
అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 30 తెలుగు రొమాంటిక్ సినిమాలు
3k+ views1 year ago
అమెజాన్ ప్రైమ్‌లో 2013 నుంచి 2023 వరకు వచ్చిన రొమాంటిక్ చిత్రాల్లో ప్రేక్షకాదరణ పొందిన టాప్ 30 సినిమాలను TFIBD సేకటించడం జరిగింది. వీటిలో అర్జున్ రెడ్డి, సీతారామం, నిన్నుకోరి వంటి హిట్ చిత్రాలతో పాటు ఎన్నో ఉన్నాయి. మీ మనసుకు నచ్చిన మీకు ఆనందాన్ని పంచే చిత్రాన్ని ఎంచుకుని రొమాంటిక్ మోడ్‌ను ఆస్వాదించండి.

1 . రంగస్థలం(మార్చి 30 , 2018)
UA|డ్రామా,హిస్టరీ,రొమాన్స్
ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్) ఎలా రివేంజ్ తీర్చుకున్నాడన్నది కథ.

2 . అర్జున్ రెడ్డి(ఆగస్టు 25 , 2017)
A|యాక్షన్,డ్రామా,రొమాన్స్
అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు. ఇంతకు తన ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ.

3 . సీతా రామం(ఆగస్టు 05 , 2022)
U|రొమాన్స్
ఆర్మీ అధికారి రామ్ (దుల్కర్ సల్మాన్) ఓ అనాథ. ఆ విషయాన్ని రేడియోలో చెప్పినప్పటి నుంచి అతడికి ఉత్తరాలు వెల్లువెత్తుతాయి. పెద్ద కుటుంబం ఏర్పడుతుంది. ఓ అమ్మాయి మాత్రం నీ భార్య సీతామహాలక్ష్మి (మృణాల్ ఠాకూర్) అని సంబోధిస్తూ ఉత్తరాలు రాస్తుంటుంది. ఇంతకీ ఈ ఆమె ఎవరు? అనాథ అయిన రామ్‌కు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఆమెని కలుసుకునేందుకని వచ్చిన రామ్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అనేది కథ.

4 . ఫిదా(జూలై 21 , 2017)
U|హాస్యం,డ్రామా,రొమాన్స్
వరుణ్ అనే ఎన్ఆర్ఐ మెడికల్ స్టూడెంట్ తన అన్న పెళ్లి కోసం ఇండియా వచ్చి భానుమతి అనే తెలంగాణ యువతితో ప్రేమలో పడుతాడు. ఓ సంఘటన వల్ల భానుమతి వరుణ్‌ను అపార్థం చేసుకుంటుంది. మరి ఈ ఇద్దరు తిరిగి కలుసుకుంటారా? లేదా? అన్నది కథ

5 . మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు(ఫిబ్రవరి 06 , 2015)
U|డ్రామా,రొమాన్స్
రాజారాం (శర్వానంద్) నేషనల్ లెవల్ రన్నింగ్ కాంపిటీషన్‌లో గోల్డ్ మెడల్ గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉంటాడు. అదే టైములో ముస్లిం అమ్మాయి అయిన నజీర(నిత్యా మీనన్) కళ్ళు చూసి ప్రేమలో పడతాడు. అనుకోని కారణం చేత వారిద్దరు విడిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? తిరిగి వారు కలిశారా లేదా? అన్నది స్టోరీ.

6 . నిన్ను కోరి(జూలై 07 , 2017)
U|డ్రామా,రొమాన్స్
పల్లవి తన మాజీ బాయ్‌ఫ్రెండ్ ఉమను తన భర్తతో కలిసి తన ఇంట్లో ఉండమని ఆహ్వానిస్తుంది. పల్లవిని తిరిగి పెళ్లి చేసుకోవాలనే ఆశతో ఉమ వారి కాపురంలో కలహాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తాడు.
.jpeg)
7 . లవ్ స్టోరీ(సెప్టెంబర్ 24 , 2021)
UA|డ్రామా,రొమాన్స్
రేవంత్(నాగ చైతన్య) జుంబా సెంటర్ నడుపుతుంటాడు. మౌనిక (సాయి పల్లవి) జుంబా సెంటర్‌లో డ్యాన్సర్‌గా చేరుతుంది. అయితే వారి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? కలిసి బతికేందుకు వారు ఎలాంటి సాహసం చేశారు? అనేది కథ.

