• TFIDB EN
  • Editorial List
    Hero Nani Top 10 Movies: నాని కెరీర్‌లో వచ్చిన టాప్‌ బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలు
    Dislike
    2k+ views
    1 year ago

    ఎటువంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా టాలీవుడ్‌లో అడుగుపెట్టి.. స్టార్ హీరోగా ఎదిగిన నటుడు నాని. తన సహజ సిద్దమైన నటనతో నేచురల్‌ స్టార్‌ నానిగా అతడు గుర్తింపు పొందాడు. నాని ఇప్పటివరకూ పలు సూపర్‌ హిట్‌ సినిమాలు తీశాడు. ప్రతీ మూవీలోనూ పక్కింటి అబ్బాయిని తలపించేలా నటించాడు. గుండెకు హత్తుకునే హావభావాలతో ఆకట్టుకున్నాడు. తెరపై అతడ్ని చూస్తున్నంతసేపు నటిస్తున్నట్లు ఎక్కడా కనిపించదు. ఎందుకంటే పాత్రలో అంతలా పరకాయ ప్రవేశం చేస్తాడు నాని. తెలుగులో నాని చేసిన టాప్‌-10 సూపర్‌ హిట్‌ మూవీస్‌ మీకోసం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . ఎవడే సుబ్రమణ్యం(మార్చి 21 , 2015)
    U|150 minutes|డ్రామా,రొమాన్స్
    మెటీరియలిస్టిక్ స్వభావం కలిగిన సుబ్రమణ్యం జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు హిమాలయాలకు వెళ్తాడు. ఈక్రమంలో అనుబంధాల పట్ల తన వైఖరిని మార్చుకుంటాడు.
    2 . నిన్ను కోరి(జూలై 07 , 2017)
    U|137 minutes|డ్రామా,రొమాన్స్
    పల్లవి తన మాజీ బాయ్‌ఫ్రెండ్ ఉమను తన భర్తతో కలిసి తన ఇంట్లో ఉండమని ఆహ్వానిస్తుంది. పల్లవిని తిరిగి పెళ్లి చేసుకోవాలనే ఆశతో ఉమ వారి కాపురంలో కలహాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తాడు.
    3 . అంటే సుందరానికి!(జూన్ 10 , 2022)
    UA|176 minutes|హాస్యం
    బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్‌)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ.
    4 . అలా మొదలైంది(జనవరి 21 , 2011)
    U|135 minutes|రొమాన్స్
    లవ్‌ ఫేయిల్ అయిన ఓ వ్యక్తి ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ఆమెకు అప్పటికే నిశ్చితార్థం జరిగిందని తెలియగానే కథలో ట్విస్ట్‌ మొదలవుతుంది.
    5 . శ్యామ్ సింఘా రాయ్(డిసెంబర్ 24 , 2021)
    UA|157 minutes|థ్రిల్లర్,డ్రామా,యాక్షన్
    వాసు (నాని) డైరెక్టర్ కావాలని కలలు కంటాడు. ‘ఉనికి’ పేరుతో తీసిన చిత్రం బ్లాక్‌బాస్టర్‌ అవుతుంది. అయితే కాపీ రైట్ కేసులో వాసు అరెస్టు అవుతాడు. ఆ సినిమా కథకు రచయిత శ్యామ్‌ సింగరాయ్‌కు ఉన్న సంబంధం ఏంటి? అన్నది కథ.
    6 . భలే భలే మగాడివోయ్(సెప్టెంబర్ 04 , 2015)
    U|145 minutes|హాస్యం,రొమాన్స్
    లక్కీ అనే యువకుడు ఒక మొక్కల శాస్త్రవేత్త. మతిమరుపుతో బాధపడుతుంటాడు. నందన అనే అమ్మాయితో ప్రేమలో పడుతాడు. తన లోపాన్ని దాచడానికి కష్టపడుతుంటాడు.
    7 . పిల్ల జమీందార్(అక్టోబర్ 14 , 2011)
    U|147 minutes|హాస్యం,డ్రామా
    అల్లరి చిల్లరగా తిరిగే ప్రవీణ్ పెద్ద భూస్వామి మనవడు. తన తాతగారి ఆస్తిని వారసత్వంగా పొందడం కోసం తన చదువును పూర్తి చేసేందుకు ఓ బోర్డింగ్ కాలేజీకి వెళ్తాడు. అక్కడ అతను జీవితం గురించి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నాడన్నది మిగతా కథ.
    8 . ఈగ(జూలై 06 , 2012)
    UA|134 minutes|ఫాంటసీ,రొమాన్స్
    నాని, బిందు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అయితే బిందుపై కన్నేసిన సుదీప్‌ నానిని చంపేస్తాడు. పూనర్జన్మలో ఈగగా పుట్టిన నాని.. సుదీప్‌పై ఎలా పగ తీర్చుకున్నాడు? అన్నది కథ.

    దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్‌ వండర్ చిత్రం ‘ఈగ’. ఇందులో నాని కనిపించేది కొద్దిసేపే అయినా తన నటనతో సినిమాకు ప్రాణం పోశాడు. సమంత వెంటపడే లవర్‌బాయ్‌గా కనిపించి అలరించాడు. 2012లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. కాగా ఈ సినిమాలో సుదీప్‌, ఆదిత్య, శ్రీనివాస రెడ్డి, తాగుబోతు రమేష్‌ కీలక పాత్రలు పోషించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.

    9 . దసరా(మార్చి 30 , 2023)
    UA|156 minutes|యాక్షన్,అడ్వెంచర్,డ్రామా
    ధరణి తన స్నేహితులతో కలిసి బొగ్గుని దొంగతనం చేస్తూ.. మద్యం సేవిస్తూ అందరితో గొడవలు పడుతూ ఉంటాడు. కానీ మరుసటి రోజు అవన్నీ మర్చిపోతాడు. ఈ క్రమంలో ఓ రోజు చిన్న నంబి ( షైన్ టామ్ చాకో) సిల్క్ బార్‌లో కూడా గొడవపడి మర్చిపోతాడు. దానిని చిన్న తంబి చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ఈక్రమంలో ఓ రాత్రి ముసుగు దుండగులు ధరణి ప్రాణ స్నేహితుడిని చంపుతారు. ఇంతకు ధరణి స్నేహితుడిని చంపిందెవరు? వారిపై ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు అన్నది మిగతా కథ

    నాని హీరోగా శ్రీకాంత్‌ ఒదెల దర్శకత్వం వహించిన చిత్రం ‘దసరా’. ఇందులో నాని తన నట విశ్వరూపాన్ని చూపించాడు. మాస్‌ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించాడు. నానికి జోడీగా కీర్తి సురేష్‌ నటించింది. హీరోతో పోటీపడి మరి నటించి మెప్పించింది. ఈ చిత్రం ద్వారా నాని రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు. దీక్షిత్‌ శెట్టి, షైన్‌ టామ్‌ చాకో, షామ్నా ఖాసీం, సముద్రఖని, సాయికుమార్, ఝూన్సీ కీలకపాత్రలు పోషించారు.

    10 . జెర్సీ(ఏప్రిల్ 19 , 2019)
    U|160 minutes|డ్రామా,క్రీడలు
    ఒక మాజీ క్రికెటర్ తన కొడుకు కోరికను తీర్చడానికి ఇండియా టీమ్‌కు సెలెక్ట్ అయ్యేందుకు ఎలాంటి కష్టాలు పడ్డాడు అనేది కథ

    @2021 KTree