• TFIDB EN
  • ఆదికేశవ (2023)
    U/ATelugu

    బాలు (వైష్ణవ్‌ తేజ్‌) తల్లిచాటు బిడ్డగా గారాబంగా పెరుగుతాడు. కానీ, కళ్లముందు అన్యాయం జరిగితే అసలు సహించడు. ఎంతటివాళ్లనైనా ఎదిరించే మనస్తత్వం అతడిది. తల్లిదండ్రుల బలవంతంతో కాస్మోటిక్‌ కంపెనీలో ఉద్యోగానికి చేరతాడు. కంపెనీ సీఈవో చిత్రావతి(శ్రీలీల)తో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో రాయలసీమలోని బ్రహ్మసముద్రం ప్రాంతం నుంచి వచ్చిన ఓ పెద్దాయన బాలుకు అసలైన కుటుంబం వేరే ఉందని చెబుతాడు. అతడి అసలు పేరు రుద్ర కాళేశ్వర్‌రెడ్డి అని తెలియజేస్తాడు. ఇంతకీ బాలు ఎవరు? బ్రహ్మ సముద్రం వెళ్లాక అక్కడ ఏం జరిగింది? ఆ ప్రాంతంలో అరాచకాలు సృష్టిస్తున్న చెంగారెడ్డి (జోజు జార్జ్‌)ని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.

    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Netflixఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    శ్రీలీలచిత్ర, బాలు ప్రేమికులు
    పంజా వైష్ణవ్ తేజ్బాలు/రుద్ర కాళేశ్వర్ రెడ్డి
    అపర్ణా దాస్వజ్ర, బాలు సోదరి
    జోజు జార్జ్చెంగా రెడ్డి
    జయప్రకాష్as Balu's adoptive father
    సుమన్మహా కాళేశ్వర్ రెడ్డి, బాలు/రుద్ర జీవ తండ్రి
    రాధిక శరత్‌కుమార్బాలు పెంపుడు తల్లి
    సిబ్బంది
    శ్రీకాంత్ ఎన్ రెడ్డిదర్శకుడు
    సూర్యదేవర నాగ వంశీనిర్మాత
    సాయి సౌజన్యనిర్మాత
    కథనాలు
    Aadikeshava Review: యాక్షన్‌ సీన్లలో రుద్రతాండవం చేసిన మెగా మేనల్లుడు.. ‘ఆదికేశవ’ ఎలా ఉందంటే?
    Aadikeshava Review: యాక్షన్‌ సీన్లలో రుద్రతాండవం చేసిన మెగా మేనల్లుడు.. ‘ఆదికేశవ’ ఎలా ఉందంటే?
    నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్, సదా, సుదర్శన్, రాధికా శరత్ కుమార్, జయప్రకాశ్, తనికెళ్ళ భరణి, సుమన్, అపర్ణా దాస్ తదితరులు   రచన - దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్. రెడ్డి సినిమాటోగ్రఫీ: డడ్లీ  సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్ నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య విడుదల తేదీ: నవంబర్ 24, 2023   మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ తన తొలి సినిమా ‘ఉప్పెన’ (Uppen Movie)తో బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత చేసిన చిత్రాలు ఆ స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో తాజాగా నటించిన 'ఆదికేశవ' మూవీపై వైష్ణవ్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. గత సినిమాలకు భిన్నంగా ఇందులో మాస్‌ లుక్‌లో వైష్ణవ్‌ కనిపించాడు. మరి, 'ఆదికేశవ'తో ఆయన విజయం అందుకున్నారా? లేదా?. వైష్ణవ్‌-శ్రీలీల జోడీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథ బాలు (వైష్ణవ్‌ తేజ్‌) తల్లిచాటు బిడ్డగా గారాబంగా పెరుగుతాడు. కానీ, కళ్లముందు అన్యాయం జరిగితే అసలు సహించడు. ఎంతటివాళ్లనైనా ఎదిరించే మనస్తత్వం అతడిది. తల్లిదండ్రుల బలవంతంతో కాస్మోటిక్‌ కంపెనీలో ఉద్యోగానికి