8 . సప్తగిరి ఎక్స్‌ప్రెస్(డిసెంబర్ 23 , 2016)
UA|హాస్యం,రొమాన్స్
కానిస్టేబుల్ అయిన హీరో.. ఇండస్ట్రీలో స్టార్ హీరో కావాలని కలలు కంటాడు. దానిని నెరవేర్చుకునే క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అన్నది కథ.
.jpeg)
9 . రాజా రాణి(సెప్టెంబర్ 27 , 2013)
U|డ్రామా,రొమాన్స్
ఒకరినొకరు ఇష్టపడని జాన్, రెజీనా బలవంతంగా పెళ్లి చేసుకుని కష్టతరమైన జీవితాన్ని గడపవలసి వస్తుంది. అయితే గతంలో వీరిద్దరికి బాధకరమైన లవ్ స్టోరీలు ఉంటాయి. ఆ ప్రేమకథలు ఏంటి? చివరికి జాన్-రెజినా కలిశారా లేదా? అన్నది కథ.
.jpeg)
10 . మహర్షి(మే 09 , 2019)
UA|యాక్షన్,రొమాన్స్
మహర్షి అనేది వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 2019 భారతీయ తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం మరియు దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ మరియు PVP సినిమా నిర్మించాయి. ఇందులో మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 9 మే 2019న విడుదలైంది.

11 . డియర్ కామ్రేడ్(జూలై 26 , 2019)
UA|యాక్షన్,డ్రామా,రొమాన్స్
స్టూడెంట్ లీడర్ అయిన బాబీ(విజయ్ దేవరకొండ).. స్టేట్ లెవల్ క్రికెటర్ అయిన లిల్లీతో ప్రేమలో పడుతాడు. అతని దుడుకు స్వభావం వల్ల లిల్లీ అతనికి దూరం అవుతుంది. ఈ క్రమంలో లిల్లీ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. లిల్లీ సమస్యను బాబీ ఏవిధంగా పరిష్కరించి తిరిగి ఆమెకు ఎలా దగ్గరయ్యాడు అనేది కథ.
.jpeg)
12 . మళ్ళి పెళ్లి(మే 26 , 2023)
UA|రొమాన్స్,డ్రామా
నటుడు నరేష్ నిజ జీవితంలోని కాంట్రవర్సీలే సినిమా స్టోరీ. నరేష్, పవిత్రల మధ్య ఉన్న రిలేషన్ ఎక్కడి నుంచి మొదలైంది? నరేష్, తన మూడో భార్య రమ్య రఘుపతికి మధ్య మనస్పర్థలు ఎక్కడ వచ్చాయి నరేష్-పవిత్ర ఓ హోటల్‌లో దొరకడం, అది మీడియాలో రావడం వంటి నిజ జీవితంలో జరిగిన సన్నివేశాలు కూడా కథలో ఇమిడి ఉన్నాయి. నరేష్ జీవితంలోని జరిగిన వివాదాల సమాహారమే ఈ సినిమా కథ.

