Editorial List
నాని నటించిన బెస్ట్ కామెడీ సినిమాల లిస్ట్ ఇదే
20+ views1 month ago
టాలీవుడ్‌లో నేచురల్ స్టార్‌గా గుర్తింపు పొందిన నాని తన కెరీర్‌లో అన్ని రకాల పాత్రల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. తనదైన హావభావాలతో కామెడీ పంచ్ డైలాగ్స్ విసురుతుంటారు. ఆయన నటించిన సినిమాల్లో బెస్ట్ కామెడీ చిత్రాలను ఇప్పుడు చూద్దాం.
1 . హాయ్ నాన్న(డిసెంబర్ 07 , 2023)
U|155 minutes|డ్రామా,ఫ్యామిలీ,రొమాన్స్
విరాజ్ (నాని) ఓ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్. తన కూతురు మహి(కియారా) అంటే అతడికి ప్రాణం. కూతురికి సరదాగా కథలు చెప్తుంటాడు విరాజ్. ఓ రోజు అమ్మ కథ చెప్పమంటే విరాజ్ చెప్పడు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది మహి. ఆ తర్వాత ఏం జరిగింది. మహి, యష్న (మృణాల్ ఠాకూర్) ఎలా ఫ్రెండ్స్ అయ్యారు. విరాజ్‌చెప్పిన అమ్మ కథలో వర్ష పాత్ర ఎవరిది? అన్నది కథ.
2 . అష్టా చమ్మా(సెప్టెంబర్ 05 , 2008)
U|హాస్యం,డ్రామా
లావణ్య అనే యువతికి హీరో మహేష్ బాబు అంటే ఇష్టం. అయితే అదే పేరుతో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అయితే తన కాబోయే భర్త అసలు పేరు మహేష్ కాదని తెలియడంతో పరిస్థితులు ఊహించని మలుపులు తిరుగుతాయి.
3 . పైసా(ఫిబ్రవరి 07 , 2014)
UA|144 mins|రొమాన్స్
ప్రకాష్ (నాని)ని నూర్ ప్రేమిస్తుంటుంది. అయితే హీరో స్వీటిని లవ్ చేయడంతో ఇంకొకరితో పెళ్లికి నూర్ ఒప్పుకుంటుంది. నూర్‌పై ప్రేమను గ్రహించిన హీరో ఆమెను కారులో ఎత్తుకెళ్తాడు. అయితే అనుకోకుండా ఆ కారులో ఓ రాజకీయ నాయకుడికి చెందిన డబ్బు ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
4 . అలా మొదలైంది(జనవరి 21 , 2011)
U|135 minutes|రొమాన్స్
లవ్ ఫేయిల్ అయిన ఓ వ్యక్తి ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ఆమెకు అప్పటికే నిశ్చితార్థం జరిగిందని తెలియగానే కథలో ట్విస్ట్ మొదలవుతుంది.
5 . భలే భలే మగాడివోయ్(సెప్టెంబర్ 04 , 2015)
U|145 minutes|హాస్యం,రొమాన్స్
లక్కీ అనే యువకుడు ఒక మొక్కల శాస్త్రవేత్త. మతిమరుపుతో బాధపడుతుంటాడు. నందన అనే అమ్మాయితో ప్రేమలో పడుతాడు. తన లోపాన్ని దాచడానికి కష్టపడుతుంటాడు.
6 . దేవదాస్(సెప్టెంబర్ 27 , 2018)
U|164 mins|యాక్షన్,డ్రామా
దేవ (నాగార్జున) పెద్ద డాన్. ఓ రోజు బుల్లెట్ గాయంతో దాస్ (నాని) క్లినిక్‌కు వస్తాడు. అలా వారి మధ్య పరిచయం ఏర్పడుతుంది. దాస్‌తో స్నేహం దేవ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? తనని చంపాలని చూస్తున్న డేవిడ్‌ను దేవ ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.
7 . మిడిల్ క్లాస్ అబ్బాయి(డిసెంబర్ 21 , 2017)
UA|144 mins.|డ్రామా,రొమాన్స్
నాని ఒక మిడిల్ క్లాస్ యువకుడు. తన వదిన అంటే నచ్చదు. కానీ ఆమెకు ఓ గ్యాంగ్ స్టార్ నుంచి ముప్పు ఎదురైనప్పుడు అతని నుంచి రక్షించేందుకు తీవ్రంగా పోరాడుతాడు.
8 . ఎవడే సుబ్రమణ్యం(మార్చి 21 , 2015)
U|150 minutes|డ్రామా,రొమాన్స్
మెటీరియలిస్టిక్ స్వభావం కలిగిన సుబ్రమణ్యం జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు హిమాలయాలకు వెళ్తాడు. ఈక్రమంలో అనుబంధాల పట్ల తన వైఖరిని మార్చుకుంటాడు.
9 . పిల్ల జమీందార్(అక్టోబర్ 14 , 2011)
U|147 minutes|హాస్యం,డ్రామా
అల్లరి చిల్లరగా తిరిగే ప్రవీణ్ పెద్ద భూస్వామి మనవడు. తన తాతగారి ఆస్తిని వారసత్వంగా పొందడం కోసం తన చదువును పూర్తి చేసేందుకు ఓ బోర్డింగ్ కాలేజీకి వెళ్తాడు. అక్కడ అతను జీవితం గురించి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నాడన్నది మిగతా కథ.
10 . నానిస్ గ్యాంగ్ లీడర్(సెప్టెంబర్ 13 , 2019)
UA|155 minutes|హాస్యం,డ్రామా,థ్రిల్లర్
విభిన్న నేపథ్యాలున్న ఐదుగురు మహిళలు తమ ప్రియమైన వారిని చంపిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడానికి 'పెన్సిల్'(నాని) అనే రచయిత సాయం కోరుతారు. మరి వారు ప్రతీకారం తీర్చుకోవడానికి పెన్సిల్ ఏంచేశాడు అన్నది కథ
11 . అంటే సుందరానికి!(జూన్ 10 , 2022)
UA|176 minutes|హాస్యం
బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ.