• TFIDB EN
  • మెగాస్టార్ చిరంజీవి ఫిల్మోగ్రఫీ గురించి మరింత చదవండి
    Dislike
    1 Likes 3k+ views
    11 months ago

    మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు 156 చిత్రాల్లో నటించారు. యాక్షన్, కామెడీ, ఎమోషన్ వంటి అనేక చిత్రాలు చేసి నటనలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. అటు భక్తిరస చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకుల హృదయాలను గెలిచి చిరంజీవి మెగాస్టార్‌గా ఎదిగారు.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . Top 10 Chiranjeevi Movies: చిరంజీవి ఉత్తమ 10 చిత్రాలు ఇవే
    తెలుగు చిత్రసీమలో పరిచయం అక్కర్లేని పేరు చిరంజీవి. కొణిదెల శివ శంకర వరప్రసాద్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి సుప్రీం హీరోగా ఎదిగి మెగాస్టార్‌గా స్థిరపడ్డాడు. సినీ కెరీర్‌లో 150కు పైగా చిత్రాల్లో నటించిన ఘనత మెగాస్టార్ సొంతం. ప్రతి సినిమాకు ఒక ప్రత్యేకత. అందులో ఉత్తమ మైన చిత్రాలేంటో చెప్పడం కాస్త కష్టమే. నటన, సినిమాకు వచ్చిన ఆదరణ, విమర్శకుల ప్రశంసలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే కొన్ని సినిమాల పేర్లను ప్రస్తావించొచ్చు. అవేంటో చూద్దాం.
    2 . Chiranjeevi Vijayashanthi: చిరంజీవి- విజయశాంతి జంటగా నటించిన చిత్రాలు ఎన్నో తెలుసా?
    మెగాస్టార్ చిరంజీవి మరే హీరోయిన్‌తో తీయనన్ని సినిమాలు లెడీబాస్ విజయశాంతితో తీశాడు. వీరిద్దరి కాంబోలో మొత్తం 19 చిత్రాలు వచ్చాయి. 90వ దశకంలో వీరికి హిట్ పెయిర్‌ అనే పేరు ఉండేది. వీరి కాంబోలో చిత్రం విడుదలైందంటే థియేటర్లకు అభిమానులు పరుగులు తీసేవారు. చిరంజీవి- విజయశాంతి జంటగా నటించిన చిత్రాల్లో గ్యాంగ్ లీడర్, పసివాడి ప్రాణం, స్వయంకృషి, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి.
    3 . Chiranjeevi Dual Role Movies: మెగాస్టార్ చిరంజీవి డబుల్ రోల్స్ చేసిన సినిమాలు ఎన్నో తెలుసా?
    మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీకి మకుటంలేని మహారాజు. ఆయన 150కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల చేత మెగాస్టార్‌గా పిలుపించుకున్నారు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయ్యారు. ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను రంజింపజేశారు. ఈ సందర్భంగా అనేక సినిమాల్లో డ్యూయర్ రోల్స్ చేసి తనదైన ముద్ర వేశారు. మరి మెగాస్టార్ చిరంజీవి డబుల్ రోల్స్‌లో నటించిన చిత్రాలు ఏవో ఓసారి చూసేద్దామా..
    4 . CHIRANJEEVI- RAJINIKANTH: చిరంజీవి, రజనీకాంత్ కలిసి ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా?
    చిరంజీవి, రజనీకాంత్ అంటే తెలుగు, తమిళరాష్ట్రాల ప్రేక్షకులకు ఆరాధ్యులు. వారి వారి స్టైల్, యాక్షన్, డ్యాన్స్‌తో అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. స్క్రీన్‌పై తమదైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అయితే ఇద్దరు లెజెండరీ హీరోలు కలిసి నటించారన్న సంగతి మీకు తెలుసా? అవును మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ రెండు పూర్తి స్తాయి సినిమాల్లో నటించారు. మరి ఆ సినిమాలెంటో ఓసారి చూద్దాం
    5 . Best Telugu Patriotic Movies: గూస్ బంప్స్ తెప్పించే 8 గొప్ప దేశ భక్తి చిత్రాలు..!
    సినిమా అంటే ప్రేక్షకులకు వినోదం మాత్రమే కాదు సామాజిక స్పృహను సైతం కలిగించాలి. దేశం పట్ల, సమాజం పట్ల పౌరులకు ఉన్న బాధ్యతను గుర్తు చేస్తూ ఉండాలి. అలా దేశభక్తిని ప్రేక్షకుల్లో రగిలించి వెండి తెరపై వెలిగిపోయిన సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఉన్నాయి. దేశ భక్తికి కమర్షియల్ హంగులు అద్ది బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. అలాంటి సినిమాలు ఏమున్నాయో ఓసారి చూద్దాం.
    6 . చిరంజీవి- రాధికను హిట్ పేయిర్‌గా నిలిపిన సినిమాలు ఇవే!
    తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి- రాధిక జంటకు సిల్వర్ స్క్రీన్ పేయిర్‌గా మంచి గుర్తింపు ఉంది. వీరిద్దరు కలిసి 16 చిత్రాల్లో నటించారు. వీటిలో చాలా సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. వాటిపై ఓలుక్ వేద్దాం.
    7 . Chiranjeevi- Radha Movies: చిరంజీవి- రాధ మొత్తం ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా?
    విజయశాంతి(19) తర్వాత చిరంజీవితో అత్యధిక సినిమాల్లో నటించిన హీరోయిన్ రాధ. ఈమె ఏకంగా 16 సినిమాల్లో నటించి చిరంజీవితో హిట్‌ పేయిర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. వీటిలో 10 చిత్రాలు హిట్‌గా నిలిచాయి. వాటిపై ఓ లుక్‌ వేద్దాం.
    8 . 2023 టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన టాప్ 10 చిత్రాలు
    2023 ఏడాది టాలీవుడ్‌లో మంచి విజయాలు నమోదయ్యాయి. పెద్ద హీరోల సినిమాలకు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. మరో నెలలో 2023 ఏడాది ముగియనుంది. ఈనేపథ్యంలో టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన టాప్ 10 సినిమాలను ఓసారి చూసేద్దామా..!
    9 . తెలుగులో చిరంజీవి, రమ్యకృష్ణ జంటగా నటించిన చిత్రాలు ఇవే
    మెగాస్టార్ చిరంజీవి, రమ్యకృష్ణ సిల్వర్ స్క్రీన్‌ పేయిర్‌గా మంచి గుర్తింపు ఉంది. వీరిద్దరు జంటగా మొత్తం ఐదు చిత్రాల్లో నటించారు. వీటిలో అల్లుడా మజాకా, ఇద్దరు మిత్రులు వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. వాటపై ఓ లుక్ వేయండి.
    10 . Chiranjeevi Top 10 Action Movies: చిరంజీవి ఉత్తమ 10 యాక్షన్ చిత్రాలు
    చిరంజీవి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. నవ రసాలను తెరపై పండించగల నేర్పరి. అందులోనూ పోరాట సన్నివేశాల్లో తనదైన మ్యానరిజంను చూపించాడు. యాక్షన్ మూవీస్‌లో తన మార్క్ స్టైల్‌ని సెట్ చేసి ట్రెండ్ సృష్టించాడు. తన కెరీర్‌లో 150కు పైగా సినిమాలు చేశాడు చిరంజీవి. వీటిలో యాక్షన్ మూవీస్‌ని లెక్కపెట్టడం కాస్త కష్టమే. అయితే, జనాదరణను పొందిన యాక్షన్ మూవీస్ ఏంటో చూద్దాం.
    11 . Top 10 Chiranjeevi Comedy Movies: చిరంజీవి టాప్ 10 కామెడీ చిత్రాలు
    చిరంజీవి కామెడీ టైమింగే వేరు. ‘హలో మాస్టారూ’ అన్నా, ‘ఫేస్ కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకో’ అని చెప్పినా కామెడీ పండాల్సిందే. సీరియస్ టోన్‌లోనూ కడుపుబ్బా నవ్వించే సత్తా చిరంజీవి సొంతం. స్క్రీన్‌పై వేరియేషన్లను చూపిస్తూ ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేయగలడు ఈ మెగాస్టార్. తన కెరీర్‌లో చేసిన 150కు పైగా సినిమాల్లో కామెడీ డోజున్న చిత్రాలు ఎక్కువే. అవేంటో ఇప్పుడు చూద్దాం.
    12 . ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?
    తెలుగు ప్రేక్షకులకు ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాం బోలెడంతా వినోదాన్ని పంచుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో అలరిస్తుంటుంది. అయితే తాజాగా మరికొన్ని హిట్ చిత్రాలను ఫ్రీ స్ట్రీమింగ్ జాబితాలో చేర్చింది. వీటిలో పరుగు, లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్, 100% లవ్ వంటి హిట్‌ సినిమాలు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం వీటిని చూసి ఆనందించండి మరి..
    13 . Chiranjeevi Negative Roles Movies: చిరంజీవి ప్రతినాయక పాత్రలు పోషించిన చిత్రాలు
    కెరీర్‌లో 150కు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. తన సినీ ప్రస్థానంలో ఎన్నో రకాల పాత్రలను పోషించాడు. తొలి నాళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా నటించిన సందర్భాలున్నాయి. హీరోగానే కాకుండా, ప్రతి నాయక పాత్రల్లోనూ చిరంజీవి మెప్పించడం విశేషం. పాత్ర ఏదైనా నటుడిగా నిరూపించుకోవాలన్న తపన చిరంజీవిని లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చింది. చిరంజీవి నెగెటివ్ రోల్ చేసిన సినిమాలేంటో చూద్దాం.
    14 . Chiranjeevi as Police Officer Movies: చిరంజీవి పోలీస్ పాత్రల్లో నటించిన సినిమాలు
    మెగాస్టార్ చిరంజీవి చెయ్యని పాత్రంటూ లేదు. ఏ పాత్ర చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటాడు. తన కెరీర్‌‌లో ఎన్నో పోలీసాఫీసర్ పాత్రలు పోషించాడు. ఓ పోలీస్ అధికారికి ఉండే హుందా తనాన్ని చక్కగా ప్రదర్శిస్తూ అభినయం పండించేవాడు చిరంజీవి. డైలాగుల్లోనూ గాంభీర్యాన్ని చూపేవాడు. అలా చిరంజీవి పోలీస్ అధికారి పాత్రలు పోషించిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. చిరు పోలీస్ ఆఫీసర్‌గా చేసిన సినిమాలు ఇవే.
    15 . ప్రముఖ ఓటీటీల్లో ఫ్రీగా ఈ సినిమాలు ఇంకా వెబ్‌ సిరీస్‌లు చూసేయండి
    ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అయిన ఆహా, ఈటీవీ విన్, హాట్‌స్టార్, జియో సినిమా తమ లిస్ట్‌లో కొత్తగా ఫ్రీ కంటెంట్‌ను చేర్చాయి. వీటిలో సూపర్ హిట్ వెబ్‌ సిరీస్‌లతో పాటు సినిమాలు కూడా ఉన్నాయి. ఆ లిస్ట్‌ను ఇక్కడ అందిస్తున్నాం. వాటిలో మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని ఆనందించండి.
    16 . Chiranjeevi Dual Role Movies: చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు
    ‘రజినీకాంత్ స్టైల్‌ని, కమల్ హాసన్‌ నటనని కలిపితే చిరంజీవి’ అని నాడు దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్ కితాబిచ్చారు. చిరంజీవి నటనా కౌశలానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది. ఏ పాత్రనైనా ఆకళింపు చేసుకుని సులువుగా నటించేయగల సత్తా మెగాస్టార్‌ది. విభిన్న కోణాలున్న పాత్రలను చేయడంలోనూ దిట్ట. అందుకే చాలా చిత్రాల్లో ఒకటి కంటే ఎక్కువ పాత్రలను చేశాడు. డ్యుయల్, ట్రిపుల్ రోల్‌లో నటించిన చిత్రాలేవో తెలుసుకుందాం.
    17 . Chiranjeevi Top 10 Family Movies: చిరంజీవి టాప్ 10 ఫ్యామిలీ మూవీస్
    చిరంజీవికి ప్రత్యేమమైన ఫ్యామిలీ ఆడియెన్స్ ఉంటారు. సినిమా కథల ఎంపికలో చిరంజీవి ఫ్యామిలీ మూవీస్‌కి ప్రాధాన్యం ఇస్తాడు. సెంటిమెంట్, ఎమోషన్స్‌ని పండించడంలోనూ మెగాస్టార్‌కు సాటిరారంటే అతిశయోక్తి కాదు. తండ్రిగా, కొడుకుగా, అన్నయ్యగా, తమ్ముడిగా, అల్లుడిగా.. ఇలా చిరు నటించిన పాత్ర లేదు. అన్నింట్లోకి పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుడితో కంటతడి పెట్టించగలడు. 150కు పైగా సినిమాలలో ఎన్నో చిత్రాలు ఫ్యామిలీ ఆడియెన్స్‌‌కి దగ్గరయ్యాయి. అందులో టాప్ 10 సినిమాలేంటో చూద్దాం.
    18 . చిరంజీవిని మెగాస్టార్ చేసిన టాప్ 10 చిత్రాలు ఇవే!
    మెగాస్టార్ చిరంజీవి గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మెగాస్టార్‌ స్థాయికి ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. దాదాపు 2 దశాబ్దాలు తెలుగు ఇండస్ట్రీని శాసించారు. ఆయన కెరీర్‌లో గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్నో మరుపురాని చిత్రాలను సినీ ప్రియులకు అందించారు. తనదైన డ్యాన్స్‌, మ్యానరిజంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు ప్రేక్షకుల చేత అన్నయ్య అని పిలిపించుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవిని మెగాస్టార్‌ను చేసిన టాప్ చిత్రాలను ఓసారి పరిశీలిద్దాం.
    19 . 2023 సంవత్సరంలో టాలీవుడ్‌లో ఫ్లాప్స్‌గా నిలిచిన టాప్ 10 చిత్రాలు
    2023 ఏడాదిలో విడుదలైన చాలా సినిమాలు ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి. భారీ బడ్జెట్‌తో రూపొంది బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. నిర్మాతలకు పెద్దఎత్తున నష్టాలను మిగిల్చాయి. మరి ఆ చిత్రాలేంటో ఓసారి చూసేయండి

    @2021 KTree