చేరతాడు. కంపెనీ సీఈవో చిత్రావతి(శ్రీలీల)తో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో రాయలసీమలోని బ్రహ్మసముద్రం ప్రాంతం నుంచి వచ్చిన ఓ పెద్దాయన బాలుకు అసలైన కుటుంబం వేరే ఉందని చెబుతాడు. అతడి అసలు పేరు రుద్ర కాళేశ్వర్‌రెడ్డి అని తెలియజేస్తాడు. ఇంతకీ బాలు ఎవరు? బ్రహ్మ సముద్రం వెళ్లాక అక్కడ ఏం జరిగింది? ఆ ప్రాంతంలో అరాచకాలు సృష్టిస్తున్న చెంగారెడ్డి (జోజు జార్జ్‌)ని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎలా సాగిందంటే ప్రథమార్థం మెుత్తం సరదా సరదాగా కాలక్షేపంగా సాగిపోతుంది. హైదరాబాద్‌లో స్నేహం, ప్రేమ, కుటుంబ సన్నివేశాలు కనిపిస్తాయి. విరామం సమయానికి కథ మలుపు తిరుగుతుంది. ద్వితీయార్థం కథంతా సీమలో చెంగారెడ్డితో ఢీ కొట్టడంతో సాగిపోతుంది. హీరో హీరోయిన్‌ కలవగానే ఓ పాట, విలన్‌ హీరో ఎదురుపడగానే ఓ ఫైట్‌ అన్నట్లు సినిమా సాగిపోతుంది.  ఎవరెలా చేశారంటే వైష్ణవ్‌తేజ్‌ మరోమారు మంచి నటుడిగా నిరూపించుకున్నాడు. ప్రథమార్థంలో లవర్‌ బాయ్‌గా సరదాగా ఉండే పాత్రలో ఆకట్టుకున్నాడు. ద్వితీయార్థంలో రుద్రకాళేశ్వర్‌రెడ్డిగా వీరోచితాన్ని ప్రదర్శించాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక శ్రీలీలకు నటన పరంగా పెద్దగా స్కోప్‌ లేదు. కానీ డ్యాన్సుల్లో మాత్రం ఎప్పటిలాగే ఇరగదీసింది. హీరో తల్లి పాత్రలో రాధిక మెప్పించారు. విలన్‌గా జోజు జార్జ్‌ క్రూరంగా కనిపించినా ఆ పాత్ర ప్రభావం తక్కువే. ఇక అపర్ణాదాస్‌, సుమన్‌, తనికెళ్ల భరణి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సుదర్శన్‌ అక్కడక్కడా నవ్వించాడు డైరెక్షన్‌ ఎలా ఉందంటే? కథలో ప్రేమ, కుటుంబ బంధాలు, డ్రామా, రాజకీయం తదితర అంశాలు పుష్కలంగా ఉన్నా వాటిని సమర్థవంతంగా తెరకెక్కించడంలో డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి తడబడ్డాడు. ఒకట్రెండు మలుపులు తప్ప కథలో కానీ, కథనంలో కానీ కొత్తదనమేమీ కనిపించదు. పాత రోజుల్లో వచ్చిన ఫ్యాక్షన్‌ సినిమాల్లాగే డైరెక్టర్‌ కథను చెప్పినట్లు అనిపిస్తుంది. భావోద్వేగాలతో కట్టిపడేసే సీన్లు, తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి ఎక్కడా కనిపించదు. రచనలో బలం లేకపోయిన దర్శకుడి మేకింగ్‌ మాత్రం బాగుంది.  టెక్నికల్‌గా  సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. డడ్లీ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. జీవీ ప్రకాశ్‌ పాటలు గుర్తుపెట్టుకునేలా లేవు. కానీ, నేపథ్యం సంగీతం బాగుంది. సినిమాకు సంబంధించిన మిగతా విభాగాలు అన్నీ మంచి పనితీరునే కనబరిచాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ వైష్ణవ్‌తేజ్‌ నటనమలుపులునేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ కథ, కథనంపండని భావోద్వేగాలు  రేటింగ్‌: 2.5/5
    నవంబర్ 24 , 2023
    Successful Actress 2023: ఈ ఏడాది తమ స్టార్‌డమ్‌ను అమాంతం పెంచుకున్న హీరోయిన్లు వీరే!
    Successful Actress 2023: ఈ ఏడాది తమ స్టార్‌డమ్‌ను అమాంతం పెంచుకున్న హీరోయిన్లు వీరే!
