• TFIDB EN
  • Editorial List
    List of Telugu Horror Movies: మిమ్మల్ని భయపెడుతూ నవ్వించే చిత్రాలు ఇవే!
    Dislike
    200+ views
    5 months ago

    సాధారణంగా ఏ చిత్ర పరిశ్రమలోనైనా హార్రర్‌ చిత్రాలు (Comedy And Horror Movies In Telugu).. ప్రేక్షకులను భయపెడతాయి. ఒంటరిగా చూడాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునేలా చేస్తాయి. అయితే టాలీవుడ్‌లో వచ్చిన కొన్ని చిత్రాలు మాత్రం ప్రేక్షకులను గిలిగింతలు పెడతాయి. ఓ వైపు భయపెడుతూనే ఆడియన్స్‌ను నవ్విస్తాయి. దెయ్యం సినిమాలంటే వణికిపోయే వారు సైతం ఈ చిత్రాలను ఎంచక్కా చూసేయచ్చు. అంతేకాదు అందులోని దెయ్యాలు చేసే కామెడీని బాగా ఎంజాయ్‌ చేయవచ్చు. టాలీవుడ్‌లో ఇప్పటివరకూ వచ్చిన ఆ హార్రర్‌ & కామెడీ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . ముని (మార్చి 09 , 2007)
    U|153 minutes|హారర్
    గణేష్‌ (లారెన్స్‌) బ్యాంక్‌ మేనేజర్‌. ఓ ఎమ్మెల్యేకి చెందిన ఇంట్లో భార్య, తల్లిదండ్రులతో కలిసి అద్దెకు దిగుతాడు. అయితే ఆ ఇంట్లోనే ముని అనే వ్యక్తిని ఎమ్మెల్యే పెట్రోల్‌ పోసి హత్య చేస్తాడు. దీంతో ఆ ఇంట్లోనే ఉన్న ముని ఆత్మ గణేష్‌ను ఆవహిస్తుంది. ఇంతకి ముని ఎవరు? అతడ్ని ఎందుకు చంపారు? గణేష్‌ శరీరం ద్వారా ముని ఎలా పగ తీర్చుకున్నాడు? అన్నది స్టోరీ.
    2 . రాక్షసుడు(మే 29 , 2015)
    U|152 minutes|హాస్యం,థ్రిల్లర్
    మాస్ చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. ఓ యాక్సిడెంట్‌ వల్ల అతడికి ఆత్మలు కనిపించడం మెుదలవుతాయి. దయ్యాలకు హెల్చ్‌ చేస్తూ తాను ప్రయోజనం పొందుతూ సాఫీగా జీవితాన్ని గడుపుతుంటాడు మాస్. ఓ రోజు అతడి లైఫ్‌లోకి శివ కుమార్ (సూర్య) ఆత్మ ఎంటర్ అవుతుంది. అసలు ఈ శివ ఎవరు? మాస్‌ని ఎన్ని ఇబ్బందులకు గురి చేసింది? అన్నది కథ.
    3 . కాష్మోరా(అక్టోబర్ 28 , 2016)
    UA|164 minutes|ఫాంటసీ,హారర్
    కాష్మోరా(కార్తీ) దెయ్యాల వద్దకు తీసుకెళ్లడానికి కొన్ని ప్రత్యేక శక్తులను కలిగి ఉన్నట్లు నటించే ఒక చిన్న దొంగ. అతను ఒక పెద్ద రాజకీయ నాయకుడిని మోసం చేసి అతని డబ్బుతో పారిపోతాడు. ఈక్రమంలో ఏడు వందల ఏళ్లనాటి ఓ పాడుబడ్డ దెయ్యాల భవనంలో అతను చిక్కుకుంటాడు.
    4 . జాంబీ రెడ్డి(ఫిబ్రవరి 05 , 2021)
    UA|125 minutes|హాస్యం,హారర్
    మారియో (తేజ సజ్జా) ఓ గేమ్‌ డిజైనర్‌. స్నేహితుడు కల్యాణ్‌ (హేమంత్‌) పెళ్లికి తన గ్యాంగ్‌తో రుద్రవరానికి వెళ్తాడు. అక్కడకు వెళ్లిన వారికి అనూహ్య పరిణాణం ఎదురవుతుంది. ఫ్రెండ్స్‌లోని కిరీటీ జాంబీలాగా మారిపోతాడు. అతడు ఎందుకు అలా అయ్యాడు? ఊరు మెుత్తం జాంబీల్లాగా మారడానికి కారణం ఏంటి? వారిని కాపాడేందుకు హీరో ఏం చేశాడు? అన్నది కథ.
