతారామం సినిమాతో నటి మృణాల్‌ ఠాకూర్ రాత్రికి రాత్రే స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ఆమెకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో ఈ మరాఠీ బ్యూటీకి తెలుగు నేర్చుకోవడం తప్పనిసరిగా మారిపోయింది. దీంతో ఈ భామ తెలుగు భాషపై ఫోకస్‌ పెట్టింది. మృణాల్‌ తెలుగు నేర్చుకునేందుకు ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ క్లాసులకు అటెండ్‌ ‌అవుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు టీచర్‌ను ఏర్పాటు చేసుకొని భాషపై పట్టు సాధించేందుకు ఆమె యత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ల్యాప్‌టైప్‌ ముందు తెలుగుతో ఈ భామ కుస్తీ పడుతున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1701561309178081571 నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘హాయ్ నాన్న’ చిత్రంలో మృణాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.&nbsp; కొన్నిరోజుల క్రితం నాని పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘సమయమా’ అనే సాంగ్‌ కూడా రిలీజ్‌ కాబోతోంది. ఈ పాట లిరికల్‌ వీడియోను సెప్టెంబర్‌ 16న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ఓ పోస్టర్‌ ద్వారా తెలిపారు.&nbsp; https://twitter.com/VyraEnts/status/1702193014792388866 విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ‘VD 13’ మూవీలో కూడా మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా చేస్తోంది. రెండు పెద్ద చిత్రాలు చేతిలో ఉండటంతో లాంగ్వేజ్‌ ప్రాబ్లమ్‌ రాకుండా మృణాల్‌ జాగ్రత్త పడుతోంది. ఎలాగైన తెలుగు నేర్చుకొని టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఈ బ్యూటీ భావిస్తోంది అటు చిరంజీవితోను కలిసి నటించే ఛాన్స్‌ను ఈ&nbsp; భామ కొట్టెసినట్లు వార్తలు వస్తున్నాయి.&nbsp; ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ.. చిరుతో 157వ చిత్రాన్ని చేయనున్నారు. ఇందులో హీరోయిన్‌ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందని, ఆ క్యారెక్టర్‌కు మృణాల్‌ అయితేనే సరిగ్గా సరిపోతుందని చిత్ర యూనిట్‌ భావిస్తోందట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; టెలివిజన్ తెరపై సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్.. మరాఠి సినిమా ‘విట్టి దండు’తో వెండితెర ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత మరాఠీతో పాటు హిందీ సినిమాల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.&nbsp; సీతారామం తర్వాత మృణాల్ ఈ యేడాది అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సెల్ఫీ’తో ఆడియన్స్‌ను పలకరించింది. ఈ సినిమా మలయాళీ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్‌కు రీమేక్‌గా వచ్చింది. ఈ సినిమా టాక్ బాగానే ఉన్న కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఈ సినిమాతో అక్షయ్ కుమార్ స్టార్‌డమ్‌పై అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేసాయి.&nbsp; మృణాల్‌కు తెలుగుతో పాటు తమిళం, మలయాళం ఇండస్ట్రీల నుంచి కూడా ఎన్నో ఆఫర్లు వస్తున్నాయట. అక్కడ అరంగేట్రానికి మంచి కథ కోసం ఈ భామ వెతుకుతోందట. మృణాల్‌ త్వరలోనే తన తమిళం లేదా మలయాళీ సినిమా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ తమిళ హీరో సూర్య మూవీలో మృణాల్‌కు ఓ&nbsp; కీలక పాత్ర ఆఫర్ చేసినట్లు పుకార్లు ఉన్నాయి.&nbsp;
  సెప్టెంబర్ 14 , 2023
  Rakul Preet Singh: గడ్డకట్టించే నీటిలో బికినితో రకుల్ ఐస్ బాత్.. వీడియో వైరల్