    ఈ ఏడాది టాలీవుడ్‌ చాలా మంది హీరోయిన్లకు కలిసొచ్చింది. వారు నటించిన చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అయితే ప్రత్యేకించి కొందరు మాత్రం ఈ ఏడాది తమ తల రాతలను మార్చుకున్నారు. తమకంటూ స్టార్‌ స్టేటస్‌ను సంపాదించుకున్నారు. అంతేగాక 2023 ఏడాదిలో తమకు తిరుగులేదని వారు నిరూపించుకున్నారు. ఇంతకీ ఆ భామలు ఎవరు? వారు సాధించిన ఘనతలు ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.  శ్రీలీల ఈ ఏడాది చాలా బాగా పాపులర్ అయిన హీరోయిన్ల జాబితాలో శ్రీలీల (Sreeleela) ప్రథమ స్థానంలో ఉంటుంది. ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. రవితేజ పక్కన ‘ధమాకా’లో చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వరుసగా ఆ తర్వాత వరుసగా రామ్‌తో ‘స్కంద’, బాలయ్య కూతురిగా 'భగవంత్‌ కేసరి', పంజా వైష్ణవ్‌ తేజ్‌తో 'ఆదికేశవ', నితీన్‌తో 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌' వంటి చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం మహేష్‌, విజయ్‌ దేవరకొండ, పవన్‌ కల్యాణ్‌ సరసన శ్రీలీల నటిస్తోంది. కీర్తి సురేష్‌ యంగ్‌ బ్యూటీ కీర్తి సురేష్‌ (Keerthy Suresh)కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. నాని సరసన ఆమె నటించిన 'దసరా' చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విజయవంతమైంది. రూ.100 కోట్లకు పైగా ఇందులో తన నటనకు గానూ కీర్తి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరోవైపు ‘భోళాశంకర్‌’ సినిమాలో చిరంజీవి సోదరిగా నటించి మరోమారు అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌ పక్కన ‘మామన్నన్‌’ సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  రష్మిక మందన్న ఈ ఏడాది రష్మిక మందన్న(Rashmika Mandanna) తన స్టార్‌డమ్‌ను మరింత పెంచుకుంది. విజయ్‌తో ‘వారసుడు’ చిత్రంలో నటించిన ఈ భామ.. బాలీవుడ్‌లో సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన ‘మిస్టర్‌ మజ్నూ’ చేసింది. ఇక రణ్‌బీర్‌ కపూర్‌కు జోడీగా ఆమె నటించిన ‘యానిమల్‌’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇందులో రష్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. సమంత ఈ ఏడాది సమంత (Samantha)కు మిశ్రమ స్పందన ఎదురైంది. ఆమె నటించిన ‘శాకుంతలం’ చిత్రం ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకోగా విజయ్‌ దేవరకొండతో చేసిన ‘ఖుషి’ మూవీ మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. మరోవైపు తమిళం, ఇంగ్లీష్‌లో తెరకెక్కుతున్న బైలింగ్విల్‌ ఫిల్మ్‌ ‘చెన్నై స్టోరీస్‌’లోనూ నటించే అవకాశాన్ని సమంత దక్కించుకుంది.  సంయుక్త మీనన్‌ ఈ ఏడాది సంయుక్త మీనన్‌ (Samyuktha menon)కు మంచి విజయాలను అందించింది. ధనుష్‌ సరసన ఆమె నటించిన 'సార్‌' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ సరసన ఆమె చేసిన 'విరూపాక్ష' చిత్రం ఘన విజయం సాధించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో సంయుక్త తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  అనుష్క శెట్టి గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన స్టార్‌ నటి అనుష్క (Anushka Shetty) ఈ ఏడాది మరోమారు తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 'మిస్ శెట్టి మిష్టర్‌ పోలిశెట్టి' చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా అనుష్కకు గట్టి కమ్‌బ్యాక్‌ లభించిందని ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. శ్రుతి హాసన్‌ టాలీవుడ్‌లో సరైన సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న శ్రుతి హాసన్‌ (Shruti Haasan)కు ఈ ఏడాది కలిసొచ్చిందని చెప్పవచ్చు. చిరంజీవి, బాలకృష్ణలతో ఆమె నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు సంక్రాంతికి విడుదలై మంచి హిట్‌ టాక్ తెచ్చుకున్నాయి. తాజాగా నానితో ‘హాయ్‌ నాన్న’ చిత్రంలోనూ ఓ పాటలో స్టెప్పులేసి అదరగొట్టింది. అలాగే ప్రభాస్‌ సరసన 'సలార్‌' సినిమాలోనూ శ్రుతి హాసన్‌ నటించింది. 
