• TFIDB EN
  • 12 ఫెయిల్‌
    UTelugu2h 26m
    మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఒక గ్రామంలో ఉండే నిరుపేద యువకుడు 12వ తరగతి ఫెయిల్‌ అవుతాడు. కానీ పట్టుదలతో చదివి, దృఢ సంకల్పంతో ఐపీఎస్‌ అధికారి అవుతాడు. ఆ యువకుడు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్న ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstarఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    విక్రాంత్ మాస్సే
    మనోజ్ కుమార్ శర్మ
    మేధా శంకర్
    శ్రద్ధా జోషి
    అనంత్ వి జోషిప్రీతమ్ పాండే
    అన్షుమాన్ పుష్కర్
    గౌరీ భయ్యా
    ప్రియాంశు ఛటర్జీడీఎస్పీ దుష్యంత్ సింగ్
    గీతా అగర్వాల్ శర్మమనోజ్ తల్లి
    హరీష్ ఖన్నామనోజ్ తండ్రి
    సరితా జోషిడాడీ
    సంజయ్ బిష్ణోయ్నావెల్
    డాక్టర్ వికాస్ దివ్యకీర్తిహింసెల్ఫ్
    సిబ్బంది
    విధు వినోద్ చోప్రా
    దర్శకుడు
    యోగేష్ ఈశ్వర్నిర్మాత
    విధు వినోద్ చోప్రా
    నిర్మాత
    విధు వినోద్ చోప్రా
    రచయిత
    శంతను మోయిత్రా (తక్లా)
    సంగీతకారుడు
    అనురాగ్ పాఠక్కథ
    రంగరాజన్ రామబద్రన్సినిమాటోగ్రాఫర్
    జస్కున్వర్ కోహ్లీఎడిటర్ర్
    విధు వినోద్ చోప్రా
    ఎడిటర్ర్
    కథనాలు
    This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    గత వారంలాగే ఈ వారం కూడా పెద్ద సినిమాలు లేకపోవడంతో థియేటర్లను ఆక్రమించేందుకు చిన్న సినిమాలు సిద్ధమవుతున్నాయి. అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 5 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు కీడా కోలా యంగ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ రూపొందించిన చిత్రం ‘కీడా కోలా’ (keedaa cola). బ్రహ్మానందం, చైతన్యరావు, తరుణ్‌భాస్కర్‌, రాగ్‌మయూర్‌, రఘురామ్‌, రవీంద్ర విజయ్‌, జీవన్‌ కుమార్‌, విష్ణు కీలక పాత్రల్లో నటించారు. కె.వివేక్‌ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్‌, శ్రీనివాస్‌ కౌశిక్‌, శ్రీపాద్‌ నందిరాజ్‌, ఉపేంద్ర వర్మ నిర్మించారు. రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 3న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మా ఊరి పొలిమేర 2 విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘మా ఊరి పొలిమేర 2’ (Maa Oori Polimera 2) చిత్రం ఈ వారమే థియేటర్లలో సందడి చేయనుంది. నవంబరు 3న తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఇందులో సత్యం రాజేష్‌, కామాక్షి, బాలాదిత్య, గెటప్‌ శ్రీను కీలక పాత్రల్లో నటించారు. మూవీ తొలి పార్ట్‌ కరోనా కారణంగా ఓటీటీలో రిలీజై హిట్‌ టాక్ తెచ్చుకుంది. దీంతో పార్ట్‌-2పై అంచనాలు పెరిగిపోయాయి. తొలి భాగానికి మించిన థ్రిల్‌ ఇందులో ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.  విధి రోహిత్ నందా, ఆనంది జంటగా చేసిన చిత్రం ‘విధి’ (Vidhi). శ్రీకాంత్ రంగనాథన్ దర్శకత్వం వహించారు. నవంబరు 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ జంట జీవితంలో విధి ఎలాంటి మలుపులకు కారణమైందనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 12 ఫెయిల్‌ విక్రాంత్‌ మస్సే హీరోగా విధు వినోద్‌ చోప్రా తెరకెక్కించిన చిత్రం ‘12 ఫెయిల్‌’. మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఒక గ్రామంలో ఉండే నిరుపేద యువకుడు 12వ తరగతి ఫెయిల్‌ అవుతాడు. కానీ పట్టుదలతో చదివి, దృఢ సంకల్పంతో ఐపీఎస్‌ అధికారి అవుతాడు. ఆ యువకుడు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్న ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఈ సినిమా ఇప్పటికే హిందీలో విడుదలై అలరిస్తోంది. నవంబరు 3న తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఘోస్ట్‌ కన్నడ స్టార్‌ శివ రాజ్‌కుమార్‌(Shiva Rajkumar) నటించిన లేటెస్ట్‌ పాన్‌ ఇండియా చిత్రం ‘ఘోస్ట్‌’ (Ghost). ఈ మూవీకి శ్రీని దర్శకత్వం వహించాడు. దసరా కానుకగా కన్నడలో విడుదలైన ఈ సినిమా నవంబరు 4న తెలుగులోనూ రానుంది. ఆసక్తికరమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో మూవీని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. క్లైమాక్స్‌ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెప్పింది.  ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు స్కంద యంగ్ హీరో రామ్‌ లేటెస్ట్ మూవీ 'స్కంద' ఈ వారం ఓటీటీలోకి రానుంది. నవంబర్‌ 2 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. అక్టోబర్ 27 నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్‌కు రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఇక అవుట్ అండ్ అవుట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటించింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుందని డైరెక్టర్ బోయపాటి క్లైమాక్స్‌లో క్లారిటీ ఇచ్చాడు.   ఫ్లాట్‌ఫామ్‌ వారీగా ఓటీటీ విడుదలలు…  మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి (telugu.yousay.tv/tfidb/ott) TitleCategoryLanguagePlatformRelease DateP.I. MeenaWeb SeriesHindiAmazon PrimeNov 3Scam 2003 ; Part-2Web SeriesHindiSony LIVNov 3Are You Ok Baby?MovieTamilAhaOctober 31Locked InMovieEnglishNetflixNov 1JawanMovieHindiNetflixNov 2
    అక్టోబర్ 30 , 2023
    Medha Shankar: హద్దులు చెరిపేసిన ‘12th ఫెయిల్‌’ భామ.. ఎద అందాలతో దిమ్మతిరిగే ట్రీట్‌!
    Medha Shankar: హద్దులు చెరిపేసిన ‘12th ఫెయిల్‌’ భామ.. ఎద అందాలతో దిమ్మతిరిగే ట్రీట్‌!
    బాలీవుడ్‌ బ్యూటీ మేధా శంకర్‌ (Medha Shankar).. తన అందచందాలతో సోషల్‌ మీడియాను అట్రాక్ట్‌ చేసింది. ఎద సంపదను ప్రదర్శిస్తూ నెటిజన్లను కవ్వించింది.  తాజాగా ‘జీ సినిమా అవార్డ్స్‌’లో పాల్గొన్న ఈ బ్యూటీ.. సిల్వర్‌ కలర్‌ పొట్టి గౌనులో తళుక్కుముంది. అక్కడ ‘12th ఫెయిల్‌’ చిత్రానికి గానూ ఉత్తమ అరంగేట్ర నటిగా అవార్డు అందుకుంది.  అనంతరం ఆ పొట్టి డ్రెస్‌లోనే ఫొటో షూట్‌ నిర్వహించిన మేధా.. అందాల ప్రదర్శనలో హద్దులు చెరిపేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్యాన్స్‌కు హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది.  గ్లామర్ ఫొటోలను మేధా తన ఇన్‌స్టా ఖాతాలో స్వయంగా పోస్టు చేయడంతో అవి కాస్త వైరల్‌గా మారాయి. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ కాగల క్వాలిటీస్‌ నీలో ఉన్నాయంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.  ఇటీవల హిందీలో తెరకెక్కిన  '12th ఫెయిల్‌' (12th Fail) చిత్రంతో మేధా రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయింది. రోజు రోజుకూ నెట్టింట ఆమె ఫాలోయింగ్‌ పెరిగిపోతోంది. ఈ చిత్రంలో ఆమె నటనపై ప్రశంసల వర్షం కురిసింది.  నోయిడాలో పుట్టిన ఈ భామ (Medha Shankar).. ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసింది. అనంతరం మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది.  ఎఫ్‌బీబీ నిర్వహించిన ఫెమినా మిస్‌ ఇండియా (2016) పోటీల్లో పాల్గొని మేధా అందరి దృష్టిని ఆకర్షించింది. పోటీల్లో రాణించి అందరి ప్రశంసలు అందుకుంది.  మోడలింగ్‌లోనే కాకుండా సంగీతంపైనా మేధా (Medha Shankar)కు పట్టు ఉంది. సితార్‌, హార్మోనియం, కీబోర్డు ప్లే వంటి వాటిల్లో ఆమె శిక్షణ కూడా తీసుకుంది.  నటనపై మక్కువతో నోయిడా నుంచి ముంబయికి మకాం మార్చిన మేధా.. 'విత్‌ యు ఫర్ యు ఆల్వేజ్‌' అనే షార్ట్‌ ఫిల్మ్‌తో నటిగా మారింది.  ఆ తర్వాత హిందీ వెబ్‌సిరీస్‌లలో నటించే ఆవకాశాన్ని దక్కించుకుంది. బీకమ్‌ హౌజ్‌ (2019), దిల్‌ బేకరార్‌ (2021) సిరీస్‌లలో కీలక పాత్రలు పోషించి బాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత 'శాదీస్తాన్‌' (2021) సినిమాతో మేధా బాలీవుడ్‌లోకి రంగ ప్రవేశం చేసింది. సంగీతం ఇతివృత్తంగా రూపొందిన ఈ చిత్రంలో అర్షి మోదీ పాత్రలో ఆమె ఆకట్టుకుంది.  2022లో వచ్చిన 'మ్యాక్స్‌, మిన్‌ అండ్‌ మ్యూజికీ'లో భాయ్‌ఫ్రెండ్‌ను త్యాగం చేసే అమ్మాయిగా యువతను మెప్పించింది.  ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితం కావడంతో మేధా శంకర్‌ పేరు ప్రముఖంగా బాలీవుడ్‌లో వినిపించింది. మూడో సినిమా '12th ఫెయిల్‌'తో శ్రద్ధా జోషిగా ఒదిగిపోయి విశేష క్రేజ్‌ సంపాదించుకుంది మేధా. అందులోని 'బోలో నా' పాటను స్వయంగా ఆమె పాడటం విశేషం.  ‘12th ఫెయిల్‌’ విడుదలకు ముందు 16వేల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ప్రస్తుతం 20 లక్షలకు చేరుకుంది.  సోషల్‌మీడియా మేధా క్రేజ్‌ ఏ స్థాయిలో పెరిగిందో చెప్పడానికి దీనికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రస్తుతం షేర్‌ చేస్తున్న ఫొటోలకు లక్షల్లో లైక్స్‌, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి.
    మార్చి 13 , 2024
    Medha Shankar: ‘12th ఫెయిల్‌’ సంచలనం.. మేధా శంకర్‌ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    Medha Shankar: ‘12th ఫెయిల్‌’ సంచలనం.. మేధా శంకర్‌ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    హిందీలో తెరకెక్కిన '12th ఫెయిల్‌' (12th Fail) చిత్రం.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. ఇందులో హీరోయిన్‌గా నటించిన మేధా శంకర్‌ (Medha Shankar)కు రోజు రోజుకూ నెట్టింట ఫాలోయింగ్‌ పెరిగిపోతోంది. ఆమె నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో మేధా శంకర్‌ గురించిన పలు ఆసక్తికర విషయాలు మీకోసం.  నోయిడాలో పుట్టిన ఈ భామ (Medha Shankar).. ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసింది. అనంతరం మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది.  ఎఫ్‌బీబీ నిర్వహించిన ఫెమినా మిస్‌ ఇండియా (2016) పోటీల్లో పాల్గొని మేధా అందరి దృష్టిని ఆకర్షించింది. పోటీల్లో రాణించి అందరి ప్రశంసలు అందుకుంది.  మోడలింగ్‌లోనే కాకుండా సంగీతంపైనా మేధా (Medha Shankar)కు పట్టు ఉంది. సితార్‌, హార్మోనియం, కీబోర్డు ప్లే వంటి వాటిల్లో ఆమె శిక్షణ కూడా తీసుకుంది.  నటనపై మక్కువతో నోయిడా నుంచి ముంబయికి మకాం మార్చిన మేధా.. 'విత్‌ యు ఫర్ యు ఆల్వేజ్‌' అనే షార్ట్‌ ఫిల్మ్‌తో నటిగా మారింది.  ఆ తర్వాత హిందీ వెబ్‌సిరీస్‌లలో నటించే ఆవకాశాన్ని దక్కించుకుంది. బీకమ్‌ హౌజ్‌ (2019), దిల్‌ బేకరార్‌ (2021) సిరీస్‌లలో కీలక పాత్రలు పోషించి బాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత 'శాదీస్తాన్‌' (2021) సినిమాతో మేధా బాలీవుడ్‌లోకి రంగ ప్రవేశం చేసింది. సంగీతం ఇతివృత్తంగా రూపొందిన ఈ చిత్రంలో అర్షి మోదీ పాత్రలో ఆమె ఆకట్టుకుంది.  2022లో వచ్చిన 'మ్యాక్స్‌, మిన్‌ అండ్‌ మ్యూజికీ'లో భాయ్‌ఫ్రెండ్‌ను త్యాగం చేసే అమ్మాయిగా యువతను మెప్పించింది.  ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితం కావడంతో మేధా శంకర్‌ పేరు ప్రముఖంగా బాలీవుడ్‌లో వినిపించింది. మూడో సినిమా '12th ఫెయిల్‌'తో శ్రద్ధా జోషిగా ఒదిగిపోయి విశేష క్రేజ్‌ సంపాదించుకుంది మేధా. అందులోని 'బోలో నా' పాటను స్వయంగా ఆమె పాడటం విశేషం.  ‘12th ఫెయిల్‌’ విడుదలకు ముందు 16వేల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ప్రస్తుతం 20 లక్షలకు చేరుకుంది.  సోషల్‌మీడియా మేధా క్రేజ్‌ ఏ స్థాయిలో పెరిగిందో చెప్పడానికి దీనికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రస్తుతం షేర్‌ చేస్తున్న ఫొటోలకు లక్షల్లో లైక్స్‌, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. ఇక '12th ఫెయిల్‌' సినిమాకు వస్తే.. ఐపీఎస్‌ అధికారి మనోజ్‌కుమార్‌ శర్మ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపొందింది. విక్రాంత్‌ మస్సే ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో మేధా ఆయన సతీమణిగా నటించింది.  ఈ స్ఫూర్తిదాయక చిత్రం ప్రస్తుతం డిస్నీ+హాట్‌స్టార్‌లో అత్యధిక వీక్షణలతో దూసుకువెళ్తోంది. ఈ సినిమాను చూసిన పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కెరీర్‌ తొలినాళ్లలో ఎన్నోసార్లు తిరస్కరణకు గురైన మేధా శంకర్ ఓ ఇంటర్యూలో చెప్పింది. ఆత్మ విశ్వాసం, పట్టుదల ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుగోగలమని ఓ సందర్భంలో పేర్కొంది.  సవాళ్లు విసిరే పాత్రలనే సినిమాల్లో ఎంచుకుంటానని మేధా చెబుతోంది. నటన జీవితంలో ఓ భాగమేగానీ అదే జీవితం కాదన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేసింది. 
