2024 వచ్చిన టాప్ బెస్ట్ థ్రిల్లర్ చిత్రాలు
80+ views1 month ago
2024 సంవత్సరంలో చాలా వరకు థ్రిల్లర్ చిత్రాలు విడుదలయ్యాయి. అయితే వాటిలో ప్రేక్షకులకు బెస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్‌ఫీరియన్స్ అందించే చిత్రాల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. వీటిలో కంగువా, మెకానిక్ రాకీ వంటి చిత్రాలు ఉన్నాయి. మీరు ఓసారి చూసేయండి
1 . పుష్ప 2: ది రూల్(డిసెంబర్ 05 , 2024)
UA|యాక్షన్,డ్రామా
పుష్పరాజ్ (అల్లు అర్జున్) స్మగ్లింగ్ సిండికేట్‌ను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్తాడు. అధికార పార్టీకి ఫండ్ ఇచ్చి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఓ రోజు సీఎంతో ఫొటో దిగమని శ్రీవల్లి (రష్మిక) ఆశగా అడుగుతుంది. పుష్ప ఇందుకు యత్నించగా సీఎం హేళన చేస్తాడు. దీంతో ఎంపీ సిద్ధప్ప (రావు రమేష్)ను సీఎం చేస్తానని సవాలు విసురుతాడు. ఇందుకోసం పుష్ప ఏం చేశాడు? కేంద్ర మంత్రి వీర ప్రతాప్ రెడ్డి (జగపతిబాబు)తో వైరం ఏంటి? పుష్పను అడ్డుకునేందుకు ఎస్పీ షెకావత్ (ఫహాద్ ఫాజిల్) ఎలాంటి ప్లాన్స్ వేశాడు? శ్రీవల్లికి ఇచ్చిన మాట పుష్ప నిలబెట్టుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.
2 . జితేందర్ రెడ్డి(నవంబర్ 07 , 2024)
UA|యాక్షన్,డ్రామా
జితేందర్ రెడ్డి (రాకేష్ వర్రే) చిన్నపుడే RSS సిద్దాంతాలకు ఆకర్షితుడు అవుతాడు. ఓ రోజు 18 ఏళ్లు కూడా నిండని కుర్రాడిని నక్సలైట్లు అన్యాయంగా చంపేస్తారు. ఈ ఘటనతో కాలేజ్ స్టూడెంట్‌గా ఉన్న జితేందర్ రెడ్డి కామ్రేడ్స్‌పై రగిలిపోతాడు. ప్రజల శ్రేయస్సు కోసం గన్ను పట్టుకున్నామని చెప్పుకునే నక్సలైట్స్ దారి తప్పారని గ్రహిస్తాడు. ఆ తర్వాత నక్సలైట్స్‌పై జితేందర్ రెడ్డి ఎలాంటి పోరాటం చేశాడు? నాయకుడిగా ఎలా ఎదిగాడు? అన్నది స్టోరీ.
3 . రోటీ కప్డా రొమాన్స్(నవంబర్ 28 , 2024)
UA|డ్రామా
ఈవెంట్ ఆర్గనైజర్ హర్ష (హర్ష నర్రా), సాఫ్ట్‌వేర్ రాహుల్ (సందీప్ సరోజ్), ఆర్జే సూర్య (తరుణ్), విక్కీ(సుప్రజ్ రంగ) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఒకే రూమ్‌లో ఉంటూ హ్యాపీగా జీవిస్తుంటారు. సాఫీగా సాగుతున్న వీరి లైఫ్‌లోకి నలుగురు అమ్మాయిలు ఎంట్రీ ఇస్తారు. వారి రాకతో ఆ నలుగురు ఫ్రెండ్స్ లైఫ్ ఎలా మారింది? ప్రేమ వల్ల వారు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? వారిలో వచ్చిన రియలైజేషన్ ఏంటి? అన్నది స్టోరీ.