    డిసెంబర్ 19 , 2023
    This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    ఎప్పటిలాగే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి. నవంబర్ ఆఖరి వారంలో ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు థియేటర్లలోకి రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ పలు చిత్రాలు, కొత్త వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.  ఆదికేశవ మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej), శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన చిత్రం ‘ఆదికేశవ’ (Aadikeshava). శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వం వహించారు. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మాస్‌ యాక్షన్‌ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. కోట బొమ్మాళి పి.ఎస్‌ ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ కీలకపాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’ (Kota bommali PS). వరలక్ష్మి శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar), రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌ (Shivani Rajashekar) ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తేజ మార్ని దర్శకుడు. బన్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబరు 24న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక ఇందులోని ‘లింగి లింగి లింగిడి’ (Lingi Lingi Lingidi) పాటకు శ్రోతల నుంచి మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. ధృవ నక్షత్రం విక్రమ్‌ (Vikram) హీరోగా గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ (Gautham Vasudev Menon) దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ధృవ నక్షత్రం’ (Dhruva Natchathiram). స్పై, యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. 2016లోనే ఈ సినిమా పట్టాలెక్కగా.. 2017లో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. చిత్రీకరణ పూర్తయినప్పటికీ అనుకోని కారణాలతో వాయిదా పడింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. పర్‌ఫ్యూమ్‌ జేడీ స్వామి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘పర్‌ఫ్యూమ్‌’ (Perfume). చేనాగ్‌, ప్రాచీ థాకర్‌ జంటగా నటించారు. జె.సుధాకర్‌, శివ.బి, రాజీవ్‌ కుమార్‌.బి, లావురి శ్రీనివాస్‌, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్‌ అక్కినేని కలిసి నిర్మించారు. స్మెల్‌ బేస్డ్‌ థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాని ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మాధవే మధుసూదన ‘మాధవే మధుసూదన’ (Madhave Madhusudana) చిత్రం కూడా ఈ వారమే రిలీజ్ కానుంది. 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో తేజ్‌ బొమ్మదేవర, రిషిక లోక్రే జంటగా నటించారు. బొమ్మదేవర రామచంద్రరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. జయప్రకాష్‌, సుమన్‌ కీలక పాత్రలు పోషించారు. ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి (telugu.yousay.tv/tfidb/ott) TitleCategoryLanguagePlatformRelease DateChaaverMovieMalayalamSonyLIVNov 24Stamped from the Beginning MovieEnglishNetflixNov 20Squid Game Season 2MovieEnglishNetflixNov 22Puli madaMovieTelugu/MalayalamNetflixNov 23My DemonWeb SeriesEnglishNetflixNov 23Doll boyMovieEnglishNetflixNov 24Gran TurismoMovieTelugu/EnglishNetflixNov 25FargoWeb SeriesEnglishDisney+HotStarNov 21The villageMovieTamilAmazon PrimeNov 24
    నవంబర్ 21 , 2023
    Tollywood Biggest Disasters 2023: ఈ ఏడాది డిజాస్టర్లుగా నిలిచిన స్టార్‌ హీరోల చిత్రాలు ఇవే!
    Tollywood Biggest Disasters 2023: ఈ ఏడాది డిజాస్టర్లుగా నిలిచిన స్టార్‌ హీరోల చిత్రాలు ఇవే!
    2023వ సంవత్సం కొందరి హీరోలకు ఊహించని విజయాలను అందిస్తే మరికొందరికి మాత్రం పీడకలను మిగిల్చింది. భారీ అంచనాలతో విడుదలైన కొన్ని చిత్రాలు భాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా దెబ్బతిన్నాయి. ఊహించని పరాజయాన్ని మూటగట్టుకుని ఈ ఏడాదిలోనే అతిపెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఇంతకి ఆ చిత్రాలు ఏవి? అందులో నటించిన స్టార్‌ హీరోలు ఎవరు? ఇతర విశేషాలను ఇప్పుడు చూద్దాం.  శాకుంతలం గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘శాకుంతలం’. సమంత లీడ్‌ రోల్‌ చేసిన చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద చతికలపడింది. తీవ్ర నష్టాలను చవిచూసింది. సినిమాపై సామ్‌ పెట్టుకున్న ఆశలను అడియాశలు చేసింది. ఏజెంట్‌ యంగ్‌ హీరో అక్కినేని అఖిల్‌కు ఇండస్ట్రీలో ఇప్పటివరకూ సరైన హిట్‌ లేదు. దీంతో అతడు ‘ఏజెంట్’ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద ఊహించని పరాజయాన్ని మూటగట్టుకుంది. అఖిల్‌ కెరీర్‌లో మరో ఫ్లాప్‌గా నిలిచింది.  