ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Ahaఫ్రమ్
ఇన్ ( Telugu )
Watch
స్ట్రీమింగ్ ఆన్JioCinema
ఇన్ ( Hindi )
Watch
స్ట్రీమింగ్ ఆన్Prime
ఇన్ ( Telugu )
Watch
రివ్యూస్
YouSay Review
Harom Hara Movie Review: ‘హరోం హరా’లో టాప్‌లేపిన సుధీర్ బాబు.. హిట్ కొట్టాడా?
సుధీర్‌బాబు (Sudheer Babu) హీరోగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హరోం హర’ (Harom Hara). మాళవిక శర్మ హీరోయిన్. సునీల్, రవి కాలే, కేశ...read more
How was the movie?
తారాగణం
సుధీర్ బాబు
సుబ్రహ్మణ్యంమాళవిక శర్మ
దేవిజయప్రకాష్
శివా రెడ్డిసునీల్
పళని సామికేశవ్ దీపక్
రవి కాలే
బసవ రెడ్డిరాజశేఖర్ అనింగివెంకటేశులు
లక్కీ లక్ష్మణ్తమ్మి రెడ్డి
అర్జున్ గౌడశరత్ రెడ్డి
సిబ్బంది
జ్ఞానసాగర్ ద్వారకదర్శకుడు
సుమంత్ జి నాయుడునిర్మాత
చైతన్ భరద్వాజ్
సంగీతకారుడుఅరవింద్ విశ్వనాథన్సినిమాటోగ్రాఫర్
రవితేజ గిరిజాలఎడిటర్ర్
కథనాలు
Harom Hara Movie Review: ‘హరోం హరా’లో టాప్‌లేపిన సుధీర్ బాబు.. హిట్ కొట్టాడా?
నటీనటులు : సుధీర్ బాబు, మాళవిక శర్మ, జయప్రకాష్, సునీల్, అర్జున్ గౌడ, రవి కాలే తదితరులు
దర్శకత్వం : జ్ఞానసాగర్ ద్వారక
సంగీతం : చైతన్ భరద్వాజ్
ఎడిటర్ : రవితేజ గిరిజాల
నిర్మాత : సుమంత్ జి. నాయుడు
విడుదల తేదీ: 14- 05-2024
సుధీర్‌బాబు (Sudheer Babu) హీరోగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హరోం హర' (Harom Hara). మాళవిక శర్మ హీరోయిన్. సునీల్, రవి కాలే, కేశవ్ దీపక్, రాజశేఖర్ అనింగి ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాలపై అంచనాలను పెంచింది. గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న సుధీర్‌బాబు.. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. జూన్ 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. సుధీర్‌బాబుకు హిట్ అందించిందా? అతడి అంచనాలను నిలబెట్టిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
1980ల్లో ఏపీ, తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కుప్పం ప్రాంతాన్ని తమ్మిరెడ్డి, అతని సోదరుడు బసవ, కుమారుడు శరత్‌రెడ్డి తమ గుప్పెట్లో పెట్టుకుంటారు. తాము చెప్పిందే వేదం అన్నట్లు అన్యాయాలు, అరాచకాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఉద్యోగరిత్యా సుబ్రహ్మణ్యం (సుధీర్‌బాబు) ఆ ఊరికి వస్తాడు. ఓ కాలేజీలో మెకానికల్ ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ శరత్‌రెడ్డితో గొడవపడి సస్పెండ్ అవుతాడు. ఆర్థిక సమస్యల వల్ల తన మెకానికిల్ తెలివితేటలతో గన్స్ తయారు చేయాలని నిర్ణయించుకుంటాడు. తొలుత గొడవపడిన శరత్‌రెడ్డితో చేతులు కలిపి అక్రమంగా తుపాకులు చేయడం మెుదలు పెడతాడు. ఈ క్రమంలో ఒక రోజు తమ్మిరెడ్డికి ఎదురు తిరుగుతాడు. ఆ తర్వాత ఏమైంది? కుప్పం ప్రజల కోసం సుబ్రహ్మణ్యం ఏం చేశాడు? ఆ ప్రాంత ప్రజలు హీరోను ఎందుకు దేవుడిగా భావించారు? తమ్మిరెడ్డిని అతడెలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
సుబ్రహ్మణ్యం పాత్రలో.. సుధీర్‌బాబు కెరీర్ బెస్ట్ నటనతో ఆకట్టుకున్నాడు. ఎంతో కష్టమైన కుప్పం యాసలో మాట్లాడుతూ తన మార్క్ నటనతో మెప్పించాడు. యాక్షన్ సీక్వెన్స్, ఫైట్స్, డ్యాన్స్ ఇలా అన్ని రంగాల్లో ప్రతిభ చూపించాడు. ఇక అతడికి జోడీగా చేసిన మాళవిక శర్మ కూడా తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సుధీర్‌బాబుతో ఆమె కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. విలన్ పాత్రల్లో జయప్రకాశ్, రవి కాలే, అర్జున్ గౌడ మంచి ప్రభావం చూపించారు. కానిస్టేబుల్ పాత్రతో సునీల్ ఆకుట్టుకున్నాడు. అక్షర గౌడ పాత్ర చిన్నదే అయిన పోలీస్ ఆఫీసర్‌గా ఆమె మెప్పించింది. మిగిలిన పాత్రధారులు తమ తమ పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారక.. రొటిన్ స్టోరీనే సినిమాకు తీసుకున్నప్పటికీ కథనాన్ని అద్భుతంగా నడిపి మంచి మార్కులు కొట్టేశాడు. తను చెప్పాలనుకున్న పాయింట్‌ను నేరుగా చెబుతూనే స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ను కథకు జోడించారు. తొలి అర్ధభాగాన్ని చాలావరకూ పాత్రల పరిచయానికే కేటాయించిన డైరెక్టర్.. ఇంటర్వెల్ ముందుకు వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో అసలైన కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్లారు. సెకండాఫ్ నుంచి కథ వేగం పుంజుకుంటుంది. అయితే సెకండాఫ్ ఊహించే విధంగా ఉండటం కాస్త మైనస్‌గా మారింది. ఓవరాల్‌గా.. మంచి యాక్షన్ సినిమాను కోరుకునేవారికి ‘హరోం హర’ మంచి ట్రీట్ ఇస్తుందని చెప్పవచ్చు.
సాంకేతికంగా..
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువే. 1980ల నాటి కుప్పాన్ని వారు మళ్లీ రీ క్రియేట్ చేసిన తీరు ప్రశంసనీయం. అటు సినిమాటోగ్రఫీ, సంగీతం కూడా మూవీకి బాగా ప్లస్ అయ్యాయి. ఎడిటింగ్ వర్క్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు అత్యాద్భుతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
సుధీర్‌బాబు నటనయాక్షన్ సీక్వెన్స్‌ఆర్ట్ డిపార్ట్‌మెంట్, సంగీతం
మైనస్ పాయింట్స్
కథలో కొత్తదనం లేకపోవడంకానరాని మలుపులు
Telugu.yousay.tv Rating : 3/5
జూన్ 14 , 2024
Maa Nanna Super Hero: ఇదెక్కడి క్రేజీ ప్రమోషన్స్‌రా అయ్యా.. స్టార్లనే బురిడి కొట్టించారుగా!
ప్రేక్షకులకు సినిమాను చేరువ చేయడంలో ప్రమోషన్స్ కీలక భూమిక పోషిస్తాయి. ప్రచార కార్యక్రమాలు ఎంత బాగా జరిగితే సినిమాపై అంత భారీగా హైప్ వస్తుంది. ఆడియన్స్‌లో సినిమా చూడాలన్న కోరిక బలపడుతుంది. అందుకే మేకర్స్ తమ సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఆడియో ఫంక్షన్స్, ఇంటర్వూలు, సోషల్ మీడియా ప్రకటనలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన మా నాన్న సూపర్ హీరో చిత్రం ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ చేస్తోన్న వినూత్న ప్రమోషన్స్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబు అంటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
క్రేజీ ప్రమోషన్స్!
టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ యంగ్ హీరోల్లో సుధీర్ బాబు (Sudheer Babu) ఒకరు. ఇటీవల ‘హరోం హరా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ ఇప్పుడు మరో సినిమాతో ఎంటర్‌టైన్ చేసేందుకు రాబోతున్నాడు. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Super Hero) చిత్రం అక్టోబర్ 11న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ వినూత్న ప్రమోషన్స్‌కు తెర లేపింది. సినిమా బ్యానర్‌ను సిద్ధం చేసి పలువురు సెలబ్రిటీలు ఫొటోలు తీసుకుంటున్న టైమ్‌లో పోస్టర్ కనిపించేలా ప్రమోషన్స్ చేస్తోంది. యంగ్ హీరోలు వరుణ్ తేజ్, మంచు మనోజ్‌తో పాటు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ వినూత్న ప్రమోషన్స్‌లో తమకు తెలియకుండానే భాగమయ్యారు. దీంతో ఈ ప్రమోషన్స్‌కు నెట్టింట విశేష స్పందన వస్తోంది. స్టార్లను భలే బురిడి కొట్టించారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సింపుల్ అండ్ న్యాచురల్‌గా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇది సెలబ్రిటీలకు తెలిసే జరిగిందా? లేదా? అన్నది మాత్రం సస్పెన్స్.
https://twitter.com/isudheerbabu/status/1843218217977966798
https://twitter.com/i/status/1842791222047367544
https://twitter.com/i/status/1842084097621164229
అవాక్కైనా మంచు మనోజ్!
తనకు తెలియకుండానే మా నాన్న సూపర్ హీరో ప్రమోషన్స్‌లో భాగం కావడంపై మంచు మనోజ్ నెట్టింట స్పందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సుధీర్ బాబు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేయగా దానికి అయోమయంగా చూస్తున్న బ్రహ్మీ జిఫ్‌ను జత చేశాడు. స్మైలీ ఎమోజీ ట్యాగ్ చేస్తూ తాను బాగా ఎంజాయ్ చేసినట్లు సంకేతం ఇచ్చారు. దీనిపై సుధీర్ బాబు కూడా ఆసక్తికర రిప్లే ఇచ్చారు. సారి బ్రో ఇంకో ఆప్షన్ దొరకలేదు అంటూ మనోజ్‌ను ట్యాగ్ చేశాడు. మొత్తానికి మా నాన్న సూపర్ హీరో ప్రమోషన్స్ మాత్రం చాలా వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు.
https://twitter.com/HeroManoj1/status/1842102892628509031
ట్రైలర్‌పై మహేష్ ఏమన్నారంటే!
‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Super Hero Promotions) ట్రైలర్ చూసి సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా మెచ్చుకున్నట్లు నటుడు సుధీర్ బాబు తెలిపారు. ‘మహేష్ బాబు సాధారణంగా ఏదైనా ఎక్కువ ఎక్స్‌ప్రెస్ చేయరు. ఆయనకు నేను తొలుత రఫ్ కట్ ట్రైలర్ పంపిస్తే బాగుందని మెసేజ్ పెట్టారు. ఆ తర్వాత ఫైనల్ ట్రైలర్ పంపా. అది చూశాక మాత్రం చాలా మెచ్చుకున్నారు. హార్ట్ టచ్చింగ్‌గా ఉందన్నారు. ఆఖర్లో వచ్చే మహేష్ పేరున్న డైలాగ్ ఫన్నీగా ఉందన్నారు. ఇలా తన నుంచి చాలా కొత్త మాటలు విన్నా. అలా తను సినిమా గురించి అంత ఎక్కువగా మాట్లాడేసరికి మా నమ్మకం రెట్టింపయ్యింది’ అంటూ తాజా ఇంటర్వ్యూలో సుధీర్ చెప్పుకొచ్చారు.
అక్టోబర్ 08 , 2024
Latest OTT releases Telugu: ఈ వీకెండ్‌లో తప్పక చూడాల్సిన చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
ఓటీటీలో కొత్త సినిమాలు చూడాలనుకునేవారికి ఈ వారం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ దొరకనుంది. తెలుగులో చాలా చిత్రాలు ఈ వీకెండ్‌లో స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. మరికొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి వచ్చి మంచి వ్యూస్ సాధిస్తున్నాయి. కొన్ని డబ్బింగ్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సైతం మిమ్మల్ని అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి? వాటి ప్లాట్స్ ఏంటి? వంటి విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
హరోం హర (Harom Hara)
సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన 'హరోం హర' చిత్రం జూన్ 14న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదు. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. ఆహా వేదికగా జూలై 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అటు జులై 18 నుంచి ఈటీవీ విన్‌లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రానుంది. ప్లాట్ ఏంటంటే.. 'కుప్పం అనే ప్రాంతానికి బతుకు తెరువు కోసం వచ్చిన సుబ్రహ్మణ్యం అనే యువకుడు.. అక్కడ అరాచకం సృష్టిస్తున్న ఇద్దరు అన్నదమ్ముల ముఠాను ఎలా ఎదుర్కొన్నాడు? ఆ ప్రాంతానికి దేవుడిగా ఎలా మారాడు?' అన్నది కథ.
ది గోట్ లైఫ్ (ఆడు జీవితం)
సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం). ఈ సినిమాకు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహించగా అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్ కీలక పాత్రలు పోషించారు. సర్వైవల్ అడ్వెంచర్‌గా వచ్చిన ఈ చిత్రం మార్చి 28న విడుదలై ఘన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కాగా, ఈ చిత్రం జూలై 19 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ప్రసారం కానుంది. ప్లాట్ ఏంటంటే.. ‘నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా?’ అన్నది కథ
మ్యూజిక్ షాప్ మూర్తి (Music Shop Murthy)
అజయ్ ఘోష్ (Ajay ghosh) టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి (Music Shop Murthy). శివ పాలడుగు (Siva Paladugu) దర్శకత్వం వహించిన ఈ మూవీ రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. ఈటీవీ విన్ (ETV Win) వేదికగా జులై 16 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో హీరోయిన్ చాందిని చౌదరి కీలక పాత్ర పోషించింది. ప్లాట్ ఏంటంటే.. 'మూర్తి (అజయ్ ఘోష్).. 52 ఏళ్ల వయసులో మ్యూజిక్ షాప్ నడుపుతుంటాడు. అయితే మూర్తికి డీజే అవ్వాలన్న కోరిక ఉంటుంది. డీజేలో శిక్షణ పొందిన అంజన (చాందిని చౌదరి).. ఓ కారణం చేత మూర్తిని కలుస్తుంది. అతడి ఆసక్తిని గమనించి డీజే నేర్పిస్తుంది. అలా సిటీకి వచ్చిన మూర్తి.. డీజేగా సక్సెస్ అయ్యాడా? ఈ క్రమంలో అతడు పడ్డ కష్టాలేంటి?’ అన్నది కథ.
బూమర్ అంకుల్ (Boomer Uncle)
తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు (Yogi Babu) ప్రధాన పాత్రలో చేసిన చిత్రం 'బూమర్ అంకుల్'. ఇందులో ఓవియా, రోబో శంకర్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. స్వదీస్ ఎమ్.ఎస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చిలో థియేటర్లలో విడుదలైంది. ఈ నెల 20 నుంచి ఆహా వేదికగా తెలుగులో స్ట్రీమింగ్‌కు రానుంది. ప్లాట్ ఏంటంటే.. 'నేసమ్ (యోగిబాబు), విదేశీ యువతి అమీ (ఓవియా)ని పెళ్లి చేసుకుంటాడు. ఓ కారణం చేత భార్య నుంచి విడాకులు తీసుకోవాలని అనుకుంటాడు. ఓ షరతుపై అందుకు అమీ అంగీకరిస్తుంది. ఆ కండిషన్ ఏంటి? విడాకులు ఎందుకు కోరుకున్నాడు?’ అన్నది స్టోరీ.
హాట్‌స్పాట్ (Hotspot)
గౌరీ జీ. కిషన్, ఆదిత్య భాస్కర్, సాండీ, అమ్ము అభిరామ్, జనని, సుభాష్, కలైయారాసన్, సోఫియా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'హాట్‌స్పాట్'. మార్చి 29న తమిళంలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా జులై 17న ఆహా (Aha) వేదికగా తెలుగులో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఆంథాలజీ నేపథ్యంలో నాలుగు కథల సమాహారంగా ఈ సినిమా రూపొందింది. ప్లాట్ ఏంటంటే 'నలుగురు యువతులు వారి భాగస్వాముల చుట్టూ కథ నడుస్తుంది. వారి రిలేషన్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? వాటి నుంచి ఆ జంట ఎలా బయటపడింది? అన్నది స్టోరీ.
నాగేంద్రన్స్ హనీమూన్ (Nagendran's Honeymoons)
నేషనల్ అవార్డ్ విన్నర్ సూరజ్ వెంజరమూడ్ (Suraj Venjaramoodu) ప్రధాన పాత్రలో నటించిన మలయాళ వెబ్ సిరీస్ ‘నాగేంద్రన్స్ హనీమూన్’. దీనికి ‘1 జీవితం 5 గురు భార్యలు’ అనేది ఉపశీర్షిక. ఐదుగురు భార్యలతో భర్త హనీమూన్‌కు వెళ్లడం అనే కాన్సెప్టుతో డార్క్ కామెడీగా ఈ సిరీస్ రూపొందింది. జులై 19 నుంచి హాట్‌స్టార్ (Disney + Hotstar) వేదికగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. ఈ సిరీస్‌కు రెంజీ ఫణిక్కర్ దర్శకత్వం వహించారు. ఆయన గతంలో కేరళ క్రైమ్ ఫైల్స్, మాస్టర్ పీస్, పెరిల్లోర్ ప్రీమియర్ లీగ్ వంటి మంచి వెబ్ సిరీస్‌లను తెరకెక్కించారు.
బహిష్కరణ (Bahishkarana)
ప్రముఖ నటి అంజలి (Anjali) వేశ్య పాత్రలో నటించిన సిరీస్ 'బహిష్కరణ'. ఇది జీ 5 వేదికగా జులై 19 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. రూరల్ రివేంజ్ యాక్షన్ డ్రామాగా ఈ సిరీస్‌ను ముకేశ్ ప్రజాపతి తెరకెక్కించారు. ఇందులో అంజలితో పాటు రవీంద్ర విజయ్ (Ravindra Vijay), అనన్య నాగళ్ల (Ananya Nagalla), శ్రీతేజ్ (Sri Tej), షణ్ముఖ్ (Shanmukh), మహబూబ్ బాషా (Mahaboob Basha), చైతన్య సాగిరాజు (Chaitanya Sagiraju) కీలకపాత్రలు పోషించారు.
https://twitter.com/i/status/1802226071795896339
త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్ (Tribhuvan Mishra CA Topper)
ఈ వారం ఓటీటీలోకి వచ్చిన మరో ఆసక్తికర వెబ్‌సిరీస్ 'త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్'. జులై 18 నుంచి నెట్‌ఫ్లిక్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు అమిత్ రాజ్ దర్శకత్వం వహించారు. మీర్జాపూర్ సిరీస్ క్రియేటర్ల నుంచి రావడంతో ఈ సిరీస్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్లాట్ ఏంటంటే 'చార్టెడ్ అకెంటెంట్ త్రిభువన్ (మానవ్ కౌల్) ఓ మహిళా క్లైంట్‌తో శారీరక సంబంధాన్ని పెట్టుకుంటాడు. ఈ రిలేషన్ అతడ్ని చిక్కుల్లో పడేస్తుంది. తన భార్యతో సంబంధం పెట్టుకున్న త్రిభువన్‌ను చంపాలని ఓ గ్యాంగ్‌స్టర్ నిర్ణయించుకుంటాడు. అతడి బారి నుంచి త్రిభువన్ తప్పించుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.
https://twitter.com/cinema_abhi/status/1813833849652101242
జూలై 18 , 2024
New OTT Releases Telugu: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
ప్రతీ శుక్రవారం టాలీవుడ్‌లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. అయితే గత కొన్ని వారాలుగా పెద్ద హీరోల సినిమాలు ఒక్కటి కూడా విడుదల కాలేదు. ఈ వారం కూడా అదే రిపీట్ కానుంది. ఈ వీకెండ్ కూడా ప్రేక్షకులను అలరించేందుకు చిన్న చిత్రాలు, తమిళ డబ్బింగ్ మూవీస్ రాబోతున్నాయి. అటు ఓటీటీలోనూ కొత్త చిత్రాలు, సిరీస్‌లు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు
హరోం హర
సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హరోం హర' (Harom Hara). మాళవిక శర్మ హీరోయిన్. సునీల్, రవి కాలే, కేశవ్ దీపక్, రాజశేఖర్ అనింగి ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. 1989 నేపథ్యంలో జరిగే కథ ఇదని, అప్పటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లుగా ప్రెజెంట్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే విడుదలై ట్రైలర్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి.
రాయణ్
తమిళ స్టార్ హీరో ధనుష్ (New OTT Releases Telugu) నటించిన లేటెస్ట్ చిత్ర 'రాయణ్' (Raayan). ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో దుషారా విజయన్ హీరోయిన్‌గా చేసింది. సందీప్ కిషన్, ఎస్.జే. సూర్య, అపర్ణ బాలమురళి, నిత్యా మీనన్, కాళిదాస్ జయరామ్ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 13న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.
ఇంద్రాణి
యానీయా, అంకిత, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఇంద్రాణి' (Indrani). ఈ చిత్రం స్టీఫెన్ పల్లం స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందింది. జూన్ 14న ఈ చిత్రం ధియేటర్లలో రిలీజ్ కాబోతోంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. వందేళ్ల తర్వాత టెక్నాలజీ పరంగా వచ్చే మార్పులేంటి? అన్నది ఇందులో చూడవచ్చని చెప్పింది.
మ్యూజిక్ షాప్ మూర్తి
టాలీవుడ్ విలక్షణ నటుడు అజయ్ ఘోష్, క్యూట్ హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ మూవీ 'మ్యూజిక్ షాప్ మూర్తి' (Music Shop Murthy). శివ పాలడుగు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి గ్రాండ్‌గా నిర్మించారు. జూన్ 14న (New OTT Releases Telugu) గ్రాండ్ ఈ సినిమా విడుదల కానుంది. 'ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి తన కలను నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు' అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందింది.
మహారాజా (తెలుగు డబ్)
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన 'మహా రాజా' (Maha Raja).. ఈ వారమే విడుదల కానుంది. నిథిలాన్ స్వామినాథన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మమతా మోహన్ దాస్, అనురాగ్ కశ్యప్, మునీశ్ కాంత్ ముఖ్య పాత్రలు పోషించారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చారు. జూన్ 14న తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
విష్వక్ సేన్ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) చిత్రం ఈ వారమే ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ (OTT Releases This Week Telugu) పోస్టర్ విడుదల చేసింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 31 థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.
పారిజాత పర్వం
చైతన్య రావు, శ్రద్ధా దాస్ నటించిన క్రైమ్ కామెడీ చిత్రం ‘పారిజాత పర్వం’ (Paarijatha Parvam) ఓటీటీలోకి వస్తోంది. ఏప్రిల్ 19న థియేటర్లలో రిలీజై.. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీని రెండు నెలల తర్వాత ఈ వారం ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. జూన్ 12 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు 'ఆహా' (OTT Releases This Week Telugu) అధికారికంగా ప్రకటించింది. కంభంపాటి సంతోష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సునీల్, హర్ష కీలక పాత్రలు చేశారు.
TitleCategoryLanguagePlatformRelease DateTour Day France Unchained S2SeriesEnglishNetflixJune 11My Next Guest S2SeriesEnglishNetflixJune 12Mysteries Of The Terracotta WarriorsMovieEnglishNetflixJune 12Doctor ClimaxSeriesEnglishNetflixJune 13Gangs Of GodavariMovieTeluguNetflixJune 14Maha RajMovieHindiNetflixJune 14Protecting ParadiseMovieEnglishDisney + HotstarJune 10The Colour Of VictorySeriesEnglishDisney + HotstarJune 10Not Dead At S2SeriesEnglishDisney + HotstarJune 12Gaanth Chapter 1SeriesHindiJio CinemaJune 11GroundMovieTeluguAmazonJune 10The Boys Season 4SeriesTeluguAmazonJune 13Paarijatha ParvamMovieTeluguAhaJune 12Kurangu PedalSeriesTamilAhaJune 14Love Ki Arrange MarriageMovieHindiZee 5June 14ParuvuSeriesTeluguZee 5June 14
జూన్ 10 , 2024
Mahesh Babu: ‘మహేష్‌ను చూసి నేర్చుకోండి’.. తమిళ ఆడియన్స్ ప్రశంసలు!
టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఒకరు. ఈ స్టార్ హీరో మంచి మనసు గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలుసు. అయితే ఇప్పుడు తమిళ ఆడియన్స్ కూడా మహేష్ గురించి తెగ పొగిడేస్తున్నారు. మహేష్ చేసిన ఓ పనికి ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మహేష్ లాంటి జీరో ఇగో హీరోను ఇప్పటివరకూ చూడలేదంటూ ఆకాశానికెత్తుతున్నారు. అసలు మహేష్ బాబు ఏం చేశారు? కోలీవుడ్ ఫ్యాన్స్ ఎందుకు ఆ స్థాయిలో మెచ్చుకుంటున్నారు? ఈ కథనంలో చూద్దాం.
‘రాయన్’పై మహేష్ రివ్యూ..!
ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాయన్' (Raayan) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా చూసిన మహేష్ బాబు ఎక్స్ వేదికగా 'రాయన్' టీమ్‌ను అభినందించాడు. ధనుష్ సహా ప్రధాన తారాగణం యాక్టింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘అద్భుతమైన దర్శకత్వంతో పాటు మంచి నటనతో ధనుష్ అదరగొట్టారు. ఎస్‌జే సూర్య, ప్రకాశ్‌రాజ్, సందీప్ కిషన్‌లు ఉత్తమంగా నటించారు. చిత్రంలో ఉన్న ప్రతిఒక్కరూ వందశాతం మంచి నటన కనబరిచారు. మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం మరో అద్భుతం. ‘రాయన్’ కచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. చిత్రబృందానికి నా శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చాడు. అటు మహేష్ బాబు పోస్టుపై నటుడు సందీప్ కిషన్ (Sundeep Kishan) స్పందించాడు. సూపర్ స్టార్‌కు ధన్యవాదాలు చెప్పాడు.
https://twitter.com/urstrulyMahesh/status/1817979697126588552
‘జీరో ఈగో’ అంటూ ప్రశంసలు
కోలీవుడ్ హీరో ధనుష్ నటన, డైరెక్షన్ స్కిల్స్‌ను మహేష్ బాబు మెచ్చుకోవడంపై తమిళ ఆడియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పక్క ఇండస్ట్రీ నుంచి తమిళ సినిమాను మెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. కోలీవుడ్‌లో ఎంతో మంది స్టార్స్ ఉన్నప్పటికీ సినిమా గురించి ఒక్కరు మాట్లడలేదని కామెంట్స్ చేస్తున్నారు. 'జీరో ఈగో'తో మహేష్ చేసిన ప్రశంసలపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ మంచి మనసు ఏంటో ఈ పోస్టుతో తమకు అర్థమైందని తమిళ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. అటు మహేష్ - ధనుష్ కాంబోలో ఓ సినిమా పడితే రికార్డ్స్ బద్దలేనని అభిప్రాయపడుతున్నారు. అటు తమిళ నటి అపర్ణ బాలమురళి కూడా మహేష్ పోస్టుకు ధన్యవాదాలు తెలిపారు.
కొత్త సినిమాపై రివ్యూ ఇవ్వాల్సిందే!
మహేష్ ఓ సినిమాకు రివ్యూ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. ఆయన తనకు నచ్చిన కొత్త సినిమాల గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో స్పందిస్తూనే ఉన్నారు. ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ'పై కూడా మహేష్ ఈ విధంగానే తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటనకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఫ్యూచరిక్ విజన్‌కు హ్యాట్యాఫ్ అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. అలాగే 'హరోం హర', 'భజేవాయు వేగం' , ‘ప్రేమలు’ తదితర చిత్రాలపై ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహేష్ లాంటి స్టార్ హీరో ఒక సినిమాను ప్రశంసించారంటే ఆ మూవీలో ఏదోక ప్రత్యేకత ఉండే ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. మహేష్ రివ్యూ ఇచ్చాడంటే ఆ సినిమా కచ్చితంగా బాగుంటుందని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
‘SSMB29’తో బిజీ బిజీ
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో 'SSMB29' సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో దర్శకధీరుడు రాజమౌళి బిజీ బిజీగా గడుపుతున్నారు. అటు మహేష్ సైతం ఈ సినిమా కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. లాంగ్ హెయిర్‌తో ముఖాన గడ్డంతో హాలీవుడ్ హీరోగా మారిపోయాడు. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మూవీ ఫస్ట్ షెడ్యూల్‌ను జర్మనీలో స్టార్ చేయనున్నట్లు సమాచారం. అటు ఈ మూవీకి 'ఆజానుబాహుడు', 'మహారాజ్', 'GOLD' టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మహేష్ బర్త్‌డే సందర్భంగా ఆగస్టు 9న మూవీకి సంబంధించి ఏదోక అప్‌డేట్ ఉండొచ్చని అంటున్నారు.
జూలై 30 , 2024
HBD Nidhhi Agerwal: ‘హరి హర వీరమల్లు’ నుంచి క్రేజీ అప్‌డేట్.. నిధి అగర్వాల్‌ను సర్‌ప్రైజ్ చేసిన టీమ్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు' చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. నేడు (ఆగస్టు 17) పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఆమె ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది.
ఈ పోస్టర్‌లో స్టన్నింగ్ లుక్స్‌తో నిధి అదరగొట్టింది. మహారాణి గెటప్‌లో ఒంటిపై ఆభరణాలతో ఆమె మరింత అందంగా కనిపించింది. అసలే షూటింగ్ జరగట్లేదన్న ఆందోళనలో ఉన్న మెగా ఫ్యాన్స్‌కు నిధి పోస్టర్ సంతోషాన్ని కలిగిస్తోంది.
https://twitter.com/FilmyNagri/status/1824752513574134185
ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'రాజాసాబ్' చిత్రంలోనూ నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ మూవీ సెట్స్‌లో నిధి బర్త్ డే వేడుకలను నిర్వహించారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/rajasaabmovie/status/1824688858853937198
నిధి హైదరాబాద్‌లోనే జన్మించింది. కానీ, పెరిగింది మాత్రం బెంగళూరు. బాలీవుడ్‌లో మున్నా మైఖేల్ సినిమా ద్వారా అడుగుపెట్టి తొలి ప్రయత్నంలోనే జీసినిమా బెస్ట్ డెబ్యూ అవార్డు అందుకుంది.
నాగ చైతన్య హీరోగా చేసిన 'సవ్యసాచి' సినిమాతో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇందులో చిత్ర పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.
ఆ తర్వాత చైతూ సోదరుడు అక్కినేని అఖిల్ పక్కన ఈ అమ్మడికి అవకాశం దక్కింది. 'మిస్టర్ మజ్ను'లో వారిద్దరు కలిసి చేశారు. అది కూడా ఫెయిల్ అయింది.
అక్కినేని హీరోలతో చేసిన రెండు సినిమాలూ ఫ్లాపవడంతో నిధి కెరీర్ డేంజర్ జోన్‌లో పడింది. దీనితో నిధికి టాలీవుడ్ లోనూ చుక్కెదురయింది.
అవకాశాలు సన్నగిల్లాయి అనుకుంటున్న సమయంలోనే పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్'లో నిధికి అవకాశం దక్కింది. ఆ మూవీ హిట్ కావడంతో నిధికి వరుస ఆఫర్లు వచ్చాయి.
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీలో నిధి హీరోయిన్‌గా ఎంపికై అందరినీ ఆశ్చర్యపరిచింది. పవన్ ఈ సినిమాకు షెడ్యూల్స్ ఇవ్వకపోవడంతో సినిమా నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది.
ఓ వైపు తెలుగు చిత్రాల్లో నటిస్తూనే తమిళంలోనూ ఈ అమ్మడు పలు సినిమాలు చేసింది. 'ఈశ్వరన్', 'కలగ తలైవన్' చిత్రాలతో తమిళ ప్రేక్షకులను పలకరించింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ నిధి చాలా చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.
గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తుండటంతో ఇన్‌స్టాగ్రామ్‌లో నిధిని అనుసరించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టా ఖాతాను 29.8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
ఆగస్టు 17 , 2024
OG Movie: ‘ఓజీ’లో ప్రభాస్? సాహోతో కనెక్షన్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో తన పెండింగ్ ప్రాజెక్ట్స్ హరి హర వీరమల్లు, ఓజీ (OG Movie) చిత్రాలను ఫినిష్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. హరి హర వీరమల్లు షూటింగ్ ఈ వీకెండ్‌తో పూర్తవుతుందన్న వార్తలు సైతం వచ్చాయి. మరోవైపు యంగ్ డైరెక్టర్ సుజీత్ సైతం ‘ఓజీ’ శరవేగంగా ఫినిష్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్ లేని సన్నివేశాలను చకా చకా షూట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ‘ఓజీ’ సంబంధించి దిమ్మతిరిగే బజ్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే థియేటర్లు బద్దలవ్వడం ఖాయమని చెప్పవచ్చు.
‘ఓజీ’లో ప్రభాస్..?
పవన్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓజీ’ (OG Movie) చిత్రం గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ పాత్ర పేరు ఓజాస్ గంభీర కావడంతో ఈ మూవీకి ‘ఓజీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కాగా తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్‌డేట్ అందుతోంది. ఈ సినిమాలో పాన్ ఇండియా స్థార్ ప్రభాస్ ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ప్రభాస్‌కు సంబంధించి కళ్లు చెదిరే క్యామియో ఉంటుందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటారని కూడా ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒక వేళ ఇదే నిజమైతే 'ఓజీ'పై ఉన్న అంచనాలు తారా స్థాయికి వెళ్లడం ఖాయం. ప్రభాస్, పవన్‌ను ఒకే స్క్రీన్‌పై చూడటం కన్నుల పండగా ఉంటుందని చెప్పవచ్చు.
https://twitter.com/TBO_Updates/status/1862813629441011860
‘సాహో’తో కనెక్షన్ ఉందా?
‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ చేసిన సాహో (Saaho) చిత్రానికి కూడా యంగ్ డైరెక్టర్ సుజీత్ (Director Sujeeth) దర్శకత్వం వహించారు. అందులో ప్రభాస్‌ను చూపించిన విధానం, మేకింగ్స్ స్కిల్స్ ఆడియన్స్‌ను చాలా ఇంప్రెస్ చేశాయి. అయితే ప్రభాస్ ‘ఓజీ’తో ‘సాహో’కి కనెక్షన్ ఉండొచ్చని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘సాహో’లోని ప్రభాస్ పాత్ర ‘ఓజీ’లో కనిపించొచ్చని చర్చించుకుంటున్నారు. కాగా, ఆ సినిమాలో ప్రభాస్ సైతం గ్యాంగ్‌స్టర్‌గా నటించారు. ఫస్టాఫ్ మెుత్తం పోలీసు ఆఫీసర్‌గా కనిపించి తోటి అధికారులను బురిడి కొట్టిస్తాడు. సెకండాఫ్‌లో అతడి ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ రోల్‌ను దర్శకుడు సూజీత్ చూపించాడు. ఓజీలోనూ పవన్ గ్యాంగ్‌స్టర్ గానే చేస్తుండటంతో ఆ పరంగా ‘సాహో’తో ఏమైనా లింక్ ఉండే అవకాశముందని నెటిజన్లు భావిస్తున్నారు.
https://twitter.com/GetsCinema/status/1862830321810493680
బ్యాంకాక్‌లో కలుస్తారా?
‘ఓజీ’ (OG) షూటింగ్‌కు సంబంధించి ఓ అప్‌డేట్ బయట కొచ్చింది. బ్యాంకాంక్‌లో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను దర్శకుడు సుజీత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ షెడ్యూల్‌తో పవన్ (Pawan Kalyan) షూటింగ్ పూర్తవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దీంతో పవన్ వచ్చేవారంలో బ్యాంకాంక్ వెళ్లి ఓజీ షూట్‌లో జాయిన్ అవుతారని సమాచారం. ప్రస్తుత అప్‌డేట్స్ ప్రకారం హీరో ప్రభాస్ సైతం బ్యాంకాక్ షూట్‌లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. అదే జరిగితే ప్రభాస్, పవన్‌లను భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో చూసే అవకాశం దక్కుతుంది. దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
అకీరానందన్ సైతం!
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కుమారుడు అకీరానందన్ (Akira Nandan) ఫిల్మ్ ఎంట్రీ గురించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. అయితే పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఓజీతోనే అకీరా తెరంగేట్రం చేయబోతున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సర్‌ప్రైజింగ్‌గా అకీరా నందన్‌పై షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. అకీరానందన్ ఎంట్రీ వందశాతం ‘ఓజీ’తోనే ఉండనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వచ్చింది. అయితే అకీరా తెరంగేట్రాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచనున్నారట. అతడి ఎంట్రీ నేరుగా తెరపై చూడాల్సిందేనని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ‘ఓజీ’లో అకీరా ఏ పాత్రలో కనిపిస్తాడనేది మాత్రం ఎక్కడా రివీల్ కాలేదు.
నవంబర్ 30 , 2024
Amazon Prime 2024: ‘ఫ్యామిలీ స్టార్’ టూ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’.. అమెజాన్‌లో రిలీజయ్యే టాప్ మూవీస్ ఇవే!
సాధారణంగా సినిమా విడుదల తర్వాత ఆ మూవీకి సంబంధించిన స్ట్రీమింగ్ వేదిక ఖరారవుతుంది. కానీ, ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ మాత్రం ఈ విషయంలో మిగిలిన వాటి కంటే ఎంతో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న టాలీవుడ్ అగ్ర హీరోల చిత్రాలను సైతం విడుదలకు ముందే తన ఖాతాలో వేసుకుంటోంది. ఆయా సినిమా పోస్ట్ థియేట్రికల్ ఓటీటీ హక్కులను ముందుగానే తన పేరిట రిజర్వ్ చేసుకుంటోంది. ఇలా అమెజాన్‌లో స్ట్రీమింగ్‌కు కన్ఫార్మ్ అయిన టాలీవుడ్ బడా చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), డైరెక్టర్ క్రిష్ (Krish) కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘హరి హర వీర మల్లు’. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను అమెజాన్ దక్కించుకుంది. థియేటర్లలోకి వచ్చిన కొద్ది రోజుల తర్వాత ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. పవన్.. ఏపీ రాజకీయాలపై పూర్తిగా ఫోకస్ పెట్టడంతో ఎన్నికల తర్వాత మిగిలిన షూటింగ్‌లో ఆయన పాల్గొంటారు.
గేమ్ ఛేంజర్ (Game Changer)
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan).. లేటెస్ట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ కూడా అమెజాన్ ప్రైమ్‌లోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని గతంలో అమెజాన్ స్వయంగా పోస్టర్ రూపంలో వెల్లడించింది. అంతేకాదు మూవీకి సంబంధించిన ప్లాట్‌ను సైతం రివీల్ చేసి వార్తల్లో నిలిచింది. కాగా, డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీ ఖరారు కానుంది.
ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)
ప్రస్తుతం టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కూడా అమెజాన్‌ను స్ట్రీమింగ్ వేదికగా ఫిక్స్ చేసింది. కాగా ఇటీవల విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ తెలుగు రాష్ట్రాల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా గాజు గురించి పవన్ చెప్పిన డైలాగ్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఫ్యామిలీ స్టార్ (Family Star)
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’.. థియేట్రికల్ రిలీజ్ తర్వాత అమెజాన్‌లోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ భారీ ధరకు దక్కించుకున్నట్లు కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా, ఈ సినిమా ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఓం భీమ్ బుష్ (Om Bheem Bush)
శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా హాస్య నటులు ప్రియదర్శి (Priyadarsi), రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఏప్రిల్ 19 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి రానుంది. మార్చి 22న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. శ్రీవిష్ణు కెరీర్‌లోనే రికార్డు వసూళ్లను రాబట్టింది.
తమ్ముడు (Thammudu)
స్టార్ హీరో నితిన్ (Nithiin) అప్‌కమింగ్ చిత్రం ‘తమ్ముడు’ స్ట్రీమింగ్ హక్కులను కూడా అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో నితిన్ చేస్తోన్న మూడో సినిమా ‘తమ్ముడు’.
ఘాతీ (GHAATI)
స్టార్ హీరోయిన్ అనుష్క (Anusha Shetty) అప్‌కమింగ్ మూవీ 'ఘాతీ' కూడా ప్రైమ్‌లోనే ఓటీటీలోకి రానుంది. దీనికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో స్వీటీ వేశ్యగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. పరిస్థితుల కారణంగా ఒక రొచ్చులో ఇరుక్కున్న మహిళ.. తన సాధికారతను నిరూపించుకోవడం కోసం ఎలా పోరాడింది' అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ రానుంది.
కాంతారా 2 (Kantara 2)
రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా ఆయన స్వీయదర్శకత్వంలో వచ్చిన ‘కాంతార’ చిత్రం.. దేశవ్యాప్తంగా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ కూడా రూపొందుతోంది. ఇది షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీకి సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను సైతం అమెజాన్ దక్కించుకోవడం విశేషం.
కంగువా (Kanguva)
2024లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులలో తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తున్న ‘కంగువా’ ఒకటి. ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా సూర్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సూర్య సరసన దిషా పటానీ (Disha Patani) హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా కూడా థియేటర్లలో విడుదల అనంతరం అమెజాన్‌లోనే స్ట్రీమింగ్‌లోకి రానుంది.
ఏప్రిల్ 03 , 2024
Hari Hara Veera Mallu: పవన్ సినిమా నుంచి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కు పూనకాలే!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చిత్రాలకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్లలో పండగ వాతావరణం ఏర్పడుతుంది. ప్రస్తుతం పవన్ చేతిలో 'ఓజీ' (OG), ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu), ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ పరంగా ‘హరి హర వీరమల్లు’ చాలా అడ్వాన్స్‌గా ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి సాలిడ్ అప్‌డేట్ ఒకటి బయటకొచ్చింది. దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. అందుకు కారణమెంటో ఇప్పుడు చూద్దాం.
ఫైనల్ షెడ్యూల్ షురూ
పవన్ హీరోగా చేస్తోన్న ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను క్రిష్, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుండగా తొలి పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ మూవీ ఆఖరి షెడ్యూల్ ఈ వీకెండ్‌లో విజయవాడలో వేసిన సెట్‌లో మెుదలుకానుంది. సినిమాకు అత్యంత కీలకమైన సీన్స్‌లో చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కూడా జాయిన్ అవుతారని టాక్. మెుత్తం 200 మంది ఆర్టిస్టులతో కలిసి పవన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. యానిమల్ ఫేమ్ బాబి డియోల్‌తో పాటు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారని తెలుస్తోంది.దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌తోనే షూటింగ్ పూర్తి కానుండటంతో ఈ సినిమా రిలీజ్‌పై ఎలాంటి సందేహాం పెట్టుకోవాల్సిన పనిలేదని ఆనందిస్తున్నారు.
500 మందితో ఫైట్ సీన్స్
హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) చిత్రాన్ని 2025 మార్చి 28న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దానికి అనుగుణంగా సినిమాను ఫినిష్ చేసేందుకు గత కొంతకాలంగా చురుగ్గా షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవలే హాలీవుడ్ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాలను సైతం మూవీ టీమ్ చిత్రీకరించింది. పవన్‌తో పాటు దాదాపు 400 నుంచి 500 మంది ఈ యుద్ధ సన్నివేశంలో పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఫైట్ సినిమాకే హైలెట్ ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ సీన్‌లో పవన్ యాక్షన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు. కాగా, హరిహర వీరమల్లు చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది.
బ్యాంకాక్ వెళ్లనున్న పవన్!
హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu)తో పాటే ‘ఓజీ’ (OG) షూటింగ్ కూడా ప్యార్లర్‌గా జరుగుతోంది. యంగ్ డైరెక్టర్ సుజీత్ పవన్ లేని సన్నివేశాలను ఎంతో ఫాస్ట్‌గా చిత్రీకరిస్తున్నారు. మరోవైపు పవన్ సైతం ఈ రెండు చిత్రాలను డిసెంబర్ ఫస్ట్ వీక్ కల్లా ఫినిష్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ వీకెండ్ హరి హర వీరమల్లును షూట్‌ను పవన్ పూర్తి చేయనున్నారు. అనంతరం ‘ఓజీ’ టీమ్‌లో పవన్ జాయిన్ కానున్నారు. బ్యాంకాంక్‌లో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను దర్శకుడు సుజీత్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ షెడ్యూల్‌తో పవన్ షూటింగ్ పూర్తవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దీంతో పవన్ వచ్చేవారంలో బ్యాంకాంక్ వెళ్లి ఓజీ షూట్‌లో జాయిన్ అవుతారని తెలుస్తోంది.
పవన్‌తో విజయ్ దేవరకొండ బిగ్ ఫైట్
2025 సమ్మర్ బరిలో పవన్‌ను విజయ్ దేవరకొండ ఢీకొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) రిలీజ్ కానున్న అదే డేట్‌కు విజయ్ నటిస్తున్న 'VD 12' కూడా విడుదల కాబోతోంది. ఆ తేదీని ‘హరి హర వీరమల్లు’ కంటే ముందే 'VD 12' టీమ్ లాక్ చేసింది. దీంతో పవన్‌తో విజయ్ దేవరకొండకు బిగ్ ఫైట్ తప్పదని చెప్పవచ్చు. అయితే పవన్‌కు అత్యంత సన్నిహితులైన సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాతలు 'VD 12'ను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు పోటీగా వారు తమ చిత్రాన్ని బరిలోకి దింపే అవకాశం లేకపోవచ్చని సమాచారం. మరో కొత్త డేట్‌ను చూసుకొని VD12ను రిలీజ్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నవంబర్ 28 , 2024
Akira Nandan: అఫీషియల్.. పవన్ కల్యాణ్ ‘ఓజీ’తోనే అకీరా నందన్ ఎంట్రీ
టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఒకరు. జనసేన పార్టీ (Janasena Party)ని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ ఏపీ ఉపముఖ్యమంత్రిగాను బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న ‘హరి హర వీరమల్లు’ ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసి పూర్తిస్థాయిలో రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ వారసుడిగా అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ స్థానంలో అకీరా నందన్ (Akira Nandan)ను స్క్రీన్‌పై చూసుకొని సంతోషపడాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ ‘ఓజీ’ సినిమాతో అకీరా ఎంట్రీ ఉంటుందని ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఇది నూటికి నూరశాతం నిజమేనని తాజా అప్‌డేట్‌ను బట్టి తెలుస్తోంది.
