నెట్‌ఫ్లిక్స్‌లో కడుపుబ్బ నవ్వించే టాప్ 20 తెలుగు కామెడీ చిత్రాలు
2k+ views1 year ago
నెట్‌ఫ్లిక్స్‌లో 2018-2023 వరకు వచ్చిన కామెడీ చిత్రాల్లో బెస్ట్ స్ట్రీమింగ్ రేటింగ్ ఉన్న టాప్ 20 చిత్రాలను YouSay TFIDB సేకరించింది. వీటిలో హుషారు అంటే సుందరానికీ, ఓ బేబీ వంటి హిట్ చిత్రాలతో పాట బెస్ట్ కామెడీ మూవీల లిస్ట్ ఉంది. వీటిలో మీ మనసుకు హాయినిచ్చే కామెడీ చిత్రాన్ని చూసి ఆనందించండి.
1 . మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(అక్టోబర్ 15 , 2021)
UA|హాస్యం,రొమాన్స్
హర్ష (అఖిల్) ఎంతో మంది పెళ్లి కూతర్లని చూస్తాడు. అందులో ఒకరైన విభ (పూజా హెగ్డే) హర్షకు బాగా నచ్చుతుంది. కానీ విభ రిజెక్ట్ చేస్తుంది. దానికి కారణం ఏమిటి? హర్ష ఆమెను పెళ్లికి ఎలా ఒప్పించాడు? ఈ క్రమంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది కథ.
2 . ఖుషి(సెప్టెంబర్ 01 , 2023)
UA|రొమాన్స్,డ్రామా,హాస్యం
సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆరాధ్య (సమంత)ను క్రిస్టియన్ అబ్బాయి విప్లవ్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు ఆమె తండ్రి చంద్రరంగం (మురళీశర్మ) ఒప్పుకోడు. ఈ పెళ్లికి విప్లవ్ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించరు. దీంతో పెద్దలను ఎదిరించి మరీ విప్లవ్, ఆరాధ్య ఒక్కటవుతారు. అంతా సాఫీగా సాగిపోతుందని అనుకున్న సమయంలో విప్లవ్, ఆరాధ్యల మధ్య కొత్త సమస్యలు వస్తాయి. అసలు విప్లవ్, ఆరాధ్యలకు వచ్చిన సమస్యేంటి? దాని నుంచి వారు ఎలా బయటపడ్డారు? అన్నది మిగిలిన కథ.
3 . అంటే సుందరానికి!(జూన్ 10 , 2022)
UA|హాస్యం
బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ.
4 . మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(సెప్టెంబర్ 07 , 2023)
UA|హాస్యం,రొమాన్స్
మాస్టర్ చెఫ్ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ.
5 . మ్యాడ్(అక్టోబర్ 06 , 2023)
UA|హాస్యం,డ్రామా
మనోజ్(రామ్ నితిన్), అశోక్ (నార్నె నితిన్), దామోదర్(సంగీత్ శోభన్) మంచి స్నేహితులు. రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల(RIE)లలో చదువుతుంటారు. ఇక మనోజ్.. శృతి(గౌరి)ని ప్రేమిస్తుంటాడు. జెన్నీ(అనంతిక) అశోక్‌ను ఇష్టపడుతుంటుంది. దామోదర్ (డీడీ)కు గుర్తుతెలియని అమ్మాయి ప్రేమ లేఖలు రాయడంతో అతడు ఆమె ప్రేమలో పడతాడు. ఇలా వెన్నెల అనే అమ్మాయిని చూడకుండానే నాలుగేళ్లు గడిపేస్తాడు డీడీ. ఇంతకీ వెన్నెల ఎవరు?. ఆమెను వెతికే క్రమంలో డీడీకి తెలిసిన నిజం ఏంటీ? మనోజ్, అశోక్, దామోదర్ తమ ప్రేమను గెలిపించుకున్నారా? అనేది మిగతా కథ.