ఆదిపురుష్‌ ప్రభాస్‌ రాముడిగా తెరకెక్కిన 'ఆదిపురుష్‌' చిత్రం ఈ ఏడాదిలోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఓం రౌత్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. విడుదల తర్వాత అనేక విమర్శలను మూటగట్టుకుంది.  కస్టడీ ఈ ఏడాది అక్కినేని ఫ్యామిలీకి కలిసిరాలేదని చెప్పవచ్చు. ఎందుకంటే నాగ చైతన్య హీరోగా చేసిన ‘కస్టడీ’ చిత్రం కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తొలిసారి కానిస్టేబుల్‌ పాత్రలో చేసిన చైతూ.. సినిమాను విజయతీరాలకు చేర్చలేకపోయారు. దీంతో నిర్మాతలు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది.  రావాణాసుర రవితేజ తొలిసారి విలన్‌ షేడెడ్‌ పాత్రలో నటించిన చిత్రం 'రావణాసుర'. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, పోస్టర్లు సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. అయితే థియేటర్లలో ఈ చిత్రం ఊహించని విధంగా ఫ్లాప్‌ టాక్ సొంతం చేసుకుంది. రవితేజ నటనకు మంచి మార్కులే పడినప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద మాత్రం కాసుల వర్షం కురిపించలేకపోయింది.  గాండీవదారి అర్జున వరణ్‌తేజ్‌ హీరోగా తెరకెక్కిన 'గాండీవదారి అర్జున' చిత్రం కూడా ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో సాక్షి వైద్య హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను చవిచూసింది.  రామబాణం ఈ మధ్య సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్న స్టార్‌ హీరో గోపిచంద్‌.. ఈ ఏడాది ‘రామబాణం’తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ చిత్రం గోపిచంద్ ఆశలను అడియాశలు చేసింది. ప్రేక్షకులను మెప్పించలేక చతికిలపడింది. డిజాస్టర్‌గా నిలిచి హీరో గోపిచంద్‌కు అసంతృప్తిని మిగిల్చింది.  భోళాశంకర్‌ మెగాస్టార్‌ హీరోగా మేహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భోళాశంకర్‌’. భారీ అంచనాలు, ప్రమోషన్స్‌తో ఊదరగొట్టిన ఈ సినిమా ఊహించని విధంగా ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. చిరంజీవి కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చింది.  ఆదికేశవ మెగా హీరో పంజా వైష్ణవ్‌ తేజ్, శ్రీలీల జంటగా చేసిన ‘ఆదికేశవ’ చిత్రం కూడా ఇటీవల విడుదలై ఫ్లాప్‌ టాక్ తెచ్చుకుంది. 
    డిసెంబర్ 20 , 2023
    This Week Movies: ఈ వారం థియేటర్లు/ఓటీటీల్లో రిలీజయ్యే చిత్రాలు ఇవే!
    This Week Movies: ఈ వారం థియేటర్లు/ఓటీటీల్లో రిలీజయ్యే చిత్రాలు ఇవే!
    ఈ వారం భారీ చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. ఈ క్రిస్మస్‌ వారాన్ని మరింత సందడిగా మార్చబోతున్నాయి. డిసెంబర్ 18 నుంచి 24వ తేదీల మధ్య థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఆ సినిమాలు/సిరీస్‌లు ఏవి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు సలార్‌ సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రాల్లో ‘సలార్‌’ (Salaar) ఒకటి. ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా రూపొందిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఈ వారం విడుదల కానుంది. డిసెంబరు 22న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు. రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్‌ ‘సలార్‌’ను నిర్మించింది.  డంకీ  బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘డంకీ’ (Dunki). రాజ్‌ కుమార్‌ హిరాణి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారుక్‌కు జోడీగా తాప్సీ నటించింది. క్రిస్మస్‌ కానుకగా డిసెంబరు 21న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ‘ఇచ్చిన మాట కోసం ఓ సైనికుడు చేసే ప్రయాణం’ ఈ సినిమా అంటూ చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ ఏడాది షారుక్‌ ఖాన్‌ ‘పఠాన్‌’, ‘జవాన్‌’ చిత్రాలతో బాక్సాఫీస్‌ ఘన విజయాలను నమోదు చేశాడు. ‘డంకీ’తో హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తున్నాడు. ఆక్వామెన్‌ అండ్‌ ద లాస్ట్‌ కింగ్‌డమ్‌ జాసన్‌ మోమోవా కథానాయకుడిగా జేమ్స్‌ వాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన హాలీవుడ్‌ చిత్రం ‘ఆక్వామెన్‌’. 2018లో విడుదలై బాక్సాఫీస్‌ ముందు సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘ఆక్వామెన్‌ అండ్‌ ద లాస్ట్‌ కింగ్‌డమ్‌’ (Aquaman and the Lost Kingdom) ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్‌ 22న భారత్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.  ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు ఆదికేశవ మెగా హీరో వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఆదికేశవ(Aadikeshava). యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి తెరకెక్కించాడు. ఈ చిత్రం డిసెంబర్ 22న ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది.  మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateThe Rope Curse 3Web SeriesEnglishNetflixDec 18MaestroMovieEnglishNetflixDec 20Top Gun: MaverickMovieEnglishNetflixDec 22Curry & CyanideDocumentaryEnglishNetflixDec 22Rebel MoonMovieEnglishNetflixDec 22Dry DayMovieHindiAmazon PrimeDec 22Sapta Saagaradaache Ello – Side BMovieTelugu/KannadaAmazon PrimeDec 22The SouvenirMovieEnglishJio CinemaDec 18Hey KameeniMovieHindiJio CinemaDec 22
