• TFIDB EN
  • 2024లో వచ్చిన టాప్ బెస్ట్ రొమాంటిక్ చిత్రాలు ఇవే!
    Dislike
    20+ views
    23 days ago

    రొమాంటిక్ సినిమాలకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంటుంది. ఇయర్ ఎండ్‌లో మీ భాగస్వామితో కలిసి రొమాంటిక్ ప్రేమ కథా చిత్రాలను చూస్తుంటే ఆ మాజానే వేరు కదా..! ఇంకేందుకు బాస్ ఆలస్యం.. ఇక్కడ YouSay TFIDB అందిస్తున్న బెస్ట్ రొమాంటిక్ చిత్రాల్లో మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని ఎంజాయ్ చేయండి మరి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . టిల్లు స్క్వేర్(మార్చి 29 , 2024)
    UA|హాస్యం,రొమాన్స్
    రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లిల్లీ జోసెఫ్‌ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ.
    2 . ప్రేమలు(మార్చి 08 , 2024)
    U|హాస్యం,రొమాన్స్
    స‌చిన్.. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌టికే ల‌వ్‌లో ఫెయిలైన స‌చిన్‌.. రీనూకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవ‌రు? స‌చిన్‌ - రీనూ చివ‌ర‌కు కలిశారా? లేదా? అన్న‌ది క‌థ‌.
    3 . 14 డేస్ లవ్(జనవరి 05 , 2024)
    UA|డ్రామా,ఫ్యామిలీ,రొమాన్స్
    రెడ్డెప్ప కూతురు చిత్ర.. ఊర్లో ఉండే రవిని ప్రేమిస్తుంది. ఓ కారణం చేత నగరంలో ఉండే అత్తింటికి వెళ్తుంది. అత్త కొడుక్కి రెడ్డెప్ప ఫ్యామిలీ అంటే నచ్చదు. ఆ కోపం చిత్రపై చూపిస్తుంటాడు. అత్తకు కరోనా సోకడంతో 14 రోజులు క్వారంటైన్‌లో ఉంటుంది. ఈ క్రమంలో బావతో చిత్రకు చనువు పెరిగి ప్రేమ చిగురుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ఊర్లో ఉన్న రవి పరిస్థితి ఏంటి? అన్నది కథ.
    4 . కృష్ణం ప్రణయ సఖీ(ఆగస్టు 15 , 2024)
    UA|హాస్యం,డ్రామా,రొమాన్స్
    కృష్ణ (గ‌ణేష్‌) ఫ్యామిలీ బిజినెస్‌ చూసుకుంటూ ఉంటాడు. ఉమ్మడి కుటుంబం కావడంతో ఫ్యామిలీలో అడ్జస్ట్‌ అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడతాడు. ఈ క్రమంలోనే అనాథ అయిన ప్రణయ అతడికి పరిచయమవుతుంది. తాను కోటీశ్వరుడన్న నిజం దాచి ప్రణయకు కృష్ణ దగ్గరవుతాడు. మరోవైపు కృష్ణను దక్కించుకునేందుకు జాహ్నవి ప్రయత్నిస్తుంటుంది. ఈ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరి చివరికి ఏలాంటి పరిస్థితులకు దారి తీసింది? అన్నది స్టోరీ.
    5 . ట్రూ లవర్(ఫిబ్రవరి 10 , 2024)
    UA|డ్రామా,రొమాన్స్
    అరుణ్, దివ్య కాలేజీ రోజుల నుంచి లవర్స్‌. దివ్య ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్‌ చేస్తుండగా.. అరుణ్‌ ఒక కాఫీ షాపు పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో వీరిద్దరి మధ్య గొడవలు మెుదలవుతాయి. ఆ తర్వాత ఏమైంది? అరుణ్‌ - దివ్య కలిశారా? లేదా? అన్నది కథ.