    5 . చీకటి గదిలో చితక్కొట్టుడు(మార్చి 21 , 2019)
    A|హాస్యం,హారర్
    ఓ స్నేహితుల బృందం బ్యాచిలర్ పార్టీ కోసం నగరానికి దూరంగా ఉన్న విల్లాకు వెళ్తారు. ఆ విల్లాలో వారికి వింత పరిస్థితి ఎదురవుతుంది. ఓ అదృశ్య శక్తి వారిని వెంబడిస్తుంటుంది.
    6 . కథ కంచికి మనం ఇంటికి(ఏప్రిల్ 08 , 2022)
    UA|140 minutes|హాస్యం,హారర్
    ప్రేమ్‌ (త్రిగుణ్‌), దీక్ష(పూజిత పొన్నాడ), నంది(ఆర్జే హేమంత్‌), దొంగేష్‌(గెటప్‌ శ్రీను) అనుకోకుండా ఓ రోజు శ్మశానంలో కలుసుకుంటారు. ఆ తర్వాత పక్కనే ఉన్న గెస్ట్‌హౌస్‌లోకి వెళ్తారు. అక్కడ దయ్యం వీరిని ఎలాంటి ఇబ్బందులకు గురిచేసింది? చైల్డ్ ట్రాఫికింగ్‌తో ఈ కథకు ఉన్న సంబంధం ఏంటన్నది కథ.
    7 . చంద్రముఖి 2(సెప్టెంబర్ 28 , 2023)
    UA|171 minutes|హాస్యం,హారర్
    రంగనాయకి (రాధిక శరత్ కుమార్) కుటుంబం చాలా పెద్దది. ఆ ఫ్యామిలీని అనుకోని సమస్యలు వరుసగా చుట్టుముడతాయి. కుల దైవం గుడిలో పూజ చేస్తే కష్టాలు తీరిపోతాయని స్వామీజీ (రావు రమేష్) చెప్తారు. దీంతో లేచిపోయిన కూతురి పిల్లలను కూడా తీసుకురావాల్సి వస్తుంది. వారితో పాటు మదన్ (రాఘవ లారెన్స్) కూడా వస్తాడు. వారి కులదైవం గుడికి దగ్గరలోనే చంద్రముఖి ప్యాలెస్ (2005లో మొదటి చంద్రముఖి సినిమా కథ జరిగిన ఇల్లు) ఉంటుంది.
    8 . మరకథమణి(జూన్ 16 , 2017)
    U|119 minutes|హాస్యం,రొమాన్స్
    ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానితో ప్రేమలో పడతాడు. అయితే, ఆమె మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. అతను మరకతమణి అనే రత్నం గురించి తెలుసుకుంటాడు. దానిని పొందేక్రమంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటాడు. ఇంతకు అతను మరకథమణిని సాధించాడా? లేదా? అన్నది మిగతా కథ.
    9 . ఎక్కడికి పోతావు చిన్నవాడా(నవంబర్ 18 , 2016)
    UA|139 minutes|ఫాంటసీ,థ్రిల్లర్
    ఆత్మ చేత పీడించబడుతున్న తన ప్రేయసిని హీరో (నిఖిల్‌) ఎలా కాపాడాడు. అసలు ఆ ఆత్మకు హీరోకు ఉన్న సంబంధం ఏమిటీ? అన్నది కథ.
    10 . ఆనందో బ్రహ్మ(ఆగస్టు 18 , 2017)
    UA|123 minutes|హాస్యం,హారర్
    ఒక ఎన్నారై తన బంధువులకు సంబంధించిన దెయ్యాల ఇంటిని అమ్మాలని చూస్తాడు, కానీ అక్కడ ఉండే దెయ్యాలకు భయపడి ఎవరూ ఆ ఇంటిని కొనేందుకు రారు. దీంతో ఆ ఎన్నారై ఓ ఉపాయం ఆలోచిస్తాడు.
    11 . గంగ(ఏప్రిల్ 17 , 2015)
    UA|164 minutes|హాస్యం,హారర్,థ్రిల్లర్
    రాఘవ గ్రీన్ టీవీలో కెమెరామెన్‌గా పనిచేస్తుంటాడు. అదే చానల్‌లో నందినిని ప్రేమిస్తాడు. వారి టీవి ఛానెల్‌ను ఫస్ట్ ప్లేస్‌కి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో దెయ్యాల మీద ఓ ప్రోగ్రాం తీద్దాం అని భీమిలి బీచ్‌లోని ఓ పాడుబడ్డ బంగాళాలోకి వెళతారు. అక్కడ ఉన్న బీచ్‌లో నందినికి ఒక తాళి బొట్టు దొరుకుతుంది. ఆ తాళిబొట్టు దొరికిన రోజు నుంచీ నందిని లైఫ్‌లో భయానక సంఘటనలు జరుగుతుంటాయి.