    డిసెంబర్ 18 , 2023
    Tollywood Roundup 2023: గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
    Tollywood Roundup 2023: గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
    టాలీవుడ్‌లో ఏటా పదుల సంఖ్యలో కొత్త హీరోయిన్లు పరిచయం అవుతుంటారు. వారిలో ఎంత మంది సక్సెస్‌ అవుతారో చెప్పలేం. అందం, అభినయం, నటన వంటివి మాత్రమే వారిని హీరోయిన్స్‌గా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేస్తాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలామంది కథానాయికలు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నారు. వీరిలో ఎవరు టాప్‌ అంటే చెప్పటం కష్టమే. అయితే 2023 ఏడాదిలో గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌లో ఉన్న తెలుగు హీరోయిన్స్‌ జాబితా బయటకొచ్చింది. అందులోని హీరోయిన్స్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం.  రష్మిక మందన్న గూగుల్‌లో ఎక్కువ మంది శోధించిన తెలుగు హీరోయిన్ల జాబితాలో రష్మిక మందన్న అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవల ఈ భామ నటించిన యానిమల్‌ చిత్రం సూపర్‌ హిట్‌ కావడంతో రష్మిక పేరు మారుమోగింది. అంతకుముందు ఆమె డీప్‌ ఫేక్‌ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం ‌అయ్యాయి. దీంతో రష్మిక గురించి ఎక్కువ మంది నెట్టింట శోధించారు. మృణాల్‌ ఠాకూర్‌ ‘సీతారామం’ మూవీతో మృణాల్‌ ఠాకూర్‌ స్టార్‌ హీరోయిన్ల సరసన చేరిపోయింది. ఈ ఏడాది బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్‌తో సెల్ఫీ సినిమాలో నటించింది. అలాగే గుమ్రా, లస్ట్‌ స్టోరీస్‌-2, పిప్పా వంటి చిత్రాల్లో కనిపించి దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది. దీంతో పాటు సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా మోస్ట్‌ సెర్చ్‌డ్‌ హీరోయిన్ల జాబితాలో ఆమె రెండోస్థానంలో నిలిచింది.  శ్రీలీల ఈ ఏడాది టాలీవుడ్‌లో అందరికంటే ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్‌గా శ్రీలీల నిలిచింది. ఈ సంవత్సరం ఆమె నటించిన నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. స్కంద, భగవంత్‌ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ చిత్రాల ద్వారా ఈ భామ ప్రేక్షకులను పలకరించింది. మరో నాలుగు భారీ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. దీంతో ఆమె పేరు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేయబడింది.  తమన్న భాటియా మిల్కీ బ్యూటీ తమన్న గురించి కూడా ఎక్కువ మంది శోధించారు. బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మతో ఆమె ప్రేమాయణం దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. లస్ట్‌ స్టోరీస్‌-2 వెబ్‌ సిరీస్‌లో వీరిద్దరు స్క్రీన్ షేర్‌ చేసుకోవడంతో పాటు ఒకరిపైఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. వాటికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు అప్పట్లో నెట్టింట వైరల్ అయ్యాయి. సమంత ఈ ఏడాది సమంత గురించి కూడా చాలా మందే శోధించారు. సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ఆమె ప్రకటించడంతో సమంత పేరు ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. అలాగే సామ్ రీసెంట్‌ మూవీ ‘ఖుషి’ హిట్‌ కావడంతో ఆమె పాపులారిటి మరింత పెరిగింది. అంతేకాకుండా సోషల్‌ మీడియాలో గ్లామర్‌ ఫొటోలను పెడుతూ ఫ్యాన్స్‌ను అలరిస్తుండటంతో ఎక్కువ మంది సమంత పేరును సెర్చ్‌ చేశారు.  అనుష్క శెట్టి అనుష్క శెట్టి సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాదే వెండితెరపై తళ్లుక్కుమంది. 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి' సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. సినిమా షూట్ మెుదలైనప్పటి నుంచి రిలీజ్‌ అయ్యేవరకూ ఏదోక రూపంలో ఆమె వార్తల్లో నిలుస్తూనే వచ్చారు.  కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి తర్వాత సినిమాలకు విరామం ఇచ్చిన కాజల్‌.. ఈ ఏడాది స్ట్రాంగ్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చారు. బాలయ్య సరసన ఆమె చేసిన ‘భగవంత్‌ కేసరి’ మంచి విజయాన్ని సాధించింది. అలాగే కాజల్‌ చేసిన ఘోస్ట్‌, కరుంగపియం వంటి చిత్రాలు కూడా ఈ ఏడాదే వచ్చాయి.  