    జనవరి 20 , 2024
    <strong>Vikrant Massey Net worth: సినిమా కెరీర్‌లో విక్రాంత్‌ మెస్సే ఎంత సంపాదించాడో తెలుసా?&nbsp;</strong>
    Vikrant Massey Net worth: సినిమా కెరీర్‌లో విక్రాంత్‌ మెస్సే ఎంత సంపాదించాడో తెలుసా?&nbsp;
    బాలీవుడ్‌ యంగ్‌ హీరో విక్రాంత్ మాస్సే (Vikrant Massey) సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 37 ఏళ్ల ఈ టాలెంటెడ్‌ నటుడు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవలే ‘12th ఫెయిల్‌’ చిత్రంతో విక్రాంత్‌ మాస్సే పేరు మార్మోగింది. ఈ చిత్రం పలు అవార్డులను సైతం కొల్లగొట్టింది. దీంతో బాలీవుడ్‌లో విక్రాంత్‌కు ఒక్కసారిగా ఆఫర్లు పెరిగాయి. చేతినిండా ప్రాజెక్ట్స్‌తో అతడు బిజీగా మారిపోయారు. అలాంటి సమయంలో సినిమాలకు బిగ్‌ బ్రేక్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.&nbsp; కారణం ఏంటంటే? సినిమాలకు కొంత కాలం బ్రేక్‌ ఇస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా విక్రామ్‌ మాస్సే (Vikrant Massey Net worth) ప్రకటించాడు. ఇందుకు గల కారణాలను వివరిస్తూ సుదీర్ఘ పోస్టు పెట్టాడు. కొన్నేళ్ల నుంచి ప్రేక్షకులు చూపిస్తున్న అసాధారణ ప్రేమ, అభిమానానికి విక్రాంత్‌ థ్యాంక్స్‌ చెప్పారు. ఇకపై కుటుంబ సభ్యులకు టైమ్‌ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. అందుకే ఇకపై కొత్త ప్రాజెక్ట్స్‌ అంగీకరించనని స్పష్టం చేశారు. 2025లో విడుదలయ్యే చిత్రమే తన చివరిదని స్పష్టం చేశాడు. ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలంటూ తన నోట్‌ను ముగించాడు. అయితే విక్రాంత్‌ నిర్ణయాన్ని ఆయన అభిమానులు తీసుకోలేకపోతున్నారు. మరోసారి ఆలోచించుకోవాలని రిక్వెస్ట్‌ చేస్తున్నారు. ఫ్యామిలీ, ప్రొఫెషనల్‌ లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకు సాగమని సూచిస్తున్నారు.&nbsp; విక్రాంత్‌ సినీ నేపథ్యం సినిమాలకు బ్రేక్‌ ఇవ్వడంతో విక్రాంత్‌ మాస్సే (Vikrant Massey Net worth) పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. అతడి గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. విక్రాంత్‌ (Vikrant Massey) 1987 ఏప్రిల్‌ 3న ముంబయిలో జన్మించాడు. అక్కడి ఆర్‌.డి. నేషనల్‌ కాలేజీలో గ్రాడ్యుయేట్‌ పూర్తి చేశాడు. 2007లో వచ్చిన 'ధూమ్‌ మచావో ధూమ్‌' సీరియల్‌తో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ధరమ్‌ వీర్‌ (2008), ‘బాలిక వధు’, ‘కుతుబ్‌ హై’ సీరియల్స్‌లో చేశాడు. 2013లో వచ్చిన ‘లూతేరా’ ఫిల్మ్‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత పదుల సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ పెద్దగా బ్రేక్‌ రాలేదు. 2018లో వచ్చిన 'మీర్జాపుర్‌' సిరీస్‌ నటుడిగా అతడికి గుర్తింపు తెచ్చిపెట్టింది. గతేడాది చేసిన '12th ఫెయిల్‌' మూవీ విక్రాంత్‌ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ ఏడాది వచ్చిన 'సెక్టార్‌ 36' ఫిల్మ్‌ సైతం నటుడిగా విక్రాంత్‌ను మరో మెట్టు ఎక్కించింది. ఈ ఏడాదే వచ్చిన 'ది సబర్మతి రిపోర్ట్‌' సైతం విక్రాంత్‌కు మంచి మార్కులు పడేలా చేసింది. ప్రస్తుతం విక్రాంత్ చేతిలో 'యార్‌ జిగ్రి', 'టీఎంఈ', 'అన్‌కౌన్‌ కి గుస్తాఖియాన్‌' ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. కొడుకు కోసం స్పెషల్ టాటూ! విక్రాంత్‌ మాస్సే (Vikrant Massey Net worth) కుటుంబానికి చాలా విలువ ఇస్తాడు. బాలీవుడ్‌ నటి షీతల్‌ థాకూర్‌ (Sheetal Thakur) ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2022 ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజున తొలుత రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నాడు. నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి 18న కుటుంబ సభ్యుల సమక్షంలో హిందూ సంప్రదాయల ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. విక్రాంత్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో బాబు పుట్టాడు. అతడికి వర్ధన్ పేరు పెట్టాడు. కొడుకుపై ప్రేమకు గుర్తుగా చేతిపై పుట్టిన తేదీతో సహా వర్ధన్‌ అనే పేరును టాటూ వేసుకున్నాడు. దీన్ని బట్టి కుటుంబానికి, కుమారుడికి విక్రాంత్ ఎంత ప్రాధాన్యత ఇస్తాడో అర్థమవుతుంది. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్స్‌ ఉండటంతో వారితో సమయం గడపడం కుదరట్లేదని సినిమాలకు లాంగ్‌ బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఆ హీరోయిన్‌కు బిగ్‌ ఫ్యాన్‌ విక్రాంత్‌ మాస్సే (Vikrant Massey) ఇష్టా ఇష్టాలకు వస్తే బాలీవుడ్‌లో అతడికి చాలా మంది ఫేవరేట్ హీరోలు ఉన్నారు. అజయ్‌ దేవగన్‌, కె.కె. మీనన్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌, పంకజ్‌ కపూర్‌ తన అభిమాన నటులని విక్రాంత్‌ చెబుతుంటాడు. అయితే హీరోయిన్‌ విషయంలో మాత్రం విక్రాంత్‌కు చాలా స్పష్టత ఉంది. ప్రముఖ నటి టబు విక్రాంత్‌కు ఫేవరేట్ యాక్ట్రెస్‌. అటు ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’ (1999), ‘వాస్తవ్‌’ (1999), ‘యువ’ (2004) చిత్రాలు విక్రాంత్‌కు ఆల్‌టైమ్‌ ఫేవరేట్ అని చెప్పవచ్చు. స్పోర్ట్స్‌ విషయానికి వస్తే క్రికెట్‌ను విక్రాంత్‌ బాగా ఇష్టపడతాడు. ఫుడ్‌ విషయానికి వస్తే రాజ్మా చావల్‌, పాలక్ పన్నీర్‌ను ఎంతో ఇష్టంగా విక్రాంత్‌ తింటాడు. డ్యాన్సింగ్‌, ట్రావెలింగ్‌, క్రికెట్‌ ఆడటం, పర్‌ఫ్యూమ్స్‌ను కలెక్ట్‌ చేయడం వంటివి విక్రాంత్ హాబీలుగా చెప్పవచ్చు. ఫుడ్‌ విషయానికి వస్తే రాజ్మా చావల్‌, పాలక్ పన్నీర్‌ను ఎంతో ఇష్టంగా విక్రాంత్‌ తింటాడు. డ్యాన్సింగ్‌, ట్రావెలింగ్‌, క్రికెట్‌ ఆడటం, పర్‌ఫ్యూమ్స్‌ను కలెక్ట్‌ చేయడం విక్రాంత్ హాబీలుగా చెప్పవచ్చు.&nbsp; విక్రాంత్‌ ఆస్తుల విలువ ఎంతంటే? విక్రాంత్‌ మాస్సే (Vikrant Massey Net worth) 2007 నుంచే నటన జీవితాన్ని ప్రారంభించినప్పటికీ చెప్పుకోతగ్గ స్థాయిలో మాత్రం ఆస్తులు కూడబెట్టలేకపోయాడు. వాస్తవానికి ‘12th ఫెయిల్‌’ (2023) చిత్రం తర్వాతే రెమ్యూనరేషన్‌ భారీగా పెరిగిందని చెప్పవచ్చు. ఆ సినిమాకు ముందు వరకూ రూ.30-40 లక్షలు మాత్రమే తీసుకున్న విక్రాంత్‌, ప్రస్తుతం రూ.2 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం అతడి నెట్‌ వర్త్‌ రూ.20-26 కోట్ల వరకూ ఉండొచ్చని బాలీవుడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అతడికి రూ.60 లక్షలు విలువైన Volvo S90 కారు, డుకాటి మాన్‌స్టర్ (రూ.12 లక్షలు), మారుతీ సుజుకీ డిజైర్‌ (రూ.8.4లక్షలు) ఉన్నాయి. అలాగే ముంబయిలో సొంతిల్లు కూడా ఉన్నట్లు సమాచారం.&nbsp;
    డిసెంబర్ 02 , 2024
    Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్‌ నామినేషన్స్‌లో ప్రభాస్‌, రష్మికకు అన్యాయం.! ఎందుకీ చిన్నచూపు?
    Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్‌ నామినేషన్స్‌లో ప్రభాస్‌, రష్మికకు అన్యాయం.! ఎందుకీ చిన్నచూపు?
    ప్రేక్షకులతో పాటు, సినీ తారలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే అవార్డుల వేడుక 'ఫిల్మ్‌ఫేర్‌' (Filmfare Awards 2024). 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుకలకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.&nbsp; జనవరి 27, 28 తేదీల్లో గుజరాత్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది అవార్డుల కోసం పోటీపడుతున్న చిత్రాల జాబితాను తాజాగా విడుదల చేశారు. అయితే ఇది కొత్త వివాదానికి దారి తీసింది. రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ’ (Rocky Aur Rani Ki Prem Kahani), యానిమల్‌ (Animal) చిత్రాలతో పాటు 12th ఫెయిల్‌, డంకీ, జవాన్‌, శ్యామ్‌ బహదూర్‌ చిత్రాలు అవార్డు రేసులో నిలిచాయి. కానీ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన 'ఆదిపురుష్‌', 'సలార్‌' వంటి చిత్రాలకు ఏ ఒక్క విభాగంలోనూ చోటు దక్కకపోవడం చర్చలకు తావిస్తోంది.&nbsp; ప్రభాస్‌కు అన్యాయం! బాహుబలి తర్వాత ప్రభాస్‌ (Prabhas) క్రేజ్‌ ప్రపంచస్థాయికి చేరింది. ఆయనతో చిత్రాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే గతేడాది ప్రభాస్‌ చేసిన ఆదిపురుష్‌ (Aadipurush), సలార్‌ (Saalar) చిత్రాలు ప్రేక్షకులను పలకరించాయి. ‘ఆదిపురుష్‌’ చిత్రం ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ ప్రభాస్‌ మానియాతో రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అందులో డార్లింగ్‌ నటనకు సైతం మంచి మార్కులే పడ్డాయి. ఇక రీసెంట్‌ మూవీ ‘సలార్‌’ బాక్సాఫీస్‌ వద్ద దుమ్ముదులిపింది. ఇప్పటివరకూ ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.611.8 కోట్లు రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతూ తన కలెక్షన్స్‌ను పెంచుకుంటుంది. పైగా ఇందులో ప్రభాస్‌ తన యాక్షన్‌తో గూస్‌బంప్స్ తెప్పించాడు. అటువంటి ప్రభాస్‌కు ఉత్తమ నటుడు కేటగిరి నామినేషన్స్‌లో కనీసం చోటు దక్కకపోవడం ఫ్యాన్స్‌లో అసంతృప్తికి కారణమవుతోంది.  సలార్‌ వద్దు.. డంకీ ముద్దు!(Saalar Vs Dunki) షారుక్‌ ఖాన్‌ రీసెంట్‌ చిత్రం డంకీ (Dunki), ప్రభాస్‌ ‘సలార్‌’ చిత్రాలు రెండూ ఒకే రోజూ రిలీజయ్యాయి. డంకీ ఇప్పటివరకూ రూ.460.70 కోట్లు వసూలు చేయగా సలార్‌ అంతకంటే ఎక్కువే కలెక్షన్స్ సాధించింది. అయినప్పటికీ సలార్‌ను కాదని, డంకీ ఉత్తమ చిత్రం కేటగిరిలో చోటు కల్పించడంపై ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది చిత్రాలు ప్రపంచ స్థాయిలో రాణిస్తున్న ఈ రోజుల్లోనూ మన హీరోలపై ఎందుకీ వివక్ష అని ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా ఘటనలు భారతీయ చిత్ర పరిశ్రమకు మంచిది కాదని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డులు పూర్తిగా హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించినవని తెలుసు.. సలార్, ఆదిపురుష్ వంటి చిత్రాలు పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన విషయం గుర్తించుకోవాలి. ప్రభాస్ బాహుబలి తర్వాత తీసిన సినిమాలు హిందీ డైరెక్టర్లతోనే తీశాడు. విచిత్రమేమిటంటే.. జవాన్ సినిమా డైరెక్టర్ అట్లీ సౌత్ నుంచి వచ్చాడు. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై హిట్ అయింది. ఈ సినిమాకు అవార్డుల్లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ కేటగిరీల్లో స్థానం దక్కింది.  అలాగే సలార్ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది.. ప్రశాంత్ నీల్. అతను సౌత్‌కు చెందినవాడే కావచ్చు. కానీ సలార్ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో ఎలాంటి హిట్ సాధించిందో… హిందీలోనూ అలాంటి హిట్‌నే సాధించింది. కావాలనే ప్రభాస్‌ను అవార్డుల రేసు నుంచి పక్కకు పెట్టారని నెటిజన్లతో పాటు ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. దీనికి బాలీవుడ్‌లో కొంతమంది అగ్ర హీరోలు ఉన్నారని చర్చించుకుంటున్నారు.  సలార్ విడుదల సమయంలో థియేటర్లు కెటాయించకుండా… డంకీ చిత్రానికి థియేటర్లు కేటాయించడంపై అప్పట్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్(Prabhas fans) నిరసన వ్యక్తం చేశారు. దానికి ప్రతీకారంగానే ప్రభాస్‌ను, ఆయన సినిమాలను బాలీవుడ్‌లో ఓ వర్గం పక్కకు పెట్టారని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు.   పాపం రష్మిక..! అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇందులో రష్మిక మంచి నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయినప్పటికీ ఉత్తమ నటి కేటగిరి నామినేషన్స్‌లో రష్మిక( Rashmika Mandanna) పేరు లేకపోవడం ఆశ్చర్య పరుస్తోంది. అదే సినిమాలో కొద్దిసేపు కనిపించి అలరించిన నటి త్రిప్తి దిమ్రి (Tripti Dimri) ఉత్తమ సహాయ నటి కేటగిరీలో ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్‌ నామినేషన్స్‌లో నిలవడం చర్చకు తావిస్తోంది. దీనిని రష్మిక ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. రష్మిక దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన నటి కావడం వల్లే ఆమె ఏ విభాగంలోనూ నామినేట్ కాలేదని చెబుతున్నారు.  అప్పట్లోనే అవమానం అంబాని గణపతి పూజ సమయంలోనూ… బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ శ్రద్ధాకపూర్ కావాలనే రష్మికను పట్టించుకోని వీడియో అప్పట్లో సోషల్ మీడియోలో వైరల్ అయింది. సౌత్ నటి అయినందు వల్లే రష్మికను అవైడ్ చేశారని పెద్ద చర్చ సాగింది. https://twitter.com/leena_gaut57982/status/1704495711058812951?s=20 ‘యానిమల్’ సత్తా చాటేనా! తెలుగు డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్‌ (Animal) చిత్రం ఏకంగా 19 విభాగాల్లో చోటు దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడి కేటగిరిలో సందీప్ రెడ్డి వంగా, ఉత్తమ నటుడు విభాగంలో రణ్‌బీర్‌ కపూర్‌, ఉత్తమ సహాయ నటులుగా అనిల్‌ కపూర్‌, బాబీ దేబోల్‌, సహాయ నటిగా త్రిప్తి దిమ్రి యానిమల్‌ మూవీ నుంచి రేసులో నిలిచారు. దీన్ని బట్టి చూస్తే 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుకల్లో (Filmfare Awards 2024) యానిమల్‌ సత్తా చాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోమారు జాతీయ స్థాయిలో టాలీవుడ్‌ సత్తా ఏంటో తెలియనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.  విభాగాల వారిగా నామినేషన్స్ జాబితా ఉత్తమ చిత్రం (పాపులర్‌) 12th ఫెయిల్‌జవాన్‌ఓఎంజీ2పఠాన్‌రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌) 12th ఫెయిల్‌బీడ్‌ఫరాజ్‌జొరామ్‌శ్యామ్‌ బహదూర్‌త్రీ ఆఫ్‌ అజ్‌జ్విగాటో ఉత్తమ దర్శకుడు అమిత్‌ రాయ్‌ (ఓఎంజీ2)అట్లీ (జవాన్‌)కరణ్‌ జోహార్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)సందీప్‌ వంగా (యానిమల్‌)సిద్ధార్థ్‌ ఆనంద్‌ (పఠాన్‌)విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌) ఉత్తమ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ (యానిమల్‌)రణ్‌వీర్‌ సింగ్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)షారుక్‌ఖాన్‌ (డంకీ)షారుక్‌ ఖాన్‌(జవాన్‌)సన్నీ దేఓల్‌ (గదర్‌2)విక్కీ కౌశల్‌ (శ్యామ్‌ బహదూర్‌) ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) అభిషేక్‌ బచ్చన్‌ (ఘూమర్‌)జయ్‌దీప్‌ అహల్వత్‌ (త్రీ ఆఫ్‌ అజ్‌)మనోజ్‌ బాజ్‌పాయ్‌ (జొరామ్‌)పంకజ్‌ త్రిపాఠి (ఓఎంజీ2)రాజ్‌కుమార్‌ రావ్‌ (బీడ్‌)విక్కీ కౌశల్‌ (శ్యామ్‌ బహదూర్‌)విక్రాంత్‌ మెస్సే (12th ఫెయిల్‌) ఉత్తమ నటి అలియా భట్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)భూమి పెడ్నేకర్‌ (థ్యాంక్యూ ఫర్‌ కమింగ్‌)దీపిక పదుకొణె (పఠాన్‌)కియారా అడ్వాణీ (సత్య ప్రేమ్‌కి కథ)రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే)తాప్సీ (డంకీ) ఉత్తమ నటి (క్రిటిక్స్‌) దీప్తి నవల్‌ (గోల్డ్‌ ఫిష్‌)ఫాతిమా సనా షేక్‌ (ధక్‌ ధక్‌)రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే)సయామీఖేర్‌ (ఘూమర్‌)షహానా గోస్వామి (జ్విగాటో)షఫిల్‌ షా (త్రీ ఆఫ్ అజ్‌) ఉత్తమ సహాయ నటుడు ఆదిత్య&nbsp; రావల్‌ (ఫరాజ్‌)అనిల్‌ కపూర్‌ (యానిమల్‌)బాబీ దేఓల్‌ (యానిమల్‌)ఇమ్రాన్‌ హష్మి (టైగర్‌3)టోటా రాయ్‌ చౌదరి (రాఖీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ)విక్కీ కౌశల్‌ (డంకీ) ఉత్తమ సహాయ నటి జయా బచ్చన్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)రత్న పాఠక్‌ షా (ధక్‌ ధక్‌)షబానా అజ్మీ (ఘూమర్‌)షబానా అజ్మీ&nbsp; (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)త్రిప్తి దిమ్రి (యానిమల్‌)యామి గౌతమ్‌ (ఓఎంజీ2)
    జనవరి 17 , 2024
    69th Filmfare Awards 2024: బాలీవుడ్ ఇలాకాలో టాలీవుడ్‌ జెండా.. తెలుగోడి సత్తా అంటే ఇదే!