6 . ధమాకా(డిసెంబర్ 23 , 2022)
UA|యాక్షన్,హాస్యం
ధమాకా చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒకరు ధనవంతుడు, మరొకరు మధ్యతరగతి వ్యక్తి. ధనవంతుడు రవితేజ ఆస్తిని లాక్కోవడానికి జయరామ్ ప్రయత్నిస్తాడు. రవితేజ తన ఆస్తిని, కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది మిగతా కథ.
7 . భీష్మ(ఫిబ్రవరి 21 , 2020)
U|హాస్యం,డ్రామా,రొమాన్స్
భీష్మ ఆర్గానిక్స్ కంపెనీ ఉద్యోగి అయిన చైత్ర(రష్మిక)ను భీష్మ(నితిన్) ప్రేమిస్తాడు. ఆమెను ప్రేమించే క్రమంలో సేంద్రీయ వ్యవసాయంపై ఇష్టం పెంచుకుంటాడు. ఇదే సమయంలో భీష్మ ఆర్గానిక్స్‌కు ఓ సమస్య వచ్చిపడుతుంది. ఆ కంపెనీతో ఏ సంబంధం లేని భీష్మ ఎలా పరిష్కరించాడు అనేది కథ.
8 . టిల్లు స్క్వేర్(మార్చి 29 , 2024)
UA|హాస్యం,రొమాన్స్
రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్ వెర్షన్ లిల్లీ జోసెఫ్ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ.
9 . ఓ! బేబీ(జూలై 05 , 2019)
U|హాస్యం,ఫాంటసీ
తన కుటుంబ జీవితం పట్ల విరక్తి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు.. ఇంటి నుంచి బయటకు రావడంతో ఆమె జీవితంలో వింతలు జరుగుతాయి. ఆ వింతలేంటి అనేది కథ
10 . హుషారు(డిసెంబర్ 14 , 2018)
A|హాస్యం
నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి స్నేహం కోసమే బ్రతుకుతుంటారు. అయితే వారిలో ఒకరు క్యాన్సర్ బారిన పడతారు. ట్రీట్‌మెంట్‌కు రూ.30 లక్షలు అవసరమవుతాయి. అప్పుడు వారేం చేశారు? అన్నది కథ.
11 . ప్రెషర్ కుక్కర్(ఫిబ్రవరి 21 , 2020)
UA|హాస్యం,డ్రామా
తన కొడుకును అమెరికా పంపించాలని నారాయణ కలగంటాడు. ఇంతలో కిషోర్ వీసా తిరస్కరించబడుతుంది. కాలక్రమంలో కిషోర్ గర్భిణీ స్త్రీల కోసం ఒక ఉత్పత్తిని కనుగొంటాడు. ఆ క్షణం నుంచి కిషోర్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది కథ
12 . అ!(ఫిబ్రవరి 16 , 2018)
UA|హాస్యం,రొమాన్స్,సైన్స్ ఫిక్షన్,థ్రిల్లర్
మల్టిపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడే కాళి అనే అమ్మాయి తనలో కలిగే ఒక్కో ఫీలింగ్‌కు ఒక్కో క్యారెక్టర్‌ను సృష్టించుకుంటూ పోతుంది. ఆ పాత్రల ద్వారా తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
13 . ఊర్వశివో రాక్షశివో(నవంబర్ 04 , 2022)
UA|హాస్యం,రొమాన్స్,డ్రామా
పెళ్లి బంధం ఎర్పరుచుకోవాలనే మనస్తత్వం ఉన్న అబ్బాయి... కేవలం లివ్- ఇన్- రిలేషన్ షిప్‌తోనే జీవితం సాగించాలనుకునే మనస్తత్వం ఉన్న అమ్మాయి మధ్య ప్రేమ పుడితే ఆ బంధం ఎలా ఉంటుందనేదే ఈ సినిమా కథ
14 . ఎవ్వరికీ చెప్పొద్దు(అక్టోబర్ 08 , 2019)
U|హాస్యం,రొమాన్స్
సంప్రదాయ కుటుంబానికి చెందిన హారతి హరితో ప్రేమలో పడుతుంది. తమ పెళ్లికి అంగీకరించని ఆమె తండ్రిని ఒప్పించేందుకు ఓ ప్లాన్ వేస్తుంది. ఆ ప్లాన్ ఏంటీ అనేది కథ.
