తెలుగులో టాప్ 25 హరర్ సినిమాలు
3k+ views1 year ago
తెలుగులో 2000 నుంచి 2023 వరకు వచ్చిన హరర్ చిత్రాల్లో ప్రేక్షకులను అమితంగా భయపెట్టిన టాప్ 25 చిత్రాలను TFIBD సేకరించడం జరిగింది. వీటిలో మసూద, ప్రేమకథా చిత్రమ్, భాగమతి, అరుందతి వంటి చిత్రాలు ఉన్నాయి. హరర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమాలు బాగా నచ్చుతాయి.
1 . అరుంధతి(జనవరి 16 , 2009)
A|హారర్,థ్రిల్లర్
చాలా ఎళ్ల తర్వాత తన సొంత ఊరికి వెళ్లిన సమయంలో అరుందతి... తాను తన తాతమ్మ జేజమ్మలాగా ఉన్నానని తెలుసుకుంటుంది. ఈక్రమంలో తనను తన కుటుంబాన్ని నాశనం చేయాలనుకునే ఓ ప్రేతాత్మతో పోరాడుతుంది.
2 . మసూదా(నవంబర్ 18 , 2022)
A|హారర్
నాజియా (భాంధవి శ్రీధర్) ఆమె తల్లి నీలం (సంగీత) ఇద్దరు కలిసి జీవిస్తుంటారు. వీరు గోపీ కృష్ణ (తిరువీర్) సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. అయితే నాజియా విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది. ఆమె ప్రవర్తన నీలం, గోపిలను షాక్‌కు గురిచేస్తుంది. ఆమెను భూతవైద్యుల దగ్గరికి తీసుకెళ్తారు. మరి నాజియా కోలుకుందా? ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తోంది? అనేది మిగతా కథ.
3 . రాజు గారి గది(అక్టోబర్ 16 , 2015)
UA|హారర్
గుప్త నిధిని కనిపెట్టే లక్ష్యంతో ఏడుగురు వ్యక్తులతో కూడిన బృందం.. రాజు గారి గది అనే భూత్ బంగ్లాలోకి ప్రవేశిస్తారు. అక్కడ వారికి భయానక అనుభవాలు, వింతలు ఎదురవుతాయి.
4 . కాంచన(జూలై 15 , 2011)
UA|హారర్,థ్రిల్లర్
మూడు ఆత్మలు రాఘవ ఒంట్లోకి ప్రవేశిస్తాయి. దీంతో అతడు విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. ఇంతకి ఆ ఆత్మలు ఎవరివి? వాటి బారి నుంచి రాఘవ ఎలా బయటపడ్డాడు? అన్నది కథ.
5 . గంగ(ఏప్రిల్ 17 , 2015)
UA|హాస్యం,హారర్,థ్రిల్లర్
రాఘవ గ్రీన్ టీవీలో కెమెరామెన్‌గా పనిచేస్తుంటాడు. అదే చానల్‌లో నందినిని ప్రేమిస్తాడు. వారి టీవి ఛానెల్‌ను ఫస్ట్ ప్లేస్‌కి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో దెయ్యాల మీద ఓ ప్రోగ్రాం తీద్దాం అని భీమిలి బీచ్‌లోని ఓ పాడుబడ్డ బంగాళాలోకి వెళతారు. అక్కడ ఉన్న బీచ్‌లో నందినికి ఒక తాళి బొట్టు దొరుకుతుంది. ఆ తాళిబొట్టు దొరికిన రోజు నుంచీ నందిని లైఫ్‌లో భయానక సంఘటనలు జరుగుతుంటాయి.
6 . పదమూడు(మార్చి 06 , 2009)
A|హారర్,థ్రిల్లర్
మనోహర్ ఫ్యామిలీ 13B ఫ్లాట్‌లోకి వస్తుంది. అప్పటి నుంచి వారికి విచిత్రమైన ఘటనలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా టీవీలో ఓ సీరియల్‌లో వచ్చే సన్నివేశాలు మనోహర్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇంతకీ ఏమిటా సీరియల్? దానికి మనోహర్‌కి ఉన్న సంబంధం ఏంటి? అన్నది కథ.
