• TFIDB EN
  • ఆహాలో A గ్రేడ్ అడల్ట్ రేటింగ్ ఉన్న 20 చిత్రాలు
    Dislike
    2k+ views
    1 year ago

    ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చేత 'A' గ్రేడ్ పొందిన అడల్ట్ మూవీల జాబీతా YouSay TFIDB సేకరిచడం జరిగింది. వీటిలో టాప్ 20 సినిమాలు ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్ వేయండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . మగధీర(జూలై 31 , 2009)
    A|యాక్షన్,డ్రామా,రొమాన్స్
    రఘువీర్ ఇందిర తండ్రిని హత్య చేసి ఆ నేరాన్ని ఆమె ప్రేమించిన హర్షపై వేస్తాడు. దీంతో అపార్థం చేసుకున్న ఆమె హర్షకు దూరంగా వెళ్లిపోతుంది. ఇందిరను వెతుకుతూ బయల్దేరిన హర్ష తన పూర్వ జన్మ గురించి తెలుసుకుంటాడు.
    2 . అర్జున్ రెడ్డి(ఆగస్టు 25 , 2017)
    A|యాక్షన్,డ్రామా,రొమాన్స్
    అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు. ఇంతకు తన ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ.
    3 . గ్యాంగ్ లీడర్(మే 09 , 1991)
    A|యాక్షన్,డ్రామా
    ముగ్గురు సోదరులలో చిన్నవాడైన రాజారామ్ తన రెండో అన్న చదువుకు డబ్బులు కట్టేందుకు చేయని నేరాన్ని తనపై వేసుకుంటాడు. అయితే తన పెద్దన్నయ్యను హత్య చేసిన నిందితుల గురించి తెలిసి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.
    4 . సింధూరం(సెప్టెంబర్ 12 , 1997)
    A|డ్రామా
    బుల్లిరాజు ట్రైనీ పోలీసు అధికారి. తనపై కొందరు అవినీతి పోలీసు అధికారులు తప్పుడు కేసులు పెట్టడంతో ఉద్యోగం వదిలి నక్సలైట్ ఉద్యమంలో చేరతాడు. తనకు అన్యాయం చేసిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
    5 . మసూదా(నవంబర్ 18 , 2022)
    A|హారర్
    నాజియా (భాంధవి శ్రీధర్) ఆమె తల్లి నీలం (సంగీత) ఇద్దరు కలిసి జీవిస్తుంటారు. వీరు గోపీ కృష్ణ (తిరువీర్) సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. అయితే నాజియా విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది. ఆమె ప్రవర్తన నీలం, గోపిలను షాక్‌కు గురిచేస్తుంది. ఆమెను భూతవైద్యుల దగ్గరికి తీసుకెళ్తారు. మరి నాజియా కోలుకుందా? ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తోంది? అనేది మిగతా కథ.
    6 . జల్సా(ఏప్రిల్ 01 , 2008)
    A|యాక్షన్,హాస్యం
    సంజయ్‌ చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నక్సలైట్‌గా మారతాడు. ఓ పోలీసాఫీసర్‌ కారణంగా ప్రజా జీవితంలోకి వస్తాడు. అయితే అనుకోకుండా ఆ పోలీసు అధికారి కూతుర్లనే రెండు పర్యాయాలలో ప్రేమిస్తాడు.
    7 . ఒదెల రైల్వే స్టేషన్(ఆగస్టు 26 , 2022)
    A|థ్రిల్లర్,క్రైమ్
    అనుదీప్ (సాయి రోనక్) ఐపీఎస్‌ అధికారి. ట్రైనింగ్ కోసం ఓదెల వెళతాడు. ఈ క్రమంలో ఆ ఊరిలో వరుస హత్యాచారాలు తీవ్ర కలకలం రేపుతాయి. మరి అనుదీప్‌ హంతకుడ్ని పట్టుకున్నాడా? కేసు విచారణలో రాధ (హెబ్బా పటేల్‌) అతడికి ఎలా సాయపడింది? అనేది కథ.
