• TFIDB EN
 • Editorial List
  Telugu Pan India Movies: జాతీయ స్థాయిలో పాపులర్‌ అయిన టాలీవుడ్‌ చిత్రాలు
  Dislike
  1 Likes 2k+ views
  8 months ago

  ఒకప్పుడు టాలీవుడ్‌ అంటే కేవలం రెండు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయి. తెలుగులోనూ పాన్‌ ఇండియా స్థాయి చిత్రాలు వస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఆదరణ పొందుతున్నాయి. అంతేగాక పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులను సైతం కొల్లగొడుతున్నాయి. టాలీవుడ్‌ సత్తా ఎంటో ఇతర ఇండస్ట్రీలకు తెలయజేస్తున్నాయి. జాతీయ స్థాయిలో పాపులర్‌ అయిన, రిలీజ్‌కు ముందే యావత్‌ దేశం చర్చించుకుంటున్న టాప్‌-10 తెలుగు చిత్రాలు మీకోసం.

  ఇంగ్లీష్‌లో చదవండి

  1 . ఆర్ఆర్ఆర్(మార్చి 25 , 2022)
  U/A|182 minutes|యాక్షన్,డ్రామా,హిస్టరీ
  నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్‌)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ.

  దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ చిత్రం ద్వారా తారక్‌, రామ్‌చరణ్‌ పాన్‌ ఇండియా స్టార్లుగా మారిపోయారు. ఈ మూవీలోని ‘నాటు నాటు’ పాట ఏకంగా ఆస్కార్ అవార్డును కొల్లగొట్టింది.

  2 . పుష్ప: ది రైజ్ - పార్ట్ 01(డిసెంబర్ 17 , 2021)
  U/A|179 minutes|యాక్షన్,థ్రిల్లర్
  పుష్ప (అల్లుఅర్జున్‌) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్‌ ఘోష్‌) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్‌)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ.

  అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’ సినిమా కూడా జాతీయ స్థాయిలో బాగా పాపులర్‌ అయ్యింది. ఇందులో బన్నీ నటనకు బాలీవుడ్‌ అభిమానులు సైతం ఫిదా అయ్యారు. ఈ సినిమా రిలీజ్‌ తర్వాత బన్నీ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా రాబోతోంది. ప్రస్తుతం ‘పుష్ప2’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

  3 . దసరా(మార్చి 30 , 2023)
  U/A|156 minutes|యాక్షన్,అడ్వెంచర్,డ్రామా
  ధరణి తన స్నేహితులతో కలిసి బొగ్గుని దొంగతనం చేస్తూ.. మద్యం సేవిస్తూ అందరితో గొడవలు పడుతూ ఉంటాడు. కానీ మరుసటి రోజు అవన్నీ మర్చిపోతాడు. ఈ క్రమంలో ఓ రోజు చిన్న నంబి ( షైన్ టామ్ చాకో) సిల్క్ బార్‌లో కూడా గొడవపడి మర్చిపోతాడు. దానిని చిన్న తంబి చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ఈక్రమంలో ఓ రాత్రి ముసుగు దుండగులు ధరణి ప్రాణ స్నేహితుడిని చంపుతారు. ఇంతకు ధరణి స్నేహితుడిని చంపిందెవరు? వారిపై ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు అన్నది మిగతా కథ

  ఈ ఏడాది టాలీవుడ్‌ నుంచి రిలీజైన పాన్‌ ఇండియా చిత్రం దసరా. ఇందులో నాని తన నటనతో పూనకాలు తెప్పించాడు. దర్శకుడు శ్రీకాంత్‌ ఒదెల తన తొలి సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు. ఇందులో కీర్తి సురేష్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

