• TFIDB EN
  • ఆహాలో టాప్ మిస్టరీ క్రైమ్ చిత్రాలు
    Dislike
    2k+ views
    1 year ago

    మిస్టరీ- క్రైమ్ జనర్‌ చిత్రాలంటే ప్రేక్షకులకు ఎప్పుడు ఆసక్తి ఉంటూనే ఉంటుంది. మిస్టరీని ఛేదించే సీన్లు ఆద్యంతం థ్రిల్లింగ్‌తో పాటు వినోదాన్ని పంచుతుంది. ఈక్రమంలో ఆహా ఓటీటీ ప్లాట్‌పామ్‌లో టాప్ మిస్టరీ- క్రైమ్‌ చిత్రాలను YouSay TFIDB లిస్ట్ చేసింది. వాటిని చూసి ఎంజాయ్ చేయండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . పశివాడి ప్రాణం(జూలై 23 , 1987)
    U|యాక్షన్,క్రైమ్
    భార్య చనిపోవడంతో మధు మద్యానికి బానిసవుతాడు. అతని జీవితంలోకి అనుకోకుండా వినికిడి, మాట లోపం ఉన్న రాజా అనే పిల్లవాడు వస్తాడు. ఆ చిన్నారి తల్లిదండ్రులను చంపిన హంతకులు అతన్ని చంపేందుకు వెతుకుతుంటారు.
    2 . నాంది(ఫిబ్రవరి 19 , 2021)
    UA|యాక్షన్,క్రైమ్,థ్రిల్లర్
    సూర్యప్రకాశ్‌ (అల్లరి నరేశ్‌) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. హత్య చేశాడనే ఆరోపణలతో అతడ్ని పోలీసులు అరెస్టు చేస్తారు. దీంతో ఐదేళ్లు జైలులోనే అతడు మగ్గుతాడు. ఇంతకీ ఆ హత్యను ఎవరు చేశారు? లాయర్‌ ఆద్య (వరలక్ష్మీ) అసలు నిందితులను ఎలా వెలుగులోకి తెచ్చింది? అన్నది కథ.
    3 . మా ఊరి పొలిమేర 2(నవంబర్ 03 , 2023)
    UA|క్రైమ్,హారర్,థ్రిల్లర్
    ఊరిలో చెతబడులు చేస్తూ చనిపోయాడని భ్రమ పడిన కొమురయ్య(సత్యం రాజేష్) తన తొలి ప్రేయసి కవితతో కేరళకు పారిపోతాడు. మరోవైపు జంగయ్య (బాలాదిత్య) తన సోదరుడు కొమురయ్య కోసం వెతుకులాటలో ఉంటాడు. ఇంతలో కొత్త ఎస్‌ఐ రవీంద్ర నాయక్ (రాకేందు మౌళి) ఆ గ్రామం చుట్టూ ఉన్న రహస్యాలను ఛేదించడానికి జాస్తిపల్లికి వస్తాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? గ్రామంలోని పాడుబడిన ఆలయంలోకి ప్రవేశించాలని పురావస్తు శాఖ ఎందుకు ప్రయత్నిస్తుంటుంది? అసలు గ్రామంలో వరుస మరణాలకు కొమురయ్య ఎందుకు కారణం అయ్యాడు? ఇంతకీ ఆ గుడిలో ఏముంది? జంగయ్య తన సోదరుడిని గుర్తించాడా ? లేదా? చివరికి ఏం జరిగింది ? అనేది మిగిలిన కథ
    4 . కిక్(మే 08 , 2009)
    UA|యాక్షన్,క్రైమ్,రొమాన్స్
    ఎప్పుడు సాహసాలు అంటే ఇష్టపడే కళ్యాణ్‌తో నైనా విడిపోతుంది. అతన్ని వదిలి కళ్యాణ్‌ను వెంబడిస్తున్న పోలీసును పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుంది.
    5 . ఒదెల రైల్వే స్టేషన్(ఆగస్టు 26 , 2022)
    A|థ్రిల్లర్,క్రైమ్
    అనుదీప్ (సాయి రోనక్) ఐపీఎస్‌ అధికారి. ట్రైనింగ్ కోసం ఓదెల వెళతాడు. ఈ క్రమంలో ఆ ఊరిలో వరుస హత్యాచారాలు తీవ్ర కలకలం రేపుతాయి. మరి అనుదీప్‌ హంతకుడ్ని పట్టుకున్నాడా? కేసు విచారణలో రాధ (హెబ్బా పటేల్‌) అతడికి ఎలా సాయపడింది? అనేది కథ.
    6 . కీడా కోలా(నవంబర్ 03 , 2023)
    UA|హాస్యం,క్రైమ్
    ఓ కూల్ డ్రింక్ లో బొద్దింక వస్తే... కోర్టు వరకు ఆ విషయాన్ని తీసుకువెళ్తే వచ్చే డబ్బు కంటే.. సదరు కార్పొరేట్ సంస్థనే బ్లాక్ మెయిల్ చేస్తే వచ్చే డబ్బు ఎక్కువ అని భావించిన కొందరు కుర్రాళ్ళు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? అనేది కీడా కోలా కథ. ఈ చిత్రంలో బ్రహ్మానందంతో పాటు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
    7 . సూపర్ ఓవర్(జనవరి 22 , 2021)
    UA|క్రైమ్,థ్రిల్లర్
    ముగ్గురు స్నేహితులు క్రికెట్‌ బెట్టింగ్‌లో రూ.1.70 కోట్లు గెలుస్తారు. ఆ డబ్బు తీసుకొని ముగ్గురూ రాత్రి వేళ బయలుదేరుతారు. ఈ క్రమంలో వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? అన్నది కథ.
    8 . అర్జున్ సురవరం(నవంబర్ 29 , 2019)
    UA|క్రైమ్,థ్రిల్లర్
    అర్జున్ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు కలిగి ఉన్నందుకు అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. తనకు సంబంధంలేని కేసులో ఇరుక్కున్న అర్జున్ ఎలా బయటపడ్డాడు అనేది కథ
    9 . ఝాన్సీ(ఫిబ్రవరి 16 , 2018)
    UA|యాక్షన్,క్రైమ్,డ్రామా
    ఝాన్సీ చెన్నైలో ఒక కఠినమైన పోలీసు మహిళ, ఆమె తక్కువ వయస్సు గల అత్యాచారం కేసును ఛేదించే బాధ్యతను తీసుకుంటుంది. ఆమె గర్భవతి అయిన అరసి (ఇవానా), బాధితురాలు మరియు గాలి రాజు అనుమానితుడు, ఇద్దరూ యుక్తవయస్కులే.
    10 . బ్లడీ మేరీ(ఏప్రిల్ 15 , 2022)
    UA|క్రైమ్
    మేరి (నివేదా పేతురాజ్‌), భాషా (కిరీటి), రాజు (రాజ్‌ కుమార్) అనాథలు. చిన్నప్పటి నుంచి కలిసే పెరుగుతారు. అనుకోని పరిస్థితుల్లో మేరి ఓ హత్య చేయాల్సి వస్తుంది. మరోవైపు భాష ఓ హత్య జరగడం చూస్తాడు. ఈ రెండు హత్యలతో ముగ్గురి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగిందన్నది కథ.

    @2021 KTree