  Rakul Preet Singh: గడ్డకట్టించే నీటిలో బికినితో రకుల్ ఐస్ బాత్.. వీడియో వైరల్
  యంగ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. తన గ్లామర్‌ షోను మరింత పెంచింది. బికిని డ్రెస్‌లో తన హాట్‌ హాట్‌ అందాలను చూపించి కుర్రకారును ఉర్రూతలూగించింది.&nbsp; https://twitter.com/FilmsLoveLife/status/1654814001186983937 మైనస్‌ 15 డిగ్రీల ఎముకలు కొరికే చలిలో రకుల్‌ ఐస్‌ బాత్‌ చేసింది.&nbsp; గడ్డకట్టిన మంచు మధ్యలో ఉన్న నీటిలో కాసేపు మునిగింది.&nbsp; https://twitter.com/PavaNTRRR/status/1654834348858949633 రకుల్‌ ఈ వీడియోకు ‘క్రియో ఇన్‌ మైనస్‌ 15 డిగ్రీస్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో ఆమె క్రియోథెరపీ చేయించుకుంటుందోని.. అందుకే ఈ ఫీట్‌ చేసిందని నెటిజన్లు అనుకుంటున్నారు. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న రకుల్‌ తన సొగసైన నడుమును చూపించి మతిపొగొట్టింది.&nbsp; వంపులు తిరిగిన నడుమును చూసిన నెటిజన్లు రకుల్‌ పిచ్చెక్కిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. గిల్లీ అనే కన్నడ చిత్రం ద్వారా రకుల్‌ సినీరంగంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమా ఫ్లాప్‌ కావడంతో రకుల్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు.&nbsp; ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్‌.. ఆ సినిమా హిట్‌తో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.&nbsp; లౌక్యం, కరెంట్‌ తీగ, పండగ చేస్కో, కిక్‌ 2, బ్రూస్‌లీ వంటి వరుస సినిమాల్లో నటించింది. అయితే అవి పెద్దగా హిట్‌ కాకపోవడంతో రకుల్‌ కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది.&nbsp; అయితే, ఆ తర్వాత వచ్చిన నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ వంటి సినిమాలు సూపర్‌ హిట్ సాధించడంతో టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా రకుల్‌ గుర్తింపు తెచ్చుకుంది.&nbsp; ప్రస్తుతం బాలీవుడ్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టిన రకుల్‌.. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ఇటీవల కట్‌పుట్‌లి డాక్టర్‌ G, థ్యాంక్‌ గాండ్‌, ఛత్రివలి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.&nbsp; కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఇండియన్‌ 2’ సినిమాలో రకుల్‌ నటిస్తోంది. అలాగే హీరో శివ కార్తికేయ సరసన ‘అయాలన్‌’ అనే సైంటిఫిక్‌ మూవీలోనూ ఈ భామ చేస్తోంది.
  మే 08 , 2023
  TABU: సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న టబు హాట్‌ ఫొటోలు, వీడియోలు! ఎందుకంటే???
  TABU: సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న టబు హాట్‌ ఫొటోలు, వీడియోలు! ఎందుకంటే???
  ‘టబు’.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకూ ఎన్నో చిత్రాల్లో నటించిన టబు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. ఏజ్‌ జస్ట్‌ నంబర్ మాత్రమే అన్నట్లుగా నడి వయసులోనూ టబు వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు.  ఇదిలా ఉంటే iగత వారం రోజులుగా టబు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నారు. టబు హాట్‌ లుక్స్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలను నెటిజన్లు తెగ షేర్‌ చేస్తున్నారు. ఆహా ఏమి అందం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం టబు గ్లామర్‌ ఫొటోలు, వీడియోలు ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తున్నాయి. https://twitter.com/tabbu_rs/status/1637332351440285701 https://twitter.com/i/status/1637660529652273152 https://twitter.com/i/status/1640567457340596226 https://twitter.com/i/status/1639930741281652766 https://twitter.com/i/status/1640312378113024001 టబు నటించిన లేటెస్ట్‌ బాలీవుడ్‌ మూవీ ‘బోళా’ చిత్రం ఇవాళే విడుదలైంది. కార్తి నటించిన ఖైదీ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా వచ్చింది. ఇందులో అజయ్‌ దేవగన్‌ హీరోగా నటించగా.. పవర్‌ఫుల్‌ ఐపీఎస్ అధికారిణిగా టబు కనిపించింది.