    69th Filmfare Awards 2024: బాలీవుడ్ ఇలాకాలో టాలీవుడ్‌ జెండా.. తెలుగోడి సత్తా అంటే ఇదే!
    బాలీవుడ్‌ ప్రతిష్ఠాత్మకంగా భావించే 69వ ‘ఫిల్మ్‌ఫేర్‌’ (69th FilmFare Awards) అవార్డుల జాబితా వచ్చేసింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ వేదికగా అట్టహసంగా సాగిన ఈ వేడుకలో విజేతలను ప్రకటించారు. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి ఈ అవార్డులు ప్రకటించారు. టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించిన యానిమల్‌ (Animal) చిత్రానికి అవార్డుల పంట పడింది. అందరూ ఊహించినట్లుగానే సందీప్‌.. ఫిల్మ్‌ఫేర్‌ వేడుకల్లో తన సత్తా ఏంటో చూపించాడు. మెుత్తం ఐదు అవార్డులను కొల్లగొట్టి టాలీవుడ్‌ జెండా బాలీవుడ్‌లో ఎగిరేలా చేశాడు.&nbsp; బాలీవుడ్‌లో ‘యానిమల్‌’ తుఫాన్‌! డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన ‘యానిమల్’ చిత్రం థియేటర్లలో ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద రూ.910 కలెక్షన్లను సాధించింది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ సినిమా సత్తాచాటుతోంది. తాజాగా ప్రకటించిన ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లోనూ సందీప్‌ మూవీ ‘యానిమల్‌’ దుమ్మురేపింది. నటుడు, గాయకుడు, సంగీతం (పాటలు), నేపథ్య సంగీతం, సౌండ్ డిజైన్‌ ఇలా మెుత్తం ఐదు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. ఈ వేడుకల్లో అత్యధిక అవార్డులు సాధించిన చిత్రంగా నిలిచింది. అదరగొట్టిన ‘12th ఫెయిల్‌’ ఇటీవల విడుదలైన ‘12th ఫెయిల్‌’ (12th Fail) చిత్రం కూడా యానిమల్‌ తరహాలోనే 69వ ‘ఫిల్మ్‌ఫేర్‌’ అవార్డు వేడుకల్లో అదరగొట్టింది. యానిమల్‌తో సమానంగా ఐదు అవార్డులను గెలుచుకొని అందరిచేత ప్రశంసలు అందుకుంది. ఉత్తమ క్రిటిక్స్ నటుడు అవార్డుతో పాటు సినిమా, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌, దర్శకుడు విభాకాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. దీంతో 12th ఫెయిల్‌ అవార్డుల సంఖ్య ఐదుకు చేరాయి. మరోవైపు 'రాకీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహాని' నాలుగు అవార్డులు గెలుచుకొని మూడో స్థానంలో నిలిచింది. బెస్ట్‌ యాక్టర్స్‌గా భార్య భర్తలు ఫిల్మ్ ఫేర్ - 2024 పురస్కారాల్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులు భార్యాభర్తలకు వచ్చాయి. 'యానిమల్' సినిమాకు గాను ఉత్తమ నటుడిగా రణబీర్ కపూర్ (Ranbir Kapoor) అవార్డు అందుకోగా 'రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని' సినిమాకు గాను ఉత్తమ నటిగా ఆలియా భట్ (Alia Bhatt) అవార్డు గెలుచుకున్నారు. పెళ్లి తర్వాత వీళ్లిద్దరి జంటకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు రావడం ఇది తొలిసారి. ఇక ఉత్తమ నటుడు క్రిటిక్స్‌ విభాగంలో విక్రాంత్‌ మెస్సె (12th ఫెయిల్‌), ఉత్తమ నటి (క్రిటిక్స్‌) రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే), ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్‌ (డంకీ), ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ) అవార్డులు సొంతం చేసుకున్నారు.&nbsp; 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో విజేతలు వీరే: ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్‌ ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): జొరామ్‌ ఉత్తమ దర్శకుడు: &nbsp;విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌) ఉత్తమ నటుడు: రణ్‌బీర్‌ కపూర్‌ (యానిమల్‌) ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): విక్రాంత్‌ మెస్సె (12th ఫెయిల్‌) ఉత్తమ నటి: అలియా భట్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ) ఉత్తమ నటి (క్రిటిక్స్‌): రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్‌ అజ్‌) ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్‌ (డంకీ) ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ) ఉత్తమ గీత రచయిత: అమితాబ్‌ భట్టాచార్య(తెరె వాస్తే..: జరా హత్కే జరా బచ్కే) ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బం: యానిమల్‌&nbsp; ఉత్తమ నేపథ్య గాయకుడు: భూపిందర్‌ బాబల్‌ ( అర్జన్‌ వెయిలీ- యానిమల్‌) ఉత్తమ నేపథ్య గాయకురాలు: శిల్పా రావు (చెలెయ- జవాన్‌) ఉత్తమ కథ: అమిత్‌ రాయ్‌ (OMG 2) ఉత్తమ స్క్రీన్‌ప్లే: విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌) ఉత్తమ డైలాగ్‌: ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)
    జనవరి 29 , 2024
    <strong>Google Most Searched Movies 2024: టాప్ 10 చిత్రాల్లో 3 తెలుగు సినిమాలే.. ప్రభాస్ డబుల్ ధమాకా!</strong>
    Google Most Searched Movies 2024: టాప్ 10 చిత్రాల్లో 3 తెలుగు సినిమాలే.. ప్రభాస్ డబుల్ ధమాకా!
    గూగుల్ ట్రెండ్స్ ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్‌ చేసిన టాప్‌ 10 భారతీయ సినిమాల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషలకు చెందిన చిత్రాలు చోటు దక్కించుకున్నాయి.&nbsp; Stree 2 అత్యధికంగా సెర్చ్‌ చేసిన భారతీయ సినిమాల్లో బాలీవుడ్ మూవీ ‘స్త్రీ 2’ మొదటి స్థానంలో నిలిచింది. ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ₹600 కోట్లకు పైగా వసూలు చేసి భారీ విజయం సాధించింది. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హారర్ కామెడీ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక స్త్రీ 2 సినిమా స్టోరీ విషయానికొస్తే... చందేరీ గ్రామంలో ‘స్త్రీ’ సమస్య తొలగింది అని అందరూ ఊపిరి పీల్చుకునేలోపు ‘సర్కట’తో కొత్త సమస్య మొదలవుతుంది. ఈ సమస్యను విక్కీ (రాజ్ కుమార్ రావు), రుద్ర (పంకజ్ త్రిపాఠి), జన (అభిషేక్ బెనర్జీ), బిట్టు (ఆపర్ శక్తి ఖురానా)తో కలిసి ఓ భూతం (శ్రద్ధా కపూర్) ఎలా ఎదుర్కొంది? అన్నది స్టోరీ. Kalki 2898 AD రెండో స్థానంలో నిలిచిన ‘కల్కి 2898 AD’ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకోణే, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ వంటి ప్రముఖులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹1200 కోట్లకు పైగా వసూళ్లు చేసి పాన్ ఇండియా స్థాయిలో పెద్ద హిట్‌గా నిలిచింది. ఇక కల్కి స్టోరీ విషయానికొస్తే…కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి చేత శాపం పొందిన అశ్వత్థామ (అమితాబ్‌బచ్చన్‌).. కల్కి ఆగమనం కోసం ఎదురుచూస్తుంటాడు. సుమతి (దీపికా పదుకొణె) అనే మహిళ కడుపున కల్కి జన్మిస్తాడని తెలిసి ఆమెకు రక్షణగా మారతాడు. కాశీలో నివసించే భైరవ (ప్రభాస్‌) స్వర్గాన్ని తలపించే కాంప్లెక్స్‌లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటాడు. సుమతిని పట్టిస్తే కాంప్లెస్‌ వెళ్లొచ్చని తెలుసుకుంటాడు. మరి భైరవ, అశ్వత్థామను ఎదిరించి సుమతిని తీసుకొచ్చాడా? సుప్రీమ్‌ యష్కిన్‌ (కమల్‌ హాసన్‌) పాత్ర ఏంటి? కురుక్షేత్ర యుద్ధంతో కలియుగం అంతం ఎలా ముడిపడి ఉంది? అన్నది కథ. 12th Fail మూడో స్థానంలో ‘12వ ఫెయిల్‌’ నిలవడం విశేషం. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను దోచుకుని మంచి వసూళ్లు సాధించింది. స్ఫూర్తివంతమైన కథనం ఈ సినిమాను సూపర్ హిట్ చేసింది.&nbsp; ఇక స్టోరీ విషయానికొస్తే…మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఒక గ్రామంలో ఉండే నిరుపేద యువకుడు 12వ తరగతి ఫెయిల్‌ అవుతాడు. కానీ పట్టుదలతో చదివి, దృఢ సంకల్పంతో ఐపీఎస్‌ అధికారి అవుతాడు. ఆ యువకుడు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్న ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. Laapataa Ladies ఆస్కార్ రేసులో భారత్ నుంచి అధికారికంగా ఎంపికైన ‘లపాటా లేడీస్‌’ నాలుగో స్థానంలో ఉంది, ఇది మహిళల సెంట్రిక్ కథతో సక్సెస్‌ సాధించింది. Hanu-Man తెలుగు సినీ ప్రియులకు గర్వకారణంగా, ‘హనుమాన్’ ఐదో స్థానంలో నిలిచింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో విడుదలై అనేక రికార్డులను తిరగరాసింది. ₹300 కోట్లకు పైగా వసూళ్లు చేసిన ఈ సూపర్ హీరో సినిమా, తెలుగు, హిందీ భాషల్లో కూడా ఘన విజయాన్ని అందుకుంది.&nbsp; ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే…సౌరాష్ట్రలో ఉండే మైఖేల్‌ (వినయ్ రాయ్‌) చిన్నప్పటి నుంచి సూపర్‌ హీరో అవ్వాలని భావిస్తుంటాడు. ఇందుకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులను కూడా మట్టు పెడతాడు. మరో పక్క అంజనాద్రి అనే గ్రామంలో దొంగతనాలు చేస్తూ కొంటె కుర్రాడిలా హనుమంతు (తేజ సజ్జ) తిరుగుతుంటాడు. కొన్ని పరిణామాల రీత్యా అతడు హనుమాన్ శక్తులని పొందుతాడు. ఈ శక్తి హనుమంతుకు ఎలా వచ్చింది? ఆ శక్తి భూమిపై ఎలా నిక్షిప్తం అయ్యింది? హనుమంతు పవర్స్‌ గురించి మైఖేల్ ఎలా తెలుసుకున్నాడు? మైఖేల్‌ నుంచి గ్రామస్తులకు ఏర్పడ్డ ముప్పును హనుంతు ఎలా తొలగించాడు? విభీషణుడు (సముద్రఖని), అంజమ్మ (వరలక్ష్మి) పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది కథ. Maharaja ఆరవ స్థానంలో విజయ్ సేతుపతి నటించిన తమిళ చిత్రం ‘మహారాజా’, ఏడో స్థానంలో నిలిచింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే… మ‌హారాజా ఒక‌ ప్ర‌మాదంలో భార్య‌ను పోగొట్టుకొని ఊరి చివర కూతురితో జీవిస్తుంటాడు. ఒక రోజు మ‌హారాజా గాయాల‌తో పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్తాడు. ఆగంత‌కులు త‌న ఇంట్లోకి చొర‌బ‌డి దాడి చేశార‌ని చెప్తాడు. త‌న బిడ్డను కాపాడిన ల‌క్ష్మిని ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేస్తాడు ఇంతకీ ఆ ల‌క్ష్మి ఎవ‌రు? మహారాజా కూతురికి జరిగిన అన్యాయం ఏంటి? విలన్లపై హీరో ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడు? అన్నది కథ. Manjummel Boys మలయాళ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్‌’, ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఫ్రెండ్‌షిప్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. కేర‌ళ‌ కొచ్చికి చెందిన కుట్ట‌న్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్క‌డ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ. The Greatest of All Time తమిళ్ సూపర్ విజయ్ నటించిన ‘గోట్‌’&nbsp; 8వ స్థానంలో నిలిచింది. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విన్నర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే..గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. ఓ మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లి కొడుకును పొగొట్టుకుంటాడు. దీంతో భార్య అను (స్నేహా) అతడ్ని దూరం పెడుతుంది. కొన్నేళ్ల తర్వాత మాస్కోకు వెళ్లిన గాంధీకి చనిపోయాడనుకుంటున్న కొడుకు జీవన్‌ (విజయ్‌) కనిపిస్తాడు. సంతోషంగా ఇంటికి తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీకి సంబంధించిన వారు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. ఈ హత్యలకు కారణం ఎవరు? చనిపోయిన జీవన్‌ ఎలా తిరిగొచ్చాడు? అన్నది స్టోరీ. Salaar ప్రభాస్‌ నటించిన ‘సలార్‌’ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ చిత్రం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చి భారీ విజయం సాధించింది.&nbsp; ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే………ఖాన్సార్‌ సామ్రాజ్యానికి రాజ మ‌న్నార్ (జ‌గ‌ప‌తిబాబు) రూలర్‌. సామ్రాజ్యంలోని ప్రాంతాలను దొరలు పాలిస్తుంటారు. ఖాన్సార్‌ పీఠం కోసం రాజ మన్నార్‌ను దొరలు సొంతంగా సైన్యం ఏర్పాటు చేసుకొని హత్య చేస్తారు. తండ్రి కోరిక మేరకు వ‌ర‌ద రాజమ‌న్నార్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌) ఖాన్సార్‌కు రూలర్‌ అవ్వాలని భావిస్తాడు. ఇందుకోసం చిన్ననాటి స్నేహితుడు దేవా (ప్ర‌భాస్‌) సాయం కోరతాడు. ఆ ఒక్క‌డు అంత‌మంది దొరల సైన్యాన్ని ఎలా ఎదిరించాడు? అన్నది స్టోరీ. Aavesham &nbsp;మలయాళం నుంచి ఫహాద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ పదవ స్థానంలో నిలిచింది. ఈ చిత్రం మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలోని పలు సన్నివేశాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కల్కి 2898 AD మరియు హనుమాన్ వంటి తెలుగు చిత్రాలు టాప్‌ 10లో చోటు దక్కించుకోవడం ఆశ్చర్యకరం కాదు. ఈ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సృష్టించిన హైప్‌ అలాంటిది. హనుమాన్ సంక్రాంతి సమయంలో విడుదలై పాత రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ ₹300 కోట్లకు పైగా వసూలు చేసింది. మొత్తంగా గూగుల్ ట్రెండ్స్ జాబితాలో ఈ ఏడాది మూడు తెలుగు సినిమాలు, మూడు హిందీ చిత్రాలు, రెండు తమిళ సినిమాలు, రెండు మలయాళ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. 2024 సంవత్సరానికి మరింత ఆసక్తికరమైన సినిమాల జాబితా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.
    డిసెంబర్ 12 , 2024
    Sai Pallavi: చిరంజీవి నుంచి విజయ్‌ దేవరకొండ వరకు సాయి పల్లవి వదులుకున్న సినిమాలు.. కారణం చెప్పిన హైబ్రిడ్ పిల్ల!
    Sai Pallavi: చిరంజీవి నుంచి విజయ్‌ దేవరకొండ వరకు సాయి పల్లవి వదులుకున్న సినిమాలు.. కారణం చెప్పిన హైబ్రిడ్ పిల్ల!
    టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయి పల్లవి గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్‌’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన సాయిపల్లవి ఆ సినిమాతో ఎనలేని పేరును సంపాదించింది. ఫిదా చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సాయి పల్లవి.. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్‌ హృదయాలను గెలుచుకుంది. అద్భుతమైన నటన, మిస్మరైజింగ్‌ డ్యాన్స్‌తో అందరిని ఆకట్టుకుంది. అయితే హీరోయిన్‌కు ఒక హిట్టు వస్తే అవకాశాలు క్యూ కట్టడం కామన్‌గా మారిపోయాయి. అందుకు తగ్గట్లే ఈ తరం హీరోయిన్లు ఎడపెడా సినిమాలు చేస్తూ ఫ్లాపులు మూటగట్టుకుంటున్నారు. అయితే ఈ ధోరణికి సాయి పల్లవి దూరంగా ఉంది. ఎంత పెద్ద సినిమా ఆఫర్‌ వచ్చిన కథ నచ్చితేనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తోంది. పాత్రలో గ్లామర్‌ డోస్‌ ఎక్కువైనా, నటనకు ప్రాధాన్యం తగ్గినా సాయి పల్లవి సున్నితంగా రిజెక్ట్‌ చేస్తుందని ఇండస్ట్రీలో టాక్‌. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ ఈ మలయాళీ భామ వదులుకున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. 1. భోళా శంకర్‌ (Bhola Shankar) చిరంజీవి హీరోగా, మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భోళాశంకర్‌. ఇందులో చిరంజీవి సరసన తమన్న నటిస్తుండగా చెల్లెలిగా కీర్తి సురేష్‌ చేస్తోంది. అయితే కీర్తి సురేష్‌ పాత్రకు తొలుత సాయిపల్లవిని చిత్రం బృందం సంప్రదించింది. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఈవెంట్‌లో సాయిపల్లవే చెప్పింది. తానే ఆ రోల్‌ను రిజెక్ట్‌ చేశానని స్పష్టం చేసింది. రీమేక్‌ సినిమాలపై ఉన్న భయంతోనే ఆ పాత్రను వదులుకున్నట్లు తెలిపింది. కాగా, తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన వేదాలం సినిమాకు రీమేక్‌గా ‘భోళా శంకర్‌’ వస్తోంది.&nbsp; 2. లియో (Leo) తమిళ స్టార్‌ హీరో విజయ్‌ కథానాయకుడు ‌అంటే ఏ హీరోయిన్‌ ‌అయినా ఎగిరి గంతేస్తుంది. కానీ సాయి పల్లవి మాత్రం విజయ్‌ సినిమాను సున్నితంగా తిరస్కరించింది. విజయ్‌ లేటెస్ట్‌ మూవీ ‘లియో’లో హీరోయిన్‌గా తొలుత సాయి పల్లవినే అనుకున్నారట. ఇందుకోసం చిత్ర యూనిట్ సాయి పల్లవిని కూడా సంప్రదించింది. అయితే ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె రిజెక్ట్‌ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత త్రిషను సంప్రదించగా అందుకు ఆమె గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.&nbsp; 3. ఛత్రపతి (Chatrapathi) యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ ఛత్రపతి సినిమాతో హిందీలోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగులో సూపర్‌ హిట్‌గా నిలిచిన రాజమౌళి ‘ఛత్రపతి’కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం కూడా సాయిపల్లవినే సంప్రదించారని అప్పట్లో టాక్‌ వినిపించింది. గ్లామర్‌ షో ఎక్కువగా చేయాల్సి ఉండటంతో సాయి పల్లని ఈ ఆఫర్‌ రిజెక్ట్‌ చేశారని సమాచారం. దీంతో ఆ పాత్రకు బాలీవుడ్‌ నటి నుస్రత్‌ భరుచ్చాను ఎంపికచేశారు. కాగా, ఈ సినిమా మే 12 రిలీజ్‌ కానుంది.&nbsp; 4. వారసుడు (Varasudu) విజయ్‌ రీసెంట్ మూవీ వారసుడు / వారిసు సినిమాను కూడా సాయి పల్లవి రిజెక్ట్‌ చేసిందట. ఇందులో కూడా హీరోయిన్‌ పాత్రకు ప్రియారిటీ లేకపోవడంతో సున్నితంగా నో చెప్పిందని సమాచారం. దీంతో సాయిపల్లవి చేయాల్సిన పాత్రకు రష్మిక మందన్నను ఎంపిక చేశారు.&nbsp; 5. సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru) మహేష్‌ బాబు, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా హిట్‌ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో హీరోయిన్‌ పాత్రను సైతం సాయిపల్లవినే చేయాల్సి ఉండగా ఆమె రిజెక్ట్‌ చేసింది. దీంతో ఆ అవకాశం మళ్లీ రష్మికకే దక్కింది. హీరోయిన్ పాత్రకు యాక్టింగ్‌ స్కోప్‌ ఎక్కువగా లేకపోవడంతోనే ఈ భామ తిరస్కరించినట్లు తెలుస్తోంది.&nbsp; 6. డియర్ కామ్రేడ్ (Dear Comrade) విజయ్‌ దేవరకొండ - రష్మిక మందన్న కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘డియర్‌ కామ్రేడ్‌’. ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద మాత్రం దారుణంగా ఫెయిల్‌ అయింది. అయితే ఈ సినిమా హీరోయిన్‌ ఆఫర్‌ కూడా ముందుగా సాయిపల్లవికే వెళ్లింది. అయితే ముద్దు సన్నివేశాలు, గ్లామర్ షో ఉన్న పాత్ర కావడంతో ఈ భామ తిరస్కరించినట్లు అప్పట్లో వార్తల్లో వచ్చాయి. తొలి నుంచి కిస్సింగ్‌ సీన్లకు దూరంగా ఉండే సాయిపల్లవి.. ఇందులో హీరోయిన్, హీరోయిన్ల ఘాటు రొమాన్స్‌ ఉండటంతో నో చెప్పింది.&nbsp; 7. చెలియా (Cheliya) లెజెండరీ డైరెక్టర్‌ మణిరత్నంతో కనీసం ఒక సినిమాలోనైనా వర్క్‌ చేయాలని హీరో, హీరోయిన్లు కలకలలు కంటారు. ఒక చిన్న పాత్ర దొరికినా చాలు అని సంబరపడుతుంటారు. కానీ సాయిపల్లవి మాత్రం ఏకంగా హీరోయిన్ ఆఫర్‌నే తిరస్కరించింది. కార్తిక్‌ హీరోగా తెరకెక్కిన చెలియా సినిమా కోసం తొలుత సాయిపల్లవినే మూవీ యూనిట్‌ సంప్రదించింది. అయితే సినిమా కథతో సంతృప్తి చెందని ఈ భామ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించింది. దీంతో సాయిపల్లవి ప్లేసులో అదితిరావు హైదరినీ తీసుకున్నారు.&nbsp;
    మే 09 , 2023
    <strong>Keerthy Suresh: దసరా నుంచి కీర్తిని హీరోయిన్‌గా తీసేద్దామనుకున్న డైరెక్టర్.. కానీ!</strong>
    Keerthy Suresh: దసరా నుంచి కీర్తిని హీరోయిన్‌గా తీసేద్దామనుకున్న డైరెక్టర్.. కానీ!
    అందం కంటే నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్లలో కీర్తి సురేష్‌ (Keerthy Suresh) ఒకరు. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఈ అమ్మడు తెలుగులోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్ర అద్భుతంగా పోషించి ఏకంగా జాతీయ అవార్డు అందుకుంది. అయితే ఆమె ఫిల్మ్‌ కెరీర్‌లో ఎన్నో ఆసక్తికర సంఘనటలు చోటుచేసుకున్నాయి. నేడు (అక్టోబర్‌ 17) కీర్తి సురేష్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; చైల్డ్‌ ఆర్టిస్టుగా నటీనటులు సురేష్‌కుమార్‌, మేనకల కుమార్తె అయిన కీర్తి సురేష్‌ పెలట్స్‌ అనే మలయాళ చిత్రంతో బాలనటిగా మెరిసింది. మరో అచనేయనేనికిష్టం, కుబేరన్‌ అనే చిత్రాల్లోనూ ఆమె చైల్డ్‌ ఆర్టిస్టుగా కనిపించింది.&nbsp; చిరుకి జోడీగా తల్లి.. చెల్లిగా కూతురు చిరంజీవి (Chiranjeevi) ‘పున్నమినాగు’ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ తల్లి మేనక నటించారు. రీసెంట్‌గా వచ్చిన 'భోళా శంకర్‌' మూవీలో మెగాస్టార్‌ సోదరిగా కీర్తి సురేష్‌ నటించడం గమనార్హం. సినిమా ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ అన్నా చెల్లెళ్లుగా వీరి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. హైదరాబాద్‌లో షూటింగ్‌ జరిగిన అన్ని రోజులు తన ఇంటి నుంచే కీర్తికి భోజనం పంపినట్లు చిరు మూవీ ప్రమోషన్స్ సందర్భంగా తెలిపారు. ప్రారంభంలోనే అటకెక్కిన చిత్రాలు మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ నటించిన గీతాంజలి సినిమాతో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా మారింది. అయితే అంతకుముందే హీరోయిన్‌గా మూడు ప్రాజెక్ట్స్‌ను కీర్తి ఓకే చేసింది. షూటింగ్‌ కూడా సగానికి పైనే జరిగింది. అయితే అనూహ్యంగా ఆ మూడు ప్రాజెక్ట్స్‌ మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో తీవ్ర నిరాశకు గురైనట్లు ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది.&nbsp; ఐరెన్‌ లెగ్‌గా ముద్ర కెరీర్‌ ప్రారంభంలోనే మూడు ప్రాజెక్ట్స్‌ ఆగిపోవడం.. మలయాళంలో చేసిన ‘గీతాంజలి’, రింగ్‌ మాస్టర్‌ చిత్రాలు ఫ్లాప్‌ కావడం, తమిళంలో ఆమె ఫస్ట్‌ ఫిల్మ్‌ ‘ఇదు ఎన్న యామమ్‌’ కూడా డిజాస్టర్‌గా నిలవడంతో కీర్తికి ఐరెన్‌ లెగ్‌ అన్న ముద్ర వచ్చింది. విపరీతంగా ట్రోల్స్‌కు సైతం గురైంది. వాటిని పట్టించుకోకుండా విజయవంతమైన చిత్రాల్లో నటించి కీర్తి సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా మారింది.&nbsp; మహానటితో కెరీర్‌ టర్నింగ్‌ తెలుగులో చేసిన ఫస్ట్ ఫిల్మ్‌ ‘నేను శైలజా’ మంచి విజయం సాధించడంతో టాలీవుడ్‌, కోలీవుడ్‌లో కీర్తి సురేష్‌కు అవకాశాలు పెరిగాయి. వరుసగా కమర్షియల్ చిత్రాలు చేస్తున్నప్పటికీ నటిగా ఏమీ సాధించలేదన్న అసంతృప్తి కీర్తిలో ఉండిపోయింది. ఆ సమయంలోనే ‘మహానటి’ ప్రాజెక్ట్ ఆమె చెంతకు వచ్చింది. ఇందులో సావిత్రిగా పరకాయ ప్రవేశం చేసి మరి నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకొని తోటి హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలిచింది. మహానటి తర్వాత కీర్తి సురేష్‌ గ్రాఫ్‌ అమాంతం పెరిగిపోయింది.&nbsp; వరుస ఫెయిల్యూర్స్ ‘మహానటి’ తర్వాత కెరీర్‌ పరంగా కీర్తి సురేష్‌కు తిరుగుండదని అంతా భావించారు. అందుకు తగ్గట్లే వరుసగా ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ ఆ సినిమాలన్నీ ఫ్లాప్‌ టాక్స్‌ తెచ్చుకోవడంతో కీర్తి సురేష్‌ ఇబ్బందుల్లో పడింది. మహానటి తర్వాత ఆమె చేసిన ‘సామి స్క్వేర్‌’, ‘పందెం కోడి 2’,&nbsp; రంగ్‌ దే, ‘అన్నాతే’ వంటి సినిమాలు ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయాయి. లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌ ‘పెంగ్విన్‌’, ‘మిస్‌ ఇండియా’, ‘గుడ్‌లక్‌ సఖి’ చిత్రాలూ సందడి చేయలేకపోయాయి.&nbsp; కీర్తిని తీసేద్దామన్న డైరెక్టర్‌ గతేడాది విడుదలైన ‘దసరా’ సినిమాతో కీర్తి భారీ విజయం సాధించి తిరిగి సక్సెస్‌ ట్రాక్‌లోకి అడుగుపెట్టింది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించి సత్తా చాటింది. ముఖ్యంగా కీర్తి సురేష్‌ నటనపై సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. వెన్నెల అనే గ్రామీణ యువతిగా ఆమె అదరగొట్టింది. ఉత్తమనటిగా సైమా, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సైతం అందుకుంది. అయితే వాస్తవానికి ఈ పాత్ర అయితే దసరా హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను తీసేద్దామని డైరెక్టర్‌ శ్రీకాంత్ ఓదెల భావించినట్లు ఆ మూవీ ప్రమోషన్స్‌ సందర్భంగా నాని చెప్పారు. మూవీ కథను కీర్తికి చెప్పిన డైరెక్టర్‌ ఆమెను 10-12 కిలోలు బరువు పెరగాలని సూచించారట. కానీ అందుకు తగ్గట్లు పెరగలేదట. దీంతో తన వద్దకు వచ్చి కీర్తి సురేష్‌ను తీసేద్దామని శ్రీకాంత్ ఓదెల అన్నట్లు నాని చెప్పారు. నువ్వు డెబ్యూ డైరెక్టర్‌వి, ఆమె నేషనల్ అవార్డ్ విన్నింగ్‌ నటి. ఇది జరగదని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ విధంగా సినిమా సెట్స్‌పైకి వెళ్లడం వారిద్దరు మంచి ఫ్రెండ్స్‌ కావడం చకాచకా జరిగిపోయినట్లు నాని వివరించారు. https://www.youtube.com/watch?v=J-PhzFEt9Wk కీర్తి స్పెషల్‌ టాలెంట్‌ కీర్తి సురేష్‌ ముఖమే కాదు, గొంతు కూడా చాలా అందంగా ఉంటుంది. దీనిని గుర్తించిన దర్శకులు ఆమె వాయిస్‌తో మ్యాజిక్‌ చేయించారు. ‘సామి స్క్వేర్’ సినిమాలో కీర్తి 'పుదు మెట్రో రైల్‌' అనే పాటను చాలా అందంగా పాడింది. అంతేకాకుండా ఇటీవల వచ్చి కల్కి 2898 ఏడీ చిత్రంలో బుజ్జి వాహనానికి వాయిస్‌ అందించి ఆకట్టుకుంది. ‘గాంధారి’ ఆల్బమ్‌తో తనలో మంచి డ్యాన్సర్‌ ఉందని కూడా చాటి చెప్పింది. ఈ ఏడాది బాలీవుడ్‌లోకి.. ఈ ఏడాది ఇప్పటికే ‘సైరన్‌’, ‘రఘుతాత’తో అలరించిన కీర్తి ‘రివాల్వర్‌ రీటా’, ‘కన్నివేడి’, ‘ఉప్పు కప్పురంబు’తో బిజీగా ఉన్నారు. ‘బేబీ జాన్‌’ (Baby John)తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తన కెరీర్‌లో సావిత్రి (మహానటి), వెన్నెల (దసరా), కళావతి (సర్కారువారి పాట) పాత్రలు సవాలు విసిరాయని ఓ సందర్భంలో అన్నారు.
    అక్టోబర్ 17 , 2024
    TIGER 3 Review in Telugu: సల్మాన్ ఖాన్ యాక్షన్‌తో అదరగొట్టాడు.. కానీ!
    TIGER 3 Review in Telugu: సల్మాన్ ఖాన్ యాక్షన్‌తో అదరగొట్టాడు.. కానీ!
