• TFIDB EN
  • Editorial List
    పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన హిట్‌ సినిమాల జాబితా
    Dislike
    50+ views
    22 days ago

    ఫలితంతో సంబంధం లేకుండా తనకు నచ్చిన కథను సినిమాగా తీసే డైరెక్టర్లో పూరి జగన్ ముందు వరుసలో ఉంటారు. మరి ఆయన తీసిన బ్లాక్ బాస్టర్ చిత్రాలెంటో ఇక్కడ చూడండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . ఇస్మార్ట్ శంకర్(జూలై 18 , 2019)
    A|141 minutes|యాక్షన్,సైన్స్ ఫిక్షన్,థ్రిల్లర్
    ఇస్మార్ట్ శంకర్ ఒక కాంట్రాక్ట్ కిల్లర్. ఓ రాజకీయ నాయకున్ని హత్య చేసి తన లవర్‌తో పారిపోతాడు. ఈ హత్య కేసును విచారిస్తున్న క్రమంలో పోలీస్‌ అధికారి అరుణ్ చనిపోతాడు. దీంతో పోలీసులు అరుణ్ మెమోరీని శంకర్‌కు అతనికి తెలియకుండా బదిలీ చేస్తారు. దీంతో కథ కీలక మలుపు తిరుగుతుంది.
    2 . పైసా వసూల్(సెప్టెంబర్ 01 , 2017)
    UA|142 minutes|యాక్షన్,డ్రామా
    గూఢచార సంస్థలో పనిచేస్తున్న ఒక అధికారి ఒక మాఫియా నాయకుడిని పట్టుకోవడానికి ఒక పెద్ద మిషన్ కోసం స్థానిక గ్యాంగ్‌స్టర్‌ని నియమిస్తాడు. మరి ఆ గ్యాంగ్ స్టార్‌ మాఫియా డాన్‌ను పట్టుకున్నాడా? లేదా అనేది కథ.
    3 . జ్యోతి లక్ష్మి(జూన్ 12 , 2015)
    UA|డ్రామా
    ఇది జ్యోతి లక్ష్మి అనే వేశ్య జీవితం మీద ఆధారపడింది, ఆమె తన వృత్తిని వదిలి మంచి జీవితాన్ని కోరుకుంటుంది. ఈ చిత్రం ఆమె సమాజంలో ఎదుర్కొనే సమస్యలు మరియు ఆమె గౌరవప్రయాణంను చూపిస్తుంది.
    4 . టెంపర్(ఫిబ్రవరి 13 , 2015)
    UA|141 minutes|యాక్షన్,డ్రామా,థ్రిల్లర్
    దయా ఒక అవినీతి పోలీసు అధికారి. వైజాగ్‌కు బదిలీ అయిన తర్వాత అక్కడ వాల్టర్ వాసు అనే గూండాతో చేతులు కలుపుతాడు. అవినీతి మార్గంలో ప్రయాణిస్తాడు. అతని ప్రేయసి కాజల్ అగర్వాల్‌ను అనుకోకుండా వాల్టర్ వాసు కిడ్నాప్ చేయడంతో కథలో ట్విస్ట్ పుడుతుంది
    5 . హార్ట్ ఎటాక్(జనవరి 31 , 2014)
    A|140 min|యాక్షన్,రొమాన్స్
    స్పెయిన్‌లో హీరో, హీరోయిన్లు ప్రేమలో పడతారు. కానీ హీరోకి పెళ్లి అంటే ఇష్టం ఉండదు. దీంతో హీరోయిన్‌ గోవా వెళ్లిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్‌ ప్రేమను రియలైజ్ అయిన హీరో ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
    6 . ఇద్దరమ్మాయిలతో(మే 31 , 2013)
    UA|143 minutes|రొమాన్స్,థ్రిల్లర్
    సంజు రెడ్డి స్పెయిన్‌లో లీడ్ గిటారిస్ట్. కొంతమందితో కలిసి బ్యాండ్ నడుపుతుంటాడు. ఈక్రమంలో ఇండియాలో బాగా ధనవంతురాలైన, యూనియన్ మినిస్టర్ కూతురైన ఆకాంక్ష సైకాలజీలో పిజి చేయడానికి స్పెయిన్ వస్తుంది. తను దిగిన ఇంట్లో, ఇదివరకూ అదే ఇంట్లో ఉన్న వారికి సంబందించిన డైరీ ఒకటి దొరుకుతుంది. ఆ డైరీకి సంజూ రెడ్డికి మధ్య సంబంధమే సినిమా కథ.
    7 . బిజినెస్‌మెన్(జనవరి 13 , 2012)
    A|131 minutes|యాక్షన్
    ముంబయిని ఏలాలన్న లక్ష్యంతో సూర్య నగరానికి వస్తాడు. లోకల్‌ గ్యాంగ్‌స్టర్లతో కలిసి పవర్‌ఫుల్‌ బిజినెస్‌మ్యాన్‌గా ఎదుగుతాడు. ఇంతకీ ఆ యువకుడు పెట్టిన బిజినెస్ ఏంటి? చిత్ర-సూర్యల లవ్‌స్టోరీ ఏంటి? అన్నది కథ.
    8 . గోలీమార్(మే 27 , 2010)
    A|145 minutes|యాక్షన్
    గంగారాం పోలీస్ ఉద్యోగంలో చేరడానికి చాలా కష్టపడుతాడు. చివరికి జాబ్ సంపాదించి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా ఎదుగుతాడు. అతను పెద్ద పెద్ద గ్యాంగ్‌స్టర్లను చంపుతున్న క్రమంలో ఇద్దరు క్రూరమైన గ్యాంగ్‌స్టర్‌లు అతని ఉద్యోగం పోయేలా చేస్తారు. మరి గంగారాం ఆ గ్యాంగ్‌స్టర్లను ఎలా ఎదుర్కొన్నాడు. తిరిగి తన ఉద్యోగాన్ని ఎలా పొందాడు అన్నది స్టోరీ. గోలీమార్ చిత్రం గోపిచంద్ కెరీర్‌లో సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్ల లాభం సాధించింది.
    9 . ఏక్ నిరంజన్(అక్టోబర్ 29 , 2009)
    UA|155 minutes|యాక్షన్,డ్రామా
    రోడ్లపై పిల్లల్ని అడుక్కునే రాకెట్‌ను నడిపే వ్యక్తి చిన్నతనంలో చోటును కిడ్నాప్ చేస్తాడు. అయితే, అతన్ని అరెస్టు చేయడంలో పోలీసులకు చోటు సహాయం చేస్తాడు. ఆ తర్వాత తన కుటుంబం కోసం వెతుకుతాడు.
    10 . నేనింతే(డిసెంబర్ 19 , 2008)
    U|యాక్షన్,డ్రామా,రొమాన్స్
    డైరెక్టర్‌ కావాలని కలలు కనే రవి.. అనేక కష్టాలకు ఓడ్చి చివరికి తన తొలి చిత్రాన్ని పట్టాలెక్కిస్తాడు. ప్రేయసిని హీరోయిన్‌గా పెట్టి సినిమా తీస్తున్న క్రమంలో నిర్మాత అయిన గ్యాంగ్‌స్టర్‌.. రవికి అడ్డంకులు సృష్టిస్తాడు. వాటిని రవి ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.
    11 . బుజ్జిగాడు(మే 22 , 2008)
    UA|146 minutes|యాక్షన్,డ్రామా
    బుజ్జి రజనీకాంత్‌ ఫ్యాన్‌. చిన్నప్పుడు ఇంటి పక్కన ఉండే చిట్టితో గొడవపడి ఇల్లు వదిలి వెళ్లిపోతాడు. 12 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చిన బుజ్జి.. చిట్టిని వెత్తుకుంటూ వెళ్తాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి? అన్నది స్టోరీ.
    12 . చిరుత(సెప్టెంబర్ 28 , 2007)
    UA|149 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
    చరణ్ తన చిన్నతనంలో చేయని హత్యను అంగీకరించి 12 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తాడు. విడుదలైన తర్వాత, అతను పని కోసం బ్యాంకాక్ వెళ్లి ఒక ధనవంతుడి కుమార్తె సంజనతో ప్రేమలో పడతాడు.