7 . అవును(సెప్టెంబర్ 21 , 2012)
UA|డ్రామా,హారర్
కొత్తగా పెళ్లయిన హర్ష - మోహిని జంట ఓ ఇంట్లో దిగుతారు. అప్పటి నుంచి మోహినికి విచిత్ర పరిస్థితులు ఎదురవుతాయి. ఓ దయ్యం ఆమె తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇంతకి ఆ ఆత్మ ఎవరిది? దాని బారి నుంచి మోహిని ఎలా తప్పించుకుంది? అన్నది కథ.
8 . చంద్రముఖి (ఏప్రిల్ 14 , 2005)
UA|హారర్
ఒక ఎన్నారై, అతడి భార్య దయ్యాల హెచ్చరికలను పట్టించుకోకుండా తమ పూర్వికుల బంగ్లాలో ఉండాలని నిర్ణయించుకుంటారు. ఇంట్లో దిగగానే వారికి విచిత్రమై పరిస్థితులు ఎదురవుతాయి. మానసిక వైద్యుడైన హీరో ఇంట్లో పరిస్థితులను చక్కదిద్దేందుకు యత్నిస్తాడు.
9 . విరూపాక్ష(ఏప్రిల్ 21 , 2023)
A|థ్రిల్లర్,హారర్,మిస్టరీ,యాక్షన్
రుద్రవరం అనే ఊరిలో అనుమానాస్పదంగా చాలామంది దారుణంగా చనిపోతుంటారు. ఈ మరణాల చేతబడి వల్ల జరుగుతున్నయా? లేదా ఎవరైనా హత్య చేస్తున్నారా? అనే విషయాన్ని కనుక్కునేందుకు హీరో సాయిధరమ్ తేజ్ ఏం చేశాడు? నందినీ పాత్ర ఏంటీ? ఆ డెత్ మిస్టరీ వెనుక అసలు ఎవరున్నారు? అనేది కథ.
10 . డెమోంటే కాలనీ(మే 22 , 2015)
UA|హారర్,థ్రిల్లర్
నలుగురు స్నేహితులు సాహసోపేతంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటారు. ఇందుకోసం దయ్యాల బంగ్లాలోకి వెళ్తారు. ఫ్రెండ్స్‌లోని ఒకరు బంగ్లాలోని డైమండ్ నెక్లెస్‌ను తమతో పాటు రూమ్‌కు తీసుకొస్తాడు. అప్పటి నుంచి వారికి విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.
11 . రాజు గారి గది 2(అక్టోబర్ 13 , 2017)
UA|హారర్
రుద్ర ఓ దెయ్యాల రిసార్ట్‌లో భూతల సమస్యను పరిష్కరించేందుకు వస్తాడు. అక్కడ కొన్ని షాకింగ్ నిజాలు తెలుసుకుంటాడు. అతనికి న్యాయం కోసం పోరాడుతున్న ఓ ఆత్మతో పరిచయం ఏర్పడుతుంది.
12 . వైశాలి(సెప్టెంబర్ 11 , 2009)
UA|హారర్,మిస్టరీ
వైశాలి పెళ్లైన మహిళ. ఓ అపార్ట్‌మెంట్లో తన భర్తతో జీవిస్తున్న క్రమంలో హత్యకు గురవుతుంది. బాత్‌రూంలో టబ్‌లో మునిగిపోయి ఉంటుంది. ఈ కేసను పోలీస్ ఆఫీసర్ వాసు దర్యాప్తు చేస్తాడు. వాసు దర్యాప్తులో ఆమెది ఆత్యహత్యకాదని హత్య అని తెలుసుకుంటాడు. ఇంతకు ఆమెను ఎవరు హత్య చేశారు. ఆత్మగా మారిన వైశాలి ఏం చేసింది అనేది కథ.
13 . ప్రేమ కథా చిత్రమ్(జూన్ 07 , 2013)
UA|డ్రామా,హారర్
నలుగురు యువకులు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అంతా కలిసి ఓ గెస్ట్ హౌస్‌కు వెళ్తారు. కానీ ఆ ఇంట్లో వారి ప్లాన్లన్నీంటిని కొన్ని సంఘటనలు అడ్డుకుంటాయి. ఎంటా సంఘటనలు? ఇంతకు వారు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనకున్నారన్నది మిగతా కథ.