4 . యూఐ(డిసెంబర్ 20 , 2024)
UA|డ్రామా
ఉపేంద్ర దర్శకత్వం వహించిన 'యూఐ' సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. మూవీ చూసినవారు వింతగా ప్రవర్తిస్తుంటారు. రివ్యూ రైటర్ కిరణ్ ఆదర్శ్ (మురళీశర్మ) ఎన్నిసార్లు సినిమా చూసిన రివ్యూ రాయలేకపోతాడు. దీంతో స్టోరీ తెలుసుకునేందుకు ఉపేంద్ర దగ్గరకు వెళ్తాడు. రాసిన కథ, సినిమాలో చూపించిన కథ వేర్వేరు అని తెలుసుకుంటాడు. ఇంతకీ ఉపేంద్ర రాసిన కథేంటి? ఈ స్టోరీలో సత్య , కల్కి భగవాన్ ఎవరు? అన్నది స్టోరీ.
5 . మెకానిక్ రాకీ(నవంబర్ 22 , 2024)
UA|యాక్షన్,హాస్యం,డ్రామా
రాకీ (విష్వక్ సేన్) తండ్రి నడుపుతున్న గ్యారేజీలో మెకానిక్‌గా చేస్తూ డ్రైవింగ్ నేర్పిస్తుంటాడు. అతడి వద్ద డ్రైవింగ్ నేర్చుకునేందుకు మాయ (శ్రద్ధ శ్రీనాథ్), ప్రియా (మీనాక్షి చౌదరి) జాయిన్ అవుతారు. తను చదువుకునే రోజుల్లోనే ప్రియను రాకీ ఇష్టపడతాడు. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత కలిసిన ప్రియకు రాకీ దగ్గరయ్యాడా? ఆమె గురించి రాకీకి తెలిసిన షాకింగ్ విషయాలు ఏంటి? వాళ్ల లైఫ్‌ను మాయ ఏ విధంగా ప్రభావితం చేసింది? రాంకీ రెడ్డి (సునీల్) వల్ల రాకీకి వచ్చిన సమస్యలు ఏంటి? అన్నది స్టోరీ.
6 . మ్యాక్స్(డిసెంబర్ 27 , 2024)
UA|యాక్షన్,అడ్వెంచర్
ఇన్స్పెక్టర్ అర్జున్ మహాక్షయ్ రెండు నెలల సస్పెన్షన్ తర్వాత కొత్త పోలీస్ స్టేషన్‌లో విధుల్లోకి తిరిగి చేరతారు. కానీ, ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటాడు. అతనికి కేవలం 12 గంటల సమయం మాత్రమే ఉంటుంది. ఇంతకు అర్జున్ మహాక్షయ్ ఎదుర్కొన్న సవాలు ఏమిటి? దాన్ని అధిగమించాడా? లేదా అనేది మిగతా కథ.