    8 . RX 100(జూలై 12 , 2018)
    A|యాక్షన్,రొమాన్స్
    సెలవులకు ఇంటికి వచ్చిన ఇందు (పాయల్‌) ఊర్లోని శివ (కార్తికేయ)ను ప్రేమిస్తుంది. పెళ్లికి ముందే అతనితో శారీరకంగా దగ్గరవుతుంది. అయితే ఓ రోజు ఇందు అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది. మరి శివ ఏమయ్యాడు? ఇందు వేరే పెళ్లి ఎందుకు చేసుకుంది? అన్నది మిగతా కథ.
    9 . రగడ(డిసెంబర్ 24 , 2010)
    A|యాక్షన్
    డబ్బులు సంపాదించాలన్న ఆశతో సత్య హైదరాబాద్‌కు వచ్చి గ్యాంగ్‌స్టర్ జికె వద్ద పనిచేయడం ప్రారంభించాడు. అయితే, అతని చర్యల వల్ల మరో గ్యాంగ్‌స్టర్ పెద్దన్నకు టార్గెట్ అవుతాడు. మరి సత్య ఆ గ్యాంగ్‌స్టర్‌ను ఎలా ఎదుర్కొన్నాడు అన్నది కథ.
    10 . ఆంజనేయులు(ఆగస్టు 14 , 2009)
    A|హాస్యం
    ఆంజనేయులు ఒక న్యూస్ ఛానెల్‌లో రిపోర్టర్. తన తోటి సహోద్యోగి హత్య కుట్రను ఛేదించేందుకు అవినీతిపరుడైన రాజకీయ నాయకులు, గ్యాంగ్‌స్టర్‌ల లింక్‌ను బయటపెట్టేందుకు ఆంజనేయులు రహస్యంగా విచారిస్తాడు.
    11 . గీతాంజలి(ఆగస్టు 08 , 2014)
    A|హాస్యం,హారర్
    హీరో తన ఫ్రెండ్‌తో కలిసి ఓ ఫ్లాట్‌లో దిగుతాడు. అప్పటి నుంచి వారికి తరచూ ఇబ్బందులు ఎదురవుతాయి. అనుకోకుండా జర్నీలో కలిసిన అంజలి రోజూ ఆ ఫ్లాట్‌కు వస్తుంది. ఇంతకీ అంజలి ఎవరు? ఆ ఫ్లాట్‌తో ఆమెకున్న సంబంధం ఏంటి? అన్నది కథ.
    12 . సేనాపతి(డిసెంబర్ 31 , 2021)
    A|థ్రిల్లర్,క్రైమ్
    ఎస్సై కృష్ణ (నరేష్‌ అగస్త్య) ఓ క్రిమినల్‌ను పట్టుకునే క్రమంలో రివాల్వర్‌ పొగొట్టుకుంటాడు. మరి అది ఎవరికి దొరికింది? బ్యాంకు దోపిడి, హత్యలకు ఆ గన్‌ ఎలా సాక్ష్యంగా మారింది? అసలు కృష్ణమూర్తి (రాజేంద్ర ప్రసాద్‌) ఎవరు? అన్నది కథ.
    13 . డర్టీ హరి(డిసెంబర్ 18 , 2020)
    A|రొమాన్స్,థ్రిల్లర్
    హరికి హైదరాబాద్‌లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్‌ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ
    14 . ఫలక్‌నుమా దాస్(మే 31 , 2019)
    A|యాక్షన్,రొమాన్స్,థ్రిల్లర్
    దాస్ తన స్నేహితుల బృందం.. ఫలక్‌నుమాలో మాంసం వ్యాపారంపై గుత్తాధిపత్యం చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే, వారు కొన్ని ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. ఇది వారిని నేరాల మార్గంలో నడిపిస్తుంది.