అకీరానందన్ ఎంట్రీ పక్కా..
పవన్ కల్యాణ్ కుమారుడు అకీరానందన్ (Akira Nandan) ఫిల్మ్ ఎంట్రీ గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఓజీతోనే అకీరా తెరంగేట్రం చేయబోతున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇది పూర్తిగా నిజమేనని తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం సర్‌ప్రైజింగ్‌గా అకీరా నందన్‌పై షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. అకీరానందన్ ఎంట్రీ వందశాతం ‘ఓజీ’తోనే ఉండనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. అయితే అకీరా తెరంగేట్రాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచే ఛాన్స్ ఉందని అంటున్నారు. అకీరా ఎంట్రీని నేరుగా తెరపై చూడాల్సిందేనని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ‘ఓజీ’లో అకీరా ఏ పాత్రలో కనిపిస్తాడనేది మాత్రం ఎక్కడా రివీల్ కాలేదు. ఇక అకీరా రోల్‌కు సంబంధించి మున్ముందు మరిన్ని లీక్స్ వచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాటి కోసం ఫ్యాన్స్‌తో పాటు మనమూ వేచి చూద్దాం.
https://twitter.com/FilmyTwood/status/1859094576272953795
తండ్రి గురువు దగ్గర యాక్టింగ్ పాఠాలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమాల్లోకి రాకముందు ప్రముఖ నట గురువు సత్యానంద్ (Acting guru Satyanand) దగ్గర యాక్టింగ్ పాఠాలు నేర్చుకున్నారు. వైజాగ్‌లోని సత్యానంద్ శిక్షణాలయంలో నటనలోని ఓనమాలు అభ్యసించారు. ఇప్పుడు పవన్ తనయుడు అకీరానందన్ (Akira Nandan) కూడా ఆయన దగ్గర యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. భావోద్వేగాలను ఎలా పలికించాలో అకీరా తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే విదేశాల్లో మార్షల్ ఆర్ట్స్‌కు సంబంధించిన శిక్షణ కూడా అకీరా తీసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీనిని బట్టి చూస్తే పర్‌ఫెక్ట్ నటుడిగా మారేందుకు అకీరా బాగానే కష్టపడుతున్నట్లు అర్థమవుతోంది. మరి స్క్రీన్‌పై అకీరా ఏ విధంగా మెరుస్తాడో చూద్దాం.
అకిరా ఎంతో టాలెంటెడ్!
అకిరా నందన్ వ్యక్తిగత విషయాలకు వస్తే అతడు ఎంతో టాలెంటెడ్. ఆటలు, పాటలు ఇలా అన్నింట్లో అకిరాకు ప్రావిణ్యం ఉంది. బాస్కెట్ బాల్ కూడా బాగా ఆడతాడని అతడి సన్నిహితులు తెలిపారు. అకిరా చదువులో కూడా ఫస్ట్ ఉంటాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సంగీతంపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో మ్యూజిక్ కోర్సులు కూడా చేశాడు. అతడి మ్యూజిక్ టాలెంట్ తెలిసే మెగా ఫ్యామిలీ ఈ ఏడాది సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో అతడి చేత ప్రత్యేక పర్‌ఫార్మెన్స్ చేయించింది. ఆ సందర్భంలోనే యానిమల్ సినిమాలోని ‘నాన్న నువ్వు నా ప్రాణం’ అంటూ పాటకు పియానో వాయించి అకిరా అందరి దృష్టిని ఆకర్షించాడు. అప్పట్లో ఈ వీడియో విపరీతంగా ట్రెండ్ అయ్యింది.
https://twitter.com/i/status/1747251367033577947
న్యూయర్‌కు బిగ్ ట్రీట్!
‘ఓజీ’ సినిమాకు సంబంధించి మరో క్రేజీ వార్త (Akira Nandan) నెట్టింట చక్కర్లు కొడుతోంది. న్యూయర్ కానుకగా 2025 జనవరి 1న ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే మొదట ఈ పాటను సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయాలని మూవీ టీమ్ భావించింది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తడం, పవన్ కూడా ఏపీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతాయుత పదవిలో ఉంటడంతో సాంగ్‌ను వాయిదాా వేశారు. అయితే కొత్త ఏడాది మాత్రం ఫ్యాన్స్‌కు గ్రాండ్ ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక పవన్‌ను ఢీ కొట్టే పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ కనిపించనున్నాడు.
ఓజీపై ఎందుకంత హైప్?
పవన్ కల్యాణ్ చేతిలోని మూడు ప్రాజెక్ట్స్‌లో ‘ఓజీ’ చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. కెరీర్‌లోనే తొలిసారి గ్యాంగ్‌స్టర్ పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తున్నాడు. ఇందులో పవన్ పాత్ర ఓజాస్ గంభీర (Ojas Gambhira) కాగా దానిని షార్ట్‌కట్ చేస్తూ ‘ఓజీ’గా టైటిల్‌ను ఫిక్స్ చేశారు. గతంలో వచ్చిన ‘ఓజీ’ గ్లింప్స్‌లో పవన్ యాక్టింగ్ చూసిన ఫ్యాన్స్ ఈ సినిమా మరో లెవల్లో ఉంటుందని ముందుగానే ఓ అభిప్రాయానికి వచ్చేశారు. అంతే కాకుండా ఈ సినిమాకి జపనీస్‌తో లింక్ ఉంటుందని డైరెక్టర్ సుజిత్ గతంలో చెప్పడంతో అభిమానుల్లో అంచనాలు తార స్థాయికి చేరాయి. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
https://twitter.com/TorchbearerEdit/status/1744312598743351385
నవంబర్ 20 , 2024
Akhanda Movie Dialogues: గూస్ బంప్స్ తెప్పించే బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవే
కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం విడుదలైన అఖండ ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. దాదాపు రెండేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించిన చిత్రం ఇది. బోయపాటి- బాలకృష్ణ కాంబోలో వచ్చిన సెకండ్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో బాలకృష్ణ అఘోరగా నటించిన తీరు ప్రేక్షుకులను మెప్పించింది. థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా ఎలివేషన్, బాలయ్య డైలాగ్ మాడ్యులేషన్‌కు బాగా హెల్ప్ అయింది. ఆయన చెప్పే డైలాగ్స్ అభిమానుల చేత విజిల్స్ కొట్టించింది. మాస్ ప్రేక్షకులకు పునకాలు తెప్పించిందనడంలో సందేహం లేదు. ఇప్పటికీ ఈ సినిమాలోని డైలాగ్స్ అభిమానుల నాలుకల మీద నాట్యం చేస్తూనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మరి ఆ పవర్ ఫుల్ డైలాగ్స్‌ను మీరు ఓసారి చూసేయండి.
“ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..శీనుగారు.. మీ నాన్నగారు బాగున్నారా ? అనేదానికి శీనుగారు మీ అమ్మమొగుడు బాగున్నాడా..అనేదానికి చాలా తేడా ఉంది రా!”
“ఏయ్ ..! అంచనా వేయడానికి నువ్ పోలవరం డాం ఆ ? పట్టుసీమ తోమా ? పిల్ల కాలువ .!“
“హర హర మహాదేవ! శంభో శంకర ! కాలుదువ్వే నంది ముందు..రంగు మార్చిన పంది కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.”
“నాకు బురదంటింది..నాకు దురదొచ్చింది.. నాకు బ్లడ్ వచ్చింది నాకు గడ్డు వచ్చింది అని అడ్డమైన సాకులు చెబితే ..!”
“విధికి, విధాతకి, విశ్వానికి సవాళ్లు విసర కూడదు.!”
“ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ ని తొక్కి పార దొబ్బుతా.!”
“ఒక మాట నువ్వంటే అది శబ్దం అదే మాట నేనంటే శాసనం. దైవశాసనం.”
“నీకు సమస్య వస్తే దణ్ణం పెడుతారు. మేము ఆ సమస్యకు పిండం పెడుతాం. బోథ్ ఆర్ నాట్ సేమ్.”
“లెఫ్ట్ ఆ, రైట్ ఆ, టాప్ ఆ , బాటమ్ ఆ , ఎటు నుంచి ఎటు పెట్టి గోకిన కొడకా ఇంచు బాడీ దొరకదు.”
“ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ ని తొక్కి పార దొబ్బుతా.!”
“మీరు మా అంటే సెల్‌లో వేస్తారు.. నేను డైరెక్ట్ హెల్‌కి పంపించా..”
“మీరు ఆయువు కోసం భయపడతారు.. మేము మృత్యువుకు ఎదురెళ్తాం”.
“దేవుడిని కరుణించమని అడగాలి, కనిపించమని కాదు.”
“రెస్పెక్ట్ అనేది బిహేవియర్ చూసి ఇచ్చేది, అడుక్కుంటే వచ్చేది కాదు.”
“మేము ఎక్కడికైనా వెళ్తే తల దించుకోము.. తల తెంచుకుని వెళ్లిపోతాం.”
అక్టోబర్ 26 , 2024
OG Release Date: ఒకే నెలలో పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు విడుదల?
ఒకప్పుడు టాలీవుడ్‌కు పరిమితమైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేరు ప్రస్తుతం రాజకీయాల్లోనూ మారుమోగుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్, పాలనలో తన మార్క్ చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ ఇటీవలే పెండింగ్ ప్రాజెక్ట్స్‌ను పట్టాలెక్కించారు. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాల షూటింగ్ కూడా తిరిగి మెుదలైంది. త్వరలోనే పవన్ కూడా రెగ్యులర్ షూటింగ్స్‌లో పాల్గొననున్నారు. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. సమ్మర్ బరిలో పవన్‌తో పవనే పోటీ పడతారని వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్ vs పవన్
పవన్ హీరోగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని 2025 మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు ‘ఓజీ’ని కూడా సమ్మర్‌లోనే తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఏప్రిల్ లేదా మేలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఈ విచిత్ర పరిస్థితి చూసి అభిమానులు షాకవుతున్నారు. మెున్నటి వరకూ పవన్ సినిమా లేదని బాధపడ్డ ఫ్యాన్స్‌కు ఈ వార్తతో ఎలా ఫీలవ్వాలో అర్థం కావడం లేదు. గబ్బర్ సింగ్‌లో చెప్పిన ‘నాకు నేనే పోటీ’ డైలాగ్‌ను పవన్ నిజం చేస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే నెల రోజుల గ్యాప్‌తోనే సెకండ్ ఫిల్మ్‌ను రిలీజ్ చేయడం వల్ల కలెక్షన్స్ దెబ్బతినే ఛాన్స్ ఉందని పవన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హరి హర వీరమల్లు టీమ్ అసంతృప్తి!
‘ఓజీ’ చిత్రాన్ని సమ్మర్‌లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేయడంపై హరిహర వీరమల్లు టీమ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. రెండు సినిమాల మధ్య కనీసం 5 నెలల గ్యాప్ అయినా ఉండాలని హరి హర వీరమల్లు టీమ్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పవన్‌ను జోక్యం చేసుకోవాలని కూడా కోరుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో పవన్ ఎవరి పక్షాన నిలుస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం మెుత్తం చూస్తుంటే పవన్ vs పవన్‌గా పరిస్థితులు మారిపోయాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మెుత్తానికి ‘ఓజీ’నే వెనక్కి తగ్గే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.