    నటీనటులు: సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, రేవతి,&nbsp; ఇమ్రాన్ హష్మీ,&nbsp; సిమ్రాన్, రద్ధీ డోంగ్రా,&nbsp; అనీష్ కురువిల్లా,&nbsp; కుముద్ మిశ్రా, మాస్టర్ విశాల్ జేత్వా, రణ్వీర్ షోరే. డైరెక్టర్: ఆదిత్య చోప్రా ప్రొడ్యూసర్: ఆదిత్య చోప్రా మ్యూజిక్: తనూజ్ టికు ఎడిటర్: రామేశ్వర్ S. భగత్ స్క్రీన్ ప్లే: శ్రీధర్ రాఘవన్ సినిమాటోగ్రఫీ: అనయ్ గోస్వామి విడుదల తేదీ: 12/11/2023 (దీపావళి రోజున) సల్మాన్‌ ఖాన్(TIGER 3 Review in Telugu) లెటెస్ట్ స్పై యాక్షన్ డ్రామా 'టైగర్ 3' దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఏక్‌థా టైగర్, టైగర్ జిందాహై సినిమాకు ఇది సీక్వెల్. మొదట వచ్చిన ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ కావడంతో టైగర్ 3పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్, టీజర్‌లో సల్మాన్ మాస్ యాక్షన్, కత్రినా కైఫ్ బ్యూటీ సినిమాపై అంచనాలను పెంచాయి. మరి టైగర్ 3 ఇంతకు ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? లేదా అనే విషయాలను ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథ:&nbsp; అవినాష్ అలియాస్ టైగర్(సల్మాన్ ఖాన్) భారత దేశం తరఫున 'రా' ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. ఆయన భార్య జోయా(కత్రినా కైఫ్) పాకిస్థాన్‌కు చెందిన మాజీ ISI ఏజెంట్. అయితే టైగర్ పాకిస్థాన్‌లో రా ఏజెంట్ గోపీ( రణ్వీర్ షోరే)ని ఉగ్రవాదుల నుంచి కాపాడుతాడు. అయితే గోపీ చనిపోయే ముందు జోయా గురించి ఓ నమ్మలేని నిజాన్ని చెబుతాడు. తన భార్య ఐస్ఐ ఏజెంట్ అని తెలుసుకున్న టైగర్ ఏం చేశాడు? అసలు జోయా తన భర్తను ఎందుకు మోసం చేసింది. భారత్- పాకిస్థాన్ ప్రభుత్వాలు వీరిద్దరి కోసం ఎందుకు వెతుకుతాయి అనేది మిగిలిన కథ ఎలా ఉందంటే? టైగర్ 3 సినిమా.. ఏక్‌ థా టైగర్, టైగర్ జిందా హై రేంజ్‌లో మాత్రం లేదు.&nbsp; భారీ యాక్షన్ విజువల్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడక్కడ ఆకట్టుకుంటుంది. సినిమాలో శత్రుదేశాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు 'భార్య భర్తలు' అయితే అనే పాయింట్ బాగున్నప్పటికీ.. దానికి తగ్గట్టుగా కథనం లేకపోవడం మైనస్ అని చెప్పాలి. సినిమా ఫస్టాఫ్, ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు మైనస్. ఎందుకంటే ఈ పార్ట్‌లో కథనం బలహీనంగా ఉంది. అయితే సెకండాఫ్‌లో(TIGER 3 Review in Telugu) వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ , క్లైమాక్స్ సీన్లు కొద్దిమేరకు మెప్పిస్తాయి. సులువుగా ప్రేక్షకుడు గెస్ చేసే స్క్రీప్ట్‌ను శ్రీధర్ రాఘవన్ రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకాస్త దీనిపై వర్క్ చేస్తే బాగుండేది. స్పై సినిమాలు అంటే ఆద్యంతం ఉత్కంఠ, ప్రతి సీన్‌లో ట్విస్ట్‌ను ప్రేక్షకుడు ఊహిస్తాడు. కానీ టైగర్ 3 సినిమాలో అవేమి కనిపించలేదు. ప్రేక్షకున్ని సినిమాలో ఎంగేజ్ చేయకుండా కథ సాగిందని చెప్పవచ్చు. సినిమా చివర్లో సల్మాన్‌ ఖాన్‌ను రక్షించేందుకు షారుఖ్‌ ఖాన్ రావడం, క్లైమాక్స్ సీన్‌లో హృతిక్ ఎంట్రీ సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి. ఎవరెలా చేశారంటే సల్మాన్ ఖాన్ వన్ మ్యాన్ ఆర్మీ షో చేశాడు. టైగర్ పాత్రకు పూర్తి&nbsp; న్యాయం చేశాడు. తన పాత్రలో జీవించాడు. తన యాక్షన్ స్టైల్‌తో ఇరగదీశాడు. ఆయనపై వచ్చిన కొన్ని ఎలివేషన్‌ సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఎమోషనల్ సీన్లలోనూ సల్మాన్ అద్భుతంగా నటించాడు. ఇక సల్మాన్- కత్రినా జంట కూడా స్క్రీన్‌పై ఆకట్టుకుంది. కత్రినా కాస్త ఓల్డ్ లుక్‌లో కనిపించినప్పటికీ యాక్టింగ్ బాగా చేసింది. తన బోల్డ్ లుక్స్‌తో ప్రేక్షకులకు కనువిందు చేసింది. ముఖ్యంగా టవల్ ఫైట్ సీన్‌లో ఆమె అందం యువ ప్రేక్షకులను రంజింపజేస్తుంది. ఇక విలన్‌గా నటించిన ఇమ్రాన్ హష్మీ తన పాత్ర పరిధిమేరకు నటించాడు. రా చీఫ్‌గా రేవతి, పాక్ ప్రైమ్ మినిస్టర్‌గా సిమ్రాన్ మెప్పించింది. క్లైమాక్స్‌లో పఠాన్‌గా వచ్చిన షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ సీన్లు సినిమాకే హైలెట్. టెక్నికల్ పరంగా సాంకేతికంగా టైగర్ 3 సినిమా ఉన్నతంగా ఉంది. అనయ్ గోస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకే బాగా ప్లస్ అయింది. యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయన పడిన కష్టం తెలుస్తుంది. ఇక తనూజ్ టీకు బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ అలరిస్తుంది. యాక్షన్ సీన్లను(TIGER 3 Review) ఎలివేట్ చేసిందని చెప్పవచ్చు. డైరెక్టర్ ఆదిత్య చోప్రా ఇంకా బలమైన కథ రాసుకున్నప్పటికీ... అందుకు తగిన సీన్లు, కథనం పెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఉత్కంఠ భరితంగా సాగాల్సి కథనాన్ని ప్రేక్షకుడు ఊహించే విధంగా సాగింది. బలాలు సల్మాన్ ఖాన్ యాక్షన్ సీన్లు,&nbsp;కత్రినా కైఫ్ బోల్డ్ లుక్స్షారుఖ్‌ ఖాన్‌ కెమియో రోల్ బలహీనతలు స్క్రీన్ ప్లేసహజత్వం లేని కొన్ని సీన్లుప్రేక్షకుడు ఊహించదగిన కథనం చివరగా: హై వోల్టేజ్ యాక్షన్ స్పై మూవీగా వచ్చిన టైగర్ 3లో.. సల్మాన్ ఖాన్ యాక్షన్ సీన్లు, కత్రినా కైఫ్ బోల్డ్ లుక్స్, షారుఖ్‌ ఎంట్రీ ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఈ సినిమా సల్మాన్ ఖాన్‌ ఫ్యాన్స్‌తో పాటు ఇతర యాక్షన్ సీక్వెన్స్ ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మిగతా సగటు ప్రేక్షకులకు సినిమా నచ్చకపోవచ్చు. రేటింగ్: 2.5/5
    నవంబర్ 12 , 2023
    <strong>Pushpa 2 Review: అల్లు అర్జున్‌ మాస్‌ తాండవం.. ‘పుష్ప 2’ బ్లాక్ బాస్టర్‌ కొట్టినట్లేనా?</strong>
    Pushpa 2 Review: అల్లు అర్జున్‌ మాస్‌ తాండవం.. ‘పుష్ప 2’ బ్లాక్ బాస్టర్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు: అల్లు అర్జున్‌, రష్మిక, ఫహద్‌ ఫాజిల్‌, జగపతిబాబు, సునీల్‌, అనసూయ, రావు రమేశ్‌, ధనుంజయ, జగదీశ్‌ ప్రతాప్‌ భండారి, తారక్‌ పొన్నప్ప, అజయ్‌, శ్రీతేజ్ తదితరులు రచన, దర్శకత్వం: సుకుమార్‌ సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ: మిరాస్లోవ్‌ కూబా బ్రోజెక్‌ ఎడిటింగ్‌: నవీన్‌ నూలి నిర్మాత: నవీన్‌ యెర్నేని, రవి యలమంచిలి నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ విడుదల: 05-12-2024 అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప' (Pushpa) చిత్రం 2021లో విడుదలై ఎంత పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. దీంతో దానికి సీక్వెల్‌గా రూపొందిన 'పుష్ప 2' దేశవ్యాప్తంగా అందరి దృష్టి పడింది. ఈ మూవీలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసింది. మలయాళ స్టార్ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ (Fahad Fazil) ఇందులో విలన్‌గా చేశాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు, ప్రమోషన్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. చిత్ర బృందం కూడా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్‌ నిర్వహించి మరింత హైప్‌ పెంచేసింది. కాగా, ఈ చిత్రం డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా రిలీజైంది. తెలుగు, హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో థియేటర్లలోకి వచ్చింది. మరి ‘పుష్ప 2’ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? బ్లాక్‌ బాస్టర్ విజయాన్ని అందుకుందా? ఈ రివ్యూ (Pushpa 2 Review In Telugu)లో తెలుసుకుందాం.&nbsp; కథేంటి&nbsp; ఎర్రచందనం కూలీగా ప్రయాణం మెుదలుపెట్టిన పుష్పరాజ్‌ (అల్లు అర్జున్‌) స్మగ్లింగ్‌ సిండికేట్‌ను శాసించే నాయకుడిగా ఎదుగుతాడు. తన సిండికేట్‌ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరిస్తాడు. అధికార పార్టీకి ఫండ్‌ ఇచ్చి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఈ క్రమంలో ఎస్పీ భన్వర్‌సింగ్‌ షెకావత్‌ (ఫహాద్‌ ఫాజిల్‌)తో శత్రుత్వం కూడా పెరిగి పెద్దదవుతుంది. బయట ఎంత దూకుడుగా ఉన్నప్పటికీ పెళ్లాం శ్రీవల్లి (రష్మిక) మాట మాత్రం పుష్పరాజ్ జవదాటడు. ఓ రోజు ఎంపీ సిద్ధప్ప (రావు రామేష్‌)తో కలిసి సీఎంను కలవడానికి పుష్పరాజ్‌ బయలుదేరగా సీఎంతో 'ఓ ఫొటో తీసుకొని రా' అంటూ శ్రీవల్లి ఆశగా అడుగుతుంది. దీంతో సీఎంను ఫొటో అడిగ్గా అతడు పుష్పను హేళన చేస్తాడు. దీంతో ఎంపీ సిద్ధప్పను సీఎంని చేస్తానని సవాలు విసురుతాడు. అందుకోసం పుష్ప ఏం చేశాడు? కేంద్రమంత్రి వీర ప్రతాప్‌ రెడ్డి (జగపతిబాబు)తో వైరం ఏంటి? పుష్పను అడ్డుకునేందుకు ఎస్పీ షెకావత్‌ ఎలాంటి ప్లాన్స్‌ వేశాడు? శ్రీవల్లికి ఇచ్చిన మాటను పుష్ప నిలబెట్టుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే బన్నీ (Allu Arjun) మరోసారి పుష్ప రాజ్‌ క్యారెక్టర్‌లో అదరగొట్టాడు. భాష, బాడీ లాంగ్వేజ్‌ విషయంలో మరింత ప్రభావం చూపాడు. ఫైట్స్‌, డ్యాన్స్‌లలో మెస్మరైజ్‌ చేశాడు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్‌, క్లైమాక్స్‌లో బన్నీ యాక్టింగ్‌ మరో లెవల్లో ఉంటుంది. శ్రీవల్లి పాత్రలో రష్మిక గుర్తుండిపోయే నటనతో ఆకట్టుకుంది. అల్లు అర్జున్‌తో ఆమె కెమిస్ట్రీ బాగా పడింది. తొలి భాగంతో పోలిస్తే సెకండ్‌ పార్ట్‌లో గ్లామర్‌ డోస్‌ బాగా పెంచింది. చాలా చోట్ల ఆమె నటన పీక్స్‌లో ఉంటుంది. ఇక ‘కిస్సిక్’ పాటతో హీరోయిన్‌ శ్రీలీల (Sreeleela) మాయచేసింది. ఎప్పటిలాగే తన డ్యాన్స్‌తో దుమ్మురేపింది. షెకావత్ పాత్రలో ఫహద్ ఫాజిల్ చక్కగా చేశాడు. కానీ ఆ పాత్రలో సీరియస్‌నెస్‌ తగ్గుతూ రావడంతో చాలా చోట్ల తేలిపోయింది. ఎంపీ పాత్రలో రావు రమేష్‌ ఆకట్టుకున్నారు. మెుదటి పార్ట్‌తో పోలిస్తే సునీల్‌, అనసూయ పాత్రలకి పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. కేంద్ర మంత్రిగా జగపతిబాబు, కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కథలో ప్రభావం చూపించారు. అల్లుఅర్జున్‌కి ఫ్రెండ్‌గా చేసిన జగదీష్ కీలక పాత్రలో కనిపిస్తాడు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే ఫస్ట్‌ పార్ట్‌తో పోలిస్తే డైరెక్టర్‌ సుకుమార్‌ పుష్ప రాజ్‌ (Pushpa 2 Review) పరిధిని మరింత పెంచేశారు. కథలో తన మార్క్ సైకలాజికల్‌, మైండ్‌ గేమ్‌ను జోడించాడు. అడుగడుగునా హీరో ఎలివేషన్లతో ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించాడు. అల్లు అర్జున్‌ ఇంట్రో, పుష్ప - షెకావత్‌ టామ్‌ అండ్‌ జెర్రీ ఫైట్‌, ఎత్తుకు పై ఎత్తులు చక్కగా చూపించాడు. కథ నెమ్మదిగా సాగినట్లు అనిపించినా ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తో మరో లెవల్‌కు తీసుకెళ్లాడు డైరెక్టర్‌. ఓ వైపు పుష్ప వ్యాపార, రాజకీయ సామ్రాజ్యాలను చూపిస్తూనే శ్రీవల్లితో అతడికి ఉన్న ఎఫెక్షన్స్‌ కళ్లకు కట్టాడు. పుష్ప, శ్రీవల్లి మధ్య ప్రేమ, కెమెస్ట్రీ తెరపై క్యూట్‌గా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో గంగమ్మ జాతర ఎపిసోడ్‌ సినిమాకే హైలెట్‌. జాతర ఎపిసోడ్‌లో హీరోయిజం, కుటుంబ భావోద్వేగాలు సుకుమార్‌ బాగా చూపించారు. క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్స్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌ అలరిస్తాయి. అయితే బలమైన విలనిజం లేకపోవడం, నిడివి బాగా పెద్దగా ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు. పతాక సన్నివేశాల్లో ట్విస్ట్‌, టర్న్‌తో ‘పుష్ప3’ సినిమాకు రూట్‌ వేశారు సుకుమార్‌.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతికంగా సినిమా (Pushpa 2 Review) అద్భుతంగా ఉంది. ప్రతి విభాగం మంచి పనితీరుని ప్రదర్శించింది. దేవిశ్రీప్రసాద్ పాటలు, నేపథ్య సంగీతంతో కట్టిపడేశాడు. మరో సంగీత దర్శకుడు సామ్ సీఎస్ కూడా నేపథ్య సంగీతంలో ఆకట్టుకున్నాడు. కూబా కెమెరా వర్క్‌ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. ప్రతి ఎపిసోడ్‌ను కెమెరా పనితనంతో గ్రాండ్‌గా చూపించాడు. శ్రీకాంత్ విస్సా మాటలు ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. మైత్రీ మూవీ మేకర్స్&nbsp; నిర్మాణం ఉన్నతంగా ఉంది. ప్రతి సన్నివేశంలోనూ రిచ్‌నెస్ కనిపిస్తుంది. ప్లస్‌ పాయింట్స్‌ అల్లు అర్జున్‌ నటనయాక్షన్‌ సీక్వెన్స్‌జాతర ఎపిసోడ్‌సంగీతం మైనస్‌ పాయింట్స్‌ తేలిపోయిన విలనిజంసెకండాఫ్‌ Telugu.yousay.tv Rating : 3.5/5 
    డిసెంబర్ 05 , 2024
    <strong>Hari Hara Veera Mallu: పవన్‌ సినిమా నుంచి మైండ్‌ బ్లోయింగ్‌ అప్‌డేట్‌.. ఫ్యాన్స్‌కు పూనకాలే!&nbsp;</strong>
    Hari Hara Veera Mallu: పవన్‌ సినిమా నుంచి మైండ్‌ బ్లోయింగ్‌ అప్‌డేట్‌.. ఫ్యాన్స్‌కు పూనకాలే!&nbsp;
    పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) చిత్రాలకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్లలో పండగ వాతావరణం ఏర్పడుతుంది. ప్రస్తుతం పవన్‌ చేతిలో 'ఓజీ' (OG), ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu), ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh) చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్‌ పరంగా ‘హరి హర వీరమల్లు’ చాలా అడ్వాన్స్‌గా ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా షూట్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి సాలిడ్‌ అప్‌డేట్‌ ఒకటి బయటకొచ్చింది. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. అందుకు కారణమెంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఫైనల్‌ షెడ్యూల్‌ షురూ పవన్‌ హీరోగా చేస్తోన్న ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను క్రిష్‌, జ్యోతి కృష్ణ డైరెక్ట్‌ చేస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుండగా తొలి పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఈ మూవీ ఆఖరి షెడ్యూల్‌ ఈ వీకెండ్‌లో విజయవాడలో వేసిన సెట్‌లో మెుదలుకానుంది. సినిమాకు అత్యంత కీలకమైన సీన్స్‌లో చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కూడా జాయిన్‌ అవుతారని టాక్‌. మెుత్తం 200 మంది ఆర్టిస్టులతో కలిసి పవన్‌ నటించబోతున్నట్లు తెలుస్తోంది. యానిమల్ ఫేమ్‌ బాబి డియోల్‌తో పాటు బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారని తెలుస్తోంది.దీంతో పవన్‌ ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌తోనే షూటింగ్ పూర్తి కానుండటంతో ఈ సినిమా రిలీజ్‌పై ఎలాంటి సందేహాం పెట్టుకోవాల్సిన పనిలేదని ఆనందిస్తున్నారు. 500 మందితో ఫైట్‌ సీన్స్‌ హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) చిత్రాన్ని 2025 మార్చి 28న పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దానికి అనుగుణంగా సినిమాను ఫినిష్‌ చేసేందుకు గత కొంతకాలంగా చురుగ్గా షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవలే హాలీవుడ్‌ యాక్షన్‌ దర్శకుడు నిక్‌ పావెల్‌ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాలను సైతం మూవీ టీమ్‌ చిత్రీకరించింది. పవన్‌తో పాటు దాదాపు 400 నుంచి 500 మంది ఈ యుద్ధ సన్నివేశంలో పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఫైట్‌ సినిమాకే హైలెట్‌ ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ సీన్‌లో పవన్‌ యాక్షన్‌ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తుందని అంటున్నారు. కాగా, హరిహర వీరమల్లు చిత్రానికి ఆస్కార్‌ విన్నర్‌ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా చేస్తోంది.&nbsp; బ్యాంకాక్‌ వెళ్లనున్న పవన్‌! హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu)తో పాటే ‘ఓజీ’ (OG) షూటింగ్‌ కూడా ప్యార్లర్‌గా జరుగుతోంది. యంగ్‌ డైరెక్టర్‌ సుజీత్‌ పవన్‌ లేని సన్నివేశాలను ఎంతో ఫాస్ట్‌గా చిత్రీకరిస్తున్నారు. మరోవైపు పవన్‌ సైతం ఈ రెండు చిత్రాలను డిసెంబర్‌ ఫస్ట్ వీక్‌ కల్లా ఫినిష్‌ చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ వీకెండ్‌ హరి హర వీరమల్లును షూట్‌ను పవన్‌ పూర్తి చేయనున్నారు. అనంతరం ‘ఓజీ’ టీమ్‌లో పవన్‌ జాయిన్‌ కానున్నారు. బ్యాంకాంక్‌లో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను దర్శకుడు సుజీత్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ షెడ్యూల్‌తో పవన్‌ షూటింగ్ పూర్తవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దీంతో పవన్‌ వచ్చేవారంలో బ్యాంకాంక్‌ వెళ్లి ఓజీ షూట్‌లో జాయిన్ అవుతారని తెలుస్తోంది.&nbsp; పవన్‌తో విజయ్‌ దేవరకొండ బిగ్‌ ఫైట్‌ 2025 సమ్మర్‌ బరిలో పవన్‌ను విజయ్‌ దేవరకొండ ఢీకొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) రిలీజ్‌ కానున్న అదే డేట్‌కు విజయ్‌ నటిస్తున్న 'VD 12' కూడా విడుదల కాబోతోంది. ఆ తేదీని ‘హరి హర వీరమల్లు’ కంటే ముందే&nbsp; 'VD 12' టీమ్‌ లాక్‌ చేసింది. దీంతో పవన్‌తో విజయ్‌ దేవరకొండకు బిగ్‌ ఫైట్‌ తప్పదని చెప్పవచ్చు. అయితే పవన్‌కు అత్యంత సన్నిహితులైన సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాతలు 'VD 12'ను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు పోటీగా వారు తమ చిత్రాన్ని బరిలోకి దింపే అవకాశం లేకపోవచ్చని సమాచారం. మరో కొత్త డేట్‌ను చూసుకొని VD12ను రిలీజ్‌ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.&nbsp;
