• TFIDB EN
  • Editorial List
    నవీన్ పొలిశెట్టి టాప్ హిట్ సినిమాలు
    Dislike
    300+ views
    9 months ago

    తెలుగు యంగ్‌ హీరోస్‌లో ప్రస్తుతం క్రేజ్‌లో ఉన్న హీరో నవీన్ పొలిశెట్టి. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హీరోగా ఎదిగిన కొద్ది మంది యువ హీరోల్లో నవీన్ పొలిశెట్టి ఒకడు. అతను నటించిన చిత్రాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న టాప్ చిత్రాలపై ఓలుక్ వేద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . '1' నేనొక్కడినే (జనవరి 10 , 2014)
    UA|177 minutes (theatrical version) 157 minutes (trimmed version)|యాక్షన్,థ్రిల్లర్
    హీరోకి బాధాకరమైన గతం ఉంటుంది. దాని వల్ల అతడ్ని కొన్ని ఆలోచనలు వెంటాడుతాయి. ఈ క్రమంలో హీరో జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హీరో గతం ఏంటి? అన్నది కథ.
    2 . లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్(సెప్టెంబర్ 14 , 2012)
    UA|169 minutes|డ్రామా,రొమాన్స్
    కాలేజీ స్టూడెంట్ అయిన శ్రీను తన హైదరాబాద్‌లోని తన మేన మామ ఇంటికి ఇద్దరు చెల్లెల్లతో వెళ్తాడు. అక్కడ గోల్డ్ ఫేజ్‌లో డబ్బున్న యువకులతో గొడవ పడిన తర్వాత అతని జీవితం మలుపు తిరుగుతుంది. అతని చెల్లెలు ఇబ్బందుల్లో పడుతుంది. మరి అతని చెల్లెలు పడిన ఇబ్బంది ఏంటి? అసలు శ్రీను ఏ ఉద్దేశంతోని హైదరాబాద్ వచ్చాడు అన్నది మిగతా కథ.
    3 . మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(సెప్టెంబర్ 07 , 2023)
    UA|147 minutes|హాస్యం,రొమాన్స్
    మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ.
    4 . జాతి రత్నాలు(మార్చి 11 , 2021)
    U|148 minutes|హాస్యం,డ్రామా
    మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ.

    ఈ చిత్రం స్టార్ డం తెచ్చిపెట్టింది. తొలి బ్లాక్ బాస్టర్ హిట్‌ను అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత నవీన్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి.

    5 . ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ(జూన్ 21 , 2019)
    UA|143 minutes|హాస్యం,థ్రిల్లర్
    ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది.

    ఈ చిత్రంలో నవీన్ నటనకు మంచి గుర్తింపు లభించింది. తొలిసారి హీరోగా సక్సెస్ అందుకున్నాడు.


    @2021 KTree