&nbsp; డయనా జోసెఫ్‌ పాత్రలో టబు నటన ఆకట్టుకున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇటీవలే ‘కుత్తే‘ వెబ్‌సిరీస్‌లోనూ టబు నటించారు. ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.&nbsp; గతేడాది టబు చేసిన రెండు బాలీవుడ్‌ సినిమాలు ‘భూల్ భులయ్యా 2’, ‘దృశ్యం 2’ సూపర్‌హిట్‌గా నిలిచాయి. భూల్ భులయ్యా 2 లో ద్విపాత్రిభినయం చేసిన టబు ప్రేక్షకుల మన్ననలు పొందారు. దయ్యం పాత్రలో కనిపించి భయపెట్టారు.  దృశ్యం 2 లోనూ అజయ్‌దేవగణ్‌ భార్యగా నటించి ప్రశంసలు అందుకున్నారు.  టాలీవుడ్‌ నిన్నటి తరం హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌ల సూపర్‌ హిట్‌ సినిమాల్లో టబు నటించారు. ఆ తర్వాత టాలీవుడ్‌కు కొంచెం గ్యాప్‌ ఇచ్చారు. &nbsp;మళ్లీ 2020లో అలా వైకుంఠపురం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను టబు పలకరించారు. ఇందులో టబు నటన సినిమాకు చాలా బాగా ప్లస్ అయింది.&nbsp;
  మార్చి 30 , 2023
  NABHA NATESH: వైట్‌ స్కర్ట్‌లో ఇస్మార్ట్‌ బ్యూటీ ఎద అందాల విందు
  NABHA NATESH: వైట్‌ స్కర్ట్‌లో ఇస్మార్ట్‌ బ్యూటీ ఎద అందాల విందు
  ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతో ఒక్కసారిగా ఇస్మార్ట్‌ బ్యూటీగా కుర్రాళ్ల గుండెల్లోకి దూసుకెళ్లిన అందాల తార నభా నటేశ్‌. కన్నడ సినిమాతో వెండతెరపైకి అడుగుపెట్టినా తన క్యూట్‌ లుక్స్‌తో టాలివుడ్‌లో తనకంటూ మంచి క్రేజ్‌ తెచ్చుకుంది.&nbsp; సినిమాల్లో హాట్‌ అండ్‌ క్యూట్‌ లుక్స్‌తో కట్టిపడేసే ఈ భామ సోషల్‌ మీడియాలోనూ తన సొగసులతో సెగలు పుట్టిస్తోంది. నిత్యం కొత్త కొత్త ఫోటో షూట్‌లతో కుర్రాళ్ల హృదయాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తాజాగా వైట్‌ స్కర్ట్‌లో ఈ భామ పోస్ట్‌ చేసిన ఫోటోలు చూసి ఆమె అభిమానులు మతులు పోగొట్టుకుంటున్నారు. నభా నటేశ్‌ తొలుత ‘వజ్రకాయ’ అనే కన్నడ సినిమాతో 2015లో&nbsp; వెండితెరపైకి అడుగుపెట్టింది. అందులో పటాకా పార్వతిగా ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఏడాది గ్యాప్‌ తర్వాత 2017లో మళ్లీ లీ, సాహెబా అనే రెండు కన్నడ సినిమాల్లో మెరిసింది. 2018లో తన తొలి తెలుగు సినిమా ‘నన్ను దోచుకుందువటే’ రిలీజ్‌ అయింది. సినిమాల పిచ్చి ఉన్న మేఘన క్యారెక్టర్‌లో నభా అదరగొట్టింది. 2018లోనే రవిబాబు నటించిన కామెడీ సినిమా ‘అదుగో’లోనూ నటించి మెప్పించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు.&nbsp; పూరీ కమ్‌బ్యాక్‌ మూవీ ఇష్మార్ట్‌ శంకర్‌తో నభా నటేశ్ దశ తిరిగింది. అందులో వరంగల్‌ పిల్ల చాందినీగా నభాకు జనం ఫిదా అయ్యారని చెప్పొచ్చు.&nbsp; 2020లో డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్‌, 2021లో అల్లుడు అదుర్స్‌, మేస్ట్రో సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం అంతగా అవకాశాల్లేకపోయినా సోషల్‌ మీడియాలో మాత్రం అలరిస్తోంది.
  మార్చి 28 , 2023
  Rajamouli vs Sukumar: ఆ విషయంలో రాజమౌళిపై సుకుమార్‌దే పైచేయి.. తగ్గేదేలే!
  Rajamouli vs Sukumar: ఆ విషయంలో రాజమౌళిపై సుకుమార్‌దే పైచేయి.. తగ్గేదేలే!
  టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ అనగానే ముందుగా మనకు దర్శకధీరుడు రాజమౌళినే గుర్తుకువస్తాడు. RRR చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ఆస్కార్‌ రేంజ్‌కు తీసుకెళ్లాడు రాజమౌళి. అటువంటి రాజమౌళి ఓ విషయంలో విఫలమయ్యాడు. తన దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన వారిని టాప్‌ డైరెక్టర్స్‌గా తీర్చిదిద్దలేకపోయాడు. ఈ విషయంలో డైరెక్టర్‌ సుకుమార్ సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. సుకుమార్‌ దగ్గర దర్శకపాఠాలు నేర్చుకున్న కొందరు డైరెక్టర్లు హిట్‌ సినిమాలతో తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఆ డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. సుకుమార్‌ ఆసిస్టెంట్&nbsp; డైరెక్టర్లు: శ్రీకాంత్‌ ఓదెల(srikanth odela) టాలీవుడ్‌లో ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల పేరు మార్మోగుతోంది. డైరెక్టర్‌గా చేసిన తొలి సినిమాతోనే శ్రీకాంత్‌ బాక్సాఫీసును బద్దలు కొట్టాడు. నానితో చేసిన ‘దసరా’( DASARA ) సినిమాను రూ.100 కోట్ల క్లబ్‌లో చేర్చాడు. అయితే శ్రీకాంత్‌ ఈ సినిమాకు ముందు వరకు సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాల సక్సెస్‌కు తనవంతు సాయం చేశాడు.&nbsp; శ్రీకాంత్‌ ఓదెల లేకుండా రంగస్థలం ఇంత బాగా వచ్చేది కాదని ఓ సందర్భంలో సుకుమార్‌ చెప్పారంటే ఈ డైరెక్టర్‌ టాలెంట్‌ అర్థమవుతోంది. https://telugu.yousay.tv/srikanth-odela-went-around-sukumars-house-for-4-years-for-opportunities-dussehra-director-emotional.html https://twitter.com/vamsikaka/status/1642932721612894208?s=20 బుచ్చిబాబు(Buchi Babu Sana) సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసి డైరెక్టర్‌గా ఎదిగిన వ్యక్తి బుచ్చిబాబు. తొలి సినిమా ఉప్పెనతో బుచ్చిబాబు ఓ ప్రభంజనమే సృష్టించాడు. సుకుమార్‌ నేర్పిన పాఠాలను చక్కగా అవపోసన పట్టిన ఆయన మెుదటి సినిమాతోనే తన మార్క్‌ ఏంటో చూపించాడు. అరంగేట్ర హీరో వైష్ణవ్‌ తేజ్‌, హీరోయిన్‌ కృతి శెట్టిని స్క్రీన్‌పై చక్కగా ప్రెజెంట్‌ చేశాడు. ఉప్పెన ఘనవిజయం ద్వారా రామ్‌చరణ్‌తో సినిమా చేసే ఛాన్స్‌ను బుచ్చిబాబు కొట్టేశారు. తన 16వ సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్‌ చేస్తారని స్వయంగా చరణ్‌ చెప్పే స్థాయికి ఎదిగాడు.&nbsp; పల్నాటి సూర్యప్రతాప్‌(Palnati surya pratap) సుకుమార్‌ డైరెక్షన్‌ స్కూల్‌ నుంచి వచ్చిన పల్నాటి సూర్యప్రతాప్‌ కూడా తన తొలి సినిమాతో మంచి హిట్‌ అందుకున్నాడు. కుమారి 21F చిత్రం ద్వారా తన టాలెంట్‌ ఎంటో నిరూపించుకున్నాడు. ఇటీవల హీరో నిఖిల్, హీరోయిన్‌ అనుపమ జంటగా ‘18 పేజెస్‌’ సినిమాను సూర్య తీశాడు. క్లాసిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకుంది. కాగా, సుకుమార్‌ తీసిన 1 నేనొక్కడినే, రంగస్థలం, పుష్పకు సూర్య స్క్రీన్‌ రైటర్‌గా పనిచేశాడు.&nbsp; రాజమౌళి ఆసిస్టెంట్&nbsp; డైరెక్టర్లు: (Rajamouli assistant directors) G.R కృష్ణ( GR KRISHNA ) టాలీవుడ్ డైరెక్టర్‌ G.R కృష్ణ తొలుత రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. సింహాద్రి సినిమా విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ‘ఆడు మగాడ్రా బుజ్జి’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన కృష్ణ.. ఆశించిన రేంజ్‌లో విజయాన్ని అందుకోలేకపోయాడు. ఆ తర్వాత చేసిన ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. దీంతో 2019 నుంచి టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న కృష్ణ ఇప్పటివరకూ మరో సినిమాను పట్టాలెక్కించలేదు. కరుణ కుమార్‌ ( KARUNA KUMAR) మరో టాలీవుడ్‌ డైరెక్టర్‌ కరుణ కుమార్‌ కూడా రాజమౌళి దగ్గర దర్శకత్వ పాఠాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్‌గా పలు సినిమాలు చేసి మెప్పించలేకపోయాడు. అయితే ఆయన తొలి సినిమా ‘పలాస’ హిట్‌ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద విఫలమైంది. ఆ తర్వాత తీసిన మెట్రో కథలు, శ్రీదేవి సోడా సెంటర్‌, కళాపురం వంటి సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందలేక పోయాయి.&nbsp; అశ్విన్‌ గంగరాజు (ASHWIN GANGA RAJU) డైరెక్టర్‌ అశ్విన్‌ గంగరాజు సైతం రాజమౌళి దగ్గర అసిస్టెంట్‌ డైెరెక్టర్‌గా పనిచేశాడు. ఈగ, బాహుబలి-1, బాహుబలి-2 విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 2021లో ‘ఆకాశవాణి’ చిత్రం ద్వారా అశ్విన్‌ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. రాజమౌళి హీరోలకూ ఫ్లాపుల బెడద..! రాజమౌళి శిష్యులే కాదు ఆయనతో సినిమా తీసిన హీరోలు సైతం తమ తర్వాతి సినిమాల్లో ఫెయిల్‌ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.&nbsp; జూ. NTR రాజమౌళి తన మెుదటి సినిమా ‘స్టూడెంట్‌ నెం.1’ను ఎన్టీఆర్‌తో తీశారు. అది సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్‌ చేసిన ‘సుబ్బు’ సినిమా ఫ్లాప్‌ అయింది. మళ్లీ ఎన్టీఆర్‌తో ‘సింహాద్రి’ సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. అది కూడా ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్‌ తీసిన ‘ఆంధ్రావాల’ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. మరోమారు ఎన్టీఆర్‌తోనే రాజమౌళి యమదొంగ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ వెంటనే ఎన్టీఆర్‌ చేసిన కంత్రి సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.&nbsp; ప్రభాస్‌ 2005లో రాజమౌళి ప్రభాస్‌తో ఛత్రపతి సినిమా తీశారు. అది ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత ప్రభాస్‌ తీసిన పౌర్ణమి చిత్రం ఫ్లాప్‌ అయ్యి ప్రభాస్‌ను నిరాశ పరిచింది.&nbsp; ఛత్రపతి తర్వాత ప్రభాస్‌తో కలిసి బాహుబలి, బాహుబలి 2 సినిమాలను రాజమౌళి తీశారు. ఆ రెండు సినిమాలు టాలీవుడ్‌ రేంజ్‌ అమాంతం పెంచేశాయి. ప్రభాస్‌ను పాన్‌ఇండియా స్టార్‌గా నిలబెట్టాయి. కానీ, ఆ సినిమాల తర్వాత ప్రభాస్‌ చేసిన సాహో, రాధేశ్యామ్‌ సినిమాలు ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ముందు రామ్‌చరణ్‌తో ‘మగధీర’ సినిమాను రాజమౌళి తీశారు. 2009లో వచ్చిన ఈ సినిమా సిల్వర్‌ స్క్రీన్‌ను షేక్‌ చేసింది. ఆ తర్వాత 2010లో రామ్‌చరణ్‌ తీసిన ఆరెంజ్‌ సినిమా దారుణంగా విఫలమైంది.&nbsp; రాజమౌళితో మర్యాదరామన్న చేసిన సునీల్ కూడా ఆ సినిమా తర్వాత సరైన సక్సెస్‌ రాక ఇబ్బందులు పడ్డాడు. అటు నాని సైతం రాజమౌళి తీసిన ‘ఈగ’ సినిమా తర్వాత ఫ్లాప్‌ అందుకున్నాడు. నాని, సమంత జంటగా వచ్చిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ మూవీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది.&nbsp;
  ఏప్రిల్ 06 , 2023
  Rashi Singh: రాశి సింగ్‌ గురించి టాప్ సీక్రెట్స్ మీకోసం!