    13 . దేశముదురు(జనవరి 12 , 2007)
    UA|148 minutes|యాక్షన్,రొమాన్స్
    ఒక టీవీ ఛానెల్‌లో పనిచేసే బాలా గ్యాంగ్‌స్టర్ తమ్ముడిని కొట్టి ఇబ్బందుల్లో పడుతాడు. అతని నుంచి తప్పించుకునేందుకు వేరే ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ ఓ అమ్మాయితో ప్రేమలో పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది. గ్లాంగ్‌ స్టర్‌తో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అన్నది మిగతా కథ.
    14 . పోకిరి(ఏప్రిల్ 27 , 2006)
    A|168 minutes|యాక్షన్,థ్రిల్లర్
    పండు డబ్బు కోసం ఎవరినైనా చంపడానికి సిద్ధపడే యువకుడు. కొన్ని కారణాల వల్ల అతను మాఫియా డాన్ అలీ భాయ్‌కి శత్రువు అవుతాడు. తర్వాత ఏమి ఏం జరిగింది? పండుకి ఉన్న గతం ఏంటి? అన్నది కథ.
    15 . సూపర్(జూలై 21 , 2005)
    UA|151 minutes|యాక్షన్,డ్రామా
    సోను, అఖిల్‌ మంచి ఫ్రెండ్స్‌. సోను చెల్లెలు అఖిల్‌ను ఇష్టపడుతుంది. ఇందుకు నో చెప్పడంతో ఆమె సూసైడ్ చేసుకుంటుంది. దీంతో సోను, అఖిల్‌ వైరం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
    16 . 143 (ఐ మిస్ యు)(ఆగస్టు 27 , 2004)
    UA|143 minutes|రొమాన్స్,థ్రిల్లర్
    నలుగురు అన్నల ముద్దుల చెల్లెలు అయిన సంజనా వారింట్లో పనిచేసే సిద్ధూతో ప్రేమలో పడుతుంది. అయితే సంజనా, సిద్ధూ ఇంటి నుంచి పారిపోతారు. ఈక్రమంలో సంజనను నక్సలైట్లు బందిస్తారు.
    17 . అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి(ఏప్రిల్ 19 , 2003)
    U|154 minutes|యాక్షన్,ఫ్యామిలీ,రొమాన్స్
    చందుకు కిక్‌బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైన నేషనల్ ఛాంపియన్ కావాలనేది అతని కల. తన తల్లితో కలిసి జీవిస్తుంటాడు. అయితే చందు తల్లి చనిపోయేటప్పుడు... తండ్రి రఘువీర్‌ను కలవమని కోరడంతో అతని జీవితం మారుతుంది.
    18 . ఇడియట్(ఆగస్టు 22 , 2002)
    U|133 minutes|యాక్షన్,హాస్యం
    చంటి అనే యువకుడిని దుండగులు కొట్టినప్పుడు సుచిత్ర అనే యువతి అతనికి రక్త దానం చేసి కాపాడుతుంది. ఈ విషయం తెలిసిన చంటి ఆమెతో ప్రేమలో పడుతాడు. సుచిత్ర తండ్రి పోలీస్ కమిషనర్‌ కావడంతో చంటి అతని నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటాడు.
    19 . ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం(సెప్టెంబర్ 14 , 2001)
    U|రొమాన్స్
    ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన శ్రావణి, సుబ్రమణ్యం ఒకరి గతం ఒకరు చెప్పుకుంటారు. చనిపోవడానికి ఒకరికొకరు సాయం చేసుకుంటారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించవు. విధి వారిని దూరం చేస్తుంది. తిరిగి కలుసుకునే ప్రయత్నంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ చిత్రం రవితేజ సినీ కెరీర్‌కు బ్రేక్ ఇచ్చింది. అప్పటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉన్న రవితేజ హీరోగా నిలదొక్కుకున్నాడు.
    20 . బాచి(నవంబర్ 09 , 2000)
    UA|యాక్షన్,డ్రామా
    ఓ పోలీస్ అధికారి దగ్గరకు ఒక బాలుడు వచ్చి నువ్వే నా తండ్రివంటూ నిలదీస్తాడు. అతని వాళ్ల ఆ అధికారి జీవితం మలుపు తిరుగుతుంది. పిల్లవాడిని వదిలించుకునేందుకు పోలీస్ అధికారి అన్ని మార్గాలను ప్రయత్నిస్తాడు.

    @2021 KTree