15 . జ్విగాటో(సెప్టెంబర్ 09 , 2022)
UA|హాస్యం,డ్రామా
మానస్ ఓ కంపెనీలో మేనేజర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. కొన్ని కారణాల వల్ల ఆ ఉద్యోగం పోవడంతో కుటుంబ పోషణకు ఫుడ్ డెలివరీ బాయ్‌గా మారతాడు. రేటింగ్స్ ప్రకారం జీతం అందే ఈ జాబ్‌లో మానస్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? కష్టాలతో అతడి జీవితం ఎలా సాగింది? అన్నది కథ.
16 . శాకిని డాకిని(సెప్టెంబర్ 16 , 2022)
UA|హాస్యం,యాక్షన్
శిక్షణ కోసం పోలీసు అకాడమీలో చేరిన షాలిని (నివేతా థామస్), దామిని (రెజీనా) స్నేహితులవుతారు. రౌడీ మూక ఓ అమ్మాయిని కిడ్నాప్ చేయడం వారు చూస్తారు. వారి వెనక పెద్ద ముఠా ఉందని తెలుసుకుంటారు. తమ శిక్షణను ఉపయోగించుకొని వారు ఆ ముఠాతో ఎలా పోరాడారు? అన్నది కథ.
17 . రంగ రంగ వైభవంగా(సెప్టెంబర్ 02 , 2022)
UA|హాస్యం,రొమాన్స్
రిషి (వైష్ణవ్ తేజ్), రాధ (కేతిక శర్మ)కు ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ, ఇగో వల్ల వారు మాట్లాడుకోరు. వీరి ఇగో చల్లారుతున్న క్రమంలోనే ప్రాణ స్నేహితులుగా ఉన్న వీరి కుటుంబాల మధ్య గొడవలు మెుదలవుతాయి. మరి రిషి, రాధ ఒక్కటయ్యారా? లేదా? అనేది కథ.
18 . శేషం మైక్-ఇల్ ఫాతిమా(నవంబర్ 17 , 2023)
U|హాస్యం,ఫ్యామిలీ
ముస్లిం కుటుంబానికి చెందిన ఫాతిమా పెద్ద ఫుట్‌బాల్ కామెంటేటర్ అవ్వాలని కలలుకంటుంది. ఫ్యామిలీలో ఎవరి మద్దతు లభించకపోవడంతో స్థానిక ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు కామెంటరీ చేస్తుంటుంది. ఇంటర్నేషనల్ కామెంటేటర్ అవ్వాలన్న ఫాతిమా లక్ష్యం నేరవేరిందా? లేదా? అన్నది స్టోరీ.
19 . మత్తు వదలరా 2(సెప్టెంబర్ 13 , 2024)
UA|హాస్యం,డ్రామా
డెలీవరీ బాయ్ ఏజెంట్స్ బాబు (శ్రీ సింహా), యేసుబాబు (సత్య) డబ్బులు సరిపోకా స్పెషల్ ఏజెంట్స్‌గా మారతారు. ఓ కేసు విషయంలో చేసిన చిన్న పొరపాటు కారణంగా చిక్కుల్లో పడతారు. ఇంతకీ ఏంటా కేసు? వారు చేసిన పొరపాటు ఏంటి? దాని నుంచి ఎలా బయటపడ్డారు? అండర్ కవర్ ఏజెంట్ నిధి (ఫరియా అబ్దుల్లా) వారికి ఎలా సాయపడింది? అన్నది స్టోరీ.
20 . సినిమా బండి(మే 14 , 2021)
UA|హాస్యం,డ్రామా
వీరబాబు (వికాస్ వశిష్ఠ) ఓ ఆటోడ్రైవర్. ఓ రోజు అతడికి పెద్ద కెమెరా దొరుకుతుంది. దాంతో సినిమా తీయాలని నిర్ణయించుకుంటాడు. మరి వీరబాబు టీమ్ సినిమా ఎలా తీసింది? ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ.