Editorial List
క్రిష్ జాగర్లమూడి సినిమాల జాబితా
40+ views23 days ago
జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకుడు. తను దర్శకత్వం వహించిన తొలి చిత్రానికే (గమ్యం) ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాన్ని పొందాడు. ఆ తర్వాత వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి మొదలైన సినిమాలు తీశాడు. ఆయన ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాల జాబితాను ఓసారి చూద్దాం
1 . హరి హర వీర మల్లు(మార్చి 28 , 2025)
UA|యాక్షన్,అడ్వెంచర్,థ్రిల్లర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు పిరియాడిక్ అడ్వెంచర్ జనర్‌లో రూపొందుతోంది. మొగల్స్ పరిపాలన సమయంలో వీరమల్లు అనే వీరుడి జీవిత చరిత్రను ఈ చిత్రం వివరిస్తుంది. ఆయన కోహినూరు డైమండ్‌ను మొగల్స్ నుంచి ఎలా సాధించాడు? ఆ సమయంలో ప్రజలకు వీరమల్లు ఏ విధంగా సాయపడ్డాడు అనేది కథగా తెలుస్తోంది.
2 . కొండ పొలం(అక్టోబర్ 08 , 2021)
U|142 minutes|యాక్షన్,అడ్వెంచర్,థ్రిల్లర్
రవీంద్రనాథ్ (వైష్ణవ్‌తేజ్) నాలుగేళ్లుగా ఉద్యోగం రాకపోవడంతో తండ్రితో పాటు గొర్రెల్ని మేపడానికి కొండపొలానికి వెళతాడు. అక్కడికి వెళ్లాక ఆ యువకుడికి అడవి ఏం నేర్పింది? అతనిలో వచ్చిన మార్పేమిటి? అన్నది కథ.
3 . మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ(జనవరి 25 , 2019)
UA|150 minutes|యాక్షన్
ఝాన్సీ రాజు భార్య మణికర్ణిక, ఈస్టిండియా కంపెనీ తమ రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు తలవంచడానికి నిరాకరిస్తుంది. బ్రిటిష్ రాజ్‌కి వ్యతిరేకంగా ఆమె చేసిన తిరుగుబాటు ఒక అగ్ని విప్లవంగా మారుతుంది.
4 . ఎన్టీఆర్: మహానాయకుడు(ఫిబ్రవరి 22 , 2019)
U|128 minutes|బయోగ్రఫీ,డ్రామా
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించి, హరికృష్ణని తన రథసారధిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటిస్తాడు. ప్రజల మద్దతుతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. కానీ రాజకీయ కుట్ర వల్ల అధికారం కోల్పోవడంతో అసలు డ్రామా మొదలవుతుంది. తిరిగి అధికారం పొందేందుకు NTR ఏం చేశాడన్నది మిగతా కథ.
5 . ఎన్టీఆర్: కథానాయకుడు(జనవరి 09 , 2019)
U|171 minutes|బయోగ్రఫీ,డ్రామా
నందమూరి తారక రామ రావు (NTR) నిజ జీవిత కథ ఆధారం ఈ సినిమా రూపొందింది. తెలుగు సినిమా, రాజకీయాల్లో ఆయన ప్రయాణాన్ని ఈ సినిమా కథ ప్రతిబింబిస్తుంది.
6 . గౌతమీపుత్ర శాతకర్ణి(జనవరి 12 , 2017)
UA|135 mins|డ్రామా,హిస్టరీ
ఈ సినిమా క్రీస్తు శకం రెండవ శతాబ్దానికి చెందిన శాతవాహన పాలకుడైన గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత ప్రయాణం ఆధారంగా తెరకెక్కింది. ఒకే సామ్రాజ్యం క్రింద పలు భారతీయ రాజ్యాలను శాతకర్ణి ఏకీకరించిన తీరు, విదేశీ దాడులను తిప్పికొట్టిన వైనాన్ని వివరిస్తుంది.
7 . కంచె(అక్టోబర్ 22 , 2015)
UA|125 minutes|రొమాన్స్,యుద్ధం,హిస్టరీ
రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ధూపతి హరిబాబు అనే సైనికుడు ఆ యుద్ధంలో పోరాడుతూనే, స్వదేశంలో కులం, సామాజిక వివక్షపై వ్యథ చెందుతాడు.
8 . కృష్ణం వందే జగద్గురుమ్(నవంబర్ 30 , 2012)
UA|139 minutes|యాక్షన్
బి.టెక్ బాబు అమెరికా వెళ్లిపోదామని అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు. బాబుకి తమ వారసత్వంగా వస్తున్న నాటకాల మీద ఆసక్తి ఉండదు. తాత కోరిక మేరకు చివరిసారి ఓ స్టేజ్ నాటకం చేసేందుకు ఒప్పుకుంటాడు. ఆ నాటకం బాబు జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది అన్నది కథ.
9 . వేదం(జూన్ 04 , 2010)
UA|135 minutes|డ్రామా
రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ.
10 . గమ్యం(ఫిబ్రవరి 29 , 2008)
U|128 minutes|డ్రామా
అభిరామ్ (శర్వానంద్) జానకి (కమలిని ముఖర్జీ)ని ప్రేమలోకి దింపుతాతని ఫ్రెండ్స్‌తో బెట్ కాస్తాడు. ఈ విషయం తెలిసి జానకి అతడ్ని వదిలి వెళ్లిపోతుంది. జానకిని నిజంగానే ప్రేమిస్తున్నట్లు గ్రహించిన హీరో ఆమెను వెత్తుక్కుంటు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇందులో గాలిశీను (అల్లరి నరేష్) పాత్ర ఏంటి? అన్నది కథ.