‘ఓజీ.. బ్లాక్‌బాస్టర్ పక్కా’
పవన్ - సుజిత్ కాంబోలోని 'ఓజీ' చిత్రం గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ పాత్ర పేరు ఓజాస్ గంభీర కావడంతో ఈ మూవీకి ‘ఓజీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కాగా ఇటీవల ఓజీ గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎక్స్ వేదికగా స్పందించారు. 'ఓజి అప్డేట్స్ గురించి అందరూ అడుగుతున్నారు. త్వరలోనే అప్డేట్స్ వస్తాయి. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అయితే మా నుంచి ఇండస్ట్రీ హిట్ వస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. డైరెక్టర్ సుజిత్ అదరగొట్టేశాడు, కెమెరామెన్ రవిచంద్రన్ కూడా సూపర్ విజువల్స్ ఇచ్చాడు. నేను కూడా ఓజీకి బెస్ట్ ఇవ్వాలి. ఇది డివివి బ్యానర్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ సినిమా. నా ట్వీట్‌ని మీరంతా పిన్ చేసి పెట్టుకోండి. అప్‌డేట్స్‌తో మనం త్వరలోనే కలుద్దాం' అంటూ మెగా ఫ్యాన్స్‌లో థమన్ మరింత జోష్ పెంచారు. థమన్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది.
https://twitter.com/MusicThaman/status/1842245316252209456
త్వరలో సెట్స్‌పైకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’!
గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ - హరీశ్ కాంబోలో రాబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఏపీ ఎన్నికల ముందు వరకు వరుస అప్‌డేట్స్‌తో భారీగా అంచనాలు పెంచేసిన దర్శకుడు హరీష్ శంకర్ గత కొంత కొలంగా సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా హరిహర వీరమల్లు, ఓజీ ప్రాజెక్ట్స్ తిరిగి సెట్స్‌పైకి వెళ్లడంతో ఉస్తాద్‌ను కూడా పట్టాలెక్కించాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోలీసు పాత్ర చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రెండు గ్లింప్స్ బయటకు రాగా వాటికి ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి కూడా అప్‌డేట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
అక్టోబర్ 23 , 2024
Hari Hara Veera Mallu: సమ్మర్ బరిలో పవర్‌స్టార్.. ఢీ కొట్టేందుకు సై అంటున్న విజయ్ దేవరకొండ!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. థియేటర్లు ఈలలు, గోలలతో దద్దరిల్లిపోతాయి. అయితే గత కొంతకాలంగా థియేటర్లలో పవన్ ఫ్యాన్స్ హడావుడి తగ్గింది. ఎందుకుంటే బ్రో సినిమా తర్వాత పవన్ నుంచి ఒక్కసినిమా కూడా రాలేదు. రాజకీయాల్లో బిజీగా అవ్వడంతో చేతిలో ఉన్న మూడు బిగ్ ప్రాజెక్టులు కూడా పెండింగ్‌లో పడిపోయాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ తిరిగి సెట్‌లోకి ఎప్పుడు వస్తాడా? ఆయన్ను మళ్లీ తెరపై ఎప్పుడు చూస్తామా? అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. విడుదల తేదీతో కూడిన అదిరిపోయే పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే అదే రోజున విజయ్ దేవరకొండ చిత్రం కూడా బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది.
సమ్మర్‌లో గ్రాండ్ రిలీజ్
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu Release Date) రిలీజ్ డేట్‌ను చిత్రబృందం తాజాగా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నట్లు తెలిపింది. ‘అన్‌స్టాపబుల్ ఫోర్స్, అన్‌బ్రేకబుల్ స్పిరిట్ మార్చి 28న విడుదల కానుంది’ అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో పవన్ కత్తిపైకెత్తి వారియర్‌లా కనిపించారు. ఇది చూసిన పవన్ అభిమానులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. హరి హర వీరమల్లు సూపర్ హిట్ అవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు స్టార్ హీరో స్టేటస్ ఉన్నప్పటికీ ఆయన నుంచి ఇప్పటివరకూ ఒక్క పాన్ ఇండియా చిత్రం రాలేదు. ‘హరి హర వీరమల్లు’ పవన్‌కు తొలి పాన్ ఇండియా చిత్రం కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అంతేకాదు ఈ సినిమా నుండి రిలీజైన గ్లింప్స్, టీజర్ ఆ అంచనాలను ఆకాశానికెత్తేసింది. అందుకే ఈ సినిమా గురించి వస్తున్న ఏ చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రెండ్ అవుతోంది. ఈ పెస్టిజియస్ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి (Krish) కొంత భాగం తెరకెక్కించగా ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఆ చిత్రాల్లోనూ కదలిక!
హరిహర వీరమల్లుతో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ పవన్ చేతిలో ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ సుదీప్‌తో ‘ఓజీ’ (OG), హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) చిత్రాల్లో పవన్ నటిస్తున్నారు. రాజకీయాల్లో నిమగ్నం కావడంతో హరిహర వీరమల్లుతో పాటు ఆ రెండు చిత్రాల షూటింగ్ కూడా వాయిదా పడ్డాయి. నేటి నుంచి (సెప్టెంబర్ 23) విజయవాడలో హరిహర వీరమల్లు షూట్ తిరిగి ప్రారంభం కావడంతో పెండింగ్ పడ్డ ఆ రెండు చిత్రాలు కూడా త్వరలో పట్టాలెక్కే సంకేతాలు కనిపిస్తున్నాయి. అటు పవన్ సైతం ఆ రెండు ప్రాజెక్ట్స్‌ను కూడా త్వరగా ఫినిష్ చేయాలన్న ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెటొచ్చని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
పవన్ vs విజయ్ దేవరకొండ!
హరి హర వీరమల్లు రిలీజ్ తేదీని ప్రకటించడంతో బాక్సాఫీస్ వద్ద పవన్, విజయ్ దేవరకొండ తలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజయ్ నటిస్తున్న 'VD 12' చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. తాజాగా అదే రోజున హరిహర వీరమల్లు వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పదని అంటున్నారు. పవన్ లాంటి బిగ్‌స్టార్‌ను ఢీకొట్టేందుకు తమ హీరో సిద్ధమంటూ విజయ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే పవన్‌కు అత్యంత సన్నిహితులైన సితారా నిర్మాతలు 'VD 12'ను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు పోటీగా వారు తమ చిత్రాన్ని బరిలోకి దింపే అవకాశం లేకపోవచ్చని సమాచారం. మరో కొత్త డేట్‌ను చూసుకొని VD12ను రిలీజ్ చేసే అవకాశం లేకపోదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు బాలీవుడ్ స్టార్ సల్మాన్ నటిస్తున్న 'సికిందర్' చిత్రం పవన్‌కు పోటీగా మారే అవకాశముంది. ఈ చిత్రాన్ని 2025 ఈద్ సందర్భంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో పాన్ ఇండియా స్థాయిలో వీరమల్లు వస్తుండటంతో నార్త్‌లో ప్రభావం చూపించవచ్చు.
సెప్టెంబర్ 23 , 2024
Hari Hara Veera Mallu: పవన్ చిత్రం నుంచి ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్.. టీజర్ కోసం సిద్ధంకండి!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చిత్రాలకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్లలో పండగ వాతావరణం ఏర్పడుతుంది. ప్రస్తుతం పవన్ చేతిలో 'ఓజీ' (OG), ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu), ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) చిత్రాలు ఉన్నాయి. క్రిష్ (Krish) దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరి హర వీరమల్లు’ మినహా మిగిలిన రెండు చిత్రాలకు సంబంధించి అడపాదడపా ఏదోక అప్‌డేట్ వస్తూనే ఉంది. దీంతో పవన్ - క్రిష్ చిత్రంపై అభిమానుల్లో ఆశలు సన్నగిల్లుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీరామ నవమి (ఏప్రిల్ 17)ని పురస్కరించుకొని హరి హర వీరమల్లు యూనిట్ అదిరిపోయే అప్‌డేట్‌ను అందించింది. ఇది చూసిన ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
‘ధర్మం కోసం యుద్ధం’.. త్వరలో!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో రాబోతున్న హరిహర వీరమల్లు సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఇవాళ (ఏప్రిల్ 17) శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మీ ముందుకు... ‘ధర్మం కోసం యుద్ధం’.. త్వరలో’ అని క్యాప్షన్ ఇచ్చింది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను అతి త్వరలో విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ట్వీట్‌కు మెగా ఫ్యాన్స్ ‘వెయిటింగ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో అని కాకుండా ఒక డేట్‌ను అనౌన్స్ చేసి ఉంటే బాగుండేదని పోస్టులు పెడుతున్నారు.
ఆందోళనలకు చెక్!
పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్‌లో బిజీ కావడంతో ఆయన చేతిలోని చిత్రాలన్నీ హోల్డ్‌లో పడిపోయాయి. అసలు విడుదలవుతాయా? లేదా? అనే సందేహాలు మెగా అభిమానుల్లో మొదలయ్యాయి. ముఖ్యంగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’ పైన ఎక్కువ అనుమానాలు వచ్చాయి. ఈ సినిమా షూటింగ్ మెుదలై మూడేళ్లు దాటినా.. ఇప్పటివరకు విడుదల తేదీపై క్లారిటీ లేదు. పైగా డైరెక్టర్ క్రిష్.. అనుష్కతో ఓ సినిమాకు కూడా అనౌన్స్ చేయడంతో ఇక హరిహర వీరమల్లు ఇప్పట్లో రానట్లేనని అంతా భావించారు. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హరిహర వీరమల్లు నుంచి అప్‌డేట్ రావడంతో ఫ్యాన్స్‌లో ఆశలు మళ్లీ చిగురించాయి.
ఏప్రిల్ 17 , 2024
Vijay Devarakonda: ‘నేను మూర్ఖుడ్ని కాదని చెప్పండి’.. రౌడీ బాయ్ స్పెషల్ వీడియో
డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కొద్ది సైబర్ నేరాలు సైతం గణనీయంగా పెరుగుతున్నాయి. బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు చోరి చేసేందుకు సైబర్ నేరస్తులు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు, ప్రభుత్వ అధికారులమని చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని యంగ్ హీరో విజయ్ దేవరకొండ సూచించాడు. ఫేక్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
రౌడీ బాయ్ ఏం చెప్పాడంటే?
సైబర్ నేరాలు, మోసాల పట్ల ప్రతీ ఒక్కరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సూచించాడు. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో తన ఫ్రెండ్‌కు జరిగిన ఘటనను పంచుకున్నాడు. ‘ఫ్రెండ్, శ్రేయోభిలాషి అంటూ మాట కలుపుతూ డబ్బులు అడిగే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు ఖాతాలో మనీ క్రెడిట్ అయినట్లు సైతం మెసేజ్‌లు సృష్టిస్తారు. ఒకవేళ అలాంటివి ఏమైనా వస్తే ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకునేందుకు తప్పనిసరిగా బ్యాంక్ స్టేట్‌మెంట్ చెక్ చేసుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తే నేను మూర్ఖుడిని కాదు అని చెప్పండి’ అంటూ వీడియోను విజయ్ ముగించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సమాజానికి ఉపయోగపడే వీడియో చేసినందుకు విజయ్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
https://twitter.com/pakkatelugunewz/status/1876979601215299644
'VD 14' క్రేజీ అప్‌డేట్..
టాక్సీవాలాతో బ్లాక్ బాస్టర్ ఇచ్చిన దర్శకుడు రాహుల్ సంకృత్యన్‌తో విజయ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. VD14 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. 1854 - 78 మధ్య కాలంలో ఈ సినిమా సాగనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ మూవీకి బాలీవుడ్ సంగీత ద్వయం ఎంపికైనట్లు సమాచారం. ఆదిపురుష్‌కు పనిచేసిన అజయ్-అతుల్ ఈ సినిమాకు మ్యూజిక్ సమకూర్చనున్నట్లు ఒక్కసారిగా వార్తలు మెుదలయ్యాయి. ఇక ఇందులో హీరోయిన్‌గా రష్మిక మందన్న చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
https://twitter.com/tupaki_official/status/1876903598078009523
‘VD 12’తో విజయ్ బిజీ..
