• TFIDB EN
  • Editorial List
    Pawan Kalyan Top 10 Movies: పవర్‌స్టార్‌ హీరోగా చేసిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలు
    Dislike
    2k+ views
    11 months ago

    టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఒకరు. ఆయనకు ఉన్న ఫ్యాన్‌ బేస్‌ ఏ హీరోకు లేదనడంలో అతిశయోక్తి లేదు. పవన్‌ క్రేజ్‌ సినిమాలకు అతీతమైనది కావడమే ఇందుకు కారణం. చిరు తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్‌.. అగ్రనటుడిగా ఎదిగారు. పవన్‌ తన సినీ కెరీర్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు తీశాడు. వాటి ద్వారా ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించారు. Read More

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . పంజా(డిసెంబర్ 09 , 2011)
    A|156 minutes|యాక్షన్,క్రైమ్,డ్రామా,రొమాన్స్
    జై ఓ అనాథ. జైకు గ్యాంగ్‌స్టర్‌ భగవాన్‌ ఆశ్రయం ఇస్తాడు. కొత్త జీవితాన్ని అందిస్తాడు. భగవాన్‌ కొడుకు మున్నా చాలా క్రూరుడు. ఓ కారణం చేత జై అతడ్ని చంపుతాడు. దీంతో భగవాన్‌కు జై శత్రువుగా మారతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
    2 . వకీల్ సాబ్(ఏప్రిల్ 09 , 2021)
    UA|156 minutes|యాక్షన్,డ్రామా,థ్రిల్లర్
    ప‌ల్ల‌వి (నివేదా థామ‌స్‌), జ‌రీనా (అంజ‌లి), దివ్య నాయక్ (అన‌న్య నాగ‌ళ్ల‌) ఓ ఇంట్లో అద్దెకుంటారు. ఓ రోజు ఎంపీ కొడుకు పల్లవిపై లైంగిక దాడి చేయబోగా ఆమె తప్పించుకొని ఇంటికి వస్తుంది. ఆ త‌ర్వాత ప‌ల్ల‌విపై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదవుతుంది. దీంతో అమాయ‌కులైన ముగ్గుర‌మ్మాయిలు క‌ష్టాల్లో ప‌డ‌తారు. ఆ సంద‌ర్భంలో వకీల్‌సాబ్ (ప‌వ‌న్‌క‌ల్యాణ్‌) వారికి ఎలా అండగా నిలబడ్డాడు? కోర్టులో ప‌ల్ల‌వి కేసుని ఎలా గెలిపించాడు? అన్నది కథ.
    3 . గబ్బర్ సింగ్(మే 11 , 2012)
    UA|152 minutes|యాక్షన్,డ్రామా
    వెంకటరత్నం తండ్రిపై కోపంతో ఊరు వదిలి వెళ్లిపోతాడు. పెద్దయ్యాక గబ్బర్‌సింగ్‌ అనే పోలీసు ఆఫీసర్‌గా అదే ఊరికి తిరిగొస్తాడు. ఆ ఊరిలోని సిద్దప్ప నాయుడు చాలా దుర్మార్గుడు. రాజకీయాల్లో చేరేందుకు ప్రయత్నిస్తుంటాడు. అతడికి హీరో ఎలా చెక్‌ పెట్టాడు? అన్నది కథ.

    హిందీలో సల్మాన్‌ ఖాన్‌ చేసిన ‘దబాంగ్’ చిత్రానికి రీమేక్‌గా ‘గబ్బర్‌ సింగ్’ చిత్రం రూపొందింది. కథలో కొన్ని మార్పులు చేసి దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో పవన్‌ తనదైన స్టైల్‌లో పోలీసు పాత్రను పోషించాడు. తన బాడీ లాంగ్వేజ్‌తో అభిమానుల చేత ఈలలు వేయించాడు. ఇందులో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా చేసింది.

    4 . గోపాల గోపాల(జనవరి 10 , 2015)
    U|153 minutes|హాస్యం,డ్రామా
    నాస్తికుడైన గోపాల రావు తన దుకాణం భూకంపంలో ధ్వంసం కావడంతో దేవుడిపై దావా వేస్తాడు, ఫలితంగా దేవుడు, గోపాలరావు మధ్య జరిగే కొన్ని సంఘటనలు జీవిత పాఠాలను నేర్పుతాయి.

    పవన్ కల్యాణ్‌, వెంకటేష్‌ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘గోపాల గోపాల’. బాలీవుడ్ చిత్రం 'ఓఎంజీ'కి తెలుగు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. 2015లో వచ్చిన ఈ సినిమాలో వెంకటేశ్‌ ప్రధాన పాత్ర పోషించగా.. పవన్‌ దేవుడిగా కనిపించాడు. ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన ‘బ్రో’ చిత్రంలోనూ పవన్‌ దేవుడిలా కనిపించడం విశేషం.

    5 . అత్తారింటికి దారేది(సెప్టెంబర్ 27 , 2013)
    U|175 minutes|యాక్షన్,డ్రామా,ఫ్యామిలీ
    హీరో తన అత్తయ్యను తాతయ్యతో కలిపేందుకు ఇండియాకు వస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అత్తను తన కుటుంబంలో ఎలా కలిపాడు? అన్నది కథ.
    6 . బద్రి(ఏప్రిల్ 20 , 2000)
    U|158 minutes|రొమాన్స్
    బద్రి, వెన్నెల ఇద్దరు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు. బద్రి తనను స్వచ్ఛంగా ప్రేమించడం లేదని వెన్నెల ఆరోపిస్తుంది. తనలాగా బద్రిని ఎవరూ ప్రేమించరు అని సవాలు విసురుతుంది. అయితే సరయు అనే యువతి బద్రి జీవితంలోకి రావడంతో కథ మలుపు తిరుగుతుంది.

