టాలీవుడ్‌లో నయా ట్రెండ్ నడుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో వస్తున్న సినిమాలు బంపర్ హిట్ సాధిస్తున్నాయి. పల్లెటూరి వాతావరణం, ఆహార్యం, యాస, ఆచార సంప్రదాయాలను ఎన్నో సినిమాలు ప్రతిబింబిస్తున్నాయి. ఇలా వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సైతం అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన టాప్-10 చిత్రాలు మీకోసం.

పూర్తిగా గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమా ఇది. రుద్రవనం అనే గ్రామంలో జరిగే ఘటనల చుట్టూ సినిమా కథను రాసుకున్నాడు డైరెక్టర్ కార్తీక్ దండు. 1990వ దశకంలో గ్రామాల్లోని పరిస్థితి ఎలా ఉండేది? మూఢ నమ్మకాలను ఎంత బలంగా విశ్వసించేవారు? పల్లెటూరి వాతావరణం వంటి వాటిని ఇందులో చూపించారు.

సుకుమార్ తెరకెక్కించిన మరో చిత్రం పుష్ప. శేషాచలం అడవుల్లోని గ్రామాల్లో నెలకొనే పరిస్థితులపై సినిమా తెరకెక్కింది. నటీనటుల వేష, భాష అచ్చం రాయలసీమను ప్రతిబింబిస్తాయి. బాక్సాఫీస్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుందీ సినిమా. పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్ ఇరగదీశాడు.

.jpeg)
అంచనాలు లేకుండా వచ్చి సంచలనం రేపిన సినిమా ‘బలగం’. ఇదొక ఊరి కథ. ప్రతి గ్రామంలోని ఓ కుటుంబంలో ఉండే కామన్ సమస్యను ఇందులో చూపించాడు డైరెక్టర్ వేణు యెల్దండి. గ్రామస్థుల మధ్య సంబంధ, బాంధవ్యాలు; వ్యవహార శైలిని కళ్లకు కట్టినట్లు తీశాడు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం పెను సంచలనం సృష్టించింది. ఊర్లలో ప్రత్యేకంగా ఈ సినిమాను స్క్రీనింగ్ చేశారు. బండ్లు, బస్సులు, ట్రాక్టర్లు కట్టుకుని థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లారు.

సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన మొదటి చిత్రం ‘దసరా’. సింగరేణి బొగ్గు గనుల్లో ఉన్న ‘వీర్లపల్లి’ అనే గ్రామం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ముఖ్యంగా, ఇక్కడి మనుషుల అలవాట్లు, కట్టుబాట్లు, వేష భాషను సినిమాలో చక్కగా చూపించారు. తెలంగాణ మాండలికంలో డైలాగులు చెబుతూ నాని యాక్టింగ్ ఇరగదీశాడు. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను ఈ సినిమా రాబట్టింది.

రంగస్థలం అనే గ్రామాన్ని సృష్టించి ఈ సినిమా తెరకెక్కించారు. ఇందులో నదీ పరివాహక ప్రాంతం, పొలాలు, గుడిసెలు.. అంతా పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. తన నటనతో రామ్‌చరణ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు.