Editorial List
క్రిష్ జాగర్లమూడి హిట్ సినిమాల జాబితా
40+ views23 days ago
జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకుడు. తను దర్శకత్వం వహించిన తొలి చిత్రానికే (గమ్యం) ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాన్ని పొందాడు. ఆ తర్వాత వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి మొదలైన సినిమాలు తీశాడు. ఆయన ఇప్పటి వరకు తెరకెక్కించిన హిట్ సినిమాల జాబితాను ఓసారి చూద్దాం
1 . కొండ పొలం(అక్టోబర్ 08 , 2021)
U|142 minutes|యాక్షన్,అడ్వెంచర్,థ్రిల్లర్
రవీంద్రనాథ్ (వైష్ణవ్‌తేజ్) నాలుగేళ్లుగా ఉద్యోగం రాకపోవడంతో తండ్రితో పాటు గొర్రెల్ని మేపడానికి కొండపొలానికి వెళతాడు. అక్కడికి వెళ్లాక ఆ యువకుడికి అడవి ఏం నేర్పింది? అతనిలో వచ్చిన మార్పేమిటి? అన్నది కథ.
2 . మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ(జనవరి 25 , 2019)
UA|150 minutes|యాక్షన్
ఝాన్సీ రాజు భార్య మణికర్ణిక, ఈస్టిండియా కంపెనీ తమ రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు తలవంచడానికి నిరాకరిస్తుంది. బ్రిటిష్ రాజ్‌కి వ్యతిరేకంగా ఆమె చేసిన తిరుగుబాటు ఒక అగ్ని విప్లవంగా మారుతుంది.
3 . గౌతమీపుత్ర శాతకర్ణి(జనవరి 12 , 2017)
UA|135 mins|డ్రామా,హిస్టరీ
ఈ సినిమా క్రీస్తు శకం రెండవ శతాబ్దానికి చెందిన శాతవాహన పాలకుడైన గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత ప్రయాణం ఆధారంగా తెరకెక్కింది. ఒకే సామ్రాజ్యం క్రింద పలు భారతీయ రాజ్యాలను శాతకర్ణి ఏకీకరించిన తీరు, విదేశీ దాడులను తిప్పికొట్టిన వైనాన్ని వివరిస్తుంది.
4 . కంచె(అక్టోబర్ 22 , 2015)
UA|125 minutes|రొమాన్స్,యుద్ధం,హిస్టరీ
రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ధూపతి హరిబాబు అనే సైనికుడు ఆ యుద్ధంలో పోరాడుతూనే, స్వదేశంలో కులం, సామాజిక వివక్షపై వ్యథ చెందుతాడు.
5 . కృష్ణం వందే జగద్గురుమ్(నవంబర్ 30 , 2012)
UA|139 minutes|యాక్షన్
బి.టెక్ బాబు అమెరికా వెళ్లిపోదామని అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు. బాబుకి తమ వారసత్వంగా వస్తున్న నాటకాల మీద ఆసక్తి ఉండదు. తాత కోరిక మేరకు చివరిసారి ఓ స్టేజ్ నాటకం చేసేందుకు ఒప్పుకుంటాడు. ఆ నాటకం బాబు జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది అన్నది కథ.
6 . వేదం(జూన్ 04 , 2010)
UA|135 minutes|డ్రామా
రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ.
7 . గమ్యం(ఫిబ్రవరి 29 , 2008)
U|128 minutes|డ్రామా
అభిరామ్ (శర్వానంద్) జానకి (కమలిని ముఖర్జీ)ని ప్రేమలోకి దింపుతాతని ఫ్రెండ్స్‌తో బెట్ కాస్తాడు. ఈ విషయం తెలిసి జానకి అతడ్ని వదిలి వెళ్లిపోతుంది. జానకిని నిజంగానే ప్రేమిస్తున్నట్లు గ్రహించిన హీరో ఆమెను వెత్తుక్కుంటు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇందులో గాలిశీను (అల్లరి నరేష్) పాత్ర ఏంటి? అన్నది కథ.