7 . ముఫాసా: ది లయన్ కింగ్(డిసెంబర్ 20 , 2024)
U|యాక్షన్,అడ్వెంచర్,యానిమేషన్,డ్రామా
ముఫాసా (సింహం) వరదల్లో కొట్టుకుపోయి టాకా (సింహం) ఉన్న రాజ్యానికి వస్తాడు. టాకా పెంచుకుందామని పట్టుబడటంతో అతడి ఫ్యామిలీ భాగమవుతాడు. ఓ రోజు టాకా తల్లిపై దాడి జరగ్గా ముఫాసా ధైర్యంగా ఎదుర్కొని తెల్ల సింహాల యువరాజును చంపేస్తాడు. దీంతో తెల్ల సింహాల రాజు కిరోస్.. ముఫాసాను చంపాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిలేలే రాజ్యం వైపు ముఫాసా, టాకా ఎందుకు పయనమయ్యారు? కిరోస్ నుంచి ముఫాసాకు ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకూ ముఫాసా ఎలా రాజయ్యాడు? అన్నది స్టోరీ. i
8 . మార్కో(జనవరి 01 , 2025)
UA|యాక్షన్,థ్రిల్లర్
విక్టర్ (ఇషాన్ షౌకత్) అనే దృష్టి లోపం ఉన్న కుర్రవాడిని రస్సెల్ (అభిమన్యు ఎస్ థాలికన్) అత్యంత దారుణంగా హత్య చేస్తాడు. అయితే, విక్టర్ అంటే ఎంతో ప్రేమ కలిగిన మార్కో (ఉన్ని ముకుందన్) తన కుటుంబం కోసం ఏదైనా చేయగల వ్యక్తి. విక్టర్ దారుణ హత్యపై మార్కో ఏమి నిర్ణయం తీసుకున్నాడు? రస్సెల్ ఆ కుర్రాడిని ఎందుకు చంపాల్సి వచ్చింది? రస్సెల్ అండ్ గ్యాంగ్ మరియు మార్కో అన్నయ్య గ్యాంగ్ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? మార్కో తన ప్రతీకారం ఏ స్థాయికి తీసుకెళ్లి తీర్చుకున్నాడనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని తప్పక చూడండి!
9 . కేశవ చంద్ర రామావత్ (కేసీఆర్)(నవంబర్ 22 , 2024)
UA|డ్రామా
కేశవచంద్ర చిన్నప్పటి కేసీఆర్‌కు వీరాభిమాని. పెద్దయ్యాక డబ్బున్న ఆసామి కూతురితో పెళ్లి కుదుర్చుకుంటాడు. సీఎం కేసీఆర్ సమక్షంలోనే పెళ్లి చేసుకుంటానని శబదం చేస్తాడు. ఆయన్ను ఒప్పించి రప్పించేందుకు హైదరాబాద్‌కు వస్తాడు. అలా నగరానికి వచ్చిన కేశవకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? రింగ్ రోడ్డు వల్ల కేశవ ఊరికి వచ్చిన సమస్య ఏంటి? దాని పరిష్కారానికి కేశవ ఏం చేశాడు? అన్నది స్టోరీ.
10 . బ్లడీ బెగ్గర్(నవంబర్ 07 , 2024)
UA|డ్రామా
ఒక లేజీ వ్యక్తి కాళ్లు లేవని జనాలను నమ్మిస్తూ అడుక్కొని డబ్బు సంపాదిస్తుంటాడు. అలా సాఫీగా లైఫ్‌ను నెట్టుకొస్తున్న ఆ బెగ్గర్ కొన్ని నాటకీయ పరిణామాల వల్ల ఇంద్ర భవనం లాంటి భవంతిలోకి అడుగుపెడతాడు. దీంతో అతడి లైఫ్ ఊహించని మలుపు తిరుగుతుంది. అక్కడ ఆ బెగ్గర్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటి నుంచి ఎలా బయటపడ్డాడు? అన్నది స్టోరీ.
11 . మట్కా(నవంబర్ 14 , 2024)
UA|డ్రామా
వాసు (వరుణ్ తేజ్) బతుకుదెరువు కోసం బర్మా నుంచి వైజాగ్ వస్తాడు. కూలీగా పనిచేస్తూ అనేక కష్టాలు పడతాడు. జీవితంలో ఏదైనా సాధించాన్న లక్ష్యం వాసుకి ఉంటుంది. ఈ క్రమంలో మట్కా గ్యాంబ్లింగ్‌లోకి అడుగుపెట్టడం అతడి కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పుకుంది. మట్కాలో బాగా కలిసిరావడంతో అందులో ఎవరికి అందనంతగా ఎత్తుకు ఎదుగుతాడు. గ్యాంగ్‌స్టర్‌గా వ్యవస్థను శాసించే స్థాయికి వెళ్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? సుజాతతో వాసు లవ్‌ట్రాక్ ఏంటి? అన్నది స్టోరీ.