  Rashi Singh: రాశి సింగ్‌ గురించి టాప్ సీక్రెట్స్ మీకోసం!
  యంగ్‌ హీరోయిన్‌ రాశి సింగ్‌ (Rashi Singh).. ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ (Bhoothaddam Bhaskar Narayana) సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా తన అంద చందాలతో మతి పోగొడుతూ నెటిజన్లకు హాట్‌ ట్రీట్‌ ఇస్తోంది. ఎద, నాభి సోయగాలను చూపిస్తూ కుర్రకారుకి వలపు వల విసురుతోంది. దీంతో ఈ భామ గురించి తెలుసుకునేేందుకు ప్రతీ ఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో రాశి సింగ్‌ సినిమాలతో పాటు ఆమె ఇష్టా ఇష్టాలు, ఆసక్తులు వంటివి ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; రాశి సింగ్‌ పుట్టిన రోజు ఎప్పుడు?&nbsp; రాశి సింగ్.. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో జనవరి 5, 1994లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు రమేష్‌ సింగ్‌, సరితా సింగ్‌. రాశికి ఓ సోదరుడు కూడా ఉన్నాడు. అతడి పేరు సౌరభ్‌ సింగ్‌.&nbsp; రాశి సింగ్‌ విద్యాభ్యాసం ఎక్కడ? ఈ భామ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌ పట్టణంలో గల క్రిష్ణ పబ్లిక్‌ స్కూల్‌లో జరిగింది. ఆ తర్వాత ముంబయిలో ఉన్నత విద్యను అభ్యసించింది.&nbsp; View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) రాశి సింగ్‌ కెరీర్‌ ఎలా మెుదలైంది? ఈ భామ కెరీర్‌లో ప్రారంభంలో ఎయిర్‌ హోస్టేస్‌ (Air Hostess)గా పని చేసింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌&nbsp; (Indigo Airlines) విధులు నిర్వర్తించింది. మోడలింగ్‌లోనూ ఈ భామకు ప్రవేశం ఉంది.&nbsp; రాశి సింగ్‌ వయసు ఎంత? రాశి సింగ్‌ జనవరి 5, 1994లో జన్మించినందున ప్రస్తుతం ఆమె వయసు 30 సంవత్సరాలు.&nbsp; రాశి సింగ్‌ ఎత్తు, బరువు ఎంత?&nbsp; రాశి సింగ్‌ 5.5 అంగుళాల ఎత్తు, 55 కేజీల బరువు కలిగి ఉంది. ఈ&nbsp; భామ బాడీ కొలతలు 32-26-34. రాశి సింగ్‌ సినిమాలపై ఆసక్తి ఎలా ఏర్పడింది? చిన్నప్పటి నుంచి రాశి సింగ్‌కు సినిమాలపై ఆసక్తి ఉండేదట. హీరోయిన్ కావాలని చిన్నప్పుడే నిర్ణయించుంది.&nbsp; ఎంతో హార్డ్‌ వర్క్‌ చేసి సినిమాల్లో అవకాశం దక్కించుకుంది.&nbsp; రాశి సింగ్‌ ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు? ఎయిర్‌ హోస్టేస్‌గా ఉద్యోగం చేస్తున్న సమయంలో ఆమె ముంబయిలో ఉండేది. ప్రస్తుతం తెలుగు సినిమాలపై ఫోకస్‌ పెట్టడంతో తన మకాంను హైదరాబాద్‌కు మార్చింది.&nbsp; రాశి సింగ్‌ ఏ ఏ భాషలు మాట్లాడుతుంది? రాశి సింగ్‌ ఇంగ్లీష్‌, హిందీ బాగా మాట్లాడకలదు. టాలీవుడ్‌లో సినిమా అవకాశాలు వస్తుండటంతో తెలుగు మాట్లాడటం కూడా నేర్చుకున్నట్లు ఓ ఇంటర్యూలో ఈ బ్యూటీ చెప్పింది.&nbsp; రాశి సింగ్‌ ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు ? వైవిధ్యభరితమైన పాత్రలు చేసేందుకు రాశి సింగ్ ఆసక్తి కనబరుస్తుంది. ఒకే తరహా పాత్రలు చేయడం తనకు నచ్చదని ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చింది.&nbsp; రాశి సింగ్‌ తెలుగులో ఫేవరేట్‌ హీరో ఎవరు? రాశిసింగ్‌ ఫేవరేట్‌ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆర్య 2 చూసి ఆమె ఆయన అభిమాని అయిపోయింది. ప్రతి సినిమాలో బన్నీ వైవిధ్యం చూపిస్తుండటం రాశిసింగ్‌కు బాగా నచ్చుతుందట.