ప్రస్తుతం విజయ్.. ‘VD12’ షూటింగ్‌తో పాల్గొంటూ చాలా బిజీగా ఉన్నాడు. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వేసవిలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయాలని భావించినా అదే సమయంలో పవన్ కల్యాణ్ (హరి హర వీరమల్లు) మూవీ రాబోతున్న నేపథ్యంలో విడుదల వాయిదా వేయబోతున్నట్లు తెలిసింది. విడుదలకు ఎలాగూ సమయం ఉండటంతో షూటింగ్ మెల్లగా చేస్తున్నారని టాక్. ఫిబ్రవరిలో మొత్తం షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. శ్రీలంక నేపథ్యంలో మెుత్తం రెండు భాగాలుగా ఈ సినిమా రానున్నట్లు చిత్ర నిర్మాత కన్ఫార్మ్ చేశారు.
జనవరి 08 , 2025
Most searched People in google 2024: పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత.. ప్రపంచంలోనే రెండో వ్యక్తిగా గుర్తింపు
పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. ఈ పేరు తెలుగు సినిమా ప్రేక్షకులకు మాత్రమే కాదు, రాజకీయ అభిమానులకు కూడా విపరీతమైన క్రేజ్ కలిగించింది. తాజాగా గూగుల్ సెర్చ్ ట్రెండ్స్‌లో పవన్ కళ్యాణ్ పేరు మారుమోగుతోంది. ఏపీ, తెలంగాణ ప్రాంతాలను దాటి, విదేశాల వరకు ఆయన పేరు సెర్చ్ కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా అత్యధికమంది సెర్చ్ చేసిన సినీ హీరోగా ఆయన రెండో స‌్థానంలో నిలిచారు.
pawan Kalyan
గూగుల్ సెర్చ్ ట్రెండ్స్‌లో పవన్ హవా
2024లో గూగుల్ విడుదల చేసిన డేటా ప్రకారం, పవన్ కళ్యాణ్ పేరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది సెర్చ్ చేసిన హీరోల జాబితాలో రెండో స్థానంలో ఉంది. అమెరికన్ హాస్యనటుడు మైకా కాట్ విలియమ్స్ ఈ విభాగంలో మొదటి స‌్థానంలో ఉన్నారు. భారతీయ నటులకు సంబంధించి, పవన్ కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు.
2024లో పవన్ క్రేజ్ ఎందుకు?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం, తరువాత ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం.. ఈ రెండూ భారీ చర్చకు దారి తీశాయి. మే నెలలో ఆయన నియామకం జరిగినప్పటి నుంచి గూగుల్ సెర్చ్‌లో "పవన్ కళ్యాణ్ పోర్ట్‌ఫోలియో", ఏపీ డిప్యూటి సీఎం, సీజ్ ది షిప్ వంటి పదాలు ఎక్కువగా ట్రెండింగ్ అయ్యాయి. (Most searched People in google 2024)
ఇది కేవలం భారతదేశంలోనే కాకుండా నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా పవన్ పేరును ఎక్కువగా సెర్చ్ చేశారు. ముఖ్యంగా కాకినాడ ఓడరేవును సందర్శించినప్పుడు ఆయన చేసిన "సీజ్ ద షిప్"(Seize The Ship) వ్యాఖ్య కూడా అంతర్జాతీయంగా ట్రెండ్ అయ్యింది.
హరి హర వీర మల్లు ప్రభావం
పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరి హర వీర మల్లు టీజర్ విడుదల సమయంలో గూగుల్ సెర్చ్‌లు మరింత పెరిగాయి. ఈ చిత్రం అభిమానుల ఆసక్తిని పెంచడంతో పాటు ఆయనకు కొత్తగా అభిమానులను సంపాదించిపెట్టింది.
తెలుగు రాష్ట్రాల్లో సెర్చ్ ట్రెండ్
గూగుల్ డేటా ప్రకారం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాలతో పాటు తెలంగాణలోని భద్రాచలం ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ సెర్చ్ చేశారు.
వ్యక్తుల జాబితాలో పవన్ కళ్యాణ్ స్థానం
ఇక ఇండియాలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన వ్యక్తుల జాబితాలో పవన్ కళ్యాణ్ ఐదో స్థానంలో నిలిచారు. నితీష్ కుమార్, వినేష్ ఫోగట్, చిరాగ్ పాశ్వాన్, హార్దిక్ పాండ్యా వంటి ప్రముఖుల తర్వాత పవన్ కళ్యాణ్ పేరు ఎక్కువగా సెర్చ్ చేయబడింది. దీంతో దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ప్రజాదరణ మరోసారి స్పష్టంగా నిరూపితమైంది.
2024లో ట్రెండింగ్ వ్యక్తి
2024 గూగుల్ ట్రెండ్స్ జాబితాలో పవన్ కళ్యాణ్ ప్రపంచవ్యాప్తంగా అయిదో స్థానంలో నిలిచారు. ఇది ఏపీ రాజకీయాల్లో మాత్రమే కాదు, దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా పవన్ క్రేజ్ ఎంతలా పెరిగిందో నిరూపిస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. నటనలో తన ప్రతిభతో, రాజకీయాల్లో తన ధైర్యంతో తెలుగు ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈ (Most searched People in google 2024) అంశం పవన్ అభిమానుల మధ్య విశేషంగా చర్చనీయాంశమవుతోంది. 2025లో పవన్ క్రేజ్ మరింత పెరుగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
డిసెంబర్ 12 , 2024
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై శుక్రవారం వైకాపా నేత దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన్ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పరామర్శించారు. దాడి జరిగిన తీరు గురించి అడిగి తెలుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ విపక్ష వైకాపాపై విరుచుకుపడ్డారు. ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో అభిమానులు చేసిన పనికి పవన్ తీవ్ర అసహనానికి గురయ్యారు. వారిపై ఫైర్ అయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఫ్యాన్స్‌పై పవన్ ఆగ్రహం..
కడప రిమ్స్‌కు పవన్ వస్తున్నారన్న వార్త విని పెద్ద ఎత్తున అభిమానులు అక్కడకు పోటెత్తారు. పవన్ ప్రెస్‌మీట్ నిర్వహించిన క్రమంలో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దాడి అంశంపై పవన్ సీరియస్‌గా మీడియాతో మాట్లాడుతుండగా 'ఓజీ.. ఓజీ.. ఓజీ..' అంటూ స్లోగన్స్ చేశారు. దీంతో పవన్ ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. 'ఏంటయ్య మీరు. ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు. పక్కకు రండి' అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
https://twitter.com/GulteOfficial/status/1872910675108086014
ఐదు భాషల్లో పవన్ సింగింగ్..!
ప్రస్తుతం పవన్ 'హరి హర వీరమల్లు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ లాక్ అయినట్లు తెలుస్తోంది. జనవరి ఒకటో తారీకు 12AMకు రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. దీని గురించి త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఈ పాటను పవన్ స్వయంగా పాడినట్లు తెలుస్తోంది. మెుత్తం ఐదు భాషల్లో ఆయన గొంతు వినిపించినట్లు సమాచారం. దీంతో రిలీజ్ తర్వాత ఈ సాంగ్ ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందోనని ఫ్యాన్స్ ఇప్పటినుంచే అంచనాలు వేస్తున్నారు.
గతంలో పవన్ పాడిన సాంగ్స్..
పవన్.. సినీ నటుడు, పొలిటీషియన్‌గానే కాకుండా మంచి సింగర్‌గాను గుర్తింపు పొందాడు. ఇప్పటివరకూ చాలా సినిమాల్లో ఆయన గాత్రదానం చేశారు. అవి ఫ్యాన్స్‌ను ఎంతగానో అలరించాయి. పవన్ ఇప్పటివరకూ ‘ఎమ్ పిల్ల మాటాడవా’ (తమ్ముడు), తాటి చెట్టు ఎక్కలేడు (తమ్ముడు), బైబైయే బంగారు రమణమ్మ (ఖుషి), నువ్వు సారా తాగుట (జానీ), రావోయి మా ఇంటికి (జానీ), పాపారాయుడు (పంజా), కాటమరాయుడా (అత్తారింటికి దారేది), రాజులకి రాజు పోతురాజు (జనసేన ప్రైవేట్ సాంగ్), కొడకా కోటేశ్వర్ రావు (అజ్ఞాతవాసి) పాటలు పాడారు.
పవన్ బిజీ బిజీ..
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉన్నారు. వరుస మీటింగ్స్, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు దర్శక - నిర్మాతలకు ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే పట్టాలెక్కించిన సినిమాలను పూర్తి చేస్తున్నారు. తన తదుపరి చిత్రాలు ‘ఓజీ’, ‘హరిహర వీరమల్లు’ షూట్స్‌లో వీలు కుదిరినప్పుడు పాల్గొంటున్నారు. సుజీత్ దర్శకత్వంలో ఆయన నటిస్తోన్న చిత్రమే ‘ఓజీ’. యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్‌గా ఇది సిద్ధమవుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు.
డిసెంబర్ 28 , 2024
OG Movie: టిల్లు బ్యూటీతో పవన్ కల్యాణ్ రొమాన్స్!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేతిలోని ప్రాజెక్ట్స్‌లో 'ఓజీ' (OG) ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వీలైనంత తొందరగా 'ఓజీ'ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలాఉంటే ఓజీ చిత్రానికి సంబంధించి ఓ సాలిడ్ అప్‌డేట్ బయటకొచ్చింది. ఇందులో యంగ్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నేహాశెట్టి స్పెషల్ సాంగ్
యంగ్ బ్యూటీ నేహా శెట్టి (Neha Shetty) ‘డీజే టిల్లు’తో ఒక్కసారిగా అందరి దృష్టి ఆకర్షించింది. రాధిక అనే పాత్రతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది. లేటెస్ట్ బజ్ ప్రకారం ‘ఓజీ’ చిత్రంలో ఈ అమ్మడు ఐటెం సాంగ్ చేస్తునట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘ఓజీ’ మూవీ షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. అక్కడే ఈ స్పెషల్ సాంగ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా మెుదలైనట్లు మూవీ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ సాంగ్‌లో నేహా పర్‌ఫార్మెన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని అంటున్నారు. ఫ్యాన్స్‌కు పక్కాగా విజువల్ ట్రీట్ ఉంటుందని చెబుతున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు సమాచారం. దీంతో ‘ఓజీ’పై అంచనాలు అభిమానుల్లో రెట్టింపయ్యాయని చెప్పవచ్చు.
https://twitter.com/Fukkard/status/1869238838721437802
‘ఓజీ’తో బౌన్స్ బ్యాక్..!