13 . పద్మావత్(జనవరి 25 , 2018)
UA|యాక్షన్,రొమాన్స్
మేవార్ రాజపుత్ మహారాజు రావల్ రతన్ సింగ్, సింహళ యువరాణి అత్యంత సౌందర్యవతి పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమె కూడా అతన్ని ప్రాణంగా ప్రేమిస్తుంది. వారి జీవితం అన్యోన్యంగా సాగుతుండగా.. ఢిల్లీ సుల్తాన్ ఖిల్జీ దురహంకారంతో పద్మావతిపై మనసుపడతాడు. ఆమెను దక్కించుకోవాలనే తపనతో రావల్ రతన్ సింగ్ చిత్తూర్ కోటపై తన సైన్యంతో యుద్దానికి బయలుదేరతాడు. అలా బయలుదేరిన అల్లాఉద్దీన్ ఖిల్జీ రావల్ రతన్ సింగ్‌తో యుద్ధం చేశాడా? రావల్ రతన్ సింగ్ అతన్ని ఎలా ఎదుర్కున్నాడు? అన్నది మిగతా కథ.
.jpeg)
14 . సమ్మోహనం(జూన్ 15 , 2018)
U|డ్రామా,రొమాన్స్
విజ్జు (సుధీర్‌బాబు) ఇంట్లో సినిమా షూటింగ్ జరుగుతుంది. అందులో హీరోయిన్‌గా నటించే సమీరా (అదితిరావు హైదరీ)ను విజ్జు ప్రేమిస్తాడు. ఈ విషయం ఆమెకు చెప్పగా తిరస్కరిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సమీరా, విజ్జు తిరిగి ఎలా ఒక్కటయ్యారు? అన్నది కథ.
.jpeg)
15 . చిత్రలహరి(ఏప్రిల్ 12 , 2019)
U|డ్రామా,రొమాన్స్
వ్యక్తిగత, వృత్తి జీవితంలో నిరంతం వైఫల్యమవుతున్న విజయ్.. తనను తాను నిరూపించుకునే అవకాశం కోసం వెతుకుతుంటాడు. కానీ ఎవరూ అతనికి అవకాశం ఇవ్వరు. అయితే స్వేచ్ఛ అనే యువతి అతనికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది.
.jpeg)
16 . జాను(ఫిబ్రవరి 07 , 2020)
U|డ్రామా,రొమాన్స్
రామ్‌కు జాను అంటే ఎంతో ప్రేమ. ఆమెను హైస్కూల్ లైఫ్‌లో ప్రేమిస్తాడు. కానీ ఎప్పుడూ ప్రపోజ్ చేయడు. విధి వారిని దూరం చేస్తుంది. అయితే దాదాపు 20 ఏళ్ల తర్వాత స్కూలు రీయూనియన్ ఫంక్షన్‌లో వాళ్లిద్దరు కలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
.jpeg)
17 . బెంగాల్ టైగర్(డిసెంబర్ 10 , 2015)
UA|యాక్షన్,రొమాన్స్
ఆకాశ్(రవి తేజ) తనను ఇష్టపడే మహిళను ఇంప్రెస్ చేయడానికి సెలబ్రెటీగా మారాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతను రాజకీయ నాయకుడిని రాయితో కొట్టి అతని దగ్గరే పనిచేస్తాడు. అయితే మొదట ఫేమస్ కావాలని ఇదంతా చేసినా... అతని లక్ష్యం వేరుగా ఉంటుంది. ఇంతకు ఆకాశ్ లక్ష్యం ఏమిటి? అన్నది మిగతా కథ.

18 . ఓ పిట్ట కథ(మార్చి 06 , 2020)
U|రొమాన్స్,థ్రిల్లర్
ఇద్దరి యువకుల ప్రేమ తగాదాతో ఓ యువతి ప్రాణాపాయం ఎదుర్కొంటుంది. వారిలో నిజమైన ప్రేమ ఎవరిదో తెలుసుకుని అతనికి దగ్గరవుతుంది.

19 . గౌతమ్ నంద(జూలై 28 , 2017)
UA|యాక్షన్,డ్రామా,రొమాన్స్
మల్టీ బిలియనీర్ కొడుకైన గౌతమ్, ఓ కంపెనీలో ఉద్యోగి అయిన నందాతో జీవితాన్ని మార్చుకోవడం ద్వారా తన ఆస్తిని విడిచిపెట్టి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు.

20 . ఉత్తమ విలన్(మే 02 , 2015)
U|డ్రామా,రొమాన్స్
మనోరంజన్ (కమల్ హాసన్) ఓ సూపర్ స్టార్. బ్రెయిన్ ట్యూమర్ వల్ల తాను ఎక్కువ కాలం బతకనన్న విషయం మనోకి తెలుస్తుంది. ఆఖరి కోరికగా తన గురువుతో కలిసి ఓ సినిమా తీయాలని నిర్ణయించుకుంటాడు. మృత్యువుకు దగ్గరయ్యే క్రమంలో మనో జీవితంలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అన్నది కథ.

21 . పడి పడి లేచె మనసు(డిసెంబర్ 21 , 2018)
U|డ్రామా,రొమాన్స్
సూర్య (శర్వానంద్) వైశాలి (సాయి పల్లవి)ని ఇష్టపడతాడు. ఆమె కూడా అతడ్ని ప్రేమిస్తుంది. అయితే పెళ్లికి మాత్రం సూర్య నిరాకరిస్తాడు. దీంతో వైశాలి అతడితో విడిపోతుంది. సూర్య ఎందుకు నో చెప్పాడు? చివరికీ వారు ఎలా కలిశారు? అన్నది కథ.