    పూరి జగన్నాథ్‌, పవన్‌ కల్యాణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన మెుదటి సినిమా ‘బద్రి’. ఈ చిత్రం 2000 సంవత్సరంలో విడుదలై ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఇందులో పవన్‌ కల్యాణ్‌ చెప్పే డైలాగ్స్‌ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ముఖ్యంగా 'నువ్వు నందా అయితే నేను బద్రి.. బద్రినాథ్‌' అనే డైలాగ్‌ ప్రేక్షకులను పవన్‌కు మరింత దగ్గర చేసింది.

    7 . జల్సా(ఏప్రిల్ 01 , 2008)
    A|167 minutes|యాక్షన్,హాస్యం
    సంజయ్‌ చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నక్సలైట్‌గా మారతాడు. ఓ పోలీసాఫీసర్‌ కారణంగా ప్రజా జీవితంలోకి వస్తాడు. అయితే అనుకోకుండా ఆ పోలీసు అధికారి కూతుర్లనే రెండు పర్యాయాలలో ప్రేమిస్తాడు.
    8 . తమ్ముడు(జూలై 15 , 1999)
    U|162 minutes|డ్రామా,రొమాన్స్,క్రీడలు
    సుభాష్‌ (పవన్‌ కల్యాణ్‌) కాలేజ్ స్టూడెంట్‌. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌ చేస్తూ రోజులు గడుపుతుంటాడు. కిక్‌ బాక్సర్‌ అయిన సుభాష్‌ సోదరుడికి ఓ రోజు తీవ్రంగా గాయపడతాడు. దీంతో ఎలాంటి బాక్సింగ్‌ అనుభవం లేకపోయిన ప్రతర్థితో సుభాష్‌ తలపడాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.

    1999లో వచ్చిన ‘తమ్ముడు’ చిత్రం బిగ్గెస్ట్‌ హిట్ అందుకుంది. ఈ చిత్రంలో అన్న కలను నెరవేర్చే తమ్ముడిగా పవన్‌ కల్యాణ్‌ నటించాడు. ఇందులో పవన్‌ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాలేజీ స్టూడెంట్‌గా పవన్‌ పండించిన హాస్యం ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించింది. ఈ చిత్రానికి P.A అరుణ్‌ ప్రసాద్‌ దర్శకత్వం వహించాడు. ప్రీతి ఝూంగియాని, అదితి గోవరికర్ హీరోయిన్లుగా నటించారు.

    9 . ఖుషి(ఏప్రిల్ 27 , 2001)
    UA|177 minutes|రొమాన్స్
    మధు, సిద్ధూలు కాలేజీ ఫ్రెండ్స్. అపార్థాల కారణంగా దూరంగా ఉంటారు. ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న ఇగో కారణంగా చెప్పుకోరు. అయితే మధు, సిద్ధూ ప్రాణ స్నేహితుల ప్రేమ ప్రమాదంలో పడినప్పుడు వీరిద్దరూ కలిసి వారి ప్రేమను గెలిపిస్తారు. ఈ ప్రయాణంలో ఒకరిపై ఒకరికున్న ప్రేమను తెలుసుకుని కలిసేందుకు ప్రయత్నిస్తారు.

    పవన్‌ సినిమాల్లో ‘ఖుషి’ చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అందుకుంది. ఈ చిత్రంలో పవన్‌ మేనరిజమ్స్‌, సొంతంగా కొరియోగ్రాఫ్‌ చేసిన ఫైట్స్‌ మూవీకే హైలెట్‌ అని చెప్పొచ్చు. 2001లో వచ్చిన ఈ సినిమాకు S.J. సూర్య దర్శకత్వం వహించాడు. భూమిక చావ్లా హీరోయిన్‌గా చేసింది. ఇదే సినిమా పేరుతో విజయ్‌ దేవరకొండ ఓ మూవీ కూడా చేస్తున్నాడు. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించింది.

    10 . తొలి ప్రేమ(జూలై 24 , 1998)
    U|146 minutes|డ్రామా,రొమాన్స్
    అమెరికా నుంచి వచ్చి తన తాత ఇంటికి వెళ్తున్న అనూను బాలు ఓ ప్రమాదం నుండి కాపాడతాడు. దీంతో అను అతడితో స్నేహం చేస్తుంది. ఈ ప్రయాణంలో బాలు అనూని ఇష్టపడతాడు. కానీ, ఆమెకు చెప్పలేకపోతాడు. వీరి ప్రేమ కథ చివరికి ఏమైంది? అన్నది కథ.

    పవన్‌ కల్యాణ్‌ సినిమాల జాబితాలో ‘తొలి ప్రేమ’ అగ్రస్థానంలో ఉంటుంది. 1998లో విడుదలైన ఈ మూవీకి కరుణాకరన్‌ దర్శకత్వం వహించారు. పవన్‌ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. కీర్తి రెడ్డి ఇందులో హీరోయిన్‌గా చేసింది. తొలి ప్రేమలోని పాటలు అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘నీ మనసే’ పాట ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్‌ అని సాంగ్‌.


    @2021 KTree