• TFIDB EN
  • Nagarjuna Top Action Movies: నాగార్జున టాప్‌ యాక్షన్‌ చిత్రాలు
    Dislike
    2k+ views
    1 year ago

    టాలీవుడ్‌లో అక్కినేని నాగార్జున అనగానే ముందుగా గుర్తుకు వచ్చే చిత్రం శివ. ఈ చిత్రం టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. నాగార్జునను యాక్షన్‌ హీరోగా నిలబెట్టింది. తెలుగులో ఆయన హీరోగా చేసిన టాప్‌ యాక్షన్‌ చిత్రాలు మీకోసం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . శివ(అక్టోబర్ 05 , 1989)
    A|యాక్షన్
    భవాని తన మనుషులతో చట్టవిరుద్దమైన పనులు చేయిస్తూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతుంటాడు. కళాశాల విద్యార్థి శివ ఓ కారణంగా అతడిపై పోరాటానికి సిద్ధపడతాడు. ఈ పోరులో ఎవరు గెలిచారన్నది కథ.
    2 . అరణ్యకాండ(డిసెంబర్ 29 , 1986)
    UA|యాక్షన్,థ్రిల్లర్
    ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఒక తెగ నాయకుడు చేస్తున్న దుర్మార్గాలను ప్రత్యక్షంగా చూస్తాడు. దానిని సరిదిద్దడానికి బయలుదేరతాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ.
    3 . హలో బ్రదర్(ఏప్రిల్ 20 , 1994)
    U|యాక్షన్,హాస్యం
    కవల సోదరులైన దేవా, రవి వర్మ పుట్టగానే మిస్రో అనే గూండా వల్ల వేరు చేయబడుతారు. అయితే వారు పెద్దయ్యాక తిరిగి కలుసుకుని తమ తండ్రికి హాని తలపెట్టాలని చూస్తున్న మిస్రో కొడుకు మిత్రాపై పోరాడుతారు.
    4 . సీతారామ రాజు(ఫిబ్రవరి 05 , 1999)
    A|యాక్షన్,డ్రామా
    సీతయ్య, బసవరాజు కుటుంబాల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతుంటుంది. సీతయ్య మరణంతో అతడి తమ్ముడు రామరాజు ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు.
    5 . శివమణి(అక్టోబర్ 23 , 2003)
    UA|యాక్షన్,రొమాన్స్
    శివమణి అనే పోలీస్ ఆఫీసర్, దత్తు అనే స్థానిక రౌడీ ఆట కట్టించేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో దత్తు, శివమణి లవర్‌ వసంతను కిడ్నాప్ చేస్తాడు. ఆమెను తిరిగి తీసుకొచ్చేందుకు శివమణి ఒక న్యూస్ రిపోర్టర్ సాయం తీసుకుంటాడు.
    6 . వైల్డ్ డాగ్(ఏప్రిల్ 02 , 2021)
    UA|యాక్షన్,థ్రిల్లర్
    ఏసీపీ విజయ్‌ వర్మ (నాగార్జున) ఓ జరిగే పేలుళ్ల కేసులో రంగంలోకి దిగుతాడు. దాని వెనక ఉగ్రవాది ఖలీద్ హస్తం ఉందని కనిపెడతాడు. నేపాల్‌లో దాక్కున్న అతడ్ని పట్టుకునేందుకు తన బృందంతో అక్కడకు వెళతాడు? నేపాల్‌లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఖలీద్‌ను ఎలా ఇండియాకు తీసుకొచ్చారు? అన్నది కథ.
    7 . డాన్(డిసెంబర్ 20 , 2007)
    UA|యాక్షన్
    ఆంధ్ర ప్రదేశ్‌లో మాఫియా కింగ్‌గా సూరి ఉంటాడు. అతను తన తమ్ముడు రాఘవతో కలిసి ప్రజలకు అన్ని విధాలుగా సహాయం చేస్తుంటారు. అయితే ఫిరోజ్ అనే మాఫియా డాన్ వారి జీవితంలోకి ప్రవేశించి, వారి అధికారాన్ని సవాలు చేస్తాడు.
