Editorial List
బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన సినిమాల జాబితా
40+ views22 days ago
తెలుగులో అగ్రశ్రేణి మాస్ డైరెక్టర్లలో బోయపాటి ఒకరు. ఆయన చిత్రాల్లో హీరో ఎలివేషన్ సీన్లు మరో స్థాయిలో ఉంటాయి. తొలి సినిమాతోనే భారీ విజయం అందుకుని అగ్ర హీరోలకు ఛాయిస్ అయ్యాడు. ఆయన తీసిన సినిమాల జాబితా ఇక్కడ చూడండి.
1 . స్కంద(సెప్టెంబర్ 28 , 2023)
UA|167 minutes|యాక్షన్,డ్రామా
స్కంద స్టోరీ విషయానికి వస్తే ఓ ఊరిలో ఉండే హీరో రామ్ కుటుంబమంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అదేక్రమంలో ఆలయంలో దొంగతనం జరుగుతుంది. ఆ నింద రామ్ ఫ్యామిలీపై పడుతుంది. ఆ నిందను రామ్ చెరిపేశాడా? ఈ మధ్యలో రామ్- శ్రీలీల మధ్య లవ్ ట్రాక్ ఎలా మొదలైంది. హీరో మరియు విలన్‌ల మధ్య పగ ఎందుకు స్టార్ట్ అయింది.
2 . అఖండ(డిసెంబర్ 02 , 2021)
UA|167 minutes|యాక్షన్,డ్రామా
మురళీకృష్ణ(బాలకృష్ణ) ఊరి పెద్దగా ఉంటూ పేదవారికి బాసటగా నిలుస్తుంటాడు. వరద రాజులు (శ్రీకాంత్) ఆ ఊరిలో యూరేనియం తవ్వకాలు ప్రారంభిస్తాడు. దాని వల్ల ఆ ప్రాంత ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ఈ క్రమంలో మురళీకృష్ణ ఏం చేశాడు? అతడు ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? అసలు అఖండ ఎవరు? మైనింగ్ మాఫియాకు ఎలా అడ్డుకట్ట వేశాడు? అన్నది కథ.
3 . వినయ విధేయ రామ(జనవరి 11 , 2019)
UA|144 minutes|యాక్షన్,డ్రామా
ఒక క్రిమినల్ తన కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు.. రామ్ అనే యువకుడు అతని నేర సామ్రజ్యాన్ని ధ్వంసం చేసేందుకు పూనుకుంటాడు.
4 . జయ జానకి నాయక(ఆగస్టు 11 , 2017)
UA|149 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
గగన్, స్వీటీ ఇద్దరు ప్రేమించుకుంటారు. కానీ ఆమె తండ్రి గగన్‌ను అంగీకరించకపోవడంతో విడిపోవాల్సి వస్తుంది. ఒక రోజు దుండగుల నుంచి ఒక కుటుంబాన్ని రక్షించే సమయంలో, గగన్ తనకు తెలియకుండా స్వీటీని రక్షిస్తాడు.
5 . సరైనోడు(ఏప్రిల్ 22 , 2016)
UA|160 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
హీరో ఆర్మీ ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్‌కు వస్తాడు. నేరగాళ్లకు తన స్టైల్లో బుద్ది చెబుతుంటాడు. ఈ క్రమంలో వ్యవస్థ మొత్తాన్నీ తన చెప్పు చేతల్లో పెట్టుకున్న వైరం ధనుష్ (ఆది)ని హీరో ఎలా ఎదిరించాడు? అతడికి హీరోకు మధ్య గొడవేంటి? అన్నది కథ.
6 . లెజెండ్(మార్చి 28 , 2014)
A|161 minutes|యాక్షన్,డ్రామా
ఇండియాకు వచ్చిన కృష్ణ (బాలకృష్ణ) ఓ సందర్భంలో జితేందర్ (జగపతిబాబు) కొడుకుతో గొడవపడతాడు. దీంతో హీరోను చంపాలని వెళ్లిన జితేందర్ అతడ్ని చూసి షాక్ అవుతాడు. జితేందర్‌కు కృష్ణకు ఇంతకు ముందే పరిచయం ఉందా? కథలో జయదేవ్ (సీనియర్ బాలకృష్ణ) పాత్ర ఏంటి? అన్నది కథ.
7 . దమ్ము(ఏప్రిల్ 27 , 2012)
A|155 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
రామచంద్ర ఓ అనాథ. సత్యను ప్రేమించడం ద్వారా రెండు రాయల్ కుటుంబాల మధ్య జరుగుతున్న వైరంలో పాలుపంచుకుంటాడు. సత్య కుటుంబంలో భాగమైన రామచంద్రకు సంచలన నిజం తెలుస్తుంది. ఏమిటా నిజం? సత్య ఫ్యామిలీకి హీరోకి ఉన్న సంబంధం ఏంటి? అన్నది కథ.
8 . సింహ(ఏప్రిల్ 30 , 2010)
A|156 minutes|యాక్షన్
శ్రీమన్నారాయణ కాలేజీ ప్రొఫెసర్. అతని కాలేజీలోకి జానకి అనే యువతి కొత్తగా చేరుతుంది. శ్రీమన్నారాయణను చూసిన వెంటనే ఆమె ప్రేమలో పడుతుంది. అయితే జానకి గతం.. శ్రీమన్నారయణ తండ్రి గతంతో లింక్ అయి ఉంటుంది. ఇంతకు జానకి ఎవరు? శ్రీమన్నారాయణ తండ్రి గతం ఏమిటి అన్నది మిగతా కథ.
9 . తులసి(అక్టోబర్ 12 , 2007)
UA|153 minutes|యాక్షన్,డ్రామా
పర్వతనేని తులసిరాం తన భార్య, బిడ్డల కోసం కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ కొన్ని సంఘటనలు తులసిని అతని కుటుంబానికి దూరం చేస్తాయి.
10 . భద్ర(మే 12 , 2005)
UA|డ్రామా
భద్ర తన స్నేహితుడి చెల్లెలైన అనుని ప్రేమిస్తాడు. ఓ రోజు శత్రువుల దాడిలో అను మినహా అమె ఫ్యామిలీ అంతా చనిపోతుంది. విలన్ల నుంచి అనుని రక్షిస్తానని చనిపోతున్న తన ఫ్రెండ్‌కు భద్ర మాట ఇస్తాడు.