14 . మా ఊరి పొలిమేర 2(నవంబర్ 03 , 2023)
UA|క్రైమ్,హారర్,థ్రిల్లర్
ఊరిలో చెతబడులు చేస్తూ చనిపోయాడని భ్రమ పడిన కొమురయ్య(సత్యం రాజేష్) తన తొలి ప్రేయసి కవితతో కేరళకు పారిపోతాడు. మరోవైపు జంగయ్య (బాలాదిత్య) తన సోదరుడు కొమురయ్య కోసం వెతుకులాటలో ఉంటాడు. ఇంతలో కొత్త ఎస్‌ఐ రవీంద్ర నాయక్ (రాకేందు మౌళి) ఆ గ్రామం చుట్టూ ఉన్న రహస్యాలను ఛేదించడానికి జాస్తిపల్లికి వస్తాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? గ్రామంలోని పాడుబడిన ఆలయంలోకి ప్రవేశించాలని పురావస్తు శాఖ ఎందుకు ప్రయత్నిస్తుంటుంది? అసలు గ్రామంలో వరుస మరణాలకు కొమురయ్య ఎందుకు కారణం అయ్యాడు? ఇంతకీ ఆ గుడిలో ఏముంది? జంగయ్య తన సోదరుడిని గుర్తించాడా ? లేదా? చివరికి ఏం జరిగింది ? అనేది మిగిలిన కథ
15 . భాగమతి(జనవరి 26 , 2018)
UA|హారర్,థ్రిల్లర్
మంత్రి ఈశ్వర్ ప్రసాద్ (జయరామ్)పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సీబీఐ ఆఫీసర్ వైష్ణవి (ఆశా శరత్) రంగంలోకి దిగుతుంది. గతంలో ఆయనకు సెక్రటరీగా ఉండి జైలు శిక్ష అనుభవిస్తున్న చంచల (అనుష్క)ను విచారణ నిమిత్తం భాగమతి బంగ్లాకు తీసుకెళ్తుంది. అయితే అది దెయ్యాల బంగ్లా. చంచల ఆ బంగ్లాకు వెళ్లినప్పటి నుంచి విచిత్రంగా ప్రవర్తించడం మెుదలుపెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
16 . దెయ్యం(ఏప్రిల్ 16 , 2021)
UA|హారర్,థ్రిల్లర్
శంకర్ (రాజశేఖర్) కూతురు విజ్జీ (స్వాతి దీక్షిత్) రాత్రిళ్లు నడవడం, గట్టిగా అరవడం చేస్తుంటుంది. తాను సైకో కిల్లర్ గురునని ఊర్లో జరిగే హత్యలకు తానే కారణమని విజ్జీ చెప్పడంతో అందరూ షాకవుతారు. నిజంగా విజ్జీ హత్యలు చేసిందా? సైకో కిల్లర్ గురుకీ, ఆమెకు సంబంధం ఏంటి? అన్నది కథ.
17 . పిజ్జా(అక్టోబర్ 19 , 2012)
UA|హారర్,థ్రిల్లర్
మైఖేల్ (విజయ్ సేతుపతి) పిజ్జా డెలివరీ బాయ్. ఓ సారి పిజ్జా డెలివరీ చేయడానికి ఓ ఇంటికి వెళ్లిన మైఖేల్ భయానక పరిస్థితులు ఎదుర్కొంటాడు. అదే సమయంలో అతడి ప్రేయసి అను కూడా మిస్ అవుతుంది. అప్పుడు మైఖేల్ ఏం చేశాడు? అన్నది కథ.
18 . జాంబీ రెడ్డి(ఫిబ్రవరి 05 , 2021)
UA|హాస్యం,హారర్
మారియో (తేజ సజ్జా) ఓ గేమ్ డిజైనర్. స్నేహితుడు కల్యాణ్ (హేమంత్) పెళ్లికి తన గ్యాంగ్‌తో రుద్రవరానికి వెళ్తాడు. అక్కడకు వెళ్లిన వారికి అనూహ్య పరిణాణం ఎదురవుతుంది. ఫ్రెండ్స్‌లోని కిరీటీ జాంబీలాగా మారిపోతాడు. అతడు ఎందుకు అలా అయ్యాడు? ఊరు మెుత్తం జాంబీల్లాగా మారడానికి కారణం ఏంటి? వారిని కాపాడేందుకు హీరో ఏం చేశాడు? అన్నది కథ.