    12 . రాజు గారి గది(అక్టోబర్ 16 , 2015)
    UA|135 minutes|హారర్
    గుప్త నిధిని కనిపెట్టే లక్ష్యంతో ఏడుగురు వ్యక్తులతో కూడిన బృందం.. రాజు గారి గది అనే భూత్ బంగ్లాలోకి ప్రవేశిస్తారు. అక్కడ వారికి భయానక అనుభవాలు, వింతలు ఎదురవుతాయి.
    13 . ప్రేమ కథా చిత్రమ్(జూన్ 07 , 2013)
    UA|130 minutes|డ్రామా,హారర్
    నలుగురు యువకులు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అంతా కలిసి ఓ గెస్ట్ హౌస్‌కు వెళ్తారు. కానీ ఆ ఇంట్లో వారి ప్లాన్లన్నీంటిని కొన్ని సంఘటనలు అడ్డుకుంటాయి. ఎంటా సంఘటనలు? ఇంతకు వారు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనకున్నారన్నది మిగతా కథ.
    14 . డీడీ రిటర్న్స్(ఆగస్టు 18 , 2023)
    UA|హారర్,హాస్యం
    కొంద‌రు ఫ్రెండ్స్ తాము దొంగిలించిన కోట్లాది రూపాయ‌ల డ‌బ్బు, నగలను ఓ భూతాల బంగ్లాలో పోలీసుల కంటపడకుండా దాచిపెడ‌తారు. ఆ బ్యాగ్‌ను తిరిగి బంగ్లా నుంచి తీసుకొచ్చే ప్రయత్నంలో వారి దెయ్యం కనిపిస్తుంది. ఈ క్రమంలో వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనేది కథ
    15 . ఊరు పేరు భైరవకోన(ఫిబ్రవరి 16 , 2024)
    UA|133 minutes|అడ్వెంచర్,ఫాంటసీ,థ్రిల్లర్
    ప్రేయసి కోసం ఒక పెళ్లిలో నగలు దొంగతనం చేసిన బసవ (సందీప్ కిషన్).. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తన గ్యాంగ్‌తో భైరవకోనకు పారిపోతాడు. అయితే ఆ ఊరికి వెళ్లినవారు ఎవరూ ప్రాణాలతో బయటకు వచ్చింది లేదు. మరి అక్కడ బసవకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ ఊరి మిస్టరీ ఏంటి? అన్నది కథ.
    16 . ఓం భీమ్ బుష్(మార్చి 22 , 2024)
    UA|హాస్యం,డ్రామా
    క్రిష్, వినయ్, మాధవ్ సిల్లీ పనులు చేస్తూ కాలాన్ని గడుపుతుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారు భైరవపురం అనే గ్రామంలో అడుగుపెడతారు. అక్కడి పరిస్థితులు వీరిని ఎలా మార్చాయి? దెయ్యం ఉన్న కోటలో వీరు ఎందుకు అడుగుపెట్టారు? కోటలో వీరికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అన్నది కథ.
    17 . గీతాంజలి మళ్లీ వచ్చింది(ఏప్రిల్ 12 , 2024)
    UA|డ్రామా
    డైరెక్టర్‌ శ్రీను (శ్రీనివాస రెడ్డి) కొత్త సినిమా కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో అతడికి సత్య, అంజలి హీరో హీరోయిన్లుగా సినిమా చేసే ఛాన్స్ వస్తుంది. అయితే నిర్మాత దెయ్యాల కోటగా పేరున్న సంగీత్‌ మహల్‌లోనే షూటింగ్‌ చేయాలని షరతు విధిస్తాడు. ఇంతకీ, ఆ సంగీత్ మహల్ గతం ఏమిటి? అక్కడ మూవీ టీమ్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ.
    18 . బాక్(మే 03 , 2024)
    UA|హాస్యం,హారర్
    శివ శంకర్ (సుందర్ సి) ఒక లాయర్. బాక్‌ అనే దుష్టశక్తి వల్ల అతని చెల్లెలు శివాని (తమన్నా) మరణిస్తుంది. అసలు ఆ బాక్ ఎవరు? శివాని ఫ్యామిలీని ఎందుకు టార్గెట్‌ చేసింది? శివాని ఆత్మగా మారి తన కుటుంబాన్ని ఎలా కాపాడింది? కథలో మాయ (రాశి ఖన్నా) పాత్ర ఏంటి? అన్నది కథ.

    @2021 KTree