    15 . చీకటి గదిలో చితక్కొట్టుడు(మార్చి 21 , 2019)
    A|హాస్యం,హారర్
    ఓ స్నేహితుల బృందం బ్యాచిలర్ పార్టీ కోసం నగరానికి దూరంగా ఉన్న విల్లాకు వెళ్తారు. ఆ విల్లాలో వారికి వింత పరిస్థితి ఎదురవుతుంది. ఓ అదృశ్య శక్తి వారిని వెంబడిస్తుంటుంది.
    16 . రౌడీ(ఏప్రిల్ 04 , 2014)
    A|యాక్షన్,డ్రామా,థ్రిల్లర్
    రాయలసీమలో ప్రజలకు ఏ కష్టం వచ్చిన అన్నగారు (మోహన్‌బాబు) అండగా నిలుస్తుంటారు. అయితే ఓ రోజు ఆయనపై అటాక్ చేయాలని విలన్లు ప్లాన్‌ చేస్తారు. దీని గురించి తెలుసుకున్న ఆయన కుమారుడు (విష్ణు) ఏం చేశాడు? తన తండ్రిని ఎలా కాపాడుకున్నాడు? అన్నది కథ.
    17 . కరెంట్ తీగ(అక్టోబర్ 31 , 2014)
    A|హాస్యం,రొమాన్స్
    హీరో స్కూల్‌ టీచర్‌ను ప్రేమిస్తాడు. ఆమెను ముగ్గులో దింపేందుకు హీరోయిన్‌ చేత రాయబారం పంపుతుంటాడు. ఈ క్రమంలో హీరోయిన్‌ హీరోను ప్రేమించడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
    18 . రామయ్య వస్తావయ్యా(అక్టోబర్ 11 , 2013)
    A|యాక్షన్
    రామయ్యా వస్తావయ్యా అనేది 2013లో హరీష్ శంకర్ రచన మరియు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు భాషా యాక్షన్ చిత్రం. దీనిని దిల్ రాజు నిర్మించారు మరియు NT రామారావు జూనియర్, శృతి హాసన్ మరియు సమంతా రూత్ ప్రభు నటించారు. సౌండ్‌ట్రాక్‌ను S. థమన్ స్వరపరిచారు. సినిమాటోగ్రఫీని చోటా కె. నాయుడు నిర్వహించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 11 అక్టోబర్ 2013న విడుదలై దాని కథాంశాన్ని విమర్శించిన విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పేలవంగా ఆడింది.
    19 . మంత్‌ ఆఫ్ మధు(అక్టోబర్ 06 , 2023)
    A|డ్రామా
    20 ఏళ్ల వివాహ బంధం తరువాత లేఖ (స్వాతి రెడ్డి), తన భర్త మధుసూధన్ రావు (నవీన్ చంద్ర)తో విడిపోవాలని అనుకుంటుంది. ఇదే క్రమంలో మధుమిత (శ్రేయ నవిలే) తన కజిన్ పెళ్లి కోసం వైజాగ్ వస్తుంది. అక్కడ మధుసూదన్ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఇంతకు మధుమిత.. లేఖ- మధుసూధన్‌ల బంధాన్ని మరింత చెడగొట్టిందా? లేక వారిద్దరిని కలిపిందా? అనేది మిగతా కథ.
    20 . తరువత ఎవరు(ఆగస్టు 03 , 2018)
    A|హారర్,థ్రిల్లర్
    రియాల్టీ షోలో కంటెస్టెంట్లు ఒకరి తర్వాత ఒకరు చంపబడుతుండడంతో కథలో ట్విస్ట్ పుడుతుంది. చందు నిత్య ప్రాణాలను ఎలా కాపాడాడు మరియు అతని ప్రేమను తిరిగి ఎలా గెలుచుకున్నాడు అనేది మిగతా కథ.

    @2021 KTree