కీర్తి సురేష్‌ ఈ ఏడాది దసరా సినిమా ద్వారా కీర్తి సురేష్‌ బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ అందుకుంది. వెన్నెల పాత్రలో అద్భుత నటన కనబరిచి అందర్ని ఆశ్చర్యపరిచింది. పాన్‌ ఇండియా స్థాయిలో దసరా రిలీజ్‌ కావడంతో కీర్తి సురేష్‌ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. దీంతో కీర్తి గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది నెటిజన్లు శోధించారు.  రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రముఖ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గురించి కూడా ఎక్కువ మంది సెర్చ్‌ చేశారు. ఈ ఏడాది తెలుగులో ఒక్క సినిమా కూడా ఆమె చేయలేదు. కానీ ఈ భామ పోస్టు చేసే గ్లామర్‌ ఫోటోలు కారణంగా రకుల్‌ తరుచూ ట్రెండింగ్‌లో నిలుస్తూ వచ్చారు.  కృతి శెట్టి ఉప్పెన సినిమాతో స్టార్‌ హీరోయిన్‌గా మారిన కృతి శెట్టి వరుసగా సినిమా అవకాశాలను దక్కించుంది. ఈ భామ గురించి కూడా ఎక్కువ మంది నెటిజన్లు సెర్చ్‌ చేశారట. ఈ ఏడాది నాగ చైతన్య సరసన ఆమె చేసిన ‘కస్టడీ’ మూవీ ఫ్లాప్ టాక్‌ తెచ్చుకుంది. 
    డిసెంబర్ 14 , 2023
    Upcoming Telugu Movies November 2023: దీపావళి బరిలో పోటీ పడుతున్న సినిమాలు ఇవే!
    Upcoming Telugu Movies November 2023: దీపావళి బరిలో పోటీ పడుతున్న సినిమాలు ఇవే!
    అక్టోబర్‌లో పెద్ద హీరోల చిత్రాలు సందడి చేసి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. దసరా బరిలో నిలిచిన భగవంత్‌కేసరి, టైగర్‌నాగేశ్వరరావు సినిమాలు సక్సెస్ సాధించాయి. అయితే నవంబర్‌లో పెద్ద హీరోల సినిమాలు మాత్రం లేవు. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం యాక్ట్ చేస్తున్న కీడాకోలా, నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ చిత్రాలు దీపావళి బరిలో ఉన్నాయి. వీటితో పాటు పాయల్ రాజ్‌పూత్ నటించిన హరర్‌ మూవీ మంగళవారం సైతం నవంబర్‌లోనే విడుదల కానుంది. మరి నవంబర్‌ నెలలో విడుదల కానున్న ఇతర తెలుగు చిత్రాల వివరాలపై ఓ లుక్ వేయండి. మా ఊరి పొలిమేర-2  సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన 'మా ఊరి పొలిమెర-2' చిత్రం నవంబర్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని డాక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు. సత్యం రాజేష్‌తో పాటు గెటప్ శ్రీను, రాకెందు మౌళి, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు.  కీడా కోలా బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కీడాకోలా. ఈ చిత్రాన్ని  డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. బ్రహ్మానందంతో పాటు ఈ సినిమాలో చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎర్ర చీర శ్రీరామ్, అజయ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ఎర్ర చీర. ఈ సినిమాను సుమన్ బాబు డైరెక్ట్ చేశారు. అమ్మ సెంటిమెంట్, హరర్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. నవంబర్ 9న ఎర్రచీర సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదికేశవ పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ఆదికేశవ. ఈ చిత్రం నవంబర్ 10న థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌ అంచనాలను పెంచేసింది.  ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఎన్‌ రెడ్డి డైరెక్ట్ చేశారు. సాయి సౌజన్య సంగీతం అందిస్తున్నారు. నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైగర్ 3 సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న టైగర్ 3 మూవీ నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పాన్ఇండియా లెవల్లో డైరెక్టర్ మానిష్ శర్మ తెరకెక్కించారు. సల్మాన్ సరసన కత్రీనా కైఫ్ హీరోయిన్‌గా నటించింది. ఇమ్రాన్ హష్మి, అషుతోష్ రాణా ముఖ్య పాత్రల్లో నటించారు. మంగళవారం పాయల్ రాజ్‌పూత్ లీడ్‌ రోల్‌లో ఈ సినిమాను సైకాలజికల్ హరర్‌ చిత్రంగా డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమాకు కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. మంగళవారం చిత్రం నవంబర్ 17న విడుదల కానుంది. సప్తసాగరాలు దాటి- సైడ్ బీ కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన సప్తసాగరాలు దాటి-సైడ్ బీ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం కన్నడలో సూపర్ హిట్‌ కాగా.. తెలుగులో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు రెండో భాగాన్ని డబ్బింగ్ వెర్షన్‌లో నవంబర్‌ 17న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని  హేమంత్ రావు డైరెక్ట్ చేశారు.  రక్షిత్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది. డెవిల్ నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కాంబోలో వస్తున్న చిత్రం డెవిల్. ఈ చిత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను 'బాబు బాగా బిజీ' ఫేమ్ నవీన్ మేడారం తెరకెక్కిస్తున్నారు. డెవిల్ చిత్రంలో కళ్యాణ్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. 