‘డీజే టిల్లు’ బ్లాక్ బాస్టర్ కావడంతో నేహా శెట్టికి తిరుగుండదని అంతా భావించారు. కానీ ఆ మూవీ సక్సెస్ హీరో సిద్ధు జొన్నగడ్డకు ఉపయోగపడినట్లుగా నేహాకు యూజ్ కాలేదు. ఆ సినిమా తర్వాత ఈ అమ్మడికి బడా చిత్రాల్లో అవకాశాలు రాలేదు. ‘బెదురులంక 2012’, ‘రూల్స్ రంజన్’ వంటి చిన్న ప్రాజెక్ట్స్ చేసినా ఈ అమ్మడికి పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత ‘టిల్లు స్క్వేర్’లో గెస్ట్ రోల్, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో మెప్పించినా తర్వాత మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దీంతో 'ఓజీ'లో స్పెషల్ సాంగ్‌తోనైనా నేహా బౌన్స్‌బ్యాక్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇటీవల 'పుష్ప 2'లో ‘కిస్సిక్’ సాంగ్ చేసి శ్రీలీల వరుస అవకాశాలు దక్కించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
మోస్ట్ వాంటెడ్ మూవీగా ‘ఓజీ’
పవన్ కల్యాణ్ చేతిలోని ‘హరి హర వీరమల్లు’, ఉస్తాద్ భగత్ సింగ్ కంటే ‘ఓజీ’ చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. కెరీర్‌లోనే తొలిసారి గ్యాంగ్‌స్టర్ పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తున్నాడు. ‘ఓజీ’ గ్లింప్స్‌లో పవన్ యాక్టింగ్ చూసిన ఫ్యాన్స్ ఈ సినిమా మరో లెవల్లో ఉంటుందని ముందుగానే ఓ అభిప్రాయానికి వచ్చేశారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. అలానే జపనీస్ నటుడు కజుకి కిటముర కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. వీరితో పాటు అర్జున్ దాస్ (Arjun Das), శ్రీయ రెడ్డి (Sriya Reddy), ప్రకాష్ రాజ్ (Prakash Raj), హరీష్ ఉత్తమన్ (Harish Uthaman), అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) వంటి వారు ఈ సినిమాలో నటిస్తుండటంతో ‘ఓజీ’పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
ఓజీలో ప్రభాస్, అకీరానందన్?
‘ఓజీ’ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కూడా ఓ క్యామియో ఇవ్వబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. మూవీ క్లైమాక్స్‌లో ప్రభాస్ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరిగింది. అంతేకాదు సుజీత్ - ప్రభాస్ కాంబోలో వచ్చిన ‘సాహో’ చిత్రంతో ఓజీకి లింక్ కూడా ఉండనున్నట్లు కథనాలు వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు పవన్ తనయుడు అకీరా నందన్ కూడా ‘ఓజీ’లో నటించినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపించింది. పవన్ చిన్నప్పటి పాత్రలో అకీరా నటించాడని, స్క్రీన్‌పై అతడి రోల్ చూసి అందరూ సర్‌ప్రైజ్ అవుతారంటూ కూడా నెట్టింట పోస్టులు కనిపించాయి.
https://twitter.com/TBO_Updates/status/1862813629441011860
https://twitter.com/FilmyTwood/status/1859094576272953795#
డిసెంబర్ 18 , 2024
Pawan Kalyan: తమిళ స్టార్ డైరెక్టర్‌తో పవన్ మూవీ? రికార్డుల మోత ఖాయమేనా!
ఒకప్పుడు టాలీవుడ్‌కు పరిమితమైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేరు ప్రస్తుతం రాజకీయాల్లోనూ మారుమోగుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఓ వైపు రాజకీయాల్లో బిజీ బిజీగా ఉంటూనే చేతిలో ఉన్న మూవీ ప్రాజక్ట్స్‌ను ఫినిష్ చేసేందుకు పవన్ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో అక్కడి స్టార్ డైరెక్టర్‌పై పవన్ ప్రశంసలు కురిపించారు. అతడి ఫిలిం మేకింగ్ బాగుంటుదంటూ ఆకాశానికి ఎత్తారు. దీంతో ఆ డైరెక్టర్‌తో సినిమా పడితే వేరే లెవల్లో ఉంటుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అటు పవన్ కామెంట్స్‌పై సదరు డైరెక్టర్ కూడా తాజాగా స్పందించడంతో వీరి కాంబోకు ఎక్కువ రోజులు పట్టదన్న చర్చ మెుదలైంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? పవన్ చేసిన కామెంట్స్ ఏంటి? వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లోకేష్ కనగరాజ్ మేకింగ్ ఇష్టం: పవన్
కోలీవుడ్‌లో తనకు ఇష్టమైన దర్శకుడి గురించి పవన్ కల్యాణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దర్శకుల విషయానికి వస్తే తనకు మణిరత్నం (Maniratnam) అంటే చాలా ఇష్టమని పవన్ అన్నారు. ప్రస్తుత దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఫిల్మ్ మేకింగ్ ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘లియో’, ‘విక్రమ్’ సినిమాలు తాను చూశానని అన్నారు. అవి తనకు బాగా నచ్చాయని ప్రశంసించారు. అలాగే తమిళ హాస్యనటుడు యోగిబాబు (Yogi Babu) కామెడీ అంటే తనకు బాగా నచ్చుతుందని పవన్ ఇంటర్యూలో పేర్కొన్నారు. ఈ కామెంట్స్‌పై తమిళ ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎలాంటి భేషజాలం లేకుండా పక్క ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్లను ఆకాశానికి ఎత్తడం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/i/status/1841446808888758277
పవన్‌కు థ్యాంక్స్ చెప్పిన డైరెక్టర్
తన మేకింగ్‌పై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించడంపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మీ నుంచి అలాంటి మాటలు వినడం ఎంతో ఆనందంగా గౌరవంగా ఉంది సర్. నా వర్క్ మీకు నచ్చడం ఎంతో గ్రేట్‌గా ఆహ్లదంగా అనిపిస్తుంది. మీకు నా కృతజ్ఞతలు’ అంటూ రాసుకొచ్చారు. ఇక లోకేష్ కనగరాజ్ విషయానికి వస్తే ఆయన తక్కువ టైమ్‌లోనే ఎంతో పాపులర్ అయ్యారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌ను సృష్టించి పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తి కలిగించారు. అటువంటి డైరెక్టర్ గురించి పవన్ మాట్లాడటంతో వీరిద్దరి కాంబోపై ఒక్కసారిగా చర్చమెుదలైంది. వీరి కాంబోలో ఓ మాస్ సినిమా పడితే థియేటర్లు దద్దరిల్లిపోతాయంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ కోరికను పవన్ అంగీకరిస్తారో లేదో చూడాలి మరి.
https://twitter.com/Dir_Lokesh/status/1841691807983534592
సమ్మర్‌లో గ్రాండ్ రిలీజ్
ప్రస్తుతం పవన్ చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌లోనూ జాయిన్ అయ్యారు. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu Release Date) రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నట్లు తెలిపింది.
త్వరలో పట్టాలపైకి ‘ఉస్తాద్’, ‘ఓజీ’!
హరిహర వీరమల్లుతో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ పవన్ చేతిలో ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ సుదీప్‌తో ‘ఓజీ’ (OG), హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) చిత్రాల్లో పవన్ నటిస్తున్నారు. రాజకీయాల్లో నిమగ్నం కావడంతో హరిహర వీరమల్లుతో పాటు ఆ రెండు చిత్రాల షూటింగ్ కూడా వాయిదా పడ్డాయి. ఇటీవల హరిహర వీరమల్లు షూట్ తిరిగి ప్రారంభం కావడంతో పెండింగ్ పడ్డ ఆ రెండు చిత్రాలు కూడా త్వరలో పట్టాలెక్కే సంకేతాలు కనిపిస్తున్నాయి. అటు పవన్ సైతం ఆ రెండు ప్రాజెక్ట్స్‌ను కూడా త్వరగా ఫినిష్ చేయాలన్న ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెటొచ్చని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
అక్టోబర్ 03 , 2024
VD 12: శ్రీలంకలో చిల్ అవుతున్న విజయ్ దేవరకొండ.. బోట్ నడుపుతున్న వీడియో వైరల్!
టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒకరు. ఎలాంటి ఫిల్మ్ నేపథ్యం లేకుండా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్ ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు. ‘పెళ్లిచూపులు’, ‘టాక్సీవాలా’, ‘గీత గోవిందం’ సక్సెస్‌తో తెలుగు ఇండస్ట్రీలో సుస్థిర స్థానం సంపాదించాడు. అటువంటి విజయ్‌కు గత కొంతకాలంగా ఇండస్ట్రీలో కలిసిరావడం లేదు. అతడు చేసిన గత మూడు చిత్రాలు ‘లైగర్’, ‘ఖుషీ’, ‘ఫ్యామిలీ స్టార్’ బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. దీంతో ప్రస్తుతం అతడు చేస్తున్న ‘VD12’ చిత్రంపై విజయ్‌తో పాటు అతడి ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూట్ శ్రీలంకలో జరుగుతుండగా అక్కడ విజయ్ చిల్ అవుతున్నాడు.
బోట్ నడుపుతూ విజయ్ చిల్!
విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కాంబోలో 'VD 12' తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శ్రీలంకలో శరవేగంగా సాగుతోంది. విజయ్ సరికొత్త లుక్‌లో ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. అదే సమయంలో షూటింగ్ గ్యాప్‌లో తెగ చిల్ అవుతున్నాడు. నీటిలో బోట్ రైడ్ చేస్తూ విజయ్ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. సూర్యస్తమయ సమయంలో బోట్ రైడ్ చేస్తున్న వీడియోను విజయ్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. విజయ్ ఫ్యాన్స్ ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. బోట్ డ్రైవింగ్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda)
రెండు భాగాలుగా..
'VD 12' చిత్రానికి సంబంధించి ఇటీవల నిర్మాత నాగవంశీ మాట్లాడారు. దీన్ని రెండు పార్టులుగా అందించనున్నట్లు తెలిపారు. ‘విజయ్ దేవరకొండ సినిమా విషయంలో నేను రిస్క్ తీసుకోవడం లేదు. రెండు పార్టులకు సరిపోయే కంటెంట్ సిద్ధంగా ఉంది. మొదటి భాగం ఫలితం ఆధారంగా రెండో పార్ట్ తెరకెక్కిస్తాం. గౌతమ్ తిన్ననూరి కథను అద్భుతంగా తీర్చిదిద్దారు. సూపర్ హిట్ అవుతుందని మాకు పూర్తి నమ్మకం ఉంది’ అని తెలిపారు. అయితే విజయ్ కెరీర్‌లో ఇప్పటివరకూ ఏ సినిమా రెండు భాగాలుగా రాలేదు. విజయ్ చేసిన చిత్రాలన్నీ సింగిల్ పార్ట్‌గా వచ్చినవే. నాగవంశీ చెప్పినట్లు అన్ని అనుకున్నట్లు జరిగితే విజయ్ కెరీర్‌లోనూ సీక్వెల్స్ చూసే అవకాశం లభించనుంది.
పవన్‌తో పోటీ!
సోమవారం (సెప్టెంబర్ 23) హరి హర వీర మల్లు రిలీజ్ తేదీని ప్రకటించడంతో బాక్సాఫీస్ వద్ద పవన్, విజయ్ దేవరకొండ తలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజయ్ నటిస్తున్న 'VD 12' చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. తాజాగా అదే రోజున హరిహర వీరమల్లు వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పదని అంటున్నారు. పవన్ లాంటి బిగ్‌స్టార్‌ను ఢీకొట్టేందుకు తమ హీరో సిద్ధమంటూ విజయ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే పవన్‌కు అత్యంత సన్నిహితులైన సితారా నిర్మాతలు 'VD 12'ను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు పోటీగా వారు తమ చిత్రాన్ని బరిలోకి దింపే అవకాశం లేకపోవచ్చని సమాచారం. మరో కొత్త డేట్‌ను చూసుకొని VD12ను రిలీజ్ చేసే అవకాశం లేకపోదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
విజయ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్!
ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో ‘VD12’తో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘ఫ్యామిలీ స్టార్’ తర్వాత విజయ్‌తో దిల్‌రాజు మరో చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నారు. అలాగే డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ మరో ప్రాజెక్ట్ చేయనున్నాడు. పీరియాడికల్ జానర్‌లో రాయల సీమ బ్రాక్ డ్రాప్‌లో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న నటించే అవకాశముంది.
సెప్టెంబర్ 24 , 2024