    6 . మనమే(జూన్ 07 , 2024)
    UA|హాస్యం,డ్రామా,రొమాన్స్
    విక్రమ్ (శర్వానంద్) పని పాట లేకుండా తాగుతూ తిరుగుతుంటాడు. ఓ రోజు విక్రమ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ అనురాగ్‌ దీంతో అనురాగ్‌ కొడుకు ఖుషీ (మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య)ని పెంచాల్సిన బాధ్యత విక్రమ్‌, సుభద్ర (కృతిశెట్టి)లపై పడుతుంది. వారిద్దరు పిల్లాడిని ఎలా పెంచారు? అసలు సుభద్ర ఎవరు? ఖుషీతో ఆమెకున్న సంబంధం ఏంటి? ఖుషీని పెంచే క్రమంలో సుభద్ర - విక్రమ్‌ ఎలా దగ్గరయ్యారు? అప్పటికే పెళ్లి నిశ్చయమైన సుభద్ర.. విక్రమ్‌తో రిలేషన్‌కు ఒప్పుకుందా? లేదా? అన్నది కథ.
    7 . ఛాలెంజర్స్(మార్చి 26 , 2024)
    UA|డ్రామా,రొమాన్స్,క్రీడలు
    పాపులర్ టెన్నిస్ ప్లేయర్ తాషి (జెండాయా) కోచ్‍గా మారి తన భర్తను ఛాంపియన్‌గా తీర్చిదిద్దుతుంది. ఈ క్రమంలోనే ఆమె మాజీ లవర్‌, ఒకప్పటి బెస్టీ తాషి జీవితంలోకి వస్తారు. వారిద్దరి రాకతో తాషి లైఫ్‌ ఎలాంటి రొమాంటిక్‌ టర్న్‌ తీసుకుంది? అన్నది స్టోరీ.
    8 . ప్రేమ కథ(జనవరి 05 , 2024)
    UA|డ్రామా,రొమాన్స్
    ప్రేమ్, ఒక మధ్యతరగతి యువకుడు. తన స్నేహితుడికి కాబోయే భార్య స్నేహితురాలితో ప్రేమలో పడతాడు. మరి అతని ప్రేమ విజయవంతమవుతుందా? లేదా విషాదంగా ముగుస్తుందా? అనేది మిగిలిన కథ.
    9 . ఘుడ్చది(ఆగస్టు 09 , 2024)
    UA|హాస్యం,రొమాన్స్
    వీర్ శర్మ (సంజయ్ దత్) రిటైర్డ్ కర్నల్. భార్య చనిపోవడంతో కొడుకు చిరాగ్‌తో జీవిస్తుంటాడు. ఓ రోజు అతడికి మాజీ ప్రేయసి కనిపిస్తుంది. ఆమె భర్త కూడా చనిపోవడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అయితే అనూహ్యాంగా ఆమె కూతుర్ని వీర్ శర్మ కుమారుడు ప్రేమిస్తాడు. ఈ ట్విస్ట్ వారి జీవితాలను ఎలా తలకిందులు చేసింది? అన్నది స్టోరీ.
    10 . ఐ హేట్ యు(ఫిబ్రవరి 02 , 2024)
    UA|రొమాన్స్,థ్రిల్లర్
    ఇందు, సంధ్య బెస్ట్‌ ఫ్రెండ్స్‌. చదువు కోసం విదేశాలకు వెళ్లిన సంధ్య బాయ్‌ఫ్రెండ్‌తో స్వదేశానికి వస్తుంది. వారిద్దరు కలిసి ఉండటం ఇందుకు నచ్చదు. దీంతో వారిని విడగొట్టేందుకు ఇందు ఏం చేసింది? ఆమెకు ఉన్న సైకలాజికల్‌ సమస్య ఏంటి? అన్నది స్టోరీ.
    11 . రివైండ్(అక్టోబర్ 18 , 2024)
    UA|రొమాన్స్,సైన్స్ ఫిక్షన్,థ్రిల్లర్
    కార్తిక్(సాయి రోనక్) ఒక సాఫ్ట్ వేర్ డెవలప్పర్. ఆఫీసులో పనిచే శాంతిని ప్రేమిస్తాడు. ఆమె తాత కృష్ణమూర్తి టైమ్‌ మిషన్‌ కనిపెడతాడు. నాటకీయ పరిణామాల తర్వాత ఆ మిషన్‌ కార్తీక్‌కు లభిస్తుంది. అప్పుడు కార్తీక్ ఏం చేశాడు? టైమ్‌ ట్రావెల్‌ చేయాలని ఎందుకు అనుకున్నాడు? కాలంలో వెనక్కి వెళ్లాడా? ముందుకు వెళ్లాడా? అన్నది స్టోరీ.