    అక్టోబర్ 26 , 2023
    Actress Sreeleela: బాలయ్యతో పోటీపడి నటించిన శ్రీలీల.. అదే జరిగితే టాప్‌ హీరోయిన్‌ స్థానం ఖాయం!
    Actress Sreeleela: బాలయ్యతో పోటీపడి నటించిన శ్రీలీల.. అదే జరిగితే టాప్‌ హీరోయిన్‌ స్థానం ఖాయం!
    టాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ శ్రీలీల (Actress Sreeleela) నటించిన ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రం ఇవాళ విడుదలైంది. ఇందులో నందమూరి బాలకృష్ణ కూతురిగా శ్రీలీల అదరగొట్టింది.  ముఖ్యంగా ఏమోషనల్‌ సీన్స్‌లో బాలయ్యతో పోటీ పడి మరీ శ్రీలీల నటించింది. కెరీర్‌ ప్రారంభంలోనే తనకు దక్కిన అద్భుతమైన అవకాశాన్ని ఈ భామ పూర్తిగా సద్వినియోగం చేసుకుంది.  శ్రీలీల తన గత చిత్రాల్లో కేవలం గ్లామర్‌, డ్యాన్స్‌కే పరిమితమైంది. కానీ భగవంత్‌ కేసరి ద్వారా నటనకు స్కోప్‌ ఉన్న పాత్రను ఆమె దక్కించుకుంది. డ్యాన్స్‌లోనే కాకుండా నటనలోనూ తనకు తిరుగులేదని నిరూపించుకుంది.  శ్రీలీల హీరోయిన్‌గా ఇటీవల వచ్చిన ‘స్కంద’ (Skanda) చిత్రం కూడా హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందులో కూడా ఆమె నటన, డ్యాన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఈ ఏడాది టాలీవుడ్‌లో శ్రీలీల నటించిన రెండు చిత్రాలు థియేటర్లలో విడుదలవ్వగా మరో నాలుగు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి.  ప్రస్తుతం ఈ భామ చేతిలో ఆదికేశవ (Adi Keshava), ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ (Extra Ordinary Man), గుంటూరు కారం (Guntur Karam), ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ (Ustaad Bhagat Singh) చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలు కూడా విజయం సాధిస్తే ఇక శ్రీలీలకు తెలుగులో తిరుగుండదని చెప్పవచ్చు.  కిస్‌ (Kiss) అనే కన్నడ చిత్రం ద్వారా శ్రీలీల సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ చిత్రం కర్ణాటకలో 100 రోజులకు పైగా ఆడి సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'భరాతే' అనే మరో కన్నడ చిత్రంలో ఈ బ్యూటీ హీరోయిన్‌గా చేసింది.  ఇక 2021లో వచ్చిన 'పెళ్లి సందD' చిత్రంతో ఈ సుందరి తెలుగులో అడుగుపెట్టింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ఈ మూవీలో శ్రీలీల ఎంతో గ్లామర్‌గా కనిపించింది. తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. గతేడాది రవితేజ ‘ధమాకా’ చిత్రంలోనూ శ్రీలీల మెరిసింది. మాస్‌ మహా రాజా ఎనర్జీకి మ్యాచ్‌ అయ్యేలా నటిస్తూ అందరి చేత ప్రశంసలు అందుకుంది.  ఓ వైపు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే సోషల్‌ మీడియాలోనూ శ్రీలీల చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తోంది. ప్రస్తుతం ఈ భామ ఇన్‌స్టా ఖాతాను 2.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. 
    అక్టోబర్ 19 , 2023

    @2021 KTree