• TFIDB EN
  • Editorial List
    Top 10 Chiranjeevi Comedy Movies: చిరంజీవి టాప్ 10 కామెడీ చిత్రాలు
    Dislike
    2 Likes 2k+ views
    1 year ago

    చిరంజీవి కామెడీ టైమింగే వేరు. ‘హలో మాస్టారూ’ అన్నా, ‘ఫేస్ కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకో’ అని చెప్పినా కామెడీ పండాల్సిందే. సీరియస్ టోన్‌లోనూ కడుపుబ్బా నవ్వించే సత్తా చిరంజీవి సొంతం. స్క్రీన్‌పై వేరియేషన్లను చూపిస్తూ ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేయగలడు ఈ మెగాస్టార్. తన కెరీర్‌లో చేసిన 150కు పైగా సినిమాల్లో కామెడీ డోజున్న చిత్రాలు ఎక్కువే. అవేంటో ఇప్పుడు చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . జై చిరంజీవ(డిసెంబర్ 22 , 2005)
    U|173 minutes|యాక్షన్,డ్రామా
    సత్యనారాయణ తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్‌ డీలర్‌ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు.
    2 . రౌడీ అల్లుడు(అక్టోబర్ 18 , 1991)
    U|డ్రామా,థ్రిల్లర్
    కళ్యాణ్ ఒక పారిశ్రామికవేత్త, అతని శత్రువులు కుట్ర పన్ని అతని స్థానంలో జానీ అనే మోసగాడిని పంపిస్తారు. అయితే కళ్యాణ్ అమాయకత్వాన్ని తెలుసుకున్న జానీ అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు.
    3 . ఘరానా మొగుడు(ఏప్రిల్ 09 , 1992)
    U|యాక్షన్,హాస్యం,డ్రామా
    పారిశ్రామికవేత్త కుమార్తె అయిన ఉమకు అహంకారం ఎక్కువ. అయితే తన ఫ్యాక్టరీలో ఎదురు తిరిగిన రాజాకు గుణపాఠం చెప్పాలని అతన్ని వివాహం చేసుకుంటుంది. క్రమంగా అతనితో ప్రేమలో పడుతుంది.
    4 . శంకర్ దాదా MBBS(అక్టోబర్ 15 , 2004)
    U|172 minutes|హాస్యం
    శంకర్ దాదా.. స్థానికంగా సెటిల్‌మెంట్లు చేసే రౌడీ. చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయిన శంకర్ దాదా... తన తల్లిదండ్రులకు తానొక డాక్టర్‌ అని అబద్దం చెబుతాడు. అయితే శంకర్ డాక్టర్ కాదన్న విషయాన్ని రామలింగేశ్వరరావు అతని తల్లిదండ్రులకు చెబుతాడు.
    5 . అందరివాడు(జూన్ 04 , 2005)
    UA|162 minutes|హాస్యం
    గోవిందరాజులు (చిరంజీవి) అనే మేస్త్రికి టెలివిజన్ షోను నడిపించే సిద్ధార్థ్ (చిరంజీవి) కుమారుడు. సిద్ధార్థ్ చిన్నతనంలోనే తల్లి మరణిస్తే గోవిందరాజులు తన కొడుకు కోసం మళ్ళీ పెళ్ళి చేసుకుండా అతన్ని ప్రేమగా పెంచుతాడు. సిద్ధార్థ్ ఒక టీవీ ఛానల్‌లో రిపోర్టరుగా పనిచేస్తుంటాడు. అయితే, సిద్ధార్థ్ ఓ కాంట్రాక్టర్ కుమార్తెను వివాహం చేసుకున్న తర్వాత గోవిందరాజులు దూరమయ్యే అవకాశం ఏర్పడుతుంది.
    6 . బావగారూ బాగున్నారా!(ఏప్రిల్ 09 , 1998)
    U|రొమాన్స్
    న్యూజిలాండ్‌లో రాజు, స్వప్న ప్రేమించుకుంటారు. ఇండియాకు వచ్చిన తర్వాత ఆత్మహత్యకు యత్నిస్తున్న ప్రెగ్నెంట్‌ మహిళను రాజు కాపాడతాడు. సాయం చేసేందుకు భర్తగా ఆమె ఇంటికి వెళ్తాడు. కడుపుతో ఉన్న మహిళ స్వప్నకు సోదరి కావడంతో కథ మలుపు తిరుగుతుంది.
    7 . చంటబ్బాయి(ఆగస్టు 22 , 1986)
    U|హాస్యం,డ్రామా
    పాండు రంగారావు ఒక డిటెక్టివ్, జేమ్స్ పాండ్‌గా ప్రసిద్ధి చెందాడు. ఒక మహిళ తప్పిపోయిన తన సోదరుడిని కనిపెట్టేందుకు పాండు రంగారావును కలవడంతో అతని జీవితం ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది.
    8 . అత్తకు యముడు అమ్మాయికి మొగుడు(జనవరి 14 , 1989)
    U|140 minutes|డ్రామా
    కళ్యాణ్‌ సోదరి డబ్బున్న వ్యక్తిని ప్రేమిస్తుంది. అహంకారి అయిన తల్లికి భయపడి ఆ వ్యక్తి పెళ్లి గురించి ఆలోచిస్తుంటాడు. కళ్యాణ్‌ రంగంలోకి దిగి తల్లికి గుణపాఠం చెప్పాలని అనుకుంటాడు. ఇందుకు ఆమె కూతురు సాయం చేస్తుంది.

    ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుని అత్తతో పోరాటం సాగించే పాత్రలో నటించాడు చిరంజీవి. కళ్యాణ్‌ పాత్రను పోషించి కామెడీని పండించాడు.

    9 . అన్నయ్య(జనవరి 07 , 2000)
    UA|157 mins|హాస్యం,డ్రామా
    రాజారామ్ తన ఇద్దరు తమ్ముళ్లను ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. వారు చేసే అల్లరి పనులను ఎప్పుడూ క్షమిస్తుంటాడు. ఒక సంఘటన వల్ల రాజారామ్ తన తమ్ముళ్లను ఇంట్లో నుంచి గెంటి వేస్తాడు. కానీ వారికి రహస్యంగా సహాయం చేస్తూనే ఉంటాడు. అయితే రాజారామ్ తమ్ముళ్లు మాత్రం అతన్ని ద్వేషించుకుంటారు.

    తమ్ముళ్ల కోసం ఏమైనా చేసే అన్నయ్య పాత్రలో నటించాడు చిరంజీవి. చిత్రంలో ఔట్ అండ్ ఔట్ కామెడీ ఉంటుంది. అమాయకత్వంతో చేసే కామెడీ ఇప్పటికీ గుర్తుండిపోతుంది.

    10 . ముగ్గురు మొనగాళ్లు(జనవరి 07 , 1994)
    U|యాక్షన్,డ్రామా
    ముగ్గురు కవల సోదరులు తమ తండ్రిని హత్య చేసిన దుండగుడి వల్ల పుట్టుకతోనే విడిపోతారు. వారు పెరిగి పెద్దయ్యాక కలుసుకుని తమ తండ్రి మరణానికి కారణమైన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడానికి బయల్దేరుతారు.

    చిన్నప్పుడే దూరమైన ముగ్గురు అన్నదమ్ములు కలిసి తమ తండ్రిని చంపిన వాడిపై ప్రతీకారం తీర్చుకోవడమే ఈ సినిమా కథ. చిరంజీవి ట్రిపుల్ రోల్ చేశాడు. ఈ రోల్స్‌లో కామెడీ పండించిన తీరు అద్భుతం.


    @2021 KTree