• TFIDB EN
  • Editorial List
    తెలుగులో చిరంజీవి, రమ్యకృష్ణ జంటగా నటించిన చిత్రాలు ఇవే
    Dislike
    800+ views
    1 year ago

    మెగాస్టార్ చిరంజీవి, రమ్యకృష్ణ సిల్వర్ స్క్రీన్‌ పేయిర్‌గా మంచి గుర్తింపు ఉంది. వీరిద్దరు జంటగా మొత్తం ఐదు చిత్రాల్లో నటించారు. వీటిలో అల్లుడా మజాకా, ఇద్దరు మిత్రులు వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. వాటపై ఓ లుక్ వేయండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . ముగ్గురు మొనగాళ్లు(జనవరి 07 , 1994)
    U|యాక్షన్,డ్రామా
    ముగ్గురు కవల సోదరులు తమ తండ్రిని హత్య చేసిన దుండగుడి వల్ల పుట్టుకతోనే విడిపోతారు. వారు పెరిగి పెద్దయ్యాక కలుసుకుని తమ తండ్రి మరణానికి కారణమైన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడానికి బయల్దేరుతారు.
    2 . చక్రవర్తి(జూన్ 04 , 1987)
    U|136 minutes|యాక్షన్,ఫ్యామిలీ
    అంజి ఎవరికి అన్యాయం జరిగినా సహించలేడు. అయితే ఓ గ్రామ పెద్ద దురాగతాల కారణంగా అతని గురువు మరణించినప్పుడు, అతను తన గురువు మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరాడు.
    3 . అంజి(జనవరి 15 , 2004)
    U|148 minutes|అడ్వెంచర్,డ్రామా
    భాటియా అనే దుర్మార్గుడు ఒక సమూహంతో కలిసి ఆత్మ లింగాన్ని వెతుకుతూ సూపర్ పవర్స్‌ని సంపాదించుకుంటాడు. అతని నుంచి ఆత్మలింగాన్ని అంజి ఎలా వేరు చేశాడు అనేది కథ
    4 . ఇద్దరు మిత్రులు(ఏప్రిల్ 30 , 1999)
    UA|డ్రామా,ఫ్యామిలీ
    విజయ్‌, అనిత చిన్నప్పటి నుంచి బెస్ట్‌ ఫ్రెండ్స్‌. వారి జీవితాల్లోకి భాగస్వాములు వచ్చాక సమస్యలు మెుదలవుతాయి. అనిత కాపురాన్ని సరిదిద్దే క్రమంలో విజయ్‌ తన వైవాహిక బంధాన్ని వదులుకునేందుకు సిద్ధపడతాడు.
    5 . అల్లుడా మజాకా(ఫిబ్రవరి 25 , 1995)
    A|యాక్షన్,డ్రామా
    ధనవంతుడు కొడుకు అయిన సీతారం సంపదను శత్రువులు దోచుకుంటారు. అన్యాయంగా అతడ్ని హత్య కేసులో ఇరికించి జైలుకు పంపుతారు. జైలు నుంచి బయటకొచ్చిన సీతారాం ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.

    @2021 KTree