• TFIDB EN
  • Editorial List
    తెలుగులో ‘మిక్స్‌ అప్‌’ మాదిరి బోల్డ్ కంటెంట్ చిత్రాలు
    Dislike
    1 Likes 500+ views
    8 months ago

    తాజాగా ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదలైన 'మిక్స్‌ అప్' వెబ్‌ సిరీస్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రాన్ని చూసేందుకు ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. బోల్డ్‌ కంటెంట్‌ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్‌ బేస్ ఉంటుంది. ఆ తరహా చిత్రాలను చూసేందుకు ఆసక్తిని కనబరుస్తుంటారు. ఈ క్రమంలో తెలుగులో వచ్చిన బొల్డ్ కంటెంట్ సినిమాలు, వెబ్‌ సిరిస్‌లపై ఓలుక్ వేద్దాం

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . మీర్జాపూర్(నవంబర్ 16 , 2018)
    UA|38–65 minutes|థ్రిల్లర్
    మీర్జాపూర్‌ అనే ఓ సంపన్న ప్రాంతాన్ని త్రిపాఠి వంశస్తులు ఏలుతుంటారు. అయితే ఆ ప్రాంతంపై ఆదిపత్యం కోసం త్రిపాఠి శత్రువులు అదును కోసం ఎదురు చూస్తుంటారు. త్రిపాఠిల వారసుడైన మున్నా అనాలోచిత చర్యల వల్ల కొత్త శత్రువులు తయారవుతారు. వారు త్రిపాఠిల అధికారనికి సవాలు విసురుతారు.
    2 . ఆరుగురు పతివ్రతలు(ఫిబ్రవరి 06 , 2004)
    UA|ఫ్యామిలీ
    ఆరుగురు చిన్ననాటి స్నేహితులు ఆరేళ్ల తర్వాత తిరిగి కలుస్తారు. అందరు ఒక దగ్గర చేరి వారి వైవాహిక జీవితంలో జరిగిన సాధక బాధకాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
    3 . 7G బృందావన కాలనీ(నవంబర్ 06 , 2004)
    U|185 minutes (Tamil) 174 minutes (Telugu)|డ్రామా,రొమాన్స్
    పనిపాటలేని రవి అనే వ్యక్తి పక్కింట్లోకి అనిత అనే అమ్మాయి తన కుటుంబంతో మారుతుంది. ఆమెతో రవి ప్రేమలో పడుతాడు. అనిత ఇంప్రెస్ చేసేందుకు రవి తన శక్తిమేర ప్రయత్నించినప్పటకీ విఫలమతుంటాడు. చివరకు రవి తనపై చూపుతున్న ప్రేమకు చలించిన అనిత తాను కూడా అతన్ని ప్రేమిస్తుంది. ఓ అనుకోని సంఘటన పెద్ద విషాదానికి దారితీస్తుంది.
    4 . RX 100(జూలై 12 , 2018)
    A|153 minutes|యాక్షన్,రొమాన్స్
    సెలవులకు ఇంటికి వచ్చిన ఇందు (పాయల్‌) ఊర్లోని శివ (కార్తికేయ)ను ప్రేమిస్తుంది. పెళ్లికి ముందే అతనితో శారీరకంగా దగ్గరవుతుంది. అయితే ఓ రోజు ఇందు అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది. మరి శివ ఏమయ్యాడు? ఇందు వేరే పెళ్లి ఎందుకు చేసుకుంది? అన్నది మిగతా కథ.
    5 . కుమారి 21F(నవంబర్ 20 , 2015)
    A|135 minutes|రొమాన్స్
    సిద్ధూ, కుమారి అనే అందమైన అమ్మాయిని ప్రేమిస్తాడు. బోల్డ్ యాటిట్యూడ్ వల్ల ఆమె ప్రేమను అనుమానిస్తాడు. ఓ రోజు ఓ సంఘటన ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది.
    6 . గుంటూరు టాకీస్(మార్చి 04 , 2016)
    A|158 min|హాస్యం,రొమాన్స్
    గిరి (నరేష్), హరి (సిద్ధు) ఓ మెడికల్‌ షాపులో పనిచేస్తూనే అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తుంటారు. ఓ దశలో పెద్ద దొంగతనమే చేయాలని నిర్ణయించుకొని ఓ ఇంట్లో 5 లక్షల రూపాయలను దోచేస్తారు. ఆ తర్వాత వారి జీవితాలు అనుకోని మలుపు తిరిగాయి. చివరికీ వీరి కథ ఎటు పోయింది? అన్నది కథ.
    7 . నేను(ఏప్రిల్ 15 , 2004)
    UA|డ్రామా
    మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది.
    8 . బాబు బాగా బిజీ(మే 05 , 2017)
    A|హాస్యం
    మాధవ్ అనేక మంది స్త్రీలతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటాడు. అయితే, మాధవ్ తన డ్రీమ్ గర్ల్ రాధను కలిసినప్పుడు అతను తన మార్గాన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తాడు.
    9 . చీకటి గదిలో చితక్కొట్టుడు(మార్చి 21 , 2019)
    A|హాస్యం,హారర్
    ఓ స్నేహితుల బృందం బ్యాచిలర్ పార్టీ కోసం నగరానికి దూరంగా ఉన్న విల్లాకు వెళ్తారు. ఆ విల్లాలో వారికి వింత పరిస్థితి ఎదురవుతుంది. ఓ అదృశ్య శక్తి వారిని వెంబడిస్తుంటుంది.
    10 . ఒదెల రైల్వే స్టేషన్(ఆగస్టు 26 , 2022)
    A|91 minutes|థ్రిల్లర్,క్రైమ్
    అనుదీప్ (సాయి రోనక్) ఐపీఎస్‌ అధికారి. ట్రైనింగ్ కోసం ఓదెల వెళతాడు. ఈ క్రమంలో ఆ ఊరిలో వరుస హత్యాచారాలు తీవ్ర కలకలం రేపుతాయి. మరి అనుదీప్‌ హంతకుడ్ని పట్టుకున్నాడా? కేసు విచారణలో రాధ (హెబ్బా పటేల్‌) అతడికి ఎలా సాయపడింది? అనేది కథ.
    11 . రానా నాయుడు(మార్చి 10 , 2023)
    A|39-50 minutes|థ్రిల్లర్
    రానా నాయుడు బాలీవుడ్‌లో ఎలాంటి సమస్యనైనా చిటికెలో పరిష్కరిస్తుంటాడు. అతడి తండ్రి జైలు నుంచి విడుదలైన తర్వాత రానా నాయుడు జీవితం కీలక మలుపు తిరుగుతుంది.

    @2021 KTree