12 . బరోజ్(డిసెంబర్ 25 , 2024)
UA|అడ్వెంచర్,ఫాంటసీ
పోర్చుగీసు రాజవంశానికి చెందిన నిధిని బరోజ్ (మోహన్ లాల్) నాలుగు శతాబ్దాలుగా కాపాడుతుంటాడు. వారసులు వస్తే వాళ్లకి నిధిని అప్పగించాలని ఎదురు చూస్తుంటాడు. ఈ క్రమంలో పదమూడో తరానికి చెందిన ఇసబెల (మాయా రావు) తన తండ్రితో కలిసి గోవాకు వస్తుంది. మరి ఆమెకి బరోజ్ నిధిని అప్పగించాడా? లేదా? అన్నది స్టోరీ.
13 . జీబ్రా(నవంబర్ 22 , 2024)
UA|డ్రామా
మిడిల్ క్లాస్‌కు చెందిన సూర్య (సత్యదేవ్) బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్‌లో రిలేషన్ షిప్ మేనేజర్‌గా పని చేస్తుంటాడు. తోటి ఉద్యోగిని స్వాతి (ప్రియ భవానీ శంకర్)ని తప్పుడు అకౌంట్‌కు రూ.4 లక్షల డబ్బును ట్రాన్‌ఫర్ చేస్తుంది. ఆ సమస్య నుంచి స్వాతిని కాపాడే క్రమంలో సూర్య రూ.5 కోట్ల ఫ్రాడ్‌లో ఇరుక్కుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాలతో ఎంతో ప్రమాదకారి అయిన ఆది (ధనంజయ్)ని సూర్య ఢీ కొట్టాల్సి వస్తుంది. సూర్య అతడ్ని ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది స్టోరీ.
14 . ధూం ధాం(నవంబర్ 08 , 2024)
UA|డ్రామా
కార్తిక్ (చేతన్ మద్దినేని) సుహానా (హెబ్బా పటేల్)ను చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కానీ, ఆమె పట్టించుకోదు. కోపంతో పోలాండ్‌కు వెళ్తాడు. అక్కడికి వెళ్లిన సుహానా తిరిగి కార్తిక్ ప్రేమను దక్కించుకుంటుంది. మరోవైపు కార్తీక్‌కు సుహానా పెద్దనాన్న, బాబాయ్‌లతో వైరం ఉంటుంది. కార్తీక్‌ను చంపాలని వారు చూస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? సుహానా ఫ్యామిలీతో కార్తిక్‌కు వైరం ఎందుకు? సుహానా - కార్తిక్ ఒక్కటయ్యారా? లేదా? అన్నది స్టోరీ.
15 . కథా కమామీషు(జనవరి 02 , 2025)
UA|డ్రామా,రొమాన్స్
కథ కామమిషు నాలుగు జంటల జీవితాలను చూపిస్తుంది. వారి ప్రయాణంలో ఒకరి జీవితాలపై ఒకరి ప్రభావం ఉంటుంది. దీంతో వారి ప్రయాణ దిశ మారుతుంది. అనుమానాలు, భయాలు, భావోద్వేగాలు ఈ జంటల మధ్య అడ్డంకులుగా నిలుస్తాయి. మరి వారి జీవితం చివరకు ఎటువైపు ప్రయాణించింది అనేది కథ.
16 . బచ్చల మల్లి(డిసెంబర్ 20 , 2024)
UA|డ్రామా
బచ్చలమల్లి (అల్లరి నరేశ్) చిన్నప్పుడు చదువులో బాగా చురుగ్గా ఉండేవాడు. తండ్రి తీసుకున్న ఓ నిర్ణయం మల్లిని ఎంతగానో బాధిస్తుంది. దాంతో చదువుకు స్వస్థి పలికి చెడు వ్యసనాలకు బానిసవుతాడు. మూర్ఖుడిగా మారిపోతాడు. మద్యం తాగుతూ ఏదోక గొడవలో తలదూరుస్తుంటాడు. కావేరి (అమృత అయ్యర్) రాకతో మల్లీ జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ఇంతకీ ఏంటా మార్పులు? తండ్రితో మల్లికి ఉన్న సమస్య ఏంటి? అన్నది స్టోరీ.
