Editorial List
నాగ్ అశ్విన్ సినిమాల జాబితా
50+ views27 days ago
నాగ్ అశ్విన్ తెలుగులో టాప్ డైరెక్టర్లలో ఒకరు. కల్కి2898ఏడీ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించాడు.2015లో ఎవడే సుబ్రమణ్యం చిత్రం ద్వారా డైరెక్టర్‌గా పరిచయమై తొలి చిత్రంతోనే మంచి విజయం సాధించాడు. మరి ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలేవో ఇప్పుడు చూద్దాం.
1 . కల్కి 2898 ఎ.డి(జూన్ 27 , 2024)
UA|యాక్షన్,సైన్స్ ఫిక్షన్
కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి చేత శాపం పొందిన అశ్వత్థామ (అమితాబ్‌బచ్చన్).. కల్కి ఆగమనం కోసం ఎదురుచూస్తుంటాడు. సుమతి (దీపికా పదుకొణె) అనే మహిళ కడుపున కల్కి జన్మిస్తాడని తెలిసి ఆమెకు రక్షణగా మారతాడు. కాశీలో నివసించే భైరవ (ప్రభాస్) స్వర్గాన్ని తలపించే కాంప్లెక్స్‌లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటాడు. సుమతిని పట్టిస్తే కాంప్లెస్ వెళ్లొచ్చని తెలుసుకుంటాడు. మరి భైరవ, అశ్వత్థామను ఎదిరించి సుమతిని తీసుకొచ్చాడా? సుప్రీమ్ యష్కిన్ (కమల్ హాసన్) పాత్ర ఏంటి? కురుక్షేత్ర యుద్ధంతో కలియుగం అంతం ఎలా ముడిపడి ఉంది? అన్నది కథ.
2 . మహానటి(మే 09 , 2018)
U|169 minutes|బయోగ్రఫీ,డ్రామా
దిగ్గజ నటి సావిత్రి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆమె ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టారు? ఆమె జీవితంపై నటుడు జెమినీ గణేషన్ ఎలాంటి ప్రభావాన్ని చూపించారు? వంటి అంశాలను ఇందులో చూపించారు. సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషించింది.
3 . ఎవడే సుబ్రమణ్యం(మార్చి 21 , 2015)
U|150 minutes|డ్రామా,రొమాన్స్
మెటీరియలిస్టిక్ స్వభావం కలిగిన సుబ్రమణ్యం జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు హిమాలయాలకు వెళ్తాడు. ఈక్రమంలో అనుబంధాల పట్ల తన వైఖరిని మార్చుకుంటాడు.