    8 . కింగ్(డిసెంబర్ 25 , 2008)
    UA|యాక్షన్,హాస్యం,డ్రామా
    చంద్ర ప్రతాప్ వర్మ రాజ కుటుంబానికి చెందినవాడు. తన తల్లి, మేనమామలు ఇతర కుటుంబ సభ్యులతో నివసిస్తుంటాడు. తన తండ్రి మరణం తర్వాత వారసత్వం చంద్ర ప్రతాప్ వర్మకు దక్కుతుంది. అయితే ఆ ఆస్తి దక్కించుకోవాలని అతని బంధువులే శత్రువులుగా మారుతారు.
    9 . ద ఘోస్ట్(అక్టోబర్ 05 , 2022)
    UA|యాక్షన్
    ద ఘోస్ట్ అనేది ప్రవీణ్ సత్తారు రచన మరియు దర్శకత్వం వహించిన 2022 భారతీయ తెలుగు భాషా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఈ చిత్రంలో నాగార్జున మరియు సోనాల్ చౌహాన్ నటించగా, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్, మనీష్ చౌదరి, రవివర్మ మరియు శ్రీకాంత్ అయ్యంగార్ సహాయక పాత్రలు పోషిస్తున్నారు.
    10 . ద్రోహి / అంతం(సెప్టెంబర్ 11 , 1992)
    A|యాక్షన్,డ్రామా
    కాంట్రాక్ట్ కిల్లర్ రాఘవ, భావనతో ప్రేమలో పడతాడు. కానీ తాను చేసే పని గురించి ఆమెకు నిజం చెప్పడు. అయితే ఓ హత్య కేసులో రాఘవ కోసం వెతుకుతున్న ఇన్స్‌ఫెక్టర్‌కు భావన సోదరి.
    11 . సూపర్(జూలై 21 , 2005)
    UA|యాక్షన్,డ్రామా
    సోను, అఖిల్‌ మంచి ఫ్రెండ్స్‌. సోను చెల్లెలు అఖిల్‌ను ఇష్టపడుతుంది. ఇందుకు నో చెప్పడంతో ఆమె సూసైడ్ చేసుకుంటుంది. దీంతో సోను, అఖిల్‌ వైరం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
    12 . రగడ(డిసెంబర్ 24 , 2010)
    A|యాక్షన్
    డబ్బులు సంపాదించాలన్న ఆశతో సత్య హైదరాబాద్‌కు వచ్చి గ్యాంగ్‌స్టర్ జికె వద్ద పనిచేయడం ప్రారంభించాడు. అయితే, అతని చర్యల వల్ల మరో గ్యాంగ్‌స్టర్ పెద్దన్నకు టార్గెట్ అవుతాడు. మరి సత్య ఆ గ్యాంగ్‌స్టర్‌ను ఎలా ఎదుర్కొన్నాడు అన్నది కథ.
    13 . మాస్(డిసెంబర్ 23 , 2004)
    UA|యాక్షన్,డ్రామా
    మాస్ ఒక అనాథ. మాఫియా డాన్ కూతురితో ప్రేమలో ఉన్న తన యజమాని కొడుకు ఆదితో మంచి బంధం ఏర్పడుతుంది. ప్రేమికులను విడదీసే ప్రయత్నంలో, గ్యాంగ్‌స్టర్లు ఆదిని చంపుతారు. దీంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి మాస్ బయలుదేరుతాడు.
    14 . దేవదాస్(సెప్టెంబర్ 27 , 2018)
    U|యాక్షన్,డ్రామా
    దేవ (నాగార్జున) పెద్ద డాన్‌. ఓ రోజు బుల్లెట్‌ గాయంతో దాస్‌ (నాని) క్లినిక్‌కు వస్తాడు. అలా వారి మధ్య పరిచయం ఏర్పడుతుంది. దాస్‌తో స్నేహం దేవ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? తనని చంపాలని చూస్తున్న డేవిడ్‌ను దేవ ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.