22 . వి ఐ పీ 2(ఆగస్టు 25 , 2017)
U|యాక్షన్,డ్రామా,రొమాన్స్
నైపుణ్యం ఉండి ఉద్యోగం లేని ఇంజనీర్ రఘువరన్ తనను తాను నిరూపించుకుంటూ.. కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగు పెడతాడు. అక్కడ ఉద్యోగ పరంగాను, వ్యక్తిగతంగాను అనేక సవాళ్లు ఎదుర్కొంటాడు.

23 . రౌడీ ఫెలో(నవంబర్ 21 , 2014)
UA|యాక్షన్,రొమాన్స్
అమెరికా నుంచి వచ్చిన హీరోకు ఈగో ఎక్కువ. ఓ రోజు హీరో ఈగోను పోలీసు అధికారి ఒకరు హర్ట్ చేస్తాడు. అతనిపై కోపంతో హీరో పోలీసుగా మారతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.

24 . జయ జానకి నాయక(ఆగస్టు 11 , 2017)
UA|యాక్షన్,డ్రామా,రొమాన్స్
గగన్, స్వీటీ ఇద్దరు ప్రేమించుకుంటారు. కానీ ఆమె తండ్రి గగన్‌ను అంగీకరించకపోవడంతో విడిపోవాల్సి వస్తుంది. ఒక రోజు దుండగుల నుంచి ఒక కుటుంబాన్ని రక్షించే సమయంలో, గగన్ తనకు తెలియకుండా స్వీటీని రక్షిస్తాడు.

25 . నిను వీడని నీడను నేనే(జూలై 12 , 2019)
UA|రొమాన్స్,థ్రిల్లర్
రిషి, దియా కొత్తగా పెళ్ళైన జంట. ఓ రోజు వారు ప్రయాణిస్తున్న కారు స్మశానం వద్ద ప్రమాదానికి గురవుతుంది. అప్పటి నుంచి వారి జీవితం తలకిందులవుతుంది.
.jpeg)
26 . హార్ట్ ఎటాక్(జనవరి 31 , 2014)
A|యాక్షన్,రొమాన్స్
స్పెయిన్‌లో హీరో, హీరోయిన్లు ప్రేమలో పడతారు. కానీ హీరోకి పెళ్లి అంటే ఇష్టం ఉండదు. దీంతో హీరోయిన్ గోవా వెళ్లిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ప్రేమను రియలైజ్ అయిన హీరో ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.

27 . చూసి చూడంగానే(జనవరి 31 , 2020)
UA|హాస్యం,డ్రామా,రొమాన్స్
శివ తన తల్లి కారణంగా తనకు నచ్చినట్లు ఉండలేక ఇబ్బంది పడుతుంటాడు. ఇష్టం లేకుండానే బీటెక్ చదువుతాడు. అక్కడ ఐశ్వర్య అనే అమ్మాయితో ప్రేమలో పడుతాడు. కానీ ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మరో అమ్మాయి పరిచయంతో శివ లైఫ్ టర్న్ అవుతుంది.

28 . రాజా వారు రాణి గారు(నవంబర్ 29 , 2019)
UA|డ్రామా,రొమాన్స్
రాజా అనే యువకుడు రాణితో ప్రేమలో పడతాడు. రాణి ఎక్కడ తన ప్రేమ కాదంటుందేమోనన్న భయంతో ప్రేమ విషయం ఆమెకు చెప్పడు. దీంతో రాజా స్నేహితులు అతనికి సాయం చేస్తారు. ఇంతకు తన ప్రేమ విషయం రాణికి చెప్పాడా లేదా అనేది కథ

29 . కిర్రాక్ పార్టీ(మార్చి 16 , 2018)
UA|హాస్యం,రొమాన్స్
కృష్ణ(నిఖిల్) అనే ఇంజినీరింగ్ విద్యార్థి తన స్నేహితుల బృందంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అతను తన సీనియర్ మీరా(సిమ్రాన్)తో ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో.. ఒక విషాద సంఘటన కృష్ణ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ ఏం చేశాడన్నది మిగతా కథ

30 . మహానుభావుడు(సెప్టెంబర్ 29 , 2017)
UA|హాస్యం,రొమాన్స్
శర్వానంద్ అతి శుభ్రత వ్యాధిని కలిగి(OCD) ఉంటాడు. ఈక్రమంలో హీరోయిన్ మెహ్రీన్‌ను ప్రేమిస్తాడు. కానీ ఆ శుభ్రతే అతని ప్రేమకు అడ్డంకిగా మారుతుంది. ఇంతకు తన ప్రేమను గెలుచుకున్నాడ? లేదా? అన్నది మిగతా కథ.