    నవంబర్ 28 , 2024
    <strong>SSMB29: మహేష్‌ లుక్‌ వేరే ఉందట! జక్కన్న భలే బురిడి కొట్టించాడుగా!&nbsp;&nbsp;</strong>
    SSMB29: మహేష్‌ లుక్‌ వేరే ఉందట! జక్కన్న భలే బురిడి కొట్టించాడుగా!&nbsp;&nbsp;
    రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే అంచనాలు ఏ స్థాయికి వెళ్లిపోతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది కూడా సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu)తో జక్కన్న సినిమా తీయనుండటంతో యావత్‌ దేశం దృష్టి దానిపై నెలకొంది. దీంతో ఈ క్రేజీ కాంబో సెట్స్‌ పైకి వెళ్లే రోజు కోసం అంతా ఎదుచూస్తున్నారు. ఇక సినిమా కోసం మహేష్‌ అదిరిపోయేలా మేకోవర్‌ అవుతున్నాడు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని మహేష్‌ దంపతులు కలవగా అతడి లుక్స్‌ వైరల్‌ అయ్యాయి. లాంగ్‌ హెయిర్‌, బియర్డ్‌ లుక్‌తో మహేష్‌ పిక్స్‌ నెట్టింట చక్కర్లు కొట్టాయి. దీంతో SSMB29లో మహేష్‌ లుక్ ఇదేనంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడే బిగ్ ట్విస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; మహేష్‌ లుక్‌ అసలైంది కాదా? సూపర్ స్టార్‌ మహేష్‌ లేటెస్ట్ లుక్‌ చూసి ఫ్యాన్స్‌ పిచ్చెక్కిపోతున్నారు. హాలీవుడ్‌ హీరోలా ఉన్నాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 'SSMB29' కోసం బాబు లుక్‌ సిద్ధమైనట్లేనని కామెంట్స్‌ కూడా చేశారు. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం మహేష్‌ ఇదే లుక్‌లో సినిమాలో కనిపించడని తెలుస్తోంది. మరింత గడ్డం, జుట్టు పెంచాక విదేశాల నుంచి హెయిర్‌ స్టైలిస్ట్‌ను రాజమౌళి పిలిపించనున్నారట. ఆ తర్వాత తను అనుకుంటున్న నాలుగైదు లుక్స్‌లోకి మహేష్‌ను మారుస్తారట. అందులో ఏది బెస్ట్‌ అని జక్కన్నకు అనిపిస్తుందో అదే చివరికీ ఫైనల్ అవుతుందని సమాచారం. దీంతో ప్రస్తుత లుక్కే ఫైనల్‌ అని భ్రమపడిన మహేష్‌ ఫ్యాన్స్‌ అంతా నాలుక కరుచుకుంటున్నారు. జక్కన్న తమని భలే బురిడికొట్టించాడని అభిప్రాయపడుతున్నారు.&nbsp; అందుకే మహేష్‌కు స్వేచ్ఛ! తన సినిమాల్లోని హీరోల లుక్‌పై రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. సినిమాల్లోని లుక్‌ బయటకు లీక్‌ కాకుండా జాగ్రత్తపడుతుంటారు. ఈ మేరకు సదరు హీరోలకు సైతం ముందుగానే రాజమౌళి కండీషన్లు విధిస్తుంటారు. షూటింగ్‌ జరుగుతున్న కాలం లుక్‌ రివీల్‌ కాకుండా చూస్కోవాలని షరతు పెడుతుంటారు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాల సమయంలో ప్రభాస్‌, రామ్‌చరణ్‌, తారక్‌ ఇదే సూత్రాన్ని పాటించారు. అయితే ఇందుకు భిన్నంగా మహేష్‌ మాత్రం స్వేచ్ఛగా ఎక్కడంటే అక్కడ కెమెరాలకు ఫోజులు ఇచ్చేస్తున్నాడు. తన మేకోవర్‌ను ఏదోక రూపంలో పబ్లిక్‌కు రివీల్‌ చేస్తూనే వస్తున్నారు. అయితే మహేష్‌ ఇలా స్వేచ్ఛగా తిరగడానికి కారణం ఆ లుక్‌ అసలైనది కాకపోవడమే అని చెప్పవచ్చు. అసలైన లుక్ ఫైనల్ అయ్యాక మహేష్‌ బయటకి ఎక్స్‌పోజ్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకునే ఛాన్స్ ఉంది.&nbsp; రాజమౌళి మాస్టర్ ప్లాన్! మహేష్‌ బాబు హీరోగా రూపొందనున్న ‘SSMB29’ చిత్రం కోసం దర్శకధీరుడు రాజమౌళి సరికొత్త వ్యూహాంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. సాధారణంగా జక్కన్న మూవీస్‌లో వీఎఫ్ఎక్స్‌కు ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి షూటింగ్‌తో సమానంగా గ్రాఫిక్స్‌ వర్క్‌ కోసం రాజమౌళి సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు దర్శకధీరుడు మాస్టర్ ప్లాన్ వేశాడట. ముందుగానే వీఎఫ్ఎక్స్‌కు సంబంధించి షాట్స్‌ను షూట్ చేయాలని భావిస్తున్నారట. అందుకు తగ్గట్లే ప్రీ ప్రొడక్షన్‌ పనులు చేస్తున్నట్లు సమాచారం. ‘SSMB29’లో గ్రాఫిక్స్‌ వర్క్‌ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందుగానే ఆ సీన్స్‌ షూట్‌ చేసి సదరు వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీలకు అప్పగిస్తారట. ఆ తర్వాత మిగిలిన షూటింగ్‌పై రాజమౌళి ఫోకస్‌ పెడతారట. దీనివల్ల ఏక కాలంలో వీఎఫ్‌ఎక్స్‌ పనులు, షూటింగ్‌ పూర్తవుతాయని జక్కన్న భావిస్తున్నట. దీని వల్ల సినిమాను త్వరగా కంప్లీట్‌ చేయవచ్చని మాస్టర్‌ ప్లాన్‌ వేశారట. దీంతో ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు.&nbsp; ఆ విమర్శలకు చెక్‌ దేశం గర్వించతగ్గ దర్శకుల్లో ఎస్‌.ఎస్‌. రాజమౌళి అగ్రస్థానంలో ఉంటారు. అయితే ఆయన్ను గత కొంతకాలంగా ఓ విమర్శ వెంటాడుతోంది. రాజమౌళి నుంచి సినిమా రావాలంటే కనీసం మూడు, నాలుగేళ్లు సమయం పడుతుందని అందరూ అంటుంటారు. ఈ నేపథ్యంలోనే జక్కన్న ఇండస్ట్రీలోకి వచ్చి 23 ఏళ్లు అవుతున్న ఆయన నుంచి వచ్చిన చిత్రాలు కేవలం 12 మాత్రమే. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఒక వ్యూహాత్మక అడుగు అని సినీ వర్గాలు అంటున్నాయి. దీని వల్ల ఒకట్రెండు సంవత్సరాల్లో సినిమా రిలీజ్‌ చేసే వీలు పడుతుందని అంటున్నారు. 'SSMB 29' చిత్రాన్ని వచ్చే ఏడాది పట్టాలెక్కించినా 2026 చివరి కల్లా రిలీజ్‌ చేసే వీలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
    సెప్టెంబర్ 26 , 2024
    <strong>Surya In Dhoom 4: షారుక్‌కి విలన్‌గా సూర్య.. బాక్సాఫీస్‌ వద్ద ఊచకోత ఖాయమేనా!</strong>
    Surya In Dhoom 4: షారుక్‌కి విలన్‌గా సూర్య.. బాక్సాఫీస్‌ వద్ద ఊచకోత ఖాయమేనా!
    బాలీవుడ్‌లో వచ్చిన యాక్షన్‌ చిత్రాల సిరీస్‌లో 'ధూమ్‌' (Dhoom)కి ప్రత్యేక స్థానం ఉంది. 2004లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇప్పటికే పలు సీక్వెల్స్‌ వచ్చాయి. బాక్సాఫీస్‌ వద్ద అవన్నీ సూపర్‌ హిట్స్‌ అందుకున్నాయి. ఈ క్రమంలోనే త్వరలో ‘ధూమ్‌ 4’ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాణసంస్థ యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ (Yash Raj Films) ఈమేరకు సన్నాహాలు కూడా మెుదలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సూర్య ఈ చిత్రంలో నటించనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.&nbsp; సూర్య పాత్ర అదే? హిందీలో వచ్చిన ధూమ్‌, ధూమ్‌ 2, ధూమ్‌ 3 చిత్రాలు ఎంతటి విజయాన్ని సాధించాయో అందరికీ తెలిసిందే. త్వరలోనే 'ధూమ్‌ 4' పట్టాలెక్కించేందుకు నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్‌ ఫిల్మ్‌ సన్నాహాలు చేస్తోంది.&nbsp; ‘ధూమ్‌, పార్ట్‌ 2, 3’లకు కథను అందించిన ఆదిత్య చోప్రానే (Aditya chopra) ఈ సినిమాకీ వర్క్‌ చేస్తున్నారని సమాచారం. ఇందులో షారుక్‌ ఖాన్‌ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో కోలీవుడ్‌ నటుడు సూర్యను అతడికి ప్రతినాయకుడిగా తీసుకోవాలని చిత్ర వర్గాలు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై చిత్రబృందం ఇప్పటికే సూర్యను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోల్‌లో యాక్ట్‌ చేేసేందుకు ఆయన ఆసక్తి చూపారని టాక్‌. దీంతో అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని సూర్య ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.&nbsp; రోలెక్స్‌గా మార్క్‌! కమల్‌ హాసన్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన 'విక్రమ్ట చిత్రం దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. డ్రగ్స్‌ నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో తమిళనటుడు విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించాడు. మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ ముఖ్య పాత్ర పోషించాడు. అయితే క్లైమాక్స్‌లో డ్రగ్‌ డీలర్లకు హెట్‌గా సూర్య కనిపించిన సర్‌ప్రైజ్‌ చేశారు. రోలెక్స్‌ పాత్రలో అతడి లుక్‌ ఎంతో క్రూరంగా కనిపించింది. 'విక్రమ్ 2' చిత్రంలో సూర్య విలన్‌ పాత్రలో కనిపించనున్నట్లు ఈ క్లైమాక్స్‌ ద్వారా డైరెక్టర్‌ స్పష్టం చేశారు. అంతకుముందు ‘24’ చిత్రంలోనూ సూర్య విలన్‌గా చేశాడు. ఇందులో రెండు పాత్రలు పోషించగా అందులో ఒకటి నెగిటివ్‌ రోల్. చరణ్‌కు విలన్‌గా సూర్య! గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌ (Ram Charan), తమిళ స్టార్‌ హీరో సూర్య (Suriya) కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్‌ రాబోతున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. లవ్ స్టోరీస్ తీయడంలో స్పెషలిస్ట్‌‌గా గుర్తింపు పొందిన హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ మల్టీ స్టారర్‌ను తెరకెక్కించనున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కథను సూర్యకు వినిపించగా అది అతడికి బాగా నచ్చిందని సమాచారం. అయితే రామ్‌చరణ్‌కు స్టోరీ వినిపించాల్సి ఉందని తెలుస్తోంది. రామ్‌చరణ్‌ కూడా ఓకే చెప్తే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌తో హను రాఘవపూడి కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ సినిమా తర్వాతే రామ్‌-సూర్య సినిమాలు పట్టాలెక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు.&nbsp; 12 వేల థియేటర్లలో ‘కంగువా’! సూర్య ప్రస్తుతం 'కంగువా' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ సూర్య కెరీర్‌లో 42వ ప్రాజెక్ట్‌గా రానుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి కంగువ గ్లింప్స్‌తో పాటు పోస్ట‌ర్‌లు విడుద‌ల చేయ‌గా.. ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. ఈ సినిమాను ద‌స‌రా కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు చిత్ర‌బృందం ప్రకటించింది. అయితే దసరాకు కాకుండా నవంబర్‌ 15న కంగువాను రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట. ప్రపంచ వ్యాప్తంగా 10భాషల్లో 12 వేల థియేటర్లలో దీన్ని రిలీజ్‌ చేయాలని నిర్ణయించారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట.
    సెప్టెంబర్ 16 , 2024
    <strong>Telugu OTT Movies: ‘భారతీయుడు 2’ వచ్చేస్తున్నాడు.. ఈ వారం రిలీజయ్యే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!</strong>
    Telugu OTT Movies: ‘భారతీయుడు 2’ వచ్చేస్తున్నాడు.. ఈ వారం రిలీజయ్యే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    గత రెండు వారాల్లో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) మినహా ఏ కొత్త సినిమా థియేటర్లలోకి రాలేదు. ప్రభాస్‌ చిత్రానికి పోటీగా తమ మూవీని రిలీజ్‌ చేసేందుకు దర్శక నిర్మాతలు సాహసించకపోవడమే ఇందుకు కారణం. అయితే తొలి వారంలోనే కల్కి సినిమాను వీక్షించిన వారు కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మరో భారీ చిత్రం ప్రేక్షకుల మందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అటు థియేటర్‌తో పాటు ఓటీటీలో అలరించనున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు భారతీయుడు 2 కమల్‌ హాసన్‌ (Kamal Haasan), డైరెక్టర్‌ శంకర్‌ (Shankar) కాంబోలో పాతికేళ్ల క్రితం వచ్చిన 'భారతీయుడు' (Bharateeyudu) చిత్రం సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అవినీతి, లంచగొండతనంపై భారతీయుడు చేసిన పోరాటం అప్పటి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ రూపొందింది. 'భారతీయుడు 2' (Bharateeyudu 2 Release Date) టైటిల్‌తో జులై 12న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాలో కమల్‌తో పాటు సిద్ధార్థ్‌ (Siddharth), రకుల్‌ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh), ఎస్‌.జె.సూర్య (S.J Surya), బాబీ సింహా (Bobby Simha), బ్రహ్మానందం (Brahmanandam), సముద్రఖని (Samuthirakani) తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. సారంగదరియా రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘సారంగదరియా’ (Sarangadariya). పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. ఉమాదేవి, శరత్‌చంద్ర నిర్మాతలు. మధ్య తరగతి కుటుంబంలో జరిగే సంఘర్షణల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. జులై 12న ఈ చిత్రం థియేటర్‌లో విడుదల కానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు మహారాజా తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన రీసెంచ్‌ చిత్రం మహారాజా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను లాక్‌ చేసింది. జులై 12 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చని పేర్కొంది. విజయ్‌ సేతుపతి కెరీర్‌లో 50వ చిత్రంగా వచ్చిన మహారాజా.. థియేటర్లలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. రూ.100 వసూళ్లను సాధించి ఆశ్చర్యపరిచింది. థియేటర్‌లో ఈ మూవీని చూడలేకపోయినవారు ఓటీటీలో వీక్షించేందుకు ఎదురుచూస్తున్నారు.&nbsp; ధూమం మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ (Fahad Faasil) నటించిన చిత్రం ‘ధూమం’. అపర్ణ బాలమురళి కథానాయిక. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్‌ నిర్మించిన ఈ చిత్రం గతేడాది విడుదలై పర్వాలేదనిపించింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తెలుగు ఓటీటీ ఆహాలో జులై 11వ (Dhoomam Telugu OTT) తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా ఓ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది.&nbsp; మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateReceiverSeriesEnglishNetflixJuly 10Wild Wild PunjabMovieHindiNetflixJuly 10Vikings : Wall HallaSeriesEnglishNetflixJuly 11Commander Karan SaxenaSeriesHindiHotstarJuly 8MastermindSeriesEnglishHotstarJuly 10Agni SakshiSerial SeriesTeluguHotstarJuly 12Show TimeSeriesEnglishHotstarJuly 1236 DaysSeriesTelugu/HindiSonyLIVJuly 12Pil&nbsp;MovieHindiJio CinemaJuly 12 గత 15 రోజుల్లో విడుదలైన చిత్రాలు &amp; వెబ్‌ సిరీస్‌లు.. గత 15 రోజుల్లో చాలా చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. అయితే కొన్ని మాత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతున్నాయి. అత్యధిక వీక్షణలు సాధిస్తూ ఆయా ఓటీటీ వేదికల్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఆ చిత్రాలు, సిరీస్‌లపై ఓ లుక్కేయండి.&nbsp; TitleCategoryLanguagePlatformMirzapur 3SeriesTelugu/ HindiAmazon PrimeMalayali From IndiaMovieTelugu/ MalayalamSonyLIVFuriosa: A Mad Max SagaMovieEnglish/ TeluguAmazon PrimeSasi MadanamSeriesTeluguETV WinMarket MahalakshmiMovieTeluguAhaBhaje Vayu VegamMovieTeluguNetflixSathyabamaMovieTeluguAmazon PrimeLove MouliMovieTeluguAhaVindu BhojanamMovieTeluguAhaGuruvayoor AmbalanadayilMovieTelugu/ MalayalamAhaAham RebootMovieTeluguAha
    జూలై 08 , 2024
    Pushpa 2: ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ‘పుష్ప 2’ పరిస్థితి? కలెక్షన్స్ భారీగా పడిపోవడం ఖాయం!