    15 . క్రిమినల్(అక్టోబర్ 14 , 1994)
    A|యాక్షన్,థ్రిల్లర్
    అజయ్ అనే యంగ్ డాక్టర్, డాక్టర్ శ్వేతను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే వారు పనిచేసే ఆసుపత్రిలో అవయవ అక్రమ రవాణా రాకెట్‌ గురించి శ్వేత తెలుసుకుంటుంది. ఈ విషయాన్ని బయటకు చెప్పేలోపే ఆమె హత్యకు గురవుతుంది.
    16 . గగనం(ఫిబ్రవరి 11 , 2011)
    UA|యాక్షన్,డ్రామా,థ్రిల్లర్
    ఉగ్రవాదులు చెన్నై నుండి ఒక విమానాన్ని హైజాక్ చేస్తారు. అయితే ప్లైట్‌లో సమస్య తలెత్తడంతో తిరుపతిలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వస్తుంది. NSG కమాండో రవికి రెస్క్యూ ఆపరేషన్స్‌ను అప్పగించారు. మరి ఉగ్రవాదులను ఆ అధికారి పట్టుకున్నాడా? ప్లైట్‌లో చిక్కుకున్న ప్రయాణికుల ప్రాణాలను ఎలా కాపాడాడు అన్నది మిగతా కథ.
    17 . రక్షకుడు(అక్టోబర్ 30 , 1997)
    U|యాక్షన్,రొమాన్స్
    కోపాన్ని అదుపు చేసుకోలేని అజయ్ సోనియాను ప్రేమిస్తాడు. సోనియా తండ్రి శ్రీరామ్ ఒక పారిశ్రామికవేత్త. అజయ్ తన కోపాన్ని మూడు నెలలు అదుపు చేసుకోగలిగితేనే సోనియాను ఇచ్చి వివాహం చేస్తానని షరతు విధిస్తాడు. మరి అజయ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని సోనియాను పెళ్లి చేసుకున్నాడా లేదా? అనేది మిగతా కథ.
    18 . ఇద్దరు ఇద్దరే(సెప్టెంబర్ 05 , 1990)
    U|యాక్షన్,థ్రిల్లర్
    జడ్జి మధుసూదన్ రావు కుమారుడు రవి చిన్నతనంలోనే తల్లిదండ్రుల నుంచి విడిపోయి దొంగగా పెరుగుతాడు. ఇద్దరూ ఉమ్మడి శత్రువుతో పోరాడవలసి వచ్చినప్పుడు తండ్రీ కొడుకులు ఏకమవుతారు.
    19 . నా సామి రంగ(జనవరి 14 , 2024)
    UA|యాక్షన్,డ్రామా,థ్రిల్లర్
    ఒక ఊరిలో రంగా(నాగార్జున) స్నేహితులతో కలిసి సరదాగా జీవనం సాగిస్తుంటాడు. అవసరం ఉన్నవారికి సాయం చేస్తుంటాడు. అలాంటి రంగాకి(Naa Saami Ranga Review) ఆ ఊరిలో కొంతమంది పెద్ద మనుషులతో గొడవ ఏర్పడుతుంది. ఇదే సమయంలో తన స్నేహితులు అయిన అంజి (అల్లరి నరేష్), భాస్కర్ (రాజ్ తరుణ్) చేసిన ఒక పని వల్ల ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులకి నష్టం ఏర్పడుతుంది. దీంతో ఆ పెద్ద మనుషులు వీరిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. చంపడానికి కూడా సిద్ధపడుతారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో రంగా తన స్నేహితులను ఎలా కాపాడుకున్నాడు?. వరలక్ష్మి, రంగాల మధ్య ప్రేమ ఎలా ఉంది? తన స్నేహితులను చంపాలనుకున్న దుర్మార్గులను రంగా ఏం చేశాడు అనేది మిగతా కథ.
    20 . విజయ్(జనవరి 19 , 1989)
    UA|యాక్షన్,డ్రామా
    బి. గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విజయ్‌. ఇందులో అక్కినేని నాగార్జున హీరోగా, విజయశాంతి హీరోయిన్‌గా చేశారు. మోహన్‌బాబు, జయసుధ ముఖ్య పాత్రలు పోషించారు. కె. చక్రవర్తి సంగీతం అందించారు.

    @2021 KTree