2024 ఏడాదిలో వచ్చిన టాప్ హర్రర్ తెలుగు చిత్రాలు ఇవే!
100+ views1 month ago
2024లో విడుదలై ప్రేక్షకులను భయపెట్టిన హరర్ చిత్రాల జాబితాను సేకరించాం. వీటిలో స్త్రీ2, బ్లడీ ఇష్క్ వంటి వెన్నులో వణుకు పుట్టించే చిత్రాలను ఇక్కడ అందిస్తున్నాం. మీరు చూసేయండి ఆ లిస్ట్‌ను
1 . ముంజ్య(జూన్ 07 , 2024)
UA|హాస్యం,డ్రామా,హారర్
1952లో తనకంటే పెద్దమ్మాయిని గోట్యా అనే పిల్లాడు ప్రేమిస్తాడు. ఆమెను దక్కించుకునేందుకు చేతబడి చేయబోతాడు. అయితే అది వికటించి పిల్ల దెయ్యం ముంజ్యగా మారతాడు. ప్రస్తుతం పుణెలో ఉంటున్న బిట్టు (అభయ్ వర్మ) అనుకోకుండా ముంజ్యకు విముక్తి కలిగిస్తాడు. ఆ ముంజ్య బిట్టును ఎన్ని ఇబ్బందులు పెట్టింది? దాని లక్ష్యం ఏంటి? చివరికీ ఏమైంది? అన్నది స్టోరీ.
2 . భ్రమయుగం(ఫిబ్రవరి 23 , 2024)
UA|హారర్,థ్రిల్లర్
తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ.
3 . స్ట్రీ 2(ఆగస్టు 15 , 2024)
UA|హాస్యం,హారర్
చందేరీ గ్రామంలో ‘స్త్రీ’ సమస్య తొలగింది అని అందరూ ఊపిరి పీల్చుకునేలోపు ‘సర్కట’తో కొత్త సమస్య మొదలవుతుంది. ఈ సమస్యను విక్కీ (రాజ్ కుమార్ రావు), రుద్ర (పంకజ్ త్రిపాఠి), జన (అభిషేక్ బెనర్జీ), బిట్టు (ఆపర్ శక్తి ఖురానా)తో కలిసి ఓ భూతం (శ్రద్ధా కపూర్) ఎలా ఎదుర్కొంది? అన్నది స్టోరీ.
4 . సి 202(అక్టోబర్ 25 , 2024)
A|హారర్,థ్రిల్లర్
చేతబడి వల్ల C 202 అనే ఇంట్లో హత్య జరుగుతుంది. దాని వెనక భూతాల రాజు (తనికెళ్ల భరణి) ఉన్నాడని తెలుస్తుంది. ఇంతకీ అతడు C 202 ఇంటినే ఎందుకు టార్గెట్ చేశాడు? ఆ ఇంట్లో వారిపై ఎందుకు చేతబడి చేస్తున్నాడు? దాని వెనక కారణాలేంటి? ఆ ఇంట్లో ఏముంది? అన్నది స్టోరీ.
5 . లవ్ మీ(మే 25 , 2024)
UA|హారర్,రొమాన్స్,థ్రిల్లర్
అర్జున్ (ఆశిష్), ప్రతాప్ (రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్ లవర్ ప్రియా (వైష్ణవి).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? దివ్యవతి ఎవరు? అన్నది కథ.
6 . తంత్ర(మార్చి 15 , 2024)
A|డ్రామా,హారర్
రేఖ (అనన్య)కు దెయ్యాలు కనిపిస్తుంటాయి. బాల్య స్నేహితుడు తేజూను ఆమె ఇష్టపడటంతో ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే రేఖపై ఎవరో క్షుద్ర పూజలు చేశారని తేజుకి తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? విగత (వంశీ), రాజేశ్వరి (సలోని) పాత్రలతో రేఖకు సంబంధం ఏంటి? అన్నది కథ.
7 . కొత్త రంగుల ప్రపంచం(జనవరి 20 , 2024)
UA|డ్రామా,హారర్
డైరెక్టర్ పృథ్వీ.. కృష్ణ, శ్రీలును హీరో హీరోయిన్లుగా పెట్టి కొత్త సినిమా ప్లాన్ చేస్తాడు. వారు షూటింగ్ కోసం ఓ ఫామ్ హౌస్‌కు వెళ్తారు. షూటింగ్ చేస్తున్నటైంలో ఆ ఇంట్లో ఏదో ఉందనే అనుమానం టీమ్‌కు కలుగుతుంది. షూటింగ్‌లో శ్రీలు వింతగా ప్రవర్తించడం చేస్తుంది. శ్రీలుకు ఏమైంది? ఆమెను ఆవహించిన ఆత్మ ఎవరిది? అన్నది కథ.
8 . ఇంటి నం. 13(మార్చి 01 , 2024)
UA|హారర్,థ్రిల్లర్
సంజయ్ తన అన్నకు గిఫ్ట్‌గా వచ్చిన విల్లాలో భార్య నిత్యతో కలిసి దిగుతాడు. కొన్ని రోజుల తర్వాత నిత్యకు ముసుగు వేసుకున్న ఆకారాలు కనిపిస్తుంటాయి. ఒక్కొసారి వింతగా కూడా ప్రవర్తిస్తుంటుంది. ఇంతకీ తెల్లటి ముసుగు ఆకారాలు ఎవరివి? ఏం సాధించడానికి అవి నిత్యను ఆవహిస్తున్నాయి? ఈ సమస్య నుంచి ఆమె ఎలా బయటపడింది? అన్నది స్టోరి.