    Pushpa 2: ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ‘పుష్ప 2’ పరిస్థితి? కలెక్షన్స్ భారీగా పడిపోవడం ఖాయం!
    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule). నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాపై జాతీయ స్థాయిలో బజ్‌ ఉంది. ఇప్పటికే విడుదలైన పుష్ప గ్లింప్స్‌, ప్రమోషన్‌ పోస్టర్లు, ఫస్ట్‌ సింగిల్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించడంతో ఆ రోజు కోసం.. సినీ ప్రేక్షకులు, బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా వాయిదా పడనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ చెప్పిన తేదీకే సినిమా రిలీజ్‌ చేస్తే కలెక్షన్స్‌లో భారీగా కోత పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు గల కారణాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; పుష్ప 2 వాయిదా..! ప్రస్తుతం ‘పుష్ప 2’ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా మారింది. ఈ సినిమాను ఆగస్టు 15న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ కొద్ది నెలల క్రితం ప్రకటించారు. అందుకు తగ్గట్లే శరవేగంగా షూటింగ్‌ సైతం నిర్వహిస్తున్నారు. జూన్‌ ఎండింగ్‌ నాటికి షూటింగ్‌ ముగించాలని దర్శకుడు సుకుమార్‌ టార్గెట్‌ పెట్టుకోగా.. అది పూర్తయ్యే పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదని టాక్‌ వినిపిస్తోంది. సినిమా షూట్ పూర్తి కావడానికి ఇంకో నెల రోజుల సమయం పడుతుందని సమాచారం. అంటే జులై ఎండింగ్‌కి పుష్ప 2 షూట్‌ కంప్లీట్‌ కానుందట. కాబట్టి మిగిలిన 15 రోజుల్లో ప్రీ రిలీజ్‌ వర్క్‌ చేయడం అసాధ్యం కాబట్టి.. 'పుష్ప 2' పోస్ట్‌ పోన్‌ చేస్తే బెటర్‌ అని చిత్ర యూనిట్‌ భావిస్తోందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. ఇది తెలిసిన ఫ్యాన్స్‌ తీవ్రంగా డిసప్పాయింట్‌ అవుతున్నారు.&nbsp; సుకుమార్‌ అసంతృప్తి పుష్ప 2 చిత్రానికి ఎడిటర్‌గా కార్తిక్‌ శ్రీనివాస్‌ పనిచేశారు. కొద్ది నెలల పాటు యూనిట్‌తో కలిసి ట్రావెల్‌ చేసిన అతడు పలు కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన స్థానంలో నవీన్‌ నూలి వచ్చి ఫైనల్ కట్స్‌ చేశారు. అయితే ఆ ఫైనల్‌ ఔట్‌పుట్‌పై సుకుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పైగా కొన్ని ఎపిసోడ్స్‌ను సుకుమార్‌ రీడిజైన్‌ చేసినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆగస్టు 15 నాటికి సినిమాను రెడీ చేయడం కష్టమని మూవీ యూనిట్‌ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది.&nbsp; కలెక్షన్స్‌లో భారీ కోత! పాన్‌ ఇండియా స్థాయి సినిమా అంటే విడుదల తేదీ పక్కాగా ఉండాలి. అలా లేకుంటే దాని ప్రభావం కలెక్షన్స్‌పై కూడా పడుతుంది. ‘పుష్ప 2’ను ఆగస్టు 15నే రిలీజ్‌ చేస్తే.. కలెక్షన్ల పరంగా బన్నీకి భారీ షాక్‌ తగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే రోజున తమ చిత్రాలు రిలీజ్‌ చేసేందుకు ముగ్గురు బడా హీరోలు సిద్ధమవుతున్నారు. తమిళ స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్‌ (Chiyaan Vikram) నటిస్తున్న 'తంగలాన్' (Thagalaan) చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారట. మరోవైపు బాలీవుడ్‌ స్టార్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgan) కూడా తన ‘సింగం ఎగైన్‌’ (Singham Again) చిత్రాన్ని ఆ రోజునే తీసుకురావాలని చూస్తున్నారట. అలాగే స్టార్‌ నటుడు జాన్‌ అబ్రహం (John Abraham) నటించిన 'వేద' (Veeda) ఆగస్టు 15న తీసుకొస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఆ మూడు భారీ చిత్రాలు బరిలో ఉండగా వాటిని తట్టుకొని ‘పుష్ప 2’ పాన్‌ ఇండియా స్థాయిలో భారీ కలెక్షన్స్‌ రాబట్టగలదా? అన్న సందేహం సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అజయ్‌ దేవగన్‌, జాన్‌ అబ్రహం చిత్రాల రిలీజ్‌ ఉన్న నేపథ్యంలో నార్త్‌లో ‘పుష్ప 2’ కలెక్షన్లపై భారీగా ప్రభావం పడొచ్చని అంటున్నారు.&nbsp; పవన్‌ అభిమానుల్లో ఆగ్రహం ప్రస్తుతం అల్లు అర్జున్‌పై పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఫ్యాన్స్‌ గుర్రుగా ఉన్నారు. ఏపీ ఎన్నికల సందర్భంగా వైకాపా అభ్యర్థి తరపున బన్నీ ప్రచారం చేయడాన్ని మెగా ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ మూవీని బాయ్‌కాట్‌ చేస్తామని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు బుధవారం (జూన్‌ 12) జరిగిన పవన్‌ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సైతం బన్నీ హాజరు కాకపోవడంతో ఫ్యాన్స్‌ మరింత ఆగ్రహంతో ఉన్నారు. ఇన్ని కష్టాల మధ్య ఇప్పట్లో ఈ మూవీని రిలీజ్‌ చేయకపోవడమే మంచిదని చిత్రయూనిట్‌ భావిస్తున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.&nbsp;
    జూన్ 13 , 2024
    OTT Suggestion: జీవితాన్ని ఎలా హాయిగా గడపాలో చెప్పే బ్యూటీఫుల్‌ చిత్రం.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?&nbsp;
    OTT Suggestion: జీవితాన్ని ఎలా హాయిగా గడపాలో చెప్పే బ్యూటీఫుల్‌ చిత్రం.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?&nbsp;
    ఒకప్పుడు థియేటర్లలో సినిమా అంటే తమకు నచ్చిన జానర్‌ను మాత్రమే ప్రేక్షకులు చూసేవారు. క్రైమ్‌, యాక్షన్‌, సైంటిఫిక్‌, అడ్వెంచర్‌, హర్రర్‌ తదితర కంటెంట్‌తో వచ్చిన మూవీస్‌ను కేవలం జానర్‌ ఇష్టపడే ఆడియన్స్‌ వీక్షించేవారు. ఓటీటీ రాకతో ఇందులో మార్పు వచ్చింది. కంటెంట్‌ బాగుంటే ఏ జానర్‌ చిత్రాన్నైనా చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలకు ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. అలాంటి ఓ సినిమాను YouSay మీకు పరిచయం చేస్తోంది. ఈ సినిమాను ఇప్పటివరకూ చూడకపోయుంటే మీరు మంచి కంటెంట్‌ను మిస్‌ అయినట్లే. ఇంతకీ ఆ చిత్రం ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? తదితర విశేషాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; సినిమా ఏదంటే? బాలీవుడ్‌లో వచ్చిన 'మస్త్‌ మెయిన్‌ రెహ్‌నే కా’ (Mast Mein Rehne Ka) మూవీ.. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వీక్షకులను ఆకట్టుకుంది. విజయ్ మౌర్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. గతేడాది డిసెంబర్‌లో అమెజాన్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. అప్పటి నుంచి మంచి వ్యూస్‌తో ఈ సినిమా ముందుకు వెళ్తోంది. ఈ సినిమాలో జాకీ ష్రాఫ్‌, అభిషేక్‌ చౌహాన్‌, నీనా గుప్తా, మౌనికా పన్వార్‌, ఫైజల్‌ మాలిక్‌ ముఖ్య పాత్రల్లో చేశారు. IMDBలో ఈ సినిమా.. 7.1 రేటింగ్‌ కలిగి ఉంది. ఎందుకు చూడాలంటే? ప్రస్తుతం ప్రతీ ఒక్కరి జీవితం ఉరుకులు పరుగుల మీద సాగిపోతోంది. చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ కష్టపడుతూనే ఉన్నారు. జీవితం అంటే ఇంతేనా? ఇంకేం లేదా? అని నిత్యం ఆలోచించే వారికి ఈ సినిమా చక్కటి సమాధానంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో తెలియజేస్తుంది. చిన్న విషయాలకే బాధపడిపోయి.. ఎలా హ్యాండిల్‌ చేయాలో తెలియక తికమక పడేవారికి పరిష్కారాన్ని చూపుతుంది.&nbsp;&nbsp; కథేంటి ముంబయికి చెందిన వీ.ఎస్‌ కామత్‌ (జాకీ ష్రాఫ్‌).. రిటైర్మెంట్‌ జీవితాన్ని కష్టంగా గడుపుతుంటాడు. అతడి భార్య 12 ఏళ్ల క్రితమే చనిపోవడంతో ఇంట్లో ఒంటరిగా జీవిస్తుంటాడు. నిరాశ, నిస్పృహలతో సాగిపోతున్న అతడికి భర్తపోయి ఒంటరిగా జీవిస్తున్న నీనా గుప్తా పరిచయం అవుతుంది. వారి మధ్య బలమైన స్నేహం ఏర్పడుతుంది. వారిద్దరు తమ వృద్ధాప్య జీవితాన్ని ఎంత సంతోషంగా గడిపారు? ఎలాంటి కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు? వారు తమ జీవితాలను కొత్తగా ఏ కోణంలో చూడటం ప్రారంభించారు? చివరికీ ఏమైంది? అన్నది కథ. Telugu.yousay.tv Rating : 3/5 
    ఏప్రిల్ 20 , 2024
    Pushpa 2 The Rule: పుష్ప2 నుంచి బిగ్ అప్‌డేట్.. ఆ బాలీవుడ్ బ్యూటీతో ఐటెం సాంగ్!
    Pushpa 2 The Rule: పుష్ప2 నుంచి బిగ్ అప్‌డేట్.. ఆ బాలీవుడ్ బ్యూటీతో ఐటెం సాంగ్!
    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘పుష్ప’ (Pushpa). పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అంతేకాకుండా బన్నీని జాతీయ స్థాయి నటుడుగా నిలబెట్టింది. ఈ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అల్లు అర్జున్‌ అందుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్‌ రూపొందుతోంది. ‘పుష్ప 2’ పేరుతో ఇది రాబోతోంది. టైటిల్‌ కింద ‘ది రూల్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. అయితే ఈ సీక్వెల్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ బయటకొచ్చింది. ప్రస్తుతం ఆ వార్త సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది.&nbsp; బాలీవుడ్‌ బ్యూటీతో ఐటెం సాంగ్‌ ‘పుష్ప’ మూవీ పాటలు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా మావా.. ఉ.. ఉ.. అంటావా’ అనే ఐటెం సాంగ్‌ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్‌ చేసింది. బన్నీ-సామ్‌ కలిసి వేసిన స్టెప్స్‌ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్‌ సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ పాట కోసం ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్‌ల పేర్లు బయటకు వచ్చినప్పటికి చివరకు ఈ అవకాశం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశ పటానీ (Disha Patani)కి దక్కింది. అంతేకాదు ఈ వారంలోనే దిశాతో ఐటమ్‌సాంగ్‌ చిత్రీకరించనున్నట్లు సమాచారం.&nbsp; శరవేగంగా షూటింగ్‌ ఆగస్టు 15న 'పుష్ప 2'ను రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అందుకు అనుగుణంగా శరవేగంగా షూటింగ్‌ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ 'రామోజీ ఫిల్మ్‌ సిటీ'లో చురుగ్గా సాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే నిన్న (ఫిబ్రవరి 12) ‘పుష్ప2’ హీరోయిన్‌ రష్మిక మందన్న సెట్‌లో డైరెక్టర్‌ సుకుమార్‌ను క్యాప్చర్‌ చేసింది. ఓ సింహం బొమ్మపై సుకుమార్ నవ్వుతూ కనిపించారు. ఈ ఫొటోను షేర్‌ చేసిన చిత్ర యూనిట్‌.. శ్రీవల్లి (రష్మిక) ఈ ఫోటో తీసినట్లు స్పష్టం చేశారు. చకా చకా షూటింగ్ పనులు జరుగుతున్నట్లు చెప్పారు.&nbsp; https://twitter.com/PushpaMovie/status/1756931867146907757? ఒకే ఒక్క మార్పు పుష్ప చిత్రం సౌత్‌లో కంటే.. నార్త్‌లోనే ఎక్కువ అభిమానుల్ని సంపాదించుకుంది. దాంతో ‘పుష్ప 2’ పై విప‌రీత‌మైన అంచ‌నాలు పెరిగాయి. పెరిగిన అంచ‌నాల్ని దృష్టిలో ఉంచుకొని, స్క్రిప్టు ప‌రంగా సుకుమార్ అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లూ తీసుకున్నారు. ఈ క్రమంలోనే ‘పుష్ప 2’లో కొత్త స్టార్లు ద‌ర్శ‌న‌మిస్తార‌ని గత కొంత కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని సమాచారం. ‘పుష్ప 1’లో ఉన్న‌వారే.. పార్ట్ 2లోనూ క‌నిపిస్తారట. ఒక్క జ‌గ‌ప‌తిబాబు పాత్ర మాత్రమే కొత్తగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది. కాగా, ఈ చిత్రంలో బన్నీతో పాటు సునీల్‌, అనసూయ, ఫహద్‌ ఫాసిల్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.&nbsp; పుష్ప2 డైలాగ్ లీక్‌..! ఇక పుష్ప2 నుంచి రిలీజైన ఓ పోస్టర్‌లో బన్నీ.. గంగమ్మ జాతర గెటప్‌లో కనిపిస్తాడు. ఈ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ నుంచి ఓ డైలాగ్ లీకైదంటూ నెట్టింట వార్తలు వచ్చాయి. మంగళం శీను (సునీల్‌)కు పుష్ప(బన్నీ) వార్నింగ్ ఇచ్చే క్రమంలో ఈ డైలాగ్‌ ఉంటుందని అంటున్నారు. అదేంటంటే.. ‘చూడు శీనప్ప పుష్ప గుండెల్లో గుండు దింపాలంటే గన్ను ఒకటే పట్టుకుంటే సరిపోదప్ప దాన్ని పట్టుకున్నోడి గుండె కూడా గన్నులా ఉండాలి’ అని సునీల్‌తో బన్నీ అంటాడట. అయితే ఈ ప్రచారంపై చిత్ర యూనిట్‌ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.&nbsp; లీకుల బెడద..! 'పుష్ప 2' చిత్రాన్ని లీకుల బెడద వెంటాడుతోంది. ఇటీవల షూటింగ్ స్పాట్‌ నుంచి అల్లు అర్జున్‌ చీరలో ఉన్న ఫొటో లీక్‌ అయ్యింది. దీంతో సుకుమార్‌ యూనిట్‌పై సీరియస్ అయ్యాడట. తాజాగా షూటింగ్‌ స్పాట్‌ నుంచి రావు రమేష్‌ ‘ప్రజా చైతన్య పార్టీ’ అనే ఫ్లెక్సీలు కూడా బయటకు వచ్చాయి. ఈ లీకులను ఆపేందుకు సుకుమార్‌ స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మున్ముందు మూవీకి సంబంధించిన మరిన్ని ముఖ్యమైన విషయాలు లీక్‌ కాకుండా అడ్డుకోవాలని యూనిట్‌ను హెచ్చరించినట్లు సమాచారం.&nbsp; https://twitter.com/SrikanthAnu2/status/1751986145318314415
    ఫిబ్రవరి 13 , 2024
    Celebrity Couples Age Gap: ఈ సెలబ్రిటీ కపుల్స్ మధ్య ఏజ్ గ్యాప్ ఇంతనా.. అయినా సో హ్యాపీ..!
    Celebrity Couples Age Gap: ఈ సెలబ్రిటీ కపుల్స్ మధ్య ఏజ్ గ్యాప్ ఇంతనా.. అయినా సో హ్యాపీ..!
    ప్రేమ ఎంతో మధురమైనది. దానికి కులం, మతం, డబ్బు, రంగుతో పని లేదంటారు. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకునేందుకు ప్రేమికులు ఏ విషయాన్ని పట్టించుకోరు. ఎంతదూరమైన వెళ్లి తమ ప్రేమను గెలిపించుకుంటారు. కొందరు సెలబ్రిటీలు కూడా సరిగ్గా ఇదే చేశారు. ప్రేమకు వయసుతోనూ పనిలేదని చాటి చెప్పారు. వయసులో ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ భాగస్వామిని చేసుకొని సంతోషంగా గడుపుతున్నారు. ఇండస్ట్రీలో పదేళ్లకు మించి ఏజ్‌ గ్యాప్‌ ఉన్న సెలబ్రిటీ కపుల్స్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; రణ్‌బీర్ కపూర్‌ - అలియా భట్‌ బాలీవుడ్‌ జంట రణ్‌బీర్‌ కపూర్‌ (40)&nbsp; - అలియా భట్‌ (30)ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఆలియా కంటే రణ్‌బీర్‌ 10 ఏళ్లు పెద్ద. వయసును ఏ మాత్రం పట్టించుకోని ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. వీరికి గతేడాది నవంబర్‌లో ఓ పాప కూడా పుట్టింది.&nbsp; ఫహద్‌ - నజ్రియా మలయాళం నటుడు ఫహద్‌ ఫాసిల్‌ (40) నటి నజ్రియా నజిన్‌ (28)ను 2014లో లవ్‌ మ్యారేజ్ చేసుకున్నాడు. తన కంటే ఫహద్‌ 12 ఏళ్లు పెద్ద అయినప్పటికీ మనసులు కలవడంతో వీరు ఒక్కటయ్యారు. పుష్ప సినిమాలో విలన్‌గా నటించి ఫహద్ ఆకట్టుకున్నాడు. అటు నజ్రియా సైతం నాని హీరోగా చేసిన 'అంటే సుందరానికి ' నటించి ఆకట్టుకుంది.&nbsp; ప్రియాంక చోప్రా - &nbsp;నిక్ జోనాస్‌ బాలీవుడ్ ‌అగ్రకథానాయికల్లో ఒకరైన ప్రియాంక చోప్రా (40) తన కంటే 10 ఏళ్లు చిన్నవాడైన హాలీవుడ్‌ నటుడు నిక్ జోనాస్‌ (30)ను ప్రేమ వివాహం చేసుకుంది. తన కంటే జోనాస్ చిన్నవాడైనప్పటికీ మనసులో మాత్రం చాలా పెద్ద వాడని ప్రియాంక ఓ సందర్భంలో పేర్కొంది. అందుకే పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. జోనాస్‌తో పెళ్లి తర్వాత ప్రియాంక క్రేజ్‌ బాగా పెరిగింది. హాలీవుడ్ అవకాశాలు కూడా ఈ అమ్మడిని వెతుక్కుంటూ వచ్చేసాయి. సైఫ్ అలీఖాన్‌ - కరీనా కపూర్‌ ప్రముఖ బాలీవుడ్‌ సైఫ్‌ అలీఖాన్‌ కూడా తన కంటే 13 ఏళ్లు చిన్నదైన కరీనా కపూర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు సైతం ఉన్నారు. కరీనాను సైఫ్‌ అలీఖాన్‌ రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే సైఫ్‌కు ఆయన మొదటి భార్యకు మధ్య కూడా వయసులో చాలా వ్యత్యాసమే ఉంది. ఫస్ట్‌ వైఫ్‌ అమృతా సింగ్‌ సైఫ్‌ కంటే 12 ఏళ్లు పెద్దది. వీరికి పుట్టిన సారా అలీఖాన్‌ ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్‌గా రాణిస్తోంది.&nbsp; ఆర్య - సయేషా సైగల్&nbsp; తమిళ హీరో ఆర్య (42).. 2019లో సయేషా సైగల్‌ (25) ను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆర్య కంటే సయేషా వయసులో 17 ఏళ్లు చిన్నది. అయినప్పటికీ పెద్దల అంగీకారంతో ఈ జంట ఒక్కటైంది. వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా ఉంది.&nbsp;&nbsp; ప్రకాష్‌ రాజ్‌ - పోనీ వర్మ ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌(58) కొరియోగ్రాఫర్‌ పోనీ వర్మ (45) ను 2010లో వివాహం చేసుకున్నాడు. ప్రకాశ్‌ రాజ్‌ కంటే పోనీ వర్మ 13 ఏళ్లు చిన్నది. వీరిద్దరి ఓ బాబు కూడా ఉన్నాడు. 1994లో లలితా కుమారి అనే మహిళను ప్రకాష్‌ రాజ్ వివాహం చేసుకున్నాడు. అనివార్య కారణాల వల్ల ఈ జంట 2009లో విడాకులు తీసింది. ఆ తర్వాతి ఏడాదే ప్రకాష్ రాజ్‌ పోనీ వర్మను పెళ్లి చేసుకున్నాడు.&nbsp; దిల్‌ రాజు - తేజస్విని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (52) తేజస్విని(వైఘా రెడ్డి)ని 2020లో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇరువురి మధ్య వయసు వ్యత్యాసం 19 సంవత్సరాలు. దిల్‌రాజు మెుదటి భార్య గుండెపోటుతో మరణించడంతో ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు. దిల్‌రాజు ఇప్పటివరకూ వివిధ భాషల్లో కలిపి 50కి పైగా సినిమాలు నిర్మించాడు.&nbsp;&nbsp; అర్జున్‌ కపూర్‌ - మలైకా బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ (45) తనకంటే 12 ఏళ్లు పెద్దదైన మలైకా అరోరా (58)తో రిలేషన్‌లో ఉన్నాడు. వీరిద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు బాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వీరు ఎక్కడ చూసినా జంటగానే కనిపిస్తున్నారు.&nbsp;
    మే 16 , 2023
    <strong>OTT Suggestions: ఈ వీకెండ్‌.. పక్కా వినోదాన్ని పంచే చిత్రాలు ఇవే</strong>
    OTT Suggestions: ఈ వీకెండ్‌.. పక్కా వినోదాన్ని పంచే చిత్రాలు ఇవే
    ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రతీవారం కొత్త సినిమాలను తీసుకొస్తూ ఆడియన్స్‌ను పసందైన ఆనందాన్ని పంచుతున్నాయి. ఈ వారంతం పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీలోకి రానున్నాయి. మరికొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటిలో మీ అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకుని ఓటీటీలో చూసేందుకు వీకెండ్‌ (OTT Suggestions)లో ప్లాన్ చేసుకోండి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి ప్లాట్స్‌ ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; జీబ్రా (Zebra) సత్యదేవ్‌, ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా’ (Zebra). ప్రియాభవానీ శంకర్‌ కథానాయిక. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకుడు. యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌గా ఇది తెరకెక్కింది. నవంబర్‌ 22న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ప్రసారం చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ అధికారికంగా ప్రకటించింది. డేట్ అనౌన్స్‌ చేయనప్పటికీ డిసెంబర్‌ 14న ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్లాట్ ఏంటంటే ‘మిడిల్‌ క్లాస్‌కు చెందిన సూర్య (సత్యదేవ్‌) బ్యాంక్‌ ఆఫ్‌ ట్రస్ట్‌లో రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌గా పని చేస్తుంటాడు. తోటి ఉద్యోగిని స్వాతి (ప్రియ భవానీ శంకర్‌)ని తప్పుడు అకౌంట్‌కు రూ.4 లక్షల డబ్బును ట్రాన్‌ఫర్‌ చేస్తుంది. ఆ సమస్య నుంచి స్వాతిని కాపాడే క్రమంలో సూర్య రూ.5 కోట్ల ఫ్రాడ్‌లో ఇరుక్కుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాలతో ఎంతో ప్రమాదకారి అయిన ఆది (ధనంజయ్‌)ని సూర్య ఢీ కొట్టాల్సి వస్తుంది. సూర్య అతడ్ని ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి?’ అన్నది స్టోరీ. తంగలాన్‌ (Thangalan) తమిళ స్టార్‌ హీరో విక్రమ్ హీరోగా నటించిన 'తంగలాన్‌' చిత్రం ఈ వారమే సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్ 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి పా. రంజిత్‌ దర్శకత్వం వహించగా మాళవిక మోహనన్‌, పార్వతి తిరువొత్తులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్లాట్‌ ఏంటంటే ‘తంగలాన్‌ తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బ్రిటిషర్లతో కలిసి బంగారం వెతికేందుకు వెళ్తాడు. అయితే బంగారాన్ని నాగజాతికి చెందిన మంత్రగత్తె ఆరతి (మాళవిక) రక్షిస్తుంటుంది. ఆమె నుంచి తంగలాన్‌ బృందానికి ఎదురైన సవాళ్లు ఏంటి? ఆమె నుంచి తప్పించుకొని తంగలాన్‌ బంగారాన్ని ఎలా సాధించాడు?’ అన్నది స్టోరీ. &nbsp;7/G&nbsp; సోనియా అగర్వాల్‌ (OTT Suggestions), స్మృతి వెంకట్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘7/G’. హరూన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టెరిఫిక్‌ హారర్‌ థ్రిల్లర్‌గా థియేటర్లలో ఆకట్టుకుంది. కాగా ఈ చిత్రం తాజాగా ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. తెలుగులో వీక్షించవచ్చు. ప్లాట్‌ ఏంటంటే ‘రాజీవ్‌, వర్ష దంపతులు ఐదేళ్ల కుమారుడితో కలిసి కొత్త ఫ్లాట్‌లోకి షిఫ్ట్‌ అవుతారు. అక్కడ వర్షకు అనూహ్య పరిస్థితులు ఎదురవుతాయి. అతీతశక్తులతో ఆమె పోరాటం చేయాల్సి వస్తుంది. చివరికీ ఏమైంది? అన్నది స్టోరీ.   బౌగెన్‌విల్లా (Bougainvillea) మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌, కుంచకో బోబన్‌, జ్యోతిర్మయి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్‌ చిత్రం 'బౌగెన్‌విల్లా'. థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. డిసెంబర్‌ 13 నుంచి సోని లివ్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. తెలుగులోనూ వీక్షించవచ్చు. ప్లాట్‌ ఏంటంటే 'థామస్, రీతు భార్య భర్తలు. యాక్సిడెంట్‌లో గీతు గతం మర్చిపోతుంది. మరోవైపు మినిస్టర్‌ కుమార్తె మిస్సింగ్‌ కేసు రాష్ట్రంలో సంచలనం సృషిస్తుంటుంది. యాక్సిడెంట్‌కు ముందు మినిస్టర్‌ కుమార్తెను రీతు ఫాలో కావడం చూసి దర్యాప్తు చేసేందుకు ఏసీపీ కోషి వాళ్ల ఇంటికి వస్తాడు. అక్కడ ఏసీపీకి తెలిసిన షాకింగ్‌ నిజాలేంటి? అసలు మినిస్టర్‌ కూతుర్ని కిడ్నాప్‌ చేసింది ఎవరు? అన్నది స్టోరీ. హరికథ (Harikatha) పలు సూపర్‌ హిట్‌ చిత్రాలు నిర్మించిన ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పీపీల్‌ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఓ ఆసక్తికర వెబ్‌సిరీస్‌ను నిర్మించింది. 'హరికథ: సంభవామి యుగే యుగే' (OTT Suggestions) పేరుతో రూపొందిన ఈ సిరీస్‌ ఈ వారమే హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. డిసెంబర్‌ 13 నుంచి ఈ సిరీస్‌ను వీక్షించవచ్చు. ఇందులో రాజేంద్ర ప్రసాద్‌, శ్రీరామ్‌, దివి, అంబటి అర్జున్‌ కీలక పాత్రలు పోషించారు. మగ్గీ దర్శకత్వం వహించారు.  రోటి కపడా రొమాన్స్ (Roti Kapada Romance) హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్ పొనుగంటి, సుప్రజ్ రంగా హీరోలుగా నటించిన సినిమా 'రోటి కపడా రొమాన్స్'. ఇందులో సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘ లేఖ, ఖుష్బూ చౌదరి హీరోయిన్లు. విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ రెస్పాన్స్ అందుకుంది. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఈ వారం స్ట్రీమింగ్‌కు వచ్చింది. డిసెంబర్‌ 12 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఈ సినిమా ప్రసారం అవుతోంది. ప్లాట్‌ ఏంటంటే ‘ఈవెంట్‌ ఆర్గనైజర్‌ హర్ష (హర్ష నర్రా), సాఫ్ట్‌వేర్‌ రాహుల్‌ (సందీప్‌ సరోజ్‌), ఆర్జే సూర్య (తరుణ్‌), విక్కీ(సుప్రజ్‌ రంగ) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఒకే రూమ్‌లో ఉంటూ హ్యాపీగా జీవిస్తుంటారు. సాఫీగా సాగుతున్న వీరి లైఫ్‌లోకి నలుగురు అమ్మాయిలు ఎంట్రీ ఇస్తారు. వారి రాకతో ఆ నలుగురు ఫ్రెండ్స్‌ లైఫ్‌ ఎలా మారింది? ప్రేమ వల్ల వారు ఎలాంటి ఇబ్బందులు ఫేస్‌ చేశారు? వారిలో వచ్చిన రియలైజేషన్‌ ఏంటి?’ అన్నది స్టోరీ కంగువా (Kanguva) ఇదిలా ఉంటే గతవారం పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. అవి ఇప్పటివరకూ చూడకుండా ఉంటే ఈ వీకెండ్‌తో ఎంచక్కా చూసేయండి. తమిళ హీరో సూర్య (Suriya) నటించిన లేటెస్ట్‌ చిత్రం 'కంగువా' (Kanguva OTT Release) డిసెంబర్‌ 10 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్‌ ఏంటంటే ‘ఫ్రాన్సిస్‌ (సూర్య) గోవాలో బౌంటీ హంటర్‌గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు ఫ్రాన్సిస్‌ను ఒక పాప కలుస్తుంది. ఆ పాపకి తనకు ఎదో బంధం ఉందని అతడికి అనిపిస్తుంది. ఆ బంధం ఇప్పటిది కాదు గత జన్మదని అతడికి అర్థమవుతుంది. 1000 ఏళ్ల కిందట ఆ పాపతో ఫ్రాన్సిస్‌కు ఉన్న సంబంధం ఏంటి? అసలు కంగువా ఎవరు? తెగ నాయకుడిగా అతడు చేసిన పోరాటాలు ఏంటి? విలన్ (బాబీ డియోల్‌) నుంచి అతడి తెగకు ఎదురైన ముప్పు ఏంటి?’ అన్నది స్టోరీ. అమరన్‌ (Amaran) పాన్‌ ఇండియా స్థాయిలో (OTT Releases) విడుదలై భారీ విజయం అందుకున్న రీసెంట్‌ తమిళ చిత్రం 'అమరన్‌' . అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ బయోపిక్‌ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. శివ కార్తికేయన్‌, సాయి పల్లవి కీలక పాత్రలు పోషించారు. రాజ్‌ కుమార్‌ పెరియసామి డైరెక్ట్‌ చేశారు. డిసెంబర్‌ 5న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడు కావాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు?’ అనేది మిగతా కథ. విక్కీ విద్యా కా వో వాలా వీడియో (Vicky Vidya Ka Woh Wala Video) ’యానిమల్‌’ బ్యూటీ త్రిప్తి దిమ్రి (OTT Suggestions) నటించిన లేటెస్ట్‌ చిత్రం గత వారం ఓటీటీలోకి వచ్చింది. 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' (Vicky Vidya Ka Woh Wala Video OTT Platform) సినిమా డిసెంబర్‌ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ  భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇందులో రాజ్‌కుమార్‌ రావ్‌, త్రిప్తి దిమ్రి జంటగా నటించారు. రాజ్‌ శాండిల్య డైరెక్ట్ చేశారు. ప్లాట్ ఏంటంటే ‘1997 సంవత్సరంలో వికీ (రాజ్ కుమార్ రావు), విద్యా (త్రిప్తి డిమ్రీ) ఇద్దరు పెళ్లి చేసుకొంటారు. ఫస్ట్‌ నైట్‌ మధుర జ్ఞాపకాలను ఓ సిడీలో బంధిస్తారు. అయితే అనూహ్యంగా ఆ సీడీ దొంగతనానికి గురవుతుంది. ఆ తర్వాత ఆ ఇద్దరి దంపతుల పరిస్థితి ఏంటి? అన్నది స్టోరీ.
    డిసెంబర్ 12 , 2024

    @2021 KTree