    12 . డార్లింగ్(జూలై 19 , 2024)
    UA|హాస్యం,రొమాన్స్
    రాఘవ్‌ (ప్రియదర్శి) చిన్నప్పటి నుంచి పెళ్లి, హనీమూన్‌ అంటూ కలలు కంటాడు. భార్యను తీసుకొని హనీమూన్‌కు పారిస్‌ వెళ్లాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ‌అతడి లైఫ్‌లోకి మల్టిపుల్‌ స్ప్లిట్‌ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్న ఆనంది (నభా నటేష్‌) వస్తుంది. ఆమెతో రాఘవ్‌ ఎన్ని తిప్పలు పడ్డాడు? అన్నది కథ.
    13 . బూట్‌కట్ బాలరాజు(ఫిబ్రవరి 02 , 2024)
    UA|హాస్యం,రొమాన్స్
    ఊరిలో పనిపాట లేకుండా తిరిగే ఓ కుర్రాడు (బూట్‌కట్‌ బాలరాజు) ఊరి పెద్ద (ఇంద్రజ) కూతుర్ని ప్రేమిస్తాడు. అదే సమయంలో మరో యువతి కూడా అతడ్ని ప్రేమిస్తుంది. కొన్ని పరిణామాల నేపథ్యంలో హీరో సర్పంచ్‌ అభ్యర్థిగా ఊరిపెద్దపై పోటీకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? హీరో ప్రేమకథ సక్సెస్‌ అయ్యిందా? లేదా? అన్నది కథ.
    14 . ప్రేమ యుద్ధం(జనవరి 26 , 2024)
    UA|డ్రామా,రొమాన్స్
    ప్రేమ యుద్ధం చిత్రం తెలుగులో త్వరలో విడుదల కానున్న చిత్రం. ఈ సినిమా ఫ్యామిలీ డ్రామా కథాంశంతో రూపొందుతోంది. తగరం సిద్ధార్థ, రూపిక అపూర్వ సాగర్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
    15 . మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌ మహి(మే 31 , 2024)
    U|డ్రామా,రొమాన్స్,క్రీడలు
    మహేంద్ర గొప్ప క్రికెటర్‌ కావాలని కలలు కని అందులో విఫలమవుతాడు. డా. మహిమను అరేంజ్‌ మ్యారెజ్‌ చేసుకుంటాడు. అయితే మహిమకు కూడా తను క్రికెటర్‌ కావాలన్న డ్రీమ్‌ ఉంటుంది. ఆమెలోని నైపుణ్యాన్ని గుర్తించిన మహేంద్ర.. కోచ్‌గా మారి ఆమె కలలను సాకారం చేసేందుకు ప్రయత్నిస్తాడు.
    16 . ఫిర్ ఆయీ హస్సీన్ దిల్రుబా(ఆగస్టు 09 , 2024)
    UA|రొమాన్స్,థ్రిల్లర్
    రాణి కశ్యప్‌ (తాప్సీ), రిషు (విక్రాంత్‌) దంపతులు. ఇద్దరికి భిన్నమైన మనస్తత్వాలు ఉంటాయి. రిషు మెతక కావడంతో నీల్‌ అనే వ్యక్తి పట్ల రాణి ఆకర్షితురాలవుతుంది. ఓ రోజు ఇంట్లో అగ్నిప్రమాదం జరిగి రిషు చనిపోతాడు. రాణినే ప్రియుడితో కలిసి చంపిందన్న ఆరోపణలు వస్తాయి. కేసు విచారణలో తేలిన నిజాలేంటి? అన్నది స్టోరీ.
    17 . లవ్ మీ(మే 25 , 2024)
    UA|హారర్,రొమాన్స్,థ్రిల్లర్
    అర్జున్ (ఆశిష్), ప్రతాప్ (రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? దివ్యవతి ఎవరు? అన్నది కథ.
    18 . డర్టీ ఫెలో(మే 24 , 2024)
    UA|యాక్షన్,డ్రామా,రొమాన్స్
    మాఫియా డాన్‌ జేపీ, గ్యాంగ్‌స్టర్‌ శంకర్‌ స్నేహితులు. డాన్‌ కావాలన్న ఉద్దేశ్యంతో జేపీపై జరిపిన దాడిలో శంకర్‌ కొడుకు చనిపోతాడు. దీంతో నీ కొడుకు (డర్టీ ఫెలో)ను కూడా చంపేస్తానని శంకర్‌ జేపీకి వార్నింగ్‌ ఇస్తాడు. మరోవైపు అదే పోలికలతో ఉన్న సిద్ధు.. ఓ గ్రామంలో టీచర్‌గా చేస్తుంటాడు. మరి సిద్ధు - డర్టీ ఫెల్లో ఒక్కరేనా? శంకర్‌కు తెలిసిన షాకింగ్ న్యూస్ ఏంటి? అన్నది కథ.
    19 . డియర్(ఏప్రిల్ 12 , 2024)
    U|హాస్యం,ఫ్యామిలీ,రొమాన్స్
    అర్జున్‌ (జీవి ప్రకాష్‌) న్యూస్‌ రీడర్‌గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్‌ లైఫ్‌లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ.
    20 . ఉషా పరిణయం(ఆగస్టు 02 , 2024)
    UA|యాక్షన్,రొమాన్స్
    హనీ (శ్రీకమల్‌) పెళ్లి చూపుల్లో ఉషాను రిజెక్ట్‌ చేస్తాడు. అయితే అతడు జాయిన్ అయిన ఫ్యాషన్‌ కంపెనీలోనే ఉషా పనిచేస్తుంటుంది. క్రమంగా ఆమెను ఇష్టపడతాడు. అయితే ఉషాకు వేరొకరితో నిశ్చితార్థం జరుగుతుంది. అప్పుడు హనీ ఏం చేశాడు? ఉషా ప్రేమను పొందగలిగాడా? అన్నది స్టోరీ.
    21 . లవ్ మౌళి(జూన్ 07 , 2024)
    A|డ్రామా,రొమాన్స్
    ఆర్టిస్ట్ అయిన మౌళి.. తల్లిదండ్రులు విడిపోవడంతో చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరుగుతాడు. అతడికి ప్రేమపై నమ్మకం ఉండదు. ఈ క్రమంలో ఓ అఘోరా అతడికి మహిమ గల పెయింటింగ్‌ బ్రష్‌ ఇస్తాడు. దాని సాయంతో తనకు నచ్చిన లక్షణాలున్న యువతిని మౌళి సృష్టించుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.
    22 . యావరేజ్ స్టూడెంట్ నాని(ఆగస్టు 02 , 2024)
    A|హాస్యం,డ్రామా,రొమాన్స్
    నాని (పవన్ కుమార్) చదువుల్లో యావరేజ్ స్టూడెంట్. బీటెక్‌లో చేరి సీనియర్ అయిన సారా (స్నేహ)తో ప్రేమలో పడతాడు. మనస్పర్థలు రావడంతో నానికి సారా బ్రేకప్‌ చెబుతుంది. వారు విడిపోవడానికి కారణం ఏంటి? నాని లైఫ్‌లోకి వచ్చిన జూనియర్ ఎవరు? తండ్రి సంతోషం కోసం నాని తనని తాను ఎలా మార్చుకున్నాడు? అన్నది స్టోరీ.
    23 . లవ్ గురు(ఏప్రిల్ 12 , 2024)
    UA|హాస్యం,రొమాన్స్
    అరవింద్‌ (విజయ్ ఆంటోని)కు కొన్ని కారణాల వల్ల 35 ఏళ్లు వచ్చినా పెళ్లికి దూరంగా ఉంటాడు. ఓ రోజు బంధువుల అమ్మాయి లీలాని చూసి ప్రేమిస్తాడు. హీరోయిన్‌ కావాలని కలలు కంటున్న ఆమెను పెళ్లి కూడా చేసుకుంటాడు. పెళ్లి తర్వాత వారి జీవితాలు ఎలా మారాయి? లీలను హీరోయిన్‌ చేసేందుకు అరవింద్ ఎలాంటి రిస్క్ చేశాడు? అన్నది కథ.
    24 . మెకానిక్(ఫిబ్రవరి 02 , 2024)
    UA|డ్రామా,రొమాన్స్
    మెకానిక్ అయిన మణికి జీవితంలో ఉన్నత లక్ష్యాలు అంటూ ఏమి ఉండవు. అయితే సామాజిక కార్యకర్త అతని తాతకు ఎదొక రోజు అతను మంచిగా మారతారనే నమ్మకం ఉంటుంది. అయితే ఆ ఊరి పెద్ద మణి మార్గానికి అడ్డుతగిలినప్పుడు ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనేది మిగతా కథ.

    @2021 KTree