  4 . మేజర్(జూన్ 03 , 2022)
  U/A|146 minutes|థ్రిల్లర్,యాక్షన్,బయోగ్రఫీ
  సందీప్‌ ఉన్నికృష్ణన్‌ (అడివి శేష్‌) కష్టపడి ఆర్మీలో చేరతాడు. అంచెలంచెలుగా ఎదిగి NSG కమాండోలకు శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదుగుతాడు. ఈ క్రమంలోనే ముంబయి తాజ్‌ హోటల్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడటంతో వారిని మట్టుబెట్టే బాధ్యత సందీప్‌ బృందంపై పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
  5 . బాహుబలి: ది బిగినింగ్(జూలై 10 , 2015)
  U/A|158 minutes (Telugu)159 minutes (Tamil)|యాక్షన్,డ్రామా,హిస్టరీ
  మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు... ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు.
  6 . బాహుబలి 2: ది కన్‌క్లూజన్(ఏప్రిల్ 28 , 2017)
  U/A|171 minutes|యాక్షన్,డ్రామా,ఫాంటసీ
  అమరేంద్ర బాహుబలి కుమారుడైన మహేంద్ర బాహుబలి తన వారసత్వం గురించి కట్టప్ప ద్వారా తెలుసుకుంటాడు. మాహిష్మతి సింహాసనాన్ని అధిష్టించేందుకు.. భళ్లాలదేవుడితో యుద్ధంలో పోరాడుతాడు.
  7 . ఈగ(జూలై 06 , 2012)
  U/A|134 minutes|ఫాంటసీ,రొమాన్స్
  నాని, బిందు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అయితే బిందుపై కన్నేసిన సుదీప్‌ నానిని చంపేస్తాడు. పూనర్జన్మలో ఈగగా పుట్టిన నాని.. సుదీప్‌పై ఎలా పగ తీర్చుకున్నాడు? అన్నది కథ.
  8 . సలార్(డిసెంబర్ 22 , 2023)
  U/A|177 minutes|థ్రిల్లర్,యాక్షన్
  ఖాన్సార్‌ సామ్రాజ్యానికి రాజ మ‌న్నార్ (జ‌గ‌ప‌తిబాబు) రూలర్‌. సామ్రాజ్యంలోని ప్రాంతాలను దొరలు పాలిస్తుంటారు. ఖాన్సార్‌ పీఠం కోసం రాజ మన్నార్‌ను దొరలు సొంతంగా సైన్యం ఏర్పాటు చేసుకొని హత్య చేస్తారు. తండ్రి కోరిక మేరకు వ‌ర‌ద రాజమ‌న్నార్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌) ఖాన్సార్‌కు రూలర్‌ అవ్వాలని భావిస్తాడు. ఇందుకోసం చిన్ననాటి స్నేహితుడు దేవా (ప్ర‌భాస్‌) సాయం కోరతాడు. ఆ ఒక్క‌డు అంత‌మంది దొరల సైన్యాన్ని ఎలా ఎదిరించాడు? అన్నది స్టోరీ.

  టాలీవుడ్‌కు చెందిన పలు చిత్రాలు రిలీజ్‌కు ముందే దేశవ్యాప్తంగా సెన్సేషన్‌ క్రియేట్ చేస్తున్నాయి. ప్రభాస్‌ హీరోగా కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న ‘సలార్‌’ చిత్రం జాతీయ స్థాయిలో క్రేజ్‌ సొంతం చేసుకుంది. ఈ మూవీకి సంబంధించి ఏ చిన్న అప్‌డేట్‌ వచ్చిన దేశమంతా ఆసక్తిగా తెలుసుకుంటోంది.

  9 . కల్కి 2898 ఎ.డి(జూన్ 27 , 2024)
  U/A|యాక్షన్,థ్రిల్లర్,సైన్స్ ఫిక్షన్
  రేటింగ్ లేదు
  కల్కి 2898-A.D అనేది నాగ్ అశ్విన్ రచన మరియు దర్శకత్వం వహించిన రాబోయే భారతీయ పురాణ సైన్స్ ఫిక్షన్ చిత్రం. వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వని దత్ దీనిని నిర్మించారు. ఈ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని మరియు పశుపతి సహా సమిష్టి తారాగణం.

  ప్రభాస్‌ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్ట్‌ K. ఈ సినిమా టైటిల్‌ను ఇటీవలే ‘కల్కి 2898 ఏడీ’గా మార్చారు. ఈ మూవీపై కూడా జాతీయ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం వచ్చిన ఈ మూవీ గ్లింప్స్‌ సగటు సినీ అభిమానిని షేక్‌ చేసింది.

  10 . దేవర(అక్టోబర్ 10 , 2024)
  U/A|యాక్షన్,డ్రామా,థ్రిల్లర్
  రేటింగ్ లేదు
  అనగనగా ఓ సముద్ర తీరం! అక్కడ ఓ రాజకుటుంబం ఉంటుంది. నరరూప రాక్షసుల వంటి మృగాల చేతిలో ఆ తీర ప్రాంత ప్రజలు బాధలు పడుతుంటారు. ఇకపై వాళ్ళ సంరక్షణ బాధ్యత తమది అని ఆ రాజకుటుంబం హామీ ఇస్తుంది. అప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న రాజ కుటుంబం వారసుడు దేవర(జూ.ఎన్టీఆర్) అడుగు పెట్టి... రాక్షస సంహారం చేస్తాడు. ఆ మృగాల మధ్య పెరిగిన మేలిమి ముత్యం లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు.. ఇదీ దేవర అసలు కథ. RRR తర్వాత జూ.ఎన్టీఆర్ నటిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. మరోవైపు ఆచార్య వంటి డిజాస్టర్ మూవీ తర్వాత కొరటాల శివ దేవర సినిమాను తెరకెక్కిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

  ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత తారక్‌ నటిస్తున్న మరో పాన్‌ ఇండియా చిత్రం దేవర. ఇందులో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.


  @2021 KTree