టాలీవుడ్‌లో అతి కఠినమైన పాత్రలను తేలికగా పోషించగల హీరోల్లో రవితేజ ఒకరు. సవాళ్లు విసిరే పాత్రలను చేసేందుకు మాస్ మహారాజా ఎప్పుడూ ముందుంటారు. అందుకే ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా ఆయన అసలు వదులుకోరు. 60 చిత్రాలకు పైగా చేసిన రవితేజ అందులో విభిన్నపాత్రలను పోషించారు. ఈ క్రమంలో ఎంతో కష్టంతో కూడుకున్న ద్విపాత్రాభినయం చిత్రాలను కూడా రవితేజ చేశారు. ఆయన చేసిన డ్యూయల్ రోల్ సినిమాలు మీకోసం.
2020లో వచ్చిన ‘డిస్కో రాజా’ సినిమాలో హీరో రవితేజ ద్విపాత్రిభినయం చేశారు. అయితే సైన్స్‌ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజకు జంటగా పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ నటించారు. సునీల్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

2012లో వచ్చిన ‘దరువు’ చిత్రం విభిన్న కథాంశంతో తెరకెక్కింది. దర్శకుడు శివ ఈ చిత్రాన్ని యమగోల, యముడికి మెుగుడు, యమలీల సినిమాల్లాగా తెరకెక్కించారు. ఇందులో రవితేజ బుల్లెట్ రాజా, హోమంత్రి రవీంద్ర పాత్రల్లో నటించారు. ఈ మూవీలో ఎం.ఎస్ నారాయణ, షియాజీ షిండే, రఘుబాబు, అవినాష్, జయసుధ, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించారు. హీరోయిన్‌గా తాప్సీ నటించింది.

రవితేజ హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బాస్టర్ చిత్రం ‘విక్రమార్కుడు’. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేశారు. ఒక పాత్రలో పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా, మరో పాత్రలో దొంగగా ఆయన కనిపించారు. రాజమౌళి డైరెక్షన్ స్కిల్స్‌కు రవితేజ యాక్టింగ్ తోడవడంతో ఈ సినిమా పలు రికార్డులను క్రియేట్ చేసింది. ముఖ్యంగా రవితేజ కెరీర్‌లో చిరస్మరణీయ చిత్రంగా నిలిచిపోయింది.