• TFIDB EN
  • Editorial List
    గోపిచంద్ నటించిన టాప్ కామెడీ సినిమాలు
    Dislike
    30+ views
    1 month ago

    తెలుగులో కామెడీని సహజంగా పండించే నటుల్లో మ్యాచో స్టార్ గోపిచంద్ ఒకరు. ఆయన తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తుంటారు. అందుకే గోపిచంద్ సినిమాలో హాస్య సన్నివేశాలు ఎక్కువగా ఉండేలా డైరెక్టర్లు జాగ్రత్త పడుతుంటారు. మరి ఆయన నటించిన బెస్ట్ కామెడీ ఎంటర్‌ టైనర్ సినిమాలు ఏంటో మీరు చూడండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . విశ్వం(అక్టోబర్ 11 , 2024)
    UA|యాక్షన్,డ్రామా
    హైదరాబాదులో కేంద్రమంత్రి హత్యకు గురవుతాడు. ఆ హత్యను కళ్ళారా చూసిన ఒక చిన్నారిని చంపేందుకు హంతకులు వెంబడిస్తూ ఉంటారు. మరోవైపు ఆ చిన్నారి కుటుంబానికి పరిచయమైన గోపిరెడ్డి (గోపీచంద్) ఆమెను రక్షిస్తుంటాడు. అసలు గోపిరెడ్డి ఎవరు? ఎందుకు చిన్నారిని కాపాడుతున్నాడు? గోపిరెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అన్నది స్టోరీ.
    2 . జిల్(మార్చి 27 , 2015)
    A|130 min|యాక్షన్,డ్రామా
    జై అనే సిన్సియర్ ఫైర్ ఆఫీసర్ తన కుటుంబంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంటాడు. అతను సావిత్రితో ప్రేమలో పడతాడు. ఆమెతో హాయిగా గడుపుతున్న క్రమంలో అండర్ వరల్డ్ డాన్ ఛోటా నాయక్ మధ్య ఓ విషయంలో గొడవ జరుగుతుంది. వీరిద్దరి మధ్య ఏర్పడిన చిన్న మనస్పర్థలు పెద్ద యుద్ధానికి దారితీస్తుంది.
    3 . శౌర్యం (సెప్టెంబర్ 25 , 2008)
    UA|159 minutes|యాక్షన్,డ్రామా
    పోలీస్‌ ఆఫీసర్‌ విజయ్‌కు చెల్లెలు దివ్య అంటే ప్రాణం. ఓ చిన్న ఆపార్థం వల్ల విజయ్‌ను వదిలి ఆమె దూరంగా వెళ్లిపోతుంది. లోకల్‌ డాన్‌ శివరామ్‌.. విజయ్‌పై కోపంతో దివ్యాను చంపాలనుకుంటాడు. దీంతో ఇద్దరూ ఆమె కోసం గాలిస్తుంటారు. దివ్య ఎవరికి దొరికింది? అన్నది కథ.
    4 . గోలీమార్(మే 27 , 2010)
    A|145 minutes|యాక్షన్
    గంగారాం పోలీస్ ఉద్యోగంలో చేరడానికి చాలా కష్టపడుతాడు. చివరికి జాబ్ సంపాదించి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా ఎదుగుతాడు. అతను పెద్ద పెద్ద గ్యాంగ్‌స్టర్లను చంపుతున్న క్రమంలో ఇద్దరు క్రూరమైన గ్యాంగ్‌స్టర్‌లు అతని ఉద్యోగం పోయేలా చేస్తారు. మరి గంగారాం ఆ గ్యాంగ్‌స్టర్లను ఎలా ఎదుర్కొన్నాడు. తిరిగి తన ఉద్యోగాన్ని ఎలా పొందాడు అన్నది స్టోరీ. గోలీమార్ చిత్రం గోపిచంద్ కెరీర్‌లో సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్ల లాభం సాధించింది.
    5 . సౌఖ్యం(డిసెంబర్ 24 , 2015)
    UA|యాక్షన్,హాస్యం,డ్రామా,రొమాన్స్
    హీరో శ్రీను (గోపీచంద్). ఫ్రెండ్స్ తో జాలీగా తిరుగుతుంటాడు. కుటుంబం కోసం ఎంతకైనా తెగిస్తాడు. ఓ ట్రైన్ జర్నీలో హీరోయిన్ శైలజ(రెజీన)ని చూసి ప్రేమలో పడతాడు. అదే ప్రేమని శ్రీని శైలజకి చెప్తే మొదట నో అంటుంది, కానీ ఫైనల్ గా ఓ రోజు ఒప్పుకుంటుంది. ఓ రోజు శైలజని ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? కిడ్నాప్ గ్యాంగ్‌ నుంచి శైలను శ్రీను కాపాడాడా? లేదా అన్నది మిగతా కథ.
    6 . లౌక్యం(సెప్టెంబర్ 26 , 2014)
    UA|149 minutes|హాస్యం,డ్రామా
    హీరో తన ఫ్రెండ్‌ కోసం విలన్‌ చెల్లెల్ని కిడ్నాప్‌ చేసి వారికి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత విలన్‌ నుంచి తప్పించుకొని నగరానికి వచ్చిన హీరో అక్కడ తొలిచూపులోనే హీరోయిన్‌ను ప్రేమిస్తారు. తీరా ఆమె విలన్‌ రెండో చెల్లెలు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
    7 . పక్కా కమర్షియల్(జూలై 01 , 2022)
    UA|152 minutes|హాస్యం,డ్రామా
    సూర్యనారాయణ (సత్యరాజ్‌) నిజాయతీ గల జడ్జి. ఓ కేసులో బాధితులకు న్యాయం చేయలేక వృత్తి నుంచి తప్పుకుంటాడు. ఆయన కొడుకు లక్కీ (గోపిచంద్‌) పక్కా కమర్షియల్‌ లాయర్‌. ఓ కేసు విషయంలో తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ తలెత్తుతుంది. దీంతో బాధితుడి పక్షాన నిలబడి తండ్రి కొడుకుతో కోర్టులో పోరాటానికి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
    8 . రణం(ఫిబ్రవరి 10 , 2006)
    UA|145 minutes|యాక్షన్
    చిన్నా ఉన్నత చదువుల కోసం నగరానికి వెళ్తాడు, అక్కడ భగవతి అనే రౌడీతో గొడవ పడుతాడు. భగవతి సోదరి మహేశ్వరితో ప్రేమలో పడినప్పుడు అతను ఇబ్బందుల్లో చిక్కుకుంటాడు.

    @2021 KTree