&nbsp;&nbsp;&nbsp; రాశి సింగ్‌ మెుదటి సినిమా ఏది? తెలుగులో జెమ్(2019) చిత్రం ద్వారా రాశి సింగ్ వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పోస్టర్, రీసౌండ్ వంటి చిన్నా చితక సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు లభించలేదు. రాశి సింగ్‌ గుర్తింపు తెచ్చిన చిత్రం? ఈ ముద్దుగుమ్మ తాజాగా నటించిన ‘భూతద్దం భాస్కర్ నారాయణ' చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో రాశి సింగ్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆమెపై దర్శక నిర్మాతల దృష్టి పడింది.&nbsp; రాశి సింగ్‌ మద్యం సేవిస్తుందా? లేదు. రాశి సింగ్‌ సిగరేట్‌ దాగుతుందా? లేదు. రాశి సింగ్‌ మాంసాహారం తింటుందా? అవును. రాశి సింగ్‌ చికెన్‌, మటన్‌తో చేసిన నాన్‌ వెజ్‌ వంటకాలను చాలా ఇష్టంగా లాగించేస్తుందట.&nbsp; ఇన్‌స్టాగ్రామ్ ఖాతా లింక్‌? https://www.instagram.com/rashi.real/?hl=en ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు? ఇన్‌స్టాలో ఈ సుందరాంగికి 1మిలియన్‌కు దగ్గర్లో ఫాలోవర్లు ఉన్నారు.
  మార్చి 05 , 2024
  Prabhas: 9 పార్టులుగా ‘కల్కీ 2898AD?... ఇక హాలీవుడ్‌ పని అయినట్లే!
  Prabhas: 9 పార్టులుగా ‘కల్కీ 2898AD?... ఇక హాలీవుడ్‌ పని అయినట్లే!
  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంపై అంచనాలు చాలా హైరేంజ్‍లో ఉన్నాయి. గ్లోబల్ రేంజ్‍లో ఈ చిత్రం రిలీజ్ కానుండటంతో హాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జానర్‌లో దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) దీనిని తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్‍, అబ్బుపరిచేలా గ్రాఫిక్స్‌తో ఈ మూవీ రూపొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సంచలన వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ బజ్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; 9 పార్ట్‌లుగా కల్కీ! ‘కల్కీ 2898 ఏడీ’ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. హీరో ప్రభాస్‌ తన ఫోకస్‌ మెుత్తం ఈ చిత్రంపైనే పెట్టాడు. అయితే ఈ సినిమాపై వచ్చిన లేటెస్ట్ బజ్‌ ప్రకారం ‘కల్కీ 2898 ఏడీ’ 9 భాగాలుగా రానున్నట్లు తెలిసింది. ఈ సినిమా కథను ఒక పార్ట్‌తో చెప్పటం సాధ్యం కాదని, బలమైన కథ ఉండటంతో దానిని ప్రేక్షకుల వద్దకు చేర్చేందుకు కనీసం 9 పార్ట్స్‌గా తీయాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇదే నిజమైతే హాలీవుడ్‌ను మించిన క్రేజ్‌ టాలీవుడ్‌కు దక్కుతుందని విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.