• TFIDB EN
  • Editorial List
    కొరటాల శివ సినిమాల జాబితా
    Dislike
    30+ views
    22 days ago

    కొరటాల శివ తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. సినీ రచయితగా తన కెరీర్ ను ప్రారంభించిన కొరటాల మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు. తొలి సినిమాతోనే భారీ విజయం సాధించి సత్తా చాటాడు. ఆయన ఇప్పటివరకు తీసిన సినిమాలు ఇప్పుడు చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . దేవర(సెప్టెంబర్ 27 , 2024)
    UA|యాక్షన్,డ్రామా,థ్రిల్లర్
    సముద్రానికి ఆనుకొని కొండపై ఉన్న నాలుగు గ్రామాల సమూహాన్ని ఎర్ర సముద్రంగా పిలుస్తుంటారు. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ (సైఫ్ అలీ ఖాన్), రాయప్ప, కుంజర ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకు రవాణా చేస్తూ జీవిస్తుంటారు. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి దేవర సరకు దొంగతనం చేయవద్దని ఫిక్స్‌ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? భైరవను దేవర ఎలా అడ్డుకున్నాడు? సముద్రంలోకి వెళ్లిన దేవర ఏమయ్యాడు? అతడి కొడుకు వర (ఎన్టీఆర్‌) ఎందుకు భయస్తుడిగా మారాడు? అన్నది స్టోరీ. దేవర చిత్రాన్ని రూ.300 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు.
    2 . ఆచార్య(ఏప్రిల్ 29 , 2022)
    UA|154 minutes|యాక్షన్,డ్రామా
    బసవ(సోనూసూద్) పాలనలో ఉన్న ధర్మస్థలిలో అధర్మం రాజ్యమేలుతుంటుంది. ఆ సమయంలో ఆచార్య(చిరంజీవి) అక్కడకి వస్తాడు. బసవ, అతని మనుషులు చేసే అరాచకాలను ఆచార్య ఎలా ఎదురించాడు. అసలు ధర్మస్థలికి ఆచార్య ఎందుకు వస్తాడు? పాదఘట్టం సంరక్షకుడిగా ఉన్న సిద్ధకు ఆచార్యకు మధ్య సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ
    3 . భరత్ అనే నేను(ఏప్రిల్ 20 , 2018)
    UA|173 minutes|డ్రామా,థ్రిల్లర్
    సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్‌ (మహేష్‌) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్‌ పెట్టాడు? అన్నది కథ.
    4 . జనతా గ్యారేజ్(సెప్టెంబర్ 01 , 2016)
    UA|162 minutes|యాక్షన్,డ్రామా
    హీరో ప్రకృతి ప్రేమికుడు. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలిగిన సహించడు. మరోవైపు జనతా గ్యారెజ్‌ అణగారిన వారికి అండగా ఉంటూ వారి తరపున పోరాడుతుంటుంది. మరి హీరో, గ్యారేజీకి మధ్య ఉన్న బంధం ఏంటి? గ్యారేజీని నడిపే బాధ్యతను అతడు ఎందుకు తీసుకున్నాడు? అన్నది కథ.
    5 . శ్రీమంతుడు(ఆగస్టు 07 , 2015)
    UA|158 minutes|యాక్షన్,డ్రామా
    కోటీశ్వరుడి కుమారుడైన హర్ష, పేదరికం సామాజిక సమస్యలతో కుదేలైన ఊరిని దత్తత తీసుకుంటాడు. ఆ ఊరిలో మార్పు తెచ్చే క్రమంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొంటాడు.
    6 . మిర్చి(ఫిబ్రవరి 08 , 2013)
    A|160 minutes|యాక్షన్
    ఈ సినిమా కథ జై అనే యువకుడి చూట్టూ తిరుగుతుంది. తన ఊరు, కుటుంబంతో శతృత్వం ఉన్న ఓ కుటుంబాన్ని మార్చేందుకు వారి ఇంటికి వెళ్తాడు. కానీ అతనేవరో ఆ కుటుంబానికి తెలిసిపోతుంది

    @2021 KTree