• TFIDB EN
  • Editorial List
    రానా దగ్గుబాటి టాప్ హిట్ చిత్రాలు
    Dislike
    300+ views
    10 months ago

    దగ్గుబాటి నటవారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనతి కాలంలోనే విలక్షణ నటుడిగా రానా పేరు తెచ్చుకున్నాడు. తన బాబాయి వెంకటేష్ స్టార్ డం తనపై పడకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. రానా ఇప్పటి వరకు చాలా హిట్‌ సినిమాల్లో నటించాడు. సినిమాల్లో అతన్ని చూస్తున్నంత సేపూ నటిస్తున్నట్లుగా అనిపించదు. ఆ క్యాక్టర్‌లో జీవిస్తున్నట్లు కనిపిస్తుంది. మరి రానా తెలుగులో నటించిన టాప్ 10 సూపర్ హిట్ మూవీస్ ఇప్పడు చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . నేనే రాజు నేనే మంత్రి(ఆగస్టు 11 , 2017)
    UA|153 minutes|డ్రామా,థ్రిల్లర్
    నేనే రాజు నేనే మంత్రి అనేది 2017లో విడుదలైన భారతీయ తెలుగు-భాషా రాజకీయ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం, ఇది తేజ రచించి, దర్శకత్వం వహించింది, ఇందులో రానా దగ్గుబాటి మరియు కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించారు, ఇందులో కేథరీన్ థ్రెసా, నవదీప్ మరియు అశుతోష్ రానా ఇతర కీలక పాత్రల్లో నటించారు.

    ఈ చిత్రంలో రానా విలక్షణ పాత్రలో నటించాడు.

    2 . భీమ్లా నాయక్(ఫిబ్రవరి 25 , 2022)
    UA|145 minutes|యాక్షన్,డ్రామా
    బీమ్లా నాయక్‌ (పవన్‌ కల్యాణ్‌) నిజాయతీ గల సబ్‌ ఇన్‌స్పెక్టర్‌. రాజకీయ పలుకుపడి ఉన్న డానియల్ శేఖర్‌ (రానా) కారులో మద్యం సీసాలతో వెళ్తూ పోలీసులకు చిక్కుతాడు. బీమ్లా నాయక్‌ డానియల్‌ను కొట్టి స్టేషన్‌కు తీసుకెళ్లడంతో అతని అహం దెబ్బ తింటుంది. ఆ తర్వాత అతడు ఏం చేశాడన్నది కథ.

    ఈ చిత్రంలో డేనియల్ శేఖర్‌ పాత్రలో పవన్‌ కళ్యాణ్‌తో పోటీ పడ్డాడు.

    3 . బాహుబలి: ది బిగినింగ్(జూలై 10 , 2015)
    UA|158 minutes (Telugu)159 minutes (Tamil)|యాక్షన్,డ్రామా,హిస్టరీ
    మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు... ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు.

    ఈ చిత్రంలో రానా చేసిన భళ్లాలదేవ క్యారెక్టర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. విలన్‌గా అతని క్యారెక్టరైజేషన్ ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తిండిపోతుంది.

    4 . కృష్ణం వందే జగద్గురుమ్(నవంబర్ 30 , 2012)
    UA|139 minutes|యాక్షన్
    బి.టెక్ బాబు అమెరికా వెళ్లిపోదామని అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు. బాబుకి తమ వారసత్వంగా వస్తున్న నాటకాల మీద ఆసక్తి ఉండదు. తాత కోరిక మేరకు చివరిసారి ఓ స్టేజ్‌ నాటకం చేసేందుకు ఒప్పుకుంటాడు. ఆ నాటకం బాబు జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది అన్నది కథ.

    ఈ చిత్రంలో తొలిసారి మాస్‌ రోల్‌లో కనిపించి రానా అలరించాడు. ఐరన్ ఓర్ మాఫియా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.

    5 . లీడర్(ఫిబ్రవరి 19 , 2010)
    U|171 minutes|యాక్షన్,రొమాన్స్
    రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తండ్రి మరణించడంతో స్వార్థపరుడైన వ్యక్తికి అధికారం కట్టబెట్టడం ఇష్టం లేని అర్జున్ సీఎం అవుతాడు. సమాజంలోని అవినీతి, కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటం చేశాడన్నది కథ.

    తొలి చిత్రంతోనే విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్నాడు రానా. ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది.


    @2021 KTree