19 . రాజు గారి గది 3(అక్టోబర్ 18 , 2019)
UA|హాస్యం,హారర్
అశ్విన్, మాయ ఇద్దరు ప్రేమించుకుంటారు. కానీ వారి ప్రేమకు ఒక ప్రేతాత్మ అడ్డుపడుతోందని తెలుసుకుంటారు. తమ జీవితాన్ని సాధారణ స్థితికి తెచ్చుకోవాలని నిశ్చయించుకున్న అశ్విన్ ఏం చేశాడు అనేది కథ
20 . ఇట్(సెప్టెంబర్ 05 , 2017)
A|హారర్,మిస్టరీ
ఆకారాన్ని మార్చే మాయగాడు పెన్నీవైస్ మళ్లీ కనిపించినప్పుడు ఏడుగురు అమాయకులైన పిల్లలు పీడకలలు కంటారు. పిల్లలకు ఆహారం ఇచ్చే నెపంతో వారిని పెన్నీవైస్ ఘోరంగా హింసిస్తాడు. మరి ఆ పిల్లలు అతని బారి నుంచి బయటపడ్డారా? లేదా? అన్నది మిగాత కథ.
21 . మంత్ర(డిసెంబర్ 14 , 2007)
UA|డ్రామా,హారర్,థ్రిల్లర్
ఒక ప్రొఫెసర్ తన పూర్వీకుల ఆస్తిని కొనాలంటే అక్కడ ఉండాలనే షరతు విధిస్తాడు. ఒక స్థానిక గూండా తొందర లాభం పొందాలనే తపనతో ఇంట్లో మూడు నెలలు గడుపుతాడు.
22 . అమ్మో బొమ్మ(మే 04 , 2001)
U|హాస్యం,హారర్
రాంబాబు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్. అతనికి వివిధ రకాల బొమ్మలను సేకరించడం అంటే ఇష్టం. ఈ క్రమంలో ఓ కొత్త బొమ్మను సేకరించగా అందులోకి దెయ్యం ప్రవేశించడంతో ఇబ్బందుల్లో పడుతాడు.
23 . చంద్రకళ(సెప్టెంబర్ 19 , 2014)
UA|హాస్యం,హారర్
ఒక కుటుంబం వారి పూర్వీకుల రాజభవనాన్ని విక్రయించడానికి స్వగ్రామానికి తిరిగి వస్తుంది. అయితే ఆ రాజభవనంలో వారికి చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. కుటుంబ బంధువు అయన రవి నిజాన్ని వెలికి తీయాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం ఏం చేశాడు? అన్నది స్టోరీ.
24 . ముని (మార్చి 09 , 2007)
U|హారర్
గణేష్ (లారెన్స్) బ్యాంక్ మేనేజర్. ఓ ఎమ్మెల్యేకి చెందిన ఇంట్లో భార్య, తల్లిదండ్రులతో కలిసి అద్దెకు దిగుతాడు. అయితే ఆ ఇంట్లోనే ముని అనే వ్యక్తిని ఎమ్మెల్యే పెట్రోల్ పోసి హత్య చేస్తాడు. దీంతో ఆ ఇంట్లోనే ఉన్న ముని ఆత్మ గణేష్‌ను ఆవహిస్తుంది. ఇంతకి ముని ఎవరు? అతడ్ని ఎందుకు చంపారు? గణేష్ శరీరం ద్వారా ముని ఎలా పగ తీర్చుకున్నాడు? అన్నది స్టోరీ.
25 . చారులత(సెప్టెంబర్ 20 , 2012)
UA|హారర్,థ్రిల్లర్
చారు, లత శరీర భాగాలు అతుక్కొని పుట్టిన కవల సోదరిమణులు. వారిద్దరు రవిని ప్రేమిస్తారు. అయితే రవి చారును ప్రేమిస్తాడు. ఈ క్రమంలో కవల సోదరిలో ఒకరు చనిపోతారు. ఆమె ఎందుకు చనిపోయింది. దయ్యంగా మారి ఏం చేసింది? అన్నది కథ.