17 . కంగువ(నవంబర్ 14 , 2024)
UA|డ్రామా
ఫ్రాన్సిస్ (సూర్య) గోవాలో బౌంటీ హంటర్‌గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు ఫ్రాన్సిస్‌ను ఒక పాప కలుస్తుంది. ఆ పాపకి తనకు ఎదో బంధం ఉందని అతడికి అనిపిస్తుంది. ఆ బంధం ఇప్పటిది కాదు గత జన్మదని అతడికి అర్థమవుతుంది. 1000 ఏళ్ల కిందట ఆ పాపతో ఫ్రాన్సిస్‌కు ఉన్న సంబంధం ఏంటి? అసలు కంగువా ఎవరు? తెగ నాయకుడిగా అతడు చేసిన పోరాటాలు ఏంటి? విలన్ (బాబీ డియోల్) నుంచి అతడి తెగకు ఎదురైన ముప్పు ఏంటి? అన్నది స్టోరీ.
18 . జాతర(నవంబర్ 08 , 2024)
UA|యాక్షన్,అడ్వెంచర్,ఫాంటసీ
పాలేటి అనే పూజారీ గ్రామంలోని గంగావతి అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాడు. ఊరి పెద్ద గంగిరెడ్డితో అతడికి పడదు. ఈ క్రమంలో పాలేటితోపాటు గుడిలోని గంగావతి అమ్మవారు మాయమవుతుంది. దీంతో పాలేటి ఫ్యామిలీని ఊరి ప్రజలు నిందిస్తారు. పాలేటి అదృశ్యం వెనుక ఎవరన్నారు? గంగిరెడ్డికి, చలపతి ఫ్యామిలీకి ఉన్న గొడవేంటి? అన్నది స్టోరీ.
19 . ఆదిపర్వం(నవంబర్ 08 , 2024)
UA|యాక్షన్,ఫాంటసీ,థ్రిల్లర్
ఎర్రగుడిలోని గుప్తనిధులు సొంతం చేసుకునేందుకు నాగమ్మ (మంచు లక్ష్మీ), ఊరిపెద్ద రాయప్ప దుష్టశక్తులను ఆశ్రయిస్తారు. నిధి రాయప్ప తన కూతురు బుజ్జమ్మ (శ్రీజిత)ను సైతం బలివ్వడానికి రెడీ అవుతాడు. తనకు చెందిన నిధిన మారెమ్మ దేవత ఎలా రక్షించుకుంది? స్వార్థపరులకు ఎలాంటి గుణపాఠం చెప్పింది? ఈ క్రమంలో దైవ, దుష్టశక్తుల మధ్య ఎలాంటి పోరాటం జరిగింది? అన్నది స్టోరీ.
20 . ఫియర్(డిసెంబర్ 14 , 2024)
UA|థ్రిల్లర్
వేదిక కవల పుత్రికలు. అక్క చిన్నప్పటి నుంచి దెయ్యాల సినిమాలు చూస్తూ చెల్లెలికి కూడా బలవంతంగా చూపించడంతో ఆమె మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. అది తీవ్రస్థాయికి చేరడంతో ఆమెను ట్రీట్‌మెంట్ కోసం మెంటల్ ఆస్పత్రిలో చేరుస్తారు. అక్కడ ఆమె తన భాయ్‌ఫ్రెండ్ సంపత్‌ను కలవరిస్తుండేది. ఇంతకీ అతడెవరు? ఆమె అక్క భయాలకు కారణం ఏంటి? అన్నది స్టోరీ.