9 . మాయ (మార్చి 15 , 2024)
UA|హారర్,థ్రిల్లర్
భర్త, కుమార్తె ఇద్దరినీ కోల్పోవడంతో రియా జీవితం విషాదకరమైన మలుపు తిరుగుతుంది. వారు ఎందుకు చనిపోయారు? భర్త, కూతురు మరణం తర్వాత రియా జీవితంలో చోటుచేసుకున్న ఘటనలు ఏవి? అన్నది స్టోరీ.
10 . లిసా ఫ్రాంకెన్‌స్టైయిన్(ఫిబ్రవరి 09 , 2024)
UA|హారర్
ఓ జంట గాఢంగా ప్రేమించుకుంటుంది. అందులోని యువకుడు అనూహ్యంగా చనిపోవడంతో అతడికి యువతి తిరిగి ప్రాణం పోస్తుంది. ఆ తర్వాత వారు ఎలా జీవించారు? మిస్సైన ప్రియుడు శరీర భాగాల కోసం వారు ఏం చేశారు? అన్నది స్టోరీ.
11 . గార్డియన్(మార్చి 08 , 2024)
UA|హాస్యం,హారర్
అపర్ణ (హన్సిక)కు క్రిస్టల్ (మెరుపు రంగు రాయి) దొరుకుతుంది. అప్పటి నుంచి ఆమె ఏది కోరుకుంటే అది జరగడం మెుదలవుతుంది. మంచి ఉద్యోగం, లవ్ తిరిగి లభిస్తాయి. ఇంతకీ ఆమె కోరికలు ఎలా నెరవేరుతున్నాయి? వాటితో క్రిస్టల్‌కు లింక్ ఏంటి? క్రిస్టల్‌లో బంధించిన ఆత్మ ఎవరు? అన్నది స్టోరీ.
12 . 105 మినిట్స్(జనవరి 26 , 2024)
A|హారర్,థ్రిల్లర్
జాను (హన్సిక) ఆఫీసు నుంచి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో తననేదో అదృశ్యశక్తి వెంటాడుతున్నట్లు ఆమెకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్లాక అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ అదృశ్య శక్తి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింసలకు గురి చేయడం ప్రారంభిస్తుంది. తన మరణానికి జానునే కారణమని చెప్పి ఇబ్బందులకు పెడుతుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు? ఆ వ్యక్తి మరణానికి జాను ఎలా కారణమైంది? దాని బారి నుంచి జాను ఎలా బయటపడింది? అన్నది మిగతా కథ
13 . బాక్(మే 03 , 2024)
UA|హాస్యం,హారర్
శివ శంకర్ (సుందర్ సి) ఒక లాయర్. బాక్ అనే దుష్టశక్తి వల్ల అతని చెల్లెలు శివాని (తమన్నా) మరణిస్తుంది. అసలు ఆ బాక్ ఎవరు? శివాని ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేసింది? శివాని ఆత్మగా మారి తన కుటుంబాన్ని ఎలా కాపాడింది? కథలో మాయ (రాశి ఖన్నా) పాత్ర ఏంటి? అన్నది కథ.
14 . అనన్య(మార్చి 22 , 2024)
UA|హారర్,థ్రిల్లర్
అనన్య ఒక సంప్రదాయ కుటుంబానికి చెందిన యువతి. కుటుంబ సభ్యుడు ఒకరు ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో అనన్యకు ఆన్‌లైన్‌లో మరో వ్యక్తి పరిచయం అవుతాడు. వారి పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత ఏమైంది? అనన్య జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది? అన్నది స్టోరీ.
15 . హంట్(ఆగస్టు 23 , 2024)
UA|హారర్,థ్రిల్లర్
కీర్తి (భావన) ఫోరెన్సిక్ డాక్టర్. ఓ మహిళా హత్య కేసుకు సంబంధించిన ఆధారాల్ని కనిపెట్టే బాధ్యత కీర్తిపై పడుతుంది. ఆ కేసు ఇన్వేస్టిగేషన్ చేపట్టినప్పటి నుంచి కీర్తి జీవితంలో అంతుచిక్కని పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఓ ఆత్మ ఆమెను వెంటాడుతుంది. ఇంతకీ ఆ ఆత్మ ఎవరిది? చనిపోయిన మహిళకు కీర్తికి ఉన్న సంబంధం ఏంటి?’ అన్నది స్టోరీ
16 . కళింగ(సెప్టెంబర్ 13 , 2024)
UA|హారర్,థ్రిల్లర్
కళింగ ఊరు పొలిమేర దాటి అడవిలోకి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి రారు. ఆ అడవిలో కళింగ రాజు సంపద ఉందని, దానికి ఓ దుష్టశక్తి కాపలాకాస్తుందని ప్రజల నమ్మకం. తన ప్రేమను గెలిపించుకోవడం కోసం గ్రామానికి చెందిన లింగా (ధ్రువవాయు) ఫ్రెండ్స్‌తో కలిసి అడవిలోకి వెళ్తాడు. అక్కడ అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? కళింగ రాజు మిస్టరీ ఏంటి? లింగా ప్రాణాలతో బయటపడ్డాడా? లేదా?’ అన్నది స్టోరీ.
17 . బ్లడీ ఇష్క్(జూలై 26 , 2024)
A|హారర్,థ్రిల్లర్
ఐల్యాండ్‍పై ఉండే ఓ భవనంలో ఉండేందుకు అవికా, వర్దన్ వెళతారు. ఈ భవనంలో అవికకు దెయ్యం ఉందని అర్థమవుతుంది. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు? అవికాను ఎలాంటి ఇబ్బందులు పెట్టింది? దాని బారి నుంచి ఆమె బయటపడింది? అన్నది స్టోరీ