&nbsp; https://twitter.com/MilagroMovies/status/1759613635327107364 ‘నేను ప్రభాస్‌కు పెద్ద ఫ్యాన్‌’ డార్లింగ్ ప్రభాస్‌కు సాధారణ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీల్లోనూ వీరాభిమానులు ఉన్నారు. చాలా మంది సెలబ్రిటీలు ఈ విషయాన్ని పలు వేదికలపై వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మెగా హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) ప్రభాస్‌పై తనకున్న అభిమాన్ని చాటుకున్నాడు. మెగా హీరోల తర్వాత తనకు నచ్చిన కథానాయకుడు ప్రభాస్ అని వరుణ్‌ తెలిపాడు. సూపర్ స్టార్ కావాలని ప్రభాస్ ఎప్పుడు అనుకోలేదని.. అతడి శ్రమ, కృషి డార్లింగ్‌ను ఈ స్థాయికి చేర్చాయని ప్రశంసించాడు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1759574622213947537 షమీ ఫేవరెట్‌ స్టార్లు వీరే టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ (Mohammed Shami) కూడా తాజాగా ఇచ్చిన ఇంటర్యూలో తాను ప్రభాస్‌ ఫ్యాన్‌ అంటూ ప్రకటించాడు. సౌత్‌ ఇండియాలో మీకు నచ్చిన స్టార్స్ ఎవరని షమీని జర్నలిస్టు ప్రశ్నిస్తుంది. ఇందుకు షమీ సమాధానం ఇస్తూ.. సౌత్‌ సినిమాలు చాలా బాగుంటాయని.. తనకు ప్రభాస్‌తో పాటు జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) ఫేవరేట్ అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను కూడా ప్రభాస్‌, తారక్‌ ఫ్యాన్స్ తెగ వైరల్‌ చేస్తున్నారు. https://twitter.com/i/status/1759506059331338533 ఛత్రపతి శివాజీగా ప్రభాస్‌! మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిన్న (ఫిబ్రవరి 19) దేశ వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ మెుదలైంది. ఛత్రపతి శివాజీ బయోపిక్‌ను సినిమాగా తీస్తే ప్రస్తుత ఇండియన్‌ స్టార్‌ హీరోల్లో ఆ పాత్రకు ఎవరు సరిపోతారన్న ప్రశ్న తలెత్తింది. దీంతో మెజారిటీ నెటిజన్లు ఛత్రపతి శివాజీ పాత్రకు ప్రభాస్ అయితేనే బాగుంటుందని బదులిచ్చారు. శివాజీ పాత్రకు ప్రభాస్ ఒక్కడే ఛాయిస్ అని పేర్కొన్నారు. https://twitter.com/i/status/1759409716114190363 ప్రభాస్‌కు హనుమాన్‌ ఎలివేషన్‌ ప్రస్తుతం ప్రభాస్‌కు సంబంధించిన సమాచారం #Prabhas హ్యాష్‌ట్యాగ్‌తో నెట్టింట వైరల్‌ అవుతోంది. ముఖ్యంగా ప్రభాస్‌కు సంబంధించిన ఓ ఎడిటింగ్‌ వీడియో ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. హనుమాన్‌ సినిమాలో ఆంజనేయుడి శక్తిని వివరిస్తూ నటుడు సముద్రఖని చెప్పే డైలాగ్‌ను ఆ వీడియోలో ప్రభాస్‌కు ‌అన్వయించారు. బాహుబలి చిత్రంలో ప్రభాస్‌కు సంబంధించిన సన్నివేశాలను సముద్రఖని డైలాగ్స్‌కు మ్యాచ్‌ చేస్తూ వీడియోను ఎడిట్‌ చేశారు.&nbsp; https://twitter.com/i/status/1759832540071027104 మే 9న ఫ్యాన్స్‌కు పండగే ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మే 9వ తేదీన గ్లోబల్ రేంజ్‌లో విడుదల కాబోతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్‍తో పాటు మరికొన్ని విదేశీ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ మూవీ గ్లింప్స్ గతేడాది సాని డిగో కామిక్ కాన్ ఈవెంట్‍ (San Diego Comic-Con 2023)లో లాంచ్ అయింది. ఈ ఈవెంట్‍లో అడుగుపెట్టిన తొలి భారతీయ చిత్రంగా కల్కి రికార్డు సృష్టించింది. అప్పటినుంచి మూవీపై హాలీవుడ్‍‍లో కూడా క్రేజ్ ఉంది. ఈ మూవీలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, తమిళ స్టార్ కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్, దిశా పటానీ కీలకపాత్రలు చేస్తున్నారు.
  ఫిబ్రవరి 20 , 2024

  @2021 KTree