Sun NXT యాప్‌లో టాప్ 10 రొమాంటిక్ సినిమాలు
2k+ views1 year ago
Sun NXTలో వచ్చిన రొమాంటిక్ చిత్రాల్లో టాప్ రేటెడ్ సినిమాలను YouSay TFIDB సేకరించడం జరిగింది. వీటిలో పెళ్లి చూపులు, చిలసౌ, ఆర్య వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. వీటిలో మీ మనసుకు నచ్చే సినిమాను ఎంచుకుని ఎంజాయ్ చేయండి.
1 . ఆర్య(మే 07 , 2004)
U|డ్రామా,రొమాన్స్
అజయ్ గీతను ప్రేమిస్తాడు. కానీ గీత అతను చేసిన ప్రేమప్రతిపాదనను తిరస్కరించినప్పుడు బిల్డింగ్‌పై నుంచి దూకెస్తానని అజయ్ బెదిరిస్తాడు. దీంతో గీత అజయ్ లవ్ ప్రపోజలన్‌ను అంగీకరిస్తుంది. ఈ విషయం తెలిసి కూడా గీతకు ఆర్య లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఆ తర్వాత కథ అనేక మలుపులు తిరుగుతుంది.
2 . ఒక్కడు(జనవరి 15 , 2003)
U|యాక్షన్,రొమాన్స్
అజయ్ జాతీయ స్థాయి కబడ్డి ప్లేయర్. శిక్షణ నిమిత్తం కర్నూలుకు వెళ్తాడు. అక్కడ స్వప్న అనే అమ్మాయిని ఓబుల్ రెడ్డి అనే ఫ్యాక్షనిస్టు చెర నుంచి కాపాడుతాడు. హైదరాబాద్‌కు తీసుకొచ్చి తన కుటుంబానికి తెలియకుండా ఇంట్లోనే ఉంచుతాడు. మహేష్ బాబు కేరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది ఈ సినిమా.
3 . ఊపిరి(మార్చి 25 , 2016)
U|హాస్యం,డ్రామా,రొమాన్స్
వీల్‌చైర్‌కే అతుక్కుపోయిన విక్రమ్ ఆదిత్య (నాగార్జున) తన బాగోగులు చూసుకునేందురు శీను (కార్తి)ను నియమించుకుంటాడు. ఈ ప్రయాణంలో ఏమేం జరిగాయి? ఎవరెవరి జీవితాలు ఎలా మారాయి? అన్నది కథ.
4 . లాఠీ(undefined 00 , 1992)
UA|డ్రామా,రొమాన్స్
లాఠీ అనేది గుణశేఖర్ దర్శకత్వం వహించిన 1992 భారతీయ తెలుగు-భాష యాక్షన్ రొమాన్స్ చిత్రం, ఇందులో ప్రశాంత్, సంయుక్త సింగ్ మరియు రఘువరన్ నటించారు. ఈ చిత్రం మూడు నంది అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రం తరువాత తమిళంలోకి డబ్ చేయబడి దావూద్ ఇబ్రహీం పేరుతో విడుదల చేయబడింది.
5 . పెళ్లి చూపులు(జూలై 29 , 2016)
U|హాస్యం,డ్రామా,రొమాన్స్
పెళ్లి చూపుల్లో ప్రశాంత్ (విజయ్ దేవరకొండ)ను చిత్ర (రీతు వర్మ) రిజెక్ట్ చేస్తోంది. ఓ కారణం వల్ల హీరోయిన్ పెట్టే ఫుడ్ ట్రక్ బిజినెస్‌లో హీరో భాగమవుతాడు. ఈ ఇద్దరి ప్రయాణం తర్వాత ఏయే మలుపులు తిరిగింది? అన్నది కథ.
6 . తొలి ప్రేమ(ఫిబ్రవరి 10 , 2018)
UA|హాస్యం,రొమాన్స్
ఆదిత్య (వరుణ్ తేజ్) రైలులో వర్ష (రాశీఖన్నా)ను చూసి ప్రేమిస్తాడు. తాను చదువుతున్న ఆమె కాలేజీకే రావడంతో ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కాలేజీలో జరిగిన ఓ గొడవ మూలంగా ఆదిత్య వర్షను వదిలి వెళ్లిపోతాడు. ఆరేళ్ల తర్వాత వర్ష మళ్లీ ఆదిత్య జీవితంలోకి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వారిద్దరు కలిశారా లేదా? అన్నది కథ.
7 . ప్రేమంటే ఇదేరా(అక్టోబర్ 30 , 1998)
U|రొమాన్స్
ఓ పోలీసుతో నిశ్చితార్థం జరిగిన యువతిని మురళి ప్రేమిస్తాడు. ఆమె కుటుంబానికి దగ్గరయ్యేందుకు పెళ్లి ఏర్పాట్లలో పాలుపంచుకుంటాడు. ఈ పెళ్లిని మురళి ఎలా అడ్డుకున్నాడు? తన ప్రేమను ఏ విధంగా గెలిపించుకున్నాడు? అన్నది కథ.
8 . నాన్నకు ప్రేమతో(జనవరి 13 , 2016)
UA|యాక్షన్,డ్రామా,రొమాన్స్
హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
9 . నేనూ.. శైలజా...(జనవరి 01 , 2016)
U|డ్రామా,రొమాన్స్
హీరో హీరోయిన్‌ను చూసి ప్రేమిస్తాడు. కానీ, హరి (రామ్) లవ్‌ను శైలజా (కీర్తి సురేష్) రిజెక్ట్ చేస్తుంది. అయితే దానికి కారణం ఏంటో తెలుసుకున్న హీరో ఏం చేశాడు? శైలజకు ఉన్న సమస్యను ఎలా పరిష్కరించాడు? అన్నది కథ.
10 . మురారి(ఫిబ్రవరి 17 , 2001)
UA|డ్రామా,రొమాన్స్,థ్రిల్లర్
మురారి.. తన మరదలు వసుంధరను గాఢంగా ప్రేమిస్తాడు. అయితే తన వంశానికి ఉన్న ఓ శాపం వల్ల తాను చనిపోతానని మురారి తెలుసుకుంటాడు. వసుంధరను ప్రేమించిన బుల్లబ్బాయి కోపంతో మురారి గునపంతో పొడుస్తాడు. దీంతో మురారి చావుబతుకుల మధ్య పోరాడుతాడు.